హోమ్ / ఆరోగ్యం / వ్యాధులు / పుండ్లు బారిన పడకుండా ఉండాలంటే..
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పుండ్లు బారిన పడకుండా ఉండాలంటే..

పుండ్లు బారిన పడకుండా ఉండాలంటే..

పరిచయం

దీర్ఘకాలం మంచం మీద ఉన్నట్టయితే , గంటల కొద్దీ కదల లేని స్థితిలో ఉంటే గనక మన చర్మంపై బాగా ఒత్తిడి పెరగటం జరుగుతుంది.  ఫలితంగా మన వీపు తుంటి, నడుము, మడమలు మొదలైన భాగాల లో పుండ్లు వచ్చే అవకాశం వున్నది. ముఖ్యంగా ఇలాంటి లక్షణాలు మనం  కొందరి    వృధులలో చూస్తుంటాము.   అయితే వీటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగిన చిస్తా చేయాలి మరి. ఆలస్యం అయితే ఒక రకమైన ద్రవం లాంటిది కారే వీలుంది. ఇన్ఫెక్షన్ రావటానికి కూడా ఆస్కారం వున్నది. అంత త్వరగానూ ఎక్కువగా కూడా అవుతుంటాయి. కనుక చేయటం కొంత కష్టం టూ కూడుకున్న పని. అందుచేత సాధ్య మైన మేరకు పుండ్లు రాకుండా చూసుకోవటమే ఉత్తమం.

ముందుగా మన చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవటం

మన చర్మం బాగా శుభ్రంగా , పొడిగాను ఉంటే పుండ్లు సోకె అవకాశం అంతగా ఉండదు. వేడి నీటిలో టవలును ముంచి మన శరీరాన్ని బాగా శుభ్రంగ తుడుచుకోవాలి. తర్వాత పొడి టవలుతో బాగా అడ్డుకుంటూ తుడుచుకోవాలి.

దొర్లటం ఎంతో మంచిది

మనం నిద్రపోయేటప్పుడు ఎప్పుడు ఒకే విధంగా పాడుకోకుమా ప్రతి ఒకటి, లేదా రెండు గంటలకు ఒక సరి పక్కకు తిరిగి పడుకుంటే చాల మంచిది. వెల్లకిలా పడుకున్న వారు పక్కకి తిరిగి పడుకోవటం, ఒకే పక్కకు తిరిగి పడుకుంటే వెల్లకిలా పడుకోవటం వంటివి చేస్తుంటే మంచిది. ఇక కోడళ్ల లేని స్థితిలో ఇంట్లోని వారి సాయం తీసుకోవాలి మరి. ఈ విధంగా చేయడంతో మన చర్మం మీద వుండే ఒత్తిడి బాగా  తగ్గే అవకాశం వున్నది.

మరి వ్యాయామం కూడా మంచిదే

మానవుడు మంచం మిడియా వున్నా కూడా ఒక మోస్తరు తేలిక పాటి వ్యాయామాలు చేసుకుంటూ ఉండాలి. దింతో పండ్ల బారిన పడకుండా వుండే వీలుంది. చెయ్యిని పైకి లేపు, పది సెకండ్ల పటు ఉంచి కిందకు దించవచ్చు. ఆ తరువాత రెండొచేతితో కూడా ఇలాగె చేయాలి. ఈ విధమైన తేలికపాటివి చేస్తే మంచిది. అవసరమైతే  వ్యాయామ నిపుణులను కూడా సంప్రదించి తెలుసుకుంటే మరియు మంచిది.

మన తలకింద దిండ్లు వాడకం.

మన శరీర భాగాలూ ఒక దానితోమరోకటి ఒరిపిడి అయ్యే చోట మధ్యలో దిండు వాడుకోవచ్చును. మనం వెల్లకిలా పడుకునేటప్పుడు మడమలు, భుజాలు, నడుము కింద, మూ చీతులు  పక్కకు తిరిగి పడుకున్నప్పుడు మోకాళ్ళు, మడమల మధ్య దిండు వాడితే మరీ మంచిది.

వ్యాసం... అనూరాధ

2.99230769231
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు