Accessibility options
Accessibility options
భారత ప్రభుత్వం
అధ్యాయాల జాబితా
30.
ఏమి చేయాలి34.
ఏమి చేయాలి36.
ఏమి చేయాలి38.
ఏమి చేయాలి41.
ఏమి చేయాలి42.
నడుము నొప్పి43.
ఏమి చెయ్యాలి45.
ఏమి చేయాలి47.
ఏమి చేయాలి?52.
ఏమి చేయాలి?56.
ఏమి చేయాలి?58.
ఏమి చేయాలి?భాగస్వామ్యం అందించినవారు : Molugu Sukesh01/07/2022
పెద్ద పెద్ద సారాంశాలను చదవాల్సిన అవసరం లేదు. వికాస్ AI సహాయంతో సంక్షిప్త సారాంశం కోసం 'కంటెంట్‌ను సంగ్రహించు' పై క్లిక్ చేయండి.
గర్భధారణ పొందటం అన్నది ఒక స్వంత నిర్ణయం. ప్రతి స్త్రీ కూడ తను ఎపుడు తల్లి కావాలి అని నిర్ణయించుకొనే హక్కు ప్రతి స్త్రీకి వుండాలి. కాని ప్రపంచవ్యాప్తంగా, చాలా మంది స్త్రీలు సంతానం విషయంలో, పిల్లలను (వీలైనంత ఎక్కువ మందిని) కనమని వారి భాగస్వాములు, కుటుంబాలు, కమ్యూనిటీల నుంచి ఒత్తిడికి గురవ్వటం జరుగుతుంది.
అదే వికలాంగ స్త్రీల విషయంలో పూర్తి ప్రతికూలంగా వుంటుంది. సంతానం గురించి, వారిని గర్భం రాకుండా చూసుకోమని ప్రోత్సహిస్తారు. చాలా మంది వైకల్యంగల స్త్రీలకు వారి ఇష్టానికి వ్యతిరేకంగా స్టెరిలైజేషన్ ఆపరేషన్ చేయించటం జరుగుతుంది. వారికి ఇంకెప్పటికీ పిల్లలు పుట్టకుండా వుంటారు అలా అయితే. ఇక వారిలో ఎవరైనా గర్భవతులైనటైతే! వారిని గర్భస్రావం చేయించుకోమని వారిపై ఒత్తిడి తెస్తున్నారు. అది గర్భస్రావం చట్టబద్ధం కాని ప్రాంతమైనా సరే.
ఒక అంగవైకల్యం గల స్త్రీలు మంచి తల్లలు కాలేరనీ, వారికి పట్టే శిశువులు కూడా అంగ వికలులై వుంటారనీ తప్పడు అభిప్రాయంతో వుంటూరు కొందరు.
అంగవైకల్యం గల చాలా మంది స్త్రీలు సురక్షితమైన గర్భం కలిగి వుండరని, ఆరోగ్యకరమైన శిశువుకు జన్మనివ్వలేరని, మంచి తల్లిగా వుండలేరని నిష్మారణంగా భావించకూడదు. (అధ్యాయం -12 చూడండి). ఏమైనప్పటికీ కొందరు వికలాంగులైన స్త్రీలు గర్భిణిగా వున్నపుడు తప్పని సరిగా తీసుకోవలసిన ముందు జాగ్రత్తలుంటాయి. కొందరు స్త్రీలు మిగతా వారి కంటే ఎక్కువ సాయం అవసరం అయిన స్థితిలో వుంటారు.
ఈ అధ్యాయంలో గర్భిణి సమయంలో ఏర్పడే మార్పులు, అవి మీ అంగవైకల్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో, సురక్షితమైన గర్భధారణకు, ప్రసవానికి ఎలా ఏర్పాట్ల చేసుకోవాలో వీటికి సంబంధించిన సమాచారం లభిస్తుంది.
నేను చిన్నదానిగా వున్నపుడు, నా స్నేహితురాళ్ళు సంతాన (బిడ్డలు) కలగటం గురించి మాట్లాడుకుంటూ వుండేవారు. వాళ్ళంతా నా వైకల్యం కారణంగా నాకు గర్భం ధరించే అవకాశం లేదని చెబుతూ వుండేవారు. ఒక వేళ ఏదైనా అద్భుతం జరిగి నేను గర్భవతిని అయినా గాని, నా బిడ్డను ఆపరేషన్ (సిజేరియన్) చేసి బయటకు తియ్యాలనీ, ఆ బిడ్డ కూడా అవిటి (వైకల్యం) తనంతోనే పుట్టటం జరుగుతుందని చెప్పేవారు. నేను కూడా వాళ్ళలాగే ఒక యువతిని అని అనుకొనేదాన్ని అపుడు వాళ్ళ మాటలు నాకు బాగా అర్థం అయ్యేవి కావు. నేను వాళ్ళలా సాఫీగా కాకుండా వేరే రకంగా నడిచేదాన్ని కనుక వైకల్యంతో, వాళ్ళ మాటలను నమ్మానుకూడ. అది నిర్ధారించుకోవటం నేను ఏ డాక్టరు పరీక్షలు చేయించుకోనూ లేదు. నాకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. అందువల్ల నాకు చాలా బాధగా వుండేది. నా స్నేహితులెవరికైనా బిడ్డ పుట్టిన ప్రతిసారి కూడా, ఆ బిడ్డ నాదైతే బాగుండునని కోరుకొనేదాన్ని.
ఆ భయాన్ని అంతటిని పక్కన పెట్టి 1987వ సంవత్సరంలో, ఒక గాఢమైన కోరిక్త పుట్టింది నాలో, నేను తల్లిని కాగలనేమో చూద్దాం అని. నాకు ఒక మగ స్నేహితుడున్నాడు. బాగుంది, ప్రయత్నించుదాం అనుకొన్నాను. ఎందుకు ప్రయత్నించకూడదు? అంతే అనుకొన్నది జరిగింది. డిశంబరు 27, 1987వ సంవత్సరంలో నేను గర్భవతినయ్యాను.
నేను గర్భవతినయ్యాను అని తెలియగానే అందలం ఎక్కినంత ఆనందపడిపోయాను. కాని అదే సమయంలో చాలా విచారం కూడా కలిగింది. ఎందుకంటే నేను పోలియోవల్ల, ఇలా మిగిలినదాన్ని నేను ఒక గైనకాలజిస్ట్ను కలిశాను. నా గర్భం గురించి నిర్ధారించుకోవటానికి. ఇంకా నా వైకల్యం కారణంగా నేను గర్భిణీగా వున్న సమయంలోను, ప్రసవ సమయంలోన వస్తాయి అన్నది నిజమా అని తెలుసుకోవటానికి.
నేను గర్భవతిని అని వినగానే డాక్టరు షాక్కు గురయ్యాడు. నేను నడిచే పద్ధతిని చూసి, నన్ను పరీక్ష చేయకుండానే చెప్పాడతడు, నా గర్భం సమయం పూర్తి అవ్వకుండానే గర్భం పోతుందని. మొదటి 3 నెలలలోనే పోతుందని చెప్పాడు. అతడు అందుకోసం 3 నెలలు ఎదురు చూడకుండా వెంటనే గర్భస్రావం చేయించుకోమని సలహా ఇచ్చాడు. అందుకు నేను ఒప్పకొని ఫిబ్రవరి 27, 1988కి అప్పాయింట్ మెంటు తీసుకున్నాను. అది చాలా ఖర్చుటో కూడుకున్నదైనా సరే, ఎలాగో డబ్బులు పోగు చేసుకొన్నాను అందుకోసం.
నేను గర్భవతినని గాని, నాకెంత విచారంగా, భయంగా వుందోనని గాని ఎవ్వరికీ చెప్పలేదు. కెన్యాలో గర్భస్రావం చట్ట విరుద్ధం కావటం వల్ల, ఎవరికీ తెలియటం నాకిష్టం లేకపోయింది. వింటే నా స్నేహితులు కూడా ఎలా ప్రతిస్పందిస్తారో నాకు తెలియదు. అందువల్ల ఆ సంగతంతా రహస్యంగా వుంచేశాను. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా, విచారంగా, భయం భయంగా గడిపేను. ప్రథమంగా నా జీవితంలో నాకంటూ ఒక బిడ్డ వుండదన్న ఆలోచన చాలా బాధను కలిగించేది. రెండవది, గర్భస్రావం అన్నది చాలా ప్రమాదం అని తెలియటం వల్ల కలిగిన భయం. నాకు ఎందరో యువతులు అరక్షిత గర్భస్రావం వల్ల ప్రాణాలు కోల్పోవటం తెలుసు. మూడవది, నేను ఒక క్రిష్టియన్ని, నాకు గర్భస్రావం చేసుకోవటం పాపం అని తెలుసు. ఇక ఆఖరుగా, నాకు పెళ్ళి ප්රిභේරීක, పెళ్ళికాని గర్భవతులను సమాజం ఎంత నిరాదరిస్తుందో తెలియటం. అందువల్ల చాల సమస్యగా, కష్టంగా అనిపించేది. మీరు వూహించగలరు నా బాధ గురించి.
ఏం చేస్తాం, జీవితం ముందుకు నడవాలి కదా. నేను ధైర్యం కూడగట్టుకొని గర్భస్రావానికి సిద్ధపడ్డాను. ఆ రోజు రానే వచ్చింది. నేను ఆసుపత్రికి వెళ్ళి, డాక్టరు పిలుస్తాడని ఎదురు చూస్తూ అతడి ఆఫీసు బయట కూర్చున్నాను. జీవితంలో ఆ క్షణం ఎంత గుబులుగా గడిచిందో చెప్పలేను. ధైర్యం ఎగిరిపోయింది. నాకు ఏమి జరుగబోతోంది అన్న బాధ ప్రారంభమైంది నాలో, నేను తప్పకుండా చనిపోతానని రూఢి చేసుకున్నాను. నన్ను క్షమించమని, ధైర్యాన్ని ఇమ్మని ప్రార్థించసాగాను. హఠాత్తుగా డాక్టరు ఎలాగైనా 3 నెలలకు నా గర్భిణీ పోతుందని చెప్పటం గుర్తు వచ్చింది. ఆ ఆలోచనతో నాలో ఒక ఉద్వేగం. అపుడు తోచింది, నేను ఇక అనవసరంగా గర్భస్రావం కోసం శ్రమ పడనక్కర్లేదని.
అది క్షేమం, చవక అనిపించింది. పైగా గర్భస్రావం చేయించుకోవటానికి, దానంతట అదే అవ్వటం, రెండింటి మధ్య చాలతేడా వుంది. ఆ అవమానం భరించనక్కర్లేదిక. అందువల్ల నేను తిరిగి ఇంటికి వెళ్లిపోయి, శిశువు బయటకు వస్తుందేమోనని ఎదురుచూసూ గడపసాగాను. నాకైతే నేను తీసుకొన్నది సరైననిర్ణయం అవునో కాదో కూడా తెలియదు.
నా గర్భిణీ సమయంలో మొదటి 4 నెలలు చాలా గోరంగా గడిచాయి. నేను చాలా బరువు తగ్గిపోయాను. ఆకలి లేదు. ఎపుడూ కూడా వాంతులతో బాధ పడేదాన్ని అన్నటిని మించి నాకేదో పెద్ద చెడు జరుగబోతోందన్న భయంతో క్షణ క్షణం నరకం అనిపించేది. మొదటిసారి కడుపులో బిడ్డ కదలగానే భయపడిపోయాను. అయితే బిడ్డ బయటకు వచ్చేసే సమయం వచ్చేసిందనుకున్నాను.
కొంత కాలం వరకు, వైద్య పరీక్ష చాలా అవసరం అని తెలిసి వుండీ వెళ్ళటానికి భయపడ్డాను. ఒక వెళ్ళాలని నిర్ణయించుకుని, దగ్గరగా వున్న ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి డాక్టరును కలిశాను. అతడు పరీక్ష చేసి చూసి నా గర్భం చాలా బాగున్నదనీ, పూర్తి అయ్యే వరకు మోస్తావనీ, బిడ్డకు సహజంగానే జన్మనిస్తావని చెప్పాడు. తన ఆసుపత్రిలోనే ప్రసవం చేసుకోమని సలహా ఇచ్చాడు.
ఇక నాకు భయం స్థానంలో ఆత్మ విశ్వాసం చోటు చేసుకొంది. ప్రసవానికి ముందు జాగ్రత్తలు చూసే హాస్పిటల్లో తరచు పరీక్షల కోసం వెళ్ళేదాన్ని ఆసుపత్రి సిబ్బంది, అంతా సవ్యంగా జరుగుతుందని ధైర్యాన్నిచ్చేవారు. వారు నాకు గర్భం గురించి, ప్రసవం గురించీ, పుట్టిన బిడ్డ సంరక్షణ గురించీ సమాచారం గల పుస్తకాలను నాకిచ్చేవారు చదవమని. వాటి వల్ల నాకు మంచి సమాచారం లభించింది. గర్భాన్ని మోయటానికి నాకు తగినంత శక్తినిచ్చాయి కూడా. నా కోరికల్లా నాకో బిడ్డ కావాలనీ, ఆ బిడ్డను చూసుకోవాలనీ, ఒక వేళ బిడ్డ వికలాంగుడేమో చూసుకోవాలనీ, అన్నింటినీ మించి నా స్నేహితురాండ్రందరిలాగే నేను 'అమ్మ అనిపించుకోవాలనీ.
అందరూ ఆశ్చర్యపోయే విధంగా, నేను 9 నెలలు పూర్తిగా మోసి వైకల్యం లేని ఒక అందమైన ఆడ శిశువుకు, సహజంగానే జన్మనిచ్చాను. 36 గంటల నొప్పల అనంతరం. నా బిడ్డకు ఇపుడు 18 సంవత్సరాలు. చాలా ఆరోగ్యమైన పిల్ల, సెకండరీ పాఠశాలలో నాలుగవ ఫారమ్ చదువుతుంది.
ప్రతి స్త్రీకి కూడ ఎందరు పిల్లలు కావాలో, ఎపుడు కావాలో నిర్ణయించుకొని ఒక ప్రణాళిక తయారు చేసుకోవటం అవసరం. ఒక స్త్రీకి, ఆమె వయసు, ఆరోగ్య స్థితి, ఆంతరంగిక జీవన పరిస్థితులు తల్లి కావాలనుకొనే ఆమె నిర్ణయంపై ప్రభావం చూపుతాయి.
గర్భవతి కావటానికి ముందు ఈ ప్రశ్నల గురించి ఆలోచించటం సహాయకరంగా వుండవచ్చు.
చాలా వైకల్యాలు బిడ్డకు తల్లి నుండి సంక్రమించవు - (వంశపారంపర్యంగా వచ్చేవి మరియు కుటుంబం నుంచి వచ్చేవి). కాని తల్లి వల్ల కొన్ని సందర్భాలలో, తండ్రి వల్ల కొన్ని సందర్భాలలో, లేదా ఇద్దరి వల్ల సంక్రమించేవి కొన్ని వుంటాయి. కుటుంబాలలో వ్యాప్తి చెందే కొన్ని వైకల్యంతో గురించిన మరింత సమాచారం కోసం. మీ బిడ్డకు వీటిలో ఏదైనా ఒక వైకల్యంతో పుట్టగలదని మీరనుకున్నటైతే ప్రసవం ఆసుపత్రిలో చేసుకుంటే మంచిది. ఏ సమస్యలు ఎదురైనా ముందు జాగ్రత్తలు తీసుకోవటానికి అనువుగా వుంటుంది.
శిశువు యొక్క లింగాన్ని నిర్ధారించేది పురుషుడి వీర్యకణం. అందువల్లే శిశువు అమ్మాయా? అబ్బయా? అన్నది నిర్ణయింపబడేది పురుషుడి వీర్యకణంలోని సగభాగం. మగశిశువును, మిగతా సగం ఆడశిశువును తయారు చేస్తాయి. స్త్రీ యొక్క అండంతో ఒక్క వీర్యకణం (స్పెర్మ్) మాత్రం కలుస్తుంది. అది మగ కణం అయితే అబ్బాయి, ఆడకణం అయితే అమ్మాయి అవుతుంది. ఫ్రీకి వైకల్యం వున్నా లేకున్నా ఈ విషయంలో మాత్రం తేడా వుండదు. ఇద్దరికీ ఒకే విధమైనదిగా వుంటుంది గర్భధారణ.
మగ బిడ్డలు కావాలని కోరుకొనే కమ్యూనిటీలలో, స్త్రీలను మగ పిల్లలు లేరని నిందిస్తూ వుంటారు. మగ పిల్లలతో సమంగా విలువ నివ్వవలసిన ఆడ పిల్లలకు అవమానం ఇది. స్త్రీలను నిందించటం కూడా సరికాదు, ఎందుకంటే పురుషుడి వల్లే బిడ్డ సెక్స్ ఏర్పడేది.
ప్రపంచవ్యాప్తంగా చాలా మంది స్త్రీలు, మంత్రసాని సాయంతో ప్రసవం చేసుకుంటారు. మంత్రసాని అనుభవం వున్నదైతే ఈ ప్రసవాలు సురక్షితంగా జరుగవచ్చు. తల్లికీ, బిడ్డకు ఆరోగ్య దాయకం కావచ్చు. వికలాంగులైన స్త్రీలకు, గర్భిణీ సమయంలో సంరక్షణ, ప్రసవం, ఇవి సాధారణంగా ఒక మంత్రసాని చేసినా సురక్షితంగాను, ఆరోగ్యంగాను జరుగుతాయి.
కాని ఒక్కోసారి మంత్రసాని సమర్థవంతంగా చూసినా, తల్లి బిడ్డకు ఆసుపత్రి రక్షణ అవసరం.
తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవలసివచ్చే అంగవైకల్యం గల స్త్రీలకు, కేవలం ఆసుపత్రులలోనే లభించే వైద్య సహాయం అవసరం. ఉదాహరణకు, ఒక వేళ మీరు:
మీరు, మీ బిడ్డ ఆరోగ్యంగా వుండాలి అని అనుకుంటే, క్రమబద్ధంగా తినాలి. రకరకాల ఆరోగ్యమైన ఆహారాలను, ముఖ్యంగా బిడ్డకు జన్మతః వచ్చే లోపాలుంటే వాటి నుంచి కోలుకోవటానికి సహాయపడే ఆహారాలను తీసుకోండి. మంచి ఆహారం తీసుకోవటం, పొగత్రాగటం మానుకోవటం, మద్యపానం, మాదక ద్రవ్యాలు మొదలైన వాటికి దూరంగా వుండటం చాలా ముఖ్యం ఎందుకంటే చాలా ఆరోగ్య సమస్యలు గర్భిణీ తొలి దశలోనే, అంటే మీకు గర్భం అని కూడా తెలియక ముందు సమస్యలు రావచ్చు.
అంగవైకల్యం గల స్త్రీలకు తమకు అవసరమైన వైద్య చికిత్స పొందటం కష్టం అయినప్పటికీ, ప్రతి గర్భవతి అయిన ఫ్రీ ప్రసవం గురించి ఒక పథకం ప్రకారం సిద్ధపడి వుండాలి. మీరు గర్భవతిగా అనుకొన్నప్పట్నుంచీ, గర్భంతో వున్నప్పడు చేసే పరీక్షలు (ప్రినాటల్) చేయించుకోవటం ప్రారంభించాలి. మీ మొదటి పరీక్ష కోసం, ఒక మంత్రసాని గాని, డాక్టర్ని గాని, మీకు నమ్మకంగల ఆరోగ్య కార్యకర్తను కలవండి. మీతో మీ స్నేహితులనెవర్నైనా గాని, మీ కుటుంబ సభ్యులలో ఒకరిని గాని తీసుకొని సాయంగా వెళ్ళాలి. మీరిద్దరూ కలిసి, ఏ సమస్యలు రావటానికి అవకాశం వుందో, అందుకోసం ఏం తీసుకోవాలో, అందుకోసం మంచి సలహా ఎక్కడ పొందాలో మాట్లాడి తెలుసుకోవచ్చు. ఆ సమాచారం మీకు ప్రసవం గురించి సిద్ధపడటానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు:
మీరు గర్భిణీగా వున్నప్పడు మీ గురించి మంచి జాగ్రత్త తీసుకోగలిగినటైతే, మీరు సురక్షితమైన గర్భం, ప్రసవం, మరియు ఆరోగ్యమైన శిశువును ఆశించవచ్చు. ఇలా ప్రయత్నించండి:
మీరు గర్భవతిగా వున్నా పాలిస్తున్నా మీరు మామూలు కన్నా ఎక్కువగా తినాలి. మీరు అదనంగా తీసుకొనే ఆహారం మీకు అధిక శక్తిని మరియు బలాన్ని చేకూర్చి, మీ శిశువు పెరుగుదలకు తోడ్పడుతుంది. సాధ్యమైనంత అధికంగా వివిధ రకాల ఆహారం, ప్రధాన ఆహారం (పిండి పదార్థాలు), పోషక పదార్ధాలు, విటమిన్లు మినరల్స్ మరియు క్రొవ్వు పదార్ధాలు, నూనెలు, పంచదారమొదలైనవాటిని అధికమైన ద్రవ పదార్థాలతో తీసుకోవాలి.
ఇనుము అధికంగా గల ఆహారం తీసుకోవటం చాలా ముఖ్యమైన విషయం. అందువల్ల మీ రక్తం శక్తివంతంగా తయారవుతుంది. ఒక ఫ్రీకి గర్భిణిగా వుండగా రక్తహీనత కలిగి, ఆమెకు అధికంగా రక్తస్రావం ప్రసవ సమయంలో అవుతున్నటైతే, ఆమె తీవ్రమైన అస్వస్థతకు గురవ్వటమే కాకుండా చనిపోవచ్చుకూడా.
తగినంత ఫోలిక్ ఏసిడ్ లభించకపోతే రక్త హీనత కలిగి, పుట్టకతోనే శిశువుకు వెన్నుముక మీద, మెదడులోను కణితిలు ఏర్పడడం వంటి తీవ్రమైన లోపాలు పుట్టకలోనే ఏర్పడతాయి. ఈ సమస్యల నుండి నివారణ పొందాలంటే, మీరు గర్భం ధరించకముందు, గర్భిణీగా వున్న సమయంలో కూడా మొదటి కొన్ని నెలలూ తగినంత ఫోలిక్ ఏసిడ్ ను తీసుకోవటం చాలా అవసరం.
ఈ ఆహార పదార్ధాలలో ఫోలిక్ ఏసిడ్ అధికంగా వుంటుంది:
కొందరు స్త్రీలు ఫోలిక్ యాసిడ్ మాత్రలను కూడా ఉపయోగిస్తారు.
0.5 నుంచి 0.8 మి.గ్రా. (500 నుంచి 800 మైక్రోగ్రాల్లి) ఫోలిక్ ఏసిడ్ ను నోటిద్వారా రోజుకు ఒక మారు తీసుకోవాలి. స్పైనా బిఫిడావున్న స్త్రీలు నోటిద్వారా 300 ఫాలిక్ ఏసిడ్ ను రోజుకు ఒకసారి తీసుకోవాలి.
కొందరు స్త్రీలు తాము గర్భంతో వున్నప్పుడు సెక్స్లో పాల్గొనటానికి అంతగా ఇష్టపడరు. కొందరు సాధారణం కన్నా ఎక్కువే కావాలనుకుంటారు. ఈ రెండు విషయాలు కూడా సహజమైనవే. సెక్స్లో పాల్గొన్నా పాల్గొనకున్నా అది ఆమెకు, ఆమె శిశువుకు కూడా ఫర్వాలేదు. సెక్స్వల్ల శిశువుకు హాని కలుగదు.
కొన్ని సందర్భాలలో గర్భిణి సమయంలో సెక్సు అసౌకర్యంగా వుంటుంది. మీరు, మీ భాగస్వామి వివిధ భంగిమలను, ప్రయత్నించవచ్చు. మీరు పైన వుండిగాని, నిలబడిగాని, కూర్చొనిగాని లేక ఒక ప్రక్కకు పడుకొని గాని ప్రయత్నించవచ్చు. మీ అంగ వైకల్యం అధిగమించి మీకు సుఖంగా అనిపించే భంగిమ దొరికేవరకు ప్రయత్నించవచ్చు.
కాని జంటలు సన్నిహితంగా వుండి సెక్స్యే కాకుండా వేరే విధంగా కూడా ఒకరినొకరు సంతోష పెట్టుకోవచ్చు. కొందరు పరస్పరం ఒకరి శరీరాన్నొకరు స్పర్శించి, మసాయ్ చేసుకుంటారు. కొందరైతే తమ కలల గురించి, భవిష్యత్ గురించి మాట్లాడుకుంటారు.
మీరు గర్భవతిగా వున్నప్పుడు సెక్స్లో పాల్గొంటే ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవటం అన్నది చాలా ముఖ్యం. అందువల్ల మీ శరీరంలో ప్రవేశించే ఏవైనా సరే పరిశుభ్రంగా వుండేలా చూసుకోవాలి. వానిలో అంగం, చేతివ్రేళ్ళూ కూడ. ఒక పురుషుడు తన గర్భవతి అయిన భాగస్వామితో సహా, ఒకరికంటె ఎక్కువ మంది స్త్రీలతో సెక్స్ లో పాల్గొంటున్నటైతే, అతడు ఎల్లప్పడూ కండోమ్ లు వాడాలి. కండోమ్ లు ఇన్ఫెక్షన్లను (వ్యాధులను) నిరోధించటానికి ఒక మంచి మార్గం.
మీకు ఇంతకు ముందే బిడ్డ వుండి వుంటే, మీరు ముందుగానే పురిటి నొప్పలు పడి వుంటే (తారీఖు కన్నా ముందే), మీకు యోనిద్వారా సెక్స్ లో ఆరు నెలలు నిండిన తర్వాత నుంచి పాల్గొనకుండా వుంటే మంచిది: అందువలన మీరు తొందరగా పురిటి నొప్పలు పడకుండా వుండవచ్చు క్షేమంగా.
సాధారణంగా గర్భం 9 నెలలు వుంటుంది. ఈ సమయాన్ని 3 భాగాలుగా విభాజించితే, ఒక్కోభాగం 3 నెలలుగా వుంటుంది. 3 నెలలు గల ఈ ప్రతిభాగం (సమయం) లోను స్త్రీ శరీరంలో ఎన్నో మార్పులు చెందుతుంది.
మీరు మొదట గర్భవతి కాగానే, శిశువు పెరగటం మొదలు పెడుతుంది. మీ రొమ్ములు పరిమాణంలో పెరిగి మృదువుగా తయారవుతాయి. మీరు మామూలు కన్నా ఎక్కువగా అలిసిపోయినట్లనిపిస్తుంది. వికారంగా అనిపించి, వాంతులు కూడా అవుతాయి. కొన్ని ప్రాంతాలలో దీన్ని వేవిళ్ళ (మార్నింగ్ పిక్నెస్) అంటారు.
చాలా మంది స్త్రీలు, అలసట తగ్గి, వికారం ఆగడం వల్ల 4వ, 5వ, 6వ నెలల గర్భాన్ని ఆనందంగా గడుపుతారు. బలంగా కూడా అనిపిస్తుంది. ఈ సమయంలోనే ఫ్రీ యొక్క గర్భం పైకి పెరగటం, కడుపులో బిడ్డ కదలటం ప్రారంభించటం జరుగుతుంది. మీరు గర్భస్థ శిశువు యొక్క గుండె చప్పడు కూడా వినవచ్చు.
ఈ సమయం మీ గర్భిణీ కాలంలో చాలా ఉద్వేగ భరితంగా అనిపిస్తుంది. మీరు ప్రతిరోజూ గర్భంలోని శిశువు కదలికల అనుభూతిని పొందుతారు. మీ గర్భం అంతకంతకు పెరగటం వలన, మీ వైకల్యం కారణంగా ఎదురయ్యే సమస్యలను, కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. మీరు మొదటి 6 నెలల కాలంలో కష్టాలు పడివున్నటైతే, అవి ఇంకా పెరిగి, బాధ కలిగించవచ్చు.
ఆఖరు నెలలో అంటే సుమారుగా ప్రసవానికి రెండు వారాల ముందు, శిశువు ఎల్లప్పడూ గర్భంలో క్రిందకు దిగుతూ వుంటుంది. ముఖ్యంగా మొదటి శిశువైనట్లైతే, మీకు వూపిరి తీసుకోవటం సులభంగా అనిపించవచ్చు.
గర్భవతిగా వున్నప్పడు చాలా మంది స్త్రీలు కడుపులో బిడ్డ కదలికల అనుభూతినే గర్భం సమయంలో ఒక ఉద్వేగ భరితమైన అంశంగా భావించుకొంటారు. తమ వైకల్యాన్ని మరచి, ముందు తెలియక గుర్తించలేకున్నా తర్వాత ఆ కదలికలని గుర్తించ గలుగుతారు. చాలా మంది స్త్రీలు దానిని ఒక టప టప మనే కదలికగానే అనుకుంటారు. మిగతా వారు ఆ కదలికలను గాప్ నొప్పలుగా అనుకుంటారు. కొందరు పొట్టలోపల ఒక ఒత్తిడిగా భావించి, చేతులతో తాకి ఆ అనుభూతిని పొందుతారు. కడుపులో బిడ్డ 4వ నెలలో కదలటం మొదలు పెట్టగానే, అది చాలా మృదువుగా వుండి ప్రతి రోజూ గుర్తించలేక పోవచ్చు మీరు. 5వ నెల నుంచి ప్రతి రోజూ ఆ అనుభూతి కలుగుతుంది. (రోజంతా కాదు గాని మధ్య మధ్య విశ్రాంతితో కదలికలుంటాయి). ఒక వేళ శిశువు కొన్ని గంటల తరబడి కదలిక లేకుండా వున్నటైతే, ఏదైనా తిని లేక త్రాగి, ఒక చోట ప్రశాంతంగా ఒక రెండు నిముషాల పాటు పడుకొని వుండండి. ఆ సమయంలో మీరు కనీసం ఆ బిడ్డ 3 సార్లు కదలటం గమనిస్తారు. అపుడు కూడా మీరు ఏ కదలిక గుర్తించలేనటైతే, ఒక మంత్రసానితోగాని, ఆరోగ్య కార్యకర్తతో గాని కలిసి మాట్లాడండి.
ఇది 5 నెలల గర్భం సమయంలో చేయవచ్చు. గర్భం పెరిగే కొలదీ శిశువు గుండె శబ్దం వినటం సులభం అవుతుంది. శిశువు గుండె శబ్దం వేగంగాను, నిశ్శబ్దంగాను వుంటుంది. సాధారణ వినికిడి శక్తికన్నా ఎక్కువ వున్న వారికి కూడా వినటం కష్టమే అవుతుంది. అర్యోగ్య కార్యకర్తగాని, ప్రసవ సహాయకులు గాని ఫీటా స్కోప్ సహాయంతో శిశువు గుండె కొట్టుకొనే శబ్బాన్ని వినగలుగుతారు. స్టెతస్కోపు సహాయం లేకుండా తల్లే బిడ్డ గుండె చప్పడు వినలేదు. (రక్తపోటు చూడటానికి ఉపయోగించే లాంటిది)
అంగవైకల్యం గల స్త్రీలకు గర్భస్రావం అయ్యే అవకాశాలు, అంగవైకల్యం లేని స్త్రీలకున్నట్లే వుంటాయి. గాని ఎక్కువ ఏం వుండవు. బిడ్డ కావాలనుకొనే వారికి ఎవరికైనా గర్భస్రావం కావటం బాధగానే అనిపిస్తుంది. అందులోనూ ముఖ్యంగా వైకల్యం గల స్త్రీలకు ఇంకా బాధాకరం. ఎందుకంటే చాలా మందికి, వైకల్యం గల ఫ్రీలు గర్భధారణకే అనరులన్న అభిప్రాయం వుండనే వుంది. ఒక వేళ ఆమె గర్భవతి అయినా అది వారికి అంగీకారంగా వుండదు. అటువంటి పరిస్థితులలో గర్భస్రావం జరిగినటైతే, అది కేవలం ఆమె వైకల్యం కారణంగానే జరిగిందని అందరూ అంటారు. ఆ ఆలోచన కూడా వారికి బాధాకరమే.
సాధారణంగా గర్భస్రావాలు, గర్భం మొదటి 3 నెలలలోను జరుగుతాయి. గర్భస్రావం అన్నది అనేక కారణాల వల్ల జరుగవచ్చు. ఉదాహరణకు:
మీకు గర్భస్రావం అయినటైతే కొంత కాలం అంటే కొన్ని రోజులు మీ గురించి మీరు జాగ్రత్త తీసుకోండి. అందువలన మీరు ఇన్ఫెక్షన్ సోకకుండా కాపాడబడటమే కాకుండా త్వరగా నయమైపోయే అవకాశం వుంటుంది.
ఇలా ప్రయత్నించండి
తొలిదశలోనైనా, అటు తర్వాతనైనా గర్భంతో వున్న సమయంలో గర్భస్రావం అయినటైతే మానసికమైన విచారం అధికంగా వుంటుంది. మీ చుటూ వున్న మనుషులు మీ శరీర బాధలు తగ్గిపోతే మీరు మళ్ళీ ఎప్పటిలా బాగుంటారనుకుంటారు. మీరెంత బాధను మానసికంగా పడుతున్నారో వాళ్ళకి తెలియదు.
మీరు బాధపడటానికి, దుఃఖించటానికి సమయం వుంచుకోండి. మిమ్మల్ని మీ భావాలను అర్థం చేసుకొనే స్నేహితులతో కలిసి సమయం గడపండి. హాయిగా వుండాలని మిమ్మల్ని మీరు బలవంత పెట్టుకోకండి. కొందరు వ్యక్తులు మిమ్మల్ని వెంటనే గర్భవతి కావటానికి ప్రయత్నించమని సలహా ఇస్తారు. మరొక గర్భం కోసం సంసిద్ధంగా వున్న ఆలోచనకు కొంత సమయం ఇవ్వండి.
గర్భంతో వున్నప్పడు మొదటి 3 నెలలు స్థిరంగా నొప్పి కలుగుతుంటే, బహుశా అది గర్భాశయం వెలుపల గర్భం పెరుగుతూ వుండటం కారణం కావచ్చు (ట్యూబల్ లేదా ఎక్టోపిక్ గర్భం), అండ వాహిక సాగుతున్నపుడు నొప్పి కలుగుతుంది. గర్భం పెద్దగా పెరిగినపుడు వాహిక (ట్యూబ్) పగిలి రక్తస్రావం అవుతుంది. ఇది చాలా ప్రమాదకరం. మీకు పొట్టలోపలే రక్తస్రావం అవటం వల్ల మీరు చనిపోవచ్చు కూడా.
గర్భిణీ సమయంలో రక్తస్రావం
గర్భంతో వున్న సమయంలో చాలా మంది స్త్రీలు కొన్ని మార్పులను, ఇబ్బందులను అనుభవ పూర్వకంగా తెలుసుకొంటూ వుంటారు. అంగవైకల్యం గల స్త్రీలు కొందరు తమ వైకల్యం వల్ల కలిగే ఇబ్బందులను తీవ్రంగా ఎదుర్కొంటారు. మరి కొందరికి తక్కువగా వుండవచ్చు.
గర్భవతిగా వున్నపుడు అలసటగా అనిపించటం, నడుము నొప్పిగా వుండటం వంటివి అందరికీ సాధారణంగా వుండే ఇబ్బందులే, వైకల్యం గల స్త్రీలకు కూడా కలిపి. ఒక వికలాంగురాలు గర్భంతో వుండే సమయంలో, ఒక ప్రత్యేకంగా కలిగే ఇబ్బంది వుంటుంది. అది, ఏదైనా శారీరక మార్పు గాని, సమస్యగాని ఏర్పడితే అది తమ వైకల్యం వలన వచ్చిందో, గర్భం కారణంగా వచ్చిందో తెలుసుకొనలేక పోవటం. మీ శరీరం సహజంగా ఏ విధంగా వుంటుందన్న అవగాహన కలిగి వున్నటైతే, మీరు ఆరోగ్య కార్యకర్తను కలవటానికి వెళ్ళినపుడు, తగిన సహాయం పొందగలుగుతారు.
మీకు వెన్నెముక గాయం వలన కలిగిన అవిటితనం వున్నటైతే, మీకు తరచుగా కొన్ని సమస్యలు ఎదురవుతూ వుంటాయి. ఉదాహరణకు మూత్ర వ్యవస్థకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు రావటం. ఇవే సమస్యలు గర్భవతిగా వున్నప్పడు తరచూ ఇబ్బంది పెడుతూ వుంటాయి. ఈ మార్పులు, సమస్యలు, మీ శరీర తత్వాన్ని ಬಬ್ಡಿ, శిశువు ఎదుగుదలను అనుసరించి గర్భవతిగా వున్న కాలంలో ఎపుడైనా కలుగవచ్చు.
ప్రతి స్త్రీ కూడా తను గర్భవతిగా వుండటం చాలా ముఖ్యంగా భావిస్తుంది. అందుకోసం ఆమె జీవితంలో ఎన్నో సరుబాట్లు చేసుకుంటూ వుంటుంది.
అంగవైకల్యం గల స్త్రీలు ఎదుర్కోవలసి వచ్చే కొన్ని మార్పులను, ఎదుర్కోవటానికి కొన్ని సూచనలను ఇక్కడ చెప్పటం జరిగింది.
గర్భవతిగా వున్న మొదటి 3 లేదా 4 నెలల వరకు చాలా మంది స్త్రీలు అలసటగా, నిద్రమత్తుగా వున్నట్లు అనుభూతిని పొందుతూ వుంటారు. ఇతర కారణాల గురించిన మరింత సంపూర్ణ సమాచారం కోసం చదవండి.
గర్భవతిగా వుండే ఆఖరు కొన్ని వారాలలో చాలా మంది స్త్రీలు, రాత్రిపూట నిద్రపోవటానికి ఇబ్బంది పడుతూ వుంటారు. బహుశా ఇది వారు రాత్రి సమయంలో మూత్ర విసర్జన చేయవలసి రావటం వల్ల, లేదా కాళ్ళలో కండరాలు బిగిసి లాగటం వల్ల కావచ్చు. (222 నుంచి 225 పేజీలు చూడండి) లేదా కదలటం, తన్నటం మొదలు పెట్టటం వల్ల కావచ్చు. నిద్రపోవటానికి సుఖంగా వుండే భంగిమ కోసం ఇబ్బందిపడి ప్రయత్నించటం వలన కావచ్చు. వీలైతే నిద్రలేమిని భర్తీ చేసుకోవటం కోసం, వీలైనంత వరకు పగటిపూట విశ్రాంతి తీసుకోండి.
విశ్రాంతి కోసంగాని, నిద్రకు గాని, సౌఖ్యవంతమైన స్థితి వెతుక్కోవటం కష్టంగా వుంటుంది. మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఎట్టి పరిస్థితిలోను మీరు వీపు నేలకు ఆనించుకొని వెల్లకిలా పడుకోకూడదని. అందువలన మీ రక్త నాళాలపై గర్భపు ఒత్తిడిపడి, రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు రావచ్చు. ఇంకా ఆహారం జీర్ణం అవ్వటానికి, వెన్ను అలసటకు, ఊపిరికి తీసుకోవటానికి సంబంధించిన సమస్యలు కలుగవచ్చు.
చాలా మంది స్త్రీలకు గర్భంతో వున్నపుడు కాళ్ళూ పాదాలు వాసూ వుంటాయి. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో వేడి వాతావరణంలో, సాధారణంగా పాదాలు వాచటం అన్నది ఏం ప్రమాదకరమైన విషయం కాదు. కాని ఉదయాన్నే లేచేసరికి ఎక్కువగా వాచి వుండటం, లేదా మీ ముఖం, చేతులు ఏ సమయంలో వాచినా, అది ప్రి-ఎక్లాంప్సియా.
వాచిన పాదాలకు, కాళ్ళకు సహాయపడే విధం: రోజుకు 2, 3 సార్లు మీరు ప్రక్కకు తిరిగి 30 నిమిషాల పాటు పడుకోండి. మీరు ఏ వైపునకు తిరిగి పడుకొన్నా సమస్య కాదు. మీ పాదాలు పైకి పెట్టుకు కూర్చుంటే సరిపోదు. మీ ప్రక్కకు తిరిగి పడుకోవటం అన్ని విధాలా ఉత్తమం.
ప్రి-ఎక్షాంప్సియాను నివారించేటందుకు సహాయ పడే విధం: పోషక విలువలున్న ఆహారాలను ఎక్కువగా తీసుకోండి. ప్రోటీన్లు ఎక్కువగా వున్న ఆహార పదార్ధాలు తీసుకోవాలి. ఎక్కువగా నీరు త్రాగండి. తక్కువ ఉప్పవాడాలి. ఆహార పదార్ధాలలో, (కొంచెం ఉప్ప వాడాలి).
మీ 9 నెలల గర్భం సమయంలో మీ శరీరంలో ఆకారం చాల మార్పు చెందుతుంది. అందువల్ల మీరు మీ కదలికల కోసం బాగా కష్టపడ వలసి వస్తుంది. వారు అంగవైకల్యం కలవారు, లేని వారు, లేని వారు అంగవైకల్యం కలవారు, లేని వారు, లేని వారు అన్న తేడా లేకుండా అందరు స్త్రీలకు గర్భిణి సమయంలో కలిగే ఇబ్బందే అది. మీరు తెలుసుకుంటారు. మీ శరీరం బాలన్స్ తప్పి మీరు పడబోవటం. లేదా క్రిందకు వంగి ఏవైనా వస్తువులను పైకి తీయటంలో సమస్య కలగటం. అందువల్ల అంగవైకల్యం గల స్త్రీలు శరీర కదలిక ఇబ్బందిగా వున్నవారు, నడవటానికి ఉపయోగపడు సాధనాలను కాస్త తిరగటానికి, శిశువు పుట్టే వరకు ఉపయోగించటం మొదలుపెడతారు.
మీకాలులో కొంత భాగం కాని, కాలుగాని తొలగించబడి మీరు కృత్రిమమైన కాలును ఉపయోగిస్తున్న వారైతే ఒక విషయం గమనించాలి. మీ శరీరం బరువు గర్భిణీవల్ల పెరగుతుంది గనుక, మీకు అమర్చిన కాలు సరిగా పని చేస్తుందో లేదో చూసుకోవాలి. కాలు తొలగించిన స్థానంలో వాపు వచ్చినటైతే, అది తయారు చేసిన వ్యక్తిని, దానిని సవ్యంగా పనిచేసేలా సరి చేయగలడేమో కనుక్కోవాలి. ఒకవేళ అది వీలుకానటైతే, మీరు క్రెచెస్గాని, వాకర్గాని చక్రాల కుర్చీగాని ఉపయోగించాలి గర్భవతిగా వున్నంత కాలం.
నడవటానికి పుతంగా వుండే సాధనం (వాకర్)ను కెన్, వెదురు, లేదా కర్రతో తయారు చేయవచ్చు. గట్టి తీగతోగాని, ట్వయిన్ తోగాని, రిబ్బన్లతో గాని, సైకిల్ ట్యూబ్తోగాని, కారుటైరు ఫ్రిప్స్తోగాని కారు టైరు ముక్కలతో గాని కర్రలను కట్టవచ్చు.
ఎదుట రెండు చక్రాలు గల వాకర్, చక్రాలు లేని దానికన్నా నాలుగు చక్రాలు గలదానికన్నా గట్టిగా వుంటుంది.
అంగవైకల్యం స్త్రీలు కూడ, గర్భంతో వున్న చివరి వారాలలో నడిచేటపుడు బాలన్స్ కుదరక ఇబ్బంది పడుతూ వుంటారు. ఇక వికలాంగులైన స్త్రీలకు ఈ రకమైన ఇబ్బందులు ఇంకా తీవ్రంగా వుంటాయి. వారిలో శరీరం క్రింది భాగానికి పక్షవాతం వచ్చిన వారు, లేదా కండరాలపై పరిమితమైన అదుపు గల వారికి కష్టంగా వుంటుంది. ఈ సమయంలో తిరగటం. మీ పెద్ద పరిమాణం గల పొట్ట వల్ల, మీరు రోజూ దినచర్యగా చేసుకొనే, బట్టలు ఉతుక్కోవటం, దుస్తులు ధరించటం వంటి కార్యకలాపాలకు భంగం కలుగుతుంది.
మీరు పడుకొని వున్న స్థితి నుంచి లేవటం కూడా సులభమే, మీరు గనుక ఇలా చేస్తే:
గర్భిణి సమయంలో ఆఖరి వారాలలో, కదలటం, తిరగటం అతి కష్టం అయిన సమయంలో, సామాన్యమైన చిన్న సహాయక సాధనాలు చాలా మంది వికలాంగ స్త్రీలకు ఎంతో సహాయంగా వుంటాయి.
గర్భవతులకు తరచుగా పాదాలు లేక పిక్కలు పట్టేస్తాయి. ముఖ్యంగా రాత్రిపూట కాళ్ళను చాచుకున్నపుడు లేక కాలి వ్రేళ్ళను క్రిందకు వంచినప్పడు ఇలా జరుగుతుంది. ఆహారంలో కాలియం తక్కువగా వుండటం వల్ల ఇలా జరుగవచ్చు.
మీ కాళ్ళను గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టటం లేదా ఒక తడిగుడ్డను (వేడి నీళ్ళలో మంచి) పట్టేసిన ప్రాంతంలో వేయటం వల్ల కూడా ప్రయోజనం వుంటుంది.
కండరాలు బిగిసి పోవటం, లాక్కుపోవటం వల్ల ఒక వ్యక్తితన కదలికలను అదుపులో వుంచుకోవటం కష్టమవుతుంది. ఇది ఎక్కువగా మెదడుకు సంబంధించిన పక్షవాతం, వెన్నెముక గాయం కలవారిలో ఇలా జరుగుతుంది ఎక్కువగా, ఈ రకమైన గాయాలు గల స్త్రీలలో ఈ కండరాలు బిగవటం, ప్రసవం సమయంలో నొప్పలు పడేటప్పడు ఎక్కువగా జరుగుతుంది.
కండరాలు జగవటం వల్ల మీ నడుము లేదా శరీరం అంతా ప్రభావం వున్నటైతే తల, భుజాలు కొంచెం ముందుకు వంగేలా తలక్రింద ఏదైనా పెట్టుకోండి. ఇందువల్ల శరీరంలోని జగుతు అంతా తగ్గి విశ్రాంతి లభిస్తుంది.
శుభ్రమైన, గోరు వెచ్లని నీళ్లలో కూర్టోవటం వలన, కండరాలు జగుతు తగ్గి విశ్రాంతి చెందుతాయి.
ముఖ్యం
ఒక సాధారణమైన నిబంధనగా: మెదడుకు సంబంధించిన పక్షవాతం వల్ల బిగిసిన కండరాలను మర్ధనా చేయకూడదు. కొన్ని దేశాలలో వైద్యులు, ఇతర వ్యక్తులు కూడా బిగిసిన కండరాలను విశ్రాంతిగా చేసేటందుకు మర్దనా, రుద్దటం కూడ ఉపయోగిస్తారు. తరచుగా మర్ధనా వల్ల పిక్కలు పట్టేసినపుడు, కండరాలు బిగుతుగా అయినపుడు (ఇతర కారణాల వల్ల) ఉపశమనం లభిస్తుంది. కాని మెదడు ద్వారా కలిగిన కండరాల బిగుతుకు మర్జన చేయటం వలన సాధారణంగా అది మరింత ఎక్కువవుతుంది.
చాలా మంది స్త్రీలు గర్భంతో వున్నపుడు, వారు అంగవైకల్యం కలవారైనా, లేని వారైనా సరే, ముఖ్యంగా ప్రసవానికి ముందు వారాలలో పొట్టబాగా పెద్దగా వున్నపుడు నడుము నొప్పితో బాధపడుతూ వుంటారు. పొట్ట భాగంలో వున్న కండరాలు గర్భం వల్ల సాగి బలహీనం కావటం వలన, వెనుక భాగంలో వున్న కండరాలకు శ్రమ ఎక్కువవుతుంది.
కొన్ని శారీరక వైకల్యాలు గల స్త్రీలు గర్భవతులుగా వున్న తొలిదశలో తీవ్రమైన నడుము నొప్పికి గురవుతున్నట్లు కనిపిస్తుంది. ఆఖరుకు శరీరపు క్రింది భాగంలో ఏ రకమైన అనుభూతి స్త్రీలకు కూడా తరచు, వారు గర్భంతో వున్నపుడు నడుము నొప్పి తెలుస్తుంది.
గర్భంలో శిశువు పెరిగే కొలదీ, తల్లి ఛాతీలోపలకు ఒత్తిడి పెరుగుతూ వుంటుంది. అందువల్ల ఆమెకు శ్వాస తీసుకోవటానికి చాలా తక్కువ స్థలం వుంటుంది. గర్భవతిగా వున్నపుడు ఇది చాల సహజమైన విషయమే. కాని మరుగుజ్ఞతనంతో చిన్న ఆకారం కలిగి వుండటం, ఛాతీ కండరాలకు పక్షవాతంతో వుండటం మొదలైన అంగవైకల్యాలు గల స్త్రీలలో మాత్రం గర్భిణీ మొదటి దశలో శ్వాస తక్కువై ఇబ్బంది పడటం జరుగుతుంది. శిశువుకు తల్లి ఊపిరి తిత్తుల నుంచే ఆక్సిజన్ (ప్రాణవాయువు) సరఫరా అవుతూ వుంటుంది. అందువల్ల గర్భిణిగా వున్నప్రీ తన వూపిరి తిత్తులను స్వచ్ఛంగా, ఆరోగ్యంగా వుంచుకోవాలి. గర్భస్థ శిశువు తనకు కావలసిన ప్రాణవాయువునంతా తల్లి ఊపిరితిత్తుల నుండే తీసుకుంటుంది.
ఒక తల్లి శ్వాస తీసుకోవటానికి ఇబ్బందిపడుతూ, నీరసంగా, అలసటగా వున్నా ఆమె వెంటనే ఒక ఆరోగ్య కార్యకర్తను చూడాలి. ఆమెకు గుండెకు సంబంధించిన సమస్యలు వుండవచ్చు, అందువల్ల వైద్య సహాయం అవసరం కావచ్చు. లేదా ఆమె రక్తహీనతతో బాధపడతూ వుండి వుండొచ్చు లేదా ఆహారలోపం లేక ఏదైనా ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు. లేదా ఆమె మానసిక ఒత్తిడికి లోనై వుండవచ్చుకూడా.
గర్భవతి అయిన స్త్రీ యొక్క శరీరం మృదువుగా, వదులుగా తయారయి, కడుపులో శిశువుకు ఎదుగుతున్న కొలదీ కావలసినంత చోటు ఇస్తూ, జన్మనివ్వటానికి సిద్ధపడుతుంది. కొన్ని సందర్భాలలో ఆమె కీళ్ళకూడా వదులయ్యి అసౌకర్యాన్నికలుగజేస్తాయి. ముఖ్యంగా పిరుదులు. ఇలా సాధారణంగా గర్భిణి ఆఖరు వారాలలో జరుగుతూ వుంటుంది. అదేం ప్రమాదమైన మార్పు కాదు, ప్రసవం తరువాత తిరిగి యధాస్థితిగా మారుతుంది శరీర పరిస్థితి.
చల్లదనం కోసం: ఒక బట్టలో గాని తువ్వాలులో గాని ఐస్నుచుట్టి 10 నుంచి 15 నిముషాల వరకు ఉపయోగించవచ్చు.
వేడి కోసం: ఒక దళసరి బట్టను శుభ్రమైన వేడినీటిలో మంచి (ఎక్కువగా వున్న నీటిని పిండేసి), బాధగా వున్న జాయింట్ (కీలు) చుటూ చుట్టండి. ఆ బట్టను ఒక ప్లాస్టిక్ ముక్కతో కప్పి, ఒక పొడి, దళసరి బట్టతో చుట్టాలి. అందువల్ల వేడి నిలబడి వుంటుంది ఎక్కువ సేపు. ఆ తడిబట్ట చల్లారిపోతుంటే & తిరిగి వేడి నీళ్ళలో మంచి, అదే విధంగా మళ్ళీ చేయాలి. లేదా ఒక సీసా (పింగాణి, ప్లాస్టిక్ లేదా గాజు)లో వేడి నీరుపోసి మూత బిగించి, ఒక బట్టలో చుట్టి నొప్పిగా వున్న ప్రాంతంలో కాచాలి.
చాలా మందిస్త్రీలు గర్భం పెరిగిన కొలదీ (నెలలు ముందుకు నిండుతున్న కొలదీ) మూత్ర విసర్జనపై అదును కోల్పోవటం జరుగుతుంది. దానితో మూత్రం అదుపు లేకుండా కారిపోవటం జరుగుతుంది. కండరాలపై పరిమితమైన అదుపు, పక్షవాతం, శరీర క్రింది భాగంలో ఏ స్పర్శ, అనుభూతి తెలియకపోవటం వంటి శారీరక వైకల్యాలు గల స్త్రీలకు, గర్భిణీ సమయంలో, ఇతర స్త్రీలు కన్నా ఎక్కువ సమస్య వుంటుంది, మూత్రం కారటం విషయంలో.
గర్భం పెద్దదవుతూ, గర్భస్థ శిశువు పెరుగుతున్న కొలదీ, మూత్రాశయం నొక్కుకొని మూత్రానికి చోటు లేక మూత్రం కారుతుంది ఒక్కోసారి. ముఖ్యంగా ఆస్త్రి దగ్గినప్పడు, తుమ్మినపుడు హఠాత్తుగా వస్తుంది. అది మూత్రమో, లేక సంచిలోని నీరు పగిలి బయటకు వస్తుందో చెప్పటం కష్టం కూడా. ఇలా జరిగినటైతే, ప్రసవపు ముందు కనబడే ఇతర లక్షణాల కోసం చూడాలి. ఒక ఆరోగ్య కార్యకర్తను గాని మంత్రసానిని గాని సలహా అడగాలి.
మీరు మామూలుగా మూత్ర విసర్జన కోసం కేధేటర్ (ట్యూబ్)ని వాడుతున్నటైతే దాని వలన ఏ సమస్య లేకుంటే, దానినే ఉపయోగించుకోవచ్చు. ఒక వేళ, సాధారణం కంటే ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళవలసి వస్తే, ఎక్కువసార్లు కేథెటర్ని పెట్టటం, తీయటం చేయలేరు కనుక దళసరి బట్టలతో పాడ్లలా తయారు చేసి మూత్రం పీల్చుకొనేలా పెట్టండి. ఈ పాడ్లను తప్పనిసరిగా ఉతికి శుభ్రపరచి ఎండలో ఆరవేయాలి. తరచూ, అలా చేస్తే మీ జననాంగాల చుటూ ఇన్ఫెక్షన్ రాకుండా వుంటుంది. ఆ పాడ్ లను తిరిగి ఉపయోగించే ముందు, అవి శుభ్రంగా, పొడిగా వుండేలా చూసుకోండి.
కొందరు స్త్రీలు ఎల్లవేళలా అలా లోపలే వుంచేసే కేథెటర్ ను ఉపయోగిసూ వుంటారు. కాని ఇలా చేయకూడదు. ఎందుకంటే శిశువు పుట్టేక కూడా అలవాటుగా పరిణమించి మానలేక పోతారు. మీ మూత్రాశయాన్ని అదుపు చేసే కండరాలు వాటి పనిని మర్చి పోతాయి. లోపల మూత్రాన్ని ఎలా పట్టి వుంచాలో మర్చిపోవటం జరుగుతుంది. అంతే కాకుండా, కేథెటర్ వల్ల మూత్రకోశానికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా వుంటుంది.
మీకు రాత్రిపూట మూత్రం లీక్ అయ్యే సమస్య వున్నటైతే, పాడ్లు వాడండి. లేదా ఒక బకెట్ లేదా మగ్లాంటిదాన్ని దగ్గరగా వుంచుకొంటేరాత్రి మూత్రాన్ని అందులో పట్టటానికి వీలుగావుంటుంది. చక్రాల కుర్చీనే టాయ్లెట్గా కూడా వుపయోగించుకొనే విధమైనదాన్ని వాడుకుంటే వీలుగా బాగుంటుంది.
మీరు మీ పొత్తి కడుపులోని కండరాలను ఉపయోగించ గలిగితే, బిగబట్టే వ్యాయామం వల్ల కొన్ని సందర్భాలలో మూత్రా శయం చుటూ వున్న కండరాలు బలంగా అవుతాయి.
చాలా మంది గర్భవతులైన ఫ్రీలు మలవిసర్జన విషయంలో సమస్యను ఎదుర్కొంటూ వుంటారు. గట్టిగా వుండే మలాన్ని విసర్జించలేక బాధపడుతూ వుంటారు. గర్భధారణ వల్లనే అసలు పేగులు నెమ్మదిగా పనిచేస్తాయి. ఇందువల్ల ఇంకా కష్టమవుతుంది మల విసర్జనకు.
మలాన్ని తొలగించే కార్యక్రమం ఉపయోగించే స్త్రీలు, గర్భవతులుగా వున్నప్పడు తరచుగా మలాన్ని తొలగించే పని చేయాలి. గట్టి మలం తొలగించకుంటే డిస్రిప్లక్సియా వస్తుంది. అది చాలా ప్రమాదకరమైనది.
గర్భవతులుగా వున్నపుడు స్త్రీలు విరేచనాల కోసం వేసుకొనే మందులను వాడకూడదు (లాక్సేటివ్స్ మరియు పర్గేటివ్స్). ఇవి పేగులను ముడుచుకొనేలా, బిగిసేలా చేస్తాయి. అందువల్ల ప్రసవపు నొప్పలు ముందుగానే ప్రారంభం అయిపోతాయి. కొన్నైతే శిశువుకు హాని కలిగిస్తాయి.
మలద్వారం చుటూ పైకి పొంగి వున్న సిరల్ని మొలలు లేక హెమరాయిడ్స్ అంటారు. అవి తరచు అక్కడ దురద, మంట, రక్తం కారటం కలిగి వుంటాయి. చాలా నొప్పిగా కూడా వుంటుంది అక్కడ. మలబద్ధకం వల్ల అవి తీవ్రంగా మారతాయి.
ఇతర సమయాలలో కన్నా గర్భిణీ సమయంలో స్త్రీలందరూ కూడా ఎక్కువగా మూత్రకోశ వ్యాధులకు గురవుతూ వుంటారు. గర్భాశయం పెద్దగా ఎదుగుతున్న కొలదీ, అది మూత్రకోశాన్ని నొక్కుతూ వుండడం వలన మూత్రం అంతా బయటకు రాకుండా అవుతుంది. అపుడు ఆ మిగిలిపోయిన మూత్రంలో క్రిములు పుట్టి ఇన్ఫెక్షన్ (వ్యాధి)ని కలుగచేస్తాయి.
కండరాలపై పరిమితమైన అదుపు కలిగి వుండటం, పక్షవాతం లేదా శరీరం దిగువ భాగంలో ఏరకమైన అనుభూతి లేకుండా వుంటం వంటి వైకల్యాలు గల స్త్రీలలో మిగతా వారికన్నా ఎక్కువగా వుంటాయి. మూత్రకోశవ్యాధులకు, మూత్రపిండాల వ్యాధులకు అవకాశాలు వుంటాయి. మూత్రకోశ వ్యాధులు డిస్రిఫ్లెక్సియా వల్ల కలుగుతూ వుంటాయి.
అమర్చివేసిన కేథెటర్ గల స్త్రీలు మూత్ర కేథెటర్ ద్వారా బయటకు రాకపోవటాన్ని గుర్తిస్తారు. పెరుగుతున్న శిశువు కేథెటర్ను నొక్కి వేయడంతో మూత్రం ప్రవహించకుండా ఆగిపోతుంది.
మూత్రకోశ ఇన్ఫెక్షన్లకు వెంటనే చికిత్స తీసుకున్నటైతే, మూత్ర పిండాలలో ఇన్ఫెక్షన్, తేదీ కన్నా ముందుగానే పురుటి నొప్పలు వంటి తీవ్రమైన సమస్యలను నివారించుకోవచ్చు. వ్యాధి (ఇన్ఫెక్షన్) లక్షణాలు కనిపిస్తాయేమో జాగ్రత్తగా చూసుకొని, అవసరమైతే ఆరోగ్య కార్యకర్తను కలవండి.
మీరు గర్భవతిగా వున్నప్పడు మూత్ర సంబంధమైన వ్యాధులను నిరోధించటానికి:
మీరు ద్రవపదార్థాలను తగినంతగా తీసుకుంటున్నారో లేదో తెలుసుకోవాలనుకుంటే మీ మూత్రం యొక్క రంగును గమనించండి. అది ముదురు పసుపు రంగులో వున్నట్లయితే మీరు బహుశా ఎక్కువగా తీసుకోవటం లేదు అనుకోవాలి. మూత్రం లేత పచ్చగా, ఇంచుమించు నీళ్ళలా వుండాలి. అధికంగా కాఫీ, టీలు తీసుకోవటం వల్ల ప్రయోజనం ఏమీవుండదు. వాటిలో వుండే కేఫీన్ మీరు తాగిన దానికన్నా ఎక్కువ ద్రవం పోయేలా చేస్తుంది.
మూర్ఛవ్యాధిగల స్త్రీకి, గర్భంతో వున్న సమయంలో కొంచెం గాని ఎక్కువగా గాని మూర్చలు వస్తాయని చెప్పటం కష్టం. మీరు కూడా మూర్చ వ్యాధి వున్న వ్యక్తి అయినటైతే, మీకు తెలుస్తుంది ఎంత తరచుగా అవి వస్తాయో, ఎంత తీవ్రంగా వుంటాయో తెలుస్తుంది. ఫినైటాయిన్ (డిఫెనైల్ హైడాన్, టాయిన్ డైలాన్టిన్) వంటి మూర్చ వ్యాధి నివారణకు ఉపయోగించే మందులు, గర్భవతి అయిన స్త్రీ తీసుకున్నటైతే ప్రసవ సమయంలో లోపాలు ఎక్కువయ్యే ప్రమాదం వుంటుంది. అయినా మీరు గర్భవతిగా వున్న సమయంలో మూర్చ వ్యాధి నివారణ మందులను మానకండి. మానినట్లేతే మూర్చలు తీవ్రమై ప్రాణ హానిని కూడా కలిగిస్తాయి. ఒక అనుభవం గల ఆరోగ్య కార్యకర్తను గాని, డాక్టరును గాని కలిస్తే, వారు మీకే మందులు సురక్షితమో నిర్ణయించటంలో సహాయపడతారు. ఫినోబార్సిటాల్ (ఫినోబార్బిటోన్, లుమివాల్, బహుశా మీకు సురక్షితమైనది కావచ్చు తీసుకోవటానికి, గర్భిణీ సమయంలో.
గర్భంతో వున్నప్పడు కాళ్ళూ, చేతులూ కొద్దిగా వాచటం (స్వెల్లింగ్) సహజం. కాని చేతులు, ముఖం వాచటం అన్నది మూత్రం ప్రి- ఎక్షాంపియా (టాక్సీమియా గర్భం సమయంలో) లక్షణాలే, ముఖ్యంగా మీకు తలనొప్పి, చూపు మసకగా కనిపించటం, కడుపులో నొప్పి కూడా వున్నటైతే, ఇంకా హరాత్తుగా బరువు పెరగటం, అధిక రక్తపోటు, మూత్రంలో ప్రోటీన్లు ఎక్కువగా పోవటం కూడా అదే లక్షణం. టాక్సీమియా వల్ల కలిగే కొన్ని హఠాత్తు కదలికలు (కన్వల్లన్స్) (కాళ్ళూ చేతులూ కొట్టుకోవటం వంటివి), మిమ్మల్ని మీ శిశువునూ కూడా ప్రాణ హానికి గురి చేస్తాయి. కన్వల్షన్స్ అన్నవి, మూర్చల నుండి వ్యత్యాసంగా వుంటాయి.
మీ తల్లికి గాని సోదరిలకు గాని టాక్సీమియా వున్నా అంతకు ముందు, లేక ఇదే మీ మొదటి గర్భం అయినా, లేదా క్రొత్త భాగస్వామితో పొందిన మొదటి గర్భం అయినా సరే మీకు టాక్సీమియా సోకే ప్రమాదం వుంది. అధిక రక్తపోటు, చక్కెర వ్యాధి, మూత్ర పిండ సమస్యలు, తీవ్రమైన తల నొప్పలు, 35 ఏళ్ళ పైబడిన వయసు, ఒకరికన్నా ఎక్కువ బిడ్డలను కనాలనుకోవటం మొదలైన లక్షణాలున్న స్త్రీలందరికీ టాక్సీమియా రావటం సాధారణం.
ఒకవేళ మీకు టాక్సీమియా లక్షణం ఏది కనిపించినా మంత్రసానిని లేదా ఆరోగ్య కార్యకర్తను కలిస్తే సంబంధించిన పరీక్షలు వారు జరుపుతారు.
ఎక్కువ సమయం కదలకుండా ఒకే భంగిమలో కూర్చోవటం గాని, పడుకోవటం గాని చేస్తే స్త్రీలలో ఒత్తిడి వల్ల కలిగే పండ్లు ఏర్పడటం జరుగుతుంది. ఇది ముఖ్యంగా పక్షవాతం వచ్చి నొప్పి తెలియని స్త్రీలలో జరుగుతుంది. మీరు గర్భిణిగా వున్నప్పుడు, అదనంగా బరువు శరీర భాగాలపై ఒత్తిడి కలిగించటం వల్ల పండ్లు పడటానికి అవకాశం వున్న పండ్లు ఏర్పడటం జరుగుతుంది.
మీ పొజీషన్ని చాలా తరచుగా, మామూలుకన్నా ఎక్కువగా, అంటే కనీసం గంటకి ఒకసారైనా కదుపుకోవాలి. ఒత్తిడి పుండు పడే ఆస్కారం వున్న చోట్ల, తరచుగా, అంతకు ముందు కంటే ఎక్కువ సార్లు చూసుకొంటూ వుండాలి.
హెచ్.ఐ.వి/ఎయిడ్స్ చికిత్స లేకున్నప్పటికీ, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ తో బాధపడే వారు ఎక్కువ కాలం జీవించి వుండటానికి తోడ్పడ గల మందులు అందుబాటుగా వుంటున్నాయి. గర్భవతి అయిన స్త్రీ తన నుండి హెచ్.ఐ.వి/ఎయిడ్స్, గర్భస్ధ శిశువుకు వ్యాప్తి చెందకుండా ఉపయోగించే మందులు (ఎ.ఆర్.వి.లు అంటారు), బిడ్డకు కడుపులో వుండగా గాని, ప్రసవం సమయంలో గాని, పాలిచ్చే సమయంలో గాని తల్లి హెచ్.ఐ.వి శిశువుకు సోకకుండా కాపాడే ఎ.ఆర్.వి మందులే, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ రోగులకు జీవిత కాలం పెంచటానికి కూడా ఉపయోగించటం జరుగుతుంది.
మీకు హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వండి గర్భంతో వున్నటైతో మీరు మీ గర్భం గురించి సహజ సంరక్షణ తీసుకుంటూనే హెచ్.ఐ.వి కి కూడా వైద్యం చేయించుకోవాలి. హెచ్.ఐ.వి సోకిన స్త్రీలు తమ గర్భం సమయంలో ఎక్కువ సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఉదాహరణకు:
బిడ్డకు హెచ్.ఐ.వి సోకకుండా మీకు చికిత్స చేయటానికి మందులు అందుబాటుగా వున్నాయేమో చూసుకోవాలి. లేదా మీ శిశువుకు ప్రారంభంలోనే అంటే తొలి దశలోనే నివారణ చర్యలు తీసుకోండి. మీ ప్రాంతంలో అన్ని సౌకర్యాలు గల ఆరోగ్య కేంద్రం వున్నటైతే, మీ ప్రసవం అక్కడ చేసుకోవటం మంచిది.
కుటుంబాలు మరియు సంరక్షకులు పాత్ర
మేము గనుక గర్భవతి కావటానికి ముందు కాని, గర్భవతి అయిన తర్వాత గాని వారిని చూడటానికి వెళ్ళటం ప్రారంభించినటైతే, డాక్టరు, ఆరోగ్య కార్యకర్త లేదా మంత్రసాని మాకు సహాయపడగలుగుతారు. ఎందుకంటే చాలా తక్కువ మంది డాక్టర్లు, నర్సులు, మంత్రసానులు ఇంకా ఇతర ఆరోగ్య కార్యకర్తలు అంగవైకల్యం గల స్త్రీలకు ఎలా సహాయపడాలో, ఎలా చికిత్స గాని వైద్యసహాయం గాని వారికి వీలుగా వుండేలా ఎలా చేయాలో అన్న అవగాహన కలిగి వుంటారు. ఆ అనుభవంతోనే వారు మాకు సహాయపడగలుగుతారు, మేము వారికి మా అంగవైకల్యం, మా గర్భంపై ఎలా ప్రభావం చూపుతుందో లేదో కూడా మాకు ఏది సహజంగా సరిపడుతుందో అర్థం అయ్యేలా చెప్పి సహాయపడగలుగుతాం. ఆరోగ్య కార్యకర్తలు ఇంకా చేయగలిగినవి:
వికలాంగ స్త్రీల యొక్క ఒక సంస్థ (డి.డబ్యూఎన్.ఆర్.వో) ఉగాండాలో వైద్య నిపుణులకు, వికలాంగ స్త్రీల యొక్క అవసరాలను గురించిన మరింత అవగాహన కలిగించేటందుకు కృషి చేస్తుంది. వారు ముఖ్యంగా చేపట్టేవి ఆరోగ్య సంరక్షణ, అనుకూలంగా వుండేలా చేయటం, అందుబాటుగా వుండేలా చూడటం, సరైన దృక్పథం కలిగించటం. ఉదాహరణకు గర్భవతులైన వికలాంగ స్త్రీలు ఆసుపత్రికి వెళ్ళినపుడు అక్కడ సిబ్బంది వారిని నిరాదరించినటైతే, వారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. అటు తర్వాత ప్రసవానికి ముందు జాగ్రత్తల కోసం ఆరోగ్య రక్షణ కోసం ఆసుపత్రికి వెళ్ళటం మానుకొంటారు. వారికి గర్భం సమయంలో తర్వాత ఏమైనా సమస్యలు రావచ్చు, అలాగే ప్రసవ సమయంలో కూడా ఏదైనా సమస్య రావచ్చు. క్రమబద్ధమైన పరీక్షలు జరిగితే ముందు నుంచీ అవన్నీ చాలా వరకు నివారించబడి వుంటాయి. సిబ్బంది నిరాదరణ కారణంగా వారికి చాలా నష్టం జరుగుతుంది.
“డి.డబ్యూఎన్.ఆర్.వో" సంస్థ డాక్టర్లకు, మంత్రసానులకు ఒక శిక్షణా కార్యక్రమం వంటి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అందులో వికలాంగ స్త్రీలసాకర్యం కోసం, అవసరాల కోసం అనేక అంశాలపై దృష్టి పెట్టటం జరిగింది. ఉదాహరణకు, ఆసుపత్రి వారులలోనికి ప్రవేశించేటందుకు అనువైన సోకర్యాలు, ప్రసవం తర్వాత సంరక్షణ, బరువునుచూసే అనువైన సాధనాలు, పరీక్ష చేసే బల్లలు, ఇతర సేవలు, ఇంకా అంధుల కోసం, వినికిడి శక్తి లోపం (చెముడు) గల వారికోసం, వారికి అవగాహన కల్పించి, వారి అవసరాల గురించి వారి ద్వారానే తెలుసుకోగల పరస్పర అవగాహన కలిగించే భాషల వినియోగం మొదలైనవి. కొన్ని ఆసుపత్రులలోని కొన్ని వార్డులను వికలాంగ స్త్రీలకు అనుకూలంగా తయారు చెయ్యటం జరిగింది. ఒక బధిరులైన (చెవిటివారు) స్త్రీలు బృందం ఇటీవల, మంత్రసానుల బృందాలకు సౌజ్ఞ (సైన్) భాషలో శిక్షణనివ్వటం జరిగింది. "డి.డబ్యూఎన్.ఆర్.వో' సంస్థ ప్రస్తుతం, వికలాంగ స్త్రీలకు ఈ సేవల గురించి అవగాహన కల్పించటానికి కృషి చేస్తుంది. అందువల్ల వారు తమ అవసరాలకు తగిన సేవలను నోరు విప్పి అడిగి పొందగలుగుతారు.
తరుచుగా చిన్నారులు ఆరోగ్య సమస్యలకు లోనవుతుంటారు. చిన్న తనమున వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకున్నట్లయితే ఆ సమస్యలు వారిని వారి జీవితాంతము వెంబడిస్తుంటాయి. అందుచేత, చిన్నారుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుటకై ఈ పోర్టల్ నందు కొన్ని సూచనలు సలహాలు ఉన్నాయి.
ఈ విభాగంలోవివిధ వయసుల వారిమీద పోషకాహారలోపము యొక్క ప్రభావాల గురించి వివరించబడింది
మీరు కావాలనుకున్నపుడు, మీరు కోరుకున్నంత మంది పిల్లల్ని మాత్రమే కనటాన్ని కుటుంబ నియంత్రణ అంటారు.
ఇమ్యూనైజేషన్ (రోగ నిరోధక టీకా మందులు) అనే అంశంపై సమాచారాన్ని తెలుసుకొని, పాటించటం.
ఈ విభాగంలోఆరోగ్యవంతమైన గర్భం దాల్చుట కొరకు కావలసిన ఆహారం మరియు ప్రతి రోజూ తీసుకోవలసిన నిర్దిష్టమైన ఆహారం గురించి వివరించబడింది
ఈ విభాగంలో అయొడిన్ (సూక్ష్మ పోషకం ) గురించి వివరించబడింది.
భాగస్వామ్యం అందించినవారు : Molugu Sukesh01/07/2022
పెద్ద పెద్ద సారాంశాలను చదవాల్సిన అవసరం లేదు. వికాస్ AI సహాయంతో సంక్షిప్త సారాంశం కోసం 'కంటెంట్‌ను సంగ్రహించు' పై క్లిక్ చేయండి.
56
తరుచుగా చిన్నారులు ఆరోగ్య సమస్యలకు లోనవుతుంటారు. చిన్న తనమున వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకున్నట్లయితే ఆ సమస్యలు వారిని వారి జీవితాంతము వెంబడిస్తుంటాయి. అందుచేత, చిన్నారుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుటకై ఈ పోర్టల్ నందు కొన్ని సూచనలు సలహాలు ఉన్నాయి.
ఈ విభాగంలోవివిధ వయసుల వారిమీద పోషకాహారలోపము యొక్క ప్రభావాల గురించి వివరించబడింది
మీరు కావాలనుకున్నపుడు, మీరు కోరుకున్నంత మంది పిల్లల్ని మాత్రమే కనటాన్ని కుటుంబ నియంత్రణ అంటారు.
ఇమ్యూనైజేషన్ (రోగ నిరోధక టీకా మందులు) అనే అంశంపై సమాచారాన్ని తెలుసుకొని, పాటించటం.
ఈ విభాగంలోఆరోగ్యవంతమైన గర్భం దాల్చుట కొరకు కావలసిన ఆహారం మరియు ప్రతి రోజూ తీసుకోవలసిన నిర్దిష్టమైన ఆహారం గురించి వివరించబడింది
ఈ విభాగంలో అయొడిన్ (సూక్ష్మ పోషకం ) గురించి వివరించబడింది.