హోమ్ / ఆరోగ్యం / పిల్లల ఆరోగ్యం / ఆ ఐదు రోజలలో తీసుకోవలసిన జాగ్రత్తలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఆ ఐదు రోజలలో తీసుకోవలసిన జాగ్రత్తలు

girlplaying.jpgమానవజీవితంలో శారీరక పెరుగుదల పుట్టిన మొదటి సంవత్సరంలో ఎక్కువగా చూస్తాము. మరల తిరిగి కౌమార వయస్సులో శారీరక మార్పులతో కూడిన పెరుగుదల ఎక్కువగా జరుగుతుంది. మానవజీవితంలో పెరుగుదల అభివృద్ధికి సంబంధించి ఈ రెండు దశలు ముఖ్యమైన సమయాలు

అయితే కౌమార దశలో ఏర్పడే శారీరక మార్పులు బాలబాలికలను పెద్దలుగా పరిణితి చెందటానికి తోడ్పడతాయి. అయితే ఈ మార్పులు కలిగే వయస్సు

ఆడపిల్లలలో . 9 నుంచి 18 సంవత్సరాలు

మగపిల్లలలో . 12 నుంచి 21 సంవత్సరాలు

అందుకే 10 నుంచి 19 సంవత్సరాల వయస్సు ని ప్రపంచ ఆరోగ్య సంస్ధ కౌమార దశగా గుర్తించడం జరిగింది. బాలురలో సంభవించే ఈ మార్పులు పురుష లక్షణాలను, బాలికలో సంభవించే శారీరక మార్పులు స్త్రీ లక్షణాలను సంతరించుకొనుటకు దోహదపడతాయి.

మగపిల్లలలో సంభవించే మార్పులు

 • మీసం, గడ్డం రావడంboys.jpg
 • రహస్య ప్రదేశాలు / జననాంగములపై వెంట్రుకలు రావడం
 • గొంతు / స్వరం మారడం
 • వృషణములు పెరుగడం
 • ఛాతీ వెడల్పవడం, వెంట్రుకలు రావడం
 • మొటిమలు (కొందరిలో) రావడం

బాలికలలో సంభవించే మార్పులు

 • ఛాతీ / వక్షోజాల పెరుగడం
 • జననాంగములు / రహస్య ప్రదేశాలలో వెంట్రుకలు రావడంgirls.jpg
 • పిరుదులు వెడల్పు (పెరుగుదల) అవ్వడం
 • కొందరిలో ముఖముపై మొటిమలు రావడం జరుగుతుంది.

ఈ విధంగా పెరుగుదల సంభవించి బాలిక మొదటిసారిగా “నెలసరి’’ కావటం కూడా ఈ వయస్సులోనే జరుగుతుంది. దీనినే వాడుక భాషలో పుష్పవతి, పెద్దమనిషి, రజస్వల అవ్వడం అంటారు.

బాలిక 10 నుంచి 17 సంవత్సరాల మధ్యలో ఎప్పుడైనా పెద్దమనిషి అయ్యే అవకాశాలున్నాయి. అయితే 17 సంవత్సరాలకు కూడా అవ్వనట్లయితే డాక్టరు / వైద్యుని సంప్రదించవలెను.

నెలసరి అయ్యే ప్రక్రియను తెలుసుకుందాం

 • నెలసరి ప్రక్రియ స్త్రీ పునరుత్పత్తి వ్యవస్ధకి సంబంధించినది.
 • నెలసరి రావటానికి దోహదమయిన పునరుత్పత్తి వ్యవస్ధకి సంబంధించిన అంతర్గత మరియు బహిర్గత భాగాల గురించి తెలుసుకుందాం.

స్త్రీ పునరుత్పత్తి వ్యవస్ధ - అంతర్గత భాగాలు

 • అండనాళములు
 • అండాశయము
 • అండములు
 • గర్భాశయము
 • గర్భాశయ ద్వారము
 • యోని

బాలికకు యోనిలో కన్పించే బాగాలు - బహిర్గత భాగాలు

 • యోని శీర్షము
 • మూత్ర ద్వారం
 • యోని ద్వారము
 • అంతర పెదవులు
 • బాహ్య పెదవులు
 • మల ద్వారము

వక్షోజం / ఛాతీ

 • చనుమొనలు
 • పాల వాహికలు
 • పాలగ్రంథులు

స్తనాలు బయటకి కన్పింస్తుంటాయి. స్తనాల ద్వారానే తల్లి శిశువులకి పాలిస్తుంది. అంటే దీని అర్థం స్తనాలలోపలగల పాల వాహికలు, పాలగ్రంథులు దీనికి తోడ్పడతాయి.

ఈ వయస్సులోనే పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. కావున పౌష్టికాహారం ఎక్కువగా తీసుకోవాలి.

పెద్దమనిషి / పుష్పవతి / రజస్వల అవ్వడం

 • ప్రతి బాలిక జీవితంలో సంభవించే ప్రక్రియ
 • మన సమాజంలో ఈ విషయాలను ముందుగా బాలికలకు తెలియ చేయడం మంచిదికాదు అనే అపోహ ఉన్నది.
 • తెలియకపోవడంలో ఒక్కసారిగా రక్తస్రావం చూసేటప్పటికి భయాందోళనలకు గురి అవుతారు.
 • ముందుగా తెలుసుకోవడం వలన మొదటి నెలసరిని కూడా చక్కగా నిర్వహించగలుగుతారు.

నెలసరి ఎలా వస్తుంది

 • ఆడ శిశువు పుట్టిన దగ్గర్నుంచి అండాశయాలలో పూర్తిగా ఎదగని గుడ్లతో ఉన్న కణాల ఉండలు ఉంటాయి.
 • ఇవి దాదాపు మూడు నుంచి నాలుగు లక్షలుంటాయి.
 • ఇందులో 300 నుంచి 500 మాత్రమే పక్వం చెందుతాయి. మిగిలినవి పక్వదశకు ముందే నశిస్తాయి.
 • ఇవి పిల్లల్ని కనే దశ ( అంటే నెలసరి మొదలు నుంచి నెలసరి ఆగిపోయేవరకు) 12 నుంచి 50 సంవత్సరాల వరకు శరీరంలోని ఈస్ట్రోజన్ హర్మోన్ వలన నెలకి ఒక గుడ్డు (అండం) చొప్పున పక్వం చెందుతుంది.
 • అండం అండాశయం నుంచి బైటికి రావటాన్ని ఓవలేషన్ అంటారు. ఈ విడుదలయిన అండం పురుషునితో సంభోగంలో వీర్యకణంతో కలిస్తే స్త్రీ గర్భం దాలుస్తుంది.
 • పురుషునితో శారీరకంగా కలిసినప్పుడు నెలసరి రాకపోయినట్లయితే ఆ స్త్రీ గర్భం దాల్చినట్లు

 • అలా జరగనట్లయితే విడుదలయిన గుడ్డు (అండం) అండనాళములోనే నశించి అప్పటికే గర్భాశయం గోడలనంటుకొని నెలసరి తరువాత నుంచి పెరిగిన పొరతో యోని ద్రవాలతో కలిసి రక్తరూపంలో బయటకి వచ్చేస్తుంది. దీనినే నెలసరి / బహిష్టు / ముట్టు అంటాము.
 • అయితే పెద్దమనిషి అయిన తరువాత నెలసరి క్రమబద్ధంగా రావటానికి ఒకటి నుంచి రెండు సంవత్సరాల కాలం పట్టవచ్చు. పెద్దమనిషి అయిన కొత్తలో ఒకటి నుంచి రెండు సంవత్సరాల పాటు క్రమంగా రాకపోయే అవకాశం ఉంది. కలవరం చెందవలసిన అవసరం లేదు. అంతకు మించి కూడా రాకపోయినట్లయితే డాక్టరు / వైద్యుని సంప్రదించవలెను.
 • నెలసరి అనగా నెలకి ఒకసారి వచ్చేది అని అర్థం. అయితే ఖచ్చితంగా నెలకి ఒకసారి అనే కన్నా ఈ చక్రం 28 రోజుల నుంచి 45 రోజుల మధ్యలో రావచ్చు. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. బాలికలు నెలసరి వచ్చే తేదిని గుర్తుంచుకొనుటకు ఋతుచక్ర చిత్రాన్ని ఉపయోగించండి.
 • ప్రతి బాలిక నెలసరి తేదిని గుర్తుంచుకొని ఆ సమయంలో ఉపయోగించుకోవడానికి బట్ట/ ప్యాడ్ లను పేపరులో చుట్టుకొని అందుబాటులో ఉంచవలెను.
 • అదే విధంగా పది సంవత్సరాల వయస్సు వచ్చినప్పటి నుంచి బట్ట లేదా ప్యాడ్ అందుబాటులో ఉంచుకోవలెను. తద్వారా ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొనవచ్చును.

ఈ సమయంలో వ్యక్రిగత శుభ్రత చాలా ముఖ్యము, పాటించవలసిన శుభ్రతలు

 • నెలసరి అయిన వెంటనే స్నానం చేయడం, వీలయితే రెండు పూటలా
 • బట్టను / ప్యాడ్ ను రెండు పూటలా మార్చవలెనుneatness.jpg
 • బట్ట వాడినట్లయితే డిటర్జెంట్ తో మరకలు పోయే వరకు ఉతికి వేడి నీటిలో జాడించి ఆరవేయాలి.
 • ప్రత్యేకంగా నూలు బట్టని వాడితే రక్తస్రావాన్ని పీల్చుకుంటుంది. బజారులో కొన్న నాప్ కిన్స్ అయినా చాలా సేపు మార్చకుండా ఉంచుకుంటే పూర్తిగా తడిసి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి బట్ట లేదా నాప్ కిన్ రోజుకి రెండుసార్లు మార్చాలి.

 • జననాంగాలను పొడిగా శుభ్రంగా ఉంచుకోవాలి. స్నానం చేసేటప్పుడు రోజూ శుభ్రపరచుకోవాలి.
 • ఉతికిన బట్టను ఎండ తగిలే ప్రదేశంలో ఆరవేయాలి. ఆరిన బట్టను ఒక పాలీధీన్ కవర్ లో పెట్టి క్రమి కీటకాటకాదులు చేరని ప్రదేశంలో భద్రపరుచుకోవాలి.
 • ఈ విధంగా శుభ్రపరచిన బట్టను కూడా రెండు నుంచి మూడుసార్లు వరకు మాత్రమే వాడాలి. ఎందుకనగా ఎక్కువసార్లు వాడిన బట్ట గట్టిగా అట్టలాగ తయారై బాధకలిగిస్తుంది.

 • వాడిన బట్టని ఎక్కడ పడితే అక్కడ పడేయరాదు. చెత్తపారవేసే dustbin.jpgకుండీలలో లేదా స్కూళ్ళు హాస్టల్స్ లో అయితే ప్రత్యేకంగా దాని కొరకు పెట్టిన డబ్బాలో పారవేయాలి. అన్నింటి కన్నా కాల్చి వేస్తే చాలా మంచిది. పారివేసేటప్పుడు పాత పేపరులో బయటకు కనిపించకుండా చుట్టి బట్టను పారవేయండి.
 • బట్ట పారవేయటంలో ఎటువంటి అపోహలు నమ్మవద్దు. మరుగుదొడ్డిలో వేయకండి.

నెలసరిలో రక్తస్రావం ఎంత అవ్వవచ్చు

 • చాలా మంది ఇది చెడురక్తం అని నమ్మి ఎంత ఎక్కువ రక్తస్రావం జరిగితే అంత ఆరోగ్యానికి మంచిది అని నమ్ముతారు. ఎక్కువ రక్తస్రావం జరిగితే డాక్టరు / వైద్యుని సంప్రదించండి.
 • రోజుకి 2 – 3 (దుకాణాలలో దొరికేవి) నాప్ కిన్స్ తడిస్తే సహజం లేదా వాడుక భాషలో ఒక కప్పు రక్తస్రావం అయితే సహజం అని గుర్తించండి.

బహిష్టు సమయంలో కొంతమందికి కడుపులో, నడుములో విపరీతమైన నొప్పి రావడానికి కారణాలు

 • గర్భాశయ కండరాలు ముడుచుకుంటూ తెరచుకుంటూ పొరను బైటకు నెట్టె ప్రయత్నం చేయడం.
 • కొన్నిసార్లు రక్తం గడ్డలుగా ఉండి అది గర్భాశయ ద్వారం నుంచి బయటకి రావటానికి వీలుకాక పొత్తి కడుపులో నొప్పి రావచ్చు.
 • బాలికలలో వీటిని తట్టుకునే బలం లేకపోవడం కూడా ఒక కారణం
 • కడుపు నొప్పి లేదా నడుము నొప్పి వచ్చినపుడు పాఠించవలసినవి

  • తగిన విశ్రాంతి తీసుకోవలెను.
  • పని ఒత్తిడిని తగ్గించుకోవలెను.
  • గోరు వెచ్చని పాలు లేదా గృహ చిట్కా పాటించండి
  • నొప్పి ఎక్కువగా అనిపిస్తే ఎ.ఎ.ఎమ్ లేదా డాక్టరు / వైద్యుని సంప్రదించి తగిన సలహా/ వైద్యం పొందండి.

  అవసరం లేని ఆహార నిబంధనలు

  ఇంకపోతే చాలా మంది ఆహార నిబంధనలు పాటిస్తారు. ఈ సమయంలో శక్తినిచ్చే అన్ని ఆహారపదార్థాలు తీసుకోవాలి. తీసుకోవలసిన ఆహారపదార్థాలలో పాలు, పెరుగు కూడా ఉన్నాయి. ఆహారపదార్థాలకి, ఋతుస్రావం మరియు తెల్లబట్టకి, చెడువాసనకి ఎటువంటి సంబంధంలేదు. ఇనుము, కాల్షియం కలిగిన పదార్థాలను ఎక్కువగా తినండి. మరియు నీరు ఎక్కువగా త్రాగండి.

  అన్ని ఆకుకూరలు, కూరగాయలు, మాంసాహారం పండ్లు తినవచ్చు

  తెల్లబట్ట ప్రక్రియ

  కండ్లలో నీరు, నోటిలో లాలాజలం స్రవించుట ఎంత సహజమో యోనిలో తెల్లబట్ట స్రవించడం కూడా అంతే సహాజం. అయితే తెల్లబట్ట నెల మొత్తంలో ఒకే విధంగా స్రవించదు. ఆయా రోజులలో ఏ విధమైన మార్పు జరుగుతుందో తెలుసుకుందాం. నెలసరి కాలాన్ని 3 భాగాలుగా విభజించినట్లయితే ఉదా . 27 రోజుల నెలసరి కాలాన్ని తీసుకుందాం. ఈ 27 రోజులను మూడు భాగాలుగా చేస్తే మొదటి 9 రోజులలో నెలసరి 5 రోజులు కలిసి ఉంటాయి. 5 రోజుల అనంతరం యోని దగ్గర పొడారిన అనుభవం ఉంటుంది. మధ్య దినాలలో (అండం విడుదల అయ్యే రోజులు) అనగా 10, 11, 12, 13, 14 రోజులలో అండం విడుదలయ్యి తెల్లబట్ట నీరు వలె, తేటగా, జారుడు పదార్ధంలా ఉండి సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ రోజులలో తెల్లబట్ట ఎక్కువగా అవుతుంది. 15 మరియు 16 రోజులలో తెల్లబట్ట గట్టి పడడం జరుగుతుంది. మరల 17 నుంచి 26 రోజుల దాకా పొడారిన అనుభవం కలిగి నెలసరి రాబోయే ముందు రోజు తెల్లబట్ట చిక్కగా ఉంటుంది. ఈ విధంగా జరిగే మార్పుని సహజమైన ప్రక్రియగా భావించాలి. బాలికలు వారి యొక్క ఋతుచక్ర కాలాన్ని రోజులలో గుర్తించి పైన తెలిపిన విధానాన్ని పాటిస్తూ ఏ సమయంలో అండం విడుదల అవుతుందో తెలుసుకోవచ్చు. అంతేకాక ఆ సమయంలో అధికంగా తెల్లబట్ట అవుతదని తెలుసుకోవలెను. ఇలా కాకుండా నెలంతా తెల్లబట్ట అధికంగా అవుతున్నట్లయితే తెలిపిన శుభ్రతలు పాటిస్తూ డాక్టరు / వైద్యుని సంప్రదించండి.

  రోజుకి కొంచెం తెల్లబట్ట అవ్వడం సహజం

  పునరుత్పత్తి వ్యవస్ధకు సోకే అంటుని గుర్తించుట

  • అతి ఎక్కువ తెల్లబట్ట
  • తెల్లబట్టతో పాటు దురద
  • వాసనతో కూడిన తెల్లబట్ట
  • తెల్లబట్ట లేత ఆకుపచ్చ రంగులో ఉండుట
  • మూత్ర విసర్జన సమయంలో మంట
  • ఒరవడం

  తెల్లబట్ట విపరీతంగా అవుతూ పై లక్షణాలు ఉన్నట్లతే డాక్టరు / వైద్యుని సంప్రదించండి.

  యోనిని శుభ్రపరుచుకునేటప్పుడు పై నుండి క్రిందికి కడుగుకోండి

  నెలసరి వచ్చే ముందు కూడా కొన్ని లక్షణాలు కన్పిస్తాయి. అయితే ఈ లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు. వ్యక్తికి వ్యక్తికి మధ్య వ్యత్యాసాన్ని చూడవచ్చు.

  • ఛాతీ గట్టిపడి నొప్పిగా ఉండడం
  • నడుములో నొప్పి
  • వికారంగా ఉండడం
  • కడుపులో నొప్పి
  • తొడలు లేదా పిక్కల నొప్పి
  • తలనొప్పి మొదలైనవి కలుగవచ్చు.

  నెలసరిని సుఖమయం చేసుకొనుట

  సరియైన బట్టవాడుతూ తరచుగా మారుస్తూ శుభ్రతలు పాటిస్తున్నట్లయితే ఆ అయిదు రోజులలో కూడా సౌకర్యంగా ఉండవచ్చు.

  అయితే ఆర్ధిక ఇబ్బందుల వలన ప్రతివారు బజార్లో దొరికే నాప్ కిన్స్ వాడలేకపోవచ్చు. ఇంటిలోనే అందుబాటులో నున్న నూలుబట్టతో బట్ట తయారు చేసుకోవచ్చు.

  ప్యాడ్ ను తయారు చేసుకునే విధానం

  పాత నేత చీరలు లేదా పంచెలను తయారీకి ఉపయోగించవలెను. ఒక వేళ పాతవి ఇంటిలో లేనట్లయితే పాత బట్టలు అమ్మే వారి దగ్గర నూలు చీర కొనుక్కోవచ్చు. కొన్న చీరని వేడినీటిలో ముంచి బట్టలుతికే సబ్బుతో ఉతికి ఎండకి ఆరవేయాలి. దానితో క్రిమిరహితం అవుతుందిpyad.jpg. ఆ బట్టని తీసుకొని పొడవుగా కత్తిరించుకోవలెను. పొడవుని పొత్తి కడుపు నుంచి క్రిందకి పెడ్తు వెనుకకి మడచి పిరుదులపైకి అనగా వెనుక నడుము వరకు బట్ట బాగాన్ని వెడల్పుగా ఉండునట్లు చూసుకొనవలెను. కొనలు (చివర) కొసవలె పటము - 4, 5 లో చూపిన విధంగా కత్తిరించుకోవలెను. దానికి ఒక తొడుగువలె కుట్టుకోవలెను. మధ్య భాగంలో 10 – 11 అంగుళాల పొడవు, 2 – 3 అంగుళాల వెడల్పుతో దిండులా కత్తిరించి ఆ తొడుగులో పెట్టుకొనవచ్చు లేదా పటము - 6 లో చూపిన విధంగాను తయారు చేసుకోవచ్చు. ఇంకా తేలికలో తయారు చేసుకోవాలంటే టైలర్ దగ్గర దొరికే వృదా ముక్కలను ఆ తొడుగులో కూర్చి ఎప్పటికప్పుడు వాడి పారవేయవచ్చు. దూదిని శుభ్రపరచిన పాత బట్టలో చుట్టి ప్యాడ్ వలె వాడవచ్చు. వాటితో పాటు బాలికలు మామూలు రోజులలో కూడా శుభ్రత పాటించడం అవసరం. బాలికలు పాత గుడ్డలని ఉండలా చుట్టి యోని రంధ్రములోనికి దూర్చే విధానం మంచిది కాదు. గోని సంచి ముక్కలు మొదలగు అశుభ్రమైన వాటిని వాడరాదు. నైలాన్ బట్టను నెలసరిలో ఉపయోగించరాదు . ఒకరు వాడిన బట్టను / లో దుస్తులను ఇంకొకరు వాడరాదు.

  వ్యక్తిగత పరిశుభ్రత

  • రోజు స్నానం ( వీలయితే రోజుకి రెండు సార్లు). వారంలో ఒకటి / రెండు సార్లు తల స్నానంvyakhigathaparishubrata.jpg
  • క్రమంగా పేలు తొలగించడం మరియు గోళ్ళు కత్తిరించుకోవడం.
  • ప్రతిరోజు ఉతికిన బట్టలు ధరించడం. ముఖ్యంగా లోబట్ట ప్రతిరోజు ఉతకాలి / మార్చాలి.
  • మల విసర్జన తరువాత భోజనానికి ముందు సబ్బుతో చేతులు కడుక్కోవడం
  • మట్టి నేలలో తిరిగేటప్పుడు చెప్పులు వేసుకోవాలి.
  • పరిసరాలని శుభ్రంగా ఉంచి దోమల వలన వ్యాపించే వ్యాధులను నివారించడం.

  బాలికలు తెలుసుకోవలసిన ముఖ్యమైన అంశాలు

 • ఆడ పిల్లల పెళ్ళి వయస్సు 21 సంవత్సరాలు మగ పిల్లల పెళ్ళి వయస్సు 25 సంవత్సరాలు
 • బాల్య వివాహాలు నిషేదం / చట్టవిరుద్ధం
 • చిన్న వయస్సులో గర్భం దాలిస్తే గర్భంస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ
 • చిన్న వయస్సులో లైంగిక సంబంధాలు ఆరోగ్యానికి హానికరం. గర్భంస్రావం హానికరం.
 • గర్భిణీ సమయంలో స్త్రీ తప్పనిసరిగా 5 గర్భిణీ తనిఖీలు పొందవలెను.
 • ప్రతి గర్భిణీ స్త్రీ కాన్పు ఆసుపత్రిలోనే జరిగే విధంగా చూసుకోవలెను.
 • ఒకరు లేక ఇద్దరు పిల్లలు చాలు
 • తల్లి ఆరోగ్యంగా ఉండాలంటే బిడ్డకి బిడ్డకి మధ్య 3 సంవత్సరాల ఎడం ఉండాలి.
 • బిడ్డకి బిడ్డకి మధ్య ఎడం ఉండాలంటే వాడవలసిన సాధనాలు ఆడవారికి - నోటి మాత్రలు ఐ.యు.డి మగవారికి - కండోమ్
 • హెచ్.ఐ.వి ఈ క్రింది తెలిపిన వాటి ద్వారా సంక్రమిస్తుంది.
  1. లైంగిక సంబందాలు
  2. రక్తమార్పిడి
  3. అరక్షిత లైంగిక పద్ధతులు
  4. శుభ్రపరచని (క్రిమి రహితం) సూదుల వాడకం
  5. వివాహేతర లైంగిక సంబందాలు
 • మొదటి దశను హెచ్.ఐ.వి అంటారు తరువాత ఎయిడ్స్ గా పరిణామం చెందుతుంది
 • వివాహేతర / అక్రమ లైంగిక సంబంధాల వలన సంక్రమించేవే సుఖవ్యాధులు. ఇవి ఆరోగ్యానికి హనికరం
 • వీటి ద్వారా సుఖవ్యాధులు సంక్రమిస్తాయి. దీని ఫలితం హెచ్.ఐ.వి కావచ్చు.
 • ఆడ పిల్లలకి అక్షరాస్యత ప్రథమ అవసరం
 • సాధికారత కలిగి సాంఘిక దురాచారాలను ఎదుర్కోవాలి.
 • వీటిని ఎదురుర్కోవాలంటే ప్రతి బాలిక విద్యావంతురాలు కావాలి.
 • వ్యాధి నిరోధక టీకాల పట్టిక

  ఎవరికి ఇవ్వాలి

  ఎప్పుడు

  ఇవ్వాలి

  వ్యాక్సిన్

  ఇవ్వవలసిన మోతాదుల సంఖ్య

  ఏ విధంగా

  ఇవ్వాలి

  ఎంత

  ఇవ్వాలి

  శిశువులకు

  పుట్టిన వెంటనే

   

  6వారాల నుండి (4 వారాల వ్యవధి 3  1/ 2 నెలలలోపు మూడు డోసులు 9 నెలలు నిండిన తరువాత 12 నెలల వరకు 16 నుండి 24 నెలల వరకు ( బూస్టర్ డోస్)

  బిసిజి

   

   

   

  డిపిటి

   

  పొలియో

   

   

   

   

   

   

  తట్టు

   

   

   

   

   

   

  డి.పి.టి

   

  పొలియో చుక్కల మందు

   

   

  1

   

   

   

  3

   

   

  3

   

   

   

   

   

   

  1

   

   

   

   

   

   

  1

   

  1

   

  1

   

   

   

   

   

   

  చర్మపు పొరలలోనికి ఇంట్రాడెర్మల్

  కండరంలోనికి (ఇంట్రామస్కులర్ నోటిలో

   

   

   

   

   

   

   

   

  ధాతుపొరలోనికి (సబ్ క్యూటేసియస్)

  కండరంలోకి

  నోటిలో

  0.1  ఎమ్ఎల్

   

   

   

   

  0.5 ఎమ్ఎల్

   

  2 చుక్కలు

   

   

   

   

   

   

   

   

   

  0.5 ఎమ్ఎల్

   

  0.5 ఎమ్ఎల్

  2 చుక్కలు

   

  పిల్లలకు

  5 సం!!లు

  10 సం!!లు

  16 సం!!లు

  టి.టి

  టి.టి

  టి.టి

  1

  1

  1

  కండరంలోకి

  కండరంలోకి

  కండరంలోకి

   

  స్త్రీలకు

  గర్భవతిగా ఉన్నప్పుడు

  టి.టి

  2

  కండరంలోకి (ఇంట్రామస్కులర్)

  0.5 ఎమ్ఎల్

  3.0
  Saleem khan May 28, 2020 07:44 PM

  Nice information. Very useful..

  మీ సూచనను పోస్ట్ చేయండి

  (ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

  Enter the word
  నావిగేషన్
  పైకి వెళ్ళుటకు