অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పౌష్టికాహారం

పౌష్టికాహారం

పౌష్టికాహార ప్రాముక్యత తెలిపే - వీడియో

పౌష్టికాహార ప్రాముక్యత - వీడియో


పౌష్టికాహార ప్రాముక్యత - ఈ వీడియొ లో చుడండి

  పౌష్టికాహార లోపాలు

 • వ్యక్తి ఆహారంలోని పౌష్టిక పధార్ధాలు ప్రతిపాదించిన మోతాదు కంటే నిరంతరంగా తగ్గటం వల్ల పౌష్టికాహార లోపం వస్తుంది.
 • ప్రపంచ ఆరోగ్య సంస్ధ (WHO) ప్రకారం 10-19 సం, వయస్సు గల పిల్లలు తీవ్రమైన పౌష్టికహార లోపాన్ని ఎదుర్కొంటున్నారు.

విటమిన్ బి1

ధైమిన్ లేదా విటమిన్ బి1 – ఇవి నీటిలో కరిగే విటమిన్ శరీరానికి శక్తిని ఉత్పత్తి చేయడంలో ఇవి కీలక పాత్ర వహిస్తుంది. (అడినోసిన్ ట్రైఫాస్పేట్ ద్వారా) నరాల సంవాహనము. (మానవ శరీరం పని చేయడానికి కావలసిన శక్తిని ధైమిన్ విటమిన్ నుండి ఉపయోగపడుతుంది)

 • ధైమిన్ విరివిగా పంది మాంసము, చిక్కుళ్ళు మరియు ఈస్ట్ లో దొరుకుతుంది.
 • మద్యం  అధికంగా సేవించేవారు. ఈ విటమిన్, ఇతర ఖనిజలోపాలను తీవ్రంగా ఎదుర్కొంటారు
 • పాలిష్డ్ తెల్ల బియ్యం, గోధుమపిండి, రిఫైన్డ్ చక్కెర, కొవ్వు  పదార్ధాలు మరియు నూనె పదార్ధాలలో విటమిన్ బి1 ఉండదు.
 • బేరి బేరి అనేది ధైమిన్ లోపం యొక్క ప్రధాన రుగ్మత
 • నాడీ వ్యవస్ధ అసాధారణంగా పనిచేయుట, (ఉదా. కాళ్ళలో ఈడ్పులు,కండరాల బలహీనత), కాళ్ళలో, చేతులలో వాపు రావటం, నాడీ పెరగటం, గుండె జబ్బులు మొదలగునవి ఇతర లక్షణాలు. నడకలో హఠాత్తుగా మార్పురావడం, స్థితి నిర్ధారణ రాహిత్యము, స్వల్పకాల జ్ఞాపక శక్తి తగ్గడం వంటి లక్షణాలు మద్యం అతిగా సేవించే వారితో కూడినది.

విటమిన్ బి3

 • పెల్లెగ్రా వ్యాధి ఆహారంలో నియాసిన్ (విటమిన్ బి3) లోపం వల్ల కానీ, నియాసిన్ ని పీల్చుకోలేకపోవటం వల్ల కానీ, (టిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లాన్ని పీల్చుకోలేక పోవటం వల్ల ఈ వ్యాధి వస్తుంది.
 • పెల్లెగ్రా అంటే బరుసగా ఉండే చర్మం.
 • ‘3 డి’లు ప్రధాన లక్షణాలు డిమెన్షియా (మతి భ్రంశము), డెర్మటైటిస్ (చర్మము యొక్క శోధము) డైయేరియా (విరేచనము)

కాల్షియం మరియు విటమిన్ డి లోపం

 1. ఆస్టియో పోరోసిస్ (బోలు ఎముకల వ్యాధి) అస్ధికణాల సంఖ్య తగ్గడం వల్ల వచ్చే సాధారణ జీవక్రియ అస్ధివ్యాధి (మెటబోలిక్)
 2. మామూలు ఎముకకు పైన ఒక చిప్ప లాంటివి (కార్ట్ క్స్) వెలుపల కంటకముల లాంటి దానికి ఇంకొకటి ట్యుబెక్యులె (త్రాపకాలు) ఉంటాయి. ఇవి ఎముకకు ప్రత్యేకమైన బలాన్ని సమకూరుస్తుంది
 3. ఎముకలోని  పదార్ధం 35 సంవత్సరాల వరకు పటిష్టంగా ప్రత్యేకమైన బలాన్ని సమకూరుస్తుంది
 4. ఎముకలోని పధార్ధం మొదట క్రమ క్రమంగా తర్వాత ఒకే విధంగా పెరుగుతుంది
 5. ఇలా క్రమం తప్పకుండా పటిష్టత పాటించడం అనేది ఎముకల  రీమౌల్డింగ్ ద్వారా జరుగుతుంది. (పాత కణజాలం పోయి కొత్త కణజాలం ఏర్పాటు అయ్యే ప్రక్రియ)
 6. 40 సంవత్సరాలు మొదలవగానే కణజాలానికి నష్టం వాటిల్లే శాతం కణజాలం ఏర్పాటయ్యే దానికన్నా ఎక్కువగా ఉండి ఎముకలోని పధార్ధం క్షీణించడానికి, కాల్షియం మోతాదు తగ్గడానికి కారణమవుతుంది
 7. స్త్రీలలో ఈ వయసు సంబంధితమైన ఎముకలో నష్టమే కాక, బుతుక్రమము ఆగిపోవటం వాటి వల్ల వచ్చే హార్మోన్ల అసమౌతుల్యం, ముఖ్యంగా ఈస్ట్రోజన్, లో తగ్గుదల వల్ల కార్టికల్ మరియు ట్రాబెక్యులార్ ఎముకలో తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
 8. బోలు ఎముకల వ్యాధి ఉన్న వారిలో ఈ నష్టం 30 – 40 వరకు ఉంటుంది. ఇది ఎముకలు పెళుసుగా మారి సుళువుగా విరగడానికి ఆస్కారం ఎక్కువుగా ఉంటుంది
 9. బోలు ఎముకల వ్యాధికి ఎన్నో కారణాలున్నాయి. పొగత్రాగడం, మద్యం సేవించడం, స్ధానబద్ధమైన జీవనశైలి మొదలగునవి ఈ వ్యాధి వచ్చే అవకాశాలను పెంచుతాయి
 10. వయస్సు, లింగము కూడా దీనికి కారణాలవుతాయి
 11. తక్కువ ఈస్ర్టోజన్ స్థాయి ఉన్న మహిళలు సులువుగా దీని బారిన పడతారు
 12. పురుషులలో ఎముకల సాంద్రత ఎక్కువగా ఉన్నందున స్త్రీలలో పోలిస్తే వారికి అవకాశాలు తక్కువ

విటమిన్ డిః -

 • రికెట్స్ (బాలాస్థి వ్యాధి) ఒకప్పుడు చిన్న పిల్లలలో అధికంగా వచ్చే సాధారణ సమస్యగా పరిగణించేవారు
 • ఈ పదాన్ని ప్రాచీన ఆంగ్ల భాష నుంచి వెలికితీసుకు వచ్చారు.”ట్విస్ట్” లేదా “వ్రిక్”
 • సాధారణంగా రికెట్స్ ఉన్న పిల్లలను - దొడ్డికాళ్ళ (బౌలెగ్స్), గాడిన కాళ్ళు (నాక్ నీస్) వల్ల మెలితిరిగినట్లు ఉండేవి. వాటి ద్వారానే ఈ వ్యాధిని గుర్తించేవారు.
 • రికెట్స్ అనేవి విటమిన్ డి లోపం వల్ల వస్తుంది. శారీరక ఎదుగుదల సమయంలో కాల్షియం, భాస్వరం (ఫాస్ఫరస్) మరియు విటమిన్ డి లతోనే మానవ ఎముక ఏర్పాటు చేయబడి అలానే కొనసాగుతుంది
 • పరిపక్వత చెందని ఎముకలో (ఆస్టియాడ్) కేల్సిఫికేషన్ అనే ప్రక్రియ ద్వారా కాల్షియం పోగవుతుంది. ఈ కాల్షియం వల్లనే ఎముక పరిపక్వత చెందుతుంది
 • ఆహారం లోని కాల్షియంని పీల్చి శరీరానికి అందించడానికి విటమిన్ డి అవసరం ఎంతో ఉంది
 • ఈ విటమిన్ డి లోపం వల్ల తక్కువ కాల్షియం, కేల్సిఫికేషన్ సరిగా జరగక పోవడం, వికారంగా ఉండే ఎముకలు ఏర్పడుతాయి
 • ఈ ఒక్క విటమిన్ డి మాత్రమే ఆహారంనుండి లభిస్తుంది మరియు శరీరంనుండి కూడా నిర్మితమవుతుంది
 • జంతువులలోని కొవ్వుపదార్ధాల నుండి, ఉదా, పాలు, వెన్న, చేపలు, మాంసం నుండి పీల్చుకున్న విటమిన్ డి మన రోజువారి అవసరాలలో కేవలం 10% మాత్రమే సమకూరుస్తుంది
 • మిగిలిన 90% మన శరీరంలో నిర్మితం కాబడింది
 • సూర్యుడి నుండి వెలువడిన అతినీలలోహిత (ultraviolet rays) కిరణాలు చర్మంలోని 7 – డై హైడ్రోకొలెస్ట్రీరాల్ ను విటమిన్ డి3 గా మారుస్తుంది
 • ఇది కిడ్నిలో (మూత్రపిండంలో) హార్మోన్ కాల్సిట్రాల్ గా మార్చబడుతుంది. కాల్షిట్రాల్ జీర్ణాశయంలో కాల్షియం, ఫాస్పరస్ పీల్చుకొని, ముఖ్యంగా చిన్నప్రేగు నుండి  పీల్చుకొని మూత్రపిండాలు, ఎముకల ద్వారా శరీరానికి కావలసినంత కాల్షియం, ఫాస్పరస్ ను సమకూరుస్తుంది
 • సరిపడినంత విటమిన్ డి లేకపోతే ఆహార పదార్ధంలోని కేవలం 10 – 15% కాల్షియం మాత్రమే శరీరానికి లభిస్తుంది
 • ఈ విటమిన్ డి, కాల్షియం మరియు ఫాస్పేట్ సమతుల్యం ముఖ్యంగా పిల్లలలో ఎముకల ఎదుగుదలకు కొనసాగడానికి ఎంతో అవసరం. ఈ లోపం పెద్ద వాళ్ళలో కూడా రావచ్చు

విటమిన్ - ఎ లోపం వల్ల వచ్చే కంటి జబ్బులు

విటమిన్ ఎ లోపం తీవ్రమైనప్పుడు కంటి చూపు పూర్తిగా దెబ్బతిని గుడ్డితనానికి దారి తీస్తుంది. విటమిన్ ఎ లోపం యొక్క మొట్టమొదటి అవలక్షణం రేచీకటి. బిడ్డ మసక వెలుతురులో చూడలేడు. కంటి తెల్లగుడ్డు రంగు తగ్గి తడి ఆరిపోతుంది. కన్నీరు కూడ గుడ్డును తడి చేయలేదు. తెల్లగుడ్డుపై నురగ బుడిదరంగు మచ్చలు ఏర్పడుతాయి. కంటి నల్లగుడ్డు మెరుపు తగ్గి, తడి ఆరిపోయి కాంతిని కోల్పోతుంది. వెంటనే చికిత్స చేయకపోతే గుడ్డులో పుండు ఏర్పడుతుంది.

నల్లగుడ్డు పూర్తిగా కరిగి, శాశ్వత అంధత్వం ఏర్పడుతుంది.

అంధత్వాన్ని నివారించడానికి అదనపు విటమిన్ ఎ, రోగనిరోధక టీకాలు మీ బిడ్డకు తప్పక ఇవ్వాలి. మొదటి డోసు (100 000 ఐ.యు. విటమిన్ ఎ) 18 నెలల వయసులో డి.పి.టి./ఓ.పి.వి. బుస్టర్ తో టు తక్కిన మూడు డోసులు (200 000 ఐ.యు. విటమిన్ ఎ) ఆరు నెలలు ఎడంతో ఏడాదికి రెండుసార్లు బిడ్డకు 3వ ఏడు నిండేసరికి మొత్తం 5 డోసులు విటమిన్ ఎ ఇచ్చి తీరాలి.

ఆధారము: మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ – ఆంధ్రప్రదేశ్

పౌష్టికాహార లోపాలు వాటి లక్షణాలు

ప్రొటీస్,ఎనర్జీ (పింఢిపధార్ధలు)మాల్ నుట్రిషన్

మాంసకృత్తులు మరియు శక్తిహీనతతో కూడిన పోషకాహార లోపం మన దేశంలో పిల్లలలో చాలా ఎక్కువగా ఉంది. అందులో 1 సంవత్సరం లోపు పిల్లలకి ఇది చాలా ఎక్కువగా ఉంది. చిన్న పిల్లలకి, అనారోగ్యము, మరణము కలుగచేయు కారణములలో పోషకాహార లోపం ముఖ్యమైనది. ఈ పోషకాహార లోపం వలన పిల్లలలో శారీరక మానసిక పెరుగుదల దెబ్బతింటుంది. పోషకాహార లోపం ముఖ్యంగా చాలినంత బలవర్థకమైన ఆహారం తీసుకోకపోవడం లేదా, తరచూ విరోచనాలు, శ్వాసకోశ జబ్బులు, నట్టలు, వంటి వ్యాధులతో బాధపడుతున్న 4 సంవత్సరములలోపు పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. అలాగే అపరిశుభ్ర వాతావరణం, పెద్ద కుటుంబాలలో త్వరగా తల్లిపాలు తప్పించడం, తల్లి అనారోగ్యం కూడా కారణాలు కావచ్చును.

లక్షణాలు:
ప్రోటీన్ (మాంసకృత్తులు) మరియు శక్తిని ఇచ్చే పౌష్టికాహార లోపం గల పిల్లలు, సన్నగా, పీలగా ఉంటారు. వయసుకి తగ్గ బరువులేక కళ్ళు గుంటలు పడి, చర్మం ముడతలు పడి చికాకుగా కనిపిస్తారు. ఎక్కువగా ఏడుస్తూ, తరచూ జబ్బులకి గురి అవుతుంటారు. వీరి కాళ్ళు, చేతులు పీలగా ఉంటాయి. పెదాలు, నాలుక, నోటి అంచులు పగలడం, కడుపు ఉబ్బుగా ఉండడం జరుగుతుంది.

చికిత్సా విధానం:
ఈ రకంగా వయస్సుకి తగిన ఎత్తు, బరువు సౌష్టవం లేని పిల్లల్ని సరైన బలవర్థకరమైన ఆహారం చాలినంత అందేలా చూడాలి. మాసంకృత్తులు కలిగిన పప్పుధాన్యాలు, వేరుశెనగ కాయలు, బెల్లం వంటివి రోజూ తిన పెడితే, చాలా మట్టుకు ఇది నివారించవచ్చు.

ఆహారం విషయంలో నిర్దిష్ట గమ్యాలు

విటమిన్ – ఎ లోపం  వల్ల అంధత్వం

కంటి చూపు బాగా వుండడానికి విటమిన్-ఎ చాలా అవసరమైన పోషకాంశం. చిన్న పిల్లలకు ఆహారం ద్వారా తగిన విటమిన్-ఎ లభించనప్పుడు కంటి దృష్టి దెబ్బతినగలదు. ఈ లోపం తీవ్రమైతే అది శాశ్వతమైన గుడ్డితనానికి దారి తీస్తుంది. ప్రస్తుతం మన దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 30 వేల మంది చిన్న పిల్లలు విటమిన్ ‘ఎ’ లోపం వల్ల గ్రుడ్డి వాళ్ళు అవుతున్నారు.
విడమిన్-ఎ లోపం యొక్క తీవ్రమైన పరిణామాలు ముఖ్యంగా 1-5 సంవత్సరాల మధ్య వయస్సుండే చిన్న పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తాయి. వాళ్ళు ఈ కారణంగా దృష్టిని పోగొట్టుకుంటారు. దాదాపు దేశమంతటా కూడా సంభవిస్తున్న ఈ పోషక లోపం ఒక ముఖ్యమైన ప్రజారోగ్య సమస్యగా తయారైంది.

విటమిన్ - ఎ లోపం లక్షణాలు తెలుసుకోనడం ఎలా ?

పోషక లోపం వల్ల ఏర్పడే ఈ అంధత్వం పిల్లల్లో వున్నట్లుండి ఒక్కసారిగా కలుగుతుందనలేము. విటమిన్-ఎ లోపం లక్షణాలు క్రమేపి గుర్తించవచ్చు.
తొలి దశల్లోనే బిడ్డలో విటమిన్-ఎ లోపం ఉన్నట్లు గుర్తించగలిగితే, ఆ పోషణ లోటును సవరించే అవకాశం ఉంది. అలాంటి చర్య తీసుకోవడం ద్వారా, బిడ్డ కళ్ళను కాపాడి, శాశ్వతమైన అంధత్వం రాకుండా రక్షించవచ్చు.

లోపం లక్షణాలను ముందుగానే గమనించండి
రేచీకటి అంటే పిల్లలు మసక వెలుతురులో సరిగా చూడలేక పోవడం. శరీరంలో విటమిన్-ఎ లోపం ఏర్పడిందనడానికి రేచీకటి మొదటి లక్షణం. కంటి తెల్ల గుడ్డు తడిలేకుండా ఎండిపోయి, మెరిసే గుణాన్ని కోల్పోతే, అది విటమిన్-ఎ లోపం తొలిదశలో కలిగే లక్షణమని గ్రహించాలి.
రేచీకటి, కంటిలో మార్పులు, ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే బిడ్డకు తగిన చికిత్స చేయించాలి. అలా చేయక పోతే లోపం మరింత ఎక్కువై వ్యాధి ముదురుతుంది. పోషకలోపాన్ని భర్తీ చేయకపోతే కంటి నల్ల గుడ్డు కూడా చెడిపోయి దృష్టి దెబ్బతింటుంది. వ్యాధి ఆ దశ చేరితే శాశ్వతమైన గుడ్డితనం ఏర్పడుతుంది. నల్లగుడ్డులో ఈ మార్పులు జరిగి అంధత్వం కలగడాన్ని కెరటొమలేసియా అంటారు. ఇది విటమిన్-ఎ లోపం పోషణ వల్ల ఏర్పడే గుడ్డితనమన్నమాట.

అంధత్వం రాకుండా చికిత్స

పోషక సంబంధమైన ఈ వ్యాధి చికిత్సలో, విటమిన్-ఎ సమృద్దిగా వుండే పదార్దాలను బిడ్డ ఆహారంలో వాడాలి. అలా చేస్తే విటమిన్-ఎ లోపం, అందువల్ల గుడ్డితనం వచ్చే ప్రసక్తి ఉండదు.
విటమిన్-ఎ అనే పోషకాహారం పాలు, గుడ్డు, చేప కాలేయం నూనె, వంటి పదార్ధాలలో అధికంగా లభిస్తుంది. కాని వీటిని అందరూ తగినంత వాడలేకపోవచ్చు. కారణమేమిటంటే అవి బాగా ఖరీదైన పదార్థాలు.
మనలో చాలా మందికి అందుబాటులో వుండి, చౌకగా లభించే ఆకుకూరలు – తోటకూర, పాలకూర, బచ్చలి కూర, మెంతికూర మొదలైనవి, క్యారట్లు, ఇంకా బొప్పాయి, మామిడి పళ్ళు వంటి ఇతర శాకాహార పదార్థాలు కూడా విటమిన్-ఎను సరఫరా చేస్తాయి. అవి తక్కువ ఖర్చులో  సులభంగా లభిస్తాయి కూడా. అనేక కారణాల వల్ల ఇటువంటి శాకాహార పదార్థాలను దొరికినప్పటికి చాలామంది సరిగా వాడరు. దానికి కొన్ని నమ్మకాలు కారణం కావచ్చు. శాస్త్రీయ సమాచారాన్ని బట్టి ఈ పదార్థాలు మంచి పుష్టికరమైనవని, విటమిన్-ఎ లోపం నుండి కాపాడుతాయని ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకే పిల్లలకు ఈ ఆహార పదార్ధాలను తగింనంతగా తినిపించాలి.
జాతీయ పోషకాహార సంస్థలో జరిపిన పరిశోధనలను బట్టి విటమిన్-ఎ లోపం నుండి చిన్న పిల్లలను రక్షించడానికి ఇంకొక సులభమైన మార్గం కూడా ఉంది. ఈ పోషకాంశం యొక్క లోపాన్ని భర్తీ చేసేందుకు 1-5 ఏళ్ళ లోపు పిల్లలందరికీ, ఆర్నెల్ల కొకసారి ఒక చెంచాడు విటమిన్-ఎ ద్రవాన్ని త్రాగించడం వల్ల వాళ్ళ శరీరంలో విటమిన్-ఎ లోపం భర్తీ అవుతుందని పరిశోధనలు తెలిపాయి. ఈ చెంచాడు ద్రవం 2 లక్షల అంతర్జాతీయ యూనిట్లు విటమిన్-ఎ ని అందిస్తుంది.
ఆరు నెలలకు ఒక సారి ఈ విటమిన్-ఎ మోతాదును బిడ్డకు ఇస్తే అతని కాలేయంలో విటమిన్-ఎ నిలువ వుండి లోపం రాకుండా చేసి కంటి దృష్టిని కాపాడుతుంది.  ఐదేళ్ళు వచ్చే దాకా ఈ ద్రవాన్ని త్రాగిస్తే శరీరంలో విటమిన్-ఎ కొరత లేకుండా చేస్తుంది.
దేశ వ్యాప్తంగా పోషణ లోపం వల్ల అంటే విటమిన్-ఎ పోషకాంశం కొరత వల్ల పిల్లల్లో ఏర్పడిన పరిస్థితి వాళ్ళను శాశ్వతంగా గుడ్డివాళ్ళను చేయకుండా భారత ప్రభుత్వం ఒక పథకాన్ని రూపొందించింది. జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని పల్లె, పట్టణ ప్రాంతాల్లో అన్ని చోట్ల అమలు చేస్తున్నారు. ఐదేళ్ళ వయసు వచ్చేవరకు పిల్లలకు విటమిన్-ఎ ద్రవాన్ని ఆరు నెలలకొక సారి ఇప్పించి వాళ్ళను గుడ్డితనం నుండి రక్షించుకోండి.

గర్భిణిగా ఉన్నప్పుడే ముందు జాగ్రత్త

బిడ్డ పుట్టక ముందే, గర్భవతి ఆహారంలో విటమిన్-ఎ సమృద్ధిగా వున్న పదార్థాలను చేర్చడం మంచి పద్ధతి. అలా చేస్తే తల్లి ద్వారా గర్భంలోని శిశువుకు తగినంత విటమిన్-ఎ లభిస్తుంది. బిడ్డ శరీరంలో విటమిన్-ఎ నిలువలు ఉంటాయి. పుట్టుక తరువాత కూడ ఆహారాన్ని సరిగా తినిపించి, బిడ్డలకు విటమిన్-ఎ ను తగినంత అందచేస్తే వాళ్ళకు విటమిన్-ఎ లోపం వల్ల గుడ్డితనం వస్తుందన్న భయం వుండదు.

పెరిగే పిల్లలకు పుష్టినిచ్చే ఆహారం

పెరుగుదలకు ఆహారం
పెరిగే పిల్లలకు తగినంత ఆహారం లభించాలి. శరీరానికి ఆహారం ద్వారా కేలరీలు, మాంసకృత్తులు లభిస్తాయి. కేలరీలు శక్తికి, మాంసకృత్తులు శరీరం పెరిగేందుకు ఉపయోగపడతాయి.
సరైన మోతాదులో ఆహారం లభించని పిల్లలకు అవసరమైన కేలరీలు, మాంసకృత్తులు అందవు. మాంసకృత్తులు, కేలరీలు తగినంతగా లేకపోవడం వల్ల, పిల్లల్లో కట్టె నంజు (మరాస్మస్) ఉబ్బు నంజు (క్యాషియోర్కర్) వ్యాధులు  వస్తాయి.

కట్టె నంజు, ఉబ్బు నంజు ఎవరికి వస్తాయి

ఎదుగుతున్న చిన్న పిల్లలు, అంటే 1-5 సంవత్సరాల మధ్య వయస్సుగల పిల్లలు ఎక్కువగా మాంసకృత్తులు, కేలరీలు తగినంతగా లేక జబ్బులకు గురవుతారు. వీరిలో 1-3 సంవత్సరాల మధ్య వయస్సుగల పిల్లలకు ఈ లోపం చాలా ఎక్కువై ఈ వ్యాధులు రావచ్చు.

కారణాలు
పెరుగుదలకు తగినంత ఆహారం ఇవ్వనప్పుడు పిల్లలకు కేలరీలు, మాంసకృత్తుల లోపం వస్తుంది. బిడ్డకు 4 నెలలు వచ్చేంతవరకు తల్లిపాల ద్వారా అవసరాలకు తగిన మాంసకృత్తులు, కేలరీలు లభిస్తాయి. కాని 4-6 నెలలు దాటిన తరువాత పిల్లలకు కాయ ధాన్యాలు, పప్పు దినుసులు, పాలు, లేదా గ్రుడ్డు మొదలయిన ఇతర ఆహార పదార్థాలు అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. శరీరానికి అవసరమైన శక్తినీ, శరీరం పెరగడానికి కావలసిన మాంసకృత్తులను ఈ ఆహార పదార్థాలు ఇస్తాయి.
ఈ విధంగా ఆహారం ఇవ్వకపోతే, ఆ బిడ్డకు సరిపడినంతగా కేలరీలు, మాంసకృత్తులు లభించక, సక్రమంగా ఎదగరు. అటువంటి పిల్లలకు కట్టెనంజు, ఉబ్బు నంజు లాంటి వ్యాధులు వస్తాయి.

ఉబ్బు నంజు - కట్టె నంజు
కాళ్ళు ఉబ్బడంతో ఈ వ్యాధి మొదలవుతుంది. క్రమంగా చేతులు, మొత్తం శరీరం ఉబ్బే అవకాశం ఉంది. ఇదే ఉబ్బు నంజు. ఉబ్బు నంజు వ్యాధికి గురైన బిడ్డ చర్మం గరుకుగాను, పొక్కులతోను ఉంటుంది.. ఈ వ్యాధి వచ్చిన బిడ్డకు జుట్టు చాలా పల్చగా ఉంటుంది. జుట్టు రంగు నలుపు నుంచి రాగి రంగుకు మారుతుంది. నంజు వ్యాధివున్న బిడ్డకు ఎక్కువ చిరాకు ఉంటుంది. తన చుట్టూ వున్న విషయాల పట్ల ఆసక్తి లేకపోవడం, ఉబ్బు వ్యాధి వచ్చిన పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
కట్టె నంజు (ఎండిపోయే వ్యాధి) వచ్చిన బిడ్డ బాగా సన్నగా బలహీనంగా ఉంటాడు. ఎముకలు బయటకు పొడుచుకొని వచ్చి కండరాలలో శక్తి నశిస్తుంది. ఈ వ్యాధిగల బిడ్డలకు ఒంట్లో నీరు, వాపు ఉండదు. మొదటి దశలో బిడ్డకు కేవలం స్వల్పంగా లేదా ఒక మాదిరిగా విరేచనాలు కలగవచ్చు. దీని వల్ల బిడ్డకు చిరాకు ఎక్కువ అవుతుంది. బరువు తగ్గిపోతుంది. అటువంటి ఆరంభ రోగ లక్షణాలు కనపడినప్పుడు వెంటనే జాగ్రత్త పడకపోయినట్టయితే, వ్యాధి ముదురుతుంది.

ఈ రోగాలకు చికిత్స ఏమిటి ?
శక్తి (కేలరీలు,) మాంసకృత్తుల లోపం మరీ ఎక్కువగా లేని వాళ్ళకు ఇంటి దగ్గరే తగిన జాగ్రత్త తీసుకొని ఈ లోపాన్ని తొలగించుకోవచ్చు. వాళ్ళకు మామూలు కంటే ఎక్కువ మోతాదులో, ఎక్కువ సార్లు ఆహారం ఇవ్వాలి. అయితే మాంసకృత్తులు, కేలరీల కొరత తీవ్రమైతే, ఆహారం తీసుకొనని పిల్లలను ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయించి ప్రమాదం నుండి కాపాడాలి.

ఉబ్బు నంజు, కట్టె నంజు రోగాలతో బాధ పడుతున్న పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి?
కట్టె నంజు, ఉబ్బు నంజు వ్యాదులతో బాధపడుతున్న పిల్లలకు శక్తిని, శరీర నిర్మాణానికి అవసరమైన మాంసకృత్తులను సరఫరా చేయగల తగిన ఆహారం ఇవ్వాలి. కాయధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పులు, చమురు గింజలు పిల్లలకు కావలసిన పోషక పదార్థాలను సరైన పాళ్ళల్లో సమకూరుస్తాయి. వీలైతే, పాలు, గ్రుడ్డు ఇతర జంతు సంబంధమైన ఆహార పదార్థాలు వాటితోపాటు తినిపించాలి.

శాకాహార పదార్థాలతో పౌష్టికాహారం
జాతీయ పోషకాహార సంస్థ హైదరాబాదు మిక్స్ అన్న పేరుతో పిల్లలకు అవసరమైన పోషక పదార్థాలతో కూడిన ఒక ఆహార మిశ్రమాన్ని రూపొందించింది. మాంసకృత్తులు, కేలరీల లోపం ఉన్న పిల్లలకు పొడి రూపంలో ఉండే ఆహార మిశ్రమం ఉపయోగపడుతుంది. ఇంట్లోనే ఈ ఆహార మిశ్రమాన్ని మీరు కూడా తయారు చేసుకొనవచ్చు.

పోషకాహార మిశ్రమంలో వాడే పదార్థాలు
హైదరాబాదు మిక్స్ ను ఈ క్రింది పాళ్ళల్లో ఆయా దినుసులను ఉపయోగించి తయారు చేయవచ్చు. గోధుమలు (వేయించినవి) 40 గ్రాములు; సెనగ పప్పు (వేయించినది) 16 గ్రాములు; వేరు సెనగ పప్పు (వేయించినది) 10 గ్రాములు; బెల్లం 20 గ్రాములు. వీటి ద్యారా అందే కేలరీలు 330, మాంసకృత్తులు 11.3 గ్రాములు.
ఉబ్బు నంజు, కట్టె నంజు, వ్యాధులతో బాధపడుతున్న అనేక మంది పిల్లలకు హైదరాబాద్ మిక్స్ వాడడం జరిగింది.  ఈ మిశ్రమాన్ని పాలతో లేదా నీళ్ళతో ఉపయోగించిన తరువాత కొద్ది వారాలలోనే ఆరోగ్యం మెరుగుపడింది.

ఆహారము, పౌష్టిక ఆహార లోపాలు.

పెరిగే పిల్లలకు పౌష్టిక ఆహారముః-

పెరిగే పిల్లలకు పౌష్టిక ఆహారము ఎంతో ముఖ్యము. ప్రోటీన్లు, క్యాలరీలు తక్కువైనచో వారికి యేరాస్మస్, మరియు క్వాషియోర్కర్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి.

మేరాస్మస్, క్వాషియోర్కర్, ఎవరికి వస్తుంది.

పౌష్టిక ఆహార లోపం ఉన్న 1 నుంచి 5 సంవత్సరాలు ఉన్న వయసు పిల్లలకి వస్తుంది.

మెరాస్మస్  యొక్క లక్షణాలు

 1. ఈ వ్యాధిలో మొదట కాళ్ళు, తరువాత చేతులు, మొత్తం శరీరం వాపు వస్తుంది
 2. గరుకు చర్మము, తలమీద వెంట్రుకలు తక్కువగా ఉంటాయి. వారి వెంట్రుకలు ఎర్రగా, గోధుమ రంగులో ఉంటాయి
 3. ఈ వ్యాధి వచ్చిన పిల్లలు నీరసముగా పాలిపోయిన ముఖముతో ఉంటారు

క్వాషియోర్కర్ లక్షణములు
ఈ వ్యాధి ఉన్నపిల్లలు సన్నగా  నీరసముగా ఉంటారు. వీరికి మొదటి ధశలో విరేచనాలు ఎక్కువగా ఉంటాయి. వీరి చర్మము పొడి బారినట్టు ఉంటుంది.

చికిత్సః-

వీరికి ప్రొటీన్లు మరియు క్యాలరీలు ఎక్కువగా ఉన్న ఆహారం వెంటనే అందించవలెను. అధికంగా లక్షణాలు ఉన్న  పిల్లలను వెంటనే వైధ్యుడిని సంప్రదించాలి.
అందించవలసిన ఆహారముః-

నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ వారు mix (మిక్స్) పేరిట ఒక పౌష్టిక ఆహారాన్ని రూపొందించారు. దీనిని ఇంట్లో కూడ తయారు చేసుకోవచ్చు.

“మిక్స్ (mix)” తయారు చేసే పద్దతి : -

వేయించిన గోధుమలు – 40 gm
పుట్నాలు                - 16 gm
వేయించిన సెనగలు    - 10 gm
బెల్లం                      - 20 gm
వీటిని పొడి చేసి కలపాలి. దీనిలో 330gm క్యాలరీలు మరియు 11.3 gm ప్రోటీన్లు  ఉంటాయి. వీటిని పాలతో గాని నీటిలో గాని ఇవ్వాలి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate