অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పిల్లలలోసాధారణ వ్యాధులు

నెలవయస్సు గల /శిశువుకు కామెర్లు - నిర్వచనం

అప్పుడే పుట్టిన బిడ్డ కళ్ళ యొక్క తెల్ల గ్రుడ్డు మరియు చర్మం బైల్ (బిలిరుబిన్) అనే వర్ణము వల్ల పసుపు చాయను సంతరించుకోవడం. అప్పుడే పుట్టిన బిడ్డలకు కొంతవరకు కామెర్ల ఉండుట సామాన్యం. ఎర్ర రక్తకణాల విచ్చిన్నం వల్ల ( ఇవి రక్తంలోకి బిలిరుబిన్ ని విడుదుల చేస్తాయి) మరియు సరిగ్గా ఎదగని కాలేయం వల్ల (బిలిరుబిన్ ను సరిగా తయారు చేయలేక మరియు మూత్రం లోనికి విసర్జించడం) ఇది జరుగుతుంది. సామాన్య నవజాతకు, కామెర్లు పుట్టిన 2 లేక 5వ రోజున కనబడి, మరియు కొంతకాలానికి తగ్గిపోతుంది.

నవజాత కామెర్లను నియోనెటల్ హైపర్ బిలిరుబినిమెయా మరియు ఫిజియెలాజిక్ కామెర్లు అని కూడ వ్యవహరిస్తారు.

అప్పుడే పుట్టిన బిడ్డలలో, కామెర్లు లేక నవ జాత కామెర్లు సామాన్యంగా హానికరం కాదు. మరియు దీనిని పుట్టిన 2వరోజున చూడవచ్చును. సాధారణమైన కాన్పుల విషయంలో 8వరోజు వరకు, ముందుగా పుట్టిన బిడ్డల విషయంలో 14వ రోజుల వరకు కనబడుతుంది.

లక్షణాలు

 1. పసుపు వర్ణం గల చర్మం
 2. కంటిలోని తెల్లగ్రుడ్డు మరియు గోళ్ళు పసుపు వర్ణం లోకి మారడం
 3. సాధారణ మైన దాని కంటే ఎక్కువ సేపు బిడ్డ నిద్రపోవడం

చికిత్స

వైద్యం: కామెర్లు సామాన్యమైనవి అయితే 10 రోజులలో తగ్గిపోతుంది. అయినప్పటికిని, తీవ్రతను తగ్గించుకొనుటకై క్రింద ఇవ్వబడ్డ వైద్య విధానాలు అవలంబించుట అవసరం.

శ్వాసకోశ వ్యాధులు – లక్షణాలు

ఆకలి దప్పిక లేకపోవటం, శ్వాస ఎక్కువగా పీల్చటం, పక్కటెముకల కదలిక, గురక, పిల్లి కూతలు. తులసి ఆకు రసం, అల్లం రసం లేదా నిమ్మరసం కలిపి తాగించాలి. శ్వాస సరిగ్గా అందకపోతే ముక్కులో ఉప్పునీరు రెండు చుక్కలు వేయాలి. అప్పటికీ తగ్గకపోతే న్యూమోనియా మందు వేయించాలి.

నీళ్ళ విరోచనాలు (అతిసార వ్యాధి)

కారణాలు

 • కలుషితమైన పాలసీసా.
 • మురికిచేతులతో తినుట.
 • ఎక్కడపడితే అక్కడ మలవిసర్జన చేయుట
 • ఈగలు వాలిన, పాడైన ఆహారం తినుట.
 • మురికినీరు వాడుట.

నిరోధక చర్యలు

 • తల్లి పాలే తాగించాలి.
 • శుభ్రమైన మంచినీరు వాడాలి.
 • వంటకు ముందు,తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
 • మూత వేసిన ఆహారం మాత్రమే తినాలి.
 • మరుగుదొడ్డి ఉపయోగించాలి.

ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు

పిల్లల చురుకుదనము లో తగ్గుదల

పిల్లలు డల్ గా ఉంటూ, తమ చుట్టూ ప్రక్కల్ జరిగే విషయాల మీద ఆసక్తి ప్రదర్శించకుండా ఉంటుంటే… అది తప్పకుండా పట్టించుకోవలసిన విషయమే. ఇలా పిల్లలు అనాసక్తికరంగా ప్రవర్తించడాన్ని. ఎటెన్షన్ డిఫిసిట్ హైపర్ ఆక్టివిటీ డిజార్డర్ (ఎ.డి. హెచ్ . డి.) ( Attention Deficit Hyper Activity Disorder) అంటారు.

ఎ.డి. హెచ్ . డి. అంటే…
పిల్లల్లో మొదట్లో చాలా చురుగ్గా అంటే ఆక్టివ్ గా ఉంటారు. కాలక్రమేణా చప్పబడిపోతారు. ఇలా ఒక్కసారిగా వారి ప్రవర్తనలో విపరీతమయిన మార్పు సంభావిస్తుందన్న మాట. మెదడు ఎదుగుదల సక్రమంగా లేనప్పుడే ఈ పరిస్థితి సంభవిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టీకరిస్తున్నారు. మెదడు మొదటి అయిదేళ్ళలో అత్యధిక ఎదుగుదల రికార్డు చేస్తుంది. శరీరంలోని హార్మోన్లు, తినే ఆహారంలోని విటమిన్లు ఈ విషయంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. జన్యు సంబంధం అంటే తల్లిదండ్రులతో ఎవరికైనా మెదడు సరిగా లేకపోతే పిల్లలకు ఈ పరిస్థితి రావచ్చు. మేనరిక వివాహలలో జన్మించిన పిల్లలు సాధారణంగా ఇవి తక్కువగా ఉండటానికి కారణం ఈ రకమైన జన్యు సంబంధమైన లోపాలే…

పసికట్టడమెలా..
క్లాస్ రూమ్ లో తోటి పిల్లలతో వీరి ప్రవర్తన ఎలా వుందో తెలుసుకుంటూ వుండాలి. పిల్లల స్నేహితులేవరు.. వాళ్ళు మన పిల్లలతో ఎలా ఉంటున్నారు? ఈ విషయాలు తెలిస్తే పిల్లాడి ప్రవర్తన అంచనా వేయవచ్చు.

జాగ్రత్తలు :
ఆరోగ్యకరమైన ప్రశాంత వాతావరణాన్ని పిల్లలచుట్టూ ఏర్పరచాలి.
క్రియేటివిటీకి స్థానం ఉండేటట్లు చేయాలి.
సంగీతం నేర్పడం… పెయింటింగ్ వేయడం… డ్యాన్స్ అంటే నృత్యం… మ్యూజిక్ అనుగుణంగా చిందులు వేయడం నేర్పితే వాళ్ళల్లో ఆహ్లాదకర భావాలు మొదలవుతాయి. కొంత వారి మానసిక పరిస్థితిని అదుపు చేయడానికి, ఎదుగుదలకు తోడ్పడుతుంది.

ఆధారము: వైద్య రత్నాకరం బ్లాగ్

పిల్లల అనారోగ్య సమస్యలు - పరిష్కారాలు

డౌన్స్ సిండ్రోమ్ అంటే..?

మాబాబుకు పదహారు నెలలు. ఇదే మాకు తొలిచూలు. మా బాబు మానసిక వికాసంలో తేడాఉందని అనిపించి డాక్టర్‌ను సంప్రదించాం. డౌన్స్ సిండ్రోమ్ అన్నారు. అసలు మాబాబుకు ఉన్న సమస్య ఏమిటి? భవిష్యత్తులో ఇది నయం అయ్యే అవకాశం ఉందా? మాకు తర్వాత పుట్టే పిల్లలకూ ఇదే సమస్య వచ్చే అవకాశం ఉందా? మేం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి తెలియజేయండి.

మీరు చెప్పిన కొద్దిపాటి సమాచారాన్ని బట్టి మీ పాపకు డౌన్స్ సిండ్రోమ్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమస్యను నిర్ధారణ చేయడానికి పాపకు క్రోమోజోమల్ పరీక్షలు చేయించడం చాలా ముఖ్యం. డౌన్స్ సిండ్రోమ్ అనేది చాలా ఎక్కువగా చూసే ఒక జన్యుపరమైన సమస్య. పిల్లల్లో క్రోమోజోమ్‌ల సంఖ్యలో మార్పు (అంటే ఉండాల్సిన క్రోమోజోమ్‌లకంటే ఎక్కువగా ఉండటం) అన్నది ఈ డౌన్స్ సిండ్రోమ్‌కు కారణం.

ఈ సమస్య ఉన్న పిల్లల్లో కండరాలు మృదువుగా ఉండటం, శరీరంలో తగినంత ఎదుగుదల లేకపోవడం, మానసిక వికాసం లేకపోవడం, మంగోలియన్‌లలా కళ్లు ఉండటం, గుండెకు సంబంధించిన రుగ్మతలు ఉండటంతో పాటు ప్రత్యుత్పత్తి వ్యవస్థల్లో కూడా సమస్యలు ఉండవచ్చు. అయితే కొద్దిమంది పిల్లల్లో ఫిట్స్ రావడం కూడా చూస్తుంటాం. డౌన్స్ సిండ్రోమ్ వచ్చిన పిల్లల్లో మానసికమైన ఎదుగుదల లోపం అన్నది అందరిలో ఒకేలా ఉండదు. వీళ్లలో తెలివితేటలు (ఐక్యూ) 30 శాతం నుంచి 60 శాతం వరకు ఉంటాయి.

డౌన్స్ సిండ్రోమ్ జన్యుపరమైన సమస్యే అయినప్పటికీ ఇది ఉన్న పిల్లలు - పెద్దలను అనుకరించడం, సంగీతం పట్ల ఇష్టం కనబరచడం, ఎప్పుడూ సంతోషంగా వంటివి చేస్తుంటారు. ఇలాంటి పిల్లలకు గుండెకు సంబంధించి ఏదైనా రుగ్మత ఉంటే తక్షణం చికిత్స చేయించడం చాలా ప్రధానం. డౌన్స్ సిండ్రోమ్ ఉన్న పిల్లలకు స్పెషల్ స్కూల్స్‌లో చదువుచెప్పడం, తేలికపాటి వృత్తుల్లో శిక్షణ ఇవ్వడం సాధ్యమే.

మహిళల్లో బాగా చిన్నవయసులో లేదా బాగా వయసు పైబడ్డాక గర్భధారణ జరిగిన వారికి డౌన్స్ సిండ్రోమ్‌తో పిల్లలు పుట్టడం ఎక్కువగా చూస్తుంటాం. మీకు మలిచూలులో ఇదే సమస్య వచ్చే అవకాశం ఉన్నదా లేదా అని చెప్పడానికి మీ బిడ్డ క్రోమోజోముల విశ్లేషణ చేయించడం చాలా ముఖ్యం. ఎందుకంటే కొన్ని రకాల క్రోమోజోముల మార్పు (ట్రాన్స్‌లోకేషన్)తో ఇది మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఉంది.

కాబట్టి మీ బాబుతో పాటు తల్లిదండ్రులిద్దరూ కారియోటైపిక్ అనాలసిస్ చేయించుకోవడం చాలా ప్రధానం. అలాగే గర్భధారణ జరిగాక మొదటి మూడు నెలల్లో (అంటే ఫస్ట్ ట్రైమిస్టర్‌లో) ట్రిపుల్ మార్కర్ వంటి పరీక్షల ద్వారా కూడా బిడ్డకు డౌన్స్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉందో, లేదో చెప్పవచ్చు. మీరు మరొకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని, అలాగే మరోసారి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటుంటే మీ గైనకాలజిస్ట్‌ను సంప్రదించి తగిన సలహా తీసుకోండి.

పాపకు పదే పదే జ్వరం... ?

మా పాపకు ఏడాది వయసు. ఈమధ్య చాలా విపరీతంగాజ్వరం వచ్చి సన్నగా అయిపోయింది. మా ప్రాంతం చాలా చల్లగా ఉంటుంది. డాక్టర్‌ను సంప్రదించాం. మందులు వాడుతున్నాం. జ్వరం తగ్గి మళ్లీ వస్తోంది. నీరసం ఎక్కువగా ఉంది. వాతావరణం వల్లనో, మరే ఇతర సమస్య వల్లనో పాప చాలానీరసంగా ఉంటోంది. పాపకు జ్వరం పూర్తిగా తగ్గి, లావు పెరగాలంటే మేం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి.

చిన్న పిల్లల్లో పదే పదే వచ్చే జ్వరాలకు అనేక కారణాలు ఉన్నప్పటికీ మీరు చెప్పిన లక్షణాలు, మీరు ఉండే ప్రాంతాన్ని బట్టి చూస్తే మీరున్న ప్రదేశాల్లో ఉండే పిల్లల్లో ముఖ్యంగా వెక్టర్ బార్న్ డిసీజెస్ అంటే... దోమలతో వచ్చే మలేరియా, పేల నుంచి వచ్చే బొరీలియా, పిగ్ బార్న్ ఫీవర్, కొన్ని ఏకకణ జీవులతో వచ్చే ట్రిపనోజోమా వంటి జ్వరాలు ఏమైనా వస్తున్నాయేమో అని తెలుసుకోవడం మొదట చేయాల్సిన పని. అలాగే చిన్న పిల్లల్లో తరచూ జ్వరం రావడం, బరువు పెరగకపోవడానికి యూరినరీ ఇన్ఫెక్షన్స్ మరో ముఖ్యం కారణంగా చెప్పవచ్చు.

పిల్లల్లో ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన తర్వాత నీరసంగా ఉండటం అన్నది మరో ముఖ్య లక్షణం.

మీరు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి పైన పేర్కొన్న కండిషన్ ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనికి కొన్ని ప్రత్యేకమైన రక్తపరీ క్షలు, మూత్రపరీక్షలు చేయించడం అవసరం. ఇక మీ వయసు పిల్లల్లో పప్పు ధాన్యాలు, పళ్లు, పాలు, తినేవారైతే కొద్దిపాటి మాంసాహారం కూడా తినిపించడం అవసరం.

మా పాప వయసు ఆరేళ్లు. ఈమధ్య చాలా డల్‌గా ఉంటోంది. ఇంతకుముందు చాలా చలాకీగాఉండేది. మొన్నీ మధ్య గొంతు నొప్పి ఉందని అంటే వెంటనే డాక్టర్‌నుసంప్రదించాం. పాప నోటిలోన, నాలుక మీద, గొంతులోపలి భాగంలో రెండు మూడుసార్లు పుండ్లలాగా వచ్చాయి. చాలా నొప్పిగా ఉంటోందని చెబుతోంది. పాపకు గొంతులోఇన్ఫెక్షన్‌లా కొంచెం పుండులాగా ఎర్రబారింది. ఏదైనా తినడానికి వీలుగాక విపరీతంగా ఏడుస్తోంది. పాప కొంచెం సన్నబడింది. మా పాప సమస్యకు మంచి సలహాఇవ్వండి.

మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు పదే పదే నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) వస్తున్నాయని తెలుస్తోంది. ఈ సమస్యను చాలా సాధారణంగా చూస్తుంటాం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు... ఉద్వేగాల పరమైన ఒత్తిడి (ఎమోషనల్ స్ట్రెస్), బాగా నీరసంగా అయిపోవడం (ఫెటీగ్), విటమిన్‌లు, పోషకాల లోపం... (ఇందులోనూ విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ ల వంటి పోషకాలు లోపించడం) వైరల్ ఇన్ఫెక్షన్‌లు (ముఖ్యంగా హెర్పిస్ వంటివి) గాయాలు కావడం (బ్రషింగ్‌లో గాయాలు, బాగా ఘాటైన పేస్టులు, కొన్ని ఆహారపదార్థాల వల్ల అయ్యే అనేక గాయాల కారణంగా) పేగుకు సంబంధించిన సమస్యలు, రక్తంలో మార్పులు, గ్లూటిన్ అనే పదార్థం పడకపోవడం, తరచూ జ్వరాలు రావడం... వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యల వల్ల పిల్లలకు తరచూ నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) వస్తుంటాయి. మీరు లెటర్‌లో చెప్పిన కొద్ది పాటి వివరాలతో నిర్దిష్టంగా ఇదీ కారణం అని చెప్పలేకపోయినా... మీ పాపకు విటమిన్‌ల వంటి పోషకాల లోపం లేదా తరచూ వన్చే ఇన్ఫెక్షన్స్‌తో ఈ సమస్య వస్తున్నట్లు విశ్లేషించవచ్చు.

ఇలాంటి పిల్లలకు నోటిలో బాధ తెలియకుండా ఉండేందుకు పైపూతగా వాడే మందులు, యాంటిసెప్టిక్ మౌత్ వాష్‌లు, విటమిన్ సప్లిమెంట్స్ వాడాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లల్లో చాలా అరుదుగా స్టెరాయిడ్ క్రీమ్స్ వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీరు పైన పేర్కొన్న అంశాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ మరోసారి మీ పిల్లల వైద్య నిపుణుడినిగానీ లేదా దంత వైద్య నిపుణుడినిగాని సంప్రదించి వారి ఆధ్వర్యంలో తగిన చికిత్స తీసుకోండి.

ఆధారము: హెల్త్ కేర్ తెలుగు బ్లాగ్

పిల్లలకు యాంటీ బయోటిక్‌-జాగ్రత్తలు

పిల్లలకు యాంటీ బయోటిక్‌ మందులు వేస్తున్నారా? అయితే కొన్ని జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి. బయో (Bio)అంటే లైఫ్(Life) అని అర్ధము . యాంటి(Anti) అనంటే వ్యతిరేకమై(opposite)నది అని అర్ధము . జీవులు నశింపజేయడానికి ... తద్వారా వాటివల్ల కలిగే జబ్బులను నయము చేయడానికి వాడే రసాయనాలు.

 • వైద్యుడిని సంప్రదించకుండా సొంతంగా యాంటీ బయోటిక్‌ మందులను వాడొద్దు.
 • దగ్గు, జలుబు, అప్పుడప్పుడు నీళ్ల విరేచనాలు, చర్మం మీద ఇన్‌ఫెక్షన్ల వంటి చిన్న చిన్న సమస్యలు 3-7 రోజుల వరకు ఉంటాయి. వీటిల్లో చాలావాటికి యాంటిబయోటిక్స్‌ వేయాల్సిన అవసరం లేదు. తగినంత విశ్రాంతి, ద్రవాహారం ఎక్కువ ఇవ్వటం, అవసరమైతే కొద్ది మోతాదులో నొప్పి నివారణ మందులతోనే ఇవి నయమవుతాయి.
 • కడుపు నిండుగా ఉన్నప్పుడు అంటే పిల్లలు ఆహారం, పాలు తీసుకున్న వెంటనే యాంటీ బయోటిక్స్‌ వెయ్యద్దు. అలాచేస్తే మందులను శరీరం పూర్తిగా గ్రహించలేకపోవచ్చు.
 • ఆంపిసిలిన్‌, అమాక్జసిలిన్‌ వంటి యాంటీ బయోటిక్స్‌ కడుపులో ఇబ్బంది, విరేచనాల వంటి స్వల్ప దుష్ప్రభావాలు కలగజేస్తాయి. అయితే ఇవి తాత్కాలికమే. వాటంతటవే తగ్గిపోతాయి. మందులు మానేయాల్సిన అవసరం లేదు.
 • పిల్లలకు, కుటుంబంలో ఎవరికైనా ఏవైనా మందులు పడకపోయినా.. దద్దు, ఉబ్బసం వంటి సమస్యలున్నా వైద్యులకు ముందే చెప్పాలి.
 • యాంటీ బయోటిక్స్‌ వేస్తున్నప్పుడు పిల్లల్లో తీవ్రమైన దురద, వాపు వంటి దుష్ప్రభావాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి.

పిల్లలలో అలర్జీలు

ఏదైనా సరిపడని వస్తువు పిల్లలకు తాకినా, పిల్లల శ్వాసమార్గంలోకి వెళ్లినా, పొరపాటుగా నోటిద్వారా తీసుకున్నా వెంటనే ఆ సరిపడని వస్తువు దుష్ర్పభావాలు అనేక లక్షణాల రూపంలో కనిపిస్తాయి. పిల్లల్లో దగ్గు , శ్వాసలో ఇబ్బంది, ఒంటినిండా దద్దుర్లు, కడుపునొప్పి ... ఇలా అనేక రూపాల్లో ఆ సరిపడని తత్వం వ్యక్తమవుతుంది. ఇలా ఏదైనా వస్తువు సరిపడని తత్వాన్ని అలర్జీ అంటారు. ఈ అలర్జీని కలిగించే పదార్థాలను అలర్జెన్స్ అంటారు. పిల్లల్లో వచ్చే అనేక అలర్జీలు, వాటికి కారణాలు, వాటి నివారణ వంటి అనేక అంశాలను తెలుసుకుందాం.

పిల్లల్లో అలర్జీ రావడానికి కారణం ఉంటుంది. వారు ఏదైనా తమకు సరిపడని పదార్ధాన్ని ముట్టుకున్నా లేదా శ్వాసించినా, లేదా పొరబాటున తిన్నా ... వెంటనే ఆ సరిపడని వస్తువును మన శరీరం ఒక శత్రువుగా భావిస్తుంది. దానితో పోరాడి బయటకు తరలించేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో భాగంగా శరీరంలో కొన్ని రసాయనాలు, హిస్టమైన్స్ అనే పదార్థాలు విడుదల అవుతాయి. ఇవి వెలువడినందువల్ల పిల్లల్లో తుమ్ములు, దురద, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

పిల్లలకు అలర్జీ కలిగించే సాధారణ పదార్థాలుచెట్లు, మొక్కల నుంచి వెలువడే పుప్పొడి, గడ్డిపరకలు, కలుపుమొక్కల వంటివి. కార్పెట్లు , పరదాల మాటున ఉండే దుమ్ము (నిజానికి ఈ దుమ్ములో ఉండే డస్ట్‌మైట్స్ అనే క్రిముల వల్ల అలర్జీ వస్తుంటుంది ). పిల్లి , కుక్క, గుర్రాలు, చెవులపిల్లులు వంటి వాటి వెంట్రుకలు, చర్మం నుంచి వెలువడే పొట్టులాంటి పదార్థాలుకీటకాలు కుట్టడం వల్ల వెలువడే రసాయనాలు, విషాలుసిగరెట్ పొగ, పెర్‌ఫ్యూమ్స్ /సెంట్స్ వంటి వాటి ఘాటైన వాసనలు, కారు నుంచి వెలువడే పొగవాసనలుఇక కొన్ని ఆహారాలు తీసుకున్నప్పుడు అవి కూడా అలర్జెన్స్‌లా పనిచేస్తాయి. ఉదాహరణకు వేరుశెనగపల్లీలు, గుడ్లు, పాలు, పాల ఉత్పాదనలు.

పిల్లల్లో అలర్జీ లక్షణాలు

చర్మంపై దద్దుర్లు / పగుళ్ల వంటివి రావడం   శ్వాసతీసుకోవడం కష్టం కావడం (ఆస్తమా )   తుమ్ములు, దగ్గులు, ముక్కు నుంచి నీళ్లు కారడం  కడుపులో ఇబ్బంది  వికారంగా వాంతి వస్తున్నట్లుగా అనిపించడం  అలర్జిక్ రైనైటిస్ (ఇందులో ముక్కు దురదగా ఉండి తుమ్ములు వస్తూ, ముక్కుకారుతుంటుంది. కళ్లలోంచి కూడా నీళ్లు వస్తుంటాయి )   ముక్కు దిబ్బడ వేయడం (దీని వల్ల ముక్కు నుంచి శ్వాస తీసుకోవడం కష్టమై, రాత్రివేళల్లో నోటి ద్వారా శ్వాసతీసుకుంటూ ఉంటారు )   చెవిలో ఇన్ఫెక్షన్ (అలర్జీల వల్ల చెవిలో కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చి , చెవి నొప్పి రావచ్చు )

అలర్జీలు తెచ్చి పెట్టే ఆహారాలు ...

పిల్లలు తీసుకునే ఆహారంతో వచ్చే అలర్జీలలో ముఖ్యమైనవి వేరుశెనగపప్పు లతో వస్తుంటాయి. ఇక పాల వల్ల కూడా కొందరిలో అలర్జీ వస్తుంటుంది. కొందరిలో గుడ్లు, చేపలు, పీతలు, లాబ్‌స్టర్స్, రొయ్యల వల్ల కూడా అలర్జీలు వస్తుంటాయి. ఇక మరికొందరిలో సోయా ఉత్పాదనలు, జీడిపప్పు వంటి నట్స్ వల్ల కూడా అలర్జీలు రావచ్చు.

తల్లిదండ్రులకు ఓ హెచ్చరిక ...

పిల్లలు తింటున్న పదార్థాల వల్లగానీ అలర్జీలు కలుగుతుంటే దాన్ని తల్లిదండ్రులు తెలుసుకోవాలి. లేదా పిల్లలకు ఏ అంశం సరిపడటంలేదో గుర్తించడం తల్లిదండ్రులు చేయాల్సిన ముఖ్యమైన పని. ఎందుకంటే సాధారణ అలర్జీలైన దద్దుర్లు, తుమ్ములు, ముక్కు నుంచి నీళ్లు కారడాలు, ఒంటి మీద దురద పెట్టడాల వంటి లక్షణాల వల్ల పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ... ఒక్కోసారి పిల్లలకు ఊపిరి అందనంతగా శ్వాసతీసుకోవడం కష్టం కావడం, ఆయాసం రావడం, అకస్మాత్తుగా రక్తపోటు పూర్తిగా పడిపోవడం, వారి శరీరం షాక్‌కు గురికావడం వంటివి జరిగితే అది పిల్లల ప్రాణాలకే ప్రమాదం తెచ్చిపెట్టవచ్చు. కాబట్టి పిల్లలకు ఏ పదార్థాలు / అంశాలు / వస్తువులు సరిపడటం లేదన్న విషయాన్ని తల్లిదండ్రులు నిశితంగా గుర్తించి, వాటి నుంచి పిల్లలను దూరంగా ఉంచడం చాలా ముఖ్యం.

అలర్జీ ఉన్న పిల్లలు ...స్కూలు విషయంలో   తల్లిదండ్రుల బాధ్యత ...

తమ పిల్లలకు ఏయే అంశాలు అలర్జీని కలిగిస్తాయన్న విషయాన్ని స్కూలు యాజమాన్యానికి తెలియజేయాలి. పిల్లల్లో అలర్జీలు కనిపించినప్పుడు స్కూలు యాజమాన్యం తక్షణం చేపట్టాల్సిన ముందుజాగ్రత్తలనూ వారికి తెలియజేయాలి. పిల్లలను నెబ్యులైజేషన్ (పీల్చే మందును మాస్క్‌లా పెట్టగలిగే వసతి) ఇచ్చే ఆసుపత్రికి లేదా ఆరోగ్యకేంద్రానికి తరలించాలని చెప్పడంతో పాటు... చిన్నారికి అలర్జీ వచ్చినప్పుడు తాము సంప్రదించే డాక్టర్ ఫోన్ నెంబరు, ఆసుపత్రి చిరునామా తెలిపాలి . స్కూలు యాజమాన్యం కూడా పిల్లల్లో అలర్జీ లక్షణాలు కనిపించగానే  తల్లిదండ్రులకు ఆ విషయాన్ని తెలిపాలి .

నివారణ ...

పిల్లలకు వచ్చే అలర్జీల విషయంలో నివారణ చాలా తేలిక. ఉదాహరణకు వారికి సరిపడని వస్తువు, అంశం, ఆహారం ... ఇలా అదేమిటో గుర్తించి, వాటి నుంచి పిల్లలను దూరంగా ఉంచాలి. అదే అన్నిటికంటే మంచి నివారణ.   పిల్లలను దుమ్మూ ధూళి నుంచి దూరంగా ఉంచాలి. వారి దుస్తులు , పక్కబట్టలు (బెడ్‌షీట్స్) , టవల్స్ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

పెంపుడు జంతువుల జుట్టు / చర్మపు పొట్టు వంటి వాటి వల్ల వారికి అలర్జీ ఉందని తేలితే ... పిల్లలను పెంపుడు జంతువుల వద్దకు అనుమతించకూడదు. ఇంట్లోని వాతావరణంలో ఆకస్మికంగా మార్పు రాకుండా చూసుకోవాలి. దాదాపు ఎప్పుడూ ఒకే రకమైన వాతావరణం ఉండేలా జాగ్రత్త వహించాలి. ఇక దుమ్ము , ధూళి వంటి వాటిని శుభ్రం చేసే సమయంలోనూ, బూజులు దులిపే సమయంలోనూ పిల్లలను ఇంట్లో ఉంచకూడదు.

చికిత్స

పిల్లల్లో అలర్జీ లక్షణాలు కనిపించిన వెంటనే వాటికి విరుగుడు మందులైన యాంటీ హిస్టమైన్స్ ఇస్తుంటారు. ఒకవేళ పిల్లల్లో అలర్జీ వల్ల కలిగిన తీవ్రత ఎక్కువగా ఉంటే వారికి ఎపీనెఫ్రిన్ (ఎడ్రినాలిన్) వంటి మందులు వాడుతుంటారు. ఇక అలర్జీ కారణంగా శ్వాస అందని సందర్భాల్లో, శ్వాస తేలిగ్గా తీసుకునేందుకు వీలుగా  పీల్చేమందులు (ఇన్‌హేలర్స్/నెబ్యులైజర్స్) కూడా వాడుతుంటారు. ఒకవేళ అలర్జీ వల్ల పిల్లల్లో ఆస్తమా ప్రేరేపితమైతే ... దాన్ని తగ్గించేందుకు కూడా ఇప్పుడు అత్యంత ఆధునికమైన పీల్చే మందులు అందుబాటులో ఉన్నాయి.

డాక్టర్ టి .పి. కార్తీక్

పీడియాట్రీషియన్, నియోనేటాలజిస్ట్,

యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్

ఆధారము: సాక్షి

ఆధారము: వైద్యరత్నాకరం బ్లాగ్

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate