హోమ్ / ఆరోగ్యం / పిల్లల ఆరోగ్యం / పిల్లలలో మధుమేహం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పిల్లలలో మధుమేహం

మధుమేహ వ్యాధి గ్రస్తులైన పిల్లల రక్తంలో చక్కెర మోతాదు చాలా అధికంగా ఉంటుంది. దీనికి కారణం క్లోమము చాలా తక్కువ కానీ లేక అసలు పూర్తిగా కానీ ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి చేయకపోవడమే.

మధుమేహ వ్యాధి గ్రస్తులైన పిల్లల రక్తంలో చక్కెర మోతాదు చాలా అధికంగా ఉంటుంది. దీనికి కారణం క్లోమము చాలా తక్కువ కానీ లేక అసలు పూర్తిగా కానీ ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి చేయకపోవడమే. (ఒకటవ రకం మధుమేహం పూర్వం దీనినే పసితనంలో వచ్చే మధుమేహం అనేవారు లేదా)

క్లోమము విడుదల చేసిన హార్మోను మోతాదు రక్తంలోని చక్కెరలను నియంత్రించ లేక పోవడం లేదా శరీరం సహకరించకపోవడం. దీనినే రెండవ రకం మధుమేహం అంటారు.
ఒకటవ రకం మధుమేహం చిన్న తనంలో కానీ లేక పసి ప్రాయంలో కూడా మొదలవవచ్చు సాధారణంగా 6 నుంచి 13 సం.,, వయసులో మొదలవుతుంది.

రెండవ రకం మధుమేహం ముఖ్యంగా యౌవ్వన ప్రాయంలో మొదలవుతుంది. ఇది అధిక శాతం స్థూలకాయం అధిక బరువువున్న పిల్లలలో ఎక్కువ కనబడడం. సాధారణమవుతున్నాయి.

ఏ పిల్లలలో రెండవ రకం మధుమేహం వచ్చే అపాయం ఎక్కువగా వుంటుంది ?
దిగువ చూపిన లక్షణాలు కలిగిన పిల్లలకు 10 సం. నుంచి ప్రతి 2 సం. లకు ఉపవాసంలో చేయవలసిన చక్కెర పరీక్ష లు చేయిస్తూ ఉండాలి.

అధిక బరువు:-

ఆ వయస్సు లో ఆ ఎత్తులో ఉండవలసిన బరువు కన్నా 120 % ఎక్కువగా ఉండడం. దగ్గరి రక్తసంబందికులలో రెండవ రకం మధుమేహం వుండడం.

యౌవ్వన ప్రాయం మధుమేహం:-

యౌవ్వన ప్రాయంలో రక్తంలోని చక్కెరలను నియంత్రించడంలో కొన్ని ప్రత్యేకమైన సమస్యలు తలెత్తవచ్చు. దానికి కారణాలు కౌమార్యంలో హార్మోన్లలో కలుగు మార్పులు.

కౌమార్యంలో జీవిత విధానం

అధిక ఒత్తిడులు, అధిక శ్రమ, శరీరక సౌందర్యం పై ధ్యాస, చురుకుదనంతో కూడిన అధికమయిన పనులు, వ్యుహము లేని భోజన సమయాలు. మధుపానం, ధూమపానంతో ప్రయోగాలు

లక్షణాలు:-

ఒకటవ రకం మధుమేహం లక్షణాలు చాలా త్వరగా బయటపడుతాయి. సాధారణంగా రెండు నుంచి మూడు వారాలలో లేక కొంచెం ముందుగానే స్పష్టమవుతాయి. రక్తంలో అధిక మోతాదులో ఉన్న చక్కెరల మూలంగా వ్యాధి గ్రస్తులైన పిల్లలు మూత్రం అధికంగా పోస్తూ ఉంటారు. ఈ విధంగా శరీరంలోని ద్రవాలు నష్ట పోవటం మూలాన వారికి అధిక దాహము వేసి ఎక్కువ నీరు లేక ద్రవ పదార్థములసు తీసుకుంటూ ఉంటారు. తగు మోతాదు ద్రవాలు తీసుకోకపోతే నిర్జలీకృతమవుతారు. తరువాత నీరసపడి చేతకాకుండా వుంటారు. నాడి అధికంగా కొట్టుకుంటుంది. చూపు మందగిస్తుంది.

రెండవ రకం మధుమేహ వ్యాధిలో లక్షణాలు మొదటి రకం మధుమేహ వ్యాధి కన్నా తక్కువ తీవ్రతలో వుంటాయి. మరియు మెల్లగా పెంపోందుతాయి.

కొన్ని వారాలు లేదా కొన్ని నెలలు సమయం పట్టవచ్చును వ్యాధి గ్రస్తులైన పిల్లలలో ఎక్కువ దాహం, ఎక్కువగామూత్రం పోయడం, నీరస పడిపోవడం, వంటి లక్షణాలు తల్లితండ్రులు గమనించవచ్చు.
ప్రత్యేకంగా రెండవ రకం మధుమేహం ఉన్న పిల్లలలో తీవ్ర నిర్జలీకరణం మరియు శరీర ద్రవములలో ఆమ్లములు మరియు ఎక్కువగు వంటి సమస్యలు తలెత్తవు.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు