గ్రామంలో పారిశుధ్యం లోపించిన ప్రదేశాలలో చిన్న పిల్లలకి నులి పురుగులు, బద్దె పురుగులు, సూది పురుగులు, నట్టలు కడుపులో చేరి వారి రక్తాన్ని పీల్చి ఆహార లోపం కలుగచేస్తాయి. దీని మూలంగా పిల్లలు బరువు కోల్పోయి, సన్నగా పీలగా, అనారోగ్యంగా తయారవుతారు. చదువులో కూడా వెనుకబడి పోతారు.
బయలు ప్రదేశంలో మల విసర్జన, ఆహారం తీసుకునే ముందు కాళ్ళు, చేతులు శుభ్రపరచుకోకపోవడం, మల విసర్జన తరువాత చేతులు సబ్బుతో కడుక్కోకపోవడం, గోళ్ళలో మచ్చి పేరుకుపోవడం.
ఎ.ఎన్.ఎం. లేదా పి.హెచ్.సి. డాక్టరు సహాయంతో పురుగులు తొలగించే మందులు వాడాలి. పరిసరాల పారిశుధ్యం, మరుగుదొడ్లు వినియోగం యొక్క ఆవశ్యకత గురించి అవగాహన కల్పించాలి.
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు