অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మీ శరీరాన్ని గురించి తెలుసుకోవటం

f1మీ శరీరం పని చేసే విధానాన్ని తెలుసుకోవటం చాలా ముఖ్యం. మీ శరీరం గురించి ఎంత ఎక్కువ తెలుసుకొంటే, అంత ఎక్కువ శ్రద్ధగా మీ శరీరం గురించి మీరు తెలుసుకోవటం జరుగుతుంది. మీ శరీరం గురించి, శారీరకంగా సాధారణంగా జరిగే మార్పులను గురించిన అవగాహన వుండటం ఎంతో అవసరం. ఎందుకంటే, ఒక వేళ మీ అంగ వైకల్యం వల్ల కలిగిన మార్పు ఏదైనా వుంటే మీరు సులభంగా గుర్తించగలుగుతారు. లేకుంటే అది సర్వ సాధారణంగా ఇతర స్త్రీలందరి శరీరాలలో కలిగే మార్చే మీకూ కలిగిందని తెలుసుకోగలుగుతారు. ఈ అవగాహన వల్ల ఇతరులు ఇచ్చే సలహాలు మీకు మేలు చేసేవో, హానిని కలిగించేవో కూడా మీకు మీరు నిర్ణయించుకోగలుగుతారు.

ఒక బాలిక శరీరంలో మార్పులు చోటు చేసుకునే తరుణం

చాలా మంది స్త్రీల శరీర ఆకృతి, రూపు రేఖలు భిన్నంగా కనిపించినా, వారి జీవిత కాలంలో వయసును అనుసరించి ఒకే రకమైన మార్పుకు లోనవుతాయి వారి శరీరాలు.

9 - 15 సంవత్సరాల మధ్య వయస్సులో, ఒక బాలిక శరీరంలో మార్పులు ఏర్పడి, ఒక స్త్రీ శరీరంగా తయారు కావటం జరుగుతుంది. ఇది కౌమార దశకు, యవ్వనానికి మద్య దశగా అనుకోవచ్చు. మీ వైకల్యం వల్ల ప్రకృతి సిద్దంగా శరీరంలో జరిగే ఈ మార్పులు ఆగిపోవు. ఈ శారీరక వైకల్యం వున్నా లేకున్న ప్రతి బాలిక శరీరంలోను సహజంగా ఏర్పడతాయి.

యవ్వనం లోనికి అడుగు పెట్టే ముందు మీరు గుర్తించగల కొన్ని ముఖ్యమైన మార్పులు ఇక్కడ ఇవ్వటం జరిగింది.

 • మీరు బొదుగాను, పొడవుగాను పెరుగుతారు.
 • మీ చేతుల క్రింద, కాళ్ళ మధ్య, జననాంగాలపైన రోమాలు పెరుగుతాయి.
 • మీ రొమ్ములలో ఎదుగుదల కనిపిస్తుంది. గర్భవతి అయిన తర్వాత పట్టే శిశువుకు పాలివ్వటానికి అనువుగా తయారవుతాయి. రొమ్ములు ఆకారంలోను, పరిమాణంలోను కూడ, మీ శరీరం లోపల, గర్భసంచి, నాళికలు, అండాశయాలు మరియు యోని కూడ పెరగడం, స్థితి మారటం జరుగుతుంది.
 • తడి(సావం) యోని నుంచి బయటకు రావటం మొదలవుతుంది.
 • నెలవారీగా కలిగే రుతుస్రావం మొదలవుతుంది. ఆ సమయంలో కడుపులో మెలి వంటి నొప్పులు, తలనొప్పి రావటం, నడుము క్రింది భాగంలో నొప్పి రావడం లేక రొమ్ములలో నొప్పిగా వుండటం జరుగుతాయి. రుతుస్రావానికి కొంచెం ముందు చికాకుగా అనిపించటం కూడ వుండవచ్చు.
 • ఉదాహరణకు, ఎవరైనా ఏమైనా అంటే తొందరగా బాధ పడటం, అలాగే తొందరగా ఓర్పు లేకుండా కోపం వచ్చేయటం కూడ జరుగుతూ వుంటుంది.
 • మీలో లైంగికమైన భావాలు, ఉద్రేకాలు ఎక్కువగా కలుగుతాయి.
 • మీ ముఖం జిడ్డుగా తయారై, మచ్చలుగాని, మొటిమలుగాని పెరగవచ్చు.
 • మీకు చెమటలు ఎక్కువగా పట్టడం మొదలవుతుంది. అంతకు ముందు పట్టే చెమటలా కాకుండా ఇది వేరే వాసనను కలిగివుంటుంది.

మీ మార్పులన్నీ కూడా సహజమైనవే అయినప్పటికీ, ఇటు బాలికగాను కాక, అటు పూర్తిగా యువతిగాను కాక, ఆ సమయంలో చాలా కష్ట పడతారు. మీ శరీరం రెండు దశలకు మధ్య రకంగా వుంటుంది. మీకు అంగ వైకల్యం వున్నా లేకున్నా ఆకాలంలో అంటే ఆ వయస్సు సంవత్సరాలలో, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొంటూ , రుతుస్రావ సమయలలో, పరిశుభ్రతను పాటిస్తూ  మీ గురించి మీరే శ్రద్ధ వహించాలి. అదే సమయంలో లైంగికమైన వేధింపుల నుండి కూడ మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి.

మీ శరీరంలో చోటు చేసుకొంటున్న మార్పులు, మీకు కలిగే భావాలు, అనుభూతులు, మీరు ఒక స్త్రీగా మార్పు చెందారని, లైంగికమైన సంబంధానికి అనువుగా మారారనీ, అందువలన గర్భం ధరించే అవకాశం కూడ వుండవచ్చని అవగాహన కలిగించడంలో సహయ పడతాయి. కొన్ని సందర్భాలలో వైకల్యం గల బాలిక, ఇతర వ్యక్తులు తన పట్ల ప్రవర్తించే తీరును బట్టి తన శరీరం అలా వున్నందుకు సిగ్గుతో కుంచించుకుపోవటం జరుగుతుంది. ఆమె ఇతరులను కలవటానికి, వారికి కనిపించడానికి కూడా సంకోచిస్తూ, కుటుంబ సభ్యులపై మరింత ఆధారపడుతూ వుంటుంది.

హార్మోన్లు

ఒక బాలిక శరీరంలో జరిగే అనేక మార్పులకు హార్మోన్లే కారణం. శరీరం ఎపుడు, ఎలా పెరగాలో నిర్దేశించే ఈ రసాయనాల (హార్మోన్లు)ను శరీరమే తయారు చేసుకుంటుంది. నెలవారీ రుతుస్రావం మొదలవ్వడానికి కొంచెం ముందుగా, మీ శరీరం, ఈస్ట్రోజన్, ప్రోజెస్తాన్ హార్మోన్లను అధికంగా ఉత్పత్తి చేస్తుంది. ఈ హర్మోనే ముఖ్యంగా ఒక స్త్రీ శరీరంలో కలిగే మార్పులకు కారణం.

ఒక స్త్రీ గర్భం దాల్చటం - అండాశయం నుంచి అండం విడుదల - రొమ్ములలో పాలు ఉత్పత్తి పుట్టిన బిడ్డ కోసం - ఈ మార్పులన్నింటి పైన ఈ హార్మోన్లే అదుపును కలిగి వుంటాయి. హార్మోన్లు రుతుస్రావాన్ని కూడ క్రమబద్ధం చేస్తాయి ఒక స్త్రీ శరీరంలో ఈ హార్మోన్లను అదుపు చేయటం ద్వారా అనేక కుటుంబ నియంత్రణ పద్ధతులను కనుక్కోవటం జరిగింది.

రొమ్ములు:

ఒక బాలిక రొమ్ములు 9 - 15 సంవత్సరాల మధ్య వయసులో ఎదగటం మొదలవుతుంది. ఆ సమయంలో ఆ మార్పు కారణంగా సిగ్గు పడవలసిన అవసరం లేదు. అదొక ఇబ్బందిగా భావించుకోనక్కర్లేదు కూడ. మీ శరీరం ఒక సంపూర్ణమైన స్త్రీ రూపు రేఖలను పొందుతుందన్న సంకేతమే ఆ మార్పు రెండింటిలో ఒక రొమ్ము ముందుగా పెరగవచ్చు, రెండవది కొంచెం ఆలస్యం కావచ్చు.

అందువలన రెండు రొమ్ములు ఒకే విధంగా లేనందుకు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. చాలా మంది స్త్రీలలో రొమ్ములు రెండూ, ఆకారంలోను, పరిమాణం లోను వేర్వేరుగా వుంటూ వుంటాయి. ఇంకా మీ రొమ్ములను మరొక బాలిక రొమ్ములతో పోల్చితే తేడాగా వున్నాయంటే అది వాటి సహజ లక్షణం. వాటి పరిమాణాలు, ఆకారాలు అనేక రకాలుగా వుంటాయి.

మీ రొమ్ములు పరిమాణంలో పెద్దగా ఎదిగిన తరువాత, గర్భం దాల్చిన అనంతరం, శిశువుకు జన్మనిచ్చినపుడు, పాలను తయారు చేయగల స్థితికి వచ్చినట్లు భావించాలి. లైంగిక సంపర్క సమయంలో మీ రొమ్ములు తాకబడితే, వాటి కొనలు గట్టిగా నిలబడి, ఉద్రేకం కలిగి మీ యోని చెమ్మగిల్లి లైంగిక సంపర్మానికి సిద్ధపడుతుంది.

నెలవారి రుతుస్రావం మొదలవ్వటానికి కొంచెం ముందుగా, మీ రొమ్ములు వాచినట్లు అవ్వటం, నొప్పిగా అనిపించటం, రొమ్ముల కొనలు గాయ పడినట్లు నొప్పి పుట్టటం జరుగుతుంది.

మీ రొమ్ములు ఒకసారి పూర్తి పరిమాణానికి ఎదిగిన తరువాత, నెలకొకసారి అయినా వాటిని పరీక్ష చేసుకోవాలి. అసాధారణమైన గడ్డలు ఏమైనా ఏర్పడ్డాయేమోనని చూసుకోవాలి. ఒక స్త్రీ ఎలా పరీక్ష చేసుకోవాలో తెలుసుకున్నటైతే ఆమె, అసాధారణమైన గడ్డలు వచ్చాయేమో తన రొమ్ములలో తెలుసుకోగలుగుతుంది. సాధారణంగా అటువంటి గడ్డలు వాటంతట అవి పోకుండా నిలబడి వున్నాయిూ అంటే అది రొమ్ము క్యాన్సర్ కు సూచన కావచ్చు. క్రమబద్ధంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటం వల్ల, ఏవైనా ఆరోగ్య సమస్యలను తొలి దశలోనే తెలుసుకొని, నివారణ చేసుకోవటానికి అవకాశం కలుగుతుంది

రుతుస్రావం (బహిష్టు)

f2ఇంచుమించుగా అంగ వైకల్యం గల స్త్రీలందరూ కూడ, మిగిలిన వైకల్యం లేని ఇతర స్త్రీలలాగే రుతుస్రావ క్రమాన్ని కలిగి వుంటారు. నెలవారీ స్రావం, గర్భం దాల్చే స్థితికి వచ్చినట్లు సూచన. తన మొదటి రుతుస్రావాన్ని ఎపుడు పొందుతుందో ఏ బాలికకూ కూడా తెలియదు. మీ రొమ్ములు, మీ శరీరంపై రోమాలు పెరగటం ప్రారంభమైన తరువాత సహజంగా జరిగే ఒక మార్పు అది. మొదటిసారి రుతుస్రావం కావటానికి కొన్ని నెలల ముందు నుంచి యోని నుంచి తడి ప్రావం కావటం గుర్తించగలరు మీరు. అందువల్ల మీరు లోపల ధరించే దుస్తులపై డాగులు కూడా పడవచ్చు. అది సహజం.

మీరు అంధులైనా, చూడటం (దృష్టి) సమస్య అయినా, మీ చేతులూ,కాళ్లు కదపలేని సమస్య వున్నా రుతుస్రావం సమయంలో మీరు బాగా విశ్వసించే మీ స్నేహితులనైనా, కుటుంబంలో ఎవరినైనా సహాయపడమని అడగండి. అర్థం చేసుకోవటం, చూసి నేర్చుకోవటంలలో సమస్య గల బాలిక అయినా, ఫ్రీ అయినా, వారికెటువంటి సహాయం అందించాలో తరువాతి అధ్యాయాలలో తెలుసుకోవచ్చు

ఒక స్త్రీ వయసు పెరుగుతున్న కొలదీ ఆమె రుతుస్రావం తగ్గిపోతుంది. ఆగిపోతుంది. ఇది సుమారుగా 45 - 55 సంవత్సరాల మధ్య వయసులో జరుగుతూ వుంటుంది. ఈ విషయాలన్నీ కూడా తరువాత అధ్యాయాలలో వివరంగా చెప్పటం జరిగింది

నెలవారీ ప్రావ క్రమం (రుతుస్రావ క్రమం):

ప్రతి స్త్రీ యొక్క రుతుస్రావ క్రమం మిగతా వారితో భిన్నంగా వుంటుంది. చాలా మంది స్త్రీలలో ఈ క్రమం మొత్తం 28 రోజులు పడుతుంది. చంద్రుడి క్రమం వలె, కొందరి స్త్రీలలో 20 రోజులకోసారి ప్రావం అవుతుంది. లేకుంటే అతి తక్కువగా 45 రోజులకు అవుతూ వుంటుంది. మొదటి సంవత్సరంలో రుతుస్రావం, నెల నెలకు ఒక్కో సమయంగా కావచ్చు. ఇది కూడా సహజమే. ఒక క్రమబద్ధమైన రుతుస్రావంకు అలవాటు పడటానికి చాలా నెలలు పట్టవచ్చు.

రుతుస్రావ క్రమం

రుతుస్రావం ఇక 14 రోజులకు వస్తుందనగా రెండింటిలో ఒక అండాశయం నుంచి ఒక అండం వెలువడుతుంది. దీనినే అండోత్పత్తి అంటారు. ఈ సమయంలో ప్రొజెస్టరాన్ హార్మోన్ కారణంగా గర్భాశయం లోపలి పొర, గర్భాన్ని వెూయటానికి సిద్ధంగా బలంగా తయారవుతుంది.

అండాశయం నుంచి అండం విడుదల అయి, అది ఫెలోపియన్ నాళాల ద్వారా ప్రయాణం చేసి గర్భాశయానికి చేరుతుంది. ఆ సమయంలో పురుషుడితో లైంగిక సంపర్కం జరిగినటైతే, అతడి వీర్యకణాలు (స్పెర్మ్) అండంతో కలిసీ ఫలదీకరణం జరగటం వలన గర్భధారణ జరుగుతుంది.

తరచు అండం ఫలదీకరణం చెందకపోవడం వల్ల, గర్భాశయం లోపల దళసరిగా ఏర్పడిన పొర అవసరం వుండదు. అది చినిగి విడిపోయి రక్తంలోకి పోయి యోని ద్వారా రుతుస్రావంగా బయటకి పోవడం జరుగుతుంది.

మీలో శారీరక మార్పులు కలిగినపుడు

f3మీ శరీరంలో కలుగుతున్న మార్పుల గురించి, భావోద్వేగాల గురించి, మీ మనసులో గల సందేహాలను సంశయాలను, భయాలను వ్యక్త పరచి ప్రశ్నలు వేయగలగటం అన్నది చాలా ముఖ్యం. మీ జీవిత కాలం అంతలోను కూడా, యవ్వనంలో అడుగు పెట్టే సమయం, లైంగికత్వం, కడుపులో బిడ్డను మోయటం, వయసు ముదిరి రుతుస్రావం ఆగిపోవటం వంటి ముఖ్యమైన పరిస్థితులు మీ శరీరానికి, ఆరోగ్యానికి కూడా పెద్ద మార్పులను కలిగిస్తాయి. మీ శారీరక మార్పులతో పాటు కలిగే లైంగిక అనుభూతులు, ఉద్వేగాలను అనుభవిస్తూనే, ఒక స్త్రీగా మిమ్మల్ని మీరు కాపాడుకోవటం, గౌరవ మర్యాదలను నిలబెట్టుకోవటం చెయ్యొచ్చు. మీకు కలిగే అనుభూతులు, భావాలు - వీటి గురించి ఆలోచించుకోవటానికి కాస్త సమయం వెచ్చించాలి. అలాగే వాటిని ఇతరులతో పంచుకోండి.

 • మీ శారీరక వైకల్యాన్ని మీలో ఒక భాగంగా భావించండి. అలా వున్నందుకు చిన్నగా బాధపడకండి.
 • లైంగికత్వం, దానికి సంబంధించి వుండే బాధ్యతల గురించి తెలుసుకోండి. కుటుంబ సభ్యులలో పెద్ద వయసు వారు, ఆరోగ్య కార్యకర్తలు, మంచి చెడ్డలు చర్చించి అర్థమయ్యేలా అవగాహన కలిగించే వ్యక్తులు, ఇతర వ్యక్తులు - వీరి నుంచి మంచి సమాచారం లభిస్తుంది.
 • కుటుంబంతో, స్నేహితులతో, ఇష్టపడే వారితో మంచి సంబంధాలను కలిగి, వాటిని జాగ్రత్తగా పెంచుకోవాలి. సత్ర్పవర్తనకు, సవ్యమైన :సంబంధాలు అత్యవసరం. ఈ విధమైన సంబంధాలు ఒక గొలుసు కట్టులాగా మీతో వుంటూ మీకు తోడ్పాటును అందిస్తాయి.
 • వైకల్యం గల ఇతర స్త్రీలతో, బాలికలతో, ముఖ్యంగా ఉద్యోగం చేస్తూ తమ కుటుంబాన్ని పెంచుకుంటున్న వారితో సంబంధాలు కలిగి వుండండి. మీకు చెడ్డగా అనిపించే వారితో గడిపి సమయాన్ని వృధా చేసుకోకండి.
 • బయట నలుగురిలో జరిగే కార్యక్రమాలలో పాల్గొనండి. అందువలన మీకు కొత్త వారితో పరిచయమై, కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు. ఇంకా మీ గురించి మీ నైపుణ్యం గురించి తెలియజేసే అవకాశం కలుగుతుంది కూడా,
 • మిమ్మల్ని మీరు లైంగిక వేధింపుల నుండి కాపాడుకోవాలి. ఇది చాలా ముఖ్యం.

ఒక బాలిక, స్త్రీగా మారే తరుణంలో సహాయపడటo:

ఒక బాలికకు స్త్రీ గా మారే సమయంలో ఆమె శరీరం ఏఏ మార్పులకు లోనవుతుందో అవగాహన కలిగించటం అవసరం. ఆమెకు మొదటిసారి రుతుస్రావం ప్రారంభం కాకముందే దాని గురించి అర్థమయ్యేలా తెలియజేయాలి. రుతుస్రావం ప్రారంభం అయిన తరువాత, ఆమెకు ఆ పరిస్థితికి అవసరమైన విధంగా సిద్ధపడేలా ఆమెకు సహాయ పడాలి.

ఆమెకు శారీరకంగా వచ్చే ఆ మార్పులు, కలిగే భావోద్వేగాలు - ఇవన్నీ సాధారణమైన విషయాలే అని అర్థమయ్యేలా చెప్పాలి.

కుటుంబంలో పెద్దవారు, సంరక్షకులు, ఆమెకు తన శారీరక మార్పుల గురించి నిస్సంకోచంగా ప్రశ్నించే వాతావరణం కల్పించాలి. ఒక అంగ వైకల్యం గల బాలిక, తనకు తన సందేహాలను తీర్చటానికి, సహాయపడటానికి తన వారున్నారన్న నమ్మకం, ధీమా ఏర్పడతాయి.

కుటుంబాల, సంరక్షకుల పాత్ర:

తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల సహాకారం:

 • ఆమె, ఇతర బాలికల వలెనే శారీరక మార్పులలో ఫ్రీగా మారుతుందని భావించాలి.
 • ఇతర వికలాంగ బాలికలతో, ప్రీలతో ఆమె కలిసేలా సహాయపడండి.
 • ఆమెను బయట జరిగే కార్యక్రమాలలో పాల్గొనేలా సహాయపడాలి. అందువలన ఆమెకు తోడుగా స్నేహితులు ఏర్పడతారు. అందువలన ఆమెకు తన పట్ల ఒక గుర్తింపు, విశ్వాసం కలుగుతాయి.
 • ఆమెకు మంచి ఆహారం ఇవ్వాలి. సమయానికి అవసరమైన ఆరోగ్య సంరక్షణను కల్పించాలి.
 • లైంగికత్వం గురించి ఆమెకు అవగాహనను కలిగించాలి. సంభాషణ ద్వారా, ఆ విషయమై ఆమె తనకు సంబంధించిన ప్రశ్నలు అడిగే అవకాశం ఇవ్వాలి. ఆమె తన లైంగికత గురించిన భావాలను తెలుపనివ్వాలి.
 • లైంగిక వేధింపుల బారిన పడకుండా ఆమెను కాపాడుకోవాలి.

వచ్చిన వయస్సుకు వేడుకలు:

f4కొన్ని కులాలో, మతాలలో, ఒక బాలిక పెద్దమనిషి అయినప్పడు, అంటే రజస్వల అయిన సందర్భంగా పెద్ద సంబరంలా జరుపుకొంటారు. విందులతో, ఆమె పెళ్ళికి సిద్ధంగా వుందని బంధువర్గంలో తెలియజేసే సంకేతమే అది.

మీరు అటువంటి కార్యక్రమాలు జరుపుకొనే ప్రాంతంలో, పరిసరాలలో వున్నటైతే, మీ కూతురికి కూడా తప్పనిసరిగా ఆ సంబరం జరిపించాలి.

ఆరోగ్య కార్యకర్తల పాత్ర

ఆరోగ్యపరమైన అవగాహనా సదస్సులను, పథకాలను నిర్వర్తించే సమయంలో వికలాంగ బాలికలను ఆ కార్యక్రమంలో పాల్గొనేలా సహాయపడాలి. అది వారి శరీరం గురించి అవగాహనను కలిగిస్తుంది వారికి, వికలాంగ బాలిక గాని స్త్రీ గానీ వున్న కుటుంబాలకు, వికలాంగ బాలికల ఉపాధ్యాయులకు, ఒక విషయం తెలియజేయాలి. వారు వికలాంగ బాలిక అయినా స్త్రీ అయినా, ఆమె శరీరం కూడా, ఇతర స్త్రీల (వైకల్యం లేని వారు) శరీరం వంటిదే గాని తేడా ఏమీ వుండదన్న అవగాహనను కలిగించాలి వారిలో,

స్త్రీ యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థ

అంగ వైకల్యం వుంటే తప్ప, సాధారణంగా ఒక స్త్రీ యొక్క శరీరానికి, పురుషుడి యొక్క

శరీరానికి తేడా లేదు. ఉదాహరణకు స్త్రీలు, పురుషులు కూడా, గుండెలు, మూత్ర

పిండాలు, ఊపిరితిత్తులు, ఇతర శరీర భాగాలు కుడా ఒకే విధంగా కలిగి వుంటారు. కానీ

వారి ప్రత్యుత్పత్తి వ్యవస్థలే, అంటే ఇరువురు కలిసి ఒక శిశువును సృష్టించే భాగాలే భిన్నంగా వుంటాయి. చాలా తేడా వుంటుంది లైంగిక పరంగా వారిలో, స్త్రీల యొక్క చాల ఆరోగ్య సమస్యల ప్రభావం ఈ వ్యవస్థ పై వుంటుంది.

ఒక అంగ వైకల్యం గల స్త్రీ యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థ వైకల్యం లేని స్త్రీ యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్తల  మధ్య సాధారణంగా భేదం ఏమీ వుండదు. ఒకే విధంగా పని చేస్తాయి కూడా. శరీరం బయట గల లైంగిక అవయవాలను, జననాంగాలు అంటారు. శరీరం లోపల వుండే భాగాలను ప్రత్యుత్పత్తి భాగాలు అంటారు. స్త్రీ యొక్క ప్రత్యుత్తత్తి భాగాలు అంటారు.

బాహ్యజననేంబ్రియాలు:

శరీరం వెలుపల స్త్రీ కాళ్ల మధ్యగా వుండే భాగాన్నంతను యోని అంటారు. బొమ్మలో యోని ఆకారం, వివిధ భాగాల పేర్లు వల్ల ప్రయోజనం వుంటుంది. గుర్తించబడ్డాయి. ప్రతి ఫ్రీ శరీరంలో కొంత వ్యత్యాసం వుంటుంది. పరిమాణంలో, ఆకారంలో, రంగులో, ముఖ్యంగా బయట, లోపల వుండే చర్మపు మడతలలో ఆ వ్యత్యాసం వుంటుంది.

కొన్ని సందర్భాలలో ఆ భాగాన్నంతనూ కలిపి యోనిగా చెప్తారు. కాని యోని అన్నది ఒక మార్గంగా బయటకు తెరిచి వుండి గర్భాశయంతో కలుస్తుంది. లోపలి వైపు, ఈ యోని మార్గాన్నే జన్మ మార్గం అని కూడా అంటారు. బాహ్యపు, అంతరపు చర్మపు మడతలు యోనిని కాపాడుతూ వుంటాయి. ఈ మడతలను కొన్ని సందర్భాలలో, "పెదవులు'గా కూడా అంటారు.

లోపలి పెదవులు మృదువుగా వుండి రోమాలు లేకుండా వుంటాయి. ఇవి స్పర్శకు స్పందనను కలిగి వుంటాయి. లైంగిక సంపర్క సమయంలో ఇవి ఉబ్బి, మదురు రంగుకు మారతాయి.

యోని ద్వారానికి కొంచెం ముందు హైమెన్ అనే ఒక పలుచని చర్మపు పొర వుంటుంది. కష్టమైన పనులు చేసేటపుడు గాని, ఆటలలో పాల్గొనేటపుడు గాని ఈ పొర సాగి చినిగిపోవటం, కొద్దిగా రక్తస్రావం జరగటం జరుగుతుంది. ఒక స్త్రీ మొదటి పర్యాయం లైంగిక సంపర్కం పొందినపుడు కూడా జరగవచ్చు ఇలా. ఈ పొర అందరిలో ఒకే విధంగా వుండదు. కొందరు స్త్రీలలో అసలు ఈ పొర వుండదు. అందువల్ల మొదటి సారి సెక్స్లో పాల్గొన్నప్పడు అందరి స్త్రీలలో రక్తస్రావం కనిపించదు.

యోని శీర్యం (క్లిటోరిస్): ఇది చిన్నగా వుండి ఒక మొగ్గ ఆకారంలో వుంటుంది. స్త్రీ జననేంద్రియాలలో స్పర్శకే ఉద్రేకం కలిగిస్తూ స్పందించే భాగం ఇదే. దీనిని, దీని చుటూ వున్న ప్రాంతాన్ని రుద్దటం వల్ల ఒక స్త్రీలో లైంగిక ఉద్వేగం, ఉద్రేకం కలుగుతాయి.

క్లిటోరిస్కు, యోని ద్వారానికి మధ్యన మూత్రద్వారం వుంటుంది. ఇది యూరెత్రా అనే చిన్న మూత్ర వాహిక లోనికి వుంటుంది లోపలి వైపు. ఇది మూత్ర కోశం లేక మూత్రాశయం నుండి మూత్రాన్ని శరీరం ద్వారం వెలుపలకు పంపిస్తుంది.

మలద్వారం, పేగుల యొక్క కొనభాగం శరీరం నుండి మలాన్ని బయటకు పంపించటం చేస్తుంది.

స్త్రీ జననాంగాలు - శరీరం లోపలి భాగాలు:

స్త్రీ శరీరం లోపల ప్రత్యుత్పత్తి భాగాలు, పెల్విక్ ప్రాంతం అంటే తుంటి ఎముకలకు కొంచెం క్రింది భాగంలో వుంటాయి. అంటే నడుముకు కొంచెం దిగువన వుంటాయి. తుంటి ఎముకలు సమానంగా లేనటైతే కూడా మీ ప్రత్యుత్పత్తి భాగాలపై ఆ ప్రభావం పడదు.

ఒక స్త్రీ, తన గర్భాశయానికి ఇరువైపుల రెండు అండాశయాలను కలిగి వుంటుంది. ఇవి బాదం పలుకు లేక ద్రాక్ష కాయ పరిమాణంలో వుంటాయి. అండాశయాల నుంచి నెలకు ఒకటిగా అందాలు విడుదలై, అండవాహికల ద్వారా గర్భాశయంలోకి చేరతాయి అండాలు. గర్భాశయం (యుటిరస్) ఒక చిన్న సంచీలాంటి మృదువైన కండరం. ఇది ఫ్రీ గర్భం దాల్చినప్పట్నుంచీ సాగుతూ, పెద్దగా పెరుగుతుంది.

పురుషుడి లైంగిక అవయవాలు:

ఒక స్త్రీ జననేంద్రియాల కన్నా పురుషుడి జననేంద్రియాలను సులభంగా చూడవచ్చు. ఎదుకంటే అవి పూర్తిగా చాలా వరకు శరీరం వెలుపల భాగంలోనే కనిపిస్తాయి. పురుష జననేంద్రియాలలో గుండ్రని భాగాలను వృషణాలు (టెస్టికిల్స్) అంటారు. టెస్టోస్టిరాన్ అనే  హార్మోనును ఇవి తయారు చేస్తాయి. ఒక బాలుడి శరీరంలో మార్పులు కలిగి ఎదిగే సమయంలో ఈ టెస్టోస్టెరాన్ హార్మోను ఎక్కువగా తయారవుతుంది. ఒక బాలుడు, పురుషుడిగా మార్పు చెందటానికి ఇదే కారణం. స్త్రీ హార్మోను ఉత్పత్తి అయి ఒక బాలికలో మార్పులు ఎలా వస్తాయో, అలాగే పురుషుడిలో కూడా జరుగుతుంది.

పురుష వీర్యకణాలు (స్పెర్మ్స) వృషణాలలోనే తయారవుతాయి. స్పెర్మ్ టెస్టికిల్స్ నుండి ఒక నాళము ద్వారా పురుషుడి అవయవంలోనికి చేరటం జరుగుతుంది. అక్కడ వీర్యగ్రంధి నుండిఉత్పత్తి అయ్యే ఒక ద్రవముతో కలుస్తుంది. ఈ కలిసిన ద్రవాన్ని వీర్యం అంటారు.

లైంగిక సంపర్కంలో ఏం జరుగుతుంది?

లైంగిక సంపర్క సమయంలో పురుషావయవం నుండి వీర్యం విడుదల అవుతుంది. ఈ ద్రవంలోని ప్రతి బిందువులోను కొన్ని వేల (స్పెర్ములు) వీర్య కణాలుంటాయి. ఇవి చాలా సూక్ష్మంగా వుంటాయి. పురుషుడు, స్త్రీ యొక్క యోనిలో గాని, జననేంద్రియాల సమీపంలో గాని విడుదల చేసిన వీర్యకణాలు ఆమె గర్భాశయంలోనికి ప్రవేశించటం జరుగుతుంది.

యోని యొక్క చర్మం, సెక్స్ సమయంలో సాగేటటువంటి చర్మంతో ప్రత్యేకంగా తయారై వుంటుంది. అలాగే బిడ్డకు జన్మనిచ్చే సమయంలో కూడా పెద్దగా సాగటం జరుగుతుంది. యోని నుండి తయారయ్యే ఒక ద్రవం వృషణాలు శుభ్రంగా వుంచి, వ్యాధి సోకకుండా కాపాడుతుంది. సెక్స్ సమయంలో ఈ ద్రవం ఎక్కువగా ఉత్పత్తి అయి, పురుషాంగం యోనిలోనికి సులువుగా ప్రవేశించేందుకు తోడ్పడుతుంది. అంతే కాకుండా యోని గాయపడకుండా చేసి, వీర్యకణాన్ని గర్భాశయానికి చేర్చటానికి సహాయపడుతుంది.

గర్భ ధారణ

ప్రతి నెల జరిగే రుతుస్రావం అయిన 14 రోజులకు, గర్భాశయం లోపలి పొర దళసరిగా అయి సిద్ధపడిన తరువాత రెండింటిలో ఒక అండాశయం నుండి ఒక అండం విడుదల అవుతుంది. దీనని అండ ఉత్పత్తి అంటారు. అండం, అండ వాహిక ద్వారా గర్భాశయంలోకి ప్రవేశిస్తుంది. ఈ సమయంతో గర్భధారణకు అనుకూలమైన వాతావరణం వుంటుంది. ఒక పురుషునితో లైంగిక సంపర్కం పొందినటైతే, అతడి వీర్యకణం (స్పెర్మ), గర్భాశయం లోనికి ప్రవేశించి ఆమె అండంతో రలుస్తుంది. దీనినే "ఫలదీకరణం అంటారు. ఇదే గర్భానికి ప్రారంభం. ఒక వేళ అండంతో వీర్యకణం కలవనటైతే, గర్భాశయం లోపల ఏర్పడిన పొర చినిగి, నెలవారీ స్రావంలో వెలుపలకు వచ్చేస్తుంది.

సెక్సులో పాల్గొనటం - అవగాహన

 • f6మొదటిసారి ఒక పురుషుడితో లైంగిక సంపర్కం కలిగినపుడు, మీకు గర్భం రావచ్చు.
 • కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించకుండా సెక్సులో పాల్గొనటం వల్ల (ఒక్క మారైనా సరే) మీరు గర్భవతి కావచ్చు.
 • పురుషుడు వీర్య కణాలను విడుదల చేయకుండా జాగ్రత్త పడ్డాడని భావించినా, మీకు గర్భవతి అయ్యే అవకాశం వుంది.
 • కుటుంబ నియంత్రణ సాధనమైన కండోమ్ను ఉపయోగించకుండా లైంగిక సంబంధం కలిగివుంటే మీకు, లైంగిక సంబంధాల వల్ల వచ్చే (వ్యాపించే) వ్యాధులు సోకే అవకాశం ఎక్కువగా వుంది. అతడి నుంచి మీకు హెచ్.ఐ.వి సోకే ప్రమాదం కూడా వుంటుంది. ఒక వ్యక్తి ముఖం చూసి అతడికి లైంగిక సంబంధమైన వ్యాధులు వున్నాయో, లేదో చెప్పలేరు కదా.
 • ఒక పురుషుడికి, ఫ్రీ నుంచి లైంగిక సంబంధమైన వ్యాధులు సోకే అవకాశం తక్కువ. పోల్చి చూస్తే ఆ అవకాశం స్త్రీకే ఎక్కువగా వుంటుంది. ఎందుకంటే అతడి వీర్యం, ఆమె యోనిలో ఎక్కువ సమయం వుంటుంది కనుక.
 • ఒక బాలిక గాని స్త్రీ గాని లైంగిక సంబంధంతో సోకే వ్యాధి గ్రస్తురాలా, కాదా అన్న విషయం వారిని చూసి తెలుసుకోవటం చాలా కష్టం. ఎందుకంటే వ్యాధి అన్నది వారి శరీరం లోపల వుంటుంది.

ఎల్లప్పుడూ స్త్రీ కండోమ్ను గాని, పురుష కండోమ్ను గాని ఉపయోగించటం వల్ల లైంగిక సంబంధమైన వ్యాధులను, ఇంకా హెచ్.ఐ.వి / ఎయిడ్స్ను కూడా రాకుండా రక్షణ పొందవచ్చు. వ్యాధిని కలిగించే క్రిములు గాని, వీర్యకణాలు కాని ఎంత సూక్ష్మంగా వున్నప్పటికీ కండోమ్ యొక్క ప్లాస్టిక్ లేక లేటెక్స్ పొరలో నుండి బయటకు వెళ్ళలేవు. ఎటొచ్చీ దానిని సవ్యంగా అమర్చుకోవాలి.

మరింత సమాచారం కోసం (మిమ్మల్ని మీరు వ్యాధుల నుండి రక్షించుకోవటం సంబంధించి) 8వ అధ్యాయం చూడండి. గర్భధారణను నిరోధించటం గురించిన సమాచారం పురుషుల కండోమ్ కోసం 9వ అధ్యాయం చూడండి

వంధ్యత్వం

వైకల్యం వలన వంధ్యత్వం సంక్రమించదు. వికలాంగ స్త్రీలలో కూడా, వికలాంగులు కాని ఇతర స్త్రీలలో వలెనే కొందరికి వంధ్యత్వం వుండొచ్చు. ఒక వికలాంగ స్త్రీకి సంతానం లేకపోవడం అన్నది ఆమె వైకల్యం వలన కాదు.

వంధ్యత్వం అంటే ఏమిటి?

f7కుటుంబ నియంత్రణ పద్ధతులను అనుసరించకుండా ఒక జంట, అంటే ఒక పురుషుడు, స్త్రీ అనేక సార్లు అంటే కొన్ని నెలలు, ఒక సంవత్సరం పాటు కూడా సెక్సులో పాల్గొన్నా సంతానం కలగలేదు అంటే దానిని వంధ్యత్వంగా పరిగణిస్తారు. అలాగే మూడు నాలుగు మార్లు గర్భధారణ జరిగి కూడా అబారన్ (గర్భస్రావం) జరిగిన జంటకు కూడా వంధ్యత్వ సమస్య వున్నట్లే లెక్క

ఒక పురుషుడు గాని, స్త్రీ గాని ఒక బిడ్డ కలిగిన తరువాత కూడా వంధ్యులు అయ్యే అవకాశం వుంది. బిడ్డ కలిగిన తరువాత నుంచి ఏదైనా సమస్య ఏర్పడి వుండవచ్చు. కొన్ని సందర్భాలలో లోపం కేవలం పురుషుడికి సంబంధించో లేక స్త్రీకి సంబంధించో వుండదు. వారి కలయికలోనే సమస్య వుండవచ్చు. కొన్ని సందర్భాలలో స్త్రీ, పురుషులిద్దరిలోను ఏ దోషం కనిపించదు. డాక్టర్లు, పరీక్షలు కూడా కనుగొనలేవు సమస్య ఎక్కడుంది అన్న విషయం. కారణం కనుగొన లేరు.

వంధ్యత్వానికి కారణం

స్త్రీలో వంధ్యత్వం:

ఒక స్త్రీలో సంతాన హీనతకు ముఖ్యమైన కారణాలు:

1. గర్భాశయంలోగానీ, అండవాహికలోగానీ అడ్డంకులు: కొన్ని సందర్భాలలో అండాన్ని గర్భాశయానికి చేర్చే అండ వాహికలలోను, గర్భాశయం చర్మం నల్లగా మాడినట్లు గట్టిపడి ముడతలుగా ఏర్పడిపోయి అడ్డంకిగా తయారవుతుంది. ఇందువల్ల అండం గర్భాశయంలోకి చేరటానికి (స్పెర్మ్) వీర్యకణం అండాన్ని చేరటానికి అవరోధం ఏర్పడుతుంది. గర్భకోశం గోడలకున్న దళసరి గట్టి చర్మం వల్ల , ఫలదీకరణం చెందిన అండం, పిండంగా మారి గర్భకోశ గోడకు అంటుకొని వుండకుండా అవరోధం ఏర్పడుతుంది. అందువల్ల గర్భస్రావం జరిగే అవకాశాలు కూడా ఎక్కువగానే వుంటాయి. ఒక స్త్రీకి ఇటువంటి అవరోధాలు ఏర్పడినా ముందుగా తెలుసుకోవటం కష్టం. అందువలన ఆమెకు అనారోగ్యం ఏమీ వుండదు కనుక, కొన్ని సంవత్సరాల తరువాత తెలుస్తుంది. ఆమెకు వంధ్యత్వం వున్నదని.

ఇందుకు కారణాలు:

 • లైంగిక వ్యాధుల నివారణకు వైద్యం చేయించుకొనక పోవటం వల్ల, అది అండవాహికలకు, గర్భాశయానికి కూడా వ్యాప్తి చెంది వాటిని నల్లగా మాడ్చినట్టు చేసి చర్మాన్ని పాడు చేస్తుంది. పెల్విన్కు క్షయ సోకటం వల్ల కూడా ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
 • అరక్షిత గర్భస్రావం వల్ల, ప్రసవ సమయంలో ఏర్పడే సమస్యల వల్ల గర్భకోశం వ్యాధిగ్రస్తమై దెబ్బతినటం జరుగుతుంది.
 • గర్భకోశం లోపల పరిశుభ్రత లేని స్థితిలో పరికరాలను ఉపయోగించటం - గర్భదారణను నిరోధించటం కోసం గర్భకోశం లోపల అమర్చే చిన్నపరికరం వల్ల కూడా వ్యాధిగ్రస్తమయ్యే అవకాశం వుంది.
 • యోని గర్భకోశం, అండాశయం, అండవాహికలు మొదలైన భాగాలకు చేసిన శస్త్ర చికిత్సల వల్ల కూడా వ్యాధులు వ్యాపించి ఈ పరిస్థితికి దారి తీయవచ్చు.

2. అండం విడుదలలో సమస్యలు: వంధ్యత్వం గల స్త్రీ యొక్క నెలవారీ రుతుస్రావం 21 రోజులకన్నా ముందే గాని, లేక 35 రోజుల తరువాత గాని జరుగుతున్నట్లయితే ఆమె అండాన్ని విడుదల చేయలేదు. ఆమె శరీరంలో అవసరమైన హార్మోన్లు తగినంతగా ఉత్పత్తి కాకపోవటం వల్ల లేక తగిన సమయంలో ఉత్పత్తి చేయకపోవటం వల్ల కూడా అలా జరుగుతుంది. కొన్ని సందర్భాలలో ఫ్రీ వయసు ముదిరి, ఆమె రుతుచక్రం చివరి దశకు చేరుకుంటూ వుండటం వల్ల కూడా (బహిష్ణు ఆగిపోవటం) ఒక కారణం. కొన్ని సందర్భాలలో స్త్రీలు బరువు ఎక్కువై సూల కాయులవ్వటం వల్ల, లేక మరీ బలహీనులుగా వుండటం వల్ల లేక అనారోగ్య కారణం గాకుండా అండాలను విడుదల చేయలేక పోతారు.

3. ఆమెకు కణితిలు వున్నాయి గర్భాశయంలో, కణితిల వల్ల గర్భస్రావం అవుతుంది:

పురుషుడిలో వంధ్యత్వం

పురుషుడిలో వంధ్యత్వానికి ముఖ్య కారణాలు:

 1. f8అతడు తగినంతగా వీర్య కణాలను ఉత్పత్తి చేయలేకపోవటం.
 2. అతడి వృషణాలు ఆరోగ్య కరమైన వీర్య కణాలను ఉత్పత్తి చేయకపోవటం. అతడు బిగుతుగా వుండే దుస్తులు ధరించటం వల్ల, బాయిలర్స్, కొలిమిలు యంత్రాలు వంటివి పనిచేసే వేడి ప్రాంతాలలో ఎక్కువ సమయం వుండటం వల్ల, ఆగకుండా కూర్చొని గంటల తరబడి సుదీర్ఘంగా వాహనాలను నడపటం వలన కూడా ఆరోగ్యకరమైన వీర్యకణాలు ఉత్పత్తి కావు. ఇంకా అతడు రోజంతా కూర్చొనే వుండటం వల్ల, సెక్స్లో పాల్గొనే ముందు వేడినీళ్ళ స్నానం ఎక్కువ సమయం చేయటం వల్ల కూడా అలా జరుగుతుంది.
 3. అతడు వీర్యకణాలను (స్పెర్మ్) విడుదల చేయ లేడు. లైంగిక సంబంధంగా సోకిన వ్యాధి వల్ల వాహికలలో చర్మం మూడి మడతలుగా అడ్డంకి ఏర్పడటం వల్ల, వెన్నెముకకు గాయం అవటం వలన కూడా అతడు వీర్యకణాలను విడుదల చేయలేడు.

స్త్రీ, పురుషులు ఇరువురిలో వంధ్యత్వం:

స్త్రీలైనా, పురుషులైనా వంధ్యత్వం కలగటానికి కారణాలు:

 1. గవదబిళ్లల వ్యాధి (మంప్స్), చక్కెర వ్యాధి, క్షయ మరియు మలేరియాల వల్ల వంధ్యత్వం ప్రాప్తించవచ్చు.
 2. మద్యపానం వలన, పొగత్రాగటం వలన, పొగాకు నమలటం వలన, మత్తు మందులు (డ్రగ్స్) సేవించటం వలన కూడా వంధ్యత్వం కలుగుతుంది.
 3. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొనక పోవటం వలన, అధిక ఒత్తిడి వలన, అధిక శారీరక శ్రమ వలన, లేక రసాయనాల ప్రభావం సోకడం వలన కూడా వంధ్యత్వం ఏర్పడుతుంది.

దత్తత ద్వారా కుటుంబాన్ని ఏర్పరుచుకోవటo:

కొందరు వికలాంగ స్త్రీలు దత్తత ద్వారా కుటుంబాలను ఏర్పరుచుకోవటాన్ని ఇష్టపడతారు. ఆమె గాని, ఆమె భాగస్వామి గానీ వంధ్యులు కావడం వలన గానీ, శిశువుకు జన్మను ఇవ్వలేని అనారోగ్య కారణంగా గానీ, సాధారణంగా ఇటువంటి నిర్ణయం తీసుకొంటారు. లేకుంటే కేవలం ఒక బిడ్డను దత్తత చేసుకొని తల్లిగా మారవచ్చు. కుటుంబం ఏర్పరుచుకోవచ్చునన్న అభిప్రాయంతో కూడా దత్తత పద్ధతిని ఎన్నుకొంటారు.

నేను ఎలా తల్లిని అయ్యాను?

ఒక బాలికగా ఎదుగుతున్న సమయంలో, అమెరికాలోని ఇతర అమ్మాయిల లాగే నేనూ కలలు గన్నాను, ఒక భాగస్వామిని చూసుకొని, ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవాలని, కాని ఆ కోరిక తీరగలదని నేను వూహించలేదు. నేను తిరగటానికి చక్రాల కుర్చీని ఉపయోగిస్తాను. నాకు తెలిసినంత వరకు చక్రాల కుర్చీ ఉపయోగించేవారిలో తల్లిదండ్రుల పాత్రలను చూడలేదు. నేను నా స్వంత కుటుంబాన్ని ఏర్పరుచుకొని హాయిగా జీవించగలనన్న ఆలోచననే నేను ప్రోత్సహించుకోలేదు. నేను నా భర్తను మొదటిసారి కలిసినపుడు, అతడే నాకు సరైన జీవిత భాగస్వామి అనిపించింది నాకు. దత్తత ద్వారా బిడ్డతో కుటుంబాన్ని పెంచుకోవాలన్న నా రహస్యమైన కలను అతడూ పంచుకొన్నాడు. నా అభిప్రాయానికి ఆలంబన దొరికింది. నాకు తెలుసు ఎందరో పిల్లలు తమ కుటుంబానికి దూరమై అలమటిస్తున్నారనీ, మరో కుటుంబంలో తమకు స్థానం కోసం ఆశగా ఎదురు చూసూ వుంటారనీను. అటువంటి మంచి బిడ్డకు, మేము మంచి, సరైన కుటుంబం కాగలమని నా మనసులో వుంది.

ముందు మా తల్లిదండ్రులు అందుకు ఒప్పకోలేదు. నా భర్తకు తనదికాని బిడ్డ ఆలన పాలనల బాధ్యతను అప్పజెప్పటం న్యాయం కాదని వారి అభిప్రాయం. నేను బిడ్డ పనులు అన్నీ చేసి పెంచగలనని వారు అనుకోలేదు. నేను ఎన్నటికీ చేయలేనని అందరూ అన్నా ఎన్నో పనులను ఎలా చేయాలో, అంతా ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాను. గతంలో నాకు స్వంత ఉద్యోగం వుండేది. నా ఇంటిజాగ్రత్త అంతా నేను చూసుకునేదానిని. నా స్నేహితుల పిల్లల జాగ్రత్త చూసే దాన్ని అపుడు. నాకు తెలుసు, నేనూ, నా భర్త కలిసి ఈ పని చెయ్యగలమని.

మేము ఎన్నో పిల్లలను దత్తత ఇచ్చే కేంద్రాలకు వెళ్ళి చూశాము. చివరకు మా ఆలోచనకు విలువ నిచ్చేవారు దొరికారు. ప్రజలలో ఏర్పడి వున్న దురభిప్రాయాలను మార్చలేమని నాకు తెలుసు. ఒక దత్తత కేంద్రం వారు'కాదు' అనగానే మరొక చోటకు ఓపికగా వెళ్ళాం, మా ఆలోచనను బలపరిచే వారు దొరికేటంత వరకు, ఆ కేంద్రం వారికి నేను బిడ్డను ఎంత బాగా సంరక్షించగలనో వారికి చేసి చూపించాను. ఏం చేయలేనో అది చెప్పలేదు. మా కలలకు, ఆశలకు రూపంగా ఒక బిడ్డను మాకు ఇచ్చారు. ఆమె కూడా నాలాగే చక్రాల కూర్చీని ఉపయోగించే పిల్ల, నా వైకల్యం చూస్తే దత్తతకు జడ్జి అంగీకరించడేమోనని భయపడ్డాం. కాని ఆయన మమ్మల్ని చూడగానే, మీరు ఒకరికొకరు మంచిగా సరిపోతారని, మా దత్తతను ఆయన అనుమతించారు. ఎదిగే వయసులో, నాకూ తురిని శ్రద్ధగా చూసుకుంటూ, ఆమెకు విద్యాబుద్దులు నేర్పిస్తుంటే నాకెంతో 55o దక్కినట్టు ఒక భావన మనసులో. ఆమెను ఒక ప్రియమైన వ్యక్తిగా, ప్రయోజకురాలిగా తీర్చి దిద్దగలిగినందుకు ఎంతో గర్వపడుతున్నాను, ఒక తల్లిగా,

- కేరెన్ బ్రెయిట్ మేయర్

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate