অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క లక్షణాలు, రోగ నిర్ధారణ

క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క లక్షణాలు, రోగ నిర్ధారణ

క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క లక్షణాలు, రోగ నిర్ధారణ

క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ (సి.కె.డి) రెండు కిడ్నీలు పాడవడానికి కొన్ని నెలల నుండి కొన్ని సంవత్సరాల వరకు సమయము పడుతుంది. దీని ఆరంభ దశలో రెండు కిడ్నీలు పని చేసే విధానములో ఎక్కువగా హాని కలగకపోవడంతో రోగం లక్షణాలు ఏమీూ కనపడవు. కానీ ఆ తరువాత కిడ్నీ మెల్ల మెల్లగా పాడవుతూ ఉంటే రోగి యొక్క బాధ పెరుగుతూ ఉంటుంది. రోగల లక్షణాలు, కిడ్నీ పని చేస్తున్న విధానము దృష్టిలో పెట్టుకుని ఈ రోగాన్ని మూడు దశలుగా విభజించవచ్చు. ప్రాథమిక, మధ్యమ మరియు అంతిమ.

ప్రాధమిక అవస్తలో కనిపించే లక్షణాలు

క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ మొదటి దశలో కిడ్నీ యొక్క పని చేసే శక్తి 35 నుండి 50 శాతము వరకు తక్కువ అయినప్పడు, రోగికి ఏ విధమైన సమస్యలు గానీ, బాధలు గానీ కనపడవు.

డయాబెటిస్, అధిక రక్త పీడన క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క ముఖ్య కారణాలు

అకస్మాత్తుగా రోగి నిర్గారణ

ఈ దశలో ఇతర వ్యాధుల యొక్క పరీక్షలు గాని మెడికల్ చెక్ ఆప్ గాని చేయించుకున్నప్పుడు చాలా మంది రోగులలో ఈ రోగము యొక్క నిర్ధారణ అకస్మాత్తుగా అనిపిస్తుంది. ఈ సమయములో రక్తములో క్రియాటిన్, యూరియాల పరిమాణము కొంచెం ఎక్కువగా ఉంటుంది. ముఖము వాయడము ముఖ్యంగా ఉదయము పూట కనపడితే అది ఈ రోగానికి యెట్ట మొదటి సూచన.

అధిక రక్తపీడనం

ఎవరైనా 30 సంవత్సరాల వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి అధిక రక్త పీడనము అయి పరీక్ష చేసినప్పడు రక్త పీడనము చాలా ఎక్కువగా (అంటే 220/110) ఉంటే, అది మందులు వాడినప్పటికి అదుపులోకి రాకపోతే దానికి కారణము క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వవచ్చు.

క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ రోగులలో రక్త పీడనం చాలా ఎక్కువగా ఉంటుంది

మాధ్యమిక అవస్తలో కనిపించే లక్షణాలు

కిడ్నీ యొక్క పని చేసే శక్తి 65 నుండి 80 శాతము వరకు తక్కువగా అయినప్పడు రక్తములో క్రియాటిన్, యూరియాల పరిమాణములో క్రమేపి వృద్ధి కనపడుతుంది. ఈ అవస్తలో కూడా కొంత మంది రోగులలో ఏ విధమైన లక్షణాలు కనిపించవు. అయితే చాలా మంది రోగులలో నీరశము, రక్తము తక్కువగా ఉండడము, శరీరములో వాపు కనపడటము, అధిక రక్త పీడనం ఉండటము, రాత్రులు మూత్ర విసర్జన ఎక్కువ సార్లు అవ్వడము వంటి లక్షణాలు కనిపిస్తాయి.

అంతిమ అవస్తలో కనిపించే లక్షణాలు

కిడ్నీ యొక్క పనిచేసే శక్తి 80 శాతము వరకు తగ్గి పోయినప్పడు, అంటే 20 శాతము పని చేయ గలుగుతున్నప్పడు, కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క లక్షణములు ఎక్కువగా అవుతుంటాయి. అయినప్పటికి చాలా మంది రోగులలో మందుల ద్వారా ఉపచారము చేయడము వల్ల ఆరోగ్యము సంతోషదాయకంగా ఉంటుంది. కిడ్నీ యొక్క కార్యక్షమత 85 నుండి 90 శాతము వరకు తగ్గిపోయినప్పడు అంటే 10 నుండి 15 శాతము వరకే పని చెయ్య కలిగినప్పడు దానిని ఎండ్ స్టేజ్ కిడ్నీ ఫెయిల్యూర్ అని అంటారు. కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క ఈ దశలో మంందులు తీసుకున్నప్పటికి δθρ యొక్క సమస్యలు నియంత్రణలోకి రాకపోవచ్చును. డయాలసిస్ లేక కిడ్నీ ట్రాన్స్ప్లాస్ట్ యొక్క అవసరము అవుతుంది.

కిడ్నీ ఎక్కువగా పాడవడముతో శరీరములో రక్తము శుభ్రపరిచే క్రియలో నీరు, ఆమ్లము, లవణములను సంతులనముగా ఉంచడములో స్పష్టత కనపడదు. రోగికి కలగపోయే సమస్యలు ఎక్కువ అవడము మొదలవుతాయి.

భోజనము రుచించకపోవడము, నీరశము, వికారముగా ఉండడము చాలా మంది కిడ్నీ రోగులలో ముఖ్య లక్షణాలు

అంతిమ కిడీ ఫెయిల్యూర్ యొక్క సామాన్యమైన లక్షణాలు

ప్రతి రోగిలో కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క లక్షణాలు, ఆ లక్షణాల గంభీరత రక రకాలుగా ఉంటాయి. ఈ అవస్తలో కనపడే లక్షణాలు ఈ ప్రకారముగా ఉంటూయి.

 • భోజనము రుచించకపోవడము, వాంతులు, ఎక్కిస్ రావడము
 • నీరశంగా ఉండడము, బరువు తగ్గిపోవడము.
 • కొద్దిగా పని చేయగానే అలసిపోవడము, ఆయాసము రావడము
 • రక్తము పాలి పోవడము (ఎనీమియా). కిడ్నీలో తయారు అయ్యే ఎర్రిత్రోపోయెటిన్ అనే హార్మోన్ తక్కువ అవ్వడముతో శరీరములో రక్తము తక్కువగా తయారు అవ్వడము.
 • శరీరము దురద పుట్టడము.
 • జ్ఞాపక శక్తి తగ్గిపోవడము, నిద్రపోవు రీతిలో మార్పులు. మందులు వాడినప్పటికి రక్త పీడనం అదుపులోకి రాకపోవడము.
 • స్త్రీలలో మాసికములలో అనియాత్మ (మెవ్ర్సుయల్ సైకిల్ ఇర్రెగ్యులర్ గా అవడము), పురుషులలో నపుంసకత చోటు చేసుకోవడము
 • కిడ్నీలో తయారు అయ్యే విటమిన్ "డి" తక్కువగా తయారు అవ్వడము వల్ల పిల్లలు ఎత్తుగా ఎదగకపోవడము, వయస్సు మళ్న వారిలో ఎముకలలో నొప్పి పుట్టడము.

అంతిమదశ కిడీ ఫెయిల్యూర్ యొక్క గంభీర లక్షణాలు

కిడ్నీ ఫెయిల్యూర్ కారణాల వల్ల సంభవించే సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికి సరైన చికిత్స చేయకపోతే క్రింద వివరించిన సమస్యలు ఎదురౌతాయి.

 • అత్యధికంగా ఆయాశము రావడము
 • రక్తము వాంతులు చేసుకోవడము
 • రోగికి సగము నిద్రగా ఉండడము, శరీరము బాధాకరంగా ఉండడము, స్పృహ తప్పతూ ఉండటము.
 • రక్తములో పొటాషియము ఎక్కువగా ఉండి గుండెపై ప్రభావము పడటము, దానివల్ల గుండె అకస్మాత్తుగా ఆగిపోవడము.
మందులు తీసుకున్న తరువాత కూడా రక్తము పాలిపోవడము తగ్గకపోతే దానికి కారణం క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వవచ్చు

రోగ నిర్ధారణ

రోగి యొక్క సమస్యలను చూసి లేక రోగికి కిడ్నీ ఫెయిల్యూర్ అయిందేమో అన్న అనుమానము వచ్చినప్పుడు గాని క్రింద వివరించిన పరీక్షల ద్వారా రోగము నిర్ధారణ చెయ్యవచ్చును.

రక్తములో హిమోగ్లోబిన్ పరిమాణము

హిమోగ్లోబిన్ యొక్క పరిమాణము కిడ్నీ రోగులలో తక్కువగా ఉంటుంది.

మూత్ర పరీక్ష

మూత్రము ద్వారా ప్రోటీన్ పోతుంటే, అది క్రానిక్ కిడీకి మొదటి బయానక సూచన. మూత్రము ద్వారా ప్రోటీన్ పోవడము కిడ్నీ ఒకటే గాక మిగిలిన కారణాల వల్ల కూడా అవ్వవచ్చు. అందుచేత మూత్రము ద్వారా ప్రోటీన్ పోతున్నట్లయితే అది తప్పకుండా కిడ్నీ మూలాన్నే అని కూడా అనలేము. మూత్రము యొక్క ఇన్ఫెక్షన్ పరీక్ష కూడా ఈ పరీక్ష కొరకు చేయవచ్చు.

రక్తములో క్రియాటినిన్ మరియు యూరియా పరీక్షలు

క్రానిక్ కిడ్నీ యొక్క నిర్ధారణ, దాని చికిత్స కొరకు ఈ పరీక్ష అన్నింటి కంటే ముఖ్యమైనది. కిడ్నీ ఎక్కువగా పాడవుతూ ఉంటే రక్తములో క్రియాటినిన్,యూరియాల పరిమాణము ఎక్కువ అవుతూ ఉంటుంది. కిడ్నీ రోగులకు నియమిత అవధిలో ఎప్పటికప్పుడు ఈ పరీక్ష చేయిస్తుంటే, కిడ్నీ ఎంత వరకు పాడయింది, చికిత్స వల్ల ఎంత వరకు మెరుగు అయింది అన్న విషయము తెలుస్తుంది.

అధిక రక్త పీడనము ఉండటము, మూత్రము ద్వారా ప్రోటీస్ పోవడము ఈ రోగము యొక్క మొట్ల మొదటి సూచన కావచ్చు

కిడ్నీ యొక్కసోనోగ్రఫి

కిడ్నీ డాక్టరుల మూడవ కన్ను అని చెప్పబడే ఈ పరీక్ష కిడ్నీ ఏ కారణము చేత పాడయింది అని తెలుసుకోవడానికి అతి ముఖ్యమైనది. చాలా వరకు కిడ్నీ రోగులలో కిడ్నీ చిన్నదిగా అవ్వడము. (కుచించుకు పోవడము) అవుతుంది. ఎక్యూట్ కిడ్నీ డయాబెటిస్, ఎమైలోడోసిస్ వంటి రోగాల కారణముగా కిడ్నీ పాడయినప్పడు కిడ్నీ యొక్క ఆకారములో పెరుగుదల కనిపిస్తుంది. కిడ్నీలో రాళ్, మూత్ర మార్గములో అవరోధము, పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధి వంటి కారణాల వల్ల కలిగే కిడ్నీ యొక్క రోగ నిర్ధారణ కూడా సోనోగ్రఫి ద్వారా చెయ్యవచ్చును.

ఇతర పరీక్షలు

క్రానిక్ కిడ్నీ రోగులకు చేసే ఇతర రక్త పరీక్షలలో సీరం, ఎలక్ట్రోలైట్, కాలియము, పాస్ఫరస్, ప్రోటీస్, బి- కార్బోనేట్ వంటివి ఉంటాయి. కిడ్నీ సరిగ్గా పని చేయ్యకపోవడము మూలంగా వచ్చే ఇతర సమస్యల గురించి తెలుసుకోవడానికి ఈ పరీక్షలు ఉపయోగపడతాయి.

సోనోగ్రఫిలో రెండు కిడ్నీలు చిన్నవిగాను కుచించుకుపోయినట్టుగాను ఉంటే, అది క్రానిక్ కిడ్నీ యొక్క సూచన


© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate