హోమ్ / ఆరోగ్యం / వ్యాధులు / గుండెపోటు కలిగినపుడు బహిర్గతం అయ్యే లక్షణాలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

గుండెపోటు కలిగినపుడు బహిర్గతం అయ్యే లక్షణాలు

సాధారణంగా గుండెపోటు కలుగుటకు ముందుగా కొన్ని రకాల లక్షణాలు బహిర్గతం అవుతాయి. బహిర్గతం అయ్యే లక్షణాలు గుండె సంబందించినవే కాకుండా శరీర భాగాలలో ఎక్కడైనా కలుగవచ్చు. వీటిని తెలుసుకోవటం వలన గుండెపోటు రావటానికి ముందుగా జాగ్రత్తలు తీసుకోవచ్చు.

సాధారణంగా గుండెపోటు కలుగుటకు ముందుగా కొన్ని రకాల లక్షణాలు బహిర్గతం అవుతాయి. బహిర్గతం అయ్యే లక్షణాలు గుండె సంబందించినవే కాకుండా శరీర భాగాలలో ఎక్కడైనా కలుగవచ్చు. వీటిని తెలుసుకోవటం వలన గుండెపోటు రావటానికి ముందుగా జాగ్రత్తలు తీసుకోవచ్చు.

శ్వాస సంబంధిత వ్యాధులు

శ్వాసలో ఇబ్బందులు కలిగినపుడు ఎక్కువ మంది గుండె సంబంధిత వ్యాధి వలన కాదు అనుకుంటారు, కానీ కొన్ని రకాల గుండెకి చెందిన వ్యాధులు కలిగినపుడు శ్వాసలో ఇబ్బందులు వ్యాధి లక్షణాలుగా బహిర్గతం అవుతాయి.ఇలా శ్వాసలో ఇబ్బందులు కలుగటం వంటి లక్షణాలు బహిర్గతమైతే మాత్రం గుండె ప్రమాదానికి గురవటం వలన లేదా గుండె సమస్యలకు గురవటం వలన ఇవి కలుగుతాయి

కండరాలలో లోపాలు

 

గుండె సంబంధిత వ్యాధులు కలిగినపుడు అరుదుగా కండరాలలో సమస్యలు కలుగుతాయి. ఈ రకమైన వ్యాధులు కలిగినపుడు భౌతిక కార్యకలాపాలు జరపటానికి ఇబ్బందులుగా మరియు కాళ్ళలో తిమ్మిరిలు లేదా పక్షవాతానికి గురి అయినట్లుగా అనిపిస్తుంది

 

నాడీసంబంధిత సమస్యలు

నాడీసంబంధిత సమస్యలు, అనగా ఎలాంటి సూచనలు లేకుండా మూర్చపోవడం వంటివి గుండె సమస్యలకు గురైనపుడు, ధమనులలో లేదా కారోటిడ్ అర్టెరీలో సమస్యలు ఏర్పడినపుడు నాడీ సమస్యలు కలుగుతాయి అని తెలిపారు. అంతేకాకుండా గంధర గోళంగా అనిపించటం, పేలవ పరిస్థితులు మరియు పక్షవాతం వంటివి కూడా కలిగే అవకాశం ఉంది

చర్మ సమస్యలు

గుండెలో సమస్యలు కలిగినపుడు చాలా అరుదుగా చర్మ సమస్యలు కలుగుతాయి అని తెలిపారు. ఈ రకమైన వ్యాధులు కలిగినపుడు, రక్తనాళాలో రక్త ప్రసరణ తగ్గటం వలన వారి చర్మం నీలి రంగులోకి మారుతుంది. కొన్ని సమయాల్లో కాళ్ళు/చేతులు అధికంగా వేడికి గురవుతాయి -

అలసట

కవాటాలలో సమస్యలు లేదా గుండె సంబంధిత కండరాలలో సమస్యలు లేదా ఇన్ఫెక్షన్'లు లేదా ఆరైథ్మియా కలిగినపుడు వ్యక్తి అలసటకి గురవుతాడు. సాధారణంగా భౌతిక చర్యలు చేసినపుడు లేదా విశ్రాంతి తీసుకున్న తరువాత అధికంగా అలసటకి గురవుతారు

నొప్పి

రక్తనాళాలో లోపాల వలన మరియు కవాటాలలో సమస్యల వలన లేదా 'ఆరైథ్మియా' వలన నొప్పి కలుగుతుంది. చురుకుగా ఉండకపోవటం, ప్రతిసారి చాతిలో నొప్పి వంటివి కలుగుతాయి. -

వాపులు

గుండె సంబంధిత వ్యాధుల వలన కాళ్ళు, చేతులు, పాదాలలో, చీల మండలలలో వాపులు కలుగుతాయి. కవాటాలు మరియు కండరాలలో లోపాల వలన వాపులు కలుగుతాయి. గుండెలో లోపాల వలన, ఉదర భాగం మరియు కళ్ళ కూడా వాపులకు గురవవచ్చు.

ఆధారము: మై హెల్త్

2.96850393701
జి.prasad Dec 11, 2017 12:41 PM

నేను ఈసీజీ ౨డ్ ఎకో టీమ్స్ టెస్ట్ చెయ్యెమ్చాను ఐన ఎక్కువ మాటలాడుతున్నపుడు అరిచినప్పుడు చిన్న నెప్ వస్తుంది .డాక్టర్ అడిగితి గ్యాస్ ప్రాబ్లెమ్ అంటున్నారు ప్లీజ్ అందుకు cheappdi

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు