অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కండరాలు మరియు కీళ్ళ వ్యాధులు

కండరాలు మరియు కీళ్ళ వ్యాధులు

ఆర్ త్రైటిస్

ఆర్ త్రైటిస్ అనగా నేమి ?
ఆర్ త్రైటిస్ అంటే కీళ్ళలో మంట, అనగా నొప్పి తో కూడిన వాపులు. ఇవి 170 రకాల కీళ్ళ జబ్బుల సముదాయం. దీని వలన కీళ్ళలో నొప్పి, వాపు, బిగుసుకు పోవడం వంటి లక్షణాలు కనపడుతాయి.

ఈ కీళ్లకు వచ్చే అతి పెద్ద సమస్య ఆర్త్థ్రెటిస్‌! అంటే కీలు లోపలంతా వాచిపోయి.. కదపాలంటేనే తీవ్రమైన నొప్పి, బాధతో.. జాయింటులో ఓ విపత్తు తలెత్తటమన్న మాట. ఇది కీలు అరిగిపోవటం వల్ల రావచ్చు. దాన్ని ఆస్టియో ఆర్త్థ్రెటిస్‌ అంటారు. ఇప్పుడు ఎక్కువ మంది అనుభవిస్తున్న మోకాళ్ల నొప్పుల బాధ ఇదే. ఇక ఒంట్లో ఏదైనా ఇన్ఫెక్షన్‌ తలెత్తి అది కీలుకు చేరటం వల్ల కీళ్లనొప్పి రావచ్చు. దీన్ని ఇన్ఫెక్టివ్‌ ఆర్త్థ్రెటిస్‌ అంటారు. సొరియాసిస్‌ వంటి చర్మ వ్యాధుల్లో కూడా కీళ్ల వాపు, నొప్పి పలకరించవచ్చు. దాన్ని సొరియాటిక్‌ ఆర్త్థ్రెటిస్‌ అంటారు. అలాగే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, నీళ్ల విరేచనాల వంటి ఇన్ఫెక్షన్ల తర్వాత కూడా కీళ్ల వాపు రావచ్చు.దాన్ని రియాక్టివ్‌ ఆర్త్థ్రెటిస్‌ అంటారు. చికున్‌గన్యా వంటి వైరల్‌ వ్యాధుల్లో కూడా కీళ్ల వాపులు రావచ్చు, వీటిని వైరల్‌ రియాక్టివ్‌ ఆర్త్థ్రెటిస్‌ అంటారు. ఇలా కీళ్ల వాపుల్లో ఎన్నో రకాలున్నాయి. అయితే ఇవన్నీ కూడా ఏదో ఒక ప్రత్యేకమైన, స్పష్టమైన కారణంతో వచ్చే కీళ్ల నొప్పులు! వీటికి భిన్నంగా... స్పష్టమైన కారణమేదీ తెలియకుండానే ఆరంభమయ్యే అతి పెద్ద సమస్య... రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌! కీళ్లవాతం!!

ఇది ఎవరికి, ఎందుకు వస్తుందో స్పష్టమైన కారణం ఇప్పటి వరకూ తెలియదు. కానీ ప్రతి వంద మందిలో ఒకరిని వేధిస్తోంది. ఒకసారి దీని బారిన పడ్డారంటే.. కీళ్లు ఎర్రగా వాచిపోతాయి. ఉదయం లేస్తూనే జాయింట్లు సహకరించవు. తీవ్రమైన నొప్పితో జీవితం నరక ప్రాయమవుతుంది. పైగా వేళ్లు, మణికట్టు వంటి చిన్న జాయింట్లను ఎక్కువగా పట్టి పీడించే ఈ కీళ్లవాతం.. దీర్ఘకాలం ఉండిపోయే సమస్య! దీన్ని నిర్లక్ష్యం చేస్తే శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, కళ్ల వంటి ఇతరత్రా అవయవాలూ ప్రభావితమై పరిస్థితి మరింత విషమిస్తుంది. అదృష్టవశాత్తూ- దీన్ని పూర్తి నియంత్రణలోకి తీసుకువచ్చి.. తిరిగి హాయిగా జీవితం గడిపేలా తోడ్పాటునిచ్చే అత్యాధునిక చికిత్సా విధానాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అందుకే 'ప్రపంచ ఆర్త్థ్రెటిస్‌ దినం' సందర్భంగా ఈ కీళ్లవాతానికి సంబంధించిన సమగ్ర వివరాలను మీ ముందుకు తెస్తోంది సుఖీభవ!

ఇది మన కీళ్లలో ఎముకల మధ్య ఉండే మృదువైన 'సైనోవియం' పొరను చూసి.. దాన్ని హానికారక శత్రువుగా పొరబడి... దానిపై దాడి చేసి దెబ్బతీయటం ఆరంభిస్తుంది. దీంతో కీళ్లు ఎర్రగా వాచిపోవటం, నొప్పుల వంటి బాధలన్నీ ఆరంభమవుతాయి. అయితే ఇది ఎందుకిలా ప్రవర్తిస్తుందో.. ఎవరిలో ఇటువంటి సమస్యలు తెచ్చిపెడుతుందో చెప్పటం కష్టం. ఇప్పుడిప్పుడే దీని వెనక ఉన్న జన్యుపరమైన, జీవనశైలీ పరమైన కారణాలను అర్థం చేసుకుంటున్నారు. మొత్తానికి దీన్ని ఎంత త్వరగా.. వీలైతే ముందుగానే గుర్తించి వెంటనే చికిత్స ఆరంభిస్తే కీళ్లు దెబ్బతినకుండా రక్షించుకోవటం, సాధారణ జీవితం గడపటం సాధ్యమవుతుంది.

నిర్ధారణ ఎలా?

రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌ విషయంలో రక్త పరీక్షల వంటివాటి కంటే కూడా వైద్యుల విచక్షణకే ప్రాధాన్యత ఎక్కువ. లక్షణాల తీరు, కొన్ని పరీక్షల సహాయంతో వైద్యులే కచ్చితంగా నిర్ధారిస్తారు.

 • రక్తపరీక్ష: రక్తంలో రుమటాయిడ్‌ ఫ్యాక్టర్‌ (ఆర్‌ఏ ఫ్యాక్టర్‌) ఎలా ఉందో చూస్తారు. ఆరంభ దశలో ఇది 75% మందిలో పాజిటివ్‌గా ఉంటుంది. నెగిటివ్‌గా వచ్చినవారికి కొన్నాళ్ల తర్వాత మళ్లీ రక్తపరీక్ష చేయాల్సి ఉంటుంది.
 • సీసీపీ యాంటీబాడీస్‌: వ్యాధి లక్షణాలు స్పష్టంగానే కనబడుతున్నా రక్తంలో 'ఆర్‌ఏ ఫ్యాక్టర్‌' నెగిటివ్‌ ఉన్న వారికి ఈ పరీక్ష అవసరం. ఇది పాజిటివ్‌ వస్తే కీళ్లవాతం ఉన్నట్టు బలంగా భావించాల్సి ఉంటుంది.
 • ఈఎస్‌ఆర్‌, సీఆర్‌పీ: ఇవి కీళ్లవాతం బాధితుల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. హెమోగ్లోబిన్‌ తక్కువ ఉండొచ్చు.
 • వీటికి తోడు వాచిన కీళ్లకు ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ వంటివీ వ్యాధి నిర్ధారణలో ఉపయోగపడతాయి.
నాలుగంచెల మందులు

కీళ్లవాతానికి చికిత్స లేదని, ఒకసారి వచ్చిందంటే జీవితాంతం బాధలు పడాల్సిందేనని చాలామంది అపోహపడుతున్నారు. కానీ దీనికి సమర్థమైన చికిత్స ఉంది. దీనికి ఇచ్చే మందులను నాలుగు రకాలుగా విభజించొచ్చు.

 1. నొప్పి నివారిణి మందులు: 'నాన్‌ స్టిరాయిడల్‌ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ' రకం నొప్పి నివారణ మందుల్లో బ్రూఫెన్‌, నేప్రోసిన్‌, నిముసులైడ్‌, ఓవరాన్‌ వంటివి కొంచెం ఎక్కువ ప్రభావంతో పనిచేస్తాయి. ప్యారాసిటమాల్‌, ట్రెమడాల్‌ వంటివి తక్కువ ప్రభావం గలవి. వీటిని ముందుగా సిఫార్సు చేస్తారు. వీటితో పెద్దగా దుష్ప్రభావాలేవీ ఉండవు.
 2. కార్టికో స్టిరాయిడ్స్‌: ఇవి నొప్పి తీవ్రతను తగ్గించటంలో బాగా తోడ్పడతాయి. వీటిని చాలా పరిమిత కాలానికే (అంటే కీళ్లవాతం తగ్గేందుకు ఇచ్చే దీర్ఘకాలిక మందుల ప్రభావం మొదలయ్యే వరకూ) ఇస్తారు. ఎక్కువ రోజులు వాడితే వీటితో దుష్ప్రభావాలుంటాయి గనక వీటిని తక్కువ మోతాదులో రెండు మూణ్నెల్లు మాత్రమే సిఫార్సు చేస్తారు.
 3. వ్యాధి నియంత్రణ మందులు: 'డిసీజ్‌ మోడిఫైయింగ్‌ యాంటీ రుమాటిక్‌ డ్రగ్స్‌'గా పిలిచే ఈ మందుల్లో ముఖ్యమైనది- 'మిథోట్రెక్సేట్‌'. ఇది వాస్తవానికి క్యాన్సర్‌కు వాడే మందు కావటంతో దీనిపై ఎన్నో అపోహలున్నాయి. కానీ.. ఇది కీళ్లవాతం చికిత్సల్లో బాగా పనికొస్తుంది. క్యాన్సర్‌ బాధితులకు దీన్ని పెద్దమోతాదులో ఇస్తే వీరికి చాలా స్పల్ప మోతాదుల్లో, అదీ వారానికి ఒకసారి మాత్రమే ఇస్తారు. వైద్యుల పర్యవేక్షణలో మెథోట్రెక్సేట్‌ను జాగ్రత్తగా వాడితే ఎలాంటి దుష్పరిణామాలూ ఉండవు.
  • సల్ఫాసలజైన్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌, లిఫ్లునోమైడ్‌, ఎజెతోయాప్రిన్‌ వంటివి కూడా కీళ్లవాతం చికిత్సలో ఉపయోగపడతాయి.
  • ఈ మందులు వాడేటప్పుడు పరిస్థితి మెరుగవుతోందా? లేదా? దుష్పరిణామాలేమైనా ఉన్నాయా? అన్నది వైద్యులు పరీక్షిస్తుంటారు. సాధారణంగా 4-6 నెలల్లో వ్యాధి చాలావరకూ నిదానిస్తుంది.
  • కీళ్లవాతం ఎలా తగ్గుముఖం పడుతోందన్నది ఎప్పటికప్పుడు 'డాస్‌ 28 స్కోర్‌' ఆధారంగానూ, ఈఎస్‌ఆర్‌, 'పేషెంట్‌ జనరల్‌ గ్లోబల్‌ స్కోర్‌' ఆధారంగా తరచూ అంచనా వేస్తుంటారు.
  1. బయోలాజికల్స్‌ చికిత్స: కొత్తతరం ఖరీదైన మందులివి. ఎంబ్రెల్‌, రెమికేడ్‌, ఒరన్షియా, రిటుక్సిమబ్‌ వంటి ఈ బయోలాజికల్‌ మందులను ఇంజక్షన్‌ రూపంలో చర్మం కిందకు గానీ, రక్తనాళంలోకి గానీ ఇస్తారు. దీంతో సమస్య నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. ఫలితాలు చాలా బాగుంటాయి. గానీ వీటికి అయ్యే ఖరీదు చాలా ఎక్కువ. ఒకవేళ వీటిని వాడాక కొన్నాళ్ల తర్వాత వ్యాధి తిరిగి విజృంభిస్తే మళ్లీ 'డిసీజ్‌ మోడిఫికేషన్‌ యాంటీ రుమాటిక్‌ డ్రగ్స్‌'తో చికిత్స చేస్తారు.

  కీళ్లవాతం అంతా ప్రత్యేకమే

 4. సాధారణంగా ఇతరత్రా కీళ్ల నొప్పులైతే శరీరంలోని ఏదో ఒకవైపు కీలుకు మాత్రమే వస్తాయి. కానీ రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌లో- ఒకేసారి రెండు వైపులా వాపు కనిపిస్తుంది. అంటే ఉదాహరణకు కుడి చేతి వేలి కీళ్లు వాస్తే, ఎడమచేతి వేలి కీళ్లు కూడా వాస్తుంటాయి. కుడి మణికట్టు కీలు వాస్తే, ఎడమ మణికట్టు కీలూ వాస్తుంది. అలాగే ఈ వాపు ఏకకాలంలో శరీరంలోని చాలా కీళ్లకూ రావచ్చు.
 5. కీళ్లవాతం ఏ వయసు వారికైనా రావచ్చుగానీ సాధారణంగా పెద్దవారిలోనే.. అదీ 30-60 ఏళ్ల మధ్య వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ముఖ్యంగా- ఇది మహిళల్లో ఎక్కువ. ప్రతి నలుగురు కీళ్లవాతం బాధితుల్లో ముగ్గురు మహిళలే ఉంటున్నారు.
 6. కీళ్లవాతం.. సాధారణంగా శరీరంలోని చిన్న కీళ్లతో మొదలవుతుంది.అంటే చేతివేళ్లు, మణికట్టు, కాలివేళ్ల వంటి వాటితో ఆరంభమై క్రమేపీమోకాలు, తుంటి వంటి పెద్ద జాయింట్లకూ రావచ్చు. వాపు, నొప్పి వంటివన్నీ చిన్న జాయింట్లతో ఆరంభం కావటం దీని ప్రత్యేక లక్షణం. (అదే కీళ్లు అరిగిపోవటం వల్ల వచ్చే ఆస్టియో ఆర్త్థ్రెటిస్‌ సాధారణంగా మోకాలు, తుంటి వంటి పెద్ద కీళ్లతో మొదలవుతుంది)
 7. కీళ్లవాతం కొంతకాలం ఉద్ధృతంగా ఊపేస్తుంది. బాధలు తీవ్రతరమవుతాయి. మరికొంత కాలం నెమ్మదిస్తుంది. ఇలా పెరుగుతూ తగ్గుతూ ఉండటం దీని మరో ప్రత్యేకత. మధుమేహం, హైబీపీల్లాగా ఇదీ దీర్ఘకాలిక సమస్య, దీనికి చికిత్స కూడా దీర్ఘకాలం తీసుకోవాల్సి ఉంటుంది.
 8. కీళ్లవాతంలో ఉదయం పూట కీళ్లు బిగుసుకుపోతుంటాయి. ఇలా కనీసం గంటకు పైగా బాధపడాల్సి ఉంటుంది. మిగతా కీళ్ల నొప్పులకూ, రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌కూ ఇదే ప్రధానమైన తేడా. అలాగే వీరిలో రాత్రి నొప్పులూ ఎక్కువ. కదులుతూ కాస్త అటూఇటూ తిరుగుతుంటే నొప్పి తగ్గినట్టుంటుంది. విశ్రాంతి తీసుకుంటే నొప్పి, బాధ ఎక్కువ అవుతాయి. రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌ దీర్ఘకాలిక సమస్య. కాబట్టి చికిత్స కూడా దీర్ఘకాలం, జీవితాంతం తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రత తగ్గిన తర్వాత కూడా మందులను కనీస మోతాదుల్లో దీర్ఘకాలం వాడుతుండాలి. తీవ్రత తగ్గిందని మందులు, చికిత్స పూర్తిగా మానేస్తే సమస్య మరింత ఉద్ధృతంగా ముంచుకొస్తుంది. మందులు తీసుకుంటుంటే హాయిగా సాధారణ జీవితం గడపగలుగుతారు.
 9. రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌ విషయంలో ఎటువంటి పథ్యాలూ లేవు. విటమిన్‌-సి ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే చేపల వంటి పదార్థాలు ఎక్కువ తీసుకుంటే మంచిది.

 10. వ్యాయామం కీలకం కీళ్లవాతం బాధితుల్లో చాలామంది పూర్తి విశ్రాంతిగా పడుకుంటూ వ్యాయామం మానేస్తుంటారు. ఇది సరికాదు. వ్యాయామం చేయకపోతే కీళ్లు గట్టిగా బిగుసుకుపోతాయి. కొన్నిసార్లు ఆపరేషన్‌ చేసినా ఫలితం ఉండకపోవచ్చు. బాధలు ఉద్ధృతంగా ఉన్న సమయంలో మాత్రమే విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. మందులతో నొప్పి తగ్గాక వ్యాయామం మొదలెట్టాలి. నొప్పి తగ్గుతున్న కొద్దీ వ్యాయామం చేసే సమయాన్ని కూడా పెంచుకోవాలి. ఏరోబిక్‌, యోగా, నడక వంటి వ్యాయామాలు ఏవైనా చేయొచ్చు. బరువులు ఎత్తటం మాత్రం చేయకూడదు.
 11. రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌ బాధితుల్లో చాలా కొద్దిమందికి మాత్రమే కీళ్ల మార్పిడి అవసరమవుతుంది. వ్యాధిని సత్వరమే గుర్తించి చికిత్స ఆరంభిస్తే ఈ కీళ్ల మార్పిడి అవసరం అంతగా రాదు. చిన్న కీళ్లకు ఈ మార్పిడి అవకాశమూ ఉండదు. అందుకే మందులతో చికిత్సకే ప్రాధాన్యం ఇస్తారు.
 12. లైంగిక జీవితంపై ఎటువంటి ప్రభావం ఉండదు. మందులు వాడుకుంటూ పూర్తి సాధారణ జీవితం గడపొచ్చు. కాకపోతే 'మిథోట్రెక్సేట్‌' తరహా మందులు వాడుతున్నప్పుడు గర్భం మాత్రం ధరించకూడదు. ఆ మందు ఆపేసిన తర్వాత.. 3 నెలలు ఆగి అప్పుడు మాత్రమే గర్భధారణకు ప్రయత్నించాలి. అవసరమైతే గర్భిణీ సమయంలో తక్కువ డోసులో స్టిరాయిడ్లు వాడొచ్చు. కీళ్లవాతం లక్షణాలేమిటి?
 13. జాయింట్లు ఎర్రగా వాచిపోయి నొప్పి
 14. ముట్టుకుని చూస్తే వేడిగా ఉండటం
 15. కీలు కదలికలు కష్టంగా తయారవటం
 16. ఉదయం లేస్తూనే కీళ్ల కదలికలు బాధాకరంగా ఉండటం
 17. ఈ లక్షణాల తీవ్రత ఎప్పుడూ ఒకే తీరులో కాకుండా పెరుగుతూ తగ్గుతూ ఉండొచ్చు.
 18. వీటికి తోడు...
 19. చాలామందిలో రక్తహీనత
 20. ఆకలి సరిగా లేకపోవటం
 21. నిస్సత్తువ, బరువు తగ్గిపోతుండటం
 22. బాధలు ఉద్ధృతంగా ఉన్నప్పుడు కొద్దిపాటి జ్వరం
 23. మోచేయి, మణికట్టు ప్రాంతంలో చిన్న బుడిపెలు (రుమటాయిడ్‌ నాడ్యూల్స్‌) ఉండొచ్చు. ఇవి ఉన్న వారిలో వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది.
 24. ఎక్కువ కీళ్లు వాచటం, రెండు వైపులా ఒకే రకం కీళ్లు ప్రభావితం కావటం, నొప్పి.. ఈ లక్షణాలు 6 వారాల కన్నా ఎక్కువకాలం ఉంటే దాన్ని కీళ్లవాతం అని అనుమానించాలి.
 25. వదిలేస్తే... విష వలయం!

  కీళ్లవాతాన్ని అరుదైన సమస్యగా భావిస్తుంటారు గానీ ఇది చాలామందిలో కనిపిస్తుంది. మన జనాభాలో సుమారు ఒక శాతం మంది దీంతో బాధపడుతున్నారు. కానీ చాలామంది దాన్ని కీళ్లవాతంగా గుర్తించలేక.. ఏదో మామూలు కీళ్లనొప్పులేనని భావిస్తూ.. సమస్య ముదిరిపోయే వరకూ తాత్సారం చేస్తున్నారు. దీన్ని సత్వరం గుర్తించి చికిత్స చేయటం ఎంతో అవసరం. లేకపోతే పరిస్థితి ప్రాణాంతక సమస్యలకూ దారి తీస్తుంది.

 26. కీళ్లవాతం వచ్చిన తొలిదశలో కీళ్ల మీది పైపొర మాత్రమే దెబ్బతింటుంది. వ్యాధి ముదురుతున్నకొద్దీ క్రమేపీ అది కీళ్లను, లోపలి ఎముకలను కొరికేస్తుంది. ఇంకా తీవ్రమైతే కీళ్ల మధ్య ఖాళీ తగ్గిపోతుంది. దీంతో ఎముకల రాపిడి కారణంగా నొప్పి వస్తుంది. కొన్నాళ్లకు కీళ్లు మొత్తం దెబ్బతింటాయి.
 27. రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌ను నిర్లక్ష్యం చేస్తే ఇతర వ్యాధులు ముంచుకొచ్చే అవకాశమూ ఎక్కువే. కీళ్లవాతాన్ని సరిగా నియంత్రించుకోకపోతే- వీరిలో గుండె జబ్బులు, పక్షవాతం వంటివి పదేళ్ల ముందుగానే వచ్చే ప్రమాదం ఉంది. కళ్లు పొడిబారటం, లాలాజలం తగ్గిపోవటంతో పాటు గుండె చుట్టూ, వూపిరితిత్తుల చుట్టూ నీరు చేరటం వంటి ఇబ్బందులూ ఎదురవ్వచ్చు. కీళ్లవాతాన్ని కచ్చితంగా నియంత్రణలో ఉంచుకుంటే ఈ దుష్ప్రభావాల బెడద ఉండదు. లాలాజల గ్రంథులు దెబ్బతింటే నోరు ఎండిపోతుంది. దీంతో పిప్పిపళ్లు వచ్చి, త్వరగా దంతాలు వూడిపోతాయి. నాడుల చుట్టూ ఉండే రక్తనాళాలు దెబ్బతినటం వల్ల కాళ్లల్లో తిమ్మిరి, స్పర్శ తగ్గిపోవటం వంటివీ మొదలవుతాయి. చర్మం మీద పుండ్లు పడటం, నాడులు దెబ్బతిని న్యూరోపతీ రావొచ్చు.
 28. వ్యాధి ఉద్ధృతంగా ఉన్నప్పుడే ఇతరత్రా దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. వ్యాధి ఉద్ధృతి తగ్గితే ఇతరత్రా దుష్ప్రభావాలు వచ్చే అవకాశం పెద్దగా ఉండదు. అందుకే వీడకుండా చికిత్స, క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవటం.. ఉత్తమం!
 29. రకాలు:

  1. రుమటాఇడ్ ఆర్ త్రైటిస్ (Rheumatoid Arthritis)
  2. ఆస్టియొ ఆర్ త్రైటిస్ (Osteoarthritis)
  3. గౌట్స్ వ్యాధి (Gout)

  ఆర్ త్రైటిస్ లేక కీళ్ళవాపు లక్షణాలు:

  • నొప్పిగా ఉండడం - ఈ నొప్పి కాళ్ళ కీళ్ళ లో - కదలిక మూలాన, నడిచి నప్పుడు, కుర్చీ నుండి లేచినప్పుడు

  వేళ్ళ కీళ్ళ లో - వ్రాసి నప్పుడు, టైపు చేసినప్పుడు, ఏదైన వస్తువు పట్టుకున్నప్పుడు, కూరగాయల తరుగుతున్నప్పుడు మొదలగునవి

  • మంట అనగా

  (1) వాపు (2) కీళ్ళు వాయడం (3) బిగుసుకుపోయి వుండటం (4) ఎఱ్ఱగా మారడం (5) వేడిగా అనిపించడం

  • ప్రత్యేకంగా ఉదయాన్నే కీళ్ళు బిగుసుకు పోయినట్టు అనిపించడం
  • కీళ్ళను వంచడంలో కష్టమనిపించడం
  • కీళ్ళు కదల్చడం సాధ్యం కాకపోవడం
  • కీళ్ళు వాటి సాధారణ ఆకృతి కోల్పోవడం లేదా కీళ్ళలో అంగ వైకల్యత ఏర్పడవచ్చు
  • బరువు తగ్గి పోవడం, అలసట
  • కారణం తెలియని జ్వరం
  • కీళ్ళు కదల్చినప్పుడు రాపిడి వల్ల వచ్చే శబ్దం

  ఆర్ త్రైటిస్ లేక కీళ్ళ నొప్పులను ఏ విధంగా సవరించుకోవచ్చు
  సమర్థవంతంగా, సరియైన పద్ధతిలో తగు చర్యలు తీసుకోవడం మూలంగా కీళ్ళ నొప్పులతో సాధారణ జీవితం గడపవచ్చు.

  • కీళ్ళ నొప్పుల గురించి అవగాహన ఏర్పరచుకోవడం వ్యాధి గురించి, దాని నివారణ గురించి త్వరితగతిన మూలమైన వైద్యం చేయించు కొని కీళ్ళ జబ్బుల వలన కలిగే దుష్పలితాలను అరికట్టుకోవచ్చు
  • నిర్ణీత సమయాల్లో రక్త పరీక్షలు, ఎక్స్ రే లు తీఇంచుకొని, వైద్యుల సలహా మేరకు మందులు క్రమబద్దంగా వాడడం
  • శరీర బరువు నియంత్రించుకోవడం
  • ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం
  • క్రమం తప్పకుండా వైద్యుల సలహా మేరకు వ్యాయామం చేయడం
  • శారీరక ఒత్తిడులకు దూరంగా ఉండడం, వ్యాయామం, విరామం, విశ్రాంతి అన్నీ తగు మోతాదులలో నిర్ణీత సమయాలలో పాటించడం
  • పనిని ముందే నిర్ణయించుకోవడం
  • మందుల కన్నా యోగాసనాలు బాగా పని చేస్తాయని శాస్త్రీయపరంగా నిరూపించబడినది

  మోకాలు నొప్పులు

  కారణాలు
  మోకాలు నొప్పులు సాధారణంగా

  • మోకాళ్ళు అధికంగా వాడడం మూలాన, బాగా చాచకుండా పరిమితంగా వాడడం మూలన వస్తాయి
  • అధిక బరువు వీటి మీద చాలా ప్రభావం చూపుతుంది
  • కీళ్ళ వాపులు
  • మోకాళ్ళ పై అధిక ఒత్తిడి – (1) ఎక్కువ సేపు వంగి వుండడం, (2) అధికంగా ఉపయోగించడం (3) దెబ్బల కారణంగా
  • మోకాలు ముందు భాగంలో నొప్పి (ముఖ్యంగా మెట్లు ఎక్కి దిగేటప్పుడు)
  • స్నాతువుల కార్టిలేజి చితికి పోవడం మూలంగా
  • బెనకడం
  • మోకాలి చిప్ప స్థానభ్రంశం చెందడం
  • మోకాలి కీళ్ళలో ఇన్ ఫెక్షన్
  • మోకాలి దెబ్బలు
  • నడుము ఎముకలలో వున్న అసాధారణ పరిస్థితులలో నొప్పి మోకాలి వరకూ ప్రాకవచ్చు.

  ఎముకలలో క్యాన్సర్ గడ్డలు కూడా మోకాళ్ళలో నొప్పులు కలిగిస్తాయి.
  ఇంటిలో తీసుకోవలసిన జాగ్రత్తలుః-
  మోకాళ్ళ నొప్పులు ఎక్కువ వాడకం, శారీరక శ్రమ వలన ఏర్పడినప్పుడు వీటిని తగ్గించు కోవడంతో ఉపయోగంతో ఉపశమనం కలుగుతుంది.

  • విశ్రాంతి ఏ పని చేసినప్పుడు నొప్పి ఎక్కువ అవుతుందో గమనించి అటువంటి పనులు చేయకపోవడం, ముఖ్యంగా బరువులెత్తడం.
  • మోకాలికి ఐసు (ice) పెట్టుకోవడం, మొదట సారి 15 ని, ఐసు(ice) పెట్టండి. తరువాత రోజుకు కనీసం 4 సార్లు పెట్టాలి.
  • మోకాళ్ళ వాపు తగ్గించడానికి మోకాళ్ళు ఎత్తులో వుంచాలి.
  • నొప్పి, వాపుకు మందులు వాడాలి
  • పడుకునే సమయంలో మోకాళ్ళ మధ్యలో లేదా మోకాళ్ళ క్రింద దిండ్లు పేట్టుకొని పడుకోవాలి

  కండరాల నొప్పి

  కండరాల నొప్పి

  • సాధరణ స్థాయి కంటే ఎక్కువగా వ్యాయామము చేయు వారికి- ఆ వ్యాయామానికి సంబంథించిన కండరాల నొప్పి ఆకస్మికంగా వస్తుంది.
  • గర్భవతి సమయములో – గర్భాశయ వత్తిడి కారణంగా రావచ్చు
  • శరీరములో లవణాల శాతము తగ్గినప్పుడు (ఉదా: విరోచనాలలో ప్రమాదకర లక్షణాలు)
  • శరీరములో కాల్షియం శాతం తగ్గినప్పుడు
  • ధైరాయిడ్ గ్రంధికి సంబంథించిన వ్యాధులు
  • అధిక మోతాదులలో మత్తుపానీయాలు దీర్ఘకాలంగా సేవించిన వారికి
  • మూత్రపిండాలకు సంబంథించిన వ్యాధులు

  ప్రాధమిక చికిత్స

  • అకస్మాత్తుగా కండరాల నొ ప్పి వచ్చినప్పుడు – పూర్తిగా విశ్రాంతి అవసరము.
  • నోప్పి వున్న కండరాలకు ఎలాంటి మర్ధనలు చేయరాదు.
  • డాక్టరు సలహా తీసుకోని కండరాల నొ ప్పి తగ్గే మాత్రలు వాడవచ్చు
  • అవసరమైనచో రక్తములో వివిధ లవణాల శాతం గుర్తించి తగిన వైద్యసలహా పొందాలి.

  కీళ్ళవాతం

  కీళ్ళవాతం

  ఇది చాలా నెమ్మదిగా పెరిగే సమస్య కీళ్ళ వాపును కలిగిస్తుంది. ఒకే సారి ఒకటి కంటే ఎక్కువ కీళ్ళలో కనబడుతుంది. మొదట చిన్న చిన్న కీళ్ళలో ( చేతి వేళ్ళ కీళ్ళు) మొదలై, తరువాత వేరే కీళ్ళలోకి ప్రాకుతుంది.( మోచేయి, మోకాలు, కాలి వ్రేళ్ళు).

  కారణాలు

  వీటి సరియైన కారణం తెలియరాదు. ఇది ఒక మిశ్రమ చర్య. ఇది జన్యు సంబందమైన, వాతావరణం మరియు హార్మోన్ల ప్రభావం మూలన కలిగే తన స్వంత కణజాలముల మీద ప్రతి ఘాతము కలిగిస్తుంది. దీని మూలంగా కీళ్ళ వాపుతో హాని కలిగి ఆకృతులలో మార్పు వస్తుంది.

  జన్యు పరమైన కారణాలు
  దీని మూలంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఇది వంశపారం పర్యంగా వస్తుంది.

  వాతావరణ ప్రభావాలు
  ప్రభావితం అయ్యే వ్యక్తుల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. చాలా కారకాలు కనుగొన్నారు.

  హార్మోన్ల ప్రభావం
  దీని ప్రభావం మూలాన సమస్య అధికం కావచ్చు. లేదా తగ్గవచ్చు. స్త్రీలలో ముట్లు ఎండి పోయే ముందు అధికంగా కనిపిస్తుంది.

  హానికారకాలు

  వయస్సు : 20 నుంచి 40 సం ” లోపు అధికంగా కనబడుతుంది. ఏ వయస్సు వారికైనా రావచ్చు.
  లైంగిక భేదం : స్త్రీలు ముఖ్యంగా ముట్లు ఎండి పోయే వయస్సులో వున్న వారికి పురుషుల కన్న మూడు వంతులు అధికంగా కనబడుతుంది.

  కీళ్ళ వాపులోఏమి జరుగుతుంది ?

  • మొట్ట మొదటి మార్పు కీళ్ళ లోపలి కణాలలో వాపు మరియు తెల్ల రక్త కణాలు చేరడం.
  • కీళ్ళ లోపలి స్ధలంలో సైనో వియల్ ద్రవం చేరుతుంది. (సైనో వియల్ పొర వాచి ఈ ద్రవం స్రవిస్తుంది.) తరువాత సైనో వియల్ పొర వాచి కీళ్ళ మధ్య స్ధలంలో వేళ్ళ ఆకారంలో చొచ్చుకొని వస్తుంది. ఇది కీళ్ళ మధ్యలో వుండే చక్రాలకు (auricular cartilage) అన్ని వైపులా పాకుతుంది. ఈ పద్దతి ని ఫానస్ అనబడును ఇది క్రమక్రమంగా కీళ్ళ మధ్యలో వుండు చక్రాలను తినివేస్తూ, కీళ్ళ మధ్య స్ధలాన్ని తగ్గించి వేసి వాటి కదలికలను తగ్గించి వేస్తుంది.

  ఎలా జబ్బు పెరుగుతుందో అలా కండరాలు క్షీణించి కీళ్ళు విపరీతాకృతులలో గట్టిపడిపోతాయి. ముఖ్యంగా రోగులు ఏ స్దితిలో నొప్పి తక్కువుగా ఉంటుందో అదే స్దితిలో ఎక్కువ సేపు కీళ్ళను అలాగే ఉంచేస్తారు. దాని మూలాన ( ఫానస్) క్రమక్రమంగా గట్టి పడి పోతుంది. (ఇరు మూలలు కలసి పోవడం ) దీని మూలాన కీళ్ళు అతికినట్టుండి పోతాయి. దీనిని ఏన్ క్తెలోసింగ్ అంటారు. వీటితో పాటు గుండ్రటి ఎముకలు గట్టి పడ్డటు చిన్న చిన్న వాపులు చర్మం క్రింద ( రుమెటాయిడ్ నాడ్యూల్స్) ఊపిరితిత్తుల్లో ,గుండెలో, కళ్ళలో కూడ కనబడుతాయి.

  కీళ్ళ వాతంచికిత్స

  • కీళ్ళ వాపు, నొప్పి తగ్గించడం
  • వ్యాధి ముదరకుండా అరికట్టడం
  • కీళ్ళ కదలిక తగ్గించడం అసాధారణ ఆకృతులను నివారించడం (కురూపము)

  వీటిని ఫిజియోధెరపీ, మందులు శస్త్ర చికిత్సల ద్వారా సాధించవచ్చు.

  (ఫిజియోధెరపీ) (భౌతిక చికిత్స)

  • కండరాలకు, కీళ్ళకు విశ్రాంతి ఇవ్వడం మూలాన నొప్పి, బిగువ తగ్గించ వచ్చు. కీళ్ళ చుట్టూ బద్దలు వాడడం మూలాన కీళ్ళకు విశ్రాంతి ఇవ్వడం ద్వారా అనవసర కదలికలు, నికుంచనములు తగ్గించ వచ్చును. వ్యాధి గ్రస్త మైన కీలుకు ఆధారమివ్వడానికి ఊత కట్టెల వంటి సాధానాలు వాడవచ్చును.
  • వ్వాధి గ్రస్తమైన కీళ్ళకు ఎక్కువ శ్రమ కలగ కుండా, అదే సమయంలో కొంత కదలికలు, బలం చేకూరే విధంగా భౌతిక చికిత్స చేయించాలి. ఇలా వైద్యుల పర్య వేక్షణలో తర్ఫీదు ఇవ్వాలి.

  నియమిత బరువు పాటించడం ఈ చికిత్సలో అతి ముఖ్య భాగం. ముఖ్యంగా కాళ్ళ కీళ్ళలో ఈ వ్యాధి సోకినప్పుడు.

  మెడ కీళ్ళ బిగువు

  ఈ జబ్బులో మెడ ఎముకలు అసాధారణ రీతిలో పెరుగుతాయి. మెడ ఎముకల మధ్య వుండే ( అంతర్ కశేరుక చక్రాలు) లో కాల్షియం ఎక్కువ మోతాదులో చేరడం. చొచ్చుకొని బయటకు రావడం వంటివి జరుగుతాయి. ఎముకలోపల క్షీణించడం జరుగుతుంది.
  నడివయస్కులు, వయసు పై బడిన వారిలో మెడ భాగంలోని వెన్ను ఎముకలలో క్షీణించడం మొదలవుతుంది. దీని మూలంగా ఏ లక్షణాలు కనపడక పోవచ్చు.
  వెన్నుముకల మధ్య భాగంలో ఉన్న చక్రాలలో క్షీణత మూలంగా నరాలపై ఒత్తిడి పెరిగి కీళ్ళ బిగువు లక్షణాలు కనపడవచ్చు. సాధారణంగా మెడ, వెన్ను ఎముకల మధ్య చక్రాలలో ఈ మార్పులు ఎక్కువగా కనిపిస్తాయి.

  మెడ కీళ్ళ బిగువు లక్షణాలు

  ఎముకలలో క్షీణత మూలంగా కలిగిన మార్పుల వల్ల లక్షణాలు కనపడడం మొదలవుతాయి.

  • మెడ నొప్పి, ఈ నొప్పి భుజాలకు, చేతులకు ప్రాకవచ్చు.
  • మెడ పట్టుకోవడం ( నీలిగి నట్టు) మూలాన మెడ త్రిప్పడం, కష్టతరమవడం.
  • తల వెనుక భాగంలో నొప్పి.
  • భుజాలు, చేతులలో మంటగా అనిపించడం, చీమలు ప్రాకినట్లుగా ఉండడం, స్పర్శ జ్ఞానం తగ్గడం, వంటి లక్షణాలు.
  • కడుపులో త్రిప్పుట, వాంతులు, కళ్ళు తిరుగుట, తల తిరుగుట.
  • భుజాలు, చేతుల కండరాల బలహీనత, కండరాలు క్షీణించడం.
  • కాళ్ళు బలహీన పడడం, మూత్ర,మల విసర్జనలో నియంత్రణ లోపించడం ( వెన్నుపాము పై ఒత్తిడి పెరిగినప్పుడు)

  మెడ బికువు చికిత్స

  • నరాల పై వత్తిడి తగ్గించి తద్వారా నొప్పి మరియు ఇతర లక్షణాల నుంచి విముక్తి కలిగించడం.
  • వెన్నుపాము, నరాల మొదలుకు హాని కలుగ కుండా నివారణ చర్యలు తీసుకోవడం
  • క్షీణత మార్పులు ఎక్కువ కాకుండా నివారించడం.

  ఈ క్రింది చర్యలు తీసుకొనడం మూలన పై మార్పులు నివారించవచ్చు.

  • మెడ కండరాలు బలపడేటటువంటి వ్యాయామాలు ఇవి వైద్యుల పర్యవేక్షణలోనే జరగాలి.

  ఫిజియో థెరపి వైద్యుల సలహా మేరకు నేర్చుకొని ఇంట్లో చేసుకొనవచ్చు.
  మెడ బెల్టు (మెడ పట్టీ), మెడకు పట్టీ వేయడం మూలాన మెడ కదలికలు తగ్గించి తద్వారా నొప్పిని తగ్గించవచ్చు.

  వాత రోగము (గౌట్)

  ఆహారం, మద్యపానియాలను సమృద్ధిగా వినియోగించడం వల్ల వాత రోగం వస్తుంది. రక్తంలోని మూత్రామ్లము స్థాయి అసాధారణంగా పెరిగి పోయిన కారణంగా శరీరంలోని జైవిక క్రియ చెల్లా చెదురు అవుతుంది. రక్తంలోని మూత్రామ్లము అడుగున మడ్డి పేరుకుపోయి స్ఫటికాలు తయారుకావడానికి దారి తీస్తుంది. ఈ స్ఫటికాలు ఎక్కువగా బొటనవేలు కీళ్ల మధ్యగల ఖాళీ స్థలాల్లో, కొన్ని సార్లు మూత్రపిండం (కిడ్నీ) లో తిష్ఠవేస్తాయి.

  వాత రోగము వస్తే ఏం జరుగుతుంది ?

  మూత్రంలో నుంచి విడిచిన ద్రవ పదార్థమే మూత్రామ్లము. మూత్రంతో పాటు ఈ మూత్రామ్లమును కూడా ప్రధానంగా మూత్రపిండమే విసర్జిస్తుంది. మూత్రామ్లము విసర్జన తగ్గినా (ఇది ప్రధానకారణంగా) లేదా మూత్రామ్లము అధికంగా ఉత్పత్తి జరిగినా, సాధారణంగా శరీర సమతుల్య ప్రక్రియకు భంగం కలుగుతుంది. అపుడు, రక్తంలోని మూత్రామ్లము స్థాయి హెచ్చుతుంది. ఇది స్ఫటికాల తయారీకి దోహదం చేస్తుంది. ఈ స్ఫటికాలు శరీరంలో కీళ్ల మధ్యగల ఖాళీ స్థలాలతో సహా వివిధ ప్రదేశాల్లో పాతుకుపోతాయి. శరీర రక్షణ కణాలు ఈ స్ఫటికాలను కబళించి వేస్తాయి. దీంతోనొప్పిని కలిగించే మూల పదార్ధాలు కీళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో విడుదల అవుతాయి. ఇలా ప్రభావితమైన కీళ్లను చెడగొట్టటానికి ఈ ప్రక్రియనే ప్రధాన కారణమని విశ్వసిస్తున్నారు.

  ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

  డిస్క్‌ప్రొలాప్స్‌

  శరీర వ్యవస్థలో వెన్నెముక ఒక మూలస్తంభం లాంటిది. ఆ మూల స్తంభం దెబ్బ తింటే ఎటూ కదల్లేక నేల మీద వాలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అసలు ఈ సమస్యలు రాకుండా జాగ్రత్త పడటమే ఉత్తమం. ఒకవేళ ఆ సమస్యలు వస్తే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్య చికిత్సలు తీసుకోవడం చాలా అవసరం. లేదంటే శరీరం శాశ్వతంగా మూలనపడే ముప్పు ఏర్పడుతుందంటున్నారు నిపుణులు.

  వెన్ను పలు విభాగాల సమ్మేళనం. వెన్నుముకకు తోడుగా కండరాలు, లిగమెంట్లు, డిస్కులు ఉంటాయి. వెన్నెముక సులభంగా వంగడానికి డిస్కులు, లిగమెంట్లు తోడ్పడతాయి. మెడనుంచి న డుము వరకు ఉండే ఈ వెన్నెముకలో 33 పూసలు ఉంటాయి. వెన్నెముకలోని ప్రతి రెండు పూసలను బంధిస్తూ లిగమెంట్లు ఉంటాయి. పూసల మధ్య రబ్బరు కుదురు లాంటి ఒక పదార్థం ఉంటుంది.

  దీనికే డిస్క్ అని పేరు. వెన్నెముక పొడవునా లేదా వెన్నుపాము (స్పైనల్ కార్డ్) ఉంటుంది. దీంట్లోంచి అసంఖ్యాకమైన నరాలు వెళుతుంటాయి. మెడభాగం నుంచి వె ళ్లే నరాలు చేతుల్లోకి వెళతాయి. న డుము నుంచి వెళ్లే నరాలు కాళ్లలోకి వెళతాయి. వీటిలో కొన్ని నరాలు మూత్రకోశం, మలవిసర్జక భాగంతో పాటు లైంగిక భాగాల్లోకీ వెళతాయి. వెన్నుపూసల మధ్య ఉండే డిస్కు దెబ్బ తినడం శరీరంలోని ఒక పరిణామం.

  శరీరంలోని కదలిక లకు ఒక ప్రధాన కేంద్రంగా ఉండడం వల్ల సర్వైకల్, లుంబార్ భాగాల్లోని డిస్క్‌లే ఎక్కువగా దెబ్బతింటూ ఉంటాయి. అంటే ఉన్న స్థానం నుంచి పక్కకు జరుగుతాయి ఈ స్థితినే డిస్క్ ప్రొలాప్స్ అంటారు. శరీరంలో వెన్నుపాము ఒక మూలస్తంభం లాంటిది. దానికి ఇరువైపులా, ఉదరభాగంలోనూ కండరాలు ఉంటాయి. నిరంతరం శరీర శ్రమ చేసివారిలో ఈ కండరాలు బలిష్టంగా ఉంటూ వెన్నుపూసలకు సహాయంగా ఉంటాయి.

  ఈ శరీర శ్రమేదీ లే ని వారిలో కండరాలు బలహీనమై శరీర భారమంతా వెన్నుపాము మీదా అలాగే డిస్కుల మీదా పడుతుంది. ఆ ఒత్తిడికి లోనైన డిస్కు తన స్థానం నుంచి పక్కకు జరుగుతుంది. ఈ స్థితినే డిస్క్ ప్రొలాప్స్ అంటారు. ఈ స్థితిలో పక్కకు జరిగిన డిస్కు పక్కనున్న నాళాల మీద వాలిపోతుంది. ఆ తరువాత వచ్చే సమస్యల అన్నిటికీ ఇదే మూలం. డిస్కు నాళాల మీద వాలిన వెంటనే నొప్పి రావడం మొదలువుతుంది.

  సాధారణంగా డిస్క్ ప్రొలాప్స్ సమస్యలకు గురయ్యే వారిలో ఎక్కువగా వృద్దులే ఉంటారు. అయితే శరీర శ్రమ బాగా తగ్గిపోవడం వల్ల ఇటీవలి కాలంలో యుక్తవయస్కులు కూడా ఈ సమస్యకు లోనవుతున్నారు. డిస్కుల్లో సహజంగానే కొంత ద్రవం ఉంటుంది. డిస్కుల్లో వెన్నుపూసను పట్టి ఉంచే బిగువు ఈ ద్రవం వల్లే కలుగుతుంది.. అయితే వయసు పైబడే కొద్దీ ద్రవం క్రమంగా తగ్గిపోయి డిస్కు మెత్తబడుతుంది. ఆ తరువాత వెన్నుపూసకు ఆధారంగా ఉండలేక డిస్కు తన స్తానం నుంచి కొంత పక్కకు జరిగి నరాల మీద వాలిపోతుంది. వెన్ను నొప్పి కారణాల్లో ఇదీ ఒకటి.

  డిస్కు సమస్యలకు స్థూలకాయం మరో ప్రధాన కారణం. బరువు పెరిగే కొద్దీ డిస్కుల మీద భారం పెరిగి అవి బయటికి అంటే త మ సహజ స్థానం నుంచి పక్కకు జరుగుతాయి.
  పని భారాన్ని అన్ని అవయవాల మీద సమంగా వేయకుండా ఆ ఒత్తిడి అంతా వెన్నెముక మీదే పడేలా చేయడం మరో కారణం.అలాగే శక్తిని మించిన బరువులు ఎత్తడం, ఏ శిక్షణా లేకుండానే హై జంప్, లాంగ్ జంప్, హెవీ వెయిట్ లిఫ్టింగ్‌లు, ఎక్కువ దూరం రన్నింగ్ చేయడం, రోజంతా వంగి పనిచేయడం డిస్కు ప్రొలాప్స్ కు దారి తీసే మరికొన్ని ఇతర కారణాలు. అలాగే వయాగ్రా లాంటి కృత్రిమ ప్రేరకాలు కూడా డిస్కు సమస్యలకు కారణమవుతాయి.

  ఇవే కాకుండా ఏదైనా ప్రమాదంలో వెన్నుపూసల మీద బలంగా దెబ్బ తగలడం, మనం ప్రయాణిస్తున్న వాహనాలు గోతుల్లో పడిపోవడం కూడా ఈ సమస్యలను తెచ్చిపెడతాయి. కొందరిలో టిబి ఇన్‌ఫెక్షన్లు కూడా వెన్నుపూసను దెబ్బ తీసే ప్రమాదం ఉంది. పక్కకు జరిగిన డిస్కు నరాల మీద పడిపోయినప్పుడు నొప్పి మాత్రమే కాకుండా కొన్ని సార్లు పక్షవాతం కూడా రావచ్చు.

  డిస్క్ దెబ్బతింటే...
  మెడ భాగంలో మొదలయ్యే సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యతో మెడతో పాటు చేతి నరాల్లోనూ నొప్పివస్తుంది. నడుము భాగంలోని డిస్కులు పక్కకు జరిగిన వారికి పడుకుని లేదా కూర్చుని ఉంటే ఏమీ అనిపించదు. కానీ, లేచి కొద్ది దూరం నడవగానే వెన్నునొప్పి మొదలవుతుంది. కాళ్లల్లో నొప్పితో పాటు నరం ఒత్తిడికి గురవుతున్న చోట తిమ్మిరి వస్తుంది. నడకలో ఇబ్బందులు మొదలవుతాయి ఈ స్థితినే సయాటికా అంటారు.

  చికిత్సలేమిటి?
  ఎంఆర్ఐ పరీక్షలోనే దాదాపు 50 మందిలోని డిస్క్ ప్రొలాప్స్ సమస్య కనిపిస్తుంది. నిజానికి డిస్క్ ప్రొలాప్స్‌తోనే సమస్య కాదు. ప్రొలాప్స్ తరువాత నొప్పి వస్తేనే దాన్ని సమస్యగా భావించాలి. నొప్పి లేనప్పుడు పక్కకు జరిగిన డిస్కులు వాటికవే తిరిగి తమ సహజ స్థానానికి వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి 90 శాతం డిస్కు సమస్యలు మందులతోనే నయమవుతాయి.

  మిగతా ఆ 10 శాతం మందికే శస్త్ర చికిత్స అవసరమవుతుంది. కాళ్లల్లో బలహీనతగానీ, తిమ్మిరిగానీ లేకుండా కే వలం నొప్పి మాత్రమే ఉంటే మందులు, ఫిజియోథెరపీతో సమస్య ముగిసిపోతుంది. కొందరిలో మందులు వాడుతున్నా తిమ్మిర్లతో పాటు కాళ్లు లేదా చేతులు బలహీనపడుతూ నొప్పి భరించలేని స్థితికి చేరుతుంది. తమ ఉద్యోగ, వ్యాపారాలేవీ చేసుకోలేని స్థితికి కూడా కొందరు వచ్చేస్తారు. అలాంటి వారికి శస్త్ర చికిత్స తప్పనిసరి అవుతుంది.

  సాధారణంగా డిస్కు ఏదో ఒక పక్కకు జరగడమే చూస్తాం. కానీ, అరుదుగా కొందరిలో డిస్కు మద్యలో దెబ్బ తింటుంది. ఇది మరీ తీవ్ర సమస్య. ఈ సమస్యతో లైంగిక శక్తి దెబ్బ తింటుంది. చివరికి మలమూత్ర విసర్జనలు కూడా ఆగిపోతాయి, ఈ స్థితిలో తక్షణమే శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుంది. ఆలస్యం చేస్తే ఇది ప్రాణాపాయానికి కూడా దారి తీయవచ్చు.

  నివారణేమిటి ?
  రోజూ పొట్ట, మెడ కండరాలను పటిష్టపరిచే వ్యాయామాలు చేస్తే నడుము భాగంలో వచ్చే లుంబార్ స్పాండిలోసిస్ గానీ, మెడ భాగంలో వచ్చే సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యలు గానీ రాకుండానే కాపాడుకోవచ్చు. నిజానికి మన రోజు వారి కార్యకలాపాలన్నిలోనూ శరీరాన్ని ముందు వైపు వంచే ఉంచుతాం.
  ఈ స్థితిని బ్యాలెన్స్ చేసేందుకు శరీరాన్ని వెనుకకు వంచే సాధన లేవీ చాలా మంది చేయరు. అందుకే విధిగా శరీరాన్ని ముందుకు వంచే ఫ్లెక్షన్ వ్యాయామాలతో పాటు వెనక్కు వంచే ఎక్స్‌టెన్షన్ వ్యాయామాలు కూడా రోజూ చేస్తే డిస్కు సమస్యలను చాలా వరకు దూరంగా ఉంచవచ్చు.

  వేధించే కాలినొప్పి... సయాటికా

  సయాటికా.. ఈ సమస్య ఉన్న వారికి కండరాలు పట్టేసినట్లు ఉండటమే కాదు భరించలేని నొప్పి ఉంటుంది. దీనికి ఆధునిక వైద్య విధానంలో శస్త్రచికిత్స ఒకటే మార్గమని చెబుతారు. అయితే అది కూడా తాత్కాలిక ఉపశమనానికి మాత్రమే. కొంత కాలం తర్వాత ఈ నొప్పి మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంటుంది. కానీ ఆయుర్వేదంలో సయాటికాకు శాశ్వత పరిష్కారం ఉందంటున్నారు వైద్యులు.

  శరీరంలో అతి పొడవైన నరం సయాటిక్. ఇది తొడల నుంచి మోకాళ్లు , పిక్కల ద్వారా అరికాళ్లు , కాలివేళ్ల దాకా వ్యాపించి ఉంటుంది. మన వెన్నులో ప్రతి రెండు వెన్నుపూసల మధ్య కొంత ఖాళీ ప్రదేశం , ఒక సయాటిక్ నరం , పూసలను బంధించి ఉంచే కొన్ని కండరాలు ఉంటాయి. మన దైనందిన పనుల్లోని కొన్ని లోపాల వల్ల కొందరిలో ఈ పూసలను బంధించి ఉంచే కండరాలు బలహీనమవుతాయి. ఫలితంగా పూసల మధ్య సహజంగా ఉండవలసిన ఖాళీ తగ్గిపోతుంది. దీనివల్ల పూసల మధ్య ఉండే సయాటికానరం ఒత్తిడికి లోనవుతుంది. దీనివల్ల ఆ నరం శరీరంలో ఎంత దూరం వెళితే అంత దూరం నొప్పి వస్తూనే ఉంటుంది. సయాటిక్ నరం ఒత్తిడికి గురి కావడం వల్ల వచ్చే సమస్య కావడం చేత దీనికి సయాటికా అన్న పేరు స్థిరపడింది. సయాటికాకు ఆయుర్వేద పరిభాషలో గృద్రసి వాతం అని పేరు.

  లక్షణాలు

  సయాటికా సమస్య ప్రారంభం కాగానే కనిపించే లక్షణం నొప్పి. ఆ తరువాత కొంత అసౌకర్యంగా ఉండటం , ఆ భాగంలో ఏదో కదిలినట్టు , చీమలు పాకినట్లు , పొడిచినట్లు అనిపిస్తుంది. తరువాత ఆ భాగమంతా మొద్దుబారినట్లుగా తయారవుతుంది. వంగడం క ష్టమవుతుంది. ఒకవేళ వంగినా మళ్లీ లేవబోతే చురుకుపెట్టినట్లు అవుతుంది.ఈ లక్షణాలు తొంటి నుంచి కాలి వేళ్ల దాకా ఎక్కడైనా కనిపించవచ్చు. ఈ సమస్య నాలుగు దశల్లో ఉంటుంది. మొదటి దశలో నడుము భాగంలో కండరాలు పట్టేసినట్లు అనిపిస్తుంది. రెండవ దశలో ఈ నొప్పి నడుము నుంచి పిరుదుల దాకా వెళుతుంది. ఈ దశలో కాస్త తైలమర్ధనం చేసుకున్నా నొప్పి తగ్గుతుంది. మూడవ దశలో నొప్పితో కాలంతా లాగుతున్నట్లు అనిపిస్తుంది. అలాగే పొడిచినట్లు , మొద్దుబారినట్లు కూడా అనిపిస్తుంది. నాలుగవ దశలో నొప్పి కాలంతా పాకడమే కాకుండా కదల్లేని పరిస్థితి ఏర్పడుతుంది.

  పడుకుని మరో పక్కకు తిరగబోతే బలంగా చురుకు పెట్టినట్లు అవుతుంది. వంగినా లేచినా ఇదే పరిస్థితి ఉంటుంది. సయాటికా సమస్య ఉన్న వివాహితుల్లో చాలా మందిలో అంగస్తంభన లోపాలు , శీఘ్రస్కలన సమస్యలు ఉంటాయి. సయాటికా సమస్యతో వచ్చిన వారికి ఈ సమస్య కూడా ఉంటే రెండింటికీ ఏకకాలంలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ కాలం ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే నపుంసకత్వానికి కూడా దారి తీయవచ్చు. సమస్య మరీ తీవ్రమైతే కొందరిలో రెండు కాళ్లూ చచ్చుబడిపోవచ్చు. ప్రమాదాల్లో కూడా కొందరిలో ఈ పరిణామాలు చోటుచేసుకుంటాయి. సమస్య మొదలైన మూడుమాసాల్లోపే వస్తే ఇది సులభంగా తగ్గిపోతుంది. కనీసం ఏడాదిలోపు తీసుకున్నా మంచి ఫలితాలే ఉంటాయి. మూడేళ్లు దాటాక చికిత్స తీసుకుంటే సమస్య పూర్తిస్థాయిలో తగ్గదు.

  కారణాలు

  సయాటికా రావడానికి అస్తవ్యస్తమైన జీవన శైలి ప్రధాన కారణం. ఆధునిక జీవన విధానానికి అలవాటు పడిన వారిలో కండరాలకు ఎక్కువగా శ్రమ ఉండదు. అరుదుగా ఎప్పుడైనా కాస్త ఎక్కువ బరువు ఎత్తడం , ఎక్కువ గంటలు నిలుచోవడం లేక కూర్చునే భంగిమలో తేడా వల్ల వెన్నుపాము అపక్రమానికి లోనయితే ఈ సమస్య తలెత్తుతుంది. రోజంతా కూర్చుని లేదా నిలుచుని ఉండే ఉద్యోగ , వ్యాపారాలు చేసే వారు , మరీ ఎత్తయిన హీల్స్ ధరించేవారు , బెల్ట్‌ను మరీ బిగుతుగా పెట్టుకునే వారు , వెయిట్ లిఫ్టింగ్ చేసేవారు , ఏదైనా ప్రమాదానికి గురయిన వారు సయాటికా సమస్యకు గురికావచ్చు.

  అలాగే దీర్ఘకాలికంగా మధుమేహం , క్షయ , లైంగిక వ్యాధుల కారణంగా వ్యాధి నిరోధక శక్తి కోల్పోయినపుడు కూడా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఇవే కాకుండా బాల్యంలో తగిలిన దెబ్బల తాలూకు దుష్ప్రభావం శరీరంలో ఉండిపోతుంది. అది పెద్దయ్యాక ఎప్పుడో శరీరం బలహీనపడినప్పుడు సయాటికాగా బయటపడవచ్చు. ముఖ్యంగా రోజూ చేసే పనుల వల్ల కాకుండా హఠాత్తుగా ఏదైనా బరువైన పనిచేసినప్పుడు ఈ సమస్య రావచ్చు. ఇక స్త్రీలలో అయితే , గర్భంతో ఉన్నప్పుడు గానీ , ప్రసవ సమయంలో గానీ నడుము మీద పడే ఒత్తిడి వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. కొంతమంది స్త్రీలలో రుతుక్రమం ఆగిపోయిన తరువాత కాల్షియం లోపాల వల్ల సయాటికా సమస్య రావచ్చు.

  వైద్య చికిత్సలు

  ఈ సమస్య నాలుగు దశల్లో ఉంటుంది. వీటిని డిస్కు బల్జ్ , స్లిప్ డిస్క్ , హెర్నియేటెడ్ డిస్క్ , సీక్వెస్ట్రమ్ డిస్క్ అంటారు. మొదటి మూడు దశల్లో సమస్యను ఆయుర్వేద మందులతోనే పూర్తిగా తగ్గించవచ్చు. చికిత్సల తరువాత ఎంఆర్ఐ రిపోర్టు చూస్తే ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. చివరి దశ అయినటువంటి సీక్వెస్ట్రమ్‌లో మాత్రం శస్త్రచికిత్స అవసరమవుతుంది. సయాటికాకు ఆయుర్వేద వైద్యవిధానంలో పంచకర్మ చికిత్సలో భాగమైన మేరు చికిత్స బాగా పనిచేస్తుంది. ఆయుర్వేద మందులతో పాటు ఆహార నియమాలను పాటిస్తే ఫలితం బాగుంటుంది.

  వృద్ధాప్యంలో వేధించే ఆస్టియోపోరోసిన్‌

  వయసులో ఉన్నప్పుడు సరైన ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగించనప్పుడు దాని ప్రభావం వృద్ధాప్యంపై పడుతుంది. వయసుతో పాటు వచ్చే సమస్యలకు తోడుగా ఆస్టియోపొరోసిస్‌ వంటి వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అక్టోబర్‌ 20 వ తేదీని ప్రపంచ ఆస్టియోపొరోసిస్‌ దినంగా పాటిస్తున్నాం.అంతర్జాతీయ ఆస్టియోపొరోసిస్‌ ఫౌండేషన్‌ 1997 నుంచి దీనిని జరుపుతుండగా 1998-99 నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ కో స్పాన్సరర్‌ అయింది.

  ఆస్టియోపొరోసిస్‌ వల్ల అయ్యే తుంటి దగ్గర ఫ్రాక్చ ర్లు ప్రస్తుతమున్న 1.66 మిలియన్‌ నుంచి 2050 నాటికి 6.26 మిలియన్లకు పెరుగుతాయని వివిధ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఒక్క భారత దేశంలోనే సుమారు 60 మిలియన్ల మంది ఈ వ్యాధితో బారిన పడుతున్నారు. ఇందుకుతోడుగా ఒక లక్ష మంది వరకూ తుంటి ఫ్రాక్చర్లకు గురవుతున్నారు.

  వృద్ధాప్యం , వ్యాధులతో ఒకదానిని మించి ఒకటి ముందుకు పరుగులు తీస్తుంటాయి. ఆస్టియోపొరోసిస్‌ కూడా అటువంటి వృద్ధాప్య సమస్యే. ఎముక సాంద్రత తరిగిపోవడంతో ఫ్రాక్చర్‌లు అతి తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి మధ్య వయస్సు , వృద్ధాప్యంలో కనిపించినప్పటికీ మహిళల్లో ఇది ఎక్కువగా కనుపిస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్‌ దాటిన మహిళలలో తుంటి , వెన్నుముక , మణికట్టు ఫ్రాక్చర్లు అయ్యే అవకాశాలు పెరుగుతాయి. తుంటికి ఫ్రాక్చర్‌ అయినప్పుడు ఆసుపత్రిలో చేరడం , మేజర్‌ సర్జరీ అవసరం అవుతాయి. కొన్ని సందర్భాలలో ఈ వ్యాధి కారణంగా వ్యక్తి వేరే ఆధారం లేకుండా తనంతట తాను నడిచే శక్తిని కోల్పోతాడు. ఇది సుదీర్ఘకాలం కొనసాగవచ్చు లేదా మరణానికి కూడా దారి తీయవచ్చు.

  వ్యాధి లక్షణాలు:

  1. చేతులు , కాళ్ళు నొప్పులు
  2. తీవ్రమైన కీళ్ళ నొప్పి
  3. బలహీనత
  4. నిద్రలేమి
  5. నొప్పి శాశ్వతంగా ఉండడం
  6. ఎముకలలో సూదులు గుచ్చినట్టుగా నొప్పి
  7. పళ్ళు ఊడిపోవడం.
  8. జుట్టు ఊడిపోవడం
  9. గోళ్ళు పెళుసుబారిపోవడం
  10. ఒంటిమీద ఉండే వెంట్రుకలు రాలిపోవడం
  11. కంటిరెప్పలు రాలిపోవడం
  12. పళ్ళు విరగడం
  13. గోళ్ళు విరగడం
  14. జాయిం ట్లలో తీవ్రమైన నొప్పి
  15. ఎముకలు నొప్పి
  16. జాయింట్ల నొప్పి
  17. ఎముకలు బలంగా లేని భావన
  18. గూని
  19. నడక కుంటిగా మారడం
  20. తల తిరగడం
  21. కళ్ళు బైర్లు కమ్మడం
  22. ఎముకలు బలహీనం కావడం
  23. ఎముకలు క్షీణించడం
  24. ఎముకలు తేలిక కావడం
  25. నోరు పొడారిపోవడం
  26. ఎనీమియా
  27. అలసట
  28. చర్మం పొడిబారడం
  29. ప్రధాన జాయింట్లన్నీ వదులుకావడం
  30. కండరాలు చిక్కిపోవడం
  31. వాత వ్యాధి లక్షణాలు కనుపించడం.

  ఆస్టియోపొరోసిస్‌ వచ్చినప్పుడు ఆహారం ద్వారా మందుల ద్వారా ఎంత కాల్షియం ఇచ్చినప్పటికీ ఎము క ధాతువుకు పీల్చుకునే లక్షణం ప్రభావితమైనందున ఒంటపట్టదు. దీనితో ఎముక ధాతువులో కాల్షియం తరగిపోతుంది. జీవక్రియ అస్తవ్యస్తం కావడంతో ఎముక ధాతువులోని కాల్షియం ఛిద్రమైపోయి అయాన్ల బదిలీ వ్యవస్థ మార్పుకు గురవుతుంది.శరీరంలో కాల్షియంను పీల్చుకునే స్తరాలు రెండు ఉంటాయి. ఒకటి జీర్ణమైన ఆహారం రక్తంలో కలిసినప్పుడు , రెండవది ఎము క ధాతువులకు రక్త ప్రవాహం నుంచి లభించేది. ఇది సరిగా జరిగేందుకు పీల్చుకున్న కాల్షియం జీర్ణ ప్రక్రియలో ఏడు స్తరాలనూ దాటాలి. ఈ ప్రక్రియలోనే మినరల్‌ కాల్షియం జీవ ఏకీకరణ కాల్షియం అయాన్లగా పరివర్తన చెందుతుంది. ఇలా పరివర్తన చెందిన కాల్షియం అయాన్లను ఎముక ధాతువులు పీల్చుకొని వాటిని పటిష్ఠం చేస్తాయి.

  చికిత్స:

  ఆస్టియోపొరోసిస్‌ను నియంత్రించేందుకు ఆయుర్వేదంలో అద్భుతమైన చికిత్సలు ఉన్నాయి. వాతం కారణంగా సంభవించే ఈ వ్యాధికి స్నేహన (తైలమర్దనం) , స్వేదన , మృదు శోధన , గోరువెచ్చటి నూనెతో మర్దన , ఎనీమా థెరపీ వంటి చికిత్సలను ఉపయోగిస్తారు. ఈ చికిత్స రెండు భిన్న రకాలుగా పని చేస్తుంది.

  కాల్షి యం పూర్తి స్థాయిలో శరీరానికి ఒంటపట్టేలా చేయడం 2. వాతాన్ని కొన్ని రకాలైన ఆయుర్వేద తైలాలను తాగిం చడం ద్వారా తగ్గించడం.

  ఆహారం:

  ఆయుర్వేద సూత్రాల ఆధారంగా సంపూర్ణాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో వేరే చెప్పనవసరం లేదు.ఎముక ధాతువు స్థాయిలో మైక్రో న్యూట్రియంట్లను అందించడంలో ఆయుర్వేద సామర్ధ్యం సర్వ విదితమే. మాంసాహారం తీసుకునే వారు ఎక్కువగా తీసుకోవలసినది బోన్‌ సూప్‌ కాగా శాకాహారులు ములక్కాడ ఆకు , పువ్వు , కాడలను , అరటి దూట ఎక్కువగా తీసుకోవాలి.

  ఆస్టియొపొరోసిస్‌ రావడానికి వాతమే ప్రధాన కారణమైనందున రోజువారీ ఆహారంలో వాతాన్ని తగ్గించే పదార్ధాలు తీసుకోవాలి. ఆస్టియోపొరోసిస్‌ను అదుపు లో ఉంచడంలో నెయ్యి , పాలు , పాల ఉత్పత్తులు , మాంసపు సూపులు బాగా పని చేస్తాయి. అలాగే తాజా పళ్ళు , కాయగూరలు కూడా ఆ వ్యాధిని నిరోధించడానికి దోహదం చేస్తాయి.

  Dr. P.N.V.R. Prasad
  Asst. Professor
  Govt. Ayurvedic College
  Vijayawada
  Ph: 9666649665/ 9390957168

  ఆధారము: ఆయురారోగ్యాలు బ్లాగ్

  ఆస్టియొ ఆర్ త్రైటిస్

  ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- Osteo-arthritis at middle age,మోకాళ్ళ నొప్పులు నడివయసేలో -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ..

  మానవ శరీరం ఒక అత్యాధునికమైన యంత్రం. సంవత్సరాల తరబడి చేసే పనుల కారణంగా, నిలబడడం, నడక, కింద కూర్చోవడం వంటి అనేక కీలుపైన బరువు వేసే పనుల మూలంగా కీలులో ఉన్న స్ట్రక్చర్స్‌ బలహీనపడతారుు. కీలు కదిలినప్పుడల్లా ఎముకల మధ్యన రాపిడి తగ్గించడం కోసం కింది భాగంలో ఏర్పడిన కార్టిలేజ్‌ (cartilage) అనే ప్రొటీన్‌ (protein) పదార్ధం అరిగిపోతుంది. దీనితో పాటుగా ఇతర స్ట్రక్చర్స్‌ ద్రవ పదార్థాలు (sinovial fluid), రెండు ఎముకలని కలిపే లిగమెంట్లు (Ligaments), కీలు తొలగిపోకుండా ఉండటానికి కావలసిన మెనిస్కస్‌ ( meniscus), కీలు చుట్టూ ఉన్న కండరాలు (muscles) క్రమక్రమంగా క్షీణిస్తాయి . పెద్దవాళ్లలో మెుకాళ్ల నొప్పి మరింతగా బాధపెట్టడం అన్నది చాలా సాధారణమైన విషయం. కారణం మోకాళ్ల అరుగుదల. దీనినే ఆస్టియో ఆర్థరైటిస్‌ (Osteo-arthritis) అని అంటారు. కీళ్ల నొప్పుల వల్ల సామాజిక, మానసిక, శారీరక మార్పులు చేకూరుతారుు.

  -మోకాళ్ల నొప్పిని ప్రారంభ సమయంలో నిర్లక్ష్యం చేస్తే నెమ్మది నెమ్మదిగా మరో కీలు, ఆ తరువాత పైకిపోకుతూ తుంటి, నడుము నొప్పులు కూడా మొదలవుతాయి. ఈ నొప్పుల మూలంగా నడక తగ్గడంతో శరీరం బరువు పెరుగుతుంది. ఇతర అనారోగ్య సమస్యలు డయాబెటిస్‌, రక్తపోటు అదుపులో ఉండకపోవడంతో కాలక్రమేనా గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడతారు. కొన్నిసార్లు ఇతర కారణాల వల్ల కూడా అనగా హర్మోన్‌ మార్పులు, విపరీతమైన శరీర బరువు, పదే పదే కీలుకి దెబ్బలు తగలడం తదితర సమస్యలతో కూడా మోకాళ్ళ నొప్పులు బాధిస్తాయి.మోకాళ్ల అరుగుదలతో మొదలయ్యే సమస్య ప్రారంభ దశలో నొప్పి కేవలం కీళుపైన భారం వేస్తేనే (ఎక్కువ నిల్చున్నా, నడిచినా, మెట్లు ఎక్కినా) ఉంటుంది. కాసేపు కూర్చుని విశ్రాంతి ఇస్తే తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో నొప్పితో పాటుగా వాపు, ఉదయానే దాదాపు అరగంట వరకు కీళ్లు బిగుసుకు పోవడం వంటి ఇతర సమస్యలు ఉంటాయి. కీలుని పరీక్ష చేయడంతో కిర్రు కిర్రు మన్న శబ్ధం తెలుస్తుంది.

  ఆస్టియో ఆర్థరెైటిస్‌(Osteo-arthritis)ని నిర్ధారించడం కోసం కావలసిన పరీక్ష మోకాలు ముందు, పక్క నుంచి తీసిన ఎక్స్‌రే(x-ray). ఎక్స్‌రే (x-ray)లో అరుగుదల మార్పులు కనిపిస్తాయి. ఎముకల మధ్యన ఖాళీ తగ్గడం, కీలు చివరలో కొత్త ఎముక నిర్మించబడుతుంది. అరుగుదల వంటి మార్పులు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఇతర లోపాలు తెలుసకోవడం కోసం రక్త పరీక్ష ఉపయోగపడుతుంది.

  చికిత్స:
  ఆస్టియో ఆర్థరెైటిస్‌ (Osteo-arthritis) వల్ల వచ్చే ఇతర సమస్యలు తగ్గించడానికి వివిధ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముందు ఎముకలకి సంబంధించిన వైద్య నిపుణులని సంప్రదించి నొప్పి, వాపు తగ్గడానికి గల మందులు, తగ్గకపోతే కీళ్ల ఇంజెక్షన్‌ అవసరం పడుతుంది. దానితో పాటుగా కీళ్ల వ్యాయామం కోసం ఫిజియోథెరపిస్ట్‌ని సంప్రదించడం అత్యవసరం.
  ఫిజియోథెరపి చికిత్స చేయించుకోవడం వల్ల వీలెైనంత వరకు త్వరగా మునుపటి జీవనం సాగించవచ్చు.

  -ఫిజియో థెరపిస్ట్‌ మొదట్లో నొప్పి తగ్గించడం కోసం ఏదో ఒక అవసరమైన కరెంట్‌ పరికరం (ఐ.ఎఫ్‌.టి , అల్ట్రాసౌండ్‌ , ఐ.ఆర్‌.ఆర్‌. , ఎస్‌.డబ్లు.డి ) తో వారం పదిరోజుల వరకు చికిత్స చేస్తారు.నొప్పి తగ్గుతూ ఉండే కొద్ది తీసుకోవలసిన జాగ్రత్తలు, కండరాలు బలపడడానికి వ్యాయామాలు, తెలుసుకోవలసిందిగా సలహా ఇస్తారు.

  • గుండె బాగా కొట్టుకుంటుంది.
  • శరీరం అంతటా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
  • కనీసం 200 క్యాలరీలు (ఇ్చజూౌటజ్ఛీట) ఖర్చు అవుతాయి.
  • మంచి కొవ్వు (ఏఈఔ) పెరుగుతుంది.
  • చెడు కొవ్వు (ఔఈఔ) తగ్గుతుంది.
  • ఇన్సులిన్‌ సూక్ష్మత పెరగడంతో షుగర్‌ వ్యాధి అదుపులోకి వస్తుంది.
  • రక్తపోటు నడక మొదలు పెట్టిన మొదట్లో కొద్దిగా పెరిగినా తరువాత అదుపులోకి వస్తుంది.

  - షుగర్‌, రక్తపోటు మూలంగా వచ్చే గుండె, కిడ్నీ, పక్షవాతం, నరాల బలహీనత, భుజం నొప్పి వంటి కీలు, కండరాల బాధలు, కంటి లోపాలు తదితర సమస్యలను వీలెైనంత వరకు నిర్మూలించవచ్చు.ఇవే కాకుండా నడక మూలంగా మెదడుకి ఎల్లప్పుడు రక్తప్రసరణ అందుబాటులో ఉండడం మూలంగా మెదడు బాగా చురుగ్గా పని చేస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది, నిద్రలేమి సమస్య ఉండదు. కొంతవరకు వృద్ధాప్యం వల్ల వచ్చే సమస్యలు కూడా తగ్గించవచ్చు.

  నడకకు సంబంధించిన కొన్ని చిట్కాలు:

  నడకకు 15 నిలతో మొదలుపెట్టి నడిచే సమయాన్ని 30-45 నిల వరకు పెంచండి.
  రోజులో ముపె్పై నిలు ఏకధాటిగా లేనిచో 10 నిలు పాటు వంతులుగా 5 సార్లు నడవచ్చు.
  బ్రిస్క్‌ వాకింగ్‌ .

  • ఎక్కువ సమయం నిల్చోవడం తగ్గించాలి.
  • నొప్పిని పట్టించుకోకుండా నడవడం మంచిది కాదు.
  • పదే పదే మెట్లు ఎక్కడం దిగడం తగ్గించాలి.
  • వెస్టెర్న్‌ టైప్‌ కమోడ్‌ ఉపయోగించాలి.

  వ్యాయామం:

  • మోకాళ్లు నొప్పి లేనంతవరకు నడవడం అతి ముఖ్యమైనది.
  • స్థరమైన సైకిల్‌ తొక్కితే మంచిది.
  • ఈత కొట్టడం చాలా మంచి వ్యాయామం.

  ఇవన్నీ చేసినప్పటికీ నొప్పి తగ్గకపోతే, కొన్ని అడుగులు కూడా నడవడం ఇబ్బందికరంగా ఉంటే వెంటనే ఎముకల వెైద్య నిపుణుడిని సంప్రదించి శస్త్ర చికిత్స చేయించుకోవడం అవసరం. దీనినే టోటల్‌ నీ రీప్లేస్‌మెంట్‌ (knee replacement surgery) లేక కీళ్ల మార్పిడీ అంటారు. ఆర్టిఫిషియల్‌ మెటల్‌ ఇంప్లాంట్‌తో కీళ్ల మార్పిడి చేస్తారు.శస్త్ర చికిత్స తదుపరి కీళ్ళకు తగిన జాగ్రత్తలు మోకాళ్ళ వ్యాయామం నడిచే పద్ధతులు తెలుసుకోవడం ఫిజియోథెరపి అవసరం. ఇప్పుడు శస్త్ర చికిత్సను 5-6 సంలు వాయిదా వేయడంతో పాటు నొప్పులతో బాధపడుతున్న వాళ్ళ జీవర సరళిని పెంపొందించుటకు ఒక కొత్త రకమైన పట్టీ (బ్రేస్‌) ‘అన్‌లోడర్‌ వన్‌’ అందుబాటులో ఉంది. ఈ పట్టీ వేసుకొని నడిస్తే శరీరం యొక్క బరువు కీళు చుట్టూ సరిసమానంగా పడడంతో కీళుకి నష్టం వాటిల్లదు, నడిచినా నొప్పి తెలియదు.

  • క్రమం తప్పకుండా ప్రతిరోజు కనీసం 30 నిలు నడవడం మూలంగా అనేక ఆరోగ్య ఫలితాలు లభిస్తాయి.
  • ఇప్పుడు మోకాలు చుట్టూ ఉన్న కండరాలకు బలం చేకూరుతుంది.
  • కీళు సులువుగా కదులుతుంది.
  • ఎముకలు బలపడతాయి.
  • బ్యాలెన్స్‌ పెరగడంతో తృటి ప్రమాదాలు తగ్గుతాయి.
  • చేతులు బాగా ఊపుతూ నడవగలిగినంత వేగంగా నడిస్తే చమట పడడంతో పాటు గుండె వేగంగా కొట్టుకుంటుంది. దీనితో మంచి ఫలితం దక్కుతుంది.

  గమనిక: నడక వేగం మీరు పాట పాడలేనంత వీలుగ కాని లేక మాట్లాడగలిగేంత ఉండాలి.
  సాధారణంగా మార్నింగ్‌ వాక్‌ ఎంచుకున్నా స్వచ్ఛమైన చల్లటి గాలి పీల్చుకోగలుగుతారు.

  మోకాళ్ల అరుగుదలతో మొదలయ్యే సమస్య ప్రారంభ దశలో నొప్పి కేవలం కీళ్లపెైన భారం వేస్తేనే (ఎక్కువ నిల్చున్నా, నడిచినా, మెట్లు ఎక్కినా) ఉంటుంది. కాసేపు కూర్చుని విశ్రాంతి ఇస్తే తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో నొప్పితో పాటుగా వాపు, ఉదయానే దాదాపు అరగంట వరకు కీళ్లు బిగుసుకు పోవడం వంటి ఇతర సమస్యలు ఉంటాయి. కీలుని పరీక్ష చేయడంతో కిర్రు కిర్రు మన్న శబ్ధం తెలుస్తుంది.

  - డా. వై. నందకిషోర్‌ కుమార్‌-- బి.పి.టి. (నిమ్స్‌), యం.యస్‌.స్పోర్ట్స్ (యు.కె.) ఫిజియోథెరపిస్ట్

  ఆధారము: వైద్య రత్నాకరం బ్లాగ్

  మెడనొప్పి (సర్వైకల్ స్పాండిలోసిస్)

  ఈమధ్య చాలామందిని వేధిస్తున్న సమస్య మెడనొప్పి. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే సర్వైకల్ స్పాండిలోసిస్ ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండానే వస్తోంది. యుక్తవయసులో ఉన్నవారు సైతం సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి ముఖ్యకారణం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు. మెడనొప్పే కదా అని నిర్యక్ష్యం చేస్తే సమస్య మరింత తీవ్రమవుతుంది. తొలిదశలోనే చికిత్స తీసుకుంటే సమస్య త్వరగా నయమవుతుంది.

  కారణం:మెడ వెనక భాగంలో తల నుంచి మొదలయ్యే మొదటి ఏడు వెన్నుపూసల మధ్య కార్టిలేజ్ (మృదులాస్థి) అనే మెత్తటి ఎముక ఉంటుంది. వెన్నుపూసలు సులువుగా కదలేందుకు ఈ కార్టిలేజ్ తోడ్పడుతుంది. అయితే అసంబద్ధ భంగిమల్లో కూర్చోవడం, కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు కదలకుండా కూర్చుని విధులు నిర్వర్తించడం, ఒకేచోట గంటల తరబడి కదలకుండా పనిచేయడం, నిత్యం తీసుకునే ఆహారంలో క్యాల్షియం, విటమిన్స్ తగినంత లేకపోవడం మొదలైన కారణాలతో ఈ కార్టిలేజ్ క్షీణించడం జరుగుతుంది. ఇలా కార్టిలేజ్‌లో వచ్చే మార్పులవల్ల మెడనొప్పి వస్తుంది. దీన్నే ‘సర్వైకల్ స్పాండిలోసిస్’ అంటారు.

  లక్షణాలు :
  మెడనొప్పి తీవ్రంగా ఉండి మెడ ఎటువైపు కదిల్చినా నొప్పి తీవ్రవుతుంది.
  వెన్నుపూస నుంచి చేతులకు బయలుదేరే నాడులు ఒత్తిడికి గురికావడం వల్ల నొప్పి భుజాల మీదుగా చేతులకు క్యాపిస్తుంది. తిమ్మిర్లు ఎక్కువగా ఉండి, ఒక్కోసారి తలతిరిగినట్లుగా (వర్టిగో) అనిపిస్తుంది. చేయి పైకిఎత్తడం కష్టమవుతుంది.

  జాగ్రత్తలు :

  • సర్వైకల్ స్పాండిలోసిస్‌తో బాధపడేవారు సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు వీలైనంత విశ్రాంతి తీసుకోవాలి.
  • కుర్చీలో కూర్చున్నప్పుడు, వాహనం నడిపేటప్పుడు నిటారుగా ఉండేవిధంగా సరైన భంగిమలో కూర్చోవాలి
  • బరువులు ఎక్కువగా లేపకూడదు
  • పడుకునేటప్పుడు తలకింద ఎత్తై దిండ్లు వాడకూడదు
  • మెడను ఒకేసారి అకస్మాత్తుగా తిప్పకూడదు
  • మెడనొప్పి ఉన్నప్పుడు స్వల్ప వ్యాయామాలు డాక్టర్ సలహా మేరకు చేయాలి
  • సరైన పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.

  హోమియో చికిత్సా విధానం

  హోమియోపతి వైద్యవిధానంలో సర్వైకల్ స్పాండిలోసిస్‌కి పూర్తి ఉపశమనం కలిగించే ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ విధానంలో కేవలం లక్షణాలు తగ్గించడం కాకుండా, లక్షణాలకు కారణాలను, వ్యక్తి శారీరక, మానసిక తత్వాన్ని పూర్తిగా విశ్లేషించి తగిన ఔషధాన్ని వైద్యులుసూచిస్తుంటారు. సాధారణంగా వాడే మందులు...

  బ్రయోనియా:మెడ కదిలించడం వల్ల నొప్పి ఎక్కువవుతుంది. విశ్రాంతితో నొప్పి తగ్గుతుంది. వీరికి మలబద్దకంతో పాటు మెడనొప్పి వస్తుంది. దాహం అధికంగా ఉండి నీరు ఎక్కువగా తాగుతారు. ఈ లక్షణాలున్నవారికి ఈ మందు ప్రయోజనకరం.
  స్పైజీలియం: నొప్పి మెడ నుంచి మొదలై ఎడమభుజంలో ఎక్కువగా ఉంటే ఈ మందు పనిచేస్తుంది.

  కాల్మియా : కుడిభుజం వైపు నొప్పి ఎక్కువగా ఉంటే ఇది ప్రయోజనకారి.

  కోనియం:మెడనొప్పితో పాటు కళ్లు తిరిగినట్లనిపిస్తుంది. వృద్ధుల్లో వచ్చే మెడనొప్పికి ఉపయోగం. ఇవేకాకుండా హైపరికం, రాస్టాక్ మొదలైన మందులను వాటి వాటి లక్షణాల ఆధారంగా వైద్యుల సూచనమేరకు వాడితే మెడనొప్పి నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుంది.

  ఆధారము: సాక్షి

  నడుమునొప్పికి పరిష్కారం

  నడుమునొప్పి అంటేనే భయం... ఏకాస్త వంగాలన్నా, కదలాలన్నా భయం. సగటున సుమారు 40 నుండి 50 శాతం జనాభాలో జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నడుమునొప్పి వస్తుంది. కాని ప్రస్తుత జీవనవిధానాల వలన ఇది 80 శాతం జనాభాను ప్రభావితం చేస్తోంది. సాధారణంగా ఇది 20 నుండి 40 సంవత్సరాల వయస్సు వారిలో ఎక్కువ శాతం మొదలవుతుంది. ఒక్కసారి నడుమునొప్పి వస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది.

  కారణాలు

  • సాధారణంగా ఒకే పొజిషన్‌లో ఎక్కువగా కూర్చోవడం
  • ఎక్కువ దూరం ద్విచక్ర వాహనాలు, కార్లలో ప్రయాణించడం
  • వెన్నుకు దెబ్బ తగలటం
  • వెన్నుకు సంబంధించిన ఎముకలు, కండరాలు, డిస్క్, నరాల సమస్యల వలన నడుమునొప్పి రావచ్చు
  • వెన్నుపూస క్షయ, osteomyelitis కు గురికావడం
  • గర్భాశయ వ్యాధుల వలన, అండాశయ వ్యాధుల వలన నడుమునొప్పి రావచ్చు
  • గర్భధారణ సమయంలో కూడా స్త్రీలలో నడుమునొప్పి వచ్చే అవకాశం ఉంటుంది

  నడుమునొప్పికి సంబంధించిన వెన్ను మరియు డిస్క్ సమస్యలు :

  యాంగ్యులర్ టియర్: వయస్సు పైబడే కొద్ది మరియు వెన్ను మీద అధిక ఒత్తిడి పడినప్పుడు వెన్నుపూస (వర్టిబ్రా) మధ్య ఉండే ఇంటర్ వర్టిబ్రల్.

  డిస్క్‌లోని ఒక భాగం చిరగటాన్ని ఆన్యూలర్ టియర్ అంటారు. ఇలా చిరిగిన ఆన్యూలర్ వాపునకు గురై నడుమునొప్పికి దారి తీస్తుంది. దీనినే డిస్క్ ‘డీజనరేటివ్ డిసీజ్’ అంటాము.

  హెర్నియేటెడ్ డిస్క్:దీనినే డిస్క్ ప్రొలాప్స్ అని కూడా అంటారు. బలహీనపడిన డిస్క్ అంచు చిరిగి, దాని మధ్యభాగంలో ఉండే మెత్తని న్యూక్లియస్ బయటకు తోసుకొని రావడాన్ని Herniation అంటారు. ఇలా Herniate అయిన డిస్క్ వెన్ను నుండి బయటకు వచ్చే నరాలను నొక్కినప్పుడు వచ్చే లక్షణాలను ‘సయాటికా’ (Sciatica) అంటారు.

  స్పాండిలోలిస్థిసిస్:ఇందులో వెన్నులోని ఎముకలు పరిమితికి మివంచి ముందుకు కాని వెనకకు కాని జారటాన్ని స్పాండిలోలిస్థిసిస్ అంటారు. ఇది వెన్నులోని ఎముకలు (వర్టిబ్రా) ను పట్టి ఉంచె లిగమెంట్లు సాగటం మరియు వర్టిబ్రాలోని ఒక భాగం విరగటం వలన వస్తుంది. స్పాండిలోలిస్థిసిస్ తీవ్రంగా ఉంటే నరాఉల మెలికపడటం మరియు నరాల పై వర్టిబ్రా వత్తిడి వలన తీవ్రమైన నడుము నొప్పికి, ఇతర లక్షణాలకు దారితీస్తుంది.

  స్పైనల్ స్టీనోసిస్:వెన్నులోపల ఉండే స్పైనల్ కానల్ అనే నాళం ఇరుకుగా మారటం లేదా మూసుకుపోవటాన్ని స్పైనల్‌స్టీనోసిస్ అని అంటాము. ఇది తీవ్రంగా ఉంటే నాళంలో ఉండే వెన్నుపాము వత్తిడికి గురై తీవ్రమైన వెన్నునొప్పితోపాటు, కాళ్ళు పడిపోవడం, తిమ్మిర్లు రావడం, మొద్దుబారటం, మలమూత్రాల విసర్జన మీద నియంత్రణ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

  యాంకిలోసింగ్ స్పాండిలోసిస్ Ankylosing spondilitis

  ఇది వెన్నుపూస దీర్ఘకాలిక వాపునకు గురి కావడం వలన వస్తుంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డీసీజ్.

  ఇది ఎక్కువగా తుంటి కీలు (sacro ilian joint), వెన్నుపూసను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా యుక్తవయస్సులో ఉన్న వారికి వస్తుంది. ఈ వ్యాధి బారిన పడిన వారి వెన్నుపూసలోని ఎముకలు బిగుసుకు పోయి నడుము కదలికలు కష్టతరం అవుతాయి. దీనినే "Bamboo spine' అని అంటారు.

  వర్టిబ్రా (Fracture):వెన్నుకు దెబ్బ తగలటం లేదా దీర్ఘకాలికంగా Osteoporosis వలన వత్తిడికి గురి అయినప్పుడు వెన్నులోని వర్టిబ్రా విరిగిపోయే ప్రమాదం ఉంది. దీనివలన తీవ్రమైన వెన్నునొప్పి, నరాలకు సంబంధించిన వ్యాధి లక్షణాలు వస్తాయి.

  లక్షణాలు :

  సాధారణం నుండి తీవ్రమైన నడుము నొప్పి నడుము పట్టేయడము.

  వెన్నులోని ఎముకలతో పాటు నరాలు కూడా వ్యాధి బారినపడితే నొప్పి నడుములో ప్రారంభమై పిరుదుల్లోకి, అక్కడినుండి తొడల్లోకి, కాళ్ళు, పాదాల వరకు వ్యాపిస్తుంది. కాళ్ళలో తిమ్మిర్లు, పాదాలలో మంటలు రావడం, మొద్దుబారటం వంటి లక్షణాలు ఉంటాయి.

  నడుమునొప్పి దీర్ఘకాలికంగా ఉండి, జ్వరం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఇది క్షయ, కాన్సర్ లక్షణాలు అయి ఉండవచ్చు.

  వ్యాధి నిర్ధారణ పరీక్షలు :

  • సీబీపీ, ఆర్ ఫ్యాక్టర్
  • ఎక్స్‌రే
  • సిటీస్కాన్
  • ఎమ్మారై స్కాన్
  • హెచ్‌ఎల్‌ఏ-బీ27

  ఇతర వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చేయటం వలన వ్యాధి తీవ్రత ఇతర తీవ్రమైన వ్యాధులను గుర్తించవచ్చు.

  నడుము నొప్పికి గల కారణాన్ని గుర్తించి సరయిన చికిత్స తీసుకోవడమే కాకుండా రోజువారి వ్యాయామం, Strech Excersices, చేయడం, కూర్చునే, నిద్రపోయే పొజిషన్‌ను తగిన విధంగా మార్చుకొని సరిచేసుకోవడం వలన నడుము నొప్పిని అదుపు చేయవచ్చు.

  హోమియోకేర్ వైద్యం

  హోమియోకేర్ ఇంటర్ నేషనల్‌లో జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ వైద్యపద్ధతి ద్వారా వెన్నునొప్పి, సయాటికా, కాళ్ళతిమ్మిర్లు, పాదాల మంటలనే కాకుండా మూల కారణాన్ని గుర్తించి వైద్యం చేయడం ద్వారా వెన్నుపూసను దృఢంగా చేసి మరల నడుము సమస్యలు రాకుండా సంపూర్ణంగా నయం చేయవచ్చు.

  - డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సి.ఎం.డి.,

  హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్

  కేరళ పంచకర్మ చికిత్సతో.. వెన్నునొప్పి మాయం

  వెన్నునొప్పి ప్రాణాలేమీ తీయకపోవచ్చు కానీ, శరీరాన్ని ఎందుకూ పనికిరానంత నిర్జీవంగా మార్చేస్తుంది. దీనికి పెయిన్ కిల్లర్స్, సర్జరీ, బెడ్‌రెస్ట్, ఫిజియోథెరపీ శాశ్వత పరిష్కారం కాదు. ఆయుర్వేదంలో సూచించిన కేరళ పంచకర్మ, మర్మ చికిత్సల ద్వారా వెన్ను నొప్పికున్న మూల కారణాలను శాశ్వతంగా శరీరం నుంచి బయటకు పంపవచ్చు. అంతే కాకుండా వెన్నెముకని ఉక్కు స్తంభంలా మారుస్తుందంటున్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ పి.కృష్ణప్రసాద్.

  భవనానికి పిల్లర్స్ ఏవిధంగా బలాన్నిస్తాయో, అదేవిధంగా మానవుని శరీరానికి వెన్నెముక మూల స్తంభం. అలాంటి వెన్నెముకలో ఏ సమస్య వచ్చినా శరీరమంతా ప్రభావం చూపుతుంది. వెన్ను సమస్యలకు శాశ్వత పరిష్కారం ఒక్క ఆయుర్వేద చికిత్సలోనే ఉంది. వెన్నునొప్పి, జలుబు సామాన్యంగా అనిపిస్తాయి. కానీ ఒక దశలో భరించలేని నొప్పిని కలిగిస్తుంది. పక్షవాతంలా జీవితాన్ని కుప్పకూల్చివేస్తుంది. పైగా ఈ సమస్యలు ఏదో 5, 10 నిమిషాలు వచ్చి తగ్గిపోయేవీ కాదు. ఏళ్లకేళ్లు మంచాన పడేస్తాయి.

  వెన్నెముక వర్సెస్ పవర్‌హౌస్

  వెన్నెముక పవర్ హౌస్ లాంటిది. ఇది కాళ్లు, చేతులు, తల, భుజాలు, మెడను స్థిరంగా నిలబడేలా చేస్తుంది. వివిధ కారణాలవల్ల ఒక్కోసారి ఈ పవర్‌హౌస్ శక్తిహీనంగా మారుతుంది. సరైన సమయంలో వైద్య చికిత్సలేవీ అందకపోతే భుజం నొప్పులు, మెడ నొప్పులు, కళ్ల నొప్పులు మొదలౌతాయి. వెన్ను భాగంలో మొద్దుబారినట్లు, బలహీన పడినట్లు, చురకలు, పోట్లు, మంటలు మొదలౌతాయి. జీర్ణ వ్యవస్థలో సమస్యలు తలెత్తుతాయి. అలాగే కొనసాగితే కొన్ని లైంగిక సమస్యలు సైతం తలెత్తవచ్చు. ఎవరికైనా వెన్నుపాములోని డిస్క్‌లు, నరాలు ఒత్తిడికి గురైతే.. కాళ్లు, చేతులు పక్షవాతానికి కూడా తలెత్తవచ్చు.

  సర్జరీతో ఒరిగేది శూన్యం...

  వెన్నునొప్పితో వెళితే వైద్యులు మొట్టమొదటగా సూచించేది పెయిన్ కిల్లర్లే. అవి వాడితే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది గానీ, అందుకు గల కారణాలను మాత్రం తగ్గించలేదు. పెయిన్ కిల్లర్స్ అతిగా వాడటం వల్ల తలనొప్పి, కడుపుబ్బరం, లివర్, కిడ్నీలు దెబ్బతినడం వంటివి తలెత్తుతాయి. సర్జరీ చేయించుకొంటే.. పెద్ద మొత్తంలో ఖర్చు అవడమే తప్ప కలిగే ప్రయోజనం మాత్రం శూన్యం. కనీసం ఆ ఒక్క సర్జరీతో అంతా అయిపోతుందా అంటే.. చెప్పలేం. ఆ తరువాత మరో సర్జరీ అవసరం కూడా రావచ్చు.

  ఆయుర్వేదం ఏం చేస్తుంది..

  ముందుగా వెన్ను నొప్పి రావడానికి గల ప్రత్యేక కారణాన్ని సమూలంగా ఆయుర్వేదం కనిపెడుతుంది. అస్థిధాతుక్షయం, మార్గావరోధాల వల్లే శరీరంలో వాతం పెరుగుతుంది. ఆ వాతమే వెన్ను నొప్పికి, కాలంతా పాకే సయాటికా నొప్పికి మూలం అవుతుంది. అందుకే ధాతుక్షయాన్ని, మార్గావరోధాన్ని నివారించే చికిత్సలకు ఆయుర్వేదం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. చికిత్స క్రమంలో కీళ్లు, లిగమెంట్లు, టెండాన్లు, డిస్కులు, వెన్నెముకతో అనుబంధంగా ఉండే కండరాలను సమస్థితికి తీసుకురావడం చాలా ముఖ్యం. అదే సమయంలో నరాల వ్యవస్థను కూడా బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ నొప్పిని తగ్గించడమే కాదు.. మరోసారి ఆ నొప్పి రాకుండా చేస్తాయి. ఈ విధానంలో మర్మ, పంచకర్మ చికిత్సల ద్వారా వెన్నునొప్పికి మూలకారణాన్ని కనుగొని ఆ నొప్పిని సమూలంగా తగ్గించి వేస్తుంది. కేరళ ఆయుర్వేద పంచకర్మ చికిత్సల ద్వారా మీ వెన్నెముకను కాపాడుకోండి. అది జీవితాంతం మిమ్మల్ని కాపాడుతుంది.

  - శ్రీచరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్

  ఆధారము: సాక్షి

  మడమ నొప్పికి ఆయుర్వేద నివారణ!

  నొప్పి వచ్చి౦ద౦టే, పాద౦ అడుగున ఉ౦డే ప్లా౦టార్ ఫేసియా అనే క౦డర భాగ౦ దెబ్బతి౦టొ౦దనీ, తక్షణ౦ జాగ్రత్త పడమని మనల్ని హెచ్చరిస్తున్నట్టు అర్థ౦ చేసుకోవాలి. దానివలన మడమ ఎముక కూడా దెబ్బతినవచ్చు. వాపు, పోటు కలుగుతాయి. ఈ పరిస్థితిని మడమక౦డర గాయ౦(ప్లా౦టార్ ఫాసైటిస్) గా చెప్పుకోవచ్చు. నడిచే తిరులో వచ్చే బాధ(వాకి౦గ్ గైట్ డిజార్డర్) అ౦టారు దీన్ని. వయోభార౦, స్థూల కాయ౦ లా౦టి కారణాలు అనేక౦ ఈ పరిస్థితిని తెచ్చిపెట్టవచ్చు. ప్లా౦టార్ క౦డరానికి కొద్దిపాటి విశ్రా౦తినిచ్చి వత్తిడిని తగ్గి౦చటమే ఇ౦దుకు సరయిన నివారణ!

  శరీర౦లో ప్రతి అవయవానికీ ఒక శాస్త్ర౦ ఉ౦ది. అలాగే పాదానికి స౦బ౦ధి౦చిన శాస్త్రాన్ని పోడియాట్రిక్స్ అ౦టారు. పాద౦ అడుగున నొప్పీ, ఎరుపు, మ౦ట, వాపు ఇలా౦టి బాధలు కలిగినప్పుడు పోడియాట్రిక్స్ సాస్త్ర౦ దీనికి సమాధాన౦ చెప్తు౦ది.

  శరీర౦లోని 26 పెద్ద ఎముకల్లో మడమ ఎముక ఒకటి! మొత్త౦ 33 ఎముకల పెద్ద జాయి౦ట్ గా దీన్ని చెప్పుకోవచ్చు. కనీస౦ వ౦ద క౦డరాలు ఈ ఎముకల్ని స౦ధాన౦ చేసి పాద౦ కదిలేలా చేస్తున్నాయి వాటివలన నడుస్తున్నా౦. నాట్య౦ చేస్తున్నా౦. ఆడగలుగుతున్నా౦. ఎగిరి దూక గలుగుతున్నా౦. పాద౦ అడుగున ఉ౦డే క౦డరాలు కుషన్ లాగా ఉపయోగపడి పాద౦లోని ఎముకలు గాయపడకు౦డా కాపాడుతున్నాయి. ఆ క౦డరమే గాయపడితే, మన ఆటలు సాగవు. అన్నీ కట్టిపెట్టాల్సి వస్తు౦ది. మడమ ఎముక చుట్టూ ఆవరి౦చి ఉ౦డే Achilles tendon అనే క౦డర౦ గాయ పడినప్పుడు పాద౦ వెనుక భాగ౦లోనూ, మడమ భాగ౦లోనూ విపరీతమైన నొప్పి కలుగుతాయి. పాద౦ అడుగున నొప్పి ఏ మూలనైనా రావచ్చు. ఎక్కడ వచ్చినా కారణ౦ అక్కడి క౦డర భాగ౦ గాయపడటమే!

  ఒక్కోసారి మడమ భాగ౦లో మడమ ఎముక అడుగున ఒక చిన్న ఎముకలా౦టిది పెరిగి అది మడమ ఎముకకూ దాని అడుగున ఉ౦డే క౦డరానికీ మధ్య పెద్ద అగాథాన్ని సృష్టిస్తు౦ది. దా౦తో అటు మడమ ఎముక, ఇటు మడమ క౦డర౦ రె౦డూ గాయ పడతాయి. దీన్ని “హీల్ స్పర్” అ౦టారు.

  బరువులు లేపట౦ లా౦టివి చేస్తున్నప్పుడు పాద౦ మీద వత్తిడి ఎక్కువ అవుతు౦ది. బరువు లేపుతున్నప్పుడు పాదాన్ని నేలమీదకు బల౦గా తొక్కి పెట్టి ఉ౦చుతా౦. అ౦తే బల౦తో వ్యతిరేక దిశలో శరీర౦ క౦డరాలను లోపలికి లాగుతు౦ది ఒక గుడ్డముక్కను అటూ ఇటూ లాగితే ఎలా చిరిగి పోతు౦దో అలాగే, పాద౦ లోపల బైటకూ, లోపలికీ ఒకేసారి వత్తిడి కలుగుతు౦ది. దాని ప్రభావ౦ పాద క౦డరాల మీద ప్రసరిస్తు౦ది.దా౦తో అవి గాయ పడతాయి.పాద౦లో ఎముకలలోపల పగులు వలనకూడా నొప్పి కలగవచ్చు. ఇవి కాక, పాద౦లోపలున్న ఎముకలలో కూడా ఆర్థ్రయిటిస్, కీళ్ళ వాత౦ లా౦టి ఎముకలకు స౦బ౦ధి౦చిన వ్యాధులు కలగవచ్చు. అవి కూడా పాద శూల లేదా మడమశూలకు కారణ౦ అవుతాయి.ఎక్స్-రే తీస్తే అనుమానాలు తిరతాయి. ఒక్కోసారి అరికాళ్ళు విపరీత౦గా కార౦పోసినట్టు మ౦టలు, తిమ్మిరి, స్పర్శ తెలియక పోవట౦లా౦టివి కూడా పాదక౦డరాలు గాయపడిన౦దువలన కలగవచ్చు.

  జాగ్రత్తలు తీసుకోగలిగితే సాధ్యమైన౦త వరకూ మ౦దుల అవసర౦ లేకు౦డానే నొప్పి తగ్గుతు౦ది. వాత వ్యాధుల్లో తీసుకొనే జాగ్రత్తలన్నీ దీనికీ అవసర౦ అవుతాయి. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉ౦టే ఆ౦గ్లేయ వైద్య౦లో నొప్పి, వాపు తగ్గే ఔషధాలు, అలాగే యా౦టీబయటిక్ ఔషధాలు ఇ౦దుకు తోడ్పడతాయి. ఆయుర్వేద౦ అనేక వాతహర ఔషధాలను సూచి౦చి౦ది. ఇవి నిరపాయకర౦గా పనిచేస్తాయి.

  • మన౦ కొత్తగా బరువు పెరగక పోయినా, వయసు పెరుగుతున్నకొద్దీ బరువు ఆపగలిగే శక్తి క౦డరాలకూ, ఎముకలకూ తగ్గినప్పుడు ఇలా౦టి బాధలు తప్పక వస్తాయి. అ౦దుకని బరువు తగ్గే ఉపాయాలు కూడా పాటి౦చట౦ అవసర౦ అవుతాయి.
  • ఉదయ౦ నిద్రలేచి నేలమీద పాద౦ మోపగానే నొప్పి మొదలౌతు౦టు౦ది కొ౦దరికి. ఏరోజు నొప్పులు లేకు౦డా నిద్రలేస్తానో ఆ రోజు శుభ దిన౦ అ౦టాడు టెన్నిసన్. ఇది మడమ క౦డర౦ గాయ పడి౦దని అనటానికి గుర్తు. కొ౦చె౦ నడిచేసరికి క౦డర౦ ఉత్తేజ౦ పొ౦ది నొప్పి తగ్గినట్టనిపిస్తు౦ది. నడివయసులో, ముఖ్య౦గా ఆడవాళ్ళలో ఇది ఎక్కువగా కనిపి౦చే వ్యాధి. కొద్ది సేపు విశ్రా౦తిగా కూర్చుని లేదా పడుకొని లేచిన తరువాత అడుగు నేల మీద పెట్టగానే తేలు కుట్టిన౦త నొప్పి పుట్టి అడుగు ము౦దుకు సాగక అవస్థ పడతారు. కొద్ది నిమిషాలు నడవగానే నొప్పి దానికదే తగ్గి బాగానే నడవ గలుగుతారు. విశ్రా౦తి తరువాత కలిగే ఈ నొప్పి మడమ భాగ౦లోనే ఎక్కువగా వస్తు౦ది. మడమ శూల అనటానికి ఇది ప్రముఖ౦గా కనిపి౦చే లక్షణ౦.
  • మెత్తటి కుషన్ చెప్పులనే వాడ౦డి. కటికనేల మీద పాదాన్ని చెప్పులు లేకు౦డా మోపక౦డి. ఇ౦టా, బైటా తిరిగే౦దుకూ వేర్వేరు చెప్పుల జతలు ఉ౦చుకో౦డి. చెక్కలాగా ఉ౦డే చెప్పులవలనే ముఖ్య౦గా ప్లా౦టార్ క౦డర౦ గాయపడుతో౦దని గమని౦చ౦డి! వాడుతున్న అలా౦టి చెప్పులను మార్చట౦ తక్షణ కర్తవ్య౦.
  • మడమ క౦డర౦ పైన వత్తిడి తగ్గి౦చే౦దు కోసర౦ గరుకు నేలమీద నడవకు౦డా ఉ౦డట౦ అవసర౦. ఎక్కువ దూర౦ నడిచే పనులు పెట్టుకోక౦డి. వ్యాయామ౦ కోస౦ నడక కన్నా సైకిల్ తొక్కట౦, ఈదట౦ లా౦టి ఇతర మార్గాలు పాటి౦చ౦డి!
  • మడమలో తీపు ఎక్కువగా ఉన్నప్పుడు పది నిమిషాలసేపు మ౦చుముక్కతో పాదానికి కాపడ౦ పెట్ట౦డి. లేదా, ఉ౦చ గలిగిన౦త సేపు ఐసుగడ్డమీద పాద౦ పెట్టి ఉ౦చ౦డి. ఉప్పుకాపు పెట్టినా ఉపశమన౦ కలుగు తు౦ది. ఒకసారి అదీ ఒకసారి ఇదీ మార్చిమార్చి పెట్టుకోవచ్చుకూడా!
  • టెన్నిస్ బ౦తి లేదా పిల్లలు ఆడుకొనే రబ్బర్ బ౦తిని పాద౦ అడుగున ఉ౦చి దానిమీద గట్టిగా వత్తుతూ పాదాన్ని కదిలి౦చ౦డి. కాలు మీద కాలు వేసుకొని కూర్చుని బ౦తితో పాద౦మీద గట్టిగా వత్తుతూ గు౦డ్ర౦గా తిప్ప౦డి నిప్పి ఉపశమిస్తు౦ది. ఒక తు౦డు గుడ్డని నిలువుగా జానెడు వెడల్పున మడిచి, దాని రె౦డుకొనలూ రె౦డు చేతులతో లాగి పట్టుకొని, బ౦తిని పాదానికి అదుముతూ, చల్లకవ్వాన్ని తిప్పినట్టు తిప్పుతు౦టే నొప్పి బాగా ఉపశమిస్తు౦ది. ఒక చేత్తో కొనని మీ వైపుకు లాగుతు౦టే, రె౦డో చేయి పాద౦ వైపుకు వెళ్ళాలి. టవల్ స్ట్రెచ్ విధాన౦ అ౦టారు దీన్ని.

  ఇవన్నీ ఉపశమన మార్గాలు. వాతపు నొప్పులను పె౦చే ఆహార విహారాలన్నీ మడమ నొప్పిని కూడా పె౦చుతాయి. వాటికి దూర౦గా ఉ౦డట౦ చాలా అవసర౦. పులుపు, దు౦పకూరలు, కష్ట౦గా అరిగే పదార్థాలన్నీ వాతపు నొప్పులను పె౦చుతాయి.

  చికిత్స పర౦గా మా అనుభవ౦లో గగనాదివటి అనే ఔషధ౦ విడవకు౦డా కొన్నాళ్లపాటు వాడుతూ ఉ౦టే, మ౦చి ఫలితాలిస్తున్నట్టు గమని౦చా౦. ఎముకలలో వాపు, క౦డరాల గాయాలు తగ్గి మడమ మళ్ళీ సామాన్యస్థితికి రావటానికి ఈ ఔషధ౦ బాగా తోడ్పడుతో౦ది. నొప్పి బాగా తగ్గుతు౦ది. పైన చెప్పిన జాగ్రత్తలు చక్కగా పాటిస్తూ, గగనాదివటి వాడుకో౦డి. మడమ నొప్పి త్వరగా తగ్గుతు౦ది. దీనికి ప్రత్యేకమైన మ౦దుల౦టూ వేరే ఏమీ ఉ౦డవు. గాయ౦ దానికదే తగ్గే పరిస్థితి దాటిపోతే, శస్త్ర చికిత్స అవసరపడవచ్చు కూడా! మడమ నొప్పి వచ్చిన రోజే జాగ్రత్త పడితే, అది ఆపరేషన్ దాకా దారి తీయకు౦డా ఉ౦టు౦దని దీని భావ౦’

  - డా. జి వి పూర్ణచ౦దు.

  ఆధారము: ప్రవాస రాజ్యం.కం

  చీలమండ నొప్పి

  చీలమండ నొప్పిని ఇంగ్లిష్‌లో యాంకిల్ పెయిన్ అంటారు. మడమ పైభాగంలో ఒకవైపు లేదా రెండు వైపులా ఈ నొప్పి రావచ్చు.

  కారణాలు :

  వాతరోగం (గౌట్): చీలమండ నొప్పికి గౌట్ అనే ఒక రకం కీళ్లవాతం కారణం కావచ్చు సూడో గౌట్: కొందరిలో కీళ్ల వద్ద క్యాల్షియమ్ ఎక్కువగా పేరుకుపోయి... వాపు, నొప్పి రావచ్చు ఆస్టియో ఆర్థరైటిస్: ఇది సాధారణంగా నలభై ఏళ్లు పైబడినవారికి రావచ్చు. ఈ రుగ్మత ఉన్నవారిలో ఎముకలు క్రమంగా క్షీణించి బలహీనంగా మారతాయి. దాంతో నొప్పి రావచ్చు సోరియాటిక్ ఆర్థరైటిస్: ఇది ఒకరకం చర్మవ్యాధి. ఇది ఎముకలు, కీళ్లకు సోకే అవకాశం ఎక్కువ రుమటాయిడ్ ఆర్థరైటిస్: ఇది కీళ్లు వాచడం వల్ల వచ్చే వ్యాధి. ఇందులో సాధారణంగా వేళ్ల ఎముకలు, మణికట్లు, మోకాళ్ల ఎముకలతో పాటు చీలమండ ఎముకలు కూడా ప్రభావితం అవుతాయి సెప్టిక్ ఆర్థరైటిస్: ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది లిగమెంట్లు గాయపడటం వల్ల కూడా కొందరిలో నొప్పి రావచ్చు. సాధారణంగా దెబ్బ తగిలి గాయం అయినప్పుడు, కీళ్లు మడతపడటం వల్ల లిగమెంట్లు చిరిగి నొప్పి రావచ్చు కండరాలను, ఎముకను కలిపే టెండన్లు దెబ్బతినడం వల్ల కూడా నొప్పి వస్తుంది కొన్నిసార్లు మోకాళ్లు, నడుము, పాదాలకు సంబంధించిన సమస్యలతో చీలమండలో నొప్పి వస్తుంది.

  పాదం, చీలమండ, కాలు చివరిభాగం వీటి ఎముకలను కలిపే లిగమెంట్లు అతిగా సాగినప్పుడు కాని, చిరిగినప్పుడు కాని, చీలమండ బెణికి నొప్పి మొదలవుతుంది. చీలమండ బెణికిన వారిలో 25 శాతం మందికి దీర్ఘకాలంపాటు జాయింట్లలో నొప్పి, కండరాలు బలహీనంగా మారటం ఉంటాయి. చీలమండ బెణకడం అనేది రెండు రకాలుగా జరుగవచ్చు. చీలమండ జాయింటు బైటివైపునకు తిరగడం వలన పాదం లోపలికి ఒరగటం మొదటి విధానం. దీనినే వైద్య పరిభాషలో ఇన్వర్షన్‌ ఇంజ్యూరీ(inverson injury) అంటారు. చీలమండ బైట వైపున ఉండే లిగమెంట్లు బాగా సాగిపోయి చీరుకుపోయినప్పుడు ఇది జరుగుతుంది. ఇక రెండవ విధానంలో చీలమండ జాయింటు లోపలివైపునకు తిరగడం వలన పాదం బైటి వైపునకు ఒరుగుతుంది. దీనిని వైద్య పరిభాషలో ఎవర్షన్‌ ఇంజ్యూరీ(everson injury) అంటారు. దీనిలో చీలమండ లోపలివైపు లిగమెంట్లు దెబ్బ తింటాయి.

  చీలమండ ఏ స్థాయిలో దెబ్బ తిన్నదనేది నిర్ణయించడానికి, తీవ్రతను కొలవడానికి కొన్ని అంశాలు దోహదపడతాయి. మొదటి శ్రేణిలో లిగమెంట్లు కొద్దిగా సాగటం కాని, లేదా చీరుకుపోవటం కాని జరుగవచ్చు. కొద్దిగా నొప్పి, వాపు, బిగుసుకుపోవటాలు ఉంటాయి. దీనిలో కొద్దిపాటి నొప్పితో నడవటం సాధ్యమవుతుంది. రెండవ శ్రేణిలో చీలమండ చీరుకుపోవడమనేది కాస్తంత ఎక్కువగా జరుగుతుంది. అయితే పూర్తిగా చిరిగిపోవటం ఉండదు. ఒక మోస్తరు నొప్పి, వాపు, ఎరుపుదనాలు ఉంటాయి. దెబ్బతిన్న భాగాన్ని ముట్టుకుంటే నొప్పిగా అనిపిస్తుంది. నడిచేటప్పుడు నొప్పి ఎక్కువ అవుతుంది. మూడవ శ్రేణిలో చీలమండలోని లిగమెంట్లు పూర్తిగా చిరిగిపోతాయి. వాపు, ఎరుపుదనాలు హెచ్చు స్థాయిలో ఉంటాయి. నొప్పి ఎక్కువగా ఉండటంతో నడవటం దుస్సాధ్యంగా మారుతుంది.

  లక్షణాలు

  బెణికిన చోట వెంటనే నొప్పి మొదలవుతుంది. అలాగే వాపు, ఎరుపుదనాలు కనిపిస్తాయి. దెబ్బ తిన్న భాగాన్ని ముట్టుకుంటే నొప్పి వస్తుంది. ఒక మోస్తరు బెణుకుల్లో వాపు కొద్ది రోజుల్లో తగ్గిపోతుంది. చాలా సందర్భాలలో మొదటి పది నిముషాలలో విపరీతమైన నొప్పి ఉండి, గంట, రెండు గంటలలో సద్దుమణుగుతుంది. కొంతమంది బెణికినప్పుడు చీరుకుపోయిన శబ్దాన్ని గాని, విరిగిన శబ్దాన్ని గాని వింటారు. చీలమండ జాయింటులోని లిగమెంట్లు దెబ్బ తిన్న స్థాయిని ఆధారం చేసుకుని లక్షణాలు తీవ్రత మారుతుంటుంది.

  ఉదాహరణకు లిగమెంట్లు పూర్తిగా చిరిగిపోయిన సందర్భాలలో నడవటం, పాదాల మీద బరువు వేయడం వంటివి కష్టతరంగా ఉంటాయి. చీలమండ అస్థిరంగా ఉన్నట్లుగా బెసికిపడిపోయేట్లుగా అనిపిస్తుంది. ఒకవేళ బెణుకు సక్రమంగా మానకపోతే మరోమారు సమస్య తిరగబెట్టడానికి అవకాశమెక్కువ. మెట్లు దిగుతున్నప్పుడు కాని, ఎగుడుదిగుడు రోడ్డుమీద నడుస్తున్నప్పుడు కాని తిరిగి బెణకవచ్చు. కొంతమందిలో చీలమండ బెణికిన తరువాత దీర్ఘకాలంపాటు నొప్పి, వాపులు కొనసాగుతాయి.

  సూచనలు

  దెబ్బ తగలగానే సరైన జాగ్రత్తలు పాటిస్తే చీలమండ నొప్పి త్వరగానే తగ్గిపోతుంది. ఒకవేళ అశ్రద్ధ చేసినా, ఆలస్యం చేసినా చీలమండలో శాశ్వతంగా అస్థిరత్వం, బలహీనతలు చోటు చేసుకుంటాయి.ఒకసారి దెబ్బ తగిలిన చోట మళ్లీ దెబ్బ తగిలే అవకాశం ఉన్నందున చీలమండకు రక్షణ ఉండేలా ఒత్తిడితో కూడిన పట్టీని అమర్చి 24 నుంచి 72 గంటలపాటు ఉంచాలి.దెబ్బ తిన్న భాగానికి విశ్రాంతిని ఇవ్వాలి. పాదంలో నొప్పి ఉన్నంత వరకూ చంక కర్ర లేదా క్రచ్‌లను వాడాలి.దెబ్బ తగిలిన మొదటి 24-72 గంటలలో వాపును తగ్గించడం కోసం ఐస్‌గడ్డలను బట్టలో చుట్టి (రెండు గంటలకు ఒకసారి చొప్పున ప్రతిసారి 10 నుంచి 20 నిముషాలు) ప్రయోగించాలి. 48 గంటలు గడిచిన తరువాత వేడినీళ్లను, చన్నీళ్లనూ మార్చి మార్చి ప్రయోగిస్తే ఉపయోగముంటుంది.

  చన్నీళ్లలో పాదాలను 30 సెకండ్ల పాటు ఉంచి వెంటనే వేణ్ణీళ్లలోకి మార్చి 30 సెకండ్లు ఉంచండి. ఇలా అయిదు నిముషాల మార్చి మార్చి చేయండి. మొదటి సారి చన్నీళ్లతో ప్రారంభించి చివరిసారి చన్నీళ్లతో ముగించాలి. ఈ చికిత్సను రోజుకు మూడు సార్లు రిపీట్‌ చేయాలి. క్రమం తప్పకుండా రెండు వారాలు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. వైద్య సలహా మేరకు జాయింటులో నొప్పి, వాపు, ఎరుపుదనం, వేడి వంటి ఇన్‌ఫ్లమేషన్‌ లక్షణాలను తగ్గించే మందులను వాడాలి.

  మొదటి రెండు రోజులు వీటిని క్రమం తప్పకుండా, నిర్ణీతమైన మోతాదులో, నిర్ణీతమైన సమయాల్లో వాడటం ముఖ్యం. దెబ్బ తగిలిన మొదటి 24 -36 గంటలలో వాపు తయారవుతుంది కనుక దానిని నిరోధించడానికి ఒత్తిడితో కూడిన ఎలాస్టిక్‌ పట్టీలు ప్రయోగించాలి. ఈ పట్టీలు వాపును నిరోధిస్తాయి తప్పితే అదనపు రక్షణను కలిగించవు. రక్షణ కోసం ఎలాస్టిక్‌ పట్టి చుట్టబోయే ముందు గట్టిప్యాడ్‌ అమర్చుకోవాలి. కాలుమీద బరువుపడే సందర్భాలలో ఇది మరింత అవసరం.ఎలాస్టిక్‌ పట్టీని మరీ వదులుగా లేదా మరీ బిగుతుగా ధరించకూడదు. ఒకవేళ ఎలాస్టిక్‌ పట్టీ మరీ బిగుతుగా ఉంటే తిమ్మిర్లు, మొద్దుబారటం, నొప్పి పెరగడం, చల్లదనం, పట్టీ అంచులో వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

  ఈ లక్షణాలు కనిపించినప్పుడు పట్టీని వదులు చేయాలి.చీలమండను గుండెకంటే ఎక్కువ ఎత్తులో రోజుకు 2-3 గంటలపాటు ఉంచాలి. ఇలా చేయడం వలన వాపు, ఎరుపుదనాలు తగ్గుతాయి. దెబ్బ తగిలిన 72 గంటల తరువాత పాదాలను ఉపయోగించడం మొదలెడితే లిగమెంట్లు త్వరగా బలాన్ని పుంజుకుంటాయి.కాళ్లు,పాదాలను సాగదీయడం కోసం, కండరాల్లో శక్తిని పునరుద్ధరించడం కోసం వ్యాయామాలు చేయాలి.

  వైద్యుణ్ణి ఎప్పుడు కలవాలి? బెణికినప్పుడు చీలమండ వద్ద ఏదో విరిగినట్లు శబ్దం రావడం. భరించలేనంత స్థాయిలో నొప్పి, వాపు, ఎరుపుదనాలు కనిపించడం లేదా రెండు వారాలకు మించి కొనసాగడం, పాదం మీద బరువు మోపలేకపోవడం, చీలమండ స్థిరత్వాన్ని కోల్పోవడం,దెబ్బ తగిలిన తరువాత తిమ్మిర్లు, మొద్దుబారటాలు ఉండటం తదితర సమయాల్లో వెంటనే వైద్య సలహా తీసుకోవాలి.

  డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలంటే...

  నొప్పి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఎముక విరిగిందేమో అనే సందేహం ఉన్నప్పుడు వాపు ఎక్కువగా ఉన్నప్పుడు జ్వరం, నొప్పి, కీళ్లవాపు, కీళ్ల వద్ద ఉన్న చర్మం ఎర్రబడటం, నొప్పి ఉన్న ప్రదేశంలో వెచ్చగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే, ఇన్ఫెక్షన్ ఉందేమో అని అనుమానించాలి. అప్పుడు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.

  కొన్ని వారాల పాటు నొప్పి తగ్గకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

  స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గించుకోవాలి సరైన పాదరక్షలు ధరించాలి. హైహీల్స్ వంటివి వేసుకోవడం మంచిది కాదు నొప్పి ఉన్నప్పుడు కీళ్ల కదలికలను సాధ్యమైనంత వరకు తగ్గించాలి నడిచే సమయంలో మడమ వద్ద బరువు పడకుండా చూసుకోవాలి వాపు ఉంటే, పడుకున్నప్పుడు తలగడ వంటివి అమర్చి, కాలిని మిగతా శరీర భాగం కంటే కాస్త పైన ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

  చికిత్స:

  హోమియో వైద్య విధానంతో చీలమండ నొప్పికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్స చేసే అవకాశం ఉంది. మూలకారణాన్ని, జబ్బు తీవ్రతను, రోగి స్వభావాన్ని తెలుసుకుంటే మందు నిర్ధారణ తేలిగ్గా చేయవచ్చు.

  వాడదగిన మందులు:

  లక్షణాలను బట్టి రస్టాక్స్, ఆర్నికా, లెడమ్ పాల్, రూటా-బీ వంటి మందులను వాడితే చీలమండ నొప్పి తగ్గుతుంది.

  ఎముకలు వంకర్లుపోయే ఆస్టియో కాండ్రోమాటోసిస్

  ఉన్నట్లుండి మోకాళ్లలో నొప్పి మొదలవుతుంది. రోజురోజుకూ అది ఎక్కువవుతూ ఉంటుంది. కాలి ఎముక ఎక్కువగా పెరిగినట్లు వైద్యపరీక్షల్లో బయటపడుతుంది. కాండ్రోమాటోసిస్ అనే ఈ వ్యాధిలో ఎముకల మీద తొలుత బొడిపెలు, వాపులు వచ్చి ఆ తరువాత క్రమంగా ఎముకలు వంకర్లు పోతాయి. సుమారు ప్రతి వేయి మందిలో ఒకరైనా గురయ్యే ఈ వ్యాధి గురించిన మరిన్ని వివరాలు మీ కోసం...

  నిటారుగా సాగే ఎముకలు కొందరిలో ఒక పక్కకు తిరిగిపెరగడం మొదలవుతుంది. ఈ పెరగడంలో ఎముకల చివర బొడిపెలు తయారవుతాయి. ఈ బొడిపెలు శరీరంలో ఒకటి రెండు భాగాల్లో మాత్రమే రావడాన్ని సాటిటరీ ఆస్టియో కాండ్రోమా అంటారు. అంతకన్నా ఎక్కువ అవయవాల్లో ఈ సమస్య రావడాన్ని మల్టిపుల్ ఆస్టియో కాండ్రోమా అంటారు. సాలిటరీ కాండ్రోమా రావడానికి గల కారణమేమిటో ఇంతవరకు తెలియదు. కానీ, మల్టిపుల్ కాండ్రోమా రావడానికైతే వారసత్వ మూలాలే కారణమని పరిశోధనల్లో వెల్లడయ్యింది.

  ఎముకల చివర్లో సహజంగా పెరిగే శక్తి కణాలు ఉంటాయి. మామూలుగా అయితే ఇవి కీళ్లను తాకుతూ నిటారుగా ఎదుగుతాయి. ఈ వ్యాధి ఉన్న వారిలో మాత్రం ఎముకలు పక్కకు తిరిగి పెరుగుతాయి. పక్కకు తిరిగినచోట ఎముక మీద ఈ బొడిపెలు ఏర్పడతాయి. నిజానికి చాలా మందిలో వీటి వల్ల ఏ సమస్యా ఉండదు. కానీ కొందరిలో ఆ బొడిపెలతో అక్కడున్న కండరాల మీద రాపిడి జరిగి నొప్పి, వాపు వస్తాయి.

  సాలిటరీ కాండ్రోమా

  మోచేతులు,మోకాళ్లు, మడమలు, తొంటి ఎముకలు, భుజాల్లోనే ఈ సమస్య ఎక్కువగా వ స్తుంది. ఏదో ఒకటి రెండు భాగాల్లో మాత్రమే వస్తే సాధారణంగా ఏ ఇబ్బందీ ఉండదు. చాలా అరుదుగా మాత్రమే ఆ భాగంలో నొప్పి, వాపు తీవ్రం కావచ్చు. అలాంటి వారు ఎదిగే వ యసు దాటేదాకా ఆగిపోయి ఆతరువాత ఒకసారి శస్త్ర చికిత్స చేయించుకుంటే ఇక మళ్లీ ఆ సమస్య రాదు.

  వాపులతో పాటు కొందరిలో ఎముకలు వంకర్లు పోయే లక్షణమూ ఉంటుంది. మామూలుగా అయితే ఎముకలు నిరంతరం కొత్త జీవాన్ని నింపుకుంటూ ఉంటాయి. ఈ సమస్య ఉన్న వారిలో మాత్రం ఆ ప్రక్రియ కుంటుపడుతుంది. పరిశీలిస్తే ఎముక నిర్మాణంలో ఏ లోపమూ కనిపించదు. అయినా పెరగడంలో లోపం ఏర్పడుతుంది.

  మల్టిపుల్ కాండ్రోమాటోసిస్

  ఈ వ్యాధి శరీరంలోని ఏ కీళ్లకైనా రావచ్చు. ఈ బొడిపెలు శరీరంలోని వివిధ భాగాల్లో రావచ్చు. అయితే అన్ని బొడిపెలు కాకుండా ఏవో ఒకటి రెండు మాత్రమే ఇబ్బంది క లిగిస్తాయి. బొడిపెలు కండరాల మీద కలిగించే రాపిడి వల్ల ఆ భాగాల్లో వాపు వస్తుంది. బొడిపెలు రావడంతో పాటు ఈ వ్యాధితో ఎముకలు వంకర్లు పోయే ప్రమాదం కూడా ఉంది. ఒక్కోసారి ఇవి విరిగిపోవచ్చు కూడా.

  ఎదిగే వయసు అంటే సుమారు 8 నుంచి 14 ఏళ్ల లోపే ఈ వ్యాధి మొదలవుతుంది. ఎదగడం ఆగిపోగానే ఈ సమస్యలు కూడా ఆగిపోతాయి. ఎముకలు వంకర్లు పోయే స్వభావం కూడా అప్పుడే ఆగిపోతుంది. అయితే కీ ళ్లు అరిగిపోవడం వల్ల నడక తీరు కూడా మారిపోతుంది. కేవలం ఒకటి రెండు చోట్ల మాత్రమే బొడిపెలు వచ్చే సాలిటరీ కాండ్రియోమాలో నొప్పి రావడం తక్కువే. కాకపోతే బొడిపెలతో నరం మీద ఒత్తిడి పడుతున్నప్పుడు, కీలు కదలడంలో అది అడ్డుపడుతున్నప్పుడు నొప్పి రావచ్చు.

  లేదా బొడిపె మీద బర్సైటిస్ అనే పొర ఏర్పడినప్పుడు కూడా నొప్పి రావచ్చు. అరుదుగా ఎప్పుడైనా ఇది క్యాన్సర్‌గా మారినప్పుడు కూడా నొప్పి రావచ్చు. ఎముకలు వంకర్లు పోయిన వారిలో శరీరం బరువు మోకాళ్ల మధ్య నుంచి కాకుండా ఒక పక్కగా వెళుతుంది. దీని వల్ల మోకాలి కీళ్లు ఏదో ఒక పక్కనే అరిగిపోతాయి. ఇది చాలా త్వరగా ఆర్థరైటిస్ సమస్యకు దారి తీస్తుంది. ఈ రెండూ కలిస్తే సమస్య రెట్టింపవుతుంది. ఎముకలు మరీ వంకరగా ఉన్నప్పుడు ఆర్థరైటిస్ సమస్యను నిరోధించడానికి శస్త్ర చికిత్స అవసరమవుతుంది.

  బాధ తీవ్రమైతేనే...

  బొడిపెల కారణంగా ఎడతెగకుండా నొప్పి రావడం కానీ, కీళ్లు కదలలేని స్థితి ఏర్పడటం వల్ల గానీ, లేదా వికారంగా కనిపిస్తున్నప్పుడు శస్త్ర చికిత్స ద్వారా బొడిపెలను తీసివేయడమే మేలు. అయితే అన్ని బొడిపెలను కాకుండా నొప్పికి గురిచేస్తున్న వాటిని మాత్రమే తొలగిస్తే చాలు. బొడిపెలు ఎదిగే వ యసులో మాత్రమే వస్తాయి. అయినా ఎదిగే వయసు పూర్తయ్యే వరకు శస్త్ర చికిత్స చేయకూడదు. అలా చేస్తే బొడిపెలు మళ్లీ పెరిగవచ్చు. కాకపోతే బొడిపెలు అమితంగా బాధిస్తున్నప్పుడు నొప్పి భరించలేనంతగా ఉన్నప్పుడు ఎదిగే వయసైనా శస్త్ర చికిత్స తప్పదు. వాస్తవానికి శస్త్ర చికిత్స తప్ప ఏ మందులూ ఈ సమస్యను త గ్గించలేవు.

  శస్త్ర చికిత్స తరువాత

  ఒకే ఒక్క బొడిపె ఉన్న వారికి శస్త్ర చికిత్స చేస్తే వారికి ఏ సమస్యా ఉండదు. ఒకవేళ ఎక్కువ బొడిపెలు ఉన్న వారైతే బాధను కలిగించే వాటిని మాత్రమే తొలగిస్తాం. అలా వదిలేసినవి మునుముందు ఎప్పుడైనా నొప్పి కలిగించవచ్చు. లేదా ఎముకలు వంకరగా మారడం వల్ల కొత్త సమస్యలేమైనా రావచ్చు. అలాంటి వారికి రెండవసారి కూడా శస్త్ర చికిత్స చేయవలసి రావచ్చు.

  కొన్ని సార్లు బొడిపెను పూర్తిగా తొలగించడం సాధ్యం కాకపోవ చ్చు. కొన్ని బొడిపెలను అలా తీయడానికి ప్రయత్నిస్తే ఎముక విరిగిపోయే ప్రమాదం ఉంది. ఆ కొంచెంగా మిగిలిపోయిన బొడిపెలు అప్పుడప్పుడు నొప్పి కలిగించవచ్చు. అలాంటి సందర్భంలో డాక్టర్‌ను సంప్రదించడం అవసరం.

  కీళ్లు చక్కబడే మార్గం ఉందా?

  నావయసు 35. గత 12 ఏళ్లుగా నేను రూమటాయిడ్ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నాను. ఏళ్ల పర్యంతంగా ఏవేవో మందులు వాడుతూనేఉన్నాను. కానీ, ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఈ సమస్యతో కీళ్ల భాగంలోవంకర్లు వచ్చాయి. ఆయర్వేద వైద్యంలో ఈ సమస్యను తగ్గించేమందులు ఉన్నాయనివిన్నాను. ఆ అవకాశాలేమైనా ఉంటే చెప్పండి. అయితే ఒకసారి వ్యాధి నయమైపోయాకమళ్లీ వచ్చే పరిస్థితి ఉంటుందా? తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా ఈవ్యాధిని నయం చేసే చికిత్సలు ఉంటే తెలియచేయండి.

  రూమాటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక విచిత్రమైన వ్యాధి. తన అంగరక్షకులే తన మీద దాడి చేసినట్లు మనలోని రక్షక కణాలు మన కణాల మీదే దాడి చేయడం వల్ల వచ్చే సమస్య ఇది. మిత్ర కణాలను శత్రుకణాలుగా పొరబడటం వల్ల ఇలా జరుగుతుంది. ఇతర వైద్య విధానాల్లో అయితే ఈ వ్యాధికి కారణమేమిటో తెలియదు అంటారు.

  కానీ, ఆయుర్వేద శాస్త్రం ఈ వ్యాధిని వాత పిత్త కఫాల సమతుల్యత దెబ్బతినడం వల్ల తలెత్తే సమస్యగా గుర్తించింది. శరీరంలోని రక్షణ వ్యవస్థను చక్కబరచనంత వరకు ఈ సమస్య ఎంత కాలమైనా వెంటాడుతూనే ఉంటుంది. అందుకే ర క్తాన్నీ, రక్తాన్ని ఉత్పత్తి చేసే వ్యవస్థనూ చక్కబరచడం ద్వారా ఆయుర్వేదం ఈ వ్యాధిని సమర్ధవంతంగా నయం చేయగలుగుతోంది. అందుకే సాధ్యమైనంత త్వరగా ఆయుర్వేద వైద్యుణ్ని సంప్రదించి ఈ సమస్యనుంచి విముక్తి పొందండి.

  నావయసు 29. నాలుగేళ్ల క్రితం ఒకసారి నేను సైకిల్ పై నుంచి పడిపోయాను. ఆప్రమాదంలో నా ఎడమ భుజం, మణికట్టు కీలు భాగంలో బలంగా దెబ్బలు తగిలాయి.స్థానిక వైద్యుని దగ్గర చికిత్స తీసుకుంటే సమస్య తగ్గిపోయినట్లేఅనిపించింది. కానీ, సుమారు 18 మాసాలుగా నా ఎడమ చేయితో పాటు శరీరంలోని ఎడమభాగమంతా నొప్పిగానూ ఒకపక్కకు లాగినట్లుగానూ ఉంటోంది. పైగా ఎడమ చేయిరోజురోజుకూ కుంచించుకుపోతున్నట్లుగా కూడా ఉంది. ఈ సమస్య క్రమంగా నడుముక్రింది భాగం, పిరుదులు, కాళ్లు, పాదాలకు కూడా వ్యాపిస్తోంది. ఇవన్నీనాలోపెద్ద భయాన్ని నింపుతున్నాయి. ఇప్పటి వరకు తీసుకున్న మందుల వల్ల నాకుఏమాత్రం ఉపశమనం కలుగలేదు. ఆయుర్వేదంలో ఈ సమస్యకు చికిత్సలు ఉంటేతెలియచేయండి.

  మీరు రాసిన వివరాలను బట్టి మీకు క్రానిక్ సర్వైకల్, లుంబార్ స్పాండిలోసిస్ సమస్య ఉన్నట్లు అనిపిస్తోంది. అలాగే ఆ భాగాల్లోని కండరాలు కూడా క్షీణించిపోతున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తొలిదశలోనే సరియైన చికిత్స జరిగి ఉంటే సమస్య ఈ స్థితికి వచ్చేదే కాదు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఆయుర్వేదంలో ఈ సమస్యకు మంచి మందులు ఉన్నాయి.

  మందులతో పాటు కొన్ని ప్రత్యేకమైన మర్ధన చికిత్సల ద్వారా మీ చేయి, వెన్ను, మెడ భాగాలు తిరిగి పూర్వ స్థితికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే అన్ని పరీక్షలు చేయిస్తే గానీ, వ్యాధి స్థితిని సరిగా అంచనా వేయడం సాధ్యం కాదు. అందుకే మీరు దగ్గరలో ఉన్న ఆయర్వేద వైద్యుణ్ని సంప్రదిస్తే మీకు ఈ సమస్యలనుంచి ఉపశమనం లభిస్తుంది.

  తగ్గే మార్గం లేదా?

  ప్రశ్న :నా పేరు రవి. వయసు 45 సంవత్సరాలు. నాకు పదిరోజుల కింద నడుమ్మీదఒక పక్క కురుపులు వచ్చాయి. బాగా నొప్పి వచ్చింది. పది రోజులకి మాడిపోయాయి.అయితే ఇప్పుడు లోపలి నుంచి భరించలేని నొప్పి వస్తోంది. నా సమస్యకుపరిష్కారం ఏమిటి?

  జ:మీరు పోస్ట్‌హెర్పెటిక న్యూరాల్జియా అనే జబ్బుతో బాధపడుతున్నారు. ఇది వారిసెల్లాజోస్టర్‌ అనే వైరస్‌ వల్ల వస్తుంది. షుగర్‌ వ్యాధి ఉన్న వారిలో రోగ నిరోధకశక్తి తక్కువ ఉన్న వారిలో ఇది రావచ్చు. జబ్బు వచ్చినప్పుడు ఎసెక్లోపిర్‌అనే టాబ్లెట్‌ వాడడంతో కురుపులు తగ్గిపోతాయి. ఇలా వాడని వారిలో కురుపులుమానిపోయాక భరించలేని నొప్పి వస్తుంది. దీనినే హెర్పెటిక్‌ న్యూరాల్జియాఅంటాము. దీనికి రెండు, మూడు రకాల మందులతో కంట్రోల్‌ చేయవచ్చు. మీరుడాక్టరుకు చూపించుకొని మీ వయసునిబట్టి, బరువుని బట్టి మందులు తీసుకుంటే మీనొప్పి కంట్రోల్‌ అయ్యే అవకాశముంది.

  ప్రశ్న :నా పేరు కిషోర్‌. వయసు ముపె్పై సంవత్సరాలు. నాకు తలకుయాక్సిడెంట్‌ అయ్యి కుట్లు పడ్డాయి. మెదడు స్కానింగ్‌ చేస్తే, ఎముకఫ్రాక్చర్‌ అయినట్టు వచ్చిం ది. మెదడులో రక్తస్రావం కూడా అయ్యింది. ఇదిజరిగి ఐదు సంవ త్సరాలు అయ్యింది. అప్పటి నుం చి సంవత్సరానికి ఒకసారిఫిట్స్‌ వస్తున్నాయి. తగ్గే మార్గం లేదా?

  జ :మెదడుకుదెబ్బ తగిలిన వారిలో, రక్తస్రావం వలన, బొక్క ఫ్రాక్చర్‌ వలన మెదడులోనికణాలలో మార్పు లు చోటు చేసుకుంటాయి. దీని వలన వాటి నుండి అవసరానికంటేఎక్కువ విద్యుత్తు ఉత్పత్తి జరిగి ఫిట్స్‌ వస్తాయి. ఈ విధంగా ఉన్న వారుచాలా సందర్భాల్లో జీవితింతం మందులు వాడవలసిన అవసరం ఉంటుంది. కొంత మందికిదెబ్బ తగిలినపుపడు ఫిట్స్‌ వచ్చి, స్కానింగ్‌ నార్మల్‌ ఉంటుంది. అటువంటివారిలో కొన్ని నెలలపాటు మందులు వాడితే సరిపోతుంది. మీరు డాక్టరుకిచూపించుకొని, స్కానింగ్‌ రిపోర్ట్‌ను బట్టి మందులు వాడండి.

  పాక్షిక మోకాలు మార్పిడితో ఎంతో ఊరట

  ఆమె పేరు మహేశ్వరి. వయస్సు 40 సంవత్సరాలు. గత ఏడాదిగా మోకాలి నొప్పితో బాధపడుతోంది. ఆమె మెకాలు ఒకవైపు అరిగిపోయి నొప్పి మొదలైంది. ఇటీవల నొప్పి తీవ్రం కావడంతో మా ఆసుపత్రికి వచ్చింది. మోకాలు మార్పిడి ఆపరేషన్‌పై ఆమెలో ఎన్నో సందేహాలున్నాయి. చిన్న వయసులో మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయించుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనని ఆమె ఆందోళన చెందుతోంది. ఆపరేషన్ తరువాత కూడా కింద కూర్చోవాలి, చిన్న చిన్న పనులు చేసుకోవాలనేది ఆమె కోరిక. ఇప్పుడే ఆపరేషన్ చేయించుకుంటే ఓ ఇరవై ఏళ్లు పోయాక పరిస్థితి ఏంటనేది ఆమె భయం. ఇదే విషయాన్ని మా దగ్గర వెలిబుచ్చింది. అయితే ఆమె సందేహాలన్నింటిని నివృత్తి చేశాం.

  మోకాలు నొప్పితో బాధపడే వారి సమస్యలు వర్ణనాతీతం. అందులోనూ చిన్న వయసులోనే మోకాలు సమస్య మొదలైతే పరిస్థితి చెప్పనక్కర్లేదు. నిజానికి మోకాలు నొప్పి సమస్య మందులతో తగ్గదు. అలాగని మోకాలులో కొంత భాగం దెబ్బతిన్నా పూర్తిగా మోకాలు మార్పిడి చేయించుకోవాల్సిన అవసరం లేదు. గతంలో మోకాలు కొద్దిగా దెబ్బతిన్నా టోటల్ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. మోకాలులో దెబ్బతిన్న భాగాన్ని మాత్రమే తొలగించి చేసే పార్షియల్ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ అందుబాటులోకి వచ్చింది. ఇదే విషయాన్ని ఆమెకు వివరించాం.

  మోకాలులో కొంత భాగం దెబ్బతింటే పూర్తిగా మోకాలు మార్పిడి చేయించుకోవాల్సిన అవసరం లేదని, పాక్షిక కీలు మార్పిడి చికిత్స సరిపోతుందని చెప్పాం. దీంతో ఆమె ఆ సర్జరీకి సంబంధించిన మరిన్ని వివరాలు చెప్పమని కోరింది. చిన్న వయసులో మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయించుకుంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయోనని సందేహం చాలా మందిలో ఉంటుంది. ఇటువంటి వారికి పార్షియల్ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ బాగా ఉపకరిస్తుంది. మోకాలులో మూడు కంపార్టుమెంటులు ఉంటాయి. ఒకటి మీడియల్, రెండవది లేటరల్, మూడవది పాటెల్లో ఫెమొరల్. సాధారణంగా అందరిలో మీడియల్ కంపార్టుమెంటులోనే అరుగుదల మొదలవుతుంది. ఆర్థరైటిస్‌తో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చే వారిలో మోకాలు ఒక పక్క అరిగిపోయి ఉండటాన్ని మేం గమనిస్తుంటాం. ఇటువంటి వారికి మొత్తం మోకాలు మార్చితే 20 ఏళ్ల తరువాత మళ్లీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆ సమయానికి ఎముక పూర్తిగా అరిగిపోయి ఉంటుంది కాబట్టి సర్జరీ చేయడం కష్టంగా మారుతుంది. ఆపరేషన్ చేసినా కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. అయితే ఈ ఇబ్బందులను పార్షియల్ నీ రీప్లేస్‌మెంట్ ద్వారా అధిగమించవచ్చు. ఈ ఆపరేషన్‌లో టోటల్ నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో పోల్చితే మూడవ వంతు భాగమే ఎముకను తొలగించడం జరుగతుంది. అంటే దెబ్బతిన్న భాగాన్ని మాత్రమే తొలగించడం జరుగుతుంది. మూడు కంపార్టుమెంటులు అరిగినపుడు మాత్రమే టోటల్ నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది.

  పార్షియల్ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీలో చాలా తక్కువ బోన్ తీస్తాం. టిష్యూస్ అన్నీ ప్రిసర్వ్ అయి ఉంటాయి. బ్లడ్‌లాస్ తక్కువ. కాబట్టి త్వరగా కోలుకుంటారు. ఫలితం బాగుంటుంది. 90 శాతం బోన్ ప్రిసర్వ్ అయి ఉంది కాబట్టి 20 ఏళ్ల తరువాత అవసరమైతే టోటల్ నీ రీప్లేస్‌మెంట్ చేసుకునే వీలుంటుంది. నిజానికి పార్షియల్ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీతో టోటల్ నీ రీప్లేస్‌మెంట్ అవసరాన్ని పది పదిహేనేళ్ల పాటు పొడిగించవచ్చు. బోన్ లాస్ ఉన్నప్పుడు ఇతరుల నుంచి సేకరించి ప్రిసర్వ్ చేసిన బోన్‌ను ఉపయోగిస్తాం. బ్లడ్ బ్యాంక్‌ల మాదిరిగానే బోన్ బ్యాంక్‌లు ఉంటాయి. ఇందులో చనిపోయిన వారి నుంచి సేకరించిన బోన్‌ను భద్రపరుస్తాం. ఆపరేషన్‌లో తీసివేసిన బోన్‌ను నిల్వ చేస్తాం. ఈ బోన్ ఇతరులకు కావలసి వచ్చినపుడు ఈ నాన్‌లివింగ్ బోన్‌తో బోన్ లాస్‌ను ఫిల్ చేస్తాం. లేదా ఆర్టిఫిషియల్ మెటల్‌ను ఉపయోగిస్తాం.

  ప్రో ప్రియో సెక్షన్.. ఇది సెన్సరీ సిస్టమ్. టోటల్ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేసినపుడు దీన్ని తొలగిస్తారు. దీనివల్ల మోకాలు దగ్గర స్పర్శ లేకుండా పోతుంది. మోకాలు వంచిది తెలియదు. మోకాలు మెలికపడితే ఆ విషయం కూడా తెలియదు. అందుకే పూర్తి మోకాలు మార్పిడి చికిత్స చేయించుకున్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. అయితే పార్షియల్ నీ రీప్లేస్‌మెంట్‌లో ఈ భయం ఉండదు. పది శాతం మాత్రమే బోన్‌ను తీసివేస్తాం కాబట్టి సెన్సరీ సిస్టమ్ అలాగే ఉంటుంది. దెబ్బతిన్న కంపార్టుమెంటును తొలగించి కొత్త భాగాన్ని అమర్చితే మిగతా రెండు కంపార్టుమెంటులు దెబ్బతినడం అగిపోతాయి. సర్జరీ అనంతరం కింద కూర్చోవడం, పనిచేయడం లాంటివి చేసుకోవచ్చు. ఒకవేళ అధిక బరువు ఉంటే తగ్గించుకోవాలి. ఇవన్నీ వివరించాక ఆమెలో ఉన్న సందేహాలన్నీ తొలగిపోయాయి. ఇప్పుడామె సర్జరీకి సిద్ధమయింది.

  మహిళల్ని వేధించే ఆస్టియోపోరొసిస్

  'పదిరోజులుగా నొప్పితో బాధపడుతున్నాను డాక్టర్.నడవలేకపోతున్నాను. అప్పుడెప్పుడో కింద పడి పోయినప్పటి నుంచి ఈ సమస్య వేధిస్తోంది.' అంటూ వచ్చింది 45 ఏళ్ల లక్ష్మీకుమారి.పడినప్పుడు బాధ తెలియలేదు.దెబ్బలేమీ తగల లేదు.ఏమీ అవదులే అనుకున్నాను గానీ రోజులు గడుస్తున్న కొద్దీ నొప్పి పెరుగుతో ంది.ఈ నొప్పి తగ్గించే మార్గం చెప్పండి డాక్టర్ అంటూ బాధపడిందావిడ.ఇరవయ్యేళ్ల క్రితం బండి మీద నుంచి కింద పడిపోయినా వెంటనే నొప్పి తగ్గలేదు.ఇప్పుడెందుకు ఇన్నిరోజులైనా తగ్గడం లేదు...అయిదు పదులు కూడా దాటలేదు...అప్పుడే అంత బలహీనం అయిపోయానా.... లక్ష్మీకుమారి మనసులో అనేక ప్రశ్నలు.

  ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒకటే... ఆస్టియోపోరొసిస్.లక్ష్మీకుమారికి ముగ్గురు పిల్లలు.ఉమ్మడికుటుంబం.భర్త, అత్తామామలు ఇంకా ఉన్నారు.ఇంటికి పెద్దకోడలిగా వీళ్లందరి ఆరోగ్యం పట్ల చూపే శ్రద్ధ తన పట్ల చూపలేకపోయింది.రుచికరంగా వండిపెడుతున్నదే గానీ తనకు సరిపడా పోషకాలు తీసుకోవడంపై నిర్లక్ష్యం వహించింది.ఫలితం.. శరీరంలో కావలసినంత కాల్షియం లేదు.. ఆస్టియోపోరొసిస్‌తో ఎముకలు బలహీనం అయిపోయాయి. జారి కింద పడగానే తుంటి ఎముక ఫ్రాక్చర్ అయింది.లక్ష్మీకుమారికి తుంటి ఎముక ఫ్రాక్చర్ అయినట్టుగా ఎక్స్‌రేలో తేలింది.

  అదృష్టవశాత్తు అది చిన్న ఫ్రాక్చరే.లేకుంటే తుంటిమార్పిడి చేయాల్సి వచ్చేది.చిన్న సర్జరీ చేస్తే సరిపోయింది.బోన్ డెన్సిడోమెట్రీ ద్వారా ఎముకల్లో కాల్షియం చాలా తక్కువగా ఉన్నట్టు తేలింది.టెరీపారటైడ్ అనే అధునాతన ఇంజెక్షన్ సాయంతో ఆస్టియోపోరొసిస్‌కి చికిత్స కూడా ప్రారంభమైంది.సంవత్సరం తిరిగే సరికల్లా లక్ష్మీకుమారి ఎముకలకు బలం చేకూరింది.

  కాల్షియం తగ్గితే....

  మహిళలను ఎక్కువగా వేధించే జబ్బుల్లో ఆస్టియోపోరొసిస్ ఒకటి.ఎముకల్లో కాల్షియం మోతాదు తక్కువ కావడమే ఈ జబ్బు తెచ్చే సమస్య.మన ఎముకల్లో పారాథైరాయిడ్ హార్మోన్ రిసెప్టర్స్ ఉంటాయి.ఇవి మనం ఆహారం ద్వారా తీసుకున్న కాల్షియంను గ్రహించి ఎముకలకు అందిస్తాయి.కాల్షియం ఎముకలు దృఢంగా పెరగడానికి తోడ్పడుతుంది.వయసు రీత్యా ఈ రిసెప్టర్స్ సంఖ్య తగ్గిపోతుంది. దాంతో ఎముకలకు తగినంత కాల్షియం అందదు.అయితే 50 దాటిన వారిలోనే కనిపించే ఈ సమస్య ఇటీవలి కాలంలో నాలుగు పదుల్లోనే కనిపిస్తోంది.

  ఇందుకు పోషకాహార లేమి ప్రధాన కారణమైతే మహిళల్లో మెనోపాజ్ దశ తొందరగా రావడం మరో కారణం.ఏ కారణం వల్లనైనా అండాశయాలను తీసివేసినా, ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్నా, వ్యాయామం లోపించినా ఈ జబ్బుకు గురయ్యే అవకాశం ఎక్కువ. కార్టికోస్టిరాయిడ్స్ లాంటి టాబ్లెట్లు కూడా ఇందుకు కారణమవుతాయి. ఆస్టియోపోరొసిస్‌కి అనువంశిక కారణాలు కూడా ఉన్నాయి.వంశంలో ఎవరికైనా ఈ జబ్బు ఉంటే తరువాతి తరాల్లో కనిపించే అవకాశం ఉంది.

  గుర్తించడం కష్టమే!

  సాధారణంగా కాల్షియం లోపం ఉన్నప్పుడు ఎటువంటి లక్షణాలూ కనిపించవు.కొందరిలో మాత్రం ఎముకల నొప్పులు ఉంటాయి.చాలావరకు వాళ్లెప్పుడో ఒకసారి హఠాత్తుగా కిందపడితే తప్ప బయటపడదు.ఎముకలు బలహీనంగా ఉండటం చేత సులువుగా విరిగిపోతాయి. ఇలాంటప్పుడు తుంటి ఎముకలే కాకుండా మణికట్టు, వెన్నెముకల్లో కూడా ఫ్రాక్చర్ కావచ్చు.వె న్నెముకలో ఫ్రాక్చర్ అయితే మరింత హానికరం.కాళ్లూచేతులు నొప్పి, తిమ్మిరెక్కడం, నడవలేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

  చికిత్స ఉంది...

  ఆస్టియోపోరొసిస్‌కి కాల్షియం టాబ్లెట్లతో పాటు టెరిపారాటైడ్ ఇంజెక్షన్ కూడా చేయించుకుంటే పూర్తిగా నయం చేయవచ్చు.ప్రారంభంలోనే సమస్య ఉంటే 3 నుంచి 6 నెలల పాటు ఇది వాడితే సరిపోతుంది.ఎముకలు తీవ్రంగా అరిగిపోయి ఉంటే మాత్రం సంవత్సరం నుంచి ఏడాదిన్నర వరకు ప్రతిరోజూ ఈ ఇంజెక్షన్ తీసుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది.అన్నింటి కన్నా ముఖ్యం ఆహారంలో తగినంత కాల్షియం ఉండేలా చూసుకోవడం.ఇందుకోసం పాలు, ఆకుకూరల్లాంటివి ఎక్కువగా తీసుకోవాలి.

  ఆధారము: వైద్యరత్నాకరం బ్లాగ్

  ఆధారము: వైద్యరత్నాకరం బ్లాగ్

  ఆధారము: హెల్త్ కేర్ తెలుగు బ్లాగ్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate