অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పిల్లలలో రాత్రి పడక తడపడము

పిల్లలలో రాత్రి పడక తడపడము

పిల్లలలో రాత్రి పడక తడపడము

పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు రాత్రి పూట వాళ్ళ పడక తడిగా కావడము సర్వసాదారణము .కానీ పిల్లల వయస్సు పెరిగిన కొలది రాత్రిలో పడక తడిపితే ఆ పిల్లలు మరియు వారి తల్లితండ్రులు చాల చింతించే విషయము అవుతుంది. సాధారణముగా అధికశాతము పిల్లలలో ఈ సమస్య కిడ్నీ యొక్క వ్యాధి కారణం కాదు.

ఈ సమస్యపిల్లలలో ఎప్పుడు అధికముగా చూడబడుతుంది

  • ఏ పిల్లవాని యొక్క తల్లి తండ్రికి వారు చిన్నప్పుడు వారికి ఈ సమస్య ఉన్నప్పుడు
  • ఆడపిల్లలతో పోలిస్తే మగ పిల్లలలో ఈ సమస్య మూడు రెట్లు అధికముగా ఉన్నది
  • ఘాడంగా నిద్ర పోయే పిల్లల్లో ఈ సమస్య అధికముగా కనబడుతుంది
  • మానసిక స్థితి కారణంగా ఈ సమస్య మొదలు అవుతుంది లేదా అధికము అవుతుంది.

ఈ సమస్య ఎంతమంది పిల్లలలో అవుతుంది మరియు అది ఎప్పుడు నయము అవుతుంది

  • ఐదు సంవత్సరాల కన్నా అధిక వయస్సు లో 10 -15 శాతం పిల్లలలో ఈ సమస్యలు చూడవచ్చు.
  • వయస్సు పెరిగిన కొలది ఈ సమస్య దానంతటగా అదే నయము అవుతుంది. 10 సంవత్సరాల వయస్సు పిల్లలలో నే ఈ సమస్య 3 శాతం మరియు 15 సంవత్సరాల కన్నా ఎక్కువ వయస్సులో 1 శతంగా కనబడుతుంది.
పిల్లలలో రాత్రి పూట తెలసితెలియక పడక తడపడము ఎలాంటి వ్యాధి కాదు

రాత్రి పడక తడపడము ఎప్పుడు తీవ్రమవుతుంది

  • ఉదయం పూట కూడా పడక తడపడము
  • మలవిసర్జన లో నియంత్రణ లేక పోవడము
  • దినములో తరచుగా మూత్రము పోయడానికి వెళ్ళడము
  • మూత్రము లో తరచుగా ఇన్ఫెక్షన్ రావడము
  • మూత్రము యొక్క ధారా సన్నగా రావడము లేదా చుక్కలు చుక్కలు గా రావడము.

చికిత్స

ఈ సమస్య ఎలాంటి వ్యాధి కాదు మరియు పిల్లలు కావాలని పడక తడపరు అందు చేతనే పిల్లలను భయపెటడము, కోపగించడము లేదా వారి మీద అరవడము లాంటివి వదలిపెట్టి ఈ సమస్యకు చికిత్స సమయస్పూర్తితో చేయవచ్చు.

అర్దము చేసుకోవడము మరియు ప్రోత్సహించడము

పిల్లలకు ఈ విషయములో అవసరమైన సమాచారమును ఇవ్వడము చాలాఅవసరము రాత్రి తెలవక నే పడక తడపడము ఎలాంటి చింతించే విషయము కాదు . మరియు ఇది తపక నయము అవుతుంది. ఈ ప్రకారము పిల్లలకు అర్దము చేయడము లో మానసిక ఉద్రిక్తతతగ్గిస్తుంది మరియు ఈ సమస్య కు కు శాశ్వతముగా పరిష్కారము చూపడానికి సహాయము దొరుకుతుంది.

ఈ సమస్య యొక్క చర్చ ద్వారా పిల్లల ను బయపెటడము, కోపగించుకోవడము లేదా చేదుగా మాట్లాడడము లాంటివి చేయ కూడదు. ఏ రాత్రి అయతే పిల్లలు పడక తడపకుండా ఉంటారో అ దినము అభినందిచాలి మరియు వారికీ చిన్న చిన్న బహుమతులు ఇవ్వడము సమస్యను నివారిచడానికి ప్రోత్సహికంగా ఉంటుంది.

వయస్సు పెరిగిన కొలది సహనము మరియు ప్రోత్సాహముతో సమస్వకు పరిష్కారము కలుగుతుంది.ఏబీసీ

ద్రవపదార్థాల తీసుకోవడము మరియు మూత్రము లో పోయే అలవాటు లో పరివర్తనము

సాయంకాలము 6 గంటల తర్వాత ద్రవాలు తక్కువ మోతాదులో తీసుకోవాలి మరియు కేఫ్ఫిన్ లాంటివి (చాయ్, కాఫీ, ఇతరులు) సాయంత్రము తరవాత తీసుకోవదు.

  • రాత్రి పడుకునే ముందు ఎప్పుడు మూత్రము పోసే అలవాటు చేసుకోవాలి .
  • ఇది కాకుండ రాత్రి పిల్లలను లేపి రెండు లేక మూడు సార్లు మూత్రము పోయించడము ద్వారా వారు పడక తడపరు.
  • పిల్లలకు డైపర్ వేయడముతో రాత్రి పడక తడవకుండా రక్షించ వచ్చు.

మూత్రాశయము యొక్క పరీక్ష

  • చాలామంది పిల్లలలో ముత్రాశాయము లో తక్కువ మోతాదులో మూత్రము ఉండవచ్చు.
  • ఇలాంటి పిల్లలకు మాటిమాటికి మూత్రము పోయవలసి వస్తుంది మరియు రాత్రి పడక తడుపుతారు
  • ఇలాంటి పిల్లలకు దినములో మూత్రము వచినప్పుడు దానిని ఆపుకోవాలి ఇలాంటి మూత్ర సహానము యొక్క కసరత్తు సలహా ఇస్తారు . ఈ రకమైన కసరత్తుతో మూత్రాశయము బలంగా అవుతుంది మరియు అందులో మూత్రము సేకరించే శ్రమ పెరుగుతుంది మరియు మూత్రము పైన నియంత్రణ పెరుగుతుంది.
సాయంత్రము తరువాత నీరు తక్కువగా తీసుకోవాలి రాత్రి సమయములో మూత్రము పోయించాలి ఇది చేయడము ద్వారా పడక తడిపే సమస్య కు గణనియమైన చికిత్స

అలారం సిస్టం

మూత్రము పోసేటప్పుడు నిక్కర్(డ్రాయర్) తడవగానే దానితో పాటే అమర్చి కట్టిన అలారము గంట మ్రోగుతుంది అలాంటి అలారం సిస్టం వివిధ దేశాలలో దొరుకుతుంది .ఇది మూత్రము పోయగానే అలారం సిస్టం యొక్క హెచ్చరికతో పిల్లలు మూత్రము అపుకుంటారు. ఈ ప్రకారముగా సమస్యను ఆపవచ్చు .

మందుల ద్వారా చికిత్స

సాయంత్రము తరువాత నీరు తక్కువగా తీసుకోవాలి రాత్రి సమయములో మూత్రము పోయించాలి ఇది చేయడము ద్వారా పడక తడిపే సమస్య కు గణనియమైన చికిత్స రాత్రి పడక తడపే సమస్య కొరకు వాడె మందులలో ముఖ్యముగా ఇమ్మిప్రేమిన్,మరియు దేస్మోప్రేసిన్ , ఈ మందుల ఉపయోగము పైన చర్చించిన చికిత్స కొరకు వాడ బడుతుంది .ఇమ్మిప్రేమిన్ అనే మందు యొక్క ప్రయోగము ఏడు సంవత్సరాల పై బడిన వయస్సు పిల్లల పైన చేయబడుతుంది . ఈ మందు మూత్రాశయము యొక్క సన్నాయువలను శితిలంగా తాయారు చేస్తుంది మరియు తద్వారా మూత్రాశయము లో అధిక మాత్రము ఉండవచ్చు ఈ పరియంతరము ఈ మందు మూత్రము క్రిందకు రానివ్వకుండా బాధ్యత వహిస్తుంది ఆ రీతిగా సమయానికి మూత్రము రాకుండా చేస్తుంది.

డేమోప్రోసిన్ (DDAVP) అనే మందు స్ప్లే లేదా గోలి మందుల దుకాణములో దొరుకుతుంది. దీని ప్రయోగము ద్వారా రాత్రి మూత్రము తక్కువ మోతాదులో తయారవుతుంది. ఏ పిల్లలలో ఎక్కువ మోతాదులో మూత్రము తయారవుతుందో వారి కొరకు ఈ మందు చాలా ఉపయోగకరము. ఈ మందు రాత్రి పడక తడపకుండా ఆపడానికి చాలా పేరు గల ఒక మందు. కానీ చాలా భిరీదు కారణంగా ప్రతి యొక్క పిల్లల తల్లి తండ్రులు అంత భిరీదు భరించలేరు .

రాత్రి పడక తడిపే సమస్య లో చాలా తక్కువ మంది పిల్లలకు మందుల అవసరము పడుతుంది

ఆధారం : కిడ్నీ ఎడ్యుకేషన్

చివరిసారిగా మార్పు చేయబడిన : 2/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate