অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

దంత సంరక్షణ

దంత సంరక్షణ

మీ దంతాల గురించి తెలుసుకోండి

దంతాల గురించి తెలుసుకోండి

ప్రతి పన్నుకీ రెండు ముఖ్య భాగాలు ఉంటాయి – కిరీట భాగం మరియు మూల భాగం. పైకి మనకు కనిపించేది కిరీట భాగం. చిగురు లోపల ఉండేది మూల భాగం. ఈ భాగం పంటి పొడవులో 2/3 వంతు ఉంటుంది. పెద్దవాళ్ళలో జ్ఞానదంతాలతో కలిపి 32 పళ్ళు ఉంటాయి.

పళ్ళు నాలుగు రకాల కణజాలాలతో ఏర్పడతాయి.

 1. ఎనామెల్ (దంతిక) – ఇది పంటి మీద కప్పబడిఉన్న తెల్లటి దృఢమైన పదార్ధము. నములుతున్నప్పుడు ఎనామెల్ పంటిని రాపిడి నుండి కాపాడుతుంది.
 2. డెంటిన్ – పంటి పై ఉన్న ఎనామెల్ కు దన్నుగా ఉంటుంది, ఇది పసుపు రంగులో ఉండే ఎముక లాంటి పదార్ధం. ఇది ఎనామెల్ కన్నా కొంచెం మృదువుగా ఉండి నాడీ తంతువులను (నెర్వ్ ఫైబెర్స్) కలిగి ఉంటుంది. ఈ నరాలు పంట్లో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు మనకి తెలియచేస్తాయి.
 3. పల్ప్ – పంటి మధ్యలో ఉండే కండ. ఇది చాలా మెత్తగా ఉండి రక్త నాళాలను, శోష రస నాళాలను (లింఫ్ వెసల్స్ ) మరియు నరాలను కలిగి ఉండే కణజాలం. ఈ పల్ప్ నుండే పంటికి పోషణ లభిస్తుంది మరియు మెదడుకి సంకేతాలు వెళతాయి.
 4. సిమెంటం – దంతం యొక్క మూల భాగాన్ని చాలావరకూ కప్పి ఉంటుంది. ఇది పంటిని దవడ ఎముకలతో కలపడానికి తోడ్పడుతుంది. ఈ సిమెంటంకి దవడ ఎముకకి మధ్యన పెరిడోంటల్ లిగమెంట్ ( దాంత్య స్నాయువు) అనే ఒక మెత్త లాంటి పొర ఉండి రెండింటినీ కలుపుతుంది

నోటి ఆరోగ్యం

నోటి ఆరోగ్యం మరియు దంతాల ఆరోగ్యం అందరికీ చాలా ముఖ్యం. నోటి ఆరోగ్యం వలన అన్ని విధాలా ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చు. ఈ దిగువన ఇవ్వబడిన సూచనలు మీకు అద్భుతమైన నోటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి:

పళ్ళ చుట్టూ ఉన్న చిగుళ్ళు మీ పళ్ళను కదలకుండా ఉంచడానికి తోడ్పడతాయి. మీ చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి నోటి పరిశుభ్రతను పాటించండి. కనీసం రోజుకి రెండు సార్లైనా పళ్ళు తోముకోవాలి. రోజుకి ఒకసారైనా ఫ్లాస్సింగ్ చేసుకోవాలి. క్రమం తప్పకుండా దంత వైద్యులను సంప్రదించాలి. మీ చిగుళ్ళు వాచి ఎర్రగా మారినా, చిగుళ్ళనుండి రక్తం స్రవిస్తున్నా అవి ఇన్ ఫెక్ష న్ కు గురి కావచ్చు. దీనిని జింజివైటిస్ అంటారు. సత్వర చికిత్స नोटिस నోటి ఆరోగ్యాన్ని పునరుధ్ధరించడానికి సహాయ పడుతుంది. చికిత్స చేయకుండా వదిలివేస్తే మరింత తీవ్రతరమైన చిగుళ్ళ వ్యాధి (పెరియోడాంటిస) గా మారి పళ్ళు కూడా ఊడిపోవచ్చు.

నోటి ఆరోగ్యం కొరకు బ్రషింగ్.
నోటి ఆరోగ్యం పరిశుభ్రమైన దంతాలతో మొదలౌతుంది. పళ్ళు తోముకోడానికి ముఖ్యమైన సూత్రాలు:

దంతాలను కనీసం రోజుకు రెండు సార్లు తోముకోవాలి హడావిడి పడకుండా నిదానంగా పళ్ళను తోముకోవాలి. సరైన టూత్ బ్రష్ ను, టూత్ పేస్టును వాడండి : ఫ్లొరైడ్ టూత్ పేస్టును, మెత్తటి టూత్ బ్రష్ ను వాడండి. సరైన టెక్నిక్ ను ప్రాక్టీస్ చేయండి పళ్ళ మీద బ్రష్ ను కొంచెం ఏటవాలుగా పెట్టుకుని, కొద్ది దూరం ముందుకీ వెనక్కీ కదుపుతూ బ్రష్ చేయాలి. పళ్ళ లోపలి వైపూ, పైనా మరియూ నాలుక మీదా బ్రష్ చేయడం మరచిపోకూడదు. చిగుళ్ళు నొప్పి పుట్టేటట్లు మరీ గట్టిగా బ్రష్ చేయకూడదు. టూత్ బ్రష్ ను మార్చడం  ప్రతి మూడు నాలుగు నెలలకి ఒక కొత్త టూత్ బ్రష్ ను మార్చాలి.

నోటిలోపొక్కులు/నంజుపోక్కులు

నంజు అంతే ... భోజనము చేసేటపుడు తినే రుచికరమైన కూర పదార్ధము ... సాధారణము గా కారము , మసాల తో తయారుచేసిన పదార్ధము . మరియొక అర్ధము ... ఒకరకమైన పౌష్టికాహార లోపమువల్ల కలిగే వ్యాధి ... ఉబ్బునంజు , కట్టే నంజు అని రెండురకాలు . ఇక్కడ నేను నన్జుపోక్కులగురించే వివరించడం జరిగినది.

నంజుపోక్కులు (OphthusUlcers):-

మనశరీరము లో చర్మము , మ్యూకస్ పొర కలిసేచోట, మ్యూకస్ పోరాపైనా ఏర్పడే పొక్కులు లాంటి పుండ్లు. ఇవి చాలా నొప్పిని కలుగజేస్తాయి. కారము, మసాలా, వగరు, పులుపు కూరలను తినడానికి చాలా భాధగా ఉటుంది. ఈ పోక్కులతో నోటిపూత (Stomatitis)కుడా ఒక్కొక్క సారి ఉండవచ్చును. ఇవి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. జనాభా లో సుమారు 10% వరకు దీని బారిన పడుతుంటారు. పురుషులు కంటే స్త్రీలలో ఎక్కువ. ఈ వ్యాధి ఉన్నవారు 30% - 40% కుటుంబ చరిత్ర (FamilyHistory) కలిగిఉంటారు.

రకాలు :

చిన్న రకము(MinorUlceratio) - వీటిలో పొక్కులు పరిమాణము ౩ మిల్లీమీటర్లు నుండి ౧౦ మి.మీ. వరకు ఉంటాయి. మ్యూకస్ పొర పైన పసుపు, బూడిద రంగులో ఉండి ఎక్కువగా పెదాలపైన ఉంటాయి.

పెద్ద రకము (MajorUlceration) - ఈ పొక్కులు ౧౦ మి.మీ కంటే ఎక్కువ పరిమాణము(Size) కలిఉంది కోపముగా ఉన్నట్లు ఎరుపు, బూడిద రానుగులలో ఉంటాయి . నొప్పి ఎక్కువ నోటిలో బుక్కలలోపల, పెదాలపైన ఉండి పెదాలు వాపును కలిగిస్తాయి . చిన్నపాటి జ్వరము వస్తుంది. ఉమ్మిని మిన్గాదానికు కుడా కష్టం గా ఉంటుంది. రోజువారి పనులు చేసుకోవడానికి చిరాకుగా ఉంటుంది.

మహమ్మారి నంజుపోక్కులు (HerpetiformUlceration)

- ఇవి బాగా బాధ పెట్టే నంజుపోక్కులు. చిన్న చిన్న చాలా ఎక్కువ పొక్కులు, అల్సర్లు సుమారు 1 నుండి 3 మి.మీ. పరిమాణము కలిగి ఉంటాయి, ఇవి కొన్ని వైరల్ ఇంఫెక్సన్ అనగా హీర్పీస్ సిమ్ప్లెక్ష్ ని పోలిఉంటుంది.
నంజుపోక్కుల వ్యాధి లక్షణాలు :

ఇవి మొదట నోటిలో మంట , దురద ఉన్న చిన్న ప్రదేశం గా మొదలై ...పొక్కు గా తయారై పుండు గా మారుతోంది. పసుపు, ఎరుపు పోక్కుగా నొప్పు పెట్టే అల్సర్ గా మారి భాద పెడుతుంది . దవడ కింద గడవ బిళ్ళలు (LymphNodes) వాపు , నొప్పి ఉండును . ఏదీ తినడానికి వీలుపడదు ... మంట నొప్పి ఉండును. సుమారు ఒక నెల రోజులలో తగ్గిపోవును ... ఇవే మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాయి.

వీటి పుట్టుకకు సరియైన కారణము తెలియదు.

ఈ కింద కొన్ని కారణాలు ఈ వ్యాది రావడానికి దోహదపడతాయి.

 • నిమ్మ జాతికి చెందినా కొన్ని పండ్లు --- నిమ్మ , నారింజ మున్నగునవి ,
 • ఎక్కువ రోజులు చాలినంత నిద్ర లేకపోవడము ,
 • మ్యుకస్ పొరకు రఫ్ గా గాయము తగలడము ... బ్రష్ చేయడం లో ను , గట్టి పదార్దములు తినడంలోను ,
 • హార్మోనుల మార్పుల వలన ,
 • కొన్ని ఆహారపదార్ధాల వల్ల కలిగే అలెర్జీ,
 • వ్యాదినిరోధక వ్యవస్థ లో కలిగే కొన్ని అవాంచిత మార్పులు (ImmuneSystemReactions),
 • విటమిన్ b12, ఐరన్, ఫోలిక్ ఆసిడ్ లోపము వల్ల,
 • ఆవుపాల అలెర్జీ రియాక్షన్ వల్ల,
 • మలబద్దకం , ఆహారపదార్ధాల లోపము , ఎలార్గీ ల వల్లా రావచును ,
చికిత్స(Treatment) :
 • నోటిలో పొక్కులు ఉన్నాపుడు వాటి ఏవిధమైన రాపిడి, వత్తిడి, దెబ్బలు తగలకుండా చూసుకోవాలి,
 • ఏమైనా కట్టుడు పళ్ళు, దేన్చార్లు ఉన్నచో వాటిని తీసివేయాలి,
 • ఏదైనా మంచి మౌత్ వాష్ .. ఉదా - TANTUM mouth wash , betaadin mouth wash , తో పుక్కలించాలి,
 • బ12 , ఫోలిక్ ఆసిడ్ తో కూడుకున్న మల్తివిటమిన్లు వాడాలి,(SupradynTab)రోజు ఒకటి , Folera 5 యం.జి. రోజు ఒకట తీసుకోవాలి,
 • TESS mouth ఆయింట్మెంట్ పుల్లు పై రాయాలి,
 • Sensodyne tooth paste తో బ్రుష్ చేసుకోవాలి,
 • తేనే లేదా ఆవునేయ్యిని ఆ పొక్కుల మీద రాస్తే తగ్గుతాయి.
 • ఉసిరి,చెక్క వేసిన తాంబూలము నమిలిన ఉపసయనం కలుగును,

నోటి ఆరోగ్యానికి చిట్కాలు:

 • ఎల్లప్పుడూ మెత్తటి బ్రష్ నే వాడండి
 • ప్రతిసారీ భోజనం చేసిన తరువాత పుక్కిలించండి
 • పళ్ళ మధ్య ఇరుక్కున్న ఆహారపు తునకలను తొలగించడానికి ఫ్లాస్సింగ్ చేయాలి
 • నోరు ఎండి పోయినట్లున్నప్పుడు షుగర్ లేని చూయింగ్ గమ్ ను నమిలితే లాలా జలం ఊరుతుంది
 • గట్టిగా ఉండే పప్పులను తింటే లాలా జలం బాగా ఊరుతుంది. నమిలే కండరాలకి వ్యాయామం కలిగిస్తుంది.
 • పసి పిల్లలకు బఠాణీ గింజంత नोटिस టూత్ పేస్ట్ వాడి బ్రషింగ్ తరువాత ఉమ్మేయమనాలి
 • ఎప్పుడూ ఆల్కహాల్ లేని మౌత్ వాష్ నే వాడాలి. ఎందుకంటే ఆల్కహాల్ వలన క్సీరోస్టోమియా (నోరు ఎండిపోవడం) రావచ్చును.
 • నాలుక శుభ్రంగా ఉండడానికి నాలుక బద్దను వాడాలి. సూక్ష్మజీవులతో కూడుకున్న నాలుక వలన హాలిటోసిస్ అనే పరిస్థితి నెలకొనచ్చు. నాలుకను శుభ్రం చేయడానికి టూత్ బ్రష్ ను కూడా వాడవచ్చు. పళ్ళు లేని వారు కట్టుడు పళ్ళను పెట్టించుకోవచ్చు. ఇవి పంటి కిరీట భాగానికి ఊతం ఇస్తాయి. బ్రిడ్జ్ లు పళ్ళ మధ్య ఖాళీలు కనిపించకుండా మంచి పలు వరుస నిస్తాయి.
 • పళ్ళు అరిగిపోయిన వాళ్ళు రకరకాల `’ఎన్హాన్స్మెంట్స్’ (అందాన్ని పెంచేవి)తో ఎంతో మార్పును తెచ్చుకోవచ్చు. ‘క్రౌన్స్’ (కృత్రిమ కిరీటాలు) పంటికి మునుపటి ఆకారాన్ని చేకూరుస్తాయి. మరియు `ఇంప్లాంట్స్ తో ఎన్నో విధాలుగా పళ్ళకు మార్పులు చేసుకొన వచ్చు. పొగత్రాగడం నోటి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. పొగత్రాగడం పళ్ళ రంగును మార్చడమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది.

పంటి నొప్పికి చిట్కాలు

మనలో చాలా మందికి అప్పుడప్పుడు అకస్మాత్తుగా పంటి నొప్పి వస్తుంది. ఈ నొప్పిని సురక్షితమైన సహజ పధ్ధతులలో నివారించడం గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరం. ఆవాలు. మిరియాలు, వెల్లుల్లి వంటివి పంటి నొప్పిని సమర్ధవంతంగా నివారిస్తాయి.

పంటి నొప్పిని నయం చెసే చిట్కాలు :

 • పంటి నొప్పి తగ్గించడానికి లవంగం నూనె మంచిది. లవంగ నూనెలో ఒక చిటికెడు మిరియాల పొడి కలిపి నొప్పి ఉన్న పన్ను మీద పెట్టాలి.
 • పంటి నొప్పినుండి ఉపశమనాన్ని పొందడానికి ఆవ నూనె కూడా వాడవచ్చు. ఒక్క చిటికెడు ఉప్పు కలిపిన ఆవ నూనెను సలుపుతున్న చిగుళ్ళపై మర్దన చెయ్యాలి.
 • నిమ్మరసం కూడా పంటి నొప్పిని తగ్గిస్తుంది.
 • నొప్పిగా ఉన్న చిగుళ్ళ మీద మరియు పంటి మీద అప్పుడే తరిగిన ఉల్లి పాయ ముక్కను పెట్టుకోవడం ద్వారా పంటి నొప్పిని సమర్ధవంతంగా నివారించవచ్చు.
 • పంటి నొప్పిని తగ్గించే కాలెండ్యులా (కాలెండ్యులా అఫిసినాలిస్ ), మిర్ (కొమ్మిఫోరా మిర్రా) మరియు సేజ్ (సాల్వియా అఫిసినాలిస్ ) వంటి మూలికలతో పుక్కిలించడానికి ఇంట్లొనే మౌత్ వాష్ ను తయారు చేసుకోవచ్చు. తులసి, మర్జోరం మరియు మెంతి కూడా ఇందుకు పనికి వస్తాయి.
 • నొప్పిని అదుపులో ఉంచడానికి బుగ్గ మీద ఐస్ క్యూబ్స్ ఉపయోగించవచ్చు.
 • అకస్మాత్తుగా పంటి నొప్పి మొదలైనప్పుడు, చల్లటి, వేడి మరియు తీపి పదార్ధాలు నొప్పిని అధికం చేస్తాయి కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.
 • ఆహార విషయంలో జాగ్రత్త వహించాలి. కూరగాయలు, పళ్ళు, ధాన్యాలు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. చిరుతిళ్ళు తినరాదు.

పంటి స్కేలింగ్

స్కేలింగ్ అంటే ఏమిటి?

దంతాల ఆరోగ్యం మన ఆరోగ్యంలో ముఖ్య భాగం. మనం ఏ వయస్సులో ఉన్నా మనం ఆరోగ్యకరమైన పళ్ళను కలిగి ఉండవచ్చు, ఉండాలి కూడా. పళ్ళ విషయంలో సరైన శ్రధ్ధ తీసుకొన్నట్లైతే మనం జీవితాంతం పళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దీనిలో స్కేలింగ్ ప్రక్రియ ఒకటి. ఇది చిగుళ్ళను గట్టిగానూ, ఆరోగ్యంగానూ ఉంచుతుంది. ఈ ప్రక్రియలో పంటి పైన ఏర్పడే పాచిని, గారనూ తొలగిస్తారు. ఈ పాచినీ, గారనూ స్కేలింగ్ ద్వారా తొలగించకపోతే ఇన్ఫెక్షన్ కలుగ చేసి చిగుళ్ళు వదులై, చివరికి పళ్ళు పుచ్చి పోయి రాలిపోతాయి. ఈ స్కేలింగ్ రివాజుగా చేసే ఒక సురక్షితమైన ప్రక్రియ కాబట్టి దీని వలన పంటి ఉపరితలానికి ఏ మాత్రం హాని కలుగదు. ఐతే దీనిని దంత వైద్యులు మాత్రమే చేయాలి.

ప్లేక్ (పాచి) అంటే ఏమిటి?

పంటి పైన అను నిత్యం ఎర్పడే మెత్తటి, రంగు లేని, సూక్ష్మ క్రిములు మరియు ఆహారపు తునకలతో కూడుకున్న జిగురులాంటి పొరను డెంటల్ ప్లేక్ అంటారు. ఈ పొరలో సూక్ష్మ క్రిములు చేరి వృధ్ధి చెంది చిగుళ్ళకు ఇన్ఫెక్షన్ కలుగ చేస్తాయి. దీని వలన చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటుంది. డెంటల్ ప్లేక్ ఏర్పడిన 10-14 గంటల లోపు బ్రష్ ద్వారా శుభ్రం చేయక పోతే అది గట్టి పడి గార (కాల్కులస్ లేక టార్టార్ ) గా మారిపోతుంది. ఒక సారి కనుక ఈ గార ఎర్పడినట్లైతే అది బ్రష్ తో తొలగించడం సాధ్యం కాదు కాబట్టి, దానిని దంత వైద్యుల ద్వారా తొలగించుకోవాలి.

స్కేలింగ్ ఎందుకు చేస్తారు?

పళ్ళు సరిగ్గా తోముకున్నప్పటికీ ఏర్పడే ఈ గారను తొలగించడానికి క్రమం తప్పకుండా దంత వైద్యుల చేత పళ్ళను శుభ్రం చేయించుకోవడం చాలా అవసరం. దంత వైద్యులు శుభ్రం చేసినప్పుడు స్కేలింగ్ తో బాటు పాలిషింగ్ కూడా చేస్తారు. టార్టార్ లేక కాల్కులస్ (గార) ను పంటి ఉపరితలం మీదనుండి తొలగించే సాధారణ శస్త్ర చికిత్స రహిత ప్రక్రియే స్కేలింగ్ . ఈ గారను శుభ్రం చేయకపోతే అది పెరియోడాంటల్ వ్యాధులకు దారి తీయవచ్చు. ఈ వ్యాధిలో పంటికి చిగురుకి నడుమ ఉన్న భాగం లోతుగా అయ్యి సూక్ష్మక్రిములు వృధ్ధి చెందడానికి అనువుగా ఉండే వాతావరణాన్ని కల్పిస్తుంది. ఈ సూక్ష్మ క్రిములు వేగంగా వృధ్ధి చెంది మరొక చిగురుకి వ్యాప్తి చెంది దవడ ఎముకను క్షీణింప చేస్తాయి. దీని వల్ల క్రమంగా పళ్ళు వదులై పోతాయి. ఈ పరిస్థితిలో చికిత్స మరింత కష్టతరమౌతుంది. పంటి చుట్టూ ఉన్న కణజాలాన్ని తిరిగి ఆరోగ్యంగా చేయడానికి శస్త్ర చికిత్స అవసరమౌతుంది.

స్కేలింగ్ ఎంత తరచుగా చేయించుకోవాలి?

పళ్ళ మీద పాచి నిరంతరంగా ఎర్పడుతూనే ఉంటుంది. ఈ పాచిని శుభ్రపరచకపోతే అది 10-14 గంటలలో టార్టార్ గా మారుతుంది. అలాంటి వారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి స్కేలింగ్ చేయించు కోవాలి. ప్రతి ఆరు నెలలకొక సారి దంత వైద్యులతో చెకప్ చేయించుకోవడం చాలా మంచి అలవాటు. స్కేలింగ్ అవసరమో కాదో మీ దంత వైద్యులే చెప్పగలరు. అలాగే వారు ఆరోగ్యకరమైన పళ్ళకోసం మనం ఇంటిలో ఎలాంటి పధ్ధతులు పాటించాలో కూడా చెప్తారు. స్కేలింగ్ వలన పళ్ళు బలహీనపడవని, పైపెచ్చు స్కేలింగ్ వలన చిగుళ్ళనుంచి రక్తం స్రవించడం వంటి వ్యాధులు రాకుండా ఉంటాయనీ, అశ్రధ్ధ చేసిన పక్షంలో మరింత తీవ్రమైన చిగుళ్ళ సమస్యలకు దారితీయగలదని మరొకసారి గుర్తించాలి.

ఫలితం ఏమిటి?

ఎన్నో దంత సమస్యలకూ, నోటికి సంబంధించిన రుగ్మతలకూ నోటి పరిశుభ్రత కీలకమైనది. పరిశుభ్రత పాటించడం వలన నోరు ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాక నోరు శరీరానికి అంతటికీ ముఖద్వారం వంటిది కాబట్టి నోరు ఆరోగ్యంగా ఉంటే చాలా వరకూ శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

జింజివైటిస్

జింజివైటిస్ అనగా సర్వసాధారణంగా చిగుళ్ళకు వచ్చే వ్యాధి. దీనితో చిగుళ్ళు వాయటం జరుగుతుంది. జింజివైటిస్ లక్షణాలు చాలా తక్కువగా ఉండడం వలన మనకు ఆ సమస్య ఉన్నట్లే మనం తెలుసుకోలేకపోవచ్చు . కానీ మనం జింజివైటిస్ ను తేలికగా తీసుకోకుండా చికిత్స చేయించుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే అది ఇంకా ప్రమాదకరమైన చిగుళ్ళ వ్యాధులకు దారి తీయవచ్చు.

మనం పళ్ళు తోముకున్నప్పుడు మన చిగుళ్ళు వాచినట్లు ఉండి రక్తం వస్తే మనకు జింజివైటిస్ ఉందని అనుకొవచ్చు. నోరు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడమే జింజివైటిస్ రావడానికి ప్రధాన కారణం. ప్రతి రోజూ పళ్ళు తోముకోవడం, ఫ్లాస్సింగ్ (ఒక రకమైన సన్నని దారంతో పళ్ళ మధ్య శుభ్రం చేసుకోవడం) వంటి మంచి అలవాట్లు జింజివైటిస్ ను నివారిస్తాయి.

జింజివైటిస్ కు ఈ లక్షణాలను ఉండవచ్చు:

 1. చిగుళ్ళ వాపు
 2. చిగుళ్ళు మెత్తబడడం
 3. చిగుళ్ళు సున్నితంగా మారడం
 4. ఫ్లాస్సింగ్ మరియు పళ్ళు తోముకుంటున్నప్పుడు చిగుళ్ళనుండి రక్తం కారడం
 5. నోటి దుర్వాసన
 6. ఆరోగ్యకరమైన గులాబీ రంగు నుండి చిగుళ్ళ రంగు జాడలుగా ఉండే ఎరుపు రంగుకి మారడం

జింజివైటిస్ వలన సాధారణంగా నొప్పి కలుగదు కాబట్టి మనం అది ఉన్నట్లు తెలుసుకోలేకపోవచ్చు. టూత్ బ్రష్ కొసలు గులాబీ రంగుగా మారినప్పుడే మనకు ఏదో సమస్య ఉందనీ, కొద్ది పాటి ఒత్తిడితో చిగుళ్ళ నుంచి రక్తం కారుతోందనీ తెలుస్తుంది.

పంటి డాక్టరును ఎప్పుడు సంప్రదించాలి?

ఆరోగ్యకరమైన చిగుళ్ళు గట్టిగా లేత గులాబీ రంగులో ఉంటాయి. ఐతే చిగుళ్ళు ఉబ్బి, చారలతో కూడుకున్న ఎరుపు రంగులో ఉండి, రక్తం స్రవిస్తూ ఉంటే డాక్టరును సంప్రదించాలి. ఎంత తొందరగా జాగ్రత్త పడితే అంత మంచిది. అప్పుడే జింజివైటిస్ లక్షణాలు తగ్గు ముఖం పట్టి అది మరింత ప్రమాదకరమైన సమస్యగా మారకుండా ఉంటుంది.

దంతములు రంగు మారుట

దంతాలకు వెలుపల భాగము వివిధ కారణాల వలన రంగు మారుతుంది.

కారణాలు:

 • దంతములు పరిశుభ్రముగా లేకపోవుట
 • ఆహార పదార్దాలు దంతాలపై నిల్వ వుండుట. ముఖ్యముగా తీపి పదార్దాలు.
 • పిప్పి పళ్ళు.
 • సిగరెట్లు, బీడీలు, పొగాకు, చుట్టలు కాల్చుట
 • పాను మసాల, పాను మొదలైనవి నములుట.
 • దంతములకు కాని చిగుళ్ళకు కాని ఇన్ ఫెక్షను వచ్చుట
 • దంతములు లేదా దవడ ఎముకలు విరుగుట
 • విటమిను సి లోపము వలన
 • విటమిను డి లోపము వలన
 • శరీరములో కాల్షియం శాతము తగ్గుట వలన
 • త్రాగు నీటిలో ప్లోరిన్ శాతము ఆధికముగా వుండుట.

 

తీసుకోవలసిన జాగ్రత్తలు:

 • ప్రతి రోజు ఉదయం, రాత్రి నిద్ర పోవుటకు ముందు దంతాలను శుభ్రపరుచుకోవాలి.
 • భోజనము చేసిన ప్రతిసారి శుభ్రమైన నీటితో శుభ్రపరచాలి.
 • మెడికేటెడ్ టూత్ పేస్ట్ వాడాలి.
 • తరచూ దంత వైద్యునిచే పరీక్ష చేయించుకొని సలహా పొందాలి.
 • చిన్నపిల్లలు చాక్లెట్లు తీపి పదార్దాలు తినిన వెంటనే నీటితో శుభ్రపరచాలి.

నోటి దుర్వాసన

 1. సాధారణంగా పళ్ళు, నోరు అపరిశుభ్రంగా వున్నందున నోటి దుర్వాసన వస్తుంది.
 2. నోటిలోని చిగుళ్ళ ఇన్ ఫెక్షను వల్ల కూడ రావచ్చును.
 3. మసాల పదార్ధములతో తయారు చేసిన ఆహార పదార్ధములు తీసుకొన్నపుడు దుర్వాసన వచ్చే అవకాశం వుంది.
 4. సాధారణంగా నోరు తడిలేని వారికి రావచ్చును.
 5. దీర్ఘకాలక, శ్వాసకోశవ్యాదులు, ముక్కుకు సంబంధించిన వ్యాదులు కూడ కారణం కావచ్చును.
 6. పొగాకు నమలడం, బీడీ, సిగరెట్ మొ||నవి వాడడం కారణం కావచ్చు.

తీసుకోవలసిన జాగ్రత్తలు:-

 1. నోటిని శుభ్రంగా వుంచాలి.
 2. రోజుకు రెండు సార్లు దంతాలను శుభ్రము చేయాలి.
 3. ఆహారం తీసుకొన్నతరువాత నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి.
 4. మెత్తని ప్లాస్టిక్ నాలుక బద్దతో నాలుకను శుభ్రపరచాలి.
 5. కట్టుడు పళ్ళువున్న క్రమము తప్పక శుభ్రము చేసుకోవాలి.
 6. వీలైనంత ఎక్కువగా నీరు తీసుకొవాలి.
 7. అన్నివేళలా నాలుక తడిగా వుండే విధంగా చూసుకోవాలి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

కృత్రిమ దంతాలు

చక్కని చిరునవ్వుకే కాదు.. ఆరోగ్యంపైన కూడా ప్రభావం చూపిస్తాయి దంతాలు. కోల్పోయిన దంతాల స్థానంలో కృత్రిమ దంతాలను అమర్చగలగడం దంతవైద్యరంగంలో మంచి పరిణామం. ఎంతోకాలంగా అందుబాటులో ఉన్న ఇంప్లాంటేషన్ చికిత్స అందించడంలో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. వీటికి పరిష్కారంగా వచ్చాయి బేసల్ డెంటల్ ఇంప్లాంట్స్.

స్విట్జర్లాండ్‌కి చెందిన డాక్టర్ ఇధావో రూపొందించిన ఈ కృత్రిమ దంతాలను మన రాష్ట్రంలో మొదటిసారిగా అందుబాటులోకి తెచ్చారు డాక్టర్ మహేందర్ ఆజాద్. మాక్సిలోఫేషియల్ సర్జరీ, ఇంప్లాంటేషన్ చికిత్సలలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవాన్ని గడించిన డాక్టర్ మహేందర్ ఆర్మీలో పనిచేసి రిటైరయ్యారు. హైదరాబాద్‌లో గత పదేళ్లుగా సేవలందిస్తున్న ఆయన కృత్రిమ దంతాల గురించి అందిస్తున్న విశేషాలు...

నెలరోజుల్లో నా పెళ్లి ఉంది డాక్టర్.. ఈలోగా ఊడిపోయిన పళ్ల స్థానంలో కొత్త దంతాలు పెట్టేయండి.... అంటూ వచ్చింది వినీల. దంతాలు పుచ్చిపోవడంతో దవడ భాగంలో రెండు పళ్లను తీసేశారు ఆమెకు. వాటి స్థానంలో కృత్రిమ దంతాలు పెట్టించుకోవాలనుకుంటోంది. కృత్రిమ దంతాలు అమర్చాలంటే సుమారు ఓ సంవత్సరం పడుతుందంటున్నారు ఫ్రెండ్స్. పెళ్లిని వాయిదా వేసుకునే పరిస్థితి లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు డాక్టర్ చెప్పిన మాట ఆమెకు అమృతంలా తోచింది. అదే... బేసల్ డెంటల్ ఇంప్లాంట్స్.

కృత్రిమ దంతాలను అమర్చే చికిత్సలు అందుబాటులోకి వచ్చి ముప్పయ్యేళ్ల పైగానే అయింది. డెంటల్ ఇంప్లాంట్స్‌ను తయారుచేసే కంపెనీలు కూడా రకరకాల మోడల్స్‌లో ఆధునిక పద్ధతుల్లో తయారుచేస్తూనే ఉన్నాయి. అయినా సరే డెంటల్ ఇంప్లాంటేషన్ (కృత్రిమ దంతాలను అమర్చడం)లో చాలా లోపాలు, కష్టాలు తీరనేలేదు. ఈ లోపాలన్నింటికీ పరిష్కారం చూపేవే బేసల్ డెంటల్ ఇంప్లాంట్స్.

ఇంప్లాంటేషన్ ఎలా?
దంతం అంటే మనకు పైకి కనిపించేది మాత్రమే కాదు. దాని రూట్ చిగుళ్ల దగ్గర ఉన్న ఎముకలో ఉంటుంది. ఇక్కడి నుంచే దంతానికి కావలసిన పోషకాలు అందుతాయి. ఈ ఎముక రెండు భాగాలుగా ఉంటుంది. దంతం వైపు ఉండేదాన్ని అల్వియోలార్ ఎముక అనీ, దాని కింద ఉండేదాన్ని బేసల్ ఎముక అనీ అంటారు. దంతం దెబ్బతిన్నప్పుడు ఈ రూట్ భాగాన్ని కూడా తీసేస్తారు. సహజమైన దంతం స్థానంలో అమర్చే ఇంప్లాంట్‌లో మూడు భాగాలుంటాయి. దీనికి కూడా సహజమైన దంతంలాగా రూట్ ఉంటుంది.

కానీ అది ప్లాటినమ్‌తో తయారుచేయబడింది. దీని కింది భాగం చూడటానికి ఒక స్క్రూలాగా ఉంటుంది. ఈ స్క్రూ పైన ఉండే భాగంలో లోపల అంతా ఖాళీగా ఉంటుంది. ఈ ఖాళీ భాగంలో ఇంప్లాంట్ మూడో భాగాన్ని చొప్పిస్తారు. దాని పైన మనకు పైకి కనిపించే కృత్రిమ దంతం ఉంటుంది. ఇంప్లాంట్ స్క్రూను అల్వియోలార్ ఎముకకి రంధ్రం చేసి దానిలోకి బిగిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం చేయడానికి సుమారు సంవత్సర కాలం అవసరం అవుతుంది. ఇంత కష్టపడి ఇప్పటి వరకు అనుసరిస్తున్న ఈ ఇంప్లాంట్స్ విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి.

ఏమిటా లోపాలు?
చిగుళ్ల వ్యాధి వల్లగాని, ఇతరత్రా సమస్యల వల్ల గానీ దంతాన్ని తీసివేసినప్పుడు వెంటనే కృత్రిమ దంతాన్ని అమర్చడం సాధ్యం కాదు. దంతం అనారోగ్యానికి గురయినప్పుడు దానితో పాటు అల్వియోలార్ ఎముక కూడా దెబ్బతింటుంది. దాని గాయం మానడానికి కనీసం 3 నుంచి 4 నెలల సమయం పడుతుంది. అందువల్ల 3 లేదా 4 నెలల తరువాత గానీ ఇంప్లాంటేషన్ చేయడానికి వీలుపడదు. స్క్రూను బిగించే అల్వియోలార్ ఎముక బేసల్ బోన్ కన్నా సున్నితమైనది. కాబట్టి కృత్రిమ దంతం త్వరగా వదులయ్యేందుకు అవకాశం ఉంటుంది.

దంతం పాడయినప్పుడు అల్వియోలార్ ఎముక కూడా దెబ్బతినడం వల్ల కృత్రిమ దంతానికి అవసరమైనంత ఎముక ఉండదు. దానివల్ల కూడా అమర్చిన దంతం తిరిగి వదులయ్యేందుకు ఆస్కారం ఉంటుంది.

స్క్రూ బిగించిన తరువా ఇంప్లాంటేషన్ ప్రక్రియ కొనసాగడానికి 4 నుంచి 6 నెలలు ఆగాల్సి ఉంటుంది. స్క్రూ ఎముకలో సర్దుకోవడానికి అంత టైం పడుతుంది.

తరువాత శాశ్వత దంతాన్ని అమర్చడానికి తిరిగి 10నెలల వ్యవధి అవసరం అవుతుంది. కానీ పేషెంట్ మాత్రం దంతాన్ని తీసివేయగానే వెంటనే కృత్రిమ దంతాన్ని అమర్చేయమని అడుగుతుంటారు. అయితే ఇప్పటివరకు అందుబాటులో ఉన్న స్క్రూ ఇంప్లాంట్స్ వల్ల మాత్రం సుమారు సంవత్సర కాలం పడుతుంది.

బేసల్ ఇంప్లాంట్స్
ఇప్పుడు కొత్తగా వచ్చిన కృత్రిమ దంతాలు సంప్రదాయ ఇంప్లాంట్స్‌తో వచ్చే సమస్యలకు పరిష్కారం చూపిస్తాయి. స్విట్జర్లాండ్‌కి చెందిన డాక్టర్ ఇధావో బేసల్ ఇంప్లాంట్స్‌ని రూపొందించారు. పేరులో ఉన్నట్టుగానే ఈ ఇంప్లాంట్స్‌ని అల్వియోలార్ ఎముకకు బదులుగా బేసల్ బోన్‌లో అమరుస్తారు. అందువల్ల ఇవి వదులయ్యే అవకాశమే ఉండదు.

దంతాలను తీసివేసిన వెంటనే వీటిని అమర్చడం సాధ్యమవుతుంది. చిగుళ్ల వ్యాధి లేదా ఇన్‌ఫెక్షన్ వల్లగానీ దంతాలను కోల్పోవాల్సి వచ్చిన సందర్భంలో కూడా బేసల్ ఇంప్లాంట్స్‌ని అమర్చవచ్చు. వీటిలో స్క్రూకి బదులుగా రింగ్ లాంటి నిర్మాణం ఉంటుంది. ఈ రింగు ఎముక వ్యాసానికి అనుగుణంగా ఉంటుంది. కాబట్టి దంతం అటూ ఇటూ జరిగిపోకుండా సరిగ్గా ఫిట్ అవుతుంది.

దీన్ని బేసల్ బోన్‌లో అమరుస్తారు కాబట్టి అల్వియోలార్ ఎముక పూర్తిగా దెబ్బతిన్నా ఇంప్లాంటేషన్ సాధ్యమవుతుంది. పై దవడ వైపు దంతం అనారోగ్యానికి గురయినప్పుడు ఎముక కూడా చాలావరకు దెబ్బతింటుంది. సంప్రదాయ ఇంప్లాంట్స్ అయితే ఇలాంటప్పుడు సైనస్ ఎఫెక్ట్ కాకుండా సైనస్ లిఫ్ట్ అనే పద్ధతి ద్వారా దీన్ని అమర్చేవారు. కానీ బేసల్ ఇంప్లాంట్స్ విషయంలో సైనస్ లిఫ్ట్ చేయనవసరం లేదు. ఏ వయసువారైనా భేషుగ్గా వీటిని పెట్టించుకోవచ్చు.

ఇంప్లాంటేషన్ ఎప్పుడు?

 • దంతాలు దెబ్బతినడానికి ప్రధాన కారణం నోరు, దంతాలు సక్రమంగా శుభ్రం చేసుకోకపోవడమే. దీనివల్ల దంతాలు, చిగుళ్లు దెబ్బతిని పంటిని పూర్తిగా తీసేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఇలాంటప్పుడు ఇంప్లాంటేషన్ ద్వారా కృత్రిమ దంతాలను అమరుస్తారు.
 • చిగుళ్ల వ్యాధులు - నోరు సరిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల ఇన్‌ఫెక్షన్లు వచ్చి చిగుళ్లు దెబ్బతింటాయి. చిగుళ్ల వ్యాధి వల్ల ఎముక కూడా దెబ్బతినవచ్చు. చిగుళ్ల వ్యాధులు వంశపారంపర్య కారణాల వల్ల కూడా రావచ్చు.
 • చిప్స్, చాక్లెట్లు లాంటివి ఎక్కువగా తినడం వల్ల కూడా దంతాలు దెబ్బతింటాయి. నోటి శుభ్రత లేకపోవడం కూడా కారణమే. - ప్రమాదాల్లో నోటికి దెబ్బలు తగిలినప్పుడు కూడా దంతాలను కోల్పోయే అవకాశం ఉంటుంది.

-డాక్టర్ మహేంద్ర ఆజాద్
డెంటల్ అండ్ మాక్సిలోఫేషియల్
సర్జరీ సెంటర్, హైదరాబాద్.

ఆధారము: ఆయురారోగ్యాలు బ్లాగ్

చిగుళ్ళు - రక్షణ

ఉదయం, రాత్రి పడుకోబోయే ముందు పళ్లు తోముకోవడం చాలా అవసరం. అయితే బ్రష్ చేసుకోవడం వల్ల దంతాలు పూర్తిగా శుభ్రం కావు. పళ్ల మధ్య ఉండే అతి సన్నని సందులలోకి, దవడ చివరలో ఉండే పన్ను దాకా బ్రష్ వెళ్లకపోవచ్చు. అందువల్ల పళ్ల సందులను దారాలతో శుభ్రం చేయడం (ఫ్లాసింగ్), మౌత్‌వాష్ ద్రావణంతో నోరు పుక్కిలించడం (రిన్సింగ్) వంటివి చేయాలి. ప్రతి ఆరుమాసాలకు ఒకసారి దంతవైద్యున్ని సంప్రదించాలి.
దంతాలు బలంగా ఉండాలంటే చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలి. చిగురు దెబ్బతింటే దంతం నిలబడదు. చిగుళ్లకు ఇన్‌ఫెక్షన్ సోకితే అందులోని హానికారక బ్యాక్టీరియా గుండె జబ్బులకు దారితీయవచ్చు. అందుకే చిగుళ్ల విషయంలో నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు దంత వైద్యులు.
దంతంలో పైకి కనిపించే పొర పింగాణి. దాని లోపల డెంటిన్ అనే పొర ఉంటుంది. పంటిలోపల రక్తప్రసారం జరిగే భాగానికి పల్ప్ అని పేరు. దంతాన్ని ఆనుకుని ఉండే తొలి చిగురును జింజైవా అంటారు. ఆ పైన ఉండే దంత మూలానికి ఆధారంగా ప్యారడాంటల్ లిగమెంట్ ఉంటుంది. జింజైవా ఇన్‌ఫెక్షన్లకు గురైనపుడు నిర్లక్ష్యం చేస్తే ఇన్‌ఫెక్షన్లు లిగమెంట్ దాకా వెళతాయి. దీనివల్ల పునాదులు దెబ్బతిన్న గోడల మాదిరిగా దంతాలు రాలిపోతాయి.

డెంటల్ ప్లాక్
ఉదయం నిద్రలేవగానే దంతాలపై కనిపించే పలుచని పొరను ప్లాక్ అంటారు. దీనిమీద బ్యాక్టీరియా చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బ్యాక్టీరియా చేరిన ఆ ప్లాక్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే అది క్రమంగా గట్టిపడి పచ్చగా (క్యాల్కులస్)దంతాల మీద నిలిచిపోతుంది. ఇందులోని బ్యాక్టీరియా దంతక్షయానికి కారణమవుతుంది.
దంతాల ఒరిపిడి(అక్లూషన్) పుట్టుకతోనే కొందరికి దంతాలు పొడవుగా ఉంటాయి. దీనివల్ల పై పళ్లకు, కింది పళ్లకు మధ్య ఉండే ఖాళీ తగ్గిపోతుంది. దంతాలు నిరంతరం ఒరుసుకుంటాయి. మరికొందరిలో నిద్రలో పళ్లు కొరికే అలవాటు ఉంటుంది. పళ్లలో జరిగే ఈ నిరంతర ఒరిపిడి కారణంగా చిగుళ్లు దెబ్బతింటాయి.
రూట్‌కెనాల్ చికిత్స
ఏదైనా ప్రమాదంలో పన్ను విరిగి డెంటిన్ దెబ్బతిన్నప్పుడు లోపల ఉండే రక్తకణాలు ఇన్‌ఫెక్షన్లకు లోనవుతాయి. అయితే ఒక్కోసారి ప్రమాదం జరిగిన వెంటనే కాకుండా కొన్ని వారాల తరువాత ఇన్‌ఫెక్షన్ల సమస్య మొదలవుతుంది. పంటి రంగు మారడం, అతివేడి లేక అతిచల్లదనానికి దంతాలు లాగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఉంటే లోపల ఉండే రక్తనాళాలు చనిపోయాయని గ్రహించాలి. వెంటనే వైద్యున్ని సంప్రదిస్తే దెబ్బతిన్న భాగాన్ని తొలగించి ఆ ఖాళీని ఒక ప్రత్యేకమైన సిమెంట్‌తో నింపుతారు. దీన్నే రూట్‌కెనాల్ చికిత్స అంటారు. పిప్పి పళ్ల విషయంలోనూ ఈ చికిత్స అవసరమవుతుంది.

పదార్థాల నిలువలు
దంతాల నిర్మాణం అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు, దంతాల మధ్య సందులు ఉన్నప్పుడు తిన్న పదార్థాలు వాటిలో నిలిచిపోతాయి. ఆ పదార్థాలను పూర్తిగా శుభ్రం చేయనప్పుడు అవి కూడా బ్యాక్టీరియాలకు నిలయమవుతాయి. పిప్పి పళ్లలో ఏర్పడే రంధ్రాలను సిమెంట్‌తో నింపుతారు. ఈ ఫిల్లింగ్స్ అవసరానికి మించి కాస్త ఎత్తుగా వేసినపుడు వాటి మీద కూడా ఆహారపదార్థాలు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. పొగతాగడం వల్ల కూడా చిగుళ్లు దెబ్బతిని బ్యాక్టీరియా చేరుతుంది.

ఇతర వ్యాధులు
మధుమేహం, ల్యుకేమియా, హీమోఫీలియా, «థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేయడం, సి-విటమిన్ లోపించడం వల్ల చిగుళ్ల నుంచి రక్తస్రావం కలుగుతుంది. విటమిన్ డి లోపించినపుడు దంతాల్లో పెళుసుదనం, విటమిన్ కె లోపంతో చిగుళ్లలో రక్తస్రావం ఏర్పడుతుంది.
చిగురు వాపు (జింజైవా)
చిగురు ముందు భాగం తొలుత ఇన్‌ఫెక్షన్లకు గురవుతుంది. ఈ స్థితిలో అప్పుడప్పుడు కొద్దిపాటి రక్తస్రావం ఉంటుంది. ఆ తరువాత చిగురు ఉబ్బి మెత్తగా మారుతుంది. ఆ భాగమంతా ఎర్రగానూ మెరుస్తూ కనిపిస్తుంది. దీనివల్ల చిగురుకు, పన్నుకు మధ్య ఒక ఖాళీ ఏర్పడుతుంది. దీన్ని ప్యారడాంటల్ సమస్య అంటారు. అక్కడ బ్యాక్టీరియా చేరిపోయి ఖాళీ మరింత పెద్దదవుతుంది. రక్తప్రసారం తగ్గిపోతుంది. నిర్లక్ష్యం చేస్తే చీము చేరిపోయి చిగురు తన పట్టుకోల్పోతుంది. పంటికి ఆధారంగా ఉండాల్సిన చిగురు దెబ్బతినడంతో పన్ను ఊగడం మొదలవుతుంది.

బ్యాక్టీరియా దంతాన్ని తినేస్తుంది. దీనివల్ల దంతం విరిగిపోయే అవకాశం ఏర్పడుతుంది. పంటిలోని రక్తనాళాలు ఇన్‌ఫెక్షన్లకు లోనైనపుడు అది ఇతర అవయవాలకు పాకే అవకాశం కూడా ఉంటుంది. ప్రత్యేకించి ఇన్‌ఫెక్షన్లు గుండెపైన ఉండే ఎండోథెలియమ్ అనే పొరను దెబ్బతీస్తాయి. దీనితో గుండె నొప్పి మొదలయ్యే అవకాశం ఉంది. దీన్ని ఇన్‌ఫెక్టివ్ ఎండ్‌కార్‌డైటిస్ అంటారు.

జాగ్రత్తలు
ఉదయం, రాత్రి పడుకోబోయే ముందు పళ్లు తోముకోవడం చాలా అవసరం. అయితే బ్రష్ చేసుకోవడం వల్ల దంతాలు పూర్తిగా శుభ్రం కావు. పళ్ల మధ్య ఉండే అతి సన్నని సందులలోకి, దవడ చివరలో ఉండే పన్ను దాకా బ్రష్ వెళ్లకపోవచ్చు. అందువల్ల పళ్ల సందులను దారాలతో శుభ్రం చేయడం (ఫ్లాసింగ్), మౌత్‌వాష్ ద్రావణంతో నోరు పుక్కిలించడం(రిన్సింగ్) వంటివి చేయాలి. ప్రతి ఆరుమాసాలకు ఒకసారి దంతవైద్యున్ని సంప్రదించాలి. దీనివల్ల సమ్యస్యను తొలిదశలో గుర్తించడం సాధ్యమవుతుంది. తద్వారా మెరుగైన ఫలితాలను రాబట్టుకునేందుకు వీలవుతుంది.

చికిత్స
దంతాల మీద చేరిపోయిన హానికారక పదార్థాలను తొలగించడం(ప్రొఫెలాక్సిస్)జరుగుతుంది. పళ్లు లోపలి వరకు దెబ్బతిని రంధ్రాలు ఏర్పడి అందులో బ్యాక్టీరియా నిండినపుడు అక్కడ శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఖాళీలను ఎముకపొడితో (సిమెంట్) నింపాల్సి ఉంటుంది. దీన్ని ప్లాప్ సర్జరీ అంటారు.
రూట్‌కెనాల్ చికిత్స
బ్యాక్టీరియా కారణంగా దంతంలోని రక్తకణాలు దెబ్బతింటున్న తొలిదశలో నొప్పి ఉంటుంది. అయితే ఆ రక్తకణాలు మొత్తంగా చనిపోయిన తరువాత నొప్పి ఉండదు. నొప్పి లేకపోవడం వల్ల సమస్య పూర్తిగా తగ్గిపోయిందని అనుకుంటారు. కానీ పన్ను లోపలి భాగం పూర్తిగా దెబ్బతింటుంది. చివరకు పన్ను విరిగిపోయే స్థితి ఏర్పడుతుంది. అంతకంటే కాస్త ముందు వైద్యున్ని సంప్రదిస్తే చికిత్స చేయవచ్చు. ఎక్స్‌రే ద్వారా పంటిని పరిశీలించి రక్తకణాలు పూర్తిగా దెబ్బతిన్న భాగాన్ని శుభ్రం చేసి సిమెంట్‌తో నింపాల్సి ఉంటుంది. దీన్ని రూట్‌కెనాల్ చికిత్స అంటారు. ఈ చికిత్స ద్వారా పన్ను విరిగిపోయే ప్రమాదం తప్పుతుంది.

ఆహారం
చిగుళ్లను రక్షించడంలో విటమిన్ సి పాత్ర చాలా కీలకం. నిమ్మ, దానిమ్మ వంటి పళ్లను తరచుగా తీసుకోవడం, లేక డాక్టర్ సలహా మేరకు విటమిన్ సి మాత్రలు వేసుకోవడం చేయాలి.
దంత నిర్మాణాన్నికాపడటంలో కాల్షియం, విటమిన్ డి కూడా ముఖ్యమే. ఉదయం వేళ కొంత సమయాన్ని సూర్యరశ్మిలో గడపటం, పాలు, గుడ్లు రోజు వారి మెనూలో ఉండేలా చూసుకోవాలి.
రక్తసంబంధమైన లోపాలు రాకుండా ఉండటం కోసం ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆరోగ్యమైన చిగుళ్లు మీ సొంతమవుతాయి.

దంతాలకు లేజర్‌ చికిత్స

కత్తులు లేని చికిత్స - నొప్పి తెలియని వైద్యం లేజర దంత వైద్యం

దంత సమస్యలకు చికిత్సలో భాగంగా హార్డ్‌ , సాఫ్ట్‌ టిష్యూలకు లేజర్‌ చికిత్స చేస్తుంటారు. లేజర్‌ యంత్రంలో వీటికి చికిత్స చేసే పైప్స్‌ వేరువేరుగా ఉంటాయి. పలు రకాల చికిత్సలను అందించేందుకు వీలుగా పలు రకాల ప్రోగ్రామ్‌లు ముందుగానే అందులో లోడ్‌ అయి ఉంటాయి. ప్రోగ్రామ్‌ మార్చినప్పుడల్లా చికిత్సా విధానం మారుతుంది. ఎలాగంటే చిగుళ్లకి చికిత్స చేయాలంటే ఒక విధమైన ప్రోగ్రామ్‌నివ్వాలి. రూట్‌కెనాల్‌ ట్రీట్‌మెంట్‌కి మరో ప్రోగ్రామ్‌...ఇలా హార్డ్‌ టిష్యూ చికిత్స కోసం 40 ప్రోగ్రామ్‌లుంటే , సాఫ్ట్‌ టిష్యూకోసం మరో 40 ప్రోగ్రామ్‌లున్నాయి ఈ మెషీన్లో సాఫ్ట్‌ టిష్యూ చికిత్సలో ఉన్న ఎండోడాంటి క్స్‌ ప్రోగ్రామ్స్‌తో రూట్‌కెనాల్‌ ట్రీట్‌మెంట్‌ చెయవచ్చు. బాగా లోతుగా ఉన్న ఇన్‌ఫెక్షన్‌ని అరి కట్టవచ్చు. పంటినిగాని , చిగుళ్లనిగాని , ఎముకనిగాని అవస రమైనంత కత్తిరించవచ్చు. మరో ప్రోగ్రామ్‌ ద్వారా పన్నుపై భాగాలు అ రిగి జివ్వున లాగుతుంటే- ఆ ప్రాంతంలోని అతిస్పందనని , మరో ప్రోగ్రామ్‌ ద్వారా.. లేజర్‌ కిరణాన్ని ఆ ప్రాంతంలోకి పంపి సెన్సిటివ్‌నెస్‌ని తగ్గించవచ్చు.

సాధారణంగా అధికరక్తపోటు , మూర్ఛలతో బాధపడే వాళ్లకు చిగుళ్లు వాస్తే ఎక్కువగా ఉన్న చిగుళ్లని ఇంకో ప్రోగ్రామ్‌తో కత్తి రించవచ్చు. మరో ప్రోగ్రామ్‌తో చిగుళ్లని ఓపెన్‌ చేయకుండానే కాంతి కిరణాలతో లోపల దెబ్బతిన్న చిగుళ్ల కణాన్ని మాడ్చి వేయవచ్చు. నోట్లో చీముగడ్డలు ఏర్పడితే వాటిని తీసి వేసే ప్రోగ్రామ్‌ ఉంది. కొంతమందిలో రెండు పళ్లమధ్య ఫ్రీనమ్‌ అనే కండరము ఏర్పడుతుంటుంది. దీంతో పళ్లమధ్య సందులు ఏర్పడతా యి. అలా సందులు ఏర్పడకుండా ఫ్రీనమ్‌ని తీసి వేయ వచ్చు లేజర్‌ కిరణా లతో. ఇలా చెప్పుకుంటూపోతే ఇంకా ఎన్నో ప్రోగ్రామ్‌లున్నాయి సాఫ్ట్‌ టి ష్యూ చికిత్సలకి. ఒక్కమాటలో చెప్పాలంటే నోటిలోని మెత్తటి కణాలన్నింటి కీ సంబంధించిన ప్రోగ్రామ్‌తో ఉన్నాయి ఈ లేజర్‌ చికిత్సా యంత్రంలో.

ఇక హార్డ్‌ టిష్యూ..గట్టి కణాల చికిత్సకొస్తే అవీ 40 రకాల వరకూ ఉన్నాయి. డెంటిన్‌ని , ఎనామెల్‌ని కట్‌ చేయవచ్చు. పంటి మీద ఎత్తుపల్లాలు ఏర్పడి క్రమంగా పళ్లలో కంతలు ఏర్పడవచ్చు. ఇలా పళ్లు పుచ్చి పోకుండా కంతలు ఏర్పడుతున్న ప్రదేశాన్ని ‘ఫిట్‌ అండ్‌ ఫీజర్‌ సీలింగ్‌ పద్ధతి’ లో మూసి వేస్తారు. లేజర్‌ కిరణాలతో పన్నునే కాదు , ఎముకనీ కట్‌ చేయవచ్చు. పుచ్చిన పళ్లని తీసివేయ వచ్చు. ఫ్లోరోసిస్‌వల్ల పళ్ల మీద పసుపు పచ్చని పొర ఏర్పడుతుంటే దాన్నీ తీసివేయవచ్చు. పళ్ల పై భాగంలో సెన్సిటి వ్‌నెస్‌ ఎక్కువగా ఉంటే లేజర్‌ కిరణాలతో ఆ భాగాన్ని డిసెన్సిటైజ్‌ చేయవచ్చు.

ఎక్కువున్న చిగుళ్లని కట్‌చేయవచ్చు. గ్రాన్యులేషన్‌..అంటే పాడైపోయిన కణాన్ని కచ్చితంగా అంతవరకే తీసివేయవచ్చు. నోట్లో ఏర్పడే రకరకాల గడ్డల్ని హార్డ్‌లేజర్‌తో తొలగించవచ్చు.

ముఖ్యంగా హిమాంజియోమాలు.. రక్తపు గడ్డల్ని తీసివేయడం కష్టం. వాటిని కొద్దిగా కత్తిరిస్తే చాలు రక్తం ధారగా కారుతుంటుంది. అలాంటి గడ్డల్ని రక్తస్రావం కాకుండా కాల్చివేయవచ్చు. ఒక్కపన్ను దగ్గరే చిగురువాస్తే దానిని తీసి వేయవచ్చు. క్రేన్‌ని పెంచడంకోసం చిగుళ్లని పెంచవుచ్చు. నోట్లో ని చిన్నచిన్న పుళ్లమీదకి లేజర్‌ కిరణాన్ని పంపగానే నొప్పి తగ్గిపోతుంది. ఇరవైనాలుగు గంటల్లో పుళ్లు పూర్తిగా తగ్గి పోతాయి. అంతేకాదు...ఆ ప్రాంతంలో నున్నగా తయారవుతుంది ఎటు వంటి మచ్చపడకుండా.
చిన్నపిల్లల్లో కొందరికి పళ్లు చిగుళ్లలో ఉండిపోతాయి. త్వరగా బయటకురావు. అలాంటి పరిస్థితుల్లో లేజర్‌ కిరణాలతో నొప్పిలేకుండా చిగు ళ్లని కోసి , పళ్లు బయటకు వచ్చేట్టు చేయవచ్చు. పళ్లమీద జెల్‌ని రాసి , లేజర్‌ కిరణా న్ని నాలుగు నిముషాలు పంపడం తో పళ్లని తెల్లగా చేయవచ్చు. వెస్టిబ్యులోప్లాస్టి. . పెదవి లోపలి వైపు ఎముకని లేజర్‌ కిరణాలతో కత్తిరించవచ్చు. పంటి చివరిభాగం కోసు కుంటుంటే ఆపదునుని తగ్గించవచ్చు. ఎక్కడ ఎముక ఏమాత్రం ఎక్కువ వున్నా నొప్పిలేకుండా కత్తిరించవచ్చు. జ్ఞానదంతాలు ఓ పట్టాన బయటకు రాకుండా నొప్పి పెడుతుంటే లేజర్‌ కిరణాలను పంపి నొప్పి లేకుండా పైనున్న చిగుళ్లని కత్తిరించి దంతాలు బయటకు వచ్చేట్టు చేయవచ్చు. ఇలా హార్డ్‌ టిష్యూ లేజర్‌లో కూడా ఎన్నో ప్రోగ్రా మ్‌లున్నాయి.

అన్ని రకాల దంత చికిత్సల్ని లేజర్‌తో చేయవచ్చు. మెత్తటి కణా లని చికిత్స చేసి నా , గట్టికణాన్ని కత్తి రించినా నొప్పి ఉండదు. రక్తం కారదు.

చిగుళ్లలో పాడైపోయిన భాగా ల్ని చిగుళ్లని కత్తిరించ కుండా కాంతిని పంపి మాడ్చేయువచ్చు. సైడ్‌ ఎఫెక్ట్‌‌స ఉండవు ఈ చికిత్సలో. చికిత్సకి పట్టే సమయం కూడా మామూలు విధానంతో పోలిస్తే తక్కువ. ఏ ప్రోగ్రామ్‌ని సెట్‌చేస్తే లేజర్‌ కిర ణాలు ఆ ప్రోగ్రామ్‌నే చేస్తాయి. మిగతా కణాన్ని ముట్టుకోవు. ఉదాహరణకు చిగుళ్లులోపల దెబ్బతిన్న కణాల్ని మాడ్చటానికి ప్రోగ్రామ్‌ పెడితే లేజర్‌ కిరణాలు ఆ కణాలనే మాడ్చే స్తాయి మిగతాకణాల్ని ఏమాత్రం ముట్టు కోకుండా. ఈ లేజర్‌ యంత్రాలలో కూడా కార్బన్‌డయాకై్సడ్‌ లేజర్‌ కన్నా ఎన్‌డిఆర్‌ లేజర్‌ శక్తివంతమైంది. అనస్థేషియా లేకుండానే ఈ శస్తచ్రికిత్సలన్నీ చేయవచ్చు.

స్టెరిలైజింగ్‌ కోయాగ్యులేటింగ్‌ ఎఫెక్ట్‌వల్ల మామూలు పద్ధతు లకన్నా ఈ లేజర్‌ చికిత్స ఎంతో ఉపయోగం. రక్తస్రావం , నొప్పి ఉండవు. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌‌స కూడా ఉండవు. మందుల అవసరం ఉండదు. అనస్తేషి యా లాంటివి అక్కర్లేదు.అవసరమైన చోటికే లేజర్ని పంపడం , ఎంత వేగం తో కావాలంటే అంత వేగంతో పంపడం వైద్యుడి ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది.

దంత అనారోగ్యం కలిగితేనే కాదు - చికిత్స కూడా బాధాకరం అనే అభిప్రాయం అందరిలో ఉంది. కానీ పళ్లు పుచ్చిపోతే లోపలి భాగాల్ని తొలగించడం , దంతాల చిగుళ్ల ఇన్‌ఫెక్షన్స్‌ని తొలగిం చడం , నోట్లో గడ్డలు ఎక్కుడున్నా తీసివేయడం , హిమాంజిె మా లవంటి వాటిని తొలగించడం , నోటిలో అల్సర్స్‌ని తగ్గించడం , పళ్ల హైపర్‌ సెన్సిటివిటిలాంటివి తగ్గించడం వంటి చికిత్సల్ని- కత్తి తో సంబంధం లేకుండా కాంతితో , ఏమాత్రం నొప్పి , రక్తస్రావం లేకుండా మన రాష్ట్రంలో చేయగ లుగుతున్నామంటే దంతవైద్య విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందిందో వేరుగా చెప్పనక్కర్లేదు.

లేజర్‌ కిరణాల సాయంతో వినూత్న పరికరం ద్వారా దంతాలు , చిగుళ్లు , నోటి ఎముకకు సంబ ంధించిన అనేక చికిత్సల్ని చేస్తున్నారు...ఇంతకు ముందు మెత్తటి కణాలకి చికిత్స చేసే లేజర్స్‌ మనకు అందుబాటులో ఉన్నాయి.

‘ఔఅఖిఉ’ పదాన్ని విస్తరిస్తే ‘లైట్‌ యాంప్లికేషన్‌ స్టిమ్యులేటెడ్‌ ఎమిషన్‌ ఆఫ్‌ రేడియేషన్‌’.
లేజర్‌ యంత్రం నుంచి హార్డ్‌ టిష్యూ , సాఫ్ట్‌ టిష్యూలకు చికిత్స చేసే పైప్స్‌- వేరు వేరుగా ఉం టాయి.
దెబ్బతిన్న సాఫ్ట్‌ టిష్యూని తొలగించే సన్నటి పైప్‌కి చివర్న గాస్‌టిప్‌ ఉంటుంది. దీనిలోంచి లేజర్‌ కిరణాన్ని అవసరమైన ప్రాంతంలోకి ప్రసరించేట్టు చేస్తారు చికిత్సలో. ఇది ఫైబర్‌ ఆప్టిక్‌ ట్యూబ్‌. తర్వాత చికిత్సలో అప్పుడు పైనున్న టిప్‌ని తీసివేస్తే , టిప్‌ని పెంచుతారు. ఇలా క్రమంగా ఈ ఫైబర్‌ ఆప్టిక్‌ ట్యూబ్‌ అయిపోవచ్చు. అప్పుడు కొత్త తీగని వేసుకోవలసి వస్తుంది.

ఇదే మెషిన్‌కి-హార్డ్‌ టిష్యూకి చికిత్స చేయడానికి వీలుగా ఎక్కువ లేజర్‌ కిరణాన్ని ప్రసరింపజేసే ట్యూబ్‌ ఉంటుంది. ఇవి రెండూ ఒకే మిషిన్‌కి ఉండటం విశేషం. ఈ మెషీన్‌ విద్యుచ్ఛక్తి సాయంతో పనిచేస్తుంది.మామూలుగా వైద్యులకు హస్త వాసి అంటారు. చేతు లతోనే శస్తచ్రికిత్సలు , అన్ని చికిత్సలు చేస్తుంటారు. అందుకని చేతులతో నేర్పుండాలి , అనుకుంటాం. కానీ ఈ లేజర్‌ మెషీన్‌ని ఆపరేట్‌ చేయాలంటే చేతులతో నైపుణ్యమే కాదు , కాళ్లలో నైపుణ్య మూ ఉండాలి. ఎందుకంటే లేజర్‌ కిరణా న్ని ప్రసరింపచేసే పైప్‌ని రోగి నోటిలోని ఆ భాగం వరకూ తీసుకువచ్చినా కింద పాదంతో పెడల్‌ మీద అవసరమైనంత ఒత్తిడిని కలిగించినప్పుడే లేజర్‌ కిరణాలు బయటకు రావడం ప్రారంభిస్తాయి. ఎప్పుడు పాదాన్ని పైకెత్తి తే అప్పుడే లేజర్‌ కిరణాలు బయటికి ప్రసరించడం ఆగిపోతుంది.

లేజర్‌ పనిచేసేది ‘ధెర్మకోయాగ్యులేటివ్‌ ఎఫెక్ట్‌’ తో. ఈ లేజర్‌ కిరణాలలో చాలా ఉష్ణముం టుంది. 200 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకూ ఉంటుంది. కానీ కాలదు. నొప్పి ఉండదు. రక్తస్రావముం డదు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంత ఉష్ణము నొప్పి కలిగించని కిరణాల ద్వారా ప్రవహించి చిి త్స తోడ్పడుతోందంటే!
హార్డ్‌ , సాఫ్ట్‌ టిష్యూలకు చికిత్స చేసే పైప్స్‌ వేరువేరుగా ఉండడమే కాదు ప్రోగ్రామ్‌ మార్చిన ప్పుడల్లా చికిత్సా విధానం మారుతుంది. ఎలాగంటే చిగుళ్లకి చికిత్స చేయాలంటే ఒక విధమైన ప్రోగ్రామ్‌ నివ్వాలి. రూట్‌కెనాల్‌ ట్రీట్‌మెంట్‌కి మరో ప్రోగ్రామ్‌...ఇలా హార్డ్‌ టిష్యూ చికిత్స కోసం 40 ప్రోగ్రా మ్‌లుంటే , సాఫ్ట్‌ టిష్యూ కోసం మరో 40 ప్రోగ్రామ్‌లున్నాయి ఈ మెషీన్లో.

సాఫ్ట్‌ టిష్యూ చికిత్సలో వున్న ప్రోగ్రామ్స్‌ని కొన్నింటిని చూద్దాం. ఎండోడాంటిక్స్‌ ప్రోగ్రామ్స్‌తో రూట్‌కెనాల్‌ ట్రీట్‌మెంట్‌ చెయవచ్చు. బాగా లోతుగా వున్న ఇన్‌ఫెక్షన్‌ని అరికట్టవచ్చు. పంటిని గాని , చిగుళ్లనిగాని , ఎముకనిగాని అవసరమైనంత కత్తిరించవచ్చు. మరో ప్రోగ్రామ్‌ ద్వారా పన్ను పై భాగాలు అరిగి జివ్వున లాగుతుంటే- ఆ ప్రాంతంలోని అతిస్పందనని మరో ప్రోగ్రామ్‌ ద్వారా.. లేజర్‌ కిరణాన్ని ఆ ప్రాంతంలోకి పంపి సెన్సిటివ్‌నెస్‌ని తగ్గించే ప్రోగ్రామ్‌ ఉంది.

సాధారణంగా అధికరక్తపోటు , మూర్ఛలతో బాధపడే వాళ్లకు చిగుళ్లు వాస్తే ఎక్కువవున్న చిగుళ్లని కత్తిరించవచ్చు ఇంకో ప్రోగ్రామ్‌తో. మరో ప్రోగ్రామ్‌తో చిగుళ్లని ఓపెన్‌ చేయకుండానే కాంతి కిరణాలతో లోపల దెబ్బతిన్న చిగుళ్ల కణాన్ని మాడ్చివేయవచ్చు. నోట్లో చీముగడ్డలు ఏర్పడితే వాటిని తీసి వేసే ప్రోగ్రామ్‌ ఉంది. కొంతమందిలో రెండు పళ్లమధ్య ఫ్రీనమ్‌ అనే కండరము ఏర్ప డుతుంటుంది. దీంతో పళ్లమధ్య సందులు ఏర్పడతాయి. అలా సందులు ఏర్పడకుండా ఫ్రీనమ్‌ని తీసివేయవచ్చు లేజర్‌ కిరణాలతో.. ఇలా చెప్పుకుంటూపోతే ఇంకా ఎన్నో ప్రోగ్రామ్‌లున్నాయి సాఫ్ట్‌ టిష్యూ చికిత్సలకి. ఒక్కమాటలో చెప్పాలంటే నోటిలోని మెత్తటి కణాలన్నింటికీ సంబం ధించిన ప్రోగ్రాంలు ఉన్నాయి ఈ లేజర్‌ చికిత్సా యంత్రంలో.

ఇక హార్డ్‌ టిష్యూ..గట్టి కణాల చికిత్సకొస్తే అవీ 40 ఉన్నాయి. డెంటిన్‌ని , ఎనామెల్‌ని కట్‌ చేయ వచ్చు. పంటి మీద ఎత్తుపల్లాలు ఏర్పడి క్రమంగా పళ్లలో కంతలు ఏర్పడవచ్చు. ఇలా పళ్లు పుచ్చి పోకుండా కంతలు ఏర్పడుతున్న ప్రదేశాన్ని ‘ఫిట్‌ అండ్‌ ఫీజర్‌ సీలింగ్‌ పద్ధతి’ లో మూసి వేస్తారు. లేజర్‌ కిరణాలతో పన్నునే కాదు , ఎముకనీ కట్‌ చేయవచ్చు. పుచ్చిన పళ్లని తీసివేయవచ్చు. ఫ్లోరో సిస్‌వల్ల పళ్ల మీద పసుపు పచ్చని పొర ఏర్పడుతుంటే దాన్నీ తీసివేయవచ్చు. పళ్ల పై భాగంలో సెన్సి టివ్‌నెస్‌ ఎక్కువగా ఉంటే లేజర్‌ కిరణాలతో ఆ భాగాన్ని డిసెన్సిటైజ్‌ చేయవచ్చు.

ఎక్కువున్న చిగుళ్లని కట్‌చేయవచ్చు. గ్రాన్యులేషన్‌..అంటే పాడైపోయిన కణాన్ని ఖచ్చితంగా అంత వరకే తీసివేయవచ్చు. నోట్లో ఏర్పడే రకరకాల గడ్డల్ని హార్డ్‌లేజర్‌తో తొలగించవచ్చు. ముఖ్యంగా హిమాంజియోమాలు.. రక్తపు గడ్డల్ని తీసివేయడం కష్టం. వాటిని కొద్దిగా కత్తిరిస్తే చాలు రక్తం ధారగా కారుతుంటుంది. అలాంటి గడ్డల్ని రక్తస్రావం కాకుండా కాల్చివేయవచ్చు. ఒక్కపన్ను దగ్గరే చిగురువాస్తే దానిని తీసి వేయవచ్చు. క్రేన్‌ని పెంచడంకోసం చిగుళ్లని పెంచవుచ్చు. నోట్లోని చిన్న చిన్న పుళ్లమీదకి లేజర్‌ కిరణాన్ని పంపగానే నొప్పి తగ్గిపోతుంది. ఇరవైనాలుగ్గంటల్లో పుళ్లు పూర్తిగా తగ్గిపోతాయి. అంతేకాదు...ఆ ప్రాంతంలో నున్నగా తయారవుతుంది ఎటువంటి మచ్చ పడకుండా.

చిన్నపిల్లల్లో కొందరికి పళ్లు చిగుళ్లలో ఉండిపోతాయి. త్వరగా బయటకు రావు. అలాంటి పరిస్థి తుల్లో లేజర్‌కిరణాలతో నొప్పిలేకుండా చిగుళ్లని కోసి , పళ్లు బయటకు వచ్చేట్టు చేయవచ్చు. పళ్ల మీద జెల్‌ని రాసి , లేజర్‌ కిరణాన్ని నాలుగునిముషాలు పంపడంతో పళ్లని తెల్లగా చేయవచ్చు. వెసి ్టబ్యూల్‌లోప్లాస్టి....పెదవి లోపలివైపు ఎముకని లేజర్‌ కిరణాలతో కత్తిరించవచ్చు. పంటి చివరి భాగం కోసుకుంటుంటే ఆ పదునుని తగ్గించవచ్చు. ఎక్కడ ఎముక ఏమాత్రం ఎక్కువ వున్నా నొప్పి లేకుండా కత్తిరించవచ్చు. జ్ఞానదంతాలు ఓ పట్టాన బయటకు రాకుండా నొప్పి పెడుతుంటే లేజర్‌ కిరణాలను పంపి నొప్పిలేకుండా పైనున్న చిగుళ్లని కత్తిరించి దంతాలు బయటకు వచ్చేట్టు చేయ వచ్చు. ఇలా హార్డ్‌టిష్యూ లేజర్‌లో కూడా ఎన్నో ప్రోగ్రామ్‌లున్నాయి.

అన్ని రకాల దంత చికిత్సల్ని లేజర్‌తో చేయవచ్చు. మెత్తటి కణాలని చికిత్స చేసినా , గట్టికణాన్ని కత్తిరించినా నొప్పి ఉండదు. రక్తం కారదు. చిగుళ్లలో పాడైపోయిన భాగాల్ని చిగుళ్లని కత్తిరించ కుండా కాంతిని పంపి మాడ్చేయువచ్చు. సైడ్‌ ఎఫెక్ట్‌‌స ఉండవు ఈ చికిత్సలో. చికిత్సకి పట్టే సమ యం కూడా మామూలు విధానంతో పోలిస్తే తక్కువ. కేవలం రెండు నిముషాలలో కావలసిన ప్రోగ్రామ్‌ని సెట్‌ చేసుకోవచ్చు. ఏ ప్రోగ్రామ్‌ని సెట్‌చేస్తే లేజర్‌ కిరణాలు ఆ ప్రోగ్రామ్‌నే చేస్తాయి. మిగతా కణాన్ని ముట్టుకోవు. ఉదాహరణకు చిగుళ్లులోపల దెబ్బతిన్న కణాల్ని మాడ్చటానికి ప్రోగ్రా మ్‌ పెడితే లేజర్‌ కిరణాలు ఆ కణాలనే మాడ్చేస్తాయి మిగతాకణాల్ని ఏమాత్రం ముట్టుకోకుండా.
ఈ లేజర్‌ యంత్రాలలో కూడా కార్బన్‌డయాకై్సడ్‌ లేజర్‌ కన్నా ఎన్‌డిఆర్‌ లేజర్‌ శక్తివంతమైంది. అనస్థీషియా లేకుండానే ఈ శస్తచ్రికిత్సలన్నీ చేయవచ్చు.

లేజర్‌ అంటే.. ?

ఒక పద్ధతి లేకుండా ప్రయాణించే అనేక ఎలక్ట్రోమేగ్నిటిక్‌ వేవ్స్‌ మాములు కాంతిలో ఉంటాయి. దీనిని ‘ఇన్‌కొహెరెంట్‌ లైట్‌’ అంటారు. లేజర్‌కాంతి కిరణాలకు మూడు ప్రత్యేక ధర్మాలుంటాయి. ఇది తిన్నగా ఒకే దారిలో వెళ్తుంది. దూరం ప్రసరింపచేసిన చాలా కొద్దిగా మాత్రమే వంగుతుంది. ఇందుకు భిన్నంగా మామూలు కాంతికిరణాలు విస్తరిస్తాయి. లేజర్‌ కిరణాల రెండవ ధర్మం ఒకటే రంగుని కలిగి ఉంటుంది. మామూలు కాంతిలో ఇందుకు భిన్నంగా ఎన్నో వేవ్‌లెంత్స్‌ రంగులుం టాయి. లేజర్‌ యంత్రంలో లేజర్‌ కేవిటీలో లేజర్‌ కిరణాలు ఉత్పత్తి అవుతుంటాయి. లేజర్‌ కేవిటీలో మూడు ముఖ్యమైన విభాగాలున్నాయి. లేజర్‌ కిరణాలు ఉత్పత్తి చేసే ప్రాంతం పవర్‌ జన రేటర్‌ ఒక ముఖ్యభాగం. లేజర్‌ కిరణాలని ఉత్పత్తి చేసే ప్రాంతం పవర్‌ జనరేటర్‌ ఒక ముఖ్య భాగం. లేజర్‌ కిరణాలని ఉత్పత్తి చేసే సోర్స్‌ ఘనరూపంలో ఉండవచ్చు.ద్రవరూపంలో ఉండ వచ్చు.వాయురూపలో ఉండవచ్చు. ఘన రూపంలో ఉండే సోర్‌స సిలెండ్రికల్‌ లేజర్‌ క్రిస్టల్‌ సాధా రణంగా వైద్యంలో వాడే లేజర్‌ క్రిస్టల్స్‌ Nd ; YAG, Er: YAG ( Neodimium yttrium- aluminium ganate, Erbium, yttrium- aluminium Gamate ఈ యాక్టివ్‌ మీడియమే... లేజర్‌నుంచి వచ్చే కాంతి వేవ్‌ లెంత్‌ని నిర్థారిస్తుంది. ఉదాహరణకి ND: YAG వేవ్‌లెంత్‌ 1.06 YM అయితే Er: YAG వేవ్‌లెంత్‌ 2.94.
రెండవది యాక్టివ్‌ మీడియా పరమాణువుల్ని స్టిమ్యులేట్‌ చేసే ఎనర్జీ సోర్స్‌ పల్స్‌డేలో ప్రెజర్‌ జినాన్‌ ఫ్లాష్‌లాంప్‌.
మూడవ ముఖ్యమైన భాగం ఆఫ్టికల్‌ రిజోనేటర్‌. లేజర్‌కేవిటీకి రెండు చివర్లలోనూ రెండు హైలి పాలిష్ట్‌ మిర్రర్స్‌ ఉంటాయి. ఇవి ఉత్పత్తి అయ్యే లేజర్‌ కిరణాలు ప్రక్కలకు వెళ్లకుండా ముందుకు వెళ్లే మార్గాన్ని నిర్దేశిస్తాయి.
లేజర్‌ కిరణాలు ఉత్పత్తి కాగానే లేజర్‌బీమ్‌ డెలివరి సిస్టమ్‌ ద్వారా ముందుకు పంపబడతాయి. అక్కడ నుంచి పైప్‌ ద్వారా ఆ కిరణాల్ని నోటిలో ఏ ప్రదేశంలోకి పంపాలో ఆ ప్రదేశంలోకి పంపడం జరుగుతుంది.
మనుషుల మీద ఈ లేజర్‌ కిరణాల ప్రభావం యంత్రం నుంచి ఉత్పత్తి ఆయ్యే రేడియంట్‌ ఎనర్జీ వేవ్‌ లెంత్‌ని బట్టి ఉంటుంది. విచిత్రమేమిటంటే ఎంతో ఉష్ణము లేజర్‌ కిరణాలలో వున్నా ఏమా త్రం కాలదు , నొప్పి అనిపించదు. శరీరంలో ఏ ప్రాంతంలోనయినా లేజర్‌ కిరణాలు తాకగానే ఆ ప్రాంత అవయవాలు వాటిని పీల్చుకుంటాయి. ఈ పీల్చుకున్న లేజర్‌ కిరణాలు ఖచ్చితంగా ప్రోగ్రా మింగ్‌ ప్రకారమే పనిచేస్తాయి. ఎంత ఎక్కువ ఎనర్జీ లోపలకు తీసుకుంటే అంత ఎక్కువ ఎఫెక్ట్‌ ఉంటుంది.
అవసరమైన చోటికే లేజర్ని పంపడం , ఎంత వేగంతో కావాలంటే అంత వేగంతో పంపడం వైద్యుడి ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది.
వైద్యంలో ఉపయోగించే లేజర్స్‌ ప్రధానంగా నాలుగురకాలు. మొదటివి గాస్‌ లేజర్స్‌ ( Co2 Argon,Hene etc) రెండో రకం సాలిడ్‌ స్టేట్‌ లేజర్స్‌. ఇవి. Er ; YAG ND: YAG,KTP లాంటివి. మూడవరకం లిక్విడ్‌ (డై) లేజర్స్‌. నాల్గవ రకం డియోడ్‌ లేజర్స్‌.

Er: YAG ని అబ్జార్బ్‌ చేసుకునే క్రోమోఫోర్స్‌ - నీరు , హైడ్రాక్సియాపటైట్‌ హార్డ్‌ డెంటల్‌ టిష్యూ చికిత్సకి ఈ లేజర్‌ కిరణాల్ని వాడతారు. రక్తస్రావం లేకుండా రక్తం గడ్డకట్టకుండా , ఇన్‌ఫెక్షన్‌ రాకుండా సాఫ్ట్‌ డెంటల్‌ టిష్యూని కట్‌ చేయవచ్చు.

ND : YAG లేజర్‌ కిరణాలు మెలనిన్‌ , హిమోగ్లోబిన్‌లలోకి నెమ్మదిగా పీల్చబడుతుంది. సాఫ్ట్‌ డెంటల్‌ టిష్యూని కోయడానికి...చికిత్సకి ఇది తోడ్పదుతుంది. ఇన్‌ఫెక్షన్‌ తొలగించడానికి , పళ్లు తెల్లగా మారడానికి కూడా తోడ్పడుతుంది.
KTP లేజర్‌ ND.YAG ఫ్రీక్వెన్సీకి రెట్టింపు , మెలనిన్‌ , హిమోగ్లోబిన్‌లో అబ్జార్బ్‌ అవుతుంది. కట్‌ చేయడానికి , ఇన్‌ఫెక్షన్‌ పోగొట్టడానికి తోడ్పడుతుంది.

HO: YAG నీరు అబ్జార్బింగ్‌ క్రోమోఫోర్‌. కటింగ్‌ , ఇన్‌ఫెక్షన్‌లను పోగొట్టడానికి ఈ లేజర్‌ కిర ణాలు తోడ్పడతాయి Co2 లేజర్‌కి అబ్జార్బింగ్‌ క్రోమోఫోర్‌ నీరు సాఫ్ట్‌ టిష్యూని కట్‌చేయడానికి ఇన్‌ఫెక్షన్‌ పోగొట్టడానికి తోడ్పడుతుంది. డియోడ్‌కి అబ్జార్బింగ్‌ క్రోమోఫోర్స్‌ మెలనిన్‌ , హిమో గ్లోబిన్‌ సాఫ్ట్‌ టిష్యూ కటింగ్‌కి , ఇన్‌ఫెక్షన్‌ పోగొట్టడానికి పళ్లని తెల్లగ చేయడానికి ఈ లేజర్‌ తోడ్ప డుతుంది.

లేజర్‌ పెరామీటర్స్‌ వేవ్‌ లెంత్‌ ( NM) పవర్‌ ( W) రెపిటేషన్‌ రేట్‌ -ఫ్రీక్వెన్సి ( H2) పల్స్‌ డ్యురేషన్‌ ( MS OR Ms). లేజర్‌ కిరణాలు ఒక తరంగ దైర్ఘ్యంలో ప్రసరిస్తాయి. అదే వేవ్‌లెంత్‌ లేజర్‌ వేవ్‌లెంత్‌ 400 NM 700NM మధ్య ఉన్నప్పుడే కాంతి కంటికి కనిపిస్తుంది.

లేజర్‌ ద్వారా ఎంత ఎనర్జీ ఉత్పత్తి అయ్యేది అన్నది పవర్‌ వైద్యం కోసం ఉపయోగించే లేజర్స్‌ని ప ల్స్‌మోడ్‌లో ఆపరేట్‌ చేస్తారు. పల్స్‌ రిపిటిషన్‌ రేట్‌ ప్రకారం లేజర్‌ కిరణాలు ప్రసరిస్తాయి. సాధా రణంగా సెకండుకి 10 పల్స్‌స్‌ రేట్‌ ప్రకారం లేజర్‌ కిరణాలు ప్రసరించేట్టు చూస్తుంటారు.

పల్స్‌ డ్యూరేషన్‌ అంటే పల్స్‌ విడ్త్‌. లేజర్‌ పల్స్‌ లెంత్‌ని చెబు తుంది. లేజర్‌ ఎనర్జీని ప్రసరింపచేయడానికి పట్టేకాలం.

పల్స్‌ ఎనర్జి ( j) అంటే లేజర్‌ పల్స్‌లో వున్న రేడియంట్‌ ఎనర్జి. పీక్‌ పవర్‌ ( w) ఇండివిడ్యువల్‌ లేజర్‌ పల్స్‌తో పవర్‌ స్థాయిని పల్స్‌ ఎనర్జి అంటారు. స్పాట్‌ సైజ్‌ ( NM) ఫ్లూయెన్స్‌ ( J/ CM2) అంటారు.
థెర్మోకోయాగ్యులేటింగ్‌ ఎఫెక్ట్‌ వల్ల గత ఇరవై సంవత్సరా లు గా లేజర్‌ కిరణాలను దంత వైద్యానికి సంబంధించిన వివిధ చికిత్సలకి ఉపయోగిస్తున్నారు. సాఫ్ట్‌ టిష్యూ చికిత్సలకి ND : YAG లేజర్‌తో బాగా నిర్వహించవచ్చు - స్టెరిలైజింగ్‌ కోయాగ్యులేటింగ్‌ ఎఫెక్ట్‌వల్ల మామూలు పద్ధతులకన్నా ఈ లేజర్‌ చికిత్స ఎంతో ఉపయోగం.

రక్తస్రావం , నొప్పి ఉండవు. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌‌స కూడా ఉండవు. మందుల అవసరం ఉండదు. అనస్థీషియాలాంటివి అక్కర్లేదు.
డాక్టర్‌ సుధీర్‌ చౌదరి
దంత వైద్యనిపుణులు
అమీర్‌పేట్‌ డెంటల్‌ స్పెషాలిటీస్‌
అమీర్‌పేట్‌ , హైదరాబాద్

ఆధారము: ఆయురారోగ్యాలు బ్లాగ్

గుట్కా వల్ల నోటి క్యాన్సర్‌

మూడు వేళ్ల వెడల్పున్న తళుకు కాగితం సంచులు ఏ కిళ్లీ కొట్టులో చూసినా, పాన్‌ డబ్బాలలో చూసినా దర్శనమిస్తుంటాయి. పల్లె పట్నం అన్న తేడా లేకుండా అన్ని ప్రదేశాలకూ వ్యాపించిన ఈ చిన్ని పొట్లాం గుట్కా. దీనిని తీసుకెళ్లడం తేలిక. అంతేకాక అన్ని చోట్లా దొరుకుతుంది. మారు మూల గ్రామాలలోకీ చొచ్చుకుపోయింది. ఇందులో వక్క, పచ్చి వక్క, సున్నం, పొగాకు తదితర పదార్థాలు వుంటాయి. దీని మూలంగా అనేక రకాల క్యాన్సర్లు వస్తాయని, వైద్యులు మొత్తుకుంటున్నా ఆగేదెవరు?రోడ్డు పక్కన ఏ బడ్డీకొట్టు దగ్గరైనా సరే కాసేపు నిలబడితే చాలు! చిన్న చిన్న పిల్లలు సైతం వచ్చేసి 'అంకుల్‌! ఒక చాంపియన్‌ ఇవ్వండి' అంటూ రూపాయి బిళ్ల డబ్బామీద పెట్టేస్తారు. కూలి పని చేసుకునేవారు సైతం పని మధ్యలో వచ్చేసి 'రెండు పాన్‌ పరాగ్‌ ఇవ్వు' అంటూ డబ్బులు అందిస్తుంటారు. షాపతను ఇంత పొడుగు దండలోంచి గుట్కా పాకెట్లు చించి ఇస్తుంటాడు. కొట్టు ముందు నుంచి కదలకుండానే నోటితో పాకెట్‌ను ఓ మూల చించేస్తారు. లేత గోధుమ, తెలుపు రంగుల్లో నిక్షిప్తమైన పదార్థాన్ని ముందుగా అరచేతిలో వేసుకుంటారు. తర్వాత ఇలా నోట్లో వేసుకుని బుగ్గన పెట్టేస్తారు.

ఇలా ఒక పొట్లాం తర్వాత మరొకటి...వేస్తూనే వుంటారు. ఏళ్ల తరబడి దీన్ని తినడం వల్ల నోరు ముఖ్యంగా బుగ్గలు, నాలుక బండబారిపోతాయి. నోటి లోపలి పొరల్లో ఫైబ్రోసిస్‌ అనే వ్యాధి వచ్చి తిష్టవేస్తుంది. ఇది సోకిన వారికి నోరు తెరవడం కూడా బాధగా వుంటుంది. సాధారణ వ్యక్తులకు క్యాన్సర్‌ సోకే అవకాశం కన్నా ఫైబ్రోసిస్‌ వ్యాధి పీడితులకు క్యాన్సర్‌ వచ్చే అకవాశం 400 రెట్లు ఎక్కువ. ఫైబ్రోసిస్‌ మొదలైన అయిదేళ్ల నుంచి పదేళ్ల లోపల క్యాన్సర్‌ వస్తోంది. నోటి లోపల ఎంత ఎక్కువ సేపు వాటిని పెట్టుకుంటే అంత ఎక్కువగా క్యాన్సర్‌ వచ్చే అవకాశం వుంది. ఈ వ్యాధి రోగి నోటినీ, ముఖాన్నీ వికారం చేస్తుంది. నానా రకాల బాధలతో తీసుకుని తీసుకుని మరణించేలా చేస్తుంది. తమాషా ఏంటంటే...ఎంతో ప్రమాదకరమైందిగా భావించే సిగరెట్‌ కంటే గుట్కా మరింత ప్రమాదకరమైంది. ఇందులో పొగాకు కలిసి వుండడమే అందుకు కారణం. పొగాకులో వందల కొద్ది విష పదార్థాలున్నాయి. కాల్చే ప్రతి సిగరెట్‌లో నికోటిన్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌, తార్‌ వుంటాయి. పొగాకులోని కార్బన్‌ మోనాక్సైడ్‌ రక్తానికి సరఫరా అయ్యే ఆక్సిజన్‌ మోతాదు తగ్గిస్తుంది. పొగాకులోని తారు క్యాన్సర్‌ వ్యాధిని కలిగిస్తుంది. క్యాన్సర్‌ వ్యాధిని కలిగించడానికి సిగరెట్‌కు పట్టే సమయంలో సగమే గుట్కాకు పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఓ తండ్రి తన కొడుక్కి సిగరెట్‌ ఇవ్వలేకపోయినా గుట్కా పాకెట్టును మాత్రం సులభంగా చేతిలో పెట్టేస్తాడు. దీనిలో దాగిన ప్రమాదం తెలీకనే ఇదంతా. మొత్తం క్యాన్సర్‌ రోగుల్లో నోటి క్యాన్సర్‌ రోగులు దాదాపు పదోవంతు మంది వున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. విదేశాల్లో ఈ క్యాన్సర్‌ రావడం చాలా అరుదు. నోరు పండించే తాంబూలం స్థానాన్ని పాన్‌మసాలాలు, గుట్కాలు ఆక్రమిస్తున్నాయి. వీటి బాధితులంతా 35 ఏళ్ల లోపు వారే. వీటిని అరికట్టలేకపోతే ఈ శతాబ్దాంతానికి నోటి క్యాన్సర్‌ రోగుల సంఖ్య తారాస్థాయికి చేరుతుందని వైద్యులు ఆందోళన చెందుతున్నారు.

ఎందుకు వాడతారు?
అసలు ప్రాణాంతకంగా మారే పొగాకును వివిధ రకాలుగా ఎందుకు వాడతారు? అసలు ఆ అలవాటును ఎందుకు చేసుకుంటారు? ఇందుకు సామాజిక, ఇతర అనేక కారణాలున్నాయి. స్నేహితులు షోకుగా, జాలీగా తాగడం, తీసుకోవడం చూసి వాటి ఆకర్షణలో పడతారు. పార్టీలలో వక్కపొడి, సిగరెట్లు ఇవ్వడం వల్ల కొంత మంది వాటిని అలవాటు చేసుకుంటారు. ఇక మరికొందరు రాత్రిపూట నిద్ర మేలుకోవడానికో, విశ్రాంతి తీసుకోవడానికో పొగతాగడం, జర్దాలు, పాన్‌పరాగ్‌లు వేసుకోవడం అలవాటు చేసుకుంటారు. రాత్రి పూట డ్రైవర్లు ఎక్కువసేపు మేల్కొని వుండడానికిగాను వక్కలు, జర్దాలు, పాన్‌పరాగ్‌లు నోటిలో పెట్టుకుంటుంటారు. సిగరెట్లు కాలుస్తుంటారు. పెద్దలను చూసి పిల్లలు కూడా మొదలెడతారు. ఇలా ఒక ప్రమాదకర వలయంలా ఇది అలవాటౌతుంటుంది.

దగ్గరకు చేరరు
గుట్కా, పాన్‌ మసాలా, జర్దాలు తినేవారి దగ్గరకు చేరడానికి ఎవరైనాసరే తటపటాయిస్తారు. ఆఖరుకు స్నేహితులు, బంధువులు, కట్టుకున్నవారు కూడా. ఆ విధంగా అందరి ఛీత్కారాలకు గురవుతారు. ఆ వాసనను అందరూ అసహ్యించుకుంటారుకూడా. అలాంటి వారిని అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. కొందరు తెలియకుండా పెళ్లి చేసుకున్నా ఆ తరువాత సంసారంలో వారి మధ్య చీదరింపులు, చీత్కారాలతో ముద్దు ముచ్చట్లు కూడా కరువవుతాయని చెబుతారు. 16-18 ఏళ్ల ప్రాయంలో చుట్టు పక్కల స్నేహితులతో సరదాగా గుట్కా, పాన్‌మసాలాతో ప్రారంభమయ్యే స్నేహం దురలవాట్లకు బానిసలుగా మార్చేస్తుంది. పళ్లన్నీ గారపట్టి ఎర్రగా అసహ్యంగా తయారై ఎవ్వరూ దగ్గరకు చేరనంతగా తయారవుతారు. చిన్న వయసులోనే క్యాన్సరుకు గురయి మరణిస్తుంటారు. అలా పదిమందిలో 9 మంది నోటి క్యాన్సరుతో మరణిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా చదువుతలేని వారు, కొద్దిపాటి చదువుకున్నవారు, కొందరు బాగా చదువుకున్న మధ్యతరగతి కుటుంబాల వారు గుట్కా, పాన్‌మసాలా, జరదాలకు అలవాటుపడి క్రమేణా క్యాన్సర్‌ వ్యాధి బారిన పడిపోతున్నారు. సరదాగా ప్రారంభమైన గుట్కా నమిలే అలవాటు క్యాన్సర్‌ వ్యాధి ప్రారంభం కాగానే పళ్లు ఊడిపోవడం, ఆహారం జీర్ణంకాకుండా పోవడం దగ్గర నుంచి ఆ తర్వాత మాట్లాడే స్థితి కూడా లేకుండా పోతుంది. జీర్ణవ్యవస్థ పాడవుతుంది. రాత్రుళ్లు నిద్ర సరిగా పట్టదు. కొన్నాళ్లకు నోరుకూడా తెరుచుకోలేని స్థితి వల్ల ద్రవపదార్థాలను గొట్టాల ద్వారా కడుపులోకి పంపించే స్థితికి చేరిపోతారు. అలా క్రమేణా స్వల్ప కాలంలోనే గుట్కాలు, జర్దాలు, పాన్‌మసాలాల కారణంగా క్యాన్సర్‌ వ్యాధితో మరణిస్తున్నారు. రూపాయి, రెండు రూపాయల గుట్కా లక్షలాది రూపాయల ఖర్చును, క్యాన్సర్‌ జబ్బును మోసుకొచ్చి ప్రాణాలను హరిస్తుంది.

ప్రభుత్వానికి పట్టదా!
ఇన్ని కోట్ల మంది ఆరోగ్యాలతో చెలగాటమాడే గుట్కాల గురించి ప్రభుత్వానికి పట్టదా? అనిపించొచ్చు. గతంలో మన కేంద్ర ప్రభుత్వం గుట్కాల ఉత్పత్తినీ, విక్రయాన్ని నిషేధించింది. కానీ ఏ మూలకెళ్లి ఏ చిన్ని బడ్డీ కొట్టులో చూసినా గుట్కా పాకెట్ల దండలు మెరుస్తూ కనిపిస్తాయి. నిషేధం విధిస్తే సరిపోతుందా! అమలులో చిత్తశుద్ధితో అమలు జరపాలిగాని!! దేనిపైనైనా నిషేధం విధిస్తే సరిపోదు. దానిపై నిఘా అత్యంత అవసరం. ఈ విషయమై ప్రజల్లో చైతన్యం కలిగించడం మరింత అవసరం. మరో ముఖ్యమైన విషయం వుంది. పొగాకు పండించే రైతులకు ప్రత్యామ్నాయ పంటలు పండించేలా చైతన్య పరచాలి. అందుకు ప్రోత్సాహకరంగా సబ్సిడీలు, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహార మందులు అందించాలి.

భయంకర జబ్బు

నోటి క్యాన్సర్‌ డబ్బు పోసి మరీ కొనుక్కునే భయంకర జబ్బు. ఏ అవయవానికి క్యాన్సర్‌ వస్తే దాన్ని కోసి తీసేయడమే. నాలుకకు వస్తే నాలుకను కోసిపారేస్తారు. బుగ్గకొస్తే బుగ్గను కోస్తారు. పెదవికొస్తే పెదవిని కోసేస్తారు. నోటి క్యాన్సర్‌ బుగ్గకు వస్తే బుగ్గకు రంధ్రం పడుతుంది. నోటి క్యాన్సర్‌ వచ్చినవారి ఫొటోలను చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. మరెప్పుడూ నోటి క్యాన్సర్‌ కారకాలైన పాన్‌పరాగ్‌, గుట్కా, జర్దా, పాన్‌మసాలా, చుట్ట, బీడీ, సిగరెట్‌, పచ్చి వక్కపొడి వగైరా వాటి జోలికి ఎన్నడూ పోకూడదన్న భయం కలగజేస్తుంది. కానీ చాలామందిలో ఆ భయం శాశ్వతంగా వుండదు. అలవాటును మానలేరు. అందుకే తెలిసి తెలిసీ నోటి క్యాన్సర్‌ బారినపడతారు. భయాన్ని శాశ్వతం చేసుకున్నవారు ఆ ప్రాణాంతక అలవాటును శాశ్వతంగా మానివేసి తమను తాము కాపాడుకోగలుగుతారు.

నోటి క్యాన్సర్‌ వచ్చినవారిలో 90 శాతం మంది పొగాకు, వక్క ఏదో ఒక రూపంలో వాడేవారే. దీన్ని బట్టి అవి ఎంత ప్రమాదకరమైనవో చెప్పాల్సిన పనిలేదు. కానీ మన దేశంలో మాత్రం గుట్కాలు, పాన్‌లు, పాన్‌పరాగ్‌లు సేవించేవారి సంఖ్య పెరిగిపోతోంది. మహిళలు, పిల్లలు, యువకులు వాటిని ఒక ఫ్యాషన్‌గా తీసుకుంటూనే వున్నారు. ముఖ్యంగా యువతరం ఈ వ్యసనానికి బానిసవుతోంది. అందుకేనేమో ఏదేశంలోనూ లేనివిధంగా 10-12 సంవత్సరాల లోపువారే నోటి క్యాన్సర్‌ బారిన పడుతున్నారు.భయంకరమైన నోటిక్యాన్సర్‌ నుంచి ప్రజలను ముఖ్యంగా యువతను విముక్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి. మన రాష్ట్రంలో కూడా గుట్కాలు, జర్దాలకు వ్యతిరేంగా ఉద్యమాలు జరిగాయి.

కట్టడి చేయాలి

రూపాయి చేతిలో వుంటే చాలు! ఆ ప్రాణాంతక పొట్లాన్ని కొనుక్కొని నోట్లో వేసుకోవచ్చు. చవగ్గా వుండడం వల్ల కూడా దాన్ని ఎక్కువగా తింటున్నారు. మరి ఇంత ప్రమాదకరమైన గుట్కాలను నిషేధించొచ్చు కదా అనిపిస్తుంది ఎవరికైనా. నిషేధం సంగతి తర్వాత. సిగరెట్‌ విషయంలోనే అది సరిగ్గా అమలు జరగడం లేదు. ప్రభుత్వాలు ఆ విషయంలో ఎన్నిసార్లు విఫలమవలేదు! అందుకే ముందు కనీసం దీనిపై ప్రభుత్వ నియంత్రణ అయినా గట్టిగా వుండాలి. భారీగా పన్నులు వడ్డించడం ద్వారా కూడా ప్రభుత్వం దాని ఉపయోగాన్ని తగ్గేలా చేయవచ్చు. ఆ విధంగా లభించే సొమ్మునే తిరిగి దాని దుష్ఫలితాలను ప్రజలకు తెలియచేసే ప్రచారానికి ఉపయోగించవచ్చు. ప్రభుత్వం వైపు నుంచి ఇంతవరకు అలాంటి చర్యలేవీ లేవు. రూపాయి నుంచి ఎనిమిది రూపాయలు పెడితే పొట్లాం వచ్చి చేతిలో పడుతోంది. మొదట మనం చెప్పుకున్న బాధితుల మాదిరిగా కోట్లాది మంది ప్లాస్టిక్‌ గొట్టాలలో ఆహారం తినకుండా వుండాలంటే... గుట్కాలపై నిషేధం విధించాలి. అదీ చేతకాదనుకుంటే కనీసం నియంత్రణ అయినా చేయగలగాలి లేకపోతే గుటుక్కే.

మానడానికి చిట్కాలు
పాఠశాలలకెళ్లే విద్యార్థుల నుంచి పనిపాటలు చేసుకునే వారి వరకు గుట్కా నములుతూనే వుంటారు. గుట్కా మానాలానుకునే వారికి కొన్ని చిట్కాలు ....

 • ఎంత త్వరగా గుట్కా బారి నుండి బయట పడతామనే విషయం వారు ఎంతకాలంగా దీనికి బానిసగా ఉన్నామనే దాని మీద ఆధారపడి ఉంటుంది.
 • అన్నిటికంటే ముఖ్యమైంది మనలో గుట్కాను మానాలనే దృఢ నిశ్చయం కలిగివుండడం.
 • ఒక్కసారిగా కాకుండా నమిలినప్పుడల్లా నెమ్మదిగా, రోజుకు, వారానికి కొంత తగ్గిస్తూ ఉండాలి. అదే సమయంలో లవంగాలను, ఇలాచీలను నములుతూ ఉండాలి.
 • గుట్కా నమలడం ఒక్కసారిగా మానకూడదు. నెమ్మదిగా మానాలి. లేకపోతే నమిలేప్పుడు ఉపయోగపడే కండరాలకు ప్రమాదం. అరుగుదల కూడా మందగిస్తుంది. నోటిలోని కండరాలు గుట్కా నమలడం వల్ల గట్టిపడతాయి. కాబట్టి ఆ కండరాలకు రోజూ వ్యాయామం అవసరం. అందుకే గుట్కాకు బదులు ఎండిన ఉసిరి, ఇలాచీలను నమలడం అలవాటు చేసుకోవాలి. గుట్కాను నమలడం మానడానికి కొంత సమయం పడుతుంది ఎందుకంటే అందులో నికోటిన్‌ అనే పదార్థముంటుంది. అందుకే మొదట్లో రెంటినీ నములుతూ ఉండాలి.
 • తక్కువ నికోటిన్‌ ఉండే గుట్కాను ఎంపిక చేసుకోవాలి. తక్కువ ఖరీదున్న గుట్కాలో ఎక్కువ నికోటిన్‌ ఉంటుంది.
 • గుట్కా ప్యాకెట్‌ కొనుక్కున్న వెంటనే తినకుండా కాసేపు కోరికను అణచుకోవాలి. దీని కంటే ఇష్టమైన వాటి వైపు (సంగీతం, పుస్తకాలు చదవడం, టీవీ చూడడం వంటివి) ధ్యాసను మరల్చాలి. అయినా దానివైపే మనసు లాగితే ఎప్పుడూ తీసుకునేదానిలో సగం గుట్కాను తీసుకోవాలి.
 • పీచు పదార్థాలు ఉన్న ఆహారం (బజ్జీలు, ఉల్లిగడ్డలు... వంటివి), జ్యూసులు ముఖ్యంగా పైనాపిల్‌, నారింజ రసాలు గుట్కా తిన్నన్ని రోజులు ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది.
 • గుట్కాలు మానేయడం పెద్ద కష్టమైన పనేంకాదు. ఓపికగా ఉంటే ఒక ఆరు నెలల్లో ఆ అలవాటును మానేయగలరు.

ఆధారము: ప్రకృతి బ్లాగ్

దంత సమస్యలు - చికిత్సలు

దంతచికిత్స చిన్నప్పుడే చేయాలా?

మా పాపకు 14 సంవత్సరాలు. పళ్లు ఎగుడుదిగుడుగా ఉన్నాయి. చక్కటి పలువరుస కోసం చికిత్స చేయడానికి ఇది సరైన వయసేనా?

చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్లీడు వస్తే తప్ప దంతాల అమరిక గురించి, అందమైన చిరునవ్వు గురించి ఆలోచించడం లేదు. ఆ వయసులో డాక్టరు దగ్గరకు తీసుకు వచ్చి అర్జెంటుగా ఫలితాలు రావాలని ఒత్తిడి తెస్తుంటారు. అలా కాక చక్కటి చిరునవ్వు కోసం చిన్నప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు. ఆధునిక దంత వైద్యవిధానంలో అందుకు తగిన చికిత్సలు ఉన్నాయి.

పళ్ల సైజు, షేప్ సహా ముఖ కవళికలన్నీ వంశపారంపర్యంగా వచ్చేవే. వీటిలో లోపాలను చిన్నప్పుడే గుర్తించి చికిత్స చేయించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. తల్లిదండ్రులు ప్రధానంగా గమనించాల్సిన విషయాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే... ‘దవడ ఎముకల పెరుగుదల, పాలపళ్లు సరైన వయసులో ఊడిపోతున్నాయా లేదా, శాశ్వత దంతాలు వాటి స్థానాల్లో మొలుస్తున్నాయో లేదో గమనించడం, నోటి ఆరోగ్యాన్ని, శుభ్రతను ప్రోత్సహించడం’ వంటివి అన్నమాట. అందమైన చిరునవ్వు కోసం చేసే దంతచికిత్సలను ఎదిగే వయసు నుంచే మొదలుపెడితే, పలువరుసతోపాటు దవడ ఎముకలను కూడ మనకు అనుగుణంగా మలుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు పై విషయాలను దృష్టిలో పెట్టుకుని... పిల్లలకు చక్కటి పలువరుస కోసం చికిత్స చేయించాలనుకుంటే చిన్నవయసు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. మీ పాపకు దంత చికిత్సకు ఇది సరైన వయసే, కాబట్టి నిపుణులైన దంతవైద్యులను సంప్రదించండి.

నా వయసు 35. కింద దవడ పన్ను పుచ్చిపోతే ఐదేళ్ల క్రితం తీయించాను. ఇప్పుడు అదేవరుసలో పై పన్ను విపరీతంగా నొప్పిపెడుతోంది. డాక్టరు దగ్గరకు వెళితేపీకేస్తారని భయంగా ఉంది.

నిన్న మొన్నటి వరకు పుచ్చిపోయి నొప్పి పెడుతున్న పన్నును తీసివేయడం తప్పనిసరి అయ్యేది. కానీ ఇప్పుడలా కాదు. పన్ను ఎంతగా నొప్పి పెడుతున్నా, వాచి ఉన్నా, విరిగిపోయినా సరే... లోపల ఉన్న ఇన్ఫెక్షన్‌ను నయం చేసి పంటిని జీవితకాలం కాపాడుకోవడానికి అనువైన చికిత్సలు ఉన్నాయి. పిప్పిపన్ను అనగానే డెంటిస్టు పన్ను పీకేస్తారన్న అపోహ వద్దు. డాక్టర్లు ఎప్పుడూ సమస్యలకు చికిత్స చేసి పళ్లను ఆరోగ్యంగా ఉంచడానికే ప్రయత్నిస్తారు. కానీ చాలామంది సంవత్సరాల కొద్దీ కాలయాపన చేస్తారు. దానివల్ల వారిలో డాక్టర్‌ను కలిసేనాటికే పంటిని తీసివేయక తప్పని పరిస్థితులు ఏర్పడవచ్చు. ప్రస్తుతం చాలా వరకు పంటిలోని ఇన్‌ఫెక్షన్‌ను ఒకటి - రెండు సిట్టింగుల్లో నయం చేసి పంటిని ఆరోగ్యంగా చేసే రూట్‌కెనాల్ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

మీరు ఐదేళ్ల కిందట పన్ను తీయించారన్నారు. ఆ ఖాళీ జాగాలో కృత్రిమ దంతాన్ని అమర్చుకున్నారా లేదా అన్నది చెప్పలేదు. అమర్చుకోకపోతే వెంటనే ఆ పని చేయండి. లేకుంటే పక్క పళ్లు ఆ ఖాళీ జాగాలోకి ఒరిగిపోవడం, పై పళ్లు కిందకు జారడం లాంటి మార్పులు సంభవించవచ్చు. దీనిని నిర్లక్ష్యం చేస్తే బాగున్న దంతాలు కూడా పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఆధారము: వైద్యరత్నాకరం బ్లాగ్

ఆధారము : హెల్త్ కేర్ తెలుగు బ్లాగ్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate