অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

లైంగికత్వం

లైంగికత్వం

  1. ఖచ్చితమైన వివాహ భాగస్వామి గురించి గీత చెప్పిన విషయాలు
  2. హానికరమైన అభిప్రాయం: వికలాంగ స్త్రీలు లైంగిక అనుభూతులను కలిగివుండరు అనుకోవటం
  3. హానికరమైన అభిప్రాయం: వికలాంగ స్త్రీలు ఎల్లపుడూ సెక్సును కోరుకుంటారన్న విషయం
  4. తెలుసుకొనే, అర్థం చేసుకొనే విషయాలలో సమస్యగల స్త్రీలను, బాలికలను అల్లీల పదాలతో దూషించటాన్ని వారించండి
  5. లైంగికత్వం గురించి తెలుసుకోవటం
  6. ప్రియమైన భాగస్వామిని వెతుక్కోవటం
  7. వేధించే భాగస్వామి
  8. ఏర్పాటు చేయబడ్డ వివాహాలు
  9. అర్థరాత్రి భర్తలు
  10. సెక్సును ఆపదంగా అనుభవించటం
  11. లైంగిక ఆనందానికి శరీరం ఎలా స్పందిస్తుంది?
  12. సెక్సులో పాల్గొనటానికి వివిధ రకాల పద్ధతులు
  13. సెక్స సమయంలో ఎదురవ్వగల సమస్యలు
  14. మార్పు కోసం కృషి చేయటం

b17.jpgసెక్సు జీవితంలో ఒక సహజమైన భాగం. చాలామంది స్త్రీలకు అది ఆనందానుభూతికి, తమ భర్తపట్ల వున్న అనురాగాన్నీ లైంగిక కోరికను వెల్లడించటానికీ, లేక తాము కోరుకొనే పిల్లల్ని గర్భంలో మోయటానికీ ఒక సాధనం. కాని, ఎవరితోనైనా సెక్సు సంబంధం పెట్టుకోవటం కంటె కూడా ఎక్కువైనది సెక్సువాలిటి. ఒక స్త్రీ తన భాగస్వామితో కలిసి సన్నిహితంగా మసలుకొనే విధానము, తన శరీరంతో తనకు సంబంధం కలిగి వున్న విధానము, తననొక ఫ్రీగా తాను భావించే విధానము - ఇవన్నీ ఆమె సెక్సువాలిటీలో ఒక భాగమే.

వికలాంగ స్త్రీలకు కూడా సెక్సు కోరిక, సన్నిహితమైన ప్రేమ పూరితమైన సెక్సు సంబంధాలను సంతోషంగా అనుభవించే హక్కు వుంటుంది. ఒక్కొక్కపుడు కమ్యూనిటీ యొక్క దృక్పథాలు కూడా వికలాంగ స్త్రీల సెక్సువాలిటీని ప్రతిభావంతము చేస్తాయి. పరిమితమూ చేస్తాయి. వికలాంగ స్త్రీలకు కూడా యితరులందరిలాగే, ప్రేమ, సెక్సు, కుటుంబం వంటి కోరికలుంటాయన్న విషయాన్ని సమాజంలోని వ్యక్తులు అర్థం చేసుకొని ఒప్పకున్నట్లయితే వికలాంగ స్త్రీలు యిూ క్రింది పనులను చేయగలరు.

  • తనకు సంతోషాన్ని కలిగించే విధమైన సెక్సు గురించి వెల్లడించటం.
  • ఆమె లైంగిక భాగస్వామిని ఎన్నుకోవటం.
  • ఎప్పడు, ఎలా సెక్సు కావాలి అనే విషయం మాట్లాడుకోవటం.
  • అసలు గర్భం కావాలా లేక ఎపుడు గర్భం కావాలి అని నిరయించుకోవటం
  • సెక్సు సంబంధమైన హెచ్.ఐ.వి, ఎయిడ్స్, సుఖ వ్యాధుల్ని అన్ల ప్రసక్తి లేకుండా నిరోధించటం. బలవంతపు సెక్సుతో సహా లైంగిక హింస నుండి విముక్తి పొందటం.

వికలాంగ స్త్రీల వాళ్లకు హక్కు లైంగికత గురించిన హానికరమైన విశ్వాసాలు వికలాంగ స్త్రీల యొక్క లైంగికత గురించిన కొన్ని హానికరమైన నమ్మకాలు యీ క్రింద వివరించబడ్డాయి. ఈ వ్యతిరేక దృక్పథాలే తాము సన్నిహిత, ప్రేమతో కూడిన లైంగిక సంబంధాలను ఏర్పరచుకోగల శక్తి లేకుండా చేస్తున్నాయని చాలా మంది వికలాంగ స్త్రీలు అంటున్నారు.

తమకు విలువనిచ్చి గౌరవించే భర్త (భార్య) మరియు భాగస్వాములను వెతుక్కోవటంలో యీ తప్పడు దృక్పథాలే వారిని అవరోధిస్తున్నాయి.

హానికరమైన దృక్పథం: వికలాంగ స్త్రీల యొక్క శరీరాలు అవమానకరమైనవని. .

అనేక కమ్యూనిటీలలో స్త్రీలు వారి శారీరక ఆకర్షణ ప్రమాణంగా గౌరవింపబడతారు. ఆ ప్రమాణానికి భిన్నమైన రీతిలో ఒక స్త్రీ కనిపిస్తే జనం ఆమెను వివాహ అర్హత గలదానిగానూ, లైంగిక భాగస్వామికావటానికి అర్హత గల దానిగానూ భావించరు.

ఖచ్చితమైన వివాహ భాగస్వామి గురించి గీత చెప్పిన విషయాలు

b3.jpgఇండియాలో వున్న సమస్య ఏమిటంటే, మనం సరైన ఆకారం గల సరైన మనుష్యుల కోసమే చూస్తాము. విపరీతమైన ప్రాముఖ్యం బాహ్య ఆకారానికే యివ్వబడుతుంది. లోపభూయిష్టమైన శరీరాకృతిగల వారికి స్థానమే వుండదు. పెళ్లి సంబంధాల ప్రకటననే తీసుకోండి. నాజూకుగా, అందంగా, తెల్లగా, విద్యావంతురాలైన, మంచి కుటుంబంలో పుట్టిన - ఇటువంటి లక్షణాలన్నీ వున్నటువంటి స్త్రీలనే పురుషులు కోరుకుంటారు. అంగవైకల్యం, పోలియో వంటి లోపాలున్న వ్యక్తి వున్న కుటుంబంలోని పిల్లను చేసుకుంటే పిల్లలు కూడా అలాగే పుడతారన్న ఒక నమ్మకం కూడా వుంది. ఇది నా విషయంలో జరిగింది. కనుక నాకు తెలుసు. ఒక్క స్త్రీల విషయంలోనే యిూ విచక్షణంతా. అదే పురుషుడు అదే పురుషుడి విషయంలో అయితే అతను ఎంత వికలాంగుడైనా, వికారి అయినా, మూర్ఛ రోగి అయినా, త్రాగుబోతు అయినా కూడా అతను తగిన, సరైన పురుషుడి క్రిందే లెఫ్టి.

హానికరమైన అభిప్రాయం: వికలాంగ స్త్రీలు లైంగిక అనుభూతులను కలిగివుండరు అనుకోవటం

ఇతర స్త్రీల అందరి మాదిరిగానే వికలాంగ స్త్రీలకు కూడా లైంగిక అనుభూతులుంటాయి. కాని ఆమె కుటుంబ సభ్యులు, కమ్యూనిటిలోని వారు ఆమెకు లైంగిక అనుభూతులు వుండకూడదనీ, వుండవనీ అనుకొంటారు. కొన్ని కొన్ని సందర్భాలలో వికలాంగ స్త్రీ తనకు లైంగిక అనుభూతులు వుండకూడదనీ, ఎవరూ లైంగికపరమైన ఆకర్షణను తన పట్ల కలిగి వుండరనీ తనతో పిల్లలను పొందటానికి యిష్టపడరనీ నమ్మకానికి వచ్చేస్తుంది. ఒక స్త్రీ తాను వికలాంగిగానే పుట్టినా, చిన్నతనంలోనే వికలాంగురాలిగా మారినా వయసుతోపాటు తాను లైంగికపరమైన ఆకర్షణ తనలో చోటు చేసుకుంటుందన్న నమ్మకాన్ని కోల్పోతుంది. ఒక యువతి తన లైంగిక జీవితం గురించి తెలుసుకొనే సమయంలో వికలాంగురాలైతే, ఆమె ఆత్మాభిమానం దెబ్బతినవచ్చు. తనను ఎప్పటికైనా లైంగిక సంబంధాలుంటాయన్న విషయాన్ని నమ్మకపోవచ్చు. లైంగిక జీవితాన్ని అనుభవించినటువంటి ఒక మధ్య వయస్కురాలైన ఫ్రీ కూడా వికలాంగురాలైన తర్వాత తన శరీరం గురించిన భావనలను మార్చుకోవచ్చు. లైంగికపరమైన ఆకర్షణ యిక ఎంతమాత్రమూ తనకు లేదనీ, ఇకనుండి లైంగికత వేరే విధంగా వుంటుందన్న విచారాన్ని కలిగి వుండవచ్చు. లైంగిక ఆనందాన్ని పొందటాన్ని కొనసాగించవచ్చన్న విషయాన్ని ఆమె తెలుసుకో లేకపోవచ్చు.

హానికరమైన అభిప్రాయం: వికలాంగ స్త్రీలు ఎల్లపుడూ సెక్సును కోరుకుంటారన్న విషయం

మిగిలిన అందరి స్త్రీలలాగానే వికలాంగ స్త్రీలు కూడా రకరకాల అభిప్రాయాలను కలిగి వుంటారు. కొందరు తరచుగా సెక్సు కావాలని అనుకుంటారు. మరికొందరు సెక్సును అంతగా యిష్టపడరు. వికలాంగ ఫ్రీ కూడా యితర స్త్రీలలాగానే తనకు సెక్సు ఎపుడు కావాలో నిర్ణయించుకోగలదు. మరియు ప్రతీ ఫ్రీ కూడా ఆమెకు అవసరం లేనపుడు కోరికలేనపుడు సెక్సును 'వద్దు అని చెప్పగలదు.

తెలుసుకొనే, అర్థం చేసుకొనే విషయాలలో సమస్యగల స్త్రీలను, బాలికలను అల్లీల పదాలతో దూషించటాన్ని వారించండి

తమకవసరమైన దగ్గర సంబంధాలను నెలకొల్పుకోగల అవకాశాలను చాలా మంది వికలాంగ బాలికలూ స్త్రీలూ పొందలేరు.

మీరు యింటివద్దనే వదిలి వేయబడినా కుటుంబ సభ్యుల వల్ల విస్మరించబడినా, ఆ ఒంటరితనంలో మీరొక స్నేహితుని కోసంగాని, మీ యందు శ్రద్ద చూపించేవారి కోసం గాని చూస్తారు. ఈ అవసరాన్ని కొందరు సెక్సుపరమైన కోరికగా పొరపాటు పడగలరు. లేదా వారు దానిని అలుసుగా తీసుకోవటానికి ప్రయత్నించగలరు. ఎందుకంటే మీరు ఒంటరిగా వున్నారు కనుక, వారు మిమ్మల్ని బాధపెట్టినా ఎవరూ మీ గురించి శ్రద్ధ తీసుకోరు గనుక, మీరు నిజంగా ఏమి కోరుకొంటున్నారు అన్నది తెలియజెప్పటం చాలా కష్టం. ముఖ్యంగా సెక్సు గరించి మీకు బోధించనపుడు - మీ శరీరం గురించి, లైంగికత్వం గురించి మీరు తెలుసుకోవటం చాలా ముఖ్యం మిమ్మల్ని మీరు రక్షించుకోవటం కోసం మరియు సెక్సు గురించి మంచి నిర్ణయాలు తీసుకోవటం కోసం - మీరు నమ్మే ఎవరో ఒకరు మీకు సహాయం చేయగలరు.

లైంగికత్వం గురించి తెలుసుకోవటం

అనేక మంది వికలాంగ బాలికలు అశ్రీలంగా దూషించబడినపుడూ లేదా, ప్రలోభ పెట్టి సెక్సులో దించబడినపుడు మొట్టమొదటిసారిగా సెక్సు గురించి తెలుసుకుంటారు. ఆరోగ్య కార్యకర్తలు, కుటుంబం, స్నేహితులు, సహాయకారులు లైంగికత్వం ప్రీత్వం గురించిన తమ సంభాషణలలో వికలాంగ బాలికలనూ, స్త్రీలనూ చేర్చుకోగలరు. సెక్సు విద్యా సంబంధమైన ప్రోగ్రాములలో వికలాంగ బాలికలను జేర్చుకుని వారికి లైంగికత్వం గురించి బోధించాలి. తమ అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని అత్యాచారం జరిపే పురుషుల నుంచి బాలికలు తమను తాము రక్షించుకోవటానికి ఇది సహాయపడుతుంది.

కొన్ని కమ్యూనిటీలలో గౌరవనీయమైన ఒక పెద్ద ద్వారా బాలిక, ఫ్రీగా మారటం గురించి బాలికలు తెలుసుకుంటారు. కొన్ని కమ్యూనిటీలలో బాలికలు స్త్రీలుగా మారే సందర్భంలో ప్రత్యేకమైన పండగలను జరుపుకుంటారు. బాలికల బృందం అక్కడ వేరి తమతమ అనుభవాలను పాలుపంచుకుంటారు. క్రొత్త హెయిర్ స్టేల్సు గురించీ, మగ స్నేహితుల గురించీ, బట్టల గురించి, పాప్స్టార్స్ గురించీ తెలుసుకొన్నట్లే వారు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. ఈ సమావేశాలలో వికలాంగ బాలికలు కూడా చేర్చబడటం చాలా అవసరం.

ప్రియమైన భాగస్వామిని వెతుక్కోవటం

ఇతర స్త్రీల అందరి లాగానే మీకు కూడా మిమ్మల్ని గౌరవించే, మీ కోసం తీసుకునే ఒక జీవిత భాగస్వామి, కావాలి. మిమ్మల్ని మంచిగా చూసుకొనే, మీ మాటవినే జీవిత భాగస్వామి మీకు కావాలి. మీ సాధక బాధకాలలో సహాయంగా నిలిచి, మిమ్మల్ని ప్రేమించే ఒక భాగస్వామి మీకు కావాలి. మీ సహాయం, నమ్మకం, ప్రేమలను కోరే భాగస్వామి మీకు కావాలి.

ప్రియమైన భాగస్వాములను పొందిన స్త్రీలు చాలామంది అంగవైకల్యం గురించిన తమ తప్పడు అభిప్రాయాలను తిరస్కరించేరు. వారు నైపుణ్యాలను సంపాదించి, కుటుంబానికి సహాయపడగలదారులను కనుగొన్నారు. వారిని వారు గౌరవించుకోవటం నేర్చుకున్నారు. మిమ్మల్ని మీరు గౌరవించుకుని మీకు విలువనిచ్చుకున్నపుడు, మిమ్మల్ని గౌరవించే భాగస్వామిని పొందగలుగుతారు.

ఒక వికలాంగ బాలిక విద్యను, వుద్యోగ నైపుణ్యాలను నేర్చుకొని వుంటే, ఆమె ప్రియమైన భాగస్వామిని పొందగలదు. ఉద్యోగం ఆమెకు అనేక అవకాశాలను, గట్టి ఆత్మస్థిర్యాన్ని యిస్తుంది. వికలాంగ స్త్రీ వుద్యోగిని అయితే కుటుంబానికి సహాయం చేయగలదన్న నమ్మకం కల్లుతుంది.

వేధించే భాగస్వామి

తనకు గాని, తన కుటుంబానికి గాని సహాయ సహకారాలందించలేనటువంటి, తన గురించి పట్టించుకొని జాగ్రత్తలు తీసుకో లేనటువంటి, వేధించేటటువంటి - ఎలాంటి భాగస్వామితోనైనా స్థిరపడటానికి ఒక్కొక్కప్పుడు స్త్రీ సిద్ధపడుతుంది. ఒక్కొక్కసారి స్త్రీ తన కుటుంబానికి ధనసహాయం చేసి, ఆసరానిచ్చే వ్యక్తిని కూడా అంగీకరిస్తుంది. బ్రతకటానికి కావలసిన సహాయం, ఆహారాలను పొందటం కోసం ఒక్కొక్క స్త్రీ సెక్సుతో వ్యాపారాన్ని కూడా చేస్తుంది. కొన్ని కొన్ని పరిస్థితులలో ఫ్రీ పనిచేస్తుంది. పురుషుడు ఆమె నుంచి ధనాన్ని తీసుకుంటాడు. అతనితో వున్నందుకే ఆమె అతనికి కృతజ్ఞతా భావంతో వుండాలని కూడా చెప్పతాడు.

ఒక స్త్రీ తనకుతాను, కుటుంబం, కమ్యూనిటీ విలువ నిచ్చుకొన్నపుడు, ఆమె తనను మంచిగా చూసుకొనే వ్యక్తులతో లైంగిక సంబంధాలను పెట్టుకుంటుంది. ఆమెను కొట్టి, తిట్టే భాగస్వామిని ఆమె అంగీకరించదు.

ఏర్పాటు చేయబడ్డ వివాహాలు

కొన్ని కమ్యూనిటీలలో కుటుంబాల వారు తమ కుమార్తెల కోసం తామే వివాహాలను కుదిర్చి ఏర్పాటు చేస్తారు. ఇలా జరిగినపుడు ఒక వికలాంగ స్త్రీ మిగిలిన ఏ ఇతర స్త్రీలకన్నా కూడా హీనంగా చూడబడుతుంది. ఆమెను వివాహం చేసుకోవటానికి యిష్టపడిన ఏ వ్యక్తితోనైనా సరే, భవిష్యత్తులో అతడామెను సరిగా చూడడని తెలిసీ కూడా ఆమె కుటుంబ సభ్యులు అతనితో ఆమె వివాహాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ స్త్రీ కూడా తనంతతానే ఆ వివాహానికి సిద్ధపడుతుంది. ఎందుకంటే ఆమె తనకు తాను విలువ నిచ్చుకోదు. వేరే మరొకరెవరూ ఆమెను వివాహం చేసుకోవటానికి యిష్టపడరని ఆమె అనుకుంటుంది. ఫ్రీ వికలాంగురాలు కనుక చాలా పెద్ద కట్నాలను, యితర సొమ్ములను భర్త అడగటం జరుగుతుంది కొన్ని సమయాలలో వికలాంగ స్త్రీ రెండవ భార్యగా మారి అంగవైకల్యం లేని భార్యను చూసిన విధంగా చూడబడక పోవచ్చు స్త్రీ యొక్క అంగవైకల్యాన్ని లెక్కచేయకుండా వుండటం కోసం ఒక వ్యక్తి ఎక్కువ ధనాన్ని కానుకలను కోరినటైతే, అతడామెను స్త్రీగా గుర్తించటం లేదనటానికి అదే ఒక నిదర్శనం - తరచుగా ఆమెను వేరే వంకలతో దూషిస్తూ, బాధిస్తూ వుంటాడు.

అర్థరాత్రి భర్తలు

b7.jpgకొన్ని దేశాలలో పురుషుడు సెక్సు కోరిక తీర్చుకోవటం కోసం వికలాంగ స్త్రీని రాత్రిపూట మాత్రమే చూస్తాడు. తర్వాత యింకా చీకటి పోకముందే తెల్లవారు ఝామునే యిల్లు వదిలి వెళ్లిపోతాడు. ఇటువంటి పురుషులు అర్థరాత్రి భర్తలుగా పిలవబడతారు. ఆ ఫ్రీ గర్భవతి అని తెలిశాక ఆమెను చూడటం ఆపేస్తారు. ఆమెకూ బిడ్డకూ ఏ రకమైన ధన సహాయం చేయరు.

సెక్సును ఆపదంగా అనుభవించటం

ఒక స్త్రీ తన భాగస్వామితో కలిసి లైంగిక ఆనందాన్ని పాలుపంచుకోవటం సహజసిద్ధమైన విషయం. కాని ఒక్కొక్కప్పడు స్త్రీ సెక్సును ఆహ్లాదంగా అనుభవించలేకపోవచ్చు. అందుకు చాలా కారణాలు వండగలవు. ఆమె భాగస్వామి పురుషుడు అయితే అతను - ఒక స్త్రీ యొక్క శరీరం లైంగిక స్పర్శకు పురుషుడి శరీరంలాగా కాకుండా వేరే విధంగా స్పందించవచ్చునన్న విషయాన్ని గుర్తించలేకపోవచ్చు. స్త్రీకి తాను సెక్సును పురుషునికన్నా తక్కువగా ఆనందించాలని, తనకు ఏమి కావాలో తన భాగస్వామికి చెప్పకూడదని బోధించి వుంటారు. (ఆమె భాగస్వామి స్త్రీ అయినా పురుషుడైనా సరే)

స్త్రీ యొక్క వైకల్యం ఆమె లైంగిక ఆనందానికి అవరోధం కావచ్చు. సెక్సును ఆనందంగా అనుభవించటం కోసం ఆమె వివిధ పద్ధతులను కనుగొనవచ్చు - ముఖ్యంగా యీ మధ్యనే వికలాంగురాలైన ఫ్రీ రోజూ తన దిన చర్యలో తన పరిశుభ్రత కోసం జాగ్రత్త తీసుకున్నట్లే, తన వైకల్యానికి అనుగుణమైన ఒక స్త్రీ సెక్కను ఒక పురుషునితో గాని, స్త్రీతో గాని, లేదా పద్ధతులలో తనకు సంతోషం కలిగించే విధంగా తనకు తాను గాని కలిగి వుండవచు, లైంగిక విధానాలను ఆమె అనుసరిస్తుంది.

లైంగిక ఆనందానికి శరీరం ఎలా స్పందిస్తుంది?

స్త్రీ పురుషులిరువురూ కూడా లైంగికపరమైన కోరికలను కలిగి వుంటారు. కాని వారి వారి శరీరాలు లైంగిక ఆలోచనలకూ, స్పర్శలకూ విభిన్న రీతులలో స్పందిస్తాయి – స్త్రీ, పురుషులు లైంగికపరమైన ఆలోచనలు, స్పర్శలను చేసినపుడు వారు వుద్రేక పూరితులౌతారు. ఎక్కువ ఆలోచనలూ, స్పర్శలూ, శరీరాన్ని ఎక్కువగా వద్రేకపరుస్తాయి. లైంగిక వుద్రేకమును పురుషునిలో చూడటం సులభం, ఎందుకంటే అపుడు అతని పురుషాంగము గట్టిగా అవుతుంది.

ఫ్రీ శరీరం కూడా వుద్రేక పూరితమవుతుంది. కాని దానిని చూడటం కష్టం. యోని శీర్షం గట్టిపడి లావుగా అవుతుంది. యోని అధరాలు, గోడలు సున్నితంగా తయారయి స్పర్శకు ప్రతిస్పందిస్తాయి. పలచని జిగురు లాంటి ద్రవంతో యోని తడిగా మారుతుంది. ఆమె చనుమొనలు కూడా వచ్చి మృదువుగా అవుతాయి.

లింగపరమైన స్పర్శలు, ఆలోచనలు అలాగే కొనసాగుతూ వుంటే ఆమె భావప్రాప్తిని పొందేవరకూ లైంగిక వుద్రేకము అలాగే వుంటుంది. లైంగిక చర్యలో పరమానంద స్థితిని పొందినప్పడు, ఆమె శరీరంలోని శక్తి వద్రేకం శిఖరాగ్రానికి చేరి విడుదల అయిపోతుంది. ఆమె విశ్రాంతిని, ఆనందాన్ని పొందుతుంది.

ఒక పురుషుడు ఆనందపు శిఖరాగ్రానికి చేరినపుడు అతని పురుషాంగము శుక్లముతో కూడిన వీర్యాన్ని వదిలి పెడుతుంది. అంటే వీర్యస్థలనం జరుగుతుంది. దీనిని "భావప్రాప్తి లేక 'ఆర్గాసమ్' అంటారు. ఆ తర్వాత అతని శరీరం విశ్రాంతిని తీసుకుంటుంది. అతని పురుషాంగము తిరిగి మొత్తబడి పోతుంది.

ఫ్రీ భావ ప్రాప్తిని పొందటానికి అతిసాధారణమైన పద్ధతి ఆమె యోని శీరాన్ని స్పృశించటం. యోని అంతర భాగాన్ని పురుషాంగంతో గాని, వ్రేళ్లతో గాని రుద్దినా ఆమెకు భావప్రాప్తి కలుగుతుంది. ఆమె మల ద్వారాం కూడా స్పర్శకు ప్రతిస్పందిస్తుంది. భావప్రాప్తిని పొందటానికి పురుషునికంటే స్త్రీకి ఎక్కువ సమయం పడుతుంది.

చాలామంది స్త్రీలకు భావప్రాప్తిని పొందటం సాధ్యమైన విషయమే. కాని ప్రతి స్త్రీ యొక్క శరీరం, అనుభవాలు భిన్నంగా వుంటాయి. శరీరం క్రింది భాగంలో తక్కువ స్పరానుభూతి కలిగి వున్న స్త్రీలకు భావప్రాప్తి పొందటం కోసం యోని శీర్షంపై ఎక్కువ ఒత్తిడి బలమైన స్పర్శ అవసరం. ఒక్కొక్కసారి అదే సమయంలో యోనిలో పని భాగంలో కూడా ఒత్తిడి కలిగించటం అవసరం అవుతుంది. వెన్నెముక దెబ్బతిన్న స్త్రీలు, మరియు శరీరంలోని క్రింది భాగంలో స్పరానుభూతి లేనటువంటి స్త్రీలు కూడా భావప్రాప్తి పొందుతారు.

భిన్నమైన పద్ధతిలో వేర్వేరు స్త్రీలు వారి వారి శరీరంలోని వేరు వేరు భాగాలను స్పృశించడం వలన ఆనందానుభూతిని పొందుతారు. చాలా మంది స్త్రీ మర్మావయవాలు, వక్షోజాలను మాత్రమే లైంగికా వయవాలుగా అనుకుంటారు. కాని స్త్రీ యొక్క చేతులు, మెడ, ముఖము, పొట్ట కూడా స్పృశించబడితే ఆమె ఆనందాన్ని పొందుతుంది. పక్షవాతం సోకిన స్త్రీలు, లేదా వెన్నెముక దెబ్బతిన్న స్త్రీలకు యీ యితర భాగాలు మృదువుగా మారి స్పర్శకు స్పందించి ఆనందానుభూతిని, భావప్రాప్తిని కలగజేస్తాయి.

పంచజ్ఞానాలైన స్పర్శ, వాసన, వినికిడి, రుచి, దృష్టిలు లైంగిక ఆనందానుభూతిని పొందటానికి చాలా ముఖ్యమైన సంతృప్తికరమైన మార్గాలు - ప్రతివ్యక్తి - పురుషుడు గానీ, స్త్రీ గానీ, అంగవైకల్యం వున్నా లేకున్నా పంచజ్ఞానాల ద్వారా అనుభూతిని పొందుతారు. ఒక అంధురాలికి - స్పరు, వినికిడి, వాసన చాలా ముఖ్యమైనవి. ఒక చెవిటి స్త్రీకి స్పర్శ, దృష్టి సెక్సును తృప్తిపరిచే భాగాలు కావచ్చు.

స్త్రీ తన శరీరంలోని జ్ఞానంగల భాగాల గురించి తెలుసుకోగలదు. తనను తాను స్పృశించు కోవటం వలన భావప్రాప్తిని ఎలా పొందగలదో, లేదా తనకేది బాగుంటుందో తన భాగస్వామికి చెప్పి భావప్రాప్తి నెలా పొందాలో తెలుసుకుంటుంది. తన భాగస్వామిని సంతోష పెట్టగలుగుతున్నాని తెలుసుకోవటం అతనికి కూడా ఆనందాన్ని కలిగించవచ్చు.

సెక్సులో పాల్గొనటానికి వివిధ రకాల పద్ధతులు

సెక్సును పొందటానికీ, భాగస్వామితో కలిసి ఆనందాన్ని పంచుకోవటానికీ వివిధ రకాలైన పద్ధతులు చాలా వున్నాయి. సెక్సు అంటే స్త్రీ పురుషుల మధ్యనే జరిగేది అనీ, యోనిలో పురుషాంగమనీ మాత్రమే వ్యక్తులు తరచుగా భావిస్తారు. కాని, మంచి సెక్సును కలిగి వుండటానికి, వేరే వ్యక్తితో తనకు గల ప్రేమను వ్యక్తపరచటానికీ అనేక మార్గాలు వున్నాయి. సెక్సు అంటే ఒక వ్యక్తియొక్క మర్మావయవాల గురించి మాత్రమే కాదు. ముదులు పెట్టుకోవటం, కౌగలించుకోవటం, మాట్లాడటం సెక్సులో భాగాలే - ఒక వ్యక్తి యొక్క చేతులు, ముఖం, వీపు, మెడలను స్పర్శించటం కూడా సెక్సు సంబంధమే. నోటి ద్వారా సెక్సు (ఒక భాగస్వామి కానీ, లేక యిద్దరూ కాని వారి నోటితో రెండవ వారి మర్మావయవాలను చప్పరించటం, పీల్చటం చేయటం ఆనందదాయకం కావచ్చు. ఒకరి మర్మావయవాలను మరొకరు ముట్టుకోవటం, రుద్దటం ద్వారా లైంగిక ఆనందాన్ని యివ్వవచ్చు, పొందవచ్చు.

ఆనందాన్ని అనుభవించటం కోసం తనని తానే మటుకోవటం

b1.jpgమిమ్మల్ని మీరే ఒక పద్ధతిలో ముట్టుకోవటం వలన మీకు లైంగిక ఆనందం లభిస్తుంది. ఏ రకమైన లైంగిక స్పర్శ మంచిగా అనిపిస్తుందో మరియు మీ శరీరాన్ని గురించి తెలుసుకోవటం కోసం యిది ఒక మంచి పద్ధతి. మీ స్వంత లైంగికత మీద మీకు నమ్మకం కలగటానికి కూడా యిది దోహదకారి అవుతుంది. తనను తాను ముట్టుకోవటం, తప్పడుపని అనీ, ప్రమాదకరమైనది అనీ అనేక కమ్యూనిటీలలో నమ్మకాలున్నాయి. అందుచేత ఆ పనిని చేయటానికి వ్యక్తులు సిగ్గుపడతారు. కాని మిమ్మల్ని మీరు ముట్టుకోవటం హానికారకం కాదు - లైంగిక కోరికను తీర్చుకోవటమూ కాదు - ఆనందాన్ని అనుభవించటానికి, మీ కోరికను తృప్తి పరచటానికి మీరు ఎవరితోను భాగస్వామి కాకుండానే వుండటానికి యిది ఒక మంచి పద్ధతి.

సెక్సుతో కూడిన సంబంధాలు

అనేక మంది స్త్రీలు తమ గురించి శ్రద్ధ తీసుకొనే వారితో సన్నిహితం ప్రేమపూరితం అయిన సంబంధాలను కలిగి వుండాలని కోరుకుంటారు. ఈ సంబంధాలు వికలాంగులతో కావచ్చు - వికలాంగులు కానివారితోనూ కావచ్చు. వికలాంగ స్త్రీలు కొందరు వివాహితులు కావచ్చు. మరికొందరు వివాహం చేసుకోనివారు కావచ్చు. అనేక మంది వికలాంగ స్త్రీలు పురుషులతోనే సంబంధాలు కలిగి వుంటారు. కొందరు స్త్రీలతో సంబంధాలు కలిగి వుంటారు. కొందరు తల్లలుంటారు. మరికొందరు తల్లులు కానివారు.

వికలాంగ స్త్రీలకు వారి భాగస్వాములకూ కూడా సెక్సు చాలా ఆనందదాయకంగా వుంటుంది. వారిద్దరూ యిష్టపడి క్రొత్త పద్దతులను కనుగొనే ప్రయోగాలు చేసినపుడు - మీరు చేయలేనటువంటి, మీకు కష్టమైనటువంటి పనులను చేయాలనుకొనే బదులు మీరు చేయగల పనులనే మీరు, మీ భాగస్వామి ఆనందాన్ని పొందండి.

మీ భాగస్వామితో మాట్లాడటం

చాలా మంది వారి కోరికలు, అనుభూతుల గురించి మాటలాడటానికి సిగ్గుపడతారు. కాని మిమ్మల్ని మంచిగా వుండేలా చేసేటటువంటి మీకు కోరిక కలగటం, సంబంధాన్ని ఏర్పరుచుకోవాలనుకోవటం సాలూ సహజమైన విషయాలు ఎవరితోనైనా సెక్సు సంబంధం కలిగి వుండాలని మీరు ముందుగా ప్లాన్ చేసుకుంటే, ఆ వ్యక్తితో ముందుగానే సురక్షిత సెక్సు గురించి, మీ యితర అవసరాలు, కోరికల గురించి మాటలాడటానికీ వీలవుతుంది.

b2.jpgమీ కదలికలలో ఏమైనా పరిధులు (హద్దులు) వుంటే వాటి గురించీ, లైంగిక ప్రేరణ విషయంలో మీ శరీరం స్పందించే పద్ధతుల గురించి మీ భాగస్వామితో మాట్లాడండి. సెక్సు స్త్రీని బాధపెడుతుందనీ, ఆమె అంగవైకల్యం కారణంగా ఆమెతో సెక్సు ప్రమాదకరమైనదనీ ఒక్కొక్కసారి భాగస్వామి దిగులు పడవచ్చు. తన భాగస్వామికి నచ్చే విధమైన లైంగిక సంభాషణనూ, స్పర్శను చేయడం తెలిసిన వాడైతే అపుడు వారిద్దరూ లైంగిక ఆనందానుభూతులను ఎక్కువగా పొందగలుగుతారు. ప్రతి వ్యక్తి కోరికలు భిన్నంగా వుంటాయి. అందుచేత మీ భాగస్వామికి యిష్టమైన రీతిలో స్టీ సంభాషించటం, ప్రయోగాలు చేయటం చాలా మంచి పద్ధతి.

మాటలాడటానికి మంచి విషయాలు

  • సెక్సు జరుపుకోవటానికి ఏ ప్రదేశం అయితే సులభతరం? ఉదాహరణకు బెడ్ మీదనా, చక్రాల కుర్చీలోనా, కుర్చీలోనా, నేలపైనా,
  • ఏ భంగిమ అయితే బాధగా వుంటుందో, ఏవి సౌకర్యంగా వుంటుందో,
  • మీ అంగవైకల్యం యొక్క ప్రభావం మీ శరీరం మీద ఎంత వరకూ వుంటుందీ, దానిననుసరించి మీ శరీరం ఎలా పని చేస్తుంది?
  • మీరిద్దరూ ఒకరికొకరు ఆనందాన్ని ఎలా యిచ్చిపుచ్చుకోగలరు.
  • మీరు తొందరగా అలసిపోయేవాళ్లయితే, వారంలో లేదా రోజులో ఏ సమయంలో అయితే మీరు లైంగిక పరంగా శక్తివంతులై వుంటారో,
  • ఏది మంచి అనిపిస్తుందో ఏది మంచిది కాదని అనిపిస్తుందో,

మీ భాగస్వామే మీ సంరక్షకుడు కూడా అయితే జాగ్రత్తలు తీసుకొనే విషయమై మీరు గడిపే కాలం, లైంగిక భాగస్వాములుగా మీరు గడిపే సమయాల మధ్యగల భేదం గురించి మాటలాడుకోవటానికి వీలు అవుతుంది.

ముఖ్య విషయం : ఒక ఫ్రీ లైంగిక సంబంధాన్ని ఒక పురుషుడితోగాని, లేదా వేరే ప్రీతో గాని పెట్టుకొన్నపుడు లైంగిక సంబంధమైన అంటు రోగాలు, హెచ్.ఐ.వి సోకకుండా సురక్షిత సెక్పుకోసం కావలసిన జాగ్రత్తలను తీసుకోవటం చాలా ముఖ్యం. సెక్సు సంబంధాన్ని పెట్టుకోవటానికి ముందుగానే హెచ్.ఐ.వి టెస్టు చేయించుకోవటం చాలా ముఖ్యం. ఇంకా వివరాలకోసం 172వ పేజీ చూడండి. మీకు సెక్సు సంబంధం కావాలి కానీ, గర్భవతి కాకూడదనుకొంటే కుటుంబ నియంత్రణ ప్రణాళిక కోసం అభ్యాసం-9 చూడండి. అత్యవసర శీప్రు గర్భనిరోధం కోసం 205వ పేజీ చూడండి.

అంగవైకల్యం పొందిన స్త్రీలలో లైంగికత

దుర్ఘటన కారణంగా గానీ, జబ్బు వలన గానీ మధ్యలో అంగవైకల్యాన్ని పొందిన ఫ్రీ తన లైంగిక అనుభూతులు మారినట్లుగా గ్రహిస్తుంది. కొందరు స్త్రీలు తక్కువ లైంగికానుభూతులను కలిగి వుండవచ్చు లేదా అసలు ఆ రకమైన శ్రద్దే లేకుండా వుండవచ్చు. లైంగిక అనుభూతినీ, ఆనందాన్ని అనుభవించే శక్తినే కోల్పోయినట్లుగా కొన్నిసార్లు స్త్రీలు అనుకుంటారు. అంగవైకల్యం తమ లైంగికత్వం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందో తెలిపే సమాచారాన్ని ప్రతి స్త్రీ తెలుసుకోవటం చాలా అవసరం. మరియు ఆమెకు ఒక భాగస్వామి గాని వుంటే, వారిద్దరూ అంగవైకల్యపు ప్రభావం లైంగికత్వంపై ఎలా పడుతుందో తెలుసుకోవాలి.

మీరు వికలాంగురాలు కాకమునుపు మీకు సెక్సు సంబంధాలుండి వుంటే, వికలాంగురాలైన తర్వాత తిరిగి సెక్సులో పాల్గొనటానికి భయపడవచ్చు - మీ జీవిత భాగస్వామి మీ పట్ల యిక ఎంత మాత్రమూ లైంగిక ఆకర్షణను కలిగి వుండకపోవచ్చునని మీరు అనుకోవచ్చు. లేదా మీరు, మీ భాగస్వామి కూడా ఒకరిని ఒకరు యికపై ఎంతమాత్రమూ తృప్తి పరుచుకోలేమని అనుకోవచ్చు. మీ అనుభూతులను, చేసుకోవలసిన మార్పులనూ గురించి, మీరిద్దరూ మాట్లాడుకోవటం చాలా సహాయపడుతుంది.

మీరు అవలంభించే సెక్సు పద్ధతి వేరుగా వుండొచ్చు. కాని, అనేక యితర జంటల మాదిరిగానే ఒకరి నొకరు ఆనందపరుచుకోవటం కోసం సెక్సు కోసం ఎన్నో పద్ధతులను కనుక్కోవచ్చు. ఇది ముఖ్యంగా అంగవైకల్యం కలగటానికి ముందుగా భాగస్వామితో మీకుగల నమ్మకమైన సంబంధాలు మంచిగా మనసులో ఏమి దాచుకోకుండా మాటలాడుకొనే (చెప్పకోగల) పద్ధతి కలిగి వుంటే ఇది తప్పక జరుగుతుంది.

ఏకాంతము

వికలాంగ సీలకు సెకు జరుపుకోవటానికి మంచి సమయ ప్రదేశం లభ్యం కావటం చాలా కష్టమైన విషయం. ముఖ్యంగా వారిని ఆ పనికి సిద్ధం చేయటానికి వేరొకరి సహాయం అవసరం అయినప్పుడు ఈ సమస్యకు సులభమైన పరిష్కారం ఏమీ లేదు. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు గాని, మీ సంరక్షకులు గాని మీకు సెక్సు అవసరం అన్న విషయాన్ని గురించి ఆలోచించినపుడు – అనుకొంటున్లట్లుగా కొన్ని సమయాలలో మీకు సహాయపడే వ్యక్తులతో మీరు మాటలాడితే వుపయోగం ఉండవచ్చు - లేక మీరు నమ్మే ఒక వ్యక్తి

ఎవరితోనైనా యిూ విషయం గురించి మాటలాడటానికి ప్రయత్నిస్తే తర్వాత వారు మీ కుటుంబ సభ్యులతో గాని, సంరక్షకులతోగాని మాటలాడతారు. ఇతర వికలాంగ స్త్రీలతో మాటలాడటం, వారి అనుభవాలను పంచుకోవటం కూడా సహాయ పడగలవు.

కొందరైతే వారంతట వారే దారులు ఏర్పాటు చేసుకోగలరు. ఉదాహరణకు - ఒక ఫ్రీ తన చక్రాల కుర్చీలోనే తన భాగస్వామితో సెక్సులో పాల్గొన గలదు. అపుడు ఆమెను బెడ్ మీదకు కదపవలసిన అవసరం వుండదు. తమ అవసరాలకు స్పందించి, తమ సంబంధానికి సపోర్టునిచ్చే సంరక్షకులు వుంటారని కొందరు తెలుసుకుంటారు.

సౌకర్యకరమైన భంగిమ

మీరు పరిమితంగానే కదలగలిగిన వారైతే సెక్సులో పాల్గొనటానికి సౌకర్యవంతమైన భంగిమను తెలుసుకొనే ప్రయోగాలు చేయవలసి వుంటుంది. మెదడుకు సంబంధించిన పక్షవాతం, బలహీనమైన కండరాలు, బిగుతు కండరాలు లేక, కీళ్లనొప్పలు, మరియు వైకల్యం వలన నొప్పి గాని, బలహీనతగాని కలిగి వున్న స్త్రీలకు. వారి భాగస్వాముల నుండి సరైన భంగిమను కనుగొనే సహాయం అవసరం. దిండుగాని, చుట్టగా చుట్టిన బట్టలు గాని, మీ కాళ్లకు గాని, పిరుదులకు గాని సపోర్టు చేయడానికి సహాయపడవచ్చు. ఇంకా ఒక భాగస్వామి బరువు నొప్పికి కారణమైతే మీరిరువురూ ప్రక్క ప్రక్కను పడుకొనే భంగిమను ప్రయత్నించండి. లేక యిద్దరు కలిసి ఒకే కుర్చీలో కూర్చోండి. ముద్దులు స్పృశించుకోవటం సులభం కావచ్చు. కాని పురుషాంగాన్ని యోని మలద్వారాల ద్వారా సెక్సు జరిపించటం కష్టం కావచ్చు. నోటితో సెక్సు సులభం కావచ్చు. ఎపుడంటే యిరువురి శరీరాలు సరైన భంగిమలో వుంచుకోగలిగినటైతే - మీరు పక్షవాత బాధితులైతే మీ శరీరం ఎంత వరకూ సహకరించగలదో, దానిని బట్టి ఏ భంగిమ మీకు సరైనదో చూసుకోవచ్చు - మీ శరీరంలో ఎంత భాగానికి పక్షవాతం సోకిందో, దానిని అనుసరించి ఒక భాగస్వామిని గాని, నమ్మకస్తుడైన సంరక్షకుణ్ణిగాని సహాయం కోరవచ్చు. పెల్విక్ పరీక్షల సమయంలో వుపయోగించబడిన భంగిమలే సెక్సు సమయంలో కూడా పనికి వస్తాయి.

సెక్స సమయంలో ఎదురవ్వగల సమస్యలు

సెక్సు సమయంలో నొప్పి

b4.pngసెక్సు గాయపరచకూడదు. ఒక స్త్రీ యొక్క వైకల్యం కూడా కొన్ని సందర్భాలలో ఆ నొప్పికి కారణం అయి వుంటుంది, కాని తరచుగా యితర కారణాలు కూడా వుంటాయి. సాధారణంగా, స్త్రీ ఆమె యొక్క భాగస్వామి కలిసి నొప్పి తక్కువగా వుండేలా చేసుకోగలుగుతారు. కొన్ని సందర్భాలలో పురుషాంగం కాని, వ్రేళ్లు, చేతులుగాని ఆమె యోనిలో ప్రవేశించినపుడు ఆమెకు నొప్పి కలగవచ్చు. ఇవి ఏసందర్భాలలో జరుగుతుందంటే

  • ఆమె విశ్రాంతి పొందక ముందే, మరియు ఆమె యోని తడికాకముందే భాగస్వామి తొందరపడి ప్రవేశించినపుడు.
  • ఆమె నామార్గాగాను, తప్ప చేస్తున్నట్లుగానూ భావించినపుడు, లేదా ఆమెకు సెక్సులో పాల్గొనటం ఇష్టం లేనపుడు.
  • ఆమెకు పొత్తికడుపులో గాని యోనిలో గాని యిన్ఫెక్షన్గాని, గడ్డగాని వున్నటైతే,
  • ఆమె జననాంగాలు కోతకు గురై కలిపి కుట్టి వేయబడినట్లయితే,

బిగువు మరియు సంకోచించే కండరాలు గల స్త్రీలు, మరియు వెన్నెముక గాయపడిన స్త్రీలు. తమ యోనిలో ఏది ప్రవేశించినా నొప్పిగానే ఫీలవుతారు. అలా అయినట్లయితే భాగస్వాములిద్దరూ తమకు సంతోషాన్ని కలిగించే యితర పద్ధతులలో సెక్సులో పాల్గొనాలి.

పొడి యోని

యోని ఎక్కువ పొడిగా వున్నట్లయితే సెక్సు బాధాకరం కాగలదు. ఒక ఫ్రీ లైంగికోద్రేకానికి గురైనపుడు ఆమె యోని తడిగా అవుతుంది. ఇది సహజమైన విషయం కాని కొన్ని సందర్భాలలో స్త్రీ యొక్క అంగవైకల్యం ఆమె యోనిని తడి కాకుండా అడ్డుకుంటుంది. ఇది చాలా మంది స్త్రీలలో జరిగే విషయం. కాని ముఖ్యంగా రుమటాయిడ్ అర్థవైటిగ్ (కండరాలు, కీళ్ళకు సంబంధించిన నొప్పలు, మంట) మరియు వెన్నెముక గాయపడిన ఫ్రీలలో యిలా జరుగుతుంది.

సెక్సులో ఎక్కువ సమయం గడిపినటైతే యోని చాలా తడిగా అవుతుంది. అందువలన అది సహజమైనది. అలా కాకుండా వేజలైన్ వంటి జారుడు పదార్థం (లూబ్రికెంట్)ను వుపయోగించవచ్చు. ఇది యోనిని జారుడుగా చేసి చర్మం గాయపడకుండా చేస్తుంది.

ముఖ్యం: ఒక లేటెక్స్ కండోమ్ను సెక్సు సమయంలో వాడినపుడు, ఆయిల్ను, పెట్రోలియమ్ జెల్నూ, మినరల్ ఆయిల్నూ, వెన్నను, లోషన్ను యోనిని తడిచేయటానికి వాడవద్దు - ఎందుకంటే యివి కండోమ్ను చినిగేలా చేస్తాయి. కేవై జెల్లీ వంటి నీటి ఆధారంగా తయారు కాబడిన జారుడు పదార్ధాన్ని (లూబ్రికెంట్ను) వాడండి.

కొన్ని ప్రదేశాలలోని వ్యక్తులు యోని చాలా పొడిగా వుండాలని కోరుకుంటారు. అందుచేత కొందరు స్త్రీలు వనమూలికలనూ లేదా వాటి పొడినో వారి యోనిలో పెట్టుకుంటారు. లేదా సెక్సు సమయానికి ముందు యోనిని కడుక్కుంటారు. కాని, యోని పొడిగా వుండటం వలన సెక్సు సమయంలో చికాకు కలుగుతుంది. అందువలన హెచ్.ఐ.వి.తో కూడిన ఇన్ఫెక్షన్ గాని, ఇతర లైంగిక పరంగా వ్యాప్తి చెందే యిన్ఫెక్షన్ గాని సోకటానికి ఎక్కువ అవకాశం వుంటుంది.

నొప్పితో కూడిన కండరాలు - కీళ్లు

కీళ్ల నొప్పలు (ఆర్థరైటిస్) వంటి వైకల్యం కొన్ని సందర్భాలలో ఒక ఫ్రీకి మామూలు కంటే ఎక్కువగా శ్రమపడి తిరిగినపుడు ఎక్కువ నొప్పిని కలిగిస్తుంది. ఇలా మీకు జరుగుతున్నట్లయితే వేడి వలన ఆ నొప్పిని తగ్గించుకోవచ్చు. ఒక బట్టను వెచ్చని నీళ్లలో తడిపి నొప్పిగా వున్న లేక వాచిన కీళ్లపై వేయండి. లేదా సెక్సుకు ముందు వేడి నీటితో స్నానం చేయండి. ఇందువలన మీ శరీరానికి విశ్రాంతి కలిగి, సెక్సు వలన ఎక్కువ ఆనందాన్ని పొందగలుగుతారు. మీరు మీనొప్పిని తగ్గించుకోవటానికి మందులు వాడుతూంటే, వాటిని పగటిపూట ఒకే సమయంలో వాడండి. అందువలన మీరు సెక్సు కోసం సిద్ధపడేటపుడు ఉత్సాహంగా వుంటారు.

బిగుతు కండరాలు

మెదడుకు సంబంధించిన పక్షవాతం లేక పక్షవాతం వంటి వైకల్యాలు గల స్త్రీ లైంగికపరంగా వద్రేకపడినట్లయితే, ఆమె కండరాలు హటాత్తుగా సంకోచించి, బిగుసుకోవచ్చు. ఈ కండరాల బిగువు ప్రమాదకరమైనదీ, హానికరమైనదీ కాదు. కాని, యిది చాలాకాలం వరకూ అదేవిధంగా కొనసాగినట్లయితే అది ప్రమాదం మీరు సెక్సులో పాల్గొనటం మాననక్కర లేదు. కొన్ని సందర్భాలలో బిగిసిన కండరాలపై మృదువుగా ఒత్తినట్లయితే, ఆ బిగువు తగ్గుతుంది. మరికొన్ని సందర్భాలలో మృదువుగా చాపటం వలన కండరాల బిగువు తగ్గుతుంది. ఆ కండను పట్టి లాగి ఆ బిగువును తగ్గించటానికి ప్రయత్నించ కూడదు. ఈ కండరాల సంకోచాన్ని నివారించటానికి మందులను సెక్సులో పాల్గొనటానికి ముందుగా వేసుకున్నట్లయితే సహాయపడగలవు.

మలమూత్రాల గురించి తీసుకోవలసిన శ్రద్ధ

సెక్సులో పాల్గొనటానికి ముందు మల మూత్ర విసర్జన చేయటం మంచిది. కాథెటర్ ద్వారా మూత్రాన్ని సంచిలోకి పడుతున్నట్లయితే అది ఖాళీగా వుండేలా చూసుకోవాలి. సెక్సు సమయంలో మంమూత్ర విసర్జనల వంటి ప్రమాదాలు జరగకుండా సెక్సుకు ముందుగా ద్రవ పదార్ధాన్ని ఆహారాన్ని తీసుకోకపోవటం మంచిది.

మూత్ర విసర్జన కోసం, ఒకవేళ కాథెటర్ను వుపయోగిస్తున్నట్లయితే సెక్సు సమయంలో అది అడు రాకుండా టేపు వేయటం కాని కట్టి వేయటం గాని చేయాలి. ఆ గొట్టం మడతపడకుండా, ఒంగి పోకుండా చూసుకోవటం అవసరం. కేథెటర్ను 4 గంటలపాటు తీసి వేయొచ్చుకూడా, కానీ ఇన్ఫెక్షన్ను నివారించటం కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సెక్సు సమయంలో కేథెటర్ను అలా వదిలి వేయటమే మంచిది.

ఒక స్త్రీ సెక్సు సమయంలో కేథెటర్ను తొలగించినట్లయితే, ఆ సమయంలో మూత్ర విసర్జన జరిగే అవకాశం వుంది. కేథెటర్ వల్ల మూత్రాశయంలో మూత్రం నిలవ వుండకుండా లీక్ అయిపోతుంది. అదే సమయంలో మల విసర్జన జరిగే అవకాశం కూడా ఎక్కువే. ఒకటవల్ గాని, బట్టగాని, మలమూత్రాలు పట్టే విధంగా దగ్గరగా వుంచుకోవాలి.

ఇది జరగవచ్చు అన్న విషయాన్ని మీ భాగస్వామితో ముందుగా చర్చించటం అవసరం, మంచిది కూడా. ఇది చాలా కష్టమైన అంశం. ప్రతి స్త్రీ దీని గురించి భిన్నాభిప్రాయాలను వ్యక్తపరుస్తారు. దీనిని జీవితంలోని ఒక భాగంగానే భావిస్తారు. మరి కొందరు స్త్రీలు దీనిని హాస్యాస్పదంగా తీసుకొంటారు.

ముఖ్యం: కేథెటర్తో కలిగిన రాపిడికి కండోమ్ చినిగిపోవచ్చు. దీనిని నివారించటానికి నీరు ఆధారంగా తయారు చేయబడిన జెల్లీని కండోమ్ బయటగాని యోని లోపల గాని వుపయోగించాలి.

ముఖ్యం: వెన్నెముక గాయం కలిగిన కొందరు ఫ్రీలలో సెక్సు సమయంలో అధిక రక్తపోటుతో కూడిన తీవ్రమైన తలనొప్పి హటాత్తుగా వస్తుంది. అపుడు వారి చర్మం ఎర్రబడి గుండె వేగంగా కొట్టుకుంటుంది. దీనినే డిస్రిఫ్లెక్సియా అంటారు. ఇది ఆరోగ్యానికి చాలా తీవ్రమైన సమస్య కావచ్చు. దీనిని నివారించటానికి సెక్సులో పాల్గొనేముందు, మలమూత్ర విసర్జన తప్పనిసరిగా చేసేటట్లు చూసుకోవాలి. దీనిని గురించిన మరింత సమాచారం కోసం 117 నుంచి 119 పేజీలు చూడండి.

తీవ్రమైన అలసటగా అనిపించటం

b11.jpgమీ అంగవైకల్యం ఒక్కొక్కసారి రోజులో ఎక్కువ భాగం మీకు అలసటగా వున్న భావనను కలిగిస్తుంది. మీరు అలసిపోయేటట్లు చేసే మందులను మీరు వాడుతూ వుండి వుండవచ్చు. ఇది మీకు సెక్సులో పాల్గొనాలన్న ఆసక్తిని లేకుండా చేస్తుంది. రోజులో మీరు ఎపుడు తక్కువ అలసటగా వుందనుకొంటారో, ఆ సమయంలో సెక్సులో పాల్గొనటానికి ప్రయత్నించండి. అది సాధ్యం కానట్లయితే ఒక ఆరోగ్య కార్యకర్తను కలిసి మీ మందులను రోజులో వేరే సమయంలో వేసుకొనేలా మార్పు చేసుకోవచ్చునేమో అడగాలి.

మీ కండరాలు బలహీనంగా వున్నా మీరు సులువుగా అలసిపోతున్నా మీరు సెక్సులో నెమ్మదిగానూ మృదువుగానూ పాల్గొన్నట్లయితే తక్కువ శక్తి ఖర్చు అవుతుంది. గాఢమైన సెక్సు మీకు తీవ్రమైన అలసటను కలుగజేస్తున్నట్లయితే, మీ భాగస్వామికి ఆనందాన్ని కలుగజేయటానికి వేరే మార్గాలను కనుగొనవచ్చు. మరియు మీ భాగస్వామిని మీ పట్ల సున్నితంగా ప్రవర్తించమని కోరాలి. ఒక ప్రేమతో కూడిన స్పర్శ ఒక స్త్రీ యొక్క బాధను తగ్గించి, ఆమె సుఖంగా నిద్రపోయేలా చేస్తుంది. ఇందువలన ఆమెకూ, ఆమె భాగస్వామికి కూడా ఆనందం కలుగుతుంది.

లైంగిక కోరిక లోపించటం

ఒక ఫ్రీకి సెక్సు పట్ల కోరిక తక్కువగా వుండటం, ఆనందం పొందలేకుండా వుండటానికి, అనేక విషయాలు కారణం కావచ్చు. ఈ విషయాలలో కొన్ని ఆమె వైకల్యం కారణంగా కావచ్చు. కొన్ని మరే యితర కారణాల వల్లనైనా కావచ్చు. ఈ క్రింది కారణాల వలన మీకు కోరిక తక్కువగా వుండవచ్చు.

  • తగినంత ఆహారం తీసుకోకపోవటం, కష్టమైన పనిచేసి అలసి వుండటం, పసిబిడ్డతో బాలెంతగా వుండటం, లేదా మీ వైకల్యం కారణంగా.
  • మీరు యిష్టపడని భాగస్వామిని కలిగి వుండటం, లేదా మీ పట్ల అతడి దురుసు ప్రవర్తన.
  • మీ వైకల్యం మీకు నొప్పిని కలిగించటం, కదలటానికి గాయపరచటం.
  • మీ శరీరం గురించి మీకు చిన్నతనం లేదా మీ వైకల్యం గురించి నామోషీగా భావించుకోవటం.
  • ఎక్కువ సమయం మీరు విచారంగానూ, నిస్పృహతోనూ వుండటం.
  • గతంలో ఎవరైనా మిమ్మల్ని సెక్సుపరంగా బలవంత పెట్టటంగానీ, గాయపరచటం గాని వుండవచ్చు.
  • మీకు గర్భం రావచ్చన్న భయం, లైంగికపరమైన ఇన్ఫెక్షన్ రావచ్చునన్న భయం వలన.

ఒక స్త్రీలో కోరిక తగ్గినపుడు, ఆమె శరీరం నుండి సహజంగా విడుదలయ్యే తడి (చెమ్మ) విడుదల కాదు. అటువంటి సందర్భంలో ఆమె సెక్సులో పాల్గొనేటపుడు బాధ లేకుండా లూబ్రికెంట్ జెల్లీ (జారుడు పదార్థం)ని ఉపయోగించటం అవసరం.

లైంగిక వేధింపు, మానభంగంలకు గురైన తర్వాత సెక్సు

లైంగిక వేధింపులకు గాని మానభంగానికి గాని గురైన ఫ్రీకి తిరిగి తన శరీరం గురించిన మంచి ఆలోచనలు కలగటానికీ, సెక్స్ గురించి ఆలోచించటానికి చాల సమయం పడుతుంది. శారీరక సంబంధమైన (భౌతిక) గాయాలు మానిపోయిన తర్వాత కూడ చాల కాలం వరకు ఆమె మానసికంగా అయిన గాయం, భయంకరమైన జ్ఞాపకాలు పీడకలలా వెంటాడుతూనే వుంటాయి. లైంగిక వేధింపు, మానభంగం తర్వాత సెక్సు జీవితం గురించిన మరింత సమాచారం కోసం 305వ పేజీ చూడండి.

మీకు లైంగికపరమైన కోరిక లోపించినటైతే మీకు ఏ విషయాలైతే లైంగిక ఆనందాన్ని కలుగజేస్తాయో వాటి గురించి ఆలోచించండి. లైంగిక ఆలోచనలు, ఊహలు మిమ్మల్ని మీరు అన్ని కోరికలు గల ఒక ఫ్రీగా భావించుకోవటానికి సహాయపడతాయి. ఆ ఆలోచనలు మీలో ఉద్రేకం పెరిగి, మీ యోనిలో తడి పుట్టి, మీరు సెక్సును అధికంగా అనుభవించేలా చేస్తాయి. కల్పనలు అన్నవి మీరు ఒంటరిగా ఆలోచించుకొనేవిగాని, మీ భాగస్వామితోనే పంచుకోగలిగినవి గాని అయివుంటాయి.

మార్పు కోసం కృషి చేయటం

వికలాంగులైన స్త్రీల యొక్క లైంగికత గురించి, వారి లైంగిక హక్కుల గురించి సమాజంలో పాతుకుపోయి వున్న తప్ప అభిప్రాయాలు, దృక్పథాలు మార్చటానికి చాల కాలం పడుతుంది. కాని కాలక్రమేణా అవి మారతాయి.

ఒక వికలాంగ స్త్రీకి, తన గురించి తాను మంచి భావాలు కలిగి వుండటం ముఖ్యం. తనకు తాను విలువనిచ్చుకొనే స్త్రీ, తన భాగస్వామి నుండి కూడ గౌరవాన్ని ఆశిస్తుంది.

వికలాంగ స్త్రీలు ఏమి చేయగలరు

  • లైంగికత్వం గురించీ, మా స్వంత భావాల గురించి, అభిప్రాయాల గురించి మేము తెలుసుకోవాలి.
  • మిగతా వికలాంగ స్త్రీలతోగాని, మేము విశ్వసించే ఇతర స్త్రీలతో గాని మాట్లాడి లైంగికత్వం గురించి మరింత తెలుసుకోవాలి. మేం ఎదిగే సమయంలో సెక్సు గురించి ఏమీ తెలుసుకోనప్పటికీ, ప్రస్తుతం ఎల్లపుడూ మేము ఎక్కువ తెలుసుకోగలుగుతాం.
  • ఒకరికొకరం, అందరం, సెక్సు గురించి తెలుసుకోవటం, మరియు అనుభవించటం గురించి సలహాలు ఇచ్చుకోవాలి.
  • వికలాంగ స్త్రీలందరూ ఒక బృందంలా ఏర్పడి, పరస్పరం సెక్స్ జీవితం గురించి, కుటుంబ జీవితం గిరించి మద్దతునిచ్చుకోవాలి. విలువనిచ్చుకోవాలి.
  • లైంగిక జ్ఞాన సంబంధమైన విషయాలలో వికలాంగ స్త్రీలను కలుపుకొనేలా వాదించాలి.
  • స్త్రీలందరి లైంగికావసరాలకు మర్యాదనిచ్చేలా చూడాలి.
  • మన లైంగికత్వాన్ని స్త్రీలుగా మనం ఏమిటో చాటి చెప్పగల మార్గాలను అన్వేషించాలి.

b13.jpgమన కమ్యూనిటీలోని వికలాంగ స్త్రీలు, స్త్రీలుగా చట్టరీత్యా అధికారం పొందటానికి అందరూ కలిసి రావాలి. మనస్త్రీత్వం, లైంగికత్వం గురించి వ్యక్తపరచటానికి మనమందరం కలిసి మార్గాలను వెతుకుతున్నాము. మనలో కొందరు తలలో పువ్వులను ధరిస్తారు, ముఖాన బొట్టు పెట్టుకుంటారు. కొన్నిసార్లు మన చేతులను, పాదాలను తికమకగా వుండే డిజైనులతో గోరింటాకుతో అలంకరించుకుంటాము. కాళ్లకు పట్టీలు ఇతర ఆభరణాలను ధరిస్తాము. సాంప్రదాయబద్ధమైన నూనె స్నానాలను చేస్తాము. ఈ విషయాలన్నీ మన లైంగికతను, మన శరీరాల గురించి మంచి ఆలోచనలనూ అన్వేషించటంలో సహాయం చేస్తాయి. మనం ఎలాంటి స్త్రీలుగా వుండాలని అనుకొంటాయో, అలాంటి స్త్రీలుగా మనని చూసుకోవటం నేర్చుకుంటాము. - ఒక వికలాంగ స్త్రీల బృందము తమిళనాడు, భారత దేశం (ఇండియా)

కుటుంబాలు మరియు సంగరక్షకుల పాత్ర

అంగవైకల్యం గల బాలికను మిగిలిన పిల్లలందరిని ఆందరించినట్లే ఆదరించండి. ఇది ఆమెకు తన గురించి తన శరీరం గురించి, తన అనుభూతుల గురించి మంచి అభిప్రాయం ఏర్పరుచుకోవటానికి సహాయపడుతుంది. ఆమె పెరిగి పెద్దదైన తర్వాత ఆమెకు తన భాగస్వామితో ప్రేమపూర్వకమైన, గౌరవంతో కూడిన బంధం కలిగివుండడం సులభమవుతుంది.

  • ఒక బాలికకు, బాలిక దశ నుండి ఫ్రీగా మారే వయసులో సహాయపడాలి. మద్దతునివ్వాలి. అంగవైకల్యం గల ఒక బాలిక, లైంగికత్వం గురించి మంచి సమాచారం తెలుసుకోగలిగినటైతే, ఆమె ఆకారం గురించి వివక్షతను ఎదుర్కొనే సమస్యరాదు. ఆమె తనను తాను ఆకర్షణీయంగా తయారు చేసుకోగలదు. ఆమె రూపం, ఆమె శరీరం మరియు ఆమె లైంగికత్వం గురించి, ఆత్మగౌరవం గురించి బలమైన అభిప్రాయాలు ఏర్పరుచుకోగలదు.
  • అంగవైకల్యం గల బాలికలూ, స్త్రీలూ కూడ లైంగికత్వం గురించిన చర్చలలో, సంబరాలలో పాల్గొనేలా చూడాలి. ప్రీత్వం గురించి వారికి అవగాహనను కలిగించాలి.
  • శక్తి కలిగిన భర్తల గురించి, ప్రేమించే భాగస్వాముల గురించీ, వికలాంగులైన స్త్రీలకు గల నిర్ణయాలకు మద్దతునివ్వాలి.
  • భర్తగాని, అతడి కుటుంబ సభ్యులు గాని, వికలాంగురాలైన ఫ్రీని, అదనంగా ఆమె వైకల్యం గురించి పరిహారం కోరినటైతే, ఆ పెళ్లిని చేయకండి.
  • సమాజంలోని వ్యక్తులు, వికలాంగ స్త్రీలను ముందు స్త్రీలుగా గుర్తించి, వారికి కూడ మిగతా ఫ్రీలలాగే లైంగికావసరాలు, వుంటాయని గుర్తు వుంచుకొని వారిని గౌరవంతో ఆదరించాలి.

అందరు వ్యక్తులు ప్రేమతో కూడిన బంధాలు కావాలని కోరుకోవటం సహజం. అలాగే అంగవైకల్యం గల స్త్రీ కూడ కోరుకుంటుంది. వృత్యాసం ఏం వుండదు.

సమాజం పాత్ర

  • సమాజంలో లైంగికతకు, స్త్రీత్వానికి సంబంధించిన సంబరాలలో వైకల్యం గల ఫ్రీలు పాల్గొనేలా చూడండి.
  • అందరు స్త్రీలు, బాలికల యొక్క లైంగికత్వంకు తగిన గౌరవం లభించడం కోసం గళం విప్పి పోరాడాలి.
  • లైంగిక విద్యా కార్యక్రమాలను చేపట్టి, అందులో వికలాంగులైన స్త్రీలను, బాలికలను పాల్గొనేలా చేయండి. ఉదాహరణకు అంధురాలైన స్త్రీని కండోమ్ను స్పర్శించి అది ఎలా ఉపయోగించాలో తెలుసుకొనేలా చేయాలి. బధిరులు (చెముడు) అయిన స్త్రీలకు మరియు చదవటం, అర్థం చేసుకోవటం కష్టమైన స్త్రీలకు, బొమ్మలు, నమూనాలను ఉపయోగించి వారికి నేర్చుకోవటం సులభమయ్యేలా చూడాలి.
  • నేర్చుకోవటం, అర్థం చేసుకోవటంలో సమస్యగల వికలాంగులను ప్రత్యేకంగా గమనించాలి. వారు తరచు లైంగిక వేధింపులకు గురయ్యే అవకాశం వుంటుంది. స్త్రీల రక్షణ సమాజం మొత్తం యొక్క బాధ్యత. వేధింపులకు గురైన స్త్రీలకు సహాయపడటం అన్న అంశం గురించి మరింత ఎక్కువ సమాచారం కోసం 14వ అధ్యాయం చూడండి.

ఆరోగ్య కార్యకర్త కోసం...

చాల మంది వికలాంగులైన స్త్రీలలో లైంగికత్వం గురించి ఎన్నో సందేహాలు కలుగుతాయి. ఆ సందేహాలను తీర్చుకోవాలన్న కుతూహలంతో ఎన్నో ప్రశ్నలుంటాయి వారి దగ్గర. కాని వారా ప్రశ్నలు అడగటానికి తరచు సిగ్గుపడతారు. భయపడతారు కూడ. ఒక ఆరోగ్య కార్యకర్తగా వారికి, వికలాంగ స్త్రీలు కూడ లైంగికతను ఏవిధంగా పెంపొందించుకోవచ్చో చెప్పాలి. అర్థమయ్యేలా బోధించాలి. వారి సందేహాలను నిష్పత్తి చేయాలి. వారి ఆశలకు ఆధారం కలుగజెయ్యాలి. వివరంగా వారికి తెలిసేలా చెప్పి.

నీవు వికలాంగ స్త్రీలతో కలిసి మెలసి పని చేసి, వికలాంగ స్త్రీలకు, పిల్లలకు వికాసాన్ని కలిగించే సందర్భాలను, కార్యక్రమాలను రూపొందించాలి. ఒక కమ్యూనిటీలోని వికలాంగ స్త్రీలందరూ వార్షిక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని, తమకు వైద్యం చేసే డాక్టరును, ఆరోగ్య కార్యకర్తను కూడ ఆహ్వానిస్తారు. స్త్రీలంతా వారిలో వారు తమ సమస్యలగురించి చర్చించుకొని, డాక్టర్ను, ఆరోగ్య కార్యకర్తను ప్రశ్నించి తమ సందేహాలను తీర్చుకుంటారు.

నీవు వికలాంగులైన స్త్రీలకు, ముఖ్యంగా యువతులకు, బాలికలకు వారి శరీరంలో చోటుచేసుకొనే మార్పుల గురించి వివరించాలి. అందుకోసం వారడిగే ప్రశ్నలకు, లైంగికత్వం – సంబంధాలు గురించి వారికున్న సందేహాలకు, సమాధానాలివ్వాలి. సమాజంలో వికలాంగ స్త్రీల పట్ల పాతుకుపోయి వున్న మూఢ నమ్మకాలను, తప్పడు అభిప్రాయాలను, ముఖ్యంగా వారికి సమాజంలో మిగతా స్త్రీలలా అన్ని హక్కులతో, సౌకర్యాలతో జీవించే అవకాశాన్ని అడ్డుకుంటున్న వాటిని మార్చాలి. ఆ మార్పు తేవటానికి సమయం పట్టినా సరే కృషి చేయాలి. చేస్తూనే వుండాలి. వికలాంగ స్త్రీలు, బాలికలు తమ శరీరం గురించి, లైంగికత గురించి మంచి భావాలు కలిగి వుండేందుకు కృషితో సహాయపడాలి.

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate