অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

క్యాన్సర్

క్యాన్సర్

  1. క్యాన్సరు
    1. క్యాన్సరు అనగా నేమి?
    2. అపాయకరమైన కంతులు ఏర్పడడానికి కారణాలు ఏవి ?
    3. క్యాన్సరును నివారించగలమా?
    4. క్యాన్సరు యొక్క సాధారణంగా కనబడే లక్షణాలు మరియు సంకేతాలు ఏవి?
    5. క్యాన్సరుకు ఏవిధంగా చికిత్స చేస్తారు?
  2. రక్త క్యాన్సరు
    1. లక్షణాలు:
    2. నాలుగు ప్రముఖ రకాలు
    3. కారణాలు మరియు రోగం అపాయకరమైన అంశాలు
  3. రొమ్ము క్యాన్సరు
    1. రొమ్ము కాన్సర్ అపోహలు - వాస్తవాలు
  4. సెర్వికల్ క్యాన్సర్
  5. క్యాన్సర్‌ని ముందే కనిపెట్టే పెట్‌స్కాన్
  6. ఎముక క్యాన్సర్
    1. రకాలు...
    2. లక్షణాలు
    3. ఎముక క్యాన్సర్ - దశలు
    4. చికిత్స ప్రక్రియలు
    5. ఎముక క్యాన్సర్‌కు హోమియో వైద్యం
  7. వివిధ రకాల క్యాన్సర్ వ్యాధులు
    1. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్
      1. నిరోధక టీకాలు
    2. పిల్లలకు పాలివ్వకపోవడం వల్ల క్యాన్సర్‌ రావచ్చు
      1. పాప్‌స్మియర్‌ టెస్టు
    3. కాలేయ క్యాన్సర్‌
      1. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
    4. ప్రొస్టేట్ కేన్సర్‌
    5. గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్‌
      1. కారణాలు
      2. లక్షణాలు
      3. నిర్ధారణ
      4. చికిత్స
    6. చర్మ క్యాన్సర్లు రకరకాలు
      1. మైకోసిస్‌ ఫంగాయిడ్స్‌
      2. మాలిగంట్‌ మెలనోమా
      3. మెర్‌కిల్‌ సెల్‌ కార్సినోమా
    7. అన్నవాహిక కేన్సర్‌
      1. కారణాలు
      2. లక్షణాలు
      3. నిర్ధా రణ
      4. చికిత్స
    8. మైలోమా క్యాన్సర్‌
      1. వైద్య విధానము
    9. కాన్సర్ వ్యాధులు - చికిత్సలు
      1. స్త్రీలలో క్యాన్సర్ కారకాలు
      2. లంగ్ క్యాన్సర్‌కు ముందస్తు జాగ్రత్తలు
      3. సర్వైకల్ క్యాన్సర్‌
      4. సర్జరీ, రేడియేషన్స్‌పై అపోహలు- వాస్తవాలు
      5. ఊపిరితిత్తుల క్యాన్సర్
      6. ముందుగా గుర్తిస్తే అదుపులో క్యాన్సర్
      7. రొమ్ము క్యాన్సర్... అపోహలూ, వాస్తవాలు
      8. మూత్రాశయ క్యాన్సర్‌కు ఆధునిక చికిత్స
      9. స్త్రీలలో కేన్సర్‌ - రకాలు
      10. వెన్నులో కణితి ...సర్జరీయే మేలు
      11. రొమ్ముక్యాన్సర్‌కి ఆధునిక చికిత్స

క్యాన్సరు

క్యాన్సరు అనగా నేమి?

క్యాన్సరు అనే వ్యాధి శరీర నిర్మాణానికి కనీస అవసరమైన కణాలలో మొదలవుతుంది. ఇది దగ్గరి సంబంధం వున్న అనేక వ్యాధుల సముదాయం. దీనిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి సాధారణమైన కణాలు ఎప్పుడు క్యాన్సరు కలిగించేవిగా మారుతాయో తెలుసుకోవాలి. శరీరం ఎన్నో కణాల సముదాయాలతో నిర్మిత మవుతుంది. సాధారణంగా కణాలు పెరిగి, విభజన చెందుతాయి. ఈ విభజన, కణాల వృద్ధి శరీరాన్ని ఆరోగ్యంగా వుంచడానికి అవసరము. కొన్నిసార్లు ఈ క్రమబద్దీకరణ అదుపు తప్పుతుంది.... శరీరానికి అవసరం లేక పోయినా క్రొత్తకణాలు ఏర్పడతాయి. పాతకణాలు క్షీణించవలసిన సమయంలో క్షీణించవు. ఈ విధంగా ఏర్పడిన కణాల సముదాయం కంతి లాగా గడ్డలాగా ఏర్పడుతాయి. దీనినే క్యాన్సరు గడ్డ అని, మారణ కంతి అని, రాచ కురుపు అని అంటారు. అన్ని గడ్డలు అపారకరమైనవికాదు. కొన్ని నిరపాయకరమైనవి కూడా వుంటాయి.

నిరపాయకరమైన కంతులు:- వీటిని క్యాన్సరు గడ్డలు అనరు. వీటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించవచ్చు. ఇవి సాధారణంగా తిరగబెట్టవు. ఈ గడ్డలోని కణాలు శరీరంలోని వేరే అవయవాలకు వ్యాపించవు. అన్నిటికన్నా ముఖ్యమైనది. ఇవి ప్రాణాంతకం కాదు.

అపాయకరమైన కంతులుః- ఈ కంతులలోని కణాలు అసాధారణంగా వుంటాయి. ఇంకా ఇవి నియంత్రణ లేకుండా విభజన చెందుతూ పోతాయి. ఇవి తమ చుట్టూ వున్న కణజాలం లోనికి చొచ్చుకొనిపోయి వాటిని విచ్ఛిన్నం చేస్తాయి. ఈ క్యాన్సరు కణాలు కంతుల నుంచి విడిపోయి దూరంగా రక్తస్రావం లోకి లేదా శోషరస వ్యవస్థలోకి చేరుతాయి. రక్తనాళాల చివరి నిర్మాణంలో రక్తనాళికలు, సిరలు ధమనులు అన్ని కలిసి వుంటాయి. వీటి ద్వారానే రక్తం శరీరంలోని అన్నిభాగాలకూ వెళుతుంది.

అపాయకరమైన కంతులు ఏర్పడడానికి కారణాలు ఏవి ?

కణాలలోని జన్యువులలో కలిగే మార్పుల వలన సాధారణంగా కణాలు కలిగే మార్పుల వలన సాధారణంగా కణాల విభజన, పెరుగుదల, క్షీణించడం వంటి అంశాలపై నియంత్రణ కోల్పోతాయి. కొన్ని రకాల జీవిత విధానాలు, వాతావరణ మార్పుల మూలంగా సాధారణంగా వుండవలసిన జన్యువులు క్యాన్సరు పెరగడానికి అనుమతించేవిగా మారుతాయి. ఈ విధమైన జన్యు మార్పులకు కారణాలు

  • ధూమపానం
  • ఆహారపుటలవాట్లు
  • సూర్యరశ్మిలోని అయనీకరణ వికిరణాలు
  • క్యాన్సరుకు కారణమయ్యే కొన్ని పదార్థాలు (ఇవి వాతావరణం లోనివి కావచ్చు లేదా పనిచేసే ప్రాంతాల నుంచి ఉత్పన్నమయినవీ కావచ్చు)
  • కొన్ని అనువంశికం (వంశ పారంపర్యంగా కూడా రావచ్చు.)

అనువంశికంగా జన్యువులలో వచ్చే మార్పుల వల్ల తప్పనిసరిగా అపాయకరమైన గడ్డలు ఏర్పడతాయని ఖచ్చితంగా చెప్పలేము కానీ, వచ్చే అవకాశాలు ఎక్కువ అని చెప్పవచ్చు. శాస్త్రజ్ఞులు ఈ విషయమై క్యాన్సరు వచ్చే అవకాశాలు ఎక్కువ లేక తక్కువ చేసే అంశాలను ఇంకా పరిశోధిస్తున్నారు. కొన్ని వైరసుల సూక్ష్మక్రిమి సంపర్కం మూలంగా ఉదా|| హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్.ఐ.వి.) కాలేయ శోధము -బి, కాలేయ శోధము - సి) ఎయిడ్స్ వైరస్ క్యాన్సరు వచ్చే అవకాశాలు, అపాయం ఎక్కువ కావచ్చును కానీ, క్యాన్సరు అంటువ్యాధి కాదు. క్యాన్సరు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. గాయాలు, కందిపోయిన భాగం నుంచి క్యాన్సరు పుట్టదు.

క్యాన్సరును నివారించగలమా?

క్యాన్సరును ఖచ్చితంగా నివారించే పద్దతి ఏదీ లేదు కానీ, వచ్చే అపాయాన్ని కొంతవరకూ నివారించుకోవచ్చును.

  • ధూమపానం, అందుకు సంబంధించిన పదార్థాలకు దూరంగా వుండడం
  • క్రొవ్వు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం, కూరగాయలు, పండ్లు, ముడి ధాన్యం, అధికంగా తీసుకోవడం చేయాలి.
  • ప్రతి దినం వ్యాయామం, తక్కువ బరువు (ఎత్తుకు తగ్గ) ను నియంత్రించుకొనడం
  • సూర్యరశ్మిలోని అపాయకరమైన కిరణాల నుంచి రక్షించుకొనడం ( ఎండ వేళల్లో గొడుగు ధరించడం, శరీరం అంతా కప్పే విధంగా దుస్తులు వేసుకొనడం, నల్ల కళ్ళద్దాలు పెట్టుకొనడం, చర్మానికి సూర్య కిరణాలను అడ్డుకునే మందులు రాసుకొనడం, తెల్ల దుస్తులు ధరించడం) వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
  • క్యాన్సరును నివారించే మందులు గురించి వైద్యులతో సంప్రదించి వాడుకోవడం.

క్యాన్సరు యొక్క సాధారణంగా కనబడే లక్షణాలు మరియు సంకేతాలు ఏవి?

క్యాన్సరు జబ్బులో చాలా రకాల లక్షణాలు కనబడుతాయి.

సాధారణంగా కనబడే లక్షణాలు:

  • కణజాలంలో కొంత మేరకు మందంగా మారడం (లేదా) గడ్డలు (కంతులు) ఏర్పడడం, (లేదా) శరీరంలో ఏ భాగంలో నైనా (రొమ్ములలో) గడ్డలుగా మొదలవవచ్చును.
  • కొత్త (పుట్టు) మచ్చలు (లేదా) ప్రస్తుతం వున్న ఆనలు (లేదా) మచ్చలలో మార్పులు స్పష్టంగా కనబడతాయి.
  • చికిత్సకు మానని పుండ్లు
  • గొంతులో గరగర, ఎప్పటికీ ఉండే పొడి దగ్గు.
  • మల, మూత్ర విసర్జన అలవాట్లలో మార్పులు
  • విడవకుండా వుంటున్న అజీర్తి, మింగడంలో ఇబ్బంది.
  • బరువులో అర్థంకాని మార్పులు (హెచ్చు తగ్గులు)
  • అసాధారణ రక్తస్రావం (లేదా) ద్రవాలు స్రవించడం.

క్యాన్సరుకు ఏవిధంగా చికిత్స చేస్తారు?

క్యాన్సరు చికిత్స విభాగంలో
  • శస్త్ర చికిత్స
  • అయనీకరణ కిరణ చికిత్స
  • మందులు
  • హార్మోనుల చికిత్స,
  • ప్రకృతి వైద్యం

వైద్యులు కొన్ని అంశాలు (క్రింద చూపినవి) పరిధి లోనికి తీసుకొని ఒకే రకమైన లేక రెండు మూడు రకాలైన చికిత్సలను కలిపి రోగికి ఇవ్వవచ్చును.
ఆ అంశాలుః -

  • క్యాన్సరు రకము (అపాయకరమైనవి, నిరపాయకరమైనవి)
  • క్యాన్సరు వున్న అవయవము (లేదా) శరీర భాగము
  • క్యాన్సరు ఇతర అవయవాలకు వ్యాప్తి చెంది వున్నదా ? (మోటాస్టాసిస్)
  • రోగి వయసు
  • శరీర ఆరోగ్య పరిస్థితి (ఇతర జబ్బులు ఏవైనా వున్నవా ?)
  • ఇతర అంశాలు: క్యాన్సరు చికిత్సలో ఆరోగ్యంగా వున్న కణాలు, కణజాలం కూడా దెబ్బతిని ఇతర హానికరమైన ప్రభావం చూపవచ్చు. కొంత మంది రోగులు చికిత్స కన్నా, మందులు వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి బెంగపడతారు.
  • రోగి, వైద్యులు కలిసి సంప్రదించుకొని చికిత్స మొదలు పెట్టడం శ్రేయస్కరం. లాభ నష్టాలు తూచి నిర్ణయం తీసుకోవలసి వుంటుంది. ఈ దుష్ప్రభావాలను నివారించే (లేదా) తగ్గించే ఉపాయాలను వైద్యులను సంప్రదించి తీసుకొవాలి.

శస్త్ర చికిత్స: క్యాన్సరు గడ్డలను తీసివేసే చికిత్స. దీని దుష్ప్రరిమాణాలు చాలా అంశాలపై ఆధారపడి వుంటాయి.

  • రోగి యొక్క శారీరక, ఆరోగ్య పరిస్థితి,
  • గడ్డ యొక్క పరిమాణం, గడ్డ పుట్టిన అవయవం.
  • శస్త్ర చికిత్స విధానం.

శస్త్ర చికిత్సానంతరం రోగికి నొప్పి అధికంగా వుండవచ్చు. దీనిని మందులతో నియంత్రించవచ్చును. కొంత మంది రోగులకు బలహీనంగా అలసటగా అనిపించవచ్చు.
ఇది శస్త్ర చికిత్స తరువాత కొంత కాలం వరకూ వుండవచ్చును. కొంత మంది రోగుల యొక్క పరీక్ష (లేదా) శస్త్ర చికిత్స మూలంగా క్యాన్సరు శరీరం అంతటా వ్యాపిస్తుందని అపోహపడతారు. ఈ విధంగా శస్త్ర చికిత్స చేసేటప్పుడు వైద్యులు అన్ని విధాల జాగ్రత్తలూ తీసుకుంటారు. శస్త్ర చికిత్స సమయం లో క్యాన్సరు గడ్డలకు గాలి తగలడం వలన ఇవి గాలి ద్వారా వ్యాపించవు.

రక్త క్యాన్సరు

లుకేమియా అనేది రక్త క్యాన్సరు. రక్తోత్పత్తి అయ్యే అవయవములు (ముఖ్యంగా ఎముక మజ్జు మరియు శోష గ్రంధులు ఫ్లీహము) క్యాన్సరుకు గురి అయి - రక్తంలో ఉండే తెల్ల రక్తకణాలు వాటి అగ్రగాములు నిరుపయోగరకమైన సంఖ్యా వృద్ధి చెందుతాయి. రక్తానికి సంబంధించిన క్యాన్సరులలో ఇది ఒకరకం.

లక్షణాలు:

రక్త క్యాన్సరులో అపరిపక్వమైన తెల్ల రక్తకణాలు అధిక సంఖ్యలో ఉత్పత్తి జరిగి సాధారణ, ఆరోగ్యమైన తెల్లరక్తకణాలను స్థానభ్రంశం చేసి ఎముక మజ్జుకు హాని కలిగిస్తాయి. దీని మూలంగా రక్తం గడ్డకట్టడానికి (గాయాలు కలిగినప్పుడు) అవసరమయే రక్తపట్టకల సంఖ్య తగ్గిపోతుంది. దీని మూలంగా రక్త క్యాన్సరు వున్న రోగులకు గాయం కలిగినప్పుడు అధిక రక్తస్రావం, శరీరం కమిలినట్టుగా కనపడడం, చర్మంమీద ఎర్ర రక్తపు దద్దుర్లు కనపడడం వంటి లక్షణాలు వుంటాయి.
తెల్లరక్తకణాలు వ్యాధికారక సూక్ష్మజీవులకు విరుధ్ధంగా నిరంతరం పోరాడుతూవుంటాయి. ఇవి ఈ వ్యాధితో అణచి చేయబడుతాయి లేక సరిగావాటి విధి నిర్వర్తించలేకపోతాయి. పర్యవసానంగా రోగి యొక్క నిరోధక వ్యవస్థ (తెల్లరక్తకణాలు మొ,,) శరీరంలోని ఇతర కణాలపై దాడి మొదలు పెడతాయి.
ఆఖరుకు ఇట్టి రక్తకణాల కొరత రక్తహీనతకు దారితీస్తుంది. రక్తహీనతవల్ల రోగికి ఆయాసం రావచ్చు. ఇతర జబ్బులలో కూడా ఈ లక్షణాలు ఉండవచ్చును. రోగ నిర్ధారణకు రక్తపరీక్షలు, ఎముక, మజ్జాల పరీక్షలు అవసరమవుతాయి.

తత్సంబంధమైన ఇతర లక్షణాలు:-

  • జ్వరము, వణుకుడు, రాత్రుళ్ళు చెమటపోయడం, ఇతర ఇన్ ప్లూయన్ జా లక్షణాలు
  • బలహీనత, అలసట,
  • ఆకలి లేమి, రక్తం కారడం
  • చిన్న గాయం నుంచి అధిక రక్తస్రావం
  • నరాల జబ్బులకు సంబంధించిన లక్షణాలు (తలనొప్పి)
  • కాలేయము, ప్లీహము యొక్క వాపు.
  • చిన్నగాయాలయినా తేలికగా చర్మం కంది పోవడం
  • తరచుగా సూక్ష్మక్రిమి సంపర్కము
  • ఎముకల నొప్పి
  • కీళ్ళ నొప్పులు
  • గళగ్రంధుల యొక్క వాపు లుకేమియా (రక్త క్యాన్లరు) అనగా తెల్ల రక్తము అని అర్థం.

సార్ధకనామంగా ఈ వ్యాధిలో తెల్లరక్తకణాల సంఖ్య రోగిరక్తంలో చికిత్సకు ముందు అధికంగా ఉంటాయి. సూక్ష్మ దర్శని క్రింద రక్తం యొక్క నమూనా పరీక్షించినప్పుడు తెల్లకణాల సంఖ్య ఆధిక్యత స్పష్టంగా తెలుస్తుంది. చాలా వరకు ఈ అధిక సంఖ్యలో ఉన్న తెల్ల రక్తకణాలు ఇతర కణాల కార్యకలాపాలలో అడ్డుపడతాయి.
కొంతమంది రక్త క్యాన్సరు రోగులలో తెల్లరక్తకణాల ఆధిక్యత స్పష్టంగా కనపడేంతగా వుండదు. దీనిని ఎలుకీమియా అంటారు. ఎముక మజ్జులో క్యాన్సరు కలుగజేసే తెల్ల రక్తకణాలు వుంటాయి మరియు ఇవి సాధారణంగా ఉత్పత్తయే రక్తకణాలలో విభేధము కలిగిస్తాయి. అయినప్పటికీ ఇటువంటి క్యాన్సరును కలుగజేసే రక్తకణాల రక్తస్రావంలోకి చేరకుండా ఎముక మజ్జులోనే ఉండిపోతాయి. ఇవి రక్త పరీక్షలో కనపడవు. ఎలుకీమియా రక్త క్యాన్సరు ఉన్న రోగులలో రక్తంలోని తెల్లరక్త కణాల సంఖ్య సాధారణంగా లేక సాధారణం కంటే తక్కువగా ఉండవచ్చును. నాలుగు ప్రముఖ రకాలైన రక్త క్యాన్సరులలో ఎలుకీమియా ఒకరకం కావచ్చును. ఎలుకీమియా కేశకణాల ఎలుకీమియాలలో అధికంగా వుంటుంది.

నాలుగు ప్రముఖ రకాలు

రక్త క్యాన్సరు అనే పదం చాలా రకాల రక్తానికి సంబంధించిన వ్యాధులకు కలిపి వర్తిస్తుంది.
రక్త క్యాన్సరును వైద్య పరీక్షలకు అనుగుణంగా వ్యాధి విజ్ఞాన శాస్త్రానికి అనుగుణంగా రెండు రకాలుగా విభజించవచ్చును.

ఆకస్మికంగా అవతరించే రకము. దీర్ఘకాలికంగా ఉండే రకము

ఆకస్మికంగా అవతరించే రకముః-
ఇందులో అపరిపక్వమైన రక్తకణాలు వేగంగా వృద్ధి చెందుతూ పోతాయి. ఈ కణాలు గుంపులు, గుంపులుగా ఎముక మజ్జునులో ఏర్పడి దీనిని ఆరోగ్యవంతమైన రక్తకణాల ఉత్పత్తి చేసే వీలు లేకుండా చేస్తాయి. ఈ రకము రక్త క్యాన్సరు పిల్లలలో మరియు యౌవ్వనంలో వున్న వారికి వచ్చే అవకాశం ఉంటుంది.
తక్షణ చికిత్స చాలా అవసరం ఎందుకంటే ఈ రకం రక్త క్యాన్సరులో క్యాన్సరు కణాలు వేగంగా పెరిగిపోయి గుంపులుగా చేరిపోయి రక్త ప్రసరణలోకి చేరి ఇతర అవయవాలలోకి వ్యాప్తి చెందుతాయి. కానీ కేంద్రనాడీ వ్యవస్థను ప్రభావితం చేయదు. అప్పుడప్పుడు కేంద్ర నాడుల పక్షవాతం వచ్చే అవకాశాలు వుంటాయి.

దీర్ఘకాలికంగా ఉండే రకముః-
ఈ రకం క్యాన్సరులో ఆకస్మిక రక్త క్యాన్సరులో లాగా కాక క్యాన్సరు కణాలు దరిదాపు పరిపక్వంగా వుంటాయి. కానీ అసాధారణంగా వుంటాయి. ఇవికూడా త్వరితగతిన వృద్ధి చెందుతాయి. కొన్ని నెలలనుంచి కొన్ని సం,, కాలంలో వృద్ధి చెందుతూ సాధారణ కణాలు వృద్ధి చెందే సమయము కన్నా కొద్దిగా ఎక్కువ సమయం తీసుకొంటాయి. ఫలితంగా రక్తంలో అసాధారణ తెల్లరక్తకణాలు ఎన్నో కనపడతాయి. దీర్ఘకాలిక రక్త క్యాన్సరు చాలా వరకూ వృద్ధులలో కనబడుతుంది. కానీ సిద్దాంతాలు ప్రకారం చిన్న వయస్సులో ఉన్న వారికి కూడా రావచ్చును. ఆకస్మిక రక్త క్యాన్సరుకు తక్షణం చికిత్స అవసరం, కానీ దీర్ఘకాలిక క్యాన్సరు రోగులను కొంతకాలం వరకూ గమనించి చికిత్స యొక్క ప్రభావం పూర్తిగా లభించే వరకూ ఎదురు చూడవచ్చును.

కారణాలు మరియు రోగం అపాయకరమైన అంశాలు

అన్ని రకాల రక్త క్యాన్సరులకు ఏదో ఒకటే కారణం అంటూ లేదు. వివిధ రకాల రక్త క్యాన్సరులకు వివిధ కారణాలు వుండవచ్చును. దీని గురించి తెలిసింది చాలా తక్కువ. శాస్త్రజ్ఞుల ఈ క్రింది పేర్కొన్న నాలుగు కారణాలు కారణం కావచ్చునని నమ్ముతున్నారు.

  • స్వాభావిక లేక కృత్రిమ అయనీకరణ కిరణ ప్రసారాలు (కిరణ ప్రసరణ వలన కలిగే ఉష్ణము)
  • కొన్ని రకాల రసాయన పదార్థములు
  • కొన్ని వైరస్ లు
  • అనువంశికం, వంశపారంపర్యం

రక్త క్యాన్సరులో వేరే క్యాన్సరులు లాగానే జన్యు పదార్థ శరీర నిర్మాణంలో మార్పులు (శాశ్వత) కలుగుతాయి. ఈ మార్పులు మామూలు కణాలను, క్యాన్సరు కణాలుగా అణచి వేసే జన్యువులను నిస్తేజ పరుస్తాయి. ఇంకా నియమబద్దంగా జరుగవలసిన కణ విభజన, ఏర్పాటు, కణక్షీణత వంటి ప్రక్రియలన్నీతారుమారవుతాయి. ఈ జన్యువు ఉత్పరివర్తనాలు ఆకస్మికంగా జరుగవచ్చును. లేదా జన్యుపరమైన కారణాం వికిరణ కిరణాల ప్రభావం, క్యాన్సరుకు కారణ భూతమయ్యే పదార్థాలు వంటి కారణాలతో కూడా ప్రభావితం కావచ్చును. కోహార్ట్ వంటి శాస్త్రజ్ఞుల పరిశోధనలలో జెంజోన్ వంటి పెట్రోలుకు సంబంధించి రసాయన పదార్థాలు, వెంట్రుకలకు వేసుకొనే రంగులు కొన్ని రకాల రక్త క్యాన్సరుకు కారణం కావచ్చునని కొంతమంది రోగుల పై ప్రయోగాల ఫలితాలను పరిశీలించ పిమ్మట, ఈ విధంగా భావిస్తున్నారు.
కొన్ని రకాల రక్త క్యాన్సర్లకు కారణం కొన్ని వైరసులు కూడా కావచ్చు. అయిన రక్త క్యాన్సర్లలో హెచ్.ఐ.వి. వైరస్ కారణం (ఎయిడ్స్ కు కారణం అయిన వైరస్) లేక హ్యుమన్ టి- లింఫాట్రాఫిక్ వైరస్ -1, 2 - దీని మూలంగా టి-కణ రక్త క్యాన్సరు లేక లింఫామా అను క్యాన్సరు వస్తాయి.
ఫాంకానీ రక్తహీనతలో ఆకస్మికమైన జీనస్ రక్త క్యాన్సరు వచ్చే అపాయం వుంటుంది.
కారణాలు తెలిసే వరకూ రక్త క్యాన్సరు నివారణ సాధ్యపడదు. కారణాలు తెలిసిన తరువాత కూడా నివారణ అంతగా నియంత్రించడం జరుగదు. ఉదాహరణకు సహజంగా, సూర్యరశ్మి లోని అయనీకరణ వికిరణాల ప్రభావాన్ని ప్రతిదినం వాటి ప్రభావాన్నుంచి కాపాడుకోవడం సాధ్యపడదు. దీని వలన నివారణ పరంగా పెద్దగా ఉపయోగం కూడా లేదు.

రొమ్ము క్యాన్సరు

స్తనంలోని కంతులు (గడ్డలు)

రొమ్ము గడ్డలు
రొమ్ము క్యాన్సరు స్త్రీలలో వచ్చే క్యాన్సరులలో అతి సాధారణమైనవి. క్యాన్సరు వల్ల స్త్రీలలో కలిగే మరణాలలో రెండవ స్థానంలో వున్నది. స్త్రీ జీవిత కాలంలో ఈ జబ్బు వచ్చే అవకాశాలు 1 నుంచి 9 వరకు వుంటాయి. (అపాయం)

స్తనంలోని కంతులు (గడ్డలు)

రొమ్ము గడ్డలు
రొమ్ము క్యాన్సరు స్త్రీలలో వచ్చే క్యాన్సరులలో అతి సాధారణమైనవి. క్యాన్సరు వల్ల స్త్రీలలో కలిగే మరణాలలో రెండవ స్థానంలో వున్నది. స్త్రీ జీవిత కాలంలో ఈ జబ్బు వచ్చే అవకాశాలు 1 నుంచి 9 వరకు వుంటాయి. (అపాయం)

లక్షణాలు

  • రొమ్ములో గడ్డ
  • చనుమొనల నుంచి ద్రవాలు స్రవించడం (కారణం)
  • వెనుదిరిగిన చనుమొనలు (సాధారణంగా బయటకు వచ్చినట్టు వుండాలి.)
  • ఎఱ్ఱగా, కందినట్టుగా వుండే చనుమొనలు
  • రొమ్ములు పెద్దవిగా అయివుండడం.
  • రొమ్ములు కుంచించుకు పోయినట్టు వుండడం.
  • రొమ్ములు గట్టిపడడం
  • ఎముకలలో నొప్పి
  • నడుము నొప్పి

హానికలిగించే, (అపాయం కలిగించే) అంశాలు:

  • కుటుంబ చరిత్ర, ముఖ్యంగా దగ్గరి బందువులలో ఈ వ్యాధి వుండడం.
  • స్త్రీల వయసు పెరిగే కొద్దీ వ్యాధి వచ్చే అపాయం పెరుగుతూ పోతుంది.
  • ముందుగా గర్భాశయం క్యాన్సరు వచ్చివున్న చరిత్ర
  • ముందుగా రొమ్ములకు సంబంధించిన జబ్బులు వచ్చి ఉండడం, రొమ్ములలో అసాధారణ మార్పులు వచ్చి వుండడం.
  • జన్యు పరమైన లోపాలు లేదా మార్పులు (అరుదైన మార్పులు)
  • 50సం,, దాటిన తరువాత బహిష్టులు ఆగిపోవడం (కొద్దిగా ఆలస్యంగా)
  • పిల్లలు కలుగక పోవడం
  • మధుపానం, ఆహారంలో ఎక్కువ క్రొవ్వు పదార్థాలు తీసుకోవడం, పీచు పదార్థాలు ఎక్కువగా వున్న ఆహారం తీసుకోవడం, ధూమపానం, అధిక బరువు, ముందుగా వున్న అండాశయ క్యాన్సరు, పెద్ద పేగుల క్యాన్సరు.

చికిత్స

రొమ్ము క్యాన్సరు యొక్క చికిత్స ముఖ్యంగా మూడు అంశాలపై ఆధారపడి వుంటుంది.

  • చికిత్స తీసుకునే స్త్రీ బహిస్టులు ఎండిపోయే వయసుకు చేరుకొని వున్నదా
  • రొమ్ము క్యాన్సరు ఎంత మేరకు వ్యాపించి ఉన్నది
  • రొమ్ము క్యాన్సరు లోని కణాల నమూనా (రకం)

రొమ్ము క్యాన్సరు యొక్క వ్యాప్తి హార్టులు క్రింది విధంగా నిర్వచించబడుతాయి.

  • రొమ్ములో ఏ స్థానంలో ఏర్పడి వున్నది
  • క్యాన్సరు ఏ వంతున శోష గ్రంధులలోకి వ్యాపించి ఉన్నది.
  • రొమ్ము లోపలి లోతుగా వున్న కండరాలలోనికి క్యాన్సరు వ్యాపించడం
  • మెదడు మరియు ఎముకలు మొ,, ఇతర అవయవాలకు క్యాన్సరు వ్యాపించడం.
  • రొమ్ము క్యాన్సరు కణాలలో కూడా రకాలు వుండవచ్చును.
  • త్వరితగతిని విభజన చెందే కణాలు కొద్దిగా తక్కువ వేగంతో విభజన చెందే కణాలు దీనికి తోడు కణాలపై గ్రాహకాలు వుంటాయి. దీవి ఉనికి రొమ్ము క్యాన్సరు చికిత్సకు ప్రతిస్పందన అధికం చేస్తుంది.

పైన చెప్పిన అంశాల ఆధారంగా వైద్యులు క్రింద చూపిన నిర్ణయాలు తీసుకొనడం జరుగుతుంది.

రొమ్ములోని గడ్డను దాని చుట్టూ వున్న కణజాలాన్ని తీసివేయడం దీనితోపాటు వికిరణ చికిత్స ఇవ్వవచ్చు ఇవ్వకపోవచ్చు.

  • పూర్తిగా రొమ్మును తొలగించడటం
  • రొమ్మును (రెండు) వీటితో పాటు శోషరస గ్రంథులను కూడా తొలగించడం.

నివారణోపాయాలు

  • ప్రతినెలా రొమ్ములను స్వయంగా పరీక్షించుకోవడం
  • సంవత్సరానికి ఒకసారి వైద్యనిపుణులతో రొమ్ముల పరీక్ష
  • పౌష్ఠికాహాకారాన్ని తీసుకోవడం
  • రొమ్ములో గడ్డలు (చిన్నవికానీ, పెద్దవికానీ) వున్నట్టు ఎంత మాత్రం అనుమానం కలిగినా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
  • రొమ్ము క్యాన్సరు త్వరగా కనుక్కొని చికిత్స తీసుకుంటే నయం చేసుకోవచ్చు, ఆలస్యం చేస్తే ప్రాణాంతకం కావచ్చును.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

రొమ్ము కాన్సర్ అపోహలు - వాస్తవాలు

మహిళలను వేధించే ఆరోగ్య సమస్యల్లో రొమ్ము క్యాన్సర్ కూడా ప్రధానమైనది. ఈ క్రమంలో ప్రతి మహిళా దీని గురించి అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. రొమ్ము క్యాన్సర్‌కి సంబంధించి కొంత మంది మహిళల్లో కొన్ని అపోహలు కూడా ఉంటాయి. అయితే దీనికి సంబంధించిన అపోహలేమిటో, వాస్తవాలేమిటో తెలుసుకోకపోతే మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ..రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించిన కొన్ని అపోహలు, వాస్తవాలు ఏమిటో తెలుసుకుందాం.

అపోహ : రొమ్ముల్లో కనిపించే గడ్డలన్నీ క్యాన్సర్ గడ్డలే
ఇది నిజం కాదు. రొమ్ములో కనిపించే గడ్డల్లో పదింట తొమ్మిది క్యాన్సర్ గడ్డలు కావు. ఒకటి మాత్రమే క్యాన్సర్ గడ్డ కావొచ్చు. అయినా నిర్లక్ష్యం చేయడానికి లేదు. ఎలాంటి గడ్డ కనిపించినా తప్పనిసరిగా వైద్యుణ్ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం అవసరం.

అపోహ : రొమ్ము క్యాన్సర్ పెద్ద వయసు స్త్రీలకే వస్తుంది
ఇది పూర్తిగా నిజం కాదు. 90 శాతం రొమ్ము క్యాన్సర్ కేసులు 50 ఏళ్ల పైబడిన స్త్రీలలోనే కనిపిస్తున్నా... ఇటీవల కాలంలో చిన్న వయసు వారిలోనూ ఈ క్యాన్సర్ వస్తోంది.

అపోహ : రొమ్ము క్యాన్సర్ పురుషులకు రాదు.
పురుషులకు స్త్రీల మాదిరి రొమ్ములు ఉండవు కాబట్టి రొమ్ము క్యాన్సర్ రాదని భావించడం నిజం కాదు. రొమ్ము కణజాలం పురుషులకూ ఉంటుంది. కొంత మంది పురుషులకూ ఈ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది.

అపోహ : రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలీదు
ఇందులో కొంతవరకే వాస్తవం ఉంది. రొమ్ము క్యాన్సర్ ముప్పును పెంచే కొన్ని అంశాలను వైద్య పరిశోధకులు గుర్తించారు.

రొమ్ము క్యాన్సర్ ముప్పును పెంచే కొన్ని కారణాలు :

  • స్త్రీలకు వయసు పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది.
  • కుటుంబంలో రొమ్ము క్యాన్సర్ చరిత్ర
  • 12 ఏళ్ల కంటే ముందే రజస్వల కావడం
  • 55 ఏళ్ల కంటే ముందే నెలసరి ఆగిపోవడం
  • పిల్లలు లేకపోవడం
  • 30 ఏళ్ల తర్వాతే తొలి సంతానం కలగడం
  • హార్మోన్ మాత్రలు ఎక్కువగా వాడడం
  • బరువు ఎక్కువగా పెరగడం...

ఇవన్నీ రొమ్ము క్యాన్సర్ ముప్పును పెంచేవే.

అపోహ : వంశంలో రొమ్ము క్యాన్సర్ ఉంటే తర్వాతి తరంలో వారికీ వస్తుంది.
ఇది నిజం కాదు. ఎందుకంటే రొమ్ము క్యాన్సర్ బారిన పడినవారి కుటుంబాల్లో చాలామంది ఆరోగ్యంగానే ఉన్నారు. ఇలా వంశ పారంపర్యంగా క్యాన్సర్ రావడానికి 10 శాతం వరకే అవకాశాలున్నాయి.

అపోహ : బిడ్డకు పాలిస్తే రొమ్ము క్యాన్సర్ రాదు
ఇది కొంతవరకే నిజం. బిడ్డకు పాలివ్వడం వల్ల క్యాన్సర్ రాకూడదని లేదు. అయితే రాకుండా ఉండడానికి కొంతవరకే అవకాశాలున్నాయి.

అపోహ : గర్భ నిరోధక మాత్రలతో రొమ్ము క్యాన్సర్ వస్తుంది.
ఇది నిజం కాదు. ఇప్పుడు లభిస్తున్న గర్భ నిరోధక మాత్రల్లో కొద్ది మొత్తంలోనే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు ఉంటాయి. ఈ మోతాదుతో క్యాన్సర్ వచ్చే అవకాశం లేదు.

అపోహ : రొమ్ము క్యాన్సర్ తొలిదశలో గుర్తించడం కష్టం
ఇది నిజం కాదు. చేతికి గడ్డలు తగలడానికి కొన్నేళ్ల ముందే క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. మామోగ్రఫీ పరీక్ష ద్వారా వీటిని గుర్తించడం సాధ్యమవుతుంది. ముందే గడ్డలు గుర్తించడం వల్ల చికిత్స చాలా సులువవుతుంది. అందుకే 40 ఏళ్లు పైబడిన స్త్రీలంతా మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలి.

అపోహ : మామోగ్రఫీ పరీక్ష బాధాకరంగా ఉంటుంది.
ఇది కూడా నిజం కాదు. సాధారణ ఎక్స్‌రే మాదిరే ఈ పరీక్ష కూడా ఉంటుంది. కొంత వరకు అసౌకర్యంగా ఉన్నప్పటికీ ఎలాంటి నొప్పీ ఉండదు. ప్రత్యేకించి డిజిటల్ మామోగ్రఫీతో కలిగే అసౌకర్యం చాలా తక్కువే.

ఆధారము: వసుంధర

సెర్వికల్ క్యాన్సర్

స్త్రీలలో మాత్రమే వచ్చే వ్యాధి సెర్వికల్ క్యాన్సర్. ఇది హ్యుమన్ పాపిల్లోమా వైరస్(హెచ్‌పీవీ) వల్ల వస్తుంది. పురుషుల్లో ఈ వైరస్ ఉన్నా ఎటువంటి హాని చేయదు. కానీ వారి ద్వారా స్త్రీలకు సంక్రమిస్తుంది. గర్భాశయ ముఖద్వారానికి వచ్చే ఈ క్యాన్సర్ వేగంగా విస్తరించడానికి అవగాహన లేకపోవడమే ప్రధాన కారణం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఈ వ్యాధి గురించి సరియైన అవగాహన లేదు. హెచ్‌పీవీ వైరస్ సోకినపుడు కొన్ని ప్రాథమిక లక్షణాలు బయటపడతాయి. వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల పరిస్థితి చేయి దాటిపోతోంది. కొందరు స్త్రీలు గుర్తించినా బయటకు చెప్పుకోలేక క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు. 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సున్న వారిలో ఈ క్యాన్సర్ ఎక్కువగా బయటపడుతోంది.

కారణాలు అనేకం
హ్యుమన్ పాపిల్లోమా వైరస్(హెచ్‌పీవీ) సోకడం వల్ల యోనికి, గర్భాశయంకు మధ్యన ఉన్న ప్రాంతంలో(గర్భాశయ ముఖద్వారం) క్యాన్సర్ అభివృద్ధి చెందుతుంది. జననాంగాల ప్రాంతంలో శుభ్రత పాటించని వారికి, ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు పెట్టుకున్న వారికి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రెగ్నెసీ సమయంలో వేసుకునే కొన్ని రకాల మాత్రల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. సెర్వికల్ క్యాన్సర్‌లో స్కమస్ సెల్ కార్సినోమ ఎక్కువగా వస్తుంది. 90 శాతం మందిలో ఈ రకమైన క్యాన్సర్ వస్తుంది. మిగతా 10 అడెనో కార్సినోమ, అడెనో స్కమస్ కార్సినోమ అనే క్యాన్సర్ కనిపిస్తోంది.

రక్తస్రావంతో జాగ్రత్త
వైరస్ శరీరంలో ప్రవేశించినపుడు ప్రాథమిక దశలో కొన్ని లక్షణాలు బయటపడతాయి. ఆ తరువాత ఎటువంటి లక్షణాలు ఉండవు. కానీ కొన్ని ఏళ్ల తరువాత క్యాన్సర్‌గా బయటపడుతుంది. మొదటి దశలో నొప్పి ఉండదు. రక్తస్రావం, పీరియడ్స్ ఎక్కువ రోజులు ఉండటం, సంభోగం తరువాత రక్తస్రావం, పీరియడ్స్‌కు, పీరియడ్స్‌కు మధ్య పీరియడ్స్ రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తరువాత దశలో మూత్రంలో, మలంలో రక్తం పడటం, రక్తహీనత. నడుం నొప్పి, కాళ్లనొప్పులు ఉంటాయి. నాలుగో దశలో మూత్ర పిండాలలో వాపు, లివర్ ఎఫెక్ట్ కావడం జరుగుతుంది.

పాప్‌స్మియర్ టెస్ట్
సెర్వికల్ క్యాన్సర్ ఉన్నదీ లేనిదీ తెలుసుకోవడానికి పాప్‌స్మియర్ టెస్టు చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో ఒక ప్రత్యేకమైన పరికరం ద్వారా గర్భాశయ ముఖ ద్వారం నుంచి కొన్ని కణాలు తీసుకుని పరీక్షించడం జరుగుతుంది. పెల్విక్ ఎగ్జామినేషన్ ద్వారా కూడా సెర్వికల్ నార్మల్‌గా ఉన్నదీ లేనిదీ తెలుసుకోవచ్చు. సెర్వికల్ ప్రాంతం నుంచి ముక్క తీసి పరీక్ష(బయాప్సీ)చేయడం ద్వారా కూడా క్యాన్సర్‌ను నిర్ధారించుకోవచ్చు. ఒకవేళ క్యాన్సర్ ఉన్నట్లయితే ఎంత వరకు వ్యాపించింది తెలుసుకోవడానికి అల్ట్రా సౌండ్ అబ్డామిన్, ఎక్స్‌రే వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది.

హిస్ట్రెక్టమీ ఆపరేషన్
సెర్వికల్ క్యాన్సర్ సోకినపుడు మెదటి, రెండు దశలలో ఆపరేషన్ ద్వారా నయం చేయవచ్చు. రాడికల్ హిస్ట్రెక్టమీ అనే ఆపరేషన్ ద్వారా గర్భాశయం, యోనిపైభాగం, అండాశయాలు, పెల్విక్‌నోడ్స్‌ను తొలగించడం జరుగుతుంది. క్యాన్సర్ సోకిన భాగాలను తొలగించడం వల్ల త్వరగా కోలుకుంటారు. మూడు, నాలుగో దశలో గుర్తించినపుడు రేడియేషన్, కీయోథెరపీని ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాధి బాగా ముదిరినపుడు కీమోథెరపీ ఇవ్వడం ద్వారా మరికొంతకాలం జీవించే అవకాశం కల్పించవచ్చు.

ముందుగా గుర్తిస్తే మేలు
సెర్వికల్ క్యాన్సర్‌లో నాలుగు దశలుంటాయి. మొదటి దశలో సెర్విక్స్ దగ్గరే వైరస్ ప్రభావం ఉంటుంది. రెండవ దశలో కొంత విస్తరిస్తుంది. మూడవ దశలో కొన్ని భాగాలకు, నాలుగవ దశలో శరీరం మొత్తం వైరస్ విస్తరిస్తుంది. మొదటి దశలో గుర్తిస్తే 95 శాతం కంటే ఎక్కువ నయమయ్యే అవకాశాలుండగా, రెండవ దశలో 80 శాతం, మూడవ దశలో 40 శాతం, నాలుగో దశలో 15 శాతం వరకు నయమయ్యే అవకాశాలున్నాయి.

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్
నలభై సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్క మహిళ పాప్‌స్మియర్ పరీక్ష చేయించుకోవాలి. ఋతుక్రమం ప్రారంభమయినప్పటి నుంచి వివాహం అయ్యేలోగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ప్యూబర్టీ దశలో మూడు డోసుల వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా సెర్వికల్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ వల్ల ఎటువంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవు. జననాంగాల ప్రాంతంలో శుభ్రత పాటించాలి. సురక్షితమైన లైంగిక సంబంధాలు చాలా ముఖ్యం. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సెర్వికల్ క్యాన్సర్ బారినపడకుండా చూసుకోవచ్చు.

డా. కె. శ్రీకాంత్
సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్టు,

ఆధారము: ఆయురారోగ్యాలు బ్లాగ్

క్యాన్సర్‌ని ముందే కనిపెట్టే పెట్‌స్కాన్

క్యాన్సర్... వచ్చిందంటే ఇక అంతే అని భయపడే రోజులు పోయాయి. ఎంత క్లిష్టమైన క్యాన్సర్‌నైనా ఇప్పుడు ఆధునిక పద్ధతులతో మట్టికరిపించవచ్చు. చాలా సందర్భాల్లో కణితి ముదిరేవరకూ ఎటువంటి లక్షణాలూ కనిపించవు. ఇలాంటప్పుడు ట్యూమర్ ఏర్పడుతున్న ప్రారంభదశలోనే గుర్తించగలిగితే క్యాన్సర్ మూలాలు కూడా లేకుండా చేయవచ్చు. వ్యాధి నిర్ధారణ దగ్గరి నుంచి కీమోథెరపీ, రేడియోథెరపీ, ఇతర చికిత్సల వరకు అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్య పరిజ్ఞానం ద్వారా క్యాన్సర్‌ను ఎదుర్కోవడం ఇప్పుడు మరింత సులభం అయింది. తొలిదశలోనే ఉన్న క్యాన్సర్ కణితిని వెతికిపట్టుకోవడానికి వచ్చిన కొత్త పరికరమే హై డెఫినిషన్ పెట్ స్కాన్.

ఆదిలోనే...
అనారోగ్యం కలిగినప్పుడు శరీర ప్రక్రియల్లో మార్పులు వస్తాయి. ఆ తరువాతే మనకు పైకి వ్యాధి లక్షణాలు కన్పిస్తాయి. చాలా సందర్భాల్లో ఈ లక్షణాలు కనిపించేవరకు అనారోగ్యం కలిగిందని గుర్తించలేం. మొట్టమొదట జీవప్రక్రియల్లో కలుగుతున్న మార్పుల దశలోనే వాటిని గుర్తించగలిగితే మరింత త్వరగా చికిత్స అందించవచ్చు. ఈ మార్పులను ప్రారంభదశలోనే గుర్తిస్తుంది పెట్ స్కాన్.

ఉదాహరణకు క్యాన్సర్ విషయంలో కణితి ఏర్పడటానికి ముందు ఆ భాగంలో ఉండే కణాలు అనియంత్రంగా అసహజంగా పెరుగుతూ ఉంటాయి. అంటే కణవిభజన ప్రక్రియలో మార్పులు వస్తాయి. అలా అసాధారణమైన కణవిభజన ప్రక్రియను ముందుగానే గుర్తించగలిగితే క్యాన్సర్‌ని అంత సులువుగా తరిమేయవచ్చు. పెట్ స్కాన్ ఇలా వ్యాధి ప్రారంభదశలోనే జీవక్రియల్లో జరిగే మార్పులను గుర్తించగలుగుతుంది కాబట్ట్టే కణుతులు పూర్తిగా ఏర్పడకముందే క్యాన్సర్ ఉందనే విషయాన్ని కనుక్కోవచ్చు. అంతేకాదు ఎటువంటి చికిత్స అందించాలో కూడా నిర్ణయించుకోవడం సులభం అవుతుంది.

పెట్ స్కాన్ చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో ఏది అవసరమో అదే చికిత్స చేయవచ్చు. క్యాన్సర్ ఏ దశలో ఉందో కనుక్కోవడానికి చేసే ఇన్వేసివ్ పద ్ధతులను చేసే అవసరం ఉండదు. అంతేకాదు, క్యాన్సర్ దశను బట్టి చేసే శస్త్రచికిత్సలతో పనిలేదు. దీనివల్ల సమయం ఆదా కావడమే కాదు.. పేషెంటుకు అనవసరమైన ఇబ్బందులుండవు. క్యాన్సర్ కణాలు వేగంగా పెరుగుతుంటాయి కాబట్టి వీటి జీవక్రియ రేటు అధికంగా ఉంటుంది. ఈ కణాలు పెట్ స్కాన్‌లో తక్కువ సాంద్రతతో కనిపిస్తాయి.

ఎలా పనిచేస్తుంది?
పెట్, సిటి రెండింటి సాంకేతిక పరిజ్ఞానాన్నిఉపయోగించుకుని పనిచేస్తుంది పెట్ సిటి స్కాన్. ఈ పరీక్షకు దాదాపు 20 నిమిషాలు పడుతుంది. ముందుగా రేడియోలేబల్ రూపంలోని గ్లూకోజ్‌ని ట్రేసర్ ఇంజక్షన్‌గా ఇస్తారు. ఒక గంట సమయంలో ఈ ట్రేసర్ రోగి శరీరమంతా వ్యాపిస్తుంది. రోగి శరీరంలోకి ఎక్కించిన ఈ రేడియో యాక్టివిటీ ఆరు గంటల వరకు ఉంటుంది. ట్రేసర్ శరీరం అంతా వ్యాపించిన తరువాత స్కానింగ్ మొదలవుతుంది.

రోగి పడుకున్న బల్ల స్కానర్ కింద ముందుకు వెళ్తూ ఉంటుంది. సిటి చేయడానికి ఓ నిమిషం సమయం పడుతుంది. తరువాత పెట్ స్కానింగ్ వైపు రోగి పడుకున్న బల్ల కదులుతుంది. పెట్ స్కానర్‌లో రోగి చుఉట్టూ కొన్ని వందల రేడియేషన్ డిటెక్టర్లు ఉంటాయి. రోగికి ఎక్కించిన రేడియోన్యూక్లైడ్ ఎమిషన్స్ (ఉద్గారం)ని బట్టి ఆయా శరీర భాగాల జీవక్రియల రేటును కొలుస్తారు. ఈ సంకేతాలను 3 డైమెన్షనల్ చిత్రాలుగా తయారుచేస్తుంది కంప్యూటర్. ఇలా ప్రతి కణ జాల పనితీరును నిర్ధారిస్తారు.

ఎలా చేస్తారు?
పెట్ సిటి స్కాన్ ఫలితాలు వ్యాధి నిర్ధారణలో కీలకపాత్ర పోషిస్తాయి. క్యాన్సర్ ఉందా లేదా అన్న విషయమే కాకుండా ఎటువంటి చికిత్సను అందివ్వాలి.. ఎలా డీల్ చేయాలన్న అంశాల్లో స్పష్టమైన అవగాహనను అందిస్తాయి. అంటే వ్యాధి నిర్ధారణలోనే కాకుండా అందుబాటులో ఉన్న చికిత్సా పద్ధతుల్లో సరైనదాన్నిఎంచుకోవడాని, చికిత్స తరువాత పరిస్థితులను అంచనా వేయడానికి, చికిత్స పద్ధతులను మార్చడానికి కూడా ఇది మార్గనిర్దేశనం చేస్తుంది. స్కాన్ చే సేటప్పుడు మెత్తని బల్లపై పడుకోబెడతారు.

ట్యూబు ఆకారంలో ఉండే పెట్ సిటి స్కానర్ వైపు ఆ టేబుల్ నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. స్కాన్ చేసేటప్పుడు కదలకుండా పడుకోవాలి. ఏమాత్రం కదిలినా స్కాన్ సరిగ్గా రాదు. స్కానింగ్ సమయంలో చిన్న శబ్దం వస్తూ ఉంటుంది. బల్ల ముందుకు కదులుతున్న కొద్దీ ఎప్పటికప్పుడు చిత్రాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ పరీక్షకు 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుంది. అయితే మొత్తం పరీక్ష కోసం 2 నుంచి 3 గంటల వరకు ఇందుకోసం రోగి తన సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది.

స్కానింగ్ వేళ ఇలా...

- స్కాన్ చేసే సమయంలో కదలకూడదు. - స్కానింగ్ తరువాత డాక్టర్ చెప్పేవరకు ఏమీ తినకూడదు. తాగకూడదు.

- పరీక్ష అయిపోయిన తరువాత ద్రవాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న రేడిఫార్మసుటికల్ పదార్థం తొలగిపోతుంది. కాబట్టి దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు.

- పెట్ స్కాన్ తరువాత ఇత రులను కలవద్దేమో అని అపోహ పడుతుంటారు. కానీ రేడియోధార్మిక పదార్థం ఎంతోసేపు శరీరంలో ఉండదు కాబట్టి ఎటువంటి సమస్యా లేదు. కానీ అదనపు రక్షణ కోసం కొన్ని గంటల పాటు చిన్నారులు, గర్భిణులు దూరంగా మెలగడం మంచింది.

క్యాన్సర్ కాకుండా...
హై డెఫినిషన్ పెట్ స్కాన్ కేవలం క్యాన్సర్ నిర్ధారణలోనే కాదు.. గుండె, నాడీవ్యవస్థలకు సంబంధించిన సమస్యలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మూర్ఛవ్యాధి మూలాలను కనుక్కోవడంలో పెట్‌స్కాన్ సహాయపడుతుంది. మెదడులో ఏ ప్రదేశంలో సమస్య ఉందో కనిపెడుతుంది. అల్జీమర్ వ్యాధి నిర్ధారణలో స్పష్టమైన ఫలితాలను అందిస్తుంది. సాధారణ మతిమరుపుకి, అల్జీమర్స్‌కి తేడా పెట్ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు.

గుండెకు సంబంధించిన జీవక్రియను అధ్యయనం చేయడం ద్వారా పెట్ స్కాన్ హృద్రోగాలను నిర్ధారిస్తుంది. ఏయే రక్తనాళాల్లో రక్తప్రసరణ తక్కువగా ఉందో, ధమనులు బ్లాక్ అవడానికి ఏమేమి కారణం అవుతున్నాయో పసిగడుతుంది. అంతేకాదు దెబ్బతిన్న కండర భాగాన్ని, జీవం వున్న కండరాన్ని గుర్తిస్తుంది. మయోకార్డియల్ ఇన్‌ఫార్‌క్షన్ ఉన్న రోగులకి, రీవాస్కులరైజేషన్ చేయాల్సిన వాళ్లకి ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటుంది.

ఆధారము: ఆయురారోగ్యాలు బ్లాగ్

ఎముక క్యాన్సర్

శరీరం లోపల మనకు ఎముక లేకపోతే... అసలు మనకు రూపమే ఉండదు. ఎముకల సముదాయంతో అస్థిపంజరం మనకో అస్థిత్వాన్ని ఇస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆకృతికి మూలం అస్థిసముదాయమే. శరీరంలోని భాగమే కాబట్టి అన్ని అవయవాల్లాగే దానికీ క్యాన్సర్ల వంటి జబ్బులు వస్తాయి. కాకపోతే నేరుగా ఎముకకే క్యాన్సర్ రావడం కాస్తంత అరుదు. కానీ ఇతర క్యాన్సర్లు ఎముకలకు పాకడం  సాధారణం. ఎముకలకు వచ్చే క్యాన్సర్లు, వాటి లక్షణాలు, ఇటీవల ఈ రంగంలోనూ వచ్చిన ఆధునిక చికిత్సల వంటి అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ కథనం.

రకాలు...

బయటకు కనిపించే శరీరాకృతిని అలా నిలబెట్టి ఉంచడానికి తోడ్పడేవి ఎముకలే. వీటిలో మూడు రకాల కణాలు ఉంటాయి. మొదటివి ఆస్టియోబ్లాస్ట్స్ (ఎముక పెరిగే సమయంలో దీని నుంచే కొత్త కణాలు పుడుతుంటాయి); రెండోవి ఆస్టియోసైట్స్ (అంటే ఇవి ప్రధాన ఎముక కణాలన్నమాట), మూడో రకం కణాలను ఆస్టియోక్లాస్ట్స్ అంటారు. అంటే ఎముక కణాల జీవితం పూర్తయ్యాక వాటిని శిథిలం చేసే కణాలివి.

ఎముక క్యాన్సర్ గురించి తెలుసుకునే ముందు మనం క్యాన్సర్ గురించీ కాస్త తెలుసుకోవాలి. ఏ అవయవంలోని కణాలైనా ఒక నిర్దిష్ట క్రమంలో కాకుండా తమ ఇష్టం వచ్చినట్లుగా హానికరమైన రీతిలో పెరగడమే క్యాన్సర్. ఇది శరీరంలోని ఏ భాగానికైనా రావచ్చు. శరీరంలోని ఏ భాగంలో క్యాన్సర్ మొదలైతే... దాన్ని ఆ అవయవ క్యాన్సర్‌గా చెబుతారు. ఉదాహరణకు ఊపిరితిత్తులకు క్యాన్సర్ వస్తే దాన్ని లంగ్ క్యాన్సర్ అంటారు. ఏ భాగానికి ముందుగా క్యాన్సర్ వచ్చిందో దాన్ని ప్రైమరీ క్యాన్సర్ అంటారు. ఇక క్యాన్సర్ అన్నది ఆ భాగానికే పరిమితం కాకుండా అలా ఎటుపడితే అటు పెరిగిపోతుందన్న విషయం కూడా తెలిసిందే. ఇలా ఒక క్యాన్సర్ పెరగడాన్ని మెటస్టాసిస్ అంటారు.

క్యాన్సర్ అన్నది తొలుత ఎముకలోనే మొదలైతే దాన్ని ‘ప్రైమరీ బోన్ క్యాన్సర్’ అంటారు. ఒకవేళ శరీరంలోని వేరే ఏదైనా భాగానికి క్యాన్సర్ వచ్చి అది పాకే (మెటాస్టాటైజ్) క్రమంలో ఎముకకు చేరితే దాన్ని సెకండరీ బోన్ క్యాన్సర్ అంటారు. మామూలుగా ఈ క్యాన్సర్ ఏ ఎముకకైనా రావచ్చు. కానీ చిన్న ఎముకలతో పోలిస్తే పొడుగ్గా పెరిగేందుకు అవకాశం ఉన్న కాళ్లు, చేతుల ఎముకలకు రావడం ఒకింత ఎక్కువ.

సాధారణంగా నేరుగా ఎముకకు క్యాన్సర్ రావడం అరుదే అయినప్పటికీ... రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటివి వచ్చి... ఆ కణుతులు పెరుగుతూ ఎముకలకు పాకి... నిర్దిష్టమైన ఆకృతిలో సాఫీగా ఉండే ఎముకలపై సైతం కణుతులుగా ఏర్పడతాయి. ఇవి గాక... శరీరంలోని మృదు కణజాలమైన చర్మం, కండరాలు, నరాలూ-రక్తనాళాల సముదాయం, కొవ్వు కణాలు, ఎముకలోనే ఉండే మృదువైన కణజాలపు పొర సైనోవియమ్ వంటి వాటికి వచ్చే క్యాన్సర్లు మరో రకం.

లక్షణాలు

ఎముకలో నొప్పి: ఎముకని ఏదైనా భాగంలో కణితి పెరగగానే కనిపించే మొదటి లక్షణం నొప్పి. తొలుత ఈ నొప్పి రోజులోని ఏదో ఒక సమయంలో వస్తుంటుంది. క్యాన్సర్ పెరుగుతున్న కొద్దీ నొప్పి వచ్చే వ్యవధి కూడా పెరుగుతుంది. అయితే ప్రతి నొప్పినీ క్యాన్సర్‌గా భావించనవసరం లేదు. ఎందుకంటే ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ వంటి సాధారణ జబ్బుల్లోనూ ఎముకలూ, కీళ్లలో నొప్పులు వస్తాయి. ఇదే సమయంలో మరో విషయమూ గుర్తుంచుకోవాలి. ఒక్కోసారి ఎముకలకు వచ్చే కణుతులను ఆటల్లో తగిలిన గాయాలుగా పొరబడే అవకాశమూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా పరీక్ష చేయించుకుని, క్యాన్సర్ కాదని నిర్ధారణ అయితే నిశ్చింతగా ఉండాలి.

వాపు : ఎముకలో నొప్పి వచ్చే చోట, వాపు కూడా కనిపించవచ్చు.

ఎముక విరగడం : సాధారణంగా క్యాన్సర్ కణాలు వృద్ధి చెందిన ప్రాంతంలో ఎముక బలహీనంగా మారుతుంది. అందుకే అక్కడ అది తేలిగ్గా విరుగుతుంది.

శరీర కదలికలు తగ్గడం : సాధారణంగా ఎముక క్యాన్సర్‌లో కణితి కీళ్ల వద్ద వస్తే మామూలు కదలికలు సైతం తీవ్రమైన నొప్పిని కలగజేస్తాయి. కాబట్టి శరీర కదలికలు తగ్గుతాయి.

ఇతర లక్షణాలు: ఎముకల్లో నొప్పితో పాటు బరువు తగ్గడం వంటి అవాంఛిత పరిణామాలూ, నీరసం, నిస్సత్తువ కనిపిస్తాయి. క్యాన్సర్ ఇతర అవయవాలకు పాకితే సదరు అవయవానికి చెందిన లక్షణాలూ కనిపిస్తుంటాయి.

ఎముక మృదుకణజాల క్యాన్సర్లలో : ఎముకలోని మృదు కణజాలానికి క్యాన్సర్ వ్యాపించినప్పుడు తొలి దశల్లో లక్షణాలు అంతగా కనిపించకపోవచ్చు. ఎందుకంటే ఎముక మృదుకణజాలానికి సాగేగుణం (ఎలాస్టిసిటీ) ఎక్కువ. మనం దాన్ని కనుగొనే సమయానికి దాని పరిమాణం చాలా పెద్దగా పెరిగిపోయి ఉంటుంది. అందుకే ఈ తరహా క్యాన్సర్లలో మొదటి లక్షణం... నొప్పి లేని గడ్డ. ఈ గడ్డ పెరుగుతూ పోతున్నకొద్దీ నరాలనూ, కండరాలనూ నొక్కుతూ వాటిపై ఒత్తిడి పెంచుతుంది. దాంతో నొప్పి కలుగుతుంది.

ప్రైమరీ బోన్ క్యాన్సర్
క్యాన్సర్ ముందుగా ఎముకలోనే పుట్టడాన్ని ప్రైమరీ క్యాన్సర్ అంటారన్నది తెలిసిందే. ఈ తరహా క్యాన్సర్‌ను ‘సార్కోమా’ అంటారు. ఇందులోని మరికొన్ని రకాలివి...

ఆస్టియోసార్కోమా: ఎముకలోనే పుడుతుంది కాబట్టి దీన్ని ‘ఆస్టియోజెనిక్ సార్కోమా’ అని కూడా అంటారు. ఎముక క్యాన్సర్లలో ఇది అత్యంత సాధారణంగా కనిపిస్తుంది. ప్రధానంగా భుజాలు, కాళ్లు, పృష్టభాగం (పెల్విస్) ప్రాంతపు ఎముకల్లో 10 నుంచి 30 ఏళ్ల వారికి వచ్చే అవకాశాలు ఎక్కువ.

కాండ్రోసార్కోమా : ఎముకల చివర్లో మృదువైన అస్థికణజాలం ఉంటుంది. దీన్నే కార్టిలేజ్ అంటారు. ఈ కార్టిలేజ్‌లో వచ్చే క్యాన్సర్‌ను కాండ్రోసార్కోమా అంటారు. సాధారణంగా ఇది 20 ఏళ్లలోపు వారికి చాలా అరుదు. అయితే వయసుతో పాటు ఎదుగుతున్న క్రమంలో ఇది వచ్చే అవకాశాలు ఒకింత ఎక్కువ.

ఎవింగ్స్ సార్కోమా : ఇది ఎముకల్లోనూ మొదలుకావచ్చు లేదా కండరాల్లోనూ ఆవిర్భవించవచ్చు. పిల్లలు, టీనేజర్లలో ఎక్కువగా కనిపించే సాధారణ క్యాన్సర్లలో దీనిని మూడో స్థానం.

ఫైబ్రోసార్కోమా అండ్ మ్యాలిగ్నెంట్ ఫైబ్రస్ హిస్టియోసైటోమా : ఈ రెండు రకాల క్యాన్సర్లూ వృద్ధుల ఎముకల చివర్లలో ఉండే మృదుకణజాలంలో మొదలవుతాయి. ప్రధానంగా భుజాలు, కాళ్లు, దవడ ఎముకల్లో ఈ తరహా క్యాన్సర్ల మొదలవుతాయి.

జెయింట్ సెల్ ట్యూమర్ ఆఫ్ బోన్: ఈ తరహా క్యాన్సర్‌లలో నిరపాయకరమైనవీ ఉంటాయి. హాని చేసేవీ ఉంటాయి. అయితే అపాయం కలిగించని తరహావే ఎక్కువ. సాధారణంగా యుక్తవయస్కులు, మధ్యవయస్కుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. చాలావరకు పాకకుండా స్థిరంగా ఉంటాయి. శస్త్రచికిత్స తర్వాత మళ్లీ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ.

కాడోమా: సాధారణంగా 30 ఏళ్లు దాటినవారిలో ఇది వెన్నెముకకుగానీ లేదా పుర్రె కింది భాగపు ఎముకలకు గాని వచ్చే క్యాన్సర్. మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఇది వచ్చే అవకాశాలు రెండు రెట్లు ఎక్కువ. చాలా నెమ్మదిగా పెరుగుతాయి. కానీ విస్తరించవు. అయితే శస్త్రచికిత్స తర్వాత మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువ. అప్పుడవి ఊపిరితిత్తులకూ, కాలేయానికీ, లింఫ్‌నోడ్స్‌కూ వ్యాపిస్తాయి.

ఎముక క్యాన్సర్ - దశలు

ఎముక క్యాన్సర్‌ను అక్కడి నుంచి చిన్న ముక్క తీసి (బయాప్సీ), పరీక్షించి నిర్ధారణ చేస్తారు. అది ఏ మేరకు పాకింది, ఎంత విస్తరించిందన్న అంశాల ఆధారంగా క్యాన్సర్ ఏ దశలో ఉందన్నది నిర్ధారణ చేస్తారు. బయాప్సీ ద్వారా క్యాన్సర్ దశలో ఉందన్న విషయాన్ని నిర్ణయించడం పైనే చికిత్స ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఎముకకు క్యాన్సర్ అని, అది ఏ దశలో ఉందన్నది నిర్ధారణ అయితే ఇతర ఆర్థోపెడిక్ సర్జన్లతోనూ సంప్రదించి, రోగిని బతికించడానికి సదరు అవయవాన్ని ఏ మేరకు తొలగించాలన్న విషయాన్నీ నిర్ధారణ చేస్తారు.

సాధారణంగా ఎముక క్యాన్సర్ ఏ దశలో ఉందనే విషయాన్ని నిర్ధారణ చేయడానికి అమెరికన్ జాయింట్ కమిషన్ ఆన్ క్యాన్సర్ (ఏజేసీసీ)  రూపొందించిన మార్గదర్శకాలను పాటిస్తున్నారు. ఇందులో ట్యూమర్ (టీ), లింఫ్ నోడ్ (ఎన్), మెటాస్టాసిస్ (ఎమ్) అనే మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. దీన్ని బట్టి క్యాన్సర్ ఏ దశ (గ్రేడ్)లో ఉందో తెలుసుకుంటారు. అందుకే ఈ దశను ‘జీ’ (గ్రేడ్) అనే ఇంగ్లిష్ అక్షరం ద్వారా సూచిస్తారు. జీ1, జీ2 అనే దశలో తక్కువ తీవ్రమైనవిగానూ, జీ3, జీ4 దశలో చాలా తీవ్రమైనవిగానూ నిర్ణయిస్తారు. వ్యాధి తీవ్రత ఆధారంగా చికిత్స ప్రక్రియలు మారుతుంటాయి.

సెకండరీ బోన్ క్యాన్సర్
ఇక ఈ తరహా క్యాన్సర్లు శరీరంలోని ఏ భాగంలోనైనా ఆవిర్భవించి, ఎముకకు పాకితే దాన్ని సెకండరీ క్యాన్సర్‌గా చెప్పుకోవచ్చు. రక్తప్రవాహంతో గానీ, లింఫ్ ప్రవాహంతోగానీ క్యాన్సర్ కణాలు ఎముకకు పాకి అక్కడ పెరుగుతాయి. ఈ తరహా క్యాన్సర్ల సాధారణంగా శరీరం మధ్యభాగంలో ఉండే ఎముకలు అంటే పృష్ఠభాగం (పెల్విస్)లోగానీ వెన్నెముక (స్పైన్)లోగాని కనిపిస్తాయి.

చికిత్స ప్రక్రియలు

ఎముక క్యాన్సర్‌కు ఇప్పటివరకూ అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయ చికిత్స ప్రక్రియలు... శస్త్రచికిత్స, కీమోథెరపీ, ఫ్రాక్షనేటెడ్ డోస్ కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ.

శస్త్రచికిత్స : ఇక ఎముకల మృదు కణజాలానికి క్యాన్సర్ వస్తే అనుసరించే ప్రక్రియల్లో శస్త్రచికిత్స చాలా సాధారణం. ఈ శస్త్రచికిత్సల్లోనూ తొలిదశలో క్యాన్సర్‌ను గుర్తించినా లేదా చుట్టూ ఉన్న మృదుకణజాలానికే క్యాన్సర్ పరిమితమైనా... శస్త్రచికిత్స ప్రక్రియను అనుసరించినప్పటికీ, వ్యాధి సోకిన అవయవాన్ని సాధ్యమైనంత వరకు తొలగించకుండా రక్షించడానికే ప్రయత్నిస్తారు. ఒకవేళ క్యాన్సర్ ముదిరిపోయిన దశలో ఉంటే అప్పుడు కూడా అవయవాన్ని తొలగించాల్సిన పరిస్థితుల్లోనూ... కేవలం ఎముకను మాత్రమే తొలగించి, దాని స్థానంలో లోహంతో తయారు చేసిన, కొత్తదైన కృత్రిమ ఎముకను అమర్చి అవయవం ఎప్పటిలాగే ఉంచేలా చూస్తారు.

ఒకవేళ క్యాన్సర్ గనక లింఫ్‌నోడ్స్‌కు చేరితే... (లింఫ్‌నోడ్స్... అన్ని అవయవాలకూ క్యాన్సర్‌ను చేర్చే గేట్ వే లాంటివి కాబట్టి) వాటిని పూర్తిగా తొలగిస్తారు. కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ కణజాలాన్ని తొలగించాక... ఆ అవయవం మునుపటి ఆకృతి కోల్పోతే... అది ముందులాగే ఉండేలా చూసేందుకు ‘రీ-కన్‌స్ట్రక్టివ్ సర్జరీ లేదా రీప్లేస్‌మెంట్ సర్జరీ’ని నిర్వహిస్తారు. ఇక క్యాన్సర్ కారణంగా ఎముకలకు తీవ్రమైన నొప్పి వస్తే... చివరి ఉపశమనంగా నిర్వహించే శస్త్రచికిత్సను ‘ప్యాలియేటివ్ సర్జరీ’ అంటారు.

ఇందులో ఏ రకమైన శస్త్రచికిత్సను ఎంపిక చేయాలన్న అంశం... వ్యాధి ఏ దశలో ఉంది, ఎముకలోని ఏ ప్రాంతంలో ఉంది, ఆ క్యాన్సర్ గడ్డ సైజ్ ఎంత, రోగి తాలూకు ఇతర ఆరోగ్యపరిస్థితులేమిటి వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. దీనితో పాటు అవసరాన్ని బట్టి కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ కూడా ఇవ్వాలి.

సర్జరీ అవసరం లేకుండా చేసే చికిత్సలు: క్యాన్సర్ గడ్డ ఏ రకానికి చెందినది, అది ఏ ప్రాంతంలో ఉంది అన్న అంశం ఆధారంగా చేయాల్సిన చికిత్స-ప్రణాళికను నిర్ణయిస్తారన్నది తెలిసిందే. ఒకవేళ శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం లేని సందర్భాల్లో క్యాన్సర్ కణాలను నాశనం చేసే బీమ్‌రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ వంటి మార్గాలు అనుసరిస్తారు. అయితే క్యాన్సర్ ఉన్న ప్రాంతం, గ్రేడ్, రోగి వయసు, ఆరోగ్యపరిస్థితి వంటి అనేక అంశాల ఆధారంగా శస్త్రచికిత్స, కీమో, రేడియేషన్ థెరపీలను సంయుక్తంగా ఉపయోగించుకుంటారు.

అవయవాన్ని కాపాడటమే ప్రధాన లక్ష్యం... ఎల్‌ఎస్‌ఎస్
కాలి ఎముక లేదా చేతి ఎముక ఇలా ఏ ఎముకకు క్యాన్సర్ సోకినా... డాక్టర్ల ప్రధాన లక్ష్యం సాధ్యమైనంత వరకు ఆ అవయవాన్ని కోల్పోకుండా కాపాడటమే. శస్త్రచికిత్స ప్రక్రియను ఎంపిక చేసుకున్నప్పటికీ ఇందుకోసమే డాక్టర్లు శ్రమిస్తారు. డాక్టర్ల ఈ ఉద్దేశాన్నే వైద్యపరిభాషలో ‘లింబ్ సాల్వేజ్ సర్జరీ’ (ఎల్.ఎస్.ఎస్.)అంటారు. ఇందులో రెండు అంచెలుంటాయి. మొదటి అంచెలో ఆరోగ్యకరమైన భాగాన్ని వీలైనంతగా రక్షించుకుంటూ... క్యాన్సర్‌కు గురైన భాగాన్ని పూర్తిగా తొలగించడం. రెండో అంచెలో... ఇలా తొలగింపు తర్వాత కోల్పోయిన భాగాన్ని పునర్నిర్మించడం.

ఈ పునర్నిర్మాణం కోసం రకరకాల మార్గాలు అవలంబిస్తారు. ఉదాహరణకు... కోల్పోయిన ఎముక స్థానంలో లోహంతో చేసిన అలాంటి ఆకృతినే అమర్చుతారు. ఇలా కృత్రిమంగా అమర్చే లోహభాగాన్ని ‘ప్రోస్థెసిస్’ అంటారు. ఒక్కోసారి మొత్తం ఎముకే... లోహంతో తయారు చేసి తొలగించిన ఎముక స్థానంలో దీన్ని అమరుస్తారు. ఇది ఒకరకంగా చెప్పాలంటే ఎముక మార్పిడి (బోన్ ట్రాన్స్‌ప్లాంట్) చికిత్స అన్నమాట. ఇలా చేయడానికి అనుగుణంగా ఇప్పుడు సర్జన్సకు రకరకాల లోహాలు అంటే... మృదులాస్థి కోసం మృదువైన లోహాలతో తయారైనవీ (వీటిని సాఫ్ట్ టిష్యూ అల్లోగ్రాఫ్ట్ప్ అంటారు); గట్టి ఎముకల కోసం గట్టి లోహాలతో రూపొందించనవీ... రోగి ఎముక పరిమాణం ఎంతుందో అంతే సైజ్‌లో ఉన్నవీ లభ్యమవుతున్నాయి.

వయసుతో పాటూ ఎదిగే కృత్రిమ ఎముకలు...
ఇప్పుడు వైద్యవిజ్ఞానశాస్త్రంలో ఈ శస్త్రచికిత్స ప్రక్రియల పురోగతి ఎంతగా ఉందంటే... ఎదిగే వయసులో ఉన్న ఒక అబ్బాయికి ఎముక క్యాన్సర్ సోకి... ఎముకను తొలగించాల్సి వస్తే... అతడిది పెరిగే వయసు కాబట్టి... పెరుగుతున్న కొద్దీ లోహపు ఎముక కూడా పెరిగేలా వ్యాప్తిచెందే కృత్రిమ ఎముకలూ ఉన్నాయి. రోగి అవయవాన్ని రక్షించడం కోసమే ఈ తరహా ఉపకరణాలను రూపొందించారన్నమాట.

శస్త్రచికిత్సల్లో మరో రెండు ప్రక్రియలు...
ఆర్థ్రోడెసిస్: ఈ ప్రక్రియలో రోగి నుంచే తీసుకున్న ఎముకను గానీ... లేదా ఎముకల బ్యాంకులో అతడికి సరిపడే ఎముకనుగానీ స్వీకరించి ఎముక మార్పిడి చికిత్స చేస్తారు. ఆర్థ్రోడెసిస్ ప్రక్రియను అనుసరిస్తే... కీలు వద్ద కూడా ఎముక వంగదు. ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. కానీ రోగి అవయవాన్ని కోల్పోకుండా ఉండే సౌలభ్యం మాత్రం ఉంటుంది.

ఆర్థ్రోప్లాస్టీ : ఇందులో రోగి నుంచి తొలగించిన ఎముక పరిణామం, అతడిలో సరిగ్గా ఇమిడిపోగల తత్వం వంటి సౌకర్యాలు ఉంటాయి.

ప్రతికూలతలూ ఉండవచ్చు...
అయితే ఆర్థ్రోడెసిస్ లేదా ఆర్థ్రోప్లాస్టీ... ఇలా ప్రక్రియ ఏదైనప్పటికీ కృత్రిమ  ఎముక మార్పిడి చికిత్స తర్వాత ఎముక అరగడం, ప్రమాదాల వంటివి జరిగినప్పుడు ఎముక విరగడం వంటి ప్రతికూలతలూ ఉంటాయి. ఇక కృత్రిమ ఎముకల అమరిక అన్నది రోగులందరికీ సాధ్యం కాకపోవచ్చు. పరిస్థితులను బట్టి అనుకూలతలు లేకపోతే కొందరిలో అవయవాన్ని తొలగించాల్సిన పరిస్థితీ ఉండవచ్చు. ఇవన్నీ రోగి పరిస్థితిని బట్టి చికిత్స చేసే డాక్టర్ల బృందం సంయుక్తంగా తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

అలాగే ఎముక మార్పిడి విషయంలో ఎముకలను ఇతర వ్యక్తుల నుంచి సేకరించి ఉంచిన ‘బోన్ బ్యాంకు’ నుంచి స్వీకరించి, దాన్ని రోగి శరీరంలో అమర్చితే రోగి దేహం దాన్ని ఆమోదించకపోవడం వంటి ప్రతికూలతలూ ఉంటాయి. అరుగుదల రేటూ ఎక్కువే. కానీ లోహపు ప్రోస్థసిస్ వంటివి అమరిస్తే మాత్రం ఇలాంటి కాంప్లికేషన్లకు అవకాశం తక్కువ.

ఇన్ని సౌకర్యాలూ, ఆధునిక పరిజ్ఞానం, వయసు ఎదిగే కొద్దీ పెరిగే కృత్రిమ ఎముకల అందుబాటు వంటి ఎన్నెన్నో మార్గాలు ఉన్నప్పటికీ డాక్టర్ ప్రధాన ధ్యేయం రోగి ప్రాణాలను రక్షించడమే. ఆ తర్వాతే సాధ్యమైనంత వరకు మిగతా అంశాలను పరిగణనలోకి తీసుకుని, రోగి మునపటి సౌకర్యాలను వీలైనంతగా పొందేలా డాక్టర్లు చూస్తారు. దీనితో పాటు రోగికి అవసరమైన ఆహారం (న్యూట్రిషన్), నొప్పి తగ్గించడం (పెయిన్ మేనేజ్‌మెంట్), కదలికలను మునుపటిలా చేసే స్వాభావిక చికిత్స (నేచురోపతి మెడిసిన్), ఫిజియోథెరపీ, ఆధ్యాత్మిక అంశాల బోధన వంటి అనేక విషయాలతో రోగికి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.

ఆధారము: సాక్షి

ఎముక క్యాన్సర్‌కు హోమియో వైద్యం

క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ప్రారంభదశలోనే గుర్తించి, అనుభవజ్ఞుడైన హోమియో వైద్యుని ఆధ్వర్యంలో చికిత్స జరిగితే వ్యాధిని అదుపులో ఉంచవచ్చు. కాన్‌స్టిట్యూషనల్ హోమియోవైద్యం ద్వారా క్యాన్సర్ కణాన్ని నియంత్రణలో ఉంచవచ్చు. రేడియోథెరపీ, కీమోథెరపీ తీసుకుంటూనే హోమియో చికిత్సనూ అనుసరిస్తే... ఇతర దుష్ర్పభావాలు రాకుండా అరికట్టవచ్చు.

కొన్ని ముఖ్యమైన హోమియో మందులు
హెక్లాలావా: ‘ఆస్టియోసార్కోమా’ వంటి ఎముక క్యాన్సర్, దవడ ఎముక, చీలమండ లోపలి ఎముక (టిబియా)లో వచ్చే క్యాన్సర్లకు వాడదగిన ఔషధం.

హైడ్రాస్టిస్ కెనడెన్సిస్: పూర్తి క్యాన్సర్ దశలో వాడదగిన ఔషధం. ఇది ముఖ్యంగా ఎముకలు, నాలుక, ఉదరం, జననాంగాలపై వచ్చే క్యాన్సర్లలో ఉపయోగపడుతుంది. క్యాన్సర్ చికిత్స తర్వాత వచ్చే కండరాల బలహీనతను అధిగమించడానికి ఉపయోగపడుతూనే కండరాల పటుత్వాన్నీ పెంచుతుంది.

కాల్కేరియా ఫాస్: వివిధ రకాల క్యాన్సర్ మందులు పూర్తిస్థాయిలో పనిచేయకుండా ఉన్నప్పుడు వాటిని క్రియాశీలం చేసేందుకు కాల్కేరియా ఫాస్ చక్కగా పనిచేస్తుంది.  చిన్నపిల్లల్లో ఎదుగుదల లోపాలు లేదా ఎముకల ఫ్రాక్చర్లు త్వరగా తగ్గిపోడానికీ, చిన్నపిల్లల్లో వచ్చే ఎముక క్యాన్సర్లు తగ్గడానికి పనిచేస్తుంది.

మెజీరియం: ఇది ఎముక, దాని చుట్టూ ఉండే కవచంపైన ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఎముక నుంచి ఏర్పడే ద్రవంతో కూడిన సిస్టిక్ ట్యూమర్, నుదురు, దవడ ఎముకల్లో వచ్చే చీముగడ్డల నివారణకు ఉపయోగపడుతుంది. సవాయిరోగాన్ని (సిఫిలిస్‌ను) అణచివేయడం వల్ల వచ్చే కపాల వాపు, కపాలంపై వచ్చే కణుతులకు చక్కగా పనిచేస్తుంది.

ఫాస్ఫరస్: ఎముక క్యాన్సర్ ముఖ్యంగా తొడ ఎముక (ఫీమర్), కాలిచీలమండ లోపలి ఎముక (టిబియా) పెరుగుదల ఉన్నవారిలో, చీముతో కూడిన కాలి పుండ్లు ఉన్నవారిలో  ఉపయోగపడుతుంది. క్యాన్సర్ కారణంగా అధిక రక్తస్రావం జరగడం, ఎముక చుట్టూ ఉండే కవచం పుండుగా మారి ఊడిపోవడం... ఎముక గరుకుగా మారడం, మంటతో కూడిన నొప్పులు, జ్వరం, చల్లటిపదార్థాలు తీసుకోవాలనిపించడం, అస్థిమితం వంటి వాటికి ఇది మంచి మందు.

రేడియం బ్రోమాటం: మొటిమలు, డర్మటైటిస్ అనే చర్మవ్యాధి కి, ఎముకల్లో నొప్పులు, కీళ్లనొప్పులు, ఎముక క్యాన్సర్‌కు  పనిచేస్తుంది.

ఆరమ్ మెట్: క్యాన్సర్‌తో మనోవ్యాకులతకు గురై ఆత్మహత్య చేసుకోవాలనిపించేవారికి పనిచేస్తుంది.

సింఫైటమ్: అన్నిరకాల ఎముక సంబంధ వ్యాధులు... ముఖ్యంగా ఎముక వాపు, దవడవాపు, సార్కోమా వంటి సమస్యలకు వాడదగిన మందు. అంతేకాకుండా సింఫైటమ్‌ను ఎముక చీలికలు లేదా ఫ్రాక్చర్లు త్వరగా మానడానికి ప్రథమ చికిత్సగా వాడతారు. నరాల నొప్పి, మోకాలి నొప్పి, టెండన్స్ ఇబ్బందులకు కూడా ఇది చక్కగా పనిచేస్తుంది.

ఆధారము: సాక్షి

వివిధ రకాల క్యాన్సర్ వ్యాధులు

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్

సర్వైకల్ కేన్సర్ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) ప్రపంచంలో మరెక్కడా లేనంతగా భారతదేశంలో మహిళలను హతమారుస్తోంది. గణనీయంగా ముందుగానే నిరోధించగల వ్యాధి ఇది అని నిపుణులు చెబుతున్నారు.

నిరోధక టీకాలు

కేన్సర్ రాకుండా వాక్సిన్ ద్వారా ముందుగానే నిరోధించే అవకాశం రూపొందిన తొలి కేన్సర్ రకం ఇదే. ఇందుకుగాను ఒకటి కాదు రెండు వ్యాక్సీన్లు ఉన్నాయి. అయినా కూడా భారతదేశంలో ఇది ఏటా 1,32,000 మంది మహిళలకు సోకుతోందని, ఇందులో 72వేల మంది దీనితో పోరాటంలో చనువు చాలిస్తున్నట్టు సర్వైకల్ కేన్సర్ ప్రీ కొలియేషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీన్ని పూర్తిగా నిరోధించలేనప్పటికీ చక్కటి అవగాహన పెంపొందించుకోవడం ద్వారా దీనివల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు.

దేశంలో ఏటా 7 లక్షల మేరకు కేన్సర్ నూతన కేసులు బయటపడుతుండగా 3.5 లక్షలమంది కేన్సర్ కారణంగా మరణిస్తున్నారు. ఈ 7 లక్షల నూతన కేసుల్లో 2.3 లక్షలకుపైగా కేసులు (33 శాతం) పొగాకు వినియోగానికి సంబంధించినవి.

గర్భాశయాన్ని మరియు జననాంగాన్ని కలిపే సెర్విక్స్ (గర్భాశయ ముఖద్వారం) యొక్క కణజాలంలో చోటుచేసుకునే కేన్సర్‌ను సర్వైకల్ కేన్సర్ అని అంటారు. ఇది చాలా నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. ఎలాంటి లక్షణాలను కనబరచకపోవచ్చు. క్రమం తప్పని పాప్ టెస్ట్‌ల (సెర్విక్స్ నుంచి కణ జాలాన్ని సేకరించి మైక్రోస్కోప్ కింద పరీక్షించడం) ద్వారా దీన్ని గుర్తించవచ్చు. హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) ఇన్‌ఫెక్షన్ దీనికి ప్రధాన కారణం.

సర్వైకల్ కేన్సర్ మొదట్లో ఎలాంటి లక్షణాలకు కారణం కాకపోవచ్చు కానీ జననాంగంనుంచి అసాధారణ బ్లీడింగ్ వంటి లక్షణాలు కన్పించవచ్చు. మరికొన్ని సందర్భాల్లో కేన్సర్ బాగా ముదిరిపోయే వరకు కూడా ఎలాంటి లక్షణాలు కనపడకపోవచ్చు. ఆ తరువాత మాత్రం పొత్తికడుపు నొప్పి, బ్లీడింగ్ లాంటివి చోటుచేసుకుంటాయి. కలయిక అనంతరం పరిశుభ్రం చేసుకునేటప్పుడు, పెల్విక్ ఎగ్జామ్‌లో సాధారణ రుతుచక్రంలో కనిపించే మాదిరిగా బ్లీడింగ్ కనిపిస్తుంది. పీరియడ్స్ ఎక్కువ రోజులు కొనసాగుతాయి. గతంలో కన్నా పరిస్థితి భారంగా వుంటుంది.

ఈ హెచ్‌పివి ట్రాన్స్‌మిషన్‌కు ప్రధాన కారణం లైంగిక సంపర్కం కారణంగా వ్యాప్తి చెందే వైరస్. సాధారణంగా మహిళలు ఈ హెచ్‌పివి ఇన్‌ఫెక్షన్‌ను ఎదుర్కొనే శక్తిని కలిగి వుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఈ వైరస్ కేన్సర్‌కు దారి తీస్తుంది. పొగ తాగే మహిళలకు, ఎక్కువమంది పిల్లలు వున్న స్ర్తిలకు, దీర్ఘకాలంపాటు కుటుంబ నియంత్రణ మాత్రలు ఉపయోగించే వారు లేదా హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్ ఉన్నవారికి సర్వైకల్ కేన్సర్ వచ్చే అవకాశాలు అధికంగా వుంటాయి.

ఈ వ్యాధి కొంతమంది మహిళలకు మాత్రమే ఎందుకు వస్తుంది, ఇతరులకెందుకు రాదు అన్న విషయాన్ని వైద్యులు కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. నిర్దిష్ట ముప్పు అవకాశాలు గల మహిళలు మిగతావారికన్నా ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు వున్నాయని మాత్రమే మనం చెప్పగలం. ముప్పు అవకాశం అనేది ఒక వ్యాధి వచ్చే అవకాశాన్ని అధికం చేసేది. హెచ్‌పీవీ అనే వైరస్‌తో వచ్చే ఇన్‌ఫెక్షన్ దాదాపుగా అన్నిరకాల సర్వైకల్ కేన్సర్‌లకు ప్రధాన కారణమని అధ్యయనాల్లో వెల్లడైంది. పలువురు వయోజనులు తమ జీవితంలో ఏదో ఒక దశలో హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్‌కు గురవుతునే వున్నా చాలా ఇన్‌ఫెక్షన్లను తమకు తాముగానే వారు నిరోధించుకోగలుగుతారు. ఈ విధంగా తొలగిపోని హెచ్‌పివి ఇన్‌ఫెక్షన్ కొంతమంది మహిళల్లో సెర్వికల్ కేన్సర్‌కు కారణమవుతుంది.

సర్వైకల్ కేన్సర్‌ను నిర్ధారించేందుకు వివిధ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి.

ల్యాబ్ టెస్టులు: సెర్విక్స్‌నుంచి డాక్టర్ లేదా నర్స్ నమూనా కణజాలాన్ని సేకరిస్తారు. పాప్‌టెస్ట్ కోసం, ఈ నమూనాలో సర్వైకల్ కేన్సర్ కణాలు లేదా అసాధారణ కణాల ఉనికి కోసం ల్యాబ్‌లో పరీక్షిస్తారు. సకాలంలో చికిత్స అందకపోతే ఈ కణాలు తరువాతి కాలంలో కేన్సర్‌గా మారుతాయి.

సర్వైకల్ ఎగ్జామ్: సెర్విక్స్‌ను చూసేందుకు డాక్టర్ కొలోస్కోప్ వినియోగిస్తారు. ఈ కొలోస్కోప్‌లో ప్రకాశవంతమైన కాంతిని అందించే లైట్‌తో కూడిన మాగ్నిఫైయింగ్ లెన్స్ ఉంటాయి. దీంతో కణజాలాన్ని సులభంగా చూడవచ్చు.

టిష్యూ శాంపిల్: కేన్సర్ కణాల కోసం టిష్యూలను తొలగించి చూడడాన్ని బయోప్సీ అంటారు. దీనికి తొలిదశలో చికిత్స సాధారణంగా సర్జరీ (లోకల్ ఎగ్జిషన్‌తో సహా) మరియు వ్యాధి ముదిరిన దశలో కేమోథెరపీ మ రియు రేడియో థెరపీ అయి వుంటుంది. ఇది సర్జరీ, రేడియేషన్ థెరపీ, కేమో థెరపీ లేదా వాటి సమ్మేళనంగా ఉంటుంది. చికిత్స ఎంపిక అవకాశం ట్యూమర్ పరిమాణంపై, కేన్సర్ విస్తరణ మరియు గర్భం దాల్చాలనుకోవడం లాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

దీర్ఘకాలికంగా గర్భ నిరోధక మాత్రలు వాడుతున్న వారిలో సర్వైకల్ కేన్సర్ ముప్పు అవకాశం అధికంగా ఉంటుంది. ఈ మాత్రలు వాడుతున్న కాలంలో ముప్పు అవకాశం అధికంగా వున్నప్పటికీ, అవి వాడడం మానేసిన తరువాత ఈ ముప్పు అవకాశం తగ్గుతూ వస్తుందని అధ్యయనాల్లో తేలింది.
పూర్తిగా నిరోధించ దగిన ఈ వ్యాధి దిగువ, మధ్యతరగతి ఆదాయ వర్గాలకు చెందిన దేశాల మహిళలకు సంబంధించి రెండో అతి పెద్ద కేన్సర్ కిల్లర్‌గా మారింది. జీవితంలో కీలక దశలో వీరు మరణిస్తున్నారు.

-డా.ఎం.బాబయ్య
అమెరికన్ అంకాలజీ ఇన్‌స్టిట్యూట్ మెడికల్ డైరెక్టర్

పిల్లలకు పాలివ్వకపోవడం వల్ల క్యాన్సర్‌ రావచ్చు

క్యాన్సర్‌… మన దేశంలో ప్రతి ఎనిమిదిమందిలో ఒకరు, యాభై ఐదేళ్ల వయస్సు దాటిన వారు క్యాన్సర్‌తో బాధపడు తున్నారు. ప్రస్తుతం సంభవిస్తున్న మరణాల్లో ఎక్కువగా గుండె జబ్బు తర్వాత రెండో స్థానంలో ఉన్నది క్యాన్సరే. ఇది శరీరంలో ఏ భాగంలోనైనా రావచ్చు. కానీ సాధారణంగా మగవాళ్లల్లో ఓరల్‌ (నోటికి) సంబంధించిన క్యాన్సర్‌, ఊపిరితిత్తుల క్యాన్సర్‌, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ఎక్కువగా కనిపిస్తుంటాయి.

ఆడవాళ్లల్లో రొమ్ము క్యాన్సర్‌, గర్భాశయ క్యాన్సర్‌ ఎక్కువ. అభివృద్ధి చెందిన దేశాల్లోని మహిళల్లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఎక్కువ. వివాహం చేసుకోకపోవడం, పిల్లలకు పాలివ్వకపోవడం లాంటి కారణాల వల్ల కూడా క్యాన్సర్‌ రావచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో, వర్థమాన దేశాల్లో గర్భాశయ క్యాన్సర్‌ ఎక్కువ. ఇందుకు ప్రధాన కారణం పరిశుభ్రత లోపించడం, చిన్న వయసులోనే లైంగిక చర్యలో పాల్గొనడం, వెనువెంటనే గర్భధారణ, ఎక్కువసార్లు ప్రసవాలు అవడంతోపాటు ఇంకా అనేక కారణాలున్నాయి. యోని నుంచి రక్తస్రావం, కడుపు కింది భాగంలో, నడుము కింది భాగంలో నొప్పి, బహిష్టు ఆగిన తర్వాత రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే క్యాన్సర్‌గా అనుమానించి, వైద్యులతో నిర్ధారించుకోవాలి.

మానవ శరీరమంతా కణ నిర్మితం. ఏ అవయవం చుట్టూ ఉన్న కణాలు ఆ అవయవాలు చేసే పనికే తోడ్పడతాయి. మూలకణాలు అనే మరోరకం కణాలు శరీరంలోని ఏ ప్రాంతంలో వేస్తే ఆ కణాలుగా మారుతాయి. ఇవి శరీరంలో ఎక్కువగా ఎముకల్లో, భుజాల్లో ఉంటాయి. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. కణాల పనులే కాదు. పరిమాణం కూడా పద్ధతిగానే ఉంటుంది. రోజూ మన శరీరంలో ఎన్ని కణాలు చనిపోతుంటాయో అంతేస్థాయిలో కొత్త కణాలు పుడుతుంటాయి. అలా ఉత్పత్తి కాకుండా అదుపు తప్పిన కణవిభజననే మ్యుటేషన్స్‌ అంటారు. ఇది ప్రాణాంతకం కాదు. కణిత బాగా పెద్దదైతే శస్త్ర చికిత్సతో తొలగించవచ్చు. కొన్నిసార్లు అసహజ కణాల ఉత్పత్తి శరీరంలో ఒకేచోట కాకుండా, ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందుతుంటాయి. వీటిని మాలిగెంట్‌ ట్యూమర్స్‌ అంటారు. ఇవి రక్తం ద్వారా గానీ, లింఫ్‌ ద్వారా గానీ శరీరంలో ఒకచోట నుంచి మరొక చోటుకు వెళ్తుంటాయి. లింఫ్‌ ద్వారా అయితే లింఫ్‌ గ్రంథులు వాస్తాయి. రక్తం ద్వారా అయితే ఊపిరితిత్తులు, మెదడు, కాలేయం, ఎముకల్లోకి వ్యాప్తి చెందుతాయి. అందుకే శరీరంలో ఏ గ్రంథులు వాచినా, ఏ ప్రాంతంలో గడ్డలు అనిపించినా, ఎటువంటి స్రావం జరుగుతున్నా నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే పరీక్ష చేయించుకొని, కారణం తెలుసుకొని అవసరమైన చికిత్సను ఆలస్యం చేయకుండా తీసుకోవాలి. చాలా వరకూ క్యాన్సర్‌ను ప్రథమ దశలోనే గుర్తించగలిగితే పూర్తిగా నయం చేయవచ్చు. ఆలస్యమైన కొద్దీ నయమయ్యే అవకాశం తగ్గుతుంది.

దాదాపు 35 ఏళ్ల వయస్సు వరకూ శరీరంలో ఎన్ని కణాలు దెబ్బతిన్నాయో అన్ని కణాలూ ఉత్పత్తి అవుతుంటాయి. ఆ తర్వాత వయస్సు పెరుగుతున్న కొద్దీ దెబ్బతిన్న కణాలకన్నా పునరుత్పత్తి అయ్యే కణాల సంఖ్య తగ్గుతుంటుంది. దాంతో అవయవాల శక్తి తగ్గుతుంది. పెరిగే కొద్దీ కణాల ప్రక్రియలలో జరిగే తప్పులూ పెరిగే అవకాశముంది. మామూలుగా పి-53 అనే జీన్‌ ఈ తప్పుల్ని సరిదిద్దుతుంటుంది. దీనినే ‘మాలిక్యులార్‌ పోలీస్‌’ అంటారు. ఈ మాలిక్యులార్‌ పనితీరు ‘మ్యుటేషన్స్‌’తో దెబ్బ తింటుంది. వయస్సు పెరుగుతున్నకొద్దీ దెబ్బతినే కణాల్లో తప్పులను సరిదిద్దే పి-53 జీన్‌ కూడా ఉండటంతో కణాల్లో జరిగే ప్రక్రియల్లో తప్పుల్ని సరిదిద్దే అవకాశం ఉండదు. దాంతో కణాల మీద నియంత్రణ తగ్గుతుంది.

మర్మావయవ ప్రాంతాల్లో శుభ్రత పాటించాలనే విషయంలో ఇప్పటికీ గ్రామీణ స్త్రీలకు సరైన అవగాహన ఉండట్లేదు. ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడబడితే అక్కడ మూత్రానికి వెళ్లడం లాంటిది మంచిది కాదు. ఎందుకంటే స్త్రీ మర్మావయవాలు అలా కూర్చున్నప్పుడు నేల ప్రాంతానికి దగ్గరగా ఉంటాయి. ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలా ఇన్‌ఫెక్షన్స్‌ని, ఇన్‌ప్లమేషన్స్‌ని అలాగే వదిలేస్తే క్యాన్సర్‌గా మారే అవకాశాలున్నాయి. కాబట్టి యూరినరీ ఇన్‌ఫెక్షన్స్‌ లాంటివి వస్తే చికిత్స చాలా అవసరం.

స్త్రీలలో వెజైనల్‌ క్యాన్సర్లు, గర్భాశయ క్యాన్సర్లు, గర్భసంచి ముఖద్వారం దగ్గర క్యాన్సర్లు వస్తుంటాయి. వెజైనల్‌ క్యాన్సర్లు తక్కువ. వీటికన్నా గర్భాశయ క్యాన్సర్లు (యుటెరైన్‌ క్యాన్సర్‌) ఎక్కువ. గర్భాశయ క్యాన్సర్ల కన్నా ముఖద్వార (సర్వైకల్‌ ) క్యాన్సర్లు ఎక్కువ. చాలామంది పిన్న వయస్సులోనే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. చిన్న వయస్సులో శరీరం

పూర్తిగా పరిపక్వత చెందకుండా దాంపత్య జీవితంలో పాల్గొనడం మంచిది కాదు. చిన్న వయస్సులో ప్రసవాల వల్ల యుటెరెస్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలున్నాయి. కొంతమంది స్త్రీలు వరుస వరుసగా ఎక్కువసార్లు గర్భాలు ధరిస్తారు. దీనివల్ల యుటెరెస్‌ క్యాన్సర్‌ రావచ్చు. స్త్రీలల్లో మర్మావయవం ముందు భాగంలో గానీ, మూత్రాశయంలో గానీ యుటెరెన్‌ ప్రాంతంలో గానీ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇవి రాకుండా స్త్రీలు జాగ్రత్తపడాల్సిన అవసరముంది.

హెచ్‌.పి.వి. వైరస్‌ వల్ల శరీరంలో ఎక్కడా క్యాన్సర్లు రావు. గర్భాశయ ముఖద్వారంలో (సర్విక్స్‌) తప్ప, ఈ క్యాన్సర్‌ మహిళల్లో ఎక్కువ. ఈ వైరస్‌ సోకిన పదిహేను, ఇరవై సంవత్సరాలకు సర్విక్స్‌ క్యాన్సర్‌ వస్తుంది. అంటే ఇరవై, ఇరవై ఐదేళ్లకు ఈ క్యాన్సర్‌ బయట పడుతుందన్న మాట. మెనోపాజ్‌ పీరియడ్‌ తర్వాత రక్తస్రావం అవుతుంటే కూడా క్యాన్సరేమోనని అనుమానించాలి. యోని నుంచి ఎటువంటి అసహజ ద్రావకాలు కారుతున్నా వెంటనే గైనకాలజిస్టును సంప్రదించాలి.

పాప్‌స్మియర్‌ టెస్టు

వెజైనల్‌, గర్భాశయ క్యాన్సర్‌ను, ముఖ ప్రాంతంలో క్యాన్సర్‌ను కనుక్కోవడానికి తేలికైన పరీక్ష పాప్‌స్మియర్‌. స్త్రీ జననాంగాల ముందు భాగంలోంచి కొన్ని కణాల్ని తీసి మైక్రోస్కోప్‌ ద్వారా పరీక్షించడంతో ప్రారంభదశలో ఈ క్యాన్సర్‌ను పసిగట్టవచ్చు. 35 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి స్త్రీ రెండు మూడు నెలలకోసారైనా ఈ పరీక్ష చేయించుకోవడం మంచిది. ఇది చాలా తేలికైన పరీక్ష. ఖర్చు కూడా తక్కువే. ఏ క్యాన్సర్‌నైనా ప్రారంభదశలో గుర్తిస్తే నయం చేయవచ్చు. కాబట్టి క్యాన్సర్‌ రాకుండా చూసుకోవడం అవసరం. పాప్‌స్మియర్‌ పరీక్ష, బ్రెస్ట్‌ మీద ఏ ప్రాంతంలోనైనా గడ్డలున్నాయో తెలుసు కోవడానికి ప్రతిరోజూ స్నానం చేసేటప్పుడు పరీక్షించుకోవడం ముఖ్యం. వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ రాకుండా జాగ్రత్తపడాలి. ప్రసవ సమయంలో గర్భాశయంలో, యోని లోపల ఎక్కడ గాయమైనా త్వరగా మానేలా చూసుకోవాలి. ఈ విధమైన జాగ్రత్తలతో క్యాన్సర్‌ను నివారించవచ్చు.

- డాక్టర్‌ రవికుమార్‌,
మెడికల్‌ ఆంకాలజిస్టు,
గ్లోబల్‌ హాస్పిటల్‌,
లక్డీకాపూల్‌,
హైదరాబాద్‌.
ఫోన్‌: 9949385000

కాలేయ క్యాన్సర్‌

సమతౌల్యం లేని ఆహారం, మద్యం అధికంగా సేవించడం, ధూమపానం, విపరీతమైన ఒత్తిళ్ళతో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు, అతివేగంతో కూడిన జీవనశైలి వల్ల రాష్ట్రంలో ఉదరకోశ వ్యాధులు పెరిగిపోతున్నాయి.కాలేయం దెబ్బతినడానికి 40 నుంచి 50 శాతం వరకు వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు ప్రధాన కారణమైతే, 30 నుంచి 40 శాతం మందిలో క్యాన్సర్‌ దెబ్బతినడానికి అతిగా మద్యం సేవించడమే ముఖ్యకారణం. ఆహారం, నీరు కలుషితమైనవి తీసుకోవడం వల్ల హెపటైటిస్‌ ఎ,ఇ వైరస్‌లు దాడి చేసి కామెర్లు, తద్వారా కాలేయం పూర్తిగా పాడయిపోవడానికి కారణమవుతున్నాయి. కలుషితమైన సూదులు, సిరంజిలు వాడడం, మత్తు పదార్థాలు తీసుకోవడం తదితర కారణాల వల్ల హెపటైటిస్‌ బి,సి వైనస్‌లు ప్రవేశించి కాలేయాన్ని మట్టుబెడతాయి.

విపరీతంగా మద్యం సేవించడం వల్ల కాలేయం సిర్రోసిస్‌ అనే జబ్బుకు గురవుతుంది. ఫలితంగా కాలేయం పూర్తిగా చెడిపోతుంది. లివర్‌ ఇన్‌ఫెక్షన్లను గాని మద్యపాన ప్రభావాన్ని గాని నివారించగల అవకావం ఉన్నా అవగాహన లేక చాలా మంది వీటివల్ల కాలేయ క్యాన్సర్‌ బారిన కూడా పడుతున్నారు. వేరుశగలాంటి గింజల్లో పెరిగే ఫంగస్‌లు ఉత్పత్తి చేసే ఆఫ్లటాక్సిన్లు కాలేయానికి క్యాన్సర్‌ కలుగజేస్తాయి. కొన్ని రకాల గర్భనిరోధక మాత్రలు కూడా కాలేయ క్యాన్సర్‌కు దారితీస్తాయి. కూరగాయలను శుభ్రంగా కడగకుండా తినడం వల్ల కాలేయంలో తిత్తులాంటివి ఏర్పడతాయి.మన ఆహార అలవాట్లు సరిగా లేనప్పుడు కడుపులో ఆమ్లాలు అవసరానికి మించి తయారవుతాయి. వీటివల్ల లోపలి పొరలు దెబ్బతిని పుండులా ఏర్పడుతుంది. నొప్పి నివారించే పెయిన్‌ కొల్లర్ల వల్ల కూడా అల్సర్లు ఏర్పడతాయి.

కీళ్ళ జబ్బులు ఉన్న వాళ్ళలో అల్సర్లు ఏర్పడానికి చాలా వరకు ఇవే కారణం. ఫలితం గా క్యాన్సర్‌ చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది. పీచు పదార్థా లను చాలా తక్కువగా తీసుకోవడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్‌ను ప్రేరేపిస్తుంది. అధిక ఒత్తిడికి గురవడం వల్ల అల్సరేటివ్‌ కోలైటిస్‌, క్రౌన్స్‌ డిసీజ్‌ లాంటివి పెద్దపేగును బాధిస్తాయి.మానసిక ఒత్తిడి అధికంగా ఉన్న వాళ్ళకి అల్సర్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. దీనికి తోడు ఆహారం విషయంలో సమయపాలన పాటించకపోవడం వంటి అలవాట్లు అల్సర్లను ప్రేరేపిస్తాయి. కలుషితమైన ఆహారం, నీటి వల్ల హెలికోబాక్టర్‌ ఫైలోరి బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు దాడి చేస్తాయి. తద్వారా జీర్ణకోశంలో అల్సర్లు బాధిస్తాయి.అవసరం కన్నా ఎక్కువగా తినడం, తక్కువ పనిచేయడం, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం తద్వారా వచ్చే ఊబకాయం… గాల్‌బ్లాడర్‌లో రాళ్ళు ఏర్పడడానికి కారణమవుతాయి. థాలసేమియా, సికిల్‌సెల్‌ అనీమియా, మలేరియా లాంటి రక్తానికి సంబంధించిన వ్యాధులు ఉంటే నల్లని రాళ్ళు ఏర్పడతాయి. కాలెస్ట్రాల్‌ పెరిగితే పసుపు రంగు ఏర్పడతాయి. ఇలాంటప్పుడు నొప్పిగా ఉండడమే కాకుండా ఇన్‌ఫెక్షన్లు కూడా కలుగుతాయి. ఇవి క్లోమ గ్రంథికి కూడా సమస్యలు తెచ్చిపెడతాయి.

రక్తంలో చక్కెరలను నియంత్రించడమే కాకుండా ఆహారం జీర్ణం కావడంలో ప్రధాన పాత్ర వహించే క్లోమగ్రంథికి మన అలవాట్లే శాపాలవుతాయి. గాల్‌ బ్లాడర్‌లో రాళ్ళు ఏర్పడడం, వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల వల్ల, కాల్షియం మోతాదు పెరిగినా, రక్తంలో ట్రైగ్లిజరైడ్ల శాతం పెరిగినా క్లోమ గ్రంథి కుళ్ళిపోతుంది. ఇలాంటప్పుడు కిడ్నీలు, ఊపిరితిత్తులు వంటి ప్రధాన అవయవాలు కూడా ప్రభావితమవుతాయి. పాంక్రియాస్‌ దెబ్బతింటే 60 శాతం మాత్రమే బతికే అవకాశం ఉంటుంది. దీన్నే అక్యూట్‌ పాంక్రియాటైటిస్‌ అంటారు. క్రానిక్‌ పాంక్రియాటైటిస్‌కు గురయినప్పుడు రాళ్లు క్లోమ నాళానికి అడ్డుపడడం వల్ల క్లోమరసానికి దారి ఉండదు. ఫలితంగా జీర్ణప్రక్రియకు అంతరాయం కలుగుతుంది. క్లోమ గ్రంథిలో రాళ్ళు ఇన్సులిన్‌ను తయారు చేసే ఐలెట్‌ కణాలను సైతం దెబ్బతీస్తాయి. ఫలితంగా రక్తంలో చక్కెరలు పెరుగుతాయి. బరువు చాలా తగ్గిపో తారు. ఈ పరిస్థితి క్లోమగ్రంథి క్యాన్సర్‌కు కూడా దారితీస్తుంది. కడుపుబ్బరం, ఆకలి లేకపోవడం, కడుపులో మంట, నొప్పి, గుండెలో మంట, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గిపోవడం, మలం నల్లగా రావడం, రక్తం పడడం, హఠాత్తుగా మలబద్ధకం రావడం ఇవన్నీ దానికి సంకేతాలు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తినే ఆహారం, నీళ్ళు స్వచ్ఛంగా ఉండాలి. ఏది తిన్నా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. కొంచెం సమస్య అనిపించినా సొంతవైద్యానికి పోకుండా డాక్టర్‌ని కలిసి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. ఆలస్యంగా వస్తే జబ్బు ముదిరితే ఎంత సమర్థవంతమైన డాక్టర్‌ అయినా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంటుంది. డాక్టర్‌ ఇచ్చిన మందుల మోతాదు పూర్తిగా తీసుకోవాలి. ఆహారం తీసుకోవడం సమయపాలన పాటించడం, వేపుళ్ళు, మసాలాలు తగ్గించడం, మళ్ళీ మళ్ళీ మరిగించిన నూనెను వాడడం, బాగా కాల్చిన ఆహారం తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదు. పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, మద్యానికి దూరంగా ఉండడం వంటి జాగ్రత్త పాటిస్తే ఎటువంటి జీర్ణ సమస్యలూ రావు. కాలేయమూ పదిలంగా ఉంటుంది.

- డా కె. రవీంద్రనాథ్‌,
సర్జికల్‌ గాస్ట్రోఎంటరాలజిస్ట్‌,
చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌,
గ్లోబల్‌ హాస్పిటల్‌, హైదారాబాద్‌,
సెల్‌: 98490 34567.

ప్రొస్టేట్ కేన్సర్‌

భారతదేశంలో మగవారిలో అత్యధికులలో ప్రోస్టేటు కేన్సరు కనిపిస్తున్నది అని డాక్టరు బి. త్యాగి బృందము (Asian Pac J Cancer Prev. 2010;11(2):397-401) 2010;11(2):397401) తెలియ జేసింది. ప్రోస్టేటు గ్రంధి మూత్రనాళాన్ని చుట్టి ఉంటుంది. వీర్యములో ఇరవై శాతము ప్రోస్టేటు గ్రంధి నుండి విడుదల అయిన ద్రవంతో పాటు మగ బీజాలు, సెమినల్ వేసైకల్సు నుండి వచ్చిన ద్రవం ఉంటాయి. ప్రోస్టేట్ కేన్సరు లక్షణాలు ఏమిటంటే ప్రయత్నించినా మూత్రం పోదు, మూత్రము పోవాలని గట్టి ప్రయత్నం చేస్తేనే మూత్రం వస్తుంది. ఒకసారి మొదలుపెడితే మూత్రం ఆగదు. రాత్రిపూట ఎక్కువసార్లు లేవటం, మూత్రపు ధార సన్నబడుట, మూత్రం పోసుకునేప్పుడు మంట లేదా రక్తము పోవటం కనిపిస్తుంది.

మగవారిలో అందులోనూ ముసలివారిలో ప్రోస్టేటు కేన్సరు కనిపిస్తుంది. ప్రోస్టేటు కేన్సరు అమెరికాలో 217,730 మందికి సోకితో అందులో 32,000 మంది చనిపోతారు. భారతదేశంలో ప్రోస్టేటు కేన్సరుతో ఎంతమంది చనిపోతారో తెలియదు. కాని డాక్టరు బి. త్యాగి రిపోర్టు ప్రకారం ఎక్కువమందే చనిపోతారు అని ఊహించవచ్చు. ప్రోస్టేటు కేన్సరును ప్రాథమిక దశలో కనుగొనలేమా? ప్రోస్టేటు కేన్సరును మూడు రకాలుగా కనుగొనవచ్చును.

శరీర పరీక్షను చేసినప్పుడు గ్రుధము ద్వారా గ్లవు వేసుకొన్న వేలితో ప్రోస్టేటును పరీక్ష చేసి కాయ ఉందో లేదో తెలుసుకోవచ్చును. ఆ కాయ నుండి సూదితో ముక్కతీసి (బయాప్సి) ప్రోస్టేటు కేన్సరు ఉందో లేదో తెలుసుకోవచ్చును. లేదా రక్త పరీక్ష చేసి ‘‘ప్రోస్టేట్ స్పెసిఫిక్కు ఏంజిజెన్’’ పి.ఎస్.ఎ. ఎంత పరిమాణంలో ఉందో తెలుసుకుని ప్రోస్టేటు కేన్సరు ఉందో లేదో తెలుసుకోవచ్చును. అంతకన్నా సులువుగా ప్రోస్టేటు కేన్సరు ఉందో లేదో తెలుసుకొనుటకు మూత్ర పరీక్ష చేసి ఆ మూత్రములో ‘‘ఇ యన్ 1’’ అనే ప్రోటీను ఉంటే ఆ పురుషుడికి ప్రోస్టేటు కేన్సరు ఉందని చెప్పవచ్చు అని యూనివర్శిటీ ఆఫ్ సర్రీ (ఇంగ్లాండు)లో పని చేస్తున్న డాక్టరు ఆర్ మోర్గను ‘‘క్లినికల్ కేన్సర్ రిసెర్చ్’’ అనే పత్రికలో తెలియజేశారు.

ఏదైనా కేన్సరు వస్తే శస్త్ర చికిత్స లేదా రేడియో ధార్మిక చికిత్స చేయవచ్చును. కాని ప్రోస్టేటు కేన్సరు వచ్చిన వారు ఎక్కువ కాలం బ్రతకరు కాబట్టి ఆపరేషను లేకుండా వేచి చూడవచ్చు. (వాచ్పుల్ వెయిటింగ్) అంటున్నారు కొందరు వైద్యులు. వేచి చూడవచ్చునో (వాచ్పుల్ వెయిటింగ్) లేదో రోగి తేల్చుకోవాలి. ‘‘ఆపరేషను లేకుండా వేచి చూడవచ్చును అన్నవారు కేన్సరు వల్లన ఏమవుతుందో అని భయపడలేదు’’ అని డాక్టరు బి.జె. డేవిసన్ (BJU Int. 2011 Apr 20) 2011Apr 20) కెనడా దేశంలో పరిశోధన చేసి చెప్పారు. డాక్టరు ఆనాబిల్ ఏక్సల్ బృందం (N Engl J Med. 2011 May 5;364(18):1708-17) వారు స్వీఢన్ దేశంలో పరిశోధన చేసి ‘‘వాచ్పుల్ వెయిటింగ్’’ కన్న ఆపరేషను చేస్తేనే ఎక్కువమంది బ్రతికారు అని చెపుతున్నారు.

రేడియో ధార్మిక కిరణాలతో కూడా ప్రోస్టేటు కేన్సరుకి చికిత్స చేయవచ్చును. రేడియో ధార్మిక చికిత్స కోసం రోగి ఆసుపత్రిలో చేరవలసిన అవసరము లేదు ‘‘రేడియో ఆక్టివ్ సీడ్లు’’ను ఉపయోగించి కేన్సరు ఉన్న ప్రోస్టేటు గ్రంధిలో ఉన్న కేన్సరుకు చికిత్స చేయవచ్చు. ప్రోస్టేటు కేన్సరు ముదిరిపోతే హార్మోనులు ఇచ్చి చికిత్స చేయవచ్చు.
ఏ రకమైన చికిత్స చేసినా కాంప్లికేషన్లు వస్తాయి. ప్రోస్టేటు కేన్సరుకి చికిత్స చేసినప్పుడు నీరుడు పోకుండా ఆపలేక పోవటం, లేపన శక్తిని కోల్పోవటం మొదలుగు కాంప్లికేషన్లు వస్తాయి. అందువల్లనే ఆపరేషను లేకుండా వేచి చూడవచ్చు.

భారత దేశంలో జనాభా పెరిగిపోతున్నది. ప్రజలు మునపటివలె కాక ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతున్నారు. జనాభాలో సగం మంది మగవారు కాబట్టి వారిలో కొందరికి ప్రోస్టేటు కేన్సరు రావచ్చును. ఏ రకమైన వైద్యం చేసినా కాంప్లికేషన్లు వస్తాయి కాబట్టి ప్రాథమిక దశలోనే కేన్సరును కనుగొంటే ప్రాణానికి అపాయం లేకుండా చికిత్స చేయవచ్చును. అందుకే ప్రోస్టేటు కేన్సర్‌ను ప్రాథమిక దశలోనో కనుగొనుటకు పరీక్షలు చేసే ప్రోగ్రామును చేపట్టాలి.

- డా. గవరసాన సత్యనారాయణ,
gavarasana@pol.net

గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్‌

జీర్ణాశయంలో వచ్చే కేన్సర్‌లలో గ్యాస్ట్రిక్‌ చాలా సాధారణంగా కన్పిస్తుంది. చైనా, జపాన్‌ చిలీ వంటి దేశాలలో ఎక్కువగా కన్పిస్తుంది. స్త్రీలకన్నా పురుషుల్లో రెండింతలు ఎక్కువ. 60 ఏళ్ల నుండి 70 ఏళ్లలోపు వారిలో చాలా ఎక్కువ.

కారణాలు

దీనికి ఇదమిత్తంగా ఇదే కారణం అని చెప్పడం కష్టం. కానీ కొన్ని కారణాలున్నాయి. అవి..

‘ఎ’ గ్రూపు బ్లడ్‌ ఉన్నవారిలో ఎక్కువని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.కొన్ని మానవ జాతులలో వారి సంతతికి ఎక్కువగా కన్పిస్తుంది. ఆహారంలో పాలు, ఎక్కువ కాల్చిన పదార్థాలు వాడడం వల్ల, ఎక్కువ ఉప్పు వాడేవారిలో వచ్చే అవకాశాలు ఎక్కువ.

వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశముంది. జీర్ణాశయంలో పాలిప్స్‌, క్రానిక్‌ గ్యాస్ట్రిక్‌ అల్సర్‌ వున్న వారిలో. జీర్ణాశయం కుంచించుకోపోయిన వారిలో. రక్తహీనతలో ముఖ్యంగా పర్నీషియన్‌ అనీమియా ఉన్న వారికి. పార్షియల్‌ గ్యాస్ట్రెక్టమి చేయించుకొన్న వారిలో కన్పించే అవకాశాలు ఎక్కువ.

లక్షణాలు

పైకడుపు ఉబ్బరంగా వుండడం. నొప్పితో కూడిన బాధ. ఆహారం తీసుకొన్న తర్వాత బాధ ఎక్కువవుతుంది. ఆకలి నశించడం. కడుపులో వికారంగా వుండడం. బరువు తగ్గడం. వమనం వచ్చినట్టు వుండడం. జీర్ణాశయంలో రక్తస్రావం జరిగి వమన రూపంలో కాఫీ కలర్‌లో వస్తుంది. విరేచన రూపంలో అయితే నల్లగా తారులాగా వస్తుంది. అన్నీ తినడానికి మింగడానికి కూడా కష్టమవడం.

పై కడుపులో గడ్డలాగా పరీక్ష చేస్తే చేతికి తగులుతుంది. రక్తహీనత. పడుకోబెట్టి పరీక్ష చేసినప్పుడు కడుపులో నీటి కదలిక. సన్నగా జ్వరం రావడం. నీరసం, ఆయాసం. కడుపులో నీరు చేరడం. జీర్ణాశయానికి రంధ్రంపడి కడుపులో రక్తస్రావం జరిగి ప్రమాదానికి గురవడం. ఇది పక్క అవయవాలకు పాకుతుంది. లివర్‌కు పాకినప్పుడు పచ్చకామెర్లు వుంటాయి. గొంతులో లింఫ్‌ గ్రంథులు వాయడం. స్త్రీల ఓవరీలో గడ్డలేర్పడతాయి. ఆసనం దగ్గర గ్రంథుల వాపు. చర్మంలో కంతులు ఏర్పడతాయి. చర్మంలో మార్పులొస్తాయి.

నిర్ధారణ

డబుల్‌ కాంట్రాస్ట్‌ బేరియమ్‌ మీల్‌ ఎక్సరే గ్యాస్ట్రో స్కోపితో చూస్తారు. బయాప్సీ పరీక్ష చేస్తారు. బ్రెష్‌ సైటాలిజి చాలా ముఖ్యమైన పరీక్షలు.అవసరమైతే సిటి స్కానింగ్‌ కూడా చేస్తారు.

చికిత్స

వ్యాధి ఆరంభ దశలో గ్యాస్ట్రెక్టమీ, సబ్‌టూటల్‌ గాని టోటల్‌ గ్యాస్ట్రెక్టమి చెయ్యాలి. మైటోమైసిన్‌, ఆడ్రియోమైసిన్‌ తర్వాత రేడియోథెరపీ చేస్తారు. ఆపరేషన్‌ వీలులేనప్పుడు ఉపశమనానికి సులభంగా జీర్ణమయ్యే ఆహారం కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు ఇవ్వాలి.

నొప్పి తగ్గించడానికి పెంట్రోబెసిన్‌, వాంతులకు జోపర్‌ ఇంజెక్షన్లు ఇవ్వాలి. ద్వారం అవరోధం వుండి మూసుకోపోయినట్టు వుంటే ‘డైలటేషన్‌’ చేయాలి. ఐరన్‌, బి-12 మొదలైన మందులు ఐవి-విప్లూయిడ్స్‌లో మల్టీవిటమిన్‌ ఇంజక్షన్‌ కూడా ఇవ్వాలి.

డాక్టర్‌ హెచ్‌. కృష్ణమూర్తి,
చీఫ్‌ ఫిజిషియన్‌,
మల్లు వెంకటనర్సింహారెడ్డి మెమోరియల్‌ క్లీనిక్‌,
ఎంహెచ్‌ భవన్‌,
ఫోన్‌: 9676376669.

చర్మ క్యాన్సర్లు రకరకాలు

చాలారకాల చర్మవ్యాధులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మరింత జటిలంగా తయారవుతాయి. క్రమేపీ అవి మొండివ్యాధులుగా మారి క్యాన్సర్‌కు కూడా దారితీయవచ్చు. అజాగ్రత్తగా ఉంటే క్యాన్సర్‌గా పరిణమించే ఈ చర్మక్యాన్సర్‌ వ్యాధులు చాలా రకాలు ఉన్నాయి.

మాలిగెంట్‌ మెలనోమా, స్క్వేమస్‌ సెల్‌ కార్సినోమా, బేసల్‌ సెల్‌ కార్సి నోమా మరియు ”మిర్‌కిల్‌ కార్సినోమా” అని ఉన్నాయి. అల్ట్రావయిలెట్‌ టైటు, అయినైజింగ్‌ రేడియేషన్‌లకు ఎక్స్‌పోజ్‌ అవటం, ఇమ్యూనిటీ బాగా తగ్గటం, ఎక్కువగా కార్పికో స్టీరాయిడ్‌ వాడటం, కొంత జన్యుసంబంధం (హీరిడిటీ) జబ్బు.కొన్ని రకాల ఇన్ఫెక్షన్లవల్ల ఉదా : హెచ్‌పివివల్ల జననేంద్రియాల దగ్గర, స్వ్కేమిస్‌ సెలో కార్పొనోమా, వెర్రుకాస్‌ కార్సినోమా అను చర్మక్యాన్సర్లు వస్తాయి.

లూకో ప్లేకియా (వంటిమీద తెల్లటి మచ్చలుంటాయి), జీరో డెర్మా పిగ్‌మెంటో జమ్‌ (వంటినిండా ముదురు రంగు మచ్చలుంటాయి. ఇది జన్యుపరమయిన వ్యాధి.) మొదలగు వాటిని ”స్కేమస్‌ సెల్‌ కార్సినోమా” గా పరిగణిస్తారు. స్కేమస్‌ సెల్‌ కార్సినోమా పుండుపడి, పువ్వువిచ్చుకున్నట్లు మారుతుంది. లింఫ్‌ గ్రంధులు వాచి ఉబ్బుగా ఉంటాయి.

బేసస్‌ సెల్‌ కార్సినోమాను ‘రోడెంట్‌ అల్సరు” అని కూడా అంటారు. ఇది ఎక్కువగా ముఖము మీద ముక్కుచెవు మధ్యభాగములో ఎక్కడయినా రావచ్చును. దీని నుండి రక్త రావటం, నొప్పిరావటం ఉంటుంది. ఇది పుండు లాగా ఉండి, ఎండిన పెలుసులాగా ఉంటుంది. ఈ క్యాన్సరు పుండు చాలాసార్లు బయటికన్నా లోపల లోపల పెరుగుతుంది. ముక్కులోపలి భాగాలకు, అక్కడ ఉండే సైనస్‌ గదులకు, కంటి భాగాలకు వ్యాపించి వాటిని దెబ్బతీసే అవకాశము ఉంది.

వీలయినప్పుడు ఈ క్యాన్సర్లను శస్త్ర చికిత్స ద్వారా వైద్యము చేస్తారు. తక్కువగా ఉన్నవాటిని, 5 ఫ్లోరో యురాసిల్‌ అనే మందు ఆయింట్‌మెంట్‌ రూపంలో వాడటం ద్వారా నయము చేయవచ్చును. కొన్నిసార్లు ఆపరేషన్‌కు వీలుకాని వాటిని రేడియో థెరపి ద్వారా వైద్యము చేస్తారు. ఒక్కోసారి కీమోథెరపి ఇస్తారు.

మైకోసిస్‌ ఫంగాయిడ్స్‌

ఇది చర్మానికి సోకిన లింఫోమా అను క్యాన్సరు వ్యాధి. దీని వలన శరీరములో ఎక్కడయినా చర్మంమీద ఎర్రటి మచ్చలు, వాటిపై పొలుసులు లాగా వస్తాయి. దురదకూడా ఉండవచ్చు. ఒక్కోసారి ఇది శరీరముపైన చర్మము అంతా ప్రాకవచ్చును. లేదా వేరే అవయవాలకూ ప్రాకవచ్చును. దీనిని రేడియో థెరపి-టోటల్‌ బాడి ఎలక్ట్రాన్‌ రేడియోథెరపి (టి.బి.ఈ.ఆర్‌.టి.) ద్వారా వైద్యం చేస్తారు.

ఈ టిబిఆర్‌టి వైద్యము కొన్ని హైయర్‌ లినియర్‌ యాక్సిలేటర్‌ మెషిన్‌ ఉన్న క్యాన్సరు సెంటరులలో మాత్రమే చేయగలరు. ప్రస్తుతానికి మనరాష్ట్రంలో హైదరాబాదు, విజయవాడలలో ఇటు వంటి సదుపాయములు ఉన్నాయి. ఇంకా కొన్ని నగరాలలో కూడా ఈ సదుపాయము రావచ్చును. ఈ వ్యాధికి అవసరాన్ని బట్టి ఒక్కోసారి కీమోథెరపి కూడా వాడుతారు.

మాలిగంట్‌ మెలనోమా

ఇదిపుట్టు మచ్చలకు సంబంధించిన క్యాన్సరు. పుట్టుమచ్చలు పెరిగి చివరకు క్యాన్సరుగా మారుతాయి. దీనిని సాధారణంగా శస్త్రచికిత్స ద్వారా తీసివేస్తారు. అవసరాన్ని బట్టి అపుడప్పుడు కీమోథెరపి వాడుతారు.

మెర్‌కిల్‌ సెల్‌ కార్సినోమా

ఇది అరుదైన చర్మక్యాన్సరు. చాలా ఉధృతంగా క్యాన్సర్‌ పెరుగుతుంది. శరీరంలో ఎండ తగిలే ప్రాంతములోనే ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని శస్త్రచికిత్స ద్వారా లేక రేడియో థెరపి ద్వారా వైద్యము చేయుదురు. అవసరాన్ని బట్టి కీమోథెరపీ కూడ వాడుతారు.

ఏరకమయిన చర్శ క్యాన్సరు చూచినా కూడా లక్షణాలు, సాధారణ చర్మ వ్యాధులతో ఉన్నట్లుగానే ఉంటాయి. ఉదా: చర్మం రంగుమారటం – విటమిన్‌ ‘ఎ’ లోపము లోను, కుష్టువ్యాధిలోనూ, మైకోసిస్‌ పంగాయిడ్స్‌ లోనూ, చర్మక్యాన్సరులోనూ ఉంటుంది. చర్మం ఎర్రగా అవటం, దురద, పొలుసులు, ఫంగల్‌ ఇన్పెక్షన్‌లోను, పిటిరియాసిస్‌ రోజియం లోనూ, సోరియాసిస్‌లోనూ, మైకోసిస్‌ ఫంగాయిడ్స్‌ మొదలగు వ్యాధులలో ఉంటాయి.

పుండు పడటం చాలా రకాల చర్మ వ్యాధులలోను, క్యాన్సరు వ్యాధిలోనూ ఉండవచ్చును. ఏమార్పు వచ్చినా చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సంప్రదించి తగుసలహా పొందటం మంచిది. ఇదే విధంగా ఏమార్పు గమనించినా క్యాన్సరేమో అని భయపడకుండా అది అసలు క్యాన్సరా లేక సాధారణ చర్మవ్యాధా అను విషయాలు వైద్యుని సంప్రదించితే వారు కొన్ని పరీక్షలు చేసి నిర్ణయిస్తారు. ఏ రకము అయినా తొలిదశలో మంచి వైద్యము ఉంది కాబట్టి మూర్ఖంగా ఏ వ్యాధిని పెంచుకోవటం ఆరోగ్యానికి శ్రేయస్కరము కాదు.

క్యాన్సర్‌ వైద్య నిపుణులు,
సెల్‌: 9849121050,

అన్నవాహిక కేన్సర్‌

అన్నవాహిక కేన్సర్‌ ఆడవారిలో కన్నా మగవారిలో ఎక్కువగా కన్పిస్తుంది. శరీరంలో వచ్చే కేన్సర్‌లలో ఇది ఐదవది. ఎక్కువ వచ్చే కేన్సర్‌ దీనిలో రెండు రకాలుగా వుంటుంది. అన్నవాహిక పైరెండు భాగాలలో వచ్చేది ‘స్క్వామస్‌సెల్‌’ కేన్సర్‌. అన్నవాహిక కింది భాగంలో వచ్చేది అడినో కేన్సర్‌. ఇది అల్సర్‌లాగా చుట్టూరా పాకుతూ పొడవుగా కూడా కనిపిస్తుంది.

కారణాలు

దీనికి ఇదమిత్తంగా కారణమంటూ చెప్పడం కష్టం. అయితే… మద్యపానం సేవించేవారిలో, పొగతాగే వారిలో ఎక్కువ. కారం, మసాలా దినుసులు వాడే వారిలో, అన్నవాహికలో అవరోధమున్న వారిలో, ఎక్కువ రేడియేషన్‌కు గురైన వారిలో, ఎక్కువ వేడిగల కాఫీ, టీలు తీసుకొనేవారిలో విటమిన్‌- ఎ, జింకు, మాలిబ్డినం లోపమున్న వారిలో ఎక్కువగా కన్పిస్తుంది.

లక్షణాలు

ఆరంభంలో గట్టి పదార్థం మింగడానికి కష్టంగా వుంటుంది. తర్వాత ద్రవ పదార్థాలు మింగడానికి కష్టంగా వుంటుంది. త్వరగా బరువు కోల్పోవడం, ఛాతీలో నొప్పి, స్వరం క్షీణించడం, నోట్లో నుండి రక్తంతో కూడిన వాంతి, అధికంగా రక్తంలో కాల్షియం వుండడం.

నిర్ధా రణ

డబుల్‌ కాంట్రాస్ట్‌ బేరియం స్వాలో. జి.పి ఎండోస్కోపి ద్వారా బయాప్సీ పరీక్ష కూడా చెయ్యెచ్చు. అవసరమైతే సిటి స్కానింగ్‌ చేయాలి.

చికిత్స

‘స్వ్కామస్‌సెల్‌’ కేన్సర్‌కు ఎక్కువ ఓల్టేజి రేడియోథెరపీ చేస్తారు. అన్నవాహిక కింది భాగంలో వచ్చే కేన్సర్‌కు ఆపరేషను ముందు, రేడియోథెరపీ తర్వాత ఆపరేషన్‌ చేస్తారు. ఇంకో విధానం కూడా అమలు చేస్తారు. కింది భాగం వచ్చే ‘అడినోకేన్సర్‌’కు ఆ భాగానికి ఆపరేషన్‌ చేసి మళ్లీ రేడియేషన్‌ థెరపీ ఇస్తారు.

కొందరు వైద్యులు ‘సిస్‌ప్లాటిన్‌’ అనే కీమోథెరపీ మందు వాడుతూ ఆపరేషన్‌ చేయాలి. ఆపరేషన్‌ వీలుకాకుంటే ఉపశమనం కొరకు ‘లేసర్‌ అబ్లేషన్‌’, బైపాస్‌ సర్జరీ చేస్తారు. ఆహారం శరీరానికి అందించేందుకు గ్యాస్ట్రాస్టమి కూడా చెయాల్సి వుంటుంది. పోషకవిలువలు కల్గిన ఆహారం దావ్రక రూపంలో ఇవ్వాలి.

డాక్టర్‌ హెచ్‌. కృష్ణమూర్తి,
చీఫ్‌ ఫిజిషియన్‌,
మల్లు వెంకటనర్సింహారెడ్డి మెమోరియల్‌ క్లీనిక్‌,
ఎంహెచ్‌ భవన్‌,
అజామాబాద్‌,
హైద్రాబాద్‌,
ఫోన్‌ : 9676376669.

మైలోమా క్యాన్సర్‌

బోన్‌మారోలో లింఫోసైట్స్‌, ప్లాస్మా సెల్సు ఉంటాయి. వీటి నుండి శరీరంలో ఇమ్యునోగ్లోబ్యులిన్‌ తయారవుతాయి. బోన్‌ మారోలో ఈ కణములు బాగా పెరగటం వల్ల నిర్దిష్టంగా కొన్ని రకాల ఇమ్యునోగ్లాబ్యులిన్స్‌ తయారవుతాయి. కొన్ని సందర్భాలలో ప్లాస్మా కణాలు బాగా పెరగటం ప్రొటీన్‌ ఉత్పత్తి బాగా పెరగటంజరిగి, సీరమ్‌ ఎలక్ట్రో ఫోరెసిస్‌ అను పరీక్షలో ప్రోటీన్‌ రజూఱసవ లాగా బాగా పెరిగినట్లు కనిపిస్తుంది. శరీరంలో ఎముక లలో కూడా దీనివల్ల చాలా మార్పులు వచ్చి ఎముకలను తినివేయటం జరుగుతుంది. ఒక్కోసారి ఎముకలువిరగటం జరుగుతుంది. ఈ జబ్బును ‘మల్టిపుల్‌ మైలోమా’ అంటారు.

సాధారణంగా ఇది 55 సంవత్సరముల వారిలో కనిపిస్తుంది. ఇది లక్షమందికి ఒకరి లో రావచ్చును. ఆడ, మగ ఇద్దరిలోనూ రావ చ్చును. ఈ జబ్బు రేడియేషన్‌ వఞజూశీరబతీవ వల్ల, క్రానిక్‌ యాంటిజన్‌ స్టిమ్యులేషన్‌ వల్ల (ఎర్రకణాల యాంటిజెన్‌లు, రుమటూ యిడ్‌ ఫ్యాక్టర్‌, కోయాగ్యులేషన్‌ ఫ్యాక్టరు మొ||), కొన్ని పరిశ్రమలలో బెంజీన్‌ వాడకంలో ఎక్పోజర్‌ వల్ల, ”హ్యుమన్‌ హెర్పిస్‌ వైరస్‌8” వల్ల రావచ్చును. కొన్ని జన్యువులలో మార్పుల వల్ల కూడా ఈ జబ్బు రావచ్చును. దీనివల్ల రక్తం బాగా తగ్గి, నీరసం, అలసట వస్తుంది. ఎముకలు దెబ్బతినటం వల్ల, అవి ఎముకలలో తీవ్రంగా ఉందో అక్కడ నొప్పి వస్తుంది. వెన్నుపూసలు దెబ్బతిని, వెన్నుపాము కూడా దెబ్బతింటే, ఆయా సందర్భాన్ని బట్టి నొప్పి, లేక పెరాలిసిస్‌ రావచ్చును. ఒక్కోసారి మూత్రపిండాలు కూడా దీనివల్ల దెబ్బతిన వచ్చును. మూత్రంలో కూడా బెన్స్‌జోన్స్‌ ప్రోటీనులు కనిపిస్తాయి. ప్లేట్‌లెట్‌ అను రక్తకణాలు తగ్గినప్పుడు చిన్న, చిన్న మచ్చలు రావటం, రక్తస్రావం జరగటం జరగవచ్చు. సాధారణ రక్త పరీక్షలు, సీరమ్‌, ఎలక్ట్రో ఫోరెసిస్‌, మూత్రపరీక్ష, బోన్‌మారో పరీక్ష, ఎముకలఎక్సరే, అల్ట్రాసౌండ్‌, ఎంఆర్‌ఐ స్కాన్‌, సిటి స్కాన్‌, పిఇటి స్కాన్‌, బోన్‌ స్కాన్‌ అను రకరకాల పరీక్షల వల్ల దీనిని గుర్తించటం జరుగుతుంది. సాధారణంగా తల ఎముకలు (రసబశ్రీశ్రీ bశీఅవర) తినివేసేటట్లుగా రంధ్రములు పడతాయి. శరీరంలో చాలా ఎముకలు ఈ విధంగా మారవచ్చు. కొన్నిచోట్ల ఎముకలు విరిగిపోవచ్చును. చాలా ఎముకలు తూట్లు పడినట్లు రంధ్రాలు పడతాయి.

వైద్య విధానము

దీనికి ఎక్కువగా కీమో థెరపీ వాడుతారు. ‘విన్‌కిస్టిన్‌’, ‘డాక్సోరూ బిసిన్‌’, ‘డెక్సామిధజోన్‌’, ‘మెల్‌ఫలాన్‌’, ‘ధాలిడొమైడ్‌’ మరియు ‘లినాలి డోమైడ్‌’లు మంచి ఫలితాలు ఇస్తాయి. హైడోస్‌ కీమోథెరపీ చాలా జాగ్రత్తగా వాడాలి. ఇంకా బోర్టిజోమిబ్‌ అను మందు ఈ మధ్య క్రొత్తగా వచ్చింది. స్టెమ్‌ సెల్‌ ధెరపీ, ఆటోలాగస్‌ బోన్‌మారో రిప్లేస్‌మెంట్‌లు, (కొంచెం ఖరీదైనా కూడా) మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఎముకలు విరిగినా గాని (టవఎశీతీaశ్రీ అవషస), విరగపోయే వాటికి ముందు జాగ్రత్తగా శస్త్ర చికిత్స (అaఱశ్రీఱఅస్త్ర వ్‌ష.) చేస్తారు. కొన్నిచోట్ల ఎముకలు బాగా దెబ్బతిని నొప్పిగా ఉన్న యెడల, ఆ ప్రదేశంలో సందర్భానుసారం గా రేడియోథెరపీ ఇవ్వటం వల్ల నొప్పి తగ్గి రోగికి బాగా ఉపశమనం వస్తుంది. ట్రీట్‌మెంట్‌ కాంప్లికేషన్స్‌ లేనియెడల, మందులకు మంచి ఫలితాలు పొందిన పది సంవత్సరముల దాకా ఏమీ ఇబ్బందిలేకుండా ఉండ వచ్చును. జబ్బు పెరిగినయెడల, అది ఉన్న స్టేజినిబట్టి, సాధారణంగా మూడు నుండి, ఐదు సంవత్సరముల వరకూ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్లాస్మా ఎలక్ట్రోఫోరెసిస్‌ అను రక్త పరీక్ష సంవత్సరంకు ఒకసారి చేయించటం వల్ల దీనిని తొలిదశలో కనుక్కోవటం వీలవుతుంది.

క్యాన్సర్‌ వైద్య నిపుణులు,
సెల్‌: 9849121050.

ఆధారము : వైద్యం బ్లాగు

కాన్సర్ వ్యాధులు - చికిత్సలు

స్త్రీలలో క్యాన్సర్ కారకాలు

45 సం.ల తర్వాత, శృంగార కలయిక జరిగాక యోని నుంచి రక్తస్రావం అవడాన్ని క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన స్థితితో పాటు, ఇతర తీవ్రమైన వ్యాధులకు సంకేతంగా చెప్పవచ్చు. దీనికి గల కారణాలను తెలుసుకోవడం చాలా అవసరం.

సరై్వకల్ డిస్‌ప్లేసియా : ఇది గర్భాశయ ముఖ ద్వారాన్ని కప్పి ఉంచే ఎపిథీలియల్ కణాలలో క్యాన్సర్ ముందు వచ్చే మార్పులను సూచించే స్థితి. బాల్య వివాహాల్లో 13-16-18 సం||ల వయస్సు నించే శృంగారంలో పాల్గొనడం ద్వారా రావచ్చు. బాల్యంలోనే వ్యభిచార కూపంలోకి నెట్టబడ్డవారు, ఎక్కువ సెక్స్ పార్ట్‌నర్స్ ఉండేవారిలో ఈ స్థితి కన్పిస్తుంది. 14 సం||ల చిన్న వయస్సులో బిడ్డను కనాల్సి రావడం కూడా ఒక కారణమే. సుఖరోగాలు బాగా ఉండి చికిత్స తీసుకోకపోవడం మరొక కారణం. దీనికి చికిత్సగా గర్భాశయ ముఖద్వారపు ద్రవాలను పాప్‌స్మియర్, బయాప్సీల ద్వారా పరీక్షించి, ప్రీ క్యాన్సరస్ కణాలున్నంతమేరా కోనైజేషన్ అనే ఆపరేషన్ ద్వారా, క్రయో సర్జరీ ద్వారా ఈ కణజాలాన్ని నిర్మూలించవచ్చు.

క్లయోమైడియా : సుఖవ్యాధుల్లో (ఎస్‌టిడి) ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇది. వీర్యం, రక్తం, యోని స్రావాల వల్ల ఇది వస్తుంది.

గనేరియా : ఇది కూడా సుఖవ్యాధుల్లో ఒకటి. ఇది ముదిరితే గర్భాశయ ముఖ ద్వార, సరై్వకల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

సర్విసైటిస్ : గర్భాశయ ముఖద్వారానికి అంటే సర్విక్స్‌కి బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్‌ల ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ ఇది. దీనికి చికిత్స తీసుకోకపోతే దీర్ఘకాలంలో క్యాన్సర్‌కి దారి తీస్తుంది.

సరై్వకల్ పాలిప్ : గర్భాశయ ముఖ ద్వారపు పొరల్లో లేదా నాళంలో, ఎరుపు లేదా వంకాయరంగులో మెత్తటి వేర్ల వంటి బుడిపెల్ని ’సరై్వకల్ పాలిప్స్’ అంటారు. వీటిని శస్త్ర చికిత్స ద్వారా తీయకపోతే క్యాన్సర్‌కి దారి తీయవచ్చు.

ట్రైకోమోనియాసిస్ : ప్రోటోజొవా ఫంగస్ వల్ల వచ్చే సుఖవ్యాధి ఇది. తల్లికి ఈ వ్యాధి ఉంటే బిడ్డకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అపరిశుభ్రమైన పరిసరాలు, టాయిలెట్ల వల్ల కూడా వ్యాప్తి చెందుతుంది. వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోయినా వస్తుంది. చికిత్స తీసుకోకపోతే దీర్ఘకాలంలో ’సరై్వకల్ క్యాన్సర్’కి దారి తీస్తుంది.

వ్జైల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్ : యోని నాళంలో, సెర్విక్స్ చుట్టూ విపరీతమైన ఫంగస్ పెరిగిపోతుంది. తీవ్రమైన దురదతో, మంటతో పాటు పెరుగులాంటి తెల్లని స్రావాలు విడుదల అవుతాయి.

ఎండోమెట్రైటిస్ లేక ఎడినోమయోసిస్ : గర్భాశయ లోపలి పొర అయిన ఎండోమెట్రియమ్‌కు ఇన్ఫెక్షన్ సోకడం.

యుటిరైన్ పాలిప్ : గర్భాశయపు ఎండోమెట్రియమ్ పొర పెరిగి బుడిపెలుగా ముందుకు పొడుచుకు రావడం. ఇది క్యాన్సర్‌గా మారే అవకాశం తక్కువ. అయితే, నెలసరి సమయంలో రక్తస్త్రావం అధికంగా ఉంటుంది. కలయిక తర్వాత, నెలసరి నిలిచిపోయినా రక్తస్రావం కనపడుతుంది. హార్మోన్ చికిత్స తర్వాత కూడా రక్తస్రావం కనపడుతుంది. ఈ స్థితిని, హిస్టెరోస్కోపిక్ గైడెడ్ క్యూరెటెజ్ ద్వారా సరి చేయొచ్చు. దీని తర్వాత ఇవి మళ్లీ మొలిచి తగ్గకపోతే, ముదిరి క్యాన్సర్‌కి దారి తీయచ్చు.

ఫైబ్రాయిడ్ ట్యూమర్స్ : గర్భాశయంలో వచ్చే ప్రమాదరహిత కణుతులు. క్యాన్సర్‌గా మారే అవకాశం తక్కువే. మెనోపాజ్‌కి చేరిన చాలామంది స్త్రీలలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల ఈ కణుతులు గర్భాశయ గోడల్లోకి ముడుచుకుపోయి అదృశ్యమవుతాయి. కలయిక తర్వాత రక్తస్రావం గమనించిన స్త్రీలు వెంటనే గైనకాలజిస్ట్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఫైబ్రాయిడ్ కణుతులు పెద్దగా ఉండి ఎప్పుడంటే అపుడు తీవ్ర రక్తస్త్రావం, నడుమునొప్పి, మూత్ర విసర్జనప్పుడు నొప్పిగా అన్పించడం వీటిలో ఏ లక్షణాలు కన్పించినా ఈ కింది పద్ధతుల్లో వాటిని తొలగించాలి.

  • మయోమెక్టోసిస్
  • యుటెరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్
  • హిస్టెరెక్టమీ

కలిస్తేనే రక్తవూసావం అవుతుంది కాబట్టి కలవకుండా ఉంటూ ఇటు డాక్టరుకీ చూపించుకోక చాలామంది వ్యాధిని ముదర గొట్టుకుంటున్నారు. లోపల సమస్య ఉంది కాబట్టే కలయిక తర్వాత రక్తవూసావం అవుతుంది. వ్యాధి ఎప్పట్నించో ఉండి, కొన్ని దశలు దాటిన తర్వాత కన్పించే ప్రమాదకర లక్షణం అది. కాబట్టి, వెంటనే అలాంటి వారు నిపుణులను సంప్రదించడం మంచిది.

లంగ్ క్యాన్సర్‌కు ముందస్తు జాగ్రత్తలు

మా నాన్నకి లంగ్ క్యాన్సర్ అని వైద్యులు నిర్ధారణ చేశారు. అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉన్నట్లు చెప్పారు. ఈ లంగ్ క్యాన్సర్‌ను ప్రిలిమనరీ స్టేజ్‌లో గుర్తించలేమా? అసలు ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

లంగ్ క్యాన్సర్ అనేది క్యాన్సర్ వలన చనిపోయే కారణాలలో ప్రముఖమైనది. ఏ క్యాన్సర్ అయినా ముందుగా సూక్ష్మ పరిమాణంలోనే మొదలవుతుంది. అది పెరిగి పెరిగి నిర్దిష్టమైన పరిమాణానికి చేరే వరకు గుర్తించడం కష్టమే. ఎందుకంటే మనం చేసే పరీక్షలన్నీ క్యాన్సర్ కణితి పరిమాణాన్ని బట్టి గుర్తించేవిగా ఉంటాయి.

నాలుగు దశలు..

లంగ్ క్యాన్సర్‌ను నాలుగు దశలుగా విభజించారు. రెండో దశ కంటే ముందుగానే మనం దీన్ని కనుక్కోగలిగితే నయం చేయగలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రెండో దశ క్యాన్సర్లన్నింటినీ నయం చేయగలిగే మందులు కనుగొనే అవకాశం లేదు.

సాధారణంగా లంగ్ క్యాన్సర్‌ను ముందుగా కనుక్కోవడానికి స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారు. అవి.. ఛాతీ ఎక్స్‌రే, కళ్ళె సైటాలజీ, స్పైరల్ కంప్యూటర్ టోమోగ్రఫీ. ఈ పరీక్షల ద్వారా క్యాన్సర్‌ను కనుక్కోగలిగే శాతం ఎంత? దాని వలన కలిగే ఉపయోగాలు ఇక్కడ ముఖ్యం కాదు. అసలు లంగ్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

"రేడాన్ అనేది రాళ్ళలోను, మట్టిలోను యురేనియం విచ్ఛిన్నం కావడం వల్ల ఏర్పడుతుంది. ఈ రేడాన్ గ్యాస్ మోతాదు ఇళ్ళలోను, ఇతర భవనాలలో అధికంగా ఉండి, ఆ గ్యాస్‌ను పీల్చడం వలన లంగ్ క్యాన్సర్ వస్తుంది. ముఖ్యంగా సెల్లార్‌లలో, అండర్‌గ్రౌండ్ బిల్డింగ్‌లలో దీని మోతాదు ఎక్కువ..''

రాకుండా ఉండాలంటే..

లంగ్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే రిస్క్ ఫ్యాక్టర్స్‌కు ఆమడ దూరంలో ఉండాలి. ధూమపానం, సెకండ్‌హ్యాండ్ స్మోక్, పర్యావరణానికి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్ల నుంచి రక్షణ పొందాలి. ఆల్కహాల్‌ను సేవించకూడదు.

పర్యావరణ రిస్క్‌ఫ్యాక్టర్లు : రేడాన్ ఎక్స్‌పోజర్ - రేడాన్ అనేది రాళ్ళలోను, మట్టిలోను యురేనియం విచ్ఛిన్నం కావడం వల్ల ఏర్పడుతుంది. ఈ రేడాన్ గ్యాస్ మోతాదు ఇళ్ళలోను, ఇతర భవనాలలో అధికంగా ఉండి, ఆ గ్యాస్‌ను పీల్చడం వలన లంగ్ క్యాన్సర్ వస్తుంది. ముఖ్యంగా సెల్లార్‌లలో, అండర్‌గ్రౌండ్ బిల్డింగ్‌లలో దీని మోతాదు ఎక్కువగా ఉంటుంది.

గాలి కాలుష్యం : గాలి కాలుష్యానికి లంగ్ క్యాన్సర్‌కు చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. కాలుష్యం అధికంగా ఉండే ప్రాంతాలలో నివసించే వారికి ఈ రకం క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

ఇక, ఇతర పర్యావరణ కారకాలలో.. ఆస్‌బెస్టాస్, ఆర్సెనిక్, క్రోమియం, నికెల్, తారు, తారు పొగ వంటివి ఉంటాయి. వీటన్నింటికీ సాధ్యమైనంత దూరంగా ఉండడం వల్ల లంగ్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

ఆల్కహాల్, ధూమపానం : ఆల్కహాల్ పుచ్చుకోవడం, ధూమపానం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు మరింత పెరుగుతాయి. లంగ్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలనుకున్న వారు ధూమపానం, మద్యపానం వంటివి చేయకూడదు. ఈ అలవాట్లు ఉన్న వారు తక్షణం మానివేయాలి. ధూమపానం నుంచి బయటపడడానికి పల్మనాలజిస్ట్ ఇచ్చే కౌన్సెలింగ్, మందులు ఉపయోగపడతాయి.

పోషకాహారం కూడా..

క్యాన్సర్ నిరోధంలో పోషకాహారం కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఎక్కువగా తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు శారీరక వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.

కొంతమంది విటమిన్-ఇ తీసుకుంటే లంగ్ క్యాన్సర్ రాదు అనుకుంటూ ఉంటారు. కానీ ఇది నిజం కాదు. అంతేకాదు, ధూమపానం చేసే వారు కెరోటినాయిడ్స్ ఎక్కువగా తీసుకుంటే లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

సర్వైకల్ క్యాన్సర్‌

ప్రపంచ వ్యాప్తంగా వచ్చే క్యాన్సర్‌లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) రెండవ స్థానంలో ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 5 లక్షల మంది స్త్రీలు ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. వీరిలో ఏటా రెండు లక్షలకు పైగా ఈ క్యాన్సర్ కారణంగా చనిపోతున్నారు కూడా. ఒకప్పుడు ఈ వ్యాధిని నివారించే మార్గాలు లేవు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. అప్పుడ ప్పుడు కొన్ని స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చునంటున్నారు గైనకాలజిస్టు డాక్టర్ ఏ పద్మశ్రీ. మరిన్ని వివరాలు ఆమె మాటల్లోనే....

లక్షణాలేమైనా పైకి కనిపించేదాకా అంతా సవ్యంగానే ఉన్నట్లు భావించడం మనలో చాలా మందికి అలవాటు. కానీ, క్యాన్సర్ వ్యాధుల్లో చాలా సార్లు పైకి కనిపించే లక్షణాలే ఉండవు. వాటిని కొన్ని వైద్య పరీక్షల ద్వారా మాత్రమే గుర్తించగలం. గర్భాశయ ముఖద్వార (సర్వైకల్ క్యాన్సర్) విషయంలో కూడా ఈ అవసరం చాలా ఉంది. ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ ఉంటే ఈ సమస్యను చాలా సమర్థవంతంగా నివారించే అవకాశాలు ఇప్పుడు ఎన్నో ఉన్నాయి.

చిన్న వయసులోనే పెళ్లి కావడం, ఎక్కువ మంది పిల్లలు పుట్టడం, శృంగారంలో ఎక్కువ సార్లు పాల్గొనడం, లేదా ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొనడం, లైంగిక సంపర్కం ద్వారా సంక్రమించే హెపివి ( హ్యూమన్ పాపిలోమా వైరస్) ఇన్‌ఫెక్షన్‌లు ఈ గర్భాశయ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఈ ఇన్‌ఫెక్షన్లను ఆధునిక వైద్య పరీక్షల ద్వారా తప్ప మామూలుగా చూస్తే కనిపించేవి కావు.

అందుకు 20 నుంచి 64 ఏళ్ల వయసులోపున్న స్త్రీలంతా తరుచూ గైనకాలజిస్టును సంప్రదిస్తూ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం అవసరం. అలా చేయడం వల్ల క్యాన్సర్ గా మారడానికి ముందే సమస్యను కనిపెట్టి దానికి అవసరమైన చికి త్స చేయడం సాధ్యమవుతుంది. ఇది క్యాన్సర్‌ను నివారించడానికి ఒక ఉత్తమ మార్గం.

మూడురకాల స్క్రీనింగ్‌లు

పాప్‌స్మియర్ ఒక ప్రధాన స్క్రీనింగ్ పరీక్ష. దీని ద్వారా క్యాన్సర్ ఉందో లేదో తెలిసిపోతుంది. అలాగే శరీరంలో అసహజమైన మార్పులేమైనా వచ్చినా కనిపిస్తుంది. పైగా క్యాన్సర్‌గా మారేందుకు దోహద పడే పరిస్థితులేమైనా ఉంటే ముందే తెలుసుకోవడం సాధ్యమవుతుంది. అయితే ఈ పరీక్షల్లో కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్లు బయటపడకపోవచ్చు. అందుకే లిక్విడ్ బేస్డ్ సైటాలజీ అనే మరో పరీక్ష కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ విధానంలో 80 శాతం కచ్చితమైన రిపోర్టులు లభిస్తాయి. కాకపోతే ఈ పరీక్ష చాలా ఖరీదైనది. పైగా అన్నికేంద్రాల్లో ఈ పరీక్షలు ఇంకా చేయడం లేదు.

పాప్‌స్మియర్‌తో కలిపి హెచ్‌పివి డిటెక్షన్ కిట్ అనే మరో పరీక్ష కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. ఉంది. దీని ఖర్చు సుమారు రెండు వేల దాకా అవుతుంది. ఈ పరీక్ష కూడా కొన్ని ఆసుపత్రుల్లోనే అందుబాటులో ఉంది. ఈ పరీక్ష ద్వారా క్యాన్సర్ కారకమయ్యే వైరస్ ఏమైనా ఉందా లేదా తెలిసిపోతుంది.

ఈ పరీక్షలకు సంబంధించి 90 శాతం మంది రిపోర్టులు నార్మల్ అనే వస్తాయి. మిగతా 10 శాతం మందికి ఇన్‌ఫెక్షన్లు గానీ, క్యాన్సర్‌గా మారే పరిస్థితులు గానీ, క్యాన్సర్ ఉన్నట్లు కానీ, తేలవచ్చు. అప్పటిదాకా క్యాన్సర్ తాలూకు లక్షణాలేవీ కనిపించని వారిలో కూడా ఒక్కోసారి క్యాన్సర్ ఉన్నట్లు బయటపడవచ్చు. అయితే క్యాన్సర్ లక్షణాలే ఇంకా బయటపడని ఈ దశలో చికిత్స చేయడం చాలా సులభం.

ఈ పరీక్షల ద్వారా గర్భాశయ ముఖద్వారం మీద అనుమానాస్పదంగా ఏమైనా కనిపిస్తే అప్పుడు కాల్పోస్కోపీ అనే మరోరకం పరీక్షలు చేయవలసి ఉంటుంది. అసహజంగా ఉన్న ఆ భాగం మీద అసిటిక్ ఆసిడ్ రసాయనాన్ని ఉపయోగించి అక్కడ చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తారు. క్యాన్సర్‌గా మారే దశలో ఉన్నా అప్పటికే క్యాన్సర్ ఉన్నా ఈ పరీక్షల్లో బయటపడుతుంది. దీనివల్ల ప్రారంభ దశలోనే వ్యాధికి చికిత్స చేయడం వీలవుతుంది.

ఎలా తెలుస్తుంది ?

నెలసరి దాకా కాకుండా మధ్యలోనే రక్తస్రావం కావడం, శృంగారం తరువాత రక్తస్రావం కావడం, పొత్తి కడుపులో నొప్పి వచ్చి రక్తస్రావం కావడం వంటి లక్షణాలు ఉంటే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకుంటే మంచిది. నిజానికి చాలా మందిలో క్యాన్సర్ వస్తే గానీ దాని లక్షణాలు కనిపించవు. క్రమం తప్పిన రక్తస్రావంగానీ, గర్భాశయం ముఖద్వారం మీద పూత రావడం వంటివి అవి అందరిలో ఉండవు. అందువల్ల ఏవైనా లక్షణాలు కనిపిస్తేనే డాక్టర్‌ను సంప్రదించే దోరణి వల్ల కొన్నిసార్లు సమస్య చేయిదాటిపోయే ప్రమాదం ఉంది.

వైద్యచికిత్సలు ఉన్నాయా ?

ముందే గుర్తిస్తే ఈ క్యాన్సర్‌నుంచి పూర్తిగా విముక్తి పొందే అవకాశాలు ఉన్నాయి. పరీక్షల్లో ఏవైనా అసాధారణ లక్షణాలు కనిపించిన ంత మాత్రాన గర్భాశయాన్ని తీసివేయవలసిన అవసరం ఇప్పుడు ఎంతమాత్రమూ లేదు. క్రయోకాటరీ (కోల్డ్ కాటరీ), లేజర్ కాటరీ, లూప్ ఎలక్ట్రికల్ కాటరీ అనే అతి సులువైన విధానాల ద్వారా ఈ చికిత్సలు జరిగిపోతాయి. క్యాన్సర్‌గా మారే అవకాశం ఉన్న కణాలను ముందే గుర్తించి కాల్చివేయడం ద్వారా అది క్యాన్సర్‌గా మారకుండా నివారించడం ఇప్పుడు సాధ్యమవుతోంది.

వీటివల్ల గర్భాశయాన్ని తీసివేయవలసిన అవసరం రాదు. అయితే ఈ చికిత్స తరువాత కూడా ప్రతి ఆరుమాసాలకు ఒకసారి డాక్టర్‌ను సంప్రదిస్తూ సమస్య పూర్తిగా నిర్మూలన అయ్యిందో లేదో తెలుసుకుంటూ ఉండాలి. ఎందుచేతంటే ఆ తరువాత కూడా కొందరికి మళ్లీ మళ్లీ వస్తూ రోజురోజుకూ తీవ్రమవుతూ ఉంటుంది. అప్పుడు మాత్రం ఇక గర్భాశయాన్ని తొలగించడమే మార్గమవుతుంది. కాకపోతే ఈ పరిస్థితి అతి తక్కువ మంది విషయంలోనే అలా అవుతుంది.

టీకాలు వచ్చేశాయి

గర్భాశయ క్యాన్సర్ రావడానికి గల కారణాల్లో హెచ్‌పివి వైరస్ ఇన్‌ఫెక్షన్ ప్రధానం. ఇది లైంగిక సంపర్కం ద్వారానే సంక్రమిస్తుంది. అయితే, ఈ ఇన్‌ఫెక్షన్‌ను నివారించే టీకాలు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని మూడు దఫాలుగా తీసుకోవాలి. మొదటి టీకా తీసుకున్న రెండు నెలల తరువాత రెండవది.

ఆ తరువాత ఆరుమాసాలకు మూడవ టీకా తీసుకోవాలి. దీనిని 12 ఏళ్ల వయసునుంచి 40 ఏళ్ల లోపు స్త్రీలు ఈ టీకాలు తీసుకోవచ్చు. ఈ టీకాలు హెచ్‌పివి ఇన్‌ఫెక్షన్ లను నియంత్రించి క్యాన్సర్ బారిన పడకుండా చాలా వరకు కాపాడతాయి. పెళ్లి కాకపోయినా, శృంగారంలో పాల్గొనకపోయినా కొందరికి ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రావచ్చు. ఈ క్యాన్సర్ రావడానికి శృంగారం అన్నది ఒక కారణమే తప్ప అదే అన్నింటికీ మూలం కాదు.

బహిష్టు సక్రమంగా రావడానికో, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో బహిష్టును ఆపడానికో వేసుకునే హార్మోన్ మాత్రల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఈ హార్మోన్ మాత్రల వల్ల గర్భాశయ ముఖ ద్వారం వద్ద వచ్చే కొన్ని మార్పులతో కూడా ఆ భాగంలో క్యాన్సర్ రావచ్చు. అందుకే 20 నుంచి 64 ఏళ్ల లోపు వారంతా ఒకసారి ఈ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం అవసరం. 65 ఏళ్లు వచ్చినా ఇంతవరకూ ఈ పరీక్షలేవీ చేయించుకోని వారు ఒకసారి ఈ పరీక్షలు చేయించుకుని నార్మల్ అని వస్తే ఆ తరువాత ఇంక అవసరం లేదు.

అపోహలే ఎక్కువ

తెల్లబట్టకావడం, నడుము నొప్పి రావడం, బహిష్టులో అతిగా రక్తస్రావం కావడం, లేదా అసలే బహిష్టు కాకపోవడం, లేదా ప్రతినెలా సకాలంలో కాకపోవడం వంటివి కూడా క్యాన్సర్‌కు దారి తీయవచ్చుననే అపోహలు చాలా మందిలో ఉన్నాయి. అందుకే ఎందుకైనా మంచిదని వెళ్లి గర్భాశయాన్ని తీసివే యించుకోవడం చేస్తూ ఉంటారు. ఇది పూర్తిగా అర్థం లేనిది. నిజానికి బహిష్టుకు సంబంధించి అన్నీ సవ్యంగానే ఉన్నా క్యాన్సర్ రాదన్న గ్యారెంటీ ఏమీ లేదు.

అలాగే అవి అస్తవ్యస్తంగా ఉన్న వారందరికీ క చ్చితంగా క్యాన్సర్ వస్తుందని కూడా లేదు. అందుకే 20 నుంచి 45 ఏళ్లలోపు ప్రతి మూడేళ్లకు ఒకసారి చొప్పున పాప్‌స్మియర్ పరీక్ష చేయించుకోవడం అవసరం. అలాగే 40 ఏళ్లు దాటిన వారు 65 ఏళ్లదాకా ప్రతి ఐదేళ్లకు ఒకసారి చొప్పున ఈ పరీక్ష చేయించుకోవడం అవసరం. ప్రతి మూడేళ్లకు ఒకసారి ఈ పరీక్షలు చేయిస్తూ ఉంటే ఆ భాగంలో ఏదైనా చిన్న మార్పు కనిపిస్తే వెంటనే అది క్యాన్సర్‌గా మారకుండా నివారించే చికి త్సలు అందించవచ్చు.

ఎంత సమయం పడుతుంది ?

నిజానికి పాప్‌స్మియర్ పరీక్ష కేవలం ఐదు నిమిషాల్లో పూర్తవుతుంది. నెలసరి అయిన 10 నుంచి 15 రోజుల మధ్య ఈ పరీక్ష చేస్తారు. కేవలం క్యాన్సర్ విషయాలే కాదు, గనేరియా, క్లెమేడియా, ట్రైకోమోనియాసిస్, క్యాండీడియాసిస్ (ఫంగల్)కు సంబంధించిన ఇన్‌ఫెక్షన్లు ఉన్నా ఈ పరీక్షలో దొరికిపోతాయి. వీటికి చికిత్స తీసుకుంటే సంతాన లేమి సమస్య రాకుండా తప్పిపోతుంది. మూడేళ్లకోసారి పాప్‌స్మియర్ పరీక్షలు చేయించుకుంటున్నా మధ్యలో ఎప్పుడైనా బహిష్టుకు సంబంధించి ఏమైనా సమస్యలు తలెత్తినప్పుడు కూడా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

సర్జరీ, రేడియేషన్స్‌పై అపోహలు- వాస్తవాలు

క్యాన్సర్ చికిత్సలో భాగంగా చేసే శస్త్రచికిత్సపై గ్రామీణ ప్రాంతాల్లో చాలా అపోహలు ఉన్నాయి. క్యాన్సర్ భాగంలో శస్త్రచికిత్స చేస్తేనే రోగి త్వరగా ప్రమాదానికి లోనవుతాడని ఒక దురభిప్రాయం ఉంది. దాన్ని అలాగే వదిలేస్తే రోగి చాలా కాలం జీవిస్తాడని, సర్జరీ తర్వాత రోగి పరిస్థితి చాలా వేగంగా విషమిస్తుందని ఒక అపోహ ఉంది.

క్యాన్సర్‌కు చేసే చికిత్సా ప్రక్రియలైన సర్జరీ, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ వంటి వాటిల్లో అత్యంత ముఖ్యమైంది శస్త్రచికిత్సే. పైగా చాలా రకాల క్యాన్సర్లకు అదే ప్రధాన చికిత్స. ఉదాహరణకు... నోరు, స్వరపేటిక, అన్నవాహిక, పేగులు, మెదడు, ఊపిరితిత్తులు, జననేంద్రియాల్లో వచ్చే క్యాన్సర్ గడ్డలకూ, కండరాల్లో, ఎముకల్లో, కాలేయంలో, మూత్రపిండాల్లో, పాంక్రియాస్‌లో... ఈ క్యాన్సర్లన్నింటికీ శస్త్రచికిత్సే ప్రధాన చికిత్స.

అపోహకు కారణం : నిజానికి క్యాన్సర్ కణాలు సూక్ష్మాతి సూక్ష్మమైనవి. శస్త్రచికిత్స చేసి క్యాన్సర్ గడ్డను తొలగించే సమయానికే అవి రక్తప్రసరణలోకి చేరి లేదా లింఫ్ గ్లాండ్స్‌లోకి చేరి... వేరే చోట్లకు పాకిపోయివుంటే కలిగే దుష్పరిణామమిది. అయితే సాధారణ ప్రజలు తమ అవగాహనలోపం వల్ల ఆ పరిణామాన్ని సర్జరీకి ఆపాదిస్తారు. వాస్తవానికి ఆ శస్త్రచికిత్సే జరపకపోతే ప్రమాదం మరికాస్త ముందే వచ్చేస్తుంది. రక్తం లాగే లింఫ్ ప్రవాహం కూడా శరీరమంతా ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే... క్యాన్సర్‌కు అదో ‘గేట్’ లాంటిదని భావిస్తారు డాక్టర్లు. క్యాన్సర్ ఉన్నచోటే ఉందా, లేక శరీరంలోని ఇతర చోట్లకు పాకిందా అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం నిపుణులు లింఫ్ గ్రంథుల్ని పరిశీలిస్తారు. ఒకవేళ క్యాన్సర్ కణాలు లింఫ్ గ్రంథుల్లో ఉంటే... క్యాన్సర్ గడ్డ మొదట కనుగొన్న శరీర భాగంలోనే గాక, లింఫ్ నాళాల ద్వారా ఇతర భాగాలకూ పాకి ఉంటుందని అనుమానిస్తారు. అప్పుడు శరీరంలో మొదట కనుగొన్న గడ్డను శస్త్రచికిత్సతో తొలగించడంతో పాటు... ఇతరచోట్లకు పాకిందని అనుమానిస్తున్న చోట్లలో రేడియేషన్ థెరపీ ఇస్తారు. అవసరాన్ని బట్టి కీమోథెరపీ చేస్తారు. కాబట్టి కత్తి పెడితే క్యాన్సర్ వేగంగా పాకుతుందనేది కేవలం ఓ అపోహ మాత్రమే. క్యాన్సర్‌కు శస్త్రచికిత్స చేసేటప్పుడు అప్పటికే వేరేచోట్ల పాకి ఉన్న సూక్ష్మమైన క్యాన్సర్ కణాలు స్కాన్‌లో కూడా కనపడవు. ఈ కారణం వల్లనే చాలామందిలో ఈ అపోహ సుదీర్ఘకాలంగా ఉండిపోయింది.

రేడియేషన్ చికిత్స బాధాకరంగా ఉంటుందా?

క్యాన్సర్‌కు చేసే రేడియేషన్ చికిత్సలో కరెంట్ షాకులిస్తారని అది చాలా బాధాకరం అన్న అపోహ ఉంటుంది. రేడియేషన్ చికిత్సను గ్రామీణ ప్రాంతాల్లో కరెంట్ చికిత్స అంటారు. దాంతో కరెంట్ చికిత్సలో షాక్‌లు ఇస్తారనే అపోహ ఉంది. నిజానికి రేడియేషన్ అంటే అది ఎక్స్-రే వంటి కిరణాలతో చేసే చికిత్స. అత్యంత శక్తిమంతమైన ఎక్స్-రేలను క్యాన్సర్ గడ్డ ఉన్నచోటే కేంద్రీకృతమయ్యేలా చేసి ఆ గడ్డను తొలగిపోయేలా చేస్తారు. దీన్ని వైద్యపరిభాషలో చెప్పాలంటే హై పవర్ ఎక్స్-రేస్ టార్గెటెడ్ ప్రిసైస్‌లీ ఆన్ ట్యూమర్ టిష్యూ అంటారు.

అపోహ : క్యాన్సర్ చికిత్స తర్వాత బాగా బలహీనపడిపోతారని, మామూలు మనిషి కావడం కష్టమనే అపోహ ఉంది. క్యాన్సర్ చికిత్స తర్వాత సాధారణ ఆరోగ్యం పుంజుకున్న వాళ్లంతా ఆరోగ్యకరమైన ఇతరుల్లాగే సంపూర్ణారోగ్యవంతులవుతారు. ఇప్పుడు శక్తిమంతమైన రేడియేషన్స్‌ను క్యాన్సర్ ఉన్నచోట ఇవ్వడం వల్ల చాలా క్యాన్సర్స్ తగ్గుతాయి. ఆ రోగులు కూడా ఇతరుల్లా అన్ని పనులూ చేసుకుంటూ ఆరోగ్యకరమైన సాధారణ జీవితాన్ని గడపగలరు.

ఊపిరితిత్తుల క్యాన్సర్

ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే ఏమిటి? ఇది ఎవరికి వస్తుంది? రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? పురుషులలో ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ తరువాత, స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ తరువాత ఈ లంగ్ క్యాన్సర్ చాలా ఎక్కువగా వస్తుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ చాలా వరకు చివరి దశలోనే కనుగొనబడుతుంది. అందుచేత దీని వల్ల సంభవించే మరణాలు కూడా ఎక్కువే. ఇది స్త్రీలకంటే మగవారిలోనే ఎక్కువగా వస్తుంది.

వయసుతోపాటు..

ఈ క్యాన్సర్ వయసుతోపాటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. 70 సంవత్సరాలకు పైబడిన వారిలో లంగ్ క్యాన్సర్ చాలా ఎక్కువగా ఉంటుంది. 40 సంవత్సరాలకంటే తక్కువ వయసు ఉన్న వారిలో తక్కువగా వస్తుంది.

ఎన్నో రకాలు..

ఊపిరితిత్తుల క్యాన్సర్‌ని రెండు రకాలుగా విభజించారు. ఒకటి - స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్, రెండోది - నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్. నాన్ స్మాల్ సెల్ క్యాన్సర్ అన్ని రకాల లంగ్ క్యాన్సర్లలో 85 శాతం ఉంటుంది. దీనిని స్క్వామన్ సెల్ కార్సినోమా, ఎడినో కార్సినోమా, లార్జ్ సెల్ కార్సినోమా అని మూడు రకాలుగా విభజించారు. అసలు ఇన్ని రకాల విభజించవలసిన అవసరం ఏమిటంటే.. వీటిలో రకాన్ని బట్టి చికిత్స మారడమే. కొన్ని రకాల ఊపిరితిత్తుల క్యాన్సర్లు అసలు ధూమపానం ఎరుగని వారికి కూడా వస్తాయి.

ఇవీ లక్షణాలు..

దగ్గు, ఆయాసం, ఊపిరితిత్తులు కుంచించుకు పోవడం (అఖీఉఔఉఇఖీఅఖిఐఖి), శ్వాసనాళాలకు అడ్డు పడడం వల్ల న్యుమోనియా రావడం, పిల్లికూతలు, దగ్గులో రక్తం పడడం, ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరడం (్కఔఉ్ఖఖఅఔ ఉఊఊ్ఖఖిఐౖూ ) లాంటి లక్షణాలు ఊపిరితిత్తులలోని క్యాన్సర్ గడ్డ పరిమాణం వలన వస్తాయి.

క్యాన్సర్ చుట్టు పక్కల అవయవాలకు విస్తరించడం వలన స్వరపేటిక నరాలు దెబ్బతిని గొంతుపోవడం, బొంగురు పోవడం, శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడే విభాజక పటలం పని చేయకపోవడం (ఈఐఅ్కఏఅఖఅఎకఅఖీఐఇ ్కఅఖఅఔ్గఖిఐఖి ), అన్న వాహికకు విస్తరించడం వలన మింగుడు పడకపోవడం తదితర లక్షణాలు వస్తాయి. అంతేకాకుండా క్యాన్సర్ కాలేయానికి, ఎముకలకు, మూలుగకి, మెదడుకు కూడా విస్తరించే ప్రమాదం ఉంటుంది. క్యాన్సర్ కణాల నుండి విడుదలయ్యే వివిధ రకాల రసాయనాల వలన రక్తంలో కాల్షియం పెరగడం, రక్తం త్వరగా గడ్డకట్టడం లాటివి జరగవచ్చు.

క్యాన్సర్‌కు కారణాలు..

  • 90 శాతం ధూమపానం వలన వస్తుంది. పురుషులలో 78 శాతం, స్త్రీలలో 90 శాతం ధూమపానం వల్లనే వస్తుంది.
  • పాసివ్ స్మోకింగ్ లేదా సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ : ధూమపానం చేసే వారికి దగ్గర్లో ఉండడం వలన, వారు పీల్చి వదిలే పొగ పక్కనున్న వారు పీల్చుకోవడం ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
  • జన్యు సంబంధమైన ససెస్టిబిలిటీ వలన ఎవరైతే క్యాన్సర్ కారకాలకు ఎక్స్‌పోజ్ అవుతారో అలాంటి వాళ్ళల్లో క్యాన్సర్ త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది.
  • ఆస్‌బెస్టాస్, రేడాన్ గ్యాస్‌లకు ఎక్స్‌పోజ్ అవడం వలన..
  • ఎయిడ్స్ సోకిన వారిలో 6.5 రెట్లు అధికంగా లంగ్ క్యాన్సర్ వస్తుంది.
  • బెరీలియం, నికెల్, రాగి, క్రోమియం, కాడ్మియం లాంటి పదార్థాలు కూడా క్యాన్సర్‌ని కలుగజేస్తాయి. తరచూ పరీక్షలు..

40 సంవత్సరాలకు పైబడిన వారు, కుటుంబంలో క్యాన్సర్ వచ్చిన వారు, ధూమపానం చేసేవారు, పైన ఉదహరించిన రోగ లక్షణాలు కనబడిన వారు పల్మనాలజిస్ట్‌ను సంప్రదించి తరచూ అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. ఉదాహరణకు.. ఛాతీ ఎక్స్‌రే, కళ్ళె పరీక్ష, బ్రాంకోస్కోపీ.. అవసరమైతే సిటి లేదా పిఇటి స్కాన్‌లాంటివి చేయించుకోవడం మంచిది.

కొంతమందిలో ఇలాంటి పరీక్షలు ఇతర కారణాల దృష్ట్యా చేసినప్పుడు కూడా క్యాన్సర్ బయటపడవచ్చు. ఇలాంటి వారిలో అప్పటికి ఎలాంటి రోగ లక్షణాలు మొదలుకాకపోవచ్చు. క్యాన్సర్ స్టేజిని బట్టి రకాన్ని బట్టి ఎలాంటి వైద్యం చేయాలో నిర్ణయిస్తారు. ఆహారంలో ఎక్కువగా తాజా కూరగాయలు, పండ్లు, పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకునే వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు అత్యల్పంగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ముందుగా గుర్తిస్తే అదుపులో క్యాన్సర్

అప్పటిదాకా నిక్షేపంగా ఉన్న వ్యక్తి ఆ తరువాత కొద్దిరోజులకే జబ్బు పడతాడు. అంటే మనకు తెలియకుండానే మనలో వ్యాధి వ్యాప్తి చెందుతుందన్నమాట. చాలాసార్లు మనకున్న జబ్బు గురించి తెలిసే సరికే పరిస్థితి విషమించి పోవచ్చు. క్యాన్సర్ల విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఎక్స్‌రే తప్ప మరే పరీక్షా సాధనాలూ లేని రోజుల్లో క్యాన్సర్ చివరిదశకు వచ్చే దాకా తెలిసేదే కాదు. ఇప్పుడు అత్యాధునిక స్క్రీనింగ్‌లు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. ఇవి పైకి ఏ చిన్న లక్షణమూ కనిపించని దశలోనే వ్యాధిని గుర్తిస్తాయి. పైకి లక్షణాలు కనిపించాయీ అంటే అప్పటికే వ్యాధి ఒక దశను దాటిందని అర్థం. అందుకే లక్షణాలు బయటపడక ముందే స్కీనింగ్‌ల ద్వారా వ్యాధిని గుర్తించడం శ్రేయస్కరం. లక్షణాలు కనిపించక ముందే వ్యాధిని గుర్తిస్తే క్యాన్సర్ నుంచి పూర్తిగా బయటపడవచ్చు నంటున్నారు, ఛీప్ సర్జికల్ ఆంకాలజిస్టు డాక్టర్ సీహెచ్ మోహనవంశీ.

ఈ కణితి నా మెడ మీద చాలా రోజుల క్రితమే కనిపించింది. కానీ, ఏదోలే అనుకుని పట్టించుకోలేదు. అది క్యాన్సర్ అవుతుందని అప్పుడు నాకు మాత్రమేం తెలుసు? తీరా తెలిసే నాటికి పరిస్థితి చేయిదాటిపోయింది అంటూ విషాదంలో మునిగిపోయే వారు ఎంతో మంది కనపడతారు. నిజమే మరి? వ్యాధి లక్షణాల గురించి ముందే అవగాహన లేనప్పుడు ఎవరైనా చేయగలిగేది ఏముంటుంది? అందుకే క్యాన్సర్ ముందస్తు లక్షణాల గురించిన అవగాహనను ప్రతి ఒక్కరూ పెంచుకోవలసి ఉంది. క్యాన్సర్‌ను ఎంత ముందుగా గుర్తిస్తే, అంత సులువుగా నయం చేయవచ్చు. క్యాన్సర్ తాలూకు విషాదాలన్నీ వ్యాధిని గుర్తించడంలో జరిగిన జాప్యాల ఫలితమే. ఒకప్పుడు ముందే గుర్తించగలిగే అంత శ క్తివంతమైన స్క్రీనింగ్‌లు లేనిమాట నిజమే. కానీ, ప్రస్తుతం అధునాతమైన స్కానింగ్‌లు వచ్చాయి. వాటి ద్వారా సమస్యను చాలా ముందే గుర్తించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. క్యాన్సర్‌ను ముందే గుర్తించే మార్గాలు రెండు. వాటిలో మొదటిది, క్యాన్సర్ ముందస్తు లక్షణాల గురించి తెలిసి ఉండడం. రెండవది స్క్రీనింగ్.

ముందస్తు లక్షణాలు

శరీరంలో వచ్చే ఎన్నో మార్పులను మనం చాలా సార్లు పట్టించుకోము. కానీ, వాటిలో కొన్ని క్యాన్సర్ సంబంధిత ముందస్తు లక్షణాలు కావచ్చు. ఆ లక్షణాల గురించి తెలిసి ఉంటే గాని వ్యాధిని ముందే పసికట్టడం సాధ్యం కాదు. రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, నోటి క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్, చర్మక్యాన్సర్ వంటివి రావడానికి ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. గడ్డలు, అసాధారణ రక్తస్రావం, చాలా కాలంగా జీర్ణశక్తి సరిగా లేకపోవడం వంటివి ఆ లక్షణాల్లో కొన్ని. ఈ లక్షణాల గురించిన అవగాహన ఉంటే క్యాన్సర్‌ను ముందే గుర్తించడం సాధ్యమవుతుంది.

స్క్రీనింగ్

కొందరు పైకి ఆరోగ్యంగానే కనిపిస్తున్నా, లోలోపల క్యాన్సర్ మూలాలు ఉంటాయి. అలా నిగూఢంగా ఉన్న క్యాన్సర్‌లను గుర్తించడానికి నిర్వహించే పరీక్షే స్క్రీనింగ్. పైకి వ్యాధి లక్షణాలేవీ కనిపించని వారంతా కచ్ఛితంగా ఆరోగ్యంగా ఉన్నట్లేమీ కాదు. అందుకే అప్పుడప్పుడు కొన్ని స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ఎంతో శ్రేయస్కరం. ఏమిటా కారణాలు?

పొగ తాగడం, పొగాకు, గుట్కా, పాన్ మసాల, జర్ద వంటి వినమిలే అలవాటు ఉన్న వారు, *అతిగా మద్యం సేవించేవారు, సిర్రోసిస్ లాంటి కాలేయ వ్యాధులు ఉన్న వారు, * వ్యాయామం చేయని వారు, స్థూలకాయులు, కొవ్వుపదార్థాలు ఎక్కువగా తీసుకునే వారు, * పీచు పదార్థాలు తక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకునే వారు, మసాలా పదార్థాలు అతిగా తినేవారు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగాఉంటుంది.మహిళలకోసం ఈ స్క్రీనింగ్‌లు

బ్రె స్ట్ క్యాన్సర్ :

  • ఈ క్యాన్సర్‌ను ముందే గుర్తించడానికి 40 ఏళ్లు నిండిన ప్రతి స్త్రీ ఏటా ఒకసారి డిజిటల్ మమ్మోగ్రామ్ పరీక్ష చేయించుకోవడం మంచిది.
  • 30 ఏళ్లు నిండిన స్త్రీలు ప్రతి మూడేళ్లకు ఒకసారి నిపుణులైన వైద్యులతో స్తనాల పరీక్ష చేయించుకోవాలి. ఇక 40 ఏళ్లు నిండిన స్త్రీలంతా ఏడాదికి ఒకసారి స్తనాల పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి.
  • 20 ఏళ్లు నిండిన ప్రతి స్త్రీ స్వయంగానే తరుచూ స్తనాలను పరీక్షించుకోవాలి. స్తనాల్లో ఎప్పుడైనా కణుతులు, గడ్డలు ఉన్నట్లు అనిపిస్తే వెంటనే నిపుణులైన డాక్టర్‌ను సంప్రదించాలి.

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్

  • శృంగారంలో పాల్గొనడం మొదలైన మూడేళ్ల నుంచి ప్రతి స్త్రీ గర్భాశయ ముఖద్వారానికి స్క్రీనింగ్ పరీక్ష చేయించుకుంటూ ఉండాలి.
  • సాధారణ పిఏపి పరీక్ష పద్ధతిలో ఏడాదికి ఒకసారి స్క్రీనింగ్ చేయించుకోవాలి. అదే లిక్విడ్-బేస్డ్ పిఏపి పద్ధతిలో అయితే రెండేళ్లకు ఒకసారి పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది.
  • 30 ఏళ్లు పైబడిన స్త్రీలంతా ప్రతి మూడేళ్లకు ఒకసారి పిఏపి పరీక్ష మరియు హెచ్‌పివి., డిఎన్ఏ పరీక్ష చేయించుకుంటే మంచిది. అయితే హెచ్ఐవి , అవయవ మార్పిడి, కీమోథెరపీ, మత్తు, మాదక ద్రవ్యాల కారణంగా వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోయిన వారు ఈ పరీక్షలు ఏటా ఒకసారి చేయించుకోవడం చాలా అవసరం.

స్త్రీలలో 70 ఏళ్లు పైబడి, గత పదేళ్లుగా పిఏపి పరీక్షల్లో నార్మల్‌గా వచ్చిన వారు స్క్రీనింగ్ పరీక్షలను ఇంక ఆపేయవచ్చు. అలాగే హిస్టరెక్టమీ ద్వారా గర్భాశ యంతో పాటు, గర్భాశయ ముఖద్వారాన్ని కూడా తొలగించిన వారికి కూడా స్క్రీనింగ్ పరీక్షలు చేయవలసిన అవసరం లేదు. అయితే, కేవలం గర్భాశయాన్ని మాత్రమే తొలగించి ముఖద్వారాన్ని తొలగించని సందర్భాల్లో మాత్రం స్క్రీనింగ్ పరీక్షలు కొనసాగించవలసిందే.

వ్యాక్సిన్ తీసుకుంటే...

పదేళ్లు నిండిన అమ్మాయిలకు, 46 ఏళ్ల లోపు స్త్రీలకు సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించే వ్యాక్సిన్ తీసుకోవడం ఎంతో మేలు. ఈ టీకాలకు 90 శాతం సర్వైకల్ క్యాన్సర్‌లను నిరోధించే సామర్ధ్యం ఉంది. ప్రొస్టేట్ క్యాన్సర్:

పురుషుల్లో వచ్చే క్యాన్సర్‌లలో ప్రొస్టేట్ క్యాన్సర్ కూడా ఒకటి. ఈ క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య భారతదేశంలో తక్కువేమీ కాదు. కానీ, చాలా మందికి అవగాహన లేదు. అందుకే పురుషులు తరుచూ ప్రొస్టేట్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని అంతర్జాతీయ సంస్థలెన్నో సూచిస్తున్నాయి. అయినా ఈ పరీక్షలకు వెళుతున్న వారి సంఖ్య ఇప్పటికీ చాలా తక్కువే. నిజానికి 50 ఏళ్లు నిండిన మగవారంతా ఏటా ఒకసారి పిఎస్ఏ ( ప్రొస్టేట్ స్పెసిఫిక్ ఆంటిజన్) రక్త పరీక్ష, డిజిటల్ రెక్టల్ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి. ఒకవేళ తన కుటుంబంలోనే ఎవరికైనా (నాన్న, సోదరుడు, కొడుకు) ప్రొస్టేట్ క్యాన్సర్ ఉంటే వారు 40 ఏళ్ల నుంచే ప్రొస్టేట్ స్క్రీనింగ్‌లు విధిగా చేయించుకోవాలి.

రొమ్ము క్యాన్సర్... అపోహలూ, వాస్తవాలు

రొమ్ము క్యాన్సర్ విషయంలో మహిళలకు ఎన్నోఅపోహలు ఉంటాయి. వాటిని తొలగించుకునే వాస్తవాలను తెలుసుకోవడం వల్ల మానసికంగాఎంతో భరోసా కలుగుతుంది. ఆ భరోసా కలిగించడం కోసం దోహదపడేవే ఈ కిందివిషయాలు...

అపోహ : వయసు మీరిన మహిళల్లోనే రొమ్ముక్యాన్సర్ కనిపిస్తుంది.

వాస్తవం : నిజానికి పెరిగే వయసు ఒక రిస్క్ ఫ్యాక్టరే అయినా కొన్నిసార్లు అంత పెద్ద వయసు లేకపోయినా రొమ్ముక్యాన్సర్ కనిపించవచ్చు.

అపోహ : రొమ్ములోని గడ్డలన్నీ క్యాన్సర్లే

వాస్తవం : కాదు... దాదాపు 80 శాతం గడ్డలు హానికరం కానివే. అయితే వయసు మీరుతున్న కొద్దీ ఈ శాతం (సంఖ్యలో) మారుతుంది.

అపోహ : నిపిల్ నుంచి స్రావాలు క్యాన్సర్‌కు సూచిక.

వాస్తవం : సాధారణంగా నిపిల్‌లో కనిపించే స్రావాలన్నీ క్యాన్సర్‌కు సూచిక కాదు. చాలామంది మహిళల్లో (దాదాపు 60 శాతం మందిలో) ఇది కనిపిస్తుంది. ఆ స్రావాలు పాలలా, కాస్తంత పసుపు రంగు లేదా ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంటే అది ప్రమాదకరం కాదు. అయితే రక్తంలా ఎరుపు రంగులో ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్ పరీక్షించి అది హానికరం కాదంటే ఇక భయపడాల్సిందేమీ ఉండదు.

అపోహ : మామోగ్రామ్‌తో క్యాన్సర్‌ను నివారించవచ్చు.

వాస్తవం : మామోగ్రామ్ వల్ల క్యాన్సర్‌ను ముందుగా తెలుసుకోవచ్చు. గాని దాని వల్ల క్యాన్సర్‌ను నివారించలేం.

అపోహ : మామోగ్రామ్ వల్ల క్యాన్సర్ రావచ్చు.

వాస్తవం : మామోగ్రామ్ అన్నది పూర్తిగా సురక్షితమైన ప్రక్రియ. అందులో కొంత రేడియోషన్ వెలువడే అవకాశాలున్నా... ఆధునిక మామోగ్రామ్ ప్రక్రియలో ఉపయోగించే రేడియేషన్ ఏమాత్రం హానికరం కాని మోతాదుల్లోనే ఉంటుంది.

అపోహ : మామోగ్రామ్ అన్నది 100 శాతం క్యాన్సర్‌ను కనిపెట్టేస్తుంది.

వాస్తవం : మామోగ్రామ్ అన్నది అత్యంత సమర్థంగా రొమ్ముక్యాన్సర్‌ను కనిపెట్టే ప్రక్రియ. అయితే అది నూరు శాతం కనిపెట్టకపోవచ్చు. వయసును పరిగణనలోకి తీసుకుంటే 80 శాతం మందిలో మామోగ్రామ్ క్యాన్సర్‌ను పసిగడుతుందనుకోవచ్చు.

అపోహ : మామోగ్రామ్ ద్వారా కనిపెట్టిన ప్రతి క్యాన్సర్‌ను నయం చేయవచ్చు.

వాస్తవం : ప్రతిఏడాదీ చేయించే పరీక్షల వల్ల ముందుగానే క్యాన్సర్‌ను కనిపెట్టడం వల్ల ఈ సౌలభ్యం ఉండవచ్చు. అయితే... అన్ని రకాల క్యాన్సర్ల తీవ్రత ఒకేలా ఉండదు. కొన్ని చాలా తీవ్రంగా ఉండి మామోగ్రామ్ ద్వారా కనిపెట్టేలోపలే ఇతర అవయవాలకూ వ్యాప్తిచెందవచ్చు. మరికొన్ని క్యాన్సర్లు చాలా నెమ్మదిగా వ్యాపిస్తుంటాయి. వాటిల్లో రొమ్ముక్యాన్సర్ ఒకటి. కాబట్టి మామోగ్రామ్ చేయించడం వల్ల ముందుగా కనిపెట్టి చికిత్స చేయించే సౌలభ్యం ఉంది.

అపోహ : రొమ్ము క్యాన్సర్ అంటే రొమ్ములో గడ్డ కనిపించడం తప్పనిసరి.

వాస్తవం : గడ్డలా కనిపించడం అన్నది రొమ్ము క్యాన్సర్ కనిపెట్టడానికి ఒక సూచిక. అయితే అది గడ్డలా చేతికి అందకముందు కూడా క్యాన్సర్ ఉండవచ్చు.

అపోహ : రొమ్ము క్యాన్సర్ అంటే తప్పనిసరిగా రొమ్ము తొలగించాల్సిందే.

వాస్తవం : అందరికీ అవసరం లేదు. ముందుగానే కనిపెడితే కేవలం పెరిగిన గడ్డను తొలగించి (లంపెక్టమీ) ఆ తర్వాత అవసరమైన రేడియేషన్, కీమోథెరపీ ఇవ్వవచ్చు. కొందరిలో కీమోథెరపీ ద్వారా గడ్డ సైజ్‌ను కుంచిచుకుపోయేలా చేసి ఆ తర్వాత గడ్డను తొలగించవచ్చు కూడా.

మూత్రాశయ క్యాన్సర్‌కు ఆధునిక చికిత్స

ధూమపానం, అద్దకం తదితర పరిశ్రమల్లోని రసాయనాల ప్రభావం, మూత్రసంచిలో ఉండే రాళ్ల వల్ల మూత్రాశయ క్యాన్సర్ వస్తుంది. ఈ క్యాన్సర్ కారణంగా మూత్రంలో రక్తం పడుతుంది. మూత్రాశయంలో వచ్చే క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించకుండా సత్వర నివారణకు మెరుగైన చికిత్స చేయించుకోవాలంటున్నారు యూరాలజిస్ట్ డాక్టర్ బి. సూర్యప్రకాష్.

ఇటీవల బ్లాడర్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న వారి సంఖ్య క్రమేణా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. డైయింగ్, కెమికల్ పరిశ్రమల్లో పనిచేసే వారితోపాటు పొగతాగటం, బిల్‌హార్జియాసిస్ అనే రోగ పీడితులు ఎక్కువగా బ్లాడర్ క్యాన్సర్ (మూత్రాశయ క్యాన్సర్)ల బారిన పడుతున్నారు. మూత్రసంచిలో ఎక్కువ కాలంపాటు రాయి ఉన్నా, చికిత్స చేయించుకోని వారికి కూడా క్యాన్సర్ వస్తుంది.

లక్షణాలు :

మూత్రంలో రక్తం పడటం, కడుపులో ఎలాంటి నొప్పిి లేకుండా మూత్రంతో రక్తం కలిసి వచ్చినా, రక్తం గడ్డలుగా తయారై మూత్రంతోపాటు చిన్న రక్తగడ్డలు పడినా, మూత్రం పోసేటపుడు మంట అనిపించినా, పొత్తికడుపులో నొప్పి అనిపించినా మూత్రాశయంలో క్యాన్సర్ ఉందని అనుమానించాలి. ఒక్కో సారి బ్లాడర్‌లో రక్తం గడ్డ కట్టి మూత్రం రాకుండా అట్టుకుంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నపుడు వివిధ రకాల పరీక్షల ద్వారా క్యాన్సర్ ట్యూమర్ సైజు ఎంత ఉంది? బ్లాడర్‌లో ఎక్కడ ఉంది? ఎన్ని ట్యూమర్లు ఉన్నాయి? శరీరంలో ఈ క్యాన్సర్ ఎంతవరకు పాకిందనే అంశాలపై వివిధ పరీక్షల ద్వారా రోగ నిర్ధారణ చేసుకోవాలి.

వ్యాధి నిర్ధారణ పరీక్షలు :

మూత్రంలో రక్తం వచ్చినపుడు ముందుగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవాలి. స్కానింగ్‌లో క్యాన్సర్ ట్యూమర్లు బ్లాడర్‌లో ఉన్నాయని తేలితే మూత్రనాళం ద్వారా మూత్రసంచిలోకి ఓ సన్నని ట్యూబ్ పంపించి లైట్ వేసి పరీక్షిస్తారు. దీన్ని సిస్టోస్కోపి అంటారు. క్యాన్సర్ ట్యూమర్ చిన్న ముక్క తీసుకొని దాన్ని బయాప్సీకి పంపించటం ద్వారా క్యాన్సర్ ఏ దశలో ఉందో గుర్తిస్తారు. దీనిలో భాగంగా బ్లాడర్‌లో ఆరంభమైన క్యాన్సర్ శరీరంలో ఏ ఏ భాగాలకు పాకిందనే అంశంపై లివర్ ఫంక్షన్ టెస్ట్ (ఎల్ఎఫ్‌టీ), ఛాతీ ఎక్స్‌రే, ఐసోటోప్ బోన్ స్కానింగ్ పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షల వల్ల క్యాన్సర్ మూత్రాశయం నుంచి బయటకు విస్తరించిందా? లింఫ్‌నోడ్, లివర్, ఊపిరితిత్తులు, ఎముకలకు పాకిందా అనే అంశాలు తెలుస్తాయి.

క్యాన్సర్‌లో నాలుగు దశలు

మూత్రాశయ క్యాన్సర్‌లో నాలుగు దశలున్నాయి. క్యాన్సర్ మూత్రసంచిలోపల వరకే పరిమితమైతే దాన్ని మొదటి దశ అంటారు. మూత్రసంచి కండరాల్లోకి పాకితే రెండోదశ అని, బ్లాడర్ పరిసర శరీర భాగాలు, లింఫ్‌నోడ్స్‌కు వ్యాపిస్తే మూడవదశగా గుర్తిస్తారు. కాలేయం, ఊపిరితిత్తులు, ఎముకలకు పాకితే నాలుగో దశగా గుర్తించి చికిత్స చేస్తారు. ట్యూమర్ నోడ్ మెటాస్టెసిస్ (టీఎన్ఎం) పరీక్ష ద్వారా క్యాన్సర్ దశను కచ్చితంగా నిర్ధారించవచ్చు.

ట్యూమర్ యూరెత్రల్ రీసెక్షన్ చికిత్స : మూత్రద్వారం నుంచి నాళం ద్వారా ఎండోస్కోపిక్ పద్ధతిలో ఓ చిన్న స్టీలు ట్యూబ్‌ను మూత్రసంచిలోకి పంపించి దాన్ని హై ఫ్రీక్వెన్సీ కరెంటు సాయంతో క్యాన్సర్ ట్యూమర్‌ను ముక్కలుగా చేసి మూత్రనాళం ద్వారా బయటకు తెస్తారు. ఇందులో ఇటీవల లేజర్ కిరణాల సాయంతోనూ క్యాన్సర్ ట్యూమర్‌లను తొలగించే విధానం అందుబాటులోకి వచ్చింది. ఈ శస్త్రచికిత్స వల్ల రక్తస్రావం తక్కువగా కావటంతో పాటు రోగి త్వరగా కోలుకుంటాడు. బ్లాడర్‌లో సూపర్ ఫిషియల్ ట్యూమర్ మూడు, నాలుగు చోట్ల వచ్చినా, తొలగించాక మళ్లీ వచ్చినా బీసీజీ అనే మందును మూత్రసంచిలో వేసి, మళ్లీ ట్యూమర్‌లు ఏర్పడకుండా చికిత్స చేస్తారు.

మజిల్ ఇన్‌వెజూ ట్యూమర్ : మూత్రసంచిలో ఏర్పడిన క్యాన్సర్ ట్యూమర్ మూత్రాశయ కండరాల్లోకి వెళితే మజిల్ డీపర్ బయాప్సీ చేస్తారు. అలాంటపుడు ఆపరేషన్ చేసి, క్యాన్సర్ సోకిన మూత్రసంచిని పూర్తిగా తొలగిస్తారు. దీన్ని టోటల్ సిస్టెక్టమీ ఆపరేషన్ అంటారు. మూత్రం రావటానికి వీలుగా పొత్తికడుపులో కుడివైపు ఓ కృత్రిమ సంచిని బయట అమరుస్తారు. మూత్రసంచిని తొలగించేందుకు అంగీకరించని రోగులకు రేడియో థెరపీ, కీమోథెరపీల ద్వారా క్యాన్సర్ ట్యూమర్ల నివారణకు చికిత్స చేస్తారు. ఓ సారి మూత్రాశయంలో క్యాన్సర్ వచ్చాక, ఆపరేషన్ చేసి ట్యూమర్లను తొలగించిన తర్వాత కూడా ప్రతి మూడు నెలలకు ఓసారి అల్ట్రాసౌండ్, సిస్టోస్కోపి పరీక్షలు చేయించుకోవటం అవసరం. క్యాన్సర్ ట్యూమర్లను తొలగించేందుకు శస్త్రచికిత్స చేయించుకోవటంలో జాప్యం చేస్తే ఈ క్యాన్సర్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదముంది.

స్త్రీలలో కేన్సర్‌ - రకాలు

మానవ శరీరంమంతా కణనిర్మితం. ఏ అవయవం చుట్టూ ఉన్న కణాలు ఆ అవయవాలు చేసే పనికే తోడ్పడుతాయి. మూలకణాలు శరీరంలో ఏ ప్రాంతంలో వేస్తే ఆ కణాలుగా మారతాయి. ఇవి శరీరంలో ఎక్కువగా ఎముక భుజాల్లో ఉంటాయి. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. కణాల పనులే కాదు, పరిమాణం కూడా పద్ధతిగానే ఉంటుంది. రోజు మన శరీరంలో ఎన్ని కణాలు చనిపోతుంటాయో అంతే స్థాయిలో కొత్త కణాలు పుడుతుంటాయి. అలా ఉత్పత్తి కాకుండా అదుపుతప్పిన కణవిభజననే ‘మ్యుటేషన్స్‌’ అంటారు. ఈ మ్యుటేషన్స్‌ కారణం వల్ల భిన్న పరిమాణమైన లేక అవసరం కన్నా ఎక్కువ కణాలు ఉత్పత్తి కావడాన్నే కేన్సర్‌ అంటారు. ఇక స్ర్తీలలో పలు రకాల కేన్సర్‌ వ్యాధులు వస్తున్నాయి. వీటిలో గర్భాశయ కేన్సర్‌ (యుటెరస్‌ క్యాన్సర్స్‌), గర్భాశయ ముఖద్వారం (సర్వికల్‌ కేన్సర్స్‌) ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అనవసర, భిన్నపరిమాణమైన కణాలు ఒకే చోట పెరిగితే ఆ కంతిని ‘బినైన్‌ ట్యూమర్‌’ అంటారు. ఇది ప్రాణాంతకం కాదు. కంతిగా బాగా పెద్దదైతే శస్తచ్రికిత్సతో తొలగించవచ్చు. కొన్ని సార్లు అసహజ కణాల ఉత్పత్తి శరీరంలో ఒకే చోట కాకుండా ఇతర ప్రాంతాలకు వ్యాపిచెందుతుంటాయి. వీటిని ‘ మాలిగ్నెం ట్‌ ట్యూమర్స్‌ ’ అంటారు. ఇవి రక్తం ద్వారాగానీ, లింఫ్‌ ద్వారా గానీ శరీరంలో ఒక చోట నుంచి మరోక చోటుకు వెళ్తుం టాయి.

లింఫ్‌ ద్వారా అయితే లింఫ్‌ గ్రంథులు వాస్తాయి. రక్తం ద్వారా అయితే ఊపిరితిత్తులు, మెదడు, కాలేయం, ఎముకల్లోకి వ్యాప్తిచెందుతాయి. అందుకే శరీరంలో ఏగ్రంథు లు వాచినా, ఏ ప్రాంతంలో గడ్డలు అనిపించినా, ఎటువంటి స్ర్తావం జరుగుతున్నా మనం నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే పరీక్ష చేయించుకొని కారణం తెలుసుకొని అవసరమైన చికిత్స ను ఆలస్యం చేయకుండా చేయించుకోవాలి. చాలా వరకు కేన్సర్‌ను ప్రథమ దశలోనే గుర్తించగలిగితే పూర్తిగా నయం చేయవచ్చు. ఆలస్యమైన కొద్ది నష్టం జరిగి చికిత్స కష్టంగా మారుతుంది.

వయసు మీరిన కొద్దీ...

దాదాపు 35ఏళ్ళ వయస్సు వరకూ మన శరీరంలో ఎన్ని కణా లు దెబ్బతిన్నాయో అన్ని కణాలూ ఉత్పత్తి అవుతుంటాయి. ఆ తర్వాత వయస్సు పెరుగుతున్న కొద్దీ దెబ్బతినే కణాల కన్నా పునఃరుత్పత్తి అయ్యే కణాల సంఖ్య తగ్గుతుంటుంది. దాంతో అవయవాల శక్తి తగ్గుతుంది. పెరిగే కొద్దీ కణాల ప్రక్రియలలో జరిగే తప్పులూ పెరిగే అవకాశముంది. మామూలుగా పి-53 అనే జీన్‌ ఈ తప్పుల్ని సరిదిద్దుతుంటుంది. దీనినే ‘మాలిక్యు లార్‌ పోలీస్‌’ అంటారు. ఈ మాలిక్యులార్‌ పనితీరు ‘ మ్యూటేష న్స్‌’తో దెబ్బతింటుంది.

వయస్సు పెరుగుతున్న కొద్దీ దెబ్బతినే కణాల్లో తప్పులను సరిదిద్దే పి-53 జీన్‌ కూడా ఉండటంతో కణాల్లో జరిగే ప్రక్రియల్లో తప్పుల్ని సరిదిద్దే వాళ్ళుండరు. దాంతో కణాలమీద నియంత్రణ తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితు ల్లో పొగాకు, ఆల్కహాల్‌, శుభ్రత లోపించడంలాంటి అలవాట్లు సమ్మెటపోటులా పనిచేస్తాయి. మన దేశంలో ప్రతి ఎనిమిది మందిలో ఒకరు...55 దాటిన వాళ్ళు కేన్సర్‌తో బాధపడు తున్నారు. దాంతో వయస్సు పెరిగిన వాళ్ళల్లో మనకి రకరకాల క్యాన్సర్‌లు కనిపిస్తుంటాయి. ఇప్పుడు మరణాలలో ఎక్కువగా గుండెజబ్బు తరువాత రెండవది కేన్సర్‌‌‌!

వివిధ రకాలుగా...

క్యాన్సర్‌ శరీరంలో ఏ భాగంలోనైనా రావచ్చు. కానీ సాధార ణంగా మగవాళ్ళలో ఓరల్‌ (నోటికి) సంబంధించిన క్యాన్సర్స్‌, ఊపిరితిత్తుల క్యాన్సర్స్‌, ప్రొస్టేట్‌ క్యాన్సర్స్‌ ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆడవాళ్ళలో అయితే రొమ్ము కేన్సర్‌, గర్భాశయ కేన్సర్‌. అభివృద్ది చెందిన దేశాల్లో ఆడవాళ్ళల్లో బ్రెస్ట్‌ కేన్సర్‌ ఎక్కువ. వివాహం చేసుకోక పోవడం, పిల్లలకి పాలివ్వక పోవడం లాంటి కారణాల వల్ల ఇవి రావచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో, పెరుగుతున్న దేశాల్లో గర్భాశయ కేన్సర్స్‌ ఎక్కువ. ఇందుకు ప్రధాన కారణం పరిశుభ్రత లోపించడం, చిన్నవయస్సులో సెక్స్‌, గర్భంధరించడం, ఎక్కువ ప్రసవాలు, హెచ్‌పి.వి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.

మర్మావయవ ప్రాంతంలో శుభ్రత పాటించాలనే విషయంలో గ్రామీణ ప్రాంతాల స్ర్తీలకు సరైన అవగాహన లేదు. ఆ ప్రాం తాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడబడితే అక్కడ మూత్రానికి వెళ్ళడం లాంటిది మంచిది కాదు. ఎందుకంటే స్ర్తీ మర్మావయవాలు అలా కూర్చున్నప్పుడు నేల ప్రాంతానికి దగ్గర గా ఉంటాయి. ఇన్‌ఫెక్షన్స్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలా ఇన్‌ఫెక్షన్స్‌ని, ఇన్‌ఫ్లమేషన్స్‌ని అలాగే వదలేస్తే కేన్సర్స్‌గా మారే అవకాశాలున్నాయి. కాబట్టి యురినరీ ఇన్‌ఫెక్షన్స్‌ లాంటివి వస్తే చికిత్స చాలా అవసరం.

స్ర్తీలలో వెజైనల్‌ క్యాన్సర్స్‌, గర్భాశయ క్యాన్సర్స్‌, గర్భసంచి ముఖద్వారం దగ్గర క్యాన్సర్‌ వస్తుంటాయి. వెజైనల్‌ క్యాన్సర్స్‌ తక్కువ. వీటికన్నా గర్భాశయ క్యాన్సర్స్‌ (యుటెరస్‌ క్యాన్సర్స్‌) ఎక్కువ. వీటి కన్నా కూడా గర్భాశయ ముఖద్వారం (సర్వి కల్‌ క్యాన్సర్స్‌) మరింత ఎక్కు వగా వస్తుంది. ఇంకా చాలా మంది పిన్న వయస్సులోనే ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేస్తున్నారు. చిన్న వయస్సులో శరీరం పూర్తిగా పరిపక్వత చెందకుండా దాంపత్య జీవితంలో పాల్గొనడం మంచిది కాదు. అలాగే చిన్న వయస్సులో ప్రసవాల వల్లా యుటెరెస్‌ కేన్సర్‌ వచ్చే అవకాశాలున్నాయి. కొంత మంది స్ర్తీలు వరుస వరుసగా ఎక్కువ గర్భాలు ధరిస్తారు. అలా జర గడం వల్ల కూడా యుటెరెస్‌ క్యాన్సర్‌ రావచ్చు. ఇలా ఆడవాళ్ళల్లో మర్మావయవం ముందు భాగంలోగానీ , మూత్రాశయంలో గానీ, యుటెరైన్‌ ప్రాంతంలోగానీ కేన్సర్‌‌‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇవి రాకుండా స్ర్తీలు జాగ్రత్త పడాల్సిన అవసరముంది.

హెచ్‌ఐవి వైరస్‌ వల్ల

హెచ్‌.పి.వి వైరస్‌ వల్ల శరీరంలో ఎక్కుడా కేన్సర్స్‌ రావు - గర్భాశయ ముఖద్వారంలో (సర్విక్స్‌) తప్ప! ఈ కేన్సర్‌‌‌‌స ఆడవాళ్ళలో చాలా ఎక్కువ. ఈ వైరస్‌ సోకిన పదిహేను ఇరవై సంవత్సరాలకి సర్విక్స్‌ కేన్సర్‌ వస్తుంది. అంటే ఇరవై, ఇరవైఅయిదేళ్ళకి ఈ క్యాన్సర్‌ బయటపడుతుందన్నమాట. యోని నుంచి రక్తస్ర్తావం, కడుపు క్రింది భాగంలోనూ, నడుము క్రింది భాగంలోను నొప్పి - లక్షణాలు, మెనూపాజ్‌ పిరియడ్‌ తర్వాత రక్తస్ర్తావమవుతుంటే అనుమానం రావాలి. యోనినుంచి ఎటువంటి ద్రావకాలు కారుతున్నా వెంటనే గైనకాలజిస్ట్‌కి చూపించడం మంచిది.

పాప్‌స్మియర్‌ టెస్ట్‌

వెజైనల్‌, గర్భాశయ కేన్సర్‌ని, ముఖప్రాంతంలో కేన్సర్‌ని కనుక్కోవడానికి తేలికైన పరీక్ష పాప్‌స్మియర్‌. స్ర్తీ జననాంగాల ముందు భాగంలోంచి కొన్ని కణాల్ని తీసి మైక్రోస్కోప్‌ ద్వారా పరీక్షించడంతో ప్రారంభ దశలో ఈ క్యాన్సర్‌ని పసిగట్టవచ్చు. 35 సంవత్సరాలు దాటిన తరువాత ప్రతీ స్ర్తీ రెండు మూడు నెలలకోసారైనా ఈ పరీక్ష చేయించుకోవడం అవసరం. ఇది చాలా తేలికైన పరీక్ష. ఖర్చు కూడా తక్కువే. ఏ క్యాన్సర్‌నైనా ప్రారంభ దశలో గుర్తిస్తే నయం చేయవచ్చు. కాబట్టి క్యాన్సర్‌ రాకుండా చూసుకోవడం అవసరం. వస్తే ప్రారంభదశలో కనుక్కోవడం అవసరం. పాప్‌స్మియర్‌ పరీక్ష, బ్రెస్ట్‌ మీద ఏ ప్రాంతంలోనైనా గడ్డలున్నాయో తెలుసుకోవడానికి ప్రతి రోజు స్నానం చేసేటప్పుడు పరీక్షించు కోవడం ముఖ్యం. వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ రాకుండా జాగ్రత్త పడాలి.

వెన్నులో కణితి ...సర్జరీయే మేలు

ఎందుకో తెలియదు.. ఏ దెబ్బలూ తగల్లేదు... కానీ కాలు విపరీతంగా నొప్పిలేస్తోంది... తాత్కాలిక ఉపశమనం కోసం ఏవో పెయిన్‌కిల్లర్స్ వేసుకున్నాడు. జండూబామ్‌లు రాశాడు. 23 ఏళ్ల నరేశ్‌కి డాక్టర్ దగ్గరికి వెళ్లే తీరిక కూడా లేదు. ఓరోజు హఠాత్తుగా కాలు కదల్చలేకపోయాడు. కొద్దిసేపు కాదు. ఎన్ని గంటలైనా కాలు కదలడం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఐ చేశారు. విషయం తెలిసి షాకయ్యాడు.

60 ఏళ్ల రఘురామయ్యకు మెడనొప్పి. ఊళ్లో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో స్కాన్ చేశారు. డిస్క్ జారిందనుకుని మందులిచ్చారు. నెక్‌బెల్ట్ వాడుతున్నాడు. ఎన్నాళ్లు గడిచినా నొప్పి తగ్గలేదు. ఎడమ పక్క అంతా తిమ్మిర్లతో మొదలై మెల్లమెల్లగా పనిచేయడం మానేస్తోంది. పట్నం వెళ్లి డాక్టర్‌కి చూపించుకుంటే అసలు విషయం బయటపడింది.

నరేశ్, రఘురామయ్య.. వీళ్లిద్దరి విషయంలోనూ కనిపించిన సమస్యలు వేరు వేరు. వాటి మూల కారణం మాత్రం ఒకటే. అదే స్పైన్ ట్యూమర్! వెన్నుపాములో కణితి.

మెడనొప్పి, నడుమునొప్పి లాంటి సమస్యల వెనుక కొన్ని సందర్భాల్లో ఇలాంటి కారణం కూడా ఉండొచ్చు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే శాశ్వతంగా పక్షవాతానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది. అదృష్టవశాత్తు వీటికి మంచి చికిత్స అందుబాటులో ఉంది. మనం గుర్తించడమే ఆలస్యం.. పాక్షికంగా పక్షవాతం వచ్చినా సరిచేయవ చ్చు.

వెన్నుకీ క్యాన్సరా?

వెన్నుపాముకి కణుతుల సమస్య రావడానికి ప్రధాన కారణం ఇతర భాగాల్లో క్యాన్సర్ రావడం. ఇతర క్యాన్సర్లు వెన్నుపాముకి విస్తరించినప్పుడు వెన్నెముక లోపల కూడా ట్యూమర్లు ఏర్పడవచ్చు. వీటిలో కొన్నింటికి జన్యుమూలాలు కూడా కారణమే. న్యూరోఫైబ్రోమాలలో కొన్ని రకాల ట్యూమర్లకు కారణం ఫ్యామిలీ హిస్టరీనే. ఇతర క్యాన్సర్లు ఎముకకి వ్యాపించినప్పుడు వెన్నెముక కూడా క్యాన్సర్ ప్రభావానికి గురవుతుంది.

ఇలా వెన్నుపాములో కాకుండా దానికి దగ్గర ఉన్న ఎముకపై కణితి ఏర్పడి, దానివల్ల వెన్నుపాము ప్రభావితం అయితే అలాంటివాటిని ఎక్స్‌ట్రా మెడ్యులరీ ట్యూమర్లంటారు. వెన్నుపాము లోపలే కణితి వస్తే దాన్ని ఇంట్రా మెడ్యులరీ ట్యూమర్ అంటారు. సాధారణంగా ఇంట్రామెడ్యులరీ ట్యూమర్లు క్యాన్సర్ కణితులే అయివుంటాయి. క్యాన్సర్‌తో సంబంధం లేకుండా కూడా ట్యూమర్లు ఏర్పడవచ్చు. అయితే ఈ కణుతులు కూడా వెన్నుపాముపై ఒత్తిడి తీసుకువస్తాయి కాబట్టి దీనివల్ల కలిగే బాధలు మాత్రం ఒకేలా ఉంటాయి.

ఎలా గుర్తించాలి?

వెన్నుపాము ట్యూమర్లున్నప్పుడు లక్షణాలు ప్రత్యేకంగా ఏమీ ఉండవు. మెడ భాగంలో ట్యూమర్ ఉంటే నొప్పి మెడ దగ్గర మొదలై వెన్ను, కాళ్ల దాకా ఉంటుంది. నడుము లేదా వెన్ను భాగాల్లో ట్యూమర్ ఉంటే నడుంనొప్పి, కాళ్ల నొప్పులుంటాయి. వీటితో పాటు తిమ్మిర్లు, నీరసం, తలనొప్పి, వికారంగా ఉండటం, మలబద్దకం, మూత్ర విసర్జనపై కంట్రోల్ లేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ కణుతులకి వయసు భేదాలేమీ లేవు.

పదేళ్ల చిన్నారి నుంచి అరవయ్యేళ్ల తాతయ్య వరకు ఎవరికైనా రావచ్చు. సాధారణంగా వెన్నెముక మీద ఏర్పడిన కణితి నరంపై ఒత్తిడి తెస్తుంది. దానివల్ల ఆ భాగంలో నొప్పి మొదలవుతుంది. దీన్ని చాలాసార్లు డిస్క్ ప్రొలాప్స్‌గా పొరబడే అవకాశంఉంది. డిస్కు జారి నరం మీద ఒత్తిడి తీసుకొస్తోందని అనుకుంటారు. సకాలంలో కణితిని గుర్తించక సమస్య మరింత జటిలమవుతుంది. ఇలాంటప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చాలా ఉపయోగపడుతుంది. అందుకే వెన్నుపాము సంబంధిత సమస్యలకు ఎంఆర్ఐ చేయిస్తేనే వందశాతం సరైన కారణం తెలుస్తుంది.

నిర్లక్ష్యం చేస్తే పక్షవాతమే!

మెడనొప్పి, నడుంనొప్పి, కాళ్లు,చేతుల నొప్పులు అకారణంగా తీవ్రంగా బాధిస్తుంటే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. రోజుల తరబడి వేధిస్తోంటే వెంటనే డాక్టర్‌ను కలవాలి. సాధారణ నొప్పి అయితే మర్దనతోనో, పెయిన్ కిల్లర్ మందుతోనో తగ్గిపోతుంది. పని ఒత్తిడి వల్ల కలిగిందైతే కాస్త రిలాక్స్ అయితే తగ్గుముఖం పడుతుంది.

కానీ ఏకారణమూ లేకుండా వచ్చిన నొప్పి ఎన్ని చేసినా తగ్గడం లేదంటే మాత్రం ఆలస్యం చేయకూడదు. వెన్నుపాము ట్యూమర్‌ని నిర్లక్ష్యం చేసినా, ఆలస్యంగా గుర్తించినా కాలు, చెయ్యి, నడుము పడిపోవచ్చు. పక్షవాతం శాశ్వతంగా కూడా ఉండవచ్చు. మెడ భాగంలో కణితి ఉంటే చేతులు, కాళ్లు, నడుము అన్నీ నొప్పిగా ఉంటాయి. వెన్ను లేదా నడుము భాగంలో అయితే కాళ్ల దగ్గరే లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని ఎంత త్వరగా గుర్తిస్తే చికిత్స వల్ల అంత మంచి ఫలితం ఉంటుంది.

సర్జరీ ఒకటే బెస్ట్

క్యాన్సర్లన్నింటిలోకీ వెన్నుపాముకు సంబంధించింది కొంతవరకు మంచిదనే చెప్పాలి. సర్జరీ ద్వారా పూర్తి స్థాయిలో నయం చేయగల ఏకైక ట్యూమర్ ఇది. వెన్నుపాములో ఏర్పడిన ట్యూమర్లు ఇతర భాగాలకు విస్తరించవు. క్యాన్సర్ కణుతులైనా సరే అవి వెన్నుపాములో మాత్రమే ఉంటాయి. వెన్నుపాము కణితిని శస్త్రచికిత్స ద్వారా తొలగిస్తారు. కొన్నిసార్లు కణితి వెన్నుపాముకి అతుక్కుని ఉండిపోతే కొంత భాగాన్ని వదిలేసి, రేడియేషన్ ద్వారా ఆ భాగాన్ని నిర్వీర్యం చేస్తారు. లేకుంటే రేడియేషన్, కీమోథెరపీల అవసరం ఉండదు. ఎంఆర్ఐలో వెన్నుపాము ట్యూమర్ ఉందని తేలినప్పుడు ముందుగా దాని ప్రాథమిక కణితి ఎక్కడుందో గుర్తించాలి.

అది బినైన్ ట్యూమరే అయితే పరవాలేదు. సర్జరీ ద్వారా దాన్ని తీసివేస్తే సరిపోతుంది. కానీ క్యాన్సర్ ట్యూమర్ అయితే మాత్రం అది ఏ అవయవం నుంచి ఇక్కడికి వ్యాపించిందో వెంటనే తెలుసుకోవాలి. ఈ ట్యూమర్‌ని తొలగించినా ఆ క్యాన్సర్‌కి కూడా చికిత్స చేస్తేనే పూర్తిగా ఫలితం ఉంటుంది. సాధారణంగా ఎముక వరకు క్యాన్సర్ పాకిందంటే దాదాపుగా చివరి దశకు చేరుకున్నట్టే. ఇలాంటప్పుడు సర్జరీ, చికిత్సల ద్వారా రోగి జీవిత కాలాన్ని ఒకట్రెండేళ్ల పాటు పెంచడం సాధ్యమవుతుంది. జీవన ప్రమాణాలనూ మెరుగుపరచవచ్చు.

రొమ్ముక్యాన్సర్‌కి ఆధునిక చికిత్స

కెరీర్ కోసం పరుగులు... ఆధునికత పేరుతో ఉరుకులు... లేటు వయసు మ్యారేజీలు... తల్లి కాలేని పరిస్థితులు.... ఇవన్నీ మహిళల పాలిట శాపాలవుతున్నాయి. రొమ్ముక్యాన్సర్ రూపంలో అందాన్నీ, ఆరోగ్యాన్నీ కబళిస్తున్నాయి. మనదేశంలో ఏటా 79 వేల మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ పాలబడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధనా ఏజన్సీ అధ్యయనంలో వెల్లడైంది. అయితే రొమ్ము తీసేయాల్సిన అవసరం లేకుండా అనేకరకాల చికిత్సలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. రొమ్ము క్యాన్సర్ గురించిన అపోహలు, పరిష్కారాలతో కూడిన విశ్లేషణ అందిస్తున్నారు ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ సచిన్ సుభాష్ మర్దా.

మూడు పదులు దాటితే గానీ పెళ్లి జోలికి వెళ్లని వాళ్ల సంఖ్య ఇటీవల పెరుగుతోంది. దాంతో పాటే రొమ్ము క్యాన్సర్ బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, పిల్లలు లేకపోవడం, పిల్లలున్నా తల్లిపాలు ఇవ్వకపోవడం, అధిక బరువు, పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం, ఆహారపు అలవాట్లు.... ఇలా చెప్పుకొంటూ పోతే రొమ్ము క్యాన్సర్ కారణాలు అనేకం. శరీరతత్వాన్ని బట్టి జీవనవిధానం దాకా చాలా అంశాలు రొమ్ము క్యాన్సర్‌ని ప్రేరేపిస్తాయి. మన అలవాట్లు మార్చుకోవడం ద్వారా చాలావరకు దీన్ని నివారించవచ్చు. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావితం అవుతుంది. ఇది కణితి ఏర్పడే వాతావరణం కల్పిస్తుంది.

సాధారణంగా నలభై దాటినవాళ్లలో రొమ్ముక్యాన్సర్ అవకాశం ఎక్కువ. కానీ ఇటీవలి కాలంలో చిన్నవయసులో కూడా ఈ క్యాన్సర్ కన్పిస్తోంది. కుటుంబంలో ఎవరికైనా రొమ్ముక్యాన్సర్ వచ్చివుంటే అవకాశాలు పెరుగుతాయి. 12 ఏళ్ల కన్నా ముందే మెచ్యూర్ అయినవాళ్లు, 55 ఏళ్ల తరువాత మెనోపాజ్ వచ్చినవాళ్లకు కూడా రిస్కు ఎక్కువ.

ఎలా గుర్తించాలి?

  • రొమ్ములో ఏదైనా గడ్డ లాగా ఉన్నప్పటికీ నొప్పి ఉండదు.
  • నిపుల్‌పైన దద్దుర్లలాగా గానీ, పుండులాగా గానీ రావడం.
  • రొమ్ము నుంచి ఎరుపు రంగు స్రావం
  • భుజంపై గడ్డ లేదా వాపు వీటిని ఎవరికి వారే రొమ్ములు పరిశీలించి, క్యాన్సర్ పరీక్ష చేసుకోవచ్చు.
  • స్నానం చేసి రాగానే అద్దం ముందు నిలబడి రొమ్ము పరిమాణంలో గానీ. ఆకారంలో గానీ, రంగులో గానీ మార్పులు వచ్చాయేమో చూడాలి.
  • తలపై రెండు చేతులు కలిపి ఉంచుకుని రొమ్ములపైన ఏవైనా మచ్చలు, వాపులు, నొక్కుకుపోయినట్టుగానీ, పెరుగుతున్న పుట్టుమచ్చలుగానీ ఉన్నాయేమో చూసుకోవాలి. నిపుల్స్ తేడాగా ఉన్నాయేమో పరిశీలించాలి.
  • నడుంపై రెండు చేతులూ ఉంచి, నిపుల్‌ని వేలితో లాగి, ఏదైనా స్రావం వస్తుందేమో పరీక్షించాలి.
  • కుడిచేతితో ఎడమ రొమ్ముని, ఎడమచేతితో కుడిరొమ్ముని లోపల ఏమైనా గడ్డలున్నాయేమో పరీక్షించాలి. రొమ్ము పక్కభాగం, పైన, కింద మొదట మూడు వేళ్లతో మృదువుగా తడిమి చూడాలి. తరువాత కొంచెం ఒత్తిడి పెంచి నొక్కి చూడాలి. కుర్చీలో కూర్చుని మరొకసారి ఇదేవిధంగా పరీక్షించాలి.
  • రొమ్ములో ఏమాత్రం తేడా కనిపించినా వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.

తొలిదశలోనే గుర్తించాలి

రొమ్ము క్యాన్సర్లో మూడు దశలుంటాయి. తొలిదశలో ఉన్న క్యాన్సర్‌కి చికిత్స చాలా సులభం. రొమ్ము, లింఫ్‌గ్రంథుల దగ్గర మాత్రమే క్యాన్సర్ కణితి ఉంటుంది. ఈ దశలో రొమ్మును రక్షించడం చాలా సులువు. అవసరమైతే సర్జరీ చేయాల్సి ఉంటుంది. సప్లిమెంటరీ హార్మోన్‌థెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ అవసరం అవుతాయి. రెండోదశలోని రొమ్ముక్యాన్సర్ కొంత తీవ్రంగానే ఉంటుంది. కానీ ఇంకా రొమ్ము, లింఫ్ గ్రంథుల నుంచి వ్యాపించదు. మొదట కీమోథెరపీ, తరువాత హార్మోన్ థెరపీ, రేడియోథెరపీ తప్పనిసరిగా చేస్తారు. మూడోదశలోకి చేరినదాన్ని మెటాస్టాటిక్ రొమ్ము క్యాన్సర్ అంటారు. ఈ దశలో క్యాన్సర్ ఎముకలు, ఊపిరితిత్తులు, మెదడు, కాలేయం లాంటి ఇతర అవయవాలకు కూడా వ్యాపించివుంటుంది. ఇలాంటప్పుడు కీమోథెరపీ లేదా హార్మోన్‌థెరపీ చేస్తారు. అన్నింటికన్నా తొలిదశలోనే గుర్తిస్తే మంచి ఫలితం ఉంటుంది.

పరిష్కారం?

బయాప్సీ, మమ్మోగ్రఫీ, ఎక్స్‌రే, సోనోగ్రఫీ, పెట్‌స్కాన్ లాంటి పరీక్షల ద్వారా క్లినికల్‌గా రొమ్ముక్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తారు. రేడియోథెరపీ, హార్మోన్‌థెరపీ, కీమోథెరపీలే కాకుండా శస్త్రచికిత్సల ద్వారా కూడా క్యాన్సర్‌ను తొలగించే ప్రయత్నం చేస్తారు. పేషెంటు ఆరోగ్య స్థితి, వయసు, పాథాలజీ, ఆర్థిక పరిస్థితులు అన్నింటిని బేరీజు వేసుకుని సరైన చికిత్సను ఎన్నుకుంటారు. కాబట్టి ఇతర పేషెంటుకు అందించే చికిత్సతో పోల్చుకోవడం సరికాదు. రొమ్ము

పునర్నిర్మాణం

బ్రెస్ట్ కన్సర్వేషన్ సర్జరీ ద్వారా రొమ్ము లోపల ఉన్న కణితిని తొలగిస్తారు. సర్జరీ తరువాత రేడియేషన్ తప్పనిసరి. రాడికల్ మాస్టెక్టమీ ద్వారా రొమ్మును తొలగించడం మరో పద్ధతి. అయితే ఆధునిక వైద్యవిధానం రొమ్మును కృత్రిమంగా తయారుచేసే పద్ధతిని కూడా అందించింది. రాడికల్ మాస్టెక్టమీ తరువాత పొట్ట, లేదా నడుము భాగం నుంచి కండరాన్ని తీసుకుని సిలికాన్ ప్రోస్థెసిస్ ఇంప్లాంటేషన్ ద్వారా రొమ్మును పునర్నిర్మించవచ్చు. కాబట్టి బాధపడాల్సిన పనిలేదు. సర్జరీ తరువాత ఫిజియోథెరపిస్టు సలహాతో కొన్ని ఎక్సర్‌సైజులు చేయాల్సి ఉంటుంది.

అపోహలు - వాస్తవాలు

  • రొమ్ములో కణితి ఉంటే క్యాన్సరేనని భయపడాల్సిన అవసరం లేదు. పదిలో ఎనిమిది కణుతులు హానికరమైనవి కావు.
  • మగవాళ్లకు కూడా రొమ్ము క్యాన్సర్ రావచ్చు. కాకపోతే ఇది చాలా అరుదు
  • మమ్మోగ్రామ్ వల్ల క్యాన్సర్ వస్తుందనే అపోహ ఉంది. కానీ ఇది నిజం కాదు. ఎక్స్‌రే డోసు చాలా తక్కువ కాబట్టి ప్రమాదం కాదు. బయాప్సీ లాంటి టెస్టులు కూడా హానికరం కాదు.
  • కుటుంబంలో క్యాన్సర్ ఉంటే తప్పనిసరిగా రావాలని లేదు. రిస్కు ఎక్కువేగానీ మంచి అలవాట్లు పెంచుకుని, ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదు.
  • రొమ్ము క్యాన్సర్ అంటువ్యాధి కాదు.
  • గర్భనిరోధక మాత్రలు వాడటం వల్ల రొమ్ము క్యాన్సర్ రాదు.
  • సర్జరీ అంటే రొమ్ము తీసేయడమే అని అర్థం కాదు. ఒకవేళ తీసేయాల్సి వచ్చినా బ్రెస్ట్‌ను పునర్నిర్మించడం సాధ్యమే.

ఆధారము: హెల్త్ కేర్ తెలుగు బ్లాగ్

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate