অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కిడ్నీ మరియు అధిక రక్తపోటు

కిడ్నీ మరియు అధిక రక్తపోటు

కిడ్నీ మరియు అధిక రక్తపోటు

సాదారణంగా రక్తపోటు 130/80 గా ఉంటుంది. ఎప్పుడైతే రక్తపోటు 140/ 90 కన్నా ఎక్కువ అవుతుందో దానిని అధిక రక్తపోటు (హై బ్లడ్ ప్రెషర్ )అని అంటారు

అధిక రక్తపోటుకు గల కారణాలు మరియు చికిత్స ఆవశ్యకత

అధిక రక్తపోటు (హై బ్లడ్ ప్రెషర్ ) 35సంవత్సరాలు పై బడిన వయస్సు గల వారిలో ఎక్కువగా కనబడుతుంది; ఇలాంటి అధిక రక్తపోటు ఎక్కువ శాతం వంశపారపరంగా రావచ్చును , డీనిని ప్రడమిక (Primary) లేదా వసేన్వియాల్ రక్తపోటు  (essential hypertension) అని కూడా అంటారు .

  • అధిక రక్తపోటు బారిన పడిన రోగులలో నుండి 10 శాతం మంది ఎన్నో రోగాల బాధితులు ఉంటారు , దీనిని సెకండరీ హైపెర్ టెన్షన్ (Secondary hypertension) అంటారు.
  • అధిక రక్తపోటు బారిన పడిన వారికి సరైన సమయానికి ఛి కిత్స చేసినట్లయితే, గుండె, మెదడు, కిడ్నీల లాంటి సున్నితమైన అవయువాలకు ఎలాంటి నష్టం కలగకుందా కాపాడవచ్చును.

ఎలాంటి వ్యాధుల కారణంగా రక్తపోటు అధికం అవుతుంది? దానికిగల కారణాలు ఏమిటి

అధిక రక్తపోటు బారిన పడిన వారు 10 శాతం మందికి ఏదో ఒక్క వ్యాధి కారణం అవుతుంది, వాటి గురించిన సమాచారం క్రింద ఇవ్వబడినది. వీటి కారణాలలో అన్నింటి కంటే 90 శాతం మంది రోగులలో కిడ్నీల వ్యాధి అధికం.

  1. కిడ్నీ యొక్క వ్యాధి
  2. కిడ్నీలోనికి రక్తానన్ని చేరవేసే ముఖ్య మైన ధమని యొక్క సంకీర్ణత (రెనాల్ అర్టేరి స్టెనోసిస్)
  3. కిడ్నీలో ఉన్న అడ్రిలిన్ అను గ్రంధిలో లోపాలు (Pheochromocytoma)
  4. శరీరములో క్రింద భాగములో రక్తాన్ని రవాణా చేసే ముఖ్య నాడీ  యుక్క ద్వారం కుదించుకు పోవుట (Shrinking) వలన  (Coractation of Aorta)
  5. స్టిరాయిడ్ లాంటి మందుల యొక్క దుప్ర్చబావము.

ఎలాంటి కిడ్నీ వ్యాధులలో అధిక రక్తపోటు రావడానికి ఆస్కారం కలదు

పిల్లలలో అధిక రక్త పోటు రావడానికి ఎక్యూట్ గ్లోమేరుల్లో నెఫిరైటిస్ (Glomerullo Nepritis), క్రానిక్ గ్లోమొరుల్లో నెఫిరైటిస్, మరియు పుట్టుక నుండి ముత్రమర్దాలలో వెసికో యురేటరిక్ యొక్క రిఫ్లక్స్ (vesico ureteric) మొదలగు వ్యాధులు కారణాలు.

వయస్సులో ఉన్న వారికి కిడ్నీ వ్యాధిలలో అధిక రక్తపోటు రావడానికి గల కారణాలు డయాబెటిస్. దీని వలన కిడ్నీలకు డయాబెటిక్ నేప్రోపతి, మరియు క్రానిక్ గ్లోమొరుల్లో నెఫిరైటిస్ పోలిసిస్టిక్ కిడ్నీ డిసీస్, కిడ్నీలోనికి రక్తాన్ని రవాణా చేసే ముఖ్య నాడీ యొక్క ద్వారం తగ్గుట ఇంకా మొదలగు కారణాలు.

ఎలాంటి పరిస్థితిలో అధికరక్తపోటుకిడీలకు కారణం అవుతుంది

అధిక రక్తపోటు కిడ్నీలకు కారణం అవడానికి ఈ క్రిందవి కారణాలు:

  • 30 సంవత్సరాల లోపు వారికీ అధిక రక్త పోటు రావడము
  • అధిక రక్తపోటు నిర్ధారణ సమయములో రక్తం యొక్క పోటు ఎక్కువగా ఉండడం అంటే 200 /120 .
  • రక్త పోటు అధికముగా ఉండడము మరియు మందులు వాడినా నియంత్రణ కాక పోవటం.
  • రక్త పోటు కారణంగా కంటి పొర పైన ప్రభావం వలన కంటి చూపులో ఇబ్బంది కలుగడం.
  • రక్త పోటుతో పాటు ఉదయాన ముఖముపై వాపు కలగడము,బలహీనంగా అనుపించడం, భోజనాలు రుచి సరిగ్గా తెలియక పోవడం మొదలగు కిడ్నీ వ్యాధి యొక్క లక్షణాలు
చిన్న వయస్సు లో అధిక రక్తపోటు ఉండడము కిడ్నీ వ్యాధి వచ్చే సూచన కావచ్చును

అధిక రక్తపోటు ఉన్నవ్యక్తిలో కిడ్నీ వ్యాధిని ఎలా నిర్ధారణ చేయాలి

సాదారణంగా మూత్ర పరీక్ష ద్వార, రక్తములో క్రియటినిన్ యొక్క పరీక్ష ద్వారా ఇంకా ఉదరం (Abdomen) యొక్క ఎక్ష్సే మరియు కిడ్నీ సోనోగ్రఫి ద్వార కిడ్నీ వ్యాధుల నిర్ధారణ కావచ్చును. ఈ పరీక్షల తరువాత ఇంట్రావెనస్ పైలోగ్రఫి, కలర్ డఫ్లోర్ యొక్క స్టడి మరియు రినాల్ యంజిఒగ్రాఫి ఇంకా ముఖ్యమైన పరీక్షల ద్వారా నిర్ధారణ చేయబడుతుంది మరియు రక్తం పై అధికంగా ఒత్తిడి ఉండడానికి గల కారణాలు ఈ యొక్క పరీక్షల ద్వారా కనుకోవడం జరుగుతుంది తరవాత దీనికి తగ్గ చికిత్స చేయబడుతుంది.

అధిక రక్తపోటు ఉన్నవాళ్ళకు కిడ్నీ వ్యాధి యొక్క నిర్ధారణ ఎందుకు అవసరనం

అధిక రక్తపోటు కిడ్నీ వ్యాధికి కారణం అవుతుంది. అందుకే వ్యాధి నిర్ధారణ చాలా మైనది మరియు దాని యొక్క లాభములు క్రింద సూచించబడినవి :

  1. కిడ్నీ వ్యాధి నిర్ధారణ మరియు చికిత్స ద్వార నయం కావచ్చును.
  2. కిడ్నీ వ్యాధి యొక్క పరిస్థితిని దృష్టి లో ఉంచుకొని చికిత్స యోగ్య కరంగా మరియు ప్రభావితంగా చేయొచ్చును.
  3. సిల్లలలో వచ్చె కిద్నీ వాపు కారణంగా (acute glomerulonephritis) చాలా త్వరగా మరియు తక్కువ సమయానికి రక్తంపై ఒత్తిడి ఏర్పడి మెదడుపై విపరీతమైన ప్రబావము ఏర్పడి ఫిట్స్ (Convulsion) రావచ్చు మరియు సృహ కోల్పోవచ్చు. అందుచేతనే రక్త పోటు లేదా రక్తంపై ఒత్తిడి పెరగగానే అవసరమైన నిర్ధారణ చేసి చికిత్స చేసినచో ఈ సమస్య నుంచి రక్షించవచ్చు.
  4. అధిక రక్త పోటు క్రానిక్ కిడ్నీ ఫైయిల్యూర్ లాంటి గంభీర మైన వ్యాధి యొక్క లక్షణాలూ మోడ్లల్లో ఒకేలా ఉండొచ్చును. క్రానిక్ కిడ్నీ ఫైయిల్యూర్లో అధిక రక్త పోటు పై తప్పకుండా నియంత్రణ పాటిస్తూ ఇంకా ఇతర చికిత్సల ద్వారా కిడ్నీకి జరిగే నష్టం నివారించవచ్చు. ఇంకా క్రానిక్ కిడ్నీ ఫైయిల్యూర్ యొక్క స్థితిలో డయాలసిస్ యొక్క అవసరము ఉంటుంది. దానిని దీర్ఘకాలం కొరకు రద్దు చేయొచ్చును.

చికిత్థ

కిడ్నీ వ్యాధి కారణంగా వచ్చే రక్తపోటు యొక్క చికిత్స రోగి యొక్క కిడ్నీ రక్తంపై ఆదారపడి ఉంది. ముఖ్యముగా: పిల్లల్లో వున్నా కిడ్నీ ఎక్యూట్ గ్లోమేరుల్లో నెఫిరైటిస్ (Glomerullo Nepritis) వ్యాధి ఉన్నప్పూడు భోజన సమయములో ద్రవపదార్థాలు మరియు ఉప్పు తక్కువగా ఉండాలి మరియు మూత్రము పెంచే మందులు, రక్తం పై ఒత్తిడి తగ్గించే మందులు తీసుకోవడము ద్వారా రక్తంపై ఒత్తిడి మెల్ల మెల్లగా తగ్గి సామాన్య స్థితిలోకి వస్తుంది ఇంకా దాని తరువత చికిత్స చేసే అవసరం ఉండదు.

ఎల్లప్పుడూ ఉండే అధికరక్తపోటు యొక్క చికిత్స

క్రానిక్కిడ్నీవైఫల్యం

ఈ వ్యాధి కారణం చేత కలిగే అధిక రక్త పోటును నియంత్రించడానికి భోజన పదార్ధాలలో ఉప్పు వీలైనంత తక్కువగా తీసుకోవాలి. శరీర వాపును దృష్టిలో పెట్టుకొని త్రాగేనీరు డాక్టర్ చే సూచించబడిన సలహా మేరకు తక్కువ మోతాదులో తీసుకోవాలి మరియు రక్తపోటును తగ్గించే డాక్టర్ చే సూచించబడిన మందులను తీసుకోవాలి. ఈ రకంగా రోగిలో అధిక రక్తపోటును నియంత్రించడముతో పాటు కిడ్నీకి అయే నష్టాన్ని నివారించవచ్చు .

రెనాల్ ఆర్టరీ స్టెనోసిస్ (Renal Artery Stenosis)

కిడ్నీలో నికి రక్తం చేర్చే దమని కుదించుకుపోయి నప్పుడు రక్తం ఒత్తిడి అధికముగా ఉన్నప్పుడు వెంటనే చికిత్స ద్వార ఈ ఒత్తిడిని శాశ్వతముగా సాధారణ స్థాయికి తీసుకురావచ్చును. ఈ ఒక చికిత్స విధానము క్రింద వ్రాయ బడినది.

1.రెనాల్ ఆంజియోప్లాస్ట్య్ (Renal AngioPlasty):

ఈ చికిత్స విదానంలో ఆపరేషన్ చేయకుండా క్యాధ్యేటర్ ( సనటి పైపు) ద్వారా దమనిలో సన్న బడిన భాగములో క్యాధ్యేటర్లో ఉన్న బుడగల సహాయముతో వ్యాకోచించేటట్లు చేయబడును. అధికశాతం రోగుల దమనిలో సన్నపడ్డ భాగములో క్యాధ్యేటర్తో వ్యాకోచించేటట్లు చేసి తరువాత మరల అది సన్నబడకుండా ఉండేందుకు దమనిలో స్టంట్ అమర్చబడును.

క్రానిక్ కిడ్నీ వైఫల్యంలో అధిక రక్తపోటును సరిగ్గా నియంత్రించడం కిడ్నీ రక్షణకు అవసరం

2. ఆపరేషన్ ద్వారా చికిత్స (Auto transplant):

ఈ చికిత్సలో దమనిలో సన్నపడ్డ భాగమును మార్చివేస్తారు లేదా రోగి యోక్క కిడ్నీని వేరే రక్తనాడితో కలుపుతారు.

కిడ్నీ వ్యాధి కారణంగా వచ్చే రక్త పోటును రోగులు సరైన చికిత్స ద్వారా పూర్తిగా నయం చేసుకోవచ్చును.

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/8/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate