అర కిలో బరువు పెరగటమో, తగ్గటమో మాములుగా ఉండేదే. అంతగా పట్టించుకోనవసరం లేదు. కానీ ఆహార నియమాలు సక్రమంగా పాటించక పోయిన, ప్రేత్యేకించి వ్యాయామం చేయకపోయినా అదే పనికా బరువు తగ్గుతుంటే మాత్రం జాగ్రత్త వహించాలసిందే. ఇలా ఉంటే మధు మేహం తోలి లక్షణం అయ్యే అవకాశాలు కూడా వున్నాయి. అయితే మధు మేహంలో బరువు ఎందుకు తగ్గుతుందో చూద్దాం.
మన శరీరంలో ప్రతి కణానికి శక్తి చాల ముఖ్యం . మనం టిఇసుకున్న ఆహరంలోని గ్లూకోజు నుంచి లభిస్తుంది. కణాల్లోకి గ్లూకోజు చేరుకునేలా చూడటం లో ఇన్సులిన్ హార్మోన్ ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. అయితే మధు మేహుల్లో ఇంస్తులుం అంత సమర్ధంగా పని చేయదనేది మనం గుర్తించాలి. దింతో కణాల్లోకి గ్లూకోజు ప్రవేశించటం కూడా తగ్గుతుంది. దాంతో నెత్తురులో గ్లూకోజు స్థాయిలు పెరుగుతాయి కూడా.
కణాల్లోకి గ్లూకోజు చేరినప్పుడు శరీరం తగినంత ఆహారం లేదని భావిస్తుంటుంది. భర్తీ చేసుకోవటానికి ఇతరత్రా మార్గాలను వెతుక్కుంటుంది. కొవ్వు, కండరాలు వేగంగా ఖర్చు చేసుకోవటం ద్వారా శక్తిని పుంజుకునే ప్రయత్నం చేస్తుంటుంది. ఇది బరువు తగ్గటానికి కూడా దరి తీస్తుంది. ఇక కిటీనులు కుడా రక్తం లో అధికంగా వున్న చక్కర శాతాన్ని తొలగించుకోవడానికి శ్రమించాల్సి వస్తుంది.
దీనికోసం ఎక్కువ శక్తీ కావాలి మరి. ఇది కిడ్నీలు దెబ్బతీయటానికి దారి తీయొచ్చు కూడా. కనుక అకారణంగా బరువు తగ్గుతుంటే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదు. ఎందుకంటే ఒక్క మధుమేహం లోనే కాదు క్యాన్సర్ వంటి సమస్యలతోను బరువు తగ్గే అవకాశముందని అనేది అందరు గుర్తుంచుకోవాలి.
వారానికి ఒక రోజు అయినా వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది
మన శరీర సామర్ధ్యాన్ని వృద్ధి చేయటానికి వ్యాయామం చాల అవసరం. వ్యాయాయం రోగ నిరోధక శక్తిని కూడా బాగా బలోపేతం చేస్తుంది. ఎక్కువ రక్త పోటు, మధుమేహం, క్యన్సర్ తదితర రకాలైన వ్యాధులకి గురి కాకుండా కాపాడుతుంది కూడా. కనుక ప్రతి రోజు కనీసం ముప్పై నిమిషాల సేపు వ్యాయామం చేయాలన్నది వైద్య నిపుణులు సూచిస్తుంటారు మనకి. ప్రస్తుతం వున్న రోజు వారి పనులతో , ఇతర రకాలైన ఒత్తిళ్లతో అనేక మందికి నిత్యం వ్యాయామం చేయటం కుదరకుండా ఉంటోంది .
దిగులు చెందాల్సిన అవసరం లేదని తాజా వైద్య అధ్యనాలు పేర్కొంటున్నాయి. వారంలో చివరి రోజు అయినా చేస్తే మంచిదేనని చెబుతోంది. వారానికి రెండు, మూడు సార్లు కలిపి మొత్తం మీద డెబ్బయి అయిదు నిముషాలు లేకపోతే ఒక మోస్తరుగా నూట యాభై నిముషాలు చేసిన వారికీ మరణం ముప్పు తగ్గుతున్నట్టు తేలటం గమనించాల్సిన విషయం. ఇటువంటి వారిలో మరణం ముప్పు ముప్పయి శాతం తగ్గుతుండగా, క్యాన్సర్ బారిన పడిన వారి మరణం ముప్పు పద్దెమినిది శాతం , గుండె జబ్బు మరణాల ముప్పు అయితే నలభై శాతం తగ్గుతుండటం విశేషం.
సెలవు దినాల్లో మాత్రమే జిమ్ కేంద్రాలకు వెళ్లేవారికి అయితే ఇది ఒక మంచి వార్తగానే చెప్పుకోవచ్చు. వారానికి చేయాల్సినంత కుదరక పోయిన ఆరోగ్య ముప్పులు మాత్రం తగ్గుతాయి అనుకోవటం ఆసక్తికరమైన అంశం. వ్యాయామం చేయక పోవటం కన్నా ఎంతో కొంత శారీరక శ్రమ, వ్యాయామం చేయటం ఎంతో మేలని మంచి ఫలితాలను సూచిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వ్యాసం.. అనూరాధ
చివరిసారిగా మార్పు చేయబడిన : 12/26/2023