অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సంక్రమణ వ్యాధులు

సంక్రమణ వ్యాధులు

 1. హెచ్.ఐ.వి. / ఎయిడ్స్
  1. హెచ్‌.ఐ.వీ. నుండి రక్షణ పొందడమిలా!
 2. సుఖరోగము, లైంగిక వ్యభిచార రోగము – సిఫిలిస్
  1. సుఖరోగము అనగానేమి ?
  2. ప్రజలకు ఇది ఏవిధంగా సోకుతుంది ?
  3. యౌవనంలో వున్నవారిలో కనపడే లక్షణాలు మరియు సంకేతాలు ఏవి ?
  4. సుఖరోగం గర్భిణి స్త్రీని గర్భస్థ శిశువును ఏ విధంగా ప్రభావితం చేస్తుంది.?
  5. సుఖరోగానికి హెచ్.ఐ.వి కి ఉన్న సంబంధం ఏమిటి?
  6. సుఖరోగం తిరగబెడుతుందా ?
  7. సుఖరోగాన్ని ఏవిధంగా నివారించవచ్చును ?
 3. క్లమీడియా
 4. గొనోరియా (సెగవ్యాధి)
 5. స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలకు వచ్చే సూక్ష్మ క్రిమి సంపర్కం
  1. పి.ఐ.డి (PID) అనగానేమి ?
  2. చికిత్స
  3. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీస్ అనే వ్యాధి ఎంత సాధాణంగా సోకుతుంది?
  4. స్త్రీలకు ఈవ్యాధి ఏ విధంగా సోకుతుంది ?
  5. క్లమీడియా (Climidia infection) కారణంగా PID - పి ఐ డి .
  6. వ్యాధి లక్షణాలు
  7. క్లిష్టమైన/అపాయకరమైన పరిణామాలు
  8. నిర్ధారణచేయడం
 6. గర్భిణి స్త్రీలో సుఖరోగాలు, లైంగిక వ్యాధులు
  1. గర్బిణిస్త్రీలలో లైంగిక వ్యాధులు వచ్చే అవకాశం వుంటుందా ?
  2. లైంగికవ్యాధులు ఏ విధంగా గర్భిణీ స్త్రీని మరియూ గర్భస్థ శిశువును ప్రభావితంచేస్తాయి ?
  3. గర్భిణిస్త్రీలలో లైంగిక వ్యాదులకు సంబంధించిన పరీక్షలు జరపాలా ?
  4. గర్భంతోవున్న స్త్రీలకు లైంగిక వ్యాధుల చికిత్స చేయవచ్చునా ?
  5. గర్భిణీ స్త్రీలు ఈ వ్యాధుల బారిన పడకుండా ఏ విధంగా రక్షణ పొందవచ్చును ?
 7. సర్పి, విపర్పిణి
 8. ఎయిడ్స్ పై సందేహ నివృత్తి

హెచ్.ఐ.వి. / ఎయిడ్స్

హెచ్.ఐ.వి./ ఎయిడ్స్ ఎలా వ్యాపిస్తుంది

 • హెచ్.ఐ.వి/ఎయిడ్స్ సోకిన వ్యక్తితో, లైంగిక సంబంధం వలన ఈ వ్యాధి ఇతరులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వారిలో, నూటికి 85 మంది లైంగిక సంబంధం ద్వారా తెచ్చుకున్న వారే.
 • హెచ్.ఐ.వి/ఎయిడ్స్ సోకిన వ్యక్తి రక్తం ఇంకొకరికి ఎక్కిస్తే ఈ వ్యాధి వారికి సోకుతుంది.
 • హెచ్.ఐ.వి/ఎయిడ్స్ సోకిన తల్లి నుండి పుట్టే బిడ్డకు కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది.
 • ఈ విధంగానే కాక హెచ్.ఐ.వి/ఎయిడ్స్ సోకిన వ్యక్తికి వాడిన సూది సరిగా మరగ బెట్టకుండా ఇతరులకు వాడితే, వారికి కూడా ఈ వ్యాధి సోకుతుంది.

హెచ్.ఐ.వి/ఎయిడ్స్ ఎలా వ్యాపించదు

 • తినే ఆహారం ద్వారా, తాగే నీటి ద్వారా లేదా పీల్చే గాలి ద్వారా ఈ వ్యాధి ఒకరి నుంచి ఇంకొకరికి రాదు.
 • కలసి భోజనం చేయడం, కలసి నివాసం ఉండడం వలన ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి రాదు.
 • దోమ కాటు ద్వారా వ్యాపించదు.

ఎయిడ్స్ వ్యాధికి కారణమయ్యే హెచ్.ఐ.వి. ఏ విధంగా సంక్రమించదు

 • కలిసి జీవించడం వల్ల
 • కలిసి పనిచేయడం వల్ల
 • కలిసి కూర్చోవడం వల్ల
 • కలిసి ఆడడం వల్ల
 • కలిసి తినడం వల్ల
 • కరచాలనం (షేక్ హ్యాండ్) వల్ల
 • ఒకే – మూత్రశాలలను (టాయిలెట్లను) ఉపయోగించడం వల్ల హెచ్.ఐ.వి సంక్రమణం జరుగదు.

హెచ్.ఐ.వి/ఎయిడ్స్ రాకుండా ఉండాలంటే ...

 • జీవిత భాగస్వామితో మాత్రమే లైంగిక సంబంధం పరిమితం చేసుకోవాలి.
 • వివాహానికి ముందుగాని, వివాహం తర్వాతగాని విచ్చలవిడి శృంగారం అత్యంత ప్రమాదం, సుఖవ్యాధులకు దారి తీయవచ్చును.
 • ఎప్పుడైనా రక్తం ఎక్కించాల్సి వస్తే, గుర్తించబడిన బ్లడ్ బ్యాంకులలో నుంచి మాత్రమే రక్తం తీసుకోవాలి.
 • క్షౌరశాలలో ప్రతి ఒక్కరికి కొత్త బ్లేడు వాడటం మంచిది.
 • సుఖవ్యాధులు ఉన్నవారు హెచ్.ఐ.వి/ఎయిడ్స్ కు  గురి అయ్యే అవకాశం పదిరెట్లు ఎక్కువ అని తెలుసుకోండి

సుఖవ్యాధులను గుర్తించడం ఎలా...

 • యోని లేక అంగం నుండి రసికారుట, అంగంపై పుండ్లు, గజ్జలలో వాపు మరియు మూత్రం పోయునప్పుడు మంట ఉన్నచో సుఖవ్యాధి అని అనుమానించి డాక్టరును సంప్రదించండి.
 • ఆడవాళ్లలో పొత్తికడుపు నొప్పి ఉన్నచో అశ్రద్ధ చేయకుండా పరీక్ష చేయించుకొనవలెను.
 • సుఖవ్యాధులను మందులతో నయం చేయవచ్చును మరియు నిరోధ్ తో నివారించవచ్చునని తెలుసుకోండి.

హెచ్.ఐ.వి/ఎయిడ్స్ సోకితే ఏమవుతుంది ?

 • హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధి మన శరీరంలోని రోగాలను నిరోధించే శక్తిని నాశనం చేస్తుంది.
 • శరీరంలో, రోగాలను నిరోధించే శక్తి (వ్యాధి నిరోధక శక్తి) బాగా తగ్గినప్పుడు. మామూలుగా వచ్చే వ్యాధులు కూడా తగ్గకుండా, బాగా ముదిరి ప్రాణాపాయం కలుగుతుంది.

హెచ్.ఐ.వి/ఎయిడ్స్ సోకిన వారు ఏం చెయ్యాలి ?

 • ఈ వ్యాధి సోకిన వారు కొన్ని ఖచ్చితమైన జాగ్రత్తలు, అలవాట్లు పాటిస్తే వ్యాధి వేగంగా ముదరకుండా చూసుకోవచ్చు.
 • ఆందోళన పడకుండా, ప్రశాంతంగా ఉండడం, ధ్యానం, యోగాసనాలు చేయడం.
 • వేళకు మంచి ఆహారం తీసుకోవడం.
 • కనీస శారీరక వ్యాయామం చేయడం.
 • క్షయ, సుఖ వ్యాధులు రాకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవడం.
 • సారా, మత్తు పదార్థాలు పూర్తిగా మానివేయడం.
 • ఈ వ్యాధి ఇతరులకు సోకకుండా ఉండడానికి తప్పనిసరి అయితే, సంభోగ సమయంలో (వ్యాధి సోకినది స్త్రీకైనా, పురుషునికైనా) మగవారు నిరోధ్ ధరించడం చేయాలి.

ప్రపంచ ఎయిడ్స్‌ దినం

అవగాహనే అసలైన అస్త్రం
డా|| రాజా ప్రసన్నకుమార్‌
అడిషనల్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌

హెచ్‌ఐవి/ఎయిడ్స్‌.. ఆధునిక ఉపద్రవం!

ఇది వ్యక్తులనూ, కుటుంబాలనే కాదు.. ఏకంగా దేశాలనే కబళించేస్తోంది. ఎన్నో జీవితాలు కావికలమైపోతున్నాయి. దీనిపై అవగాహన పెంచుకోవటం ఒక్కటే దీనికి సరైన, అసలైన పరిష్కారం.

అరక్షిత లైంగిక సంబంధాలు

మన రాష్ట్రంలో ప్రధానంగా హెచ్‌ఐవి వ్యాప్తి ఈ అరక్షిత లైంగిక సంబంధాల ద్వారానే జరుగుతోంది. నిజానికి ఈ మార్గంలో హెచ్‌ఐవి సంక్రమిచే రిస్కు 0.1-0.3% మాత్రమే. అయినా అదే మన దగ్గర పెనుశాపంగా పరిణమిస్తోందంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అరక్షిత శృంగారంలో ఇది పురుషుల నుంచి స్త్రీలకు సంక్రమించే అవకాశాలు ఎక్కువ. కారణం: స్త్రీలలో యోని మార్గం అతి పల్చటి జిగురు పొరతో కప్పి ఉండటం, స్త్రీ జననాంగంలో హెచ్‌ఐవికి అనువైన కణాలు ఎక్కువగా ఉండటం, లైంగిక చర్య సమయంలో స్త్రీ జననాంగాల్లో సూక్ష్మమైన గాయాలవుతుండటం, వీర్యం స్త్రీశరీరంలో ఎక్కువసేపు నిల్వ ఉండటం, వీటన్నింటి వల్లా స్త్రీలకు హెచ్‌ఐవి ముప్పు మరింత ఎక్కువ. వీటికి జననాంగ, సుఖవ్యాధులు కూడా తోడైతే హెచ్‌ఐవి రిస్కు 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. జననాంగాల్లో పుండ్లు, స్రావాలు, తెల్లమైల, పొత్తికడుపు నొప్పి, గజ్జల్లో గడ్డలు, పులిపిరులు ఇలాంటివి ఉన్నప్పుడు అరక్షిత శృంగారం ద్వారా హెచ్‌ఐవి సోకే అవకాశాలు మరింత పెరుగుతాయి. అందుకే సుఖవ్యాధులకు చికిత్స తీసుకోవటం, భాగస్వామిని కూడా చికిత్సలో భాగం చెయ్యటం చాలా అవసరం. వీటికి చికిత్స అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా కూడా లభిస్తుంది. కండోమ్‌ వాడకం, వ్యక్తి అలవాట్లు, ప్రవర్తనల్లో మార్పుతేవటం, ఈ రెండూ ముఖ్యమైన నివారణ చర్యలు!

తల్లిదండ్రుల నుంచి బిడ్డకు

తల్లిదండ్రుల నుంచి బిడ్డకు హెచ్‌ఐవి మూడు రకాలుగా సంక్రమించవచ్చు. 1. బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడు 2. ప్రసవ సమయంలో 3. తల్లిపాల ద్వారా. వాస్తవానికి 100 మంది హెచ్‌ఐవి పాజిటివ్‌ తల్లులకు 70 మంది బిడ్డలు హెచ్‌ఐవి లేకుండానే పుడుతున్నారు. 30 మందికి మాత్రం హెచ్‌ఐవి సంక్రమించే అవకాశం ఉంటోంది. ఈ ముప్పును మరింతగా తగ్గించేందుకు గర్భిణులకు 'నివిరపిన్‌ ప్రొఫైలాక్సిస్‌' విధానం మరింత మేలు చేస్తుంది. హెచ్‌ఐవి పాజిటివ్‌ గర్భిణులకు ప్రసవ సమయంలో నివిరపిన్‌ 200 ఎంజీ మాత్ర ఒకటి ఇస్తారు. పుట్టిన బిడ్డకు 72 గంటల్లోపు నివిరపిన్‌ టానిక్‌ ఒక్కసారి తాగిస్తారు. ఇలా చేస్తే హెచ్‌ఐవి సంక్రమించే అవకాశం 30 శాతం నుంచి 9-11 శాతానికి పడిపోతుంది. ఇక తల్లిపాలు ఇవ్వవచ్చా? లేదా? అన్నది చాలా వరకూ తల్లిదండ్రుల నిర్ణయానికే వదిలేస్తారు.

కలుషిత సూదులు, సిరంజీలు

మన రాష్ట్రంలో కలుషిత సూదులు, సిరంజీల ద్వారా హెచ్‌ఐవి సోకటమన్నది 0.32 శాతం వరకూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీలైనంత వరకూ సూదులు/సూదిమందులు కాకుండా వీలైనంత వరకూ వైద్యుల పర్యవేక్షణలో మాత్రలు వాడుకోవటం ఉత్తమం. ఇంజక్షన్లు తప్పనిసరి అయినట్లయితే, కొత్త సూదులే వాడటం, వాడిపారెయ్యటానికి వీలైన సిరంజీలను ఎంచుకోవటం అవసరం. రక్తపరీక్షలకు వెళ్లినప్పుడు కూడా కొత్త సూదులే వాడేలా చూసుకోవటం మంచిది.

రక్త మార్పిడి

హెచ్‌ఐవి పాజిటివ్‌ వ్యక్తి రక్తాన్ని పరీక్ష చెయ్యకుండా ఆపద సమయంలో మరొక వ్యక్తికి మార్పిడి చేసిన పక్షంలో వారికి హెచ్‌ఐవి సోకే అవకాశం నూరు శాతం ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలు, లైసెన్సింగ్‌ విధానం, తప్పనిసరి హెచ్‌ఐవి+ పరీక్షల వల్ల ఈ మార్గం ద్వారా హెచ్‌ఐవి వ్యాప్తి చెందే అవకాశం బాగా తగ్గింది. రక్తం దానం చేసే ప్రతి దాత రక్తాన్నీ ముందుగా- హెచ్‌ఐవి, హెచ్‌బీవీ, మలేరియా, సిఫిలిస్‌, హిమోగ్లోబిన్‌ శాతం పరీక్షలు చేసిన తర్వాతే మార్పిడి చెయ్యాలి.

హెచ్‌ఐవి నుంచి ఎయిడ్స్‌కు!

హెచ్‌ఐవి క్రిమి ఒంట్లో చేరగానే జరిగే పరిణామాలు చాలా కీలకం. మన శరీరంలో రక్షణ వ్యవస్థకు అత్యంత కీలకమైనవి 'సీడీ4' అనే కణాలు! హెచ్‌ఐవి ఒంట్లో చేరగానే ముందుగా ఈ కణాలను లోబరుచుకుంటుంది. ఆ తర్వాత, ప్రతి సీడీ4 కణం నుంచీ దాదాపు 250-500 వరకూ కొత్త వైరస్‌లను తయారుచేస్తుంది. ఈ క్రమంలో సీడీ4 కణం చనిపోతుంది. ఇలా సుమారు 10-15 సంవత్సరాల కాలంలో సీడీ4 కణాలు తీవ్రంగా దెబ్బతిని, వాటి సంఖ్య తగ్గిపోయి, వైరస్‌ పెరిగిపోయి, హెచ్‌ఐవి పాజిటివ్‌ వ్యక్తి.. ఎయిడ్స్‌ దశలోకి వెళ్లిపోతారు.
తొలిదశలో హెచ్‌ఐవి యాంటీబాడీ పరీక్షలు చెయ్యటం ద్వారా దీన్ని గుర్తించవచ్చు. అయితే ఈ పరీక్షలో కచ్చితంగా ఫలితం తెలియాలంటే 6 వారాల నుంచి 6 నెలల 'విండో పీరియడ్‌' కాలం ఆగాల్సి ఉంటుంది. 'పీసీఆర్‌' పరీక్ష ద్వారా హెచ్‌ఐవి ఉనికి ఇంకా ముందే గుర్తించవచ్చు.

ఎయిడ్స్‌ దశలో

 • పదిశాతం బరువు తగ్గిపోవటం
 • తరచూ విరేచనాలు కావటం
 • తరచూ జ్వరం రావటం ముఖ్య లక్షణాలు!

ఇవే కాకుండా ఇంకా రకరకాల 'అవకాశ వ్యాధులు' వచ్చే ముప్పు కూడా ఎక్కువే ఉంటుంది. ముఖ్యంగా మనదేశంలో ఊపిరితిత్తుల్లో క్షయ వ్యాధి చాలా ఎక్కువగా వస్తుంది. కాబట్టి హెచ్‌ఐవి పాజిటివ్‌ వ్యక్తులంతా తరచూ కళ్లె పరీక్ష చేయించుకోవటం ద్వారా క్షయ రాకుండావెంటనే జాగ్రత్తలు తీసుకునే వీలుంటుంది. అలాగే క్షయ వ్యాధిగ్రస్తులు కూడా హెచ్‌ఐవి పరీక్ష చేయించుకోవటం వల్ల ఈ వ్యాధులు ముదరకుండా చూసుకోవచ్చు.

 • హెచ్‌ఐవి పాజిటివ్‌ వ్యక్తులు 6 నెలలకు ఒకసారి సీడీ4 పరీక్ష చేయించుకోవటం ద్వారా సమస్య ఎయిడ్స్‌కు దారితీస్తోందేమో తెలుసుకోవచ్చు. సాధారణ ఆరోగ్యవంతుల్లో సీడీ4 కణాల సంఖ్య 800-1500 వరకూ ఉంటుంది. హెచ్‌ఐవి పాజిటివ్‌ వ్యక్తిలో ఈ సంఖ్య 250 కన్నా తగ్గినట్లయితే ఎయిడ్స్‌ దశలోకి వెళుతున్నట్టుగా గుర్తించాలి.
 • ఎయిడ్స్‌ దశలోని వ్యక్తి ఆయుర్దాయాన్ని పొడిగించేందుకు ప్రభుత్వం అన్ని జిల్లాల్లో 'ఏఆర్‌టీ సెంటర్ల' ద్వారా ఉచితంగా మందులు అందజేస్తోంది. వీటిని ఎయిడ్స్‌ బాధితులు కచ్చితంగా వాడటం ద్వారా ఆయుర్దాయాన్ని పెంపొందించుకోవచ్చు.

ఇలా వ్యాపించదు!

 • హెచ్‌ఐవి క్రిమి గాలి ద్వారా, నీటి ద్వారా, ఆహారం ద్వారా, స్పర్శ ద్వారా, వస్తువుల ద్వారా, దోమల ద్వారా వ్యాప్తి చెందదు!
 • చాలామంది దోమల ద్వారా హెచ్‌ఐవి ఎందుకు వ్యాపించదని ప్రశ్నిస్తుంటారు. హెచ్‌ఐవి క్రిమి మనుషుల్లోనూ, చింపాంజీల్లోనూ తప్పించి మరే జీవిలోనూ బతకలేదు. కాబట్టి ఇది దోమల ద్వారా వ్యాపించే అవకాశం లేదు.
 • హెచ్‌ఐవి ఉన్న శారీరక ద్రవం ఏదైనా- బయటి వాతావరణంలో ఎండిపోయినట్త్లెతే,  ఆ ద్రవంలో ఉన్న హెచ్‌ఐవి కూడా చనిపోతుంది

సంక్రమించేదెలా?

ఎయిడ్స్‌ కారక వైరస్‌.. ప్రధానంగా 'హెచ్‌ఐవి పాజిటివ్‌' వ్యక్తుల శారీరక ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. ఈ శారీరక ద్రవాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది- 1. పురుషుల వీర్యం 2. స్త్రీల యోని ద్రవాలు 3. రక్తం 4. ఉమ్మనీరు 5. మస్తిష్క నీరు 6. తల్లిపాలు 7. ఊపిరితిత్తుల నీరు 8. పొట్ట నీరు. కాబట్టి పాజిటివ్‌ వ్యక్తుల శారీరక ద్రవాలు తమకుసోకకుండా, తగలకుండా చూసుకోవటం ముఖ్యం. సాధారణంగా ఈ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి ఎలా సోకుతోందంటే:

 • అరక్షిత లైంగిక సంబంధాలు (94.69%)
 • తల్లిదండ్రుల నుంచి బిడ్డకు (4.13%)
 • కలుషిత సూదులు/సిరంజిలు (0.32%)
 • కలుషిత రక్త మార్పిడి (0.3%)

ఆధారము: ఈనాడు

హెచ్‌.ఐ.వీ. నుండి రక్షణ పొందడమిలా!

హెచ్‌ఐవీ వైరస్ రక్తం నుంచి వేరుచేస్తే చాలా త్వరగా చనిపోతుంది. నేరుగా హాని చేయదు. కానీ చాపకింది నీరులా ఎంతో హాని చేస్తుంది. అది మన రోగ నిరోధకశక్తిని నిర్వీర్యం చేస్తుంది. దాంతో అంతకు మునుపు మనం హాని చేయగలదని భావించని చిన్న చిన్న ఇన్ఫెక్షన్లే పెనుముప్పుగా తయారవుతాయి. మనకు సోకి కూడా ఏమీ చేయకుండా వాటంతట అవే తగ్గిపోయే బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లూ, ఇతర సూక్ష్మజీవుల వల్ల సంక్రమించే జబ్బులూ ఎంతో ప్రమాదకరంగా పరిణమిస్తాయి. అంతకుమునుపు అస్సలు హాని చేయకుండా, హెచ్‌ఐవీ కారణంగా రోగనిరోధకశక్తి దెబ్బతినడం వల్ల ఇవి ముప్పుగా పరిణమిస్తాయి కాబట్టి వీటిని హెచ్‌ఐవీకి సంబంధించిన అవకాశవాద ఇన్ఫెక్షన్స్‌గా పేర్కొంటారు. వైద్య పరిభాషలో వీటినే ‘ఆపర్చ్యయనిస్టిక్ ఇన్ఫెక్షన్స్ ఇన్ హెచ్‌ఐవీ’గా అభివర్ణిస్తారు. హెచ్‌ఐవీని ఆసరా చేసుకుని విజృంభించే ఈ తరహా ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొంది, సాధారణ జీవితం గడపడం ఎలాగో తెలుసుకునేందుకు ఉపయోగపడేదే ఈ కథనం.

హెచ్‌ఐవీ రోగికి ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్లు సోకేదెప్పుడు...?
మనలో రోగనిరోధక శక్తిని కలిగించే కణాలు చాలా ఉంటాయి. అందులో ‘టీ’ సెల్స్ ముఖ్యమైనవి. వీటినే సీడీ4 కణాలు అని కూడా పిలుస్తారు. సాధారణంగా హెచ్‌ఐవీ సోకినవారు కూడా మామూలు వ్యక్తుల్లాగే సాధారణ జీవితం గడుపుతారు. అయితే హెచ్‌ఐవీ వైరస్ ఈ రోగనిరోధక కణాలను క్రమంగా దెబ్బ తీస్తూపోయి వాటి సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ ‘టీ’సెల్స్ సంఖ్య (సీడీ4 కణాల కౌంట్) ప్రతి మైక్రోలీటర్‌కూ 200 కంటే తగ్గితే (200 సెల్స్/మైక్రోఎల్) అప్పుడు ఆ రోగికి  ‘ఎయిడ్స్’ సోకినట్లుగా నిర్ధారణ చేస్తారు. ఈ స్థితిలో రోగికి ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్లు చాలా తేలిగ్గా సంక్రమిస్తాయి.

అయితే ఆ దశలోనూ కొన్ని రకాల యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్ మందులతో చికిత్స చేస్తూ రోగిని మామూలు వ్యక్తిలాగే పూర్తి జీవిత కాలం బతికేలా చూడవచ్చు. అందుకే అనేక వ్యాధుల్లాగే ఎయిడ్స్ పూర్తిగా తగ్గకపోయినా...  ఈ రోజుల్లో ఎయిడ్స్ కూడా డయాబెటిస్ వంటి ఇతర వ్యాధుల్లాగే వైద్యంతో అదుపులో ఉండే వ్యాధి (మెడికల్లీ మేనేజబుల్ డిసీజ్). సాటి వ్యక్తులంతా అపోహాలు తొలగించుకొని వీళ్ల పట్ల వివక్ష చూపకపోతే చాలు... ఈ రోగులు సైతం పూర్తి జీవితకాలం సాధారణంగానే బతకగలరు.

ఎంతెంత కౌంట్‌కు... ఏయే తరహా జబ్బులకు చికిత్స...
హెచ్‌ఐవీ సోకిన వారు ఎవరైనా వారి ‘టీ’సెల్ కౌంట్ 200/మైక్రోలీటర్ ఉంటే వారి రోగనిరోధకశక్తి మామూలుగానే ఉంటుంది. అయితే అంతకంటే తగ్గితే మాత్రం ఏమేరకు కౌంట్ తగ్గిందో దాన్ని బట్టి సంక్రమించగల వ్యాధులకు తగిన నివారణచర్యలు / నివారణ చికిత్సలు తీసుకోవాల్సి ఉంటుంది. అది...

-టీ సెల్ కౌంట్ 200/మైక్రోలీటర్ కంటే తక్కువ ఉంటే న్యూమోసిస్టిక్ నిమోనియా వ్యాధిని నివారించే చర్యలు తీసుకోవాలి.  టీ సెల్ కౌంట్ 100/మైక్రోలీటర్ కంటే తగ్గి... ఆ తర్వాత చేయించిన రక్తపరీక్షలో టాక్సోప్లాస్మా అనే ఏకకణజీవి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్‌కు పాజిటివ్ అని తేలితే, ఆ సాంక్రమికవ్యాధి పెచ్చుమీరకుండా ఉండేందుకు చికిత్స తీసుకోవాలి.
-టీ సెల్ కౌంట్ 50 /మైక్రోలీటర్ కంటే తగ్గితే మైకోబ్యాక్టీరియా ఏవియమ్ కాంప్లెక్స్ (ఎమ్‌ఏసీ) అనే తరహా బ్యాక్టీరియల్ ఇన్షెక్షన్లను నివారించేందుకు అవసరమైన మందులు తీసుకోవాలి.

వ్యాక్సిన్లతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
ఇక్కడ పేర్కొన్న చాలా వ్యాక్సిన్ల వల్ల కొద్దిపాటి మంట/నొప్పి ఉంటుంది. అది కేవలం ఒక్క రోజులో తగ్గుతుంది.

ఆపర్చ్యునిస్టిక్ ఇన్ఫెక్షన్లు... ప్రొఫిలాక్టిక్ చికిత్సలు
హెచ్‌ఐవీ రోగిలో ‘టీ’ సెల్స్ తగ్గి, రకరకాల ఇన్ఫెక్షన్లు సోకేందుకు అవకాశం ఉందని నిర్దిష్టంగా తెలిసినప్పుడు, అవి రాకుండానే ముందుగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ముందుగానే వ్యాధి రాకుండా తీసుకునే చికిత్సను ‘ప్రొఫిలాక్సిస్’ చికిత్స అంటారు. హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్థులకు తగ్గిన కౌంటును అనుసరించి, ఆయా దశల్లో రకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉన్నందున ప్రొఫిలాక్టిక్ చికిత్సలు తీసుకుంటే వారు సైతం నార్మల్‌గా ఉంటారు. ఈలోపు రోగనిరోధక శక్తి పెరిగే మందులూ వాడుతుంటారు కాబట్టి ఈ యాంటీబయాటిక్ తరహా ప్రొఫిలాక్టిక్ మందులను సీడీ4 సెల్ కౌంట్ మెరుగుపడే వరకూ వాడవచ్చు.

హెచ్‌ఐవీ రోగులకు... వ్యాక్సిన్లు ఉపయోగపడతాయా?
ప్రస్తుతం మార్కెట్‌లో రకరకాల వ్యాధులను నివారించే వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే చాలామందిలో ఒక సందేహం ఉంది. ఇవి మామూలు వ్యక్తులకు ఎలాగూ ఉపయోగపడతాయి. అయితే హెచ్‌ఐవీ రోగులకూ ఇవి అదే తరహాలో ఉపయోగపడతాయా అనే సంశయం చాలా మందికి ఉంటుంది. సాధారణ ప్రజల్లో వ్యాధిని నివారించే వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందో... హెచ్‌ఐవీ రోగులకూ ఆయా వ్యాక్సిన్లు అదే తరహాలో ఉపయోగపడతాయి. నిజానికి మామూలు వ్యక్తుల కంటే హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్థులకు రకరకాల వ్యాధులు సోకే అవకాశం ఉన్నందున ఇవి మరింత ఉపయోగకరం.

అయితే హెచ్‌ఐవీ ఉన్నవారికి కొన్ని రకాల వ్యాక్సిన్లే సురక్షితం. అంటే ఉదాహరణకు వ్యాక్సిన్ల తయారీ రెండు రకాలుగా జరుగుతుంది. సాధారణంగా ఒక తరహా వ్యాక్సిన్ తయారీలో చనిపోయిన వైరస్‌ను ఉపయోగిస్తారు. ఈ తరహా వ్యాక్సిన్‌ను ‘ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్’ అంటారు. ఇక మరికొన్ని రకాల వ్యాక్సిన్లలో జీవించి ఉన్న వైరసే అయినప్పటికీ బాగా బలహీనపరచినదాన్ని, నిష్క్రియతో ఉండేదాన్ని ఉపయోగిస్తారు. ఈ తరహాగా రూపొందించిన వైరస్‌ను ‘లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్’ అంటారు. సాధారణంగా ఎయిడ్స్ రోగులకు ఇచ్చే వ్యాక్సిన్ల విషయంలో లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్‌ల కంటే ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్లు ఉపయోగించడం మేలు. అయితే దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఉదాహరణకు హెచ్‌ఐవీ ఉన్న రోగులకు చికెన్‌పాక్స్‌ను నివారించేందుకు లైవ్ అటెన్యుయేటెడ్  వ్యాక్సిన్‌నూ ఉపయోగించవచ్చు.

హెచ్‌ఐవీ రోగులు ప్రయాణం చేయదలిస్తే...?
హెచ్‌ఐవీ రోగులు ఒకవేళ ప్రయాణం చేయదలిస్తే, వారు ఏ ప్రాంతానికి వెళ్లదలిచారో తమ డాక్టర్‌తో సంప్రదించాలి. అక్కడి స్థానిక పరిస్థితులు, అక్కడి స్థానిక వ్యాధులకు అనుగుణంగా అవసరమైన ముందుజాగ్రత్తలు, నివారణ వ్యాక్సిన్లు తీసుకోవాలి. కొన్ని రకాల ట్రావెల్ వ్యాక్సిన్లు హెచ్‌ఐవీ రోగులకు సురక్షితమే అయినా మరికొన్ని సురక్షితం కావు. అందుకే ప్రయాణానికి ముందు డాక్టర్‌ను సంప్రదించడం అవసరం.

పరిస్థితులను బట్టి అదనంగా తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు మెనింగోకోకల్ వ్యాక్సిన్ : మెనింగోకోకస్ అనే సూక్ష్మక్రిమి మెదడు చుట్టూ ఉండే పొరల వాపు వచ్చేలా చేసి, మెనింజైటిస్ అనే తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. హెచ్‌ఐవీ ఉన్నవారిలో... కాలేజీలలోని డార్మెటరీలలో నివసించేవారు, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాలకు వెళ్లాల్సిన వారు ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. మెనింజైటిస్ విస్తృతంగా ఉన్న ప్రాంతానికి వెళ్లేవారు, లేదా అకస్మాత్తుగా ఈ వ్యాధి విజృంభించినప్పుడు ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి.

హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ : హెపటైటిస్ ఏ వైరస్ కాలేయాన్ని దెబ్బతీస్తుంది. కలుషితమైన నీటి వల్ల ఈ వైరస్ సోకుతుంది. మాదకద్రవ్యాలను రక్తనాళం (ఐవీ) ద్వారా లోపలికి తీసుకునే వారు, ఇంతకుమునుపే కాలేయ వ్యాధులు ఉన్నవారు, రక్తస్రావం విపరీతంగా జరిగే హీమోఫీలియా వంటి బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్నవారు, ప్రపంచ పర్యటనలకు వెళ్లేవారు ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి.

లైవ్ వ్యాక్సిన్లలో ఏవి తీసుకోవాలి?
హెచ్‌ఐవీ రోగులు కొన్ని లైవ్ వ్యాక్సిన్లను సైతం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటిని వారు తమ టీసెల్ (సీడీ4) కౌంట్ 200 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. అవి..
వారిసెల్లా వ్యాక్సిన్ : రెండు మోతాదుల్లో తీసుకోవాల్సి ఈ వ్యాక్సిన్ చికెన్‌పాక్స్‌నుంచి రక్షణ ఇస్తుంది.
జోస్టర్ వ్యాక్సిన్ : ఒక మోతాదులో తీసుకోవాల్సిన ఇది షింగిల్స్ అనే వ్యాధి నుంచి రక్షణ ఇస్తుంది. ఇది చికెన్‌పాక్స్‌కు సంబంధించిన వ్యాధి. ఇందులో చర్మంపై తీవ్రమైన నొప్పితో కూడిన కదుముల వంటి ర్యాష్ కనిపిస్తుంది.

గర్భధారణను కోరుకుంటే...?
హెచ్‌ఐవీ ఉన్న మహిళలు గర్భాన్ని ధరించాలని కోరుకుంటే తప్పనిసరిగా తమ డాక్టర్‌ను సంప్రదించాలి. గర్భధారణకు ముందుగా విధిగా తీసుకోవాల్సిన కొన్ని రకాల వ్యాక్సిన్లను తప్పనిసరిగా డాక్టర్ల పర్యవేక్షణలో తీసుకోవాలి.

ఏయే ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్లు, ఎంతెంత వ్యవధి తర్వాత?

హెచ్‌ఐవీ రోగులు వాడాల్సిన వ్యాక్సిన్లు...
ఫ్లూ వ్యాక్సిన్ : జ్వరం, చలి, కండరాల నొప్పులు, దగ్గు, బొంగురుగొంతు లక్షణాలతో ఫ్లూ బయటపడుతుంది. దీన్ని ‘ఫ్లూ షాట్’ లేదా ‘ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్’ అంటారు.  దీన్ని ప్రతి ఏడాదీ ఒక డోసు తీసుకోవాలి.
న్యూమోకోకల్ వ్యాక్సిన్: న్యూమోకోకస్ అనేది ఊపిరితిత్తులు, చెవులు, రక్తం లేదా మెదడు చుట్టూ ఉన్న కణజాలాన్ని దెబ్బతీసే సూక్ష్మక్రిమి. దీన్ని నివారించే  వ్యాక్సిన్‌ను న్యూమోనియా వ్యాక్సిన్ అని కూడా  అంటారు. ఇందులో రెండు రకాలు ఉంటాయి. హెచ్‌ఐవీ ఉన్నవారు ఈ రెండిట్లో ఏదో ఒకదాన్ని 19 నుంచి 64 ఏళ్ల మధ్యన వాడుతుండాలి. ఇక వారికి 65 ఏళ్లు నిండాక కూడా ఈ రెండింట్లో ఒకదాన్ని వాడాలి. అయితే గత ఐదేళ్లలో వాడని రకాన్నే ఈసారి వాడాలి.

డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్ వ్యాక్సిన్ : డిఫ్తీరియా రోగులకు గొంతు వెనక నల్లటి పొర ఏర్పడుతుంది. ఇది శ్వాస తీసుకోవడంలో అవాంతరాలు సృష్టిస్తుంది. టెటనస్ వ్యాధి కండరాల పనితీరును అస్తవ్యస్తం చేస్తుంది. పెర్టుసిస్‌ను కోరింత దగ్గు అని కూడా అంటారు. దీని వల్ల రోగులకు తీవ్రమైన దగ్గు వస్తుంది. ఈ మూడు జబ్బులనూ నివారించే ఒకే వ్యాక్సిన్‌ను హెచ్‌ఐవీ రోగులు ఒకే మోతాదు (ఒక షాట్‌గా) తీసుకోవాలి. ఇలా ఈ మూడు వ్యాక్సిన్లు కలిపిన ఒకే షాట్‌ను ప్రతి పదేళ్లకోసారి తీసుకోవాలి.

హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) వ్యాక్సిన్ : ఈ వైరస్ మర్మావయవాల వద్ద పులిపిరుల వంటి వాటికీ, కొన్ని రకాల క్యాన్సర్లకు కారణమవుతుంది. హెచ్‌ఐవీ ఉన్నవారు ఈ వ్యాక్సిన్‌ను మూడు మోతాదుల్లో తీసుకోవాలి.
హెపటైటిస్ బి వ్యాక్సిన్: హెపటైటిస్-బి వైరస్ కాలేయాన్ని దెబ్బతీస్తుంది. ఈ వ్యాక్సిన్‌ను మూడు మోతాదుల్లో తీసుకోవాలి.

వచ్చేందుకు అవకాశం ఉన్న ఇన్ఫెక్షన్లు... చికిత్సలు

న్యూమోసిస్టిస్
న్యూమోసిస్టిస్ కేరినై న్యుమోనియా (పీసీపీ) అనే ఈ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులకు సోకే అవకావం ఉంది. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో అత్యధికుల్లో మరణానికి దారితీసే న్యూమోనియా రకాల్లో ఇదొకటి. యాంటీబయాటిక్స్‌తో చికిత్స ద్వారా ఈ పీసీపీని నివారించవచ్చు. నోటిలో థ్రష్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండి, టీ సెల్ కౌంట్ 200/మైక్రోలీటర్ ఉన్నవారికి ఈ వ్యాధి చికిత్స అవసరం. అయితే ఒకవేళ హెచ్‌ఐవీ ఉన్నందున యాంటీ రిట్రోవైరల్ మందులు (ఏఆర్‌వీ) వాడుతూ... వాళ్ల టీ సెల్ కౌంట్ 200/మైక్రోలీటర్ కంటే ఎక్కువ ఉంటే వారు ఆరు నెలల పాటు పీసీపీకి చికిత్స తీసుకొని ఆ తర్వాత దాన్ని ఆపేయవచ్చు. కానీ టీసెల్ కౌంట్ అంతకంటే తక్కువ ఉంటే మాత్రం జీవితాంతం ‘పీసీపీ’కీ చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

టోక్సోప్లాస్మా
పెద్దగా బాహ్యలక్షణాలేవీ కనిపించకుండా సంక్రమించే వ్యాధుల్లో టోక్సోప్లాస్మోసిస్ ఒకటి. అయితే టోక్సోప్లాస్మా ఇన్ఫెక్షన్‌కు కారణమైన ఏకకణజీవి... కొందరు ఎయిడ్స్ వ్యాధిగ్రస్థుల మెదడుకు ఇన్ఫెక్షన్ కలిగేలా చేసి, మృత్యువుకు సైతం దారితీయవచ్చు. ఒక వ్యక్తికి హెచ్‌ఐవీ ఉన్నట్లు నిర్ధారణ అయితే, అతడి రక్తంలో  టోక్సోప్లాస్మా పరాన్నజీవి అప్పటికే ఉందా అన్న విషయాన్ని నిర్ధారణ చేయడం కోసం వెంటనే రక్తపరీక్ష నిర్వహించాలి. ఒకవేళ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడిలో టీసెల్స్ కౌంట్ 100/మైక్రోలీటర్ ఉంటే టోక్సోప్లాస్మా నివారణ చికిత్స ప్రారంభించాలి. అయితే న్యుమోసిస్టిక్ కేరినై న్యూమోనియా (పీసీపీ) చికిత్స కోసం వాడే కొన్ని మందులు టోక్సోప్లాస్మానూ నివారిస్తాయి.

ఒకవేళ రక్తపరీక్షలో ఆ రోగికి అంతకుమునుపు టోక్సోప్లాస్మా లేదని తెలిస్తే అతడు ఆ వ్యాధికి ఎక్స్‌పోజ్ కాకుండా కొన్ని చర్యలు తీసుకోవాలి. ఇందులో భాగంగా అతడు పచ్చి మాంసం లేదా ఉడికీ ఉడకని మాంసానికి దూరంగా ఉండాలి. పిల్లి విసర్జనకు, మట్టికి దూరంగా ఉండాలి. దీంతో పాటు టోక్సోప్లాస్మా నివారణకు మరికొన్ని చర్యలు/జాగ్రత్తలు చేపట్టాలి. అవి...

 • వేటమాంసం, బీఫ్ అండ్ పోర్క్ రంగు పింక్ కలర్‌లో ఉందంటే అది ఉడకనట్టు లెక్క. అలాంటి మాంసాన్ని ఎయిడ్స్ రోగి తినకూడదు.
 • పిల్లి విసర్జనను శుభ్రపరచదలచుకుంటే చేతులకు గ్లౌవ్స్ ధరించాలి. ఆ తర్వాత చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి.
 • తోట పని చేసిన తర్వాత చేతులను చాలా శుభ్రంగా కడుక్కోవాలి.
 • పచ్చిగా తినే పండ్లు, కూరగాయలను చాలా శుభ్రంగా కడిగాకే తినాలి.
 • మైకోబ్యాక్టీరియమ్ ఏవియమ్ కాంప్లెక్స్ (ఎమ్‌ఏసీ-మ్యాక్)
 • హెచ్‌ఐవీ రోగుల్లో టీ సెల్ కౌంట్ 50/మైక్రోలీటర్స్ కంటే తక్కువ ఉన్నవారికి వచ్చే అవకాశం ఉన్న ఇన్ఫెక్షన్లలో ఇదొకటి. మ్యాక్‌కు గురైన రోగుల్లో అత్యధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి, బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అన్ని వాతావరణాల్లోనూ మ్యాక్ కనిపిస్తుంది. కొన్ని వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకున్నంత మాత్రాన దీన్ని నివారించలేము. అయితే ‘టీ’సెల్ కౌంట్ 50/మైక్రోలీటర్ కంటే తక్కువగా ఉన్నవారిలో కొన్ని రకాల ప్రివెంటివ్ యాంటీబయాటిక్స్ వాడటం ద్వారా దీన్ని నివారించవచ్చు. ఆ తర్వాత టీ సెల్ కౌంట్ 100/మైక్రోలీటర్‌కు చేరగానే ఈ చికిత్సను ఆపేయవచ్చు.  ఈ చికిత్స కనీసం మూడు నెలలు కొనసాగాల్సి ఉంటుంది.

క్యాండిడా (ఈస్ట్)
క్యాండిడా అనే ఈ ఇన్ఫెక్షన్ హెచ్‌ఐవీ ఉన్న రోగుల్లో సాధారణంగా నోరు, యోని ప్రాంతాల్లో రావచ్చు. ఈస్ట్ ఫంగల్ ఇన్ఫెక్షన్ చర్మంలోని ముడుత పడే ప్రాంతాల్లో పెరగవచ్చు. మలద్వారం చుట్టూ కూడా రావచ్చు. అయితే తరచూ పునరావృతమవుతుంటే తప్ప దీనికి నివారణ చికిత్సలు చేయరు.

ఇదొక రకం ఫంగల్ ఇన్ఫెక్షన్. సాధారణంగా పక్షులు ఎక్కువగా ఉండే చోట్ల నేలలో ఇది పెరుగుతుంది. దీని వల్ల క్రిప్టోకాక్సోసిస్ అనే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో క్రిప్టోకోకల్ మెనింజైటిస్ అనే మెదడు ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. ఇది టీసెల్ కౌంట్ 100/మైక్రోలీటర్ కంటే తక్కువ ఉన్న వారిలో వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. ఎయిడ్స్ రోగుల్లో కనిపించే అత్యధిక ఇన్ఫెక్షన్లలో దీనికి నాలుగో స్థానం. అయితే యాంటీ రిట్రోవైరల్ మందుల ఉపయోగం తర్వాత ఇది కనిపించే ఫ్రీక్వెన్సీ కొంత తగ్గినప్పటికీ, ఎయిడ్స్ మందులు వాడని వారిలో ఇప్పటికీ ఇది ఎక్కువగానే కనిపిస్తుంటుంది. మందులు వాడినప్పటికీ దీని నివారణ విషయంలో పెద్ద తేడా ఏమీ లేనందువల్ల సాధారణంగా దీనికి ఎలాంటి మందులనూ సిఫార్సు చేయరు.

సైటోమెగాలోవైరస్
ప్రపంచవ్యాప్తంగా కనిపించే ఈ సైటోమెగాలో వైరస్ (సీఎమ్‌వీ) సోకిన కొద్దిమందిలో తేలికపాటి జ్వరం, ఒళ్లునొప్పులు కనిపిస్తాయి. అయితే చాలామందిలో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. ఎయిడ్స్ రోగుల్లో ఈ వైరస్ ఉంటే అది వారి కళ్లు, జీర్ణవ్యవస్థ, మెదడు, వెన్నుపూస వంటి భాగాలను తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. కంటిలో రెటీనాను దెబ్బతీసే ఈ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్ వల్ల రోగికి కనిపించే దృశ్యం అస్పష్టంగా మారి క్రమంగా చూపుపోవడం జరగవచ్చు. హెచ్‌ఐవీకి గురికాకమునుపే ఈ సీఎమ్‌వీకి గురైన కేసులు చాలా ఎక్కువే ఉంటాయి. ఇలా గతంలోనే సీఎమ్‌వీకి గురైన వారికి హెచ్‌ఐవీ సోకినట్లు నిర్ధారణ అయితే వారి టీ సెల్ కౌంట్ 200/మైక్రోలీటర్ కంటే తగ్గితే... కంటికి సంబంధించిన లక్షణాలు కనింపించినా, కనిపించకపోయినా తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించాలి.

అయితే సీఎమ్‌వీ నివారణకు మందులు వాడినా పెద్ద ఫలితాలేమీ కనిపించకపోవడంతో దీని నివారణకు సాధారణంగా మందులూ సూచించరు. కాకపోతే... సీఎమ్‌వీ రెటినైటిస్ తొలిదశలోనే ఉన్నప్పుడు (అంటే చూపు అస్పష్టంగా మారడం, కంటి ముందు నల్లమచ్చలు కనిపించడం, మిరుమిట్లు గొలుపుతున్నట్లు, తేలుతున్నట్లు మెరుపులు కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు) తప్పనిసరిగా డాక్టర్‌ను కలిసి తక్షణం చికిత్స తీసుకోవాలి. తొలిదశలో చికిత్స తీసుకుంటే దాని ప్రభావం, ఫలితం  తప్పక కనిపిస్తాయి.

క్రిప్టోస్పోరీడియోసిస్

ఇది కలుషితమైన నీటిని తాగేవారిలో, అలాంటి నీటిలో ఈదే వారిలో కనిపించే పరాన్నజీవి. ఈ ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి మలం నుంచి ఇది నీటిలోకి చేరి... ఇతరులకు వ్యాపిస్తుంది. ఈ క్రిమి కలిగించే ఇన్ఫెక్షన్‌ను ‘క్రిప్టోస్పోరీడియోసిస్’ అంటారు. హెచ్‌ఐవీ ఉన్న రోగులకు ఈ ఇన్ఫెక్షన్ సోకితే అది వారికి నీళ్లవిరోచనాలను కలిగిస్తుంది. మామూలు వారికీ ఇది సోకే అవకాశం ఉన్నప్పటికీ... టీ సెల్ కౌంట్ 100/మైక్రోలీటర్ కంటే తక్కువ ఉన్న హెచ్‌ఐవీ రోగులకు ఇది దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్‌గా పునరావృతమవుతూ ఉంటుంది. దీని రిస్క్ నుంచి తప్పించుకోడానికి రోగులు తమ చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి.

ముఖ్యంగా డయాపర్స్‌ను మార్చాక, తోటపనిలో భాగంగా మట్టిని ముట్టుకున్న తర్వాత, పెంపుడు జంతువులను ముట్టుకున్న తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అప్పటికే ఈ ఇన్ఫెక్షన్ నుంచి బాధపడుతున్నవారి నుంచి దూరంగా ఉండాలి. ఒక్కోసారి మున్సిపల్ నీటిపంపిణీ వ్యవస్థలోని నీరు కలుషితం కావడం వల్ల ఇది ఒక్కసారిగా కనిపించే అవకాశం ఉంది. అలాంటి సమయాల్లో నీటిని కాచి, వడపోసి తాగడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. క్రిప్టోస్పోరీడియోసిస్‌కు నిర్దిష్టమైన చికిత్స ఏదీ లేదు. అయితే మైకోబ్యాక్టీరియమ్ ఏవియమ్ కాంప్లెక్స్ (ఎమ్‌ఏసీ-మ్యాక్)కు ఇచ్చే చికిత్సే క్రిప్టోస్పోరీడియోసిస్‌కూ ఉపయోగపడుతుంది.

ఆధారము: సాక్షి

సుఖరోగము, లైంగిక వ్యభిచార రోగము – సిఫిలిస్

సుఖరోగము అనగానేమి ?

సుఖరోగము అనేది అసురక్షిత లైంగిక సంపర్కం వలన ట్రపనీమా పారిడమ్ అను సూక్ష్మజీవి వల్ల సంక్రమించే జబ్బు.

ప్రజలకు ఇది ఏవిధంగా సోకుతుంది ?

ఇది ఒక వ్యక్తి నుంచి  మరొకరికి సుఖవ్యాధి పుండుతో నేరుగా సంపర్కం కలగడం మూలంగా వ్యాపిస్తుంది. ఈ పుండ్లు ముఖ్యంగా పురుషాగం, బాహ్య జననేంద్రియాలు, యోని మరియు మూత్రాశయంపై ఏర్పడుతాయి. ఈ పుండ్లు పెదవులమీద మరియు నోటి లోపలి భాగంలో కూడా ఏర్పడవచ్చు. సూక్ష్మజీవి యోని,  ఆసనము లేదా నోటి సంభోగం ద్వారా  వ్యాప్తి చెందుతుంది. గర్భస్ధశిశువుకు వ్యాప్తి చేసే అవకాశం వుంటుంది. ఈ సుఖరోగం ఈ క్రింది కారణాల వల్ల వ్యాప్తి చెందదు.

 • ఒకే మల మూత్రవిసర్జన స్థలం ఉపయోగించడం మూలంగా
 • తలుపు గడియలు
 • ఈత కొలనులు
 • భోజనానికి ఒకే కంచాలు వాడడం. స్నానాల తొట్టి, బట్టలు వంటివి వ్యాధి  గ్రస్తులైన వారితో పంచుకొన్నప్పుడు వ్యాధి సొకే ప్రమాదం వుండదు.

యౌవనంలో వున్నవారిలో కనపడే లక్షణాలు మరియు సంకేతాలు ఏవి ?

ఈ వ్యాధి గ్రస్థులైన  వారిలో చాలా సం.ల వరకూ లక్షణాలు కనబడవు.

ప్రాధమిక దశ : సుఖ రోగం యొక్క ప్రాధమిక దశలో ఒకటి లేదా ఒకటి కన్నా ఎక్కువ  పుండ్లు  ఎక్కువ శాతం జననేంద్రియాలు పై కనబడుతాయి. రోగి వ్యాధి ,సంక్రమించిన దినం నుంచే మొదట లక్షణం అంటే పుండ్లు వంటివి బయటబడడానికి ముందు సాధారణంగా చిన్నగా, గుండ్రంగా గట్టిగా నొప్పి లేనిదిగా వుంటుంది. ఇవి సుఖరోగం శరీరంలో ప్రవేశించిన కేంద్రంలో ఏర్పడుతాయి. ఇవి 3 నుంచి 6 వారాల వరకూ వుండి వాటంతటవే మానిపోతాయి. కానీ కొన్ని సందర్భాలలో రోగ నిరోధక శక్తిని బట్టి ఒకవేళ తగు విధంగా చికిత్స తీసుకోని పక్షంలో సోకిన వ్యాధి రెండవ దశకు చేరుకుంటుంది.

రెండవ దశ: చర్మంపైన దద్దుర్లు, శ్లేష్మపొర పై ఏర్పడే పుండ్లు లేక దద్దర్లుతో ఈ రెండవ దశ గుర్తింపబడుతుంది. దద్దర్లలో సాధారణంగా దురద వుండదు. ఈ  దద్దర్లు ఎఱ్ఱగా, ఎరుపు తో కూడిన గోధుమ వర్గంలో మచ్చలలాగా అరికాళ్ళలో అరచేతులలో కనిపిస్తాయి. కానీ కొన్ని సందర్భాలలలో శరీరంలో వేరే భాగంలో వేరే వ్యాధులలో కనిపించే దద్దుర్ల వంటివి కూడా కనిపించవచ్చు. దద్దుర్లే కాకుండా సుఖరోగం రెండవ దశలో జ్వరం, శోషరస గ్రంధుల వాపు, గొంతులోని శ్లేష్మపొర మీద క్షతము లేదా రాపిడి (వాడుక భాష గొంతు పూయడం) తలపై అక్కడక్కడా మచ్చలుగా జుట్టురాలిపోవడం, తలనొప్పి, బరువుతగ్గడం, కండరాల నొప్పి మరియు అలసత్వం వంటి లక్షణాలు కూడా కనబడుతాయి.

అంతర్గతంగా వున్నదశ:  రెండవ దశ  లక్షణాలు కనుమరుగయిన తరువాత  అంతర్గతదశ మొదలవుతుంది. అవసాన దశలో ఈ సుఖరోగం క్రమక్రమంగా  అంతర్గతంగా మెదడు, నరాలు, కళ్ళు, గుండె, రక్తనాళాలు, కాలేయము, ఎముకలు మరియు కీళ్ళు, మొదలగు అవయవాలకు అపాయం (హాని) కలిగిస్తుంది.  ఈ అంతర్గతంగా జరిగే హాని కొన్ని సం.ల తరువాత బయట పడవచ్చు. అంతర్గత దశలోని చిహ్నాలు  లక్షణాలు ఈ క్రింది విధంగా వుంటాయి.

 • వివిధ కండరాల కదలికలలో సమన్వయ లోపం
 • పక్షవాతం
 • తిమ్మిరులు
 • క్రమంగా వృధిచెందే అంధత్వం
 • మతిభ్రంశము

ఈ మార్పులు ఒక్కొక్కప్పుడు ప్రాణాంతకం అవుతాయి.

సుఖరోగం గర్భిణి స్త్రీని గర్భస్థ శిశువును ఏ విధంగా ప్రభావితం చేస్తుంది.?

సుఖరోగం యొక్క ప్రభావం గర్భిణి స్త్రీపై ఎంత కాలంగా ఆమె ఈ వ్యాధి పీడితురాలిగా వున్నదీ దానిని బట్టి పరిణామాలు వుంటాయి. ఈ కాలం అధికంగా వుంటే మృత శిశువు జన్మించేంతటి తీవ్రపరిణామం కూడా జరుగవచ్చు. లేదా పుట్టిన కొద్ది సమయంలోనే శిశువు మృతి చెందవచ్చు. వ్యాధి సంక్రమించి శిశువులో ఏ సంకేతాలు, లక్షణాలు లేక పోవచ్చును. తక్షణమే చికిత్స అందించని యెడల శిశువులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం వుంటుంది.  చికిత్స అందని శిశువులకు పెరుగుదలలో మైలురాయిలు ఆలస్యం కావచ్చును. కొన్ని సార్లు మూర్ఛరోగం, మరణం కూడా సంభవించవచ్చును.

సుఖరోగానికి హెచ్.ఐ.వి కి ఉన్న సంబంధం ఏమిటి?

జననేంద్రియాలపై వచ్చే సుఖరోగం పుండ్ల ద్వారా సుఖరోగం మూలంగా కలిగే జననేంద్రియాలపై వచ్చే పుండ్లు ద్వారా హెచ్.ఐ.వి. సంపర్కం సంభోగం ద్వారా తేలికగా వ్యాప్తి చెందుతుంది. సుఖరోగం వున్నవారికి 2 నుంచి 5 రెట్లు హెచ్.ఐ.వి. సూక్ష్మజీవి సంపర్కము సోకే అవకాశం వుంటుంది.

సుఖరోగం తిరగబెడుతుందా ?

సుఖరోగానికి పూర్తిగా చికిత్స తీసుకున్న తరువాత కూడా మరల వ్యాధి సోకే అవకాశం వుంటుంది. ఒకసారి వ్యాధి సంక్రమించిన తరువాత తిరిగి సంక్రమించకుండా వుండేటట్టు వ్యాధి నిరోధకశక్తి శరీరానికి ఏర్పడదు.

సుఖరోగాన్ని ఏవిధంగా నివారించవచ్చును ?

వివాహేతర సంబందాలకు దూరంగా వుండడం ఖచ్చితంగా ఈ వ్యాధి సోకకుండా కాపాడుతుంది. అసురక్షిత సంభోగాలకు దూరంగా వుండాలి. మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాలు కూడా లైంగిక ప్రేరేపణలకు కారణమవుతాయి. కాబట్టి వీటికి కూడా దూరంగా వుండడం ఎంతైనా ఉవసరం.

క్లమీడియా

క్లమీడియా అనగా నేమి?

క్లమీడియా అనే వ్యాధి క్లమీడియా ట్రకోమాటాస్ అనే సూక్ష్మజీవి వల్ల కలిగే వ్యాధి. ఇది సంభోగం ద్వారా వ్యాప్తి చెంది స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలకు  హానికలుగచేస్తుంది.

జనులకు ఈ క్లమీడియా వ్యాధి ఏ విధంగా సోకుతుంది.

క్లమీడియా యోనిద్వారా లేదా ఆసనం మరియు నోటి ద్వారా సంభోగం జరుపునప్పుడు వ్యాప్తి చెందే అవకాశం వుంటుంది. ప్రసవం జరుగుతున్నప్పుడు యోని ద్వారా తల్లి నుండి  శిశువుకు సోకే అవకాశం వుంటుంది.

లైంగికపరంగా ఉత్తేజితంగా వున్న తరచు  సంభోగంలో పాల్గొంటున్న ఏ వ్యక్తికైనా క్లమీడియా వ్యాధి సోకవచ్చు.

క్లమీడియా వ్యాధి యొక్క లక్షణాలు ఏవి?

ప్రధమంగా క్లమీడియా స్త్రీ యొక్క గర్భశయ బహిర్గ ద్వారం మరియు మూత్రమార్గములకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు వున్న స్త్రీలకు యోని ద్వారా ద్రవాలు స్రవించడం మరియు మూత్రము పోయునప్పుడు మంట వంటి సమస్యలు  కనబడుతాయి. గర్బాశయ బహిర్గ ద్వారం నుంచి వ్యాధి గర్భకోశ నాళములకు సోకవచ్చును.  ఇంతవరకూ కూడా కొంత మంది  స్త్రీలలో లక్షణాలు  కానీ  చిహ్నాలు కానీ కనపడక పోవచ్చును. కొంతమందిలో పొత్తి కడుపు నొప్పి , నడుంనొప్పి , కడుపులో త్రిప్పడం, సంభోగం సమయంలో నొప్పి, రుతుక్రమం  మధ్యలో రక్తస్రావం  కనబడడం వంటి లక్షణాలు వుంటాయి. పురుషులలో పురుషాగం నుంచి ద్రవాలు  స్రవించడం, మూత్రం పోయునప్పుడు మంట, వంటి సమస్యలు  కనబడుతాయి. పురుషాగం మొనచుట్టూ  దురద మంట కూడా వుండవచ్చును.

క్లమీడియా వ్యాధి చికిత్స తీసుకొని పక్షంలో ఏ సమస్యలు తలెత్తే అవకాశం వుంటుంది. దుష్పరిణామాలు (చిక్కులు)

చికిత్స తీసుకోని పక్షంలో క్లమీడియా వ్యాధి ప్రత్యుత్పత్తి వ్యాధి ప్రత్యుత్పత్తి వ్యవస్థ మరియు ఇతర ఆరోగ్య సమస్యలపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. దీని పర్యవసానంగా ధీర్ఘకాలిక సమస్యలు  మరియు స్వల్పకాలిక సమస్యలు తలెత్తవచ్చును. స్త్రీలలో చికిత్స తీసుకోని పక్షంలో వ్యాధి గర్భ సంచికి చికిత్స తరువాత గర్భకోశ నాళాలకు తరువాత అండాశయములకు సోకే అవకాశం వుంటుంది. ఇవన్నీ కటికుహరంలో వుండే అవయవాలు కటి కుహరంలో వున్న గర్భసంచి ఫెల్లోపియన్ నాళము మరియు అండాశయాలకు సోకే సూక్ష్మక్రిమి సంపర్కము ఈ వ్యాధి సోకిన స్త్రీలతో అసురక్షిత సంభోగంలో పాల్గోంటే హెచ్.ఐ.వి. సోకే అవకాశం అయిదు రెట్లు ఎక్కువగా వుంటుంది.

పురుషులలో అవాంఛిత పరిణామాలు అరుదు.

క్లమీడియా వ్యాధిని ఏ విధంగా నివారించవచ్చు?

అసురక్షిత సంభోగాలకు దూరంగా ఉండడమెక్కటే ఖచ్చితమైన నివారణోపాయం లేదా ఈ వ్యాధి సోకలేదని నిర్ధారింప బడిన స్త్రీతోనే  దీర్ఘకాలం లైంగిక సంబంధం కొనసాగించడం.

గొనోరియా (సెగవ్యాధి)

గొనోరియా (సెగవ్యాధి)-స్త్రీ బీజకోశము సుఖరోగము

సెగవ్యాధి అనగా నేమి ?

సెగవ్యాధి (గొనోరియా) లైంగిక సంపర్కం వల్ల వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి నిస్సిరియే గొనేరుయే అనే సూక్ష్మజీవి తడిగా వెచ్చగా ఉండే స్త్రీ పురుషుల యొక్క ప్రత్యుత్పత్తి, వ్యవస్థలో వుండే స్థలాలలో తేలికగా పెరిగి  వృద్ధి చెందుతుంది.  ఈ సూక్ష్మజీవి నోరు, గొంతు మరియు కళ్ళలో కూడా పెరగ గలుగుతుంది.

జనులకు సెగవ్యాధి ఏవిధంగా సోకుతుంది.?

సెగవ్యాధి పురుషాంగం, యోని, నోరు, ఆసనము తో సంపర్కమ మూలాన వ్యాప్తి చెందుతుంది. ప్రసవ సమయంలో తల్లి మంచి శిశువుకు సంప్రాప్తింపవచ్చు.

సెగవ్యాధి యొక్క చిహ్నాల మరియు లక్షణాలు ఏవి?

లైంగికంగా చురుకుగా వున్న ఏ వ్యక్తికైనా, ఈ వ్యాధి సోకవచ్చు. చాలా మంది వ్యాధి సోకిన పురుషులలో ఏ లక్షణాలు కనపడక పోవచ్చుకానీ కొందరిలో వ్యాధి సోకిన రెండు నుండి 5 రోజులతరువాత కొన్ని లక్షణాలు కనపడవచ్చు. కొన్ని మార్లు లక్షణాలు బయటపడటానికి 30 రోజుకూడా పట్టవచ్చు. మూత్రంలో మంట, తెలుపు లేక ఆకుపచ్చ లేక పసుపుపచ్చ ద్రవాలు పురుషాంగం  లేదా యోని నుంచి స్రవించవచ్చు. సెగవ్యాధి సోకిన పురుషులలో అప్పుడప్పుడు వృషణాల నొప్పితో వాయడం జరుగుతుంది. స్త్రీలలో లక్షణాలు తీక్షణత తక్కువగా వుంటుంది. స్త్రీలలో తొలుత మూత్రంలో మంట, యోని స్రావాలు ఎక్కువగా స్రవించడం, యోని ద్వారా  బహిష్ఠుల మధ్యలో రక్తస్రావం వంటి లక్షణాలు కనుబడుతాయి.

సెగవ్యాధి ఏ విధంగా గర్భిణిని, గర్భస్థ శిశువుకు  ప్రభావితం చేస్తుంది?

ఒకవేళ గర్భిణీ  స్త్రీలో సెగ వ్యాధి వుంటే ప్రసూతి సమయంలో ఇది శిశువుకు యోని ద్వారా బయటకు  వచ్చేటప్పుడు సోకవచ్చు. దీనివల్ల అంధత్వం, కీళ్ళలో సూక్ష్మజీవి సంపర్కం, మరియు రక్తంలో సూక్ష్మజీవి సంపర్కం వల్ల శిశువుకు ప్రాణహాని కూడా కలుగవచ్చు. గర్భిణి స్త్రీకు సోకిన సెగవ్యాధి ని అందించినట్టయితే తీవ్రమైన పరిణామాలను తగ్గించవచ్చు.

గర్భిణి స్త్రీలు ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించి తగువిధంగా పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకోవాలి.

సెగవ్యాధి ఏ విధంగా నివారించాలి ?

అసురక్షిత లైంగిక సంబంధాలకు దూరంగా వుండడమే ఖచ్చితమైన నివారణోపాయము లేదా ఈ వ్యాధి సోకలేదని నిర్ధారించబడిన ఒకే స్త్రీతో దీర్ఘకాల సంబంధం కొనసాగించడం శ్రేయస్కరం.

స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలకు వచ్చే సూక్ష్మ క్రిమి సంపర్కం

పి.ఐ.డి (PID) అనగానేమి ?

కటి కుహరము ( స్త్రీలలో పోట్ట క్రింది భాగం ) లో వుండే  స్త్రీ ప్రత్యుత్పత్తి (PELVIS) అవయవాలకు వచ్చే అంటు (ఇన్ ఫెక్షన్) ను  పెల్విక్ ఇన్ ఫ్లమేటరీ డిసీస్ అంటారు.

స్త్రీ కటి కుహరము లో వుండే అవయవాలు - గర్భసంచి, ఫెల్లో పియాన్  నాళాలు,  అండాశయములు. కొన్ని సుఖవ్యాధుల (STD అసురక్షిత లైంగిక సంబంధాలతో వచ్చే జబ్బులు) లో ముఖ్యంగా క్లమీడియా, గానోరియా తరువాత కలుగు దుశ్ఛలితాలలో ఈ పి.ఐ.డి. ఒకటి. దీనికి వెంటనే చికిత్స తీసుకోక  పోయినచో గర్భాశయమునకు, అండాశయమునకు చుట్టు పక్కలా ఉండే కణజాలాలలో మరియూ వీటిని రెండిటినీ కలిపే నాళాలు (ఫెల్లోపియన్ ట్యూబ్స్ ) లో పి.ఐ.డి వ్యాధి మూలాన హాని కలిగే అవకాశం వుంటుంది.

-U/S (ఉల్ట్రాసౌండ స్కానింగ్) వలన ఫాలిపియన్ నాళం వాచిందా/పెద్దగా మారిందా ? కణితలు ఎమైనా ఉన్నాయా ? తెలుసు కోవాలి. తరువాత ల్యాప్రోస్కోపి ద్వారా కటి కుహరంలోని అవయవాలను చూడవచ్చు. అవసరమైతే దీని ద్వారా అవయవాల కణజాలంను తీసి ల్యాబ్ పరీక్షకు పంపుతారు

చికిత్స

 • యాంటి బయోటిక్స్ / మందులు డాక్టరును సంప్రదించి వాడడం .
 • ముందుజాగ్రత్త తీసుకొంటూ సోకకుండా చూసుకోని – లైంగిక సంపర్కం ద్వారా సోకే వ్యాధులు (STD) ని అరికట్టాలి. సురక్షిత లైంగిక సంపర్కం, తొడుగులు (కాన్ డోమ్లు) వాడడం వలన వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చు.

పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీస్ అనే వ్యాధి ఎంత సాధాణంగా సోకుతుంది?

 • దీని వలన 100,000 మంది మహిళలకు గర్బదారణ లేకుండా పోతోంది. మరియు పిండం పెరుగుదల గర్బాశయంలో కాకుండా మరోచోట అభివృద్ధి చెందుతుంది.
 • దీని  వలన సంవత్సరానికి 150 మంది కంటే ఎక్కువ మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు

స్త్రీలకు ఈవ్యాధి ఏ విధంగా సోకుతుంది ?

 • ఈ బ్యాక్టీరియా యోని మార్గం ద్వారా ప్రవేశించి ఆ మహిళ యొక్క ప్రత్యుత్పతి అవయవాలకు చేరుకుంటుంది.
 • ఈ వ్యాధి చాలా రకాల సూక్ష్మజీవుల ద్వారా కూడా కలుగుతుంది కాని  ఇవి  గొనొరియా (Gonorrnea), క్లమీడియా (clamydia) అనే రెండు సుఖవ్యాధులతో కలిసి వస్తాయి.
 • మొదటి సారి సోకిన దాని కంటే మరలా రెండవసారి వ్యాధి సోకినవారిలో వ్యాధి లక్షణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అవయవాలు మొదట్లోనే పాడైపోయి  వుంటాయి.
 • 25 సం. వయసు లోపు ఉండి శృంగారంలో పాల్గొంటూ, పిల్లలకు జన్మనిచ్చే మహిళలకు ఇది చాలా ప్రమాదకరం. మరియు మహిళ వయస్సు 25 సం లోపు వారు ఎక్కువగా ఈ వ్యాధికి గురి అవుతారు. 50 సం. పై బడిన వారికి కొద్దిగా తక్కువగా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
 • ఎందుకంటే యవ్వనపు మహిళలలో, బాలికలలో, గర్భాశయం యొక్క ముందు భాగము (సర్విక్స)   అంతగా  అభివృద్ధి  చెంది ఉండదు. అందువల్ల ఎక్కువగా సుఖవ్యాధులు (STD) వచ్చుటకు ఆస్కారం ఉంది. వీటితో PID - పి ఐ డి   కూడా ముడిపడి ఉంటుంది.
 • ఒకరు లేదా ఎక్కువ మంది తో అసురక్షిత లైంగిక సంపర్కం ఉన్న స్త్రీలకు  ఈ వ్యాధి PID - పి ఐ డి ఎక్కువగా సోకే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువ వ్యాధికారక సూక్ష్మజీవులు సోకుతాయి.
 • యోనిని గొట్టంలోని నీటితో శుభ్ర పరుచు (యోనిలోకి  నీటిధార పంపి శుభ్ర పరచుట) మహిళకు ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుంది. సాధారణ పద్ధతిలో శుభ్రం చేసుకొనే మహిళకు ఈ వ్యాధి సోకడం తక్కువ.
 • దీనిని ప్రయోగాత్మకంగా నిరూపించబడినది. గొట్టంతో కడుగుట వల్లన సూక్ష్మ జీవులు యోని ద్వారా స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలైన అండాశయం పై భాగానికి చేరుకుంటాయి.
 • గర్భనిరోధక పద్ధతి కాపర్ టీ లేదా లూపులు (IUD) అవలంబించే మహిళలలో PID - పి ఐ డి   ఎక్కువ గాను, అది కూడా (IUD) అమర్చిన మొదట్లో వచ్చే అవకాశం  ఉన్నది.
 • కాపర్ టీ లేదా లూపులు  (IUD) అమర్చే ముందు STD పరీక్షలు చేయడం

క్లమీడియా (Climidia infection) కారణంగా PID - పి ఐ డి .

ఈ వ్యాధి సోకిన తరువాత, స్త్రీకి ఈ వ్యాధి లక్షణాలు గుర్తించవచ్చు లేదా గుర్తించలేకపోవచ్చు, ముఖ్యంగా ఎక్కువ ప్రత్యుత్పత్తి   భాగాలు పాడైపోయే టప్పుడు, PID - పి ఐ డి వ్యాధి లక్షణాలను ఆరోగ్య కార్యకర్త  కూడా గుర్తించలేరు.

వ్యాధి లక్షణాలు

 • బొడ్డు క్రింద భాగంలో కడుపు నొప్పి.
 • జ్వరము
 • యోని నుండి ద్రవాలు స్రవించడం (రావడం) ఇది దుర్వాసనతో కూడి ఉండటం.
 • లైంగిక చర్యలో నొప్పి
 • మూత్ర విసర్జన సమయంలో నొప్పి
 • ఋతుచక్రం క్రమం తప్పడం  రక్రస్రావం జరగడం
 • అరుదుగా కుడివైపు కడుపు పై భాగాన నొప్పి రావడం (Upper Abdomen)

క్లిష్టమైన/అపాయకరమైన పరిణామాలు

సరైన వైద్యం చేత PID - పి ఐ డి   వ్యాధి లక్షణాలను నయం చేయవచ్చు. ఒకవేళ వైద్యం చేయకపోతే మహిళ యొక్క ప్రత్యుత్పత్తి అవయవాలు శ్యాస్వతంగా   నాశనం అవుతాయి.

వ్యాధి కారక బ్యాక్టీరియా నెమ్మదిగా ఫాలోపియన్ నాళములలోకి ప్రవేశిస్తాయి.  తరువాత సాధారణ

కణజాలమును గట్టి కణజాలంగా మార్చి వేస్తాయి.

 • ఈ గట్టి కణజాలం వల్లన అండము గర్భాశయంకు చేరకుండా ఈ నాళంలోనే ఆగిపోతుంది.
 • ఒకవేళ  ఫాలోపియన్ నాళము పూర్తిగా గట్టి కళజాలంతో నిండిపోయిన ఎడల,    శుక్రకణము, అండంతో కలవదు, అప్పుడు ఆ మహిళకు పిల్లలు కలగరు.
 • వంద్యత్వము ఫాలోపియన్ నాళము కొద్దిగా మూసుకు పోయినా, కొద్దిగా పాడైపాయినా వంద్యత్వము కలగవచ్చు.
 • PID - పి ఐ డి   సోకిన 8 మంది మహిళలో ఒకరు వంద్యత్వంకు లోనవుతున్నారు. ఎక్కువ సార్లు PID - పి ఐ డి వచ్చిన ఎడల అది వంద్యత్వము (గొడ్రాలు) వచ్చే అవకాశం ఎక్కువ.
 • ఒక్కొక్కసారి కొద్దిగా మూసుకుపోయి, లేదా కొద్దిగా పాడైపోయిన ఫాలోపియన్ నాళం కాకుండా మిగిలిన ఫాలోపియన్ నాళంలో పిండోత్పత్తి జరుగుతుంది. ఈ విధంగా గర్భాశయంలో కాకుండా  ఫాలోపియన్ నాళంలో పిండోత్పత్తి జరగడాన్ని Ectopic Pregnancy అంటారు.
 • ఈ   Ectopic Pregnancy  వలన  ఫాలోపియన్ నాళం  లోనే అండం అభివృద్ది చెంది పెద్దదవుతుంది పిండం. దీని వలన  ఫాలోపియన్ నాళం  పగిలి ఎక్కువ నొప్పి, లోపల రక్తస్రావం జరగడం, ఒక్కొక్కసారి ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతుంది.
 • కింది కడుపు భాగము (కటి కుహరము), ఫాలోపియన్ నాళపు కణజాలం గట్టిపడడం వలన ఎక్కువ కాలం కటి కుహరపు నొప్పి ఉంటుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధి లాగా ఉండును. పదే పదే ఈ వ్యాధికి గురికావటం వలన వంద్యత్వముతో బాధ పడతారు.

నిర్ధారణచేయడం

 • PID - పి ఐ డి   వ్యాధి నిర్ధారణ చేయడం కష్టం ఎందుకంటే వ్యాధి లక్షణాలు తక్కువగాను,  ఒక్కొక్క సారి లక్షణాలులేక పోవడం వలన ప్రత్యేక పరిక్షలు ద్వారానే ఈ వ్యాధిని నిర్ధారించవలసి ఉంటుంది.
 • ఒకవేళ వ్యాధి లక్షణం బొడ్డు కింద బాగంలో కడుపు నొప్పి వస్తే ఆరోగ్య అధికారులు, శారీరక పరీక్షలు చేసి, ఎటువంటి నొప్పి, ఏ ప్రదేశంలో నొప్పి, జ్వరము, యోని స్రవాలను పరీక్షించాలి. మరియు గోనోరియల్ (Gonorrheal) , క్లమీడియల్ (chlamydial)  అంటు/ ఇన్ఫేక్షన్ కోసం కూడా పరీక్షించాలి.
 • వ్యాధి నిర్ధారణ అయినచో వైద్యం తప్పని సరి చేయించుకోవాలి.
 • ఆరోగ్య సహాయకాదికారులు సూక్ష్మజీవుల పరీక్షలు నిర్వహించాలి. ఒపెల్నిక్ అల్ట్రాసౌండ్ (Opelnic ultnosoond) PID - పి ఐ డి  - పి ఐడి కనుగొనుటకు ఉపయోగ పడుతుంది.

గర్భిణి స్త్రీలో సుఖరోగాలు, లైంగిక వ్యాధులు

గర్బిణిస్త్రీలలో లైంగిక వ్యాధులు వచ్చే అవకాశం వుంటుందా ?

అవును గర్భం దాల్చని స్త్రీలలో లైంగిక వ్యాధులు వచ్చినట్టే గర్భిణీ స్త్రీలకు కూడా ఈ వ్యాధులు వచ్చే అవకాశం వుంటుంది.

లైంగికవ్యాధులు ఏ విధంగా గర్భిణీ స్త్రీని మరియూ గర్భస్థ శిశువును ప్రభావితంచేస్తాయి ?

గర్భిణీ కాని స్త్రీలలో లైంగిక వ్యాధుల వల్ల వచ్చే సమస్యలు వాటి పరిణామాలు ఎలా ఐతే వుంటాయొ, అలాగే గర్భిం దాల్చిన స్త్రీలలో కూడా లైంగిక వ్యాధుల వల్ల అదే మాదిరి సమస్యలు వస్తాయి. లైంగిక వ్యాధుల వల్ల గర్భసంచి మూతి క్యాన్సరు (కంతులు) వేరే అవయవాల దూరణ కంతులు (cencers) దీర్ఘకాలిక కాలేయ శోధము, శ్రోణి అవయవాల శోధము (శోధము -Infection), మరియు కటవలయంలోని అవయవాల సూక్ష్మక్రిమి సంపర్కము, వంద్యత్వము మరియు ఇతర దుష్పరిణామాలు కూడా కలుగవచ్చును. చాలా మందిలో లైంగిక వ్యాధులు ఏ లక్షణాలు బయట పడక నిశ్శబ్దంగా వుంటాయి. ఏ లక్షణాలు, సంకేతాలు పైకి కనపడవు.

లైంగిక వ్యాధి వున్న గర్భిణీ కాన్పు నెలలు నిండకమునుపే రావచ్చు లేదా, గర్భస్థ శిశువు చుట్టూ వున్న ఉమ్మినీరు పొరలు నెలలు నిండకమునుపే పగిలి పోవచ్చు లేదా, గర్భసంచికి సూక్ష్మక్రిమి, సంపర్కము కలుగు వచ్చును. లైంగిక వ్యాధి తల్లి నుంచి శిశువుకు గర్భంలో వుండగా లేదా కాన్పు జరుగునప్పుడు లేదా కాన్పు తరువాత పాలద్వారా వ్యాపించవచ్చును. సిఫిలిస్ అనే లైంగిక వ్యభిచార రోగములో రోగక్రిములు తల్లినుండి మాయను దాటి బిడ్డకు సంక్రమించవచ్చు. ఇతర లైంగిక వ్యాధుల (గొనోరియా - సెగవ్యాధి, కాలేయ శోధము - B, జననేంద్రియాలకు సోకే విసర్పిణి , క్లమీడియా) లో తల్లి నుండి బిడ్డకు ప్రసవ మార్గం గుండా ప్రయోగించునప్పుడు సోకవచ్చు. H.I.V (ఎయిడ్స్) వ్యాధి మాయను దాటి గర్భంలో వుండగానే బిడ్డకు సోకవచ్చు లేదా ప్రసవ సమయంలో సోకవచ్చు లేదా ఇతర లైంగిక వ్యాధులవలెకాక పుట్టిన తరువాత తల్లిపాల నుంచి కూడా బిడ్డకు వ్యాపించవచ్చును.

లైంగిక వ్యాధుల దుష్ప్రభావాలుః- తక్కువ బరువున్న బిడ్డపుట్టడం (5 పౌండ్ల కంటే తక్కువ) కండ్లకలక (కళ్ళలో కలిగే సూక్ష్మక్రిమి సంపర్కము ఊపిరితిత్తుల నిమ్ము , శిశువుల రక్తస్రావంలో సూక్ష్మక్రిమి సంపర్కము లేక చీము పోయడం), నరాలకు హనికలగడం (మొదడుకు హాని, కదలికలలో సమన్వయం లేకపోవడం, గ్రుడ్టితనం, చెముడు, ఆకస్మిక కాలేయ శోధము  మొదడు పొరల శోధము లేక సూక్ష్మక్రిమి సంపర్కము, దీర్ఘకాలిక జబ్బులు, కాలేయంలో అధికంగా నార పదార్థము చేరే జబ్బు.

గర్భిణిస్త్రీలలో లైంగిక వ్యాదులకు సంబంధించిన పరీక్షలు జరపాలా ?

లైంగిక వ్యాధుల చికిత్సలో భాగంగా గర్భిణి స్త్రీలు పరీక్షకు వచ్చిన మొదట సారే వీటి గురించి పరిశోధనలు, పరీక్షలు చేయించాలి.

పరీక్ష చేయించవలసిన లైంగికవ్యాధులు:

 • క్లామీడియా
 • సెగవ్యాధి
 • కాలేయ సూక్ష్మక్రిమి సంపర్కము లేక కాలేయ శోధము- బి (హెపటైటిస్ - బి)
 • కాలేయ శోధము -సి (హెపటైటిస్ - సి)
 • ఎయిడ్స్ (HIV)
 • సిఫలిక్ లేక సుఖరోగము

గర్భంతోవున్న స్త్రీలకు లైంగిక వ్యాధుల చికిత్స చేయవచ్చునా ?

క్లామీడియా, సెగవ్యాధి, సుఖరోగము ట్రైకోమోనాస్ (తెల్ల బట్ట), సూక్ష్మజీవుల వల్ల కలిగే యోని యొక్క శోధము వంటి సుఖ వ్యాధులకు సూక్ష్మ చికిత్స చేయవచ్చును. వైరస్ల వల్ల కలిగే ఎయిడ్స్ మరియు జననేంద్రియాల మొదలగు వ్యాధుల లక్షణాలు కొంతవరకు పూర్తిగా నయం చేయలేము. జననేంద్రియాల నొప్పి తీవ్రంగా వున్న గర్భిణి స్త్రీలకు యోని ద్వారా ప్రసవం కాకుండా కడుపు గర్భసంచి శస్త్ర చికిత్స ద్వారా బిడ్డకు బయటకు తీయడం వలన బిడ్డకు ప్రసవ మార్గం నుండి వచ్చే సూక్ష్మక్రిమి సంపర్కాన్ని నివారించవచ్చును. కాలేయ శోధము -బి వ్యాధి లేదని నిర్ధారింపబడిన వారికి ఆ వ్యాధి టీకాలు ఇవ్వవచ్చును.

గర్భిణీ స్త్రీలు ఈ వ్యాధుల బారిన పడకుండా ఏ విధంగా రక్షణ పొందవచ్చును ?

సుఖవ్యాధుల బారిన పడకుండా వుండాలంటే ఈ వ్యాధి సోకిన వారితో లైంగిక సంపర్కంలో పాల్గొనకుండా వుండడం ఒకటే శ్రేయస్కరమైన మార్గం. ఒకే వ్యక్తితో సంసారిక జీవనం గడపడం లేదా కనీసం లైంగిక సంపర్కంలో పాల్గొనే వ్యక్తి వ్యాధి సోకిన వారా అని నిర్థారించుకొన్న తరువాతే పాల్గొనడం వంటి జాగ్రత్తలు తీసుకొనడం ఎంతైనా ముఖ్యం.

సర్పి, విపర్పిణి

సర్పి, విపర్పిణి అంటే ఎమిటి ?

జననేంద్రియాల సర్పి లైంగిక సంపర్కం వల్ల  సంక్రమించే వ్యాధి దీనికి కారణం హెర్పిస్- సంప్లెక్స్  అనే వైరస్ 1వ రకం (హెచ్ ఎస్ వి -1) మరియు 2వ రకం (హెచ్ ఎస్ వి -2).

జననేంద్రియాల సర్పి ఏ విధంగా వ్యాపిస్తుంది?

హెచ్.ఎస్.వి. -2 రకం సర్పి ఈ వ్యాధి సోకిన వ్యక్తితో లైంగిక సంపర్కం మూలాన వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తికి ఈ వ్యాధి తనకు సోకి వుందన్న విషయం తెలిసి వుండక పోవచ్చును. జననేంద్రియాలపై పుండ్లు  కూడా  కనబడకపోవచ్చును.

సర్పియొక్క లక్షణాలు మరియు సంకేతాలు

చాలా మంది ఈ వ్యాధి సోకిన వారికి, ఈ వ్యాధి తమకు సంక్రమించిందన్న విషయం తెలియదు. వ్యాధి సంక్రమించి రెండు వారాలకు మొట్టమొదటి జననేంద్రియాలపై పుండ్లు బయపడి అవి  రెండు నుంచి నాలుగు వారాలలో మానిపోతాయి.  లక్షణాలు లేక సంకేతాలు కనబడడం. మొదలయినప్పుడు అవి జననేంద్రియాలు లేక ఆసనము పై చిన్న బొబ్బలు లాగా బయటపడుతాయి. ఈ బొబ్బలు పగిలి అవి పుండ్లు పడి (వ్రణాలు) పోతాయి అవి మానడానికి రెండు నుంచి నాలుగు వారాల సమయం పడుతుంది. మొదటి సారి ఇంత సమయం పడుతుంది.  రెండవసారి మళ్ళీ బొబ్బలు కొన్ని వారాలు లేక నెలలు తరువాత కనబడతాయి. కానీ మొదట సారికంటే తక్కువ తీవ్రతతో వుంటే తక్కువ సమయంలో మానిపోతాయి. ఈ వైరస్ లు శరీరంలో ఎంత కాలం వుంటాయో చెప్పలేము కానీ లక్షణాలు సమయం గడిచే కొద్దీ తీవ్రత  తగ్గుతూ పోతుంది. లక్షణాలు సంకేతాలు ఫ్లూను పోలి వుంటాయి. జ్వరము, గ్రంధులు వాపు వంటివి  కనబడుతాయి.

సర్పికి చికిత్స ఉన్నాదా?

శాశ్వతమైన చికిత్స లేదు. కానీ వైరస్ కు విరుద్ధంగా వేసుకునే మందులు మూలంగా మందులు తీసుకుంటున్నంత కాలం పుండ్లు బాధించే  కాలాన్ని  తక్కువ చేసుకోవచ్చు. మళ్ళీమళ్ళీ బొబ్బలు లేవకుండా నివారించుకొనవచ్చు. ప్రతి రోజూ, బొబ్బలను, లక్షణాలను అణచే మందులు వాడడం మూలాన లైంగిక సంపర్కంలో పాల్గొనే వాళ్ళకు వ్యాప్తి చెందకుండా వుంటుంది.

సర్పి వ్యాధిని నివారించడం ఎలా?

లైంగిక వ్యాధుల బారిన పడకుండా వుండాలంటే వివాహేతర లైంగిక సంపర్కాలకు దూరంగా వుండడం ఉత్తమమైన మార్గం. ఒకే జీవిత భాగస్వామితో ఎక్కువకాలం కలిసి వుండడం,  లేదా వ్యాధి లేదని నిర్థారింపబడిన వారితోనే లైంగిక సంబంధం పెట్టుకోవడం వంటి మార్గాలు అనుసరించాలి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

ఎయిడ్స్ పై సందేహ నివృత్తి

హెచ్ఐవి ఉన్నా ఆరోగ్యవంతమైన బిడ్డను కనే అవకాశం ఉందా?

నా వయస్సు 28 సంవత్సరాలు. రెండేళ్ల క్రితంజరిపిన పరీక్షల్లో హెచ్ఐవి ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం ఒక అమ్మాయి నన్నుఇష్టపడుతోంది. హెచ్ఐవి ఉన్నా పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపుతోంది. అయితేమేం పెళ్లి చేసుకున్నా శృంగారంలో కండోమ్ ఉపయోగించాలని నిర్ణయించుకున్నాం.దీనివల్ల ఆమె హెచ్ఐవి బారినపడకుండా ఉంటుంది కదా. అయితే మా సమస్య ఏంటంటేమాకు పిల్లలు కలిగేదెలా? హెచ్ఐవి ఉన్న వ్యక్తి నుంచి వీర్యాన్ని సేకరించిఅందులో ఉన్న వైరస్‌ను నిర్మూలించే పరిజ్ఞానం వచ్చిందని అంటున్నారు.నిజమేనా? మేం శారీరకంగా కలవకుండా ఆరోగ్యవంతమైన బిడ్డను కనే అవకాశం ఉందా? వివరాలు తెలియజేయండి.

భర్తకు హెచ్ఐవి ఉన్నంతన మాత్రాన భార్యకు రావాలని లేదు. ఎందుకంటే భారతదేశంలో 5 శాతం మంది జనాభాలో హెచ్ఐవి సోకటానికి ఉండాల్సిన కో రెసిప్టార్స్ లేవు. అంతేకాకుండా సిడి4 కౌంట్ ఎక్కువగా ఉండి, వైరస్‌లోడ్ తక్కువగా ఉన్నప్పుడు హెచ్ఐవి సంక్రమించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇప్పుడు హెచ్ఐవి ఉన్నా పిల్లలు కనేందుకు మంచి పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. మీరు శారీరకంగా కలవకుండా కూడా పిల్లలను కనవచ్చు. ఈ పద్ధతిని ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటారు.

ఇందులో హెచ్ఐవి ఉన్న వ్యక్తి వీర్యాన్ని శుద్ధి చేయడం జరుగుతుంది. శుద్ది చేయడం వల్ల హెచ్ఐవిని నిర్మూలించవచ్చు. హెచ్ఐవి వైరస్ వీర్యంలోని లిక్విడ్‌లో ఉంటుందే తప్ప శుక్రకణాలకు అతుక్కుని ఉండదు. కాబట్టి సెమన్‌ను వాష్ చేయడం ద్వారా హెచ్ఐవిని నిర్మూలించి ఆరోగ్యవంతమైన శుక్రకణాలను పొందవచ్చు. వీటిని స్త్రీ గర్భాశయంలో ప్రవేశపెట్టడం ద్వారా ఆరోగ్యవంతమైన సంతానాన్ని పొందవచ్చు. అయితే ఈ విధానం ద్వారా సంతానం పొందాలనే పురుషులకు సెమెన్ కౌంట్ నార్మల్‌గా ఉండాలి. ఎటువంటి ఇన్‌ఫెక్షన్లు ఉండకూడదు. ఈ చికిత్స అమెరికాలో మాత్రమే లభించేది. ప్రస్తుతం మన దగ్గర కూడా అందుబాటులో ఉంది. దంపతులద్దిరికీ హెచ్ఐవి ఉన్నా పుట్టే పిల్లలకు 98 శాతం హెచ్ఐవి లేకుండా పుట్టేలా చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా పాజిటివ్ వ్యక్తులు వైరల్ లోడ్‌ను బాగా తగ్గించకుని, సిడి 4 కౌంట్ పెరిగేలా మందులు వాడుకుని ఆ తరువాత సంతానాని కోసం ప్రయత్నించాలి.

క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందా ?

నా వయసు 42. ఇటీవల చేసిన పరీక్షల్లో నాకు హెచ్ఐవితో పాటు హెచ్‌బిఎస్-ఎజి కూడా ఉన్నట్లు బయటపడింది. అయితే ఈ రెండూ ఉన్నవారు క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువని కొందరి నోట విన్నాను. ఇదినిజమేనా ? నా ఆరోగ్యాన్ని కాపాడుకునే మార్గం చెప్పండి.

హెచ్ఐవితో పాటు హెచ్‌బిఎస్-ఎజి కూడా ఉన్నవారిలో హ్యుమరల్ ఇమ్యూనిటీ, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ వేగంగా త గ్గిపోతాయి. వీరిలో క్షయ, మ్యాక్ ఇన్‌ఫెక్షన్లు ఎక్కువవుతాయి. ఫలితంగా కాలేయం పెద్దదవుతుంది. ఇవన్నీ క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం కూడా ఉంది. హెచ్ఐవి వల్ల కాలేయంలో సూక్ష్మరక్తనాళాలు దెబ్బ తింటాయి. హెచ్ఐవికి వాడే మందుల వల్ల కూడా కొందరిలో కాలేయం దెబ్బ తింటుంది. వీరిలో ఎక్కువ మంది సిర్రోసిస్ వ్యాధికి గురవుతూ ఉంటారు.

అందుకే హెచ్ఐవి ఉన్నవారికి హెపటైటిస్ సమస్యలు రాకుండా ముందే టీకా తీసుకోవడం మేలు. ఒకవేళ అంతకు ముందే హెపటైటిస్ సమస్య వచ్చి ఉంటే టీకా కాకుండా మందులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కాలేయం బావుంటేనే హెచ్ఐవి మందులు (ఏఆర్‌టి) వాడాలి. కాలేయంలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు అది తగ్గేదాకా హెచ్ఐవి మందులు వాడకూడదు. ఏమైనా వెంటనే లైంగిక వ్యాధి నిపుణులను సంప్రదించి వెంటనే చికిత్స తీసుకోవడం చాలా అవసరం.

ఎనిమిదేళ్ల క్రితం నాకు హెచ్ఐవి ఉన్నట్లుబయటపడింది. డాక్టర్ సూచించినప్పటి నుంచి ఎఆర్‌టి మందులు వాడుతూనే ఉన్నాను, కాకపోతే ఎప్పుడూ సిడి-4 కౌంట్ పెద్దగా పెరగదు. రక్తంలో వైరల్ చూసినా నిల్అనే ఉంటుంది. అయినా నాకు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉన్నట్లు అనిపించదు. నిరంతరంనీరసం, నిస్సత్తువ పట్టి పీడిస్తూ ఉంటాయి. నాకో చిన్న వ్యాపారం ఉంది.కొద్ది రోజులు పోతే నేనింక ఆ వ్యాపారం కూడా చేయలేనేమో అనిపిస్తోంది. నాలోఆత్మ విశ్వాసం రోజురోజుకూ అడుగంటి పోతోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి.

హెచ్ఐవిలో టైప్-1, టైప్-2 అని రెండు రకాలుగా ఉంటుంది. మీకున్న హెచ్ఐవి ఏ టైపో మీరు రాయలేదు. వాస్తవానికి హెచ్ఐవి టైప్-1 కోసం వాడే మందులన్నీ హెచ్ఐవి-2 కు పనిచేయవు. మీరు సిడి-4 కౌంట్ సరిగా పెరగడం లేదు అన్నారు. హెచ్ఐవి మందులు వేసుకుంటున్నప్పుడు సిడి-4 కౌంట్ ఏడాదికి 50 నుంచి 100 వరకు పెరగడం నార్మల్.

వాస్తవానికి ఒక్క హెచ్ఐవి-1 లోనే 8 సబ్‌టైప్స్ ఉంటాయి. అందులోనూ మళ్లీ మూడు గ్రూపులు ఉంటాయి. వాటిని 'ఎన్', 'ఓ' టైప్స్‌గా పిలుస్తారు. ఇవి వేరువేరు దేశాల్లో వేరు వేరుగా అంటే మేజర్, న్యూట్రల్, ఔట్లియర్ అనే విభాగాలుగా చూస్తారు. అలాగే హెచ్ఐవి-2 లోకూడా సబ్‌టైప్స్ ఉంటాయి. నిజానికి ఈ హెచ్ఐవి-2 రకం ఆఫ్రికాలోనే ఎక్కువగా కనిసిస్తుంది. మనదేశంలో ఈ రకం చాలా అరుదుగా కనిపిస్తుంది. చాలా మందిలో ఏదో ఒక ర కం హెచ్ఐవి మాత్రమే ఉంటుంది. అరుదుగా కొందరిలో హెచ్ఐవి-టైప్1, టైప్ 2 ఈ రెండు రకాలూ ఉంటాయి.

ఒకవేళ మీకున్నది హెచ్ఐవి-2 ఉంటే సాధారణ మందులు కాకుండా వేరే మందులు వాడవలసి ఉంటుంది. హెచ్ఐవి టైప్-1 వైరస్‌తో పోలిస్తే హెచ్ఐవి- టైప్-2 రకం తక్కువ హానికారి. పైగా హెచ్ఐవి-2 ఎయిడ్స్‌గా మారడానికి 10 నుంచి 15 ఏళ్లదాకా పడుతుంది.

హెచ్ఐవి-2 తల్లినుంచి బిడ్డకు రావడం కూడా చాలా తక్కువే. తల్లి పాల నుంచి వ్యాపించే అవకాశం కూడా తక్కువే. అయితే, హెచ్ఐవి-2 కి తీసుకునే మందులు కొన్ని అదనంగా ఉంటాయి. వీరికి ఎన్ఆర్‌టిఐ తో పాటు పిటి ( ప్రొటపీస్ ఇన్హిబిటార్స్) కూడా వాడవలసి ఉంటుంది. వీరికి ఎన్ఎన్ఆర్‌టిఐ మందులు పనిచేయవు. ఏమైనా హెచ్ఐవి వ్యాధి నిర్ధారణలో కొన్నిసార్లు త ప్పిదాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే కొంతమంది పరీక్షలు చేసి హెచ్ఐవి లేదని చెబుతారు. కానీ, వారి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తూ ఉంటుంది. అలాంటి వారు ఒకసారి హెచ్ఐవి-2 పరీక్ష చేయించవలసి ఉంటుంది.

నిజానికి హెచ్ఐవి-2 వ్యాధిలో చాలా కాలం దాకా వ్యాధి లక్షణాలేవీ కనిపించవు. అందుకే తమకు తాముగా తమకేదో సమస్య ఉన్నట్లు అనుమానించే అవకాశం రోగికి ఉండదు. అందుకే ఏటా చేయించే సాధారణ పరీక్షలతో పాటే హెచ్ఐవి పరీక్షలు కూడా చేయించుకుంటే సమస్యను ముందే గుర్తించే వీలుంది. ఏమైనా హెచ్ఐవి ఉన్నట్లు తేలితే పౌష్టికాహారం తీసుకుంటే క్రమం తప్పకుండా మందులు వాడితే ఒక సాధారణ ఆరోగ్య జీవితం గడపడం సాధ్యమవుతుంది.

ఎయిడ్స్‌కు దూరం కావడం ఎలా ?

హెచ్.ఐ.వి. ఎవరికి వస్తుంది?

హెచ్.ఐ.వి రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?

హెచ్.ఐ.వి. ప్రాణాంతకమైన లైంగిక వ్యాధి. ఒకరి కంటే ఎక్కువ మందితో కండోమ్ రహితంగా శృంగారానికి దిగినపుడు సదరు వ్యక్తులకు ఈ వ్యాధి ఉంటే రెండో వ్యక్తికీ సోకుతుంది. యోని, మౌఖిక, గుద మార్గాలలో సెక్స్ చేసే స్త్రీ, పురుషులిద్దరికీ ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. సుఖవ్యాధులు ఉన్న వారితో సెక్స్‌లో పాల్గొంటే ఈ ప్రమాదం తప్పదు. అలాగే, హీమోఫీలియా లాంటి ఎర్రరక్త కణాలకు సంబంధించిన వ్యాధులున్న వారు తరచూ రక్తం ఎక్కించుకోవాల్సి వుంటుంది. వీరికి ఒకవేళ సరిగా పరీక్షించకుండా రక్తాన్ని ఎక్కించినా వ్యాధి వస్తుంది. అలాగే, హెచ్.ఐ.వి. పాజిటివ్ ఉన్న తల్లికి పుట్టిన బిడ్డలకు ప్రసవవేళ కొన్ని పొరపాట్లు జరిగితే ఇది సోకవచ్చు. హెచ్.ఐ.వి. స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోకుండా రక్తాన్ని ఎక్కించుకునే వారికి కూడా ఇది వస్తుంది. హెచ్.ఐ.వి రోగులకు ఇంట్రావీనస్ ఇంజెక్షన్ ద్వారా వాడిన సూదులను స్టెరిలైజ్ చేయకుండానే మళ్ళీ వేరొకరికి వాడినపుడు లేదా టాటూలు, ముక్కులు, చెవులు పొడిపించుకునే చిన్న ఆభరణాల ద్వారా కూడా హెచ్‌ఐవి వ్యాపిస్తుంది.

హెచ్.ఐ.వి రాకుండా జాగ్రత్తలు

ప్రమాదకర హెచ్.ఐ.వి వ్యాధి గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత మంచిది. బహు లైంగిక సంబంధాల్లోకి వెళ్ళకుండా ఉండాలి. దాంపత్య జీవితంలో విలువల్ని ఆచరించాలి.

సురక్షిత సూత్రాలను పాటించని వారికి ఈ ప్రమాదం పొంచి ఉంటుంది. మంచి సామాజిక విలువల్ని పాటించడం ఉత్తమం. భార్యను మోసం చేసి, వేశ్యల దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచనను మనసులోకి రానివ్వకూడదు. శృంగార జీవితానికి, పెళ్ళికి మధ్య ఉన్న నైతిక ప్రమాణాల్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. పెళ్ళికి ముందు సెక్స్ అనుభవం ఉండాలని ప్రోద్బల పరిచే పరిస్థితులను, స్నేహితుల్ని అవాయిడ్ చేయడమే మంచిది. వివాహేతర సంబంధాల సమయంలో తాజా కండోమ్‌లను విధిగా, సరిగా వాడాలి. కండోమ్‌కి కనిపించని రంధ్రాలుండటమే కాక అవి చిరుగుతాయి. కాబట్టి, సుఖవ్యాధుల నుంచి అవి పూర్తి రక్షణను ఇవ్వవు. ఇంట్రావీనస్ ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ తీసుకునేపుడు ఇంజెక్షన్స్ ఎప్పుడూ స్టెరైల్‌వే వాడాలి. పూర్తి ‘డిస్‌పోసెబుల్’ (ఒకసారి వాడాక పడేసేవి) సూదులే వాడాలి. హెచ్.ఐ.వి. లేని రక్తాన్నే పరీక్ష చేయించుకుని మరీ ఎక్కించుకోవాలి. ఒకవేళ సురక్షితం కాని శృంగారాన్ని జరిపితే త్వరగా అన్ని ఎస్‌టిడి, హెచ్.ఐ.వి పరీక్షలు తాము చేయించుకోవడంతోపాటు పార్ట్‌నర్‌కీ చేయించాలి. సెక్స్ వర్కర్స్ లేదా వేశ్యల వద్దకు అస్సలు వెళ్ళకూడదు. అవకాశం దొరికింది కదాని ఎవరితో పడితే వారితో సెక్స్‌లో పాల్గొనకూడదు. అయితే, హెచ్.ఐ.వి. రాకుండా వాక్సినేషన్ కనుగొన బడలేదు. దీనికి పూర్తి చికిత్స కూడా లేదు.

టి 20 ఇంజెక్షన్‌తో హెచ్ఐవి పోతుందా ?

నా వయసు 31. నాకు గత ఆరేళ్లుగా హెచ్ఐవి ఉంది.క్రమం తప్పకుండా రోజూ మందులు వాడుతూనే ఉన్నాను. ఇటీవల ఓ వ్యక్తి కలిసిహెచ్ఐవి పూర్తిగా నయం చేసే ఒక ఇంజెక్షన్ ఏదో కొత్తగా వచ్చిందని చెప్పాడు.ఒకే ఒక్క ఇంజెక్షన్‌తో హెచ్ఐవి పూర్తిగా హరించుకుపోతుందని ఆ తరువాత ఇలారోజూ మాత్రలు వేసుకోవలసిన అవసరమే ఉండదని చెప్పాడు. కాకపోతే ఆ ఇంజెక్షన్చాలా ఖరీదైనది చె ప్పాడు.ఇది వాస్తవమేనా? నిజానికి రోజూ ఈ మాత్రలువేసుకోవడం చాలా విసుగ్గా ఉంది. కొన్నిసార్లు ఆ మాత్రల వల్ల వచ్చేదుష్ప్రభావాలు బాగా వేధిస్తూ ఉంటాయి. ఆ దుష్ప్రభావాలు తగ్గడానికి మళ్లీవేరే మందులు వాడాలి. రోజు వారి మాత్రలే కాకుండా ఇలా తరుచూ వేరే మాత్రలుకూడా వేసుకోవలసి రావడం ఎంతో బాధగా ఉంటోంది. ఆ ఇంజెక్షన్ వచ్చిందే నిజమైతే ఆవివరాలు తెలియచేయండి.

హెచ్ఐవి చికి త్స కోసం ఉద్దేశించిన 23 రకాల మందులు ఉన్నాయి. వాటిలో 18 రకాలు మన దేశంలో దొరుకుతున్నాయి. హెచ్ఐవి కోసం ఇచ్చే కొన్ని రకాల మందులతో పాటే ఈ ఇంజెక్షన్ కూడా ఉంటుంది. మొదట్లో ఈ ఇంజెక్షన్‌ను టి 20 అని పిలిచేవారు. ప్రస్తుతం ఈ ఇంజెక్షన్‌కు ఎన్‌ఫువర్‌టైడ్ అన్న పేరుతో వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి ఈ ఇంజెక్షన్ హెచ్ఐవి చికిత్సలో భాగంగా ఉంటుందే తప్ప అదేమీ హెచ్ఐవి పూర్తిగా తొలగించేది కాదు.

ఆ మాటకు వస్తే హెచ్ఐవిని పూర్తిగా తొలగించే మందులు ప్రపంచంలో ఎక్కడా లేవు. కాకపోతే ఈ ఇంజెక్షన్‌కు వైరస్ సిడి-4 కణాల లోపలికి హెచ్ఐవి వైరస్ ప్రవేశించకుండా నిరోధించే సామర్థ్యం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ ఇంజెక్షన్ వల్ల వైరస్ పలురకాలుగా వ్యాప్తి చెందే వీలు ఉండదు. సాధారణంగా హెచ్ఐవి వైరస్ శరీరంలో 5 లక్షలకు పైగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఇంజెక్షన్ సూచిస్తారు.

ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి చొప్పున రోజూ రెండు సార్లు ఈ ఇంజెక్షన్ తీసుకోవలసి ఉంటుంది. నెలకు తీసుకునే 60 ఇంజెక్షన్లకు సుమారు లక్ష రూపాయల దాకా అవుతుంది. ఈ ఇంజెక్షన్‌ను కండ రానికి కాకుండా చర్మానికి ఇస్తారు. అయితే వైరస్ సంఖ్య పెరిగినంత మాత్రాన ఆ ఇంజెక్షన్ తప్పనిసరేమీ కాదు. వైరస్ సంఖ్యను తగ్గించే మాత్రలు కూడా ఉన్నాయి. అందుకే ఇంజెక్షన్ ఖరీదు మరీ ఎక్కువని బెంబేలు ఎత్తవలసిన అవసరమేమీ లేదు.

వైరల్ లోడ్ నిల్ ఉన్నా నీరసం ఎందుకు?

ఎనిమిదేళ్ల క్రితం నాకు హెచ్ఐవి ఉన్నట్లుబయటపడింది. డాక్టర్ సూచించినప్పటి నుంచి ఎఆర్‌టి మందులు వాడుతూనే ఉన్నాను, కాకపోతే ఎప్పుడూ సిడి-4 కౌంట్ పెద్దగా పెరగదు. రక్తంలో వైరల్ చూసినా నిల్అనే ఉంటుంది. అయినా నాకు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉన్నట్లు అనిపించదు. నిరంతరంనీరసం, నిస్సత్తువ పట్టి పీడిస్తూ ఉంటాయి. నాకో చిన్న వ్యాపారం ఉంది.కొద్ది రోజులు పోతే నేనింక ఆ వ్యాపారం కూడా చేయలేనేమో అనిపిస్తోంది. నాలోఆత్మ విశ్వాసం రోజురోజుకూ అడుగంటి పోతోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి.

హెచ్ఐవిలో టైప్-1, టైప్-2 అని రెండు రకాలుగా ఉంటుంది. మీకున్న హెచ్ఐవి ఏ టైపో మీరు రాయలేదు. వాస్తవానికి హెచ్ఐవి టైప్-1 కోసం వాడే మందులన్నీ హెచ్ఐవి-2 కు పనిచేయవు. మీరు సిడి-4 కౌంట్ సరిగా పెరగడం లేదు అన్నారు. హెచ్ఐవి మందులు వేసుకుంటున్నప్పుడు సిడి-4 కౌంట్ ఏడాదికి 50 నుంచి 100 వరకు పెరగడం నార్మల్.

వాస్తవానికి ఒక్క హెచ్ఐవి-1 లోనే 8 సబ్‌టైప్స్ ఉంటాయి. అందులోనూ మళ్లీ మూడు గ్రూపులు ఉంటాయి. వాటిని 'ఎన్', 'ఓ' టైప్స్‌గా పిలుస్తారు. ఇవి వేరువేరు దేశాల్లో వేరు వేరుగా అంటే మేజర్, న్యూట్రల్, ఔట్లియర్ అనే విభాగాలుగా చూస్తారు. అలాగే హెచ్ఐవి-2 లోకూడా సబ్‌టైప్స్ ఉంటాయి. నిజానికి ఈ హెచ్ఐవి-2 రకం ఆఫ్రికాలోనే ఎక్కువగా కనిసిస్తుంది. మనదేశంలో ఈ రకం చాలా అరుదుగా కనిపిస్తుంది. చాలా మందిలో ఏదో ఒక ర కం హెచ్ఐవి మాత్రమే ఉంటుంది. అరుదుగా కొందరిలో హెచ్ఐవి-టైప్1, టైప్ 2 ఈ రెండు రకాలూ ఉంటాయి.

ఒకవేళ మీకున్నది హెచ్ఐవి-2 ఉంటే సాధారణ మందులు కాకుండా వేరే మందులు వాడవలసి ఉంటుంది. హెచ్ఐవి టైప్-1 వైరస్‌తో పోలిస్తే హెచ్ఐవి- టైప్-2 రకం తక్కువ హానికారి. పైగా హెచ్ఐవి-2 ఎయిడ్స్‌గా మారడానికి 10 నుంచి 15 ఏళ్లదాకా పడుతుంది.

హెచ్ఐవి-2 తల్లినుంచి బిడ్డకు రావడం కూడా చాలా తక్కువే. తల్లి పాల నుంచి వ్యాపించే అవకాశం కూడా తక్కువే. అయితే, హెచ్ఐవి-2 కి తీసుకునే మందులు కొన్ని అదనంగా ఉంటాయి. వీరికి ఎన్ఆర్‌టిఐ తో పాటు పిటి ( ప్రొటపీస్ ఇన్హిబిటార్స్) కూడా వాడవలసి ఉంటుంది. వీరికి ఎన్ఎన్ఆర్‌టిఐ మందులు పనిచేయవు. ఏమైనా హెచ్ఐవి వ్యాధి నిర్ధారణలో కొన్నిసార్లు త ప్పిదాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే కొంతమంది పరీక్షలు చేసి హెచ్ఐవి లేదని చెబుతారు. కానీ, వారి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తూ ఉంటుంది. అలాంటి వారు ఒకసారి హెచ్ఐవి-2 పరీక్ష చేయించవలసి ఉంటుంది.

నిజానికి హెచ్ఐవి-2 వ్యాధిలో చాలా కాలం దాకా వ్యాధి లక్షణాలేవీ కనిపించవు. అందుకే తమకు తాముగా తమకేదో సమస్య ఉన్నట్లు అనుమానించే అవకాశం రోగికి ఉండదు. అందుకే ఏటా చేయించే సాధారణ పరీక్షలతో పాటే హెచ్ఐవి పరీక్షలు కూడా చేయించుకుంటే సమస్యను ముందే గుర్తించే వీలుంది. ఏమైనా హెచ్ఐవి ఉన్నట్లు తేలితే పౌష్టికాహారం తీసుకుంటే క్రమం తప్పకుండా మందులు వాడితే ఒక సాధారణ ఆరోగ్య జీవితం గడపడం సాధ్యమవుతుంది.

కండోమ్‌ వాడకంపై అపోహలు వద్దు

సుఖ వ్యాధుల వ్యాప్తి నిరోధానికి అవసరమైన కండోమ్‌ గురించిన పరిజ్ఞానం చాలా అవసరం. కండోమ్‌ వాడకం గురించిన అవగాహన అనేకమందికి లేదనడం అతిశయోక్తి కాదు. కండోమ్స్‌పై అనేక మంది అనేక రకాల సందేహాలు వ్యక్తపరుస్తుంటారు. ఈ కండోమ్‌ల గురించిన సమగ్ర అవగాహన కలిగి ఉండటం అవసరం.

కండోమ్స్‌ను లేటెక్స్‌, ప్లాస్టిక్‌ లేదా సహజమైన పొరలతో చేస్తారు. ప్రస్తుతం అనేక రకాల కండోమ్స్‌ మనకు లభ్యమవుతున్నాయి. లూబ్రికేషన్‌ కలిగిఉంటం, లేకపోవడం, పలుచన, బాగా పలుచన, పైన చుక్కలు ఉండేవి పాలీ యూరేథిన్‌తో తయారు చేసిన కండోమ్స్‌ గత 60 సంవత్సరాలుగా లభ్యమవుతున్నాయి.

పాలీ యూరేథిన్‌ అనేది ఒక రకమైన ప్లాస్టిక్‌. ఇది లేటెక్స్‌ కన్నా రెట్టింపు దృఢమైనది. కనుక బాగా పలుచగా చేయవచ్చు. వీటిరి వాసన ఉండదు. పాలీ యూరేథిన్‌ లేటెక్స్‌ ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకోగలదు. సుఖ వ్యాధులనుంచి రక్షణకు కండోమ్‌ ఉత్తమమైన మార్గం. కండోమ్‌పై ఎప్పుడూ వాటర్‌ బేస్డ్‌ జెల్లీలు వాడాలి.

కండోమ్‌ను స్తంభించిన అంగంపై విప్పుకుంటూ వెళ్లాలి. కండోమ్‌ తేలికగా అన్‌రోల్‌ అవుతూ వెళుతుంది. లాగడం, పీకడం వంటివి అవసరం లేదు. ఒకసారి వాడిన కండోమ్‌ను మరొకసారి వాడకూడదు. కండోమ్‌ను ముందే విప్పేస్తే తొడగడం కష్టమవుతుంది.

జాగ్రత్తలు :

కండోమ్‌ను చల్లటి పొడి ప్రదేశాలలో నిలువ ఉంచాలి. వేడి కాని, సూర్యరశ్మి కాని కండోమ్‌లకు సోకకూడదు. కండోమ్‌లు తయారైన తేదీనుంచి నాలుగేళ్లలోపు వాడాలి. కండోమ్‌ కవర్‌ను గోళ్లతో కాని, పళ్లతో కాని చింపేప్పుడు లోపల కండోమ్‌కు తగలకుండా చూడాలి. వీర్యస్కలనం కాగానే కండోమ్‌ తీసివేయాలి.

గర్భ నిరోధంలో కండోమ్‌ రక్షణ

సరైన పద్ధతిలో కండోమ్‌ వాడితే 97 శాతం రక్షణనిస్తుందని అంటారు. నిజానికి అది 88 శాతం వరకే రక్షణనిస్తుంది. కండోమ్‌లో స్పెర్మి సైడ్‌ కలిపి వాడితే అది మరింత రక్షణనిస్తుంది.

ఫిమేల్‌ కండోమ్స్‌

స్త్రీలు వాడే కండోమ్‌లు అమెరికా, యూరప్‌లలో లభిస్తున్నాయి. రియాలిటీ కండోమ్‌ 17 సెంటీమీటర్ల పొడవు ఉండి, పాలీ యూరేథిన్‌ రింగ్స్‌ కలిగి ఉంటుంది. దీనిని డయఫ్రామ్‌లాగా లోపలికి పెట్టుకోవాలి. ఉమెన్స్‌ ఛాయిస్‌ ఫిమేల్‌ కండోమ్‌ అనే మరొక రకం కండోమ్‌ పురుషుల కండోమ్‌ కంటే 30 శాతం ఎక్కువ దళసరిగా ఉంటుంది. మరొక రకంలో లేటెక్స్‌ ప్యాంటీలాగా ఉండి యోని ద్వారం దగ్గర ఒక పౌచ్‌ను కలిగి ఉంటుంది. శృంగార సమయంలో ఈ పౌచ్‌ను యోనిలోనికి తోసుకోవాలి. ఒది మొత్తం బాహ్య జననావయవాలను కవర్‌ చేసి రక్షణనిస్తుంది.

దంపతుల్లో ఒకరికి హెచ్ఐవి ఉంటుందా?

నా వయస్సు 28 సంవత్సరాలు. పెళ్లయి మూడుసంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఇటీవల చేయించుకున్న పరీక్షల్లో హెచ్ఐవిపాజిటివ్ అని తేలింది. నా భార్యకు కూడా ఉంటుందనుకున్నాను. కానీ ఆశ్చర్యంగాఆమెకు నెగెటివ్ అని వచ్చింది. ఇదెలా సాధ్యం? భార్యాభర్తల్లో హెచ్ఐవి ఒకరికిఉండి, మరొకరికి లేకుండా ఉండే అవకాశం ఉందా?

హ్యూమన్ ఇమ్యునోడెఫిసియెన్సీ వైరస్(హెచ్ఐవి) మానవ శరీరంలోకి ప్రవేశించాలంటే కొన్ని కో- రెసిప్టర్స్ అవసరం. వాటి సహాయంతోనే వైరస్ తన టార్గెట్ సెల్స్‌లోకి ప్రవేశిస్తుంది. హెచ్ఐవి ఎంటర్ కావడానికి కావలసిన కో-రెసిప్టర్స్ సిసిఆర్5, సిఎక్స్ఆర్5. ఇవి ఒకరకమైన ప్రొటీన్‌లు. వీటి సహాయంతోనే వైరస్ టి సెల్స్‌లోకి ప్రవేశిస్తుంది. అయితే కొందరిలో ఈ కో-రెసిప్టర్స్ ఉండవు. దీంతో హెచ్ఐవి వైరస్ టి సెల్స్‌లోకి ప్రవేశించలేకపోతుంది. మీ భార్య విషయంలోనూ అదే జరిగింది. మనదేశంలో ఈ తరహా కో రెసిప్టర్స్ లేని వారి సంఖ్య 5 శాతం ఉంటుంది. వీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం లేదు. ఇది సశాస్త్రీయంగా నిర్ధారణ అయింది.

నా వయస్సు 36 సంవత్సరాలు.నేను గత పదేళ్లుగా హెచ్ఐవితో జీవిస్తున్నాను. పాజిటివ్‌గా తేలినపుడుచేయించిన పరీక్షల్లో సీడీ4 కౌంట్ 126. అప్పటి నుంచి క్రమంతప్పకుండా డాక్టర్సూచించిన మందులు వాడుతున్నాను. ప్రస్తుతం సీడీ4 కౌంట్ 1300గా ఉంది. అయితే ఈమందులు ఎంతకాలం కాపాడతాయని స్నేహితులు అంటున్నారు. మందులు వాడితేఆరోగ్యానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కదా? మొదటి దశ మందులతో ఎన్నిసంవత్సరాలు జీవించవచ్చు? ఒకవేళ రెండవ దశ మందులు వాడవలసి వస్తే అవిఎన్నేళ్లు కాపాడతాయి? వివరాలు తెలియజేయండి.

మొదటి దశ మందులు వాడుతున్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నట్లయితే రెండవ దశ మందులకు పోవాల్సిన అవసరం లేదు. మీ సీడీ 4 కౌంట్ బాగుంది కాబట్టి మీకు రెండవ దశ మందులు అవసరం లేదు. ఇక ఈ మందులతో ఎన్ని సంవత్సరాలు జీవించవచ్చు అని అడిగారు. క్రమం తప్పకుండా మందులు వాడుతూ ఆరోగ్యకరమైన జీవన విధానం అలవాటు చేసుకుంటే అందరిలాగే నూరేళ్లు జీవించవచ్చు. సాధారణ జీవితం గడపొచ్చు. అయితే జీవితాంతం మందులు వాడటం మాత్రం మరవకూడదు. మొదటి దశ మందులకు రెసిస్టెన్స్ వచ్చినపుడు, ఆ మందులు పనిచేయడం లేదని నిర్ధారణ అయినపుడు మాత్రం డాక్టర్ పర్యవేక్షణలో రెండవ దశ మందులు వాడటం ప్రారంభించాలి.

ఈ మందులను కూడా క్రమంతప్పకుండా వాడాల్సి ఉంటుంది. సెకండ్ లైన్ ట్రీట్‌మెంట్‌లో ఒకరకమైన మందులకు రెసిస్టెన్స్ వచ్చినపుడు కాంబినేషన్ డ్రగ్స్ ఉపయోగించాల్సి ఉంటుంది. వీలైనంత వరకు క్రమంతప్పకుండా మందులు వాడుతూ ఫస్ట్ లైన్ మందులకు రెసిస్టెన్స్ పెరగకుండా చూసుకోవడమే మంచిది. కాబట్టి ఆందోళన చెందకుండా మందులు వాడండి.

నా వయస్సు 48 సంవత్సరాలు. రెండేళ్లుగా యాంటీ రెట్రోవైరల్ మందులు వాడుతున్నాను. ఇటీవలకడుపు నొప్పి వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్లాను. స్కానింగ్ చేసి లివర్ఎన్‌లార్జ్ అయిందని చెప్పారు. మందులు వాడాల్సి ఉంటుందన్నారు. అయితే ఎంతకాలంవాడాలో చెప్పడం లేదు. హెచ్ఐవి మందులతో పాటు జీవితాంతం ఈ మందులు కూడావాడాల్సి ఉంటుందా? హెచ్ఐవి మందుల వల్లనే లివర్ పెరిగిందంటారా?

హెచ్ఐవి మందుల వల్ల కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది. లివర్ సిర్రోసిస్, జాండిస్ వంటి కారణాలు కూడ కావచ్చు. కాబట్టి ఏ కారణం చేత కాలేయం పెరిగిందో ముందుగా తెలుసుకోవాలి. ఇందుకోసం కొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ యాంటీ రెట్రోవైరల్ మందుల వల్లనే కాలేయం పెరిగితే కనుక మందులతో సమస్యను తగ్గించుకోవచ్చు. లివర్ సమస్య తగ్గేంతవరకు మందులు వాడితే సరిపోతుంది. అప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించకపోతే ఏఆర్‌టీ మందులను మార్చుకోవాల్సి ఉంటుంది. అంతేతప్ప లివర్ సమస్యకు జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం లేదు.

-సి . పార్థసారధి , ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌

ఆధారము: హెల్త్ కేర్ తెలుగు బ్లాగ్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate