অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్

క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్,

అది రావడానికి కారణాలు

కిడ్నీ రోగులలో క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ (క్రానిక్ కిడ్నీ) చాలా ప్రమాదకరమైన రోగము. ఎందుకంటే ప్రస్తుతము వాడుకలో ఉన్న చికిత్స పద్దతుల ద్వారా ఈ రోగాన్ని పూర్తిగా నివారించడానికి ఏ విధమైన మందులు లేవు. గత అనేక సంవత్సరాలుగా ఈ రోగము వల్ల బాధపడుతున్న రోగుల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగి పోయింది, డయాబెటిస్, అధిక రక్త పీడనం (బ్లడ్ ప్రెషర్), రాళస్ మొదలగు వ్యాధుల సంఖ్య పెరగడమే దీనికి ముఖ్య కారణము.

మూత్రంలో ప్రోటీన్, రక్త పీడనం, డయాబెటిస్ కిడ్నీ రోగానికి కారణం.

క్రానిక్ కిడ్నీఫెయిల్యూర్ అంటే ఏమిటి

ఈ రకమైన కిడ్నీ ఫెయిల్యూర్లో కిడ్నీ పాడయ్యే ప్రక్రియ చాలా నెమ్మదిగా కొన్ని నెలలపాటు లేక కొన్ని సంవత్సరాల పాటు అవుతూ ఉంటుంది. చాలా కాలము తరువాత రోగి యొక్క రెండు కిడ్నీలు చాలా చిన్నవిగా అయిపోతాయి. మరియు పని చేయడము ఆగిపోతుంది. ఆ కిడ్నీలను మందులు గాని, ఆపరేషన్ ద్వారాగాని, డయాలసిస్ ద్వారా గాని సరిచెయ్యలేము.

క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు ప్రారంభిక దశలో సరి అయిన మందుల ద్వారాను, ఆహార నియంత్రణ ద్వారాను ఉపచారము చేయబడుతుంది.

ఎండ్ స్టేజ్ కిడ్నీ (రెనాల్) డిసీస్ (ఇ.యస్.కె.డి లేదా ఇ.యస్.అర్.డి) అంటే ఏమిటి?

క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క రోగులలో రెండు కిడ్నీలు ಮೆಲ್ಲ మెల్లగా పాడవ్వటము మొదలవుతుంది. కిడ్నీ 90 శాతము కంటే ఎక్కువగా పాడయినప్పడు లేక పూర్తిగా పని చేయడము ఆగి పోయినప్పడు, అప్పడు దాన్ని ఎండ్ స్టేజ్ రెనాల్ స్టీన్ లేక సంపూర్ణ కిడ్నీ ఫెయిల్యూర్ అని అంటారు.

ఈ స్థితిలో సరి అయిన మందులు వేసుకుని, ఆహార నియంత్రన పాటించినప్పటికి, రోగి యొక్క ఆరోగ్యము చెడిపోతూ ఉంటుంది. అది రక్షించుకోవడానికి నియమిత రూపములో డయాలసిస్ లేక కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయవలసిన అవసరము ఏర్పడుతుంది.

క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్లో కిడ్నీ మెల్ల మెల్లగా తిరిగి నయమవ్వడానికి వీలులేని విధముగా పాడవుతుంది


క్రానిక్ కిడ్నీఫెయిల్యూర్ అవటానికి ముఖ్యకారణాలు ఏమిటి

ప్రత్యేకముగా చికిత్స ఇచ్చినప్పటికీ రెండు కిడ్నీలు తిరిగి నయమవ్వడానికి వీలు లేకుండా సంభవించే కిడ్నీ ఫెయిల్యూర్కు ముఖ్య కారణములు ఏ విధముగా ఉంటాయ.

  1. డయాబెటిస్ : ఏఏ విషయము తెలుసుకుని విచారించవలసిన పరిస్థితి. క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్లో 30 నుండి 40 శాతము వరకు రోగులు లేక ప్రతి ముగ్గురులో ఒక వ్యక్తి గాని డయాబెటిస్ కారణముగా ఈ వ్యాధికి గురి అవుతారు. డయాబెటిస్, క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్కి అన్నింటి కంటే ముఖ్యమైన ప్రమాదకరమైన కారణముగా పేర్కొనబడింది. అందుచేత డయాబెటిస్ రోగులపై ఈ రోగము గురించి కనిపెట్టుకుని ఉండవలసిన అవసరము ఎంతైనా ఉంది.
  2. అధిక రక్త పీడనము (హై బ్లడ్ ప్రెషర్) : చాలా దీర్ఘకాలము వరకు రక్తం యొక్క పీడనం అధికముగా ఉంటే, ఈ అధిక పీడనము క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ వ్యాధికి కారణము అవ్వవచ్చు.
  3. క్రానిక్ గ్లోమెరులో నెఫ్రిటిస్ : ఈ రకమైన కిడ్నీ వ్యాధిలో ముఖములోన, చేతులలోన వాపు కనపుడుతుంది. రెండు కిడ్నీలు మెల్ల మెల్లగా పని చేయడము ఆగి పోతుంధి.
  4. వంశపరంపర్యముగా వచ్చే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీస్.
  5. కిడ్నీ రాళ్ : కిడ్నీ మరియు మూత్ర మార్గములో రెండు వైపుల రాళ్ళు మూలంగా అవరోధము వల్ల నిర్ణీత సమయములో చికిత్స చేయకపోవడము.
  6. చాలా కాలము వరకు తీసుకున్న మందుల వల్ల (నొప్పి నివారణకు తీసుకునే మాత్రలు, భస్మవీలు లాంటివి) కిడ్నీకి హానికారక మవ్వవచ్చు.
  7. పిల్లలలో కిడ్నీ మరియు మూత్ర మార్గములో ఇన్ఫెక్షన్ అవ్వడము.
  8. పిల్లలలో పుట్టుకతో ఉన్న ఇన్ఫెక్షన్ లేక అవరోధము వంటివి.

క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్లో కిడ్నీ మెల్ల మెల్లగా తిరిగి నయమవ్వడానికి వీలులేని విధముగా పాడవుతుంది




© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate