অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

గ్యాస్ సమస్యలు

గ్యాస్ సమస్యలు

పొట్ట ఉబ్బరించిందా?

పేగుల్లో తయారయ్యే గ్యాస్ ప్రమాదం కలిగించదు. కాని మహా ఇబ్బందని, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైన మీటింగులో ఉన్నప్పుడు గాని, లిఫ్ట్‌లో ఇతరులతో పాటు నిలబడినప్పుడు గాని, మొదటిసారి జీవిత భాగస్వామితో గడిపే ఏకాంత సమయాల్లో గాని గ్యాస్ విడుదల చేయాల్సి వస్తే సంకటస్థితి అంతా ఇంతాకాదు. గ్యాస్‌తో పొట్ట ఉబ్బరించి ఉదరంలో నొప్పిని కలిగిస్తున్నప్పుడు దానిని ఆయుర్వేద పరిభాషలో ‘ఆధ్మానం’ అనే పేరుతో పిలుస్తారు. కాగా మలద్వారం నుంచి విడుదలయ్యే గ్యాస్‌ని అపానం (ప్లాటస్) అనే పేరుతో వ్యవహరిస్తారు. ప్రతివారిలోనూ గ్యాస్ తయారవుతూనే ఉంటుంది.

సాధారణ వ్యక్తుల్లో మామూలు పరిస్థితుల్లో రోజుకు కనీసం 10 సార్లు గ్యాస్ విడుదల చేస్తూ ఉంటారు. కొంతమందిలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో బంధింపబడి తీవ్రస్థాయిలో కడుపునొప్పిని కలిగించే అవకాశం ఉంది. మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలను కలిగించే కారణావల్ల అదనంగా గ్యాస్ తయారవటమే కాకుండా నొప్పిగా అనిపిస్తుంది. పేగుల్లో తయారయ్యే గ్యాస్‌లో ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్, మిథేన్ వంటి వాయువులు ఉంటాయి.

గ్యాస్ తయారవటం అనేది సహజమైన శారీరక క్రియ. కనుక దానిని అడ్డుకోలేక పోయినప్పటికీ, కొన్ని చిన్న, చిన్న గృహ చికిత్సల ద్వారా ఆహార వ్యవహారాల్లో మార్పులు, చేర్పుల ద్వారా గ్యాస్ సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు.

లక్షణాలు

గ్యాస్ సమస్య కలిగినవారికి సంకల్పంతోగాని, అసంకల్పితంగా గానీ గ్యాస్ విడుదలవుతుంటుంది. గ్యాస్ వల్ల కడుపునొప్పిగా అనిపిస్తుంది. కడుపులో నొప్పి చాలా తీక్షణంగా, ఉదరకండరాలను పట్టేసినట్లు, ఏదో ప్రమాదకరమైన సమస్య ఉందేమో అన్నంత స్థాయిలో వస్తుంది. గ్యాస్‌వల్ల వచ్చే కడుపునొప్పి ఉదరంలో ఒక భాగంలో కేంద్రీకృతం కాకుండా త్వరిత గతిన మారుతుంటుంది. ఆమ్లాశయంలో కండరాలు ముడిపడినట్లు అనిపించవచ్చు. గ్యాస్‌వల్ల ఒకవేళ ఉదరంలో ఎడమవైపు పైభాగంలో నొప్పి వస్తుంటే గుండెనొప్పిగా భ్రమకలుగుతుంది. అలాగే గ్యాస్‌వల్ల ఒకవేళ ఉదరంలో కుడివైపు పైభాగంలో నొప్పి వస్తుంటే ఎంపెండిసైటిస్‌గా గాని లేదా గాల్‌స్టోన్స్ నొప్పిగా గాని భ్రమకలుగుతుంది. పొట్ట ఉబ్బరింపుగా నిండిపోయినట్లు బిర్రుగా అనిపించడం గ్యాస్ ప్రధాన లక్షణం. అలాగే రోజుల తేడాతో పొట్ట వచ్చినట్లు మళ్లీ అంతలోనే తగ్గిపోయినట్లు కనిపించటం కూడా గ్యాస్ లక్షణమే.

కారణాలు

* మాట్లాడేటప్పుడు గాని, ఆహారాలను మింగేటప్పుడు గాని గాలిని మింగటం; ఆందోళనగా ఉన్నప్పుడుగాని ఉధ్విగ్నంగా ఉన్నప్పుడు గాని గాలిని అసంకల్పితంగా మింగటం

* ఆహారాన్ని నమలకుండా గబగబ మింగటం; చూయింగ్‌గమ్ వంటి వాటిని అదే పనిగా నమలటం; స్ట్రాతో ద్రవహారాలను తాగటం.

* ఆహారంలోని పిండి పదార్థాలు చిన్నపేగులో జీర్ణం కాకపోతే పెద్ద పేగులోని బ్యాక్టీరియా చర్య జరిపి పులిసిపోయేలా చేసి గ్యాస్‌ని విడుదల చేయటం.

* పండ్లు, కాయగూరలు, గింజధాన్యం, బీన్స్, చిక్కుడు, బఠాని తదితర పీచు పదార్థాలూ, ఈసబ్‌గోల్ వంటి తంతుయుత పదార్థాలూ అరగకపోవటం.

* సోడా, బీర్, శీతలపానీయాలు తదితర గాలినిండిన కార్బనేటెడ్ పానీయాలను తీసుకోవటం.

* ఇతర వ్యాధులు సమాంతరంగా బాధిస్తుండటం (డైవర్టిక్యులైటిస్, క్రాన్స్ వ్యాధి, అల్సరేటివ్ కోలైస్).

* యాంటీ బయాటిక్స్‌ని అతిగా వాడటం (ఇవి మంచిచేసే సాధారణ బ్యాక్టీరియాను సైతం నాశనం చేస్తాయి).

* విరేచనౌషధాలను గాని లేదా మలాన్ని బంధించే ఔషధాలను గాని వాడటం (వీటివల్ల పేగు కదలికలో తేడాలు చోటుచేసుకుంటాయి).

* మలబద్ధకంతో ఇబ్బంది పడుతుండటం (మలం బిరడా వేయటం వల్ల గ్యాస్ కింద నుంచి వెళ్లలేక, పొట్ట ఉబ్బరింపు కలుగుతుంది).
పాలలోని ల్యాక్టోజ్ అనే తీపి పదార్థాన్ని శరీరం సూక్ష్మాంశాలుగా విభజించి జీర్ణించుకోలేకపోవటం (మిల్క్ ఇంటాలరెన్స్).

* గోధుమల్లోని గ్లూటెన్ అనే జిగురు పదార్థాన్ని శరీరం అనుఘటకాలుగా విభజించి విలీనం చేసుకోలేకపోవటం(గ్లూటెన్ ఇంటాలరెన్స్).

* ఆహారానికి కలిపే కృత్రిమ పదార్థాలు పడపోవటం (బబుల్‌గమ్స్, సుగర్ క్యాండీలు వంటి వాటిల్లో కలిపే సార్బిటాల్, మ్యానిటాల్ వంటి పదార్థాలు గిట్టకపోవటం).

ఇవన్నీ గ్యాస్ తయారవడానికి ప్రధాన కారణాలు. వీటిమీద అవగాహన ఉంటే గ్యాస్‌ని నిరోధించుకోవచ్చు.

ఆయుర్వేద చికిత్సలు, సూచనలు ఆహార విధానం

గ్యాస్‌ని కలిగించే ఆహారాలను మానేయాలి. అన్ని ఆహార పదార్థాలూ అందిరోనూ ఒకే మాదిరిగా గ్యాస్‌ని, గ్యాస్ నొప్పినీ కలిగించవు. చాలా మందిలో గ్యాస్ కలిగించే ఆహారాలను అధ్యయనకారులు గుర్తించారు. అవి: చిక్కుళ్లు, ఉల్లిపాయ, క్యాబేజి, క్యాలీఫ్లవర్, యాపల్స్, జల్లించని గోధుమపిండి, కోడిగుడ్డు, శనగపిండి వంటకాలు తదితరాలు.

వేపుడు పదార్థాలను, నూనె పదార్థాలను మానేయాలి. కొవ్వు పదార్థాలు అమ్లాశయంలో వేగంగా కదలవు. దీనితో పొట్టనిండినట్లు అనిపించి ఉబ్బరిస్తుంది. పీచుపదార్థాలను తగ్గించాలి. పీచు పదార్థాలను ఆహారంలో నెమ్మదిగా, అల్పమోతాదులో చేర్చుతూ క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలి.

పీచుపదార్థాలను తీసుకునే సమయంలో ఎక్కువగా నీళ్లు తాగాలి. పాలను మానేయాలి. లేదా కనీసం బాగా తగ్గించాలి. పాలకు బదులు అవసరమనుకుంటే పెరుగు వాడాలి. లేదా పాలను వాడటం తప్పదనుకుంటే పాలను అన్నం వంటి ఇతర పదార్థాలతో కలిపి వాడాలి. పుదీనా పచ్చడిగాని, లేదా వేడి వేడి పుదీనా కషాయం గాని తీసుకోవాలి.

పుదీనాలో ఉండే మెంథాల్ (పిప్పర్‌మింట్) జీర్ణావయవాల కండరాలను వదులు చేసి గ్యాస్ సంచితవకుండా చేస్తుంది. అయితే ఒకవేళ ఎసిడిటిగాని, రిఫ్లక్స్ గాని ఉంటే పుదీనాలోని మెంథాల్ ఆ సమస్యలను ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది.

జీవన విధానం

ఆహారాన్ని కొద్ది మొత్తాల్లో, ఎక్కువ సార్లు తీసుకోవాలి. బబుల్‌గమ్ నమలటం, గట్టి క్యాండీలను చప్పరించటం, స్ట్రాతో తాగటం మానేయాలి. ఈ చర్యలతో గాలిని ఎక్కువగా మింగే అవకాశం ఉంటుంది. ఆందోళనగా ఉన్నప్పడుగు గాని, గాభరాగా ఉన్నప్పుడు గాని, హడావిడిగా ఉన్నప్పుడు గాని తినవద్దు. ఆహారాన్ని ఎప్పుడూ నింపాదిగా ఉన్నప్పుడు మాత్రమే తినాలి.

ఉపశమనం.. జీవన విధానంలో మార్పులు తీసుకోవటం ద్వారా కొంతమేరకు దీని ఉపశమనం పొందవచ్చు.

 • <ఆల్కహాల్, పొగ త్రాగుడు, గుట్కాలు లాంటి పదార్థాలను పూర్తిగా మానివేయాలి.
 • మానసిక ఆందోళనను తగ్గించుకోవాలి.
 • ఎక్కడపడితే అక్కడ ఫాస్ట్ఫుడ్స్ తినకూడదు.
 • మసాలాలతో కూడిన ఆహార పదార్థాలు తినటం తగ్గించుకోవాలి. ప్రతిరోజూ నియమిత సమయంలో, ఆహారాన్ని ఆదరా బాదరాగా కాక ప్రశాంతంగా.. బాగా నమిలి తినాలి.
 • తగినంత విశ్రాంతి తీసుకోవాలి.

కాబట్టి ఎసిడిటీనీ పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ.. మన అలవాట్లు, ఆహార నియమాలలో వుంది. ప్రతివారూ కాస్త శ్రద్ధ తీసుకొని వీటిని పాటిస్తే.. ఎసిడిటీని తరిమేయవచ్చు.

ఈ అసిడిటీతో బాధపడేవారు తినవల్సిన /తినకూడని పదార్ధములు ...

పులుపు గా ఉన్న పదార్ధాలు తినికూడదు . ,

పచ్చిగా ఉన్న కాయలు , పండ్లు తినకూడదు ,

మసాలా వస్తువులు ఎక్కువగా తినకూడదు .,

తేలికగా జీర్ణం అయ్యే పదార్ధములే తినాలి ,

కొబ్బరి కోరుతో తయారయ్యే పదార్ధములు తక్కువగా తినాలి ,

నూనే వంటకాలు మితము గా తీసుకోవాలి (ఫ్రై ఫుడ్స్ ),

అసిడిటీని తగ్గించాలంటే...

 

ఆయుర్వేదము :

ఆవకూర, మెంతి కూర, పాలకూర, క్యాబేజీ, ముల్లంగి ఆకులు, ఉల్లి కాడలు, తోటకూరలను తరిగి ఒకటిన్నర లీటరు నీళ్లలో వేసి బాగా మరిగించాలి. తరువాత అందులో ఉప్పు, అల్లం రసం, నిమ్మరసం, రెండు వెల్లుల్లి రెబ్బలు నలిపి కలియబెట్టాలి. అసిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సూప్ తాగితే ఒంట్లో తేలిగ్గా ఉంటుంది.

అల్లోపతి:

 • యాంటాసిడ్ మాత్రలు గాని , సిరప్ గాని ఉదా: tab . gelusil mps or sy.Divol --3-4 times for 4 days
 • యాసిడ్ ను తగ్గించే మాత్రలు : cap. Ocid -D.. 2 cap / day 3-4 days.
 • -----------------------Or. cap.Rabest-D.. 1 cap three time /day 3-4 days. వాడాలి .

అసిడిటీ మందులు దీర్ఘకాలం వాడొద్దు!

అజీర్ణం, పుల్లటి త్రేన్పులు, ఛాతీలో మంట వంటివి తరచుగా కనిపించే సమస్యలే. ముఖ్యంగా వృద్ధుల్లో ఎంతోమంది వీటితో బాధపడుతుండటం చూస్తూనే ఉంటాం. వీటి నుంచి తప్పించుకోవటానికి చాలామంది ఒమెప్రొజాల్‌ వంటి ప్రోటాన్‌ పంప్‌ ఇన్‌హిబిటార్స్‌ (పీపీఐ) మాత్రలు వేసుకుంటూ ఉంటారు. డాక్టర్లు సిఫారసు చేయకపోయినా సొంతంగా కొనుక్కొని వాడేవాళ్లూ లేకపోలేదు. అయితే వీటిని ముట్లుడిగిన మహిళలు దీర్ఘకాలం వాడటం మంచిది కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో ఎముకల పటిష్ఠం తగ్గి.. తుంటి ఎముకలు విరిగే ప్రమాదం పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు. బోస్టన్‌లోని మసాచుసెట్స్‌ జనరల్‌ ఆసుపత్రికి చెందిన డాక్టర్‌ హమీద్‌ ఖలీల్‌ బృందం ఇటీవల ఒక అధ్యయనం చేసింది. నెలసరి నిలిచిపోయిన 80 వేల మంది మహిళలను పరిశీలించింది. మొత్తం ఎనిమిదేళ్ల పాటు చేసిన ఈ అధ్యయనంలో.. పీపీఐలు వాడేవారిలో తుంటిఎముక విరిగే ముప్పు 35% పెరిగినట్టు గుర్తించారు. ఇక పొగతాగే అలవాటుంటే ఇది మరింత ఎక్కువవుతుండటం గమనార్హం. ఈ మందులను ఆపేస్తే ఎముక విరిగే ముప్పు రెండేళ్లలోనే మామూలు స్థాయికి చేరుకుంటోంది కూడా. బరువు, వయసు, వ్యాయామం, పొగ తాగటం, ఆహారంలో క్యాల్షియం మోతాదు, క్యాల్షియం మాత్రల వాడకం వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఈ ముప్పును లెక్కించారు. ఆహారం ద్వారా నియంత్రించ గలిగే సమస్యలకూ డాక్టర్లు చాలాసార్లు పీపీఐలను సిఫారసు చేస్తున్నారని ఖలీల్‌ చెబుతున్నారు. వీటిని కొన్నాళ్లు వాడాక ఆపేయటమే మంచిదని.. అయితే వెంటనే మానేస్తే త్రేన్పులు, ఛాతీలో మంట వంటివి తిరగబెట్టే అవకాశం ఉన్నందువల్ల నెమ్మదిగా తగ్గించుకుంటూ రావాలని సూచిస్తున్నారు. సాధారణంగా ముట్లుడిగిన వారికి క్యాల్షియం మాత్రలనూ సిఫారసు చేస్తుంటారు. అయితే పీపీఐలు మన శరీరం క్యాల్షియాన్ని గ్రహించే ప్రక్రియను అడ్డుకుంటాయి. దీంతో క్యాల్షియం మాత్రలు వేసుకున్నా ప్రయోజనం కనబడటం లేదు. అందువల్లే క్యాల్షియం మాత్రలు వేసుకుంటున్న వారిలోనూ తుంటిఎముక విరిగే ముప్పు అలాగే ఉంటోందని ఖలీల్‌ పేర్కొంటున్నారు.

ఔషధ విధానం

* ఉదర కండరాల మీద టర్‌పెంటైన్ ఆయిల్‌ని వేడిచేసి ప్రయోగించి ఉప్పు మూటతో కాపడం పెట్టుకోవాలి. దీనితో ఉదరకండరాల్లో స్తబ్దత తగ్గి ప్రేగుల కండరాలు వదులవుతాయి. ఫలితంగా గ్యాస్ తప్పించుకొని ఉపశమనం లభిస్తుంది.

* వామును దోరగా వేయించి మెత్తని పొడిగా నూరి ఉదయ, సాయంకాలాలు భోజనానికి అరచెంచాడు పుచ్చుకోవాలి.

* అవసరమైతే వాముతో తయారైన అజమోదార్కం అనే ఔషధాన్ని కూడా మోతాదుకు రెండు పెద్ద చెంచాలు చొప్పున తీసుకోవచ్చు.

* ఇంగువను దోరగా వేయించి, పొడి చేసుకొని పావుచెంచాడు మోతాదుగా వేడి అన్నంతో, మొదటి ముద్దతో కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు బాధించదు.

* జీలకర్ర (2 భాగాలు), శొంఠి (4 భాగాలు), ఉప్పు (1 భాగం), శంఖభస్మం (ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది) (2 భాగాలు) వీటన్నింటినీ మెత్తగా నూరి, నిష్పత్తి ప్రకారం కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి.

గ్యాస్‌తో పొట్ట ఉబ్బరించినప్పుడు ఈ మిశ్రమాన్ని అరచెంచాడు మోతాదుగా వేడినీళ్లతో కలిపి తీసుకోవాలి.

* ఆకలి లేకపోవటం వల్ల పొట్ట ఉబ్బరిస్తుంటే జీలకర్రను దోరగా వేయించి, పొడిచేసి, అరచెంచాడు నుంచి చెంచాడు మోతాదుగా భోజనానికి ముందు అరకప్పు వేడినీళ్లతో తీసుకోవాలి.

* వాము, అల్లం, జీలకర్రను సమ భాగాలుగా తీసుకొని సైంధవ లవణం కలిపి నూరి ఉదయ, సాయంకాలాలు పుచ్చుకోవాలి.

* నిరంతరం కడుపుబ్బరంతో బాధపడేవారు ప్రతినిత్యం భోజనానికి ముందు రెండు, మూడు అల్లం ముక్కలను ఉప్పుతో అద్దుకొని తింటుండాలి.

* త్రిఫలాలు (కరక్కాయ, తానికాయ, ఉసరికాయ వలుపు), త్రికటు (శొంఠి, పిప్పళ్లు, మిరియాలు) వీటి చూర్ణాన్ని సమ భాగాలుగా తీసుకుని కలిపి కషాయం తయారు చేసుకొని తాగాలి.

* నల్లజీలకర్ర (కలౌంజి) గింజలు (4 భాగాలు), శొంఠి (2 భాగాలు), నల్ల ఉప్పు (1 భాగం), శంఖభస్మం (1 భాగం) నిష్పత్తిలో తీసుకొని దంచి పొడిచేయాలి. ఈ మిశ్రమాన్ని 3-6 గ్రాముల మోతాదుగా పుచ్చుకోవాలి.

* నింబూపానకం: 6 భాగాలు నిమ్మరసానికి 5 భాగాలు పంచదార కలిపి పానకం తయారు చేసుకోవాలి. దీనిని 2 చెంచాల మోతాదుగా, నీళ్ళతో కలిపి పుచ్చుకోవాలి.

డాక్టర్ చిరుమామిళ్ల మురళీమనోహర్

కడుపులో గ్యాస్‌ ఉంటుందా?

కడుపులో గ్యాస్‌, కడుపు ఉబ్బరంగా ఉందని చాలా మంది వైద్యున్ని సంప్రదించడం సాధారణమైంది. ఈ సమస్య ఉన్నప్పుడు ఏ పనీచేయలేం. స్థిమితంగా ఉండలేం. మన జీవనశైలి వల్లే ఈ సమస్య వచ్చిందని గమనించాలి.

కారణాలు:

ఎక్కువ సేపు ఒకే చోట కూర్చునేవారు, వ్యాయామం లేనివారు, అతిగా నిద్రపోయేవారు, కొన్ని మందుల వల్ల జీర్ణాశయంలో, పేగుల్లో కొన్ని సూక్ష్మ జీవుల వల్ల గ్యాస్‌ ఏర్పడుతుంది. ఇది ఉర్ధ్వముఖంగాని, అపానవాయువుగా గాని బయటికిపోవాలి. లేదంటే మనిషిని చాలా కష్టపెడుతుంది. జీర్ణవ్యవస్థ లోపం వల్ల, పిత్తాశయ వ్యాధి వల్ల, జీర్ణాశయానికి, పేగులకు ఆపరేషన్‌ తర్వాత గాని, జీర్ణవ్యవస్థలో వ్యాధులవల్ల, పిండి పదార్థాలు ఎక్కువగా వాడడం వల్ల (కూరగాయలు అంటే క్యాబేజి, ఆలుగడ్డ, కందగడ్డ శ్యామగడ్డ, వుల్లి), పేగులలో వుండే కొన్ని బ్యాక్టీరియా ప్రభావం వల్ల కూడా గ్యాస్‌ ఏర్పడుతుంది. అమీబియాసిస్‌లో గ్యాస్‌ ఎక్కువగా వుండవచ్చు.

లక్షణాలు:

కడుపు ఎప్పుడు ఉబ్బరించుకోవడం. అన్నంతిన్న తర్వాత ఆయాసంగా ఉండడం. కడుపు, గుండెలో మంటగా ఉంటుంది. తేన్పు రావడానికి ఇబ్బంది. తేన్పులు వచ్చినప్పుడు అపానవాయువు ద్వారాగాని గ్యాస్‌ బయటికిపోతే ఉపశమనం కలగడం. ఏమి తిననప్పుడు కూడా కడుపు ఉబ్బరించుకోవడం. నడవడానికి కూడా ఇబ్బంది పడడం.

చికిత్స:

కడుపు ఉబ్బరాన్ని నివారించడంలో వ్యాయామం అతిముఖ్యమైంది. బ్రిస్క్‌వాక్‌ రోజు 40 నిమిషాలు ఉదయం, లేక సాయంత్రం చేయాలి. నీళ్లు బాగా తాగాలి. స్విమింగ్‌ లేక తాడుతో గెంతడం (స్కిప్పింగ్‌) చేయాలి. అన్నం తిన్న వెంటనే పడుకోకూడదు. కొద్ది దూరం ఇంట్లోనే నడవాలి. గ్యాస్‌ ఎక్కువ చేసే పదార్థాలు తగ్గించాలి. ముఖ్యంగా మద్యం సేవించకూడదు. మసాల దినుసులు తగ్గించాలి. వేళకూ మితంగా భోజనం చేయాలి. ఊబకాయం తగ్గించుకోవాలి. డైమల్‌ సిరఫ్‌ గాని, యూనిమెంజైమ్‌ మాత్రలు రోజుకు రెండు వాడాలి. అమీబియాసిస్‌ ఉంటే వైద్యుని సలహా మేరకు మందులు వాడాలి.

డాక్టర్‌ హెచ్‌. కృష్ణమూర్తి
చీఫ్‌ ఫిజిషియన్‌,
మల్లు వెంకటనర్సింహారెడ్డి మెమోరియల్‌ క్లీనిక్‌,ఎంహెచ్‌ భవన్‌
అజామాబాద్‌, హైద్రాబాద్‌.
ఫోన్‌ : 9676376669

ఆధారము: వైద్యం.ఇన్ఫో

పెద్ద ప్రేగు, జీర్ణాశయంను శుభ్రం చేసే 10 ఉత్తమ హోం రెమెడీస్

పెద్ద ప్రేగుకు వచ్చే ప్రధానమైన సవుస్య కోలన్ క్యాన్సర్. దీనిపై అందరికీ అవగాహన అవసరం. ఏటా ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల వుందిని బలితీసుకుంటున్న ఈ వ్యాధిని ముందే పసిగడితే నివారించడం పూర్తిగా సాధ్యం. అందరూ 50 ఏళ్లు దాటాక విసర్జక అలవాట్లలో ఏవైనా మార్పులు కనిపించినప్పుడు వెంటనే పరీక్షలు చేయించినా, 50 ఏళ్ల వయుసు దాటాక ఏ లక్షణాలు కనిపించకపోయినా ప్రతి ఐదేళ్లకోసారి ‘ప్రివెంటివ్ స్క్రీనింగ్ కార్యక్రమం' కింద క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకున్నా తప్పనిసరిగా నివారించతగ్గ వ్యాధే కోలన్ క్యాన్సర్. అందునా గతంలో కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కోలన్ క్యాన్సర్ వచ్చిన కుటుంబ చరిత్ర ఉన్నా పరీక్షలు చేయించడం తప్పనిసరి. కోలన్ క్యాన్సర్ లక్షణాలు: మలవిసర్జన సమయుంలో రక్తం పడుతున్నా, మలబద్ధకం తీవ్రంగా ఉన్నా లేదా ఆగకుండా నీళ్లవిరేచనాలు అవుతున్నా, ఈ రెండు సమస్యలూ ఒకదాని తర్వాత మరొకటి కనిపిస్తున్నా, రక్తహీనత, కడుపులో నొప్పి, మలవిసర్జన తర్వాత కూడా ఇంకా అక్కడ కొంత మిగిలే ఉన్నట్లు అనిపించడం, బరువు తగ్గడం... ఈ లక్షణాలు అన్నీ లేదా వీటిల్లో కొన్ని కనిపించినప్పుడు డాక్టర్‌ను తప్పనిసరిగా సంప్రదించాలి. పెద్ద ప్రేగును ప్రక్షాళన (శుభ్రం)చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది చర్మానికి కూడా మేలు చేస్తుంది. పెద్దప్రేగు శుభ్రపడటం వల్ల శరీరంలోని మలినాలు మరియు విషాలు శరీరం నుండి బయటకు స్రవించబడుతుంది. దాంతో డిటాక్సిఫికేషన్ వల్ల చర్మం అందం పెరుగుతుంది. పెద్దపేగు సరిగా పనిచేయనట్లైతే మీరు మలబద్ధకం మరియు జీర్ణ మరియు పొట్టకు సంబంధించిన రోగాల భారీన పడేలా చేస్తుంది. కాబట్టి పెద్దపేగు సక్రమంగా పనిచేయాలన్నా.. మలబద్దకం మరియు జీర్ణ సమస్యలను నివారించాలన్నా ఫైబర్ రిచ్ ఫుడ్స్ బాగా సహాయపడుతాయి. వీటితో పాటు కొన్ని కోలన్ క్లీనింగ్ రిచ్ ఫుడ్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.ఈ ఫుడ్స్ తో పాటు కొన్ని హోం రెమెడీస్ కూడా అనుసరించాలి. కోలన్ శుభ్రపరచడం వల్ల చిన్న ప్రేగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. ఇది ఎనర్జీ ని అందిస్తుంది. కాబట్టి కోలన్ శుభ్రపరచాలనుకుంటే, డాక్టర్ ను సంప్రదించాలి. అంతకు ముందుగా మనం అనుసరించాల్సిన 10 హోం రెమెడీస్...

నీళ్ళు:

కోలన్ (ప్రేగు)ను శుభ్రపరచడంలో నీరు అద్భుతంగా సహాయపడుతుంది. కాబట్టి, రోజుకు కనీసం 10-12 గ్లాసుల నీళ్ళు త్రాగాలి. దీని వల్ల శరీరంలో ఉన్న టాక్సిన్స్ మరియు మలినాలను బయటకు నెట్టివేస్తుంది.

ఆపిల్ జ్యూస్:

కోలన్ శుభ్రం చేయడంలో ఆపిల్ జ్యూస్ ఒక ఉత్తమ హోం రెమెడీ. రెగ్యులర గా ఆపిల్ జ్యూస్ త్రాగడం వల్ల బౌల్ మూమెంట్ ను ఫ్రీగా ఉంటుంది. టాక్సిన్స్ ను బ్రేక్ చేస్తుంది మరియు లివర్ మరియు జీర్ణ వ్యవస్థ యొక్క ఆరోగ్యంను రక్షిస్తుంది. 1. ప్రతి రోజూ ఒక గ్లాస్ ఆపిల్ జ్యూస్ తీసుకోవాలి. 2. అరగంట తర్వాత ఒక గ్లాసు నీళ్ళు త్రాగాలి. 3. ఇలా ప్రతిరోజూ చేయాలి. రోజులో రెండు మూడు సార్లు చేస్తుండాలి. ఇలా చేస్తున్నప్పుడు సాలిడ్ ఫుడ్స్ ను నివారించాలి.

నిమ్మరసం:

నిమ్మరసంలో యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది కోలన్ శుభ్రం చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.కాబట్టి, ప్రతి రోజూ ఉదయం నిద్రలేవగానే గోరువెచ్చని నీటిలో నిమ్మరం పిండి, తేనె మిక్స్ చేసి తీసుకోవాలి.

పచ్చికూరగాయలు:

కోలన్ శుభ్రం చేయడానికి ప్రొసెస్ చేసిన మరియు వండిన పదార్థాలను ఒకటి లేదు రెండు రోజులు తీసుకోకూడదు. సాలిడ్ ఫుడ్ కాకుండా, తాజా వెజిటేబుల్ జ్యూస్ ను ఒక రోజులో పలు సార్లు తీసుకోవాలి. క్లోరిఫిల్ కలిగిన గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్ ను తొలగిస్తుంది. మరియు మినిరల్స్, విటమిన్స్, అమినో ఆసిడ్స్ మరియు ఎంజాయ్స్ ఉన్న ఈ కూరలు తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యం ఉంటుంది. అలాగే మీరు హేర్బల్ టీ తీసుకోవాలి.

ఫైబర్ రిచ్ ఫుడ్స్:

కోలన్ శుభ్రం చేయడానికి ఫైబర్ రిచ్ ఫుడ్స్ అధికంగా తీసుకోవాలి. ప్రేగులోని హానికరమైన టాక్సిన్స్ తొలగించడానికి ఫైబర్ రిచ్ ఫుడ్స్ రెగ్యులర్ డైట్ లో తీసుకవాలి. ఇది స్టూల్ సాఫ్ట్ గా అవ్వడానికి మరియు బౌల్ మూమెంట్ మెరుగుపరచడానికి సహాయపడుతుంది. మొత్తానికి శరీరంలోని వ్యర్థాలను శరీరం నుండి బయటకు విసర్జించడానికి ఇవి గ్రేట్ గా సహాయపడుతాయి.

పెరుగు:

రెగ్యులర్ డైట్ లో పెరుగును చేర్చుకోవడం వల్ల కోలన్ ను హెల్తీగా ఉంచుతుంది. ప్రోబయోటిక్ ఫుడ్, పెరుగు తీసుకోవడం వల్ల ప్రేగులో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మరియు ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ను తగ్గిస్తుంది. మరియు వీటిలో ఉండే క్యాల్షియంకోలన్ యొక్క సెల్ లైనింగ్ ను తగ్గిస్తుంది.

ఫ్లాక్స్ సీడ్స్:

ఫ్లాక్సీడ్స్ ల ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్స్ మరియు నేచురల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ఒక ఉత్తమ మార్గం. ఫ్లాక్ సీడ్స్ నీటిని గ్రహించి కోలన్ ను విస్త్రుతపరుస్తుంది. దాంతో టాక్సిన్ మరియు మ్యూకస్ ను శరీరం నుండి బయటకు నెట్టేస్తుంది. దాంతో పాటు, క్యాన్సర్, గుండె జబ్బులను మరియు డయాబెటిస్ ను నివారిస్తుంది.

సీ సాల్ట్:
 1. ఒక గ్లాసు వేడి నీళ్ళలో సీ సాల్ట్ మిక్స్ చేసి త్రాగాలి.
 2. ఉదయాన్నేఈ నీటిని గోరువెచ్చగా లేదా చల్లగా త్రాగవచ్చు.
 3. కొన్ని నిముషాలు అలాగే ఉండి తర్వాత పడుకొని పొట్టను నిధానంగా మసాజ్ చేసుకోవాలి. ఇది మీ బౌల్ మూమెంట్ ను క్రమబద్దం చేస్తుంది. మరియు ఇది హానికరమైన టాక్సిన్స్ ను తొలగిస్తుంది. ఇలా నెలలో 5లేదా 6సార్లు చేస్తుండాలి.
కలబంద:

అలోవెరలో డిటాక్సిఫైయింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి మరియు లాక్సేటివ్ గా పనిచేస్తుంది మరియు ఇది కోలన్ క్యాన్సర్ మీద ఎక్కవ ప్రభావంతంగా పనిచేస్తుంది. మరియు ఇది ఇతర ఆరోగ్యసమస్యల మీద తలనొప్పి, స్కిన్ ఇన్ఫెక్షన్, డయోరియా, గ్యాస్ట్రిక్ మరియు మలబద్దకం మీద పనిచేస్తుంది.

 • ఒక నిమ్మకాయ రసంలో కొద్దిగా కలబంద రసాన్ని వేసి బాగా బ్లెండ్ చేసి, ఫ్రిజ్ లో పెట్టి రెండు మూడు గంటల తర్వాత రోజులో అప్పుడప్పుడు త్రాగుతుండాలి.
అల్లం:

అల్లం, మన ఇంట్లోరెడీమేట్ గా అందుబాటులో ఉండే పదార్థం. ఇది కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. కోలన్ వ్యవస్థను క్రమబద్దం చేస్తుంది. ప్రేగుల్లో వ్యర్థాలు మరియు టాక్సిన్స్ లేకుండా ఫ్రీచేస్తుంది. తగినన్ని ఆమ్లరసాలను ఉత్పత్తి చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

 • అల్లంను తురిమి, జ్యూస్ చేసి తీసుకోవడం వల్ల ప్రేగులు శుభ్రపడుతాయి.
 • రెండు కప్పుల నీటిలో ఒక చెంచా అల్లం రసం, కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి తీసుకోవాలి. అవసరం అయితే తేనె కూడా జోడించుకోవచ్చు.

ఆధారము: తెలుగు.బోల్డ్ స్కై.కం

అసిడిటీ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

"ఇదివరకు ఏం తిన్నా అరాయించుకునే వాళ్లం".." ప్రస్తుతం పరిస్థితి అలా లేదు". " ఏ ఆహారం తీసుకోవాలంటే భయమేస్తుందని" చెప్పే వారి సంఖ్య నానాటికి అధికమవుతోంది. ఏదైనా ఆహారం తీసుకోగానే తేన్పులు, చిరాకు, గుండెలో మంట వంటివి వస్తే.. ఈ పరిస్థితినే అసిడిటీ అంటారు .ఎసిడిటీ అనేది జబ్బు కాదు. జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోతే కడుపులో మంట అన్పిస్తుంది. పొట్టలో ఆమ్లాలు ఉత్పన్నమవుతాయి. రక్తంలో ఆమ్ల, క్షార సమతుల్యత సమపాళ్లలో ఉంటే ఈ సమస్య రాదు.

జీర్ణాశయంలోని జఠర గ్రంధులు జఠర రసాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ జఠర రసంలో హైడ్రో క్లోరిక్ ఆమ్లం ఉంటుంది. ఇది జీర్ణాశయంలోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఒక్కోసారి ఇది అధికంగా తయారవుతుంది. అలా అధిక ఉత్పత్తి కావడాన్నే ‘ఎసిడిటీ’ అంటారు.

సాధారణంగా మనం తినే ఆహారంవలన, మన జీవన గమనం వలన ఎసిటిడీ వచ్చే వీలుంది. జిహ్వ చాపల్యం అధికంగా వుండేవారికి ఇది దగ్గరి చుట్టం. దొరికింది కదాని.. ఎక్కడపడితే అక్కడ.. ఏది పడితే అది తినేవారికి ఎసిడిటీ సమస్య అందుబాటులో ఉంటుంది.

ఎసిడిటీ వున్నవారికి చాతీలోను, గొంతులోను, గుండెల్లోనూ, జీర్ణాశయంలోనూ మంటగా వుంటుంది. పుల్లటి తేపులతో ఆహారం నోటిలోకి వచ్చినట్లుంది. కడుపు ఉబ్బరించి వాంతి వచ్చినట్లుంటుంది. మలబద్ధకం, అజీర్ణం పెరిగి ఆకలి మందగిస్తుంది.

జీవన విధానం.. మన దైనందిన జీవన విధానం కూడా ఎసిడిటీకి దారితీస్తున్నాయి. ఉద్యోగం, పిల్లలు, పిల్లల చదువులు.. సమాజంలో అవతలవారితో పోటీపడటం, ఉరుకులపరుగుల జీవనం తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నాయి. ఈ మానసిక ఒత్తిడి ఆరోగ్యంమీద పనిచేసి ఎసిడిటీనీ కలిగిస్తున్నాయి. దీనినే ఈ విదంగా చెప్పవచ్చును ... Hurry , worry , curry ....... leads to Acidity .

ఉపశమనం.. జీవన విధానంలో మార్పులు తీసుకోవటం ద్వారా కొంతమేరకు దీని ఉపశమనం పొందవచ్చు.

 • ఆల్కహాల్, పొగ త్రాగుడు, గుట్కాలు లాంటి పదార్థాలను పూర్తిగా మానివేయాలి.
 • మానసిక ఆందోళనను తగ్గించుకోవాలి.
 • ఎక్కడపడితే అక్కడ ఫాస్ట్ఫుడ్స్ తినకూడదు.
 • మసాలాలతో కూడిన ఆహార పదార్థాలు తినటం తగ్గించుకోవాలి. ప్రతిరోజూ నియమిత సమయంలో, ఆహారాన్ని ఆదరా బాదరాగా కాక ప్రశాంతంగా.. బాగా నమిలి తినాలి.
 • తగినంత విశ్రాంతి తీసుకోవాలి.

కాబట్టి ఎసిడిటీనీ పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ.. మన అలవాట్లు, ఆహార నియమాలలో వుంది. ప్రతివారూ కాస్త శ్రద్ధ తీసుకొని వీటిని పాటిస్తే.. ఎసిడిటీని తరిమేయవచ్చు.

ఈ అసిడిటీతో బాధపడేవారు తినవల్సిన /తినకూడని పదార్ధములు ...

 • పులుపు గా ఉన్న పదార్ధాలు తినికూడదు,
 • పచ్చిగా ఉన్న కాయలు , పండ్లు తినకూడదు,
 • మసాలా వస్తువులు ఎక్కువగా తినకూడదు,
 • తేలికగా జీర్ణం అయ్యే పదార్ధములే తినాలి,
 • కొబ్బరి కోరుతో తయారయ్యే పదార్ధములు తక్కువగా తినాలి,
 • నూనే వంటకాలు మితము గా తీసుకోవాలి (ఫ్రై ఫుడ్స్)

అసిడిటీని తగ్గించాలంటే...
ఆయుర్వేదము :
ఆవకూర, మెంతి కూర, పాలకూర, క్యాబేజీ, ముల్లంగి ఆకులు, ఉల్లి కాడలు, తోటకూరలను తరిగి ఒకటిన్నర లీటరు నీళ్లలో వేసి బాగా మరిగించాలి. తరువాత అందులో ఉప్పు, అల్లం రసం, నిమ్మరసం, రెండు వెల్లుల్లి రెబ్బలు నలిపి కలియబెట్టాలి. అసిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సూప్ తాగితే ఒంట్లో తేలిగ్గా ఉంటుంది.

అల్లోపతి:

 • యాంటాసిడ్ మాత్రలు గాని , సిరప్ గాని ఉదా: tab . gelusil mps or sy.Divol --3-4 times for 4 days
 • యాసిడ్ ను తగ్గించే మాత్రలు : cap. Ocid -D.. 2 cap / day 3-4 days.
 • cap.Rabest-D.. 1 cap three time /day 3-4 days. వాడాలి .

అసిడిటీ మందులు దీర్ఘకాలం వాడొద్దు!

అజీర్ణం, పుల్లటి త్రేన్పులు, ఛాతీలో మంట వంటివి తరచుగా కనిపించే సమస్యలే. ముఖ్యంగా వృద్ధుల్లో ఎంతోమంది వీటితో బాధపడుతుండటం చూస్తూనే ఉంటాం. వీటి నుంచి తప్పించుకోవటానికి చాలామంది ఒమెప్రొజాల్‌ వంటి ప్రోటాన్‌ పంప్‌ ఇన్‌హిబిటార్స్‌ (పీపీఐ) మాత్రలు వేసుకుంటూ ఉంటారు. డాక్టర్లు సిఫారసు చేయకపోయినా సొంతంగా కొనుక్కొని వాడేవాళ్లూ లేకపోలేదు. అయితే వీటిని ముట్లుడిగిన మహిళలు దీర్ఘకాలం వాడటం మంచిది కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో ఎముకల పటిష్ఠం తగ్గి.. తుంటి ఎముకలు విరిగే ప్రమాదం పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు.

బోస్టన్‌లోని మసాచుసెట్స్‌ జనరల్‌ ఆసుపత్రికి చెందిన డాక్టర్‌ హమీద్‌ ఖలీల్‌ బృందం ఇటీవల ఒక అధ్యయనం చేసింది. నెలసరి నిలిచిపోయిన 80 వేల మంది మహిళలను పరిశీలించింది. మొత్తం ఎనిమిదేళ్ల పాటు చేసిన ఈ అధ్యయనంలో.. పీపీఐలు వాడేవారిలో తుంటిఎముక విరిగే ముప్పు 35% పెరిగినట్టు గుర్తించారు. ఇక పొగతాగే అలవాటుంటే ఇది మరింత ఎక్కువవుతుండటం గమనార్హం. ఈ మందులను ఆపేస్తే ఎముక విరిగే ముప్పు రెండేళ్లలోనే మామూలు స్థాయికి చేరుకుంటోంది కూడా. బరువు, వయసు, వ్యాయామం, పొగ తాగటం, ఆహారంలో క్యాల్షియం మోతాదు, క్యాల్షియం మాత్రల వాడకం వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఈ ముప్పును లెక్కించారు. ఆహారం ద్వారా నియంత్రించ గలిగే సమస్యలకూ డాక్టర్లు చాలాసార్లు పీపీఐలను సిఫారసు చేస్తున్నారని ఖలీల్‌ చెబుతున్నారు. వీటిని కొన్నాళ్లు వాడాక ఆపేయటమే మంచిదని.. అయితే వెంటనే మానేస్తే త్రేన్పులు, ఛాతీలో మంట వంటివి తిరగబెట్టే అవకాశం ఉన్నందువల్ల నెమ్మదిగా తగ్గించుకుంటూ రావాలని సూచిస్తున్నారు. సాధారణంగా ముట్లుడిగిన వారికి క్యాల్షియం మాత్రలనూ సిఫారసు చేస్తుంటారు. అయితే పీపీఐలు మన శరీరం క్యాల్షియాన్ని గ్రహించే ప్రక్రియను అడ్డుకుంటాయి. దీంతో క్యాల్షియం మాత్రలు వేసుకున్నా ప్రయోజనం కనబడటం లేదు. అందువల్లే క్యాల్షియం మాత్రలు వేసుకుంటున్న వారిలోనూ తుంటిఎముక విరిగే ముప్పు అలాగే ఉంటోందని ఖలీల్‌ పేర్కొంటున్నారు.

ఆధారము: వైద్య రత్నాకరం బ్లాగ్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate