హోమ్ / ఆరోగ్యం / పిల్లల ఆరోగ్యం / పిల్లల పెరుగుదలలో ముఖ్యమైన దశలు / మైలు రాళ్ళు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

పిల్లల పెరుగుదలలో ముఖ్యమైన దశలు / మైలు రాళ్ళు

ఒక బిడ్డ ఎదుగుదల క్లిష్టమైన మరియు కొనసాగుతూ ఉండే ప్రక్రియ. కొన్ని వయస్సులలో కొన్ని పనులు మాత్రమే చేయగలరు. వీటినే అభివృద్ధి మైలురాళ్ళు అని అంటారు.

ఒక బిడ్డ ఎదుగుదల క్లిష్టమైన మరియు కొనసాగుతూ ఉండే ప్రక్రియ. కొన్ని వయస్సులలో కొన్ని పనులు మాత్రమే చేయగలరు. వీటినే అభివృద్ధి మైలురాళ్ళు అని అంటారు. ఒక తల్లి తండ్రిగా, గమనించవలసిన ముఖ్య విషయం ఏమనగా ఏ ఇద్దరు పిల్లలు ఒకే విధంగా ఎదగరు. కావున, పక్కింటి బిడ్డ ఫలానా పనులు చేయగలుగుతున్నాడు, కాని తన సొంత బిడ్డ చేయలేకపోతున్నాడే అని విచారించడం నిరర్ధకం. ఫలానా వయస్సులలో పిల్లలు చేయదగ్గ పనుల కొరకు, వారిని కొంతకాలం గమనించాలి.

కొన్ని నెలల ఆఖరున ఫలానా పని ఇంకా చేయలేని యెడల, పిల్లల నిపుణులను సంప్రదించాలి. దీనివల్ల మనం తెలుసుకోవలసిన సత్యం ఏమనగా ఆ బిడ్డకు రుగ్మత లేక కలవరపాటు వలన భిన్నంగా ప్రవర్తించుచున్నాడని, అప్పుడప్పుడు ఆ బిడ్డ కొన్ని ప్రాంతాలలో సమాన వయస్కులైన మిగతా పిల్లల కన్నా మెల్లగా అభివృద్ధి చెందవచ్చు, కాని కొన్ని విషయాలలో మిగతా పిల్లల కంటే ముందుండ వచ్చు. బిడ్డ నడవడానికి సిధ్ధంగా లేనప్పుడు బలవంతంగా నడిపించుట సహాయపడదు.

అభివృద్ధి లోని ఆలస్యమును త్వరితంగా గుర్తించుట

బిడ్డ వయసు చేయగలగ వలసిన పనులు
2  నెలలు సాంఘికమైన చిరునవ్వు
4 నెలలు మెడను నిల్పుట
8 నెలలు ఆధారం లేకుండా కూర్చొనుట
12 నెలలు నిలబడుట

పుట్టుక నుండి 6 వారాల వరకు

 • బిడ్డ వీపు మీద పడుకుని తల ఒక ప్రక్కగా తిప్పి ఉంటుంది.
 • అకస్మాతైన శబ్ధానికి అతడి శరీరం ఉలిక్కిపడి బిఱుసుగా మారుతుంది.
 • పిడికిలి గట్టిగా మూసివేయబడి ఉంటుంది.
 • అతడి హస్తానికి మోటుగా తగిలిన వస్తువును దగ్గరకు తీసుకోగలడు. దీనిని గ్రాస్ప్ రిఫ్లెక్స్ అంటారు.

6 నుండి 12 వారాల వరకు

 • అతడి మెడను బాగా నిలుపుట నేర్చుకుంటాడు.
 • వస్తువుల మీద చూపు నిలపగలుగుతాడు.

3 నెలలు

 • వెల్లకిలా పడుకున్నప్పుడు అతడి చేతులు మరియు కాళ్ళు సమానంగా కదల్చగలడు. సమన్వయముకాని లేక తుళ్ళిపడే కదలికలు కావు. బిడ్డ ఏడుపే కాకుండా గుడుగుడు అను, ఇతర శబ్ధములు చేయును.
 • బిడ్డ తల్లిని గుర్తించి మరియు ఆమె గొంతుకు స్పందించును.
 • బిడ్డ  చేతులు ఎక్కువగా తెరిచే యుండును.
 • బిడ్డను ఎత్తుకున్నప్పుడు, బిడ్డ తన తలను లిప్తకాలము కంటే ఎక్కువ కాలం నిలపలేడు

6 నెలలు

 • బిడ్డ తన చేతులను ఒక దానితో ఒకటి అంటించి ఆడుకుంటాడు
 • బిడ్డ తన చుట్టు ప్రక్కల చేయు శబ్ధములకు తలత్రిప్పును.
 • బిడ్డ తన వీపు నుండి పొట్టమీదకు , పొట్టమీదనుండి వీపు మీదకు తిరుగుతాడు
 • ఆధారంతో బిడ్డ కాసేపు కూర్చోగలడు.
 • బిడ్డను ఎత్తుకున్నప్పుడు, అతనికాళ్ళమీద కాస్త బరువును భరించగలడు.
 • అతని పొట్టమీదున్నప్పుడు, ఆ బిడ్డ తన చాపబడిన చేతులతో వాడి బరువును మోయగలడు.

9 నెలలు

 • శరీరం పైకి లేపకుండా తన చేతులతో ఆధారం లేకుండా కూర్చోగలడు
 • బిడ్డ తన చేతులతో మరియు మోకాలితో పాకగలడు.

12 నెలలు

 • బిడ్డ నిలబడుటకు పైకి లేస్తాడు.
 • మామ అను మాటలు అనుట ప్రారంభించును.
 • సామాన్లు పట్టుకుని నడవగలుగును.

18 నెలలు

 • సహాయం లేకుండా గ్లాసుపట్టుకొనగలడు మరియు వలకకుండా త్రాగగలడు.
 • బిడ్డ పడిపోకుండా, తూలిపోకుండా ఒక పెద్ద గది గుండా ఆధారం లేకుండా నడవ గలడు.
 • రెండు, మూడు మాటలు పలుకగలడు.
 • బిడ్డ తనంతట తానే తినగలడు.

2 సంవత్సరాలు

 • బిడ్డ పైజమా లాంటి బట్టలను తీసివేయగలడు.
 • బిడ్డ పడిపోకుండా పరిగెత్తగలడు.
 • బిడ్డ బొమ్మల పుస్తకం లోని బొమ్మల మీద ఆసక్తి కనబరచును.
 • బిడ్డ తన కేమి కావాలో తెలుపగలడు.
 • బిడ్డ ఇతరులు చెప్పిన మాటలు తిరిగి చెప్పగలడు.
 • బిడ్డ తన శరీరం లోని కొన్ని అవయవాలను గుర్తించగలడు.

3 సంవత్సరాలు

 • బిడ్డ బంతిని పైకి విసరగలడు ( ప్రక్కకు లేదా క్రిందకు కాకుండా )
 • నీవు అమ్మాయివా అబ్బాయివా అనే చిన్న ప్రశ్నలకు బిడ్డ సమాధానం చెప్పగలడు.
 • బిడ్డ వస్తువులను అవతలకు పెట్టడానికి సహాయపడును.
 • బిడ్డ కనీసం ఒక రంగు పేరైనా చెప్పగలడు.

4 సంవత్సరాలు

 • మూడు చక్రాల బండిని త్రొక్కగలడు.
 • పుస్తకాలలోని  పత్రికలలోని బొమ్మలను గుర్తించగలడు.

5 సంవత్సరాలు

 • బిడ్డ తన బట్టలకు గుండీలు పెట్టుకొనగలడు.
 • బిడ్డ కనీసం మూడు రంగుల పేర్లను చెప్పగలడు.
 • బిడ్డ పాదాలను ఒకదాని కొకటి మార్చి మెట్ల కిందకు దిగగలడు.
 • బిడ్డపాదాలు దూరంగా పెట్టి గెంతగలడు.

ఆధారము : డాక్టర్ యన్ డి టివి

3.01851851852
mala nagaraju Mar 14, 2015 11:05 PM

యు అరె డూయింగ్ అ వండర్ఫుల్ వర్క్

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు