অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వైకల్యానికి చేయూత – స్నేహపూర్వక ఆరోగ్య సంరక్షణ

i1వికలాంగ స్త్రీలకు ఆరోగ్యం కలిగి వుండటానికి, మంచి సంరక్షణ పొందటానికి హక్కు ఉంది. కాని కొన్ని మాత్రమే ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులు, క్లినిక్ లు వికలాంగుల వినియోగానికి అనువుగా నిర్మించబడి ఉంటాయి. అవి చేరే విధానం లేనంత దూరం గాను, చాల ఖర్చు అయ్యేవి గాను వుంటాయి. అందువలన ఆరోగ్య కార్యకర్తలతో అత్యవసరానికి వెంటనే సంప్రదింపు వీలు కాదు. వెళ్ళి అంత దూరం మందులకూ, వైద్యానికి డబ్బు చెల్లించాలంటే కూడ కష్టమే వారికి.

ఈ అధ్యాయంలో డెల్ఫిన్ అనే మహిళ తన ఆరోగ్య సమస్య కమ్యూనిటీ లోని మిగతా స్త్రీలతో కలిసి పని చేసి ఎలా పరిష్కరించుకుందో చూద్దాం. ఆమె సమస్యకు సరిపడే పరిష్కారం, డెల్ఫిన్ స్థితికి అందుబాటులోనిది కాదని, డెల్ఫిన్ స్నేహితులు తెలుసుకోవటం జరిగింది. ఒక వైకల్యం గల స్త్రీ ఆరోగ్య సమస్య అన్నది, అందరి స్త్రీల ఆరోగ్య సమస్యల్లా కేవలం వ్యక్తికి సంబంధించి వుండదు. అది కమ్యూనిటీ మొత్తం యొక్క సమస్యగా పరిగణింప బడుతుంది.

డెల్ఫిన్, ఆమె స్నేహితురాళ్ళు మంచి ఆరోగ్య సంరక్షణ అవకాశాల కోసం, వారి సమాజంలో వున్న సమస్యలకు మూల కారణాలను వెతకటం కోసం, వాటిలో మార్పు తేవటం కోసం ఎంతో కృషి చేశారు.

డెల్ఫిన్ కథ

i2డెల్ఫిన్ కు మెదడుకు సంబంధించిన పక్షవాతం (సెరెబ్రల్ పాల్సీ) వచ్చింది. ఆమె చక్రాల కుర్చీ సహాయంతో తిరుగుతూ వుంటుంది. ఆమెకు ఒక అబ్బాయితో స్నేహం ఏర్పడింది. అతడికి మాత్రం ఆ అంగవికలురాలైన స్త్రీతో లైంగిక సంబంధం ఏర్పరుచుకున్న సంగతి ఎవరికీ తెలియటం ఇష్టం లేదు. అతడు అర్ధరాత్రి వచ్చి ఆమె దగ్గరకు, తెల్లవారక ముందే వెళ్ళిపోతూవుండేవాడు.

ఒక రోజు డెల్ఫిన్ యోనినుండి వేరే రకంగా స్రావం అవటం గమనించి, ఏవో అందుబాటుగా తెలిసిన వైద్యాలూ, ఉపాయాలూ ప్రయత్నించినా లాభం లేకపోయింది. అది తీవ్రం అయి పొత్తి కడుపులో నొప్పి ప్రారంభమైంది. చివరకు డెల్ఫిన్ ఒక క్లినిక్ కు వెళ్ళింది. ఆమెకు ఒక అబ్బాయితో లైంగిక సంబంధం వున్నదని ఆమె చెప్పినా వారికి నమ్మబుద్ధి కాలేదు. అతడి పేరు వారికి చెప్పినటైతే, అతడిక తనను చూడటానికి రాదేమో నన్న భయంతో చెప్ప లేదు  డెల్ఫిన్. ఆమె వైకల్యం వల్లే ఆ సమస్య ఏర్పడినట్లు వారు గట్టిగా నమ్మారు. ఆమె కాళ్ళూ, చేతులు బాగా దాచేందుకు ప్రయత్నించారు వారు. ఆమె కండరాలు సాగిబిగుతుగా నొప్పి ఎక్కువైంది డెల్ఫిన్ కు. కండరాలు విశ్రాంతిగా అయి నొప్పి తగ్గటానికి మందులిచ్చారు. కాని అవి పనిచేయక, ఆమె కడుపులో నొప్పి ఎక్కవై పోవటమే కాకుండా, ఎక్కువగా జ్వరం వచ్చి చెమటలు వచ్చాయి. మూత్ర విసర్జన చేసేటపుడు నొప్పి వచ్చేది.

డెల్ఫిన్ కు ఒక స్నేహితురాలు ఒకసారి చెప్పింది. వికలాంగులై స్త్రీలు కొందరు ఒక బృందంగా ఏర్పడినట్లు, అది గుర్తుకు వచ్చి ఆమె దగ్గరకు వెళ్ళింది తన సమస్యను వివరించేటందుకు, ఆ బృందం స్త్రీలు ఈ మధ్యనే మనకు డాక్టర్ లేనిచోట అన్న పుస్తకం చదవటం ద్వారా, సెక్స్ వల్ల వ్యాధులు ఒకరి నుండి ఒకరికి ఎలా వ్యాపిస్తాయో తెలుసుకున్నారు. ఆ బృందంలోని ఇద్దరు స్త్రీలు డెల్ఫిన్ కు తీసుకొని తిరిగి ఆ క్లినిక్ కు వెళ్ళారు. వారిద్దరూ కలిసి డెల్ఫిన్ కు సెక్స్ వలననే ఆ వ్యాధి వచ్చి వుంటుందని చెప్పి, డెల్ఫిన్ కు సెక్స్ సంబంధం వుందని చెప్పి ఒప్పించగలిగారు. అపుడు డాక్టర్ అందుకు అవసరమైన పరీక్షలు చేసి ఆమెకు సెక్స్వల్ల వ్యాప్తి చెందే తీవ్రమైన వ్యాధి ఆమె కడుపులో వుందని కనుగొన్నాడు. అది గనోరియా, క్లెమైడియా సంబంధమైనది. అపుడు అందుకు తగిన మందులిచ్చి ఆమెకు వ్యాధి తగ్గేలా చేసి, ఆమె స్నేహితుడు కూడ ఆ మందులు వాడాలని చెప్పాడు. అతడు కండోమ్ వాడటం అవసరమనీ, మరొక సారి వ్యాధి రాకుండా అది నివారిస్తుందని కూడ చెప్పాడు.

సమస్యలకు మూల కారణాలు

i3డెల్ఫిన్ మందులు వాడిన తర్వాత ఆరోగ్యం కాస్త కుదుట పడటంతో "హమ్మయ్య” సమస్య తీరిపోయింది అనుకుంది. కాని ఆ పుస్తకం చదివిన తర్వాత అది నిజం కాదని అర్థమైంది ఆమెకు. మళ్ళీ తన స్నేహితుడు తన దగ్గరకు రాగానే మళ్ళీ ఆ వ్యాధి వచ్చే అవకాశం వుంది, అతడు మందులు ఉపయోగించని, కండోమ్లువాడని పక్షంలో, డెల్ఫిన్ తన సమస్యను ఇతర వికలాంగ స్త్రీలతో చర్చించింది. అపుడు వారు "కాని ఎందుకు." అని ఒక ఆట ఆడాలని అనుకున్నారు. డెల్ఫిన్ సమస్యకు కారణమైన పరిస్థితులను అందరూ గుర్తించి, జాగ్రత్త పడగలరని.

ఆ స్త్రీలంతా చెప్పిన కారణాల జాబితాను, ఒక క్రమంలో పట్టికగా వారు తయారు చేశారు.

ఈ విధంగా అంటే క్రింది విధంగా వ్రాయటం వలన, ఆరోగ్య సమస్యలను కలిగించే వివిధ రకాల పరిస్థితులను, ఆ సమస్యలకు పరిష్కారాలను ఎక్కడ ఎలా సాధించుకోవచ్చో సులభంగా  తెలుసుకోవచ్చు.

శారీరక కారణాలు

 • గనేరియా క్రిములు
 • క్లెమైడియా క్రిములు
 • సెక్ట్ ద్వారా వాడైపించే వ్యాధులు పురుషులకన్న స్త్రీలలో ఎక్కువ సోకే అవకాశం వుంటుంది. అందునా యోనిపై గాని, యోని శీర్షం పైగాని గాయాలు, పుళ్ళూ వున్నట్టైతే ఇంకా ఎక్కువ అవకాశం వుంటుంది.
 • పోష్టికాహార లోపం ఎక్కువ కాన్పుల వల్ల రోగనిరోదక శక్తి తగ్గిపోవటం జరుగుతుంది.

వైకల్యం గురించిన దురభిప్రాయాలు

 • వికలాంగ స్త్రీలను మామూలు స్త్రీ ల తరహ చూడరు. గుర్తించరు.
 • వికలాంగ స్త్రీలు సెక్లో పాల్గొనలేరు.
 • వికలాంగాస్త్రీలు ఎదుర్కొనే ఆరోగ్య నమస్యలకు వారి వైకల్యమే కారణం అని డాక్టర్ల నమ్మకం.

సాధారణ సామాజిక సమస్యలు

 • పురుషులు తరచు ఇతరులతో కూడ సెక్స్లో పాల్గొంటారు.
 • వారు కండోమ్లు వాడటానికి ఇష్టపడరు. అవి ఆ ఆనందాల్లి తగ్గిస్తాయని.
 • లైంగిక సంపర్కం వల్ల వ్యాప్తి చెందే వ్యాధుల గురించి అవగాహన లోపించటం,
 • స్త్రీలు ఉపయోగించే కండోమ్లు ఖరీదైనవి, దొరకవు కూడ సులభంగా.
 • పురుషులు, వికలాంగ భాగస్వాముల గురించి నామోషిగా భావిస్తారు.

ఆరోగ్య సంరక్షణ మానవులందరి హక్కు

i4మెరుగైన ఆరోగ్య సంరక్షణ వల్ల వైకల్యాన్ని మరింత దిగజార్చే ఆరోగ్య సమస్యలు కలుగకుండా వుంటాయి. అంతే కాకుండా మంచి ఆరోగ్య సంరక్షణ వల్ల, వైకల్యం కారణంగా ఏర్పడే ఆరోగ్య సమస్యలు కూడ దూరం అవుతాయి. ఒక సామాన్యమైన ఆరోగ్య సమస్యకు సకాలంలో వైద్య సహాయం అందటం వల్ల ఎంతో ప్రయోజనం వుంటుంది. అదే నిర్లక్ష్యం చేయటం వల్ల, ఉదాహరణకు ఒకే ప్రక్కకు పడుకోవలసి రావటం వల్ల, ఒకే వైపుకు కూర్చోవలసి వుండటం వల్ల ఏర్పడే పుళ్ళను నిర్లక్ష్యం చేయటం వల్ల అవే ప్రాణాంతకం కాగలవు.

సాంఘిక పరమైన అంతస్తుల, అంతరాల వివక్షత లేకుండా వైకల్యంగల స్త్రీ అందరికీ ఆరోగ్య సంరక్షణ అందుబాటుగా వుండేలా చేయాలి. ఉచితంగా కాని, అతి తక్కువ చెల్లింపుతో గాని వైద్య సేవలు అందేలా, ఇన్సూరెన్స్ ద్వారా గాని, కేష్ రూపంగా కాని ఆరోగ్య సంరక్షణకు చెల్లించేలా, ప్రజా రవాణా సౌకర్యాలను సులభంగా వినియోగించుకొనే రీతిగా సమకూర్చటం - ఇవన్నీ ఆరోగ్య సంరక్షణ క్రిందే పరిగణించాలి.

ఆఱోగ్యము – దారిద్ర్యం

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరమైన, వాణిజ్య పరమైన విధానాలు, వైద్య సంరక్షణకు తక్కువ నిధులు, ప్రజలలో సాంఘిక పరమైన అసమానతలు వంటి తీరుతో వుండటం వల్ల దారిద్ర్యం అధికమైపోయింది. ఆ అసమానతలు స్త్రీలకు వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య రక్షణ పొందటానికి అడ్డంకులుగా నిలుస్తున్నాయి. ఖరీదైన మందులు, రవాణా సౌకర్య ఇబ్బందులు వంటి ఇతర ఆర్థిక పరమైన అడ్డంకులే కాకుండా ఆరోగ్య సంరక్షణకు, వినియోగించుకున్నందుకు ఫీజు కట్టమని మరోభారం వేయబడింది. దీనితో ఆరోగ్య రక్షణ అన్నది అందరి వరంగా మారిపోయింది పేద స్త్రీలకు.

వికలాంగ స్త్రీలకు ఆరోగ్య సంరక్షణ అన్నది పొందటంచాల కష్ట తరంగా మారిపోయింది. ఆఫ్రికా దేశాలలో చాలవరకు, 100 మంది వికలాంగులలో ఏ ఒక్కరికో అవసరమైన వైద్యసేవలను పొందే అవకాశం కలుగుతుంది. అవసరమైన సౌకర్యాలు, సేవలు లోపించటమే కాకుండా, ఖర్చు, దూరం, అసమానతలు, హానికరమైన అభిప్రాయాలు మరికొన్ని ఇబ్బందులు వారికి.

ఒకవేళ కొందరు స్త్రీల దగ్గర ఆ ఖర్చు భరించ గల సొమ్ము వున్నాకాని, అందుబాటుగా వున్న వైద్య సేవలు సరిపడక వుండటం అన్నది చాల అరుదైన విషయం. ముఖ్యంగా వికలాంగ స్త్రీల ఆరోగ్య అవసరాలకు, వారి ప్రత్యుత్పత్తికి సంబంధించిన ఆరోగ్య అవసరాలకు సౌకర్యాలు పొందటం అన్నది కష్టమే.

నెజీరియాలో అడ్డంకులను కూలదోసిన సంగతి

i5నైజీరియాలో చమురుతో ధనవంతమైన నైగర్ డెల్టా ప్రాంతానికి చెందిన ఎకేట్ జూడిత్ ఒమో పోలియోతో జీవిస్తున్న ఒక మహిళ. ఆరోగ్య సంబంధమైన కార్యక్రమాలైనా సరే వికలాంగ స్త్రీలను, బాలికలను మొత్తం చేర్చుకొనే విధంగానే జరగాలని పటు పట్టింది ఆమే.  కార్యక్రమాలను రూపొందించటం లోను, సేవలలోను అన్ని దశల యందు వారి ప్రమేయం వుండి తీరాలంది జూడిత్ ఆమె మాటలలో చెప్పాలంటే కాలికి వేసుకున్న చెప్ప ఎక్కడ నొక్కుతుందో, గాయ పరుస్తుందో దాన్ని ధరించిన వ్యక్తికే బాగ తెలుస్తుంది. అలాగే వికలాంగులకే తెలుస్తుంది తోటి వికలాంగులు ఎదుర్కొనే సమస్యల కష్టం గురించి...?

2000వ సంవత్సరంలో ఎకేట్ ఒక సంస్థను (FACICP)ని స్థాపించింది. అది వైకల్యపు సవాలును ఎదుర్కొంటున్న వికలాంగ స్త్రీల యొక్క బాలికల యొక్క అవసరాలను, హక్కులను కాపాడటం కోసం అన్ని ఆరోగ్య కార్యక్రమాలలోను వారిని గౌరవంగా చూసేలా చేయటానికి ఉద్దేశింపబడిన ప్రభుత్వేతర సంస్థ. ఆమె ఆ సంస్థను, అసమానతలు, అడ్డంకులు లేని సంస్థగా ఉదహరించింది. "వికలాంగ స్త్రీలకు ప్రత్యుత్పత్తి ఆరోగ్య సమాచారం, హెచ్.ఐ.వి ఎయిడ్స్ తో సహా అందించే అవకాశం కల్పించటం కూడ మా సంస్థ లక్ష్యం. ప్రస్తుతం ప్రత్యుత్పత్తికి సంబంధించిన సామాన్య ఆరోగ్య సమాచారాన్ని బ్రెయిలీ లోనికి అనువదించటం మొదలు పెట్టాం. దీని వల్ల ఎందరో అంధులకు ప్రయోజనం కలుగుతుంది. అంతే కాకుండా, గర్భిణీ, తల్లిగా జాగ్రత్తలూ మరియు వైకల్యం - వీటికి సంబంధించి లైంగికత్వం గురించిన విద్య నేర్పించేందుకు ప్రతి నెలలోను సమావేశాలను ఏర్పాటు చేస్తున్నాం."

స్త్రీల యొక్క ఆరోగ్య విషయాల గురించిన ఆరోగ్య సంబంధమైన విద్యను విస్తృతంగా నేర్పించేటందుకు సొసైటీ ఫర్ ఫామిలీ హెల్త్ (SFH) అనే సంస్థతో భాగస్వామిగా పనిచేస్తున్నాం కూడ. వికలాంగ స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య అవసరరాలను గురించి అవగాహన పెంచేందుకు నిర్వహించే అన్ని శిక్షణా కార్యక్రమాలకు, వర్క్ షాప్ లకు మమ్మల్ని ఆహ్వానించేందుకు ఆ ఒప్పకోవటం జరిగింది." అని చెప్పింది ఆమె.

వారు కలిసి నిర్వహించే కార్యక్రమాలన్నీ చక్రాల కుర్చీలు ఉపయోగించే వారికి వీలుగా వుండే ప్రదేశంలో ఏర్పాటు చేయటమే కాకుండా,సౌంజ్ఞలు, సంకేతాలతో చెప్పే భాష వచ్చిన వారిని వినికిడి శక్తి లేని వారి కోసం ఏర్పాటు చేయటం జరిగింది. ఎస్.ఎఫ్.హెచ్ శిక్షణ పొందిన వికలాంగ స్త్రీలు తమ కమ్యూనిటీలో కుటుంబాలకు ఆరోగ్య అవగాహనను కల్పించే శిక్షకులుగా పని చేయగలుగుతారు.

ఎకలేట్, ఆమె తోటి వారు ప్రభుత్వాలను, అభివృద్ధి చెందిన సంస్థలను, పౌర సంఘాలను, వైకల్యపు అద్దంలోంచి చూసి అందుకు అనువుగా వారికి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టమని సవాలు చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు నిధులు సమకూర్చే పథకాలలో వికలాంగులకు శిక్షణ, సాంకేతిక సహకారం, సంప్రదింపులు, పథకాలకు నిధులు, కావలిసిన సామగ్రి సమకూర్చటం వంటి కార్యక్రమాలను చేర్చటం జరిగింది. అందువల్ల వికలాంగుల ఆరోగ్య హక్కులు, అవసరాలు మరుగున పడిపోలేదనీ, వెలుగులోనే వున్నాయని రుజువవుతుంది. ఎక్కడున్నా వికలాంగులంతా, ఒకే హక్కులను, సౌకర్యాలను కలిగి వుండాలని, మిగతా అన్ని కమ్యూనిటీలలో వారిలాగే వీరు కూడ సంతోషంగా అన్ని సౌకర్యాలను అనుభవించాలనీ ఎకేట్ హెచ్చరికగా గుర్తు చేసింది.

ఆరోగ్య సేవల వినియోగం సులభతరం చేయటం

వైకల్యంగల స్త్రీలు, ఆరోగ్య కార్యకర్తలు కలిస్తే వికలాంగ స్త్రీలకు మెరుగైన రీతిలో ఆరోగ్య సేవలను అందేలా చేయగలరు. వికలాంగ స్త్రీలు సులభంగా ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళి అక్కడ పరికరాలను, వికలాంగ సహాయక సాధనాలను వినియోగించటానికి, వైకల్యాలను గురించిన సమాచారం మరింత తెలుసుకోవటానికి, ఆరోగ్య కార్యకర్తలకు వికలాంగ స్త్రీల పట్ల గల అభిప్రాయాలను మంచిగా మార్చటానికి, మార్గాలను వారు అన్వేషించగలుగుతారు. ఎందుకంటే, వారు నిత్యజీవితంలో వైకల్యంవల్ల ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి బాగా తెలుసు. అందుకు పరిష్కార మార్గాలు వారికి చాలవరకు తెలిసే వుంటాయి. వారు సూచించే, ఆశించే ఆ మార్పులు చాలవరకు కూడ అంత ఖర్చుతో కూడుకున్నవి అయివుండవు కూడ.

యువకులు, చిన్నవారు తిరిగినంత సులువుగా తిరగలేని వృద్దులకు, ఏ ప్రమాదాల కారణంగానైనా తాత్కాలిక అంగవైకల్యం కలిగిన వారికి కూడ ఈ మార్పులు ఎంతో సహాయకరంగా వుంటాయి.

వైకల్యగ్రస్తులకు, ఆరోగ్య సేవలను స్నేహపూర్వకంగా అందించటంకోసం కొన్ని సలహాలు:

 • ఆరోగ్య కేంద్రాలకు దూరంగా వున్నవారికి, వారానికి ఒకసారో, నెలకి ఒకసారో, వారి ఇళ్ళకు వెళ్ళి పరామర్శించే కార్యక్రమం చేపట్టాలి.
 • వికలాంగ స్త్రీలకు ఉచితంగా ఆరోగ్య సేవలను అందించాలి.
 • వినియోగానికి సులభంగా వుండే పరకరాలను తయారు చేయాలి.
 • వారికి ఆరోగ్య కేంద్రానికి వెళ్ళేటందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజారవాణా సౌకర్యాన్ని గాని, ప్రభుత్వేతర రవాణా సౌకర్యాన్ని గాని కల్పించాలి. నడవటం కష్టమైన వారికి, చక్రాల కుర్చీలను, క్రెచెస్ను వినియోగించే వారికి అనువుగా ఆ సౌకర్యం ఏర్పాటు చెయ్యాలి.

ఆరోగ్య సంరక్షణకు అడ్డంకులు:

 • i6చాల వరకు ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులు కూడ, చక్రాల కుర్చీగాని, క్రెచెస్ గానీ ఉపయోగించే స్త్రీలకు లోనికి ప్రవేశించ గలిగేందుకు అనువుగా నిర్మాణం వుండదు. చాల సందర్భాలలో ఆరోగ్య కేంద్రాలు చాల దూరంగా వుండి, వారికి అక్కడకు చేరే మార్గమే వుండదు.
 • వారికి అవసరమైన వస్తువులు, పరికరాలు అందుబాటుగా వుండవు. తక్కువ ఎత్తుగల మంచాలు వగైరాలు.
 • ఆరోగ్య కేంద్రం పని చేసే సమయం వారికి అనువైనది కాకపోవచ్చు.
 • చాల మంది స్త్రీలు, మగ డాక్టర్ల దగ్గరకు వైద్య సహాయం కోసం వెళ్ళటానికి ఇబ్బందిగా భావిస్తున్నా సరే, లేడీ (ఆడ) డాక్టర్ల సంఖ్య తక్కువగానే వుంటుంది.
 • తరచు ఆరోగ్య కార్యకర్తలకు వినికిడి శక్తిలేని వారితో ఎలా సంభాషించాలో, ప్రవర్తించాలో అవగాహన వుండదు. అంతే కాకుండా, కంటిచూపు లేని వారికి (అంధులకు), ఆరోగ్య సంబంధమైన సమాచారం అందించే సాధనాలు కూడ తరచు అందుబాటులో వుండదు.
 • వైకల్యం పరంగా మంచి శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తలు, డాక్టర్లు, నర్సులు కూడ అందుబాటుగా ఆరోగ్య కేంద్రాలలో లేక పోవచ్చు. వారికి వైకల్యం గురించిన అవగాహన కూడ అంతగా లేకపోవచ్చు. అంగవైకల్యం గురించి వారి దృష్టిలో ఏర్పడివున్న తప్పు అభిప్రాయాలనే నమ్ముతారు గాని మీ మాట వినిపించుకోరు, లెక్కచేయక పోవచ్చుకూడ.
 • ఆరోగ్య సేవలను ఖరీదుగా మార్చే మధ్యవర్తులు తీసుకొనే లంచాలు కూడ వుంటాయి. ఆరోగ్య కార్యకర్తకు, మీకు మధ్య చెయ్యిచాపినవారికి లంచం ఇస్తేనే వైద్యం జరగవచ్చు.

క్లినిక్ లను, ఆసుపత్రులను వినియోగించుకోవటాన్ని సులభతరం చేసేందుకు సూచనలు: ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులు ఈ విధంగా వుండి తీరాలి:

 • సమీప దూరంలో వుండి, ప్రయాణ సౌకర్యం అందుబాటుగా వుండాలి చేరేటందుకు.
 • నడక కష్టమైన వారికి, చక్రాల కుర్చీలు, క్రెచెస్ వినియోగించే వారికి వినియోగానికి అనువుగా వుండాలి.
 • మెట్లకు బదులుగా రాంప్ట్ (వాలుగావుండే చష్ణా), లిఫ్ట్ లు కలిగి వుండాలి.
 • వికలాంగ మహిళల వినియోగానికి అనువైన మరుగుదొడ్లు వుండాలి.
 • అంతేకాకుండా అంధులకు, బధిరుల (వినికిడి లోపం కలవారు) కు అర్థమయ్యే విధంగా సమాచారం అందించగల సమర్థ వంతమైన శిక్షణ పొందిన సిబ్బందిని కలిగి వుండటం చాల అవసరం. ఇంకా మెదడుకు సంబంధించిన పక్షవాతం కలవారికీ, అర్థం చేసుకోలేని లోపం గలవారికీ కూడ సహాయపడగల, వారికి అర్థమయ్యేలా సమాచారాన్ని వ్యక్త పరచగలిగి కూడ వుండాలి స,బ్బంది.

క్లీనిక్ లు, ఆసుపత్రులు చేయగల కార్యక్రమాలు:

 • ప్రతి వారికి వైకల్యం గురించి అవగాహనను కలిగించవచ్చు.
 • అంగ వైకల్యం గల స్త్రీలను ఆరోగ్య కార్యకర్తలుగా, సిబ్బందిలో సభ్యులుగా, క్లినిక్లలోను ఆసుపత్రులలోను చేర్చుకోవాలి.
 • భవనాల చుట్టూ, అవసరమైన చోట తాడును కట్టటంగాని, కర్రలతో రైలింగ్ ను గాని ఏర్పాటు చేయటం వల్ల దాని సహాయంతో, కంటిచూపు అంతగా లేనివారు, అంధులు నడవటానికి, మార్గం వెతుక్కోవటానికి అనువుగా వుంటుంది. క్షేమంగా లోనికి ప్రవేశించటానికి సులువుగా కూడ వుంటుంది.
 • వికలాంగస్త్రీలు మరియు వారి ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి.
 • నెలకు ఒకసారి గాని, క్రమబద్ధంగా కాని, వికలాంగ స్త్రీల సమస్యలను తెలుసుకొనే, పరిష్కరాలను సూచించే అవగాహనా సదస్సులను నిర్వహించాలి.
 • వికలాంగ స్త్రీలు క్లినిక్ కు గాని, ఆసుపత్రికి గాని వెళ్ళిన రోజునే, వారికి వీలైనన్ని విభాగాలలో అవసరాన్ని బట్టి వైద్యులతో సంప్రదించేలా ప్రవేశం కల్పించాలి. అందువల్ల వారికి ఎక్కువ సార్లు కష్టపడి తిరిగే బాధ తగ్గుతుంది. ఆరోగ్య కార్యకర్తల ద్వారా కొన్ని ఆరోగ్య కేంద్రాలు, గ్రామిణ ప్రాంతాలలో ఈ సౌకర్యం కల్పిస్తుంది.
 • ఆరోగ్య సేవలను అర్థం చేసుకోవటం మరియు ఆరోగ్య సేవలను సులభంగా పొందటం ఎలాగ అన్న విషయాలపై సమాచారం తయారు చేసి అందించాలి వారికి,
 • ఆరోగ్య సంబంధమైన సమాచారాన్ని వివిధ భాషలలో అందించాలి.
 • అంధులైన స్త్రీలకు, బ్రెయిలీలో గాని, ఆడియో క్యాసెట్ల ద్వారా గాని ఆరోగ్య సమాచారాన్ని అందించాలి.
 • నేర్చుకోవటంలో, అర్థంచేసుకొనే విషయంలో లోపంగల ఫ్రీలకు, సరళమైన భాషలో, వివరంగా తెలిసేలా మరియు ఏమి చెప్తున్నారో తెలిపే బొమ్మలను చూపటం ద్వారా సహాయపడాలి.
 • వివరంగా మాట్లాడటం చేతకాని లోపం గల స్త్రీలకు సహాయ పడి, సంప్రదించగల విధంగా ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణను ఇవ్వాలి.
 • ఆరోగ్య సిబ్బందికి, బధిరులైన (వినికిడి లోపం గలవారు) స్త్రీలకు ఆరోగ్య సమాచారం అందించేందుకు అనువుగా సాంజ్ఞల ద్వారా తెలియజేసే భాషలో శిక్షణనివ్వాలి.

ఆరోగ్య కేంద్రంలో ఒక్క ఆరోగ్య కార్యకర్తకు సౌంజ్ఞ భాష తెలిసి వున్నా ఆ ప్రాంతంలో వుండే బధిరులైన వారందరికీ ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఆ భాషను నేర్పించే శిక్షణ కేంద్రం దగ్గరగా లేనటైతే, జాతీయ బధిర సంస్థనుంచిగాని, దగ్గరగా నివసించే ఆ భాషవచ్చిన బధిర వ్యక్తినుంచి కాని క్లినిక్ సిబ్బందిలో వారు నేర్చుకోవచ్చు. అంతేకాకుండా వారు ఒక స్థానిక సౌంజ్ఞ భాష నిఘంటవు దొరికినటైతే దాని ద్వారా కూడ నేర్చుకొనవచ్చు. ఆ భాష ద్వారానే కాకున్నా మామూలు అంటే సామాన్యమైన చేతుల కదలికలతో కూడ అర్థం అయ్యేలా చెయ్యొచ్చు. అసలు, బధిరులైన స్త్రీలే తమకు ఏ విధంగా తెలియజేస్తే ఉత్తమంగా అర్థమవుతుందో ఆరోగ్య కార్యకర్తలకు సూచించగలరు. ఆరోగ్య సంబంధమైన సంజ్ఞ భాష సూచనల కోసం 369 నుంచి 371 పేజీలు చూడండి.

కమ్యూనిటీ ఆరోగ్య కార్యకర్తలే సంరక్షణ చేయవచ్చు:

చాలా దేశాలలో వికలాంగ స్త్రీల ఆరోగ్య సంరక్షణ అన్నది చాల ప్రత్యేకమైనదిగా భావిస్తారు. అది కేవలం డాక్టర్లే నిర్వహిస్తారు అక్కడ. కాని అందులో చాల సేవలు ఇంకా తక్కువ ఖర్చుతో వారికి, శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తలు, ఉపాధ్యాయులు, పునరావాస కార్యకర్తలు మొదలైన వారి ద్వారా అందించవచ్చు.

వికలాంగ పిల్లలకు సేవలు అందించటం

నేపాల్ లో కావ్రే వద్ద గల ఆసుపత్రి - పునరావాస కేంద్రం వికలాంగ పిల్లల ఆరోగ్య సంరక్షణ కోసం నేపాల్ అంతటా తమ సేవలను విస్తరించింది. ఈ సంస్థకు చెందిన శిక్షణ పొందిన కార్యకర్తలు ఒత్తిడి వల్ల ఏర్పడే పండ్లకు, వ్యాధిగ్రస్తమైన కండరాలను వ్యాయామం మరియు ఫిజికల్ థెరపీతో ఆరోగ్యవంతం చేయటం మొదలైనవి చేస్తారు. అంతే కాకుండా వికలాంగ పిల్లలు సులభంగా తిరిగేటందుకు వైకల్య సహాయ సాధనాలను అమరుస్తారు కూడ.

ఆసుపత్రి మరియు ఆరోగ్య కేంద్ర భవనాలను సులభంగా వినియోగించుకోవటానికి తక్కువ ఖర్చుతో అనువైన సలహాలు

సాధారణంగా భవనాలలో వుండే ఎత్తైన మెట్లు, లిఫ్ట్ లు లేకపోవటం, ఇరుకైన నడిచే దారులు, చిన్న మరుగుదొడ్లు, జారిపోయేలా నేల మొదలైన ఇబ్బందుల వల్ల, కొందరే లోపలకు ప్రవేశించటం, తిరగటం సాధ్యమవుతుంది. వృద్దులు, వికలాంగులు ఆ ప్రయత్నం మానుకోక తప్పదు. ఇటువంటి అసౌకర్యపు నిర్మాణాల వల్ల వైద్య సహాయం, ఇంకా ఇతర ప్రజాసేవలు పొందలేక ఎందరో వికలాంగులు అవస్థ పడటం జరుగుతుంది. అటువంటి వారి సౌకర్యం కోసం తక్కువ ఖర్చుతో భవనాలలో కొన్ని మార్పులను, చేర్పులను చేయటం కోసం కొన్ని సలహాలు క్రింద ఇవ్వటం జరిగింది.

చేయూతకు తాడు లేక రైలింగ్

i7బిల్డింగ్ లకు బయట కాలినడక దారి పొడవునా వూతంగా పట్టుకు నడిచి, లోపలకు ప్రవేశించటానికి వీలుగా, తాడుగాని రైలింగ్ గాని ఏర్పాటు చేయటం వల్ల, అంధులకు, సరిగా నడవలేని వారికి, నడక లోపం గల వారికి ఎంతో సహాయ పడుతుంది. అలాగే లోపల గోడల పొడవునా కూడ తాడును ఏర్పాటుచేయటం వల్ల ఎక్కడికి వెళ్ళాలన్నా తెలుసుకొని వెళ్ళిపోగలుగుతారు పట్టుకొని నడుస్తూ,

తలుపులు

తలుపులకు పట్టుకొని తియ్యటానికి, వెయ్యటానికి ఉపయోగించే హ్యాండిల్, గుండ్రని నాబ్ కన్నా అనువుగా వుంటుంది. చేతులను వీలుగా కదప లేని వారు హ్యాండిల్ ను క్రిందకు నొక్క గలుగుతారు సులభంగా, అలాగే చక్రాల కుర్చీలో కూర్చున్న వ్యక్తి కూడ హ్యాండిల్ ను  సులువుగా పట్టుకోగలుగుతుంది.i8 ఏదైనా బరువును మోసుకు వచ్చేవారు కూడ హ్యాండిల్ అయితే తలుపును తెరువగలుగుతారు కష్ట పడకుండా,

ఒక మెటల్ ప్లేటును తలుపు నాబ్ పై వెల్లింగ్ చేయటం ద్వారా, దానిని సులువుగా తెరుచుకోవటానికి ఉపయోగపడే హ్యాండిల్ గా మార్చుకోవచ్చు. హ్యాండిల్ ను బాగ తక్కువ ఎత్తులో అమర్చటం వల్ల చిన్న ఆకారం గల వ్యక్తులకు, చక్రాల కుర్చీలోని వ్యక్తులకు అందుబాటుగా సౌకర్యంగా వుంటుంది.

తలుపులు కొన్ని కష్టంగా తెరుచు కొంటూ వుంటాయి. అటువంటి తలుపల మడత బందులలో కొబ్బరి నూనె గాని, గ్రీజు గాని, కొవ్వొత్తికి ఉపయోగించే మైనాన్ని గాని వేయటం వల్ల అవి మెత్తగా, సులువుగా తెరుచుకోవటం జరుగుతుంది.

i9ఒక్కో సందర్భంలో తలుపు తెరిచిన తర్వాత చక్రాల కుర్చీ లోనికి వెళ్ళేటంత ఖాళీ వుండదు. మరుగుదొడ్లు, బాత్రూమ్లు వంటి చిన్న గదులైనటైతే, తలుపును ఆ చిన్నగది లోనికి తెరుచుకొనే విధంగా కాక, బయటకు తెరుచుకొనేలా అమర్చటం అవసరం. అందువల్ల 5533 వెళ్ళటానికి, బయటకు రావటానికి కూడ సులభంగా వుంటుంది. ఒక్కోసారి, స్థలం మరీ చిన్నగా వున్న సందర్భం అయితే ప్రక్కకు జరిగే వంటి (సైడింగ్ డోర్) తలుపు కూడ ఉపయోగించవచ్చు.

చక్రాల కుర్చీ లోపలకు వెళ్ళేటంత వెడల్పుగా వుండాలి గుమ్మం. చక్రాల కుర్చీలోని వ్యక్తి చక్రాలపై చేతులతో లోపలకు కష్ట పడకుండా వెళ్ళేటంత ఖాళీగా వుండాలి గుమ్మం వెడల్పు

భవనాల లోనికి ప్రవేశించేందుకు మెట్లు ఎక్కలేని వారికి, చక్రాల కుర్చీలు ఉపయోగించే వ్యక్తుల సౌకర్యార్థం, రాంప్లను (ర్యాంప్-వాలుగా వుండే చష్టాలు) నిర్మించటం అత్యవసరం. అందువల్ల చాలమంది, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, గ్రంధాలయాలు, ఇంకా అనేక ప్రజాసేవా కేంద్రాలలోనికి వెళ్ళేందుకు, వచ్చేందుకు అవకాశం కలుగుతుంది. రాంప్లన్నవి కేవలం చక్రాలకుర్చీల వారికే కాక ఇంకా నడక కష్టంగా వుండేవారికి, ప్రమాదాల వల్ల గాయాలయ్యేవారికి కూడ ఎంతో ఉపయోగపడతాయి.

మరుగుదొడ్లు

మీరు చక్రాల కుర్చీ వాడే వ్యక్తి అయితే మరుగుదొడ్డి, మీరు ఆ కుర్చీలో నుంచి టాయ్లెట్ సీటు మీదకు మారి కూర్చోవటానికి అనువుగా విశాలంగా వుండాలి. టాయ్లెట్ మీ కుర్చీ ఎత్తుతో సమంగా కాని, కొంచెం దిగువగాగాని వున్నటైతే మీకు అలా మారి కూర్చోవటం సులభం అవుతుంది. అదే పాదాల మీద ఆనుకుని కాళ్ళఎత్తుగా వచ్చేలా కూర్చొనే నేలబారు మరుగుదొడ్లయినటైతే సమస్య అవుతుంది. ఒక పెట్టె ఆకారంలో వుండే, సరిపడిన ఎత్తుతో, ఇరువైపుల పట్టుకోవటానికి వూతంగా వున్న టాయ్లెట్ను మీరే తయారు చేసుకోవచ్చు. మధ్యన ఖాళీగా వుండాలి. గోడకు కూడ ఒక హ్యాండిల్ లేక పైప్ వంటిది పట్టుకోవటానికి వీలుగా అమర్చాలి.

ఆసుపత్రి మంచాలు

i10వికలాంగ వ్యక్తులే కాకుండా, ఇతరులు కూడ చాలమంది ఆసుపత్రులలో వుండే మంచాలపైకి చేరుకోవటం కష్టంగా వున్నట్లు చెప్తున్నారు. సాధారణంగా ఇళ్ళలో వాడుకొనే మంచాల కన్నా ఎత్తుగా వుంటాయి ఆసుపత్రిలో మంచాలు. రోగుల సంరక్షణ చూసుకొనే ఆరోగ్య కార్యకర్తలు ఎక్కువగా వంగనవసరం లేకుండా అలా ఎత్తుగా వేస్తారు.

జబ్బు పడిన వ్యక్తులు, వికలాంగులు అంతఎత్తుగా వున్న పక్కపైకి ఎక్కిపడుకోవాలంటే వారికి చాల కష్టం. సాధారణంగా ఆ మంచాలకు చక్రాలు కూడ వుంటాయి కోళ్ళకు చిన్నగా, అందువల్ల ఎక్కుతున్న వ్యక్తి నుంచి వెనకకు జరిగిపోయే ప్రమాదం కూడ వుంటుంది.

ఆరోగ్య కేంద్రాలలో, చక్రాలు లేని ఎత్తు తక్కువగా వున్న మంచాలు న్నటైతే, అందరూ కూడ అవి తమకు ఉత్తమంగా, సౌకర్యంగా వుంటాయని అవే కావాలనుకుంటారు.

ఆరోగ్య కార్యకర్తలకు సూచనలు

వైకల్యం గురించి తెలుసుకోండి (నేర్చుకోండి)

సాధారణంగా డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు వైకల్యం లేని రోగుల ఆరోగ్య సంరక్షణ చేయటంలోనే శిక్షణ పొంది వుంటారు. వారు నేర్చుకొనే వైద్య విద్యలో వైకల్యం గురించి చాల తక్కువ సమాచారం వుంటుంది. వికలాంగుల యొక్క వైకల్య నివారణ విషయంగా వారితో మాటలాడతారు తప్ప వేరే ఆరోగ్య సమస్యల గురించి అనగానే వారికి చేతకాదు.

ఆరోగ్య కార్యకర్తలు వైకల్యం గురించి ఇంకా ఎక్కువ సమాచారం తెలుసు కోవలిసిన అవసరం ఎంతైనా వుంది. ఒక ప్రత్యేకమైన వైకల్యానికి లోనైన స్త్రీ జీవితంలో గర్భం దాల్చటం, వయసు మళ్ళటం వంటి విషయాలపై, ఆ వైకల్యపు ప్రభావం ఎంతవరకు వుండవచ్చు అన్న అంశాన్ని వారు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి.

ఆరోగ్య కార్యకార్తలు, అంగ వైకల్యం గురించిన మరింత ప్రావీణ్యం సంపాదించాలంటే, వారి శిక్షణ కార్యక్రమాలలో వికలాంగ స్త్రీలను కూడ ప్రవేశ పెట్టటం అన్నది మంచి పద్ధతి.

వికలాంగ స్త్రీల ద్వారానే, వారి వైకల్యం గురించిన అనుభవాలను తెలుసుకోవటం వల్ల ఇటు ఆరోగ్య కార్యకర్తలకు ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. అలాగే అటు వికలాంగ స్త్రీలు కూడ ఎలాచెస్తే అర్థమయ్యే అవకాశం ఎక్కువగా వుంటుందో అలా వారికి చెప్పి తమ ఆరోగ్య సంరక్షణను ఆరోగ్య కార్యకర్తలు స్నేహపూర్వకంగా చేసేలా చేసుకోగలుగుతారు.

ఆరోగ్య కార్యకర్తలు, వికలాంగ స్త్రీల నుండి తెలుసుకోవటం

i11ఉగాండాలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా వున్న మంత్రసానులను, ఇంకా సాంప్రదాయ ప్రకారంగా కాన్పులు చేసే మంత్రసానులను ఒక సర్వే ద్వారా విచారించి, వారికి ఏ రకమైన సమాచారం అందిస్తే తమ విధులను ఇంకా సమర్థవంతంగా నిర్వర్తించ గలుగుతారు! అని అడగటం జరిగింది. అందుకు చాల మంది, అంగవైకల్యం గల స్త్రీలకు ఎలా సహాయం అందించాలి అన్న విషయంపై అధిక సమాచారం కావాలని కోరటం జరిగింది.

ప్రస్తుతం ఉగాండా ఆరోగ్య మంత్రిత్వ శాఖ, అంగ వైకల్యం గల స్త్రీల ఆరోగ్యం గురించి ఎక్కువ సమాచారం తెలుసుకొనేటందుకు అనువుగా శిక్షణా సదస్సులను నిర్వహించే ఏర్పాట్లు చేస్తుంది. ఆ కార్యక్రమాలను నిర్వర్తించటంలో వికలాంగ స్త్రీలే సహాయ పడటం విశేషం. వికలాంగ స్త్రీల ఆరోగ్య సంరక్షణకు ఉత్తమమైన విధానాలను గురించిన ప్రశ్నలకు, తమ అనుభవాల విశ్లేషణలతో వికలాంగ స్త్రీలే సమాధానాలను, సలహాలను ఇస్తారు. అందువలన ఆరోగ్య కార్యకర్తలు, వికలాంగ స్త్రీలు పరస్పర అవగాహనతో మెలగి ఎన్నో కొత్త విషయాలను తెలుసుకొనే అవకాశం ఏర్పడుతుంది.

ఒక వికలాంగ స్త్రీ ఏదైన ఆరోగ్య సమస్యతో మీ దగ్గరకు వచ్చినపుడు, ఆమె, మిగత స్త్రీలందరి వంటి స్త్రీయే అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. మొదట ఆమె ఎందుకు వచ్చిందో, ఆమెకు మీరు ఎలా సహాయపడగలరో తెలుసుకోవాలి. ఆమె తన వైకల్యం సంబంధమైన వైద్య సహాయానికే వచ్చివుండ వచ్చని వూహించకూడదు.

ఆమెకు మాట్లాడే అవకాశం కల్పించండి. ప్రశ్నలు వేయ నివ్వండి. అపుడు ఆమె ఆరోగ్య సమస్య ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఆమె ఆరోగ్య సమస్యల గురించి, ఆమెకే బాగా తెలుసు. ఆమె అభిప్రాయాలను గౌరవించాలి. ఆమె వైద్యం గురించి ఆమే నిర్ణయాలు తీసుకోగలదు కూడ.

ఆమెకు విశ్రాంతిగా ఆలోచించుకొని మాట్లాడే అవకాశం ఇవ్వాలి. అపుడు ఆమె సందేహాలన్నీ వ్యక్త పరచగలదు. అందువలన ఆమెకు గల బెరుకు, భయం తొలగిపోతాయి. ఒక్కో సందర్భంలో, ఆమె మనసులో భయం కలిగించే సందేహాలను, అనుమానాలను బయట పెట్టలేక బాధపడటం జరుగుతుంది. అందుకు అనువైన వాతావరణం కల్పించాలి ఆమెకు. ఎన్ని కారణాలున్నా వికలాంగ స్త్రీల భయాలను తగ్గించే విషయంలో మీరు సహాయ పడగలరు. వారికి మరింత విశ్వాసం కలిగించి, వారికి కావలిసిన వైద్య సేవలను, సమాచారాన్ని అందించండి.

గౌరవం

i12ఒక వికలాంగ స్త్రీ ఆరోగ్య సంరక్షణ చూసుకునేవారు ఎవరైనా సరే ఒక్క విషయం గుర్తు వుంచుకోవటం అవసరం. ఆమె పట్ల తీసుకునే జాగ్రత్త ప్రేమ పూర్వకంగా తీసుకోవాలి. ఆమే ఆరోగ్య సంరక్షణ చేసేవారు ఎల్లపుడూ ఆమె గౌరవ, మర్యాదలకు భంగం కలిగించకుండా ప్రవర్తించాలి ఆమె పట్ల, దురదృష్టవశాత్తూ కొందరు వ్యక్తులకు ఈ విషయం గురించి జ్ఞాపకం చేయవలసి వస్తుంది. ఆమె ఆరోగ్య సమస్య గురించి వివరంగా మాట్లాడేటందుకు అవకాశమిచ్చి ప్రోత్సహించాలి. ఆమె ఆరోగ్య సమస్యను ఎలా పరిష్కరించు కోవాలో ఆమే చెప్పగలదు కూడ. అందువలన ఒక ఆరోగ్య కార్యకర్తకు వివిధ రకాల వైకల్యాల గురించి అవగాహన ఏర్పడుతుంది. కలిసి పనిచేయటం వలన అభిప్రాయభేధాలు, అపార్ధాలు తొలిగిపోయి, ఉత్తమమైన ఫలితాలు లభిస్తాయి.

ప్రత్యేక వైకల్యాలు గల స్త్రీలకు సహాయపడటం

అంధురాలు లేక కంటి చూపు సరిగాలేని స్త్రీ అయినటైతే -

 • అత్యవసరం అయితేనే గాని నీనెవరివో చెప్పక ముందుగా ఆమెను తాకకూడదు.
 • ఆమె మిమ్మల్ని అసలు చూడలేదు అనీ భావించకండి.
 • మీరు మామూలు కంఠస్వరంతో మాట్లాడండి.
 • ఆమె దగ్గర చేతి కర్ర వున్నటైతే, ఎట్టిపరిస్థితిలోను దానిని ఆమెకు దూరంగా పెట్టకండి.
 • వెళ్ళిపోయేటపుడు 'గుడ్ బై' అని వీడ్కోలు చెప్పటం మరచిపోకండి.

బధిరురాలు లేక వినికిడి శక్తిలోపం గల స్త్రీ అయినటైతే -

 • మాట్లాడే ముందు ఆవిడ మిమ్మల్ని గమనిస్తుందో లేదో చూసుకొని మాట్లాడండి లేకుంటే నెమ్మదిగా ఆమె భుజంపై స్పర్శించండి.
 • గట్టిగా పెద్ద శబ్దంతో మాట్లాడకుండా, చెప్పాలనుకున్నది క్లుప్తంగా చెప్పండి.
 • నేరుగా ఆమె వైపే చూస్తూ, నోటికి ఏమీ అడ్డు పెట్టుకోకుండా మాటూడండి.
 • ఆమెను అడిగి తెలుసుకోండి, ఏ విధంగా సంభాషిస్తే ఆమె అర్థం చేసుకోగలదో,

శారీరక వైకల్యం (అంగవైకల్యం)గల స్త్రీ అయినటైతే -

 • ఆమె మానసికంగా కూడ బలహీనంగా వుండవచ్చని వూహించుకోవద్దు.
 • వీలైనంత వరకు ఆమె కంటిచూపునకు ఎదురుగా, సమానంగా వుండేలా కూర్చోవాలి.
 • ఆ స్త్రీ యొక్క అనుమతి లేకుండా క్రెచెస్, చేతికర్ర, నడిచేటపుడు వూతంగా వుపయోగించే వాకర్ కాని, చక్రాల కుర్చీగాని కదపటానికి ప్రయత్నించకూడదు.
 • ఆమె చక్రాల కుర్చీ ఉపయోగించే వ్యక్తి అయినటైతే ఆమె కుర్చీపై చేర్లబడి నిలబడటం గాని, ఆమె అనుమతి లేకుండా ఆ కుర్చీని తాకటంగాని చేయకూడదు.

మాట్లాడటం సమస్యగాగల స్త్రీ అయినటైతే –

 • ఆమె మాట నెమ్మది, అర్థం చేసుకోవటానికి కష్టమైన రీతిగా వున్నదీ అయినా సరే, ఆమెకు మాత్రం అర్థం చేసుకోవటంలో, నేర్చుకోవటంలో లోపం వున్నట్లు భావించకూడదు.
 • మీకు అర్థం అయ్యేటంత వరకు ఆమెను మళ్ళీ చెప్పమని అడగండి.
 • ఆమె "అవును”, “కాదు" అని జవాబివ్వగల ప్రశ్నలనే అడగండి.
 • ఆమె సమస్యను వివరించేటందుకు ఆమెకు కావలిసినంత సమయాన్ని తీసుకోనివ్వండి. మీరు ఓపిక వహించాలి.

అర్థం చేసుకోవటం, నేర్చుకోవటంలలో లోపం వున్న స్త్రీ అయితే -

 • చిన్న పదాలను, వాక్యాలను ఉపయోగించాలి.
 • మర్యాదగా, ఓపికగా ప్రవర్తించాలి ఆమె పట్ల చిన్న పిల్లగా పరిగణించకూడదు.

మార్పు కోసం కృషి చెయ్యటం

ఆరోగ్య కార్యకర్తలతో కలసి కృషి చేయటానికి మీకు ఇక్కడ కొన్ని సూచనలు ఇవ్వటం జరిగింది. ఈ సూచనలను పాటించటం వల్ల, ఆరోగ్య సంరక్షణ సేవలను మరింత మెరుగు పరచవచ్చు. ఈ కార్యకలాపాల వల్ల తప్పకుండ కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి.

 • వికలాంగ వ్యక్తులకు, అవసరాలు తీరే విధంగా సౌకర్యాలు అనుకూలంగా, అందుబాటుగా వుండే విధంగా మార్పు వస్తుంది. అంతే కాకుండా వికలాంగ స్త్రీల పట్ల ఏర్పడివున్న దురభిప్రాయాలు, మూఢ విశ్వాసాలు తొలగిపోయి, వారికి మంచి ఆరోగ్య సంరక్షణ లభిస్తుంది.
 • వికలాంగ స్త్రీల ఆరోగ్య సంరక్షణకు తీసుకోవలిసిన చర్యలను గుర్తించటం ద్వారా వారికి మరింత ఉత్తమంగా సేవలను అందించవచ్చు.

ఆరోగ్యసేవలను మెరుగు పరచటం కోసం ఇక్కడ కొన్ని మార్గదర్శక సూత్రాలను సూచించటం జరిగింది. ఒక బృందంగా సమావేశమై ఆరోగ్య సంరక్షణ విషయంలో ఎదుర్కొంటున్న ఆటంకాల గురించి పరస్పరం అనుభవాలను తెల్పుకోవటం వల్ల ప్రతి ఒక్కరికీ ఆత్మవిశ్వాసం కలుగుతుంది.

 1. i13ప్రతి ఒక్కరిలో చెప్పకోవటానికి ఒక విశేషం వుంటుంది: ప్రతి ఒక్కరు మీలో ఇబ్బంది లేకుండా పరస్పరం సహృద్భావంతో మెలిగేటందుకు వారి వారి నైపుణ్యాల గురించి తెలుసుకోవాలి. తమ గురించి తాము గర్వపడే విధంగా భావించుకొనే విషయాలను చెప్పమని అడగాలి. (ఇష్టం లేనివారు తమ గురించి మాట్లాడనవసరంలేదు.)
 2. ఆరోగ్య సంరక్షణ సానుకూలత కోసం పరస్పరం అనుభవాలను పంచుకోవటం: ఒక్కొక్కరుగా ప్రతి ఒక్కరినీ, ఒక వికలాంగ స్త్రీ ఆరోగ్య సంరక్షణ పొందకుండా ఎదుర్కొన్న అడ్డంకుల గురించి, చూసినగాని స్వయంగా చవిచూసిన అనుభవం గురించిగాని చెప్పమని అడగాలి. ఆ స్త్రీలందరూ ఎదర్కొన్న కష్టాల జాబితాను తయారు చెయ్యండి. దానికేం క్రమం అక్కరలేదు.
 3. నాటకాలలో పాత్రల ద్వారా మంచి ఆరోగ్య సంరక్షణకు ఏర్పడే ఆటంకాల గురించి అవగాహన: తయారు చేసిన జాబితా ప్రకారం ఎదుర్కొన్న సమస్యలు ప్రతి ఒక్కరికీ బాగా అర్థమయ్యే విధంగా తమనే పాత్రలుగా పరస్పరం మార్చుకొని, ఆరోగ్య కార్యకర్తలు, వైకల్యం గల స్త్రీలు ప్రదర్శనలు ఇవ్వటం చేయాలి. బృందంలోని వారందరినీ చిన్నచిన్న జట్లుగా విడదీసి, ఆరోగ్య కార్యకర్తలను కూడ చేర్చి నాటికలు ప్రదర్శించటం వల్ల • ఎంతో అవగాహన పెరుగుతుంది.
 4. ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించండి: ఆ బృందం గుర్తించినకొన్ని ఆటంకాలను గురించి ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవటం కోసం వారు స్థానికంగావున్న కొన్ని ఆరోగ్య కేంద్రాలను దర్శించి వికలాంగ స్త్రీలు ఎన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవచ్చు.
 5. ఆ బృందాన్ని రెండుగా విడదీసి, రెండు గ్రూప్లలోను ఒక్కొక్క ఆరోగ్య కార్యకర్త వుండేలా చూడాలి. రెండు, మూడు ఆరోగ్య కేంద్రాలను సందర్శించాలి. అందులో ఒకరిద్దరు స్త్రీలను (ఆ బృందంలో) అక్కడ వారు కనుగొన్న సమస్యలనుగాని, అడ్డంకులనుగాని ఒక పేపరు పై వ్రాయమనాలి, లేకుంటే గురువుంచుకున్నా ఫర్వాలేదు. అంతే కాకుండా వికలాంగ స్త్రీలకు ప్రయోజనకరంగా అనిపించే ప్రతి విషయాన్ని కూడ నోట్ చేయాలి.

  ఈ విధంగా స్త్రీలు ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళి అక్కడిలోటు పాట్లను తెలుసుకోవటం వల్ల, స్త్రీలు ఒకరికొకరు పరస్పరం సహాయ పడటమే కాకుండా వారి సంఘటిత కృషి వల్ల సమస్యలను, అడ్డంకులను అధిగమించ గలుగుతారు.

  ఉదాహరణకు చక్రాల కుర్చీ ఉపయోగించే వారు అంధ స్త్రీలకు, అంధులు నడకలో సమస్య గలవారికి తోడ్పడగలరు.

 6. మీరు ఆరోగ్య కేంద్రం వద్ద చూసినవేమిటి? ఆరోగ్య కేంద్రం నుండి తిరిగి వచ్చిన తర్వాత ప్రతి బృందం కూడ తాము చూసిన, కనుగొన్న సమస్యల గురించి చర్చించుకోవాలి. వికలాంగ స్త్రీలకు సహాయంగా వున్న విషయాలను కూడ చర్చలో భాగంగా చెయ్యాలి. ప్రతి బృందాన్ని అడగాలి, వారిని ఆరోగ్య కేంద్ర డైరెక్టరు, సిబ్బంది ఎలా ఆదరించారోనని. వారు కనుగొన్న సమస్యలను ఒక జాబితాగా గాని, ఒక మ్యాప్గాగాని తయారు చేయండి మీరు.
 7. ముఖ్యమైన సమస్యలను గుర్తించటం: ఆరోగ్య కేంద్రాలను చూడటానికి వెళ్ళినపుడు గుర్తించిన సమస్యలను చర్చించాలి. ఆ స్త్రీలను అడగాలి వాటిలో ఏ సమస్యలను వారు ముఖ్యమైనవిగా భావిస్తున్నారో, లేక ఏ సమస్యలకు ముందుగా మార్పులు చేసి పరిష్కరించాలని వారికి అనిపిస్తుందో అడిగి తెలుసుకోవాలి. ఆరోగ్య సంరక్షక సేవలలో మార్పులు చేర్పులు తేవాలంటే, అది చాల కాలం పడుతుంది. అందుకు ఒక పదతిగా పథకాన్ని కూడ రూపొందించుకోవాలి. ఆ ప్రకారం ముందుకు వెళ్ళటానికి తప్పకుండ సమయం పడుతుంది. మీ బృందం ఆ జాబితాను పరిశీలించి, ఏ మార్పులు తొందరగా చేయగలుగుతారో, ఏ సమస్యలకు సమయం పట్టవచ్చో తెలుసుకోవాలనుకొంటారు. వారు ఎంపిక చేసిన సమస్యలను వారు ముఖ్యమైనవిగా ఎందుకు భావిస్తున్నారో, ఒకవేళ ఆ సమస్యలకు పరిష్కారాలు చేసి మార్పుల ద్వారా మెరుగు పరచినటైతే, అందువల్ల వారి ఆశలు తీరుతాయా, కోరికలు నేరవేరతాయా అని అడిగి తెలుసుకోవాలి.
 8. మెరుగుదలకు ఒక పథకం ద్వారా చర్యలు: ఆ బృందం, వికలాంగ స్త్రీలు మంచి ఆరోగ్య సంరక్షణను పొందటాన్ని కష్టతరం చేసే ఒకటి రెండు సమస్యలను ఎన్నుకొన్న తర్వాత, ఒక పథకం రూపొందించి, దాని ప్రకారం కృషి చేయటం వలన ఆ సమస్యలను పరిష్కరించవచ్చు. ప్రతి సమస్యకు వివిధ రకాలపైన పరిష్కార మార్గాల గురించి బృందంలోని స్త్రీలంతా చర్చించుకోవాలి. ఇంకా ఈ విషయంగా తమకు ఇతర వ్యక్తులు ఎవరైనా కూడ సహాయ పడగలరేమో ఆలోచించుకోమని ఆస్త్రీలకు సూచించాలి. ఈ మార్పులతో పరిష్కరించుకొనే కార్యక్రమాన్ని అవసరమైన విధంగా అంచలు అంచలుగా చేపట్టి, ఒక్కో చర్యకు ఒకరిని బాధ్యులుగా నియమించుకొని ఆ ప్రకారం కృషిని చేపట్టాలి.

పాత్రల పోషణతో ప్రదర్శనల ద్వారా అవగాహన

i14నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలు నలుగురికీ అర్థమయ్యేలా చేసే విధానాలలో ఉత్తమమైనది, ఆ పాత్రలను నటించి చూపటమేనని చెప్పవచ్చు. ఒక బృందంలోని వ్యక్తులంతా చర్చించి రూపొందించిన ప్రదర్శనను చూడటం ద్వారా మరో బృందం వ్యక్తులు, మనుషులు ఆచారాల పేరిట ఏర్పరుచుకున్న దురభిప్రాయాలు వికలాంగ స్త్రీల ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతాయో అర్థం చేసుకొంటారు. ఈ ప్రదర్శనలు అవగాహనను పెంపొందించటమే కాకుండా, సాంఘిక సమస్యలకు మరొక రీతిగా పరిష్కార మార్గాలను సూచించటం జరుగుతుంది. పాత్రపోషణ అన్నది వినోదంగా, భావించటమే కాకుండా దానిని తీవ్రంగా కూడ ఆలోచించాలి. పాత్రలు, నటనలు అతిశయోక్తిగా కనిపించినా, యదార్థం అన్నది తప్పకుండా వుంటుంది అంతర్గతంగా, ఈ పాత్రల పోషణకు ముందుగా తయారు కావటం, సంభాషణలను కల్పించి వ్రాసే అవసరం కూడ అంతగా వుండవు.

పాత్రల పోషణకు వారంతట వారు దృశ్యాలను తయారు చేసుకోలేకపోయినటైతే, ఇక్కడ కొన్ని సాధ్యమయ్యే ప్రదర్శనలకు రూపకల్పన చేయటం జరిగింది.

పాత్ర పోషణ అయిపోగానే నటులను తమ బృందం దగ్గరకు వచ్చేయమని చెప్పాలి. అప్పుడు ఆ బృందం సభ్యులందరినీ వికలాంగ స్త్రీలు ఎదుర్కొనే సమస్యలను బాగా వివరించే విధంగా వున్నాయా పాత్ర పోషణలు అని ప్రశ్నలు అడగాలి. వికలాంగ స్త్రీలు మంచి ఆరోగ్య సంరక్షణ పొందటానికి ఎన్ని సమస్యలను ఎదుర్కోవాలో వారికి అర్థమైందేమో అడిగి తెలుసుకోవాలి.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate