অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కిడ్నీ మార్పిడి

కిడ్నీ మార్పిడి
  1. కిడ్నీ మార్పిడి
    1. కిడ్నీ మార్పిడి చికిత్స విజ్ఞానంలో ఇది ప్రగతి యొక్కసూచన
    2. కిడ్నీ మార్పిడి అనగా ఏమిటి?
    3. కిడ్నీ మార్పిడి ఎప్పుడు అవవసరం పడదు
    4. కిడ్నీ మార్పిడి ఎప్పుడు అవసరం పడుతుంది
    5. కిడ్నీ మార్పిడి ఎందుకు అవసరం
    6. కిడ్నీ మార్పిడి వల్ల ఎటువంటి లాభాలు కలవు
    7. కిడ్నీ మార్పిడి యొక్క నష్టాలు ఏంటి
    8. కిడ్నీ మార్పిడికి విరుద్దముగా ఎప్పుడు సలహా ఇస్తారు
    9. కిడ్నీ మార్పిడిలో దాతల ఎంపిక ఎలా జరుగుతుంది
    10. కిడ్నీ దాతలకు కిడ్నీఇచ్చిన తరువాత ఎలాంటి సమస్యలు వస్తాయి
    11. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కు ముందు రోగి యొక్క పరీక్ష
    12. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కు సంబంధించిన సమాచారం
    13. కిడ్నీ మార్పిడి తరువాత తెలుసుకోవలసిన ముఖ్య సూచనలు
    14. కిడ్నీ మార్పిడి తరువాత రిజెక్షన్ యొక్కసంభవాన్ని తగ్గించడానికి ఎలాంటి మందులు ఉపయోగిస్తారు
    15. కిడ్నీ మార్పిడి తరువాత ఎంత సమయం వరకు ఇమ్మునో సప్రషన్స్ ఉపయోగించవలసి వస్తుంది
    16. కిడ్నీ మార్పిడి తరువాత వేరే మందులు తెసుకోవడం అవసరం పడుతుందా
    17. కిడ్నీ మార్పిడి తర్వాత తీసుకోవలసిన ముఖ్య సూచనలు
    18. కిడ్నీ మార్పిడి తరువాత సంక్రమణ నుండి కాపాడుకోడానికి సూచనలు
    19. కిడ్నీ మార్పిడిలో కొని ప్రతికూలాలు
    20. ఖర్చుతోకూడిన చికిత్స
  2. కెడేవర్ కిడ్నీ మార్పిడి
    1. కెడేవర్ కిడ్నీ మార్పిడి అనగా ఏమి
    2. కెడేవర్ కిడ్నీ మార్పిడి ఎందుకు అవసరం
    3. బ్రెయిన్ డెడ్ ఏమిటి
    4. వ్యక్తి మరణం తరువాత కిడ్నీ దానం చేయవచ్చా
    5. బ్రెయిన్ డెడ్ కావడానికి ముఖ్యకారణాలు ఏమిటి
    6. బ్రెయిన్ డెడ్ ఎప్పుడు ఎలా జరుగుతుంది
    7. కెడేవర్ కిడ్నీదాతలకు ఎలాంటి వ్యాధులు ఉన్నప్పుడు కెడేవర్ కిడ్నీతీసుకోరు
    8. కెడేవర్ దాత వేరే ఏ అవయువాల దానం చేసి ఇతర రోగులకు సహాయపడవచ్చు
    9. కెడేవర్ కిడ్నీ మార్పిడిలో ఏ వ్యక్తులు సమావేశం అవుతారు
    10. కెడేవర్ కిడ్నీ మార్పిడి ఎలా జరుగుతుంది
    11. కెడేవర్ కిడ్నీదానం చేసే వారికి ఎలాంటి లాభాలు కలవు
    12. కెడేవర్ కిడ్నీమార్పిడికి కావలసిన సదుపాయాలు ఎక్కడ ఉన్నవి

కిడ్నీ మార్పిడి

కిడ్నీ మార్పిడి చికిత్స విజ్ఞానంలో ఇది ప్రగతి యొక్కసూచన

క్రోనిక్ కిడ్నీ ఫైయిల్యూర్ యొక్క అంతిమ అవస్థ యొక్క ఉపచారమునకు ఇది ఉత్తమమైన వికల్పము .

కిడ్నీ మార్పిడి సఫలముగా జరిగిన తరువాత రోగి వేరే వ్యక్తుల వలె సామాన్య జీవనం సాగించవచ్చు .

కిడ్నీ మార్పిడి విషయం పై చర్షనాలుగు భాగాలుగా చేయవచు

  1. కిడ్నీ మార్పిడికి ముందు తెలుసుకోవలసిన విషయాలు
  2. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ యొక్క సమాచారం
  3. కిడ్నీ మార్పిడి తరువాత తెలుసుకోవలసిన విషయాలు
  4. కెడేవర్ కిడ్నీ మార్పిడి

కిడ్నీ మార్పిడికి ముందు తెలుసుకోవలసిన విషయాలు

కిడ్నీ మార్పిడి అనగా ఏమిటి?

క్రోనిక్ కిడ్నీ ఫెయిల్యూర్ రోగులలో వేరే వ్యక్తుల (జీవించియున్న లేదా మరణించిన) యొక్క ఆరోగ్యమైన కిడ్నీని ఆపరేషన్ ద్వార అమర్చే విధానాన్ని కిడ్నీ మార్పిడి అంటారు .

కిడ్నీ మార్పిడి ఎప్పుడు అవవసరం పడదు

ఎవరికైన రెండు కిడ్నీలలో ఒకటి పనిచేయనప్పుడు శరీరంలో కిడీకి సంభందించిన అన్నిఆవశ్యక విధులు రెండో కిడ్నీ సహాయముతో జరుగుతాయి అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ సరియైన చికిత్స (కొందరి రోగులలో మందులు మరియు కొంత సమయం వరకు డయాలిసిస్)తో కిడ్నీ సంపూర్ణముగా పనిచేయడం ప్రారంభిస్తుంది. ಇಟ್ಟಿ రోగులకు కిడ్నీ మార్పిడి అవసరం పడదు .

కిడ్నీ మార్పిడి యొక్క అన్వేషణ క్రోనిక్ కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు ఒక బహుమానము

కిడ్నీ మార్పిడి ఎప్పుడు అవసరం పడుతుంది

క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ రోగులలో 100% పైగా పనిచేయనప్పుడు మందులు తీసుకున్నా కూడా ఆరోగ్యం క్షీణించినప్పుడు మరియు నియమితముగా డయాలిసిస్ అవసరం పడినప్పుడు ఇట్టి రోగులకు ఒక్క ఉత్తమమైన వికల్పం కిడ్నీ మార్పిడియే.

కిడ్నీ మార్పిడి ఎందుకు అవసరం

క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు రెండు కిడ్నీలు పూర్తిగా పనిచేయనప్పుడు మరియు మంచి ఆరోగ్యం కొరకు వారంలో 3-4 సార్లు డయాలిసిస్ మరియు మందుల అవసరం పడుతుంది. ఇట్టి రోగుల ఆరోగ్యం, నిర్ధారిత సమయానికి జరిపే డయాలిసిస్ పై ఆధార పడి ఉంటుంది. కిడ్నీ మార్పిడి తరువాత విటి నుండి రోగి విముక్తి పొందుతారు. సఫలమైన కిడ్నీ మార్పిడి మంచి జీవనానికి ఒక సంపురమైన ప్రత్యన్యాయము.

కిడ్నీ మార్పిడి వల్ల ఎటువంటి లాభాలు కలవు

సఫలమైన కిడ్నీ మార్పిడి యొక్కలాభాలు:

  1. ఉత్తమమైన జీవన విధానము. రోగి సామాన్య వ్యక్తుల వలె జీవనం సాగిస్తూ రోజూవారి పనులు చేసుకోవచ్చును.
  2. డయాలిసిస్ నుండి విముక్తి
  3. ఆహార నియమాలలో తక్కువ మార్పులు.
  4. రోగి మానసిక మరియు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు.
  5. పురుషుల శారీరక సంభంధాలలో ఎలాంటి అవరోధం ఉండదు. మహిళలు పిల్లలకు జన్మ ఇవ్వవచ్చు.
  6. ఉపచారమునకు అయ్యే మొదటి సంవత్సర ఖర్చు తరువాత ఎలాంటి ఖర్చు ఉండదు.

కిడ్నీ మార్పిడి యొక్క నష్టాలు ఏంటి

కిడ్నీ మార్పిడి వల్ల జరిగే నష్టాల క్రింద తెలుపబడినవి.

  1. పెద్ద ఆపరేషన్ అవసరం పడుతుంది, అయితే ఇది చాలా సురక్షితము.
  2. మొదట్లో మార్పిడి సఫలవంతమైన కొందరు రోగులలో మరల కిడ్నీ పాడైయ్యే అవకాశం ఉంది.
  3. కిడ్నీ మార్పిడి తరువాత క్రమము తప్పకుండ మందులు తీసుకోవాల్సి ఉంటుంది. మొదట్లో ఇవి చాలా ఖర్చుతో కూడినవి. కొంత సమయం వరకు మందులు ఆపివేసిన యెడల మార్పిడి చేసిన కిడ్నీ పాడైపోయే ప్రమాదం ఉంది.
  4. చికిత్స చాలా ఖర్చుతో కూడినది. ఆపరేషన్ మరియు హాస్పిటల్ ఖర్చు, ఇంటికి వెళ్ళిన తరువాత నియమితముగా తీసుకోవాల్సిన మందులు మరియు తరుచు లేబరేటరీ చాలా ఎక్కవైనవి(మూడు నుండి ఇదు లక్షల వరకు అవుతుంది).

కిడ్నీ మార్పిడికి విరుద్దముగా ఎప్పుడు సలహా ఇస్తారు

రోగి వయస్సు ఎక్కవ అయినప్పుడు. రోగి ఎయిడ్స్ లేక కాన్సర్ తో ఉన్నప్పుడు మార్పిడి చేయరు. మన దేశములో చాలా తక్కువగా పిల్లలలో కిడ్నీ మార్పిడి జరుపబడుతుంది.

సఫలమైన కిడ్నీ మార్పిడి క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క అంతిమ అవస్లలో ఒక ఉత్తమమైన వికల్పం

కిడ్నీ మార్పిడిలో దాతల ఎంపిక ఎలా జరుగుతుంది

క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు అందరి కిడ్నీ సరిపడదు. ముందుగ రోగి(ఎవరికీ అయితే కిడ్నీ అవసరమో) వారి బ్లడ్ గ్రూప్ దృష్టిలో ఉంచుకొని డాక్టర్ ఎవరి కిడ్నీ సరిపోతుందో నిర్ణయిస్తారు.

కిడ్నీ దాతల మరియు కిడ్నీ తీసుకొనే(రోగి) వ్యక్తుల బ్లడ్ గ్రూప్ సరిపడిన కుడా రక్తములోని తెల్ల కణాలలో ఉండే హచ్. ఎల్. ఎ (Human Leucocytes Antigen-H.L.A.) పదార్ద్మ్ యుక్క్ స్థాయిలు సామాన్యముగా ఉండవలెను. హచ్. ఎల్. ఎ మేచింగ్ టెస్టు టైపింగ్ పరీక్ష ద్వార నిర్ణయిస్తారు

కిడ్నీ మార్పిడిలో కుటుంబ సభ్యులలో నుండి తీసుకునే కిడ్నీ శ్రేష్టమైనది

ఎవరుకిడీని ఇవ్వవచుః

సాధారణముగా: 18 నుండి 70 వయసుగా గల వ్యక్తులలో నుండి కిడ్నీ తీసుకొంటారు. స్త్రీలు మరియు పురుషులు ఒకరికి ఒకరు కిడ్నీ ఇచ్చుకోవచ్చు. కవలలు తమ్ముడు/ చెల్లెలు కిడ్నీ దాతలుగా సరిజోడి. కాని ఇది సాధారణముగా జరుగదు. ఒక వేళ ఈ కిడ్నీ దాతల నుండి కిడ్నీ దొరకనప్పుడు వేరే కుటుంబ సభ్యుల నుండి బాబాయ్, అత్తా, మామ, పిన్ని నుండి కిడ్నీ తీసుకోవచ్చు. ఇది కుడా జరగనప్పుడు భార్య భర్తల కిడ్నీ పరీక్షచేసుకోవచ్చు. ఇతర దేశాలలో కుటుంబ సభ్యుల కిడ్నీ దొరకనప్పుడు బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి కిడ్నీ(కెడేవర్ కిడ్నీ) మార్పిడి ఉపయోగిస్తారు.

కిడ్నీ దాతలకు కిడ్నీఇచ్చిన తరువాత ఎలాంటి సమస్యలు వస్తాయి

కిడ్నీ తీసుకొనే ముందు కిడ్నీ దాత యొక్క సంపూర్ణ శారీరక పరీక్ష చేయబడుతుంది. కిడ్నీ దాత యొక్క రెండు కిడ్నీలు సామాన్యంగా పనిచేస్తున్నాయని పూర్ణరూపంగా నిశ్చయించిన తరువాత ఒక్క కిడ్నీ ఇచ్చిన తరువాత వారికీ ఎలాంటి సమస్యలు తలెత్తవని నిర్ధారించాలి . సామాన్యంగా ఒక్క కిడ్నీ ఇచ్చిన తరువాత ఎలాంటి సమస్యలు తలెత్తవు, వారు తమ జీవనాన్ని సామాన్యంగా కొనసాగించ వచ్చును. ఆపరేషన్ తరువాత శారీరక వ్యాయామం కూడా చేయవచ్చు. వారి వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు. ఒక్క కిడ్నీ ఇచ్చిన తరువాత మరో కిడ్నీ రెండో కిడ్నీ చేయవలసిన పనులు చేస్తుంది.

40సం ιι వయస్సులో పి.కె.డి యొక్క ముఖ్య లక్షణం కడుపులో గంల్ల పడటం మరియు మూత్రంలో రక్తం రావటం

కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కు ముందు రోగి యొక్క పరీక్ష

ఆపరేషన్ కు ముందు కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు అనేక విధములైన శారీరిక లేబొరేటరీ మరియు రేడియాలజీ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల ఉద్దేశము రోగి ఆపరేషన్ కు ముందు పూర్ణరూపేన తయూరుగా ఉన్నాడని నిర్ణయం చేసుకోడానికి, ఇంకా ఆపరేషన్ కు ఆటంకముగా వేరే ఏ వ్యాది లేదని నిశ్చయించుకోవడానికి.

కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కు సంబంధించిన సమాచారం

కిడ్నీ మార్పిడి ఆపరేషన్లో ఏమి చేస్తారు?

  • బ్లడ్ గ్రూప్డొరికిన తరువాత హెచ్. ఎల్. ఎ స్థాయిలు సంతోషకరముగా ఉందని నిశ్చయించిన తరువాత కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేస్తారు
  • ఆపరేషన్ కు ముందు రోగి యొక్క బందువుల నుండి మరియు కిడ్నీ ధాత యొక్క బందువులనుండి అనుమతి తీసుకుంటారు.
  • కిడ్నీ మార్పిడి ఆపరేషన్ ఒక టీం చేస్తుంది ఇందులో నెఫ్రాలజిస్ట్ (కిడ్నీ ఫిజిషియన్) యూరాలజిస్ట్ (కిడ్నీ యొక్క సర్జన్), పేతోలజిస్ట్ మరియు శిక్షణ పొందిన సహాయక బృందం యొక్క సంయుక్త కృషితో ఈ ఆపరేషన్ జరుగుతుంది . ఈ ఆపరేషన్ ను యూరాలజిస్ట్ చేస్తారు .
  • కిడ్నీదాత మరియు కిడ్నీ పొందే రోగి ఆపరేషన్ ఒకేసారి జరుగుతాయి. ఆపరేషన్లో దాత యొక్క కిడ్నీ తీసిన తరువాత దానిని ప్రత్యకమైన చల్లని ద్రవముతో శుభ్రం చేస్తారు. ఇది క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ రోగి కడుపులోని ముందు భాగములోని కుడి ప్రక్క కింది భాగములో పెట్టబడుతుంది -
  • రోగి యొక్క పనిచేయని కిడ్నీ తీయబడదు అయితే ఈ కిడ్నీ శరీరానికి హాని కలిగించేదిగా ఉంటే ఆ కిడ్నీని తీసివేయడం అవసరం
  • ఈ ఆపరేషన్ మూడు నుండి నాలుగు గంటల వరకు జరుగుతుంది.
  • ఆపరేషన్ అయిన తరువాత చికిత్స సంబంధిత భాద్యత నెఫ్రాలజిస్ట్ పైన ఉంటుంది.

కిడ్నీ మార్పిడి తరువాత తెలుసుకోవలసిన ముఖ్య సూచనలు

సంభవిత అపాయాలు:

కిడ్నీ మార్పిడి తరువాత కలగబోవు ప్రమాదలాలో కొత్త కిడ్నీని శరీరము త్రునికరించడం (కిడ్నీ రిజెక్షన్కు గురి కావడం ఆపరేషన్ సంభందిత ప్రమాదాల భయము ఉండటం ఇంకా మందుల యొక్క దుప్రభావాలు శరీరము పె ఉండడం.

మందుల ద్వారా చికిత్స మరియు కిడ్నీ రిజెక్షన్కు కిడ్నీ మార్పిడి వేరే ఆపరేషన్ తో పోలిస్తే ఎలా విభిన్నమైనది. సామాన్యంగా వేరే ఆపరేషన్లో రోగి ఆపరేషన్ తరువాత కేవలం 7 నుండి 10 రోజుల వరకు మందులు తీసుకోవలసి ఉంటుంది. కానీ కిడ్నీ ఆపరేషన్ తరువాత కిడ్నీ రిజెక్షన్ ఆపడానికి జీవన కాలమంత మందులు తీసుకోవలసి ఉంటుంది.

కిడ్నీ మార్పిడిలో పాత కిడ్నీని అదే స్థానములో ఉంచుతూ కొత్త కిడ్నని కడుపులోని ముందు భాగము క్రింద పెట్టబడుతుంది.

కిడ్నీ రిజెక్షన్ అనగా ఏమిటి?

మనకు తెలుసు సంక్రమణ సమయములో శరీరములోని శ్వేత అణువులు రోగ ప్రతిరోదిత పదార్థము (యాంటి బాడీస్) తయారు చేస్తుంది ఈ యాంటి బాడీస్ జీవ కణాలతో పోరాడి వాటిని నష్టం చేస్తుంది.

అదే తరహాలో క్రొత్తగా అమర్చిన కిడ్నీ బయిటిది అయినందు వలన శ్వేత అణువులు ఉన్న యాంటి బాడీస్ ఈ కిడ్నీకి హాని కలిగించవచ్చు. దీని

వలన కిడ్నీ పాడయ్యే అవకాశం ఉంది దీన్నే మెడికల్ బాషలో కిడ్నీ రిజెక్షన్ అంటారు.

కిడ్నీ మార్పిడిలో ముఖ్య భయాలు కిడ్నీని శరీరము త్రూనికరించడం (కిడ్నీ రిజెక్షన్), సంక్రమణకు గురి కావడం ,ఇంకా మందుల యొక్క దుప్రభావాలు శరీరము పై ఉండడం.

కిడ్నీ మార్పిడి తరువాత రిజెక్షన్ యొక్కసంభవాన్ని తగ్గించడానికి ఎలాంటి మందులు ఉపయోగిస్తారు

  • శరీరంలోని ప్రతిరోధ శక్తి కారణముగా పెట్టబడిన కొత్త కిడ్నీ రిజెక్షన్ అయ్యే అవకాశం ఉంది రిజెక్షన్
  • మందులు తీసుకోవడం ద్వార శరీరంలోని ప్రతిరోధ శక్తిని తక్కువ చేయగలిగితే రిజెక్షన్ భయం ఉండదు కానీ దీనివల్ల ప్రమాద కరమైన సంక్రమణ భయం ఉంటుంది
  • కిడ్నీ మార్పిడి తరువాత ప్రత్యేకమైన మందులను ఉపయోగిస్తారు. ఇవి కిడ్నీ రిజెక్షన్ ఆపడంలో సహకరిస్తాయి ఇవి రోగి యొక్క పోరాడే శక్తిని తటస్థంగా ఉందుతాయ (Selective immuno Suppression)

ఈ రకమైన మందులని ఇమ్మనో సప్రషన్స్ అంటారు . ప్రిడ్నిసలోన్, అజోతయోప్రిన్, సైక్లోస్పోరిన్ మరియు ఎం.ఎం.ఎఫ్ ఇంకా టేక్రోలిమస్, ఈ రకమైన మందులలో ముఖ్యమైనవి.

రిజెక్షన్ ఆపడానికి కిడ్నీ మార్పిడి తరువాత జీవిత కాలమంతా మందులు తీసుకోవలసి ఉంటుంది

కిడ్నీ మార్పిడి తరువాత ఎంత సమయం వరకు ఇమ్మునో సప్రషన్స్ ఉపయోగించవలసి వస్తుంది

ఈ మందులు చాలా ఖరిదైనవి కిడ్నీ మార్పిడి అయిన రోగులు విటిని జీవితాంతం ఉపయోగించాలి. మొదట్లో మందుల యొక్క మోతాదు మరియు ఖర్చు కూడా చాలా అవుతుంది, ఇది సమయంతో పాటు తగ్గుతూ వస్తుంది

కిడ్నీ మార్పిడి తరువాత వేరే మందులు తెసుకోవడం అవసరం పడుతుందా

అవును, సమయనుకులముగా కిడ్నీ మార్పిడి అయిన రోగులు తీసుకొనే మందులలో అధిక రక్త పోటు సంభందించినవి, కాలియం, విటమిన్స్ కు సంభందించినవి వేరే సమస్యల కొరకు మందులు తీసుకోవలసి వస్తే మిరు డాక్టరుకు మి యొక్క కిడ్నీ మార్పిడి ఆపరేషన్ గురించి తెల్పవలెను, వారు దాని అనుసారంగా మందులను సూచిస్తారు.

కిడ్నీ మార్పిడి తర్వాత తీసుకోవలసిన ముఖ్య సూచనలు

కొత్త కిడ్నీ యొక్కసంరక్షణలో తీసుకోవలసిన ముఖ్య సూచనలు కిడ్నీ మార్పిడి తరువాత కిడ్నీ పొందిన రోగికి ఇచ్చే ముఖ్యమైన సూచనలు :

  • డాక్టర్ సూచన ప్రకారం క్రమము తప్పకుండా మందులు తీసుకోవడం చాలా అవసరం. క్రమము పాటించనచో కొత్త కిడ్నీ చెడిపోయే అవకాశం ఉంటుంది.
  • మొదట్లో రోగి యొక్క బ్లడ్ ప్రెషర్, మూత్రం యోక్క మోతాదు ఇంకా శరీరం యొక్క బరువును నియమితముగా కొలచి డైరీలో పొందు పరుచవలెను.
  • డాక్టర్ యొక్క సలహా ప్రకారం క్రమముగా లేబొరేటరీలో పరీక్ష చేయించుకోవలెను మరియు నెఫ్రాలజిస్ట్ తో క్రమముగా చెకప్ చేయించు కోవలెను.
  • రక్తము మరియు మూత్రము యొక్క ప్రరీక్ష నమ్మకమైన లేబొరేటరీలో చేయించవలెను. రిపోర్ట్ లో మార్పులు ఉన్నచో లేబొరేటరీ మార్చడం బదులు నెఫ్రాలజిస్ట్ కి సమాచారం అందించడం అవసరం
  • జ్వరం రావడం, కడుపులో నొప్పి రావడం, మూత్రం తక్కువగా రావడం, శరీర బరువు తగ్గడం మరియు ఇతర సమస్యలు ఉన్నప్పుడు నెఫ్రాలజిస్ట్ ని సంప్రదించవలెను .
కిడ్నీ మార్పిడి యొక్క సఫలత కొరకు జాగ్రతలు తీసుకోవడం చాలా అవసరం

కిడ్నీ మార్పిడి తరువాత సంక్రమణ నుండి కాపాడుకోడానికి సూచనలు

  • మొదట్లో సంక్రమణ నుంచి రక్షించుకోడానికి జీవానువులు ఆపే శుభ్రమైన మాస్క్ ధరించడం అవసరం, దీనిని రోజూ మార్చవలెను
  • రోజూ శుభ్రమైన నీళ్ళతో స్నానం చేసిన తరువాత ఎండలో ఆరి ఇస్తి చేసిన బట్ట్ల్ను ధరించవలెను
  • ఇంటిని శుభ్రముగా ఉంచుకోవలెను
  • అనారోగ్యముగా ఉన్న వ్యక్తులకు దూరముగా ఉండవలెను
  • కలుషిత ప్రదేశాలు మరియు అదిక జనాభా తిరిగే ప్రదేశాలు (మేళ) లాంటి చోట్లకు వెళ్ళకుండా చూసుకోవాలి
  • ఎల్లప్పుడు మరిగించి చల్లార్చిన నీటిని తీసుకోవాలి
  • బయట తయారు చేసిన భోజనం తీసుకోకూడదు
  • ఇంట్లోనే తయారు చేసిన భోజనం తీసుకోవలెను
  • ఆహారపు అలవాట్ల సంభందించిన నియమాలను క్రమం తప్పకుండా పాటించవలెను
కిడ్నీ మార్పిడి తరువాత సంక్రమణ నుండి కాపాడు కోవడానికి అన్ని సురక్షకాలు పాటించాలి

కిడ్నీ మార్పిడిలో కొని ప్రతికూలాలు

క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అయిన రోగులు ఎందువల్ల కిడ్నీ మార్పిడి చేయించుకోలేరు ?

కిడ్నీ మార్పిడి ఒక ఉపయోగకరమైన ఉతమమైన చికిత్స .కానీ అందరు రోగులు ఈ చికిత్స యొక్క లాభాలు పొందలేకపోతున్నారు. దీనికి ముఖ్యముగా రెండు కారణాలు

  • కిడ్నీ అందుబాటులో లేకపోవడం
  • కిడ్నీ మార్పిడికి ఇష్టులైన రోగుల యొక్క కుటుంభ సభ్యుల నుండి యోగ్యమైన కిడ్నీ లేదా కెడేవర్ కిడ్నీ దొరక్క పోవడం. ఇది కిడ్నీ మార్పిడిలో ఒక ముఖ్యమైన ప్రతికూలం.

ఖర్చుతోకూడిన చికిత్స

ప్రస్తుత సమయంలో కిడ్నీ మార్పిడికి మొత్తం ఖర్చు (ఇందులో) ఆపరేషన్, పరీక్ష మందులు మరియు హాస్పిటల్ ఖర్చులు కలిపి రెండు నుండి ఐదు లక్షలకు పైగా అవుతుంది. హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళిన తరువాత మందులు మరియు పరీక్షలకు అయ్యే ఖర్చు కుడా చాలా ఎక్కువ. మొదటి సంవత్సరంలో ఈ ఖర్చు పది నుండి పదిహేను వేలు ప్రతి మాసం అవుతుంది.

మొదటి సంవత్సరం తరువాత ఈ ఖర్చు తగ్గుతుంది. కాని మందులు జీవిత కాలం వరకు తీసుకోవలసి ఉంటుంది. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ మరియు దాని తరువాత మందుల ఖర్చు గుండె జబ్బు బై పాస్ సర్జరీ కన్నా ఎక్కువ. ఇంత ఖర్చుతో కూడినది కనుక చాలా రోగులు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసుకోలేక పోతున్నారు.

కిడ్నీరోగంలో రక్తపీడనం అత్యంత అధికం అవటం ముఖ్య కారణంగా వుంటుంది.

కెడేవర్ కిడ్నీ మార్పిడి

కెడేవర్ కిడ్నీ మార్పిడి అనగా ఏమి

బ్రెయిన్ డెడ్: మెదడు పనిచేయని (బ్రెయిన్ డెత్) వ్యక్తి శరీరములో నుండి కిడ్నీ తీసి కిడ్నీ ఫెయిల్యూర్ రోగిలో  పెట్టే ఆపరేషన్ ను కెడేవర్ కిడ్నీ మార్పిడి అంటారు.

కెడేవర్ కిడ్నీ మార్పిడి ఎందుకు అవసరం

రెండు కిడ్నీలు ఫెయిల్ అయిన వ్యక్తుల చికిత్స కొరకు రెండు అవకాశాలు ఉన్నవి - డయాలిసిస్ మరియు కిడ్నీ మార్పిడి.

కిడ్నీ మార్పిడి చేసుకున్న రోగులు తక్కువ నియమాలు పాటించాలి మరియు సాధారణ వ్యక్తుల వలె జీవించే సౌలబ్యం కలదు. దీని వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు మెరుగైన జీవన శైలి దొరుకుతుంది. ఇందువల్ల డయాలిసిస్ కన్నా కిడ్నీ మార్పిడి ఒక మంచి వికల్పం.

కిడ్నీ మార్పిడి చేసుకోవాలను కున్న అందరు రోగులకు తమ కుటుంబ సభ్యుల నుండి కిడ్నీ దొరక్క పోవచ్చు. ఇందువలన డయాలిసిస్ చేసుకొనే రోగుల శాతం ఎక్కువ. ఇట్టి రోగులకు కెడేవర్ కిడ్నీ మార్పిడి విధమైన ఆశాకిరణం. మరణం తరువాత శరీరముతో పాటు కిడ్నీ కుడా నష్టం అవుతుంది. ఇలాంటి కిడ్నీ క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ రోగికి కొత్త జీవితం ఇస్తుంది దీనికన్నా మంచి ఏమిటి ?

బ్రెయిన్ డెడ్ ఏమిటి

సాధారణ భాషలో మరణం అంటే గుండె శ్వాస మరియు మెదడు ఎప్పటికి ఆగిపోవడం . బ్రెయిన్ డెడ్ డాక్టర్ల ద్వారా తెలిచే మరణం బ్రెయిన్ డెడే రోగులలో గంభీరమైన చోటు కారణంగా మెదడు ఎప్పటికి(సంపూర్ణముగా) పనిచేయడం ఆపేస్తుంది - ఇట్టి రోగులు ఎలాంటి చికిత్స మార్పు చెందరు కానీ వెంటిలేటర్, ఇతర సాధనాల సహాయంతో శ్వాస మరియు హృదయ చలనం జరుగుతుంది. తగిన మోతాదులో రక్తం మొత్తం శరీరానికి అందుతుంది, ఇట్టి రకమైన మరణాన్ని బ్రెయిన్ డెడ్ అంటారు. హృదయ చలనం మరియు శ్వాస ఉంటుంది ఇంకా మెదడు యొక్క

ఇతర కార్యాలు ఎదాతదముగా జరుగుతాయి. విరు తిరిగి మేలుకోవడమే ఒక సరైన చికిత్స.

బ్రెయిన్ డెడ్ లో మెదడుకు ఒక తీవ్రమైన నష్టం జరుగుతుంది, దీనిని సరిచేయడం చాలా కష్టం. ఇట్టి రోగులకు వెంటిలేటర్ ఆగినప్పుడు శ్వాస మరియు హృదయ చలనం ఆగిపోతుంది మరియు రోగికి మరణం కుడా సంభవిస్తుంది. కిడ్నీ మార్పిడి కొరకు కుటుంబ ನಿಭಿ।ುಲು దొరకనప్పుడు క్రెడేవర్ కిడ్నీ మార్పిడి ఒక ఆశాకిరణం

కిడ్నీ మార్పిడిలో ఒక ముఖ్యమైన ప్రతికూలం కిడ్నీ దొరక్కపోవడం మరియు అధిక ఖర్చుతో కూడినది కావడం.

వ్యక్తి మరణం తరువాత కిడ్నీ దానం చేయవచ్చా

లేదు, మరణం తరువాత నేత్ర దానం లాగ కిడ్నీ దానం చేయలేము. హృదయం ఆగిపోయినప్పుడు కిడ్నీకి రక్త ప్రవాహం ఆగిపోతుంది దీనివల్ల కిడ్నీ పనిచేయడం ఆపేస్తుంది. ఇందువలన మరణం తరువాత కిడ్నీని ఉపయోగించలేము.

బ్రెయిన్ డెడ్ కావడానికి ముఖ్యకారణాలు ఏమిటి

బ్రెయిన్ డెడ్ కారణాలు క్రింద తెలుపబడినవి:

  • ప్రమాదములో తలకు తీవ్రమైన దెబ్బ తాకడం.
  • రక్త ఒత్తిడి పెరిగి నరాలు పగలడం వల్ల బ్రెయిన్ హ్యమరేజ్ జరగడం.
  • మెదడకు రక్తము అందించే నాళ ములో రక్తము గడ్డకట్టడం, దీనివల్ల మెదడకు రక్తము అందడం ఆగిపోతుంది.
  • మెదడులో కాన్సర్ కణితి ఉండడం, ఇది మెదడుకు తీవ్రమైన నష్టం కలిగిస్తుంది.
బ్రెయిన్ డెడ్ అయిన రోగి స్థితి మెరుగు పడే అవకాశం తక్కువ.

 

బ్రెయిన్ డెడ్ ఎప్పుడు ఎలా జరుగుతుంది

తగిన సమయం వరకు డాక్టర్ చేసే చికిత్సకు రోగి యొక్క మెదడు ఎలాంటి స్పందన చూపించనప్పుడు మరియు రోగి వెంటిలేటర్ సహాయంతోనే ఉపచారము జరుగుతున్నపుడు. ఇట్టి రోగులకు బ్రెయిన్ డెడ్ పరీక్షలు నిర్వహిస్తారు.

కిడ్నీ మార్పిడి డాక్టర్ల యొక్క టీం కన్నా ముందు వేరే డాక్టర్ల టీం ద్వారా బ్రెయిన్ డెడ్ యొక్క నిర్ధారణ చేస్తారు. ఈ డాక్టర్ల టీంలో చికిత్స చేసే ఫిజిషియన్, న్యూరో ఫిజిషియన్ మరియు న్యూరో సర్జన్లు ఉంటారు.

డాక్టర్ల అనేక మైన లేబారేటేరి పరీక్షాలు, మరియు మెదడు యొక్క ప్రత్యకమైన పరీక్ష ఈ.ఈ.జి మరియి ఇతర అవశ్యకమైన పరీక్షలలో రోగి యొక్క మెదడు మెరుగుపడే అవకాశాలను పరిశీలిస్తారు. అన్ని ముఖ్యమైన పరిక్షలు జరిపిన తరువాత డాక్టర్ రోగి యొక్క మెదడు మరల పనిచేయదని నిర్ధారించిన తరువాత బ్రెయిన్ డెడ్ అని ప్రకటిస్తారు.

కెడేవర్ కిడ్నీదాతలకు ఎలాంటి వ్యాధులు ఉన్నప్పుడు కెడేవర్ కిడ్నీతీసుకోరు

  • కెడేవర్ కిడ్నీ దాత రక్తము సంక్రమ చెందే అవకాశం ఉన్నప్పుడు
  • కాన్సర్ ఉన్నప్పుడు (మెదడు కాన్సెర్ తప్ప) అ కిడ్నీ చా లాసమయం పనిచేయనప్పుడు లేదా కిడ్నీకి వ్యాధి ఉన్నప్పుడు.
  • రక్త పరీక్షలో ఎయిడ్స్ లేదా జాండిస్ (కామెర్లు) నిర్ధారణ అయినప్పుడు. చాలా సమయం వరకు డయాబెటిస్ లేదా రక్తములో అధిక ఒత్తిడి ఉన్నప్పుడు.
  • దాత వయస్సు 10 సం క్రింద లేదా 70 సం పైన ఉన్నప్పుడు ఇట్టి పరిస్థితిలో కిడ్నీ తీసుకోబడదు.
సరళ భాషలో బ్రెయిన్ డెడ్ అంటే వెంటిలేటర్ సహాయముతో శ్వాస

కెడేవర్ దాత వేరే ఏ అవయువాల దానం చేసి ఇతర రోగులకు సహాయపడవచ్చు

  • కెడేవర్ దాత రెండు కిడ్నీలు దానంలో తీసుకోవచ్చు. దీని ద్వారా కిడ్నీ ఫెయిల్యూర్ అయిన ఇద్దరు రోగులకు క్రొత్త జీవనం దొరుకుతుంది.
  • కిడ్నీ కాకుండా కెడేవర్ దాత దానంలో వేరే అవయవాలు - గుండె, లివెర్, పాంక్రియాస్, కళ్ళు దానము చేయవచ్చు.

కెడేవర్ కిడ్నీ మార్పిడిలో ఏ వ్యక్తులు సమావేశం అవుతారు

కెడేవర్ కిడ్నీ మార్పిడి సఫలం కావడానికి టీం వర్క్ అవసరం పడుతుంది, ఇందులో

  • కెడేవర్ కిడ్నీ దానం సమ్మతి కొరకు కిడ్నీ దాత కుటుంబంలోని ఒక వ్యక్తి
  • రోగులకు చికిత్స చేసే ఒక ఫిజిషియన్
  • కెడేవర్ కిడ్నీమార్పిడి విషయంపై అవగాహనా మరియు సమాచారం ఇచ్చే మార్పిడి సమన్వయకర్త
  • బ్రెయిన్ డెడ్ నిర్షారణ చేసే న్యురాలజిస్ట్, కిడ్నీమార్పిడి చేసే నెఫ్రాలజిస్ట్ మరియు యూరాలజిస్ట్ ఇందులో ఉంటారు.

కెడేవర్ కిడ్నీ మార్పిడి ఎలా జరుగుతుంది

కెడేవర్ కిడ్నీ మార్పిడిలో తెలుసుకోవలసిన ముఖ్య సమాచారం

  • బ్రెయిన్ డెడ్ నిర్ధారణ జరగాలి
  • కిడ్నీ దాతను లేబారేటరీలో పరీక్షా చేసి కిడ్నీ పూర్తి ఆరోగ్యంగా ఉందని నిర్ధారించుకోవాలి
  • కిడ్నీ దాత శరీరములో నుండి కిడ్నీ తీసే ఆపరేషన్ సమాప్తము అయ్యే వరకు రోగి యొక్క హృదయము మరియు శ్వాసను వెంటిలెటర్ మరియు ఇతర సాధనాల సహాయముతో నడుప బడుతుంది. మరియు రక్తములోని ఒత్తిడిని తగిన మోతాదులో ఉండేలా చూస్తారు.
  • కిడ్నీ దాత బ్లడ్ గ్రూప్ మరియు టెస్టు టైపింగ్ రిపోర్ట్ యొక్క ఆధారముగా కిడ్నీ మార్పిడికి ఇస్టులైన రోగికి కెడేవర్ కిడ్నీ సరి పడుతుందో లేదో నిర్ధారిస్తారు
  • అన్ని రకములైన పరీక్షలు మరియు సంసిద్దత తరువాత కిడ్నీ మార్పిడి ఆపరేషన్ ఎంత త్వరగా జరిగితే అంత మంచిది.
  • ఆపరేషన్ ద్వారా తీసిన కెడేవర్ కిడ్నీ లేదా కుటుంబ సభ్యుల నుండి పొందిన కిడ్నీ ఈ రెండు పరిస్థితులో కిడ్నీ పెట్టే విధానము ఒక్కట కిడ్నీ మార్పిడి తరువాత రోగి సాధారణ వ్యక్తుల వలె జీవనం సాగించవచ్చు.
  • మార్పిడి ముందు కిడ్నీని మంచు గడ్డలో పెట్టడం ద్వార కిడ్నీకి మంచు యొక్క చల్లదనం తాకి రక్తము మరియు ప్రాణ వాయువు లభించదు
  • ఈ ప్రకారముగా కిడ్నీకి జరిగిన నష్టానన్ని కెడేవర్ కిడ్నీ మార్పిడి తరువాత చాలా రోగులలో క్రొత్త కిడ్నీ పనిచేయడానికి తక్కువ సమయం పడుతుంది. రియు రోగికి ఇట్టి స్థితిలో డయాలిసిస్ అవసరం కుడా పడదు.
ఒక కెడేవర్ (దాత) నుండి దొరికిన రెండు కిడ్నీలు ఇద్దరు రోగులకు జీవనం ఇస్తుంది.

కెడేవర్ కిడ్నీదానం చేసే వారికి ఎలాంటి లాభాలు కలవు

క్రెడేవర్ కిడ్నీదాత ఇంకా కుటుంబ సభ్యులకు ఎలాంటి ధన సహాయం దొరకదు. ఇందువల్ల కిడ్నీ పొందిన రోగి ఎలాంటి రుసుము చెల్లించ వలసిన అవసరం ఉండదు. మరణం తరువాత కిడ్నీ నష్టం చెందుకుండా అవసరంలో ఉన్న రోగికి కిడ్నీలభిస్తే వారికి కొత్త జీవితం దొరుకుతుంది, ఇది చాలా అమూల్యమైనది. ఈ దానము వలన ఒక దుఃఖంములో ఉన్న రోగికి సహాయం చేయడం ద్వార సంతోషం మరియు ఆనందం పొందవచ్చు, ఇది ఆర్ధిక లాభము కన్నా ఎంతో ఎక్కువ.

ఈ ప్రకారముగా ఏ వ్యక్తి అయిన తమ మరణం తరువాత ఇతర రోగులకు కొత్త జీవితం ఇవ్వవచ్చు. దీని కన్నా గొప్ప లాభం ఏమి ఉంటుంది

ఒక కిడ్నీ దాత శరీరములో నుండి రెండు కిడ్నీలు లబిస్తాయి, నితో ఒకే సారి ఇద్దరు రోగులకు కెడేవర్ కిడ్నీ మార్పిడి చేయవచ్చు.

కెడేవర్ కిడ్నీమార్పిడికి కావలసిన సదుపాయాలు ఎక్కడ ఉన్నవి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వార ఆమోదం పొందిన హాస్పిటల్స్ లో  కెడేవర్ కిడ్నీమార్పిడి సదుపాయమ కలవు. భారత దేశములోని అన్ని ముఖ్య

నగరాలైన ముంబై, చెన్నై, అహ్మబాద్, బెంగలూరు, హైదరాబాద్ లో ఈ ఆపరేషన్లు చేయబడతాయి.

మరణం తరువాత అవయవాల దానంతో రోగులకు కొత్త జీవితం ఇవ్వడం కంటే పుణ్య కార్యం వేరోకటి లేదు.

 



© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate