హోమ్ / ఆరోగ్యం / వ్యాధులు / రక్త పోటు తగ్గించుకోండి
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

రక్త పోటు తగ్గించుకోండి

రక్త పోటు తగ్గించుకోండి

పరిచయం

ప్రస్తుత కాలంలో రక్త పోటు అనేది సర్వ సాధారణమైన వ్యాధిగా తయారయింది అతిశయోక్తి కాదనే చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో వయస్సులో పెద్దగా ఆంటీ 50 సంవత్సరాలు పైబడిన వారికో లేక మరి కాస్త తక్కువ వయస్సు వున్నా వారికో కనిపిస్తుండేది. అయితే ఇటీవల కాలంలో చిన్న వయస్సులో ఉన్న వారికీ కూడా ఇది ప్రబలుతోంది. అందరికి దీన్ని గురించి వెంటనే తెలియటం లేదు. మొదట్లో వంట్లో ఏమిటోగా ఉండటం, ఒక్కో సారి కళ్ళు తిరుగుతున్నట్టు ఉండటం జరుగుతుంది. తగ్గకుండా మనిషి డీలా పడిపోయే వరకు తీసుకెళ్తుంది కొందరిలో. కొందరిలో అయితే కాసంత గాబరా పెడుతుంది. ఇక అప్పుడు వైద్యం కోసం పరుగులు పెడుతుంటారు.  ఇక దీని గురించి చాల మంది చెప్పే సమాధానం ఒకటే 120 / 80 నెంబరుకు మించి పెరుగుతుంటే జాగ్రత్త పడాలని. ఆ సంఖ్య 140 / 90 గా సూచిస్తుంటే మందులు వాడక తప్పదు మరి. దీనిని ప్రపంచంలోని అన్ని దేశాలు అవలంబిస్తున్న సూత్రం.  సంఖ్య 140 వచ్చే వరకు ధీమాగా వుందా కూడదని తాజా పరిశోధనలు, అధ్యయనాలు చెబుతున్నాయి. రక్త పోటుని సాధ్యమైనంత వరకు 120 / 80 కన్నా తక్కువగా ఉండేట్టు చూసుకోవటం మంచిదని వైద్య రంగ నిపుణులు చెబుతుంటారు. ఇదే విషయన్ని అమెరికా దేశంలోని ప్రముఖ వైద్య పత్రిక జామా  ఒక    అధ్యయనమ్   ప్రచురించింది కుడా.

ఎలా వస్తోంది

ప్రస్తుతం చాలామంది రక్తపోటు ఎక్కువవడం వాస్తవమే. నూట యాభై నాలుగు దేశాల్లో  ఎనిమిది వందల నలభై నాలుగు అధ్యయనాలు సేకరించి చూడగా ఇది బాగా కనబడింది. పోటును 120 / 80 అని రెండు సంఖ్యలోనే చెబుతుంటారు. ఇందులో మొదటి అంకె చాల ముఖ్యమైనది. వైద్య భాషలో దీన్ని సిస్టాలిక్ రక్తపోటు గ అంటారు. ఇది ఎంత పెరిగితే వ్యాధులు కూడా పెరిగే వీలుంది. పాతికేళ్లుగా వస్తున్న వైద్య సమాచారాన్ని గమనిస్తే ప్రపంచ వ్యాప్తంగా సిస్టాలిక్ రక్తపోటు ఎక్కువగానే కనిపిస్తోందని తెలుస్తోంది.  ప్రపంచం లో ఇప్పటికి ఎనభై అయిదు కోట్ల మందికి పైగా ఎక్కువ రక్తపోటు వుంది. మూడు వందల యాభై కోట్ల మందికి ఎక్కువ పోతూ  లేకున్నా  ముప్పులు తెచ్చే స్థాయిలో ఉండటం గమనార్హం. పోటు వాళ్ళ గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీ సమస్యలు ఏర్పడతాయి. కనుక అందరూ యుక్త వయస్సు నుంచే జాగ్రత్త పడితే మంచిది. తీసుకునే ఆహారం, బరువు ఎక్కువ కాకుండా ఉండటం వంటి జాగ్రత్తలు  ముందస్తుగానే చూసుకోవాలి.

అసలు పోటు అంటీ

చికిత్స కోసం డాక్టరుని సంప్రదిస్తే మొట్ట మొదటిగా చూసేది రక్తపోటు. దీనికి అంతటి ప్రాముఖ్యత వున్నది. మానవుడి వుండే బలంగా నెత్తురుని పంపు చేస్తూ శరీరం లోని ప్రతి భాగానికి సక్రమంగా వెళ్ళేలాగా చూస్తుంది. రక్త నాళంలో నెత్తురు ప్రవహించేటప్పుడు నాళాల గోడ మీద పడే వత్తిడిని రక్తపోటు అని అంటారు. ఇందాక చెప్పినట్టు పోటు చుసిన తరువాత మొదటిది సిస్టాలిక్, కింది సంఖ్యా డ్యాస్టాలిక్ వత్తిడికి గుర్తుగా ఉంటుంది. గుండె బలంగా కొట్టుకున్నప్పుడు రక్త నాళంలో వచ్చే పీడనాన్ని సిస్టాలిక్ ప్రెషర్ అంటారు. సిటాలిక్ పెరిగితే వ్యాధుల ముంపుకి కారణంగా తయారవుతుంది.

కానరాకుండానే.

పోటు ఒకసారి ఎక్కువ వచ్చిందంటే ఎక్కువ కాలం వేధిస్తుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయకూడదు. గుండె, మెదడు, కిడ్నీలు అన్ని రకాల ముఖ్య అవయవాలు దెబ్బతినే ప్రమాదముంది. ప్రాణాంతక సమస్యని కూడా తెచ్చి పెడుతుంది. లోపల ఉంటూనే తీవ్ర సంక్షోభంలో పడేస్తుంది. ఆంగ్లంలో సైలెంట్ కిల్లర్ అని వ్యవరిస్తారు కూడా. కనుక ఎప్పటికప్పుడు రక్తపోటు పరీక్షలు చేసుకుంటూ వైద్యుల సూచన మేరకు అదుపులో ఉంచుకుంటూ తగిన మందులు వాడుతుండాలి.

ఎలాంటి వారికీ వస్తుంది.

ఇది ఎటువంటి వారికీ వస్తుందో నిక్కచ్చిగా చెప్పలేము. ఎటువంటి వయసు వారికైనా రావచ్చు.  ప్రస్తుత కాలంలో ఎక్కువగా ఉప్పు తినటం, మధ్య పాన వ్యసనం శరీరానికి తగినంత శ్రమ లేని వారికీ బరువు ఎక్కువగా వున్నా వారికీ, ధూమపానం అలవాటు వున్న వారికీ ప్రబలుతోంది. రక్త పోటు రావటానికి తొంభై అయిదు శాతం మందిలో ఎటువంటి ప్రత్యేక కారణాలు కానరావు. అయితే కొద్దీ  మందిలో మూత్ర పిండాల సమస్యలు, థైరాయిడ్  వంటి ఇతరత్రాలు బయట పడుతుంటాయి. కనుక నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఆరుమాసాలకి  ఒక సరి పరీక్షలు చేయించుకోవటం ఉత్తమం.

మధు మేహులు అప్రమత్తంగా    ఉండాలి.

మధు మెహఅం వున్నా వారికీ రక్తపోటు ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. రక్తపోటు ఎక్కువగా వున్నా వారికీ మధుమేహం వచ్చే వీలుంది. మధు మేహుల్లో తలతీ కరోనరీ గుండె జబ్బు పక్షవాతం వంటివే కాదు మూత్ర పిండాలు, రెటీనా వంటి అవయవాలు పాడయ్యే అవకాశం లేకపోలేదు.  కనుక మధుమెదులు రక్తంలో గ్లూకోజు, కొవ్వు ను కూడా అదుపులో ఉంచుకోవటం తప్పనిసరిగా చూసుకోవాలి.

వ్యాసం: అనూరాధ

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు