অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కిడ్నీ రోగములు

కిడ్నీ రోగములను ముఖ్యముగా రెండు భాగాలుగా విభజించవచ్చును:

  • మెడికల్ రోగములు (మందులతో నయము చేయు రోగములు) :ఇటువంటి రోగముల చికిత్స నెప్రోలజిస్ట్ మందులు (ఔషదముల) ద్వారా చేస్తున్నారు. కిడ్నీ ఫెయిల్యూర్తో బాధ పడుతూ గంభీరమైన అవస్తలో ఉన్న రోగులకు డయాలసిస్ మరియు కిడ్నీ ట్రాన్స్ప్లాన్డేషన్ (కిడ్నీ మార్పిడి) కూడా అవసరమవుతుంది.
  • సర్జికల్ రోగములు (ఆపరేషన్ ద్వారా నయముచేయు) : ఇటువంటి రోగములకు చికిత్స యూరలజిస్ట్ చేస్తారు. సామాన్యమైన ఆపరేషన్లు, టెలిస్కోప్తో ఎండోస్కోపి లేక లేజర్తో కిడ్నీ రాళ్ళను పగల గొట్టుట వంటి ఉపచారన, లితొట్రోప్సి వంటి చికిత్సలు ఉంటాయి.
  • నెప్రోలజిస్ట్ మరియు యూరాలజిస్ట్ మధ్య బేధము ఏమిటి ?
  • కిడ్నీ పనితీరు గురించి విశేష జ్ఞానము కలిగిన ఫిజీషియన్స్ను నెప్రోలజిస్ట్ అని అంటారు. నెప్రోలజిస్ట్ మందుల ద్వారా, డయాలసిస్ ద్వారా రక్తాన్ని శుభ్ర పరుస్తారు. కిడ్నీ నిర్మాణము గురించి జ్ఞానమున్న సర్జెన్ని యూరలజిస్ట్ అని అంటారు. యూరాలజిస్ట్ ఆపరేషన్ ద్వారా టెలిస్కోప్ ఉపయోగించి ఆపరేషన్ చేసి కిడ్నీ రోగములకు చికిత్స చేస్తారు.
మూత్రపిండాల ప్రధాన వ్యాధులు
మందులకు సంభందించిన రోగాలు శస్త్ర చికిత్సకు సంభందించిన రోగాలు
కిడీ ఫెయిల్వూర్ మూత్రపిండాలలో వాపు నెప్రోటిక్ సిండ్రోమ్ మూత్రంలో సంక్రమణ మూత్ర మార్గంలో రాయి  ప్రోస్టేట్ రోగాలు  మూత్ర మార్గంలో పుట్టుకతో వచ్చే సమస్య  మూత్ర మార్గంలో క్యాన్సర్
ఎక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ రోగములో రెండు కిడ్నీలు హఠాత్తుగా పాడయిపోతాయి. కానీ చికిత్స తరువాత పూర్తిగా నయమవుతాయి.

కిడ్నీ ఫెయిల్యూర్

కిడ్నీ ఫెయిల్యూర్ అంటే రెండు కిడ్నీలు పని చేసే శక్తిలో తగ్గుదనము కనిపించడము. రక్తములో క్రియాటిన్ మరియు యూరియా పెరగడము కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క సంకేతము.

కిడ్నీఫెయిల్యూర్ రెండు రకాలుగా ఉంటుంది.

  1. ఎక్యూట్ కిడ్నీఫెయిల్యూర్
  2. క్రానిక్ కిడ్నీఫెయిల్యూర్
ఎక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్

ఎక్యూట్ కిడ్నీఫెయిల్యూర్లో క్రమబద్దముగా పని చేస్తున్న కిడ్నీలు హఠాత్తుగా తక్కువ సమయములో పాడయిపోతాయి. ఎక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ సంభవించడానికి ముఖ్య కారణాలు వానులు అవ్వటము, మలేరియా, రక్తపోటు అకస్మాత్తుగా తక్కువ అయిపోవడము లాంటి పరిస్థితులు. సరైన మందులు ఇవ్వడము ద్వారా, అవసరము అయితే డయాలసిస్ చేయడము ద్వారా తిరిగి రెండు కిడ్నీలు మొదటివలె పని చేయడము జరుగుతుంది.

క్రానిక్ కిడ్నీ ఫెయిల్కూర్

క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్లో (క్రానిక్ కిడ్నీ డిసీస్ - సికెడి) రెండు కిడ్నీలు మెల్ల మెల్లగా దీర్ఘకాలములో క్షీనిస్తుంటాయి. అవి తిరిగి సరి కాలేవు. శరీరములో వాపు రావడము, ఆకలి తక్కువగా ఉండడము, వాంతులు అవుతుండటము, మనస్సు సరి లేక పోవడము, నీరసముగా ఉండడము, తక్కువ వయస్సులోనే రక్తపోటు ఎక్కువగా ఉండటము ఇటువంటివి ఈ రోగానికి ముఖ్య లక్షణాలు.

రక్త పరీక్షలో క్రియాటిన్ మరియు యూరియాల పరిణామము పాడయిన కొద్దీ రక్తములో క్రియాటిన్ మరియు యూరియా యొక్క పరిణామము ఎక్కువ అవుతుంది.

ఈ రోగము యొక్క ప్రాధమిక చికిత్స మందుల ద్వారా, ఆహారము విషయములో తీసుకోవలసిన జాగ్రత్తల ద్వారాను ఆధారపడి వుంటుంది. ఈ చికిత్స యొక్క ముఖ్య ఉద్దేశ్యము కిడ్నీ ఎక్కువ పాడవకుండా మందుల ద్వారా రోగిని ఎంత ఎక్కువ కాలము వీలయితే అంత ఎక్కువ కాలము వరకూ ఆరోగ్యవంతముగా ఉంచటము.

కిడ్నీ అత్యధికముగా పాడయతే అంతే  సామాన్యముగా క్రియాటిన్ 810 మిల్లీగ్రాముల వరకు పెరిగినప్పుడు, మందులు తీసుకున్నప్పటికీ, ఆహార నియమము పాటించినప్పటికీ రోగి యొక్క పరిస్థితిలో మెరుగు కనిపించదు. ఇటువంటి పరిస్థితిలో రెండు మార్గాలు ఉంటాయి. డయాలసిస్ (రక్తము యొక్క డయాలసిస్ లేక పొట్ట యొక్క డయాలసిస్) మరియు కిడ్నీ మార్పిడి.
ఫెయిల్యూర్లో రెండు కిడ్నీలు మెల్లమెల్లగా తిరిగి నయమవటానికి వీలు లేకుండా అవి పాడయిపోతాయి.

డయాలసిస్:

రెండు కిడ్నీలు ఎక్కువగా పాడయిపోయినప్పుడు శరీరములో అనవసరమైన విసర్జించబడిన పదార్ధములు, నీటి యొక్క పరిణామము కూడా బాగా ఎక్కువగా ఉన్నప్పుడు, ఇటువంటి అనవసర కృత్రిమ రూపములో బయటకు పంపించు ప్రక్రియను డయాలసిస్ అని అంటారు.

హిమోడయాలసిస్ (మిషన్ల ద్వారా రకాన్ని శుభ్రపరుచుట)

ఈ పద్ధతి డయాలసిస్లో హిమోడయాలసిస్ అనే మిషన్ సహాయముతో కృత్రిమ కిడ్నీ (డయలైజర్)లో రకాన్ని శుభ్రపరుస్తారు. ఎ.వి. ఫిష్ణులా లేదా డబుల్ లుమెన్ క్యతేటర్ యొక్క సహాయముతో శుభ్ర పరచడానికి శరీరము నుండి రకాన్ని తీస్తుంటారు. మిషన్ సహాయముతో రక్తము శుభ్రపరుస్తూ తిరిగి శరీరములోకి పంపించి వేస్తాయి.

శరీరాన్ని ఆరోగ్యవంతముగా ఉంచడానికి రోగికి వారానికి రెండు లేక మూడు సార్లు హిమోడయాలసిస్ చేయించుకునే అవసరము ఉంటుంది హిమోడయాలసిస్ చేయించుకునే సందర్భములో రోగి మంచము పైన వుండగానే భోజనము చెయ్యడము, టివి చూడటము వంటి మామూలు పనులు చేసుకోవచ్చు. నియమిత పద్ధతిలో డయాలసిస్ చేయించుకుంటే రోగి సామాస్క జీవనము కొనసాగించవచ్చును. డయాలసిస్ చేయించుకోవడానికి మాత్రము రోగికి ఆసుపత్రిలో హిమోడయాలసిస్ యూనిట్ వద్దకు రావలసి ఉంటుంది. 4 గంటల వ్యవధిలో ఈ కార్యము పూర్తి అవుతుంది.

ప్రస్తుత కాలములో హిమోడయాలసిస్ చేయించుకునే రోగుల సంఖ్య  పొట్ట యొక్క డయాలసిస్ చేయించుకునే రోగుల సంఖ్య కంటే  ఎక్కువగా ఉన్నది.

కిడ్నీ ఎక్కువ పాడయిపోయిన మీదట కిడ్నీ పనిని కృత్రిమముగా చేసే విధానాన్ని డయాలసిస్ అని అంటారు.

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్

ఏ వయసులోనైనా సంక్రమించగలిగిన ఈ వ్యాధి పిల్లలలో ఎక్కువగా కనపడుతుంది. ఈ రోగము గొంతులోన గాని, చర్మములోన గాని ఇస్పెక్షన్ వల్ల వస్తుంది. ముఖము వాచకము, మూత్రము ఎర్రగా అవ్వటము ఈ రోగము యుక్క ముఖ్య లక్షణాలు.

ఈ రోగము యొక్క పరీక్షలో రక్తపోటు ఎక్కువగా ఉండటము, మూత్రములో ప్రోటీన్ ఎక్కువగా ఉండటము, చాలా సార్లు కిడ్నీ ఫెయిల్యూర్ కనపడటము జరుగుతుంది. అయితే చాలా వరకు పిల్లలలో వెంటనే సరైన మందు ఇస్తే, చాలా తక్కువ సమయములోనే ఈ వ్యాధి పూర్తిగా నయమవుతుంది.

పిల్లలలో అన్నింటి కంటే ఎక్కువగా కనిపించే కిడ్నీ రోగము ఎక్యూట్ గ్లోమెరూలో నెప్రోటిస్.

నెఫ్రోటిక్ సిండ్రోమ్

ఈ కిడ్నీ వ్యాధి ఇతర వయస్సు వారి కంటే పిల్లలలోనే ఎక్కువగా ఉంటుంది. శరీరము మాటి మాటికి వాచి పోవడము ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణము. ఈ రోగములో మూత్రములో ప్రోటీన్ కనబడటము, రక్త పరీక్షలో ప్రోటీన్ తక్కువగా ఉండి కొలెస్టెరాల్ ఎక్కువగా ఉండటము జరుగుతుంది. ఈ వ్యాధిలో రక్తపు పోటు ఎక్కువ అవ్వటము ఉండదు. కిడ్నీ పాడైపోయే అవకాశము కూడా చాలా తక్కువగా ఉంటుంది.

ఈ వ్యాధి మందులతో నయమవుతుంది. కానీ మాటి మాటికి ఈ రోగము తిరగ పెట్టడము, శరీరము ఉబ్బి పోవడము వంటివి నెప్రోటిక్ సిన్ర్దోము యొక్క లక్షణము. ఈ విధంగా ఈ రోగము చాలా కాలము వరకు కొనసాగడము పిల్లలకు, వారి కుటుంబ సభ్యులకు వారి ధైర్యానికి అగ్ని పరీక్ష లాంటిది.

మూత్ర సంక్రమణ

మూత్రము పోయినప్పడు ముంట్ పుట్టడము, మూటి మాటికి యూరిన్ రావడము, బొడ్డు కింది భాగములో నొప్పి పుట్టడము, జ్వరము రావడము యురినరీ ఇన్ఫెక్షన్ ముఖ్య లక్షణాలు.

ఈ రోగము మందులు తీసుకుంటే నయమవుతుంది. పిల్లలలో ఈ రోగానికి చికిత్స ఇస్తున్నప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు పాటించడము అవసరము. పిల్లలకు ఈ చికిత్స ఇవ్వడములో ఆలస్యము చేసిన, సరైన మందులు ఇవ్వకపోయినా కిడ్నీకి నష్టము కలిగే (తిరిగి నయమయ్యే అవకాశము లేనటువంటి) ప్రమాదము ఉంది.

మాటి మాటికి యురినరీ ఇన్ఫెక్షన్ అవుతున్నపుడు, రోగి మూత్ర మార్గములో అడ్డంకులు ఏర్పడటము, రాళ్ళు, మూత్ర మార్గము యొక్క టి.బి. వంటి లక్షణాల గురించి పరీక్షలు చేయవలసిన అవసరము ఉంటుంది. పిల్లలో యురినరీ ఇన్ఫెక్షన్ మాటి మాటికి రావడానికి కారణము (వసైకొ యురెటెరిక్ రిఫ్లెక్స్) లో మూత్రాశయము, మూత్రవాహినిల మధ్య ఉన్న నాళము లోపల పట్టుకతో ఉన్న దోషము వల్ల మూత్రము మూత్రాశయము నుండి వెనక్కి తిరిగి మూత్రవాహినిలో కిడ్నీ వైపుగా వెళుతుంది.

పిల్లలలో యురినరీ ఇన్ఫెక్షన్ యొక్క అసంపూర్తి పరీక్షలు, అసంపూర్తి చికిత్స వల్ల కిడ్నీ పూర్తిగా పాడయ్యే అవకాశము ఉంది, అవి తిరిగి నయమవ్వడానికి కూడా ఆస్కారము ఉండదు.

కిడ్నీ రాళ్ళ వ్యాధి

కిడ్నీ రాళ్ళు ఒక మహత్ పూర్నమైన కిడ్నీ రోగము. సామాన్యముగా ఈ వ్యాధి కిడ్నీ మూత్రవాహిని మరియు మూత్రాశయములో ఉండే రోగము. కడుపులో భరించలేని నొప్పి రావడము, వాంతులు అవ్వటము, యూరిన్ (మూత్రము) ఎర్రగా ఉండటము ఈ రోగము యొక్క ముఖ్య లక్షణాలు. కొంత మంది రోగులలో రాళస్ ఉన్నా కూడా నొప్పి ఉండదు. ఈ రకము వ్యాధిని సైలెంట్ స్టోన్ అంటారు.

కిడ్నీ రాళ్ళ చికిత్సకు కడుపు (పొట్ట) యొక్క ఎక్స్రే సోనోగ్రఫి ఒక పరీక్ష చిన్న చిన్న రాళస్ ఎక్కువగా నీరు త్రాగడము వల్ల సాధారణంగా బయటకు పోతాయి.

ఈ రాళ్ళ వల్ల మాటి మాటికి ఎక్కువగా నొప్పి ఉన్నప్పుడు, తరచుగా మూత్రములో రక్తము గానీ, రసి కారడము గానీ ఉన్నప్పుడు, రాళ్ళ కారణంగా  మూత్రమార్గములో అవరోధము వల్ల కిడ్నీకి నష్టము కలిగే భయము ఉన్నప్పుడు, ఆ రోగికి రాళస్ బయటకు తీయవలసిన అవసరము ఉంటుంది.

సామాన్యముగా రాళ్ళ తీయడానికి ఉపయోగించే పద్ధతులలో లితోట్రోప్పి, దుర్చీన్ (టెలిస్కోప్ ద్వారా), (సిస్టాకొపి మరియు యరెటిరొస్కోపి) ద్వారా చికిత్స మరియు ఆపరేషన్ (శస్త్ర చికిత్స) రాళ్ళను బయటకు తీసివేస్తారు. 80 శాతము రోగులలో రాళ్ళ తిరిగి ఉద్భవిస్తుంటాయి. ఎక్కువగా నీళ్ళ తాగడము, ఆహారములో నియమితముగా ఉండడము, సమయానుసారంగా వైద్యున్ని సంప్రదించడము అవసరము. దానివల్ల చాలా లాభదాయకము.

రాళ్ళ వ్యాధికి కడుపులో నొప్పి పట్టడము ముఖ్య లక్షణము.

నిరపాయమైన ప్రోస్టేట్ గ్రంధి పెరుగుదల (BPH)

ప్రొస్టేట్ గ్రంధి పురుషులలో మాత్రమే ఉంటుంది. మూత్రాశయము నుండి మూత్రము బయటకు పంపించే మూత్రనాళిక యొక్క మొదటి భాగము ప్రొస్టేట్ గ్రంధి మధ్య నుంచి వెళుతుంది. పెద్ద వయస్సు గల పురుషులలో ప్రొస్టేట్ పెద్దదిగా అవ్వటము మూలంగా మూత్రనాళిక పైన ఒత్తిడి వస్తుంది. అందు వల్ల రోగికి మూత్రము పోయుటలో కష్టమవుతుంది. డీనినే బిపిహెచ్  (బినైన్ ప్రొస్టేటిక్ హైపరర్లోఫి) అంటారు. రాత్రుళ్ళు అనేక సార్లు మూత్ర విసర్జనకు లేవడము, మూత్రము యొక్క ప్రవాహము సన్నగా ఉండటము, మూత్రము బయటకు రావడానికి విపరీత ప్రయత్నము చేయడము ఈ రోగానికి సంకేతాలు. ప్రాధమిక దశలో దీనికి చికిత్స మందుల ద్వారా వుంటుంది. మందుల ద్వారా స్థితి మెరుగు అవ్వకపోతే, దుర్బిన్ ద్వారా చికిత్స చేయవలసి వస్తుంది.

వెద్ద వయస్సు గల పురుషులలో మూత్రవిసర్జనకు సంబంధించిన సమస్యలకు ముఖ్య కారణము బిపిహెచ్.

ఆధారం : కిడ్నీ ఎడ్యుకేషన్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate