పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఎక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్

ఎక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్

ఎక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్

ఎక్యూట్ కిడీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి

సంపూర్తిగా పని చేస్తున్న రెండు కిడ్నీలు ఏదో ఒక కారణము చేత హఠాత్తుగా నష్టము వాటిల్లడము వల్ల కొంత సమయము వరకు అవి పని చేసే శక్తి తగ్గడము కానీ పూర్తిగా పనిచేయడక పోవడముకాని జరిగితే దానిని ఎక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అని అంటారు.

ఎక్యూట్ కిడీఫెయిల్యూర్ సంభవించడానికి కారణాలు ఏమిటి

ఎక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ సంభవించడానికి కారణాలు ఈ విధముగా ఉంటాయి.

 1. చాలా ఎక్కువగా వికారముగా గాని, వాంతులు అవుతున్నట్లు గాని ఉంటే శరీరములో నీటి యొక్క పరిమాణము తక్కువగా ఉండడం, రక్త పీడన తక్కువగా ఉండడం.
 2. ఫాల్సిఫారము మలేరియా లేక లెప్టో స్టెరోసిస్
 3. ఘంఫ్డ డిపిషియన్సి అవ్వడము, ఈ రోగములలో కొన్ని మందులు వాడకము వలన రక్త కణాలు నష్ట పడడం దాని వలన కిడ్నీ హఠాత్తుగా ఫెయిల్ అవ్వడము జరగడం.
 4. రాళ్ళవల్ల మూత్ర మార్గంలో అవరోధము ఏర్పడడము

ఇవికాక రక్తములో ప్రమాదకర స్థాయిలో ఇన్స్క్షన్, కిడ్నీలో ప్రమాదకరమైన ఇన్స్క్షన్, కిడ్నీలో విశేషమైన వాపు, స్త్రీలలో ప్రసవించే సమయములో రక్త పీడనము అధికముగా ఉండడము లేక ఎక్కువగా రక్తస్రావము అవ్వడము, మందుల దుప్రభావము పడడము, పాము కాటు వేయడము, ఎముకల నరాల పైన వత్తిడి వలన, విష పదార్థాల వలన కిడీపై ప్రభావము పడటము, ఇటువంటివి కాడా ఎక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్‌కి కారణాలు కావచ్చు.

ఎక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్లో రెండు కిడ్నీల అకస్మాత్తుగా పాడైపోతే రోగలక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అబ్క్

ఎక్యూట్ కిడ్నీఫెయిల్యూర్ లక్షణాలు

ఆకలి తక్కువగా వుండడము, వికారముగా ఉండటము, వాంతులు అవుతున్నట్లు ఉండటము, ఎక్కిస్ రావడము మూత్రము తక్కువగా రావడము, లేక పూర్తిగా ఆగిపోవడము

ముఖంలో, కాళ్ళలో, శరీరములో వాపు రావడము,శ్వాస అందక పోవడము, రక్త పీడనము అధికం కావడము.

రక్త వాంతులు అవ్వడము, రక్తములో పొటాషియం యొక్క పరిమాణము ఎక్కువగా ఉండడము ( ఈ కారణము చేత హఠాత్తుగా గుండె కొట్టుకోవడము ఆగవచ్చు.)

కిడ్నీ ఫెయిల్యూర్ యొక్కలక్షణాలే కాక, ఏ రోగము కారణముగా కిడ్నీ పాడయిపోయిందో ఆ రోగ లక్షణాలు ဉ့်လူ႕ဗ် కనిపిస్తూ ఉంటాయి, ఉదాహారణకి మలేరియా విషజ్వరముతో చలితో వణికించేలా జ్వరము రావడం.

ఎక్యూట్ కిడ్నీఫెల్యూర్ యొక్కరోగ నిర్ధారణ

ఏదైనా రోగము వల్ల కిడ్నీ పాడైపోయిందని సందేహము ఉంటే, రోగిలో కనిపిస్తున్న లక్షణాల వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అయి ఉండవచ్చని అనుమానము ఉన్నప్పడు వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవలెను. రక్తములో క్రియాటినిన్, యూరియా పరిమాణము ఎక్కువగా ఉంటే అది కిడ్నీ ఫెయిల్యూర్‌కి సంకేతాన్ని ఇస్తుంది. మూత్రము, రక్తము యొక్క పరీక్షలు, సోనోగ్రఫి మొదలగు పరీక్షల వల్ల ఎక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క నిర్ధారణ మరియు ఎక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల శరీరములో కనిపించే మిగిలిన సంకేతాల గురించి తెలుసుకోవచ్చు.

ఎక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్లో రెండు కిడ్నీలు హఠాత్తుగా పాడపడంతో రోగ లక్షణములు ఎక్కువగా కనిపిస్తాయి.

కిడ్నీ రోగులకు సమయానికి డయాలసిస్ చేయటం అనేది ప్రాణదానంగా వుంటుంది

ఎక్యూట్ కిడ్నీఫెయిల్యూర్ను ఆపడానికి ఉపాయము

వికారము, వాంతులు అవ్వడము, మలేరియా వంటివి కిడ్నీని పాడు చేసే రోగాలకు నిర్ధారణ చేసుకుని వెంటనే వైధ్యము చేయడము వల్ల కిడ్నీ ఫెయిల్యూర్‌ను అరికట్టవచ్చు.

 • ఈ రోగము తొలి దశలో నియమిత పరిమాణము నీరు తాగడము.
 • తరువాత మూత్రము తక్కువ అవుతుంటే, వెంటనే డాక్టర్‌కు తెలియచేసి మూత్రము ఎంత అవుతుందో అంతే నీరు తాగవలెను.
 • కిడ్నీకి నష్టాన్ని కలిగించే ఏ విధమైన మందులు తీసుకోకూడదు. (ముఖ్యముగా నొప్పిని నివారించే మందులు)

ఎక్యూట్ కిడ్నీఫెయిల్యూర్లో కిడ్నీ ఎంత సమయములో తిరిగి పని చేయడము మొదలవుతుంది?

సరి అయిన చికిత్స తీసుకుంటే 4 వారాలలో చాలామంది రోగులలో కిడ్నీ తిరిగి పూర్తిగా పనిచేయడము మొదలవుతుంది. అటువంటి రోగులకు చికిత్స పూర్తి అయిన పిమ్మట మందులు తీసుకోవలసిన అవసరముగాని డయాలసిస్ చేయించుకునే అవసరము గాని ఉండదు.


ఎక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్లో రెండు కిడ్నీలు హఠాత్తుగా పాడపడంతో రోగ లక్షణములు ఎక్కువగా కనిపిస్తాయి.

ఎక్యూట్ కిడ్నీఫెయిల్యూర్ యొక్క వైద్యము

ఈ రోగానికి చికిత్స రోగము యొక్క కారణములు, లక్షణాల తీవ్రత,

లేబొరేటరీ పరీక్షలు దృష్టిలో ఉంచుకుని ప్రతి రోగికి వేరు వేరుగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రోగానికి మొట్టమొదట సరి అయిన వైద్యము ఇస్తే రోగికి.పునర్జన్మ దొరికినట్లే. అలా చికిత్స జరగని పక్షములో కోగి త్రి మృత్యువు కూడా కలగవచ్చు.

ఈ రోగము వల్ల పాడైపోయిన కిడ్నీలు సరైన చికిత్స వల్ల సంపూర్ణముగా నయమయ్యి తిరిగి పనిచేయడము మొదలవుతుంది.

 • ఎక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క ముఖ్య చికిత్స ఈ ప్రకారముగా ఉంటుంది.
  1. కిడ్నీ పాడవ్వడానికి కారణమైన రోగానికి చికిత్స చేయడము.
  2. ఆహార పానీయాలలో నియమితముగా ఉండడము.
  3. మందుల ద్వారా చికిత్స
  4. డయాలసిస్

ఎక్యూట్ కిడ్నీఫెయిల్యూర్కి కారణమైన రోగానికి చికిత్స

 • కిడ్నీ ఫెయిల్యూర్‌కి ముఖ్య కారణములు వాంతులు, వికారము, ఫాల్చిఫెరము, మలేరియా వీటిని నియంత్రణలో ఉంచడానికి వెంటనే చికిత్స చేయవలసిన అవసరము ఉంది. రక్తములో ఇన్ఫెక్షన్ని అరికట్టడానికి ప్రత్యేకమైన యాంటిబయాటిక్స్ ద్వారా చికిత్స చేయవచ్చు. రక్త కణాలు నష్టమయితే, రక్తాన్ని ఇవ్వవలసి వస్తుంది.
 • కిడ్నీ రాళ్ళ మూలంగా మూత్ర మార్గములో అవరోధము ఉన్నచో టెలిస్కోప్ ద్వారా లేక ఆపరేషన్ ద్వారా చికిత్స చేసి ఈ అవరోధాన్ని నిర్మూలించాలి.
 • వెంటనే చికిత్స చేయడము ద్వారా పాడయిపోయిన కిడ్నీని మరింత ఎక్కువగా పాడవకుండా కాపాడవచ్చు, కిడ్నీ తిరిగి సంపూర్ణముగా పని చేసేలా చేయవచ్చు.
ఈ రోగము వల్ల పాడైపోయిన కిడ్నీలు సరైన చికిత్స వల్ల సంపూర్ణముగా నయమయ్యి తిరిగి పనిచేయడము మొదలవుతుంది

ఆహార నియమముల అలవాట్లు

 • కిడ్నీ సరిగ్గా పని చేయకపోవడము మూలంగా కలిగే నష్టాలను, చిక్కులను తగ్గించుకోవడానికి ఆహారములో కట్టుదిట్టములు అవసరము.
 • మూత్రము యొక్క పరిమాణము దృష్టిలో పెట్టుకుని మంచి నీళస్, మిగిలిన పానీయాలు తీసుకోవడము తగ్గించాలి.
 • దాని వల్ల శరీరములో వాపు, ఆయాసము నుండి రక్షించుకోవచ్చును.
 • రక్తములో పొటాషియము యొక్క పరిమాణము పెరగకుండా ఉండడానికి పండ్లరసము, కొబ్బరి నీళ్ళు,  డ్రె  ప్రూట్స్ వంటివి తీసుకోరాదు. రక్తములో పొటాషియము యొక్క పరిమాణము పెరిగితే, గుండెకి అపాయము కలగవచ్చును.
 • ఉప్ప తీసుకోవడములో నియంత్రణ వల్ల శరీరములో వాపు, అధిక రక్తపీడనం, శ్వాస తీసుకోవడములో కష్టము (ఆయాసము) ఎక్కువగా దాహము వేయడము లాంటి సమస్యలను అదుపులో ఉంచుతుంది.

మందుల ద్వారా చికిత్స

 • మూత్రము ఎక్కువ అవ్వడానికి మందు మూత్రము తక్కువగా అవడము వలన శరీరములో వాపు శ్వాస తీసుకోడవములో కష్టము వంటి సమస్యలను అరికట్టడానికి ఈ మందు చాలా ఉపయోగపడుతుంది.
 • వాంతులు, అసిడిటి, కొరకు మందులు కిడ్నీ ఫెయిల్యూర్ కారణమువల్ల సంభవించు వాంతులు, ఎక్కిళ్ళు లాంటివి ఆపడానికి ఈ మందు సేవించడము ఎంతో ఉపయోగకరము.
 • మిగిలిన మందులు ఆయాసము, రక్త వాంతులు అవడము, శరీరము బద్ధకంగా ఉండడము లాంటి గంభీరమైన సమస్యల నుండి ఉపసయనము కలుగుతుంది.
ఈ రోగములో సరైన మందుల ద్వారా వెంటనే చికిత్స చేస్తే డయాలసిస్ అవసరము లేకుండానే కిడ్నీ నయమవుతుంది

డయాలసిస్

డయాలసిస్ అంటే ఏమిటి

కిడ్నీ పని చేయకపోవడము మూలంగా శరీరములో చేరుకున్న అనవసరమైన పదార్థాలు, నీరు, లవణము, ఆమ్లము లాంటి రసాయనిక పదార్ధముల నుండి కృత్రిమ పద్ధతిలో రక్తాన్ని శుభ్రపరిచే ప్రక్రియను డయాలసిస్ అని అంటారు.

డయాలసిస్ రెండు విధములు: పెరిటోనియల్ మరియు హిమోడయాలసిస్ డయాలసిస్ గురించి పూర్తిస్థాయి వివరణ 18వ అధ్యాయములో ఇవ్వబడినది.

మూత్రం ఎక్కువగా గానీ, తక్కువగా గానీ జరిగినచో మూత్రపిండం కోగ నిర్ధారణగా గుర్తించవచ్చు.

డయాలసిస్ యొక్కఅవసరము ఎప్పడు ఉంటుంది

ఎక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ రోగులందరికి చికిత్స మందుల ద్వారా, ఆహార నియమముతోను చేయబడుతుంది. కానీ కిడ్నీకి చాలా ఎక్కువగా నష్టము వాటిల్లినప్పుడు పూర్తి చికిత్స చేసిన తరువాత కూడా రోగలక్షణాలు ఎక్కువగా ఉంటే ప్రాణానికి ముప్ప వచ్చే అవకాశము ఉంటుంది. అటువంటప్పుడు ఈ రోగులకు డయాలసిస్ అత్యవసరము అవుతుంది. సరైన సమయములో డయాలసిస్ చేయడము వలన రోగికి జీవన దానము చేసినట్లు అవుతుంది.

 • డయాలసిస్ ఎన్నిసార్లు చేయవలసి వస్తుంది?

ఈ రోగముతో బాధపడుతున్న రోగి యొక్క పాడయిన కిడ్నీ తిరిగి పూర్తిస్థాయిలో పని చేసేవరకు, డయాలసిస్ కృత్రిమ రూపములో కిడ్నీ యొక్క పనిని రోగి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ వస్తుంది.

 • కిడ్నీ తిరిగి నయమవ్వడానికి 1 నుండి 4 వారాల వరకు సమయము పట్టవచ్చు. అంతవరకు అవసరానికి డయాలసిస్ చేయవలసి వస్తుంది.
 • చాలామంది వ్యక్తులలో ఒకసారి డయాలసిస్ చేయిస్తే మళ్ళీ మళ్ళీ డయాలసిస్ చేయవలసి వస్తుందని అనేక అపోహలు ఉంటే అప్పడప్పడు ఈ భయముతో రోగి డయాలసిస్ చికిత్స చేయించుకోవడములో అశ్రద్ధ చూపిస్తాడు. దీనివలన రోగి యొక్క ఆరోగ్యస్థితి ప్రమాదకరము అయి డాక్టర్ యొక్క ఉపచారానికి ముందే రోగి ప్రాణాలు కోల్పోతాడు.
 • రోగులలో కొందరికి మందుల వల్ల, కొంత మందికి డయాలసిస్ వల్ల సరైన చికిత్స చేయడము వల్ల కొన్ని రోజులలోనే రెండు కిడ్నీలు సంపూర్ణముగా పనిచేయడము మొదలవుతుంది. ఆ తరువాత ఆ రోగి సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడు. మందులు, ఆహార నియంత్రణ అవసరము ఉండదు.
ఎక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్లో డయాలసిస్ యొక్క అవసరము కొద్దిరోజుల వరకే ఉంటుంది.
2.98657718121
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు