హోమ్ / ఆరోగ్యం / పిల్లల ఆరోగ్యం / క్రానిక్ మైలోసైటిక్ ల్యుకేమియా (సి ఎం ఎల్)
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

క్రానిక్ మైలోసైటిక్ ల్యుకేమియా (సి ఎం ఎల్)

క్రానిక్ మైలోసైటిక్ ల్యుకేమియా (సి ఎం ఎల్) స్త్రీలకైనా, పురుషులకైనా; ఏ వయసువారికైనా రావచ్చు. అయితే, సాధారణంగా, 10 సంవత్సరాల లోపు పిల్లలకు ఈ వ్యాధి రాదు.

క్రానిక్ మైలోసైటిక్ ల్యుకేమియా (సి ఎం ఎల్)

క్రానిక్ మైలోసైటిక్ ల్యుకేమియా (సి ఎం ఎల్) స్త్రీలకైనా, పురుషులకైనా; ఏ వయసువారికైనా రావచ్చు. అయితే, సాధారణంగా, 10 సంవత్సరాల లోపు పిల్లలకు ఈ వ్యాధి రాదు. సర్వసాధారణంగా ఈ వ్యాధి 40-60 మధ్య వయస్సు వారికి వస్తుంది. సామాన్యంగా, రెండు ప్రత్యేక క్రోమోజోములు , ఫిలడల్ఫియల్ క్రోమోజోముగా రూపొందడమే ఈ వ్యాధికి రావడానికి కారణం. ఈ ఫిలడల్ఫియల్ క్రోమోజోము, టైరోసిన్ కినేజ్ అనే ఒక అసాధారణమైన ఎంజైంను ఉత్పత్తిచేస్తుంది. ఈ ఎంజైం కారణంగానే, తెల్లరక్తకణాలు అసాధారణ రీతిలో పెరగుతాయి.
సి ఎం ఎల్ లో, ల్యుకేమియా కణాలు చాలావరకు ఎముక మూలుగు ( బోన్ మారో) లోనే ఉత్పత్తి అవుతాయి. ప్లీహంలోను, కాలేయంలోకూడా కొన్ని ల్యుకేమియా కణాలు ఉత్పత్తికావచ్చు. యాక్యూట్ ల్యుకేమియాలలో మాదిరిగా, పెరుగుదల సరిగాలేని తెల్ల రక్త కణాలు అధిక సంఖ్యలో వుండడం కాకుండా; సి ఎం ఎల్ లో, సాధారణమైనవిగానే కనిపించే తెల్ల రక్త కణాల సంఖ్య, కొన్నిసార్లు ప్లేటిలెట్ల సంఖ్య కూడా గమనించదగినంతగా పెరుగుతుంది. క్రమేణా వ్యాధి పెరిగేకొద్దీ, అధిక సంఖ్యలో ల్యుకేమియా కణాలు, ఎముక మూలుగును నింపివేస్తాయి. మరికొన్ని రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయి.

వ్యాధి లక్షణాలు

క్రమేణా, ల్యుకేమియా కణాలు మరిన్ని మార్పులకు లోనవుతాయి. వ్యాధి రెండవదశను యాక్సిలరేటెడ్ దశ అని, మూడవ / చివరిదశను బ్లాస్ట్ క్రైసిస్ దశ అని అంటారు. బ్లాస్ట్ క్రైసిస్ దశలో సాధారణంగా, ప్లీహం (స్ప్లీన్) బాగా వాయడం, జ్వరం రావడం, బరువు తగ్గడం వుంటాయి. సి ఎం ఎల్ ప్రారంభ దశ అయిన క్రానిక్ దశలో , ఈ వ్యాధిని గుర్తించే లక్షణాలేమీ కనిపించకపోవచ్చు. అయితే, కొందరిలో అలసట, బలహీనత, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, జ్వరం రావడం, రాత్రిపూట చెమట పట్టడం, ప్లీహం పెరగడంవల్ల సాధారణంగా , కడుపు నిండుగావున్నట్టు అనిపించడం వంటివి గమనించవచ్చు. వ్యాధి బ్లాస్ట్ క్రైసిస్ దశకు చేరే కొద్దీ, ఎర్ర రక్త కణాల సంఖ్య , ప్లేటిలెట్ల సంఖ్య మరింతగా తగ్గుతూ, పాలిపోవడం, గాయాలుకావడం, రక్తం కారుతుండడం వల్ల ఈ వ్యాధిసోకినవారు మరింతగా కుంగి పోతారు.

వ్యాధిని గుర్తించడం

  • సాధారణ రక్తపరీక్షలో కనిపించే అనుమానాస్పదమైన అంశాలనుబట్టి, సి ఎం ఎల్ ను గుర్తిస్తారు. రక్త పరీక్షలో, తెల్ల రక్తకణాల సంఖ్య అసాధారణమైన రీతిలో , చాలా ఎక్కువగా వున్నట్టు ఈ రక్త పరీక్ష బయటపెట్టవచ్చు. రక్తం నమూనాను మైక్రోస్కోప్‌లో పరీక్షించినపుడు, ఎముక మూలుగులో మాత్రమే కనిపించే విధంగా, ఎదుగుదల బాగా తక్కువగావుండే, తెల్ల రక్త కణాలు కనిపించవచ్చు.
  • క్రోమోజోములను ( సైటో జెనెటిక్ క్రోమోజోములు, లేదా, మాలిక్యులర్ జెనెటిక్ క్రోమోజోములు) విష్లేశించే పరీక్ష ద్వారా, ఫిలడల్ఫియా క్రోమోజోమును గుర్తించి, వ్యాధిని నిర్ధారించడంతోపాటు , వ్యాధి పరిణామాన్ని ఊహించగలిగి, ఏ రకమైన చికిత్స అవసరమో స్పష్టంచేయవసి వుంటుంది

చికిత్స

  • ఈ వ్యాధికి చేసే చికిత్సలు, చాలావరకు, వ్యాధిని తగ్గించలేనప్పటికి, వ్యాధి ముదరడాన్ని నిదానం చేయగలుగుతాయి. కొత్త రకాల మందులు, ఫిలడల్ఫియా క్రోమోజోం ఉత్పత్తిచేసే అసాధారణ ఎంజైంను అడ్డుకుంటాయి. మిగతా చికిత్సలకంటె, ఈ మందులు చాలా ఎక్కువ ప్రభావం చూపగలగడమే కాకుండా, వీటివల్ల ఇతర దుష్ఫలితాలు కూడా తక్కువ.
  • వ్యాధిని గుర్తించిన తర్వాత ఐదేళ్ళు గడిస్తే, ఆపై, జీవించే అవకాశం 90 % పైగా వుంటుంది.
  • ఎక్కువ పరిమాణాలలో కెమోథెరపి ఇవ్వడంతోపాటు, స్టెమ్సెల్ మార్పిడి జరిపితే, సి ఎం ఎల్ నయంకావచ్చు. అయితే, కొందరి విషయంలోనే, మూలకణాల మార్పిడి కుదురుతుంది. సరిపోయే ధాతు నిర్మాణం కలిగినవారినుంచి, సాధారణంగా తోబుట్టువులనుంచి, సేకరించే మూలకణాలు మాత్రమే, మార్పిడికి పనికివస్తాయి.
  • వ్యాధి ప్రాధమిక దశలో మూలకణాల మార్పిడి జరిపితే, బాగా ఎక్కువ ప్రభావం చూపగలుగుతుంది. వ్యాధి పెరిగేకొద్దీ, లేదా బ్లాస్ట్ క్రైసిస్ దశ చేరితే ఫలితం చాలా స్వల్పంగావుంటుంది.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

2.97345132743
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు