অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కిడ్నీ రోగముల ఉపచారము

కిడ్నీ రోగముల ఉపచారము

పరిచయం

కిడ్నీ రోగాలలో చాలా వరకు నివారణలేని రోగాలు. అటువంటి రోగములు మితి మీరిన స్థితికి వచ్చిన తరువాత వాటికి చికిత్స చాలా ఖరీదయినదే కాక, చాలా క్లిష్టమైనదిగానూ, అసురక్షితమైనదిగాను ఉంటుంది. దురదృష్టవశాత్తు కిడ్నీకి సంబంధించిన అనేక రోగాలు, ప్రారంభ దశలో లక్షణములు అతి తక్కువగా కనిపిస్తాయి. అందుచేత ఎప్పుడైతే కిడ్నీ రోగమున్నదని అనుమానము వస్తుందో, అప్పుడు వెంటనే డాక్టర్ని కలిసి నివారణ ఉపచారము ప్రారంభించవలెను.

కిడ్నీ పరీక్షఎలా చేయించాలి? కిడ్నీబాధ ఎప్పుడు అధికమవుతుంది

  1. ఒక వ్యక్తిలో కిడ్నీ యొక్క రోగలక్షణాలు కనిపించినప్పుడు.
  2. ఎవరికైతే డయాబెటిస్ రోగము ఉంటుందో అటువంటి వ్యక్తికి
  3. రక్త పీడనము నియమిత స్థితి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు
  4. కుటుంబములో వంశ పారంపర్యంగా కిడ్నీ రోగము ఉన్నప్పుడు.
  5. చాలా కాలము వరకు నొప్పిని అరికట్టే మాత్రలు వేసుకున్నప్పుడు
  6. పుట్టినప్పటి నుండి మూత్రమార్గము చెడిపోయి ఉన్నప్పుడు.

కిడ్నీరోగచికిత్సకొరకు చేయించవలసిన అవసరమైన పరీక్షలు ఈవిధముగా ఉంటాయి.

మూత్ర పరీక్ష

  • కిడ్నీ రోగ చికిత్సకు మూత్ర పరీక్ష అత్యవసరమైనది.
  • మూత్రములో చీము ఉన్న యెడల అది మూత్రమార్గములో ఇన్ఫెక్షన్ (సంక్రమణ) కి లక్షణము
  • మూత్రములో ప్రోటీన్లు రక్తకణాలు ఉండడము కిడ్నీ వాచి ఉండటానికి (గ్లోమెరూలోనెఫ్రిటిస్) సంకేతాన్ని ఇస్తుంది.
  • కిడ్నీ యొక్క అనేక రోగాలలో మూత్రములో ప్రోటీన్లు పోతూ ఉంటాయి కానీ మూత్రములో ప్రోటీన్లు పోవడము కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి గంభీరమైన రోగానికి సర్వప్రదమ లక్షణము అవ్వవచ్చు. డయాబెటిస్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ మొదలవడానికి మొదటి సంకేతము మూత్రములో ప్రోటీన్ కనబడటము.

మొక్రోలు మినురియు

  • డయాబెటిస్ ద్వారా కిడ్నీ పై చెడు పరిణామాలు కనపడినప్పుడు ప మూత్రము యొక్క ఈ పరీక్ష సరైన పద్దతిలో చికిత్స చేయడానికి అత్యవసరమైనది.

మూత్రము యొక్క మిగిలిన పరీక్షలు ఈ విధముగా ఉంటాయి :

  1. మూత్రములో టిబి యొక్క బ్యాక్టీరియా పరీక్ష (మూత్ర మార్గము యొక్క టిబికు సంబంధించిన పరీక్ష ఇది).
  2. 24 గంటలలో మూత్రములో ప్రోటీన్ యొక్క పరిమాణము (కిడ్నీ యొక్క వాపు దాని యొక్క ఉపచారము కొరకు).
  3. మూత్రము యొక్క కల్చర్ మరియు సెన్సిటివిటి గురించి పరీక్ష (మూత్రములో ఇన్ఫెక్షన్కి కారణమైన బ్యాక్టిరియాను నివారించటానికి చికిత్స వాటిపై పని చేసే మందుల గురించి తెలుసుకోవడానికి).

మూత్ర పరీక్షల వల్ల కిడ్నీ యొక్క విభిన్న రోగాల గురించి అనేక విషయాలు తెలుస్తాయి. కానీ మూత్ర పరీక్షల రిపోర్టు సామాన్యముగా ఉన్నంత మాత్రమున కిడ్నీలో ఏ విధమైన రోగము లేదని నిర్ణయించలేము.

రక్తపరీక్ష:

రక్తములో హిమోగ్లోబిన్ పరిమాణము : రక్తములో హిమోగ్లోబిన్ పరిమాణము తక్కువగా ఉన్నప్పుడు ఆ స్థితిని ఎనీమియా అంటారు. ఇటువంటి స్థితి ఉన్నప్పుడు అది కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క ముఖ్యమైన సూచిక ఈ రక్తలోపము అనేకమైన ఇతర రోగాలలో కూడా ఉండవచ్చు. అందుచేత ఈ పరీక్ష వల్ల కిడ్నీ రోగమేనని నిర్ధారణ చేయలేము.

రక్త పరీక్ష వల్ల కిడ్నీ పని చేసే శక్తి, క్రియాటినిన్ మరియు యూరియా గురించి అంచనా తెలుస్తుంది. 10

రక్తములో క్రియాటినిన్ మరియు యూరియా యొక్క పరిమాణము :

ఏఏ పరీక్ష వల్ల కిడ్నీ పని చేసే శక్తి గురించి అంచనా తెలుస్తుంది. క్రియాటినిన్ మరియు యూరియా శరీరములోని అనవసరమైన చెత్త పదార్థాలు. ఈ పదార్థాలు కిడ్నీ ద్వారా శరీరము నుండి విసర్జించబడతాయి. సామాన్యంగా రక్తములో క్రియాటిన్ 0.6 నుండి 1.4 మిల్లీగ్రాము లోపున, యూరియా 20 నుండి 40 మిల్లీ గ్రాములోపున ఉంటుంది. రెండు కిడ్నీలు పాడైన సందర్భములో ఈ రెండింటి పరిమాణము ఎక్కువ అవ్వడము జరుగుతుంది. ఈ పరీక్ష కిడ్నీ ఫెయిల్యూర్ నిర్ధారణకు, చికిత్సకు అత్యంత ముఖ్యమైనది.

రేడియోలజి పరీక్ష

కిడ్నీ సోనోగ్రఫి : ఇది సరలమైన సురక్షితమైన మరియు శీఘ్రమైన పరీక్ష దీనివల్ల కిడ్నీ యొక్క ఆకారము, నిర్మాణము, కిడ్నీ యొక్క స్థానము, మూత్ర మార్గములో అవరోధములు, కిడ్నీ రాళస్, గాంట్ (మీనింగ్) వంటి అత్యవసరమైన విషయాలు తెలుస్తాయి. ముఖ్యముగా క్రోనిక్ కిడ్నీ ఫెయిల్యూర్ రోగులు సోనోగ్రఫిలో రెండు కిడ్నీలు సంకుచితమై పోవడముగా కనిపిస్తాయి.

కడుపు యొక్క ఎక్స్రే ఏఏ పరీక్ష ముఖ్యంగా కిడ్నీ రాళస్ ఉపచారము కొరకు చేయబడుతుంది.

ఇంట్రావీనస్ ఫైలోగ్రఫి:

ఈ పరీక్షలో రోగికి ఒక ప్రముఖమైన అయోడిన్ కలిగిన మందు (రేడియో కాన్రాస్టు పదార్ధము) ఇన్టెక్షన్ ద్వారా ఇస్తారు. ఇన్టెక్షన్ ఇచ్చిన కొద్ది సమయము తరువాత కడుపు యొక్క ఎక్స్రేలు తియ్యబడును. కడుపులో ఈ మందు కిడ్నీ ద్వారా వెలుతూ మూత్ర మార్గము ద్వారా మూత్రాశయములోకి వెళ్ళడము కనిపిస్తుంది.

ఐ.వి.పి. కిడ్నీ పనిచేసే శక్తి గురించి, మూత్ర మార్గము యొక్క నిర్మాణము గురించి ಮಿಖ್ಯ విషయాలు తెలుపుతుంది. ఈ పరీక్ష ముఖ్యంగా కిడ్నీలో రాట్రీస్, మూత్రమార్గములో అవరోధాలు, గాంట్ (మీనింగ్) లాంటి వ్యాధుల చికిత్సలో ఉపయోగపడుతుంది. కిడ్నీ అప్పటికీ పాడయిపోయి తక్కువగా పని చేస్తుందన్న సందర్భములో ఈ పరీక్ష ఉపయోగపడదు.

రేడియో కాన్హాస్టు ఇంజెక్షన్ పాడయిపోయిన కిడ్నీకి మరింత హానికలగవచ్చు. అందుచేత కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు ఈ పరీక్ష వల్ల హాని కలగవచ్చు.

మరికొన్నిరేడియోలాజికల్ పరీక్షలు

కొంత మంది రోగుల చికిత్స కొరకు కిడ్నీ డోప్లర్, మిక్స్ రేటింగ్, సోనోగ్రామ్, రేడియో న్యూక్లియర్ స్టడి, రెనాల్ యాంజియోగ్రఫి సిటి స్మాన్, యాంటీగ్రేడ్ మరియు రెట్రోగ్రేడ్ ఫిలోగ్రఫి వంటి విశేషమైన పరీక్షలు చేయబడుతుంటాయి.

కిడ్నీ యొక్క సోనోగ్రఫి పరీక్ష కిడ్నీ రోగ వైద్యులకు మూడవ కన్ను లాంటీది

మరికొన్నివిశేష పరీక్షలు

కిడ్నీ యొక్క బయోప్సి, టెలిస్కోప్ (ధూరవాహిని)తో మూత్రమార్గము యొక్క పరీక్ష మరియు యురోడైనమిక్స్ వంటి విశేషమైన పరీక్షలు కిడ్నీ రోగుల చికిత్సలకు ఎంతో అవసరము. మూత్ర పరీక్ష అనేది మూత్ర పిండ రోగ నిర్ధానణకు అత్యంత

మూత్ర పరీక్ష అనేది మూత్ర పిండ రోగ నిర్ధానణకు అత్యంత సమర్ధవంతమైన పరీక్షగా వుంటుంది

కిడ్నీ బయోప్సి

కిడ్నీ బయోప్సి రోగికి మత్తు ఇవ్వకుండానే ఒక సూది సహాయంతో నొప్పి లేకుండ జరిపే ఒక విధమైన పరీక్ష

కిడ్నీ బయోప్సి అంటే ఏమిటి

కిడ్నీ యొక్క అనేక రకమైన రోగాలకు మూలకారణాలు తెలుసుకోవటానికి సూది సహాయంతో కిడ్నీ నుంచి ఒక సన్నటి దారము లాంటి ముక్కని తీసి దాని యొక్క విశేషమైన హిస్టోపాతలోజికల్ పరీక్షలు జరుపుతారు. ఈ పరీక్షనే కిడ్నీ బయోప్సి అంటారు.

కిడ్నీ బయోప్సి ఎప్పుడు అవసరము అవుతుంది

మూత్రములో ప్రోటీన్ పోతూ వుండటము, కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వటము, వంటి కిడ్నీ రోగులకు మిగిలిన పరీక్షలు అన్నీ జరిపినప్పటికీ చికిత్స సరిగ్గా కుదరనప్పుడు అటుంటి రోగులకు కిడ్నీ బయోప్సి చేయవలసిన అవసరము కలుగుతుంది.

కిడ్నీ బయోప్సి పరీక్షవల్ల లాభము ఏమిటి

పరీక్ష ద్వారా కిడ్నీ రోగుల రోగానికి నిశ్చయమైన కారణాలు తెలుసుకుని వారికి సరైన ఉపచారము చేయగలుగుతాము. పరీక్ష వల్ల ఎటువంటి చికిత్స చేయవలనో, అటువంటి చికిత్స ఏ మాత్రము ఉపయోగపడుతుంది, భవిష్యత్తులో కిడ్నీ పాడవడానికి ఎంత వరకు ఆస్కారము ఉన్నది, ఇలాంటి ప్రశ్నలకు విశేషమైన సమాధానాలు లభిస్తాయి.

కిడ్నీ బయోప్సి ఏ విధమైన పరీక్ష

  • కిడ్నీ బయోప్సి పరీక్ష చేయడానికి రోగిని ఆసుపత్రిలో అడ్మిట్ చేయాలి.
  • ఈ పరీక్ష సురక్షితముగా చేయడానికి రక్తపోటు సామాన్యముగా ఉండేలా చూసుకోవాలి.
  • రక్తాన్ని పలచబరిచే యాస్త్రిన్ వంటి మందులు బయోప్సి పరీక్షకు రెండు వారాలు ముందుగానే తీసుకోవడము ఆపివేయాలి.
  • ఈ పరీక్ష రోగికి మత్తు ఇవ్వకుండానే చేయగలుగుతారు. కానీ చిన్న పిల్లకు మాత్రము మత్తు మందు ఇచ్చి ఈ పరీక్ష చేస్తారు.
  • బయోప్సి పరీక్ష చేస్తున్నప్పుడు రోగిని బోర్గా పడుకోపెట్టి పొట్ట కింద తలగడ ఉంచుతారు.
  • బయోప్సి చేయడానికి సోనోగ్రఫి సహాయముతో పొట్టపై (వీపుపై) ఒక నిశ్చిత స్థానమును కేంద్రీకరిస్తారు. పొట్ట కింద భాగంలో బొడ్డు కింద ఎముకల దగ్గరలో బయోప్సి కొరకు అనువైన స్థలము ఉంటుంది.
  • ఇలా ఎంచుకున్న ప్రదేశమును మందుతో శుభ్రము చేసి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆ శరీర భాగాన్ని నొప్పి లేకుండా చేస్తారు.
  • ఒక ప్రత్యేకమైన సూది (బయోప్సి నీడిల్) సహాయముతో కిడ్నీ లోపల నుండి దారము లాంటి 2 లేక 3 ముక్కలను తీసి వాటిని హిస్టోపేతలోజి పరీక్షకి పేతోలజిఫ్ట్ దగ్గరకు పంపుతారు.
  • బయోప్సి చేసిన ಹಿಮ್ಮಿಬ రోగి మంచము మీద విశ్రాంతి తీసుకోవలెను. సామాన్యముగా రోగిని రెండవ రోజు ఇంటికి వెళ్ళటానికి అనుమతి ఇవ్వబడుతుంది.
  • కిడ్నీ బయోప్సి చేసిన పిమ్మట రోగికి 24 వారాల పాటు శ్రమతో కూడిన పనులు ఏమీ చేయటానికి కుదరదు. ముఖ్యముగా బరువైన వస్తువులు ఎత్తటానికి అనుమతి ఇవ్వబడదు
మూత్ర పిండం పనితీరు తెలుసుకోవటానికి క్రియాటినిన్, యూరియా పరీక్ష అవసరం

ఆధారం : కిడ్నీ ఎడ్యుకేషన్

చివరిసారిగా మార్పు చేయబడిన : 4/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate