অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మీ పసిబిడ్డల సంరక్షణ

మీ పసిబిడ్డల సంరక్షణ

  1. జీవితం కోసం సంబంధాన్ని ఏర్పరుచుకోవటం
  2. నేర్చుకోవటం, అర్ధం చేసుకోవటంలో సమస్యలున్న స్త్రీలు
  3. ఆలోచించవలసిన విషయాలు
  4. బిడ్డకు చనుబాలు యివ్వటం
  5. రొమ్ము పాలివ్వడం ఎలాగు?
  6. బడ్డను పట్టుకోవడం ఎలాగ?
  7. మీరు చనుబాలు యివ్వలేకపోతే
  8. రోణములను చేతితో ఒత్తి పాలను తీయడం ఎలాగ?
  9. పాలను పిండి తీయటం కోసం వెచ్చని సీసా పద్దతి
  10. రోణము పాలను నిల్వ చేయటం ఎలాగ?
  11. మీరోణముల సంరక్షణ
  12. నోటి పూత
  13. నోటి పూతకు చికిత్సా విధానం
  14. రొమ్ముయిన్ఫెక్షన్ (మాస్టెటిస్)
  15. లక్షణాలు
  16. చికిత్స
  17. హెచ్.ఐ.వి/ఎయిడ్స్ మరియు రొమ్ము పాలివ్వడం
  18. హెచ్.ఐ.వి. పున్న తల్లలు చనుబాలు యివ్వడం
  19. ఇతర రకాల పాలను వాడటం
  20. బిడ్డకు జంతువుల పాల పట్టడం
  21. సీసాతోగాని బిడ్డకు పాలు పట్టడం
  22. కప్పతో బిడ్డకు పాలుపట్టడం
  23. సీసాతో బిడ్డకు పాలు పట్టడం
  24. బిడ్డకు తేన్సు వచ్చేలా సహాయం చేయటం
  25. ఎదిగిన బిడ్డకు ఆహారాన్నివ్వటం
  26. మీరు సరిగా చూడగల వారు కానటైతే
  27. మీ శరీరపు పై భాగానికి పరిమితమైన బలం, మరియు తక్కువ సమన్వయం వున్నట్లయితే
  28. బిడ్డకు 1 సం.రం లేదా ఎక్కువ వయస్సు వున్నపుడు:
  29. బిడ్డను సౌకర్యంగా వుండేలా చేయటం
  30. మీ చేతులు వుపయోగకరంగా లేనపుడు లేదా బిడ్డను మీరు ఎత్తుకోలేనపుడు
  31. మీరు సరిగా వినగలవారు కానటైతే
  32. బిడ్డగోల చేసి విసిగిస్తుంటే
  33. బిడ్డతో పాటు నిద్రపోవటం
  34. మీరు నడవటానికి కష్టపడే వారైతే
  35. బట్టలను మార్చి బిడ్డకు వేరే బట్టలు వేయటం
  36. మీకు భౌతికమైన వైకల్యాలుంటే
  37. బిడ్డను శుభ్రపరచటం
  38. మీ చేతులు పూర్తిగా వుపయోగపడని పరిస్థితి అయితే
  39. మీరు అంధులు గాని, బాగా చూడలేనివారు కాని అయితే
  40. బిడ్డను మోస్తూ తిరగటం
  41. బిడ్డను కూర్చుండబెట్టి బెల్లులతో తమ శరీరానికి కట్టుకునే సాధనం.
  42. మీరు చక్రాల కులీనైనా బండినైనా వాడుతూ వుంటే:
  43. మీరు సౌంజ్ఞా భాషను వాడుతూంటే
  44. మీకు (ఫిట్స్) మూర్చలు వుంటే
  45. బిడ్డ కూడా వుండి చూచుకోవటo
  46. మీరు తొందరగా కదలలేని వారైతే
  47. మీకు దృష్టిదోషం వున్నా లేదా పూర్తిగా అంధులైనా
  48. బిడ్డల ఆరోగ్యాన్ని సంరక్షించడం
  49. ఆ ద్రావణాన్ని తయారు చేయటానికి 2 పద్దతులున్నాయి
  50. బిడ్డలు ఆరోగ్యంగా ఎదగటానికి, జబ్బుల బారిన పడకుండా వుండటం కోసమూ 3 పద్ధతులున్నాయి.
  51. పోషకాహారం
  52. పరిశుభ్రం
  53. రోగ నిరోధక టీకాలు

ps1.jpgఏ తల్లీ ఒంటరిగా తన బిడ్డను పెంచదు. నిత్యం కనిపెట్టుకొని ఆలన పాలనలు చూడటం పసిబిడ్డకు అవసరం. అది చాలా కష్టం, అలసటలతో కూడిన విషయం. సుమారుగా తల్లలందరూ తమ బిడ్డల పెంపకం విషయంలో తమ కుటుంబ సభ్యుల, స్నేహితుల, ఇరుగుపొరుగువారి యొక్క శిశు సంరక్షక కార్యకర్తల యొక్క టీచర్ల యొక్క సహయంపై ఆధారపడతారు.

కొందరు వికలాంగ స్త్రీలు శిశు సంరక్షణ గురించి తొందరగా నేర్చుకుంటారు. కాని మీ అంగవైకల్యం కారణంగా మీ దినచర్యలలో మీరు యితరుల సహాయం అవసరమవుతూన్నట్లయితే, మీ బిడ్డ దినసరి కార్యక్రమాలు జరిపించటానికీ కూడా బహుశా మీకు యితరుల సహాయం అవసరం కావచ్చు. కొత్తగా పుట్టిన బిడ్డలకు తరచూ పాలుపట్టడం, బట్టలు మార్చడం అవసరం. కనుక యితరుల సహాయం అవసరమైనపుడు వారిని అడగటానికి అధైర్యపడవద్దు. పసిబిడ్డల తల్లలందరికీ బిడ్డను సాకటానికి సహాయం కావాలి.

ps2.jpgమీ బిడ్డల గురించి మీరు యితరుల సహాయాన్ని ఎంత తీసుకునప్పటికీ మీరు మీ బిడ్డకు తల్లి, మీ బిడ్డ సంరక్షణ కోసం మీరు యితరుల నుంచి ఎంత సహాయాన్ని తీసుకున్నా అది మీ మాతృత్వానికిని (అమ్మతనాన్ని) తగ్గించలేదు. మీ కళ్లు, చెవులు, కాళ్లు, చేతులకు బదులుగా, అంటే అవి చేయవలసిన పనులలో యితర వ్యక్తి యొక్క సహాయాన్ని అర్ధించినప్పటికీ, మీ బిడ్డ యొక్క రక్షణను, క్షేమాన్ని దృష్టిలో వుంచుకొని ఆయా అవసరాలను ఎలా తీర్చాలన్న విషయాన్ని నిర్ణయించవలసినది మీరే. అదే తల్లి చేసే పని. రాత్రి పగలూ మీకు దగ్గరగా వుంచుకోవటం వలన మీ బిడ్డ మీ ముఖాన్ని చూడగలదు. మీ కంఠధ్వనినీ, వాసననూ గుర్తించగలదు. ఈ విధంగా తనతల్లి ఎవరో నిర్ధారించుకోగలదు. అది మీరే.

జీవితం కోసం సంబంధాన్ని ఏర్పరుచుకోవటం

ఒక బిడ్డ తన తల్లితోగానీ, సంరక్షకురాలితో గాని పెంపొందించుకొనే సంబంధం, ఆ బిడ్డ యొక్క మానసిక, భౌతిక వికాసాలకు తోడ్పడుతుంది. దగ్గర సంబంధం ఏర్పడిన తర్వాత, తన భద్రత అందులోనే వున్నట్లుగా బిడ్డ గుర్తిస్తుంది. తర్వాత యితర వ్యక్తులతో క్రొత్త సంబంధాలను ఏర్పరుచు కోవటం బిడ్డకు సులభతరమవుతుంది.

ఇతర కుటుంబ సభ్యులు మీబిడ్డ సంరక్షణ విషయంలో సహాయం చేయగల్గినపుడు, మీరే తన సంరక్షకురాలిగా గుర్తింపబడే టట్లు చూచుకోవటం చాలా ముఖ్యవిషయం. అపుడే మీ బిడ్డతో గాఢమైన బంధాన్ని ఏర్పరచుకో గల్లుతారు.

నేర్చుకోవటం, అర్ధం చేసుకోవటంలో సమస్యలున్న స్త్రీలు

నేర్చుకోనే, అర్థంచేసుకొనే విషయాలలో యిబ్బందులున్నప్పటికి అనేక మంది స్త్రీలు మంచి తల్లలు కాగలరు. మీ బిడ్డకు మీకు ఏ విషయాలలో యితరుల సహాయం అవసరమవుతుందో మీకుటుంబ సభ్యులతో చర్చించి తెలుసుకోండి.

ఆలోచించవలసిన విషయాలు

పసిబిడ్డల ఆలన పాలనలు రాత్రి పగలు శ్రద్దగా చూసుకోవటం అవసరం. అందువలన మీకు తగినంతగా నిద్ర పోవటానికి వీలుకాదు. పగలంతా చేసి మీరు అలసటగా వున్నా మీ బిడ్డ రాత్రంతా మిమ్మల్ని చాలాసార్లు నిద్రాభంగం కలిగించినా మీరు బిడ్డ గురించి శ్రద్ద తీసుకోవటం అవసరమవుతుంది. అపుడు మీరు యితరులను యిూ విషయాలలో సహాయం అడగగలరా?

  • బిడ్డను శుభ్రంగా వుంచటం.
  • బిడ్డకు వైద్యం అవసరమేమో తెలుసుకోవటం.
  • అవసరమైతే మందులను మోతాదు ప్రకారం కొలవటం.
  • బిడ్డ యీ క్రింది విషయాల నుంచి సురక్షితంగా వున్నట్ల దృఢపరచుకోవటం.

-పడిపోవటం

-మంటల నుండి దూరంగా వుండటం.

-జంతువులు -విషపదార్ధాలు

-నోటిలో అడ్డంపడే వస్తువులు

-చర్మం కోసుకొనే, ఎముకలు విరిగే దుస్సంఘటనలు.

తల్లిపాలు యిస్తున్నట్లయితే మీరు ఫార్మలాను తయారు చేసుకోనవసరం లేదు. అలా కాని పక్షంలో మీరు సీసాలను శుభ్రంగా వుంచుకొనే విషయం, ఫార్ములా పాలుగానీ, వేరే పాలుగానీ సరైన పద్ధతిలో తయూరు చేయబడ్డాయన్న విషయాన్ని దృఢపరుచుకోవాలి.

బిడ్డకు చనుబాలు యివ్వటం

ps3.jpgవీలున్నంత వరకూ పసిబిడ్డకు చనుబాలే యివ్వండి. బిడ్డ జననం తర్వాత 2, 3 రోజుల వరకూ వచ్చే పసుపు రంగు కలిగిన చనుబాలు బిడ్డకు చాలా మంచి ఆహారం. క్రొత్తగా జన్మించిన పసిబిడ్డకు అవసరమైన పౌష్టికాహారం మరియు రోగాల నుండి రక్షణ కల్పించే శక్తి గలదీ యీ పసుపు పచ్చని చనుబాలు. కోరినపుడల్లా చనుబాలు యివ్వబడుతూన్న బిడ్డలకు చక్కెర నీరువంటి యితర ఆహారాలేమీ అవసరం లేవు. వీలైతే మొదటి ఆరు నెలలూ మీ బిడ్డకు చనుబాలను మాత్రమే యివ్వండి. చనుబాలను యివ్వడం మీకు చాలా కష్టమైతే పాలను చేతిలో పిండి తీయండి ఆ పాలను వేరే విధంగా బిడ్డకు త్రాగించవచ్చు.

బిడ్డకు చనుబాలను యివ్వడం చాలా ముఖ్యం - ఎందుకంటే

  • బిడ్డ ఆరోగ్యంగా, బలంగా ఎదగటానికి దోహదపడే సరైన ఆహారం రొమ్ముపాలు.
  • చనుబాలివ్వడం వలన తల్లికి రక్తస్రావం ఆగుతుంది.
  • రోగ నిరోధక శక్తి చనుబాల ద్వారా బిడ్డకు చేరుతుంది. చక్కెర వ్యాధి, క్యాన్సర్, డయేరియా, న్యూమోనియా వంటి రోగాల బారి నుండి కాపాడబడుతుంది.
  • చనుబాలివ్వడం వలన తల్లీ బిడ్డల అనుబంధం భద్రత పెరుగుతాయి. ఆ అనుబూతి యిద్దరికీ కలుగుతుంది.
  • చనుబాలివ్వడం వలన కొందరి స్త్రీలకు ఆరు నెలలలోపే తిరిగి గర్భం దాల్చకుండా నిరోధించబడుతుంది.
  • చనుబాలు విలువలేనివి. (కొనే పనిలేదు)

వికలాంగ స్త్రీలు చాల మంది వారి బిడ్డకు చనుబాలివ్వగలరు. కొందరు వికలాంగ స్త్రీలకు బిడ్డను సరైన భంగిమలో పట్టుకోవటం కోసం సహాయం అవసరం అవుతుంది. మరికొందరికి తగినన్ని చనుబాలు లేక పోవచ్చును. కొన్ని రకాల అంగవైకల్యాలు స్త్రీలను నీరసం, అలసట చెందేటట్లు చేస్తాయి. మీ బిడ్డకు చనుబాలు యివ్వగలమా? లేదా అన్న విషయాన్ని మీరే నిర్ణయించుకోండి.

రొమ్ము పాలివ్వడం ఎలాగు?

ఎక్కువ మంది పిల్లలు పాలను నోటితో ఎలా పీల్చుకోవాలో తెలుసుకొనే పుడతారు. కాని వారికి చనుమొన తగినంత నోటిలోకి వెళ్ళేటట్లుగా సహాయం చేయటం అవసరం. బిడ్డకు నోటి నిండా చన్ను వుండి చనుమొన బాగానోటి లోపలికి వండాలి.

బడ్డను పట్టుకోవడం ఎలాగ?

ps4.jpgచను బాలను యివ్వడం మొదట్లో బాధాకరం కావచ్చు. కాని బిడ్డ సరైన పొజీషన్లో వుండి, పాలను పీల్చుకోగలిగితే, మీ బాధ పోతుంది. అలాకాని పక్షంలో బిడ్డ పొజిషనును కానీ, మీ పొజిషనును కాని మార్చి మార్చి ప్రయత్నించి చూడండి. బిడ్డకు నోటినిండా చన్ను వుండేటట్లుగా చూడండి. ఇంకా చనుబాలివ్వడం కష్టంగానే, బాధాకరంగానే అంటే ఆరోగ్యకార్యకర్తతో మాట్లాడండి. వేరే ఏదైనా సమస్య ఫ్రాన్ అయివుండవచ్చు.

కుర్చీలోగాని, మంచంపై గాని వీపును ఆనుకొని కూర్చుని . పాలివ్వడం కొందరి స్త్రీలకు తేలికగా వుండవచ్చు. చేతులకు సపోర్టు వున్నా పాదాలను ఆనించినా కూడా మీకు సౌకర్యంగా వుండొచ్చు. బిడ్డకు కూడా సరైన సపోర్టు వుండేలా చూచుకోండి.

అనేక మంది స్త్రీలు వారి కుటుంబంలోని, సంఘంలోని యితర స్త్రీలను చూచి, బిడ్డకు పాలివ్వడం నేర్చుకుంటారు. ఆ వేరే స్త్రీకి కూడా మీకున్నటువంటి అంగవైకల్యమేవుంటే, ఆమె తల్లి అయి వుంటే, ఆమె సలహా తీసుకోండి.

చాలా మంది వికలాంగ స్త్రీలు వారికి సౌకర్యకరమైన భంగిమ ఏదో తెలుసుకోగలిగితే వారి బిడ్డలకు చనుబాలను యివ్వగలుగుతారు.

మీ శరీర పై భాగాన్ని ముంజేతులను మీరు సరిగా వాడుకోగలిగితే, మీరు ఏ సమస్యా లేకుండా మీ బిడ్డకు చనుబాలను యివ్వగలుగుతారు. మీ బిడ్డ, ముఖ్యంగా మీ బిడ తల సరెన సపోర్టుతో వుండేటటూ, మీరు మీకు సౌకర్యంగా వుండేపొజిషన్లో కూర్చోవడం గాని, పడుకోవటంగాని చేసేటటూ నిర్ధారించుకోండి.

మీ శరీరపు పై భాగాన్ని ముంజేతులను పూర్తిగా వాడుకోలేకపోయినట్లయితే, ఏదో ఒక్క వీలైన భంగిమను మీ బిడ్డకు పాలివ్వడం కోసం కనుక్కోవటానికి ప్రయత్నించండి. అవసరమైతే ఎవరిదైనా సహాయం కోరండి. ఇక్కడ కొన్ని సూచనలివ్వబడ్డాయి.

మీ ముంజేతులను శరీరపు పై భాగాన్ని అసలు వాడుకోలేక పోయినట్లయితే, మీరు మీ కుటుంబ సభ్యుల లేదా స్నేహితుల సహకారంతో చనుబాలు యివ్వగలరు. బిడ్డను ఏ పొజిషన్లో వంచితే మీకు వీలుగా వుంటుందో వారికి వివరించండి. అవసరమైతే బిడ్డను, ముఖ్యంగా బిడ్డ తలను మీకు వీలుగా వారినే పట్టుకోమనండి.

ps5.jpgమీ రొమ్ములను పట్టుకోవటం మీకు కష్టమైతే, మీ చనుమొన మొత్తం బయటికి వచ్చేటంత రంధ్రమున్న బాడీని (బ్రాసరీని) ధరించండి. చనుబాలివ్వడం కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన (చను మొన బయటికి వచ్చేలా, తిరిగి మూయబడేలా తయారు చేయబడిన) నర్సింగ్ బ్రాను మీ రొమ్ములకు సపోర్టునివ్వటం కోసం కొనుక్కోగలరు.

మీరు చనుబాలు యివ్వలేకపోతే

మీ బిడ్డకు చనుబాలను యివ్వటానికి మీరు అశక్తులైతే, రొమ్ములను చేతితో పిండి (ఒత్తి) పాలను తీసి సీసా ద్వారాగాని, కప్పతోగాని బిడ్డకు పట్టవచ్చు. అలా మీరు పాలను పిండలేకపోయినట్లయితే మీరు నమ్మే ఒక వ్యక్తి సహాయాన్ని అడగండి.

రోణములను చేతితో ఒత్తి పాలను తీయడం ఎలాగ?

  • సీసాను దాని మూతను సబ్బు మంచినీటితో శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టండి. సీసాను వాడటానికి ముందుగా వీలైతే మరిగిన నీళ్లతో కడగండి. ఇలా చేసినందు వలన సీసాలోని క్రిములు నశించి బిడ్డకిచ్చేపాలు సురక్షితంగా వుంటాయి.
  • మీ చేతులను శుభ్రంగా కడుక్కోండి.
  • మీ బొటన వ్రేలును రొమ్ము మొన చుటూ వుండే గోధుమ రంగు ఏరియాలో అనే భాగంలో రొమ్ము మొనపైన, వ్రేళ్ళను రొమ్ము మొన అడుగున వుంచి, ఛాతి వైపుకు లోపలికి నొక్కాలి.

చేతి వ్రేళ్లను అన్నిటినీ కలిపి నొక్కుతూ చనుమొన చుటూ త్రిప్పాలి. చనుమొనను గిచ్చటం, లాగటం చేయరాదు. పాలు పిండటం బాధాకరం కాకూడదు. మీ చేతి వ్రేళ్లను ఏరియొలా చుటూ మొత్తం పైన క్రిందా కూడా త్రిప్పతూ నొక్కాలి. అపుడే రొమ్ములోని మొత్తం పాలు బయటికి రాగలవు. ఇదే పద్ధతిని రెండవ రొమ్ము కూడా ఖాళీ అయ్యే వరకూ అనుసరించాలి. మొదట్లో పాలు ఎక్కువ రావు. కాని, అభ్యాసంతో ఎక్కువగా వస్తాయి. వీలైతే 3, 4 గంటలకొకసారి, 24 గంటలలో కనీసం 8 సార్లు పాలను పిండి తీయటం వలన పాలు మంచిగా వస్తున్నాయో లేదో తెలుస్తుంది. ఎవరూ లేని చోట విశ్రాంతిగా, సౌకర్యంగా వున్నటైతే మీరు ఎక్కువ పాలను తీయగలుతారు. పాలను పిండి తీసే సమయంలో మీ బిడ్డ గురించి ఆలోచిస్తూంటే మీకు పాలధారా బాగా రావచ్చు. పాల ధార రావటం కష్టంగా వుంటే వెచ్చని తడి బట్టనుగాని, తువ్వాలని గాని మీ రొమ్ములకు చుట్టి మసాజ్ చేసిన తర్వాత పాలను పిండటం మొదలు పెట్టండి. పాలను తేలికగా పిండటం కొరకు మీకు బ్రెస్ట్ పంపు దొరకవచ్చు. కొన్ని ఆసుపత్రులు, వైద్య కేంద్రాలు కరెంటు పంపుల కోసం అప్ప యివ్వడం లేదా వాటిని అద్దెకు యివ్వటం చేస్తాయి. సామాన్యమైన చేతి పంపులను వారు తక్కువ ధరలకు అమ్మవచ్చును కూడా.

పాలను పిండి తీయటం కోసం వెచ్చని సీసా పద్దతి

రొమ్ములు పాలతో నిండివున్నపుడు లేదా చాలా నొప్పిగా వున్నప్పడూ యిూ పద్ధతి బాగా పనిచేస్తుంది. ప్రసవం తర్వాత వెంటనే గానీ, చనుమొనలు పగిలివున్నపుడు లేదా రొమ్ముకు ఇన్ఫెక్షన్ సోకినపుడు గాని యిలా నొప్పి కలిగి వుండవచ్చు. మీ రొమ్మునుగాని, సీసానుగాని మీరు పట్టుకోలేకపోయినపుడు మీరు నమ్మే వ్యక్తి సహాయాన్ని అడగండి.

  • మూడు, నాలుగు సెంటీమీటర్ల వెడల్పు మూతి వున్న ఒక పెద్ద గాజు సీసాను శుభ్రపరచండి. సీసా పగలకుండా వేడినీళ్లతో నెమ్మది నెమ్మదిగా నింపండి. కొన్ని నిముషాల తర్వాత ఆ నీటిని పారబోయండి.
  • ps6.jpg

  • సీసా మీకు కాలకుండా వుండటం కోసం దానిని చల్లటి శుభ్రమైన నీటితో చల్లబరచండి.
  • సీసామూతిని చను మొనకు పట్టివుండేలా అమర్చండి. అలాగే చాలా నిముషాల సేపు పట్టి వుంచండి. అపుడు సీసా పాలను నెమ్మదిగా బయటికి లాగుతున్నది.
  • పాల ధార రావటం నెమ్మది అయినపుడు, రొమ్ముల చుటూ సీలు కాబడిన సీసామూతను లూజు చేయండి.
  • ఇదే పద్ధతిని రెండవ రొమ్ముకు కూడా అనుసరించండి.

రోణము పాలను నిల్వ చేయటం ఎలాగ?

మీ పాలను శుభ్రమైన మూత వున్న డబ్బాలో వుంచండి. మీరు పాలను పిండిన అదే సీసాను కూడా వాడవచ్చు. ఎండపడని చల్లటి ప్రదేశంలో సీసాను వుంచండి. చల్లటి ప్రదేశంలో సీసాను వుంచండి.

ps7.jpgపాల డబ్బాను చల్లటి నీటిలో పెట్టవచ్చు లేదా తడి యిసుకలో కప్పి వుంచవచ్చు. లేదా తడి ಬಣ್ಣ చుట్టి వుంచవచ్చు. చల్లని రొమ్ము పాలను 12 గంటల సేపు నిల్వ వుంచవచ్చును.

మీకు రిఫ్రిజిరేటర్ వున్నట్లయితే పాలను అందులో నిల్వ చేయవచ్చు. గాజు సీసా లేక డబ్బాలో పోసి వుంచిన పాలను రిఫ్రిజి రేటర్లో 2 లేక 3 రోజుల పాటు నిల్వ చేయవచ్చు. పాలలో మీగడ పాల డబ్దాను చల్లటి ప్రదేశంలో తేరవచ్చు. కనుక బిడ్డకు ఆ పాలను పట్టే ముందు సీసాను పాలు చల్లటి నీటితో వున్ల మట్టి పాత్రలో మీగడ కలిసేటట్లు బాగా కుదిపి వేడి నీటి పాత్రలో వుంచాలి. వంచితే ఎక్కువ సేపు నిల్వ పాలవేడిని తెలుసుకోవటం కోసం కొన్ని చుక్కలను మీ చేతి మీద వేసుకొని పరీక్షించండి. పాలు వేడిగా వుండకూడదు. మీ చర్మం ఉష్ణోగ్రతతో సమానంగా వుండాలి.

హెచ్చరిక: పాలను చల్లగా నిలువ చేయలేకపోతే అవి పాడవుతాయి. వాటిని పారబోయాలి. పాడైన పాలు బిడ్డను అనారోగ్యం పాలు చేస్తాయి.

జిడ్డ బరువు పెరుగుతూ వుంటేను, రోజుకు కనీసం ఆరు సార్లు మూత్రము పోసుకొంటూ వుండేను, ఆ బిడ్డకు ఆ పాలు సరిపోతున్దట్లే

మీరోణముల సంరక్షణ

నొప్పితో కూడిన రొమ్ములు

రొమ్ములు నిండుగా వుండి గట్టిపడినపుడు లేదా చనుమొనలు పగిలినపుడు రొమ్ములలో నొప్పి కలుగుతుంది. ఈ నొప్పి 1, 2 రోజులలో తగ్గిపోతుంది. బాధ కలుగుతున్నప్పటికీ బిడ్డకు చనుబాలు యివ్వడం చాలా ముఖ్యమైన విషయం. తరచూ బిడ్డను చనుమొనలను చీకనివ్వటం కూడా ముఖ్యం. పాలిచ్చే ప్రతిసారీ బిడ్డ పొజిషన్ను మార్చటం కూడా మంచిది.

పండు పడిన లేదా పగిలిన చనుమొనలు

బిడ్డ పాలు త్రాగేటపుడు చనుమొనతో బాటు చన్నులోని కొంత భాగాన్ని కూడా నోటితో పీల్చడానికి బదులుగా వట్టి మొనను మాత్రమే పట్టుకొని పీల్చడం వలన యీ పండుగాని మొనలు చిట్లటం గాని జరుగుతుంది.

ఈ బాధను నివారించటం మరియు చికిత్స

  • బిడ్డను చాలా సేపు మరియు కోరినన్ని సార్లు పాలు త్రాగనీయండి.
  • బిడ్డ పాలు తాగటం ఆపిన తర్వాత, కొన్ని పాలను పిండి మీ చనుమొనలకు రుద్దండి.
  • మీకు ఇన్ఫెక్షన్ లేనట్లయితే సబ్బునుగాని క్రీమును గాని వాడకండి. మీ చనుమొనలను శుభ్రంగా మృదువుగా వుంచే సహజమైన నూనెను మీ శరీరమే తయారు చేస్తుంది.
  • బిగుతుగాను, గరుకుగానూ వుండే బట్టలను ధరించటం మానండి.
  • బిడ్డ పాలను పీల్చుకొనేటపుడు నొప్పి చాలా అధికంగా వుంటే చనుపాలను చేతితో పిండి తీసి కప్పతోనో, స్పూనుతోనో బిడ్డకు పట్టండి. మీ చనుమొనలలో పగిలిన భాగం రెండు రోజులలో నయమయిపోతుంది.
  • మీ రొమ్ములు పాలతో నిండిపోయి, గట్టిగా మారకుండా చూసుకోండి. బిడ్డ తాగగలిగిన పాలకంటే ఎక్కువ పాలు మీ దగ్గరుంటే, వెచ్చటి బట్టతోనో, తువ్వాలుతోనో మీ రొమ్ములను కప్పకొని పాలను తీసివేయండి చేతితో. కొన్ని వారాల తర్వాత మీ శరీరం మీ బిడ్డకు కావలసినన్ని పాలను మాత్రమే తయారు చేస్తుంది. మీ రొమ్ములు నిండిపోవు.

నోటి పూత

బిడ్డ సరైన పొజిషన్లోనే వుండి పాలు త్రాగుతున్నప్పటికీ మీ చనుమొనలలోని బాధ తగ్గకుండా వారం రోజులకంటే కూడా ఎక్కువ రోజులు వుంటే అది . కారణంగా కావచ్చు . (మీ చనుమొనలలో గాని, బిడ్డనోటిలో గాని కలిగిన యీస్ట్ యిన్ఫెక్షన్). మీ చనుమొనలు దురదగా లేదా పొడుస్తున్న మండుతున్నటువంటి బాధను కల్గించవచ్చు.

బిడ్డనోటిలో తెల్లని చుక్కలు లేదా నోరు ఎర్రగా వుండి వుండొచ్చు . బిడ్డనోటి పూత కారణంగా చనుమొనలు చిట్లవచ్చు లేదా పుండుపడవచ్చు. రొమ్ముకు యిన్ఫెక్షన్ కలగవచ్చు. తల్లీ, బిడ్డా యిద్దరూ చికిత్స చేయించుకోవాలి.

నోటి పూతకు చికిత్సా విధానం

0.25% ద్రావణాన్ని తయారు చేయటం కోసం జెన్టియన్ వైయొలెట్ మరియు నీటిని కలపాలి. ఉదాహరణకు: ఒక టీస్పూన్ జెన్టియన్ వయొలెట్ను 3 టీ స్పూన్ల శుభ్రమైన నీటితో కలపాలి. ఒక శుభ్రమైన బట్టను గాని, మీ వ్రేలిని గాని ద్రావణంలో మంచి మీ చనుమొనలకు పాపాయి నోటి పూతకు పూయాలి. రోజుకు ఒకసారి 5 రోజులు అలా పూయాలి. ద్రావణం కారణంగా మీ చనుమొనలు బిడ్డ నోరు కూడా పర్పుల్కలర్కు మారవచ్చు. ఇది సాధారణమైన విషయమే. మీరు పాలు యిసూనే వండాలి. నోటిపూత మూడు రోజులలో తగ్గకపోతే యీ ద్రావణం పూయటం ఆపి వైద్య సలహా తీసుకోవాలి.

రొమ్ముయిన్ఫెక్షన్ (మాస్టెటిస్)

నొప్పితో కూడిన రొమ్ములు, పండు పడిన లేదా చిట్టిన చనుమొనలు రొమ్ముల లోపల యిన్ఫెక్షన్కు దారితీయగలవు.

లక్షణాలు

  • రొమ్ములోని కొంత భాగం వేడిగా, ఎర్రగా, వాచి మరియు నొప్పిగా వుండవచ్చు.
  • జ్వరం - చలి వుండవచ్చు.
  • చేతుల క్రింది బిళ్లలు వచ్చి పండు రావచ్చు. వాయవచ్చు.
  • రొమ్ములలో నొప్పితో కూడిన కణితులు మాదిరి వచ్చి ఒక్కొక్కసారి పగిలి చీము కారవచ్చు.

చికిత్స

ps8.jpgబిడ్డకు చనుబాలు యిస్తూనే వుండండి. ముందుగా యిన్ ఫెక్షన్ వచ్చిన రొమ్మునీయండి. లేదా చేతితో పాలను తీయండి. ఎలా నొప్పి తక్కువగా వుంటుందో అలా చేయండి. ఇన్ఫెక్షన్ బిడ్డకు సోకదు.

  • విశ్రాంతిగా వుండి ద్రవ పదార్థాలను చాలా ఎక్కువగా తీసుకోండి.
  • ప్రతిఒక్కసారి పాలు యివ్వటానికి 15 నిముషాలు ముందుగా వేడినీళ్లతో పుండు పడిన రొమ్ముకు కాపడం పెట్టండి. నొప్పిని తగ్గించటం కోసం చల్లగా కూడా కాపడం పెట్టండి పాలిచ్చే మధ్యలో.
  • బిడ్డ పాలు త్రాగే సమయంలో నెమ్మదిగా పండు పడిన రొమ్మును మసాజ్ చేయండి.
  • నొప్పి తగ్గటానికి పారాసిట్మాల్ బిళ్లను వేసుకోండి.
  • యాంటి బయొటెక్ మాత్రను వేసుకోండి. డిక్లోక్సాసిలిన్ మంచి యాంటి బయొటిక్. 500 మిల్లీ గ్రాములు రోజుకు 4 సార్లు చొప్పన 7 నుంచి 10 రోజులు తీసుకోండి. ఇది మీకు లభించకపోతే లేదా మీకు పెన్సిలిన్ పడక పోతే ఎరిత్రోమైసిన్ వాడండి. 500 మిల్లీ గ్రాములు రోజుకు 4 సార్లు చొప్పన 7 రోజులు నోటితో తీసుకోండి.

హెచ్.ఐ.వి/ఎయిడ్స్ మరియు రొమ్ము పాలివ్వడం

హెచ్.ఐ.వి/ఎయిడ్స్ గురించిన సాధారణ సమాచారం కోసం 169వ పేజీ చూడండి. హెచ్.ఐ.వి. గల తల్లలు కొందరు చనుబాల ద్వారా తమ బిడ్డలకు యిన్ఫెక్షన్ను వ్యాపింపచేస్తారు. చనుబాలనిచ్చే కొందరు తల్లుల బిడ్డలకు యిన్ఫెక్షన్ వ్యాపించదు. ఇలా కొందరు బిడ్డలకు యిూ యిన్ఫెక్షన్ ఎందుకు సోకుతుందో మరికొందరికి ఎందుకు వ్యాపించదో ఎవరికీ తెలియని విషయం. చనుబాల ద్వారా బిడ్డకు హెచ్.ఐ.వి. అతి సులభంగా సోకే పరిస్థితులు

  • తల్లికి క్రొత్తగా హెచ్.ఐ.వి సోకినపుడు
  • తల్లి ఎయిడ్స్తో చాలా జబ్బుగా వున్నపుడు.
  • తల్లి పాలతోబాటు పార్ములా గాని యితర ద్రవ పదార్ధాలుగాని బిడ్డకు యిస్తున్నపుడు.
  • తల్లికి చిట్టిన చనుమొనలు లేక రొమ్ము యిన్ఫెక్షన్ వున్నపుడు
  • బిడ్డకు నోటి పూత వచ్చినపుడు

ఎక్కువ మంది తల్లలకు, హెచ్.ఐ.వి సోకిన తల్లులకైనా సరే వారి బిడ్డలకు రొమ్ము పాలివ్వటమే అతి సురక్షితం. సురక్షిత నీరు లభ్యం కాని ప్రదేశాలలో చాలా మంది పసి బిడ్డలు విరేచనాలతో జబ్బుపడి చనిపోతూ వుంటారు. తల్లిదండ్రులు తగినంత ఫార్మలాను బిడ్డకు యివ్వలే

ని పరిస్థితులలో కూడా పోషకాహార లోపం వలన వారు చనిపోతూ వుంటారు.

హెచ్.ఐ.వి. పున్న తల్లలు చనుబాలు యివ్వడం

ps9.jpgహెచ్.ఐ.వి. గురించి చికిత్స కోసం మందులు వాడుతూ వున్న తల్లి పాలివ్వడం వల్ల బిడ్డకు ఆ వైరస్ సోకే అవకాశాలు కొంచెం తక్కువగా వుంటాయి. కాని, మీరు ఎ.ఆర్.టి మందులను తీసుకుంటూ వుండక పోయినా చనుబాలు యివ్వటమే ఎక్కువ శ్రేష్టము.

  • మొదటి ఆరు నెలలూ బిడ్డకు చనుబాలను మాత్రమే యివ్వండి. - ఫార్మలా మరియు యితర ఆహారాలు - ద్రవ పదార్థాలను తీసుకొనే పసిబిడ్డలకు యిన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఎక్కువ. ఇతర ఆహార పదార్ధాలు, ద్రవ పదార్ధాలు గట్టిగా వుండి, జీర్ణం కాక చిన్న బిడ్డను విసిగించవచ్చు. ఈ కారణంగా హెచ్.ఐ.వి తేలికగా సోకే అవకాశం వుంది.
  • బిడ్డకు 6 నెలలు నిండిన తర్వాత పాలివ్వడం మానేయండి. కాని అకస్మాత్తుగా కాదు. పసిబిడ్డను తల్లిపాలకు దూరం చేయటానికి సాధారణంగా చాలా రోజులు పట్టవచ్చు
  • చనుమొనలు చిట్లటాన్ని నిరోధించటం కోసం బిడ్డను సక్రమమైన పొజిషన్లో వుంచి పాలివ్వాలి. నోటిపూత, చిట్టిన చనుమొనలు, రొమ్ము యిన్ఫెక్షన్లకు వెనువెంటనే చికిత్స చేయించుకోవాలి.
  • వాచిన స్థానం నుంచి బిడ్డకు పాలివ్వరాదు. ఆపాలను పిండి పారబోయాలి. ఇన్ఫెక్షన్ తగ్గేవరకూ రెండవ రొమ్ము నుంచే పాలివ్వాలి.

చనుబాలలోని హెచ్.ఐ.వి.ని నాశనం చేయటం కోసం వాటిని మరిగించవచ్చు. తర్వాత చల్లార్చి సీసాతోనో, కప్పతోనో బిడ్డను త్రాగించాలి. మీకు శుభ్రమైన నీరు, యింధనం, ఆసరా వుంటే యిలా చేయవచ్చు. కొంచెం పని ఎక్కువే అయినా.

చనుబాలను వేడిచేసి క్రిములను తొలగించే విధానం

  • చనుబాలు పోసిన సీసాను ఒకనీటి పాత్రలో వుంచండి.
  • ఆ నీటిని మరిగించండి.
  • వెంటనే ఆ నీటి పాత్రను మంట మీది నుంచి తీయండి.
  • బిడ్డకు త్రాగించటానికి ముందుగా పాలను చల్లారనీయండి.

ఇలా వేడి చేసిన పాలను కొన్ని గంటల లోపలే వాడేయాలి. చనుబాలను ఎట్టిపరిస్థితులలో మరిగించరాదు.

ఇతర రకాల పాలను వాడటం

బిడ్డకుచనుబాలివ్వటం శ్రేష్టం. కాని మీకు అది వీలుకానపుడు ఫార్ములా పాలు (కృత్రిమంగా తయారు చేయబడిన పాలు) సురక్షిత ప్రత్యామ్నాయం.

మీరు ఫార్మలా యివ్వలేకపోయినట్లయితే, హెచ్.ఐ.వి /ఎయిడ్స్ లేనటువంటి మీ బంధువో, స్నేహితురాలో తన చనుబాలను మీ బిడ్డకీయవచ్చు. లేనట్లయితే జంతువుల (ఆవు, గేదెల) పాలను కూండా ఇవ్వవచ్చు.

బిడ్డకు జంతువుల పాల పట్టడం

ఆవు, మేక, ఒంటె పాలు:

 

గొర్రె లేక గేదె పాలు:

 

100 మిల్లీ లీటర్ల తాజా పాలకు

 

50 మిల్లీలీటర్ల తాజా పాలకు

 

50 మిల్లీ లీటర్ల నీరును,

50 మిల్లీ లీటర్ల నీరును,

2 స్పూన్ల చక్కెరను కలపాలి.

 

ఒక స్పూను చక్కెరను కలపాలి.

 

తర్వాత యీ పాలను మరిగించి, చల్లార్చి బిడ్డకు పట్టాలి. జంతువుల పాలలో బిడ్డకు కావలసిన విటమిన్లన్నీ వుండవు కనుక ఆరు నెలల వయసు బిడ్డకు వివిధ రకాల పళ్లు, కూరలు, ఆహార పదార్థాలను మొత్తగా మెదిపి తినిపించాలి.

సీసాతోగాని బిడ్డకు పాలు పట్టడం

బిడ్డకు మీరు చనుబాలు యివ్వలేని పరిస్థితిలో చనుబాలను, జంతువుల పాలను, ఫార్మలాను కప్పతోగాని, సీసా ద్వారాగాని బిడ్డకు పట్టవచ్చు. మీరు కప్పను పట్టుకోలేని పరిస్థితిలో, యితరుల సహాయాన్ని అడగండి.

కప్పతో బిడ్డకు పాలుపట్టడం

  • ps10.jpgచిన్నగా వుండే చాలా శుభ్రమైన కప్పను వాడండి. మరిగించటానికి వీలుకాని పరిస్థితి అయితే కప్పను సబ్బుతోనూ, శుభ్రమైన నీళ్ళతోనూ కడగండి.
  • బిడ్డ మీ ఒడిలో పైకి ఎత్తబడి వుండాలి.
  • పాలకప్పను బిడ్డ నోటికి దగ్గరగా పట్టుకోవాలి. బిడ్డ పెదాలకు అందేలా కప్పను వంచాలి. తర్వాత కప్పను క్రింది పెదవిపై తేలికగా ఆనించాలి. అంచును పైపెదవికి తగిలించాలి.
  • పాలను బిడ్డ నోటిలోనికి పోయవద్దు. బిద్దే పాలను తన నోటితో తీసుకొనేలా చూడండి.

సీసాతో బిడ్డకు పాలు పట్టడం

ఈ క్రింది ప్రశ్నలకు మీరు అవును అని సమాధానం.

  • మీ కమ్యూనిటీలో పరిశుభ్రమైన నీటి సరఫరా కొరకు శాశ్వత వనరులున్నాయా?
  • నీటిని మరిగించటం కోసం శాశ్వతమైన ఇంధనం సరఫరా అవుతుందా?
  • మీకు గాని మీ కుటుంబ సభ్యులకు గాని బోలెడు పాలసీసాలను పీకలను కొనగల ఆర్థిక స్తోమత వుందా ?
  • కనీసం ఆరు నెలల వరకైనా ఫార్ములా గాని, డబ్బా పాలు, గేదెపాలు కొనగల స్తోమత వుందా?
  • మీరు గాని, మీ కుటుంబంలోని వారికి గాని సీసాలను, పీకలను సరిగా శుభ్రపరచటం, పాలను తయారు చేయటం వస్తుందా?

మీరు ఫార్ములాను గాని, జంతువుల పాలను గాని యిస్తుంటే, ప్రతి వస్తువునూ చాలా శుభ్రంగా వుంచుకోవాలి. కప్ప, స్పూను, సీసాలు, రబ్బరు పాల పీకలు, మరియు యితర డబ్బాలు, గిన్నెలూ (పాల కోసం ఫార్మలా కలపటం కోసం వాడే వస్తువులు) అన్నిటినీ శుభ్రంగా కడిగి 20 నిముషాల సేపు నీళ్లలో బాగా మరిగించాలి. వాడే ప్రతి ఒకసారి 20 నిముషాలకు ముందు యిలా చేయాలి. ఫార్మలా, డబ్బా పాలు, జంతువుల పాలు గది ఉష్ణోగ్రతలో ఎన్నడూ 2 గంటలకన్న ఎక్కువ సేపు నిలువ వుంచరాదు. అవి పాడై బిడ్డ ఆరోగ్యానికి భంగం కలగజేస్తాయి. ఫార్ములా రిఫ్రిజిరేటర్లో 12 గంటలపాటు నిల్వ చేయవచ్చు.

బిడ్డకు తేన్సు వచ్చేలా సహాయం చేయటం

పాలుత్రాగేటపుడు కొందరు పసి బిడ్డలు గాలిని ప్రిమింగుతారు. అందువలన వారు అసౌకర్యానికి గురికాగలరు. ఆ గాలిని బయటికి తేవటానికి తేన్పు వచ్చేలా మీరు బిడ్డకు సహాయం చేయాలి. బిడ్డను మీ భుజం మీదనో, రొమ్ముపైనో ఎత్తి పట్టుకొని వీపు మీద రుద్దవచ్చు. లేదా మీ ఒడిలో కూర్చుండబెట్టుకొని వీపుపైన రుద్దవచ్చు. అపుడు బిడ్డకు తేన్పు వచ్చి గాలి బయటికి పోతుంది.

మీకు ఒకటే చేయి వున్నట్లయితే లేదా ఆ చేతికి కూడా సరిపడినంత శక్తి లేనట్లయితే, బిడ్డ ముఖం ప్రక్కకు వన్డేలా మీ మోకాళ్లపై కూరుండబెట్టుకొని మీ చేతితో ఛాతిపై ముందుకు, వెనకకు బిడ్డకు తేను వఛే వరకూ ఊపండి.

ఎదిగిన బిడ్డకు ఆహారాన్నివ్వటం

బిడ్డకు ఆరు నెలలు నిండిన తర్వాత చనుబాలతో బాటు యితర ఆహారాలను కూడా యివ్వడం మొదలు పెట్టాలి. అన్ని సమయాలలోను ముందుగా చనుబాలను యిచ్చి, తర్వాతనే యితర ఆహారాలను యివ్వాలి. మీ ప్రధాన ఆహార దినుసులతో తయారు కాబడిన నూకల జావతోగాని, పిండితో తయారు చేసిన జావతోగాని ప్రారంభించటం మంచింది. ఈ క్రొత్త ఆహార పదార్గాలు బాగా వుడక బెట్టబడి, మెత్తగా గుజ్ఞలా చేయబడాలి. ప్రారంభంలో కొంచెం చనుబాలతో ఆహార పదార్ధాన్ని పలచగా కలిపితే బిడ్డకు బ్రిమింగటానికి తేలిక అవుతుంది.

కొన్ని రోజుల తర్వాత యితర ఆహార పదార్థాలను యీ జావకు కలపటం మొదలు పెట్టండి. ఒక్కొక్కసారి, ఒకే రకమైన ఆహార పదార్ధాన్ని అదీ చాలా తక్కువ పరిమాణంలో కలపండి, బిడ్డకు జీర్ణం కావటానికి యిబ్బంది లేకుండా, ముఖ్యమైన విషయం అదనపు శక్తినిచ్చే నూనెలు, యినుము లభించే ఆకుపచ్చని ఆకు కూరలు వీలైనపుడల్లా వాడుతుండాలి. మీ బిడ్డకు ఆరోగ్యకరమైన ఆహారాన్నివ్వడం కోసం యింకా ఎక్కువ సమాచారం తెలుసుకోవటం కోసం 107వ పేజీ (డాక్టర్ లేనిచోటలో) చూడండి:

చిన్న బిడ్డ కడుపు చాలా చిన్నదనీ, ఒకేసారి ఎక్కువ ఆహారాన్ని తీసుకోగల శక్తిలేనిదీ, అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. కనుక తరచూ, వీలైతే రోజుకు 5 సార్లు అధిక శక్తినిచ్చే ఆహార పదార్థాలను ప్రధాన ఆహారానికి కలిపి యివ్వండి.

భోజన సమయం అవటానికి ముందే మీరు ప్లాన్ చేసుకొని అన్నీ సిద్ధంగా వుంచుకుంటే బిడ్డ ప్రశాంతంగా, సంతోషంగా వుంటుంది. బిడ్డకు ఆకలై ఏడ్చేవరకూ మీరు ఆగినట్లయితే వాడిని ప్రశాంతపరచి ఆహారాన్నివ్వటం మీకు చాలా కష్టమవుతుంది. బిడ్డకు భోజనం పెట్టటానికి మీరు సిద్ధంగా వున్నపుడు

మీరు సరిగా చూడగల వారు కానటైతే

బిడ్డ ఎదిగిన అది తనంతట తానే తిరగ్గలుగుతాడు. అపుడు మొదట్లో బహుశ ఆ ఆహార పదార్థాలను చిందర వందర చేస్తాడు. మీరు మీ కుటుంబ సభ్యులనో, స్నేహితులనో, యిరుగు పొరుగువారినో అడిగి తెలుసుకోవలసి వుంటుంది. ఆహార పదార్థాలు ఎక్కడ ఎక్కడ చల్లబడ్డాయో తెలుసుకుని శుభ్రపరచటం కోసం నేర్పుగా వుండటానికి ప్రయత్నించండి. బిడ్డ వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆహార పదార్థాలను చిందరవందర చేయటం కొంచెం కొంచెంగా తగ్గుతుంది.

మీ శరీరపు పై భాగానికి పరిమితమైన బలం, మరియు తక్కువ సమన్వయం వున్నట్లయితే

ps12.jpgమీరు బిడ్డకు ప్రక్కన కూర్చుంటే ఆహారాన్ని యివ్వగలుగుతారు. ఇలా అయితే మీరు ఆహారాన్ని అందించటానికి బాగా ముందుకు వంగనవసరం లేదు. కాని మీ బిడ్డకు మీరు ఆహారాన్ని తినిపిస్తూ వుంటే మీరు మీ బిడ్డకు వీలైనంత దగ్గరగా కూర్చుని కబుర్లు చెప్పాలి. ఇలా చేయటం వలన మిమ్మల్ని తనకు ఆకలిగా వున్నపుడు ఆహారాన్నిచ్చే వ్యక్తులలో ఒకరిగా అనుకుంటాడు.

బిడ్డకు 1 సం.రం లేదా ఎక్కువ వయస్సు వున్నపుడు:

అతడు పెద్దలు తినే ఆహారాన్నే తినగలదు. కాని అతనికి చనుబాలను యిస్తునే వుండాలి . లేదా వీలైనపుడల్లా పాలను త్రాగించాలి.

ప్రతి రోజూ బిడ్డకు మీ కమ్యూనిటీలోని వారు తినే ఆహారాన్నే ఎక్కువగా యిస్తూ వుండాలి. దానితోపాటు బలవర్థకమైన, ప్రొటీనులు, విటమినులు, ఐరన్ మరియు మినరల్లూ గల యితర ఆహార పదార్థాలను కూడా చేర్చి తిననివ్వాలి. అపుడే అతడు బలంగా ఆరోగ్యంగా పెరుతాడు.

బిడ్డ సరిపడినంత ఆహారం తిన్నాడో లేదో తెలుసుకోవటం కోసం అతడికి వేరేగా తన స్వంత పల్లెంలోనే భోజనాన్ని వడ్డించాలి. అతడికి అవసరమైనంత ఆహారాన్ని తనే పెట్టుకొనేలా చూడాలి.

బిడ్డను సౌకర్యంగా వుండేలా చేయటం

బిడ్డ సురక్షితంగా తల్లిదగ్గరే వున్న అనుభూతిని పొందేటందుకుగాను – ఆ బిడ్డ అసౌకర్యంగా చికాకుగా వున్నపుడు వాడిని సౌకర్యవంతంగా సంతోషంగా వుండేలా తల్లి చూచుకోవటం చాలా ముఖ్యమైనవిషయం. బిడ్డ ఏడవటం మొదలు పెట్టినపుడు మీరు ఆ బిడ్డను తొందరగా మీ దగ్గరకు తెచ్చుకోలేని పరిస్థితిలో, యితరులెవరైనా బిడ్డను మీ దగ్గరకు తీసుకురావాలి. అపుడే బిడ్డ మీ ముఖాన్ని చూడగలడు. ఊరడింపు మాటలు చెప్పే మీ గొంతును వినగలడు, మీరు స్వంతంగా ఆ బిడ్డను ఎత్తి పట్టుకోలేకపోయినా మిమ్మల్ని గుర్తించగలుగుతాడు.

మీ చేతులు వుపయోగకరంగా లేనపుడు లేదా బిడ్డను మీరు ఎత్తుకోలేనపుడు

బిడ్డను సౌకర్యవంతంగా వుంచేటందుకు యిక్కడ రెండు పద్ధతులు చూపించబడ్డాయి.

మీరు సరిగా వినగలవారు కానటైతే

ps13.jpgఆరోగ్య వంతుడైన బిడ్డ తనకు ఆకలిగా వున్నా అసౌకర్యంగా వున్నా మామూలుగా చాలా పెద్ద శబ్దం చేస్తూ ఏడుస్తాడు. మీకు బాగా వినపడదు కనుక, మీరు బిడ్డకు వీలైనంత దగ్గరగా అంటే బిడ్డకు కావలసిన మీ అవసరాన్ని చూసి గుర్తించేలాగ వండాలి. రాత్రి సమయాలలో బిడ్డకు వీలైనంత దగ్గరగా అతడి కదలికలు మీకు తెలిసేలా పడుకోవాలి. మరియు పగటి సమయంలో మీకు వీలైనంత దగ్గరగా బిడ్డను వుంచుకోవాలి.

చాలా మంది స్త్రీలకంటే ఎక్కువగా మీ బిడ్డను మీరు ఒడిలో పెట్టుకొని మోయాలి. ఎందుకంటే బిడ్డ ఏ పరిస్థితులలో వున్నాడో తెలుసుకోవటానికి వీలవుతుంది. బిడ్డను అలా ఒడిలో మోయటం వలన అతడికి మీ వాసన, అనుభూతులు, కంఠధ్వనిని తొందరగా గుర్తించగలుగుతాడు. ఇందువలన బిడ్డ మీకు దగ్గరగా వున్నట్లు, భద్రంగా వున్నటూ అనుభూతిని పొంద గలుగుతాడు.

సౌజ్ఞా భాష వాడవలసినపుడు మీ బిడ్డ చెవిటివాడు కాకపోయినప్పటికీ నోటితో మాట్లాడకుండా సౌంజూ భాషనే వాడండి. ఈ విధంగా చేస్తే మీరూ, మీ బిడ్డా జీవితమంతా కూడా యిదే పద్దతిలో మీ మీ అభిప్రాయాలను తెలియపరుచుకోగలుగుతారు. వినికిడి లోపం లేని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో బిడ్డను కలిసి గడపనీయండి. అపుడు అతడు మాట్లాడటం కూడా నేర్చుకోగలుగుతాడు.

బిడ్డగోల చేసి విసిగిస్తుంటే

మొదటి కొన్ని నెలలలో కొందరు పిల్లలు చాలా గోల చేసూ విసిగిస్తుంటారు. ముఖ్యంగా సాయంకాలం వేళలలో, చనుబాలు త్రాగే పిల్లలలో యిూ లక్షణం వుండవచ్చు. అపుడు బిడ్డకు రొమ్మునందించి శాంతపరచవచ్చు. లేదా భుజం మీద వేసుకొని తేనుపు వచ్చేలా వీపును రుద్దవచ్చు. పాటలు, మాటలూ నడపడం, జోకొట్టటం వంటివి చేసి కూడా తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. పిల్లలు తిరగటానికిష్టపడతారు. ఏ తల్లికైనా గోల చేసే పిల్లల వలన విసుగు, నీరసం కలుగుతాయి. అటువంటి సమయాలలో తండ్రిగాని, యితర కుటుంబ సభ్యులెవరైనా గాని, సంరక్షకులు గాని బిడ్డను తీసుకొని ఆడించి సహాయం చేయగలిగితే, మీకు కొంచెం విశ్రాంతి లభిస్తుంది.

బిడ్డతో పాటు నిద్రపోవటం

ఎక్కువ మంది పసిబిడ్డల తల్లలు తమ తమ బిడ్డలతోబాటే ప్రక్కన పడుకొని నిద్రపోతూ విశ్రాంతి తీసుకుంటారు. బిడ్డ ఆకలితో లేచినపుడు, పైకి లేవదీయకుండా చనుబాలీయటానికి యిది తేలికైన పద్ధతి. మీరు సరిగా చూడలేని, వినలేని వారు అయితే, యిలా ప్రక్కనే పడుకోవటం వలన బిడ్డకు ఎపుడు పాలివ్వవలసిన అవసరమో , బట్టలు ఎపుడు మార్చాలో తెలుసుకోగలుగుతారు.

మీరు నడవటానికి కష్టపడే వారైతే

బిడ్డలు బట్టలు తడిపినపుడు మార్చవలసిన న్యాపీలు, డయపరూ లేక పాత బట్టలూ, శుభ్రమైన బట్టలూ మీకు దగ్గరగా వుంచుకోవటం వలన, రాత్రి సమయాలలో కూడా లేవకుండానే మీరు బిడ్డను శుభ్రపరిచి బట్టలు మార్చగలుగుతారు.

ps14.jpgబిడ్డపై దొర్లి పడేటటువంటి వైకల్యాన్ని మీరు కలిగి వుంటే లేదా వాడి ప్రక్కనే కూర్చొని నిద్రపోవాల్సిన పరిస్థితి అయితే మీరు ప్రత్యేకమైన ఏర్పాట్ల చేసుకోవలసి వుంటుంది. ఇక్కడ ఒక ఉదాహరణ యివ్వబడింది.

మీరు బిడ్డపై దొర్లి పడతారేమోనని అనుకుంటే, చెక్కతో చేయబడిన గోడలున్ల పెట్టె వంటి చిన్ల బెడ్ను బిడ్డ కోసం తయారు చేయించి, మీ ప్రక్కనే పెట్టుకొని అందులో నిద్రింప చేయాలి. ఒక ప్రక్కగోడవంటి భాగాల్లి కొంచెం ఖాళగా వంచితే మీరు తేలికగా జడ్డను తాకి పనులు చేసుకోగలుగుతారు. చెక్క గోడలను నున్దగా చేయించుకోవటంగాని, లేదా బట్టతో కష్టి వుంచటం గానే చేస్తే, జడ్డకూ, మీకూ గీసుకోకుండా వుంటుంది.

బట్టలను మార్చి బిడ్డకు వేరే బట్టలు వేయటం

ఆరోగ్యవంతుడైన బిడ్డ చలాకీగా వుండి విపరీతమైన కదలికలతో వేగంగా పొర్లుతూ వుంటాడు. ఎదుగుతూ వున్న కొద్దీ అతడి బట్టలు మార్చడం చాలా చాలా కష్టమవుతుంది. వేయటం, తీయటం తేలికగా జరిగే బట్టలను వాడటానికి ప్రయత్నించండి. ఉదాహరణకు జిప్పలు, దానంతటదే అతుక్కొనే ప్లాస్టిక్ టేపులు అమర్చబడిన బట్టలనే వాడండి. బొత్తాములు తీయటం పెట్టట కంటే యిది తేలికగా వేగంగా చేయగలుగుతారు.

మీకు భౌతికమైన వైకల్యాలుంటే

వికలాంగ స్త్రీలు చాలా మంది తమ బిడ్డలను బల్లపైనో, మంచంపైనో వుంచి తేలికగా వారు మార్చగలుగుతారు. ముఖ్యంగా వారు కూర్చోగలిగినవారైతే కాని కొందరు స్త్రీలకు తగినంత శారీరక బలం వుండదు యిలా చేయటానికి. ఇక్కడ రెండు వుదాహరణలు చూపబడ్డాయి.

బిడ్డను సురక్షితంగా వుంచగల్గిన రెండు ఉదాహరణలు చేయబడ్డా బల్లలు వున్నాయి. క్రింది బొమ్మలో అవి మీ శరీరానికి ఎలాంటి గాయాన్ని కల్గించవు. వాటి ఎత్తు కూడా మీకు కావలసినంత పెట్టుకోవచ్చు.

బిడ్డను శుభ్రపరచటం

బిడ్డను శుభ్రపరిచే సమయంలో ఏదైనా చిన్న ఆటవస్తువును యిస్తే ఆడుకొంటూ, ఎక్కువగా కదలకుండా వుంటుంది. 10 రకాల ఆటవస్తువులను బిడ్డ పట్టుకోగల్లినవి సంపాదించి పెట్టుకోవటానికి ప్రయత్నించండి. అలా అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క వస్తువును మార్చి మార్చి యిూయగలరు. క్రొత్త ఆటవస్తువు బిడ్డను ఎక్కువ ఆకర్షితుడిని చేస్తుంది. ఇంట్లో వున్న అనేక చిన్న చిన్న వస్తువులను ఆటవస్తువులుగా వాడవచ్చు - మార్చవచ్చు - ఉదాహరణకు శబ్దం చేసే గింజలున్న కాయ, గంట, బట్టతో చేయబడిన బొమ్మ అద్దం, రంగుపూసలతో చేయబడిన బ్రేస్లెట్ లేదా రంగుల కాగితాలు - ఇటువంటి 10 వస్తువులతో ఆడిన తర్వాత, తిరిగి మొదటి వస్తువుతో మొదలు పెట్టండి. అది కొత్త వస్తువుగా అనిపిస్తుంది బిడ్డకు. ఇక్కడ కొన్ని సామాన్యమైన చిన్న ఆట వస్తువులను వుదాహరణగా చూపించడమైనది.

బిడ్డను శుభ్రపరచిన తర్వాత బట్టలు మార్చిన తర్వాత, బిడ్డను మరుగు దొడ్డికి వెళ్ళినపుడు సహాయం చేసిన తర్వాత తప్పనిసరిగా మీ చేతులను బాగా కడుక్కోండి.

మీ చేతులు పూర్తిగా వుపయోగపడని పరిస్థితి అయితే

ps15.jpgవారి చేతులలో కదలిక శక్తి చాలా తక్కువగా వున్న అనేక మంది స్త్రీలు వారి వారి బిడ్డల క్రింది శరీర భాగాన్ని మర్మావయవాలను శుభ్రపరచగలరు. కాని వారు న్యాపీలను, డయాపర్లనూ ముఖ్యంగా పిన్నీసులతో బిగించవలసిన వాటిని బిడ్డలకు కట్టలేరు. ఈ పని చేయటానికి మీరు కుటుంబ సభ్యుల మీదగాని, సహాయకుల మీదగాని ఆధారపడాలి. మీరు మీ బిడ్డను శుభ్రపరచి ಬಟ್ಟಲು మార్చలేని స్థితి అయితే, యితరుల వలన ఆ పనులు చేయబడుతూ వుంటే మీరు బిడ్డ ప్రక్కనే వుండేలా చూసుకోండి. అలా అయితే బిడ్డ మీ కంఠధ్వనిని వినగలదు. మీ ముఖాన్ని చూడగలదు.

మీకు ఒకటే చేయి వున్నా చేతులు పూర్తిగా పనిచేయలేనివై వున్నా మీ బిడ్డకు ఒక నెల వయసున్నప్పటి నుంచీ, మీరు నేపీని వేసేటపుడు తను మీకు ఎలా సహాయం చేయాలో నేర్పించగలరు. శుభ్రమైన బట్టను బిడ్డ క్రింది భాగం అడుగున వేసినపుడు ఆమె క్రింది భాగాన్ని 2, 3 సార్లు పైకి ఎత్తాలి లేదా పైకి క్రిందికీ వూపాలి.

ఇలా ప్రతి ఒకసారి చేయండి. తొందరలోనే బిడ్డ తనంతటతాను తన క్రింది శరీరభాగాన్ని మీరు స్పృశించినట్లు తెలియగానే పైకి ఎత్తటం మొదలు పెడుతుంది. ఇందువలన బిడ్డ క్రింద బట్ట వేయటం మీకు సులభమవుతుంది.

న్యాపీగాని, డయపర్గాని పిన్నులు లేకుండానే కట్టి పైన డ్రాయర్ తొడిగేయవచ్చు. అందువలన న్యాపీతో బాటు డ్రాయర్ కూడా తడిసిపోవచ్చు. అందుచేత దానిని కూడా వుతికి ఆరబెట్టుకోవాలి. స్టిక్కర్, ఫ్రిప్లను కూడా డైపర్ను పట్టి వుంచేటందుకు వాడవచ్చు.

మీరు అంధులు గాని, బాగా చూడలేనివారు కాని అయితే

బిడ్డ క్రింది భాగంలోని మలము అంతపోయి శుభ్రపడినదా లేదా అన్న విషయం తెలుసుకోవడం చాలా కష్టం. ఇక్కడ కొన్ని సూచనలు యివ్వబడ్డాయి.

మీకు తగినంత నీరులేకపోయినట్లయితే పలుచటి తడిబట్టతో బిడ్డ క్రింది భాగాన్ని తుడవండి. దళసరి బట్టను వాడితే మలం ఎక్కడ వున్నదీ మీకు తెలియదు. తర్వాత ఆ బట్టను సబ్బు నీళ్లలో జాడించి ఎండలో ఆరవేయాలి.

మీ బిడ్డకు మలబద్ధకం వుంటే, కొంచెం వంట నూనెను మలద్వారం దగ్గర రాయండి. లేదా మీ వ్రేలికి కొంచం గ్రీజు అయినా నూనె అయినా రాసుకొని మలద్వారంలోకి మెల్లగా పోనిచ్చి గట్టిగా వున్న మలాన్ని తీసి వేయండి. ఆముదం, యితర నూనెలు, విరేచనమయ్యే మందులను చంటి బిడ్డకు ఇవ్వవదు.

బిడ్డను మోస్తూ తిరగటం

ps16.jpgమీ కాళ్లు, చేతులు పూర్తిగా పనిచేయలేని స్థితిలో వుంటే బిడ్డను మోస్తూ నడవటం చాలా కష్టం. మీరు పడిపోకుండా బ్యాలన్సుగా వుండటం చాలా కష్టం. అంతే కాకుండా మీ నడుము క్రింది భాగం దెబ్బతినవచ్చు. మీ ఆలోచనలతో ఎన్నో పద్దతులను ప్రయత్నించవచ్చు మీకు తగిన పద్ధతి తెలుసుకొనే వరకూ కొందరు స్త్రీలకు బిడ్డను వీపుకు కట్టుకొని మోయటం తేలికగా అనిపించవచ్చు. మరికొందరికి బిడ్డను ముందువైపు పెట్టుకోవటం తేలిక అని అనిపించవచ్చు. మీ బిడ్డ బరువు, చురుకుతనం కూడా పెరుగుతూనే వుంటాయి. ఒక నెలలో పని చేసిన విధానం మరుసటి నెలలో పని చేయకపోవచ్చు. మొదట్లో మీకు బ్యాలన్సు కావటం కష్టంగా అనిపించవచ్చు. కాని, బిడ్డ చిన్నగా వున్న సమయంలోనే మీరు వాడిని మోయటం మొదలు పెడితే మీరు బ్యాలన్సు కావటానికి అలవాటు పడతారు. బిడ్డ పెద్దగా ఎదుగుతూ బరువు పెరుగుతున్న కొద్దీ మీ శరీరం ఆ బరువుకు బ్యాలన్సు కావటానికి ఎద్దస్ట్ అవుతుంది.

నడవటానికి ఊతంగా వుపయోగించే కర్రలను (క్రెచెస్) కాని చేతికర్రను గాని వాడుతూ వుంటే

మీ బిడ్డను మీ చేతులతో ఎత్తి మోయటం కష్టం. అపుడు బిడ్డను మీ వీపుపై పెట్టుకొని మోయటమే చాలా మంచి పద్ధతి.

బిడ్డను కూర్చుండబెట్టి బెల్లులతో తమ శరీరానికి కట్టుకునే సాధనం.

మిషన్ స్లింగ్ బిడ్డ బరువును వీలుగా మోయటానికి సహాయ పడుతుంది. మీ చేతులకు, భుజాలకు ఎక్కువ శ్రమ వుండదు. వీనిని మీ వీపుకు గాని, ముందుగాని కట్టుకోవచ్చు.

మీరు చక్రాల కులీనైనా బండినైనా వాడుతూ వుంటే:

ps17.jpgమీ చక్రాల కుర్చీని తోయటానికి మీరు రెండు చేతులనూ వాడుతూ వుంటే బిడ్డను చేతుల మీదనో, ఒడిలోనో పెట్టుకోవటం కష్టమవుతుంది. మీరు మెడ చుటూ స్లింగ్ ను ధరించటం వలన మీ బిడ్డ కుర్చీ దొర్లేటపుడు సురక్షితంగా వుంటుంది. స్లింగ్ ను బెల్లుతో మీ నడుముకు కట్టుకొంటే బిడ్డకు కుదుపులు వుండవు.

బిడ్డ ఎదుగుతూ వున్న కొద్దీ, మీ ఒడిలో కూర్చున్నపుడు సపోర్టిచ్చే హార్నెస్(కుషన్)ను వాడండి.

హార్నెస్ కుషన్ ఇటువంటి బేజు కుపన్ను మీ నడుము చుటూ కట్టుకుంటే, జడ్డ సురక్షితంగా మీ ఒడిలో కూర్లోవటానికి సహాయ పడుతుంది.

మీరు సౌంజ్ఞా భాషను వాడుతూంటే

మీరు సౌంజ్ఞాభాషను వాడవలసిన వారైతే, మీరొక స్లింగును కూడా వాడవలసి వుంటుంది. అపుడే మీ చేతులు సౌంజ్ఞలు చేయటానికి ఖాళీగా వుండగలవు.

మీకు (ఫిట్స్) మూర్చలు వుంటే

ps18.jpgమీకే బాగా తెలుస్తుంది, అవి ఎంత తరచుగా వస్తాయో, ఎంత తీవ్రంగా వుంటాయోనన్న విషయం మీకే బాగాతెలుస్తుంది. మీరు బిడ్డను పట్టుకొని వుండగా, మీకు మూర్ఛ వచ్చి క్రింద పడిపోతే పసిబిడ్డకు తీవ్రంగా దెబ్బలు తగలవచ్చు, చనిపోవచ్చు కూడా.

వీలైతే అటువంటి మూర్చలు లేని వ్యక్తి నెవరినైనా ఎల్లపుడూ మీ వెంట, మీ బిడ్డ వెంట వుండేలా చూడండి. మీరు ఒక్కరే నివశిస్తూ, ఒంటరిగా వుండవలసి వుంటే గదిలో ఒక సురక్షిత ప్రదేశాన్ని బిడ్డను వుంచటం కోసం ఏర్పాటు చేసుకోండి. బిడ్డను నిత్యం అక్కడే వుండనివ్వండి. బిడ్డను పెట్టుకొని చుటూ తిరగవదు. కుర్చీలు, బల్లలు లాంటి వస్తువులకు పదునైన అంచులు లేకుండా చూడండి. ఇలా చేస్తే మీకు మూర్చవచ్చినపుడు బిడ్డ సురక్షితంగా వుంటుంది. ఆహారం యిచ్చేటపుడు, స్నానం చేయించేటపుడు, బట్టలు వేసేటపుడు బిడ్డను నేల మీదనే వుంచటం చాలా సురక్షితం.

బిడ్డ కొంచెం ఎదిగి పాక గలిగినదైనపుడు, తెరిచి వున్న గుమ్మానికి, మెట్లకు గేటుగాని ఏదైనా అద్దాన్ని గాని పెట్టండి. అపుడు మీకు మూర్చలు వచ్చినా బిడ్డ సురక్షితంగా వుంటుంది.

బిడ్డ కూడా వుండి చూచుకోవటo

పసిబిడ్డలు పాకటం, నడవటం నేర్చుకున్నపుడు వారి వెంట వెంటనే తిరుగుతూ చూసుకోవటం ఏ తల్లికైనా, తండ్రికైనా కష్టమే. ఎదుగుతున్న బిడ్డలకు నడవటం, పరుగులు పెట్టటం చాలా ఆరోగ్యకరమైన విషయం. మరియు నేర్చుకొంటున్న క్రొత్తలో పిల్లలు ఎక్కువగా పడుతూ వుంటారు. దానిని గురించి పట్టించుకోవద్దు. బిడ్డ పెరుగుదలలో అది ఒక సహజమైన భాగం.

మీరు తొందరగా కదలలేని వారైతే

పసిబిడలు చాలా వేగంగా వుంటారు. వారి కదలికలలో మరియు దెబ్బలు తగిలించుకోవటం కూడా వారికి చాలా సాధారణ విషయం. కాని, కారుకు అడ్డంగా పరుగులు పెట్టేటటువంటి, పొయ్యి మంటల దగ్గరకు వెళ్లేటటువంటి దుర్ఘటనల నుంచి కాపాడటానికి ఆ బిడ్డ వెంట పరుగులు పెట్టటం చాలా కష్టమైన విషయం. కనుక బిడ్డ చేతి మణికట్టల (రిస్ట్)కు ఒక త్రాడును కట్టినట్లయితే బిడ్డను మీరు తొందరగా వెనకకు లాగగలుగుతారు. ఆ త్రాడును మీ చేతితో పట్టుకోవటానికి అశక్తులైతే, మీ నడుముకు కట్టుకోండి.

మీకు దృష్టిదోషం వున్నా లేదా పూర్తిగా అంధులైనా

బిడ్డచాలా చిన్నగా వున్నపుడు బిడ్డ ప్రక్కనే అదే ప్రక్కమీద పదుకొని నిద్రపోండి. అలా అయితే బిడ్డకేం కావాలి? ఎక్కడున్నాడు? అన్న విషయాన్ని తెలుసుకొంటుండవచ్చు.

బిడ్డ కొంచం పెరిగి తనంతట తాను పాకటం, నడవటం మొదలు పెట్టినపుడు బిడ్డ కాలి మడమకు (యాంకిల్) లేక చేతి మణికట్టుకు (రిస్ట్) చిన్న గంటను కాని గలగలా శబ్దం చేసే గింజలున్న కాయలు కాని కట్టితే, ఆ శబ్దాన్ని విని బిడ్డ ఎక్కడున్నాడో తెలుసుకోవచ్చు.

బిడ్డ తిరిగి ఆడుకోవటం కోసం దెబ్బలు తగిలించుకోకుండా వుండే సురక్షితమైన ఒక చోటును తయారు చేయండి. అక్కడ పదునైన అంచులున్న వస్తువులు గాని మూలలు గాని లేకుండా చూడండి. గదులలో నుండి బయటికి వెళ్లే ద్వారాలకు, మెట్లకు అడ్డులు పెట్టండి. అందువలన బిడ్డ తన సురక్షిత ప్రదేశాన్ని వదిలి బయటికి వెళ్లలేదు.

బిడ్డల ఆరోగ్యాన్ని సంరక్షించడం

పిల్లలకు కలిగే అనారోగ్యాలు తరచుగా చాలా వేగంగా ప్రమాదకరంగా మారతాయి. పెద్దవాళ్ళకు హాని చేయడానికి లేదా ప్రాణం తీయడానికి కొన్ని రోజులు, వారాలు టైము తీసుకొనే అనారోగ్యాలు పసిబిడ్డలను కొన్ని గంటలలోపలే చంపగలవు. కనుక తొలి దశలోనే కనిపించిన వ్యాధి లక్షణాలను గుర్తించి వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవటం చాలా ముఖ్యం.

పలచని లేదా నీళ్ల విరేచనాలు పెద్దల ಆಂಟೆ పసిబిడ్డలకు చాలా సాధారణంగా వచ్చేవీ, చాలా ప్రమాదకరమైనవీ కూడా. మీ పసిబిడ్డగాని, ఎడ బిడ్డగాని యీ జబ్బుతో బాధపడుతుంటే, మీరు వెంటనే తగిన చర్య తీస్కుకోవాలి.

  • చనుబాలను తరచూ యిసూండండి.
  • ఆహారాన్ని కూడా యిసూనే వుండండి.
  • ద్రవ పదార్థాలను బాగా ఎక్కువగా యివ్వండి.

పిల్లలు విపరీతంగా నీళ్ల విరేచనాలతో బాధపడుతూ వున్నపుడు వారిలో నీరు తగ్గిపోతుంది. దానిని తిరిగి నింపటంకోసం ఉప్ప, పంచదారలను నీటితో చేర్చి ఆ ద్రావణాన్ని తరచూ యిసూ వుండాలి.

ఆ ద్రావణాన్ని తయారు చేయటానికి 2 పద్దతులున్నాయి

చక్కెర, ఉప్పలతో: ఒక లీటరు శుభ్రమైన నీటిలో అరస్పూన్ ఉప్పను కలపండి. అవి కంటి నీటి కన్నా తక్కువ వుప్పగా వుండేలా చూడండి. తర్వాత 8 టీస్పూన్ల చక్కెరను కలపండి: బాగా కలిపి, ఆ ద్రావణాన్ని బిడ్డకు యివ్వడం మొదలు పెట్టండి:

ధాన్యాలలో చేయబడిన పిండి, వుప్పలలో: బియ్యపు పిండి శ్రేష్టం, (కాకుంటే జొన్న గోధుమ పిండి, లేదా వడికించి మొత్తగా చేయబడ్డ ఆలుగడ్డలు వాడండి)

ఒక లీటరు శుభ్రమైన నీటిని అరటీస్పూను వుప్పను కలపండి. అవి కన్నీటికన్న తక్కువ వుప్పగా వుండేలా చూడండి. తర్వాత 8 పూర్తి టి స్పూన్ల పిండిని కలిపి 5 నుంచి 7 నిముషాల సేపు మరిగించి జారుడుగా జావ తయారు చేయండి. చల్లార్చి బిడ్డకు త్రాగించటం మొదలు పెట్టండి.

వేడి వాతావరణంలో యీ జావ కొద్ది గంటలలోనే పాడవుతుంది. కనుక త్రాగించే ప్రతిసారీ మీరు రుచి చూడండి ముందుగా, జావకు ఒక అరకప్ప పండ్ల రసంగానీ కొబ్బరి నీటినిగాని, లేదా మెత్తగా మెదిపిన అరటి పండు గుజ్ఞను గాని కలిపి త్రాగించండి. ఇందువలన బిడ్డకు పొటాసియమ్ దొరుకుతుంది. అది ఎక్కువ ఆహారాన్ని ద్రవపదార్ధాన్ని బిడ్డ తీసుకొనేందుకు సహాయపడుతుంది.

ముఖ్య విషయం: మీరున్న ప్రదేశానికి అనుగుణమైన పదార్ధాన్నే తయారు చేసుకొని బిడ్డకు యిచ్చే పరిమాణాన్ని కూడా తగిన విధంగా క్రమబద్ధం చేసుకొని వాడండి. తేలికగానూ, సూక్ష్మంగానూ తయారుచేసుకొనే పద్ధతి కోసం చూడండి.

బిడ్డలు ఆరోగ్యంగా ఎదగటానికి, జబ్బుల బారిన పడకుండా వుండటం కోసమూ 3 పద్ధతులున్నాయి.

  • పోషక విలువలున్న ఆహారం.
  • పరిశుభ్రత.
  • వ్యాధి నిరోధక టీకాలు, చుక్కల మందులు.

పోషకాహారం

పిల్లలు చక్కగా ఎదగటం కోసమూ, జబ్బులబారిన పడకుండా వుండటం కోసమూ, వారికి బలవర్ధకమైన, పోషకాహార విలువలున్న ఆహారాన్నివ్వటం చాలా ముఖ్యమైన విషయం. అన్నిటికన్నా ముఖ్య విషయం - పిల్లలకు తగినంత ఆహారం రోజులో అనేక సార్లు లభ్యమయ్యేలా చూడటం.

పరిశుభ్రం

పిల్లలూ, వారి యిళూ పరిశుభ్రంగా వుంచబడితే, వారు ఆరోగ్యకరంగా వుంటారు. ఇక్కడ కొన్ని సూచనలివ్వబడ్డాయి.

  • పిల్లలను తరచూ శుభ్రపరిచి, ಬಬ್ಬಲಸು మార్చుతూ వుండాలి.
  • ప్రొద్దున్న లేవగానే, టాయ్లెట్ వెళ్లిన తర్వాత వారు తినటానికి, భోజన పదార్థాలను ముట్టుకోవటానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలన్న విషయాన్ని వారికి బాగా బోధించాలి. టాయ్లెట్లను, మరుగుదొడ్లను వాడే పద్ధతిని వారికి నేర్పించాలి. నులి పురుగులు కనిపిస్తే, పిల్లలను చెప్పలులేని కాళ్లతో వుండనీయవద్దు. విధిగా చెప్పలనో, బూటులనో వేసుకొనేలా చూడాలి.
  • ప్రతిరోజూ వారు పళ్లను బ్రష్ చేసుకొనేలా నేర్చించండి. ఎక్కువగా మిరాయిలను, డ్రింకులను యివ్వకుండి.
  • చేతి గోళ్లను పొట్టిగా కత్తిరించండి.
  • జబ్బుగా వున్నటువంటి, పండల్లా, మచ్చలూ, పేలూ, తామర వున్న పిల్లలతో పడుకోకుండా, వారి బట్టలను, టవళ్లను వాడకుండా చూడాలి.
  • ఒక బిడ్డ నుంచి వేరే బిడ్డకు తేలికగా పాకే (అంటుకొనే) పై జబ్బులున్న పిల్లలకు వెంటనే చికిత్స చేయించాలి.
  • పిల్లలు మురికి వస్తువులను నోట్లో పెట్టుకోకుండా చూడాలి. కుక్కలు, పిల్లలు, యితర జంతువులు బిడ్డల ముఖాలను నాకకుండా చూసుకోవాలి.
  • పందులు, కుక్కలు, కోళ్లు ఇంట్లో లేకుండా చూడాలి.
  • శుభ్రమైనటువంటి, మరిగించి వడబోసిన నీటినే బిడ్డకు త్రాగటానికి వాడాలి. పసిబిడ్డల విషయంయిది యింకా చాలా ముఖ్యం.
  • మలేరియా బారిన పడకుండా బిడ్డలను కాపాడుకోవటానికి దోమతెరలను వాడాలి.
  • రోగ నిరోధక టీకాలు

    అనేక ప్రమాదకరమైన జబ్బులబారిన పడకుండా టీకాలు బిడ్డలను రూఢిగా రక్షిస్తాయి. ఆరోగ్య కార్యకర్తలు మీ సమాజంలో అలా రోగ నిరోధక టీకాలను యివ్వకపోయినట్లయితే, మీ బిడ్డలను మీకు దగ్గరగా వున్న ఆరోగ్య కేంద్రాలకు తీసుకు వెళ్లి టీకాలను యిప్పించండి. వారు ఆరోగ్యంగా వున్నపుడే రోగ నిరోధకాలను యిప్పించటం, వారికి జబ్బుసోకిన తర్వాత చికిత్స చేయించటం కంటే చాలా మంచి విషయం. రోగ నిరోధక టీకాలు సాధారణంగా వూరకనే (డబ్బు తీసుకోకుండానే) యివ్వబడతాయి. (వివిధ దేశాలలో వివిధ పద్ధతులుంటాయి. పిల్లలకు వేయవలసిన అతి ముఖ్యమైన రోగ నిరోధక టీకాలు, యింజక్షన్లు, చుక్కలు

    రోగ నిరోధకాలు

    ఇవ్వవలసిన

    గుర్తుంచుకోవలసిన విషయం

    D.P.T (డి.పి.టి)

    గొంతువాపు, కోరింత దగ్గు, ధనుర్వాతం నివారించుటకు.

    2 నెలలు, 4 నెలలు, 6 నెలలు, 18 నెలల వయస్సులో ఇవ్వబడతాయి.

    కొన్ని దేశాలలో బిడ్డకు 4 మరియూ 6 సంవత్సరాల వయస్సులో వేరొక ఇంజక్షను కూడా ఇవ్వబడుతుంది.

    పోలియో

    పసిబిడ్డలలో వచ్చే పక్షవాత నివారణకు

    కొన్ని దేశాలలో పుట్టినపుడు ఒక డోసు మరొక 3 డోసులు డి.పి.టి. యిచ్చే సమయాలలోనే ఇవ్వబడతాయి.

     

    B.C.G (బి.సి.జి)

    క్షయ నివారంచుటకు

    పుట్టినపుడు గాని లేదా తర్వాత ఎప్పుడైనాగాని, యివ్వబడతాయి.

    ఇతర దేశాలలో మొదటి 3 డోసులు డి.పి.టి ఇంజక్షన్ల తో బాటే, 4వ డోసు 12 నెలలు, - 18 నెలల మధ్యలో మరియు 5వ డోసు 4 సంవత్సరాల వయస్సులో ఇవ్వబడతాయి.

    పొంగు

    మొదటి ఇంజక్షన్ 9 నెలలలోపు, రెండవ ఇంజక్షన్ 15 నెలల తర్వాత ఇవ్వబడతాయి.

    చాలా దేశాలలో ఎం.ఎం.ఆర్ అనబడే 3 జబ్బులను (పొంగు, గవద, బిళ్ళలు, రుబెల్లా అనబడే జెర్మన్ మీజిల్స్) నిరోధించగల ఒకే ఇంజక్షనును 12 మరియు 15 నెలల మధ్యలో ఒకసారి, తిరిగి 4 నుండీ 6 సంవత్సరాల వయసులో రెండవసారి యివ్వబడతాయి.

    హెపటైటిస్ – బి

    డి.పి.టి యిచ్చిన మాదిరిగానే 3 ఇంజక్షన్లు యివ్వబడతాయి.

     

    H.I.B

    హిమొఫిలస్, ఇనుప్లుయంజా టైప్ – బి.

    చిన్న పిల్లలలో మెనున్ జైటిస్, న్యూమోనియాలను కలిగించే క్రిమి సంహరణాకి

    మొదటి 2 డి.పి.టి ఇంజక్షన్సుల తో బాటే 3 ఇంజక్షన్లు ఇవ్వబడతాయి.

    కొన్ని దేశాలలో పుట్టినపుడు ఒకటి , 2 , 6 నెలలలో మరొక రెండు ఇంజక్షన్లు యివ్వబడతాయి.

    T.D.  T.T

    లేక (టెటనస్) ధనుర్వాత నిరోధానికి పెద్దలకూ, 12 సంవత్సరాలు పైబడిన పిల్లలకూ యివ్వబడుతుంది.

    ప్రతి పది సంవత్సరాలకు ఒక ఇంజక్షన్ ఇస్తారు. కొన్ని దేశాలలో 9 మరియు 11 సంవత్సరాల మధ్యలో (ఆఖరి డి.పి.టి) తర్వత 5 సంత్సరాలయినాక, తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి యివ్వబడతాయి.

    గర్భిణి స్త్రీలు తమ ప్రతి గర్భం సాయంలోనూ యి టి.బి. ఇంజక్షన్ తీసుకోవాలి. అపుడే వారి బిడ్డలు పసిబిడ్డలకు ధనుర్వాతం నుండి కాపాడబడతారు.

    మీ బిడ్డలకు వ్యాధి నిరోధక టీకాలు, యింజక్షన్ల సరైన సమయంలో యిప్పించండి.

    మీ బిడ్డలకవసరమైన వ్యాధి నిరోధక టీకాలు, యింజక్షన్లను పూర్తిక్రమంలో యివ్వబడినట్లుగా మీరు నిర్ధారణ చేసుకోండి.

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate