অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కిడ్నీలలో రాళ్లు

కిడ్నీలలో రాళ్లు

స్టోన్స్ వ్యాధి

స్టోన్స్ వ్యాధి అనేక మంది రోగులలో కనబడే ఒక ముఖ్యమైన కిడ్నీ వ్యాధి. కలన కారణంగా ఇది భరించలేని వ్యాధి. మూత్రములో ఇన్ఫెక్షన్ వలన కిడ్నీకి నష్టం కలగొచ్చు. కావున స్టోన్స్ వ్యాధి గురించి మరియు దానిని నివారించడము చాలా అవసరము.

స్టోన్స్ అంటే ఏమిటి

మూత్రము లో కాలిపం అక్సిల్లేట్  (Calicium Oxylate)తేదా  ఇతర స్పటికాలు (Crystals) ఒక దానితో ఒకటి కలయికతో కొంత సమయము తరవాత నెమ్మదిగా మూత్రమార్గములో కఠినమైన రాయిగా తయారవ్వడము మొదలవుతుంది దీనినినే స్టోన్ అని అంటారు.

సోన్ ఎంత పెద్దదిగా ఉంటుంది? చూడడానికి ఎలా ఉంటుంది? ఇది మూత్రమార్గములో ఎక్కడ చూడవచ్చు

మూత్రమార్గములో ఉండే స్టోన్ విడివిడిగా పొడవుగా మరియు విభిన్న ఆకారాలలో ఉంటుంది. ఇది ఇసుక స్పటికవలె చిన్నదిగా లేదా బంతి వలె పెద్దదిగా ఉండొచ్చు. కొన్ని స్టోన్స్ గుడ్రంగా లేదా గ్రుడ్డు ఆకారములో బయటనుంచి నున్నగా ఉంటాయి. ఇలాంటి స్టోన్ నుండి నొప్పి తక్కువగా ఉంటుంది మరియు అవి సాధారణంగా, సహజంగా రూపంలో మూత్రము ద్వారా బయటికి వచేస్తాయి -

కొన్ని స్టోన్స్ రష్ణా ఉంటాయి. వీటి ద్వారా చాలా నొప్పి కలుగుతుంది మరియు సాధారణంగా ఇవి మూత్రములో ద్వార బయటకి రావు . స్టోన్స్ ముగా మూత్రవాహిని, మరియు మూత్రాశయములో కనబడుతుంది .

కడుపులో బరించలేని నొప్పి కి ముఖ్య కారణము మూత్రమార్గములో రాళ్ళు

కొందరు వ్యక్తులలో సోన్స్ వివిధ రూపములో ఎందుకు కనపడుతాయి

సోన్స్ కలగడానికి గల ముఖ్యకరణము ఏమిటి ?

చాలా మంది మూత్రములో ఉండే కొన్ని ప్రత్యేక రసాయనిక పదార్ధముల క్షార కణాలు ఇతర కలయికను కలుగకుండా చేస్తాయి ఇందు మూలముగా స్టోన్స్ తయారవ్వవు. కానీ చాలా మందిలో కింద వ్రాసిన కారణాల ప్రకారము స్టోన్స్ తయారుకావడానికి అవకాశము కలదు

  1. నీరు తక్కువగా తీసుకునే అలవాటు ఉన్నవారికి
  2. వంశపారంపరంగా స్టోన్స్ కలిగి ఉన్న చరిత్ర
  3. మూత్రమార్గములో ఇన్ఫెక్షన్ అనేక సార్లు కలగడం
  4. మూత్రమార్గములో అడ్డంకి కలగడము.
  5. విటమిన్ సి లేదా కాలిషం మందులూ అధికంగా సేవించడం
  6. చాలాసమయము వరకు అస్వస్థతగా ఉండడము
  7. హైపర్ పైరలైరడిసం యొక్క బాద ఉన్నవారు

సోన్స్ యొక్కలక్షణాలు

  • సామాన్యంగా స్టోన్స్ వ్యాధి 30 నుండి 40 సంవత్సరాల వయస్సు ఉన్న వారికి మరియు మహిళలతో పోలిస్తే పురుషులలో 3 నుంచి 4 రెట్లు అధికముగా కనబడుతుంది
  • చాలాసార్లు స్టోన్ యొక్క నిర్ధారణ ఆకస్మికంగా కనిపిస్తుంది, ఈ రోగులలో కలన ఉన్నట్లు ఎలాంటి లక్షణాలు కనబడవు. దీనిని సైలెంట్ స్టోన్ అని అంటారు
  • కడుపులో మరియు వీపులో నిరంతరంగా నొప్పి కలుగుతుంది వాంతులూ వికారం రావడము
  • మూత్రములో మంట కలగడము
  • మూత్రములో తరచుగా ఇన్ఫెక్షన్ రావడము
  • హఠాత్తుగా మూత్రము ఆగిపోవడము

కలన నొప్పి యొక్కలక్షణాలు

  • స్టోన్ వలన కలుగు నొప్పి, స్టోన్ యొక్క స్థానము, ఆకారము, రకము ఇంకా పొడవు వెడల్పుల పై ఆధారపడి ఉంటుంది.
  • కడుపులో నొప్పి మరియు మూత్రము ఎరుపుగా కనబడడానికి ముఖ్య్ కారణము స్టోన్
  • స్టోన్ వల్ల నొప్పి అకస్మాత్తుగా మొదలవుతుంది ఈ నొప్పి మూలాన దినములో విపరీతంగా అంటే భరించలేనంతగా అని అర్దము
  • కిడ్నీ స్టోన్ నొప్పి వీపు నుండి మొదలై కటి(పెల్విస్) వైపుగా వస్తుంది.
  • మూత్రాశయము యొక్క స్టోన్ నొప్పి కటి(పెల్విస్) మరియు మూత్ర మార్గములో ఉంటుంది
  • ఇలాంటి నొప్పులు తిరిగెటప్పూడు కన్నా ఎత్తు తగ్గుల దారిలో వాహనముపైన ప్రయానించేటప్పుడు జట్కలు తగిలినప్పుడు అధికమువుతుంది
  • ఈ నొప్పి సాదారణంగా గంటల తరబడి ఉంటుంది తరువాత మెల్ల మెల్లగా దానింతట అదే తగి పోతుంది
  • ఈ నొప్పి అధికముగా ఉండటము వలన తరచుగా రోగి డాక్టర్ వద్దకు వెళ్ళవలసి వస్తుంది మరియు నొప్పి తగ్గించడానికి మందులు లేదా ఇంజక్షన్ తీసుకునే అవసరము కలుగవచ్చు.

సోన్ కారణంగా కిడ్నీలూ చెడిపోతాయా

  • అవును. చాలామంది రోగులలో స్టోన్స్ గుండ్రంగా గుడ్డు ఆకారములో నున్నగా ఉంటాయి. ఇలాంటి స్టోన్స్ కలిగి ఉన్న రోగులలో ఎలాంటి లక్షణాలు కనబడవు. అయితే ఇలాంటి స్టోన్స్ మూత్రమార్గములో ఆటంకము కలగించవచ్చు. ఎలా అంటే కిడ్నీ లో తయారయ్యే మూత్రము యొక్క సరళతను బట్టి మూత్రమార్గములో ప్రవేశించలేదు. ఈ కారణంగా కిడ్నీ వాపునకు గురి అవుతుంది.
  • ఒకవేళ ఈ రాళ్ళను సమయానికి సరైన చికిత్స చేయకపోతే చాలా కాలము వరకు వాచి ఉన్న కిడ్నీ మెల్ల మెల్లగా బలహీనంగా అవుతుంది మరియు పూర్తిగా పనిచేయడము ఆగిపోతుంది. ఇలాంటి సమయములో కిడ్నీ చేడిపోయిన, ఒకవేళ స్టోన్ తీసివేసిన కూడా కిడ్నీ పనిచేసే సూచనలు చాలా తక్కువ .
నొప్పి లేని స్టోన్ కారణంగా కిడ్నీలు చెడిపోయే ప్రమాదము అధికముగా ఉంటుంది.

మూత్రమార్గములో రాళ్ళ యొక్క నిర్ధారణ

  • స్టోన్ నిర్ధారణ ముఖ్య ముగా మూత్రమార్గము యొక్క సోనోగ్రఫి మరియు కడుపు ఎక్ష్సే ద్వారా జరుగుతుంది
  • ఐ.వి.పి.(ఇంట్రా వెనస్ పైలోగ్రఫి) ద్వారా నిర్ధారణ: సాదారణంగా ఈ పరీక్ష ఆపరేషన్ లేదా దుర్బిను ద్వారా చెకిత్సకు ముందు చేయబడుతుంది.
  • ఈ పరీక్షల ద్వారా స్టోన్ యొక్క పొడవు వెడల్పు, దాని స్థానం లాంటి వివరాలు మరియు కిడ్నీ పనితత్వము ఎలా ఉంది, కిడ్నీ వాపు ఎంత ఉంది వంటి ఈ వివరాలు కూడా సేకరించబడుతుంది
  • మూత్రము మరియు రక్త పరీక్ష ద్వారా మూత్రములో ఉన్న ఇన్ఫెక్షన్ దాని తీవ్రత మరియు కిడ్నీ
  • పనితనమునకు సంబందిచిన వివరాలు అందుతాయి.

మూత్రరమార్గములోని సోన్ చికిత్స

స్టోన్ గురించి ఎలాంటి చికిత్స చేయడము అవసరమో అది స్టోన్ యొక్క వెడల్పు పొడవు,స్థానము మరియు దాని వలన కలిగే సమస్య మరియు ప్రమాదంను దృష్టి లో ఉంచుకొని నిర్ణయించబడుతుంది.

స్టోన్ నిర్ధారణ కొరకు సోనోగ్రఫి మరియు ఎక్స్ ముఖ్యమైన పరీక్షలు

ఈ చికిత్స విధానాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు.

  • మందుల ద్వరా చికిత్స  (Conservative Medical Treatment)
  • మూత్రమార్గములో స్టోన్ తీసివేసే సాధారణ చికిత్స (ఆపరేషన్, దుర్బిన్, లితోట్రిప్సి).

మందుల ద్వారాచికిత్స

దాదాపు 50 శాతం రోగులలో స్టోన్ ఆకారము చినదిగా ఉంటుంది దాని యొక్క ప్రకృతిపరమైన రూపము మూడు నుంచి ఆరు శాతం ఉంటుంది స్వతహాగా మూత్రము తో వెళిపోతుంది ఈ ఒక్క ప్రక్రియ సమయములో రోగికి నొప్పి నుండి ఉపశమనం కొరకు మరియు స్టోన్ త్వరగా రావడానికి సహాయముకై మందులు ఇవ్వబడును.

1.మందులు మరియు ఇంజక్షన్

స్టోన్ వలన భరించలేని నొప్పి తగ్గించడానికి వెంటనే ప్రభావితమైన పెయిన్ కిల్లెర్స్ మందులు లేదా ఇంజక్షన్ ఇవ్వబడుతుంది

2.నీరు అధికముగా

నొప్పి తగ్గిన రోగికి అధిక మొత్తంలో నీరు తెసుకోమని సలహా ఇస్తారు. అధిక మోతాదులో నీరు సేవించడం ద్వారా మూత్రము ద్వారా స్టోన్ బయటికి పోవడానికి సహాయపడుతుంది. ఒకవేళ వాంతులు కారణంగా రోగి నీరు తీసుకోవడము సాధ్యము కాకపోతే ఇంజక్షన్ ద్వారా గూకోజ్ ఎకించబడుతుంది.

3.మూత్ర ఇన్ఫెక్షన్ యొక్క చికిత్స

స్టోన్ ఉన్న రోగుల మూత్రములో ఇన్ఫెక్షన్ కనిపిస్తుంది. ఇది యాంటీబయాటిక్స్ ద్వారా చికిత్స చేయబడుతుంది.

అధికముగా నీరు తీసుకోవడము ద్వారాచిన్న స్టోన్ సహజ రూపకంగా స్వతహాగా మూత్రములో వచ్చేస్తుంది.

4.మూత్రమార్గములో స్టోన్ తొలగించి తీసివేసే చికిత్స

ఒక వేళ సహజ రూపకంగా స్టోన్ రాక పోతే స్టోన్ను తొలగించే అనేక విధానాలు అందుబాటులో ఉన్నాయి. స్టోన్ యొక్క ఆకారము, స్థానము, రకం దృష్టిలో ఉంచుకొని ఎలాంటి పద్ధతి ఉత్తమమైనదో యూరాలజిస్ట్ లేదా సర్జన్లు నిర్ణయం తీసుకుంటారు.

ప్రత్యేకమైన స్టోన్లను తక్షణమే తొలగించటం అవసరమా ?

లేదు. ఒకవేళ స్టోన్ ద్వారా పలుమార్లు నొప్పి, మూత్రములో ఇన్ఫెక్షన్, మూత్రములో రక్తము, మూత్రమార్గములో ఆటంకము లేదా కిడ్నీ చెడిపోకుండా ఉంటే ఇలాంటి సూచనలు కనిపించని యెడల స్టోన్ తక్షణమే తొలగించటం అవసరము ఉండదు. డాక్టర్ ఇలాంటి స్టోన్స్ పై దృష్టి లో ఉంచుకొని ఎప్పుడు ఎలా, ఏ పద్ధతిలో చికిత్స విధానం రోగికి లాభాదాయకమో సలహా ఇస్తాడు.

స్టోన్ కారణంగా మూత్రమార్గములో ఆటంకము, మూత్రములో తరచుగా రక్తము లేదా చీము వస్తున్నా లేదా కిడీకి నష్టము కలుగుతున్నా స్టోన్ తక్షణమే తొలగించటం అవసరము.

లితోట్రిప్సి

కిడ్నీ మరియు మూత్రావాహిని పై భాగమున ఉన్న స్టోన్స్ను తొలగించే ఆధునికమైన పద్ధతి ఇది, ఈ పద్ధతి లితోట్రిప్టర్ అనే యంత్రం సహాయముతో శక్తివంతమైన తరంగాలతో స్టోన్లను చిన్నచిన్న కణాలగా చేస్తారు. అవి కొద్ది రోజుల తరువాత మూత్రంతో బయటికి వచ్చేస్తాయి.

లాభo:
  • సామాన్యంగా రోగిని ఆస్పత్రిలో చేర్చే అవసరము ఉండదు
  • ఆపరేషన్ లేదా దుర్బిన్ ప్రయోగము, రోగికి సృహ కోల్పోకుండానే రాళ్ళ (స్టోన్)ను తొలగించవచ్చును.
లితోట్రిప్సి ఆపరేషన్ లేకుండా స్టోన్ తొలగించే అధునాతనమైన మరియు ప్రభావితమైన పద్ధతి

హాని:

  • అన్నిరకాల స్టోన్లకు మరియు పెద్ద స్టోన్కు ఈ పదతి ప్రయోజనకరముగా ఉండదు.
  • స్టోన్ నిర్మూలించడానికి అనేక సార్లు ఈ యొక్క చికిత్స చేయవలిసి వస్తుంది
  • స్టోన్ తొలగించేటప్పుడు నొప్పి లేదా అనేకసార్లు మూత్రములో ఇన్ఫెక్షన్ రావొచ్చు పెద్ద స్టోన్స్ తొలగించేటప్పుడు దుర్బిన్ సహాయముతో కిడ్నీ మరియు
  • మూత్రాశయము మధ్యలో విశేషమైన స్టంట్ అమర్చవలసి వస్తుంది.

కిడ్నీ రాళ్ళ వ్యాధికి దుర్టిన్ ద్వారా చికిత్స (PCNL - Per Cutaneous Nephro Lithotripsy)

  • కిడ్నీలోని రాళ్ళు ఒక సెం. మీ. కన్నా పెద్దదిగా ఉంటే అప్పుడు దానిని తొలగించ వలసి ఉంటుంది ఇలాంటి సమయములో ఇది ఆధునికము మరియు ప్రభావితమైన విధానం
  • ఈ పద్ధతిలో వీపు భాగములో కిడ్నీ భాగములో ఒక చిన్న రంద్రము చేసి, దాని ద్వారా కిడ్నీ వరకు మార్గము ఏర్పాటు చేసి, ఈ మార్గము ద్వారా కిడ్నీలోని స్టోన్ ఉన్న స్థానము వరకు ఒక గొట్టము పంపించ బడుతుంది
  • ఈ గొట్టము ద్వారా రాళ్లను చూస్తూ చిన్న స్టోన్లను పోర్స్ ద్వారా చిన్న చిన్న మరియు పెద్ద స్టోన్లను శక్తివంతమైన తరంగాల ద్వారా చిన్న చిన్న భాగాలుగా చేసి తొలగించబడుతుంది.

లాభము:

సామాన్యంగా కడుపు మరియు వీపు భాగములో ఆపరేషన్ చేసి తొలగించే పద్దతిలో 12 నుండి15 సెం.మీ పొడవు కోయబడుతుంది. కానీ ఈ యొక్క ఆధునిక పద్ధతి ద్వారా కేవలము ఒక సెం.మీ చిన్న రంద్రము చేయబడుతుంది అందుచేతనే ఆపరేషన్ తరువాత రోగి కొన్ని రోజులలోనే తన ప్రతి దినచర్య తిరిగి చేసుకోవచ్చు.

మూత్రాశయము మరియు మూత్రవాహినిలో ఉన్న స్టోన్లను దుర్బిన్ ద్వారా తొలగించే చికిత్స మూత్రాశయము మరియు మూత్రవాహినిలోని స్టోన్లను తొలగించే చికిత్సలో ఇది ఉతమమైన పద్ధతి. ఈ పద్ధతిలో ఆపరేషన్ లేదా రంద్రము చేయకుండానే మూత్రమార్గము (మూత్రనాళిక) గుండా విశేషమైన దుర్బిన్ (Cystoscope & Ureteroscope) యొక్క సహాయముతో స్టోన్ల వరకు చేరుకొని స్టోన్లను షాక్ వేవ్ పోర్స్ ద్వారా చిన్న చిన్నకణాలుగ విడగొట్టబడుతుంది.

దుర్బిన్ ద్వారా చేయబడే చికిత్సలలో స్టోన్లను ఆపరేషన్ లేకుండానే తొలగించవచ్చు

ఆపరేషన్:

స్టోన్లు పెద్దదిగా ఉండినయెడల వివిధ చికిత్సల ద్వారా సులభంగా తొలగించలేకపోతే అలాంటి సమయములో ఆపరేషన్ ద్వారా తొలగించబడుతుంది

సోన్ నివారణ:

స్టోన్ ఒక సారి ప్రకృతి పద్ధతిలో లేదా చికిత్స ద్వారా తొలగించిన తరువాత ఈ సమస్య నుండి సంపూర్ణంగా విముక్తి లభిస్తుందా? లేదు. ఒక సారి రోగిలో స్టోన్ కలిగిఉంటే అతనికి మరోసారి స్టోన్ ఏర్పడే అవకాశం 80 శాతం ఉంటుంది. అందుచేతనే ప్రత్యేకమైన రోగులు జాగ్రత్తగా ఉంటే మంచిది.

స్టోన్ మళ్ళీ పునవృతం కాకుండా రోగిక ఎలాంటి హెచ్చరికలు మరియు సూచనలు పాటించాలి ఈ రాళ్ళ వ్యాధిలో ఆహార నియమము విశేష మహాత్వారము.

ఈ రాళ్ళ వ్యాధిలో ఆహార నియమము విశేష మహాత్వారము. స్టోన్ కలుగకూడదు అనుకునే రోగులు ఎల్లప్పుడు క్రింద వ్రాయబడిన సలహాలను పూర్తి ఏకాగ్రతతో పాటించాలి.

నీరు అధికముగా తీసుకుంటే రాళ్ళ చికిత్స కొరకు మరియు దానిని మరల తయారు కాకుండా నివారించడానికి చాలా అవసరము

1. నీరు అధిక మొత్తంలో తీసుకోవాలి

  • 3 లీటర్లు లేదా 12 నుండి 14 గ్లాసుల కన్నా అధిక మొత్తంలో నీరు మరియు ద్రవ పదార్థాలు ప్రతి దినము తీసుకోవాలి .
  • ఈ పదతి రాళ్ళు ఏర్పడకుండా నివారణ కొరకు అన్నింటి కన్నా ముఖ్యమైన ఉపాయము
  • రాళ్ళు తయారు కాకుండా నివారించడానికి త్రాగే నీరు యొక్క నాణ్యత కన్నా రోజూవారి త్రాగే నీరు మోతాదు అతి ముఖ్యమైనది.
  • రాళ్ళు తయారు కాకుండా నివారించడానికి ఎంత నీరు తీసుకుంటారో దానికంటే ఎక్కువ మోతాదులో మూత్రము వస్తే ఇది చాలా ముఖ్యమైనది. ప్రతిరోజూ రెండు లీటర్ల కన్నా ఎక్కువ మూత్రము రావడానికి సరిపడే నీరు తీసుకోవడము అవసరము .
  • నీరు అధికముగా తీసుకుంటే రాళ్ళ చికిత్స కొరకు మరియు దానిని మరల తయారు కాకుండా నివారించడానికి చాలా అవసరము రోజంతా మూత్రము నీరులాగా స్పష్టంగా వస్తే దీని అర్ధం నీరు సరైన మోతాదులో తీసుకున్నట్లు ఒక వేళ మూత్రము పసుపుగా లేదా నిస్తేజంగా వస్తే నీరు తక్కువ మోతాదులో తీసుకునట్లు .
  • నీరుతో పాటు ఇతర పానీయాలు లాంటివి కొబ్బరినీరు, బార్లీ, మద్యం, సన్నటి పాలవిరుగుడు, ఉప్పలేని సోడా లెమన్ ఇంకా ఇతర ద్రవాలు సేవించాలి.
  • దినములో ఏదో ఒక సమయములో మూత్రము తక్కువగా మరియు పీలగా అవుతుంది. ఈ సమయములో మూత్రములో క్షార అధికముగా ఉండటము వలన
  • కలన తయారయ్యే ప్రక్రియ చాలా త్వరగా మొదలు అవుతుంది దీనిని నివారించడము చాలా అవసరము. కలనలను నివారించడం మరవవద్దు
  • భోజనము తీసుకున్నతరువాత మూడు గంటల వరకు, చాలా కష్టతరమైన పని చేసిన తరవాత, లేదా రాత్రి పడుకునే ముందు లేదా మధ్యరాత్రిలో లేచి రెండు గ్లాసులు లేదా అధిక మోతాదులో నీరు తీసుకోవడము చాలా మంచిది
  • ఈ విధంగా దినములో ఏ సమయములో కలనలు తయారవ్వడానికి ఎక్కువ అవకాశము ఉన్నదో ఆ సమయములో అధికముగా నీరు లేదా ద్రవ పదార్ధములు తీసుకోవడము ద్వారా సన్నని స్పష్టమైన మరియు అధిక మోతాదులో మాత్రా మూత్రము తయారవుతుంది. దీని ద్వారా కలన తయారవ్వడాన్ని నివారించవచ్చు ఆహారములో నియంత్రణ కలనలను దృష్టిలో ఉంచుకొని ఆహారములో పూర్తీ జాగ్రత్త మరియు నియంత్రణ పాటిస్తూ కలన నివారణకు సహాయము అవుతుంది.
  • ఆహారములో ఉప్పు మోతాదు తక్కువగా తీసుకోవాలి మరియు ఉప్పు పదార్ధముల వడియాలు, అప్పడాలు, పచ్చళ్ళు లాంటి ఉప్పు అధికముగా ఉన్న పదార్ధములు తీసుకోవదు. కలన తయారవ్వడానికి ఇది చాలా మంచి సూచన అని తెలియకుండా చాలామంది రోగులు ఈ యొక్క సూచనలు పాటించకుండా త్రోసిపుచ్చుతారు.
  • రోజంతా నీరు అధిక మోతాదులో తీసుకుంటునట్లు అనిచూపటానికి సాక్షము మూత్రము కూడా నీరు వలె నిమ్మకాయ నీరు కొబ్బరి నీరు బత్తాయి రసము,ఆనాసపండు రసము, గాజర్, కాకరకాయ, గింజలులేని టమాట, బార్లీ, వోట్స్, బాదము ఇంకా ఎలాంటివి సేవించాడము ద్వారా కలన యొక్క నివారణ చేయవచ్చు. అందుచేతనే వీటిని అధికముగా తీసుకోమని సలహా ఇస్తారు.
  • కలన వ్యాధి రోగులు పాల ఉత్పతి లేదా అధిక కాలియం లంటి పదార్థాలు తీసుకోవదు ఇది చాలా అపాయం అవుతుంది తినుబండరాలలో ఉండే కాలియం మోతాదు ఆక్సలేట్తో కలసిపోవడముతో కడుపులో అంతా ద్వారా ఆక్సలేట్ యొక్క
  • పరిమాణము తగ్గిపోతుంది దీని ద్వారాకలన తయారవ్వడానికి నివారణ సహాయము దొరుకుతుంది  విటమిన్ సిమాత్ర(4గ్రాము లేదా దానికన్నా అధికము) తీసుకోవదు
  • ఆక్సలేట్ కలన నివారణ క్రింద సూచించబడిన ఆక్సలేట్ కలిగి ఉన్న పదార్థాలను తక్కువగా తీసుకోవాలి.
  • కూరగాయాలలో టమాట, బెండకయ, వంకాయ, మునగకాడ, దోసకాయ, పాలకూర తదితర కూరగాయలు
రోజంతా నీరు అధిక మోతాదులో తీసుకుంటునట్లు అనిచూపటానికి సాక్షము మూత్రము కూడా నీరు వలె ఉండటము

పంద్లు :

సపోటా, ఉసిరి, అంగూర, స్టాబెర్రీ, రాస్బెర్రీ, సీతా ఫలము మరియు కాజు.

80 శాతుం మందిలో కలన మరల రావొచ్చును అందుకే ప్రతిసారి గ్రతగా ఉండాలి. సూచనా మేరకు పరీక్ష చేయించడము తప్పనిసరి

ద్రవపదార్ధములు:

మారుతున్న టీ, అగుర రసము, కేడ్బర్రి,కోకో ,చాకోలేట్,థంసుప్, పెప్సి .కోకోకోల

యూరిక్ యూసిడ్ రాళ్ళ యొక్కనివారణ

క్రింద సూచించిన పదార్థాలను ఎక్కువగా తెసుకోవడము ద్వార యూరిక్ యాసిడ్ పెరుగుతుంది అందు చేతనే ఇవి తక్కువగా తీసుకోవాలి

  • స్వీట్ బ్రెడ్, హౌల్వీట్  బ్రెడ్
  • పప్పులు, బటానీలు, కాయధాన్యాలు, సేమ్య
  • కూరగాయలు: కాలిప్లవర్, వంకాయ, పాలకూర మొదలగునవి.
  • ఫలాలు: సపోటా, సీతాఫలము, సొరకాయ
  • మాంసాహారము: మాంసము, చికెన్, చాపలు, గుడ్లు.
  • మద్యము: బీరు
కలన యొక్క దశలను దృష్టిలో ఉంచుకొని మందులు తీసుకోవడము ద్వారా కలన యొక్క నివారణ చేయవచ్చును.

3. మందుల ద్వారా చికిత్స

  • ఏ రోగికి మూత్రములో కాలియం మోతాదు అధికముగా ఉంటుందో వారికీ తైజైధాస్ మరియు సిట్రేట్ లాంటి మందులు ఇవ్వబడుతుంది.
  • యూరిక్ యాసిడ్ కలనలకు అల్లోపురినోల్ మరియు మూత్రము కొరకు ఆల్కలీన్తో తయారుచేయు మందులను తీసుకోమని సలహా ఇవ్వబడుతుంది.

4. సాధారణ పరీక్ష

కలన స్వతహాగా పోయినప్పుడు లేదా చికిత్స చేసిన తరువాత పోయినా కుడా మరల అది తయారవ్వుతుంది, కొందరికి కలన లక్షణాలు కనబడవు అందు చేతనే ఎలాంటి భాధ కలగక పోయిన డాక్టర్ సలహా మేరకు లేదా ప్రత్యేకంగా సంవత్సరానికి ఒక్క సారి సోనోగ్రఫి పరీక్ష చేయించడము అవసరము. సోనోగ్రఫి పరీక్ష ద్వారా కలన లేదని ఇంకా మొదటిదశ లాంటివని నిర్ధారణ కావొచ్చును.

మూత్ర మార్గంలో క్షయ వున్నప్పుడు మూత్రంలో క్షయకు సంబందించిన బ్యాక్టీరియి పరీక్ష అనేది ముఖ్యమైనది.

చివరిసారిగా మార్పు చేయబడిన : 10/18/2023



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate