অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

క్రానిక్ కిడ్నీ యొక్క చికిత్స

క్రానిక్ కిడ్నీ యొక్క చికిత్స

క్రానిక్ కిడ్నీ యొక్క చికిత్స

క్రానిక్ కిడ్నీయొక్కచికిత్స ముఖ్యముగా మూడు రకాలు:

  1. మందులు మరియు ఆహార నియంత్రణ
  2. డయాలసిస్
  3. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్

క్రానిక్ కిడ్నీ డిసీస్ (సి.కె.డి) ప్రారంభ దశలో అంటే కిడ్నీ బాగా పాడవకుండా ఉన్నప్పడు, రోగ నిర్ధారణ అయిన తరువాత మందుల ద్వారా, ఆహార నియంత్రణ ద్వారా ఉపచారము చేయబడుతుంది.

రెండు కిడ్నీలు ఎక్కువగా పాడవటముతో కిడ్నీ పని చేయగలిగే శక్తి చాలా క్లిష్టమైన స్థితికి దిగజారిపోతే అప్పుడు డయాలసిస్ చేయవలసిన అవసరము వుంటుంది. ఆ రోగులలో కొంత మంది కిడ్నీ ట్రాన్స్ప్లాంస్ట్ లాంటి విశిష్టమైన చికిత్స చేయించుకుంటారు.

మందులు, ఆహార నియంత్రణ ద్వారా ఉపచారము

క్రానిక్ కిడ్నీ రోగులకు మందులు, ఆహార నియంత్రణ ద్వారా చికిత్స ఎందుకు మహత్వపూర్వమైనది?

కిడ్నీ ఎక్కువగా పాడవ్వటము మూలంగా చికిత్సకు అవసరమైన డయాలసిస్, కిడ్నీ ట్రాన్స్ప్లాట్ చేయడానికి అయ్యే ఖర్చు అత్యధికముగా ఉంటుంది, అంతే గాక అవి అన్ని చోట్ల అందుబాటులో ఉండవు. పైగా రోగికి సంపూర్ణముగా ఆరోగ్యవంతుడు అవుతాడని బరోసా కూడా ఉండడు. క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ ఆరంభములో మందుల ద్వారాను, ఆహార నియంత్రణ ద్వారాను తక్కువ ఖర్చులో అన్ని ప్రదేశాలలోను సులభముగా చికిత్స అవుతుంది. అందువలన మనము మందుల ద్వారా, ఆహార నియంత్రణ ద్వారా కిడ్నీ పాడవ్వకుండా ఎందుకు రక్షించుకోకూడదు?

రెండు కిడ్నీలు పాడైన (ఖరాబు) ఉండవచ్చును. అయిన తరువాత కూడా సరైన ఉపచారముతో చాలా కాలము ఆరోగ్యవంతముగ ఉండొచ్చును.

క్రానిక్కిడ్నీరోగులు చాలామంది మందులు, ఆహార నియంత్రణద్వారా, చికిత్స వల్ల లాభాన్ని పొందడములో ఎందుకు అసఫలము అవుతారు?

క్రానిక్ కిడ్నీలో ఆరంభము నుండి సరి అయిన చికిత్స తీసుకుంటే, కిడ్నీ పాడవ్వకుండా రక్షించుకోవచ్చు. కాని ఈ రోగము యొక్క లక్షణములు ప్రారంభ దశలో తక్కువగా కనిపించడం మూలంగా రోగి తన యొక్క దిన చర్యలను చాలా సులభముగా చేయగలుగుతాడు. అందుచేత డాక్టర్ ద్వారా లభించే విస్తృత వివరాలు, సలహాలు తీసుకున్నప్పటికీ రోగము యొక్క గంభీరతను, సరైన సమయములో తీసుకున్న చికిత్స వల్ల లాభములను కొంత మంది రోగులు, వారి యొక్క కుటుంబ సబ్య్ లు అర్థము చేసుకోరు.

చాలా మంది రోగులలో చికిత్సకు సంబంధించిన అజ్ఞానము, నిర్లక్ష్యత కనిపిస్తూ వుంటాయి. అనియమితముగాను, యోగ్యము కానిది, అసంపూర్ణమైనది వంటి చికిత్సల వల్ల కిడ్నీ చాలా త్వరగా పాడవ్వటము, చాలా తక్కువ సమయములోనే ఆరోగ్యము క్షీణించడంతో డయాలసిస్, కిడ్నీ ట్రాన్స్ప్లాన్డ్ వంటి ఖరీదైన చికిత్సలు అవసరమవుతాయి. చికిత్సలో నిర్లక్ష్యము వల్ల, ఆలస్యము చేయటం వల్ల చాలా మంది రోగుల ప్రాణానికి కూడా ముప్ప తెచ్చుకోవడము జరుగుతుంది.

మందులద్వారా, ఆహార నియంత్రణద్వారా చికిత్స చేయడములో ఉద్దేశ్యము పమిటి?

క్రానిక్ కిడ్నీలో మందులు, ఆహార నియంత్రణ ద్వారా చేయబడే ఉపచారము యొక్క ಮಿ೩ು ఉద్దేశ్యము ఈ విధముగా ఉంటుంది.

  1. ఈ రోగము మూలంగా రోగికి కలిగే సమస్యల నుండి రోగికి ముక్తిని కలిగించడము.
  2. కిడ్నీకి ఇప్పడున్న పని చేసే శక్తిని కాపాడుకుంటూ కిడ్నీ పాడవ్వకుండా రక్షించుకోవడము అంటే కిడ్నీ తీవ్రంగ పాడవ్వకుండ రక్షించుకోవడము.
  3. సరైన ఉపచారము ద్వారా ఆరోగ్యాన్ని సంతోష పూర్వకముగా ఉంచడము, డయాలసిస్, కిడ్నీ ట్రాన్స్ప్లాస్ట్ వీలయినంతవరకు ఆపడానికి ప్రయత్నము చేయడము.
క్రానిక్ కిడ్ని రోగులకు ఆరంభ దశ సుకునె ఉపచారము చాలా లాభదాయకముగా ఉంటుంది

క్రానిక్ కిడ్నీ యొక్క ఉపచారము మందుల ద్వారా, ఆహార నియంత్రణ ద్వారా ఏ విధముగా చేస్తారు

క్రానిక్ కిడ్నీకి మందుల ద్వారా చేయబడే చికిత్స ఈ క్రింద వివరించిన విధంగా ఉంటుంది.

క్రానిక్కిడ్నీకారణాలకు చికిత్స

  • డయాబెటిస్ మరియు అధిక రక్త పీడనంలకు సరైన చికిత్స
  • మూత్రములోని ఇన్ఫెక్షన్కు అవసరమైన చికిత్స
  • రాళ్ళను నిర్మూలించడానికి అవసరమైన ఆపరేషన్ గాని లేక దూరదర్శిని ద్వారా చికిత్స.

కిడ్నీపనిచేసే శక్తిని కాపాడుకోడానికి ఉపచారము

  • అధిక రక్త పీడనంను నియంత్రణలో ఉంచడము
  • శరీరములో నీరు యొక్క పరిమాణము తగు పాళల్లో ఉంచడము
  • శరీరములో పెరిగి ఉన్న ఆమ్ల పాదధ్రముల పరిమాణము (అసిడోసిస్) యొక్క చికిత్సకు సోడియము బై కార్బోనెట్ ఉపయోగించడము.

త్రానిక్కిడ్నీవల్ల ఉత్పన్నమైన లక్షణాలకు ఉపచారము

  • అధిక రక్త పీడనాన్ని నియంత్రనలో ఉంచడము
  • శరీరములో వాపు తగ్గడానికి మూత్రము ఎక్కువగా అవ్వడానికి మందులు (డైయురిటిక్స్) వాడడము.
  • వాంతులు, వికారము, అసిడిటి వంటి వాటికి సరైన మందుల ద్వారా ఉపచారము.
  • ఎముకల పటిష్టతకు కాల్చియము మరియు విటమిన్ "డి" ద్వారా ఉపచారము చేయడము.
  • రక్తము పాలి పోయే సమస్యను అరికట్టడానికి విటమిన్ల మందులు, ఎరిత్రోపోయిటిన్ యొక్క ఇంజెక్షన్ ద్వారా ఉపచారము.
ఈ రోగాన్ని ఆపడానికి కిడ్నీ పాడవ్వడానికి గల కారణాలకు ఉపచారము చేయడము అతి ముఖ్యము

కిడీకి సంభవించే ఏవిధమైన అపాయములనైనా ఆపడము

కిడ్నీకి అపాయము కలిగించే మందులు అనేక రకాలైన యాంటి బయాటిక్స్, నొప్పిని నివారించే మందులు, ఆయుర్వేదిక్ భస్మాలు వంటివి ఉపయోగించరాదు.

కిడ్నీకి అపాయము కలిగించే ఇతర రోగాలకు (విరోచనాలు, వాంతులు, మలేరియా, సెప్టిసెమియా వంటి రోగాలు) వెంటనే చికిత్స చెయ్యాలి.

కిడ్నీకి నేరుగా నష్టాన్ని కలిగించే రాళ్, మూత్ర మార్గములో ఇన్ఫెక్షన్ వంటి రోగాలకు త్వరగా చికిత్స చెయ్యడము.

పొగ తాగకూడదు, తమలపాకు, గుట్కా సారా వంటివి సేవించకూడదు.

క్రానిక్కిడ్నీఫెయిల్యూర్ వల్లభవిష్యత్తులో తీసుకునేచికిత్సలకు తయారుగా ఉండటము

  • రోగ నిర్ధారణ తరువాత, ఎడమ చేతి నరములకు (వెయిన్స్) కష్టమేమి కలగకుండా వాటిని కాపాడడానికి రక్త పరీక్షల కొరకు ఆ నరముల నుండి రక్తము తీయకూడదు, ఏ విధమైన ఇంజెక్షన్లు తీసుకోరాదు గ్లుకోస్ బోటిల్ కూడా ఆ చేతికి తగిలించరాదు.
  • కిడ్నీ బాగా పాడైన పక్షములో ఎడమ చేతి యొక్క దమని సిరాక జోడించి ఎ.వి ఫిస్టులా (అర్తెరియొ వేయిన్ ఫిస్టులా) తయారు చేయవలసి ఉంటుంది.
  • అది చాలా కాలము వరకూ హిమోడయాలసిస్ చేయడానికి అవసరము అవుతుంది. హెపటైటిస్ "బి" వాక్సిన్ ఇంజెక్షన్ యొక్క కోర్స్ వీలైనంత త్వరలో తీసుకుంటే డయాలసిస్ లేక కిడ్నీ ట్రాన్స్ప్లాస్ట్ జరుగుతున్న సమయములో హెపటైటిస్ "బి" వల్ల హాని జరగకుండా చూసుకోవచ్చు
శరీరములో గాని మూత్రములో గాని ఇన్ఫెక్షన్ వైంటనే పూర్తిగా చికిత్స చేస్తే కిడ్నీ పాడవకుండా రక్షించుకోవడములో మహత్వపూర్వమైన పాత్ర ఉంటుంది

ఆహార నియంత్రణ

ఉప్ప (సోడియము) : అధిక రక్త పీడనంను నియంత్రణలో ఉంచడానికి, శరీరములో వాపు తక్కువగా ఉండేలా చేయడానికి ఉప్ప తక్కువగా తినాలి. ఇటువంటి రోగుల ఆహారములో ప్రతి రోజు 3 గ్రాముల కంటే ఉప్ప ఎక్కువ తినకూడదు. ఎక్కువగా ఉప్పు ఉండే తిండి పదార్థాలు అంటే అప్పడాలు, పచ్చళీస్, అమ్చూర్, వేఫర్స్ లాంటివి తినకూడదు.

తాగే నీటి పరిమాణము : మూత్రము తక్కువగా అవడముతో శరీరములో వాపు ఉండటము, శ్వాస తీసుకోవడము కష్టముగా ఉండటము జరుగుతుంది. అలా శరీరములో వాపు ఉంటే నీరు, ఇతర ద్రవ పదార్థాలు తక్కువగా తీసుకోవాలి. దానివల్ల వాపును తగ్గించగలుగతాము. ఎక్కువ వాపుగా ఉన్నప్పుడు దానిని తగ్గించడానికి 24 గంటలలో అయ్యే మూత్రము కంటే తక్కువ పరిమాణములో నీళస్, ఇతర ద్రవ పదార్థాలు తీసుకోవడానికి సలహా ఇవ్వబడుతుంది.

పోటాషియము : కిడ్నీ రోగ బాధితులకు ఎక్కువగా పోటాషియము ఉండే ఆహార పదార్థాలు అంటే పళస్, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి బొండాము నీళస్ లాంటివి తక్కువగా తీసుకోమని గాని, లేక పూర్తిగా మానేయమని గాని సలహా ఇవ్వబడుతుంది. పోటాషియము యొక్క పరిమాణము ఎక్కువ అయితే గుండె పై ప్రాణ సంకటమవ్వగలిగే గంభీర ప్రభావము పడుతుంది.

ప్రోటీన్ : కిడ్నీ రోగులకు ఎక్కువగా ప్రోటీన్ ఉండే ఆహార పదార్థాలను తీసుకోవద్దని సలహా ఇవ్వబడుతుంది. శాకాహారము తినే రోగులకు ఆహారము విషయములో పెద్దగా మార్పులు చేయవలసిన అవసరము లేదు.

నియమిత ప్రకారము ప్రోటీన్లు ఉండే ఆహార పదార్థాలు అంటే పప్పులు తక్కువగా తీసుకోమని సలహా ఇవ్వబడుతుంది.

కానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ ఆహార పానీయాల నియంత్రణ వల్ల కిడ్నీ ఖరాబు అవ్వకుండా రక్షించవచ్చు

క్యాలరీ : శరీరానికి తగు పాలల్లో కావలసిన క్యాలరీలు (35 కిలో కేలరీ/కెజీ) శరీర పోషనకు, ప్రోటీన్లకు అనవసరముగా ఖర్చు పెట్టకుండా ఉండడానికి కావాలి.

ఫాస్పరన్ : ఫాస్పరస్ ఉండే ఆహార పదార్థాలు కిడ్నీ రోగులకు తక్కువగా తీసుకోవాలి.

కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు ఆహార విషయాలకు సంబంధించిన సూచనలు విస్తృతముగా 27వ అధ్యాయములో ఇవ్వబడినవి.

క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు మందుల ద్వారా చేసే చికిత్సలో అన్నింటికంటే మహత్వపూర్ణమైన చికిత్స ఏమిటి?

ఈ రోగము యొక్క చికిత్సలో అధిక రక్త పీడనంను ఎల్లప్పడు నియంత్రణలో ఉంచటము అన్నిటికంటే మహత్వపూర్ణమైన చికిత్స, కిడ్నీ ఫెయిల్యూర్ రోగులలో ఎక్కువ మందికి రక్త పీడనము ఎక్కువగా ఉండటము కనిపిస్తుంది. దానివల్ల అప్పటికే వ్యాధివలన బలహీనముగా ఉన్న కిడీకి మరింత భారము వేసి దానికి మరింత నష్టాన్ని కలిగింప చేస్తుంది.

రక్త పీడనంను అరికట్టడానికి ఈ మందు ఎక్కువగా ఉపయోగపడుతుంది?

అధిక రక్త పీడనంను నియంత్రణలో ఉంచడానికి మందుల ద్వారా చికిత్స కిడ్నీ రోగ నిపుణులైన నెప్రోలజిస్ట్ లేక ఫిజిషియన్ చేస్తారు, ఆ వైద్యులు ఇచ్చే మందుల ద్వారానే చికిత్స చేయబడుతుంది. రక్త పీడనంను అరికట్టడానికి కాల్చియము ఛానల్ బ్లాకర్స్, బీటా బ్లాకర్స్, డైయురిటిక్స్, వంటి మందులను ఉపయోగిస్తారు.

కిడ్నీ సురక్షణకు రక్త పీడనంను నియంత్రణలో ఉంచడమే అన్నింటికంటే మహత్వపూర్ణమైన ఉపచారము



కిడ్నీ ఫెయిల్యూరి ఆరంభ దశలో ఎ.సి.ఇ లేక ఎ.ఆర్.బి వంటి మందులను విశేషముగా ఇస్తూ ఉంటారు. ఈ మందులు రక్త పీడనాన్ని తక్కువగా ఉంచడమే కాక అనారోగ్యముగా ఉన్న కిడ్నీని త్వరగా పాడవ్వకుండా ఆ థాతిని తగ్గించడములో లాభదాయకమైన పని చేస్తుంది.

క్రానిక్ కిడ్నీఫెయిల్యూర్ రోగులలో రక్తపీడనం ఎంత వరకు ఉండవచ్చు?

కిడ్నీని ఎక్కువ పాడవ్వకుండా రక్షించడానికి రక్తము యొక్క పీడనం ఎప్పడూ 140/84 కంటే తక్కువగా ఉండాలి.


రక్తపీడనం హద్దులలోనేఉంది అని ఎలా తెలుస్తుంది? దేనికి ఎటువంటి పద్దతి ఉత్తమమైనది?
నియమిత కాలములో డాక్టర్ వద్దకు  వెళ్ రక్త పీడనము కొలిపించుకుని రక్త పీడనం సరిగ్గా ఉందా లేదా అని తెలుకోవచ్చు. కిడ్నీ సురక్షణకు బ్లడ్ ప్రెషర్ ఎల్లప్పుడు నియంత్రణలో ఉంచడం చాలా అవసరము. డయాబెటిస్ రోగి స్వయంగా గూకో మిటిర్స్తో రక్తములో గూకోస్ పరిమాణముఏలా కొలుచుకుంటారో  అలాగే కుటుంబములోని సభ్యులు బ్లడ్ ప్రెషర్ కోలవడము నేర్చుకుంటే అది చాలా శ్రేష్టమైన ఉపాయము.  ప్రతిరోజూ బ్లడ్ ప్రెషర్ కొలిచి డైరీలో రాసుకుని డాక్టర్కి చూపిస్తే డాక్టర్ మందులలో అవసరమెన మార్పులు చెయ్యడానికి ఆస్కారము ఉంటుంది.


కిడ్నీ ఫెయిల్యూర్లో ఉపయోగపడే డయురిటిక్స్ మందులు ఏమిటి?

కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల మూత్రము తక్కువగా అవడముతో శరీరములో వాపు, శ్వాస తీసుకోవడములో సమస్యలు అవ్వవచ్చు. డయురిటిక్స్ అనే పేరుతో గుర్తింపబడే మందులు మూత్రము యొక్క పరిమాణమును పెంచి శరీరములో వాపు నుంచి, శ్వాస తీసుకోవడములో ఉండే సమస్య నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ మందులు మూత్రమును పెంచడానికి ఉపయోగపడుతుంది గాని కిడ్నీ పని చేయడాన్ని మెరుగు పరచడానికి ఏ మాత్రము ఉపయోగపడదు.

కిడ్నీ ఫెయిల్యూర్లో రక్తము పాలిపోయినప్పడు తీసుకోవలసిన చికిత్స ఏమిటి?

దీని కోసము అవసరమైన ఐరన్ మరియు విటమిన్తో కూడిన మందులు ఇస్తారు. కిడ్నీ ఎక్కువగా పాడయినప్పడు ఈ మందులు ఇచ్చినప్పటికీ హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడము సంభవిస్తుంది. అటువంటి రోగులకు ఎరిత్రోపో ఇటిన్ ఇంజెక్షన్ ఇవ్వబడుతుంది. ఈ ఇంస్టెక్షన్ యొక్క ప్రభావము వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఈ ఇంజెక్షన్ సురక్షితముగా, దాని ప్రభావము ఉండేలా సరలమైన పద్ధతిలో ఇవ్వవచ్చు. కానీ ఎక్కువ ఖరీదైనది అవ్వడము కారణముగా రోగులందరు ఈ ఇంజెక్షన్ కొరకు ఖర్చు పెట్టలేరు. ఇటువంటి రోగులకు రక్త దానము తీసుకోవడము తక్కువ ఖర్చుతో కూడిన పని, కాని ఈ చికిత్సలో ఎక్కువ అపాయము ఉంటుంది.

రక్తము పాలిపోతే చికిత్స ఎందుకు అవసరము?

రక్తములోని హిమోగ్లోబిన్ ఊపిరి తిత్తుల నుండి ఆక్సిజన్ను తీసుకుని పూర్తి శరీరానికి అందజేయడములో ఒక మహత్వపూర్ణమైన పని చేస్తుంది. రక్తము పాలిపోవడము వల్ల తెలిసేది ఏమిటంటే రక్తములో హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని. దీనివల్ల రోగికి నీరశముగా ఉంటుంది మరియు త్వరగా అలసిపోతుంటాడు. కొంత పని చేసిన పిమ్మట రోగికి ఆయాసము రావడము, చాతిలో నొప్పి పుట్టడము జరుగుతుంది. శరీరములో రోగాలను ఎదుర్కొనే శక్తి తగ్గిపోతుంది. అంతేగాక అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

అందుచేత కిడ్నీ ఫెయిల్యూర్ రోగులు ఆరోగ్యముగా ఉండాలంటే రక్తములో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండే సమస్యకు ఉపచారము చేయించుకోవడము అవసరము. రక్తము తక్కువగా ఉండడము వల్ల దాని చెడు ప్రభావము గుండె పని చేసే తీరు మీద కూడా పడుతుంది. దీనివల్ల హిమోగ్లోబిన్ పెంచడము అత్యవసరమైన విషయము.

నెప్రోలజిస్ట్ ద్వారా రోగికి నియమిత సమయములో పరీక్షలు చేయించడము, ఉపచారము చేయించుకోవడము

  • కిడ్నీకి జరగబోయే నష్టము నుండి రక్షించుకోవడానికి రోగి నియమిత సమయంలో నెప్రోలజిస్ట్ని కలసి సలహా తీసుకోవడము, పరీక్షలు చేయించుకోవడము అత్యంత అవసరము.
  • నెప్రోలజిస్ట్ రోగి యొక్క సమస్యలను, కిడ్నీ యొక్క కార్య క్షమతను దృష్టిలో పెట్టుకుని అవసరమైన ఉపచారమును నిర్ణయిస్తారు.

క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్లో ఆరోగ్యాన్ని సరిగ్గా ఉంచడానికి రక్తములో హిమోగ్లోబిన్ పరిమాణమును నియంత్రణలో ఉంచడము చాలా మహత్వపూర్ణమైన విషయము



© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate