অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

రక్త పోటు

రక్త పోటు

  1. రక్తపోటు
    1. అధిక రక్తపోటు
    2. లో - బిపి
  2. రుమాటిక్ హార్ట్ డిసీస్ ( రుమాటిక్ గుండె వ్యాధి ) – కీళ్ళ వాతం వ్యాధి
    1. 1. లక్షణాలు
    2. 2. ఈ వ్యాధి వచ్చి నప్పుడు గుండెలోని కవాటాలకు ఏమి జరుగుతుంది?.
    3. 3. ఈ వ్యాధి నిర్ధారణ ఎలా జరుగుతుంది.
    4. 4. నివారణ
  3. గుండె సరిగా పని చేయకపోవటం(హార్ట్ ఫెయిల్యూర్)
    1. ‘హార్ట్ ఫెయిల్యూర్’ కు గల కారణాలు?
    2. ‘హార్ట్ ఫెయిల్యూర్’ లక్షణాలు
    3. ‘హార్ట్ ఫెయిల్యూర్’ తగ్గించేందుకు కొన్ని సూచనలు
  4. గుండెను కప్పి వున్న రెండు పొరల మధ్యలో ద్రవము చేరుట
    1. హృదయావరణ తిత్తిలో ద్రవాలు చేరుటకు - కారణాలు
    2. లక్షణాలు
    3. సంకేతాలు
  5. స్ట్రోక్
    1. స్ట్రోక్ లక్షణాలు
    2. స్ట్రోక్ కలిగించే ప్రమాద కారణాలు
    3. స్ట్రోక్ కలుగ కుండా తప్పించుకొనటం ఎలా?
  6. క్రొవ్వుతో నిండిన ఆహార పదార్ధాలు
    1. అధికంగా అధిక సాంద్రత గల కొలెస్ట్రాల్ మోతాదు వుండడం
    2. అధిక మరియు తక్కువ సాంద్రత కల క్రొవ్వు పదార్ధాలు -మంచి కొలెస్ట్రాల్ ఏది? మరియు హానికరమైన కొలెస్ట్రాల్ ఏది?
    3. ట్రైగ్లిస రైడ్స్
  7. Lp(a) క్రొవ్వు పదార్ధాలు
    1. రక్తపోటును అడ్డుకొనే కొన్ని సహజ మార్గాలు
    2. రెగ్యులర్ వ్యాయామం:
    3. బరువు పెరగడాన్ని కంట్రోల్ చేయడం:
    4. సమతుల్య ఆహారం:
    5. సోడియంను తగ్గించుకోవాలి:
    6. ఆల్కహాల్ ను మితంగా తీసుకోవాలి:
    7. రెడ్ బైట్:
    8. పొగాకు ఉత్పత్తులు మరియు సెకెండ్ హ్యాండ్ స్మోకింగ్:

రక్తపోటు

గుండె అనుక్షణము సంకోచ, వ్యాకోచాలు చేస్తూ రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేస్తుంటుంది. ఇలా సంకోచించినప్పుడు (కుంచించుకొన్నప్పుడు) రక్తం గుండె నుండి రక్త నాళాల లోనికి వేగంగా వత్తిడితో ప్రవహిస్తుంది. ఈ వత్తిడిని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ (Systolic Blood pressure) అని అంటారు.

గుండె మరల వ్యాకోచించి సాధారణ స్ధితికి వచ్చినప్ఫుడు,రక్తనాళాలలో వున్న వత్తిడిని డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అని అంటారు. ఈ రక్త పోటును గాజు గొట్టము లోని పాదరసపు మిల్లీ మీటర్లలో కొలుస్తారు.

సాధారణంగా ఆరోగ్యవంతుల రక్త పోటు సిస్టోలిక్ ప్రెషర్ 90 నుండి 120 మి.మీ గాను, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 60 నుండి 80 మి.మీ గాను నమోదు కావచ్చు.

అయితే ఈ బి.పి మనిషి నుండి మనిషికి వయస్సు పెరుగుతున్నకొద్దీ మార్పు చెందుతుంది.

అలాగే సాధారణ వ్యక్తిలో రక్తపోటు ఉదయం నుండి సాయంత్రానికి కొన్ని మార్పులు చెందుతుంటుంది. మానసిక వత్తిడులు కూడా బి.పి ని ప్రభావితం చేస్తాయి.

అధిక రక్తపోటు

  • అసాధారణంగా రక్త పోటు 130/90 మి.మీ.అంతకన్నా అధికంగా వున్నప్ఫుడు ఎక్కువ రక్తపోటు (హైపర్ టెన్షన్) అని అంటారు.
  • 120/80 నుండి 139/89 మి.మీ స్ధాయిని అధిక రక్తపోటు ముందు స్ధాయిగాను, 140/90 మి.మీ.స్ధాయిని అధిక రక్త పోటుగాను గుర్తించాలి.

అధిక రక్తపోటు - అనర్ధాలు :

  • అధిక శాతం గుండె జబ్బులకు - అధిక రక్తపోటు ప్రధాన కారణం.
  • మూత్రపిండాల వ్యాధులు.
  • కంటి జబ్బులు.
  • మెదడుకు సంబంధించిన రక్త నాళాల జబ్బులు.
  • పక్షవాతము.
  • గుండె రక్తనాళాల జబ్బులు.
  • విపరీతమైన తలనొప్పులు.

లక్షణాలు: -

  • తలనొప్పి.
  • తల తిరుగుతున్నట్లు, తూలుతున్నట్లు అనిపించడం.
  • కూర్చున్న స్ధితి నుండి నిలుచోగానే కళ్ళు బైర్లు కమ్మడం.
  • సాధారణంగా శ్వాస తీసుకోలేకపోవడం

తీసుకోవలసిన జాగ్రత్తలు : -

40 సంవత్సరాలు పైబడి వున్న వారు ప్రతి సంవత్సరం పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.

కుటుంబంలో ఎవరికైనా అధిక రక్తపోటు వున్నా ఆరోగ్య పరీక్షలు కనీసం సంవత్సరానికి ఒక సారి చేయించుకోవాలి.

  • మధుమేహ వ్యాధి (Diabetes)తో బాధపడుతున్న వారు రక్తములో అధిక స్ధాయిలో కొవ్వు పదార్ధాలు (Cholesterol) వున్నా తగుజాగ్రత్తలు తీసుకోవాలి.
  • అమితంగా అలసిపోయే విధంగా అధికంగా వత్తిడి కలిగే కార్యక్రమాలు తక్కువగా చేయాలి.
  • తగినంత విశ్రాంతి తీసుకోవాలి.

లో - బిపి

సాధారణంగా ఉండవలసిన రక్త పోటు (బి.పి) కన్నా తక్కువ స్ధాయిలో బి.పి ఉండటాన్ని లోబిపి అంటారు. వైద్యపరిభాషలో దీనినే హైపోటెన్షన్ అని అంటారు. దీని వలన ప్రధాన అవయవాలైన గుండె,మెదడు,మూత్రపిండాలకు,ప్రాణ వాయువు (ఆక్సిజన్) ఆహారసరఫరా తగు పాళ్ళలో జరగదు.

సాధారణంగా కొందరిలో 90/60 మి.మీ. ఉన్నప్పటికి ఆరోగ్యంగానే వుంటారు. కాని బి.పి.సుమారు 160/90 ఉండి, 110/70 కి తగ్గితే అది లోబిపి గా పరిగణించాలి. బిపి రీడింగ్ లో తేడా 40 మి.మీ. కు మించింది అంటే అది లోబిపి గా పరిగణించాలి.

లోబిపి లక్షణాలు : -

  • నీరసం,అలసట.
  • మానసికంగా కృంగిపోవుట.
  • సరిగా నిద్ర లేక పోవుట.
  • తలనొప్పి.
  • గుండె వేగంగా పని చేయుట.
  • నాడి అధికంగా వుండుట.
  • కళ్ళు బైర్లు కమ్ముట.
  • కళ్ళు తిరుగుట.
  • శరీరం పాలి పోవుట.
  • అరికాళ్ళు,అరిచేతులు చల్లగా వుండి చెమటలు పట్టుట.
  • ఛాతి నొప్పి.
  • కొన్ని సందర్భాలలో గుండె పోటు వచ్చే అవకాశం వుంటుంది.
  • మూత్ర పిండాలు సరిగా పనిచేయక పోవడం వలన యూరియా, క్రియాటినిక్ లాంటి పదార్ధాలు రక్తములో అధికమై ప్రాణాపాయం కలిగిస్తాయి.
  • ప్రమాదకరమైన లోబిపి తో షాక్ వచ్చి ప్రాణాపాయం కావచ్చు.

రుమాటిక్ హార్ట్ డిసీస్ ( రుమాటిక్ గుండె వ్యాధి ) – కీళ్ళ వాతం వ్యాధి

రుమాటిక్ గుండె వ్యాధి – ఇది గుండె లోని కవాటాలకు వచ్చే వ్యాధి. గుండెలో, సంకోచించే - వ్యాకోచించే ప్రక్రియ ఈ కవాటాల ద్వారా జరుగుతుంది, ఈ సంకోచ వ్యాకోచ (కవాటాలు మూసుకొనుట – తెరుచుకొనుట) ప్రక్రియ ద్వారా రక్త ప్రసరణ జరుగుతుంది(శరీరం నుండి గుండెకు–గుండె నుండి శరీరానికి ప్రసరణ జరుగుతుంది.)

ఈ వ్యాధి స్ట్రెప్టోకోకల్ బాక్టిరియా ద్వారా వస్తుంది. మొదట ఈ బాక్టీరియా గొంతులో వ్యాధి కలిగిస్తుంది. ఇచ్చటి నుండి ఈ వ్యాధి క్రిములు, కీళ్ళకు వ్యాధి కలిగిస్తాయి. ఆ తరువాత తరచుగా, ఈ వ్యాధి గొంతుకు రావటం, కీళ్ళ పై ప్రభావం చూపే ప్రక్రియలో సరైన చికిత్స లేని సమయంలో, ఈ వ్యాధి క్రిములు గుండెకు చేరి, ఈ కవాటాలపై ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధి వలన, శరీరంలోని ధాతువులు అనగా సముదాయక కణాలపై ప్రభావం చూపటంతో గుండెలోని ధాతు కణాలు, ఇంకా కీళ్ళ లోని ధాతువులు ఈ వ్యాధికి గురి అవుతాయి.

1. లక్షణాలు

  • జ్వరం
  • కీళ్ళ వాపు ; కీళ్ళు తాకితే నొప్పి ( మోకాలు, మడిమలు, మణికట్టు, మో చేతులు)
  • కీళ్ళ పై బుడిపెలు
  • చేతులు , కాళ్ళ కండరాల కదలికలు స్వాధీనం తప్పటం
  • నిస్సత్తువ, ఊపిరి అందకపోవటం

2. ఈ వ్యాధి వచ్చి నప్పుడు గుండెలోని కవాటాలకు ఏమి జరుగుతుంది?.

ఈ వ్యాధి సోకిన కవాటాలు సంకోచ వ్యాకోచన (కవాటాలు మూసుకొనుట – తెరుచుకొనుట) ప్రక్రియ పూర్తిగా జరగదు.
ఈ కవాటం మూసుకోనందువలన, రక్త ప్రసరణలు కూడా పూర్తిగా కాకుండా, వెనక్కి కారడం జరుగుతుంది, దీనినే రిగర్జ్ టేషన్, లేదా కారుట (లీక్) అందురు. ఈ వెనక్కు కారిన రక్తాన్ని మరలా ముందుకు పంపు చేయుటకు గుండెకు, గుండె కండరాలకు ఎక్కువ శ్రమ కలుగుతుంది.

అలానే గుండె కవాటాలు పూర్తిగా తెరుచుకోనందువలన, గుండె ఎక్కువ శ్రమతో రక్తాన్ని పంపు చేయ్యటం జరుగుతుంది. ఈ ప్రక్రియ వలనకూడా, గుండెకండరాలకు శ్రమ కలుగుతుంది. సామాన్యంగా ఈ కవాటాలు పూర్తిగా చిన్నగా అయిపోయేంత వరకు ఎటువంటి లక్షణాలు కనిపించక పోవచ్చు. ఎప్పుడైతే ఈ కవాటాలు మరీ చిన్నగా అవుతాయో అప్పుడే లక్షణాలు కనిపిస్తాయి.

3. ఈ వ్యాధి నిర్ధారణ ఎలా జరుగుతుంది.

1. ఛాతీ ఎక్స్ రే
2. ఎలెక్ట్రో కార్డియో గ్రామ్ – గుండె, గుండె లోని అవయవాలు పని తీరును చూపించే యంత్రం చికిత్స వ్యాధి తీవ్రతను బట్టి జరుగుతుంది.

4. నివారణ

ఇలాంటి హ్రుద్రోగం రాకుండా ఉండాలంటే –
1. కీళ్ళ ( వాపు , వాతం) జ్వరాన్ని నివారించటం.
2. గొంతు వాపు, వ్యాధి సరైన సమయంలో చికిత్స
3. ఒక వేళ వ్యాధి ఉన్నట్లైతే మరలా మరలా రాకుండా ఉండాలంటే, యాంటి బయాటిక్ తో చికిత్స తీసుకోవాలి. డాక్టరు సలహా మేరకు చికిత్స పొందాలి.
4. ఈ వ్యాధి పూర్తిగా నివారణ చెయ్యాలంటే
* రుమాటిక్ జ్వర నివారణ
* ఈ జ్వరాన్ని వెంటనే గుర్తించి, వెంటనే చికిత్స సరైన సమయంలో, సరైన పధ్ధతిలో
* డాక్టర్ సలహా మేరకు దీర్ఘ కాలిక చికిత్స పొందాలి.

గుండె సరిగా పని చేయకపోవటం(హార్ట్ ఫెయిల్యూర్)

"హార్ట్ ఫెయిల్యూర్” అంటే గుండె సమర్ధవంతంగా పని చేయలేక పోవడం. గుండే శరీరంలోని అన్ని భాగాలకు సాఫీగా రక్తాన్ని సరఫరా చేయడానికి ఎంత సమర్ధ వంతంగా పని చేయాలో అంత పని చెయ్యటంలేక పోతున్నది అని అర్ధం. (‘హార్ట్ ఫెయిల్యూర్’ అంటే గుండె పని చెయ్యటం ఆగిపోయిందనీ లేదా గుండెపోటు వచ్చిందనీ అర్ధం కాదు) (కాకుంటే, గతంలో తరచూ గుండె పోటు వచ్చిన వారికి హార్ట్ ఫెయిల్యూర్ సంభవిస్తూ ఉంటుంది). గుండె ఆగటాన్ని ‘రక్త ప్రసారం స్థంభించి గుండె ఆగిపోవటమని (సి హెచ్ యఫ్ - కన్జెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్)’ కూడా పిలుస్తారు." రక్త ప్రసారం స్థంభించటమనగా "గుండె సక్రమంగా పనిచెయ్యకపోవటం వల్ల శరీరంలో ద్రవం పేరుకుపోవటం.

‘హార్ట్ ఫెయిల్యూర్’ కు గల కారణాలు?

‘ హార్ట్ ఫెయిల్యూర్ ’ కి చాలా విభిన్నకారణాలు ఉన్నాయి. కొన్నిసార్లు అసలు కారణమేమిటో కనుక్కోలేము.
హార్ట్ ఫెయిల్యూర్’ కు గల కొన్నిసాధారణ కారణాలు ఈక్రింద ఇవ్వబడ్డాయి:

  • హృదయ ధమని వ్యాధి ( గుండెకు పాక్షికంగా గానీ పూర్తిగా గానీ రక్త సరఫరా నిలిచి పోవటం)
  • గతంలో గుండె పోటు వచ్చి ఉన్నా రాకున్నా
  • హృదయ కండరముతోనే సమస్యలు (కార్డియో మయోపతి)
  • అధిక రక్తపోటు
  • ఏదన్నా హృదయ కవాటముతో సమస్యలు
  • హృదయ స్పందన సక్రమంగా లేక పోవటం (అర్థిమియాస్)
  • మత్తు పదార్ధాలను ఉపయోగించటం (మద్యం మరియు మాదకద్రవ్యాల దుర్వినియోగం)
  • పుట్టుకతో వచ్చిన హృద్రోగాలు ( హృదయ సమస్య లేదా జన్మతః వచ్చిన లోపము )
  • మధుమేహం
  • థైరాయిడ్ సమస్యలు

‘హార్ట్ ఫెయిల్యూర్’ లక్షణాలు

  • ఊపిరందకపోవటం (బహుశా నడుస్తున్నప్పుడు, మెట్లెక్కుతున్నప్పుడు లేదా చలాకీగా ఉన్నప్పుడు)
  • వంగినప్పుడు ఊపిరాడకపోవటం
  • ఆకలి లేకపోవటం
  • నిద్రలో పైకి లేవటం,అకస్మాత్తుగా ఊపిరందకపోవటం
  • సాధారణమైన అలసట లేదా నీరసం, వ్యాయమం చేయగలిగే సామర్ధ్యం తగ్గటంతో కలిపి
  • కాళ్ళు, పాదాలు లేదా మడమలు వాయటం
  • పొత్తికడుపు వాయటం
  • హృదయస్పందన వేగంగా లేదా అపసవ్యంగా ఉండటం
  • వేగంగా బరువు పెరగటం (రోజుకు 1 లేదా 2 పౌండ్ల బరువు చొప్పున వరుసగా మూడు రోజులు)
  • తీవ్రమైన దగ్గు లేదా రొంప
  • వికారం

‘హార్ట్ ఫెయిల్యూర్’ తగ్గించేందుకు కొన్ని సూచనలు

  • ఆహారం : తీసుకునే ఉప్పు పరిమాణాన్ని తగ్గించండి & కొలెస్ట్రాల్ మరియు కొవ్వు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోండి
  • మద్యం : మద్యాన్ని తగ్గించమని సలహా
  • వ్యాయామం : ‘హార్ట్ ఫెయిల్యూర్’ ఉన్న వారు కూడా వ్యాయామం చెయ్యవచ్చు, వైద్యులు ఎలాంటి వ్యాయామాలు, ఎంత మేరకు చెయ్యవచ్చు అన్నదాన్ని నిర్ణయించి సహాయం చేస్తారు.
  • బరువు : బరువు తగ్గాల్సి ఉంటుంది
  • కుటుంబ సహకారం : మీ కుటుంబమే మీకు మద్దతుకు / సహాయ సహకారాలు అందించేందుకు పెద్ద ఆధారం,
  • కాబట్టి వారిని కలుపుకుని ఉండండి.
  • మద్దతు లభించే ఇతర అధారాలు : మీకు మద్దతునిచ్చి / సలహా, సహకారాలు అందించే ఇతర సమూహాల గురించి వైద్యులు మీకు సమాచార మందిస్తారు. మీలాంటి సమస్యలున్నవారితో సంభాషిస్తే మీకు ఉపయోగపడగలదు.

గుండెను కప్పి వున్న రెండు పొరల మధ్యలో ద్రవము చేరుట

ఈ వ్యాధిలో గుండెను కప్పి వున్న రెండు పొరల మధ్యలో ద్రవము అసాధారణ మోతాదులో చేరుతుంది.
ఈ వ్యాధికి కారకాలు స్థానికమైనవి (గుండెకు సంబంధించిన) లేక ఇతర వ్యవస్థలకు సంబంధించిన వ్యాధుల మూలంగా లేక ఏ కారణమూ లేకుండానే కూడా రావచ్చును. ఈ వ్యాధి ఆకస్మికంగా లేక దీర్ఘకాలికంగా బయట పడవచ్చు. వ్యాధి లక్షణాలు ఈ వ్యాధి బయట పడడానికి తీసుకున్న సమయాన్ని బట్టి వుంటాయి.

గుండెను కప్పి వున్న తిత్తిలో సాధారణంగా 15 - 50 మిల్లీ లీటర్ల ద్రవం వుంటుంది. ఇది గుండెను అంటిపెట్టుకొని వున్న పొర మరియు వెలుపలి పొరల మధ్య రాపిడిని నివారించే విధంగా ఉపయోగపడుతుంది. (చమురు లాగా) గుండెను కప్పి వున్న ఈ పొరలు మరియు వీటి మధ్య వున్న ద్రవము రెండూ గుండె సక్రమంగా పని చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి.

సాధారణంగా హృదయావరణము కొద్ది మోతాదులో అధిక ద్రవాన్ని రెండు పొరల మధ్య ఒత్తిడి పెరగకుండా సర్దుకునే విధంగా వ్యాకోచించే శక్తి కలిగి వుంటుంది. దీని మూలంగా ఏ కొద్ది పాటి ఒత్తిడైనా గుండెకు అన్ని వైపులా వ్యాపించే సౌకర్యం కలుగుతుంది. హృదయావరణము యొక్క నిర్మాణం గుండె కండరాలు సమతుల్యంగా సంకోచ వ్యాకోచాలకు సహాయపడే విధంగా వుంటుంది. గుండెలో ఉత్పన్నమయ్యే ఒత్తిడిని గుండెకు అన్ని వైపులా వ్యాపించే విధంగా సహయపడుతుంది. వ్యాధి లక్షణాలు హృదయావరణ తిత్తిలో ద్రవాలు ప్రోగవడానికి తీసుకున్న సమయం మీద, వేగం మీద ఆధారపడి వుంటుంది. కొద్ది మోతాదులో 80 మి.లీ ద్రవమైనా అది వేగంగా ప్రోగయినట్టయితే హృదయావరణ తిత్తిలోని ఒత్తిడిని పెంచుతుంది. అదే నెమ్మదిగా 20 మి.లీ ప్రోగయినట్టయితే లక్షణాలు త్వరిత గతిన బయటపడవు.

హృదయావరణ తిత్తిలో ద్రవాలు చేరుటకు - కారణాలు

అసాధారణ రీతిలో ద్రవాలు ఉత్పన్నమౌతుండటానికి ఈ క్రింద ఇవ్వబడ్డ కారణాలు పై ఆధారపడి ఉంటుంది:
1 . సాధారణంగా గాయం తగిలిన తరువాత లేదా సూక్ష్మ క్రిమి సంపర్కము తరువాత
2 . శోధ రహిత స్రావము ప్రవాహములో అవరోధం మూలంగా ప్రోగయ్యే ద్రవాలు
సాధారణంగా శోషరసనాళాల ద్వారా ప్రవహించి రక్త స్రావంలో కలుస్తాయి. వీటి మార్గంలో అవరోధం ఏర్పడినప్పుడు ఈ ద్రవాలు వివిధ అవయవాలలో ప్రోగవుతూ వుంటాయి.
3 . శోధ సహిత స్రావ మూలంగా
వీటికి కారణాలు వేడి మంట వాపు (గాయముల ఉపరితలము నుంచి ) క్యాన్సరు, హృదయావరణ లోపలనే స్వంత కణముల మీద ప్రతి ఘాతము (తమ ప్రతి రక్షకాలే తమ కణములకు శత్రువుల వలె ప్రవర్తించి కణనాశనము కలుగజేయుట) కలగుట మూలంగా కావచ్చును.

  • కొన్ని కేసులలో స్పష్టంగా ప్రత్యేకమైన కారణం గుర్తించబడదు
  • సూక్ష్మ క్రిమి సంపర్కము వలన
    • హెచ్ ఐ. వి వైరస్ వలన కలిగే ఎయిడ్స్ వ్యాధి వలన కూడా హృదయావరణ తిత్తిలో నీరు చేరవచ్చు. ఈ వ్యాధిలో నీరు పలు విధాలుగా చేరుతుంది.
      • సూక్ష్మ జీవుల సంక్రమితం తదుపరి పరిణామంగా రావచ్చు.
      • అవకాశం తీసుకుని (రోగ నిరోధక శక్తి క్షీణించినపుడు) రావచ్చును.
      • క్యాన్సరు, మూలంగా (శోషరస కణజాలముల అసాధారణ పెరుగుదల బంధన కణజాలం నుండి ఉద్భవించే అపాయకరమైన కంతులు)
  • వైరస్ మూలంగా సర్వ సాధారణంగా హృదయావరణం మరియు హృదయ కండరాలకు సోకే సూక్ష్మ క్రిమి సంపర్కము వైరస్ ల మూలంగానే ఎక్కువ శాతం వుంటుంది. ఇతర వేరే కారణ భూతమైన జీవులు.
  • చీము గడ్డలు, చీము ఉత్పత్తి చేసే స్వభావం కల సూక్ష్మ జీవులు.

(న్యూమోకాకై, స్ట్రెప్టోకొకై, స్టఫలో కొకై, నిస్సీరాయే క్షయ వ్యాధి

  • శిలీంధ్రాలు : హిస్టోప్లాస్మోస్, కోక్సిడియో డోమైకోసిస్, కాన్ డిడా
  • ఇతర సూక్ష్మక్రిమి సంపర్కాలు – సుఖవ్యాధులు (సిఫిలిటిక్) ఏక కణాన్న జీవులు (ప్రొటొజొవా) పరాన్న జీవులు ( పారాసైటిక్ )
  • శస్త్ర చికిత్సానంతరం గుండె మార్పిడి జరిగిన రోగిలో హృదయావరణ తిత్తిలోకి ద్రవాలు చేరే అవకాశం ఎక్కువ వుంటుంది. దీనికి కారణం ఆకస్మికంగా రోగి శరీరం కొత్త అవయవాన్ని తిరస్కరించడం.
  • ఏవో కొన్ని సందర్భాలలో కారణ భూతాలు
  • URAEMIA జీవన క్రియ యొక్క వ్యర్థ పదార్థములు విసర్జింప బడక పోవడం. రోగి మూత్రములో రక్త స్రావము కనపడవచ్చు.
  • ధైరాయిడ్ గ్రంధి మాంద్యము
  • ఊపిరితిత్తులలోని రక్తపోటు అధిక మవడం
  • కిరణ ప్రసరణ తో చేసే చికిత్సానంతరం
  • ఆకస్మికంగా గుండె గోడ కండరాల రక్త ప్రసరణలో లోపం వలన కొంత ప్రాంతము చెడిపోవుట లేక క్షీణించిపోవుట గుండె గోడలు పగిలిపోవచ్చును. (FREE WALL RUPTER)
  • మాహాధమని కోసుకొని లేదా పగిలి పోయినపుడు రక్త స్రావము జరిగి ఇది హృదయావరణ గోడల గుండా హృదయావరణ తిత్తిలోకి ఊరుతుంది లేదా చేరుతుంది.
  • గాయాలు
  • అతి సంవేదన శీలత లేక అతి గ్రాహకత్వం (HYPER SENITIVITY)
  • ప్రతి ఘాతము (AUTO UMMINE) తన ప్రతి రక్షకాలే తన కణములకు శత్రువులై కణ నాశనము చేయుట
  • శరీరంలోని చర్మము లేక బంధన కణజాలము యొక్క రుగ్మత. దీనిలో చర్మము మీద పొక్కులు జ్వరము, కీళ్ళవాతము, బహుళ అవధయ క్షతము (హృదయావరణ తిత్తిలో ద్రవము చేరుట) మొదలగునవి కనబడతాయి. (కీళ్ళలో కల బంధకణజాలము యొక్క నొప్పి, శోధము కలుగుట)
  • కీళ్ళవాతము, బీటా హిమొలిటక్ స్ట్రెప్టోకొకై అనే సూక్ష్మ క్రిములు గొంతు, మరియు టాన్సిల్స్ పై దాడి చేసిన తరువాత గుండెకు, కీళ్ళకు సోకుతుంది. రోగికి అన్ని కీళ్ళలో ఒకటి తరువాత ఒకటి నొప్పి వాపు చేసి గుండె హృదయావరణములో ద్రవము చేరడం కూడా జరగవచ్చు.
  • చర్మంలోని బంధన కణజాల క్షతము
  • కొన్ని మందుల ప్రభావం మూలంగా ఉదా : ప్రొకైనమైడ్, హైడ్రల జీన్, ఐసోనియాజిడ్, మనోక్సిడివ్, ఫినెటాయిన్, యాంటీ కొయాగ్యులెంట్స్, మిదైసర్ జైడ్

లక్షణాలు

గుండెకు సంబంధించినవి:

  • గుండె నొప్పి, ఒత్తిడి, అసౌకర్యం, హృదయావరణములో నొప్పి. ఈ నొప్పి కూర్చుని ముందుకు వంగినపుడు తగ్గినట్టనిపిస్తుంది. మరల పడుకోగానే ఎక్కువ అవుతుంది.
  • తల తేలికగా అయి తిరిగినట్టనిపించడం
  • గుండె దడ
  • ఊపిరితిత్తులకు సంబంధించినవి:
  • దగ్గు
  • ఆయాసం
  • గొంతు గరగర అనడం
  • అన్నాశయ జీర్ణకోశ వ్యవస్ధకు సంబంధించినవి:
  • వెక్కిళ్ళు
  • నాడీ వ్యవస్ధ
  • ఉత్సుకత
  • అయోమయం

సంకేతాలు

  • హృదయావరణ గోడల రాపిడి మూలంగా ఉత్పన్నమయ్యే శబ్దం: ఆకస్మికంగా వచ్చే హృదయావరణ శోధము/ నొప్పి వాపులో వినిపించే ఈ శబ్దం ముఖ్యంగా మూడు భాగాలు కలిగి వుంటుంది. ఒక్కోసారి హృదయ కవాటాలు మూసుకుని తెరుచుకొనే లోపల మూడు రకాలుగా వినబడుతుంది. ఎతైన స్వరం కలిగి చెక్కుతున్నట్టుగా గరుకుగా వినబడుతుంది. దీనిని ఆలను ఛాతీ మధ్య టెముకకు ఎడమ ప్రక్క క్రింది భాగంలో అదిమి పెట్టడంతో వినవచ్చు.
  • గుండె వేగంగా ఎక్కువ సార్లు కొట్టుకోవడం.
  • శ్వాస ఎక్కువ సార్లు పీల్చుకొనడం.
  • శ్వాస ప్రక్రియ శబ్ధాలు తక్కువ స్ధాయిలో వినబడడం (శ్వాసకోశాల ఆవరణలో ద్రవాలు చేరిన తరువాత హృదయావరణ పొరలో ద్రవాలు చేరడం)
  • కాలేయము, ప్లీహముల వాపు.
  • చేతులు, కాళ్ళలో ఉన్న నాడులు బలహీనంగా కొట్టుకోవడం.
  • నీరు చేరడం, ఒళ్ళు వాపు.
  • శరీరం నీలంగా మారడం.

స్ట్రోక్

ఎక్కువగా స్ట్రోక్ మెదడుకు రక్తం తీసుకువెళ్ళే దమనిలో ఏర్పడ్డ అడ్డంకి వల్ల కలుగుతాయి. దానివల్ల మెదడులోని ఆ భాగము దెబ్బతిని రక్త ప్రసారం స్ధంభించడం వలన, అక్కడ కణాలు నిర్జీవం అవుతుంది, మరియు మెదడులోని ఆ భాగము నియంత్రించే విధి మీద నియంత్రణ కోల్పోవచ్చు. ఉదాహరణకు మీరు చేయి లేదా కాలు ఉపయోగించలేకపోవచ్చు లేదా మాట్లాడే సామర్ధ్యాన్ని కోల్పోవచ్చు. ఈ నష్టం తాత్కాలికం కావచ్చు లేదా శాశ్వతం కావచ్చు పాక్షికం కావచ్చు లేదా పూర్తిగా కావచ్చు. లక్షణాలు మొదలైన వెంటనే కనుక చికిత్స పొందితే మెదడుకు రక్తం అందే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి, నష్టానికి తక్కువ అవకాశముంటుందని వైద్యులు కనుగొన్నారు.

స్ట్రోక్ లక్షణాలు

ఈ లక్షణాలు గనుక మీరు కలిగి ఉన్నట్లైతే అత్యవసరంగా మీరు వైద్య సహాయం పొందాలి. మీరు ఎంత త్వరగా సహాయం పొందగలిగితే వైద్యులు అంత త్వరగా ముందు జరగబోయే లేదా శాశ్వత నష్టాన్ని అరికట్టగలరు.

  • అకస్మాత్తుగా నీరసం లేదా మొఖం, కాలు లేదా చెయ్యి లేదా శరీరములో ఒకవైపు మొద్దుబారటం
  • అకస్మికంగా దృష్టి మసక బారటం లేదా కోల్పోవటం, ముఖ్యంగా ఒక కంటిలో
  • మాటలాడలేక పోవటం, లేదా ఇతరులు మాట్లాడేది అర్ధం చేసుకోలేకపోవటం మాటపడిపోవటం
  • తెలిసిన ఎలాంటి కారణం లేకుండా అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి రావటం
  • కారణం తెలియని నలత, నిలకడలేని నడక లేదా తూలి పోవటం

ప్రత్యేకించి పైన చెప్పిన ఏదో ఒక లక్షణంతో కలసి స్ట్రోక్ కు మరొక ప్రమాదకరమైన సంకేతాన్ని ట్రాన్సీయెంట్ ఇస్క్ -మిక్ ఎటాక్ (టి ఐ ఏ). ఈ ‘ టి ఐ ఏ’ అన్నది ఒక స్వల్పఘాతం అది పైన పేర్కొన్న లక్షణాలను కలిగిస్తుంది మరియు కొద్ది నిమిషాలపాటు మాత్రమే ఉంటుంది, కానీ అశ్రద్ధ చేయకూడనిది. ‘టిఐఏ’ వచ్చిన వారికి తర్వాతి కాలములో గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం. మీకు టిఐఏ కలిగిందని మీరు భావిస్తే సత్వరం వైద్యుడిని కలవాలి.

స్ట్రోక్ కలిగించే ప్రమాద కారణాలు

  • అథెరొ సెలారొసిస్ (ధమనులు బండబారి పోవటం)
  • అదుపు లేని మధుమేహం
  • అధిక రక్తపోటు
  • అధిక కొలెస్ట్రాల్
  • ధూమపానము
  • గతములో ‘టిఐఏ’ వచ్చియుండటం
  • హృద్రోగము
  • కారొటిడ్ ధమని వ్యాధి ( మెదడుకు రక్తమును తీసుకువెళ్ళే ధమని )

స్ట్రోక్ కలుగ కుండా తప్పించుకొనటం ఎలా?

మీ కుటుంబ వైద్యునితో మీకు స్ట్రోక్ కలిగే ప్రమాదము గురించి (పైన తెలిపిన ప్రమాదకారణాలను చూడండి) మరియు మీకు ముప్పు ఎలా తప్పించాలన్నదాని గురించి మాట్లాడండి. ఇక్కడ మీరు స్ట్రోక్ నుంచి తప్పుకోవటానికి చెయ్య వలసిన మరికొన్ని ఇతర పనులు ఉన్నాయి.

  • రక్తపోటు అధికంగా ఉంటే వైద్యుని సలహాతో నియంత్రించండి.
  • ఉప్పు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోకండి, మరియు కొలెస్ట్రాల్ మరియు రక్తపోటును తగ్గించేందుకు ఉప్పును తక్కువగా తీసుకోండి.
  • మధుమేహం గనుక ఉంటే రక్తములో చక్కెరస్థాయిని అదుపులో ఉంచండి
  • మీరు తీసుకునే మద్యాన్ని పరిమితుల్లో ఉంచండి
  • ధూమపానం వదిలెయ్యండి, అలవాటు లేకుంటే మొదలు పెట్టకండి

మీకు స్ట్రోక్ కలిగే సమస్యలను తెలుసుకునేందుకుగాను క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించటం ముఖ్యం. గుండెపోటు కలుగకుండా ఆస్పిరిన్ ను తక్కువమోతాదులో తీసుకోవచ్చునేమో మీ వైద్యునితో మాట్లాడండి. ఆస్పిరిన్ రక్తాన్ని గడ్డకట్టకుండా సహాయము చేస్తుంది ఆ గడ్డకట్టటమే ధమనుల్లో అడ్డంకులను కలిగిస్తాయి.

క్రొవ్వుతో నిండిన ఆహార పదార్ధాలు

కొలెస్ట్రాల్ ఒక మైనము వంటి పదార్ధము ఇది కాలేయము ఉత్పత్తి చేయ బడుతుంది. కొన్ని రకాల ఆహార పదార్ధాలలో వుంటుంది. విటమిన్ డి తయారీలో కొన్ని హార్మోనుల తయారీలో కణాల గోడల నిర్మాణంలో, పైత్య లవణాల తయారీలో అవసరమవుతాయి. పైత్య లవణాలు క్రొవ్వును అరిగించడంలో అవసరమవుతాయి. నిజానికి శరీరంలో కొలెస్ట్రాల్ తగు మోతాదులో తయారవుతుంది. అవసరానికి మించి తిననిచో మనిషి ఆరోగ్యంగా వుంటాడు కాని వీటికి దూరంగా ఉండడం అసాధ్యం ఎందుకంటే మనం ఇష్టపడే చాలా ఆహార పదార్ధాలలో ఇది వుంటుంది. మోతాదుకు మించి శరీరంలో కొలెస్ట్రా చేరినట్టయితే గుండె జబ్బులుకు దారి తీస్తుంది. కొలెస్ట్రాల్ అధికం కావడానికి చాలా అంశాలు దోహదం చేస్తాయి. కాని శుభవార్త ఏమంటే మనము కొన్ని చర్యలు తీసుకొనడం వల్ల వీటిని నియంత్రించవచ్చు.

  • మానవ శరీరంలో కొలెస్ట్రాల్ ఎంత మోతాదులో వున్నది కొలవడానికి హెచ్.డి.ఎల్ (అధిక సాంద్రత వున్న కొలెస్ట్రాల్ మోతాదు ) మరియు ( మంచి లేక నిరపాయకరమైన కొలెస్ట్రాల్) తక్కువ వున్న కొలెస్ట్రాల్ మోతాదు కలిపి చూడవలసి వుంటుంది. ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ మోతాదు నియంత్రించుకోవడానికి హెచ్.డి.ఎల్ కొలెస్ట్రాల్ ఎల్.డి.యల్ కొలెస్ట్రాల్ కన్నా ఎక్కువ వుండడం మంచిది. అధిక సాంద్రత వున్న కొలెస్ట్రాల్ నిరపాయకరమైనవి.
  • ఆహారం తీసుకునేటప్పుడు అందు ఏ రకమైన క్రొవ్వు పదార్ధాలు కరిగి వున్నాయి. గమనించుకోవాలి. అసంతృప్త క్రొవ్వు పదార్ధాలు వున్న ఆహారం తీసుకోవడం మూలాన నిరపాయకరమైనవి. కొలెస్ట్రాల్ ను పెంపొందించుకోవచ్చు.
  • నియమిత క్రమాను సారంగా వ్యాయమం చేయడం తక్కువ మోతాదులో క్రొవ్వు పదార్ధాలున్న ఆహారం తీసుకోవడం లేదా అసలు తీసుకోకపోవడం ధూమపానం నిషేధం చర్యల మూలంగా చెడు కొలెస్ట్రాల్ కు దూరంగా వుండవచ్చు.

అధికంగా అధిక సాంద్రత గల కొలెస్ట్రాల్ మోతాదు వుండడం

మానవ శరీరం క్రొవ్వు పదార్ధాలు ఎక్కువ మోతాదులో తీసుకోవడానికి ఇష్టపడకపొయిన కొద్దిపాటి క్రొవ్వు శరీరానికి అవసరమవుతుంది. మనం చాలా మటుకు అవసరానికి మించి ఆహారంలో క్రొవ్వు తీసుకుంటూ వుంటాయి. మానవ శరీరానికి అవసరమైన శక్తినిచ్చే కాలరీలో నాలగవ వంతు సంతృప్త క్రొవ్వు పదార్ధాలు నుంచి రావాలి. కాని ఈ సంతృప్త క్రొవ్వు పదార్ధాల హానికరమైనవి మరియు వేయించిన ఆహార పదార్ధాలలో ఎక్కువగా వుంటాయి. సంతృప్త క్రొవ్వు పదార్ధాలు తక్కువ సాంద్రత క్రొవ్వులను అధికం చేస్తాయి.

మానవ శరీరం అసంతృప్తి క్రొవ్వులకు దూరంగా వుండడానికి ప్రయత్నిస్తుంది. మనం తినే ఆహారంలో పాక్షికంగా కరిగిన వనస్పతి నూనె వున్నట్టుతే వీటిలో అసంతృప్త క్రొవ్వులు వుంటాయి. ఇవి హానికరమైనవి ఎందుకంటే ఇవి అధిక సాంద్రత గల క్రొవ్వులను తగ్గించి తక్కువ సాంద్రత గల క్రొవ్వులను అధికం చేస్తాయి. ఇది మన శరీరం కొరే దానికి విధంగా వుంటుంది. దీనికి బదులు మనం తీసుకున్న ఆహారంలో ఏక సంతృప్త క్రొవ్వు పదార్ధాలు బహుళ సంతృప్త క్రొవ్వు పదార్ధాలు వుండే విధంగా చూసుకోవడం మంచిది. ఇవి ఆలివ్ నూనెలో కెనొలో రకాల గింజలలో లభిస్తాయి. అవొకాలో కూడా ఏక సంతృప్త క్రొవ్వు పదార్ధాలు అధికంగా వుంటాయి.

ఒమేగా 3 అను క్రొవ్వు ఆమ్లాలు వున్న ఆహారం తీసుకోవడం మూలాన హెచ్.డి.ల్ ఎడ్.డి.యల్ క్రొవ్వు పదార్ధాల నిష్పత్తి వృధ్ది చెందుతుంది. ఆ ఆమ్లాలు టూనా మరియు సాల్ మన్ అనే రకాల చేపలను తినగలిగితే కొలెస్ట్రాల్ నిష్పత్తిని తగు విధంగా నియత్రించుకొనవచ్చును.

ఇతర మంచి కొలెస్ట్రాల్ లభించే ఆహారాలు చేపనూనె, సోయా బీన్ ఉత్పత్తులు, ఆకుపచ్చని ఆకుకూరలు మొదలైనవి. వ్యాయామం అన్నిటికన్నా ఉత్తమమైన పద్దతి.

తరచుగా ప్రాణ హితమైన వ్యాయామాలు, నడవడం, పరిగెత్తడం, మెట్లు ఎక్కడం వంటివి రోజుకు అరగంట వారంలో అయిదు రోజులు చేసినట్టయితే అధిక సాంద్రత క్రొవ్వు పదార్ధాను 5 శాతం దాకా అధికం చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం మూలంగా మంచి కొలెస్ట్రాల్ వున్న ఆహారం తీసుకుంటు మరోక ప్రక్క వ్యాయామం కూడా చేసినట్టయితే ఖచ్చితంగా ఎక్కువ సాంద్రత ( మంచి క్రొవ్వు పదార్ధాలు ) గల క్రొవ్వులను అధికం చేసుకోవచ్చు.

మీరు ధూమపానం చేస్తువున్నట్టతే మానేయడం మూలంగా మంచి క్రొవ్వు పదార్ధాలను ఎక్కువ చేసుకోవచ్చును. మీరు ధూమపానం చేస్తున్నపుడు వెలువడే రసాయనాల మూలంగా మంచి క్రొవ్వు పదార్ధాలు తగ్గుతాయి. ధూమపానం మానేయడం మూలంగా హెచ్చు సాంద్రత గల క్రొవ్వు పదార్ధాలు 10 శాతం పెంచుకునే అవకాశం కూడా మంచి క్రొవ్వు పదార్ధాలను పెంచుకోవచ్చు.ఆరు పౌండ్ల బరువు తగ్గించుకున్న ప్రతిసారీ మీ శరీరంలో మంచి క్రొవ్వు పదార్ధాలు 1 mg/dl వరకు పెంచుకోవచ్చు. మంచి కొలెస్ట్రాల్ వున్న ఆహార పదార్ధాలు తరచూ తీసుకోవడం వల్ల కూడా శరీర బరువు తగ్గించుకోవచ్చు.

అధిక మరియు తక్కువ సాంద్రత కల క్రొవ్వు పదార్ధాలు -మంచి కొలెస్ట్రాల్ ఏది? మరియు హానికరమైన కొలెస్ట్రాల్ ఏది?

కొలెస్ట్రాల్ రక్తంలో కరుగలేదు. ఇవి ఏక కాలంలో, కణాల నుండి వెలుపలికు లైపోప్రొటీన్లు అనేవి మోసుకొని పొతాయి. లైపోప్రొటీన్లు (క్రొవ్వు మరియు ప్రొటీన్లు కలిగివుండడం)

తక్కువ సాంద్రత కల క్రొవ్వు పదార్ధాలు హానికరమైన (చెడ్డ) క్రొవ్వు పదార్ధాలు హెచ్చు సాంద్రత గల క్రొవ్వు పదార్ధాలు మంచి క్రొవ్వు పదార్ధాలు లేక హానికరమైన క్రొవ్వు పదార్ధాలు. ఈ రెండు రకాల క్రొవ్వులు ట్రైగిస రైడ్స్ మరియు బల్క్ క్రొవ్వు పదార్ధాలు ఈ మూడు కలిసి శరీరంలోని మొత్తం క్రొవ్వు పదార్ధాలకు కాలమానం అవుతాయి. దీనిని రక్త పరీక్ష ద్వారా కనుగొనవచ్చును.

తగ్గు సాంద్రత కల క్రొవ్వు పదార్ధాలు

తక్కువ సాంద్రత కల క్రొవ్వు పదార్ధాలు రక్తంలో ఎక్కువ మోతాదులో తిరుగుతూ వుంటే అవి రక్త నాళాల గోడల లోపలి తలం పై చేరడం మొదలవుతుంది. ముఖ్యంగా గుండెకు. మెదడుకు రక్తాన్ని చేర్చే నాళాలలో చేరుతాయి. ఈ విధంగా మెల్లమెల్లగా చేరుతున్న క్రొవ్వులు గడ్డవలె ఏర్పడి రక్తనాళాన్ని మూసేసి తద్వారా గుండెకు. మెదడుకు ప్రసరించే రక్త ప్రవాహన్ని అడ్డుకుంటాయి. దీని మూలంగా రక్తపోటు, పక్షవాతం వచ్చే అవకశాలు వుంటాయి.

హెచ్చు సాంద్రత గల క్రొవ్వు పదార్ధాలు లేక చెడ్డ క్రొవ్వు పదార్ధాలు

రక్తంలో వున్న మొత్తం క్రొవ్వు పదార్ధాలలో ఒకటికి నాలుగో వంతు హెచ్చు సాంద్రత గల క్రొవ్వు పదార్ధాలు వుంటాయి. ఇవి గుండె పోటు నుంచి గుండెను కాపాడుతాయి. అందువల్లన వీటిని మంచి లేక నిరపాయకరమైన హెచ్చు సాంద్రత గల క్రొవ్వు పదార్ధాలంటారు. ఇవి తక్కువ మోతాదు వుంటే కూడా గుండె పోటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా వుంటాయి.

ట్రైగ్లిస రైడ్స్

ఇది శరీరంలో తయారయ్యే ఒక రకమైన క్రొవ్వు పదార్ధాము కొన్ని సందర్భాలలో రక్తంలో ఇవి ఎక్కువ మోతాదులో వుంటాయి. అవి అధిక బరువు లావుగా వుండడం, శారీరక శ్రమ లేక పోవడం, పొగ త్రాగడం మధ్యపానం అతిగా సేవించడం, దినము తీసుకునే ఆహారంలో 60 శాతం పిండి పదార్ధాలు వుండడం శరీరంలో ట్రైగ్లిస రైడ్స్ అత్యధికంగా వున్న వారిలో, మొత్తం క్రొవ్వు పదార్ధాల మోతాదు అధికంగా ఉంటుంది. అదీకాక తక్కువ సాంద్రత కల క్రొవ్వు పదార్ధాలు ఎక్కువగాను హెచ్చు సాంద్రత గల మంచి క్రొవ్వు పదార్ధాలు తక్కువగాను వుంటాయి. గుండె జబ్బులు మరియు మధుమేహం వున్న వారిలో ఈ రకమైన (ట్రైగ్లిస రైడ్స్) క్రొవ్వు పదార్ధాలు హెచ్చుగా వుంటాయి.

ఆధారము: పోర్టల్ విషయ రచన భాగస్వామ్యులు

Lp(a) క్రొవ్వు పదార్ధాలు

ఇవి జన్యు పరంగా తక్కువ సాంద్రత కల క్రొవ్వు పదార్ధాలలో ఒక రకమైనవి. ఇవి అధిక మోతాదులో వున్నప్పుడు రక్తనాళాలలో లోపలి వైపు క్రొవ్వు బిళ్ళలుగా చేరడం మొదలవుతుంది.

రక్తపోటును అడ్డుకొనే కొన్ని సహజ మార్గాలు

బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులోనూ అధికంగా హైబీపీ, లోబీపికి గురిఅవుతున్నట్లు చాలా అధ్యాయాలు పేర్కొన్నాయి. సాధారణంగా ఆరోగ్యవంతుల రక్తపోటు సిస్టోలిక ప్రెషర్‌ 90 నుండి 120 మి.మీ గాను, డయాస్టోలిక బ్లడ్‌ ప్రెషర్‌ 60 నుండి 80 మి.మీగాను నమోదు కావచ్చు. అయితే ఈ బి.పి మనిషి నుండి మనిషికి వయస్సు పెరుగుతున్న కొద్దీ మార్పు చెందుతుంది. అలాగే సాధారణ వ్యక్తిలో రక్తపోటు ఉదయం నుండి సాయంత్రానికి కొన్ని మార్పులు చెందుతుంటుంది. మానసిక ఒత్తిడులు కూడా బి.పిని ప్రభావితం చేస్తాయి.

ముఖ్యంగా ఈమోడ్రన్ లైఫ్ స్టైల్ అనేక వ్యాధులతో సంబంధం కలిగి ఉంది. అధికంగా అలసిపోవుట మరియు స్ట్రెస్ వల్ల బ్లడ్ ప్రెజర్ అధిక మవుతుంది. ఈ మద్యకాలంలో హైబిపికి ప్రధాణ కారణంగా మారుతున్నది ఒత్తిడే, కాబట్టి, ఒత్తిడిని కనుక తగ్గించుకోగలిగినట్లైతే బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. మరొ ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవాలంటే మన చుట్టూ ఉన్నచాలా విషయాలను నియంత్రణలో ఉంచుకోవాలి . ఒక్క ఒత్తిడిని మాత్రమే తగ్గించుకోవడం వల్ల మాత్రమే అది సాధ్యం కాదు. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. అందులో ముఖ్యంగా ఒత్తిడి తగ్గించుకోవడం అనేది ప్రధానమైన లక్ష్యంగా పెట్టుకోవాలి. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే, మీరు ఖచ్చితంగా కొన్ని ప్రమాణాలను నియంత్రణలో పెట్టాల్సిందే. జీవిన శైలిలో మార్పులు చేసుకోవడానికి బిపి హెల్త్ టిప్స్ సలహాల్లో వివిధ మార్గాలున్నాయి. మరి అవేంటో చూద్దాం...

రెగ్యులర్ వ్యాయామం:

ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో వ్యాయామాలు చేసేవారే తక్కువైపోయారు. ఎప్పుడు చూడు లాప్ టాప్, కంప్యూటర్స్ ముందుకూర్చొవడం, లేదా ఫోన్లు, ఫేస్ బుక్, ట్విట్టర్లతో కాలక్షేపం చేస్తూ మరింత బద్దకస్తులుగా తయారవుతుంది. ఇలా చేయడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యకరంగా జీవించగలరు. వారంలో కనీసం 5రోజుల వ్యాయామం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది . బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్లో ఉంచడానికి అనుసరించే మార్గాల్లో వ్యాయామం ఉత్తమ మార్గం.

బరువు పెరగడాన్ని కంట్రోల్ చేయడం:

ఎప్పుడైతే మీరు బరువు తగ్గడం ప్రారంభిస్తారు, అప్పుడే మీరు ఒక ఆరోగ్యకరమైన జీవనశైలికి చేరుకుంటారు . కాబట్టి, బరువు తగ్గడానికి ప్రారంభించండి . బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ చేయడానికి ఇది చాలా ముఖ్యమైన మార్గం.

సమతుల్య ఆహారం:

ఒత్తిడిని కంట్రోల్ చేయాలంటే సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం చాలా అవసరం. అలాగే టైమ్ కు లచ్ మరియు త్వరగా డిన్న చేయడం కూడా ముఖ్యం. ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు మరియు సంతృప్త కొవ్వు వంటివి తీసుకోవడం వల్ల 14యంయం హెజిని తగ్గిస్తుంది. డైయట్ ప్లాన్ మార్చడం అంత సులభం కాదు. కానీ కొన్ని చిట్కాలు పాటించడం వల్ల హెల్తీ డైయట్ ను పాటించవచ్చు.

సోడియంను తగ్గించుకోవాలి:

మనకు రోజుకు ఒక వ్యక్తికి 6 గ్రాముల ఉప్పు అవసరం. పళ్లు, కూరగాయల్లో సహజసిద్దంగా ఉప్పు ఉంటుంది. ఇది మన శరీరం పనిచేయడానికి తోడ్పడుతుంది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఉప్పును తగ్గించుకోవచ్చు. నిల్వ ఉన్న, బయట దొరికే ప్రాసెస్‌ ఫుడ్స్‌ పూర్తిగా మానాల్సి ఉంటుంది. ఎందుకంటే వీటిలో ఉప్పు ఎక్కువుంటుంది. ఆహారం తినే సమయంలో ఉప్పు డబ్బా పెట్టుకోకూడదు. ఉప్పుకు బుదులు రుచికలిగించేవి, సుగంధద్రవ్యాలు, నిమ్మరసం, వెనిగర్‌, మిరియాలపొడి, ఉల్లిపాయలు వాడాలి.

ఆల్కహాల్ ను మితంగా తీసుకోవాలి:

ఆల్కహాల్ వల్ల ఆరోగ్యానికి మంచి మరియు చెడు రెండు ఉన్నాయి. అతి తక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల రెండు నుండి నాలుగు mm Hg ద్వారా రక్త పోటును తగ్గింస్తుంది. ఆల్కహాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం కంటే హనీ ఎక్కువ కలుగ జేస్తుంది. కాబట్టి ఆల్కహాల్ కు దూరంగా ఉండటమే మంచిది. పురుషులు ఒకటి లేదా రెండు పెగ్గులు తీసుకుంటే, మహిళలు ఒక్కటికి పరిమితం చేసుకోవాలి.

రెడ్ బైట్:

ఆల్కహాల్ హానికరం, అయితే రెడ్ వైన్ హెల్ప్ ఫుల్ గా ఉంటుంది. కాబట్టి ధమనులు ఓదార్పుకు మరియు రక్తపోటు తగ్గించడం కోసం మితంగా రెడ్ వైన్ తీసుకోవచ్చు.

పొగాకు ఉత్పత్తులు మరియు సెకెండ్ హ్యాండ్ స్మోకింగ్:

ధూమపానం వల్ల శరీరానికి అన్నిరకాలుగాను నష్టం వాటిళ్లితుంది. పొగాకులో ఉన్న నికోటిన్ ఊపిరితిత్తులను పాడు చేయడం మాత్రమే కాదు, 10mm Hg స్థాయి రక్తపోటును కూడా పెంచుతుంది. ప్రతి రోజూ ధూమపానం చేసే వారికి తప్పని సరిగా రక్తపోటు లక్షణాలు కలిగి ఉంటారు. అలాగే పొగతాగేవారికి దూరంగా ఉండాలి. ఇతరుల నుండి పొగ పీల్చడం కూడా అధిక రక్తపోటు మరియు గుండె జబ్బులు, మరియు ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.

బిపిని కంట్రోల్ చేయడానికి ఎప్పటికప్పుడు వైద్యపరీక్షలు చేయించుకోవడం ఉత్తమం: క్రమబద్ధమైన ఆరోగ్యకర వైద్యపరీక్షలకోసం మీ కుటుంబ వైద్యుడిని సంప్రదించడం వల్ల ప్రమాదకర రోగాల నుండి, అనారోగ్యాల నుండి దూరంగా ఉండవచ్చు. ఒక క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ఆరోగ్యకరమైన జీవితానికి ఖచ్చితమైన మూలం. మీ ఆహారం, జీవనశైలిలో చిన్న మార్పులు తీసుకురావడం వల్ల మీ మొత్తం శ్రేయస్సు కు విపరీత౦గా సహాయపడగలదు. చిన్న వయసులోనే ఈ విషయాలపట్ల శ్రద్ధ పెడితే, భవిష్యత్తులో ఎటువంటి ఆరోగ్య సమస్యలను౦డైనా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.

ఆధారము: తెలుగు.బోల్డ్ స్కై.కం

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate