অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

శారీరక వ్యవస్థ అవయవాల ద్వారా వచ్చే వ్యాధులు

శారీరక వ్యవస్థ అవయవాల ద్వారా వచ్చే వ్యాధులు

 1. మెదడు
  1. ఆల్ జీమెర్స్ వ్యాధి
  2. 10 ఆల్జీమర్స్ వ్యాధి ప్రమాద సూచికలు
 2. శ్వాస కోశ వ్యాధి (ఉపిరి తిత్తులు సంభండిత వ్యాదులు)
  1. శ్వాసకోశ వ్యాధి లక్షణాలు
  2. దగ్గు
  3. డిస్పినియా
  4. వీజింగ్
  5. ఛాతీ నొప్పి
  6. హిమోప్టిసిస్
  7. సైనోసిస్
  8. వాపు
  9. శ్వాసకోశముల వైఫల్యం
  10. శ్వాసకోశ వ్యాధికి కారణాలు మరియు హాని కారకాలు
  11. పొగత్రాగుట మానివేయాలి
 3. వివిధ రకాల ఊపిరితిత్తుల వ్యాధులు
  1. కాలుష్యంతో ఆరోగ్యానికి ముప్పు...
  2. మనం ఎలా శ్వాసిస్తున్నాం...
  3. ఉదరకోశపు క్షయ అవగాహన
 4. ఫిషర్స్‌
  1. కారణాలు
  2. లక్షణాలు
  3. నిర్ధారణ
  4. చికిత్స
  5. హోమియో మందులు
 5. యానల్ ఫిషర్/ఆనల్ ఫిషర్
  1. ఫిషర్‌లలో రకాలు...
  2. ఫిషర్ రాకుండా నివారణ
  3. చికిత్స
  4. లక్షణాలు
  5. నిర్ధారణ
  6. శస్త్రచికిత్స ప్రక్రియలు
 6. పైల్స్‌ వ్యాధి - చికిత్స
  1. పైల్స్‌:
  2. ఫిస్టులా:
  3. జాగ్రత్తలు:
  4. పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా హోమియోకేర్ వైద్యం
 7. శరీర నిర్మాణ పరమైన సమస్యలు - సలహాలు
  1. ఆడవారిలా ఎందుకిలా...?
  2. సాగిన చర్మాన్ని బిగుతుగా చేయ్యవచ్చా?

మెదడు

ఆల్ జీమెర్స్ వ్యాధి

ఆల్ జీమెర్స్ అనువ్యాధి మెదడుకు సంబంధించినది. అలోయిస్ ఆల్ జీమెర్ (ALOIS ALZHEIMER) అనే వ్యక్తి ఈ వ్యాధిని మొదటిసారిగా వివరించినారు కనుకనే ఈ వ్యాధి పేరు ఆ వ్యక్తి పేరుతో గుర్తించబడినది. ఇది మెదడుకు సంబంధించిన వ్యాధి. జ్ఞాపక శక్తి కోల్పోవడం ప్రధాన లక్షణం.

కారణాలు

ఈ వ్యాధి ఎందుకు వస్తుందో నిర్దారించలేదు - తెలియలేదు .

శాస్త్రవేత్తల సమాచారం ప్రకారం - మెదడులో ఒక ప్రత్యేక రకమైన మాంసకృత్తులు అధికంగా ఉత్పత్తి అయినందు వలన ఈ లక్షణాలు రావచ్చని తెలియజేసారు. అమైలాయిడ్ హైపొధెసిస్ అమైలాయిడ్ ప్రికర్ సార్ ప్రోటీన్ సిద్దాంత ప్రభావము కూడా ఆల్ జీమెర్స్ వ్యాధికి కారణము కావచ్చు. బీటీ సెక్రిటీజ్ అనే ప్రోటీన్ జ్ ఎంజైమ్ ప్రభావం కూడా ఈ వ్యాధి కారకం కావచ్చు.

10 ఆల్జీమర్స్ వ్యాధి ప్రమాద సూచికలు

1. జ్ఞాపకం తగ్గిపోవడం -ఇటీవలే తెలుసుకొన్న విషయాలు గుర్తులేకపోవడం అనేది ఈ వ్యాధి పొడచూపే సర్వ సాధారణమైన ఆరంభ సూచనల్లో ఒకటి. సదరు వ్యక్తి తరచూ మతిమరుపుకు లోనవడం, తర్వాత దానిని గుర్తు తెచ్చుకోలేకపోవడం జరుగుతుంది.
2. తెలిసిన పనులు చేయడానికీ కష్టపడటం - - ఈ వ్యాధి ఆరంభదశలో ఉండేవారికి రోజువారీ పనులను క్రమపధ్ధతి లో సరిగా ముందుగానే ఆలోచించుకొని చేసుకోలేక, పనులు పూర్తిచేయలేకపోతారు. వ్యక్తిగతంగా వారు వంట చేయడంలో వివిధ దశలనీ, ఒక టెలిఫోన్ కాల్ చేయడాన్నీ లేదూ ఒక ఆట ఆడటాన్నీ మర్చిపోతారు.
3. భాషతో సమస్యలు - ఈ వ్యాధి పొడచూపినవారికి చిన్నచిన్న సులభమైన పదాలను సైతం మర్చిపోవడం, కొత్త పదాలతో వాటిని ప్రయోగించడం, లేదా వారి సంభాషణగానీ, రాతగానీ అర్థం కాకుండా ఉంటుంది. ఉదాహరణకి వారు వారి టూత్ బ్రష్ ను వెతికి పట్టుకోలేకపోతారు. పైగా అదెక్కడపోయిందో అని అడగటానికి ‘నా నోటిలో వాడెదెక్కడని’ అడుగుతారు.
4. కాలాన్నీ , స్థలాన్నీ మర్చిపోవడం - ఈ వ్యాధి పొడచూపిన వారు, వారి ఇంటికి వెళ్లే దారినీ, వారెక్కడికి వెళుతున్నారో , ఎక్కడనించి వచ్చారో, ఎన్ని గంటలకు బయల్దేరారో కూడా మర్చిపోతారు.
5. నిర్ణయ లోపం - ఈ వ్యాధితో ఉన్న వారు, వస్త్రధారణ సరిగ్గా చేయరు. మంచి ఎండాకాలంలో స్వెట్టర్ వేయడం, చలికాలంలో తక్కువ దుస్తులు వేయడం చేస్తుంటారు. వీరి నిర్ణయ లోపం ఎలా ఉంటుందంటే, ముక్కూమొకం తెలీని వారికి డబ్బులిచ్చేస్తూంటారు.
6. ఆలోచనా లోపం - ఈ వ్యాధి పొడచూపిన వారిలోక్లిష్టమైన పనులకు బుర్ర పనిచేయదు. ఎలాంటి సంఖ్యలను ఎలా వాడాలో సైతం తెలియక సతమతమౌతారు.
7. వస్తువులను ఎక్కడంటే అక్కడ పెట్టేయడం - ఈ వ్యాధి ఉన్న వారు ఆయా వస్తువులను వాటి స్థలాల్లో కాక ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూంటారు. ఉదాహరణకు, ఇస్త్రీ పెట్టెను ఫ్రిజ్ లో పెట్టడం.
8. మూడ్ లో లేదా ప్రవర్తనలో మార్పు - ఈ వ్యాధి పొడచూపిన వారిలో మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. అంత వేగంగా మారిపోతూఉంటుంది. అంతలో ఆనందం, అంతలో కోపం - అకారణంగా అలా జరిగిపోతుంది.
9. వ్యక్తిత్వంలో మార్పు - ఈ వ్యాధితో బాధపడే వారి వ్యక్తిత్వం నాటకీయంగా మారిపోతూంటుంది. త్వరగా తికమకైపోవడం, సందేహాస్పదంగా ఉండటం, భయపడటం, లేదా అన్ని పనులకు కుటుంబ సభ్యులలో ఎవరిపైనో ఆధారపడటం జరుగుతుంది.
10. చొరవ తీసుకోలేకపోవడం - ఈ వ్యాధి పొడచూపిన వారు స్థబ్దుగా మారిపోవడం, టీవీ ముందు గంటల కొద్దీ కూచోవడం, అనూహ్యంగా ఎక్కువసేపు నిద్రపోవడం, నిత్య కృత్యాలపై ఆనాసక్తితో ఉండటం జరుగుతుంది.

ఇలాంటి సూచనలు మీలో గనక పొడజూపితే, ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి. ఆరంభ దశలో అల్జమీర్ లేదా ఈ లోపాన్ని పొడజూపే వ్యాధిని గుర్తిస్తే, సకాలంలో సరైన చికిత్సను పొంది ఆ వ్యాధినించి విముక్తి పొందవచ్చు.

ఆధారం : శైలేష్ గుప్త, వ్యవస్థాపక అధ్యక్షులు, సిల్వర్ఒ ఇన్నింగ్స్ ఫౌండేషన్

ఎవరిలో ఈ వ్యాధి వస్తుంది :

వయస్సు పెరుగుదలతో పాటు ఈ వ్యాధి వస్తుంది. 65 సం,, పై బడిన వారిలో(10%) మంది 85 సం. పైబడిన వారిలో 50 % మంది ఈ వ్యాధి తో బాధపడుతున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.
 1. జెనెటిక్ రిస్క్ కారణాలు - క్రోమోజోము నంబరు 19 లో మార్పులు కారణం కావచ్చు.
 2. 70 సం. పై బడిన వారు ఎక్కువ శాతం ఈ వ్యాధితో బాధపడతారు.
 3. 40 నుండి - 50 సం. లో 2-5 శాతం మందికి వచ్చే అవకాశం వుంది.
 4. అధిక రక్తపోటు ఉన్నవారు.
 5. కోరోనరీ రక్త నాళాల వ్యాధి వున్నవారు
 6. మధుమేహ వ్యాధి గ్రస్ధులు
 7. రక్తంలో కొవ్వు పదార్ధాలు అధికంగా వున్నవారు.
 8. డౌన్ సిండ్రోము వ్యాధి ఉన్నవారు 40 సం. వయస్సులోపీ ఆల్ జీమెర్ వ్యాధితో బాధపడే అవకాశం వుంది.

ప్రమాదకర సూచికలు

 1. 65-85 సం. వయస్సు ప్రధానమైన ప్రమాదకరమైన వయస్సు
 2. సాధారణంగా ప్రమాదకరమైన జీన్-అపోలిపో ప్రోటీన్ - ఇ
 3. తలకు దెబ్బ తగలడం

వ్యాధిని గుర్తించడం ఎలా ?

 1. జ్ఞాపకశక్తి తగ్గిపోవడం ప్రధాన లక్షణం ఏ కారణం నిర్ణయించలేక పోయినపుడు
 2. మెదడుకు సంబంధించి వ్యాధి లక్షణాలు నిలకడగా వున్నపుడు
 3. మెదడుకు సంబంధించిన ఏ విధమైన వ్యాధులు లేవని నిర్దారించినపుడు - ఈ లక్షణాలను ఆల్ జీమర్ వ్యాధిగా పరిగణించవచ్చు.

పరిశీలించదగ్గ వ్యాధులు

1. నరాలకు సంబందించిన వ్యాధులు
2. మెదడులో రక్తనాళాల వ్యాధి
3. పక్షవాతము
4. మెదడులో గడ్డలు
5. రక్తనాళాలలో గడ్డకట్టిన రక్తం.
6. మల్టిపుల్ స్ల్కీరోసిస్
7. పార్కిన్ సన్స్ వ్యాధి

ఇన్ ఫెక్షన్ కు సంబంధించిన వ్యాధులు

1. దీర్ఝకాలిక సిషలిస్
2. హెచ్.ఐ.వి - ఇన్ ఫెక్షన్
3. దీర్ఝకాలిక ఫంగల్ మెనింజైటిస్

మందుల ప్రభావము

 1. మూత్రాశయ వ్యాధుల మందులు వాడకం.
 2. మానసిక వ్యాధుల మందులు వాడకం, మనోవ్యాధి మూర్చలు.
 3. మందులకు అలవాటు పడడం.
 4. మాదక ద్రవ్యాలకు బానిస కావడం.
 5. మెటబాలిక్ - తైరాయిడ్ గ్రంధి తక్కువగా పనిచేయడం.
 6. విటమిన్ బి -12 తక్కువగా వుండడం.
 7. ధైయమిన్ - విటమిన్ తక్కువగా ఉండడం.
 1. తలకు దెబ్బ తగలడం మెదడులో గడ్డలు ఉండడం.

రసాయన పదార్ధాల ప్రభావము

 1. కార్బన్ మోనాక్సయిడ్ ప్రభావం.
 2. మెటల్ పాయిసనింగ్.

పది ప్రమాదకర లక్షణాలు

 1. జ్ఞాపకశక్తి తగ్గిపోవడం.
 2. సాధారణంగా చేయుపనులను సరిగా నిర్వర్తించలేక పోవడం.
 3. మాతృభాష, లేదా బాగా వచ్చిన భాషను - మాట్లాడడములో ఇబ్బంది పడడం.
 4. స్ధలము, కాలమును గుర్తించుటలో మార్పులు కనిపించడం.
 5. సాధారణ నిర్ణయాలు సరిగా తీసుకోలేక పోవడం సరియైన సమయానికి తీసుకోలేక పోవడం.
 6. సమాచార సమీకరణలో - ఆలోచనలో ఇబ్బందిపడడం.
 7. వస్తువులను - సాధారణ స్ధలములో లేకుండా - మార్పులు చేయడం- మరచి పోవడం.
 8. వ్యక్తిగత - ప్రవర్తనలో మార్పులు.
 9. వ్యక్తిత్వములో మార్పులు రావడం.
 10. వ్యక్తిగత కార్యక్రమములలో కాని - ఇతర కార్యక్రమములలో కాని - ప్రధాన పాత్రపోషించలేక పోవడం –ప్రారంభించలేక పోవడం.

వైద్యం

 1. నిర్దిష్టమైన, నిర్దేశించబడిన వైద్యం లేదు
 2. లక్షణాలలో మార్పుచేయుటకు, ఇతర వ్యాధులకు వైద్యం చేయుట.
 3. మానసికంగా బలోపేతం చేయుట వలన జీవన విధానములో కొంత మార్పుతేవచ్చును.

శ్వాస కోశ వ్యాధి (ఉపిరి తిత్తులు సంభండిత వ్యాదులు)

ప్రతి సంవత్సరం మిలియన్ల ప్రజలు ఈ శ్వాసకోశ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించబడుతున్నారు. చాలా మంది ప్రజలు ఈ వ్యాధి నిర్ధారణకే వెళ్ళడం లేదు. ఈ శ్వాసకోశ వ్యాధికి కొన్ని నిర్ధిష్టమైన వ్యాధి చిహ్నాలు, లక్షణాలు ఉన్నాయి. ఈ క్రింది జాబితాలో శ్వాసకోశ వ్యాధి యొక్క వ్యాధి చిహ్నాలు , లక్షణాలు మరియు ప్రతి విషయం గురించి వివరణ ఉన్నాయి.

శ్వాసకోశ వ్యాధి లక్షణాలు

దగ్గు

దగ్గు అనేది ఒక రక్షణ వ్యవస్ధ, ఇది శ్వాసకోశ వాయుమార్గంలోనున్న శ్లేష్మాన్ని, గాలి పీల్చినపుడు చేరు విషపదార్థాలను లేదా ఇతర పదార్థాలు ఏమైనా ఉన్నప్పుడు వాటిని తొలగించుటకు ఉపయోగపడుతుంది. దగ్గు అనేది ప్రయోజనకారా లేదా అప్రయోజనకారా అనేది దాని చర్యపై ఆధారపడి ఉంటుంది. ప్రయోజనకారక దగ్గు శ్వాసకోశ వాయుమార్గంలోనున్న శ్లేష్మాన్ని, స్రావాలను తొలగిస్తుంది. తీవ్రమైన జ్వరము, డిస్పినియా(ఊపిరి ఆడకపోవడం) లేదా రక్తముతో కూడిన లేదా ధారాళమైన కఫముతో పాటు వచ్చే ఎడతెగని దగ్గు లేదా ఉధృతమైన దగ్గుకి తక్షణ వైద్య సేవలు అవసరము. దగ్గు అనేది శ్వాసకోశ వ్యాధి యొక్క సాధారణ లక్షణము.

డిస్పినియా

డిస్పినియా (ఊపిరి ఆడకపోవడం) కొన్నిసార్లు శ్వాసకోశ వ్యవస్థ, గుండె జబ్బులు, ఆందోళన లేదా ఇతర కారణాలవల్ల వస్తుంది. జబ్బుతో ఉన్న కాలంలో అకస్మాత్తుగా వచ్చే ఊపిరాడకపోవడం లాంటి, ప్రత్యేకంగా ఇతర లక్షణాలతో పాటు విడువకుండా దగ్గు వస్తున్నట్లైతే దానిని వ్యాధిగా గుర్తించి తక్షణమే వైద్యునిచే పరీక్ష చేసుకోవాలి. ఊపిరాడకపోవడం అనేది వయస్సుతో పాటు వచ్చే సాధారణ విషయం కాదు. దానిని తీవ్రమైన విషయంగా తీసుకుని డాక్టర్ ని సంప్రదించాలి.

వీజింగ్

ఊపిరిపీల్చినపుడు, వదలినపుడు చాలా ఎక్కువగా వచ్చే శబ్దమే వీజింగ్. ఏవైనా బయటి వస్తువుల గాలిని పీల్చి వాయు మార్గాన్ని అడ్డగించినపుడు లేదా శ్లేష్మం లేదా అధికస్రావాలు, నొప్పితో కూడిన వాపు లేదా అసాధారణ కణజాలం వలన ముక్కులోని గాలిమార్గం అడ్డగించినపుడు లేదా వాయు మార్గం సన్నగా ఇరుకుగా అయినపుడు వీజింగ్ అనేది సంభవిస్తుంది. శ్వాసకోశముల పనితీరు క్షీణించుచున్నదని చెప్పడానికి వీజింగ్ అనే వ్యాధి చిహ్నంగా చెప్పవచ్చు.

ఛాతీ నొప్పి

ఛాతీ నొప్పి సాధారణంగా , ఛాతీ గోడల ఎముకలు, కండరాలు, ఊపిరితిత్తులపైన పొర (ప్లూరా) ఊపిరితిత్తులు మొదలగు వాని సమస్యను సూచిస్తుంది. ఈ సమస్య చిన్నదవవచ్చు లేదా తీవ్ర మైనది లేదా ప్రాణాంతకమవవచ్చు మరియు శాశ్వతమైనది లేదా ఊపిరిపీల్చేటప్పుడు మాత్రమే రావచ్చు. జ్వరం లేదా దగ్గుతోపాటు ఛాతీలో నొప్పి వస్తే అది అంటువ్యాధిగా గుర్తించవచ్చు. మీకు ఛాతీనొప్పి వస్తున్నట్లనిపించినట్లైతే సత్వర వైద్యసేవలు పొందాలి.

హిమోప్టిసిస్

హిమోప్టిసిస్ (దగ్గునపుడు నెత్తురు పడుట) స్వచ్ఛమైన నెత్తురు లేదా నెత్తుటి జీర లేదా ముద్దతో కూడిన శ్లేష్మము లేదా లేత గులాబీరంగు నురుగులో కనిపించవచ్చు. ఎడతెగని దగ్గు వలన ఇది సంభవిస్తుంది. లేదా ఇది తీవ్రమైన శ్వాసకోశ వ్యాధిని సూచించవచ్చు. హిమోప్టిసిస్ అనేది తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి లక్షణము.

సైనోసిస్

చర్మము రంగు నీలిరంగులోగాని, వంగపండురంగులోగాని మారినపుడు సైనోసిస్ గా గుర్తించవచ్చు. ఇది ముఖ్యంగా పెదవుల చుట్టూ, గోరు మొదళ్ళలో కనిపిస్తుంది. రక్తము సరిపోయినంత ఆక్సిజన్ ని తీసుకోవడంలేదని దీనికి గుర్తు. నెమ్మదిగా శ్వాసకోశ వ్యాధి ముదురుతున్నట్లు లేదా తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి కి గుర్తుగా సైనోసిస్ కనిపించవచ్చును.

వాపు

కాళ్ళు, చేతులు, చీలమండల దగ్గర వాపు ఉన్నట్లైతే అది శ్వాసకోశ వ్యాధి కి చిహ్నంగా చెప్ప వచ్చును. హృదయరోగములతో ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు తోడైనప్పుడు వాపు అనేది విలక్షణంగా కనిపిస్తుంది. చాలా సార్లు గుండె, ఊపిరితిత్తులు ఒకే రకమైన లక్షణాలను కనపరుస్తాయి. ఎందుకంటే చాలా రకాలైన వ్యాధులకు ఈ రెండు అవయవాలు ప్రభావితమౌతాయి.

శ్వాసకోశముల వైఫల్యం

శ్వాసకోశ వైఫల్యము అనేది తీవ్రమైన, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధికి ఆనవాలు. తీవ్రమైన అంటు వ్యాధి, ఊపిరితిత్తుల వాపు, గుండె ఆగి కొట్టుకొనుట , తీవ్ర శ్వాసకోశవ్యాధి తీవ్రమైన శ్వాసకోశముల వైఫల్యం యొక్క లక్షణములు. ఊపిరితిత్తులు రక్తాన్ని ఆక్సిజనీకరణము చేయలేనప్పుడు లేదా సాధారణంగా రక్తంలోని కార్బన్-డై-ఆక్సైడ్ ను వేరుచేయలేనప్పుడు దీర్ఘకాలిక తీవ్రమైన శ్వాసకోశ వైఫల్యం వస్తుంది.

శ్వాసకోశ వ్యాధికి కారణాలు మరియు హాని కారకాలు

శ్వాసకోశ వ్యాధి వయస్సు మీరిన వారి మీద మాత్రమే ప్రభావము చూపదు. అది చిన్న పిల్లల మీద కూడా ప్రభావమును చూపుతుంది. నిజానికి శ్వాసకోశ వ్యాధులు, ఇతర శ్వాసకోశ అంటువ్యాధులు మరియు ఇతర జబ్బులు శిశువుల మరణానికి కారణమయ్యే వాటిలో మొట్టమొదటిది.

పొగత్రాగుట మానివేయాలి

పొగత్రాగుట మన శరీరం మీద భయంకరమైన ప్రభావమును కల్గి ఉంటుంది. ఇది శ్వాసకోశ వ్యాధులకు మాత్రమే కారణం కాకుండా, ఎంఫిసిమా, క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మొనరీ డిసీజ్ (సిఓపిడి), ఊపిరితిత్తుల కేన్సర్ని కూడా కలుగజేస్తుంది. కాని ఇది శరీరంలోని ఇతర భాగాలపై కూడా హానికరమైన ప్రభావాన్ని చూపిస్తుంది.

ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు

వివిధ రకాల ఊపిరితిత్తుల వ్యాధులు

వాతావరణంలో ఉండే కాలుష్య పదార్థాలు మన శరీరంలోని వివిధ అవయవాలపై దుష్ర్పభావాలు చూపిస్తుంటాయి. చర్మం , కళ్లపైనే కాకుండా , ఊపిరితిత్తులపైన కూడా ఈ ప్రభావాలు ఉంటాయి. శ్వాస తీసుకున్నప్పుడు గాలిలో సూక్ష్మంగా ఉండే పదార్థాలు ఊపిరితిత్తులో చేరుతాయి. వీటిలో ఎక్కువ భాగం శ్వాస నాళాలలోని ద్రవ పదర్థాలలో చేరి కఫం ద్వారా బైటికి నెట్టివేయబడతాయి. వ్యాధి నిరోధక శక్తి కలిగించే ఐజి-ఎ యాంటిబాడీస్‌ శ్వాస నాళాలలో చేరే క్రిముల నుండి దేహాన్ని రక్షిస్తాయి. తెల్ల రక్తకణాలు కూడా దీనికి దోహదపడతాయి.

గాలిలో సూక్ష్మంగా ఉండే బ్యాక్టీరియా , వైరస్‌లతో పాటు ఫంగస్‌ , దుమ్ము , ధూళి , పుప్పొడి లాంటి పదార్థాలు ఉంటాయి. వీటికి తోడు పరిశ్రమలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వివిధ రసాయన పదార్థాలు సల్ఫర్‌డై ఆకై్సడ్‌ , హైడ్రోజన్‌ సలె్పైడ్‌ , క్లోరిన్‌ , నైట్రికి ఆకై్సడ్‌ తదితరాలు ఉంటాయి. ఇలాంటి రసాయన పదార్థాలు పీల్చినప్పుడు దగ్గు , కఫం , పిల్లికూతలు , ఛాతీ పట్టేయడం జరుగుతుంది. కొందరిలో కెమికల్‌ నీమోనైటిస్‌ అనే సమస్య వస్తుంది. కొందరిలో వాతావరణ మార్పులు జరుగుతు న్నప్పుడు వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి.

వీరిలో జలుబు , జ్వరం , ఒళ్లునొప్పులు , ఆకలి మందగించడం , తలపోటు వంటి లక్షణా లు ఉంటాయి.ఇలా సంవత్సరంలో రెండు , మూడు సార్లు వైరస్‌ ఇన్‌ఫెక్షన్లు రావచ్చు. రెస్పిరేటరీ సిన్నసషియల్‌ వైరస్‌ , రైనోవైరస్‌ , ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ దీనికి కారణం , వ్యాధి నిరోధక శక్తి మందగించినప్పుడు ఇలాంటి వారిలో న్యూమెనియా కూడా రావచ్చు. దీనికి కమ్యూనిటీ ఆకై్వర్డ్‌ న్యూమోనియా అంటారు. దగ్గినపుడు , తుమ్మినపుడు శ్వాసనాళాలో నుండి వెలువడే గాలి తుంపరల వల్ల ఒకరినుండి మరొకరికి జబ్బులు వస్తాయి. క్షయవ్యాధి ఉన్నవారు దగ్గినప్పుడు వారిలో ఉండే టి.బి. బ్యాక్టీరియా గాలి తుం పర్ల ద్వారా ఇతరుల ఊపిరితిత్తులలోకి చేరుకుంటాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తి వలన నిస్తేజమవుతాయి. కాబట్టి కొద్దిమందిలో మాత్రమే వ్యాధి ప్రబలే అవకాశం ఉంది.

ఈ వ్యాధి ఇతరులకు రాకుండా ఉండాలంటే దగ్గినప్పుడు మొహానికి అడ్డంగా రుమాలు ఉంచుకోవడం ఎంతైనా అవసరం. కొంతమందిలో గాలిలో ఉండే ఫంగస్‌ , ఆస్పర్జిల్లస్‌ , కాండిడా , పెన్సిల్లియమ్‌లు ఊపిరితిత్తు లోకి చేరి న్యూమోనియా , ఉబ్బసం , ఎక్స్‌ట్రిన్సిక్‌ ఎలెర్జిక్‌ అల్వియోలైటిస్‌ అనే వ్యాధులు కలుగచేస్తాయి. సాధరాణంగా వాడే యాంటిబయోటిక్స్‌ వలన న్యూమోనియా తగ్గినప్పుడు ఫంగస్‌ న్యూమోనియా ఉందేమోననే అనుమానం కలుగుతుంది. క్యాన్సర్‌ వ్యాధి ఉన్న వారిలోనే కాకుండా క్యాన్సర్‌ మందులు వాడుతున్న వారిలో కూడా ఇలాంటివి కనిపిస్తుంటాయి.

ఇతర వ్యాధుల చికిత్స కోసం ఆసుపత్రులలో అత్యధిక కాలం ఉన్న వారిలో వచ్చే న్యూమోనియాను హాస్పిటల్‌ ఆకై్వర్డ్‌ న్యూమోనియా అంటారు. ఆసుపత్రి వాతావరణంలో ఉండే బ్యాక్టీరియా సాధారణ వాతావరణంలో ఉండే బ్యాక్టీరియా కంటే భిన్నంగా ఉంటుంది. వీటిలో కెల్సియెల్లా , సూడోమోనాస్‌లు ముఖ్యమైనవి. శక్తివంతమైన యాంటిబయోటిక్స్‌ వాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి జ్వరం తగ్గకుండా ఉంటుంది. న్యూమోనియా శరీరమంతా పాకి సెప్టిసీమియా వస్తుంది. మామూలుగా కొన్ని సూక్ష్మక్రిములు ముక్కు , గొంతులో జబ్బేమీ కలుగజేయకుండా ఉంటాయి. మత్తు పదార్థాలు సేవించే వారిలో నోటిలోని లాలాజలం , ఆహారంతో పాటు ఇవి స్వరపేటికను దాటి శ్వాస నాళాలలోకి ప్రవేశిస్తాయి.వీటి వల్ల బ్రాంకటైటిస్‌ , యాస్పిరేషన్‌ న్యూమోనియా వస్తుంది.

ఊపిరితిత్తుల వ్యాధులు శ్వాస ద్వారానే కాకుండా ఇతర కారణాల వలన కూడా రావచ్చు. కాలేయంలో చీము గడ్డలు ఏర్పడినప్పుడు వాటిలో ఉండే బ్యాక్టీరియా , అమీబా వంటి సూక్ష్బజీవులు డయాఫ్రంను దాటి ఊపిరితిత్తులలోకి చేరుకుంటాయి. న్యూమోనియా , హెపాటిక్‌ పల్మొనరీ అమీబియాసి వీటితో కలిగే వ్యాధులు. ఛాతిలో నీరు , చీము కూడా వస్తుంటుంది.కడుపులో నీరు , చీము ఇదే విధంగా డయాఫ్రంలో ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా ముఖ్యంగా కుడివైపున ఉన్న ఫ్లూరల్‌ కేవిటీలోకి చేరి ఫ్లూరల్‌ ఎఫ్యూజన్‌ , ఎంపరుూమ వ్యాధులను కలుగజేస్తాయి.

మూత్రపిండాలు , గర్భాశయానికి చెందిన ఇన్‌ఫెక్షన్లు రక్తం ద్వారా శ్వాసకోశాలకు చేరి ఆక్యూట్‌రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిండ్రోమ్‌ అనే వ్యాధిని కలుగచేస్తాయి. సాధారణంగా ఇటువంటి ఇన్‌ఫెక్షన్లు గ్రామ్‌ నెగటివ్‌ బ్యాక్టీరియా , స్టెఫలోకాకస్‌ బ్యాక్టీరియాలకు సంబంధించినవై ఉంటాయి.చర్మంలో గానీ , శరీరంలోని ఏ ఇతర అవయంలలో కానీ ఇన్‌ఫెక్షన్‌ వచ్చినా అది సెప్టిక్‌ పదార్థాలుగా మారి రక్తం ద్వారా శ్వాసకోశాలకు చేరుతుంది. ఊపిరితిత్తులు ఇలా రక్తం ద్వారా వచ్చే క్రిములను , సెప్టిక్‌ ఎంబాలైలను ఫిల్టర్‌ చేస్తుంది. కనుక ఈ సూక్ష్మక్రిములు ఊపిరితిత్తులలో పేరుకుపోయి లంగ్‌ ఇన్‌ఫెక్షన్‌ను కలుగచేస్తాయి. రుమాటిక్‌ హార్ట్‌ డిసీజ్‌ ఉన్న వారిలో గుండెలోని కుడిభాగం కవాటాలు ఇన్‌ఫెక్టై తద్వారా శ్వాసకోశాల్లోకి ఈ ఇన్‌ఫెక్షన్‌ పల్మొనరీ ఆర్డరీ ద్వారా వ్యాపిస్తుంది.

కాలుష్యంతో ఆరోగ్యానికి ముప్పు...

రోజురోజుకీ జనాభా పెరగిపోతోంది. పరిశ్రమలు , వాహనాలతో కాలుష్యం మరింత ఎక్కువవుతోంది.పెరుగుతున్న కాలుష్య ప్రభావం మనమీద ఎంతగానో ఉంటోంది. రకరకాల రోగాలు ప్రబలుతున్నాయి. మనలో పెరుగుతున్న దురలవాట్ల ప్రభావం కూడా దీనికి తోడవుతుంది. ధూమపానం చేసే వాళ్ల ముక్కు , గొంతులలలో దురద , ఇన్‌ఫెక్షన్స్‌ , ఆస్త్మాలాంటి వ్యాధులు రావచ్చు. పొగత్రాగేవాళ్లలో కొందరికి క్యాన్సర్‌ రావచ్చు. చిన్నప్పటి నుంచి పొగత్రాగే వాళ్లలో పాదాలకు రక్తప్రసరణ తగ్గి బర్జర్స్‌ డిసీజ్‌ రావచ్చు. ఈ వ్యాధిలో క్రమంగా వేళ్లు , పాదాలలోని సన్నని రక్తనాళాలు దెబ్బతిని , రక్త ప్రసరణ లేక గాంగ్రీన్‌ వస్తుంది. క్రమంగా కాళ్లని తీసి వేయాల్సిన పరిస్థితిరావచ్చు.

గర్భిణీ స్ర్తీలు పొగత్రాగనే కూడదు. పక్కనుండే వాళ్లు పొగత్రాగినా వారి ప్రభావం వీళ్ల మీద పడుతుంది.దీని వల్ల పుట్టిన పిల్లలో బరువు తక్కువ ఉంటుంది. నెలలు నిండకుండానే డెలివరీ రావచ్చు. కారణం లేకుండా పిల్లలు చనిపోవచ్చు. పొగత్రాగడం వల్ల త్రాగేవారికి అనారోగ్యం కలుగుతుంది. అంతేకాదు , వీళ్లు విడిచే పొగని పీల్చే చుట్టు ప్రక్కల వాళ్ల ఆరోగ్యం పాడవుతుంది కూడా. వాతావరణంలోకి పొగని విడిచిపెట్టే వాహనాలకు , వీళ్లకు తేడా ఉండదు. ముఖ్యంగా చంటి పిల్లల ముందు సిగరెట్‌ లాంటివి కాల్చడం మరీ ప్రమాదకరం. ఇలాంటి కలుషిత గాలి పీల్చడం వల్ల చిన్న పిల్లల్లో న్యుమోనియా , దగ్గు , ఆయాసం , పిల్లి కూతలలాంటివి వస్తాయి.

మనం పీల్చే ఇన్‌హేలర్స్‌లో క్లోరోఫ్లోరో కార్బన్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి క్రమంగా వాతావరణంలోకి ప్రవేశించి రేడియేషన్‌ దుష్ర్పభావాన్నుంచి మనల్ని కాపాడుతున్న ఓజోన్‌ పొరని దెబ్బతీస్తాయి. ఒజోన్‌ పొర దెబ్బతింటే ఫిల్టర్‌ కాకుండా సరాసరి వచ్చే అట్ట్రావయోలెట్‌ కిరణాల వ్లస్కిన్‌ క్యాన్సర్స్‌ , కెటరాక్ట్‌ లాంటి వ్యాధులు రావచ్చు. ఎసి. ఫ్రిజ్‌లోనూ ఈ క్లోరో ఫ్లోరో కార్బన్‌లుంటాయి. పరిశ్రమలు కూడా విపరీతంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇవి వదిలే కాలుష్యాల వల్ల రకరకాల రోగాలొస్తున్నాయి. ఉదాహరణకి కాటన్‌ ఇండస్ట్రీలో పనిచేసే వాల్లకి బైసినోసిస్‌ , షుగర్‌కేర్‌ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్లకి బాగాసోసిస్‌ , యాస్బెస్టాస్‌ కంపెనీలో పనిచేసే వాళ్లకి యాస్టెస్టోసిస్‌ అనారోగ్యాలు కలుగుతాయి.

ఇలాంటి వృత్తుల్లో పనిచేఏ వాళ్లు ముక్కుకు మాస్క్‌ని ధరించడంతో పాటు మిగతా జాగ్రత్తలూ తీసుకోవాలి.జాగ్రత్తలు తీసుకుంటే ఆ వ్యక్తులకు కొంత మేలు జరుగవచ్చు. గానీ వాతావరణ కాలుష్యం పెరుగుతుంది కదా.గాలిలో కలిసి ఉండే దుమ్ము , ధూళీ , గ్యాస్‌ పార్టికల్స్‌ సూర్యకిరణాలలలో కలసి రసాయనిక సంయోగం చెంది ఫొటోకెమికల్‌ సొల్యూషన్‌ ఉత్పత్తి అవుతుంది. సల్ఫర్‌ డయాకై్సడ్‌ , క్లోరిన్‌ లాంటి వాయువులు వాతావరణంలో కలిసిపోయి ప్రజల ఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్నాయి.

మనం ఎలా శ్వాసిస్తున్నాం...

మనం మామూలుగా గాలిని ముక్కు ద్వారా పీల్చుకుంటాం. శ్వాసతోనే మనం జీవిస్తాం. వాతావరణంలో తక్కువ తేమతో ఉండే చలిగాలి సరాసరి శ్వాసనాళాలలోకి వెళ్లకుండా ముక్కు ద్వారా వెచ్చగా అయి నీటి ఆవిరిని కూడా కలుపుకొని శ్వాసనాళాల్లోకి వెళ్తుంది. ముక్కు నుంచి నేసోఫారింక్స్‌ , లారింక్స్‌ ఆ తరువాత ట్రేకియాలోకి వెళ్తుంది. ట్రేకియా చివరి భాగంలో శ్వాసనాళం రెండుగా చీలి ఉంటుంది. వీటిని బ్రాంకై అంటారు. ఇవి విడివిడిగా ఒక్కొక్క ఊపిరితిత్తులోకి వెళ్తాయి. క్రమంగా ఈ నాళంరెండుగా చీలుతూ ఊపిరితిత్తులను ఆక్రమిస్తాయి. రెండు మి.మీ.ల కంటే సన్నగా ఉండే శ్వాసనాళాలను స్మాల్‌ ఎయిర్‌వేస్‌ అంటారు.

ఊపిరితిత్తులలో ఈ శ్వాసనాళాల చివరి భాగాలు టెర్మినల్‌ బ్రాంకియోల్‌ , రెస్పిరేటరీ బ్రాంకియోల్‌ , ఆల్వియోలార్‌ డక్ట్స్‌లోకి చేరి అంతమవుతాయి. ఊపిరితిత్తులు రెండూ గొంతు దిగువ భాగాన ఛాతీ కుహరంలో ఒకదాని పక్కన మరొటి ఉంటాయి. ఈ రెండింటి మధ్య భాగంలో ఉండే ఖాళీ స్థలాన్ని మీడియస్టినమ్‌ అంటారు.. మీడియాస్టినమ్‌ మధ్య భాగంంలో గుండె , దాని నుంచి వచ్చే రక్తనాళాలు ఉంటాయి. ఒక్కొక్క ఊపిరితిత్తిని ఒక్కొక్క పొర ఆవరించి ఉంటుంది. ఊపిరితిత్తికి అతుక్కొని ఉండే పొరను విస్రల్‌ఫ్లూరా అంటారు. దాని పైభాగంలో ఉండే పొరని పెరైటల్‌ప్లూరా అంటారు. ఈ రెండు పొరల మధ్య ఉండే స్థలాన్ని ప్లూరల కేవిటీ అంటారు.

దీనిలో రక్తం నుంచి వచ్చే సీరమ్‌ సుమారు ఐదు నంచి పది మిల్లీ లీటర్లు ఉంటుంది.ఈ పొరల మధ్య నీరు , గాలి , ఇన్‌ఫెక్షన్‌ చేరితే అనారోగ్యానికి గురువుతాం.ఊపిరితిత్తులు పిరమిడ్‌ల ఆకారంలో ఉంటాయి.చిన్న ిపిల్లలు ఊదుకునే బెలూన్స్‌లా ఇవి చాలా మెత్తటి అవయవాలు. బ్రౌనిష్‌ రెడ్‌ రంగులో ఉంటాయి. కుడివైపు ఉండే ఊపిరితిత్తిలో మూడు , ఎడమవైపు ఉండే ఊపిరితిత్తిలో రెండు లోబ్స్‌ ఉంటాయి. అయితే కుడివైపు ఊపిరితిత్తిలో మూడు భాగాలున్నా సైజులో మాత్రం చిన్నగా ఉంటుంది.ఎడమ ఊపిరితిత్తి పరిమాణం 55 శాతం ఉంటే కుడి ఊపిరితితి ్తపరిమాణం 45 శాతం ఉంటుంది.

డా బి.శ్యామ్‌సుందర్‌ రాజు ,
పల్మొనాలజిస్ట్‌.
ఫోన్‌ నెం. 93940 18040

ఆధారము: ఆయురారోగ్యాలు బ్లాగ్

ఉదరకోశపు క్షయ అవగాహన

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా, ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు. ఆరోగ్యముగా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు. మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము. ఇప్పుడు -ఉదరకోశపు క్షయ అవగాహన(Abdominal T.B-Awareness) - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం!. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి.

క్షయ వ్యాధికి గురైన మొత్తం బాధితుల్లో సుమారు 5 శాతం మంది ఉదరకోశ క్షయతో బాధపడుతున్నారని గణాంకాలు తెలియజేస్తు న్నాయి. వీరిలో 25 నుంచి 60 శాతం మందికి పెరిటోనియల్‌ క్షయకు గురవుతున్నారు ఊపిరి తిత్తులకు సోకే క్షయతోపాటు, ఉదరకోశానికి సోకే క్షయ వ్యాధికి గురైన వారు 20 నుంచి 50 శాతం వరకూ ఉన్నారు.

వివిధ కారణాల వల్ల మనిషి వ్యాధి నిరోధక శక్తిని అణచివేసే మందులను (ఇమ్యునో సప్రెసెంట్స్‌) వాడటం, హెచ్‌ఐవి / ఎయిడ్స్‌ మొదలైన వ్యాధుల కారణంగా ఉదరకోశపు క్షయ తిరిగి విజృంభిస్తూ ఆందోళన కలిగించే స్థాయికి చేరుతోంది.
ఉదరకోశంలోని పెరిటోనియం, మీసెట్రీ, లింఫ్‌నోడ్స్‌, పేవులు ఇతర అవయవాలు క్షయ వ్యాధికి గురి కావచ్చు. ఇది అనేక రకాల వ్యాధుల లక్షణాలను ప్రదర్శించవచ్చు. ఉదా హరణకు ఇన్‌ఫ్లమేటరీ బొవెల్‌ డిసీజ్‌, కేన్సర్‌, ఇతర ఇన్‌ఫెక్షన్స్‌లో కనిపించే లక్షణాలు ఈ వ్యాధిలో కూడా కనిపించే అవకాశాలున్నాయి.

ఈ వ్యాధి సరైన సమయంలో తగిన చికిత్స తీసుకోని పక్షంలో దీర్ఘకాలిక వైకల్యానికి లేదా ఇతరత్రా ఇక్కట్లకు దారి తీయవచ్చు. ఈ కారణంగా వ్యాధిని తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం అవసరం.
ఉదరకోశపు క్షయ వ్యాధి సోకిన ఉదరంలోని అవయవాన్ని అనుసరించి వివిధ రకాలైన లక్ష ణాలను ప్రదర్శిస్తుంది కనుక వాటిని నిర్ధారిం చడానికి కంప్యూటెడ్‌ టోమోగ్రఫీ (సి.టి.) స్కాన్‌ పరీక్ష చేయాల్సి ఉంటుంది. సి.టి. పరీక్ష ద్వారా ఉదరకోశంలోని అన్ని అవయవా లను ఒకేసారి పరీక్షించడానికి అవకాశం ఉంటుంది.

ఉదరకోశంలో క్షయ వ్యాధి సోకడానికి ప్రధాన కారణం మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యు లోసిస్‌ లేదా మైకోబాక్టీరియం ఏవియం అనే సూక్ష్మక్రిములు. వ్యాధి నిరోధక శక్తిని అణచడా నికి ఔషధాలు సేవించే వారిలో రెండవరకం సూక్ష్మక్రిమి సాధా రణంగా కనిపిస్తుంటుంది.
కలుషిత ఆహారం ద్వారా ఈ బాక్టీరియా శరీ రంలోకి చేరుతుంది. చిన్న ప్రేవులు, లింఫ్‌ నోడ్స్‌ మొదలైనఅవయవాల క్షీణతకు ఈ బ్యాక్టీ రియా కారణమవుతుంది. ఈ అవయవాలు చిట్లిపోవడం ద్వారా బాక్టీరియా పెరిటోనియం లోకి చేరి పెరిటోనియల్‌ ట్యుబర్‌క్యులోసిస్‌కు దారి తీస్తుంది.

ఉదరకోశ క్షయ వ్యాధుల్లో అత్యంత సాధార ణంగా కనిపించే వ్యాధి పెరిటోనియల్‌ టిబి. పెరిటోనియల్‌ టిబి మూడు రకాలు.
ద్రవాలతో నిండిన సంచులు లేదా జలో దరంతో కూడిన తడితో కూడిన (వెట్‌ టైప్‌) టిబి ఒక రకం.
లింఫ్‌ ఎడినోపతి, ఉదరకోశ కండరాలు ముద్దలాగా కనిపించే పొడి రకపు (డ్రై టైప్‌) టిబి రెండవ రకం. ఒమెంటమ్‌ మందంగా మారడం వల్ల కంతుల మాదిరిగా కనిపించే క్షయ మూడవ రకం.

వీటిలో మూడవరకం క్షయను ఉదర కుహ రంలో ఏర్పడిన కంతులని పొరబడటం జరుగు తుం టుంది. ఆహార నాళానికి సోకే క్షయ వ్యాధి అత్యంత సాధారణంగా ఇలియమ్‌, సీకమ్‌ భాగాలకు సోకుతుంది. ఇతర భాగాల విషయంలో పెద్దపేగు, జెజునమ్‌, మలా శయం, డుయోడినమ్‌, జీర్ణకోశ భాగాలకు ఆరోహణా క్రమంలో సోకుతుంది.
ఆహార నాళానికి సోకే క్షయ అల్సర్‌ రకంగా కానీ, హైపర్‌ప్లాస్టిక్‌ రకంగా కాని, ఈ రెండింటి కలయికగా కానీ కనిపిస్తుంది. ఇలియమ్‌, సీకమ్‌ భాగాలకు (ఇలియో సీకల్‌) సోకే క్షయ ఎక్కువగా హైపర్‌ప్లాస్టిక్‌ రకంగా ఉంఉంది.

ఉదరకోశంలో సోకే క్షయ వివిధ రూపాలుగా కనిపి స్తుంది. సి.టి. స్కాన్‌ ద్వారా దీనిని సమగ్రంగా పరీక్షిం చడం సాధ్యమవుతుంది.
ఉదరకోశ క్షయ వ్యాధికి గురైన వారిలో కనిపించే లక్షణాలు - కడుపు నొప్పి, వాపు, జ్వరం, రాత్రి వేళల్లో చెమటలు పట్టడం, ఆకలి లేక పోవడం, బరువు తగ్గిపోవడం మొదలైనవి.

ఉదరకోశ క్షయ వ్యాధికి గురయ్యే వారిలో అత్యధికులు పేదవర్గాలకు చెందిన వారే. ఉదర కోశ క్షయ వ్యాధికి గురైన వారికి ఛాతీ ఎక్స్‌రే తీసినప్పుడు, ఊపిరితిత్తుల క్షయకు గురైన దాఖలేవీ కనిపించలేదు. చర్మానికి సంబంధిం చిన క్షయ కోసం చేసే పరీక్షల ఫలితాలు కూడా కొన్ని కేసుల్లో నెగటివ్‌గా వచ్చాయి.

ఉదరకోశ క్షయ వ్యాధికి గురైన వారిలో అత్యధికులు కడుపు నొప్పి, కడుపులో నీరు చేరి ఉబ్బిపోవడం (అసైటిస్‌) వంటి లక్షణాలతో చికిత్స కోసం వైద్యుల వద్దకు వస్తుంటారు. కొందరిలో అసైటిస్‌ లేకుండా కడుపు నొప్పి మాత్రమే ఉండవచ్చు.
ఉదరకోశానికి క్షయ వ్యాధి సోకినప్పుడు హిస్టొపాథొలాజికల్‌ పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారించవచ్చు. అంతేకాకుండా, కేన్సర్‌ వంటి ఇతర వ్యాధులు సోకిన విషయాన్ని కూడా పరీక్షించవచ్చు.

చికిత్స :
టి.బి. జబ్బులో వాడే మందులే వాడలి . ఒక కోర్సు పూర్తి కాలము వాడాలి.
శరీరంలో క్షయ వ్యాధి ఏ భాగంలో ఉన్నప్పటికీ చికిత్సా విధానం మాత్రం ఒకటే. రిఫాంపిసిన్‌, ఐసోనెక్స్‌, ఇతాంబ్యుటాల్‌ వంటి మందులతో వ్యాధిని పూర్తిగా నయం చేయ వచ్చు. ఈ వ్యాధికి కనీసం 6 నెలలు క్రమం తప్పకుండా వైద్య సలహాపై మందులు వాడాలి. మందులు వాడటం మొదలుపెట్టిన నెల రోజుల్లో రోగికి చాలా వరకూ ఉపశమనం వస్తుంది. కానీ ఆరు నుంచి తొమ్మిది నెలల పాటు తప్పనిసరిగా మందులు వాడాలి. కొంత మంది ఉపశమనం లభించిందని మందులు వాడటం మానేస్తుంటారు. ఇటువంటి వారికి వ్యాధి తిరిగి ఆరంభమవుతుంది.

వ్యక్తిగత శుభ్రత, పరిసరాల శుభ్రతతోపాటు ఇళ్లలో గాలి, వెలుతురు మొదలైనవి బాగా ఉండేలా చూసుకోవాలి. దగ్గినప్పుడు, తుమ్మిన ప్పుడు చేతి రుమాలు అడ్డంగా పెట్టుకోవాలి. ఎక్కడపడితే అక్కడ కళ్లె ఉమ్మేయకూడదు.ఉమ్మి వేయడానికి మూత ఉన్న కప్పు ఉప యోగించాలి. మంచి పోషకాహారం తీసుకుని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింప జేసుకోవాలి.

ఆధారము: వైద్య రత్నాకరం బ్లాగ్

ఫిషర్స్‌

మలద్వారము దగ్గర చీలిక ఏర్పడడాన్ని ఆనల్ ఫిషర్ అంటారు. ఈ చీలిక వల్ల అల్సర్ తయారై దురద, నొప్పి, రక్తంకారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

కారణాలు

 • ఎక్కువ కాలం మలబద్దకం లేక విరేచనాలు ఉండటం వల్ల నరాల మీద ఒత్తిడి పెరిగి మలద్వారం చీరుకుపోయి అల్సర్ తయారవుతుంది.
 • మలబద్దకం ఉన్నప్పుడు మలవిసర్జన గట్టిగా జరగడం వల్ల చీలికవచ్చే అవకాశం ఉంది. విరేచనాల వల్ల ఎక్కువసార్లు కడగటం వల్ల మలద్వారం ఉబ్బిపోతుంది.
 • ఆనల్ క్రిప్ట్‌లో సూక్ష్మజీవులు ప్రవేశించడం వల్ల క్రిప్టైటిస్ వచ్చి చీలిక ఏర్పడి అల్సర్‌గా మారుతుంది.
 • కొంతమందిలో ఆనల్ ఫిషర్ నయం కాకుండా చాలా సార్లు దెబ్బతినడం వల్ల విపరీతమైన నొప్పి వస్తుంది.
 • మల విసర్జనలో సరిగా అరగని పదార్థాలు ఉండటం వల్ల మలద్వారం దగ్గర ఉన్న చర్మం చీలుకుపోతుంది.
 • ఆనోరెక్టల్ సర్జరీ, ప్రొక్టైటిస్, క్షయ, క్యాన్సర్ వల్ల కూడా ఆనల్ ఫిషర్ వచ్చే అవకాశాలున్నాయి.

లక్షణాలు

 • మలద్వారంలో చీలిక
 • దురద, నొప్పి, రక్తంకారటం.
 • మల విసర్జన తరువాత నొప్పి గంట వరకు ఉండటం.
 • ఎర్రటి రక్తం మలంతో కలిసి గానీ, తురువాత గానీ రావటం.
 • మలవిసర్జన సమయంలో నొప్పిగా ఉండటం.
 • ఆనల్ ఫిషర్ రావడానికి ఆనల్్ ఆబ్సిస్(చీముగడ్డ)కూడా కారణమే.

నిర్ధారణ

మలద్వారం దగ్గర చర్మం వేలాడుతూ ఉంటుంది. అల్సర్ కనిపిస్తూ ఉంటుంది. సిగ్నాయిడ్ స్కోప్, ఆనోస్కోప్, కొలనోస్కోప్ ద్వారా పరీక్షించి వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు.

చికిత్స

యాభైశాతం మందిలో ఫిషర్స్ ఎటువంటి ఆపరేషన్ లేకుండా వాటంతట అవే తగ్గిపోతాయి. మలద్వారం దగ్గర పరిశుభ్రంగా ఉంచుకోవటం, మల విసర్జన తరువాత కాటన్ గుడ్డతో తుడవటం వల్ల ఫిషర్ తొందరగా మానిపోతుంది. ఒకవేళ ఫిషర్ ఎక్కువ రోజులు ఉంటే మానడం కష్టమవుతుంది. సిట్స్ బాత్ (మలద్వారాన్ని ఇరవై నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో ఉంచడం) వల్ల ఫిషర్ వల్ల వచ్చే సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవటం, సమయానుసారంగా తినడం, సమయానికి మలవిసర్జనకు పోయే అలవాటు చేసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నొప్పి ఎక్కువగా ఉంటే ఎనస్తటిక్ ఆయింట్‌మెంట్ పైపూతగా రాసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

హోమియో మందులు

ఆసిడ్ నైట్రికమ్ :ఈ మందు ముఖ్యంగా శ్లేష్మపొర, చర్మం కలిసే దగ్గర సమస్య ఉంటే పనిచేస్తుంది. కుచ్చినట్లుగా నొప్పి, చిరాకు ఎక్కువగా ఉండటం, మలవిసర్జనకు కష్టపడాల్సి రావటం, మలవిసర్జన తరువాత గంటల తరబడి నొప్పి ఉండటం, మలంతో పాటు రక్తం పడుతుండటం, త్వరగా అలసిపోవటం, రాత్రివేళ చలిగానీ, వేడిగానీ ఎక్కువ ఉంటే బాధలు ఎక్కువ కావటం, ప్రయాణం చేస్తున్న సమయంలో ఉపశమనంగా అనిపించటం వంటి లక్షణాలున్న వారికి ఈ మందు ఉపయోగకరంగా ఉంటుంది.

ఆస్కులస్ హిప్ :ఈ ఔషధం పేగు కింది భాగంలో ఎక్కువగా పనిచేస్తుంది. పైల్స్‌తో పాటు నడుము నొప్పి ఉండటం, రక్తం తక్కువగా పడటం, హెమరాయిడల్ వీన్స్(సిరలు)నిండుగా ఉబ్బిపోయి ఉండటం, మలాశయం దగ్గర చిన్న చిన్న పుల్లలు ఉన్నట్లుగా అనిపించటం, నొప్పి కింది నుంచి పైకి వెళుతున్నట్లు అనిపించటం, నడిచినపుడు, మలవిసర్జన సమయంలో నొప్పి ఎక్కువ కావడం వంటి లక్షణాలున్న వారు వాడదగిన మందు ఇది.

అలోస్ సొకట్రీన :ఎక్కువ సమయం కూర్చుని ఉండే వారికి ఈ మందు బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా వయసు పైబడిన వారిలో చక్కగా పనిచేస్తుంది. మలాశయం దగ్గర నొప్పి, రక్తం ఎక్కువగా పడటం, చల్లటి నీటితో కడగినపుడు ఉపశమనంగా అనిపించటం, మలం జిగటగా రావడం, పైల్స్ బయటకు వేళాడుతూ ఉండటం వంటి లక్షణాలున్న వారు ఉపయోగించదగిన ఔషధం.

రటానియా:ఈ మందు ముఖ్యంగా మలాశయం పైన పనిచేస్తుంది. విపరీతమైన వెక్కిళ్లు, మలాశయం దగ్గర నొప్పి, మలవిసర్జన తరువాత నొప్పి కొన్ని గంటల వరకు ఉండటం, మలవిసర్జనకు కష్టపడాల్సి రావడం, మంట, చల్లటి నీటితో కడగటం వల్ల ఉపశమనంగా ఉండటం వంటి లక్షణాలున్న వారికి సూచించదగిన మందు.

మెర్క్‌కార్:మలవిసర్జన సమయంలో తీవ్రమైన బాధ, మలం వేడిగా, రక్తంతో కలిసి రావడం, జిగటగా, దుర్వాసనకూడా ఉండటం, రాత్రి సమయంలో బాధ ఎక్కువగా ఉండటం, కదలకుండా ఉన్నప్పుడు ఉపశమంగా అనిపించడం వంటి లక్షణాలున్నవారు వాడదగిన మందు.

పమోనియా :మలవిసర్జన తరువాత దురద, మంటగా ఉండటం, కాళ్లపైన, పాదాలపైన, మలాశయం వద్ద పుండ్లు తయారవడం, పైల్స్ లేత వంకాయ రంగులో ఉండటం వంటి లక్షణాలున్న వారికి సూచించదగిన మందు.

నక్స్‌వామికా:ఆధునిక జీవనం వల్ల ఈ సమస్య వచ్చినవారికి ఉపయోగపడే మందు. ఎక్కువ సమయం కూర్చుని పని చేసే వారికి ఈ మందు ఇవ్వవచ్చు. మలబద్ధకం, తరచుగా మలవిసర్జనకు వెళ్లాలనిపించడం, మలవిసర్జన కొంచెం కొంచెంగా రావటం, దురద, నొప్పి ఎక్కువగా ఉండటం, పైల్స్, ఉదయంపూట బాధ ఎక్కువవడం, నిద్ర పోయినపుడు ఉపశమనంగా అనిపించడం వంటి లక్షణాలున్న వారు ఉపయోగించదగిన మందు.

సల్ఫర్:వేడి పడదు, నీళ్లు అంటే ఇష్టం ఉండదు. చర్మం, వెంట్రుకలు పొడిబారి ఉంటాయి. ఎక్కువ సేపు నిలబడి ఉండలేరు. మలద్వారం వద్ద మంట, దురద ఉంటుంది. పొద్దున లేచిన వెంటనే విరేచనాలు అవుతాయి. పైల్స్ నుంచి రక్తస్రావం, పొడిగా, వెచ్చగా ఉండే వాతావరణంలో ఉపశమనంగా అనిపించటం వంటి లక్షణాలు ఉన్న వారు వాడదగిన మందు.

డా. మురళి అంకిరెడ్డి, హోమియోకేర్ ఇంటర్నేషనల్,
ఫోన్ : 9550001133, 9550001199

యానల్ ఫిషర్/ఆనల్ ఫిషర్

యానల్ ఫిషర్ అంటే...
మలద్వారం వద్ద చిన్న పగులులా కనిపించే ఇది తొలి దశలో మలద్వారం అంచునుంచి చిన్న చిరుగులా ఉంటుంది. అంటే తొలిదశలో ఇది కేవలం చర్మం పైపొరకు (ఎపిథీలియమ్‌కు) మాత్రమే పరిమితమవుతుందన్నమాట. ఆ దశలో ఎలాంటి చికిత్సా తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే అక్కడి మృదువైన లోపలి పొరల్లోనూ (మ్యూకస్ మెంబ్రేన్‌లలో) పగుళ్లు ఏర్పడి చీరుకుపోయే ప్రమాదం ఉంది.

ఫిషర్‌లలో రకాలు...

ఫిషర్ ఏర్పడిన వ్యవధిని బట్టి దీన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటిది అప్పటికప్పుడు కనిపించే అక్యూట్ ఫిషర్. రెండోది దీర్ఘకాలం పాటు కొనసాగుతూ బాధించే క్రానిక్ ఫిషర్.

ఆక్యూట్ ఫిషర్ : ఇందులో తొలుత మలద్వారం బయటి చర్మం చీరుకుపోయినట్లుగా అవుతుంది. ఆ తర్వాత అక్కడి మెత్తటి కణజాలం పొరల (మ్యూకోజా)లో కూడా పగుళ్లు ఏర్పడినట్లు అవుతుంది. ఒకవేళ ఈ ఫిషర్‌కు తగిన చికిత్స తీసుకోకుండా అలాగే వదిలేసి, అలా చాలాకాలం పాటు ఉంటే అదే దీర్ఘకాలం కొనసాగే ఫిషర్ (క్రానిక్ ఫిషర్)గా రూపొందవచ్చు.

క్రానిక్ ఫిషర్ : ఇలా దీర్ఘకాలం పాటు కొనసాగే క్రానిక్ ఫిషర్ నిర్దిష్టమైన లక్షణాలను కనబరుస్తుంది. ఉదాహరణకు మలద్వారాన్ని గట్టిగా పట్టేసినట్లుగా ఉంచి, బలంగా మూసుకుపోయేలా చేసే స్ఫింక్టర్ కండరాలు చీరుకుపోయినట్లుగా కనిపిస్తుంటాయి. ఫిషర్ చివరల్లో మలద్వారం వద్ద చీరుకుపోయిన చోట కండ పెరిగినట్లుగా ఉండి, దాని చివరభాగం బయటకు తోసుకొచ్చినట్లుగా
కనిపిస్తుంది.

ఫిషర్ రాకుండా నివారణ

ఫిషర్ నొప్పితో బాటు సామాజికంగా చాలా ఇబ్బందిని కలిగించే సమస్య. అందుకే వచ్చాక దీనికి చికిత్స చేయించుకోవడం కంటే అసలు రాకుండానే నివారించుకోవడం మేలు. పైగా ఫిషర్‌ను నివారించుకోవడం చాలా సులువు కూడా. నివారణ మార్గాలేమిటంటే...

 • మనం తీసుకునే ఆహారంలో పీచు ఎక్కువగా ఉండే ఆకుపచ్చటి ఆకుకూరలు, తాజా పండ్లు వంటివి ఎక్కువగా తీసుకోవడం, రోజులో ఎక్కువసార్లు మంచినీళ్లు తాగుతూ ఉండాలి.
 • మలం గట్టిగా మారడానికి తోడ్పడే ఆహారపదార్థాలైన మసాలాలూ, మాంసాహారం, పచ్చళ్ల మోతాదును గణనీయంగా తగ్గించుకోవడం వంటి జాగ్రత్తలతో ఫిషర్‌ను సమర్థంగా నివారించుకోవచ్చు.
 • మాటిమాటికీ నీళ్ల విరేచనాలు అవుతున్నవారు, ఇలా తరచూ ఎందుకు జరుగుతుందన్న విషయాన్ని డాక్టర్‌ను సంప్రదించి తెలుసుకుని తగిన చికిత్స తీసుకోవాలి.
 • మలవిసర్జన తర్వాత ఆ ప్రాంతాన్ని చక్కగా శుభ్రం చేసుకోవడం, పొడిగా ఉంచుకోవడం వంటి వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) విధానాలను పాటించాలి. మలవిసర్జన తర్వాత టాయిలెట్ పేపర్‌తో శుభ్రపరచుకునే వారు చాలా మృదువైన వాటిని ఉపయోగించడం మేలు.
 • ఒకవేళ అప్పటికే చిన్నపాటి ఫిషర్ ఉన్నవారు మలవిసర్జన సాఫీగా జరిగేలా అక్కడ ఒరిపిడిని తగ్గించే ల్యూబ్రికేటింగ్ ఆయింట్‌మెంట్స్ వాడాలి.

చికిత్స

ఆక్యూట్ ఫిషర్‌ను కనుగొన్నప్పుడు చేసే చికిత్సలో నేరుగా ఫిషర్‌కు చికిత్స చేయడం కాకుండా... దాదాపు 80 శాతం పైగా సందర్భాల్లో ఫిషర్ ఏర్పడటానికి కారణమైన అంశాలను నివారించడానికి చికిత్స చేస్తుండటం సాధారణంగా జరుగుతుంటుంది. ఇందులో భాగంగా మలబద్దకాన్ని నివారించే మందులు ఇవ్వడం, మలాన్ని మృదువుగా మార్చే ఔషధాలు వాడటం, మలవిసర్జన సమయంలో కలిగే నొప్పిని నివారించే మందులు ఇవ్వడం వంటివి చేస్తారు. మలవిసర్జన సాఫీగా జరిగేలా పేగు కదలికలు (బవెల్ మూవ్‌మెంట్స్) క్రమబద్ధంగా జరిగేలా చూస్తారు.

ఇక మొదటిదశ చికిత్స (ఫస్ట్ లైన్ ట్రీట్‌మెంట్)గా మలం మృదువుగా మారేలా స్టూల్‌సాఫ్టెనర్స్ ఇస్తారు. మలవిసర్జన తర్వాత తగినంత గోరువెచ్చని నీటితో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలని సూచించి, అక్కడ నొప్పిని తగ్గించడం, స్ఫింక్టర్ గట్టిగా బిగుసుకుపోవడాన్ని (స్ఫింక్టర్ స్పాజమ్) నిరోధించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు.
ఇలా ఫిషర్‌కు మొదటి దశ చికిత్స (ఫస్ట్ లైన్)ను నిర్లక్ష్యం చేస్తే సాధారణంగా 30% నుంచి 70% కేసుల్లో అది మళ్లీ తిరగబెడుతుంటుంది. కేవలం పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధి తిరగబెట్టడాన్ని 15% నుంచి 20%కి
తగ్గించవచ్చు.

ఇక రెండోదశ చికిత్సగా (సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్‌మెంట్) మలద్వారం లోపలికి 0.4% నైట్రోగ్లిజరిన్ వంటి మందులతో పాటు గ్లిజెరాల్ ట్రైనైట్రేట్ ఆయింట్‌మెంట్ వంటివి స్ఫింక్టర్ లోపల పూతమందుగా వాడాల్సి ఉంటుంది. నిఫైడిపైన్ ఆయింట్‌మెంట్, డిల్షియాజెమ్ ఆయింట్‌మెంట్ వంటి పూతమందులు కూడా బాగా పనిచేస్తాయి.

శస్త్రచికిత్స ప్రక్రియలు
ఆక్యూట్ ఫిషర్‌కు మందులను 3 నుంచి 4 వారాల పాటు వాడినా గుణం కనిపించని సందర్భాల్లోనూ లేదా యానల్ ఫిషర్ దీర్ఘకాలిక ఫిషర్ (క్రానిక్)గా రూపొందిన సమయాల్లోనూ శస్త్రచికిత్సను నిర్వహించాల్సి రావచ్చు. శస్త్రచికిత్స విధానాలివి...

స్ఫింక్టర్ డయలేషన్ : ఈ శస్త్రచికిత్సను శరీరమంతటికీ మత్తు మందు (జనరల్ అనస్థీషియా) ఇచ్చి నిర్వహిస్తారు. ఇందులో మలద్వారాన్ని గట్టిగా మూసుకుపోయేలా చేసే స్ఫింక్టర్‌ను వెడల్పు చేస్తారు. అయితే సాధారణంగా ఈ ప్రక్రియను చాలామంది డాక్టర్లు అంతగా సిఫార్సు చేయరు. ఎందుకంటే ఈ తరహా శస్త్రచికిత్స తర్వాత చాలామంది మలనియంత్రణపై అదుపు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ తరహా శస్త్రచికిత్స నిర్వహించాలంటే సర్జన్ మంచి నిపుణులై ఉండాలి.

ల్యాటరల్ ఇంటర్నల్ స్ఫింక్టరెక్టమీ : ఈ శస్త్రచికిత్స ప్రక్రియను కూడా సాధారణంగా పూర్తి మత్తు (జనరల్ అనస్థీషియా) లేదా వెన్నెముకకు మత్తుమందు (స్పైనల్ అనస్థీషియా) ఇవ్వడం ద్వారా నిర్వహిస్తారు. ఇందులో స్ఫింక్టర్‌లో గట్టిబారిన కండరప్రాంతాన్ని (హైపర్‌ట్రొఫాయిడ్ ఇంటర్నల్ స్ఫింక్టర్) జాగ్రత్తగా ఒలిచినట్లుగా చేసి తొలగిస్తారు. దాంతో స్ఫింక్టర్ కండరం తన బిగుతును కోల్పోయి మునుపటిలా మృదువుగా మారుతుంది. ఫలితంగా మలవిసర్జన సమయంలో ఒరిపిడి తగ్గి, క్రమంగా మలద్వారం వద్ద ఉన్న పగులు/చిరుగు క్రమంగా తగ్గిపోతుంది.

లక్షణాలు

మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఇలా వచ్చిన నొప్పి ఆ తర్వాత కొద్ది గంటల సేపు బాధిస్తుంటుంది. మలవిసర్జనకు వెళ్లిన ప్రతిసారీ నొప్పి తిరగబెడుతుంటుంది. దీంతో మలవిసర్జనకు వెళ్లాలంటేనే రోగి తీవ్రమైన ఆందోళనకు గురవుతుంటాడు. మలవిసర్జనకు వెళ్లడానికి విముఖత చూపుతుంటాడు. ఫలితంగా మలబద్దకం ఏర్పడి, మలవిసర్జన క్రమం (సైకిల్) దెబ్బతినవచ్చు. పైగా మలవిసర్జనకు వెళ్లడానికి విముఖత చూపుతూ... మాటిమాటికీ ఆపుకోవడం వల్ల మలం మరింత గట్టిగా మారి, మలవిసర్జన మరింత బాధాకరంగా పరిణమిస్తుంది.

చాలా మంది రోగుల్లో మల విసర్జన జరిగినప్పుడు రక్తస్రావం కావడం లేదా ప్రక్షాళన సమయంలో రక్తం చేతికి లేదా టాయిలెట్ పేపర్‌కు అంటడం జరుగుతుంది. అయితే ఫిషర్ విషయంలో ఎక్కువ రక్తస్రావం జరగదు. కాస్తంత రక్తం మాత్రమే కనిపించి, మలద్వార ప్రాంతంలో దురదగా (ప్రూరిటస్ యానీ) అనిపించవచ్చు. ఇక మరికొందరిలో మలద్వారం వద్ద దుర్వాసనతో కూడిన స్రావాలూ కనిపించవచ్చు. కొంతమందిలో మూత్రవిసర్జన కూడా నొప్పిగా ఉంటుంది. ఒక్కోసారి అసలు మూత్రవిసర్జన జరగడమూ కష్టం కావచ్చు.

నిర్ధారణ

రోగితో మాట్లాడి అతడి వ్యాధి చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకోవడం, మలవిసర్జన ద్వారం ప్రాంతాన్ని జాగ్రత్తగానూ, సున్నితంగానూ పరిశీలించడం ద్వారా ఫిషర్‌ను నిర్ధారణ చేయవచ్చు. ఒక్కోసారి పరీక్ష చేయడానికి రోగిని ఆ ప్రాంతంలో చూసినా కూడా ఫిషర్ కనిపించకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఆ ప్రాంతంలో పూతమందు రూపంలో లభ్యమయ్యే నొప్పి, స్పర్శ తెలియనివ్వని స్థానిక మత్తుమందు (టాపికల్ అనస్థీషియా)చ్చి పరిశీలించడం అవసరం కావచ్చు.

ఇక మలద్వారం నుంచి రక్తస్రావం అయ్యేవారిలో... ఆ ప్రాంతంలో గొట్టంతో పరీక్ష చేసే సిగ్మాయిడోస్కోపీ వంటి పరీక్షలు అవసరం కావచ్చు. సాధారణంగా రోగి 50 ఏళ్లలోపు వారైతే, ఈ తరహా పరీక్ష అవసరమవుతుంది. ఇక కొందరిలో 50 ఏళ్లు దాటాక మలద్వార క్యాన్సర్ ఉన్న కుటుంబ చరిత్ర ఉన్నవారైతే వారిలో పెద్దపేగునంతా పరిశీలించడానికి డాక్టర్లు కొలనోస్కోపీ పరీక్షను సిఫార్సు చేసే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ నేరుగా కాకుండా కొంతకాలం మందులు ఇచ్చి చూసి, మెరుగుదల కనిపించే తీరును బట్టి పై పరీక్షలను చేయాల్సి ఉంటుంది. ఇక కొందరిలో మలద్వారం స్ఫింక్టర్ మూసుకుపోయేందుకు కలిగే ఒత్తిడి ఎంత ఉందో పరిశీలించేందుకు యానోరెక్టల్ మ్యానోమెట్రీ అనే పరీక్షనూ నిర్వహించవచ్చు.

కారణాలు
నిజానికి ఇలా మలద్వారం చీరుకుపోయి ఫిషర్ ఏర్పడటానికి ఇతమిత్థమైన కారణాలు ఇంకా తెలియదు. కానీ మలవిసర్జన సమయంలో చీలికను ఒరుసుకుంటూ మలం బయటికి రావడం వల్ల, తీవ్రమైన నొప్పి వల్ల దీని ఉనికి తెలుస్తుంది.  మనం తీసుకునే ఆహారంలో ఆకుపచ్చటి ఆకుకూరలు, తాజాపండ్ల వంటి  పీచును కలిగి ఉండే పదార్థాలు తక్కువగా ఉండటం వల్ల కూడా ఫిషర్ ఏర్పడుతుందని అనేక అధ్యయనాల్లో నిర్ధారణ అయ్యింది.  కొన్ని సందర్భాల్లో మలద్వారం వద్ద ఉండే కండరాలు గట్టిగానూ, మందంగానూ మారడం వల్ల మలవిసర్జన సాఫీగా సాగక బలంగా ఒరుసుకుపోతూ జరుగుతుంది. దీనివల్ల అక్కడ చీలిక ఏర్పడటం, చిరిగినట్లు కావడం వల్ల కూడా ఫిషర్ రావచ్చు.

కొంతమందిలో మలబద్దకం వల్ల ముక్కి ముక్కి మల విసర్జన చేయాల్సి వస్తుంటుంది. మలం చాలా గట్టిగా మారడం వల్ల ఇలా జరుగుతుంది. ఇలా మలం గట్టిగా ఉండటం కారణంగా మల విసర్జన సమయంలో ఆ ప్రాంతం చీరుకుపోవచ్చు. ఇక మరికొందరిలో దీర్ఘకాలం పాటు నీళ్లవిరేచనాలు అవుతుండటం వల్ల... దీర్ఘకాలం ఆ ప్రాంతం తడిగానూ, తేమగానూ ఉండటం వల్ల కూడా ఆ ప్రాంతానికి రక్తసరఫరా తగ్గి ఫిషర్ ఏర్పడవచ్చు.

మల విసర్జన తర్వాత ఇక అక్కడి నుంచి మలం లీక్ కాకుండా ఉండేందుకు మలద్వారాన్ని చాలా గట్టిగా మూసుకుపోయేలా చేసే స్ఫింక్టర్ కండరాలు ఉంటాయి. అందువల్లనే మనకు మల విసర్జన తర్వాత మళ్లీ ఇంకొక సారి మల విసర్జనకు వెళ్లే వరకు ఎలాంటి మలమూ లీక్ కాదు. అయితే ఏదైనా కారణం వల్ల మలద్వార ప్రాంతంలో శస్త్రచికిత్స జరిగితే స్ఫింక్టర్‌కు గాయం కావచ్చు లేదా మలద్వారం ఉండాల్సిన రీతిలో కాకుండా సన్నబడిపోవచ్చు. ఇలా సన్నబడిపోవడాన్ని స్టెనోసిస్ అంటారు. ఇలాంటిది జరిగినప్పుడు ఆ సన్నబడ్డ ద్వారం నుంచి మలం బయటకు రావాలంటే చాలా బలంగా ఒత్తిడి కలిగించాల్సి వస్తుంటుంది. ఈ కారణంగా మలద్వారం చీరుకుపోయి ఫిషర్‌కు దారితీసే ప్రమాదం ఉంది.

 • కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలిక టీబీ, ల్యూకేమియా, క్యాన్సర్లు, ఎయిడ్స్ వంటి జబ్బులు దీర్ఘకాలంలో మలవిసర్జన ప్రాంతంలో ఇన్‌ఫ్లమేషన్ కలిగించడం, అది క్రమంగా ఫిషర్‌కు దారితీయడం కూడా జరగవచ్చు.
 • సెక్స్ ద్వారా సంక్రమించే వ్యాధులు (ఎస్‌టీడీలు) సోకినప్పుడు అవి క్రమంగా ముదిరి దీర్ఘకాలంలో ఫిషర్‌కు దారితీయవచ్చు. ఉదాహరణకు సిఫిలిస్, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్, క్లమీడియా వంటి వ్యాధులు మలవిసర్జన ద్వారానికీ విస్తరించడం వల్ల అక్కడ పగుళ్లు రావడం, చీరుకుపోవడం జరిగి ఫిషర్ ఏర్పడవచ్చు.
 • ఇక మహిళల్లో ప్రసవం సమయంలోనూ మలద్వారం చీరుకుపోయి ఫిషర్ రావచ్చు.
 • కొందరిలో క్రోన్స్ డిసీజ్, మాటిమాటికీ మలవిసర్జనకు వెళ్లాల్సి వచ్చే అల్సరేటివ్ కొలైటిస్, మలవిసర్జన తర్వాత మలద్వార ప్రాంతాన్ని శుభ్రంగానూ, పొడిగానూ ఉంచుకోకపోవడం వంటి వ్యక్తిగత పరిశుభ్రత విధానాలు పాటించకపోవడం (పూర్ టాయిలెటింగ్ హ్యాబిట్స్) కూడా ఫిషర్‌కు దారితీయవచ్చు.

శస్త్రచికిత్స ప్రక్రియలు

ఆక్యూట్ ఫిషర్‌కు మందులను 3 నుంచి 4 వారాల పాటు వాడినా గుణం కనిపించని సందర్భాల్లోనూ లేదా యానల్ ఫిషర్ దీర్ఘకాలిక ఫిషర్ (క్రానిక్)గా రూపొందిన సమయాల్లోనూ శస్త్రచికిత్సను నిర్వహించాల్సి రావచ్చు. శస్త్రచికిత్స విధానాలివి...

స్ఫింక్టర్ డయలేషన్ : ఈ శస్త్రచికిత్సను శరీరమంతటికీ మత్తు మందు (జనరల్ అనస్థీషియా) ఇచ్చి నిర్వహిస్తారు. ఇందులో మలద్వారాన్ని గట్టిగా మూసుకుపోయేలా చేసే స్ఫింక్టర్‌ను వెడల్పు చేస్తారు. అయితే సాధారణంగా ఈ ప్రక్రియను చాలామంది డాక్టర్లు అంతగా సిఫార్సు చేయరు. ఎందుకంటే ఈ తరహా శస్త్రచికిత్స తర్వాత చాలామంది మలనియంత్రణపై అదుపు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ తరహా శస్త్రచికిత్స నిర్వహించాలంటే సర్జన్ మంచి నిపుణులై ఉండాలి.

ల్యాటరల్ ఇంటర్నల్ స్ఫింక్టరెక్టమీ : ఈ శస్త్రచికిత్స ప్రక్రియను కూడా సాధారణంగా పూర్తి మత్తు (జనరల్ అనస్థీషియా) లేదా వెన్నెముకకు మత్తుమందు (స్పైనల్ అనస్థీషియా) ఇవ్వడం ద్వారా నిర్వహిస్తారు. ఇందులో స్ఫింక్టర్‌లో గట్టిబారిన కండరప్రాంతాన్ని (హైపర్‌ట్రొఫాయిడ్ ఇంటర్నల్ స్ఫింక్టర్) జాగ్రత్తగా ఒలిచినట్లుగా చేసి తొలగిస్తారు. దాంతో స్ఫింక్టర్ కండరం తన బిగుతును కోల్పోయి మునుపటిలా మృదువుగా మారుతుంది. ఫలితంగా మలవిసర్జన సమయంలో ఒరిపిడి తగ్గి, క్రమంగా మలద్వారం వద్ద ఉన్న పగులు/చిరుగు క్రమంగా తగ్గిపోతుంది.

శస్త్రచికిత్స వల్ల కలిగే దుష్పరిణామాలు
ఫిషర్‌కు శస్త్రచికిత్స వల్ల కలిగే మేళ్లతో పాటు కొన్ని దుష్పరిణామాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఫిషర్‌కు శస్త్రచికిత్స చేశాక, అది నిర్వహించిన ప్రాంతం గాలిసోకని విధంగా, అవయవాల ముడుతల్లో ఉంటుంది కాబట్టి అక్కడ ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఎక్కువగానే ఉంటుంది. ఒక్కోసారి శస్త్రచికిత్స తర్వాత రక్తస్రావం కూడా కావచ్చు. ఫిషర్ క్రమంగా లోపలివైపునకు సాగుతూ పేగుల్లో పొడుగాటి పైపులా పాకే ‘ఫిస్టులా’ అనే కండిషన్‌కూ దారితీయవచ్చు.

ఇక అన్నింటికంటే ప్రమాదకరమైన పరిస్థితి ఏమిటంటే... శస్త్రచికిత్స తర్వాత కొందరిలో మలాన్ని లోపలే పట్టి ఉంచేలా చేసే నియంత్రణ శక్తి కోల్పోయి... అక్కడి నుంచి కొద్దికొద్దిగా మలం బయటకు వస్తూ ఉండవచ్చు. దీన్నే ‘ఇన్‌కాంటినెన్స్’ అంటారు. శస్త్రచికిత్స తర్వాత ఈ ఇన్‌కాంటినెన్స్ వస్తే అది మరింత ఇబ్బందికరం కాబట్టి ఇలాంటి శస్త్రచికిత్సలు అవసరమైనప్పుడు అత్యంత నిపుణులైన సర్జన్‌ల ఆధ్వర్యంలోనే ఈ తరహా శస్త్రచికిత్సలు జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

సర్జరీ విషయంలో మరో హెచ్చరిక...
సాధారణంగా ఫిషర్ సమస్యను తగ్గించడానికి చేసే సర్జరీ విజయవంతమైతే పరవాలేదు. కానీ ఇక్కడ ఒక అంశాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో చేసే శస్త్రచికిత్స తర్వాత కూడా ఒక శాతం నుంచి ఆరు శాతం కేసుల్లో ఫిషర్ మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంది. ఈ అంశాన్ని గమనంలో ఉంచుకుని మానసికంగా సిద్ధపడే శస్త్రచికిత్సకు ముందుకెళ్లాలి.
ఫిషర్ సమస్య వ్యక్తిగతంగా, సామాజికంగా ఇలా అన్నిరకాలుగా ఇబ్బందికరం. పైగా పూర్తిగా తగ్గించాలని చేసే శస్త్రచికిత్సతోనూ కొన్ని దుష్పరిణామాలు వచ్చే అవకాశం ఉంది.

ఈ అంశాలన్నింటినీ గుర్తుపెట్టుకుంటే... దీనికి చికిత్స కంటే నివారణ చాలా సులభం కాబట్టీ అంటే... కేవలం వేళకు భోజనం చేయడం వంటి మంచి ఆహారపు అలవాట్లు, పీచు పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలు, నీళ్లు ఎక్కువగా తాగడం, మలద్వారం వద్ద వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) పాటించడం వంటి సాధారణ జాగ్రత్తలతోనే దీని నివారణ జరిగిపోతుంది కాబట్టి వాటిని ఫిషర్ ఉన్నా లేకున్నా అందరూ ఈ జాగ్రత్తలను పాటించడం వల్ల అసలు ఫిషర్ రాకుండానే నివారించుకోవచ్చునని గుర్తుంచుకోండి.

ఆధారము: సాక్షి

పైల్స్‌ వ్యాధి - చికిత్స

కొందరు పైల్స్‌ వంటి సమస్యలతో ఎంతో బాధపడుతుంటారు. మల విసర్జన ద్వారం వద్ద వచ్చే ఇటువంటి వ్యాధులు వారికి మనశ్శాంతి లేకుండా చేస్తాయి. పైల్స్‌తో పాటు ఫిషర్‌, ిఫిస్టులా వంటి వ్యాధులు నేడు సాధారణంగా అందరికీ వస్తున్నాయి. అవసరమైన వైద్యం చేయించుకొని ఈ వ్యాధులను పూర్తిగా నయం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆహార నియమాలు, తగిన జాగ్రత్తలతో ఈ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.

పైల్స్‌:

సాధారణంగా వస్తున్న వ్యాధుల్లో పైల్స్‌ ఒకటి. పైల్స్‌ ఎక్కువగా మధ్య వయ స్సులో ఉన్నవారికి వస్తుంది. పీచు పదా ర్థాలు తక్కువగా తీసుకున్నవారికి, మంచి నీళ్లు తక్కువగా తాగేవారిలో ఈ వ్యాధి కని పిస్తుంది. సై్పసీ ఫుడ్‌, జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుం ది. పైల్స్‌ వల్ల విరోచనాలకు ముందు లేదా తర్వాత రక్తం రావడం జరుగుతుంది. కొన్ని సార్లు రక్తం గడ్డలు, గడ్డలుగా కూడా వస్తుంది.

మరికొన్నిసార్లు లోపలి మాంసం బయటకు కూడా రావచ్చు. పైల్స్‌ వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. పైల్స్‌ను మూడు గ్రేడులుగా విభజించవచ్చు. మొదటి గ్రేడులో పైల్స్‌ లోపల మాత్రమే కనిపిస్తుంది. రెండవ గ్రేడులో లోపలి నుంచి బయటకు వచ్చి మ ళ్లీ వాటంతట అవే లోపలికి వెళ్లిపోతాయి. మూడవ గ్రేడులో బయటకు వచ్చి బయటే ఉంటాయి. నాలుగవ గ్రేడులో బయటకు వచ్చిన వాటికి ఇన్‌ఫెక్షన్‌ రావచ్చు. కొన్ని సార్లు పైల్స్‌ ఆపరేషన్‌ తర్వాత కూడా మళ్లీ వచ్చే అవకాశం ఉంది. వీటిని సెకండరీ హెమరాయిడ్స్‌ అని అంటారు.

ఫిషర్‌: ఈ వ్యాధి ఏ వయస్సు వారికైనా రావచ్చు. ఇది రావడానికి ముఖ్య కారణం మలబద్ధకం. మలద్వారం పగిలి ఫిషర్‌ వస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారికి విపరీతమైన నొప్పి వస్తుంది. కొన్నిసార్లు రక్తం కూడా రావచ్చు. రక్తం ఒకటి, రెండు చుక్కలు మా త్రమే వస్తుంది. విరోచనాలు అయిన తర్వా త నొప్పి ప్రారంభమై మూడు, నాలుగు గం టల వరకు ఉంటుంది. కొన్నిసార్లు ఫిషర్‌ మలద్వారానికి ముందు వైపు, వెనుకవైపున కూడా ఉంటుంది. మరికొన్నిసార్లు ఫిషర్‌తో పాటు చర్మం కూడా ముందుకు చొచ్చుకు వస్తుంది. దీన్ని సింటినైన్‌పైల్‌ అంటారు.

ఫిస్టులా:

ఈ వ్యాధిని కొందరు లూటి అని కూడా అంటారు. ఇది ఈ రకం వ్యాధు లన్నింటికెల్లా ఇబ్బందికరమైన సమస్యగా చెప్పుకోవచ్చు. పెద్ద పేగు నుంచి బయటకు వచ్చే చర్మానికి ఇన్‌ఫెక్షన్‌ వల్ల ఈ వ్యాధి వ స్తుంది. పిస్టులా వ్యాధి రెండు రకాలు. మల ద్వారానికి పోయే పై దారిలో ఏర్పడేది ఒక రకం, కింది భాగంలో ఏర్పడేది మరో రకం. పైభాగంలో వచ్చేది సామాన్యంగా సమాంతరంగా ఉంటుంది. కింది భాగంలో వచ్చే దారి వంకరగా ఉంటుంది. ఈ వ్యాధి ఏ వయస్సులో ఉన్నవారికైనా రావచ్చు. ము ఖ్యంగా ఎక్కువ సేపు కూర్చొని ఉన్నవారిలో ఈ వ్యాధి వస్తుంది.

బయటకు చిన్న రంధ్రా లుగా కనపడవచ్చు. కొన్నిసార్లు అవి మూ సుకుపోయినప్పుడు ఇన్‌ఫెక్షన్‌ వచ్చి చీము పట్టే అవకాశాలు ఉంటాయి. నొప్పి కూడా ఉండవచ్చు. ఇన్‌ఫెక్షన్‌ వల్ల నొప్పి వస్తుంది. పిస్టులాను లోలెవెల్‌, హైలెవెల్‌ రకాలుగా వర్గీకరిస్తారు. లోలెవెల్‌ రకం దోవ పొడవు గా ఉంటుంది. ఇది రెండు సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. హైలెవెల్‌లో దోవ పొడవు కొన్నిసార్లు నాలుగు, అయిదు సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు విరోచనాలు కంట్రోల్‌ కాకపో వచ్చు. చీము, రక్తం కూడా రావచ్చు.

పరీక్షలు: పైల్స్‌ వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. వీరికి ప్రాక్టోస్కోపిక్‌ పరీక్షను నొప్పి లేనప్పు డు చేస్తారు. ఈ పరీక్షలో పైల్స్‌ బాగా కనిపిస్తాయి. కొలోస్కోపిలో పైల్స్‌, ఫిషరీ, ఫిస్టులా వ్యాధులను తెలుసుకోవచ్చు. పొట్ట స్కానింగ్‌లో వేరే పేగులకు ఏమైనా గడ్డలు ఉన్నాయా తెలుస్తుంది. పిస్టులోగ్రామ్‌ పరీ క్షను పిస్టులా ఉన్నవారికి నిర్వహిస్తారు. దారి పొడవు ఎంతోఉందో తెలుసుకోవడం జరుగుతుంది. బేరియన్‌ ఎనిమా పరీక్ష ద్వా రా పెద్ద పేగు ఎలా ఉండో తెలుసుకోవచ్చు.

వైద్యం: పైల్స్‌ వ్యాధి వచ్చిన వారిలో మొదటి, రెండు గ్రేడులుగా ఉన్నవారికి చాలా వరకు మందులతో నయమవుతుంది. కొన్నిసార్లు స్ల్కీరో థెరపీ ద్వారం పరీక్ష చేస్తూ డాక్టర్‌ పైల్స్‌లోకి ఇంజెక్షన్‌ చేస్తారు. ఆ ఇంజెక్షన్‌ ఇవ్వడం వల్ల వాటిలో రక్త ప్రసరణ తగ్గి కృశించుకుపోతాయి. పైల్స్‌ బాగా ముదిరిన వారికి ఎమరోయెక్టమీ ఆపరేషన్‌ ద్వారా వాటిని తొలగిస్తారు. ఫిషర్‌ వచ్చినవారి ఆహారంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలి.

విరోచనాలు సాఫీగా సాగేందుకు మందులు వాడాలి. ఈ విధంగా చేసినా ఇబ్బంది మళ్లీ వస్తుంటే విరోచనాలు జరిగే దారి బిగుసుకు పోతుంది. ఆ సమయంలో ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుంది. ఈ ఆపరేషన్‌ను స్పింటరాటమి అని అంటారు. పిస్టులా వ్యాధిని హై లెవెల్‌, లో లెవెల్‌ను బట్టి వైద్యం చేస్తారు. కొన్నిసార్లు వీటిని తీసివేయాల్సి ఉంటుంది. ఈ ఆపరేషన్‌ చేసేటప్పుడు విరో చనాలను ఆపుకునేందుకు ఎలాంటి ఇబ్బం ది కలగకుండా చూసుకోవాలి. ఈ ఆపరేష న్‌ను ఫిస్టురెక్టమీ అని అంటారు.

జాగ్రత్తలు:

ఈ వ్యాధులు వచ్చినవారు సమతుల ఆహారం తీసుకోవాలి. ఆహారం లో పీచు పదార్థాలు(పండ్లు, కూరగాయలు) ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఉప వాసాలు చేయకూడదు. విరోచనాలు అ య్యేందుకు మందులు ఎక్కువగా వాడ కూ డదు. మన జీవన విధానంలో కొన్ని మార్పు లు చేసుకోవడం ద్వారా ఇటువంటి వ్యాధులకు చాలావరకూ దూరంగా ఉండవచ్చు. ముఖ్యంగా పీచు పదార్ధాలు అధికంగా ఉం డే ఆహారం తీసుకోవడం వల్ల శరీర క్రి యలు ఆరోగ్యంగా ఉంటాయి.

ఆధారము: ఆయురారోగ్యాలు బ్లాగ్

పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా హోమియోకేర్ వైద్యం

తీవ్రమైన నొప్పి, ఎవరికి చెప్పుకోలేని బాధ, మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి లేదా రక్తస్రావం కావటం లేదా మలబద్దకం వంటి సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు.

ఈ సమస్యలకు కారణం. ‘‘పైల్స్ లేదా ఫిషర్స్ లేదా ఫిస్టులా’’ అనవచ్చు. మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల వలన ఈ సమస్యలు తీవ్రతరం, సర్వసాధారణం అవుతున్నాయి.

పైల్స్
మలద్వారంలో ఉండే రక్తనాళాలు ఉబ్బిపోయి. వాపునకు గురి అయి, తీవ్రమైన నొప్పి, రక్త స్రావం కలగటాన్ని పైల్స్ అంటారు.

పైల్స్‌కి కారణాలు, వాటిని తీవ్రతరం చేసే అంశాలు :

 • దీర్ఘకాలికంగా మలబద్దకం
 • పొత్తిడుపు ఎక్కువ కాలం వత్తిడికి గురి అనటం
 • దీర్ఘకాలికంగా దగ్గు ఉండటం
 • గర్భధారణ సమయంలో

కాలేయ సంబంధిత వ్యాదులతో బాధపడే వారిలో పైల్స్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. పైన తెలిపిన కారణాల వలన మలద్వారం దగ్గర ఉండే రక్తనాళాలపై దీర్ఘకాలికంగా ఒత్తిడి ఏర్పడి, వాటిలోని కవాటాలు దెబ్బతినడం, రక్తనాళాలు సాగదీతకు గురై, అందులో రక్తం నిల్వ ఉండడం వలన మలవిసర్జన సమయంలో మలద్వారం దగ్గర వత్తిడి ఏర్పడుతుంది. దాంతో తీవ్రమైన నొప్పి వచ్చి, రక్తనాళాలు పగిలి రక్తస్రావం జరుగుతుంది.

పైల్స్‌ని ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ అని రెండురకాలుగా విభజిస్తారు.

ఇంటర్నల్ పైల్స్:మలవిసర్జన మార్గంలో రక్తనాళాలు వాపుకు గురవడం వలన ఇది ఏర్పడుతుంది. ఇందులో అంత ఎక్కువ నొప్పి ఉండదు.

ఎక్స్‌టర్నల్ పైల్స్ అనగా మలద్వారం చివరి ప్రాంతంలో ఉన్న రక్తనాళాలు వాపుకు, గురై వాటిపైన ఉన్న మ్యూకస్ పొర బయటికి పొడుచుకొని రావడాన్ని ఎక్స్‌టర్నల్ పైల్స్ అంటారు.

దానిలో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం ఉండవచ్చు.

ఫిషర్స్
మలద్వారం దగ్గర ఏర్పడే నిట్టనిలువు చీలికను ఫిషర్ అని అంటారు. ఇది చాలా నొప్పి, మంటతో కూడి ఉంటుంది.

కారణాలు :
దీర్ఘకాలికంగా మలబద్దకం ఉండి మలవిసర్జన సమయంలో వత్తిడి ఏర్పడి మలద్వారం ద్వారా ఫిషర్స్ ఏర్పడే అవకాశం ఉంది. ఎక్కువ కాలం విరేచనాలు ఉండడం వలన, కూడా ఫిషర్ ఏర్పడే అవకాశం ఉంది.

గర్భధారణ సమయంలో కూడా ఫిషర్ ఏర్పడే అవకాశం ఉంది.

క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కాలరైటివ్స్ జబ్బులతో బాధపడే వారిలో ఫిషర్ ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది.

ఫిస్టులా
అనగా, రెండు ఎపితికల్ కణజాల మధ్య ఉండే ఒక గొట్టంలాంటి నిర్మాణాన్ని ఫిస్టులా అని అంటారు. మానవ శరీరంలో ఫిస్టులా అనేది ఎక్కడైనా ఏర్పడవచ్చు. కాని సర్వసాధారణంగా ఏర్పడే ఫిస్టులాలో ఆనల్ ఫిస్టులా ఒకటి.

ఇది ఎక్కువ ఊబకాయం ఉన్నవారిలో కనిపిస్తుంది. ఇది ఎక్కువగా రెండు పిరుదుల మధ్యప్రాంతంలో మలద్వారానికి పక్కన ఏర్పడుతుంది. చర్మం పైన చిన్న మొటిమలాగ ఏర్పడి నొప్పి, వాపు ఏర్పడి రెండు మూడు రోజులలో పగిలి చీము కారుతుంది.
దానిమూలంగా తీవ్రమైన నొప్పి, చీము, జ్వరం వంటి లక్షణాలతో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీని తీవ్రతను బట్టి వారానికి నెలకు 1, 2 సార్లు మళ్ళీ మళ్ళీ తిరగబెట్టడం వలన సాధారణ జీవన విధానాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది.

ఫిస్టులా ఒక్కొక్కసారి మలద్వారంలోకి తెరచుకోవడం వలన ఇందులో నుండి మలం వస్తుంది. దీనినే ఫిస్టులా ఇన్ అనో అంటారు. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఫిస్టులా మళ్ళీ వచ్చే అవకాశం 90 శాతం వరకు ఉంటుంది.

కారణాలు :
ఊబకాయం
గంటల తరబడి కదలకుండా ఒకేచోట కూర్చొని పనిచేసేవారిలో, తీవ్రమైన మలబద్దకంతో బాధపడే వారిలో ఊక్రాన్స్ డిసీజ్ లేదా అల్సరేటివ్ కాలైటిస్ జబ్బులతో బాధపడే వారిలో.

నిర్ధారణ పరీక్షలు :

 • సిబిపి
 • ఇఎస్‌ఆర్
 • ఫిస్టులోగ్రమ్
 • ఎమ్మారై, సీటీస్కాన్

మొదలైన నిర్ధారణ పరీక్షల ద్వారా ఇతర తీవ్రమైన వ్యాధులను, వ్యాధి తీవ్రతను గుర్తించవచ్చు.

పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాలు చిన్న సమస్యలు అని అనిపిస్తాయి కాని ఇది రోగి దినచర్యలను చాలా ప్రభావితం చేస్తాయి. చాలామంది వివిధరకాల చికిత్సలు చేయించుకొని విసిగి పోయి, చివరి ప్రయత్నంగా ఆపరేషన్ చేయించుకుంటారు. కాని చాలామందిలో ఈ సమస్యలు తిరగబెట్టడం సర్వసాధారణంగా కనిపిస్తుంది.

హోమియో కేర్‌లో వైద్యం
హోమియోకేర్ ఇంటర్ నేషనల్ ‘జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ ట్రీట్‌మెంట్ ద్వారా పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా, మలబద్దకం వంటి వాటికి మూలకారణాలను గుర్తించి వైద్యం చేయడం ద్వారా సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ సమస్యలు మళ్లీ మళ్లీ తిరగబెట్టకుండా, ఎలాంటి ఆపరేషన్ అవసరం లేకుండా హోమియోకేర్ ఇంటర్‌నేషనల్ వైద్యం ద్వారా సంపూర్ణంగా నయం చేయవచ్చు.

తీసుకోవలసిన జాగ్రత్తలు :

 • సరైన పోషకాహారం తీసుకోవడం
 • ఆహారంలో పీచు (ఫైబర్) పదార్థాలు అధికంగా ఉండేటట్లు చూసుకోవడం మాంసాహారం తక్కువగా తినడం
 • మలవిసర్జన ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉండే విధంగా చూసుకోవడం
 • సరి అయిన వ్యాయామం చేయడం
 • ఊబకాయం రాకుండా చూసుకోవడం.

ఆధారము: సాక్షి

శరీర నిర్మాణ పరమైన సమస్యలు - సలహాలు

ఆడవారిలా ఎందుకిలా...?

నా వయసు 15. నా ఛాతీ ఎత్తుగా ఉంటుంది. 'ఏమిటిలా అమ్మాయిలా....' అంటూ స్నేహితులంతా ఎగతాళి చేస్తున్నారు. టి-షర్టులు వేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటోంది. నలుగురితో కలిసి తిరగలేకపోతున్నాను. మానసికంగా నరకయాతన అనుభవిస్తున్నాను. నా ఈ సమస్యను పరిష్కరించే అవకాశం ఉందా? తెలియజేయగలరు.

మీ సమస్యను 'గైనకోమాస్టియా' అంటారు. దీనికి చాలా కారణాలు ఉన్నా యవ్వనంలో ఉండగా కొంతమందికి ఏ కారణం లేకుండానే వస్తుంది. వయసు పెరిగే కొద్దీ 'టెస్టోస్టిరాన్' అనే హార్మోను ఎక్కువ అవడం వల్ల కొంతమందికి తగ్గిపోతుంది. మరికొందరికి ఆపరేషన్ ద్వారా తగ్గించాల్సి ఉంటుంది. అయితే ఆపరేషన్‌కి ముందు కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈ ఆపరేషన్ వల్ల పూర్తి ఫలితం ఉంటుంది. అందరిలానే మీరు కూడా టి-షర్టులు వేసుకోవచ్చు. అందరితో కలిసి మెలసి తిరగవచ్చు. కాబట్టి దిగులు చెందకుండా త్వరగా ప్టాస్టిక్ సర్జన్‌ను సంప్రదించి సమస్యను వివరించండి. తప్పకుండా ఫలితం ఉంటుంది.

నా వయసు 24. బరువు 84 కేజీలు. ఎత్తు 5.6 అడుగులు. ఇంకా పెళ్లి కాలేదు. నేను ఇలా లావుగా ఉండడం పెళ్లికి ఆటంకంగా మారింది. వచ్చిన సంబంధాలన్నీ వెనక్కి వెళ్లిపోతున్నాయి. దీంతో సన్నబడాలని వ్యాయామం చెయ్యడం ప్రారంభించాను. కానీ కొంచెంసేపు చేసిన తరువాత తొడ లోపలి భాగం రాపిడి వల్ల చర్మం మంట పుట్టి పుండులా అవుతోంది. దీనివల్ల మూడునాలుగు రోజులు వ్యాయామం మానేయాల్సి వస్తోంది. ఆహారాన్ని ఎంత నియంత్రించినా బరువు మాత్రం తగ్గడం లేదు. 'లైపోసక్షన్' చేసుకుంటే బరువుతగ్గుతారని విన్నాను. దీనివల్ల ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా? తెలియజేయగలరు.

మీరు ఆహారం తగ్గించినంత మాత్రాన బరువు తగ్గరు. అంతేకాక మరింత బలహీన పడతారు. కాబట్టి సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోండి. ఈ విషయంలో డైటీషియన్ సలహా పాటించండి. మీ బరువు తగ్గడానికి 'లైపోసక్షన్' చేయవచ్చు. కానీ దాని ద్వారా మీ శరీరంలో పదిశాతం కొవ్వునే తీసే వీలుంటుంది. ఎక్కువగా ఉన్న చోట తీసేస్తే మీకు వ్యాయామం కొనసాగించేందుకు అనుకూలంగా ఉండడమే కాకుండా, తొడల మధ్య రాపిడి తగ్గుతుంది.

అయితే మీకు ఆపరేషన్ అయిన తర్వాత రోజు బరువు చూసుకుంటే పెద్ద మార్పు కనిపించదు. రెండుమూడు నెలల తర్వాతనే తేడా కనిపిస్తుంది. ఒకేసారి ఎక్కువ కొవ్వును తొలగిస్తే సమస్యలు వచ్చే అవకాశం కొంచెం ఎక్కువ. సాధారణంగా ఆపరేషన్ చేసిన చోట నొప్పి రావడం, నీరు కారడం, చర్మం ఎర్రగా కందిపోవడం..లాంటి సమస్యలన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఐదు లీటర్ల కంటే ఎక్కువ కొవ్వు తొలగించిన వారికి శరీర ఉష్ణోగ్రత తగ్గే అవకాశం కూడా ఉంటుంది.

కాబట్టి మంచి వైద్యుని చేత చేయించుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి కొంతవరకు తప్పించుకునే వీలుంటుంది. కాకపోతే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆపరేషన్ తర్వాత వ్యాయామం మానేసి, అవసరానికంటే ఎక్కువ తినడం మొదలుపెడితే మళ్లీ బరువు పెరగడం ఖాయం. ఆపరేషన్ అయిపోయింది కనుక నేనిక సన్నబడ్డట్టే అనుకుని వ్యాయామలు చెయ్యడం, సరైన ఆహారం తీసుకోవడంలో బద్ధకిస్తే వైద్యులు చేసిన ప్రయత్నమే కాకుండా, డబ్బులు కూడా వృథా అయినట్టే.

సాగిన చర్మాన్ని బిగుతుగా చేయ్యవచ్చా?

నా వయసు 32. ఇద్దరు అమ్మాయిలు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోలేదు. మా వారేమో మగబిడ్డ కావాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికే రెండు కాన్పుల వల్ల పొట్ట బాగా సాగిపోయి వదులుగా అయి ఎత్తుగా కనిపిస్తోంది. స్ట్రెచ్ మార్క్స్ బాగా కనిపిస్తున్నాయి. నన్ను చూసిన వారంతా 'ఎన్నోనెల' అని అడుగుతున్నారు. నాకేమో సిగ్గుగా ఉంటోంది. నేను మళ్లీ మామూలు 'షేప్'లోకి రాగలనా?

మీరు రెండు సమస్యలకు పరిష్కారాన్ని కోరుతున్నారు. మొదటిది మూడో కాన్పు గురించి. దీనికోసం మీవారితో కలిసి చర్చించి నిర్ణయం తీసుకోండి. ఇక మీ రెండో సమస్యను ప్లాస్టిక్ సర్జరీ ద్వారా చాలా వరకు సరిచేయవచ్చు. అయితే 'అబ్డామినోప్లాస్టీ' అనే ఆపరేష్‌ను సంతానం పూర్తయిన తరువాత చేస్తారు.

ఈ ఆపరేషన్‌లో వదులు అయిన కడుపు కండరాలను మళ్లీ బిగుతుగా చేయడమే కాకుండా, ఎక్కువగా సాగి వదులుగా వేలాడుతున్న చర్మాన్ని కూడా తీసేసి ఫిగర్‌లో ఇంప్రూవ్‌మెంట్ తీసుకురావచ్చు. కండరాలకు కుట్లువేసి 'మజిల్ టోన్ ఇంప్రూవ్' చేస్తారు. కాబట్టి ఆపరేషన్ తరువాత గర్భం వస్తే కుట్లు తెగిపోయి ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది. ఆపరేషన్ తరువాత చర్మానికి వేసే కుట్లను 'పాంటీలైన్'కింద వేస్తారు కాబట్టి చీర కట్టుకున్నా, బికిని వేసుకున్నా ఇబ్బందేం ఉండదు.

మా బాబుకి గ్రహణం మొర్రి ఉండేది. ఆరు నెలల వయసులో పెదవికి, రెండేళ్ల వయసులో అంగటికి ఆపరేషన్ చేయించాం. ఇప్పుడు తన వయసు 16. చిన్నప్పుడు ఆపరేషన్ చేసిన మచ్చ చాలా వె డల్పుగా కనబడుతోంది. ముక్కు ఇంకా వంకరగానే ఉంది. దూరం నుంచి కూడా స్పష్టంగా కనబడుతోంది. ఇప్పుడు దీనిని చక్కదిద్దే మార్గం ఉందా? తెలియజేయగలరు

మీ అబ్బాయి ముక్కును చక్కదిద్దదడం సాధ్యమే. పెదవికి చేసిన ఆపరేషన్‌లో కొన్నిసార్లు లోపల కండరాలు కలవకపోతే వెడల్పు అయ్యే అవకాశం ఉంది. ఇలా ఉన్నప్పుడు మళ్లీ ఆపరేషన్ చేయవచ్చు. దీంతోపాటు 'క్లెఫ్ట్ రైనోప్లాస్టీ'చేసి ముక్కును సరిదిద్దవచ్చు. దీనిని సెకండరీ క్లెఫ్ట్ సర్జరీ అంటారు. దీంతోపాటు తనకి మాటలు సరిగ్గా పలకడం కోసం సర్జరీ, స్పీచ్ ట్రైనింగ్ ద్వారా ప్రయత్నించవచ్చు.

నా వయసు 23. నా చిన్నప్పుడు ముఖం కాలి తలలో సగభాగం పైగా జుట్టు మొలవలేదు. ముఖంపై సన్నని మచ్చలు కూడా ఉన్నాయి. తలభాగంలో ఎక్కువ కాలడం వల్ల చూడడానికి అసహ్యంగా ఉంటోంది. ఇప్పటి వరకు దానిని టోపీతో కవర్ చేసుకుంటూ వస్తున్నాను. అయితే ప్రస్తుతం ఇది పెళ్లికి అడ్డంకిగా మారింది. హెయిర్ ప్లాంటేషన్ చేసి జుట్టు మొలిపించవచ్చా?

హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ మీకు సరైన చికిత్స కాదు. సగానికి పైగా జుట్టు లేదంటున్నారు కాబట్టి 'టిష్యూ ఎక్స్‌పాన్షన్' ద్వారా మీకు ఆ భాగంలో జుట్టు వచ్చేటట్లు చేయవచ్చు. దీనిలో మామూలు జుట్టు ఉన్న చర్మం కింద ఆపరేషన్ ద్వారా ఒక బెలూన్ పెట్టి దానికి క్రమేణా నీరు నింపి, ఆ బెలూన్‌ని సాగదీసి జట్టు ఉన్న భాగాన్ని ఎక్కువ చేస్తారు. తరువాత మళ్లీ సర్జరీ చేసి జుట్టు ఉన్న భాగాన్ని సాగదీసి జుట్టులేని భాగాన్ని తీసివేసి కవర్ చేస్తారు. ఒకేసారి పూర్తిగా కవర్ కాకపోతే కొన్ని నెలల తర్వాత మళ్లీ చేసి కంప్లీట్ చేయవచ్చు. దీనివల్ల మీకు మొత్తం తలకి జుట్టు వచ్చేటట్లు చేయవచ్చు.

సిక్స్ ప్యాక్ రావాలంటే..?

నా వయసు 16. శరీరానికి కండలతో పాటు, సిక్స్‌ప్యాక్ రావాలని జిమ్‌కి వెళ్తున్నాను. సిక్స్‌ప్యాక్ రావాలంటే 3 నెలల సమయం పడుతుందంటున్నారు. ఇది నిజమేనా? కండలు, ప్యాక్ రావడానికి ప్రత్యేకమైన ఆహారం తీసుకోవాలా?

ఫిట్‌నెస్ అంటే కేవలం కండలు పెంచడమే కాదు, ఫిట్‌నెస్ అనేది శరీరం మొత్తానికి సంబంధించినది. మన శరీరర పూర్తి ఫిట్‌గా ఉండాలంటే.. కార్డియో వ్యాయామాలు, బరువులు ఎత్తడాలు లాంటివి చెయ్యాలి. ఇంకా సిక్స్ ప్యాక్ గురించి అడిగారు, దీన్ని సాధించాలంటే.. కార్డియో వ్యాయామాలు తప్పనిసరి.

అలాగే అబ్డామినల్ వ్యాయామాలు చేయడం కూడా ముఖ్యమే. సిక్స్ ప్యాక్ రావాలంటే ఇన్ని రోజులంటూ ఉండదు. అదంతా మీరు చేసే వ్యాయామాల పైన ఆధారపడి ఉంటుంది. ఆహారం కూడా ఇందులో ప్రముఖ పాత్ర వహిస్తుంది. పూర్తిగా ప్రోటిన్ డైట్‌తో ఉండాలంటే.. కార్బోహైడ్రేట్లు అస్సలు తీసుకోకూడదు. ఒక వేళ శరీరానికి కావలసిన కార్బోహైడ్రేట్లను అందించాలి అనుకుంటే మాత్రం సింపుల్ కార్బోహైడ్రేట్లు అంటే.. చపాతీ, బ్రౌన్ బ్రెడ్ లాంటివి తీసుకోవాలి.

నాకు 19 సంవత్సరాలు. ఎత్తు 5.6 అడుగులు. నాకు ఇంకా 4అంగుళాల ఎత్తు పెరగాలని ఉంది. దానికోసం రోజూ నేను ఒక కిలోమీటర్ రన్నింగ్ చేస్తున్నాను. ఇంకా 4 కిలోమీటర్లు సైకిల్ కూడా తొక్కుతున్నాను. వీటన్నింటి వల్ల నేను ఎత్తు పెరుగుతానా?

మీ వయసు 19 సంవత్సరాలు అని రాశారు. కనుక ఎత్తు పెరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అంటే.. అస్సలు పెరగరు అని కాదు, పెరిగే అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయని. కనుక మీరు ఎత్తు పెరగడానికి ప్రయత్నించాలంటే.. ఎక్కువగా కార్డియో, స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేయండి. వీటితో పాటుగా ఆహారంలో క్యాల్షియం ఉండేట్లు చూసుకోండి. క్యాల్షియం ఎక్కువగా పాలు, ఆకుకూరలలో లభిస్తుంది. వీటితో పాటు క్యాల్షియం ట్యాబ్లెట్లనూ వాడవచ్చు.

నా వయసు 25. నేను చూడడానికి నార్మల్‌గానే ఉంటాను. కానీ పొట్ట ఉంది. దీంతో డైట్ కంట్రోల్ చేస్తున్నాను. దీంతో సన్నగా అవుతున్నాను. కానీ పొట్ట తగ్గడం లేదు. టి.విలో వచ్చే ప్రకటనలో బెల్ట్ పెట్టుకుంటే పొట్ట తగ్గుతుంది అంటున్నారు. వాటివల్ల ఉపయోగం ఉంటుందా? ఈ పొట్ట తగ్గే మార్గం ఉంటే చెప్పండి.

మన శరీరంలో ముందుగా కొవ్వు చేరే భాగం పొట్ట కాబట్టి మీరు నార్మల్‌గా కనిపిస్తున్నా పొట్ట కనబడడానికి కారణం అదే అయి ఉండవచ్చు. ఆహారం విషయంలో కంట్రోల్‌గా ఉంటున్నానని రాశారు, మంచిదే. కానీ దానితో పాటుగా కొంచెం కార్డియో వ్యాయామాలు అంటే.. వాకింగ్, సైక్లింగ్ లాంటివి చేయండి.

అలాగే.. అబ్డామినల్ వ్యాయామాలు చేస్తే, శరీరంలో ఉన్న క్యాలరీలు కరిగిపోయి పొట్ట తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇక టీవీలలో చూపించే బెల్ట్‌ల గురించి అడిగారు, వాళ్లు ఎలా తగ్గుతారో సైంటిఫిక్ రీజన్ ఏమీ ఇవ్వరు. అలాంటప్పుడు వాటి వలన ఉపయోగం ఉంటుందని నేననుకోను. కనుక కార్డియో వ్యాయామాలు చేసి ఆహార విషయంలో కంట్రోల్‌గా ఉంటే సరిపోతుంది.

ఆధారము: హెల్త్ కేర్ తెలుగు బ్లాగ్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate