పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

హెపటైటిస్

హెపటైటిస్ –ఎ అనే వైరస్ చేత కాలేయము/కార్జముకు వాపు కలగటాన్ని హెపటైటిస్ –ఎ వ్యాధి అని అంటారు. “వైరల్ హెపటైటిస్” అనేది ఈ వ్యాధికి ప్రత్యామ్నాయ పేరు

హెపటైటిస్ –ఎ

హెపటైటిస్ –ఎ అనే వైరస్ చేత కాలేయము/కార్జముకు వాపు కలగటాన్ని హెపటైటిస్ –ఎ వ్యాధి అని అంటారు. “వైరల్ హెపటైటిస్ ” అనేది ఈ వ్యాధికి ప్రత్యామ్నాయ పేరు.

వ్యాధి ఎలా కలుగుతుంది ?

కలుషితమైన ఆహారం లేదా నీరు వల్ల లేదా అప్పటికే ఈ వ్యాధి కలిగివున్న వ్యక్తిని తాకటం / స్పర్శించటం ద్వారా హెపటైటిస్ –ఎ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు బయటపడక ముందు 15 నుంచి 45 రోజుల మధ్య (అంటే వ్యాధి క్రిములు) శరీరంలో పొదుగుతున్న సమయంలో మరియు అనారోగ్యం బహిర్గతమైన మొదటివారంలో వ్యాధిగ్రస్తుని మలంలో హెపటైటిస్ –ఎ వైరస్ కారుతుంది.

హెపటైటిస్ –ఎ వ్యాధిగ్రస్తుల శరీరం, కళ్లు పసుపు రంగులోకి మారటం మినహా మిగతా లక్షమాలన్ని “ఫ్లూ” జ్వరం లక్షణాల లాగే ఉంటాయి. శరీరంలోని రక్తం నుంచి బిల్రుబిన్ ను లివర్ ఫిల్టర్ (వడబట్టడం) చేయలేకపోవటం వల్ల ఇలా జరుగుతుంది. ఇతర హెపటైటిస్ వైరస్ అంటువ్యాధుల్లో హెపటైటిస్ – బి, హెపటైటిస్ – సి కూడా ఉన్నాయి. వీటిల్లో స్వల్పమైనదీ, ప్రమాదమెక్కువలేనిదీ హెపటైటిస్ –ఎ మాత్రమే. మిగతా రెండూ దీర్ఘకాల వ్యాధులుగా మారవచ్చు కాని, హెపటైటిస్ –ఎ మాత్రం అలా మారదు.

లక్షణాలు

 • కామెర్లు
 • నీరసం
 • ఆకలి కోల్పోవటం
 • వికారం, వాంతులు
 • జ్వరం
 • బంకమట్టి రంగులో మలం
 • ముదురు రంగులో మూత్రం
 • దురద

నివారణ

పరిశుభ్రమైన ఆహారం, నీటిని తీసుకోవడం, మల మూత్ర విసర్జన తర్వాత, శుభ్రంగా చేతులు కడుక్కోవటం, ముఖ్యంగా ఈ వ్యాధిగ్రస్తుని రక్తం, మలం, ఇతర శారీరక ద్రవాలను తాకిన వెంటనే చేతులను సబ్బుతో బాగా కడుక్కోవడం ద్వారా ఈ వ్యాధి వైరస్ సంక్రమించే అవకాశాలను తగ్గించవచ్చు.

ప్రజలతో మమేకమై పని చేసే సంస్థలు ఈ వ్యాధి వేగంగా ప్రబలటానికి కారణం అవుతాయి. ప్రతిసారి ముట్టుగుడ్డలను, మార్చటానికి ముందు, ఆ తర్వాత, ఆహారం వడ్డించటానికి ముందు, విశ్రాంతి గదిని వాడుకున్న తర్వాత రెండు చేతులను బాగా శుభ్రంగా కడుక్కోవటం ద్వారా ఈ వ్యాధి సామూహిక సంక్రమణను నిరోధించవచ్చు.

హెపటైటిస్ –ఎ వ్యాధి గ్రస్థులతో సన్నిహితంగా మెలిగే వారికి ఇమ్యున్ గ్లోబులిన్ మందు ఇవ్వాలి. హెపటైటిస్ –ఎ సంక్రమించ కుండా రక్షణ కల్పించే వ్యాక్సిన్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. మొదటిడోసు తీసుకున్న నాలుగువారాల తర్వాత నుంచి ఈ వ్యాక్సిన్ రక్షణ కల్పించటం ప్రారంభిస్తుంది. సుదీర్ఘకాలం పాటు ఈ రక్షణ పొందాలంటే 6 నుంచి 12 నెలల బూస్టర్ తీసుకోవటం అవసరం.

విశదీకరణాలు మరియు ప్రతిబింబాలు

జీర్ణ వ్యవస్థ

ఈగ

హెపటైటిస్ ఎ

ఎర్య్తేమ మల్టీ ఫార్మే, గుండ్రని లెసిఒన్స్ - చేతులు

జీర్ణ వ్యవస్థ అవయవాలు

హిపటైటిస్ – బి

నిర్వచనము

వివిధ రకాలైన వ్యాధుల కారణంగా కాలేయము (లివర్) ఇన్ ఫెక్షన్ కు గురికావడాన్ని - హిపటైటిస్ అని అంటారు.

కారణాలు

సాధారణంగా వైరస్ సూక్ష్మ క్రిముల వలన కాలేయము (లివర్) ఇన్ ఫెక్షన్ కు గురి అవుతుంది. A,B,C,E, అనే నాలుగు రకాల వైరస్ వల్ల లివర్ కు ఇన్ ఫెక్షన్ రావచ్చు. వీటిలో హిపటైటిస్ - బి మరియు హిపటైటిస్-సి వ్యాధులు దీర్ఝకాలిక వ్యాధులుగా - వ్యాధి గ్రస్థులలో నిలిచిపోవచ్చును.

హిపటైటిస్ బి కారణాలు

 1. హిపటైటిస్ - బి వ్యాధితో బాధపడుతున్నవారి నుండి తీసిన రక్తము - రక్త మార్పిడి ద్వారా ఆరోగ్యవంతులకు సంక్రమిస్తుంది
 2. హిపటైటిస్ - బి వ్యాధిగ్రస్థులతో రక్షణ లేని సంభోగం ద్వారా
 3. ఇన్ ఫెక్షన్ అయిన సిరంజి సూది ఆరోగ్యవంతులు వాడడం వలన
 4. వైద్యశాలలో పనిచేయు డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది సంరక్షణ విధానాలు పాటించకుండా - హిపటైటిస్ - బి వ్యాధిగ్రస్థులను - వారి రక్తము - ఇతర శరీర స్రావాలను తాకడం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
 5. వ్యాధి క్రిములు ఉన్న పరికరములతో - పచ్చ గుర్తులు కాని ఆకు పంచర్ అనే వైద్య విధానము వలన రావచ్చును.
 6. వ్యాధి గ్రస్తురాలైన తల్లి ద్వారా పుట్టిన బిడ్డకు సంక్రమించవచ్చును

లక్షణాలు

త్వరగా అలసిపోవుట
2. వాంతులు వచ్చునట్లు అనుభూతి
3. ఆకలి మందగించడం
4. కడుపునొప్పి
5. కాళ్లునొప్పులు
6. పచ్చకామెర్లు శరీరము పచ్చగామారుట
7. మూత్రము పచ్చ రంగులో వుండుట

సంక్రమణ కాలం - 1 నుండి 6 నెలలు

ప్రమాద స్ధితి

హిపటైటిస్ - బి ఇన్ ఫెక్షన్ దీర్ఝకాలిక వ్యాధిగా ప్రమాదకారి కావచ్చును. ఈ ప్రమాదకర స్ధితి, వ్యాధి క్రిములు ఏ వయస్సులో శరీరములోకి ప్రవేశంచినవి అనే దాని పై ఆధారపడి ఉంటుంది. సుమారు 90% తల్లి ద్వారా అపుడే పుట్టిన పిల్లలలో ప్రమాదం అధికంగా వుంటుంది.
హిపటైటిస్ - బి వైరస్ సోకడం వలన - వ్యాధి నిరోధక శక్తి లోపించి కాలేయ కణాలు పనిచేయక పోవడం వలన ట్రాన్ అమైనేజ్ అనే లివర్ ఎంజైము లివర్ నుండి రక్తములో కలిసి పోతుంది. అందువలన రక్తము గడ్డ కట్టే గుణములో మార్పు సంభవిస్తుంది. సీరంబీలు రుబిన్ అనే పదార్ధము రక్తములో అధికమై పచ్చకామర్ల రూపంలో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.

ల్యాబ్ పరీక్షలు

1. రక్త పరీక్ష హెచ్ బియస్ ఎంజైమ్ (హిపటైటిస్ - బి సర్ షేస్ ఆరిటీజెన్) రక్తములో ఉన్నట్లు నిర్ధారణ అయితే – హె. బి ఇన్ఫెక్షన్ ఉన్నట్లు భావించాలి. ఈ పరీక్ష 1-2 మాసముల వరకు మాత్రమే రక్త పరీక్షలో తెలుస్తుంది
2. హెచ్ బి యస్ జి - ఆరిటిజన్ వున్న వ్యాధి గ్రస్తులలో హిపటైటిస్ - బి కోర్ ఆంటిజన్ 1-2 వారాలలో గుర్తించవచ్చును
3. హిపటైటిస్ - బి సర్ షేస్ ఆంటి బాడీ ( యాంటి హెచ్ బి) హిపటైటిస్ - బి ఉపశమం పొందిన వారిలో కనిపిస్తుంది
రక్త పరీక్షలో లివర్ ఎంజైమ్ (టీన్స్ అమైనేజ్) అధికంగా వుంటుంది
4. ప్రో త్రాంబిక్ టైమ్ (రక్తం గడ్డ కట్టుకాలము) ఎక్కువ అవుతుంది

నివారణా చర్యలు

 1. హిపటైటిస్ - బి వ్యాధిగ్రస్థులకు సేవలు చేయు ఆరోగ్య, వైద్య సిబ్బంది, బందు మిత్రులు తగు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలి
 2. హిపటైటిస్ - బి వ్యాధి నివారక టీకాలు టీకాల పట్టిక ప్రకారం క్రమం తప్పక తీసుకోవాలి

ఆధారము: పోర్టల్ విషయ రచన భాగస్వామ్యులు

3.11538461538
రాజ్కుమార్ Oct 23, 2019 04:34 PM

నామసితేయ్,

హెపటైటిస్ E గురుంచి వివరాలు చెప్పగలరు

కవిత Aug 21, 2019 03:59 PM

చాలాబాగుంది సర్ వేకెన్సీ లిస్ట్ పంపండి సర్

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు