অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పిల్లలకు పోషకాహారం

బడికి వెళ్ళే ముందు వయసు పిల్లలకు  పోషకాహారం (1-5 సంవత్శరాలవయసు)

 • చనుబాలు మానిపించేందుకు ఇది కీలకమైన సమయం
 • ఇతర వైవిధ్యమైన ఆహారాన్ని జోడించేందుకు పాలపరిమాణాన్ని మెల్లగా తగ్గించాలి.
 • చిన్నబిడ్డల యొక్క ఆహారానికి ప్రత్యేకశ్రద్ధ మరియు ప్రణాళిక అవసరం
 • శక్తి మరియు పోషకాల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఆకలి తక్కువగా ఉంటుంది మరియు ఆహారపు అలవాట్లు గడబిడగా ఉండొచ్చు.కాబట్టి,వారి ఆహారం క్రమమైన,చిన్నవైన పోషకసాంద్రతతోకూడినవిగా ఉండాలి.

బడికి వెళ్ళేముందు వయసు పిల్లలకు  తగిన ఆహారం

 • ఆరవనెలనుంచి తల్లిపాలతోపాటు మంచి అనుబంధ ఆహారం తీసుకుంటున్న శిశువు తనఎదుగుదలకు,అభివృద్ధికి కావాల్సిన అన్ని పోషకాలను తీసుకుంటున్నట్లే.అదేఆహారాన్ని కొద్దిగా పరిమాణం పెంచి కోరినవెంటనే తల్లిపాలతోబాటు కొనసాగించాలి.
 • తిండిలో అన్ని సమూహాలనుంచిఆహారాన్ని తీసుకోవాలి.1-2 సంవత్శరాల వారికి ఇచ్చే సగటు ఆహారములో ఉండాల్సినవి,

వండిన తృణధాన్య లేదా పిండితో కూడిన కూరగాయలను రోజుకు మూడుసార్లు

 • ఆవుపాలు-తల్లిపాలు తాగుతున్నవారికి కనీసం రోజుకు 200మిల్లీలీటర్లు మరియు తల్లిపాలుతాగనివారికి రోజుకు కనీసం 500 మిల్లీలీటర్లు.కొద్దిపాలకు బదులుగా జున్ను లేదా పెరుగు కూడా ఇవ్వవచ్చు.ఆవుపాలు సహించకపోతే ప్రత్యామ్న్యాయాన్ని ఇవ్వవచ్చు(సోయాపాల వంటిది),ఏదిఏమైనప్పటికీ ఆ ప్రత్యామ్నాయాలలో కొవ్వు తక్కువగా ఉండటంవల్ల రెండేళ్ళలోపు పసిబిడ్డలకు సిఫారసుచెయ్యబడలేదు.
 • కాయధాన్యాలు,మాంసము లేదా చేపలు రోజుకొకసారి
 • ఏ రూపములో వండినా రోజుకొక్కటిచొప్పున వారానికి కనీసం నాలుగు గుడ్లు
 • జియల్ వి లేదా ఇతర ఉడికించినకూరగాయలు రోజుకు రెండుసార్లు
 • ఫలాలు రోజుకొకసారి;అదనపు ఫలాలు కూరగాయలకు బదులుగా లేదా కూరగాయలకు బదులుగా ఫలాలు ఇవ్వవచ్చు.
 • బిడ్డతినేతిండియొక్కపరిమాణము ఆ బిడ్డ యొక్కఆకారము మరియు అటపాటలమీద ఆధారపడి ఉంటుంది
 • ఆహారపరిమాణాన్ని నెమ్మదిగా పెంచవచ్చు,కానీ ఏ నిర్దిష్టమైన దశలో ఎంత ఆహారం అవసరమన్నది తెలియజెప్పే మంచి సాధనం ఆకలి
 • కుటుంబంతీసుకునేది గనుక మంచిఆహారమైతే పిల్లలు  ఇంటితిండిని పొందవచ్చు,వారికి ఐదేళ్ళప్రాయం వచ్చేసరికి మిగతాకుటుంబసభ్యులలాగానే వారు మంచిపీచుకలిగిన ఆహారము తింటూఉంటారు.
 • భోజనవేళలు క్రమంగా ఉండాలి.ఉదయపు అల్పాహారం చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి అది పోషకాలతో కూడినదిగా ఉండాలి.
 • కొవ్వుతో,చక్కెరతోకూడిన పదార్ధాలను తీసుకోవటం నియంత్రించాలి.వంటనూనెలు,చక్కెర,బిస్కట్లు,కేకులు,మిఠాయిలు,చాకొలేట్లు,ఐస్ క్రీములు మరియు తీయటిపానీయాలు ఉదహరణలు.ఇవి పిల్లలయొక్క ఇతరపోషకాహార వినియోగాన్ని ప్రభావితం చేస్తాయి.వారికి భోజనము మధ్యలోకాక భోజనానంతరం ఒక చిరుతిండిగా ఇవ్వండి.తీయటితిండిపదార్ధాలు మరియు పానీయాలు(పళ్ళరసంతో సహా)పిల్లలలో దంతక్షయానికి దారితీస్తాయి.భోజనాలకు మధ్యలో పాలు లేదా నీరు మంచిపానీయాలు.
 • చిన్నపిల్లలకు అదనపుఎ,సి,మరియు డి విటమిన్లను అనుబంధాలుగా ఇవ్వవచ్చు.
 • పిల్లలు విపరీతంగా బరువుపెరుగుతుంటే,చిరుతిళ్ళను తగ్గించాలి,ముఖ్యంగా మిఠాయిలు మరియు చాకొలేట్,వారిని ఆటలాడవలసిందిగా శారీరకంగా చురుగ్గా ఉండేలా ప్రోత్శహించాలి. పిల్లలు సరిగ్గా బరువుపెరగకపోతే వైద్యసలహా తీసుకోవాలి
 • జబ్బుపడ్డప్పుడు మరియు కోలుకున్నాక పిల్లలకు సరైనరీతిలో ఆహారం అందించాలి ,లేనిచో అది పిల్లల ఎదుగుదలను ఆటంకపరుస్తుంది.

పాఠశాలకు వెళ్తున్న పిల్లలకు పోషకాహారము

 • భోజనములు మరియు చిరుతిళ్ళు అన్నీ పోషకాహారము మరియు శక్తిపూర్ణమైనవిగా ఉండటం అన్నది చాలా కీలకం
 • వారివారి వయసు మరియు చురుకుదనము స్థాయినిబట్టి పాఠశాలవయసు బాలబాలికలు ప్రతిరోజూదాదాపు 1600 నుంచి 2400 కాలరీలు అవసరమవుతాయి,ఒకసారి వారు ఎదుగుదలను అందుకున్నాక బాలికలకు అదనముగా 200కాలరీలు బాలురకు 500 అదనముగా అవసరమవుతాయి.
 • ఆహారపదార్ధాలను అయిదు ప్రధాన ఆహారసమూహాలనుంచి ఎంపిక చెయ్యాలి.కొవ్వు మరియు తీపిచిరుతిళ్ళను మితంగా ఇవ్వాలి.
 • ఆరోగ్యవంతమైన బరువును నిలబెట్టుకొనటానికి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవటాన్ని ప్రోత్సహించండి.
 • పిల్లలు సరిపడినంత కాల్షియం,ఐరన్,మరియు బికాంప్లెక్స్ గ్రూపు విటమిన్లు ప్రత్యేకించి ఫాలికామ్లము తీసుకుంటున్నారో అన్నది గమనించాలి/అది ఐరన్ మాంసేతర వనరులనుండిఎక్కువప్రభావవంతముగా  గ్రహించేందుకు,దానిని విటమిన్ సి సమృద్ధిగా  పుల్లని ఫలాలు మరియు పళ్ళరసాలతోఉన్నవాటితో కలపండి.

తల్లిదండ్రులకు మార్గదర్శకాలు

 • పిల్లలకు ప్రధానాహారము మూడు క్రమబద్ధమైన భోజనాలు ఉదయం మధ్యలో మరియు మిట్టమధ్యాహ్నం లేదా పడుకోబోయేముందర అదనపు చిరుతిళ్ళు ఏమన్నా ఉంటే.రోజంతా తినటాన్ని ప్రోత్శహించకండి.
 • పిల్లలను వారిఆహారం వారేతీసుకునేలా ప్రోత్శహించండి
 • భోజనాన్ని తాజాగా ఆకర్షణీయంగా ఉండేలా వడ్డించండి
 • పిల్లలు సులభంగా తినగలిగేలా ఆహారాన్ని ఇవ్వండి(ఉదా.చిన్నచిన్నముక్కలుగా కోసి)
 • పిల్లలను బలవంతంగా తినేలా చెయ్యవద్దు
 • ఆహారానికి బదులుగా పాలు ఇవ్వవద్దు
 • పూర్తిధాన్యాల మరియు తృణధాన్యాల రొట్టెలను ఎంపికచేసుకోండి
 • బాగావేయించిన పదార్ధాలను తీసుకోకపోవటం,ఆరోగ్యవంతమైన వంటపద్ధతుల ద్వారా కొవ్వును తగ్గించండి
 • ఉప్పు మసాలా తక్కువగా ఉండే ఆహారాన్ని ఎంపికచేసుకోండి
 • మీపిల్లలను భోజనము యొక్క ప్రణాళికలో తయారీలో భాగస్వాములయ్యేలా ప్రొత్శహించండి.

ఆరోగ్యచిట్కా

పిల్లల ఆదర్శ ఎత్తు మరియు బరువును నిర్ధారించేందుకు సులభసూత్రం

ఆదర్శ బరువు

 • ఒకటి నుంచి ఆరుసంవత్శరాల వయసున్న పిల్లలకు,వయసును రెండుతోటి హెచ్చించండి మరియు దానికి ఎనిమిదికలిపితే ఆపిల్లవాడి ఆదర్శబరువు తెలుస్తుంది.ఉదాహరణకు,పిల్లవాడికి నాలుగు సంవత్శరాల వయసు అయితే,నాలుగును రెండుతో హెచ్చిస్తే అది ఎనిమిదికి సమానం కాబట్టి,ఎనిమిది ఎనిమిది కలిపితే పదహారు.పదహారు కిలోలబరువు మంచిదే

ఆదర్శఎత్తు

 • ఎత్తుతెలుసుకొనటానికి వయసును  ఆరుతో హెచ్చించి మరియు దానికి  77ను కలపాలి.ఉదాహరణకు పిల్లవాడికి నాలుగు సంవత్సరాలయితే ఆరును నాలుగుతో హెచ్చిస్తే అది 24 దానికి 77కలిపితే 101.
 • గమనిక:ఒకవేళ పిల్లవాడు ఉండాల్సిన ఎత్తుకన్నా పొడవుగా ఉంటే ఆ ఎత్తుకు సరిపడా బరువున్నాడా లేదాఅన్నది పోలిక చార్టులనుపయోగించి కనుక్కోవాలి

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate