ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని సమయాలలో సహాయం అవసరం. మనం యితరుల నుంచి సహాయం తీసుకోవటమో, లేదా, యితరులకు (కుటుంబ సభ్యులకో, యిరుగు పొరుగు వారికో లేదా ఎవరైనా క్రొత్త వారికైనా సరే) సహాయం చేయటమో జరగని రోజు వుండటం చాలా అరుదు. ఒకరికొకరు సహాయం చేసుకోవటం మానవ స్వభావం.
ఒక వికలాంగురాలికి తన దిన చర్యలలో తరుచుగా సహాయం అవసరం. ఆమె తనకవసరమైన సహాయాన్ని పొందగలిగితే, ఆరోగ్యవంతమైన, ఆనందమైన జీవితాన్ని గడపగలదు. తన కుటుంబానికీ, సమాజానికీ కూడా వుపయోగపడగలదు.
వికలాంగురాలైన ఫ్రీకి చేయూతనివ్వడం చాలా మెచ్చుకోదగిన విషయం. చాలా శ్రమతో కూడుకున్న విషయమూ - ముఖ్యంగా ఆమెకు చాలా జాగ్రత్తలు అవసరమైనపుడు మరీ శ్రమ పడవలసి వుంటుంది. ఈ అధ్యాయం ముఖ్యంగా వికలాంగ స్త్రీలకు సంరక్షణ చేసే వ్యక్తులు, కుటుంబాలవారు తమకోసం తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేయటానికి వద్దేశింపబడినది. వికలాంగ స్త్రీలు తమ సంరక్షకుల అవసరాలను తెలుసుకోవటానికి కూడా యీ అధ్యాయం సహాయపడుతుంది.
ఒక వికలాంగ స్త్రీకి సహాయపడే వారెవరైనా సరే, అన్నిటికన్నా ముఖ్యంగా గురుంచుకోవలసిన విషయం ఏమిటంటే తానొక ఎదిగిన స్త్రీననీ, చిన్న బిడ్డను కాను అనీ. ఆమెకు ఎటువంటి సహాయం అవసరమో, ఆమె చెప్పగలిగితే చెప్పనీయండి. తర్వాత మీరు ఆమె కలిసి ఎలా చేస్తే మంచిగా వుంటుందో నిర్ణయించండి.
వీలైనంత వరకూ వికలాంగ స్త్రీ తన జాగ్రత్తలు గురించీ, తన జీవితం గురించీ తానే బాధ్యత వహించేటట్లు చూడాలి. వికలాంగ స్త్రీ తన టీముకు తానే కెప్టెన్గా అనుకునేటట్లు, తనకు తాను గౌరవించుకొనేలాగ సంరక్షకులు ఆమెను ప్రోత్సహించాలి. ఆ విధంగా ఆమె తనకు అవసరమైన సహాయాన్ని పొందగలదు. మరియు తనకనవసరం అనుకొన్నటువంటి, వుపయోగం కానటువంటి, తన మర్యాదను కోల్పోయేటటువంటి సహాయాన్ని తీసుకోకుండా వుండటానికి వీలు అవుతుంది.
వీలైనంత వరకూ వికలాంగ ప్రీతో మాట్లాడి ఆమె ఏమి ఆశిస్తున్నదో తెలుసుకోవాలి. ఏ రకమైన బాధ్యతలలో ఆమె పాలు పంచుకోగలదో, సంరక్షకురాలు ఏమి చేయాలో, ఏమి చేయనవసరం లేదో అడిగి తెలుసుకోవాలి. తానే చేసుకోగలననుకొన్న కొన్ని పనుల గురించిన సహాయం అడగటం ఆమెకు మంచిగా అనిపించకపోవచ్చు. మీరూ వికలాంగ స్త్రీ ముఖాముఖీ మాట్లాడుకొంటే ఆమెకు మంచి సంరక్షణ యివ్వటం సులభమవుతుంది. అలా వీలుకానట్లయితే, మిమ్మల్ని ఆమె వూహించుకొని ఆమె ఏమనుకొంటున్నదో తెలుసుకోవటానికి ప్రయత్నించండి. ఆమెకు వినికిడి లోపం వుండి సౌంజ్ఞాభాషతో అవసరాలను వ్యక్త పరుస్తుంటే మీరు వెంటనే వీలైనంత తొందరగా ఆమెతో సౌంజ్ఞలను చేసే విధానాన్ని నేర్చుకోండి.
ఆమె అంధురాలయితే ఆమె పరిసరాలలో తిరిగే దారిని తెలుసుకోవటానికి ఆమెకు ఎటువంటి సహాయం కావాలనుకొంటున్నదో ఆమెను చెప్పనీయండి. మీరు ఆమె చేతిని మీ చేతితో పట్టుకొని ఆమెను మీ అంత మీరే నడిపించే ప్రయత్నం చేయకండి. ఆమె దారిని తెలుసుకోవటానికి చేతికర్రను వాడుతూ వుంటే, ఆ కర్ర ఎల్లపుడూ ఆమెకు అందేలా ఆమె దగ్గరగా వుండేలా చూడండి. ఆయనే, మీ చేతిని ముందుగా పట్టుకోనివ్వండి.
మీరు వికలాంగురాలై యుండి మీ దిన చర్యలైన స్నానం చేయటం, దుస్తులు ధరించటం, తినటం, పడుకొని లేవటం వంటి పనులలో మీకు సహాయం అవసరం అయితే, మీ సహాయకులు మీకు సహాయం చేయటం ప్రారంభించకముందే వారితో మాట్లాడండి. మీకు ఎంత సహాయం అవసరమో ఎంత కాదో అన్న విషయాన్ని వారు అర్థం చేసుకున్నటుల రూఢి చేసుకోండి.
ఓర్పుగా వుండండి. చాలా విషయాలలో మీకు సహాయం అవసరం లేదు అన్న విషయాన్ని అర్థం చేసుకోవటానికి మీ సహాయకులకు కొంచెం సమయం పట్టవచ్చు. మీరు ఓర్పుగా వుండాలి.
సంరక్షకులకు విశ్రాంతి అవసరం. చాలా మంది సహాయకులు, సంరక్షకులు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ప్రతి రోజూ వారి కోసం వారికి కొంత సమయం కావాలి. మరియు వారానికి ఒక రోజు సెలవు వుండాలి. మీ సంరక్షకురాలు కొంచెం విశ్రాంతి తీసుకున్నట్లయితే మీకు యింకాస్త చక్కగా సహాయ పడగలదు.
ఇద్దరూ కలిసి నిర్ణయాలను తీసుకోండి. మీకు ఎటువంటి సహాయం కావాలో మీకే బాగా తెలిసినప్పటికీ మీ సంరక్షకురాలు చెప్పే ఆలోచనలను కూడా వినండి. ఒక్కొక్కపుడు ఆమె సలహాలు బాగా పని చేయగలవు. ఇతర వికలాంగ స్త్రీలను కలవండి.
వారి అభిప్రాయాలు, సలహాలతో పాలు పంచుకోవటం. మీ సంరక్షకుల నుంచి మీరు చక్కటి సహాయాన్ని అందుకోవటానికి సహాయ పడవచ్చు.
వికలాంగ స్త్రీలు మరియు సంరక్షకులు యిద్దరూ కూడా – వారు కుటుంబ సభ్యులైనా, జీతం తీసుకొని పని చేసేవారైనా - పురుషులైనా, స్త్రోలైనా, పిల్లలైనా సరే వారు మన కమ్యూనిటీకి విలువైన సభ్యులు - కుటుంబాలలో గాని కమ్యూనిటీలోగాని నివశిసూ, పని చేసూ మన సంతోషాలనూ, బాధలనూ పంచుకొంటూ వుండే మన సంరక్షకులకు మన సపోర్టు, మనతో సన్నిహిత సంబంధాలు కలిగి వుండటం అవసరమవుతుంది. కాని అనేక యింటి పనులు మాదిరిగానే వికలాంగ స్త్రీలకు చేయబడే సహాయం కూడా అరుదుగా గుర్తించబడుతుంది. మెచ్చుకోబడటం, ముఖ్యమైనదిగా చూడబడటం కూడా అరుదే. ఒక్కొక్కసారి వికలాంగ స్త్రీ కూడా సహాయాన్ని తీసుకోవటం తమ హక్కుగా భావిస్తున్నట్లుగా అనుకొని సంరక్షకురాలు బాధపడవచ్చు.
జబ్బు పడిన, లేదా అంగవైకల్యం కుటుంబ సభ్యులకు తరచుగా స్త్రీలు, బాలికలే సహాయం చేస్తారు. మరియు వారు వారి యింటి పనులూ, కమ్యూనిటీ పనులు చేసుకుంటూనే యీ పనులను కూడా చేస్తారు. అనేక మంది స్త్రీలకు వారి దినచర్య సూర్యోదయానికి ముందే మొదలై చాలా పొద్దు పోయే వరకూ పూర్తికాదు. వారు యితరులకు సహాయం కూడా చేసూంటే వారికి చేయవలసిన పని చాలా ఎక్కువగా వుంటుంది.
తల్లలకు సహాయపడే పిల్లలకు ముఖ్యంగా కూతుళ్లకు వారి స్వంత పనులుంటాయన్న విషయాన్ని తేలికగా మరిచిపోతారు. ఇతర పిల్లలతో గడపటానికి, నేర్చుకోవటానికి, ఆడుకోవటానికి పిల్లలకు కొంత సమయం అవసరం.
వికలాంగులైన తల్లలు తమ పిల్లల సహాయం తీసుకునే బదులు కుటుంబంలోని యితర పెద్దల సహాయం తీసుకోవటం ద్వారా తమ పిల్లలకు సహాయం చేసిన వారవుతారు. తల్లి తనకవసరమైన సహాయాన్ని అందరికీ వివరించి చెప్పటం వలన, కుటుంబ సభ్యులందరూ ఒక టీమ్గా ఆమెకు సహాయాన్ని అందించగలరు.
ఒక్కొక్కసారి పురుషుడో, బాలుడో తన భార్యనో, అక్క చెల్లెళ్లకో, తల్లికో సంరక్షకులుగా వుంటారు. అటువంటపుడు ఆ పురుషునికి తను సహాయపడుతూన్న వికలాంగ స్త్రీ సహాయంతో బాటు, కుటుంబంలోని యితర స్త్రీల సహాయం కూడా అవసరమవుతుంది. వికలాంగ స్త్రీ జీవితానికి పురుషుని జీవితానికి గల తేడా అర్థమవుతుంది. స్త్రీ, పురుష శరీరాలలోని భేదం ముఖ్యమైన విషయమే కాని ఫ్రీ, పురుషులు సంఘంలో ఎలా పెంచబడ్డారో ఆదరించబడ్డారో అన్న విషయాలు కూడా యింకా చాలా ముఖ్యం.
ఒక్కొక్కసారి వికలాంగ స్త్రీ జీతమిచ్చి ఒక ఆంతరంగిక సహాయకురాలిని ఏర్పాటు చేసుకుంటుంది. ఆ వ్యక్తి చేసే సహాయం వలన ఆమెకు ఎక్కువ స్వేచ్చ, స్వాతంత్ర్యాలు లభిస్తాయి. కొన్ని దేశాలలో వికలాంగులకు ప్రభుత్వము కొంత ధనాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ ధనంతో తనకు సహాయపడే వ్యక్తిని ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా కుటుంబ సభ్యులనో స్నేహితులనో తమకు సహాయ పడేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక్కొక్కపుడు వికలాంగ స్త్రీ తన సంరక్షకుడికి భోజనం మరియు వుండటానికి గది కూడా ఏర్పాటు చేస్తుంది.
సహాయకులు చేసే మలమూత్ర సంబంధమైన రోజూ చేసే పరిశుభ్ర కార్యక్రమాలు ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనా కాని దానిని హీనమైన పనిగా భావిస్తాయి. జీతం కూడా తక్కువే యిస్తారు. కుటుంబ సభ్యులు తమని అదుపులో వుంచాలనుకొంటారని, అర్థంలేని పనులు చెప్పి తమ సమయాన్ని వృధా చేస్తారనీ లేదా నిష్కారణంగా పనినుంచి తొలగిస్తారనీ సంరక్షకులు అంటారు. వికలాంగ వ్యక్తులు ఒంటరివారైవుంటే తమ సంరక్షకులు ఎంత నిరాదరణకు గురి అవుతున్నారో అర్థం చేసుకోలేరు.
నాతో నవ్రుతగా వుండాలని ఎవరూ తాపత్రయ పడరు. రోజులో కొంత సమయం నాకూ అవసరమనీ, ఒక రోజు సెలవు అవసరమనీ, క్రిస్టీన్ ఒకత్తెకి మాత్రమే అర్థమవుతుంది.
ఆంతరంగిక సహాయకులుగా శిక్షణ నిప్పించి ఉద్యోగాలను చూపించే సంస్థలూ, కమ్యూనిటీలోని బృందాలు యీ క్రింది విధంగా చేయాలి.
- పనిచేసే పరిస్థితులు ప్రమాణాలను నిర్ణయించటం
- అభిప్రాయ భేదాలను నివారించే పద్దతులను బోధించాలి.
- వికలాంగ స్త్రీల ఉద్వేగ భరితమైన పరిస్థితులలో తగిన అవగాహనతో వికలాంగ స్త్రీలకు సహాయ పడడానికి అవసరమైన శిక్షణను యిప్పించాలి.
- మనిషిని ఎత్తటం, వ్యాయామం చేయించటం, యిన్ఫెక్షన్సు రాకుండా నివారించటం మొదలైన విషయాలలో నేర్పులను, బోధించాలి.
ఘనా అనే ప్రదేశంలో వృద్దులకు సహాయపడే ఆరోగ్యకార్యకర్తలు పనులను తేలికగా ఎలా చేయాలో నేర్పించటం కోసం ఒక సంరక్షకుల బృందాన్ని సమీకరించారు. ఎందుకంటే ఘనాలోని వివిధ గ్రామాలను సందర్శించినపుడు అక్కడి వృదులకు వారి దినచర్యలలో సహాయపడేటపుడు వారికి తెల్సిన విషయమేమిటంటే వారికి సహాయపడటంతో పాటు, ప్రతిరోజూ వారికి సహాయాన్నందించే వారి యింటిలోని వారికి కూడా యీ సులువులు నేర్పించాలని. అప్పటి నుంచీ ఏ వృద్దులకు సహాయం చేయటానికి వెళ్లినా వారి సంరక్షకులకు కూడా సూచనలు యివ్వడం మొదలు పెట్టారు. వారి అనుభవాలను, సమస్యలను విని పరిష్కారాలను సూచించేవారు. సంరక్షకులకు కొంత విశ్రాంతి వుండాలని కూడా సూచించారు.
వికలాంగుల పనులను యింకా మంచిగా చేసే ప్రయత్నంలో సంరక్షకులు చాలా పనులతో తీరిక లేకుండా వుంటారు. తరచుగా వికలాంగులు అనుభూతులెలా వున్నాయో అన్న విషయం మీదే దృష్టిని కేంద్రీకరించి వుంటారు. కాని, మీరు సంరక్షకులుగా వున్నటైతే మీ స్వంత అభిప్రాయాల గురించి ఆలోచించటానికి మీరు కొంత టైము తీసుకోవటం చాలా ముఖ్యం. ఒక వికలాంగురాలికి సహాయం చేయటం మీకు చాలా సంతోషకరమైనప్పటికీ ఒక్కొక్కసారి మీకు అసలట, ఒత్తిడి, అశాంతి, విసుగు లాంటివి కలగవచ్చు. సంరక్షకురాలిగా మీరు అనేక రకాలైన పనులను చేస్తూ వుండవచ్చు. ఒక నర్సులా, ఒక కౌన్సిలర్గా, డ్రైవర్గా, ఎకౌంటెంట్గా ఇంటిని తీర్చిదిద్దేవారిలా —ఈ అన్ని పనులనూ ఒకేసారి చేస్తుండవచ్చు. అయితే అదే ఒక జబ్బు లేక డిప్రెషన్తో బాధపడే వ్యక్తిని మీరు చూసుకోవలసి వస్తే మీరు చాలా ఎక్కువ సైస్ను అనుభవిస్తారు. కుటుంబ సభ్యులుగాని, యితరులెవరైనాగాని వికలాంగ స్త్రీలకు సంరక్షణ చేసూ విసిగి సారి పోతున్నందుకు అశాంతిగా వుండి కోపం తెచ్చుకొంటున్నందుకు తప్పగా ప్రవర్తిస్తున్నానేమోనని సిగ్గు పడతారు. కాని అది సహజమే. ఒక వ్యక్తి తన దగ్గర బంధువుకో లేక తన భర్తకో/భార్యకో సేవ చేసే పరిస్థితులలో అసౌకర్యంగానూ, మనో వికారాలతోను వుంటారు. అలా ఆ పరిస్థితుల నుంచి తప్పించుకోవాలని అపుడపుడూ అనుకోవటం తప్పనీ తప్పని ఫీలై సిగ్గుపడవద్దు. అలా అనుకోవటం సహజమే.
మిమ్మల్ని అలా కోపానికి, విసుగుకూ, అసహాయతకూ గురిచేస్తున్న విషయాలేమిటో మీరు గుర్తించగలిగితే వాటిని మార్చుకోవటానికి పద్ధతులను అన్వేషించగలరు.
మీ దగ్గర వారెవరైనా ఏదైనా దుర్ఘటన వలన గాని లేదా జబ్బు వలనగాని అకాస్మాత్తుగా వికలాంగులైతే ఒక విధంగా ఆ యింటిలోని ప్రతి ఒక్కరూ కూడా గాయపడినట్లే, మీ జీవితంలో వచ్చిన యీ అనుకోని మార్పు భయంకరమైనదీ, మరియూ మిమ్మల్నీ మీ కుటుంబ సభ్యులను తీవ్రమైన క్రోధ, విచారాలకు గురిచేయటానికీ కారణం కాగలదు.
మీ భావాలను అర్ధం చేసుకోవటం వలన కలిగే ప్రేరణలో మీరు తీసుకునే చర్యలు, మీ యిద్దరి జీవితాన్ని మరియు వికలంగురాలైన ఆ స్త్రీ యొక్క జీవితాన్ని కూడా మెరుగుపరుస్తాయి.
మీకు కోపం రావటం వలన మీరు ఇతర సంరక్షులతో కూడిన ఒక బృందాన్ని ఏర్పరచి, వారిద్వారా వికలాంగ స్త్రీలకు మంచి ఆరోగ్య సంరక్షణ, రవాణా సౌకర్యం మరియు ప్రజా సంబంధమైన భవనాలను చేరటానికి వారికి అనువుగా తయారుచేయటం మొదలైన అంశాలపై ప్రభుత్వం మీద వత్తిడి తేగల శక్తి మీకు వస్తుంది.
విసుగు చెందటం, నిస్సహాయంగా అనిపించటం లేక ఒంటరితనం వంటి భావాలు కలగటం వలన మీరు సమాజంలో వికలాంగ స్త్రీలతో కలిసి జీవిస్తున్న ఇతర వ్యక్తులను లేక వికలాంగులైన వ్యక్తులను కలుసుకొనే అవకాశం కలుగుతుంది. వారు బహుశా మీకు సహాయపడగలరు.
ఎక్కువ సమయం కలిసి గడిపే వ్యక్తులు పరస్పరం కలిగే భావాల గురించి మాట్లాడుకోరు, తెలుసుకోరు. అందువలన వారు ఒకరి పట్ల ఒకరు విసుగుకు, కోపానికి గురి అవుతారు. మీకు కలిగే భావాలకు గల మూలకారణాలను మాట్లాడుకోవటం ద్వారా కూడా మార్చుకోలేనట్లయితే, అది వాటిపట్ల మీరు స్పందించే విధానాన్ని మార్చుకోవటానికి మీ యిద్దరికి సహాయపడుతుంది.
తమకు కలిగిన భావాలను వ్యక్తులు వివిధ రీతులలో కనబరుసూ వుంటారు. మీ భావాలను వ్యక్తపరచటానికి ఆరోగ్యకరమైన పద్ధతులు, అనారోగ్యకరమైన పద్ధతులు రెండు కూడా ఉంటాయి. ఉదా
నా కుమారై పోలియోతో వున్న బిడ్డ ఆమె చిన్నతనంలో మేము ఆమెకు చక్రాల కుర్చీ కొనతంగాని, ఆమె సహాయానికి ఎవరినైనా నియమించటంగాని చేయలేకపోయాము. అందుచేత నేనే ఆమెను నా వీపుపై కూర్చుండబెట్టుకొని బడికి తీసుకువెళ్లేదాన్ని ఆమె 12వ తరగతి చదివే వరకూ కూడా. కాని, ఆమె చాలా పెద్దగా, బరువుగా తయారుకావటం వలన ఆమెను మోయటం నాకు చాలా కష్టమయ్యేది. అలసిపోయేదానిని ఆమె విశ్వవిద్యాలయానికి వెళ్లే సమయానికి ఆమెకు కూడా చక్రాల కుర్చీ వచ్చింది. ఇపుడైతే ఆమెకు స్వంత కారు కూడా వుంది. కనుక కొన్ని సంవత్సరాల క్రిందటి వరకూ నేను పడిన శ్రమతో పోల్చుకొంటే ప్రస్తుతం నేను చాలా విశ్రాంతిగా వున్నట్లే.
కాని ప్రస్తుతం ఆమె ఒక్కొక్కసారి ఆమె తన నడతలో స్థిరం లేకుండా, క్రమబద్ధంగా వుండకుండా వుంటుంది. అందుచేత ఆమెకు నేను మనోధైర్యాన్ని యివ్వవలసిన అవసరం వుంది. ఆమె పరిస్థితి నాకు తెలుసు కనుక సహాయం చేయటానికి ప్రయత్నించాను. కాని ఆమెకు సహాయం చేయటానికి నేను ఎవరినైనా ఏర్పాటు చేయగలిగితే ఆమె యింకొంచెం స్థిరంగా వుండగలదు. అపుడు నేను కూడా నా స్వంత విషయాలను చూసుకోగలుగుతూ రోజంతా అలసి పోకుండా వుండగలుగుతాను.
కొందరు సంరక్షకులు తాము సంరక్షణ చేస్తున్న వారి కోసం తమను తాము పూర్తిగా అర్పించుకుంటారు. ఇతరులకు చేసే సహాయం విషయంలో వారెంతో మంచిగా వుంటూ, తమ స్వంత అవసరాల గురించి పూర్తిగా మరచిపోతారు. కొన్ని కొన్ని సమయాలలో వారు తమ సుఖసంతోషాలను కూడా త్యాగం చేస్తూ వుంటారు. అలా తమ గురించితాము ఆలోచించుకోని సంరక్షకులు కొంత కాలం తర్వాత తాము సంరక్షణనిచ్చేవారిపై విసుగు కోపం తెచ్చుకుంటారు. ఇది సంరక్షకులనూ, సంరక్షింపబడేవారినీ, యిద్దరినీ కూడా బాధపెట్టగలదు.
మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోవాలి, యితరులకు సహాయపడటానికి అవసరమైన శక్తిని మీరు కోల్పోతారు. ఎవరి గురించి అయినా మీరు తగిన మంచి జాగ్రత్తలు తీసుకోవటం కోసం మీకు తగినంత నిద్ర, విశ్రాంతి అవసరం. మీ భౌతిక అవసరాలను తీర్చుకుంటూ, మీ ఆనందాలను, సంబంధాలను కొనసాగించుకుంటూనే వుండాలి.
మీ శరీరాన్ని మనస్సునూ ప్రశాంతపరచగలిగినటువంటి, మీకు శక్తిని కలిగించేటటువంటి సాంప్రదాయకంగా వస్తున్న యోగ, ప్రార్థన, ధ్యానం . వంటి వాటిని ఆచరించండి. క్రమబద్ధంగా యీ సాంప్రదాయాలను అభ్యాసం చేసినందు వలన, యితరులకోసం మీరు పడే శ్రమ కొంచెం తగ్గగలదు.
మీ పనులను ప్రక్కన పెట్టి, మీకు సంతోష దాయకమైన పనులను చేసుకోవటానికి సమయాన్ని కేటాయించుకోండి. వికలాంగురాలికీ, ఆమె సంరక్షకురాలికీ - యిద్దరికీ కూడా వేరే వేరే స్నేహితులు, యిష్టాలు వుండటం చాలా ಮಿಫ್ಟಿಂ. పూర్తి సంతృప్తికరమైన జీవితాన్ని కలిగి వుండటం కోసం, మీరిద్దరూ కూడా యితర వ్యక్తులతో కొంత సమయాన్ని గడపటం చాలా అవసరం.
సంరక్షణ పని తరచూ శారీరక శ్రమతో కూడిన పనులతోనే వుంటుంది. వికలాంగ ఫ్రీని పైకి ఎత్తేటపుడు మీ వీపు, వెన్ను గాయపడవచ్చు. ఎవరినైనా లేదా ఏదైనా బరువును ఎత్తటం, మోయటం సురక్షితంగా చేయటానికి యీ క్రింది విధంగా చేయాలి.
సంరక్షకురాలిగా వుండటం, ఆమెను ఏకాంతంగా వుండేలా చేస్తుంది. ఒక వికలాంగురాలు పూర్తిగా, అంటే, రోజంతా ఒకే సహాయకురాలిపై ఆధారపడి వున్నటైతే, ఆమెను గురించి అందరూ అనుకోవచ్చు. ఆమె మంచినైపుణ్యం గల సహాయకురాలనీ, ఆమె ఒక్కతికే సరైన పద్ధతిలో సహాయం అందించటం చేతనవును అనీను. కాని ఎవరూ కూడా ఒక వికలాంగురాలికి తాను ఒక్కతే సహాయకురాలిగా వుండలేరు. ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులు, యిరుగు పొరుగు వారు భోజనం వండటమో, తేవటమో, మార్కెట్టుకు వెళ్లటము, శుభ్రపరచటం, వచ్చి చూసూ వుండటం ద్వారానో సహాయం చేయగలరు. ఇలా చేస్తే మీకు విశ్రాంతి దొరుకుతుంది, మరియూ శకీ వసుంది.
కుటుంబపు దినచర్య కార్యక్రమాలలో ఆమె (వికలాంగురాలు) సహాయపడగల పద్ధతులను అన్వేషించండి. అపుడు ఆమె సహాయాన్ని తీసుకొనే బదులు, సహాయం చేయగలదు కూడా, మంచి ఫలితాలను ఆశించండి.
చాలా చక్కగా ఆ పనిని చేయగలది స్త్రీయేనన్న అభిప్రాయాన్ని కలిగి వుండండి. క్రొత్త విషయాలను ప్రయత్నించి, ఆమె నైపుణ్యాన్ని అభివృద్ధిపరచుకొనేలా ప్రోత్సహించండి.
సంరక్షకుల ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసే ఒక ముఖ్యమైన పద్ధతి ఏమిటంటే సంరక్షకులు కలిసి ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం. సంరక్షకులకూ, వికలాంగులకూ కూడా అవే అనుభవాలు గల యితర వ్యక్తుల సపోర్టు అవసరం. మీ అవసరాలు అనుభూతుల గురించి యితరులతో మాట్లాడటం మీ ఒంటరిగా వున్నానన్న ఆలోచన తగ్గటానికి సహాయపడుతుంది. ఇతర సంరక్షకులతో మీ అభిప్రాయాలను పంచుకోవటంవలన పనులను యింకా తేలికగా ఎలా చేయవచ్చో తెలుసుకోవటానికి వీలు అవుతుంది. వికలాంగుల కోసం వారి సంరక్షకుల కోసం సపోర్టు బృందాలను తయారు చేయటానికి కూడా వీలవుతుంది.
ఇంతకు ముందే ఒక బృందం లేకపోయినా, మీ కమ్యూనిటీలో యింకా కొందరు సంరక్షకులు వున్నా మీకిష్టమైతే ఒక బృందాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఒక వ్యక్తి యొక్క ఉద్దేశాల కారణంగానే కొన్ని చాలా బలమైన, అతి చురుకైన బృందాలు మొదలయ్యేయి. ఒక వ్యక్తి ఒంటరిగా సమస్యలను, పరిష్కరించే దానికన్నా ఎక్కువగా ఒక బృందం పరిష్కరించగలదు.
సహాయక బృందాన్ని ఏర్పాటు చేయాలని అనుకొంటున్న యిద్దరుగాని, అంతకన్నా ఎక్కువ మందిని గాని తెలుసుకోవాలి. వికలాంగులున్న కుటుంబాలు మీకు తెలియకపోయినటైతే ఆరోగ్య కార్యకర్తకు సమీపంలో గల కమ్యూనిటీలలో గల అటువంటి కుటుంబాలు తెలుస్తాయి.
ఎక్కడ ఎపుడు కలుసుకోవాలనే విషయమై ఒక ప్రణాళికను తయారు చేసుకోండి. ఇందువలన మాట్లాడటానికి అందరికీ సౌకర్యంగా వుండే ప్రదేశాన్ని ఎంచుకోవటం జరుగుతుంది. అది ఆరోగ్య కేంద్రంలోని గది కావచ్చు. కమ్యూనిటీ సెంటరో, కో-ఆపరేటివ్ సెంటరో, లేదా దేవాలయము కావచ్చు. మొట్టమొదటి మీటింగ్లో మీరెందుకు కలుసుకున్నారో, ఏమి చేయాలనుకొంటున్నారో చర్చించండి.
బహుశా మొదటి కొన్ని మీటింగులకు ఒక వ్యక్షే లీడర్గా వుండవచ్చు. కాని ఏ ఒక్కరూ కూడా బృందం తరపున తీర్మానాలు చేయకూడదన్నది చాలా ముఖ్యమైన విషయం. ప్రతి ఒక్కరికీ మాట్లాడటానికి అవకాశం వండాలి. చర్చలు మీటింగ్. యొక్క ముఖ్య కారణాలపై కేంద్రీకరించబడి జరగాలి. మొదటి కొన్ని మీటింగుల తర్వాత గ్రూప్ లీడర్లు మారుతూ వుండాలి. విభిన్న వ్యక్తులతో మీటింగ్స్ నడపబడుతూండటం వలన, సిగ్గుతో వెనక్కు వుండే సభ్యులు కూడా పాల్గొనే అవకాశం వుంటుంది.
ఇండియాలోని బెంగుళూరు పట్టణంలోని ఒక బీద కమ్యూనిటీలో అంగవిలులైన పిల్లలు, పెద్దలు గల అనేక కుటుంబాలు ఒక సహాయక బృందాన్ని స్థాపించే యి కమ్యూనిటీలో గల వికలాంగులకి అందించవలసిన సేవాకార్యక్రమాలు, మరియూ ఆ సేవలను యింకా వృద్ధి చేసే విషయమై ప్రణాళికలను తయారు చేయటం గురించీ మాట్లాడుకోవటం కోసం వారు వారానికి ఒక రోజు కలుస్తారు. వారికి ఆటో రిక్షాలున్నాయి. నడిపించుతారు కూడా. వాటిలో వికలాంగ బాలబాలికలను బడులకు తీసుకెళ్లి తీసుకువస్తారు.
నిత్యం యితరులకు సహాయం చేస్తూ చాలా బిజీగా వుండేటటువంటి వ్యక్తులు తమ స్వంత అనుభూతుల గురించి ఆలోచించుకునే టైము లేకుండా వుంటారు. అసలు తాము అసంతృప్తిగా వున్నట్లుగా అనుకోవటానికే తమకు హక్కులేదనీ, అలా అనుకోవలసిన వారు కేవలం అంగవికలులు మాత్రమే ననీ అనుకొంటారు. ఇద్దరు సంరక్షకులు ఒకరికొకరు బాగా తెలిసిన వారైనప్పటికీ, వారి భావనలనూ, అనుభవాలనూ, సమస్యలను గురించి ఆత్మీయంగా మాట్లాడుకోవటానికి కొంత సమయం పడుతుంది.
కొందరికి వేరే వారితో మాట్లాడడం కన్నా ఒక బృందంతో మాట్లాడటం సులభంగా వుంటుంది. కాని ఆలోచనలను, అనుభూతులనూ తెలియపరచటానికి మాట ఒకటే మార్గం కాదు - పాటలు పాడటం, పద్యాలు చేయటం, కథలు చెప్పటం వంటి వివిధ కార్యకలాపాలను ప్రయత్నించటం వలన కూడా ఒక వ్యక్తి మరొకరితో సౌకర్యవంతంగా వుండగలుగుతాడు. కొందరైతే చిత్రలేఖనం (డ్రాయింగు) మరియు రంగులు వేయటం పెయింటింగుల ద్వారా కూడా వారి భావ ప్రకటనను మంచిగా చేయగలరు.
బృందంలోని సభ్యులు ఒకరి యెడల మరొకరు నమ్మకంతో సౌకర్యవంతమైన అనుభూతితో వుండటం కోసం సహాయపడే కొన్ని సూచనలు యిక్కడ యివ్వబడ్డాయి.
ఇతరులు చెప్పేది వినండి. మీ మాటలను యితరులు వినాలని మీరెలా అనుకొంటారో ఆలోచించండి. ఆ తర్వాత యితరులు చెప్పేది మీరు వినటానికి అదే విధంగా ప్రయత్నించండి.
ఇతర వ్యక్తులతో వారు ఏమి చేయాలి అనే విషయం చెప్పకుండా వుండటానికి ప్రయత్నించండి. ఇతరులు తమ అనుభూతులను అర్థం చేసుకొనేలా సహాయపడండి. మీ అనుభవాలను వారితో పంచుకోండి. కాని వికలాంగులకు సహాయపడే విషయంలో ప్రతి ఒక్కరూ కూడా తమకు తోచిన అతి మంచి పద్ధతిని వారే నిర్ణయించుకుంటారు.
సంరక్షకుడు, తన భంగపాటు, విసుగుల కారణంగా తన కోపాన్ని అరుపులనూ ప్రదర్శించగల ప్రదేశమే సహాయక బృందమున్న ప్రదేశమూ.
మీ అనుభవాలను, ఉద్దేశాలను పంచుకోవటం ద్వారా, అటువంటి అనుభూతులను మీకు కలిగించుతున్న కారణాలను మార్చగల పద్ధతులను కనుగొని ఒకరికొకరు సహాయం చేసుకోగలుగుతారు.
ఒక బృందం కలిసి పనిచేసి అనేక సమస్యలను పరిష్కరించుకోగల చర్యను తీసుకోగలదు. చర్యను తీసుకోవటానికి వుపయోగపడే కొన్ని సూచనలు యిక్కడ యివ్వబడ్డాయి.
ఆరోగ్య కార్యకర్తలు - సంరక్షకులకు సహాయం చేయగలరు. మీరు ఒక వికలాంగురాలికి చికిత్స చేసేటపుడు, ఆమె సంరక్షకురాలికీ, ఆమెకూ గల సంబంధం గురించి చర్చించి తెలుసుకోండి. ఆమె సంరక్షకురాలు కూడా ఆమెతో కలిసి వస్తే వారి సంబంధ బాంధవ్యాల గురించి యిద్దరినీ అడిగి తెలుసుకోండి. మరియు వారు ఒకరి నుంచి మరొకరు ఏమి ఆశిస్తున్నారో కూడా తెలుసుకోండి.
సంరక్షకురాలు తన స్వంత అభిప్రాయాలను వెల్లడించేలా ప్రోత్సహించండి. ఆమెను మాట్లాడనిచ్చి మీరు వినండి. ఆమె విసుగూ, కోపం, అశాంతి చెందినందుకు ఆమెను నిందించకూడదు. వేరొక వ్యక్తికి సహాయం చేస్తూనే వుండటం చాలా కష్టమైనపని. ఒక్కొక్క సమయంలో విచారంగా కోపంగా, చికాకుగా వుండటం సహజమే నన్న విషయాన్ని సంరక్షకురాలికి తెలపండి. ఆమె స్వంత అవసరాల గురించి సంరక్షకురాలిని అడగండి. తన గురించిన శ్రద్దతాను తీసుకుంటూనే ఆ వ్యక్తికి కూడా సంరక్షణచేసేలా ఆమెను ప్రోత్సాహపరచండి.
సంరక్షకురాలికి కొంత విశ్రాంతి నివ్వగలిగే వారి ఎవరికోసమైనా ప్రయత్నించండి - ప్రతి ఒక్కరికీ తమకు కోసం కొంత సమయం అవసరం. సంరక్షకురాలికి కొంచెంసేపు సహాయం చేయగల వారి కుటుంబంలోనే వున్న వేరొక వ్యక్తిగాని లేదా కమ్యూనిటీలోని ఎవరినైనాగాని మీరు వెతికి పెట్టటానికి ప్రయత్నించండి. అవసరమైతే మీ కమ్యూనిటీలోని సంరక్షకులకు అవసరమైన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు, కౌన్సెలింగ్ నైపుణ్యాలను బోధించి, యింకా శ్రేష్టమైన సహాయాన్ని వారు సహాయపడుతున్న వికలాంగురాలికి అందించేలా చేయండి.
ఒక వ్యక్తి తాను విసుగు చికాకులు చెందటానికీ, తాను సహాయం చేస్తున్న వ్యక్తిని బాధపెట్టటానికీ మధ్య తేడా వుంది. ఒక్కొక్కసారి సంరక్షకులు చాలా ఒత్తిడి, విసుగు, కోపాలకు గురి అవుతూ వుంటారు. ఆ పరిస్థితిలో వారు తాము సంరక్షణనిస్తూ వున్న వారికి చాలా ప్రమాదకారకు లవుతారు. ఒక వికలాంగ స్త్రీని గాని వేరే ఏ ఫ్రీనైనా గాని పరీక్షించేటపుడు ఆమె వేధింపులకు గురైనట్లుగా కన్పించే లక్షణాల కోసం ఎల్లపుడూ జాగ్రత్తగా చూడండి. ఆమెతో ఒంటరిగా మాట్లాడి, ఆమె సంరక్షకుల నుంచి ఏ విధమైన వేధింపులకైనా గురి అవుతున్నదేమో తెలుసుకోవాలి.
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020