హోమ్ / ఆరోగ్యం / పిల్లల ఆరోగ్యం / పిల్లలకు సున్తి
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

పిల్లలకు సున్తి

మగ పిల్లలకు జన్యత పురుషాంగం చివరి భాగాన్ని కప్పుతు పడగవలె వదులుగా అధిక చర్మం వుంటుంది. ఇది ముందు వెనుకలకు పురుషాంగం పై కప్పుతుంది. సుంతి శస్త్ర చికిత్సలో ఈ వదులుగా అధికంగా ఉన్న చర్మాన్ని తొలగిస్తారు.

 

సుంతి:

మగ పిల్లలకు జన్యత పురుషాంగం చివరి భాగాన్ని కప్పుతు పడగవలె వదులుగా అధిక చర్మం వుంటుంది. ఇది ముందు వెనుకలకు పురుషాంగం పై కప్పుతుంది. సుంతి శస్త్ర చికిత్సలో ఈ వదులుగా అధికంగా ఉన్న చర్మాన్ని తొలగిస్తారు. దీనితో పురుషాంగం చివర భాగం బయటపడుతుంది.

ఈ శస్త్ర చికిత్స మగబిడ్డ పుట్టిన 48 గంటలలో చేయడం ఉత్తమం కానీ సాధారణంగా మొదటి 10 రోజులోపల చేయిస్తూ వుంటారు. బిడ్డ పెరిగే కొద్దీ ఇది క్లిష్టమవుతుపోతుంది.

నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలకు మరియు ఇతర సమస్యలతో పుట్టిన పిల్లలకు ఇది ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్ళే వరకు సాధారణంగా చేయరు.

పురుషాంగం లోపాలతో పుట్టిన పిల్లలలో ఈ శస్త్ర చికిత్స చేయరు. ఎందుకంటే లోపాలు సరి చేసే శస్త్ర చికిత్సలో ఈ అధిక చర్మం ఉపయోగపడవచ్చు.

 • సుంతి జరిగిన పిదప పురుషాంగం గురించి తీసుకొనవలసిన జాగ్రత్తలు ప్రతిసారీ స్నానాంతరం సబ్బు గోరు వెచ్చని నీటితో శుభ్రపరచాలి. సుంతీ శస్త్ర చికిత్స తరువాత బిడ్డకు కొంత ఆ ప్రాంతంలో కొంత అసౌకర్యంగా ఉంటుంది. శుభ్రపరిచేటప్పుడు కొంత సున్నితంగా పట్టుకోవాలి.
 • సాధారణంగా పుండు మానడానికి, 7 నుంచి 10 రోజులు పడుతుంది. అంత వరకు మొన పచ్చిగా, పసుపురంగులో ఉంటుంది.

ఈ క్రింది పరిస్థితులలో వైద్య సలహా తీసుకొనవలసి ఉంటుంది.

 • ఆగకుండా రక్తస్రావం జరుగుతువున్నచో.
 • మొన చుట్టూ ఎర్రబడటం , 3 రోజులలో ఇంకా ఎక్కువయిన పక్షంలో
 • జ్వరం చీముతో నిండిన బొబ్బలు కనబడితే
 • సుంతీ తరువాత 7 నుంచి 8 గంటల తరువాత మూత్రము చేయని పక్షంలో

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

సున్తీ చేయడం (నెల లోపే) వలన చాలా ప్రయోజనాలు

పుట్టిన పిల్లలకు సున్తీ చేయడం (నెల లోపే) వలన చాలా ప్రయోజనాలను చేకూరస్తుంది అవి:

 1. పరిసరాల అంటువ్యాధుల నుంచి  పురుషాంగం కు రక్షణ ఇస్తుంది.ఒకవేళ పురుషాంగం మొదటి పై భాగం  చర్మం ఉంచితే దాని వలన  అంటు వ్యాదులు సోకే ప్రమాదం ఉంది. సున్తీ చేయించడం వలన అంటూ వ్యాదులకు దూరంగా ఉంటారు. పురుషులకు యవ్వన దశలో చాలా అంటూ వ్యాదులకు గురి అవుతారు. దానిలో ముఖ్యంగా పురుషాంగం కు సోకే వ్యాదులు చాలా ప్రమాదకరమైనవి.
 2. మూత్రం వలన  అంటువ్యాదులు సంక్రమణ. చాలా అధ్యయనాల ప్రకారం  సున్తీ చేయించని బాలురు మూత్రం  అంటువ్యాదులకు గురి అవుతున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం 39రెట్లు సున్తీ చేయబడని వారు  మూత్ర అంటువ్యాదులకు గురి అవుతున్నారు.ఇంకా కొన్ని అధ్యయనాల ప్రకారం పది రెట్లు ఎక్కువగానే అంటువ్యాధులకు గురి అవుతున్నారు. 95%బాలురు సున్తీ చేయించుకోనివారు మూత్ర అంటువ్యాదులకు గురి అవుతున్నారు. అయితే సున్తీ చేయించుకున్న బాలురుల్లో  5%కూడా అంటువ్యాదులకు గురి కాజాలరు.
 3. మూత్ర అంటువ్యాధులు కొన్ని సందర్భాలలో  ఘోరమైన అనారోగ్యానికి గురి చేస్తుంది. ప్రొఫెసర్ వైస్ వెల్ అధ్యయనాల ప్రకారం 36% బాలురుల్లో 88 బాలురులు మూత్ర అంటువ్యాధులకు గురి అవుతున్నారు.  అదే బ్యాక్టీరియా వారి రక్తంలో కూడా కనుగొనబడింది. అందులో ముగ్గురు బాలు రులు నాడీ మండల శోధతో ఇబ్బంది పడుతున్నారు. మరో ఇద్దరు పూత్ర పిండాల వైఫల్యం తో  భాధపడుతున్నారు. మిగతా ఇద్దరు శరీరంలో సూక్ష్మజీవులు వ్యాపించి మరణించారు.
 4. మూత్రం వలన కలిగే క్యానర్ కారకాలకు వ్యతిరేఖంగా రక్షణ. ఎంతమంది అయితే సున్తీ చేసుకున్నవారున్నారో దాదాపు వారందరూ పురుషాంగ క్యాన్సర్ కొంచెం కూడా లేదు. యు.ఎస్ లో సున్తీ చేయించుకున్న  వారి శాతం సూన్యం. ఇక్కడ ఉన్న ప్రతి  100,000మంది జనాభా లో ప్రతి 2.2 మనుషులలో సున్తీ చేయించని వారున్నారని డాక్టర్ ముహమ్మద్ అలీ బిన్ బార్ వివరిస్తున్నారు. దీని వలన  యు.ఎస్ లో కొంచెం మంది మాత్రం సున్తీ చేయించుకుంటున్నారు. అయినప్పటికీ  అక్కడి క్యాన్సర్ భాదితులు సంవత్సరానికి 750 నుండి  1000మంది వరకు ఉంటున్నారు. ఒకవేళ వీరు సున్తీ చేయించుకోవడం మానివేస్తే సంవత్సరానికి వీరి జనాభా 3000పెరుగుతుంది. ఇంకా కొన్ని చైనా, ఉగాండా, పుఎర్తో రికో  దేశాలలో సున్తీ చేయించుకోనక 12-22 %పురుషులు పురుషాంగ క్యాన్సర్ వ్యాధి తో భాదపడుతున్నారు.
 5. Sexually transmitted diseases (STDs).  లైంగిక వ్యాధులు : పరిశోధకులు కనుగొన్నదేమిటంటే లైంగిక వ్యాదులు సోకడానికి కారణాలు ఏమిటంటే, వారు సున్తీ చేయించుకోకపోవడం మరియు చాలా మంది వ్యభిచారానికి లేదా వివాహేతర సంబందానికి పాల్పడటం,స్వలింగ సంపర్కానికి పాల్పడటం. ముఖ్యంగా హెర్పెస్, మృదువైన chancres, సిఫిలిస్, ఈతకల్లు, గోనేరియాతో మరియు జననేంద్రియ మొటిమలతో.
 6. భార్యలను సెర్వికల్ కాంసర్ నుండి రక్షిస్తుంది. సున్తీ చేయించుకున్న భర్తల భార్యలకు ఇది వచ్చే అవకాశం చాలా తక్కువ. అదే సున్తీ చేయించుకోని భర్తల భార్యలకు ఇ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని పరిశోధకులు కనుగొన్నారు

సున్తీవలనఉపయోగాలు

 • సులభతరమైన పరిశుభ్రత :సున్తీ చేయించడం వలన పురుషాంగం ను శుభ్రం  చేసుకోవడం సులభం అవుతుంది.
 • మూత్ర వలన కలిగే ప్రమాదాలను తగ్గిస్తుంది: మొత్తానికి మూత్ర అంటువ్యాదులు పురుషులలో చాలా తక్కువ. కాని సున్తీ చేయించుకోని పురుషులలో మాత్రం  మూత్ర అంటువ్యాధులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ మూత్ర వలన కలిగే అంటూ వ్యాదులు భవిష్యత్తులో మూత్రపిండాల వైఫల్యానికి దారి తీస్తుంది.
 • లైంగిక సంభందాల వలన కలిగే అంటూ వ్యాదులను తగ్గిస్తుందిఅవి  హెచ్.ఐ.వి అంటువ్యాదులు లాంటివి.
 • పురుషాంగ సమస్యలు దాని నివారణ: సున్తీ చేయించుకోని పురుషాంగం ఉపసంహరించటానికి చాలా కష్టమవుతుంది. దీని వల్ల పురుషాంగంపై వాపు వచ్చే ప్రమాదముంది.
 • పురుషాంగ క్యాన్సర్ ప్రమాదం ను కూడా తగ్గిస్తుంది. పురుషాంగ క్యాన్సర్ రావడం అనేది చాలా తక్కువ. ఇది సున్తీ చేయించుకున్నవారికి మరీ తక్కువ. సున్తీ చేయించుకున్నవారి లైంగిక సంభందాల వలన వారి భార్యలకు గర్బాశ్రయ క్యాన్సర్ లు  వంటి వ్యాదులకు దూరంగా ఉంటారు.
 • మొత్తానికి లైంగిక చర్య సులభతరంగా ఉంటుంది.

ఆధారము : అస్క్ ఇస్లాం పీడియా

2.98275862069
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు