దాదాపుగా ప్రతిఒక్కరూ తలనొప్పి తో ఏదో ఒక సందర్భంలో బాధపడతారు, కానీ కొన్ని చాలా అసౌకర్యం కలిగిస్తాయి. అయితే ఇవి ఎక్కువ తాత్కాలి కమైన ఇబ్బందులే.
సాధారణంగా తలనొప్పులు తాత్కాలికం, అవి వాటంతటవే పోతుంటాయి. అయితే, నొప్పి ఇబ్బంది కలిగిస్తూ ఉంటే మాత్రం వైద్యుడిని సంప్రదించటానికి సిగ్గుపడకూడదు. వైద్యుడు, తలనొప్పి తీవ్రంగ ఉన్నదా, మళ్ళీ మళ్ళీ వస్తున్నదా లేదా జ్వరంతో పాటువస్తున్నదా అని పరీక్షించాలి.
ప్రతి తలనొప్పికీ వైద్యమక్కరలేదు. కొన్ని తలనొప్పులు భోజనం సరియైన సమయంలో తీసుకోకపోవడం వల్లా లేదా కండరాల ఉద్రిక్తతవల్ల కలుగుతాయి, వాటికి తగుజాగ్రత్తలు ఇంటిదగ్గర తీసుకుంటే సరిపోతుంది. మరికొన్ని తలనొప్పులు ఏదో తీవ్రమైన స్ధితికి సంకేతాలు మరియు వాటికి తక్షణం వైద్యసాయం అవసరమవుతుంది.
మీరు ఈ క్రింది తలనొప్పి లక్షణాలను కనుక అనుభవిస్తుంటే మీకు అత్యవసరంగా వైద్య సహాయం అవసరం:
మీరు ఈ క్రింది తలనొప్పి లక్షణాలను కనుక అనుభవిస్తుంటే మీకు వైద్య సహాయం అవసరం:
ఆందోళన,క్లస్టర్ తలనొప్పి,పార్శ్వశూల అనేవి తలనొప్పులలోని రకాలు. తల పగిలిపోయేంత,పార్శ్వశూల అనేవి రక్తనాళాలకు సంబంధించిన తలనొప్పులు. ఈ రక్తనాళాలకు సంబంధించిన తలనొప్పులలో భౌతిక శ్రమ తలనొప్పి బాధను అధికం చేస్తుంది. తలచుట్టూ ఉండే కణజాలములోని రక్తనాళాలు ఉబ్బుతాయి లేదా వాస్తాయి. దానివల్ల తల నొప్పితో బాధపడతాము. తల పగిలిపోయేంత (క్లస్టర్) తలనొప్పి పార్శ్వశూల తలనొప్పి కన్నా తక్కువగానే వస్తుంది, ఇది రక్తనాళాలకు సంబంధించిన తలనొప్పులలో సాధారణమైనది.
క్లస్టర్ తలనొప్పి వరుసగా అతివేగంగా వస్తుంది-వారాలు లేదా నెలలపాటు ఉంటుంది. క్లస్టర్ తలనొప్పి ఎక్కువగా మగవారికి వస్తుంది మరియు భరించరానంత బాధాకరంగా ఉంటుంది.
అధికభాగం తలనొప్పులు తీవ్రస్థితిలో కలిగేవి కావు మరియు దుకాణాలలో దొరికే మందులతో చికిత్స చెయ్యవచ్చు. పార్శ్వశూల తలనొప్పి మరియు యితర తీవ్రమైన తల నొప్పులకు వైద్య పర్యవేక్షణ మరియు ఔషధచీటి అవసరం కావచ్చు.
సరణి(సైనస్)తలనొప్పులకు సరణి సంక్రమణం(అంటువ్యాధి) లేదా సహించకపోవటం (ఎలర్జీ) వల్ల కలుగుతాయి.
జలుబు లేదా ఫ్లూ జ్వరము తరువాత ముక్కు ఎముకలకు ఎగువన,దిగువన ఉండే గాలి కుహరాలు, సరణి మార్గాలు మంటకు గురి కావడం వల్ల సరణితలనొప్పి కలుగుతుంది. ఈ సరణి చిక్కబడటం లేదా క్రిమిపూరితం అయినా తలకు నొప్పి కలిగించేకారణమవుతుంది.ఈ నొప్పి తీవ్రంగా, కొనసాగుతూ ఉంటుంది, ఉదయాన్నే మొదలవుతుంది మరియు ముందుకు వంగితే మరింత దారుణంగా మారుతుంది.
సరణి(సైనస్)తలనొప్పుల సాధారణ లక్షణాలు:
సరణి (సైనస్) తలనొప్పులలో వచ్చే ముఖం నొప్పులకు వేడిద్వారా మరియు మంచుద్వారా ఉపశమనం కలిగిస్తారు.
గమనిక: మీకు తీవ్రమైన తలనొప్పులుంటే,ఆ లక్షణాలన్నిటిని, నొప్పి యొక్క తీవ్రత మరియు ఆ నొప్పిని మీరు ఎలా నిభాయించారు అన్న దానిని గుర్తుంచుకోండి.
తరచూ వచ్చే ఒక రకమైన తలనొప్పిని మైగ్రేన్ అని అంటారు. పార్శ్వ తల నొప్పి( మైగ్రేన్ తలనొప్పి ) ఇతర తలనొప్పులకు భిన్నంగా వుంటుంది. మైగ్రేన్ లక్షణాలు మనిషి మనిషికీ వేరు వేరు విధాలుగా ఉంటాయి. ఇది నరాల వ్యవస్దకు సంబంధించిన సాధారణమైన జబ్బు.
లక్షణాలు
మైగ్రేన్ లక్షణాలు సాధారణంగా ఉదయం నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు వస్తుంటాయి. తేలిక పాటి తలనొప్పితో ప్రారంభమై తీవ్రమైన తలనొప్పి వస్తుంది. కొందరిలో వాంతి వస్తున్నట్లుగాను మరికొందరిలో వాంతులతో కూడిన తలనొప్పి వుంటుంది. అధిక వెలుతురును, శబ్దాలనూ భరించలేరు. కళ్ళముందు వెలుతురు చుక్కలాగా కనిపించవచ్చు.
కారణాలు
నివారణ
జుట్టు రాలడం అనేది పలచబడడం దగ్గర నుంచి బట్టతల రావడం వరకూ ఉండవచ్చు. వైద్య పరంగా క్రింది విధంగా విభజించవచ్చు.
మందుల వల్ల కలుగు దుష్పలితం
జబ్బు లక్షణాలు
స్త్రీలలో జుట్టు రాలిపోవడం ముందు బాగం మొదలు కొని కణతల వైపు నుంచి వెనక్కు వెళుతుంది. తల పైభాగంలో తక్కువగా కనబడుతుంది.
ప్రతి రోజు 50 నుంచి 100 వెంట్రుకలు రాలడం సహజం.ఇంత కన్న ఎక్కువ రాలిన పక్షంలో వైద్య సలహా అవసరం. జుట్టు పలుచబడ్డట్టు అనిపించినా,ఒకటి కంటే ఎక్కువ చోట్ల బట్టతల కనపడ్డా వైద్య సలహా తీసుకోవాలి.
చక్కని ఒత్తై జుట్టు కావాలని కోరుకోని వారు ఎవరుంటారు..! అలా నిగనిగలాడే అందమైన జుట్టు మన దైనందిన జీవితంలో తీసుకునే జాగ్రత్తలపై ఆధారపడి ఉంటుంది. తీసుకునే ఆహారం, తాగే నీరు, నివసించే ప్రదేశం, వాతావరణ మార్పులు, మానసిక, శారీరక సంబంధ సమస్యలు కూడా జుట్టుపై ప్రభావం చూపిస్తాయి. వీటన్నింటినీ ఓ పద్ధతి ప్రకారం శరీరానికీ అనుగుణంగా మార్చుకుంటూ... పౌష్టికాహారం, తాజా పండ్లు, కూరగాయలు, వ్యాయామం, యోగా మెడిటేషన్, రోజుకు కనీసం ఏడెనిమిది గంటల ప్రశాంతమైన నిద్ర వల్ల చాలా వరకు కేశ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. జుట్టు ఊడిపోవడానికి హార్మోన్ సమస్యలు, సర్జరీ, కేన్సర్, దానికి ఇచ్చే కీమోథెరపీ తదితర కారణాలుంటాయి. అధిక మొత్తంలో వెంట్రుకలు ఊడటం, లేదంటే తలలో కొన్ని భాగాల్లో (ప్యాచెస్) మాత్రమే ఊడిపోవడాన్ని హెయిర్ లాస్ అనవచ్చు. సాధారణంగా రోజుకు 60- 70 వెంట్రుకలు సగటు మధ్యవయస్సు వారికి ఊడవచ్చు.
ఈ కేశ సంబంధ సమస్యలు రెండు రకాలు :
1. పురుష సంబంధ బట్టతల : ముందు నుంచి వెనుకకు పొయ్యే వెంట్రుకల సమూహం. ముఖ్యంగా 25% మంది పురుషుల్లో ఈ సమస్య ఉంటుంది. 30 ఏళ్ల వయసు వారికి ఇది రావచ్చు.
2. స్త్రీ సంబంధ బట్టతల : వంశపారంపర్యంగా వయసు, హార్మోన్ల లోపాలు, పీరియడ్స్ ఆగిపోవడం, తల ముందు భాగంలో అలాగే ఉండి... మిగిలిన మొత్తం భాగంలో పలుచబడుతుంది.
కారణాలు
కారణాన్నిబట్టి చికిత్స
ప్రతిరోజూ చికిత్సకు వచ్చే వాళ్లలో ముఖ్యంగా స్త్రీలు దీని గురించి బాగా చింతపడుతూ ఉంటారు. హోమియోలో వ్యాధి కారణాన్ని బట్టి లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. గర్భవతిగా ఉన్నపుడు, కాన్పు తర్వాత వచ్చే హార్మోన్ సమస్యలను సరిచేయటం, పోషకాహార సమస్యలు, ఏదైనా విటమిన్, రక్తహీనత సరిచేసే మందులతో పాటు నేట్రంమూర్, పల్సటిల్లా, ఆర్నికా, జబొరాండి, సెపియా తదితర మందులు బాగా పనిచేస్తాయి. వీటిని డాక్టరు సలహా మేరకు తీసుకోవాలి.
ఆధారము: సాక్షి
ఎలా వస్తుంది?
జలుబుతో బాధపడుతున్నవ్యక్తి తుమ్మినా, చీదినా అందులోంచి వచ్చు వైరస్ క్రిములు గాలి తుంపర్లుగా వ్యాపిస్తాయి. ఈ వైరస్ కలిగిన తుంపర్ల గాలిని దగ్గరలో వున్న ఇతరులు పీల్చితే వారికి జలుబు వస్తుంది.
జలుబు వున్న వ్యక్తి ఎవరినైనా ముక్కుతో కాని, చేతులతో కాని తాకినా జలుబు వ్యాపిస్తుంది. జలుబు వున్న వ్యక్తి తాకిన, పెన్ను,టవలు,చేతిరుమాలు,పుస్తకాలు,కాఫీ కప్పుల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. జలుబు కారక వైరస్ లు ఈ వస్తువుల ద్వారా అధికంగా వ్యాపిస్తాయి.
చలి వాతావరణ ప్రభావము వలన జలుబు ప్రధానంగా వ్యాపించదు. ఈ వాతావరణ మార్పు జలుబు వ్యాప్తిలో పెద్దగా ప్రభావితము చూపించదు.
ఎంతకాలం వుంటుంది?
జలుబు తగ్గించే విధానాలు: -
గుండె అనుక్షణము సంకోచ, వ్యాకోచాలు చేస్తూ రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేస్తుంటుంది. ఇలా సంకోచించినప్పుడు (కుంచించుకొన్నప్పుడు) రక్తం గుండె నుండి రక్త నాళాల లోనికి వేగంగా వత్తిడితో ప్రవహిస్తుంది. ఈ వత్తిడిని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ (Systolic Blood pressure) అని అంటారు.
గుండె మరల వ్యాకోచించి సాధారణ స్ధితికి వచ్చినప్ఫుడు, రక్తనాళాలలో వున్న వత్తిడిని డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అని అంటారు. ఈ రక్త పోటును గాజు గొట్టములోని పాదరసపు మిల్లీ మీటర్లలో కొలుస్తారు.
సాధారణంగా ఆరోగ్యవంతుల రక్త పోటు సిస్టోలిక్ ప్రెషర్ 90 నుండి 120 మి.మీ గాను, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 60 నుండి 80 మి.మీ గాను నమోదు కావచ్చు.
అయితే ఈ బి.పి మనిషి నుండి మనిషికి వయస్సు పెరుగుతున్నకొద్దీ మార్పు చెందుతుంటుంది.
అలాగే సాధారణ వ్యక్తిలో రక్తపోటు ఉదయం నుండి సాయంత్రానికి కొన్ని మార్పులు చెందుతుంటుంది. మానసిక వత్తిడులు కూడా బి.పి ని ప్రభావితం చేస్తాయి.
అధిక రక్తపోటు - అనర్ధాలు :
లక్షణాలు: -
తీసుకోవలసిన జాగ్రత్తలు : -
40 సంవత్సరాలు పైబడి వున్న వారు ప్రతి సంవత్సరం పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
కుటుంబంలో ఎవరికైనా అధిక రక్తపోటు వున్నా ఆరోగ్య పరీక్షలు కనీసం సంవత్సరానికి ఒక సారి చేయించుకోవాలి.
సాధారణంగా ఉండవలసిన రక్త పోటు (బి.పి) కన్నా తక్కువ స్ధాయిలో బి.పి ఉండటాన్ని లోబిపి అంటారు.వైద్య పరిభాషలో దీనినే హైపోటెన్షన్ అని అంటారు. దీని వలన ప్రధాన అవయవాలైన గుండె, మెదడు, మూత్రపిండాలకు,ప్రాణ వాయువు (ఆక్సిజన్), ఆహార సరఫరా తగు పాళ్ళలో జరగదు.
సాధారణంగా కొందరిలో 90/60 మి.మీ. ఉన్నప్పటికి ఆరోగ్యంగానే వుంటారు. కాని బి.పి.సుమారు 160/90 ఉండి, 110/70 కి తగ్గితే అది లోబిపి గా పరిగణించాలి. బిపి రీడింగ్ లో తేడా 40 మి.మీ. కు మించింది అంటే అది లోబిపి గా పరిగణించాలి.
లోబిపి లక్షణాలు : -
థైరాయిడ్ గ్రంధి సీతాకోక చిలుక ఆకారంలో వుండే చిన్న గ్రంధి. ఇది గొంతు ముందు భాగములో వుంటుంది. ఈ గ్రంధి ఉత్పత్తి చేయు హార్మోనుల ప్రభావము వలన శరీరములో వున్న వివిధ కణాలు అవసరమైన శక్తిని ఉపయోగించుకొని విధి నిర్వహణ చేసుకొనుటకు తోడ్పడతాయి.
కారణాలు: -
లక్షణాలు: -
మల బద్ధకం అనగా నేమి ?
ప్రతిరోజు క్రమబద్దంగా అలవాటు ప్రకారంగా కాకుండా దీనిలో ఎటు మార్పు వచ్చినా,ఆ మార్పు మలం తక్కువ కావటం, గట్టిగా గాను,తక్కువ సార్లు మలవిసర్జన కావటం,మలవిసర్జన సమయంలో చాలా ముక్కడం,కష్టంగా ఉండటం ఉంటే దానిని మలబద్ధకం అంటారు. సామాన్యంగా మల విసర్జనలో మనిషికి మనిషికి అలవాట్లు వేరుగా ఉంటాయి. అనగా కొంత మందికి ప్రతి రోజూ లేక ప్రతి రెండు రోజులకు ఒక్క సారి కావటం జరుగుతుంటుంది.
లక్షణాలు:- కడుపు ఉబ్బరం లేదా కడుపులో ఇబ్బందికరంగా ఉండటం
కారణాలు :-
1. తీసుకొనే ఆహారంలో పీచుపదార్ధం తక్కువగా ఉన్నచో.
2. శరీరంలొ నీరు తక్కువ అయినా.
3. శరీరం కదలికలు తక్కువ అయినా.
4. ఏవైనా మందులు వాడుతున్నా.
5. ప్రేగులలో ఏదైనా సమస్య ఉన్నచో. ఉదా:(ప్రేగులలో క్యాన్సర్ వ్యాధి)
6. థైరాయిడ్ హర్మోన్ తక్కువ అయినా.
7. కాల్షియం, పొటాషియం తక్కువ అయినా.
8. మధుమేహ వ్యాధి వలనా,జీర్ణకోశ వ్యాధి అయినా.
9. పార్కిన్ సన్ వ్యాధి అయినచో.
ఎలా నివారించాలి :-
1. ఆహారంలో పీచుపదార్ధం ఎక్కువగా ఉండాలి.
2. ఎక్కువగా పండ్లు మరియు కూరగాయలు తీసుకోవాలి.
స్నానం చేయగానే శరీరంపై ఉన్న మురికంతా పోయి హాయిగా అనిపిస్తుంది. అదేవిధంగా శరీరం లోపల స్నానం చేయించగ లిగితే బాగుంటుంది కదా. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థను ఒకేసారి శుభ్రం చేస్తే పొట్ట అంతా రిలాక్స్ అవుతుంది. ఇదే ఐడియా ఒక కొత్త చికిత్సకు బీజం వేసింది. బయటకు రావడానికి బద్ధకించే మలాన్ని కడిగివేయడానికి అందుబాటులోకి వచ్చిన టెక్నికే కోలన్ హైడ్రోథెరపీ.
మంచి ఆహారం తీసుకోవడం, అది సక్రమంగా జీర్ణం కావడం, వ్యర్థాలు బయటకు వెళ్లిపోవడం... ఇవన్నీ సరైన రీతిలో జరిగితే 90 శాతం జబ్బులను నివారించవచ్చంటే అతిశయోక్తి కాదు. దురదృష్టవశాత్తు ఆధునిక జీవనశైలి వీటిని పక్కదారి పట్టిస్తోంది. ఫలితంగా ఆహారం సరైన విధంగా జీర్ణం కాకపోవడం, మలబద్ధకం లాంటివి అనేక రకాల అనారోగ్యాలకు దారి తీస్తున్నాయి. పెద్ద పేగు కేన్సర్ లాంటి ప్రమాదాలకు కూడా కారణమవుతున్నాయి.
మల బద్ధకం ఎందుకు..?
తగినన్ని నీళ్లు తాగకపోయినా, జీర్ణక్రియ సరిగా లేకపోయినా, ఆహారంలో తగినన్ని పీచు పదార్థాలు లేకపోయినా.. పేగుల్లో కదలికలు సరిపడినంత ఉండవు. అలాంటి సందర్భాల్లో మలబద్ధకం ఏర్పడుతుంది. కొంతమంది పేగుల్లో కదలికలు కలిగి విసర్జించాల్సిన అవసరం ఉన్నప్పుడు విసర్జించకుండా పదే పదే ఆపుకోవడం వల్ల నాడీ వ్యవస్థకు చేరే సంకేతాల తీరు మారుతుంది. అందువల్ల కూడా మలబద్ధకం ఏర్పడుతుంది. స్మోకింగ్ ఇందుకు దారి తీస్తుంది. రోజులో కనీసం ఒక్కసారైనా పేగులలో కదలికలు లేకపోతే మలబద్ధకం అని భావించవచ్చంటున్నారు మెడికల్ డెరైక్టర్ ప్రసాద్.
కోలన్ హైడ్రోథెరపీ
మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ సమస్యలకు పేగులు శుభ్రపడి వాటి కదలికలు సాఫీగా ఉండటమే పరిష్కారం. ఇందుకోసం కోలన్ హైడ్రోథెరపీ మేలు చేస్తుందంటున్నారు శుద్ధ్ కోలన్ డెరైక్టర్ డాక్టర్ రాజగోపాల్. స్వచ్ఛమైన గోరువెచ్చని నీటిని మలద్వారం ద్వారా పెద్ద పేగు లోపలికి పంపించి అక్కడ పేరుకున్న వ్యర్థాలను తొలగిస్తారు. ఆ నీరు పెద్ద పేగు మొత్తాన్ని పూర్తిగా కడిగివేస్తూ బయటకి వచ్చేస్తుంది. దీంతో శరీరంలో మిగిలి ఉన్న మాలిన్యాలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఈ నీటిని పంపించడం కోసం ప్రతి పేషెంట్‌కి డిస్పోజబుల్ నాజిల్స్ వాడతారు కాబట్టి నాజిల్ కలుషితం అయ్యే అవకాశం ఉండదు.
ఈ ప్రక్రియకు 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది. ‘సమస్య తీవ్రంగా ఉన్నవారికి దీన్ని ప్యాకేజీ చికిత్సగా కూడా ఇస్తారు. పూర్తి ప్యాకేజి చికిత్స తీసుకుంటున్న వారు ఫ్రీ ప్రోబయోటిక్ మందులు కూడా వాడాల్సి ఉంటుంది. ప్యాకేజి మొత్తంలో ఐదు సిట్టింగ్‌లు ఉంటాయి. మొదటి, రెండో సిట్టింగ్‌కు మధ్య ఒక వారం, రెండో దానికి మూడో సిట్టింగ్‌కు మధ్య రెండు వారాలు.. మూడు, నాలుగు మధ్య మూడు వారాలు, నాలుగు, ఐదు సిట్టింగ్‌ల మధ్య నాలుగు వారాల నిడివి ఉండాలి’ అని వివరించారు శుద్ధ కోలన్ కేర్ డెరైక్టర్ రాజగోపాల్. ఈ ప్యాకే జి పూర్తి అయ్యే నాటికి శరీరంలోని అన్ని వ్యవస్థలూ గాడిన పడతాయి. మనం కూడా ఒకసారి ట్రై చేద్దామా!
ఇవీ ప్రయోజనాలు
వీరికి పనికిరాదు
గర్భవతులు, పెద్దపేగు మలద్వార క్యాన్సర్‌తో బాధపడేవారు, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అల్సరేటివ్ కొలిటీస్ బాధితులు, పైల్స్ ఉన్నవారికి కోలన్ హైడ్రో థెరపీ పనికిరాదు.
- రాజగోపాల్, డెరైక్టర్
శుద్ధ్ కోలన్ కేర్
అడ్రస్ mail id: info@shuddhcoloncare.com
website: www.shuddhcoloncare.com
ఆధారము: సాక్షి
ఒక వ్యక్తి వయస్సు , ఎత్తులను పరిగణనలోకితీసుకొని , సాధారణ బరువుకన్నా , అధిక బరువు ఉండడాన్ని స్థూలకాయులు అంటారు. వీరు సాధారణంగా 20% అధికంగా బరువు ఉంటారు.
కారణాలు: -
స్థూలకాయాన్ని గుర్తించడం ఎలా?
సాధారణంగా ఎత్తు, బరువుల ఆధారంగా నిర్ధారించిన సూచిక ప్రకారము (Body Mass Index)స్థూలకాయాన్ని గుర్తించవచ్చును.
తీసుకోవలసిన జాగ్రత్తలు: -
అది జబ్బు కాదు... కానీ చాలా రకాల జబ్బులకు కేంద్రబిందువు. బిపి నుంచి గుండెజబ్బుల దాకా, కిడ్నీ నుంచి కీళ్లనొప్పుల దాకా... రకరకాల సమస్యలకు మూలకారణం. అదే.... స్థూలకాయం. అధిక బరువు నుంచి స్థూలకాయం దశకు చేరుకున్న తరువాత ఇక చిన్నచిన్న చికిత్సలేవీ పనిచేయవు. బేరియాట్రిక్ సర్జరీ ఒక్కటే మార్గం అంటున్నారు ప్రముఖ బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ టిఎల్‌విడి ప్రసాద్‌బాబు. ఆయన అందిస్తున్న వివరాలు....
మనదేశంలో 14 శాతం మంది పురుషులు, 18 శాతం మంది మహిళలు అధిక బరువు ఉండగా, 5 శాతం మంది స్థూలకాయులేనని సర్వేలు తెలుపుతున్నాయి. కాలి వేలి నుంచి తల వరకు అధిక బరువు ప్రభావం చూపించని శరీర భాగమే లేదు. కనబడకుండా కబళించే జబ్బు ఇది. అధిక బరువు స్థూలకాయంగా పరిణమించిందంటే ఇక రోజురోజుకీ అనారోగ్యాలకు దగ్గరవుతున్నట్టే.
అధిక రక్తపోటు, గుండెపోటు, కీళ్లనొప్పులు, కిడ్నీ వ్యాధులు, మధుమేహం.... ఇలా జబ్బుల లిస్టు పెరిగిపోతూనే ఉంటుంది. ఆధునిక జీవన విధానం తెచ్చిన ఈ సమస్యలన్నింటినీ కలిపి మూకుమ్మడిగా మెటబోలిక్ సిండ్రోమ్ అంటారు. ఈ స్థితికి వచ్చిన తరువాత బరువు తగ్గడం కోసం మనం ఇంట్లో కూర్చుని చేసే ప్రయత్నాలేవీ సత్ఫలితాలను ఇవ్వవు. ఎంత డైటింగ్ చేసినా, ఎన్ని వ్యాయామాలు చేసినా ఫలితం ఆశాజనకంగా ఉండదు. ఇలాంటప్పుడు ఉపయోగపడేదే బేరియాట్రిక్ సర్జరీ.
ఎవరికి అవసరం?
మన ఎత్తు, బరువుల ఆధారంగా గణించి చెప్పేది జీవక్రియ ఆధారిత రేటు(బేసల్ మెటబోలిక్ ఇండెక్స్). అధిక బరువు లేకుండా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల బిఎంఐ 25 ఉంటుంది. బిఎంఐ విలువ 25 నుంచి 30 ఉంటే మంచి ఆహారం, వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కానీ బిఎంఐ 35 నుంచి 40 ఉంటే అధిక బరువు అంటాం. అధిక బరువు ఉన్నా, మధుమేహం, హైపర్‌టెన్షన్ సమస్యలుంటే అలాంటివాళ్లకి బేరియాట్రిక్ సర్జరీ అవసరం అవుతుంది. బిఎంఐ విలువ 40కన్నా ఎక్కువ ఉంటే వాళ్లు స్థూలకాయులన్నమాట. వీళ్లకి ఎటువంటి సమస్య లేకపోయినా భవిష్యత్తులో వచ్చే అవకాశాలెక్కువ.
కొవ్వు తీయడమేనా...?
ఈ సర్జరీ పేరు వినగానే శరీరంలో కొవ్వు తీసివేయడమేమో అనుకుంటారు. కానీ ఆ పద్ధతి వేరు.. ఈ చికిత్స వేరు. తొడలు, పిరుదులు, పొట్ట... ఇలా ఒకచోట పేరుకుపోయిన కొవ్వును తీసివేయడాన్ని లైపోసక్షన్ అంటారు. బేరియాట్రిక్ సర్జరీ అంటే కొవ్వు పేరుకోకుండా అడ్డుకునే చికిత్స. శరీరం లోపల జీర్ణవ్యవస్థలో చిన్న మార్పులు చేయడం ద్వారా ఇది సాధ్యపడుతుంది.
జీర్ణకోశం పరిమాణం తగ్గించడం, లేదా ఆహారం పూర్తిగా జీర్ణం కాకుండా ఆనకట్ట వేయడం.. బేరియాట్రిక్ సర్జరీలో ఉన్న అంశాలు ఈ రెండే. జీర్ణకోశాన్ని నిలువుగా కోసి కొంత భాగాన్ని తీసివేయడం ద్వారా దాని పరిమాణాన్ని తగ్గిస్తారు. ఈ తీసివేసే భాగంలో గ్రెలిన్ అనే హార్మోన్ ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతుంది. గ్రెలిన్ ఆకలి పెంచే హార్మోన్. ఈ పద్ధతి ద్వారా జీర్ణాశయ పరిమాణం తగ్గిపోవడం వల్ల కొద్దిగా తినగానే కడుపు నిండిపోతుంది. అంతేగాకుండా గ్రెలిన్ ఉత్పత్తి తగ్గుతుంది కాబట్టి ఆకలి కూడా తగ్గిపోతుంది. తద్వారా మెల్లమెల్లగా తీసుకునే కేలరీలు తగ్గుతాయి.
జీర్ణాన్ని ఆపే పద్ధతి
మరోపద్ధతి మాల్ అబ్‌సార్‌ప్షన్ పద్ధతి లేదా రెస్ట్రిక్టివ్ ఆపరేషన్. ఈ పద్ధతిలో జీర్ణకోశాన్ని అడ్డంగా స్టేపుల్ చేస్తారు. అంటే పిన్ లాంటి నిర్మాణంతో జీర్ణాశయం ఒక చివరను మూసేస్తారు. సిలికాన్ బ్యాండింగ్ మరో పద్ధతి. సన్నని ట్యూబు ద్వారా మాత్రమే ఆహారం ప్రయాణిస్తుంది. దీనివల్ల చాలా కొద్ది పరిమాణంలో ఆహారం జీర్ణాశయానికి వెళ్తుంది. మిగిలింది పూర్తిగా జీర్ణం కాకుండానే బయటకు వెళ్లిపోతుంది.
ఈ పద్ధతి ద్వారా అవసరాన్ని బట్టి బిగించిన చివరను వదులు చేసుకోవచ్చు. బైపాస్ పద్ధతి ద్వారా కూడా ఆహారం పూర్తిగా జీర్ణం కాకుండా చేయవచ్చు. జీర్ణాశయం నుంచి డైరెక్ట్‌గా చిన్నపేగుకు దాదాపు చివరి భాగానికి బైపాస్ చేయడం వల్ల ఆహారం జీర్ణాశయం నుంచి వెంటనే ఆ చివరి భాగానికే వెళ్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఆహారం జీర్ణం కాదు. కేలరీలు ఎక్కువగా అందవు. అలా నెమ్మదిగా బరువు తగ్గుతారు.
సురక్షితమేనా?
130, 150 కిలోలు... ఇలా వంద కిలోలకు మించి బరువున్నవారికి ఆపరేషన్ చేయడం చాలా రిస్కుతో కూడుకున్న వ్యవహారం. ఇలాంటివాళ్లకి కాళ్లలోని రక్తనాళాల్లో గడ్డలు(క్లాట్స్) ఏర్పడే ప్రమాదం ఉంది. ఇవి ఊపరితిత్తుల వైపు వెళ్లి మరింత ప్రమాదకర పరిస్థితి ఏర్పడవచ్చు. అందువల్ల క్లాట్స్ ఏర్పడకుండా ప్రత్యేకమైన పరికరం ద్వారా కాళ్లకు వైబ్రేషన్స్ పంపిస్తారు. రక్తం పలుచబడటానికి బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్లు, హిపారిన్ ఇంజెక్షన్లు ఇస్తారు. స్లీప్ అప్నియా ఉంటే సర్జరీకి వారం ముందు నుంచే పడుకునేటప్పుడు బైపాప్ పరికరం ద్వారా ఆక్సిజన్ అందిస్తూ సర్జరీకి ప్రిపేర్ చేస్తారు.
ఇలాంటి జాగ్రత్తలెన్నో తీసుకోవడం వల్ల ఎలాంటి క్రిటికల్ కేసు అయినా, ఎంత రిస్కు ఉన్నా ఆపరేషన్ విజయవంతమయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఆహారం తక్కువగా తీసుకోవడం వల్ల పోషకాహార లోపం ఏర్పడే అవకాశం ఉంటుందేమో అన్నది చాలామంది అనుమానం. అయితే తీసుకునే కొద్ది ఆహారంలోనే అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకోవడం అవసరం. ఇందుకోసం సర్జరీ తరువాత డాక్టర్లు సూచించిన డైట్‌చార్జ్‌ను తప్పక పాటించాల్సి ఉంటుంది.
సైడ్ ఎఫెక్ట్‌లుంటాయా?
బరువు తగ్గించే పిల్స్ మాదిరిగా ఈ ఆపరేషన్ వల్ల సైడ్ ఎఫెక్టులు ఉండవు. ఇకపోతే ఈ ఆపరేషన్ కీహోల్ ద్వారా చేస్తారు కాబట్టి శరీరంపై గాయం ఉండదు. ఇన్‌ఫెక్షన్ల అవకాశమూ ఉండదు. ఎక్కువ రోజులు హాస్పిటల్‌లో ఉండాల్సిన అవసరం ఉండదు. వారం రోజుల తరువాత అన్ని పనులూ యథావిధిగా చేసుకోవచ్చు. ఆరు నెలల నుంచి ఏడాదిలోగా బరువు తగ్గుతారు. ఒక్కసారిగా బరువు తగ్గరు కాబట్టి మళ్లీ లావెక్కే అవకాశం కూడా ఒక్కసారిగా ఉండదు. ఆపరేషన్ తరువాత ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచుకుంటే స్థూలకాయ సమస్య మళ్లీ తలెత్తదు.
డాక్టర్ టిఎల్‌విడి ప్రసాద్‌బాబు
బేరియాట్రిక్ అండ్ సర్జికల్
గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్
యశోద హాస్పిటల్స్
సికింద్రాబాద్ - హైదరాబాద్
నానాటికీ పెరిగిపోతున్న గుండె జబ్బులూ , పక్షవాత సమస్యలు మానవాళిని కలవరపెడుతున్నాయి. కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడంతో పాటు శరీర శ్రమలేకపోవడమే ఈ స్థితికి ప్రధాన కారణంగా ఉంటున్నాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి , మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే దిశగా ప్రయత్నాలు కొనసాగించడమే ఈ సమస్యలకు పరిష్కారం. సమస్యకు గురయ్యాక అందులోంచి బయటపడేందుకు యాతన పడేకన్నా రాకుండా నివారించుకోవడమే ఉత్తమం అంటున్నారు నిపుణులు.
కొలెస్ట్రాల్ అనగానే బెంబేలె త్తిపోతాం కానీ , అందులో మంచి కొలెస్ట్రాల్ కూడా ఉంది. అది మనకు మంచే చేస్తుంది. సమస్య అంతా చెడు కొలెస్ట్రాల్‌తోనే. కొలెస్ట్రాల్ ను ఉత్తత్తి చేయడం అన్నది శరీరంలోని ఒక సహజ ప్రక్రియ. అలా సహజంగానే దాదాపు 60 నుంచి 70 శాతం కొలెస్ట్రాల్ మన శరీరంలోనే ఉత్పత్తి అవుతుంది. ఇది కాక 30 నుంచి 40 శాతం కొలెస్ట్రాల్ మనం తీసుకునే ఆహార పదార్థాల్లోంచి తయారవుతుంది. నిజానికి శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే ఆ 70 శాతం కొలెస్ట్రాలే ఎక్కువ. అలాంటిది ఆహార పదార్థాల ద్వారా కూడా అధికంగా కొలెస్ట్రాల్ తయారయితే పరిస్థితి ప్రమాదానికి చేరువైనట్లే.
ఆహార పదార్థాలతో ప్రమేయం లేకుండానే కొందరిలో సహజంగానే అవసరానికి మించి కొలెస్ట్రాల్ తయారవుతూ ఉంటుంది. దీనికి జన్యుపరమైన మూలాలే ప్రధాన కారణం. తల్లిదండ్రుల్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే లక్షణం ఉంటే అది వారి పిల్లల్లోనూ ఉంటుంది. దానికి తోడు ఆహారపు అలవాట్లు , శరీర శ్రమ లేకపోవడం , జీవ న శైలి ఇవన్నీ ఇతర కారణాలుగా ఉంటాయి. పుట్టినప్పటి నుంచీ దాదాపు 20 ఏళ్లు వచ్చేదాకా కొలెస్ట్రాల్ 100 నుంచీ 130 మిల్లీ గ్రాముల దాకా ఉంటుంది. అందుకే ఆ దశలో కొలెస్ట్రాల్ మూలంగా ఉండే ఏ గుండె జబ్బులూ రావు. చాలా మందిలో 20 ఏళ్లు దాటాకే కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంటుంది. పెద్ద వారిలో 200 మిల్లీ గ్రాముల దాకా వెళ్లవచ్చు.
రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదు పెరిగిపోతున్నప్పుడు మామూలుగా అయితే ఏ లక్షణాలూ కనిపించవు. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ అడ్డుపడి , వాటి వైశాల్యం తగ్గిపోయి రక్తప్రసరణలో అంతరాయంగా మారిన తరువాతే సమస్య తెలుస్తుంది. ఒక్కోసారి గుండెపోటో లేదా పక్షవాతమో వ చ్చేదాకా ఏమీ తెలియకపోవచ్చు. అందుకే అప్పుడప్పుడు కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం.
కేవలం రక్తపరీక్ష ద్వారానే కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తెలుసుకోవచ్చు. 20 ఏళ్లు దాటిన వారంతా ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవాలి. కొలెస్ట్రాల్ సాధారణ పరిమాణంలోనే ఉన్నట్లు రిపోర్టు వస్తే ఆ తరువాత ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఈ పరీక్ష చేయించుకుంటూ ఉంటే చాలు. ఒకవేళ ఏవైనా వ్యత్యాసాలు కనిపిస్తే ఏటా ఒకసారి చేయించుకోవడం తప్పనిసరి. ఇలా ఏటా పరీక్షలు చేయించుకుంటూ ఉంటే ఇప్పుడున్న 75 శాతం గుండె జబ్బులు చాలా వరకు తగ్గుముఖం పడపడతాయి.
సాధారణంగా 25 లేదా 30 ఏళ్ల లోపు వారిలోనే కండరాలు పెరుగుతాయి. వ్యాయామం చేసే వారైతే ఆ తరువాత కూడా కొంతమేరకు కండర కణజాలంలో ఉండే పీచుపదార్థం (సెల్ ఫైబర్) పెరుగుతుంది. వ్యాయామాలు చేయనివారిలో 30 ఏళ్ల తరువాత ఎవరైనా బరువు పెరుగుతున్నారూ అంటే ఆ పెరిగేది కొవ్వు మాత్రమే. బాగా వ్యాయామం చేసే వారు ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తీసుకుంటారు. ఆ తరువాత ఎప్పుడైనా వీరు వ్యాయామం చేయడం మానేస్తే అదే క్రమంలో తీసుకునే క్యాలరీలు కూడా తగ్గించుకోవాలి. అలా తగ్గించకపోతే తీసుకున్న ఆహారంలో ఎక్కువ భాగం కొవ్వుగా మారుతుంది. అది కొలెస్ట్రాల్‌గా రక్తంలో చేరిపోతుంది.
శరీరంలోని ఏ భాగంలో కొలెస్ట్రాల్ చేరిపోతే ఆ భాగంలో రక్తనాళాలు సన్నబడతాయి. మెదడు రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ నిలువైతే పక్షవాతం వస్తుంది. గుండె రక్తనాళాల్లో అడ్డుపడితే గుండెపోటు వస్తుంది. కిడ్నీకి వెళ్లే రక్తనాళాల్లో అడ్డుపడితే కిడ్నీ దెబ్బ తినడంతోపాటు రక్తపోటు కూడా పెరుగుతుంది. కాళ్లలోని రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ నిలువైతే కాళ్ల జబ్బులు వస్తాయి.
చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్)తగ్గడమే కాకుండా వ్యాయామంతో మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డిఎల్) పెరుగుతుంది. అందుకే మానవ శాస్త్రం వ్యాయామానికి ఎంతో ప్రాధాన్యతనిస్తుంది. ప్రతి నిత్యం వాకింగ్ చేసే వారు గుండె జబ్బులకు చాలా దూరంగా ఉంటారు. అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నా జన్యుకారణాలతో కొందరిలో చెడు కొలెస్ట్రాల్ పెరగవచ్చు అలాంటి వారు డాక్టర్‌ను సంప్రదించి కొలెస్ట్రాల్‌ను తగ్గించే మాత్రలు వేసుకోవాలి.
వీటిని జీవితకాలమంతా వేసుకున్నా ఏ దుష్ప్రభాలూ ఉండవు. ఇవే కాకుండా తీసుకున్న ఆహారం ద్వారా వచ్చే కొలెస్ట్రాల్‌ను రక్తం గ్రహించకుండా చేసే మందులు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్‌ను సంప్రదించి ఎప్పటికప్పుడు అవసరమైన వైద్య సలహాలూ , చికిత్సలూ తీసుకుంటూ ఉంటే జీవిత కాలమంతా కొలెస్ట్రాల్ సమస్యలను అడ్డుకోవచ్చు.
స్థూలకాయులు అధిక బరువుతో కలిగే సమస్యల నుంచే కాకుండా మూత్రపిండాల వంటి శరీరాంతర్గత అవయవాల సంబంధిత వ్యాధులతో కూడా బాధపడే అవకాశాలున్నాయి.స్థూలకాయులకు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు అధికంగా ఉన్నట్లు వెల్లడైంది.
మూత్రపిండాల్లో రాళ్లు
ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనుపిస్తుంటుంది. సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ సమస్య 50 శాతం తక్కువే అయినప్పటికీ స్థూలకాయం గల మహిళల్లో సమస్య ఎక్కువగా ఉంటుంది. కొవ్వు అధికంగా ఉండడం వల్ల శరీరం ఇన్సులిన్‌కు తగిన రీతిలో స్పందించలేదు. దీని కారణంగా మూత్రంలో మార్పులు సంభవించి , మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలున్నాయని బోస్టన్‌లో ఉన్న బ్రిస్టన్‌లోని బ్రిగ్‌హామ్ అండ్ ఉమెన్స్ హస్పిటల్‌కు చెందిన డాక్టర్ ఎరిక్ టేలర్ స్పష్టం చేశారు. ఈ అంశంలో మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉన్నట్లు ఆయన అన్నారు.
శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడంతో ఆ కణాలు క్రమంగా కాలేయంలోకి చేరుకోవడం ప్రారంభిస్తాయి.ఇలా కాలే యంలో కొవ్వులు పేరుకు పోవడాన్ని స్టీటోసిస్ అంటారు. కాలేయంలో కొవ్వు కణాలు పేరుకుపోయి కలిగే ఇన్‌ఫ్లమేషన్‌ను నాష్ నాన్ ఆల్కహాల్ ఫాటీ లివర్ డిసీస్ అని ఎందుకంటున్నారంటే ఆల్కహాల్ తాగేవాళ్ల లివర్ దెబ్బతిన్నట్టే ఈ సిండ్రోమ్‌లోనూ లివర్ దెబ్బతింటుంది.అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ నాన్ ఆల్కహాలిక్ ఫాటిలివర్ డిసీజ్ కనిపిస్తుంటుంది.
అధిక బరువు వల్ల శరీరంలో ఇన్సులిన్ రెసిసెటన్స్ పెరుగుతుంది. దాంతో ఎక్కువ మొత్తాలలో ఇన్సులిన్ ఇంజక్షన్ ద్వారా తీసు కుంటున్నా ఫలితాలు అంతగా ఉండవు. ఇలా అధిక బరువువల్ల మధుమేహంతో బాధపడుతుంటారు. మధుమేహం వ్యాధికాదు కాని డైజెస్టివ్ డిజార్డర్. దీని ప్రభావం క్రమంగా శరీరంలోని మూత్రపిండాలు , కాలేయంతో పాటు నరాలు కూడా దెబ్బతినడం తో నొప్పి తెలియదు. అందుకే సైటెంట్ హార్ట్ ఎటాక్స్ వస్తుంటాయి. బరువు పెరగడం , గుండె పోటుకు మధ్య ప్రత్యక్ష సంబం ధమే ఉంది.బరువు పెరగడం వల్ల అధిక రక్తపోటు కలుగుతుంది. లిపిడ్స్ స్థాయి పెరుగుతుంది. కొలెస్ట్రాల్ లిపిడ్స్ స్థాయి పెరుగుతుంది. కొలెస్ట్రాల్ అయిన హెడిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కాబట్టి వీటన్నింటి ప్రభావం బరువు పెరిగే కొద్దీ ఎక్కువవుతుంది.
పరిశోధనలను బట్టి ఆడ , మగ , ఇద్దరిలో బిఎంఐ 23-25 కన్నా ఎక్కువ ఉంటే కరోనరి హార్ట్ డిసీజ్...అంటే గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు పూడుకుపోయి గుండె పోటు వచ్చే అవకాశాలు 50 శాతం ఉన్నాయి. 40-65 సంవతత్సరాల మధ్య వ యస్సు వాళ్లలో బిఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) 25-29 మధ్య ఉంటే గుండె పోటు వచ్చే అవకాశాలు 72 శాతం ఉంటాయి. అధిక బరువున్న వాళ్లలో హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ. గుండె ముడుచుకుపోవడం వల్ల రక్తం శరీర భాగా లన్నీంటికీ వెళుతుంది.
మనం ఒక కిలో బరువు పెరిగామంటే గుండె మీద రోజుకు మరో 30 కిలోమీటర్ల దూరం రక్తాన్ని నెటా ్టల్సిన భారం పడుతుంది. అంటే బరువు పెరిగిన కొద్దీ గుండె , మరింత గట్టిగా ముడుచుకోవలసి వస్తుంది. దాంతో బరువు పెరిగే కొద్దీ గుండె కండరాల మీద భారం పెరుగుతుంది. అవి తొందరగా అలసిపోయే ప్రమాదం ఉంది. మాములు బరువున్న వాళ్లల్లో కన్నా స్థూలకాయులలో అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు మూడు రేట్లు అధికం.అధిక రక్తపోటున్న వాళ్లకు గుండెపోటే కాదు పక్షవాతం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే. డైలేటెడ్ కార్డియోమయోపతితో పాటు గుండె రిథమ్ తప్పడం లయ తప్పి కొట్టుకోవడం వల్ల అధిక బరువున్న వాళ్లలో మరణాలు సంభవిస్తాయి.
ఊపిరితిత్తుల మీద అధిక బరువు ప్రభావం
గుండెమీద ఎక్కువ రక్తాన్ని పంప్ చేయాల్సిన బాధ్యత పడినప్పుడు ఆ ప్రభావం ఊపిరితిత్తుల మీద పడుతుంది. ఎందుకంటే గుండె పంప్ చేసిన రక్తమంతా శుభ్రపడడానికి , ఆక్సిజన్ తీసుకోవడానికి ఊపిరితిత్తులకు చేర్చాల్సి ఉంటుంది. దాంతో గురక లాంటివి ప్రారంభం కావచ్చు. ఇలాగే స్లీప్ అప్నియాలింటి ఇబ్బందులూ కలుగవచ్చు. నిద్రలో గొంతులోకి శ్వాసనాళాలు ముడు చుకుపోతాయి. ఇలాంటి పరిస్థితిని గుర్తించిన వెంటనే వాళ్లను లేపాలి.నిద్రలేవగానే శ్వాసకండరాలు మాములుగా అవుతాయి. ఇలా స్లీప్ ఆప్నియాలో ఒక రాత్రిలో చాలాసార్లు శ్వాస ఇబ్బంది కలగవచ్చు. మాటిమాటికి వాళ్లని లేపుతుండడంతో నిద్ర చాలక పగలూ కునికి పాట్లు పడే అవకాశం ఎక్కువ. అధిక బరువు వల్ల శ్వాస నాళాలలో ఊపిరితిత్తులో ఎన్నో సమస్యలు రావచ్చు.
డా. కె.ఎస్. లక్ష్మి
ఒబెసిటి సర్జన్ , లక్డీకాపూల్ ,
గ్లోబల్ హాస్పిటల్స్
ఫోన్: 9849713853, 23244444
ఆధారము: ఆయురారోగ్యాలు బ్లాగ్
నా వయసు 62. ఎత్తు 5'2. బరువు 80 కిలోలు. విపరీతమైన కీళ్ల నొప్పులతో బాధపడుతున్నాను. దీని వల్ల ఎక్కువ దూరం నడవలేకపోతున్నాను. నాకు మధుమేహ వ్యాధి కూడా ఉంది. ఈ వయసులో నేను బరువు తగ్గడానికి సర్జరీ చేసుకోవచ్చా? దయచేసి సలహా ఇవ్వగలరు.
బేరియాట్రిక్ చికిత్సా విధానంలో సర్జరీలు చేసుకున్న వారిలో 60 సంవత్సరాలు పైబడిన వారు చాలా మంది ఉన్నారు. ఇటీవలనే ఒక 69 ఏళ్ల మహిళకు గ్యాస్ట్రిక్ స్లీన్ సర్జరీ చేయడం జరిగింది. డయాబెటిస్, బిపి వంటి వ్యాధులతో బాధపడుతున్న ఆ మహిళ సర్జరీ తర్వాత కొద్ది నెలల్లోనే అధిక బరువు తగ్గిపోయింది. అలాగే మధుమేహం కూడా పూర్తిగా అదుపులోకి వచ్చింది. బిపి మందుల డోసేజ్ సగానికి తగ్గింది. ఇదివరకు ఆమె మోకాలి నొప్పులు, నడుం నొప్పులతో బాధపడేవారు. ఇప్పుడు ఆ బాధలన్నీ పోయి చలాకీగా తిరుగుతున్నారు. మీ విషయానికే వస్తే మీరు ఉండవలసిన బరువు కన్నా 25-26 కిలోలు అదనపు బరువు ఉన్నారు.
కీళ్ల నొప్పులతో బాధపడుతున్న మీరు శారీరక వ్యాయామం చేయడంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే బేరియాట్రిక్ స్లీవ్ సర్జరీ ద్వారా మీ అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం చాలా సులభం. అన్నాశయంలోని 85 శాతం భాగాన్ని సర్జరీ ద్వారా తొలగించడం వల్ల మీరు తీసుకునే ఆహారం పరిమాణం బాగా తగ్గిపోయి కొద్ది నెలల్లోనే మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. లాపరోస్కోపిక్ ద్వారా చేసే ఈ సర్జరీ పూర్తయిన నాలుగైదు రోజులకే మీరు ఇంటికి వెళ్లిపోవచ్చు. డయాబెటిస్‌కి సంబంధించిన మందులను వారం రోజులకే ఆపేయవచ్చు. భవిష్యత్తులో కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండదు.
నా వయసు 39. ఎత్తు 5'11. బరువు 102 కిలోలు. చిన్నప్పుడు నేను మామూలుగానే ఉండేవాణ్ని. గత 10 సంవత్సరాలుగా బరువు బాగా పెరిగాను. బరువు తగ్గడానికి సైక్లింగ్, థ్రెడ్‌మిల్ లాంటి వ్యాయామాలు చేస్తూ, డైటింగ్ ఉంటున్నా ఎటువంటి మార్పు కనపడడం లేదు. నాకు డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్ లాంటి వ్యాధులేమీ లేవు. అధిక బరువు తగ్గడానికి నేనేం చేయాలి?
మీరు ఉన్న హైట్‌కి ఉండవలసిన ఐడియల్ బాడీ వెయిట్ 72 కిలోలు. 30 కిలోల తేడా ఉంది. కాబట్టి మీరు సీరియస్ నుంచి మార్బిడ్ ఒబెసిటీలోకి ప్రవేశిస్తున్నారు. ఇప్పటిదాకా వేరే ఇతరత్రా అంటే డయాబెటిస్, బిపి, కొలెస్టరాల్ వంటి ఆరోగ్య సమస్యలు మీకు లేనప్పటికీ 40వ పడిలోకి ప్రవేశిస్తున్నారు కాబట్టి, పైగా 30 కిలోలు అదనపు బరువు ఉన్నారు కాబట్టి త్వరలో ఈ అదనపు బరువు తగ్గకపోతే కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తడం మొదలుపెడతాయి. ముఖ్యంగా పొట్ట దగ్గర వచ్చే వితరల్ ఫ్యాట్ కారణంగా మెటబాలిక్ సిండ్రోమ్ అనే సమస్య రావడం, దాని వల్ల మధుమేహం, బిపి, కొలెస్టరాల్ వంటి వ్యాధులు ఏర్పడే అవకాశం ఉంది.
ఈ వ్యాధుల కారణంగా హార్ట్ ఎటాక్, స్ట్రోక్, కొన్ని రకాల క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఈ పరిస్థితులలో అధిక బరువును వదిలించుకోవడం చాలా అవసరం. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు అంటున్నారు కాబట్టి బేరియాట్రిక్ సర్జరీతో ఈ సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు. ప్రత్యేకంగా గ్యాస్ట్రిక్ బ్యాండ్ లేదా గ్యాస్ట్రిక్ స్లీవ్ పద్ధతుల ద్వారా స్థూలకాయం సమస్య నుండి బయటపడవచ్చు. నాలుగైదు నెలల్లోనే మీరు అధికంగా ఉన్న బరువును కోల్పోగలరు. అంతేగాక భవిష్యత్తులో ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా కూడా జాగ్రత్తపడవచ్చు.
నా వయసు 48. నాకు ఇద్దరు పిల్లలు. వాళ్ల వయసు 18, 15. నేను, నా భార్య స్థూలకాయులం కాము. నార్మల్‌గానే ఉంటాము. కాని మా పెద్దబ్బాయి మాత్రం అధిక బరువుతో బాధపడుతున్నాడు. వాడి ఎత్తు 5'6. బరువు మాత్రం 105 కిలోలు. డాక్టర్ల సలహా మేరకు థైరాయిడ్ చెకప్ కూడా చేయించాము. అన్నీ నార్మల్‌గానే ఉన్నాయన్నారు. మా అబ్బాయి సమస్యకు పరిష్కారం సూచించండి.
మగ పిల్లలకు 18, 19 సంవత్సరాలకు పొడుగు పెరగడం ఆగిపోతుంది. మీ అబ్బాయి వయసుకు ఉండాల్సిన బరువు 62-64 కిలోలు మాత్రమే. కాని దాని కన్నా దాదాపు 40 కిలోలు అధిక బరువు ఉన్నాడు. అధిక బరువు ఉన్నపుడు చిన్న వయసులోనే టైప్-2 డయాబెటిస్, బిపి, శరీరం బరువును మోసే జాయింట్లు అంటే నడుము, మోకాళ్లు, పాదాలు వంటి వాటన్నిటికి నొప్పులు రావడం వంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. మీరు చెప్పిన వివరాలను బట్టి మీ అబ్బాయి సమస్య జెనెటిక్‌పరంగా రాలేదని అర్థమవుతోంది. ఇక మిగిలింది జీవనశైలి.
ఆహారపు అలవాట్లు, పరిసరాలు వంటివి పరిశీలించాల్సి ఉంటుంది. సాధారణంగా పిజ్జాలు, బర్గర్లు వంటి హైవీ క్యాలరీడ్ ఫుడ్ తినడం, శారీరక వ్యాయామం లేకపోవడం, ఎక్కువగా టివి ముందు కూర్చోవడం వంటి జీవనశైలి వల్ల పిల్లలలో చిన్నవయసులోనే ఒబేసిటీ సమస్య తలెత్తుతోంది. ఈ పరిస్థితులలో ఇతరత్రా వ్యాధులు రాకముందే బరువు తగ్గే పద్ధతులను ఎంచుకుంటే మంచిది. మీ అబ్బాయి సమస్యను గ్యాస్ట్రిక్ బ్యాండ్ లేదా గ్యాస్ట్రిక్ స్లీవ్ ద్వారా పరిష్కరించవచ్చు.
గ్యాస్ట్రిక్ బ్యాండ్ అంటే అన్నాశయం పైభాగంలో ఒక సిలికాన్ బ్యాండ్ వేయడం జరుగుతుంది. దీంతో అక్కడ ఒక చిన్న సంచిలా ఏర్పడుతుంది. అన్నాశయం విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల కొద్దిగా తిన్నా కడుపు నిండిపోతుంది. అవసరాన్ని బట్టి దాన్ని వదులు చేసుకోవడం లేదా బిగించడం వంటివి చేయవచ్చు. ఈ పద్ధతులన్నీ లాపరోస్కోపిక్ విధానంలోనే జరుగుతాయి.
శరీరంపైన పెద్ద గాట్లు ఉండవు. ఈ చికిత్సల వల్ల నాలుగైదు నెలల్లోనే మీ వాడు 40 కిలోల అదనపు బరువును కోల్పోగలడు. ఈ మధ్యే 152 కిలోల బరువున్న ఒక 18 సంవత్సరాల యువకుడికి గ్యాస్ట్రిక్ స్లీవ్ సర్జరీ చేయడం జరిగింది. ఐదు నెలల్లో అతను 45 కిలోల బరువును కోల్పోయాడు.
నా వయసు 28. ఎత్తు, 5-'4. బరువు 92. నాకు విపరీతమైన ఆకలి ఉంటుంది. ఎక్కువ మొత్తంలో తింటే తప్ప తృప్తి కలగదు. దాంతో రోజురోజుకూ బరువు పెరుగుతూనే ఉన్నాను. బరువు తగ్గించుకోవడానికి ఇప్పటి దాకా అనుసరించిన పద్ధతులన్నీ విఫలమైపోయాయి. మాకు తెలిసిన జనరల్ ఫిజిషియన్ ఒకరు, గ్యాస్ట్రిక్ స్లీవ్ సర్జరీ చేయించుకొమ్మని, దాని వల్ల చాలా వేగంగా బరువు తగ్గుతారని చెప్పారు. అయితే ఈ సర్జరీ ద్వారా అంత వేగంగా బరువు తగ్గడానికి ఆకలి క లిగించే హార్మోన్‌ను తొలగించడమే కారణమని చెప్పారు. ప్రకృతి సహజంగా ఉండే ఆ హార్మోన్‌ను తొలగించడం ద్వారా మునుముందు ఏవైనా సమస్యలు తలెత్తవా?
మీ బాడీ మాస్ ఇండెక్స్‌ను అనుసరించి మీ బరువు 58 కేజీలకు మించకూడదు. అంటే మీరు దాదాపు 34 కేజీల అదనపు బరువుతో ఉన్నారు. ఈ బరువు తగ్గించడానికి మీరు అనుకుంటున్నట్లు గ్యాస్ట్రిక్ స్లీవ్ సర్జరీ ఉత్తమం. ఈ సర్జరీలో 80 శాతం గ్లెరిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేసే భాగాన్ని తీసివేస్తాం. ఆకలిని కలిగించే ఈ హార్మోన్ జీర్ణకోశంలో ఉత్పత్తి అవుతుంది.
అయితే ఈ భాగాన్ని తొలగించినా చిన్న పేగుల్లో మరో 20 శాతం గ్రెలిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. ఇది శరీర వ్యవస్థకు సరిపోతుంది. ఇక్కడ జరిగేదంతా గ్లెరిన్ హార్మోన్ అదనంగా ఉత్పత్తి కావడాన్ని నిరోధించడమే. అందుకే ఇలా తొలగించడం వల్ల శరీరానికి ఏ విధమైన ఇబ్బందీ ఉండదు. గ్యాస్ట్రిక్ స్లీవ్ సర్జరీ జరిగిన ఆరుమాసాల్లో మీలో అదనపు బరువు తగ్గిపోతుంది.
వాస్తవానికి అధిక బరువు వల్ల శరీర ఆకృతి మారడం ఒక్కటే కాదు. ఈ సమస్య దీర్ఘకాలికంగా కొనసాగితే అధిక రక్తపోటు, మధుమేహంతో పాటు, మోకాలి కీళ్ల నొప్పులు, వెన్నునొప్పుల వంటి ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ఈ సర్జరీ ద్వారా బరువు తగ్గించుకుంటే ఈ సమస్యలన్నిటికీ దూరంగా ఉండవచ్చు. బరువు తగ్గడం వల్ల జీవక్రియలు కూడా చైతన్యవంతంగా పనిచేస్తాయి. ఫలితంగా శరీరం శక్తివంతంగా మారడంతో పాటు కొత్త ఉత్సాహం నిండిపోతుంది.
నా వయసు 36. ఎత్తు 5-'2 . బరువు 87 కేజీలు. ఇప్పటి వరకూ బరువు తగ్గించుకోవడానికి నేను పాటించిన ఆహార నియమాలు, చేసిన వ్యాయామాలతో పెద్ద ప్రయోజనమేదీ కనిపించలేదు. పైగా నీరసం, నిరుత్సాహం ఆవహించాయి. మాకు తెలిసిన వారు ఒకరు ఈ స్థితిలో బరువు తగ్గించుకోవడానికి బేరియాట్రిక్ సర్జరీ ఒక్కటే మార్గం అన్నారు. అయితే, ఈ సర్జరీ ద్వారా బరువు వేగంగానే తగ్గుతుంది కానీ, చర్మమంతా బాగా ముడతలు పడుతుందని చెబుతున్నారు. అది నిజమేనా? సర్జరీ తరువాత ఎంత కాలం విశ్రాంతి తీసుకోవాలి? సర్జరీ తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి? ఆ వివరాలు తెలియచేయండి.
మీ బాడీ మాస్ ఇండెక్స్ అనుసరించి మీ బరువు 55 కేజీలకు మించకూడదు. అంటే దాదాపు 30 కేజీలుు మీరు అదనపు బరువుతో ఉన్నారని అర్థం. ఈ బరువును తగ్గించడానికి గ్యాస్ట్రిక్ బ్యాండ్ లేదా గ్యాస్ట్రిక్ స్లీవ్ విధానాలు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. ఈ సర్జరీ చేయించుకున్న 6 నుంచి 8 మాసాల్లో అధికంగా ఉన్న మీ శరీరం బరువు తగ్గిపోతుంది. అయితే వే గంగా బరువు తగ్గడం ద్వారా తొలుత చర్మం కాస్త వదులు కావడం నిజమే.
అయితే ఆ తరువాత శరీర సహజతత్వం వల్ల 70 శాతం ముడతలు వాటికవే తొలగిపోతాయి. ఇక మిగిలిన 30 శాతం ముడతలు బైపోలార్ థర్మో థెరపీ అనే ఒక ప్రత్యేక వ్యాయామం వల్ల తగ్గిపోతాయి. ఏమైనా, అధిక బరువు వల్ల అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలేవీ తలెత్తకముందే మీరు ఈ ఆధునిక చికి త్సల వల్ల బరువు తగ్గించుకోవడం శ్రేయస్కరం. ఈ చికిత్సలు జరిగిన రెండు మూడు రోజుల్లోనే మీరు ఇంటికి వెళ్లిపోవచ్చు. ఆపైన ఓ వారం రోజులు విశ్రాంతి తీసుకుంటే, ఆ తరువాత యథావిధిగా మీరు మీ విధులకు హాజరు కావ చ్చు.
మా పాప వయసు 10 ఏళ్లు. వయసుకు మించిన బరువు ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక చిరుతిళ్లు తింటుంది. చాకొలెట్స్, చిప్స్, కూల్‌డ్రింక్స్‌తో గడిపేస్తుంది. ఎంత చెప్పినా వాటిని తినడం మానదు. మాఆ అమ్మాయి బరువు తగ్గించడానికి మీ ట్రీట్‌మెంట్స్ ఉపయోగపడతాయా?
సాధారణంగా 13 సంవత్సరాల లోపు పిల్లల్లో మానసిక ఎదుగుదల ఎక్కువగా ఉండదు కాబట్టి ఆలోపు వయసు పిల్లలకు బేరియాట్రిక్ సర్జరీలను నిర్వహించడం సబబుకాదు. అదీగాక శారీరకంగా, మానసికంగా ఎదిగే వయసు కాబట్టి ఎదిగే కొద్దీ ఇప్పుడున్న అధిక బరువు దాంతో సర్దుకోవచ్చు. 13 ఏళ్లు దాటిన తర్వాత కూడా వారి శరీర బరువులో ఎటువంటి మార్పులు రాకపోతే అప్పుడు గ్యాస్ట్రిక్ బెలూన్ చికిత్స చేసుకోవచ్చు.
సెలైన్ నింపిన ఒక బెలూన్‌ను నోటి ద్వారా జీర్ణాశయంలోకి పంపిస్తాము. దీంతో జీర్ణాశయంలో ఖాళీ ప్రదేశం తగ్గిపోయి కాస్త తినగానే కడుపు నిండిపోతుంది. ఆరు నెలల తర్వాత బెలూన్‌ను తీసేయడం జరుగుతుంది. ఈ లోపల మీ అమ్మాయిలో ఫిజికల్ యాక్టివిటీ పెంచండి. వాకింగ్, ఎక్సర్‌సైజెస్ రెగ్యులర్‌గా చేయించండి. గ్యాస్ట్రిక్ స్లీవ్ సర్జరీని 18 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే చేయడం జరుగుతుంది.
అది జబ్బు కాదు... కానీ చాలా రకాల జబ్బులకు కేంద్రబిందువు. బిపి నుంచి గుండెజబ్బుల దాకా, కిడ్నీ నుంచి కీళ్లనొప్పుల దాకా... రకరకాల సమస్యలకు మూలకారణం. అదే.... స్థూలకాయం. అధిక బరువు నుంచి స్థూలకాయం దశకు చేరుకున్న తరువాత ఇక చిన్నచిన్న చికిత్సలేవీ పనిచేయవు. బేరియాట్రిక్ సర్జరీ ఒక్కటే మార్గం అంటున్నారు ప్రముఖ బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ టిఎల్‌విడి ప్రసాద్‌బాబు. ఆయన అందిస్తున్న వివరాలు....
మనదేశంలో 14 శాతం మంది పురుషులు, 18 శాతం మంది మహిళలు అధిక బరువు ఉండగా, 5 శాతం మంది స్థూలకాయులేనని సర్వేలు తెలుపుతున్నాయి. కాలి వేలి నుంచి తల వరకు అధిక బరువు ప్రభావం చూపించని శరీర భాగమే లేదు. కనబడకుండా కబళించే జబ్బు ఇది. అధిక బరువు స్థూలకాయంగా పరిణమించిందంటే ఇక రోజురోజుకీ అనారోగ్యాలకు దగ్గరవుతున్నట్టే.
అధిక రక్తపోటు, గుండెపోటు, కీళ్లనొప్పులు, కిడ్నీ వ్యాధులు, మధుమేహం.... ఇలా జబ్బుల లిస్టు పెరిగిపోతూనే ఉంటుంది. ఆధునిక జీవన విధానం తెచ్చిన ఈ సమస్యలన్నింటినీ కలిపి మూకుమ్మడిగా మెటబోలిక్ సిండ్రోమ్ అంటారు. ఈ స్థితికి వచ్చిన తరువాత బరువు తగ్గడం కోసం మనం ఇంట్లో కూర్చుని చేసే ప్రయత్నాలేవీ సత్ఫలితాలను ఇవ్వవు. ఎంత డైటింగ్ చేసినా, ఎన్ని వ్యాయామాలు చేసినా ఫలితం ఆశాజనకంగా ఉండదు. ఇలాంటప్పుడు ఉపయోగపడేదే బేరియాట్రిక్ సర్జరీ.
ఎవరికి అవసరం?
మన ఎత్తు, బరువుల ఆధారంగా గణించి చెప్పేది జీవక్రియ ఆధారిత రేటు(బేసల్ మెటబోలిక్ ఇండెక్స్). అధిక బరువు లేకుండా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల బిఎంఐ 25 ఉంటుంది. బిఎంఐ విలువ 25 నుంచి 30 ఉంటే మంచి ఆహారం, వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కానీ బిఎంఐ 35 నుంచి 40 ఉంటే అధిక బరువు అంటాం. అధిక బరువు ఉన్నా, మధుమేహం, హైపర్‌టెన్షన్ సమస్యలుంటే అలాంటివాళ్లకి బేరియాట్రిక్ సర్జరీ అవసరం అవుతుంది. బిఎంఐ విలువ 40కన్నా ఎక్కువ ఉంటే వాళ్లు స్థూలకాయులన్నమాట. వీళ్లకి ఎటువంటి సమస్య లేకపోయినా భవిష్యత్తులో వచ్చే అవకాశాలెక్కువ.
కొవ్వు తీయడమేనా...?
ఈ సర్జరీ పేరు వినగానే శరీరంలో కొవ్వు తీసివేయడమేమో అనుకుంటారు. కానీ ఆ పద్ధతి వేరు.. ఈ చికిత్స వేరు. తొడలు, పిరుదులు, పొట్ట... ఇలా ఒకచోట పేరుకుపోయిన కొవ్వును తీసివేయడాన్ని లైపోసక్షన్ అంటారు. బేరియాట్రిక్ సర్జరీ అంటే కొవ్వు పేరుకోకుండా అడ్డుకునే చికిత్స. శరీరం లోపల జీర్ణవ్యవస్థలో చిన్న మార్పులు చేయడం ద్వారా ఇది సాధ్యపడుతుంది.
జీర్ణకోశం పరిమాణం తగ్గించడం, లేదా ఆహారం పూర్తిగా జీర్ణం కాకుండా ఆనకట్ట వేయడం.. బేరియాట్రిక్ సర్జరీలో ఉన్న అంశాలు ఈ రెండే. జీర్ణకోశాన్ని నిలువుగా కోసి కొంత భాగాన్ని తీసివేయడం ద్వారా దాని పరిమాణాన్ని తగ్గిస్తారు. ఈ తీసివేసే భాగంలో గ్రెలిన్ అనే హార్మోన్ ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతుంది. గ్రెలిన్ ఆకలి పెంచే హార్మోన్. ఈ పద్ధతి ద్వారా జీర్ణాశయ పరిమాణం తగ్గిపోవడం వల్ల కొద్దిగా తినగానే కడుపు నిండిపోతుంది. అంతేగాకుండా గ్రెలిన్ ఉత్పత్తి తగ్గుతుంది కాబట్టి ఆకలి కూడా తగ్గిపోతుంది. తద్వారా మెల్లమెల్లగా తీసుకునే కేలరీలు తగ్గుతాయి.
జీర్ణాన్ని ఆపే పద్ధతి
మరోపద్ధతి మాల్ అబ్‌సార్‌ప్షన్ పద్ధతి లేదా రెస్ట్రిక్టివ్ ఆపరేషన్. ఈ పద్ధతిలో జీర్ణకోశాన్ని అడ్డంగా స్టేపుల్ చేస్తారు. అంటే పిన్ లాంటి నిర్మాణంతో జీర్ణాశయం ఒక చివరను మూసేస్తారు. సిలికాన్ బ్యాండింగ్ మరో పద్ధతి. సన్నని ట్యూబు ద్వారా మాత్రమే ఆహారం ప్రయాణిస్తుంది. దీనివల్ల చాలా కొద్ది పరిమాణంలో ఆహారం జీర్ణాశయానికి వెళ్తుంది. మిగిలింది పూర్తిగా జీర్ణం కాకుండానే బయటకు వెళ్లిపోతుంది.
ఈ పద్ధతి ద్వారా అవసరాన్ని బట్టి బిగించిన చివరను వదులు చేసుకోవచ్చు. బైపాస్ పద్ధతి ద్వారా కూడా ఆహారం పూర్తిగా జీర్ణం కాకుండా చేయవచ్చు. జీర్ణాశయం నుంచి డైరెక్ట్‌గా చిన్నపేగుకు దాదాపు చివరి భాగానికి బైపాస్ చేయడం వల్ల ఆహారం జీర్ణాశయం నుంచి వెంటనే ఆ చివరి భాగానికే వెళ్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఆహారం జీర్ణం కాదు. కేలరీలు ఎక్కువగా అందవు. అలా నెమ్మదిగా బరువు తగ్గుతారు.
సురక్షితమేనా?
130, 150 కిలోలు... ఇలా వంద కిలోలకు మించి బరువున్నవారికి ఆపరేషన్ చేయడం చాలా రిస్కుతో కూడుకున్న వ్యవహారం. ఇలాంటివాళ్లకి కాళ్లలోని రక్తనాళాల్లో గడ్డలు(క్లాట్స్) ఏర్పడే ప్రమాదం ఉంది. ఇవి ఊపరితిత్తుల వైపు వెళ్లి మరింత ప్రమాదకర పరిస్థితి ఏర్పడవచ్చు. అందువల్ల క్లాట్స్ ఏర్పడకుండా ప్రత్యేకమైన పరికరం ద్వారా కాళ్లకు వైబ్రేషన్స్ పంపిస్తారు. రక్తం పలుచబడటానికి బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్లు, హిపారిన్ ఇంజెక్షన్లు ఇస్తారు. స్లీప్ అప్నియా ఉంటే సర్జరీకి వారం ముందు నుంచే పడుకునేటప్పుడు బైపాప్ పరికరం ద్వారా ఆక్సిజన్ అందిస్తూ సర్జరీకి ప్రిపేర్ చేస్తారు.
ఇలాంటి జాగ్రత్తలెన్నో తీసుకోవడం వల్ల ఎలాంటి క్రిటికల్ కేసు అయినా, ఎంత రిస్కు ఉన్నా ఆపరేషన్ విజయవంతమయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఆహారం తక్కువగా తీసుకోవడం వల్ల పోషకాహార లోపం ఏర్పడే అవకాశం ఉంటుందేమో అన్నది చాలామంది అనుమానం. అయితే తీసుకునే కొద్ది ఆహారంలోనే అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకోవడం అవసరం. ఇందుకోసం సర్జరీ తరువాత డాక్టర్లు సూచించిన డైట్‌చార్జ్‌ను తప్పక పాటించాల్సి ఉంటుంది.
సైడ్ ఎఫెక్ట్‌లుంటాయా?
బరువు తగ్గించే పిల్స్ మాదిరిగా ఈ ఆపరేషన్ వల్ల సైడ్ ఎఫెక్టులు ఉండవు. ఇకపోతే ఈ ఆపరేషన్ కీహోల్ ద్వారా చేస్తారు కాబట్టి శరీరంపై గాయం ఉండదు. ఇన్‌ఫెక్షన్ల అవకాశమూ ఉండదు. ఎక్కువ రోజులు హాస్పిటల్‌లో ఉండాల్సిన అవసరం ఉండదు. వారం రోజుల తరువాత అన్ని పనులూ యథావిధిగా చేసుకోవచ్చు. ఆరు నెలల నుంచి ఏడాదిలోగా బరువు తగ్గుతారు. ఒక్కసారిగా బరువు తగ్గరు కాబట్టి మళ్లీ లావెక్కే అవకాశం కూడా ఒక్కసారిగా ఉండదు. ఆపరేషన్ తరువాత ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచుకుంటే స్థూలకాయ సమస్య మళ్లీ తలెత్తదు.
ఆధారము: హెల్త్ కేర్ తెలుగు బ్లాగ్
కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు మర్దన ఒకటే సమర్థమైన చికిత్స. పుట్టిన బిడ్డ ఎముకలు గట్టిపడటానికి మొదలుకొని ఎన్నో కీలక సమస్యలలో మర్దనను ఒక చికిత్సా ప్రక్రియలా ఉపయోగిస్తారు. ఎన్నో సమస్యలలో అనేక తైలాలతో మర్దన చేయడం ఆయుర్వేద విధానంలో ఒక మార్గం. అయితే ఇది కేవలం ఒక ఆయుర్వేదానికే పరిమితం కాదు. ఆధునిక వైద్య చికిత్సతో పాటు మరెన్నో చికిత్సా ప్రక్రియల్లోనూ అవసరాన్ని బట్టి మర్దనను ఉపయోగించడం పరిపాటి. ఈ మర్దననే బాడీ మసాజ్‌గా అభివర్ణించవచ్చు. అనేక రుగ్మతల సమయంలో ప్రకృతిచికిత్సలో మసాజ్ థెరపీకి ఉన్న ప్రాధాన్యతను తెలిపేదే ఈ ‘ముందుజాగ్రత్త’.
బిడ్డ పుట్టి ఎదిగే క్రమంలో స్నానం చేయించే ముందర కాసేపు మాలిష్ చేసినట్లుగా మర్దన చేయడం అనుభవం ఉన్న మాతృమూర్తులు చేసే పనే. తొలిచూలు మహిళలకు, బాలెంతలకూ ఈ విషయం ప్రాధాన్యాన్ని ఇంట్లోని పెద్దలు చెబుతూనే ఉంటారు. ఇలా చేయడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుందని బోధపరుస్తారు. ఇదీ మర్దన ప్రాధాన్యం. అంటే బిడ్డ ఆరోగ్యమైన ఎదుగుదలకు ప్రతిబంధకాలు ఎదురుకాకుండా చూసే ‘ముందుజాగ్రత్త’ విధానంగా భావించవచ్చు.
ప్రకృతిచికిత్స – మర్దనం: స్పర్శ ఉపయోగం మనకు తెలిసిందే. దుఃఖం కలిగే సమయంలో ఊరడింపునకు, అనునయానికి స్పర్శ ఉపయోగపడుతుంది. ఈ స్పర్శతో కలిగే ప్రయోజనాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయడం ద్వారా మర్దన చికిత్సను నిపుణులు వైజ్ఞానికంగా అభివృద్ధి చేశారు. దాంతో మర్దన చికిత్స (మసాజ్ థెరపీ) అన్నది ఒక శాస్త్రంగా రూపొందింది. మర్దనప్రక్రియ ద్వారా ఒనగూరే ప్రయోజనాలను ప్రత్యేకంగా అధ్యయనం చేసిన ఆయుర్వేదం, ప్రకృతి వైద్య విధానం దీన్ని ఒక వైజ్ఞానిక చికిత్స పద్ధతిగా ఇంకాస్త అభివృద్ధి చేశాయి. కేవలం చిన్నతనంలోనే కాదు… పెద్దయ్యాక అనేక శరీరక శ్రమలతో శరీరంలోని కండరాలు అలసటకు గురైనప్పుడు, ఆ కండరాలను సేదదీర్చడానికి మర్దన చాలామట్టుకు ఉపయోగపడుతుంది. దీన్నే ‘బాడీ మసాజ్’ థెరపీగా పేర్కొనవచ్చు.
మన దేశ సంప్రదాయంలో శరీర దారుఢ్యాన్ని పెంపొందించడానికి దండీలు, కుస్తీల వంటి సంప్రదాయ వ్యాయామాలతో పాటు మర్దనాన్ని కూడా ఎన్నో ప్రామాణిక వైద్యగ్రంథాల్లో ఉటంకించారు.
మర్దనలో జాగ్రత్తలు
మర్దనచికిత్సను చేసే నిపుణులు శరీర నిర్మాణాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని ఉండాలి. ఎందుకంటే కొన్ని సార్లు శరీర నిర్మాణాన్ని తెలుసుకోకుండా చేసే మర్దనతో నొప్పి మరింత పెరగవచ్చు. కాబట్టి శరీర నిర్మాణ తత్వాన్ని అనుసరించి మర్దన చేయడం ఈ చికిత్స ప్రక్రియలో అవసరం.
ఏయే ఆరోగ్య సమస్యల్లో…
కొన్ని రకాల పెరాలసిస్‌లు: కొన్ని రకాలపైన పక్షవాతాల్లో చచ్చుబడిన శరీర భాగాలను మళ్లీ పునరుజ్జీవింపజేయడానికి మర్దన చికిత్స చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద చికిత్స ప్రక్రియల్లో స్నేహస్వేద ప్రక్రియల్లో ధన్వంతరి తైలం, క్షీరబలాతైలాలతో మర్దన చేయాల్సి ఉంటుంది.
నరాల నొప్పులకు: నరాలు నొక్కుకుపోవడం వల్ల పాకినట్లుగా వచ్చే సయాటికా వంటి కొన్ని నొప్పులలో నరాన్ని, నరం వెళ్లే మార్గాన్ని ఉత్తేజితం చేసినట్లుగా మర్దన చేయాల్సి ఉంటుంది. ఆయుర్వేద నిపుణులు సూచించిన మహానారాయణ తైలం వంటి తైలాలను రుద్ది, ప్రకృతిచికిత్స నిపుణులు ఈ మర్దన చేస్తారు.
మాడు నొప్పి, తలనొప్పి: తలకు సంబంధించి తరచూ వచ్చే చాలా నొప్పులకు స్వచ్ఛమైన కొబ్బరినూనెతో తలపై మృదువుగా మర్దన చేయాలి. ఇలాంటి నొప్పులలో పడుకోబోయే ముందర మర్దన అవసరమవుతుంది. ప్రకృతి చికిత్సకులు, ఆయుర్వేద నిపుణుల సహాయం తో శరీరానికంతటికీ మసాజ్, ధారాచికిత్స అవసరమవుతుంది.
ఉబ్బసం, ఆయాసం: అలర్జీ వల్ల వచ్చే కొన్ని రకాల ఆయాసాలకు ఆయుర్వేద చికిత్సా విధానంలో కర్పూరతైలం, సైంధవలవణం కలిపిన నువ్వుల నూనెను ఛాతీపెనా, వీపు మీద మర్దన చేసినట్లుగా రుద్ది ఆ తర్వాత వేడినీళ్లతో కాపడం పెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
కాలి మడమల నొప్పులకు: కాలిమడమల వద్ద గుచ్చినట్లుగా వచ్చే నొప్పులకు ఆయుర్వేద వైద్య నిపుణుల సలహా మేరకు పిండతైలం, మహానారాయణ తైలాలను సమాన భాగాల్లో కలిపిన తైలంతో నొప్పి వచ్చే భాగంలో దాదాపు అరగంట పాటు మర్దన చేసి, ఆ తర్వాత కాపడం పెట్టుకోవాలి.
కండరాల్లో నొప్పులు : బాగా అలసట వల్ల వచ్చిన కొన్ని రకాల కండరాల నొప్పులు ఉపశమించేందుకు మర్దన చికిత్స ఉపయోగపడుతుంది.
కీళ్ల వాతం : కీళ్లు బిగుసుకుపోయినట్లుగా అయినందున వచ్చే సమస్యలు… ముఖ్యంగా చికన్‌గున్యా వంటి వ్యాధుల్లో కీళ్ల వాపు, నొప్పి, బిగుసుకుపోవడం వంటి సమస్యలకు మర్దన చికిత్సతో ఉపశమనం ఉంటుంది.
నిద్రలేమి: ఇటీవల పెరిగిన నిద్రలేమికి మర్దన చికిత్స సమర్థంగా ఉపయోగపడుతుంది. స్లీపింగ్ పిల్స్ వంటివి వాడకుండానే ఆరోగ్యకరమైన ప్రకృతి చికిత్సామార్గంలో క్రమం తప్పకుండా నిద్రపట్టేలా చేయడం, ‘స్లీప్ సైకిల్’ను క్రమబద్దీకరించేందుకు మసాజ్ థెరపీ ఉపయోగపడుతుంది.
అధిక బరువు నియంత్రణ: ఇటీవల శారీరకమైన శ్రమ చేయడం తగ్గిపోవడం అన్నది మారుతున్న జీవనశైలిలో మనకు అలవడ్డ దురలవాటు. దీనివల్ల బరువు పెరగడం, పొట్ట పెరగడం ఒకసమస్య. అయితే ఇది బయటకు కనిపించే సమస్య కాగా… అజీర్ణం, పొట్టపెరగడం, గ్యాస్, పుల్లటి తేన్పులు, అసిడిటీ, మలబద్దకం వంటిని అంతర్గతంగా వచ్చే అనుబంధ సమస్యలు. కొన్ని రకాల మర్దన ప్రక్రియలతో ఈ సమస్యలకూ మర్దన చికిత్స ఉపయోగపడుతుంది.
లైంగిక సమస్యలు: దైనందిన ఒత్తిడులతో లైంగిక సుఖానికి దూరమయ్యేవారికి మర్దన ఉపయోగపడుతుంది.
మానసిక ఒత్తిడులతో కలిగే అనేక అనుబంధ సమస్యలను మర్దన చికిత్స నివారిస్తుంది. మర్దనతో మానసికంగా కలిగే ఒత్తిడిని నివారించడం సాధ్యమైనందువల్ల ఒత్తిడి కారణంగా శరీరంలోకి విడుదల అయ్యే అనేక రకాల దుష్పరిణామాలను, హానికర రసాయనాలను నిరోధించవచ్చు. ఫలితంగా మానసిక ఒత్తిడులను మర్దన పరోక్షంగా నివారిస్తుందని చెప్పవచ్చు.
మర్దనతో ప్రయోజనాలు
శారీరకంగా, మానసికంగా రిలాక్సేషన్ లభిస్తుంది.
చర్మం కాంతివంతం అవుతుంది. ముఖ్యంగా మసాజ్ చేసిన చోట చర్మరంధ్రాలు బాగా తెరుచుకుని చెమటను బయటకు పంపడం వల్ల శరీరంలో మాలిన్యాలు బయటకు వెళ్తాయి.
రక్తప్రసరణ బాగా జరుగుతుంది.
శరీర కండరాలు సేదదీరుతాయి.
రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది.
వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే సమస్యలైన కీళ్లనొప్పులు, నడుము, వెన్నెముక, మెడ నొప్పులకు మర్దన చికిత్సతో మంచి ఉపయోగం ఉంటుంది.
చేయకూడని సందర్భాలు…
మానసిక సంతులన లేనివారికి, గర్భణీ స్త్రీలకు పొట్ట మీద మసాజ్ చేయకూడదు.
తల్లిదండ్రులు స్థూలకాయులైతే తాము కూడా స్థూలకాయంగా వుంటారనే అపోహ చాలా మందిలోవుంది. కానీ వారు తీసుకునే ఆహారం, వ్యాయామం చేయకపోవడం వల్ల వీరిలో స్థూలకాయం పెరుగుతోంది. స్థూలకాయానికి జన్యువులు ఎలా కారణమని ఒక పరిశోధన చేశారు.
జన్యుపరంగా స్థూలకాయం వస్తుందనేది ఒక కారణమే. కానీ నిజానికి అది కారణం కాదు. వృద్ధాప్యంలో స్థూలకాయం రావొచ్చు. చిన్న వయసు నుంచే మితంగా ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ స్థూలకాయం రాదు.
పసరతిత్తి రాళ్లనే గాల్ స్టోన్స్ అని అంటారు. స్థూలకాయం, కొలెస్ట్రాల్ ఎక్కువున్న ఆహారం తీసుకోవడమే దీనికి కారణం. ఈ వ్యాధి లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకుందాం…
పసరతిత్తి వ్యాధికి కారణాలు
స్థూలకాయం. మధుమేహం. గర్భ నిరోధక మాత్రలు వాడే వారిలో. సిరోసిస్ లివర్. ఎక్కువ కొలెస్ట్రాల్ వున్న వారిలో. పాలిఅన్ స్యాచురేటెడ్ కొవ్వు కల్గిన ఆహారం తీసున్నవారిలో పసరతిత్తి (గాల్ బ్లాడర్) బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ వుంటే వస్తాయి. మహిళల్లో నలభై వయస్సు, లావుగా ఉన్నవారిలో నాల్గు రెట్లు ఎక్కువగా కన్పిస్తుంది. గర్భవతుల్లో కూడా ఈ వ్యాధి వస్తుంది.
లక్షణాలు
చాలా మందిలో ఈ రాళ్ల వల్ల ఏ లక్షణాలు కనిపించవు. కొంత మందిలో మాత్రం ఉదరం పైభాగం కుడి పక్కన మెలిపెట్టినట్టు వస్తుంది. భోజనం చేసిన 30 నిమిషాల నుండి గంటన్నర తర్వాత మొదలవుతుంది. ఈ నొప్పి కుడి భుజానికి వీపునకు, పొట్ట దిగువ భాగానికి పాకుతుంది. మరికొందరిలో వయనం వచ్చినట్టు వుండడం, వాంతులవడం, చలితో కూడిన జ్వరంతోపాటు పసరికలొస్తాయి.
కొందరిలో పసరతిత్తి వాహికల్లో అడ్డుఏర్పడినప్పుడు అకస్మాత్తుగా తిత్తి వాచినప్పుడు, విపరీతమైన నొప్పి చలితో కూడిన జ్వరం వస్తుంది. దీన్ని ‘అక్యూట్ కోలిసిస్టెటిస్’గా గమనించాలి. రోగిని పరీక్షిస్తే కడుపుపై భాగంలో, కుడిపైపు నొక్కితే విపరీతమైన నొప్పి కలుగుతుంది. వ్యాధి తీవ్రతను బట్టి కొన్ని విపరీత లక్షణాలు ఈ విధంగా వుంటాయి. పచ్చకామెర్లు ఎక్కువగా వుండడం, సెప్టిసీమియా, పసరతిత్తిలో చీము నిండి పగలడం, తర్వాత షాక్‌లో వెళ్లడం జరుగుతుంది.
వ్యాధినిర్ధారణ
రక్తంలో బిలురూబిన్ ఎక్కువగా వుంటుంది. సాధారణ (కడుపు) ఎక్స్‌రే, ఓరల్ కోలిసిస్టోగ్రఫీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా గుర్తించవచ్చు.
చికిత్స
లక్షణాలు ఎక్కువున్నప్పుడు బాగా విశ్రాంతి అవసరం. సాత్విక ఆహారం తీసుకోవాలి. లావుగా వుంటే బరువు తగ్గించుకోవాలి. గుడ్డు, వేయించిన పదార్థాలు, వెన్నె సంబంధిత పదార్థాలు, పందిమాంసం కూడా బాగా తగ్గించాలి. వెచ్చని నీళ్లు వాటర్ బ్యాగ్‌లో వుంచి కడుపు మీద వుంచాలి. వాంతులు విరేచనాలు వుంటే నోటి ద్వారా ఏమి ఇవ్వకుండా నరాల ద్వారా గ్లూకోజ్ ఎక్కించాలి.
జెంటామైసిన్ 80 మిల్లీగ్రాములు రోజుకు రెండు పూటలు, ఎనిమిది రోజులు డాక్టర్ సలహా మేరకు వాడాలి. ఇంజక్షన్ల ద్వారా వ్యాధిని అరికట్ట లేకపోతే శస్త్ర చికిత్స ద్వారా పసరతిత్తిని తొలగించాలి. శస్త్ర చికిత్స సాధ్యపడని పరిస్థితిలో టాబ్లెట్ యుడియా, వుడిలివ్ రోజు రాత్రి పడుకునే టప్పుడు ఇవ్వాలి. ఈ మందు 400 మిల్లీగ్రాములు 6 నెలల నుండి 10 నెలలు దాకా వాడాలి. దీనితో విరేచనాలవుతే తక్కువ మోతాదులో వాడాలి. దీనితోనే పసరతిత్తి రాళ్లు కరుగుతాయి. ఇంకో విధానం ఎక్స్‌ట్రా కార్పోరియల్ షార్బ్‌వేవ్‌లితో ట్రిప్పితో రాళ్లు ఎక్కువ లేకుంటే తీసెయ్యవచ్చు. ఇది చాలా వుపయోగకరం.
డాక్టర్ హెచ్. కృష్ణమూర్తి
చీఫ్ ఫిజిషియన్ , మల్లు వెంకటనర్సింహారెడ్డి మెమోరియల్ క్లీనిక్ ,
ఎంహెచ్ భవన్ అజామాబాద్ , హైద్రాబాద్.
ఫోన్ : 9676376669
21వ శతాబ్దపు అతిపెద్ద సమస్య స్థూలకాయం. వివిధ వ్యాధులు చుట్టు ముట్టడానికి ఒక ముఖ్యమైన కారణం అవడమే కాకుండా అనవసరమైన మరణాలకు రెండవ ప్రధాన కారణమవుతోంది. అభివృద్ధి చెందిన దేశాలలో పోషకాహార లేమికి రూపం ఇది. ఈ సమస్య ఎంతమేరకు వ్యాపించిందో నిర్ధిష్టంగా తెలియకపోయినప్పటికీ అభివృద్ధి చెందిన దేశాలలో 20-40 శాతం మంది వయోజనులు, 10-20 శాతం మంది పిల్లలు, యువత దీని బారిన పడుతున్నారని అంచనా.
స్థూలకాయం పెరగడానికి కారణాలలో ప్రధానమైనది గ్రామీణ జీవనం నుంచి నగర జీవితానికి పరివర్తన చెందడం, వ్యక్తులకు భౌతిక వ్యాయామం లేకపోవడం.స్థూలకాయాన్ని మందులు లేకుండానే తగ్గించవచ్చు. అయితే దాని వ్యాప్తి గురించి, రావడానికి కారణాలు, జీవితంపై దాని ప్రభావం, సామాజిక, మానసిక ప్రభావాలు, మరణానికి చేరువ చేసే దాని సామర్ధ్యం గురించి సరైన అవగాహన ఉండాలి.
స్థూలకాయం
అధిక బరువును కలిగి ఉండటం అంటే స్ర్తీ అయినా పురుషుడైనా వారి వయసుకు, ఎత్తు కు తగ్గట్టుగా ఉండవలసిన బరువుకన్నా అధికంగా ఉండడం. అధిక బరువు అనేది సాధారణంగా స్థూలకాయం వల్లే వచ్చినా అసహజ రీతిలో కండరాలు పెరగడం లేదా ద్రవా లు నిలిచిపోవడం వల్ల కూడా రావచ్చు. కొవ్వు కణాలు విస్తరించినా లేదా కొవ్వుగల కణజాలం అసహజంగా పెరిగినా లేదా వాటి సంఖ్య రెట్టింపు అయినా లేదా ఈ రెండు చోటు చేసుకోవడాన్ని స్థూలకాయంగా అభివర్ణించవచ్చు. దీనిని ‘బాడీ మాస్ ఇండెక్స్’ (బిఎంఐ) ద్వారా తెలుసుకోవచ్చు. సాధారణంగా పురుషులలో 30 కన్నా స్ర్తీలలో 28.6 కన్నా బిఎంఐ అధికంగా ఉన్నప్పుడు స్థూలకాయ సూచనలు ఉన్నట్టే.
బిఎంఐ
ఒక వ్యక్తి అధిక బరువును కలిగి ఉన్నాడా అనేది నిర్ధారించేందుకు ఉపయోగించే గణనే బాడీ మాస్ ఇండెక్స్. ఒక వ్యక్తి బరువును కిలోలలో, ఎత్తును మీటర్లలో తీసుకొని దానిని భాగాహరించి, ఎంత సంఖ్య వస్తే అంతటితోనే హెచ్చింపు చేసి అంతి మంగా వచ్చే సంఖ్య ద్వారా నిర్ధారిస్తారు.
వివిధ బరువులు ఉన్న వారిలో బిఎంఐ.. వర్గీకరణ
1. తక్కువ బరువు – 18.5
2. సాధారణ బరువు – 18.5 – 24.9
3. అధిక బరువు – 25.0
4. ప్రీ- ఒబేస్ – 25-29.9
5. ఒబేస్ క్లాస్ -1 – 30.0 – 34.9
6. ఒబేస్ క్లాస్ -2 – 35.0- 39.9
7. ఒబేస్ క్లాస్ – 3 – 40.0
కారణాలు
ఇందుకు ఏ ఒక్క కారణమని నిర్ధిష్టంగా చెప్పలేం. దీర్ఘ కాలం పాటు అనేక కారణాలు కలిసి పనిచేయడం ఫలితంగా ఇది సంభవిస్తుంది. గుర్తించిన కొన్ని సాధారణ కారణాలు వయసు- అది ఏ వయసు అయినా కావచ్చు అయితే వయసుతో పాటు స్థూలకాయం వచ్చే అవకాశాలూ పెరుగుతాయి.జెండర్- పురుషులు 29-34 సంవత్సరాల మధ్య అధిక బరువు పెరుగుతారని కనుగొనగా స్ర్తీలు 45-49 ఏళ్ళ మధ్య బరువు పెరుగుతారు.
భౌతిక శ్రమ లేక పోవడం.
సామాజిక, ఆర్ధిక కారణాలు – ఎక్కువగా సంపన్న దేశాలలో కనుపిస్తుంది.
ఆహారపు అలవాట్లు – ఎ) భోజనానికి మధ్య తినడం. బి) ఎక్కువగా తినడం. సి) భారీగా తినడం. డి) స్వీట్లు. ఇ) రిఫైన్డ్ పదార్ధాలు తీసుకోవడం. ఎఫ్) టిన్డ్, కాన్డ్ పదార్ధాలను, డ్రింక్స్‌ను తీసుకోవడం. జి) చిల్డ్ ఫుడ్స్, డ్రింక్స్. హెచ్) నూనె పదార్ధాలు, వేపుళ్ళు వగైరా. ఐ) కొత్త బియ్యం, పప్పులు. జె) తాజా వైన్. కె) పాలపదార్ధాలు. ఎల్) బేకరీ ఉత్పత్తులు. ఎం) మాంసాహారం.
పగటి పూట నిద్రించడం
సౌకర్యవంతమైన పడక. ఇతర కారణాలలో అవిద్య, చైతన్యం లేకపోవడం, ఆహారంలో ఉండే కేలరీలు, అవి తీసుకునే విషయంలో అజ్ఞానం.
చికిత్స
ఒబేసిటీకి కేవలం ఒకటే పరిష్కారం లేదు. అనేక ప్రక్రియలను సమాంతరంగా చేపడుతూ వాటిని సమన్వయం చేయడం ద్వారానే దానిని నియం త్రించవచ్చు.
ఒబేసిటీని నియంత్రించేందుకు వివిధ రకాలైన, ప్రతిభావంతమైన చికిత్సలు ఉన్నాయి. అవి:
మందులతో చేసే చికిత్సను బిఎమ్‌ఐ 30.0 నుంచి 27.0 వరకు ఉండి ఒకటి లేదా రెండు ఒబేసిటీకి సంబంధించిన లక్షణాలు కలిగి ఉంటే చేస్తారు. దానిని బరువు తగ్గించి, తగు బరువును మెయింటైన్ చేయడానికి ఉపయోగిస్తారు. అయితే ఇది జీవన శైలిలో కొన్ని మార్పులతోనే సాధ్యమవుతుంది.
సాధారణంగా ఉపయోగించే మందులు
మూలికలు
ఆహారం
వ్యాయామం
కౌన్సెలింగ్
చికిత్సలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఒబేసిటీవల్ల కలిగే ఒత్తి డి, సామాజిక హేళన వం టి వాటి నుంచి రోగి బయటపడేందుకు ఇది ఉపయోగపడుతుంది. వ్యాధిగ్రస్థుడు స్వయం నియం త్రణను వృద్ధి చేసుకొని, తన కార్యకలాపాలను క్రమబద్ధం చేసుకునేందుకు సాయపడుతుంది.
స్థూలకాయాన్ని నియంత్రించేం దుకు ఆయుర్వేద చిట్కాలు
డా ప్రసాద్ , ఎం.డి.( ఆయుర్వేద) ,
డా స్వాతి , ఎం.డి. ( ఆయుర్వేద)
గాయత్రి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ సెంటర్ ,
101, రామచంద్రనివాస్ అపార్ట్‌మెంట్స్ , వెంగళరావ్‌నగర్ , హైదరాబాద్
ఫోన్: 93909 57168 / 9666649665 / 09503628150
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అధిక బరువు, స్థూలకాయంతో సతమతమవుతున్నారు. సుమారు 120 కోట్ల మంది అధిక బరువుతో.. 30 కోట్ల మంది వూబకాయంతో బాధపడుతున్నారని అంచనా. వీరిలో 13 శాతం మంది, పిల్లలు యువకులే కావటం విశేషం. గత పదేళ్లతో పోలిస్తే ఇది రెట్టింపు కావటం మరింత ఆందోళన కలిగిస్తోంది. మన దేశంలో పట్టణాల్లో ఉన్నత, మధ్య తరగతి మహిళల్లో 30-50 శాతం మంది.. పురుషుల్లో 32 శాతం మంది స్థూలకాయంతో బాధపడుతున్నారని ఇటీవల జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అధిక బరువు, స్థూలకాయం వివిధ జబ్బులకు దారితీస్తుండటంతో వీటిని తగ్గించుకోవాలని వైద్యులు నొక్కి చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం నివారించదగిన 10 ఆరోగ్య సమస్యల్లో స్థూలకాయం కూడా ఒకటి. ముఖ్యంగా స్థూలకాయుల సంఖ్య పెరిగిపోతుండటానికి టీవీలు, కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు గడుపుతుండటం.. పిల్లలకు ఆటస్థలాలు కనుమరుగు అవుతుండటం.. వ్యాయామం చేయకపోవటం.. శారీరక శ్రమ అంతగా లేని ఉద్యోగాలు.. ఆహారంపై అవగాహన లేకుండా చిరుతిళ్లకు అలవాటు పడటం వంటి జీవనశైలి దోహదం చేస్తోంది.
మన సమాజంలో కేలరీలు అధికంగా ఉండే పిండి పదార్థాలు, వేపుళ్లు, నూనె, నెయ్యి, కొవ్వు పదార్థాల వాడకం ఒకప్పటికన్నా నేడు బాగా పెరిగిపోయింది. ఇలా ఎక్కువెక్కువగా తింటూ అవసరమైన మేరకు శారీరక శ్రమ చేయకపోవటం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి బరువు పెరగటానికి దారి తీస్తోంది. దీనికి దురలవాట్లు కూడా తోడైతే పరిస్థితి మరింత విషమిస్తుంది.
వ్యాధుల దాడి
స్థూలకాయం కారణంగా గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, సంతాన సమస్యలు, క్యాన్సర్, వూపిరితిత్తుల జబ్బులు, పిత్తాశయంలో, కిడ్నీల్లో రాళ్లు, అల్సర్లు, గ్యాస్ట్రిక్ సమస్యల వంటివన్నీ చుట్టుముడుతున్నాయి. భారీ కాయాన్ని మోయాల్సి రావటంతో మోకాలి కీళ్లు అరిగే ప్రమాదమూ ఉంది. కాలేయం దెబ్బతింటుంది. ఇన్స్‌లిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. దీంతో మధుమేహ నియంత్రణ కష్టమవుతుంది. చెడ్డ కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) పెరిగి, మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) తగ్గుతుంది. ఇవి పక్షవాతానికి, గుండెజబ్బులకు దారితీస్తాయి. మనం కిలో బరువు పెరిగితే రోజుకి అదనంగా 30 కిలోమీటర్ల దూరం వరకు రక్తాన్ని నెట్టాల్సిన భారం గుండెపై పడుతుంది. దీంతో గుండె ఎక్కువ బలంతో పని చేస్తూ గుండె వైఫల్యానికి దారి తీస్తుంది.
బరువెందుకు పెరుగుతారు?
ఏ వయసులోనైనా బరువు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ.. చాలామంది మధ్యవయసులోనే ఎక్కువగా బరువు పెరుగుతుంటారు. కొందరు చిన్నతనంతోనే అధిక బరువుతో ఉండొచ్చు.
కొందరు వంశపారంపర్యంగా అధిక బరువు సమస్య బారిన పడొచ్చు. తల్లిదండ్రుల్లో ఇద్దరూ స్థూలకాయులైతే సుమారు 73 శాతం మంది పిల్లలకూ అది రావొచ్చు. ఎవరో ఒకరు స్థూలకాయులైతే పిల్లల్లో 45 శాతం మంది దీని బారినపడొచ్చు.
స్త్రీలల్లో కొన్ని గ్రంథుల స్రావాలు అధిక బరువును తెచ్చిపెట్టొచ్చు. రజస్వల అయినపుడు, గర్భం ధరించినపుడు, ముట్లుడిగిన తర్వాత మహిళలు అధికంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. స్టిరాయిడ్లు, గర్భ నిరోధకమాత్రలు, ఇన్స్‌లిన్ వంటివి తీసుకోవటమూ దీనికి దోహదం చేయొచ్చు. మానసిక అలసట, అశాంతి, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవటం, స్వీట్లు ఎక్కువగా తినటం, వంటివన్నీ బరువు పెరగటానికి కారణమవుతున్నాయి.
మూడు రకాలు
ఎత్తును బట్టి ఉండాల్సిన బరువును మూడు రకాలుగా విభజించారు. 1. సామాన్య బరువు 2. అధిక బరువు 3. వూబకాయం. ఎత్తు బరువుల నిష్పత్తి (బాడీ మాస్ ఇండెక్స్-బీఎంఐ) ప్రకారం దీనిని గణించొచ్చు. బీఎంఐ 20-25 ఉంటే సాధారణ బరువుతో ఉన్నట్టు. 25-30 ఉంటే అధికబరువుగానూ 30-35 ఉంటే వూబకాయంగానూ పరిగణిస్తారు.
వ్యాధిగ్రస్థ వూబకాయం: బీఎంఐ 40కి పైగా ఉంటే వ్యాధిగ్రస్థ వూబకాయం (మార్బిడ్ ఒబేసిటీ)లోకి అడుగిడినట్టే. ఈ దశలో నడవటమే కష్టమవుతుంది. ఏమాత్రం వ్యాయామం చేయలేరు. కష్టపడి వ్యాయామం చేసేందుకు ప్రయత్నించినా, తిండి తగ్గించినా కూడా బరువు తగ్గటమన్నది మాత్రం దుర్లభంగా తయారవుతుంది.
తగ్గే మార్గాలు
వ్యాయామం:
సహజసిద్ధంగా బరువును తగ్గించుకోవటానికి వ్యాయామాన్ని మించింది లేదు. దీంతో శరీరాకృతిని కూడా తీర్చిదిద్దుకోవచ్చు. తలనొప్పి, నడుంనొప్పి, ఆందోళన వంటి సమస్యలూ తగ్గిపోతాయి. వయసు పైబడుతున్నా వ్యాయామాన్ని మానరాదు. వయసుకు తగ్గ వ్యాయామాలను ఎంచుకోవాలి.
ఆహారం:
వ్యాయామం చేయటంతో పాటు జీవన విధానాన్ని మార్చుకోవటమూ అవసరమే. ఇందులో ఆహార నియమాలు, మితం పాటించటం ముఖ్యమైనవి. ముఖ్యంగా కొవ్వులు, నూనె పదార్థాలను తగ్గించి సమతులాహారం తీసుకోవటంపై దృష్టి పెట్టాలి.
ధూమానికి దూరం:
అప్పుడుప్పుడు సిగరెట్లు, బీడీలు కాల్చితే అంతగా ముప్పు ఉండదని భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదు. వీటిల్లోని నికోటిన్ గుండె, శ్వాసకోశం, ఇతర కండరాలకు ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఏమాత్రం పొగ తాగినా ఆరోగ్యానికి హాని కలుగుతుందని ఎన్నో అధ్యయనాల్లో రుజువైంది. పొగ తాగటం వల్ల రక్తంలో ఆక్సిజన్ మోతాదు పడిపోయి రకరకాల సమస్యలకు దారి తీస్తుంది. ఒకవేళ పొగ అలవాటుంటే వ్యాయామానికి అరగంట ముందూ తర్వాతా తాగకుండా ఉండటం మంచిది.
* ఆరోగ్యకరమైన జీవనశైలిని చిన్నప్పట్నుంచి పాటిస్తుంటే స్థూలకాయం ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.
బేరియాట్రిక్ సర్జరీ
వూబకాయం ప్రమాదకర స్థాయికి (మార్బిడ్ ఒబేసిటీ) చేరినవారు బరువు తగ్గాలంటే ‘బేరియాట్రిక్ సర్జరీ’ సమర్థ మార్గం. ఆహారాన్ని తగ్గించి వ్యాయామం చేస్తున్నా బరువు తగ్గనివారు, అధిక బరువు మూలంగా దైనందిన కార్యక్రమాలు చేయలేకపోతున్న వారికీ ఈ సర్జరీ మేలు చేస్తుంది. దీని ద్వారా తీసుకునే ఆహార పరిమాణం గణనీయంగా తగ్గుతుంది. ఇది బరువు తగ్గటానికి దోహదం చేస్తుంది. బేరియాట్రిక్ సర్జరీలో వివిధ రకాలున్నాయి. సాధారణంగా మనం తిన్న ఆహారం జీర్ణాశయం, పేగుల మొదటి భాగాల్లో జీర్ణమవుతుంది. అనంతరం చిన్నపేగుల గోడల ద్వారా పోషకాలు రక్తంలో కలుస్తాయి. మిగిలిన వ్యర్థాలు పెద్దపేగు ద్వారా బయటకు వెళ్తాయి. బేరియాట్రిక్ సర్జరీలో జీర్ణాశయంలో కొంతభాగాన్ని బాండ్‌తో బిగిస్తారు. దీనిని ‘గ్యాస్ట్రిక్ బ్యాండింగ్’ అంటారు. దీంతో జీర్ణాశయం సైజు తగ్గి ఆహారం తీసుకోవటం తగ్గిపోతుంది. ఇక చిన్నపేగుల బైపాస్ సర్జరీ ప్రక్రియలో పేగుల పొడవును తగ్గిస్తారు. దీని వల్ల ఆకలి తగ్గి క్రమంగా బరువు తగ్గుతారు.
* బేరియాట్రిక్ సర్జరీలో పొట్ట సైజును తగ్గించినంత మాత్రాన ఆకలి, తినాలనే కోరిక ఎలా తగ్గుతుందని చాలామంది అనుమానిస్తుంటారు. ఈ శస్త్రచికిత్స చేయించుకున్నవారిలో జీర్ణాశయానికి తగినట్టుగానే హార్మోన్ల ఉత్పత్తిలోనూ మార్పులు వస్తాయి. దీంతో ఎక్కువగా తినాలనే కోరిక కలగదు. వీటిని చేయించుకున్నవారిలో కొద్దిపాటి గ్యాస్ట్రిక్ సమస్యలు ఎదురవ్వొచ్చు. వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడుతూ వీటిని నివారించుకోవచ్చు.
ఇదీ బీఎంఐ.. ఎత్తు-బరువుల నిష్పత్తి
(26 అక్టోబర్ – ప్రపంచ వూబకాయ నియంత్రణ దినం)
డా|| కె.ఎస్.లక్ష్మి
ఒబేసిటీ సర్జన్, గ్లోబల్ హాస్పిటల్
హైదరాబాద్
అన్నివర్గాలకు చెందిన ఆహారాలను తీసుకుంటుండాలి. ఒకే రకం ఆహారానికే పరిమితం కాకూడదు. దీనినే షడ్రసోపేతమైన ఆహారం అంటుంది ఆయుర్వేదం. ఆహారంలో పిండి పదార్థాలను 60 శాతం, మాంసకృత్తులు 20 శాతం, కొవ్వు పదార్థాలు 20 శాతం ఉండేలా చూసుకోవాలి. ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి. మాంసాహారులైతే ఎర్రని మంసానికి బదులు తెల్లని మాంసం ఎంచుకోవాలి. అంటే మేక, గొర్రె, పోర్క్, బీఫ్‌కు బదులు చర్మం తొలగించిన కోడి, చేపల మాంసం తినాలి. గుజ్జు కలిగిన తియ్యని పండ్లు, డ్రైఫ్రూట్స్ బదులు రసం కలిగిన తాజా పండ్లు తీసుకోవాలి.
ఆహార పదార్థాలను ఫ్రై (నూనెలో వేయించటం) చేసే బదులు రోస్ట్ (నిప్పుల మీద వేడి చేయటం) చేయాలి. ఎక్కువ నూనెను వాడాల్సిన వంట పాత్రల బదులు మూకుడు, ఓవెన్, నాన్‌స్టిక్ ఫ్రయింగ్ ప్యాన్, ప్రెషర్ కుక్కర్ వంటివి వాడాలి. కూల్ డ్రింక్స్, టీ, కాఫీ తాగే బదులు మినరల్ వాటర్, బబుల్ వాటర్, డైట్ డ్రింక్స్ తీసుకోవాలి. వడ్డనకు పెద్ద గరిటెలు, వెడల్పాటి ప్లేట్లు వాడే బదులు చిన్నసైజ్ టేబుల్ స్పూన్లు, చిన్నప్లేట్లు వాడాలి.
నెమ్మదిగా తినాలి
ఆత్రంగా, గబగబా తింటే ఎంత తిన్నారో, ఏమి తిన్నారో తెలియక ఎక్కువ తినే అవకాశం ఉంటుంది. కనుక నెమ్మదిగా ప్రతి ముద్దనూ నమిలి, రుచిని ఆస్వాదిస్తూ తినాలి. దీంతో లాలాజలం విడుదలై ఆహారం బాగా జీర్ణమవుతుంది. ఒకవేళ నెమ్మదిగా తినలేకపోతే అలవాటయ్యేంతవరకూ స్పూన్‌తో తినాలి. ప్రతి ముద్దకూ చెంచాను కంచంలో విడిచిపెట్టి మళ్లీ తీసుకుంటూ ఉండాలి. ఆహారం తినేటప్పుడు చక్కని ఆహ్లాదకరమైన సంగీతం వింటూ తింటే నెమ్మదిగా తినడం అలవాటవుతుంది. దీంతో తిన్న ఆహారం పూర్తిగా పచనం చెంది శక్తిగా మారుతుంది. వేళ పట్టున తక్కువ మొత్లాల్లో తినాలి బయట ఫంక్షన్లకూ, రెస్టారెంట్లకూ వెళ్ళేటప్పుడు చాలామంది పార్టీలో ఎలానూ తినాల్సి వస్తుంది కదా అనుకొని ఇంట్లో ఏదీ తీసుకోరు. అయితే బరువు పెరగకుండా ఉండాలంటే పార్టీలకు వెళ్ళబోయేముందు ఇంట్లో మజ్జిగన్నం వంటివి తిని వెళ్లాలి. దీంతో పార్టీలో తిన్నప్పటికీ పేగులు ఎక్కువగా స్వీకరించవు. అలాగే రోజువారీగా తేలికగా ఉండే లఘు ఆహారాన్ని తింటూ ఉండాలి. ఉపవాసాలుండకూడదు. లెక్క ప్రకారం తినాలి. వీలైతే ‘్ఫడ్ డైరీ’ రాయాలి. తినేటప్పుడు వేరే పనిమీద దృష్టిపెట్టకూడదు. మాట్లాడుకుంటూ, టీవీ చూస్తూ, చదువుతూ తినకూడదు. ఆహారాన్ని పెద్దమొత్తాల్లో తక్కువసార్లు కాకుండా చిన్నమొత్తాల్లో ఎక్కువసార్లు తీసుకోవాలి. ప్రధాన ఆహారపు వేళల మధ్యలో చిరుతిండ్లు తినకూడదు. అయితే, అవసరమనుకుంటే ద్రాక్షపండ్లు, జామపండ్లు వంటివి తినవచ్చు. ఇవి మలనిర్హణ సజావుగా జరగడానికి సహకరిస్తాయి. మధ్యాహ్నం పూట తీసుకునే ఆహారం ఎక్కువగానూ, రాత్రి పూట తీసుకునే ఆహారం అల్పమోతాదులోనూ ఉండాలి.
తేనెను వాడితే మంచిది
తేనె తీసుకుంటే స్థూలకాయంలో చక్కని ఫలితం కనిపిస్తుంది. కాకపోతే ఏడాది కాలంపాటు నిల్వ ఉంచిన పాత తేనెను వాడాలని ఆయుర్వేదం సూచిస్తుది. పాత తేనెకు రూక్షం (స్నిగ్దత్వాన్ని తగ్గించటం), గ్రాహ (ద్రవరూపస్రావాలను ఎండిపోయేలా చేయటం), లేఖనం (కొవ్వును గీరేసి వదులయ్యేలా చేయటం), కఫ హరం (శే్లష్మాన్ని తగ్గించడం) అనే గుణాలు ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం గ్లాసు గోరువెచ్చని నీళ్ళకు రెండు చెంచాలు తేనెను చేర్చి తీసుకోవాలి. తేనెను నీళ్లకుచేర్చి తీసుకోవటంవల్ల వ్యాయామ సమయంలో నీరసం రాకుండా ఉంటుంది. అవసరమైతే ఈ విశ్రమానికి చెక్క నిమ్మరసం కూడా చేర్చి తీసుకోవచ్చు.
శూకధాన్యం మంచిది
యవగోధుమలు, బార్లి, ఓట్స్ వంటి వాటిని శూకధాన్యం (సిరియల్స్) అంటారు. వీటిల్లో అధిక మొత్తాల్లో పీచు పదార్థం ఉంటుంది. ఇది కొవ్వును పేరుకుపోకుండా చేస్తుంది. పీచు పదార్థం శక్తిని నిలకడగా విడుదలయ్యేలా చేస్తుంది. నీటిని పీల్చుకుంటుంది కాబట్టి అంత త్వరగా ఆకలి వెయ్యదు. పీచువల్ల మల, మూత్రాల నిర్హరణ సజావుగా జరుగుతుంది. అలాగే ఫైబర్ కొలెస్టరాల్‌ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
పాత బియ్యం హితకరం
ఏడాదిపాటు పాతబడిన బియ్యాన్ని వాడుకుంటే స్థూలకాయంలో హితకరంగా ఉంటుంది. అయితే మరీ పాత బియ్యం వాడితే శోథ(వాపు) వస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. బియ్యాన్ని నేరుగా కాకుండా కృతాన్నం రూపం తీసుకోవాలి. ఉడికించిన బియ్యానికి పప్పు, కాయగూరలు వంటివి చేర్చడాన్ని కృతాన్నం అంటారు. కొత్త బియ్యం వాడితే కఫం పెరిగి లావెక్కుతారు. కనుక స్థూలకాయులు వాడకూడదు.
మేలు చేసే ఆహారాలు తీసుకోవాలి
శమీధాన్యంలో (పప్పుదినుసుల్లో) మాంసకృతులు, పీచు అధికంగా ఉంటాయి. పెసర్లు లఘువుగా ఉంటాయి కనుక మంచివి. అలాగే ఉసిరి, పొట్ల, ఆకుకూరలు అన్నీ మంచివే. శొంఠి, పిప్పళ్లు, మిరియాలు వంటివి హితకరంగా ఉంటాయి. జీలకఱ్ఱ, ధనియాలు, సోంపు గింజలు, ఏలక్కాయలు, అల్లం, దాల్చిన చెక్క వంటివి ఆహారంలో ఎక్కువగా ఉపయోంచాలి. అయితే మినుములు గురువుగా ఉంటాయి కనుక స్థూలకాయులు వాడకూడదు.వేడినీళ్ళతో అద్భుతం- వేడినీళ్లు తాగితే సన్నబడతారు. వేడినీళ్ళ స్నానమూ మంచిదే. స్థూలకాయులు చన్నీళ్లు వాడకూడదు.ఆహారానికి ముందు నీళ్లు తాగాలి- ఆహారానికి ముందు 2 గ్లాసులు నీళ్లు తాగితే సన్నబడతారని ఆయుర్వేద సంహితా గ్రంథంలో అష్టాంగ హృదయం చెబుతుంది. ఆహారం తీసుకున్న వెంటనే మంచినీళ్ళు తాగితే లావెక్కుతారు కనుక కనీసం అరగంట వరకూ ఆగాలి.
మజ్జిగ మేలు చేస్తుంది
మజ్జిగ తేలిగా ఉంటుంది. అలాగే ఊబ శరీరాన్ని ఎండిపోయేలా చేస్తుంది. మజ్జిక తీపి, పులుపు, వగరు రుచులు కలిగి ఉంటుంది. ఈ రుచులు ఉండటంవల్ల ఇది త్రిదోషహరంగా పనిచేస్తుంది. పులుపువల్ల వాతం, తీపివల్ల పిత్తం, కషాయంవల్ల కఫం తగ్గుతాయి. మజ్జిగను వాతాధిక్యతలో (నొప్పులు, గ్యాస్ ఉన్నప్పుడు) సైంధవ లవణంతోను, పిత్త్ధాక్యతలో (మంటలు, జీర్ణక్రియా సమస్యలు ఉన్నప్పుడు) మిశ్రీతోను, కఫాధిక్యతలో (జలుబు వంటివి ఉన్నప్పుడు) త్రికటుచూర్ణంతోను తీసుకోవాలి. అయితే మజ్జిగను వెన్న తీసి మాత్రమే వాడాలి.చింతనతో స్థూలకాయ చింత దూరం శరీరంలో అధికంగా కొవ్వు చేరకుండా ఉండాలంటే అనుక్షణం చింత (ఆలోచన) చేయాలని ఆయుర్వేదం చెబుతుంది. బాధ్యతారహితమైన జీవన విధానంవల్ల స్థూలకాయం సిద్ధిస్తుంది.
వ్యాయామం చేయటం అవసరం
స్థూలకాయం రాకుండా ఉండాలంటే ప్రతినిత్యం అర్ధశక్తిగా వ్యాయామం చేయాలని ఆయుర్వేదం సూచిస్తుంది. యోగాసనాలు, సైక్లింగ్, నడక, ప్రాణాయామం, ఈత, క్రీడలు, జిమ్, ఎయిరోబిక్స్ వంటి వాటిల్లో ఏది అనువుగా వుంటే దానిని ఎంచుకొని సాధన చేయాలి. వ్యాయామం తరువాత చన్నీళ్లు తాగవద్దు చాలామంది వ్యాయామం చేసిన తరువాత అలుపు తీర్చుకునేందుకు చన్నీళ్ళు తాగుతుంటారు. అయితే, చన్నీళ్ళుగాని, లేదా తలపానీయాలుగాని జీవక్రియను ఆలస్యం చేసి స్థూలకాయానికి కారణమవుతాయి. అవసరమైతే వేడినీళ్ళనుగాని లేదా వేడిగా తయారుచేసిన శొంఠి కషాయం వంటి మూలికాపానీయాలను గాని తాగవచ్చు. ఆరోగ్యకరమైన దాంపత్య జీవితం ముఖ్యం నిద్ర, ఆహారం, మైథునం అనే మూడు స్తంభాలు మనిషి శరీరాన్ని ముక్కాలిపీటలాగా నిలబెడతాయని అంటుంది ఆయుర్వేదం. స్తంభాల ఎత్తులో హెచ్చుతగ్గులుంటే ఏ విధంగా మంటపం నిలబడదో అదేవిధంగా మనిషి శరీరం కూడా పతనమవుతుంది. కనుక వీటిని పరిమితంగా ఆస్వాదించాలి. మైథునంవల్ల ఉదాసీనత దూరమై చలాకీతనం వస్తుంది. బరువు నియంత్రణలో ఉంటుంది.
- డాక్టర్ చిరుమామిళ్ల మురళీమనోహర్
ఆధారము: వైద్యం.ఇన్ఫో
మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత 370 సెంటిగ్రేడ్ లేక 98.60 ఫారన్ హీట్ ఉంటే అది సాధారణ ఉష్ణోగ్రత అని అంటారు. శరీర ఉష్ణోగ్రత అంతకంటే ఎక్కువ ఉంటే అది జ్వరం అంటారు. సాధారణంగా 37.50సెంటిగ్రేడ్ (100 ) వుంటుంది. జ్వరం అన్నది శరీరంలో వున్న ఏదో ఒక వ్యాధి లక్షణము మాత్రమే. వ్యాధి ప్రభావము పెరిగే కొద్దీ జ్వర తీవ్రత అధికమవుతుంది. 39.50c లేదా 1030Fకు పైన ఉన్నా తప్పనిసరిగా డాక్టరు సలహా తీసుకోవాలి.
సాధారణ కారణాలు
సాధారణ జ్వరం లక్షణాలు
జ్వరం వచ్చినప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలు
టాన్సిల్స్ గొంతులో ఉండే లింఫాయిడ్ గ్రంధులు. ఇవి బయట నుండి నోటి ద్వారా లోపలికి వెళ్ళే గాలి మరియు ఆహార పదార్దాలలోని సూక్ష్మజీవులతో పోరాడి గొంతుకు రక్షణ కలిగిస్తాయి. ఇవి చిన్న వయసులో పెద్దవిగా ఉంటాయి. వయసు పెరిగే కొద్ది వాటి పరిమాణం తగ్గుతుంది. కాని ఒక్కొక్కసారి ఈ టాన్సిల్స్ లో అంటు చేరి అవి వాస్తాయి. దీనినే టాన్సిలైటిస్ అంటారు. ఈ సమస్య ముఖ్యంగా 10-15 సంవత్సరాల వయసు పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది.
గొంతు నొప్పి, జ్వరం, గ్రంధులు వాపు వలన ఆహారం మ్రింగుడు పడుట కష్టమవడం టాన్సిలైటిస్ లో కనిపించే లక్షణాలు. ఈ గ్రంధులలో అంటు చేరడం వల్ల పై పొరలలో పుండుపడి, తెల్లని గుల్లలవలె కనిపిస్తుంది.
ఈ వ్యాధిలో ఎక్యూట్ మరియు క్రానిక్ టాన్సిలైటిస్ అని రెండు రకాలు. ఎక్యూట్ టాన్సిలైటిస్ లో ఈ వ్యాధి తీవ్రంగా వచ్చి తక్కువ వ్యవధిలో తగ్గిపోతుంది. ఈ ఎక్యూట్ టాన్సిలైటిస్ పదే పదే రావడం వల్ల అది క్రానిక్ టాన్సిలైటిస్ గా మారి ఎక్కువ రోజులు రోగి బాధపడతాడు.
అంటు చేరిన శరీర భాగాన్ని బట్టి టాన్సిలైటిస్ లో ఈ క్రింది రకాలు ఉన్నాయి.
1. సూపర్ఫిషియల్: ఈ టాన్సిలైటిస్ వచ్చినప్పుడు ఫారింక్స్ లోని మ్యుకస్ పొర మంటకు గురవుతుంది.
2.ఫాలిక్యులార్:టాన్సిల్స్ లోని ఫాలికల్స్ కు అంటుచేరి అవి చీముపడతాయి. అందువల్ల టాన్సిల్స్ పైన పచ్చని చుక్కలు కనిపిస్తాయి. మిగిలిన పొర అంతా ఎర్రగా వాపుతో ఉంటుంది.
3.సప్పురేటివ్:టాన్సిల్స్ చుట్టూ ఉన్న కణజాలానికి అంటు వ్యాధి వ్యాపించి పెరిటాన్సిలార్ ఆబ్సీస్(క్విన్సీ) కూడా ఏర్పడవచ్చు. సాధారణంగా ఒక్క టాన్సిల్ మాత్రమే వ్యాధికి గురవుతుంది. ఈవాపు మెత్తటి అంగిలివరకు, అటు నుండి చెవి వరకు వ్యాపించవచ్చు. రోగి చాలా నొప్పితో బాధపడతాడు.
4.అక్యూట్ పేరన్కైమిటస్: టాన్సిల్ అంతా అంటుకు గురవుతుంది. మొత్తం టాన్సిల్ వాచి ఎర్రగా మారుతుంది.
5.అక్యూట్ మెంబ్రేనస్: ఫాలిక్యులర్ టాన్సిలైటిస్ ఎక్కువై టాన్సిల్స్ నుండి కొన్ని పదార్దాలు తయారై అవి టాన్సిల్స్ మీద ఒక పొరగా మారతాయి.
ఈ వ్యాధి వచ్చిన వాళ్ళకి పూర్తి విశ్రాంతి ఇచ్చి ఇతరుల నుండి దూరంగా ఉంచాలి.
టాన్సిల్స్ గొంతులో రక్షణ కల్పించే గ్రంధులైనప్పటికి ఒక్కొక్కసారి వాటిలో అంటు బాగా ఎక్కువైపోయినప్పుడు మరియు మందుల వల్ల ఈ టాన్సిలైటిస్ తగ్గనప్పుడు వీటిని శస్త్ర చికిత్స చేసి తొలగిస్తారు.
తీసుకోవలసిన జాగ్రత్తలు:-
క్యాటరాక్టు (కంటిలో తెల్లపువ్వు) :
కంటిలో ఒక లెన్సు ఉంటుంది. రానురాను ఈ లెన్సు పారదర్శకత్వాన్ని కోల్పోతుంది. చూపు మందగిస్తుంది. ఈ దశను క్యాటరాక్టు అంటారు.
క్యాటరాక్టు వచ్చిన వారికి ఈ క్రింది లక్షణములు ఉంటాయి :
రాను రాను నొప్పి లేకుండా కంటిచూపు తగ్గుతుంది. దగ్గర దూర చూపులో వ్యత్యాసం దుర్లభం. రంగులు గుర్తు పట్టడంలో కష్టం, ఒకే దృశ్యం రెండుగ కనబడడం. కంటిపాప రంగుమారి తెల్లపడడం, మబ్బుమబ్బుగా ఉండడం.
క్యాటరాక్టును ఏవిధంగా చికిత్స చేయవచ్చు?
సామాన్య కంటిచూపు మళ్ళీ తెచ్చుకోవడానికి ఒకే ఒక ఉపాయం ఉంది. ఒక సామాన్య ఆపరేషన్ ద్వారా కంటిలోని లెన్సు తొలగించడమే.
క్యాటరాక్టు ఆపరేషన్ దుష్పరిణామానికి దారితీస్తుందా ?
ఇదొక సామాన్యమైన ఆపరేషన్. ఇందులో నొప్పి ఉండదు. రోగికి స్పృహ లేకుండా చెయ్యరు. మత్తుమందు ఇవ్వనవసరము లేదు.
కంటి సంరక్షణ కోసం, క్యాటరాక్టు వచ్చిన వారిని పరీక్షించడానికి, వారికి చికిత్స చేయడానికి, జిల్లా అంధత్వ నివారణ సంఘములను, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేశారు.
స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా నేత్రచికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఆపరేషన్ తర్వాత రోగులకు ఉచితంగా కంటద్దాలు అందజేస్తున్నారు.
జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయాలు :
నిర్జలీకరణం అనగా నేమి ?
శరీరం నుంచి అధిక మోతాదులో నీరు నష్టపోవడాన్ని నిర్జలీకరణం అంటారు. మన శరీరం లో ఉన్న వ్యవస్థలు పని చేయడానికి నిర్ణీత మోతాదులో నీరు అవసరం. కనీసం 8 గ్లాసుల నీరు రోజుకు అవసరం ఈ అవసరం మనిషి రోజు చేసే పని,వయసును బట్టి మారుతూ వుంటుంది. చాలా శరీరక శ్రమ చేసే వారికి దీనికి రెండు నుంచి మూడింతలు త్రాగవలసి వుంటుంది. శరీరంలో సహజంగా జరిగే జీవ ప్రక్రియలకు అవసరమైన నీటిని మనం అందించ వలసి వుంటుంది. తగిన మోతాదులో తీసుకొనక పోయినా, తీసుకొన్న దానికంటే అధికంగా నష్ట పోయినా నిర్జలీకరణం సంభవిస్తుంది.
నిర్జలీకరణకు కారణాలు
అన్నవాహిక (జీర్ణ వ్యవస్ధ) నుంచి అధికంగా నీరు నష్టపోవడం మూలాన ఈ స్ధితి ఏర్పడవచ్చును. దీనికి కారణాలు
లక్షణాలు చిహ్నాలు
(కొన్ని మార్లు కొద్ది గంటలలో త్వరిత గతిన బరువు తగ్గడం 10 శాతం కన్నా ఎక్కువ వున్నప్పుడు సమస్యను తీవ్రంగా పరిగణించవలసి వుంటుంది.
కొన్ని సార్లు వేరే జబ్బు లక్షణాలతో కలిసి వుండి గుర్తించడం కష్టం కావచ్చు.
(నులి పురుగులు, నట్టలు, నులిపాములు, ఏలిక పాములు)
వివరణ
లక్షణాలు
పై బాగాలలో వున్న ఏలిక పాములు కడుపులో నొప్పి కలిగిస్తాయి.
బలహీనత, విరేచనాలు, ఆకలి లేక పోవడం బరువు తగ్గిపోవడం, వాంతులు, రక్తహీనత, పౌష్ఠికాహార లోపం, విటమిన్లు, ధాతువులలోపం, కొవ్వు పదార్ధాల, ప్రోటీన్ల లోపం వల్ల లక్షణాలు కలుగజేస్తాయి.
గుద ద్వారము వద్ద దురద, మానం వద్ద దురద, నిద్రలేమి, ప్రక్కలో మూత్రం పోయడం, కడుపులో నొప్పి వంటి లక్షణాలు, నులి పురుగులు వల్ల కలిగే ఇన్ ఫెక్షన్లు కనబడుతాయి.
కారణాలు
బద్దె పురుగులు
వీటిలో చాలా విభజనలు ఉంటాయి. ఇవి ముఖ్యంగా జీర్ణ వ్యవస్ధలో చొచ్చుకుని పోతాయి. అక్కడ నుండి ఇవి ఆతిధేయులు (HOST) నుంచి ఆహారాన్ని గ్రహిస్తాయి.(పీల్చుకుంటాయి.)
హాని కలిగించే కారణాలు
నివారణోపాయాలు
అల్సర్ అంటే ఎమిటి ?
వ్రణము, పుండు, చీము, కురుపు- వ్రణము లేదా పుండు అనే పదం శరీరంలో ఏ భాగంలోనైనా దీర్ఘకాలికంగా మానకుండా వున్న సందర్భములో వాడుతారు.
అన్నవాహికము లోపల ఈ పుండ్లు ఏర్పడుతాయి. జీర్జాశయంలో ఏర్పడిన వాటిని జీర్ణాశయం కురుపులు లేదా వ్రణాలు అని, చిన్న ప్రేవులలో మొదటిభాగం ఏర్పడే సందర్భంలో చిన్న ప్రేవుల వ్రణము అని సంభోదిస్తారు.
వ్రణాలు లేదా కురుపులవడానికి కారణాలు ఏవి ?
హెలికోబాక్టర్ పైలొరి అనే సూక్ష్మక్రిములు ముఖ్యంగా ప్రేవులలో ఏర్పడే కురుపులకు కారణమవుతాయి.
జీర్జాశయంలో ఉత్పన్నమయే ఆమ్లాలు ద్రవాలు అన్నవాహిక లోపలి స్ధలంలోని కణజాలాన్ని కాల్చివేసినట్లు చేయడం మూలాన ఈ కురుపులు ఏర్పడడానికి దోహదపడతాయి. ఈ విధంగా జీర్ణాశయంలో ఆమ్లాలు అవసరం కంటే ఎక్కువ మోతాదులో ఉత్పన్నమయినప్పుడు, లేదా అన్నవాహిక లోపలి తలపు కణజాలం ఏదో ఇతర కారణాల మూలంగా చెరిగి పోయి దెబ్బతిని ఉన్నప్పుడు అటువంటి భాగంపై ఈ ఆమ్లాల ప్రభావం మూలాన వ్రణాలు ఏర్పడుతాయి.
ముందుగానే ఈ వ్రణాలు వున్న వారిలో శారీరక లేక మానసిక ఒత్తిడి అధికమయినప్పుడు ఇవి మరికొంత బెరచినట్టు అవుతాయి (ఆమ్లాలు అధిక ప్రభావం చూపుతాయి)
నొప్పిని నివారించే కొన్ని మందులు దీర్ఘకాలం వాడడం మూలంగా కూడా ఈ వ్రణాలు ఏర్పడవచ్చు.
దిగువ చూపిన లక్షణాలు వ్రణాలలో కనబడవచ్చును
ఏదైనా ఆహారం లేక ద్రవ పదార్థాలు తీసుకొన్న వెంటనే తెరుపునిచ్చిన భావము కలగడం. తదుపరి రెండు మూడు గంటల తరువాత మరల మొదటికి వచ్చి లేక ఇంకా లక్షణాలు దిగజారిన భావన కలగడం. ఈ లక్షణం సాధారణంగా ఆంత్రమూలము (ప్రధమంధ్రము) లో వున్న వ్రణాలలో కనపడుతుంది.
ఏదైనా ఆహారం తిన్న లేక త్రాగిన తరువాత లక్షణాలు పెరిగిన భావన, ఇది అన్నాశయంలో వున్న వ్రణాలలో కనబడుతుంది.
కడుపు నొప్పి బాధతో రాత్రిళ్ళు నిద్రలోంచి మెలుకువ రావడం, కడుపు బరువుగా, పట్టినట్టుగా, ఉబ్బినట్టుగా, మండుతున్నట్టుగా సన్నటినొప్పి వున్నట్టుగా భావన కలగడం. వాంతులు, అనుకోని రీతిలో బరువు తగ్గడం.
సులువుగా తీసుకోకలిగే నివారణోపాయాలు: -
వ్రణము పరిస్థితి దిగజారుతున్నప్పుడు హెచ్చరిక చేసే గుర్తులు.
* వివిధ రకాల శరీర భాగాలైన నోరు, గొంతు, ఊపిరితిత్తులు, కడుపు, కిడ్నీ, మూత్రపిండాలకు వచ్చే క్యాన్సర్ వ్యాధికి ప్రధాన కారణం పొగాకు వాడకమే.
* పొగాకు వాడకం గుండె, రక్త నాళాల వ్యాధికి దారి తీస్తుంది. ఇంకా హార్ట్ ఎటాక్, ఛాతీలో నొప్పి, హృద్రోగంతో ఆకస్మిక మరణం, మెదడుకు పక్షవాతం, నాడీ సంబంధ వ్యాధులకు కూడా పొగాకు దోహదం చేస్తుంది.
* పురుషుల్లో, మహిళల్లో పొగాకు/ధూమపానం వల్ల కలిగే దుష్ప్రభావాలు
పొగాకును మానటం వల్ల కలిగే సామాజిక లాభాలు:
*1* ఏదో ఒక పని చేయటం
*2* లోతైన శ్వాస తీసుకోవటం
*3* మంచి నీరు తాగటం
*4* తర్వాత సిగరెట్ / పొగాకు వాడకాన్ని జాప్యం చేయటం.
11. మీలో మీరు మంచి గురించి మాట్లాడుకోండి.
12 మీకు మీరు ప్రతిఫలం ఇచ్చుకోండి
13. ప్రశాంతత చిట్కాలను ప్రతిరోజూ సాధన చేయండి. ఉదాహరణకు యోగా, నడక, ధ్యానం, డ్యాన్సు, సంగీతం, తదితరాలు
14. కెఫీన్, ఆల్కహాలు (మత్తు /మద్యం) వాడకాన్ని తగ్గించండి.
15. పౌష్ఠికాహారంతో కూడిన భోజనం చేయండి చురుకుగా ఉండండి.
ప్రథమ చికిత్స – చేయవలసిన పనులు :
ఎ) వ్యక్తికి ధైర్యమును చెప్పుట
బి) విషము వ్యాపించకుండా చేయుట
సి) వైద్య సహాయమును కల్పించుట
చేయవలసిన పని (చికిత్స) :
ప్రథమ చికిత్స (కార్య నిర్వహణము) :
ఏ కుక్కకాటు అయినా, పాముకాటుకు చేయవలసిన ప్రథమ చికిత్సనే చేయండి. వెంటనే ప్రథమ సహాయము అత్యధిక ప్రయోజనకరము. గాయమును సబ్బునీళ్ళతో బాగా కడగాలి.
పెద్ద వయసయింది - వాడుక భాష
మనిషి వయసు పెరగడం అనేది పుట్టిన దినం నుంచి మొదలవుతుంది. పసి బిడ్డ పెరిగి, వృద్ధి చెంది ప్రౌఢ వయస్సుకు చేరుతుంది. శరీరం, అంతర్ అవయవాల కార్యకలాపాలు తగ్గు ముఖం పట్టినపుడు వయసు మీదపడుతుంది అంటారు. ఇది మెల్ల మెల్లగా మరణానికి దారి తీస్తుంది. (అవయవాల వయోపరిమితి పూర్తి అయినట్టు భావిస్తారు. దీనినే సహజ మరణం అని కూడా అంటారు.
వయసు మీరే కొద్దీ జరిగే కొద్ది మార్పులు క్రింద సూచించబడ్డాయి అవి :-
మెదడు మరియు నాడీ వ్యవస్థ
మనుషుల వయసు పెరిగే కొద్దీ మెదడులోని నాడీకణాల సంఖ్య కొద్ది మోతాదులో తగ్గుతూ పోతుంది. చాలా ఇతర అంశాలు ఈ నష్టాన్ని పూడ్చడానికి సహాయం చేస్తాయి. ఈ మార్పుల కారణంగా మెదడు అంత చురుకుగా పనిచేయకపోవచ్చు. అందుకని ముసలివారు పనులు కొద్దిగా నెమ్మదిగా చేయడం జరుగుతూ వుంటుంది. ఏ మాటైనా అర్ధం చేసుకోడానికి కొంత సమయం తీసుకుంటారు. వయసు పెరిగే కొద్దీ చిన్న చిన్న మాటలు మరచిపోవడం, ఏ విషయాలైనా కొంత కాలమే గుర్తు పెట్టుకోగలగడం, కొత్త విషయాలు నేర్చుకోలేకపోవడం, కొన్ని మాటల పేర్లు, స్థలాల పేర్లు ముందు వెంటనే గుర్తు చేసుకోలేక పోవడం వంటి మార్పులు కనబడుతూ వుంటాయి.
60 సంవత్సరాలు పై బడిన తరువాత వెన్నుపాములో వున్న కణాల సంఖ్య తగ్గుతూ పోతుంది. వయసు మీరిన వారిలో సర్శాజ్ఞానం తగ్గడం గమనిస్తారు. కాబట్టి ముసలి వారిలో గాయాలు, ఎవో జబ్బులు, సమస్యలు ఎక్కువగా కనబడే అవకాశాలు పెరుగుతాయి.
వ్యాధి నిరోధక వ్యవస్థ
వయసు పెరిగే కొద్ది వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఈ తగ్గుదల కారణంగా క్యాన్సరు మరియు నుమానియా, జబ్బులు (ఊపిరితిత్తుల నిమ్ము)
మొదలైన సూక్ష్మక్రిమి సంపర్కాలు (Infections) అధికంగా రావడం మొదలవుతుంది.
వెన్నునొప్పి అనేది మెడ క్రింది భాగమునుండి, తుంటి ఎముక బంధనము వరకు వచ్చునొప్పి.
కారణాలు:-వడదెబ్బ, దీనినే ఎండదెబ్బ అని కూడా అంటారు ఎక్కువ ఉష్ణోగ్రతల తాకిడికి గురైన కారణంగా శరీరంలోని వేడిని నియంత్రించే విధానం విఫలమయి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది. చాలా వేడియైన వాతావరణం లేదా చురుకైన పనులవలన కలిగే అధిక వేడిని శరీరం తట్టుకోలేనప్పుడు ఇది సంభవిస్తుంది. అధిక ఉష్ణోగ్రతలు, శరీరం యొక్క ప్రాధమిక అవయవాలు విఫలమయ్యేలా చేస్తాయి.
వేడికి సంబంధించిన సమస్యలలో వడదెబ్బ చాలా తీవ్రమైనది. ఇది తరచుగా, వ్యాయామం నుండి లేదా వేడి వాతావరణంలో, సరియైన మోతాదులో ద్రవపదార్థాలని తీసుకోకుండా బరువైన పనిని చేసినప్పుడు కలుగుతుంది
ఈ వడదెబ్బ ఎవరికైనా వచ్చేది అయినప్పటికీ, కొంతమంది మాత్రమే దీనికి గురౌతారు. వారిలో పిల్లలు, క్రీడాకారులు, అతిమూత్ర వ్యాధి ఉన్న వ్యక్తులు, మద్యము సేవించువారు మరియు విపరీతమైన సూర్యరశ్మికి మరియు వేడిమి అలవాటు లేనివారు ఉన్నారు. కొన్ని మందులు కూడా మనిషిని వడదెబ్బకు గురయేలా చేస్తాయి.
వడదెబ్బలో కనబడే అతి ముఖ్య లక్షణం స్పష్టంగా అధికమయిన శరీర ఉష్ణోగ్రత(104 డిగ్రీల ఫారన్ హీట్ కంటే ఎక్కువ) దీనితో పాటు వ్యక్తిగత ప్రవర్తనలో మార్పులు కూడా కనబడుతాయి _ ఇవి అయోమయం నుంచి అపస్మారక స్థితి వరకూ వుండవచ్చును.
ఇతర గుర్తులు మరియు లక్షణాలలో ఈ క్రింది ఇచ్చినవి ఉంటాయి:
వడదెబ్బ కొనసాగితే, ఈ క్రింద ఇచ్చిన త్రీవ్ర లక్షణాలు కలుగుతాయి
జ్వరము 102 ఫారన్ హీట్ కన్నా ఎక్కువ ఉండి, స్పృహ కోల్పోవడం, కంగారు లేదా అకస్మాత్తుగా వ్యాధిరావడం జరిగితే తక్షణమే అత్యవసర వైద్య సహయం తీసుకోండి.
వడదెబ్బ తగలకుండా ఉండడానికి, బయట పనులు చేసేటప్పుడు ఎక్కువగా పానీయాలు త్రాగి శరీర ఉష్ణోగ్రతని మాములుగా ఉంచుకోవాలి. కెఫీన్ మరియు మద్యానికి దూరంగా ఉండండి. ఎందుకంటే అవి జల వియోజనాన్ని కలిగిస్తాయి. లేతరంగు మరియు వదులైన దుస్తులను ధరించాలి మరియు తరచు నీరుని త్రాగడానికి మరియు శరీర నీటి స్థాయిని తగిన స్థాయిలో ఉంచడానికి విరామం తీసుకోండి.
ఆధారము : Mayoclinic.com
శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. ఇది జీర్ణప్రక్రియకు తోడ్పడే రసాలను ఉత్పత్తి చేస్తుంది. కొందరు అధికంగా బరువు పెరగడం, కొవ్వు ఎక్కువగా పెరిగిపోవడం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, డయాబెటిస్ వంటి కారణాల వల్ల కాలేయం కొవ్వును తొలగించలేకపోతుంది. దీనివల్ల కొవ్వు పదార్థాలు కాలేయంలో నిలువ ఉండిపోతాయి. కాలేయం సాధారణ పరిమాణం కంటే పెద్దగా అవుతుంది. సామర్థ్యం తగ్గిపోతుంది. దీన్నే ఫ్యాటీలివర్ అంటారు. ఇతర సమస్యలకోసం ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నప్పుడు ఈ సమస్య బయటపడుతూ ఉంటుంది.
కారణాలు
కాలేయ వ్యాధులకు ప్రధాన కారణం హెపటైటిస్ ఇన్‌ఫెక్షన్. ఇదే కాకుండా ఆల్కహాల్, దీర్ఘకాలంపాటు మందులు వాడటం, విల్‌సన్స్ డిసీజ్, రోగనిరోధక వ్యవస్థలో కలిగే లోపాలు ఫ్యాటీ లివర్‌కు కారణమవుతాయి. డయాబెటిస్ ఉన్న వారు, స్థూలకాయులు, హైపర్‌ట్రైగ్లిసరిడీమియా, ఇన్సులిన్ రెసిస్టెంట్ ఉన్న వారు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
నిర్థారణ పరీక్షలు
కంప్లీట్ బ్లడ్ పిక్చర్(సి.బి.పి), లివర్ ఫంక్షన్ టెస్ట్(ఎల్.ఎఫ్.టి), సి.టి లివర్, యూఎస్‌జి అబ్డామిన్, లివర్ బయాప్సీ, లిపిడ్ ప్రొఫైల్, ఎఫ్‌బిఎస్, పిఎల్‌బిఎస్, ఆర్‌బిఎస్ పరీక్షలు చేయించడం ద్వారా కాలేయ పనితీరు, వ్యాధులను నిర్ధారించుకోవచ్చు.
చికిత్స
కాలేయ వ్యాధులకు హోమియోలో చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. ఫ్యాటీ లివర్ సమస్యను హోమియో మందులతో పూర్తిగా తగ్గించుకోవచ్చు. రోగి శారీరక, మానసిక తత్వాన్ని పరిశీలించి, వ్యాధి తీవ్రతను బట్టి మందులు ఇవ్వడం జరుగుతుంది. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఈ మందులు వాడితే వ్యాధి త్వరగా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది.
కార్డస్‌మరైనస్ :ఈ మందు కాలేయం, నరాల మీద మంచి ప్రభావం చూపుతుంది. ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉండటం, శరీరంలో నీరు పట్టడం, కాలేయం పరిమాణం పెరగడం, ఆకలి మందగించడం, మలబద్ధకం, అర్షమొలలు, శ్వాసతీసుకోవడం కష్టంగా ఉండటం వంటి లక్షణాలు ఉన్నవారు ఈ ఔషధం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఛెలిడోనియమ్ :కాలేయం సమస్యలు, తల బరువుగా ఉండటం, తల తిరగడం, కాలేయం వాపు, పచ్చకామెర్లు, పిత్తాశయంలో రాళ్లు, మలబద్ధకం, ఆయాసం, మెడనొప్పి, కుడి భుజంనొప్పి, శరీరం పచ్చరంగులోకి మారడం వంటి లక్షణాలతో బాధపడుతున్నవారు ఉపయోగించదగిన మందు.
సియోనాంతస్ :ఇది కాలేయం, ప్లీహం మీద మంచి ప్రభావం చూపుతుంది. మలేరియా, రక్తహీనత, ప్లీహం వాపు, కుడిపైపు కడుపు నొప్పి, కాలేయ వాపు, నడుం నొప్పి, అర్జంటుగా మూత్రవిసర్జన చేయాల్సి రావడం వంటి లక్షణాలు ఉన్నవారికి ఉపకరిస్తుంది. లైకోపోడియమ్ : కొంచెం ఆహారం తీసుకోగానే కడుపు నిండిన ఫీలింగ్ కలగడం, కాలేయం వద్ద నొప్పి, శరీరంలో నీరు పట్టడం, కాలేయ వాపు, అర్షమొలలు, మలబద్ధకం, ఉత్సాహంగా లేకపోవడం, తీపిపదార్థాలంటే ఇష్టపడుతుండటం, చల్లదనానికి, రాత్రివేళ నొప్పి నుంచి ఉపశమనంగా అనిపించడం వంటి లక్షణాలు ఉప యోగించవచ్చు.
కాల్కేరియా కార్బ్ :తెల్లగా, లావుగా ఉండి ఎక్కువ చెమటలు పట్టే తత్వం ఉన్నవారికి మంచి మందు. వంగినపుడు కాలేయం వద్ద నొప్పి, కడుపు ఉబ్బడం, ఇంగ్వైనల్ మీసెంటరిక్ గ్రంథుల వాపు ఉంటుంది. చల్లదనానికి, నిలబడినపుడు ఈ లక్షణాలు ఎక్కువవుతుంటాయి. పొడి వాతావరణంలో నొప్పి ఉన్న వైపు పడుకుంటే ఉపశమనం ఉంటుంది. ఈ తరహా లక్షణాలతో బాధపడుతున్న వారు ఈ మందు వాడవచ్చు.
మెర్క్‌సాల్ :దాహం అధికంగా ఉండటం, జీర్ణశక్తితగ్గడం, కాలేయ వాపు, పచ్చకామెర్లు, రక్తం, జిగురుతో కూడిన విరేచనాలు వంటి లక్షణాలతో బాధపడుతున్నప్పుడు ఈ మందు బాగా పనిచేస్తుంది.
మాగ్‌మూర్ :ఇది కాలేయంపైన మంచి ప్రభావం చూపుతుంది. జీర్ణశక్తి లోపించిన మహిళలకు ఇది దివ్యౌషధం. గర్భాశయ సమస్యలతో బాధపడే వారు ఉపయోగించవచ్చు. నాలుకు పచ్చరంగులో ఉండటం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం, అర్షమొలలు వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఉపయోగించదగిన మందు.
నక్స్‌వామికా :తేన్పులు, వికారం, వాంతులు, జీర్ణశక్తిలోపించడం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నప్పుడు నక్స్‌వామికా మందు పనిచేస్తుంది.
ఫాస్‌ఫరస్ :ఫ్యాటీ లివర్, పచ్చకామెర్లు, కడుపునొప్పి, ఆహారం తీసుకున్న వెంటనే వాంతులు, మలబద్ధకం వంటి వ్యాధి లక్షణాలు ఉన్నప్పుడు ఉపయోగించదగిన మందు.
నివారణ
డాక్టర్ టి. ప్రభాకర్, ఎండి హోమియో
హోమియో కేర్ ఇంటర్నేషనల్
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు.
ముఖం మీద అత్యంత తీవ్రమైన నొప్పి కలిగించే వ్యాధి ట్రైజెమినల్ న్యూరాల్జియా. ప్రతి 15 వేల మందిలో ఒక రు ఈ సమస్యకు లోనవుతుంటారు. సాధారణంగా 50 ఏళ్లు దాటిన వారిలోనే కనిపించే ఈ వ్యాధికి గురయ్యే వారిలో పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగా గురవుతుంటారు. ముఖం మీదుగా వెళ్లే ట్రైజెమినల్ నరానికి అనుబంధంగా ఆప్తాల్మిక్, మ్యాక్జిలరీ, మాండిబులార్ అనే మూడు నరాల విభాగాలు ముడివడి ఉంటాయి.
ఇవి ముఖ సంబంధమైన స్పర్శనూ, నొప్పినీ ప్రసరింపచేస్తాయి. ఆప్తాల్మిక్ నరం, నుదుటి కీ, మాక్జిలరీ నరం చెంపలకూ, ముక్కుకూ, మాండిబులర్ నరం దవడభాగానికి ఈ నొప్పినీ, స్పర్శనూ ప్రసరింప చేస్తాయి. ఇవి కాకుండా మోటార్ నరం అనే ఒక నరం, నమలడానికి సంబంధించిన కండరాలకు ప్రసరింపచేస్తుంది.
మరీ తీవ్రం
ముఖమంతా విద్యుత్తు తాకినట్లు తీవ్రమైన నొప్పి వస్తుంది. కాకపోతే నొప్పి కొద్ది క్షణాలే ఉండి తగ్గిపోతుంది. ఈ నొప్పి, మాక్జిలరీ, మాండిబులార్ విభాగాల్లోనే ఎక్కువగా వస్తుంది. బలమైన గాలి వీయడం, చల్లని పదార్థాలు తినడం, గడ్డం గీసుకోవడం, బ్రష్ చేసుకోవడం వ ంటివి ఈ నొప్పిని ప్రేరేపిస్తుంటాయి. ఈ నొప్పి కొద్ది క్షణాల నుండి, కొద్ది నిమిషాల దాకా కొనసాగుతుంది. అయితే ఈ నొప్పి రోజుకు ఏ 25 సార్లో వచ్చిపోతూ ఉంటుంది.
ఈ నొప్పి ఎప్పుడు వస్తుందనేది ఎవరికీ తెలియదు. తరుచూ వచ్చే ఈ నొప్పి కారణంగా వృత్తి పరమైన పనుల మీద మనసు లగ్నం కాదు. ఫలితంగా జీవన ప్రమాణాలు పడిపోతాయి. మామూలుగా అయితే ఈ నొప్పి ముఖానికి ఏదో ఒక వైపునే వస్తుంది. కానీ, చాలా అరుదుగా కొందరికి రెండు వైపులా రావచ్చు. సమస్య ఒకసారి మొదలైతే, రోజులు గడిచే కొద్దీ, ఎక్కువ సార్లు నొప్పి రావడం, మరింత ఎక్కువ తీవ్రతతో రావడం జరుగుతూ ఉంటుంది. నొప్పి ఇలా నిరంతరం వేధిస్తూ ఉండడం వల్ల దాన్ని తట్టుకోలేక కొందరు ఆత్యహత్యలు చేసుకుంటారు. అందుకే ఈ వ్యాధిని సూసైడ్ డి సీజ్ అని కూడా అంటారు.
ట్రైజెమినల్ న్యూరాల్జియా వ్యాధి రావడానికి గల సరియైన కారణం ఇంతవరకూ తెలియదు. కాకపోతే పక్కపక్కగా వెళే9్ల రక్తనాళం, రక్త దమనుల మధ్య సహజంగా దూరం లేకపోవడం ఈ వ్యా«ధిగ్రస్తుల్లో కనిపిస్తుంది. ఒకదానికి ఒకటి ఆనుకోవడం వల్ల నిరంతరం వచ్చే ప్రకంనలే నరాల్లో ఒక కంపరాన్ని, నొప్పినీ కలిగిస్తాయనేది ఒక పరిశీలన.
కానీ, నొప్పికలిగించే కారణాలేమిటన్నది ఇప్పటికీ అంత కచ్ఛితమైన సమాచారం లేదు. ఎంఆర్ఐ పరీక్ష ద్వారా ఈ సమస్యను గుర్తించే వీలుంది. ప్రారంభంలో ఈ వ్యాధి చికిత్స మందులతోనే ఉంటుంది. కార్బమేజ్‌పైన్ అనే మాత్రల్ని ఈ వ్యాధికి ఎక్కువగా ఇస్తారు. దీనికి తోడు బాక్‌లోఫఫెన్, లామోట్రిజిన్, ఫెనిటాయిన్, డులాక్సిటిన్ వంటి మందులు కూడా ఈ నొప్పిని తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. కాకపోతే దీర్ఘకాలికంగా ఈ సమస్య ఉన్న వారికి మందుల ద్వారా 50 నుంచి 60 శాతమే ఉపశమనమే లభిస్తుంది.
ఈ నొప్పి తగ్గించడానికి పలురకాల శస్త్ర చికిత్సలు ఉన్నాయి. మాక్రోవాస్కులర్ డికాంప్రెషన్ అనేది వాటిలో ప్రధానమైనది. మైక్రోస్కోప్ లేదా ఎండోస్కోప్ విధానంలో చెవి వెనుక భాగంలో ఒక చిన్న కోతతో ఈ శస్త్ర చికిత్స చేస్తారు. రక్తనాళం, దమని మధ్యదూరం పెంచడమే ఈ శస్త్ర చికిత్స ఉద్దే«శం వాటి మధ్య దూరాన్ని పెంచడానికి ఆ రెండింటి మధ్య 'సెల్ట్' అనే పదార్థాన్ని పెడతారు. ఈ శస్త్ర చికిత్స 90 శాతం మందికి శాశ్వత ఉపశమనం ఇస్తుంది. శస్త్ర చికిత్స జరిగిన కొద్ది రోజుల్లోనే తిరిగి తమ విధులకు హాజరు కావచ్చు. శస్త్ర చికిత్స తరువాత ఇక ఏ మందులూ అవసరం ఉండదు.
డాక్టర్ టివిఆర్‌కె మూర్తి
న్యూరో సర్జన్
కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్
ఆధారము : ఆయురారోగ్యాలు బ్లాగ్
ఆస్తమా లేదా ఉబ్బసం వ్యాధి సాధారణంగా అన్ని వయస్సుల వారిలో వచ్చినా, నాలుగింట ఒకవంతు పది ఏళ్లలోపు పిల్లలో కనిపిస్తుంది. ఆడపిల్లలలోకంటే మగపిల్లలలో ఇది ఎక్కువగా వస్తుంది. ఇది తెరలు తెరలుగా ఆయాసంతో శ్వాసనాళాలు సంకోచం చెందడం వలన తెమడతోపాటు వస్తుంది. ఛాతీలో పిల్లికూతల వంటి శబ్దంతో, బరువుగా ఉంటూ, ఒక్కొక్కసారి కొంచెం దగ్గుతో కూడుకుని వస్తుంది.
ఆస్తమాను ప్రధానంగా రెండు రకాలుగా చెప్పుకోవచ్చును. అవి - ఇడియోపతిక్ (ప్రైమరీ ఆస్తమా), సింప్టమాటిక్ (సెకండరీ ఆస్తమా). రెండవరకం ఆస్తమా కొన్ని ఇతర వ్యాధులతో అను బంధంగా వస్తుంది. గాయిటర్, రికెట్స్, మలేరియా, నరాల వ్యాధులు, నట్టలు మొదలైన వాటితో రెండవరకం ఆస్తమా వస్తుంది.
కారణాలు, లక్షణాలు: జన్యుసంబంధంగా వచ్చే ఆస్తమా కంటే ఇతర కారణాల వలన వచ్చేవే ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు వంశపారంపర్యంగా కనిపిస్తుంది. ఆస్తమా ఎటాక్ ఎలా వస్తుం దనే అంశానికి సంబంధించి వివిధ సిద్ధాంతాలు ఉన్నప్పటికీ, సింపథిటిక్ నరాలవ్యవస్థ సమస్యాత్మంగా మారినప్పుడు ఈ వ్యాధి మరింత తీవ్రమవుతుందని తెలుస్తున్నది. చాలామంది రోగులలో పువ్వుల వాసనతో అటాక్ వస్తుంది. భయంతో, ఆందోళనతో, కోపంతో కూడా ఆస్తమా అటాక్ రావచ్చును. కొన్ని రకాల ఆహారపదార్థాల వలన, లేదా వివిధ వాతావరణ మార్పుల వలన కూడా ఉబ్బసం ప్రకోపిస్తుంది. ఉదాహరణకు కొంత మందికి కోస్తా ప్రాంతానికి వెళితే వస్తుంది. మరి కొంతమందికి తేమ, చలి ప్రదేశాలలో వస్తుంది.
సాధారణంగా ఆస్తమా అకస్మాత్తుగా వస్తుంది. ముఖ్యంగా రాత్రి పూట ఎక్కువగా వస్తుంది. కొన్ని సార్లు చిన్నపిల్లలలో ముందు జలుబు, దగ్గుతో మొదలై, ఉబ్బసంలోకి దింపుతుంది.
కొన్నిసార్లు ఛాతిలో బరువుగా ఉండి, ఒకటి రెండు రోజుల తరువాత ఉబ్బసం వస్తుంది. కాని చిన్నపిల్లలలో ఎక్కువగా అకస్మాత్తుగా రాత్రిపూట ఆయాసం వచ్చి నిద్రలోనుండి లేస్తారు. ఉక్కిరిబిక్కిరి అవుతారు.
బాధతో, భయంతో చేతిని ఛాతీపై పెట్టుకుని, ఊపిరి అందక బాధపడుతారు. కొంత దగ్గు, తెమడ రావచ్చును. పిల్లికూతలు వినబడు తాయి. కొన్నిసార్లు కాళ్లుముడుచుకుని, నడుమును ముందుకు వంచి కూర్చుంటే కాని ఉపశమనంగా ఉండదు. ముఖం పాలిపోయి, భయంగా ఉంటుంది. ముక్కు సాగదీస్తూ దీర్ఘంగా శ్వాసతీస్తూ ఉంటారు. మాట్లాడటం కష్టంగా ఉం టుంది. ఒళ్లు చల్లబడుతుంది. ఉబ్బసం కొన్ని గంటలనుంచి రెండుమూడు రోజుల వరకూ కొనసాగవచ్చును. ఉబ్బసం అటా క్ తగ్గిన తరువాత నీరసంతో నిద్రపోతారు.కొన్నిసార్లు చల్లని వాతావరణంలో ఉబ్బసంతో పాటు బ్రాంకైటిస్ కూడా రావ చ్చును. అప్పుడు దగ్గు కనపడుతుంది.ఆస్తమా వ్యాధి వచ్చిన వారి తెమడలో ఆక్ట్రాహెడ్రల్ క్రిస్టల్స్ ఉంటాయి. అందువలన ఈ తెమడ చల్లని నీళ్లలో కరుగదు.
వ్యాధి నిర్ధారణ: పైన పేర్కొన్న లక్షణాలతో ఉబ్బసం వచ్చి నప్పుడు దానిని ఆస్తమాగా నిర్ధారించవచ్చు. రిట్రో ఫారిం జియల్ ఆబ్సెస్, డిఫ్తీరియా, న్యుమోనియా, గుండె జబ్బులు మొదలైన వాటిలో వచ్చే ఆయాసం శ్వాసతీసుకునే సమ యంలో వస్తుంది. కాని ఉబ్బసవ్యాధిలో ఆయాసం శ్వాస బైటకు వదిలే సమయంలో వస్తుంది. సాధారణంగా ఆస్తమా ప్రాణాంతక వ్యాధికాదు. సరైన సమయంలో, సరైనచికిత్స చేస్తే దీనినుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు. కాని కొన్ని వ్యాధులతో కూడుకుని ఉన్నవారిలో ఇది ప్రాణాంతకంగా మార వచ్చు. ఉదాహరణకు గుండెజబ్బులు, మూత్రపిండాల వ్యాధు లలో తీవ్రమైన ఆస్తమా అటాక్‌వస్తే అది ప్రాణాంతకం కావ చ్చు. చిన్నపిల్లలలో న్యుమోనియా, క్షయవ్యాధులతో కలిసి ఉబ్బసం వస్తే కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారవచ్చు.
హోమియో చికిత్స: మొదట ఉబ్బసాన్ని తీవ్రం చేసే కారణాన్ని తెలుసుకోవడం ముఖ్యం. నట్టలుకాని, అజీర్ణంవల్ల కాని, పైల్స్ వల్ల కాని ఆయాసం వస్తున్నప్పుడు ఆ కారణానికి చికిత్స చేయాల్సి ఉంటుంది.
వాతావరణ మార్పుల వలన, ఆహారపు అలవాట్ల వలన వస్తే వాటిని కొంత నియంత్రించినప్పుడు ఉబ్బసం త్వరగా నయ మవుతుంది. తీవ్రమైన ఉబ్బసంవచ్చి ఊపిరి తీసుకోలేనంతగా ఉండి, తరచుగా చాలారోజుల వరకూ వస్తూ ఉన్నప్పుడు కొన్ని సార్లు ఆసుపత్రిలోఉంచి ఆక్సిజన్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఒక కాలపరిమితితో, ఒక క్రమపద్ధతిలో హోమియో వైద్యం చేసుకున్నాక చాలా వరకూ ఉబ్బసం వ్యాధిని, ముఖ్యంగా చిన్నపిల్లలో ఈ వ్యాధిని నయంచేయవచ్చు.
ఆధారము: వార్త
మన జీవన విధానంలో వేడి నీళ్ళు కొన్ని అద్భుతాలనే చేస్తాయి. ఇంకా ఎక్కువగా నీరుత్రాగడం వల్ల కూడా మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. చాలా మందికి మాత్రం వేడి నీళ్ళు లేదా గోరువెచ్చనీ నీరు త్రాగడం వల్ల అందులో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న విషయం చాలా మందికి తెలియదు. కాబట్టి, ఇంతటి ఎఫెక్టివ్ వేడినీళ్ళను వదిలేసి, చల్లటి నీరు త్రాగడంలో ప్రయోజనం లేదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఒక రోజుకు 7-8గ్లాసుల నీరు, ప్రతి ప్రాణికీ అవసరం అవుతుంది. అందువల్ల చాలా మంది కోల్డ్ వాటర్ లేదా నార్మల్ వాటర్ తీసుకోవడం జరుగుతుంటుంది. అయితే, కోల్డ్ వాటర్ లేదా నార్మల్ వాటర్ కు బదులు వేడి నీళ్ళు లేదా గోరువెచ్చని నీటితో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అంధిస్తుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయం.
నీళ్ళ గురించి పచ్చి నిజాలు... ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మం మరియు జుట్టుకు కొన్ని అశ్చర్యకరమైన ప్రయోజనాలను అంధిస్తుందని నిర్ధారించారు. మరి హాట్ వాటర్ గురించి ప్రయోజనాలను తెలుసుకోవాలని మీకు కూడా అనిపిస్తోందా? హాట్ వాటర్ నేచురల్ బాడీ రెగ్యులేట్ చేస్తుంది. ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు స్వచ్చమైన వేడినీళ్ళతో మీ దినచర్యను ప్రారంభిస్తే భవిష్యత్తులో కూడా ఆరోగ్యకరమైన జీవితంను పొందవచ్చు. మరి హాట్ వాటర్ లోని ఆ అమేజింగ్ హెల్త్ & బ్యూటీ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి తెలుసుకోండి:
దగ్గు, జలుబు మరియు గొంతు నొప్పి సమస్యలున్నప్పుడు వేడినీళ్ళు త్రాగడం ఒక గొప్ప నేచురల్ హోం రెమడీ. ఇది నిరంతర వేధించి పొడి దగ్గును తగ్గించి, శ్వాసనాళాన్ని తేలికచేసి, సరైన శ్వాస పీల్చుకొనేందుకు సహాయపడుతుంది. అలాగే గొంతునిప్పిని నివారిస్తుంది.
హాట్ వాటర్ ను తీసుకోవడం వల్ల శరీరంను డిటాక్సిఫై చేస్తుంది మీరు అజీర్తి సమస్యలను తగ్గించుకోవాలన్నా లేదా శరీరంలోని మలినాలను బయటకు నెట్టివేయాలంటే ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఉదయం మరియు రాత్రి పడుకొనే ముందు వేడి నీళ్ళు త్రాగడం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వేడి నీళ్ళు త్రాగడం వల్ల శరీరంలో వేడి పుట్టి, చెమట పట్టడం ప్రారంభం అవుతుంది దాంతో శరీరంలోని టాక్సిన్స్ చెమట రూపంలో బయటకు నెట్టివేస్తుంది. మరింత మంచి ఫలితాల కోసం నిమ్మరసం మరియు తేనెను మిక్స్ చేసుకోవచ్చు.
రెగ్యురల్ గా క్రమంతప్పకుండా వేడి నీళ్ళు తీసుకోవడం ద్వారా మీ శరీరాన్ని తేమగా మరియు వెచ్చగా ఉంచుకోవచ్చు. ఇది డ్రై మరియు ఫ్లాకీ స్కిన్ కు చాలా గొప్పగా సహాయపడుతుంది. మరియు ఆరోగ్యకరమైన చర్మం నిర్వహించడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఇది శరీరం మొత్తంలో బ్లడ్ సర్కులేషన్ పెంచి శరీరానికి పింక్ గా చర్మఛాయను అంధిస్తుంది. అంతే కాదు ముఖంలో మొటిమలు మచ్చలు ఏర్పడకుండా సహాయపడుతుంది. హాట్ వాటర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మంలోపలి నుండి శుభ్రం చేస్తుంది.
హాట్ లేదా వార్మ్ వాటర్ తీసుకోవడం వల్ల మీ హెయిర్ సెల్స్ కు శక్తినందివ్వడానికి ఒక గొప్ప మూలం. ఇది వాటి నిరంతర క్రియలను పెంపొందిస్తుంది. దాంతో జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
రోగ నిరోధక శక్తి అంతంతమాత్రంగా ఉన్న బాధితుడు పోలెన్, లేదా దుమ్ము వంటి అలెర్జెన్ను లోనికి పీల్చుకున్నప్పుడు అలెర్జిక్ రినైటిస్, లేదా హే ఫీవర్ వస్తుంది. ఇది ఒంట్లో యాంటీబాడీల ఉత్పత్తిని పెంచేస్తుంది. ఈ యాంటీబాడీలు చాలావరకు హిస్టమైన్లుండే మాస్ట్ కణాలతో బంధం ఏర్పరచుకుంటాయి. పొలెన్, దుమ్ము, హిస్టమైన్ (ఇతర రసాయనాల) ద్వారా ప్రభావితమైనప్పుడు ఈ మాస్ట్ కణాలు విడుదలవుతాయి. ఇది దురద, వాపు, శ్లేష్మం ఉత్పత్తి వంటివాటికి దారితీస్తుంది. ఈ లక్షణాల తీవ్రత వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంటుంది. బాగా సున్నితంగా ఉండే వ్యక్తుల్లో హైవ్స్, దురద వంటివి కన్పించవచ్చు. మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత 370 లేక 98.60ఉంటే అది నార్మల్ అని అంటారు. శరీర ఉష్ణోగ్రత అంతకంటే ఎక్కువ ఉంటే అది జ్వరం అంటారు. సాధారణంగా 37.50 (100 ) వుంటుంది. జ్వరం అన్నది శరీరంలో వున్న ఏదో ఒక వ్యాధి లక్షణము మాత్రమే వ్యాధి ప్రభావము పెరిగే కొద్ది జ్వర తీవ్రత అధికమవుతుంది. 39.50 c లేదా 1030Fకు పైన ఉన్నా తప్పనిసరిగా డాక్టరు సలహా తీసుకోవాలి. సాధారణ కారణాలు: మలేరియా, టైఫాయిడ్, క్షయ, రుమాటిక్ జ్వరము, ఆటలమ్మ, గవదలమ్మ, ఊపిరితిత్తులు ఇన్ పెక్షన్, జలుబు, దగ్గు, టాన్సిలైటిస్, బ్రాంకైటిస్ మూత్రనాళాల ఇన్ ఫెక్షన్ మొదలైనవి. బ్యాక్టీరియా, వైరస్. సాధారణ జ్వరం లక్షణాలు: 37.50 C లేదా 1000 F ఆ పైన జ్వరం నమోదు. తలనొప్పి, చలితో కూడిన జ్వరం, కీళ్ళనొప్పులు, నోరు చేదుగా ఉండుట, అకలి తగ్గడం, మలబద్దకం, కొన్ని ప్రత్యేక సమయాలలో కలవరింతలు మొదలైనవి.
జ్వరం ఉన్నప్పుడు శరీరానికి అధిక కేలరీలు అవసరము అవుతాయి కనుక గ్లూకోజ్, హార్లిక్స్ లాంటి ద్రవ పదార్దాలు, పండ్ల రసాలు వంటివి ఆధికంగా తీసుకోవాలి. బియ్యం గంజి,సగ్గుబియ్యం గంజి,జావ, బార్లీ నీళ్ళు సులభంగా జీర్ణమై య్యే పదార్దాలు ఇవ్వాలి. కాఫీ, టీ లాంటి ద్రవ పదార్దాలు సాధారణ వేడి తో తీసుకోవాలి. పాలు, రొట్టె లాంటి పదార్దాలు తీసుకోవచ్చును. మాంసం, గుడ్డు, వెన్న, పెరుగు, నూనె పదార్దాలు తీసుకోరాదు.
చాలా మంది మహిళలు మూత్ర వాహిక ఇన్ఫెక్షన్ తో భాదపడుతూ ఉంటారు. కానీ ఇది గర్భవతి మహిళలలో సాదారణంగా ఉంటుంది. మహిళలు గర్భం దాల్చినప్పుడు,గర్భ హార్మోన్ శరీరం లోపల అభివృద్ధి చేస్తుంది. అలాగే మహిళ యొక్క మూత్ర నాళమునకు మార్పులు చేస్తుంది. మహిళ గర్భాశయం పెరుగుతున్న కొద్ది మూత్రాశయం మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇది పూర్తిగా మూత్రాశయం నుండి మూత్రాన్ని ఖాళీ చేయడంను నిరోధిస్తుంది. మూత్రాశయం లోపల మూత్రం ఉండుట వలన ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ వ్యాధి ప్రారంభ దశలో ఉన్నప్పుడే చికిత్స చేయించుకోవాలి. లేకపోతే మూత్రపిండాల వ్యాధి పెరుగుదలకు కారణం అవుతుంది.
ఉదరం యొక్క దిగువ భాగంలో తిమ్మిరి మూత్రాశయ ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలు మూత్ర వాహిక ఇన్ఫెక్షన్ మూత్రాశయ ఇన్ఫెక్షన్ కారణంగా వస్తుంది. దీని లక్షణాల గురించి తెలుసుకోండి. మూత్రం రంగు మారటం తరచుగా మూత్రవిసర్జన మూత్రవిసర్జన సమయంలో నొప్పి చెడ్డ వాసన హనీమూన్ సిస్టిటిస్ లక్షణాలు మీ హనీమూన్ ను పూర్తిగా కొన్ని భౌతిక పరిస్థితులతో భగ్నం చేయవచ్చు. లైంగిక కార్యకలాపాల కారణాలు, మహిళల మూత్ర మార్గంలో బాక్టీరియా ఒత్తిడి చేయవచ్చు. ఈ పరిస్థితిని హనీమూన్ సిస్టిటిస్ అంటారు. కొంతమంది స్త్రీలలో వారు లైంగిక చర్యలు కొనసాగించిన ప్రతి సమయంలోను మూత్ర వాహిక ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది సాధారణంగా గర్భ ప్రక్రియలో డయాఫ్రాగమ్ ఉపయోగించే మహిళల్లో కనిపిస్తుంది. మూత్రపిండాల వ్యాధి లక్షణాలు వాంతులు, చలితో కూడిన జ్వరం, వెన్నెముక కింది భాగంలో ఒక వైపు నొప్పి, వికారం వంటి లక్షణాలు ఉంటాయి. మూత్ర వాహిక సంక్రమణ కోసం ఇంటి నివారణలు బ్లూ బెర్రీలు బ్లూ బెర్రీలలో ఈ లక్షణాలను నిరోదించే అద్భుతమైన బాక్టీరియా ఒకటి ఉంది. ఇటీవల నిర్వహించిన అధ్యయనాలు ప్రకారం, బ్లూ బెర్రీ జ్యూస్ అనేది గర్భవతి అయిన మహిళల మూత్ర వాహిక ఇన్ఫెక్షన్ నిరోధించడానికి అద్భుతముగా పనిచేస్తుంది. మీరు మీ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఈ పండును జ్యూస్ గా తీసుకోవచ్చు. పైనాపిల్ పైనాపిల్ లో మూత్ర వాహిక ఇన్ఫెక్షన్ చికిత్సలో సమర్థవంతంగా మరియు అద్భుతంగా పనిచేసే యాంటీబయాటిక్ లక్షణాలున్నాయి. మూత్ర వాహిక ఇన్ఫెక్షన్ చికిత్సలో చాలా సమర్థవంతంగా పనిచేసే బ్రొమెలైన్ అనే ఎంజైమ్ పైనాపిల్ లో ఉంటుంది. మీరు మీ అల్పాహారం లేదా భోజనం తరువాత ఒక పైనాపిల్ పండును తీసుకోవాలి. అంతేకాక పైనాపిల్ ను జ్యూస్ గా కూడా తీసుకోవచ్చు. విటమిన్ సి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న రోగులకు వైద్యులు 5000 mg విటమిన్ సి ని సిపార్స్ చేస్తారు. మీ మూత్రాశయం ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్ సి లో ఉండే అసిడిఫీస్ అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది. హానికరమైన బ్యాక్టీరియా రాకుండా గొప్ప సామర్ధ్యం తో పనిచేస్తుంది. మీ మూత్రాశయంను ఆరోగ్యంగా ఉంచటానికి మంచి మొత్తంలో విటమిన్ సి ని తీసుకోవలసిన అవసరం ఉంది.
ఆధారము: తెలుగు.బోల్డ్ స్కై.కం
బొజ్జ :వయసు మీద పడుతున్న కొద్దీ పొట్ట కూడా పెరగటం సహజమే. పురుషులు పెద్దగా పట్టించుకోకపోవచ్చు గానీ ఇది ఎంతోమంది స్త్రీలకు పెద్ద సమస్యగానే పరిణమిస్తుంది. శరీరాకృతినే మార్చేసి మరింత వయసు ముదిరినట్టు చేస్తుంది మరి. ఇది అందానికే కాదు ఆరోగ్యానికీ చేటు కలిగిస్తుంది. శరీరంలో మిగతా భాగాల్లోని కొవ్వు కన్నా పొట్ట మీద పేరుకునే కొవ్వు చాలా ప్రమాదకరమైంది తెలుసా? ఇది గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు రావటానికీ దోహదం చేస్తుంది. అలాగని బాధ పడుతూ కూచోకుండా జీవనశైలిలో మార్పులు చేసుకోవటంతో పాటు కొన్ని రకాల వ్యాయామాలు చేయటంతో దీనిని తగ్గించుకునే ప్రయత్నం చేయటం చాలా అవసరం.
సైనికులు , పోలీసులు ప్రతి రోజూ కవాతు చేస్తారు . సైనికుల్లో ఎవరికైనా పొట్ట ,బొజ్జ రావడము చూడము కాని కొంతమంది లేకా పోలీసులందరికీ బొజ్జ కనబడుతూ ఉంటుంది. కారణము వారి శిక్షణ , ఆహార నియమావళి , క్రమబద్ధమైన వ్యాయామము .
ఎందుకొస్తుంది?వయసు పెరుగుతున్న కొద్దీ జీవక్రియలు మందగిస్తుంటాయి. దీంతో శరీరంలో కొవ్వు మోతాదూ నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది. పురుషుల్లో కన్నా స్త్రీలల్లోనే ఇది ఎక్కువ. మెనోపాజ్ అనంతరం చేతులు, కాళ్లు, తొడల వద్ద కొవ్వు తగ్గిపోతూ పొట్ట దగ్గర పేరుకుపోవటం ప్రారంభిస్తుంది. కడుపుని పట్టుకున్నప్పుడు చర్మం కింద చేతికి తగిలే కొవ్వు కన్నా.. లోపల అవయవాల చుట్టూ పేరుకునే కొవ్వు ఇంకా ప్రమాదకరం. ఇది వంశ పారంపర్యంగానూ రావొచ్చు. ముట్లుడిగిన తర్వాత కలిగే హార్మోన్ల మార్పు కూడా దీనికి దోహదం చేస్తుంది. బరువు పెరగకుండా బొజ్జ పెరుగుతున్నా ప్రమాదకరమే.
కొలుచుకుంటే సరిఎత్తు బరువుల నిష్పత్తిని (బీఎంఐ) బట్టి అధిక బరువును గుర్తించొచ్చు గానీ దీంతో శరీరంలో కొవ్వు శాతాన్ని తెలుసుకోలేం. నడుం చుట్టుకొలత ద్వారా పొట్ట భాగంలో కొవ్వు ప్రమాదకర స్థాయికి చేరుకున్న విషయాన్ని పసిగట్టొచ్చు. దీన్ని ఎలా చూడాలో తెలుసా?
తగ్గించుకునేదెలా?కొన్ని రకాల వ్యాయామాలు, ఆహారంలో మార్పులతో పొట్టను తగ్గించుకోవచ్చు.
వ్యాయామం:బొజ్జను తగ్గించుకోవటానికి రోజూ వ్యాయామం చేయటం అన్నింటికన్నా ఉత్తమమైన మార్గం. దీంతో బరువుతో పాటే పొట్ట కూడా తగ్గుతూ వస్తుంది. బరువులు ఎత్తే వ్యాయామాలూ పొట్ట తగ్గటానికి ఉపయోగపడతాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అయితే ఎంతసేపు, ఏయే రకాల వ్యాయామాలు చేయాలన్నది వారి శారీరక శ్రమ, పనులను బట్టి ఆధారపడి ఉంటుంది. ఎవరికేది అవసరమో వైద్యుల సలహా మేరకు నిర్ణయించుకోవాలి.
ఆహారం:ఆహార పదార్థాలు కొనేటప్పుడు సంతృప్త కొవ్వులకు బదులు పాలీ అసంతృప్త కొవ్వులు ఉండేవి ఎంచుకోవాలి. మామూలు పిండి పదార్థాలు గల పాలిష్ పట్టిన బియ్యం, గోధుమలు, బ్రెడ్, శుద్ధిచేసిన పాస్తాలకు బదులు సంక్లిష్ట పిండి పదార్థాలు ఉండే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. తక్కువ తినటంతో పాటు కేలరీలనూ తక్కువగా తీసుకుంటే బరువు తగ్గుతారు.
పొట్టను (కొవ్వును) తగ్గించే కొన్ని ఆహారపదార్ధాలు :
పొట్ట కండరాలను దృఢ పర్చటం: మామూలు వ్యాయామం, ఆహార నియమాలతో బొజ్జ తగ్గకపోతుంటే.. పొట్ట కండరాలను దృఢం చేసే వ్యాయామ పద్ధతులు అనుసరించాలి. ముఖ్యంగా పొత్తి కడుపు, కడుపులోపలి కండరాలను పటిష్ఠం చేయటంపై దృష్టి సారించాలి.
హర్మోన్ చికిత్స: అరుదుగా కొందరికి మెనోపాజ్ అనంతరం హార్మోన్ రిప్లేస్‌మెంట్ చికిత్స (హెచ్‌ఆర్‌టీ) తీసుకోవటం కూడా ఉపయోగపడుతుంది.
అనర్థాలు--బొజ్జ మూలంగా రకరకాల జబ్బులు దాడి చేసే ప్రమాదముంది. అవి
పొట్ట వద్ద పేరుకునే కొన్ని కొవ్వు కణాలు ఇన్స్‌లిన్ నిరోధకతను ప్రేరేపించే హార్మోన్లనూ ఉత్పత్తి చేస్తాయని పరిశోధనల్లో తేలింది. ఇది మున్ముందు మధుమేహానికి దారి తీయొచ్చు. మరికొన్ని కణాలు మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీంతో రొమ్ము క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుంది.
బొజ్జ తగ్గించుకునే కొన్ని చిట్కాలు :
అల్పా హారము తప్పనిసరి
ప్రతి రోజూ ఉదయము అల్పాహారము తీసుకోవడము తప్పనిసరి . ఉదయము ఎమీ తినకపోవడమంటే ఎవరికి వారు శిక్ష విధించుకోవడమే. ఉదయము నిండి సాయంత్రమువరకూ చేసే పనులన్నింటికీ తగిన శక్తినిచ్చేది . . . ఆ అల్పాహారమే . అల్పాహారమువలన శరీరము బరువు , ఆకృతి అదుపులో ఉంటాయి.
ఉప్పు తగ్గించాలి ఎవరైతే తక్కువ ఉప్పు తింటారొ వారు లవెక్కరు . ఉప్పుకు శరీరములో నీటిని , కొవ్వును నిలవా చేసే గుణము ఉన్నది . ఫలితము వా బరువు పెరుగుతారు .చలాకీతనము తగ్గుతుంది. అందుకే రోజుకు 6 గ్రాములకు మించి ఉప్పు వాడకుండా ఉంటే పొట్ట తగ్గుతుంది.
మూడు పూట్లా తినండి : బరువు తగ్గాలి అనగానే ఆహారము తీసుకోవడము మానేస్తారు. ఇటు వంటి డైటింగ్ ప్రమాదకరము . లావు తగ్గాలన్నా , పొట్ట కరగాలన్నా మూడు పూటలా ఆహారము తీసుకోవాలి . ఆ తినే ఆహారము విషయము లో జాగ్రత్తపడాలి . శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలు సమపాళ్ళలో లభించేలా ఆహారము తీసుకోవాలి. పరిమితమైన ఆహారము తీసుకోవాలి.
నడక అవసరము : నదక సహజ వ్యాయామము . ఇతర వ్యాయామాలు చేసేవారు కూడా నడాల్సిందే . 1.5 కిలోమీటర్లు పావుగంట కాలము లో వేగము గా నడిచేవిధముగా సాధనచేయాలి . రోజుకు సుమారు 3 కి.మీ నడిస్తే మంచిది.
ఎత్తుపల్లాల్లో పరుగు : కాళ్ళకు బలాన్నిస్తుంది పరుగు . కొవ్వును బాగా కరిగిస్తుంది. ఎత్తు పల్లాలో కొండలమీదికి నడక , పరుగు , ఎక్కి దిగ గలిగితే పాదము నేలమీద తాకే సమయము బాగా తగ్గుతుంది. ఫ్యాట్ కరిగేందుకు దోహదపడుతుంది . గుండెజబ్బులున్నవారు కొండలెక్కడము మంచిది కాదు.
వేపుళ్ళు వద్దు : రుచికి బాగుంటాయని ఎక్కువమంది వేపుడు కూరలు తింటారు .. కాని ఆరోగ్యరీత్యా వేపుడు కూరలు మంచివి కావు. ఉడికించిన కూరలు తింటేనే శరీరరూపము మెరుగ్గా ఉంటుంది. కాబట్టి కూరలన్నింటినీ సగం మేర ఉడికించి తర్వాత కొంద్దిగా వేయించి తినడం ద్వారా రుచి, ఆరోగ్యము రెండూ లభిస్తాయి.
సాయంకాల సమయ ఆహారము : సాయంకాలము లో ఏదో ఒకటి తినాలి. ఆకలి తో ఉండకూడదు. ఎండిన పళ్ళు, కొవ్వులేని ఆహారపదార్ధములు, తాజా పండ్లు తినాలి. నూనెలో ముంచి తేలిన చిప్స్, నూడిల్స్, కురుకురేల వంటివి అస్సలు తినకూడదు.
నీరు బాగా త్రాగాలి : నీరు మన దాహానికి తగ్గట్టుగా తాగుతూ ఉండాలి. నీరు తాగడము వలన ఆహారము తీసుకోవడము తగ్గుతుంది. జీవ పక్రియ మెరుగవుతుంది. నీరు శరీరానికి అవసము. తగినంత ఉంటే ఆలోచనలు స్పస్టముగా ఉంటాయి. నిర్ణయాలు తీసుకోవడము లో అటు ఇటు అవ్వదు.
శ్వాసతీరు మార్చుకోవడము : సైనికులకు శ్వాస వ్యాయామము ప్రత్యేకము గా చేయిస్తారు. శ్వాసక్రియను చాతీకి పరిమితం చేయక కిందనున్న పొట్టను పైకిలాగుతూ శ్వాసను పీల్చి వదలడము చెయ్యాలి. ఇది పరుగెడుతున్నప్పుడు చేయాలి. ఉదరబాగముతో కలిపిన శ్వాసక్రియవల్ల శరీర రూపములో మార్పువస్తుంది. పొట్ట లోపలికి పోతుంది.
బరువుతో పరుగు : పరుగు చ్క్కని వ్యాయామము . అయితే పొట్ట బాగ తగ్గాలంటే వీపుకు ఏధనా బరువును కట్టుకొని పరుగెట్టడము మంచిది. సైనికులు తమ అవసరాలకు సంబంధించిన సామానులతో కూడిన సంచి వీపుకు తగిలించుకొని పరిగెడు తుంటారు దీనివలన కొవ్వు కరిగిపోతుంది. కొత్తగాకొవ్వు చేరనివ్వదు.
పరుగు తీరు : మేము ప్రతిరోజూ పరిగెడుతున్నాము . . . కాని శరీరములో మార్పు కనిపించడము లేదంటారు. పరిగెత్తేటపుడు త్లల ఎత్తి ఉంచాలి . ముందుకు చూస్తూఉండాలి . వీపును వెనక్కి నెట్టినట్లుగా, మోచేతులు శరీరానికి పక్కగా ఉంచి పరుగెత్తాలి. దీనివల్న పరుగు వేగము అందుకుంటుంది ... కొవ్వు కరిగే అవకాశాలు ఎచ్చువ అవుతాయి.
తగినంత నిద్ర : నిద్ర వలన రెండురకాల లాభాలున్నాయి. ఒకటి కండరాలు అలసటనుండి తేరుకుంటాయి. నిద్రలో ఎక్కువ కాలరీలు కరుగుతాయి. నిద్ర తగినంత పోకపోతే బలహీన పడతారు. కొవ్వు అదనము పేరుకుపోయి ఇబ్బంది కలిగిస్తుంది.
వ్యాయామములో మార్పు: ఒకే తరహా కసరత్తు నెలల తరబటి చేయకుండా రకరకాల పద్దతులలో వ్యాయామము మార్చి చేస్తూ ఉండాలి. దీనివలన కొత్త ఉత్సాయము, కొత్త లాబాలు శరీరానికి చేర్చిన వారవుతారు.
రిలాక్ష్ అవ్వాలి : నిరంతము టెన్సన్ మంచిది కాదు. ఒత్తిడిలో ఉన్నవారు ఆహారము అధికముగా తీసుకుంటారు. వారి హార్మోనులు సమతుల్యము తప్పుతాయి. సరియైన సమయానికి అవసరమైన పని చేస్తూ మిగతా సమయాల్లో విశ్రాంతి తీసుకోవాలి. గాబరా గాబర గా ఏదో ఒకటి తింటూ ఎల్లప్పుడు పని ఒత్తిడిలో ఉండకూడదు. వీరు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ నే తీసుకోవడము జరుగుతూ ఉంటుంది. . . ఇవి కొవ్వును అధికం చేస్తాయి.
24 గంటలు అపెండిక్స్ గండం. 24 గంటల నొప్పి... అదే అపెండిక్స్... ఏ క్షణాన... తిప్పలు తెచ్చిపెడుతుందోనని ప్రతి ఒక్కరికీ భయమే. 'అపెండిసైటిస్' మన మనసుల్లో అంతటి భయాన్ని సృష్టించింది.
నిజానికి అపెండిక్స్ నొప్పి అంత ఇబ్బందికరమైనదే. ఎందుకంటే దీన్ని అనుమానించటం తేలిక. కానీ కచ్చితంగా నిర్ధారించుకోవటం కష్టం. ఒకవేళ నిర్ధారించినా వెంటనే ఆపరేషన్ అవసరమా? కాదా? అన్నది తేల్చి చెప్పటం మరో ఇబ్బంది. అయితే ఒకప్పటి కంటే ఇప్పుడు ఈ అపెండిక్స్ పై మన అవగాహన చాలా పెరిగింది.
ఉండుకం... అపెండిక్స్.. అన్నది పెద్దపేగులో మొట్టమొదటి భాగం! చిన్నపేగూ, పెద్దపేగూ కలిసే చోట.. మొదట్లో ఉంటుందిది. కావటానికి ఇది పెద్దపేగులో మొదటి భాగమైనా మానవుల్లో దీనికేమంత ప్రాధాన్యం లేకపోవటం వల్ల.. పరిణామక్రమంలోనే పెద్దపేగుకు అతుక్కుని ఉండిపోయే చిన్న తిత్తిలా తయారైంది. సాధారణంగా ఇది 8 సెం.మీ. పొడవుంటుంది. అరుదుగా 12 సెం.మీ. వరకూ ఉంటుంది. అందరికీ ఒకే కోణంలో ఉండాలనేం లేదు. సాధారణంగా లోపలికి ఏవైనా పదార్ధాలు వెళుతుంటేనే పేగుల సైజు పెరుగుతుంది. ఈ ఉండుకం పేగుల్లో భాగమే అయినా ఇదొక ప్రత్యేక కోణంలో వంగి ఉండటం, దీని ప్రవేశ మార్గం చాలా చిన్నగా ఉండటం వల్ల దీనిలోకి ఎలాంటి పదార్థాలూ వెళ్లవు. కాబట్టి ఇది సైజు పెరగకుండా అలా చిన్నగానే ఉండిపోతుంది. ఉండుకంలో జిగురు స్రావాలు (మ్యూకస్) ఉత్పత్తి అవుతుంటాయి. చిన్నగా ఉండే దీని ప్రవేశ మార్గంలో నుంచి ఆ స్రావాలు ఎప్పటికప్పుడు పెద్దపేగుల్లోకి వచ్చి చేరుతుంటాయిగానీ పెద్దపేగుల్లోని ద్రవాలు, మలం, స్రావాల వంటివి మాత్రం దీన్లోకి వెళ్లవు.
అపెండిసైటిస్... ఈ ఉండుకం నొప్పి ప్రధానంగా రెండు రకాలుగా రావచ్చు.
నొప్పి లక్షణాలు ముఖ్యం
అపెండిసైటిస్ సమస్య... ప్రధానంగా కడుపు నొప్పితో ఆరంభమవుతుంది. తర్వాత జ్వరం, వాంతులు, ఆకలి లేకపోవటం.. ఈ నాలుగూ ప్రధాన లక్షణాలు. అపెండిసైటిస్‌ను నిర్ధారించటంలో ఈ లక్షణాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది.
వైద్యులేం చూస్తారు? ఇవాళ ఎన్నో రకాల అత్యాధునిక పరీక్షా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. అయినా అపెండిసైటిస్‌ను నిర్ధారించే విషయంలో వైద్యులు స్వయంగా చేసే పరీక్షకు ఎంతో ప్రాధాన్యం ఉంది. వైద్యుల పరీక్షతో దీన్ని తేలికగానే గుర్తించగలుగుతారు. దాన్ని నిర్ధారించుకునేందుకుఆల్ట్రాసౌండ్ పరీక్ష, రక్తపరీక్షలు చేయిస్తారు. వీటితో కచ్చితంగా నిర్ధారించటం సాధ్యమవుతుంది.
నొప్పి కేంద్రం.. మెక్‌బర్నీస్ పాయింట్
కడుపు నొప్పి వచ్చినప్పుడు.. అది ఉండుకం వాచి.. అపెండిసైటిస్ కారణంగా వచ్చిన నొప్పేనా? అన్నది గుర్తించటానికి ఒక సూత్రం ఉంది. కుడివైపు కటి ఎముక (ఇలియాక్ స్పైన్) నుంచి బొడ్డు వరకూ ఒక గీతను ఊహించుకోండి. దీన్ని 'స్పైనో అంబ్లికల్ లైన్' అంటారు. ఈ గీతను మూడు భాగాలు చేసి బొడ్డు నుంచి రెండు భాగాలు దాటిన తర్వాత మూడో భాగం మొదట్లో పాయింట్ ముఖ్యమైంది. దీనికిందే ఉండుకం ఉంటుంది. అపెండిక్స్ వాపు వచ్చినపుడు ఈ పాయింట్ వద్ద వేలితో నొక్కితే రోగి నొప్పితో విలవిల్లాడిపోతారు. దీన్నే 'మెక్ బర్నీస్ పాయింట్' అంటారు. పొత్తికడుపు అంతా ఎక్కడ నొక్కినా పెద్దగా స్పందించరుగానీ.. ఈ 'పాయింట్' వద్దకు రాగానే చేత్తో కూడా తాకనివ్వరు. నొప్పి ఉండుకానికి సంబంధించినదేనని చెప్పేందుకు ఇది కీలకమైన సంకేతం.
రెండోది పెరిటోనైటిస్: అపెండిక్స్ వాచిన తర్వాత క్రమంగా సమయం గడుస్తున్న కొద్దీ ఇన్‌ఫెక్షన్ కడుపులోని ఇతర పొరలకూ వ్యాపించి ఆ ప్రాంతంలో పెరిటోనైటిస్‌కు దారి తీస్తుంది. అప్పుడు పొత్తికడుపు కండరం నొక్కితే గట్టిగా తయారవుతుంది. దీన్ని 'మజిల్ గార్డింగ్' అంటారు.
మరికొన్ని సంకేతాలు..
తేల్చిచెప్పే ఆల్ట్రాసౌండ్ వైద్యులు స్వయంగా వివిధ రకాలుగా పరిశీలించిన తర్వాత అపెండిక్స్ వాపు అని బలంగా అనుమానిస్తే.. కచ్చితమైన నిర్ధారణ కోసం ఇతర పరీక్షలు చేయిస్తారు. వీటిల్లో ఆల్ట్రాసౌండ్ ముఖ్యమైంది.
వైద్యుల పరీక్ష, ఆల్ట్రాసౌండ్‌లలో అపెండిక్స్ వాచినట్టు స్పష్టంగా నిర్ధారణ అయితే నేరుగా ఆపరేషన్‌కు వెళ్లిపోవటం మంచిది. ఒకవేళ ఆల్ట్రాసౌండ్ ఫలితం స్పష్టంగా లేకపోతే.. రక్తపరీక్ష ఫలితాలను చూస్తారు. అప్పటికీ ఉండుకం నొప్పేనా? కాదా? అన్నది స్పష్టంగా తేలక అనుమానంగా ఉంటే బాధితులను ఆసుపత్రిలో చేర్చి జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. నొప్పి తీవ్రంగా లేకపోయినా, ఆల్ట్రాసౌండ్ పరీక్షలో స్పష్టంగా కనిపించకపోయినా, రక్తంలో తెల్లకణాలు అంత ఎక్కువగా లేకున్నా.. యాంటీబయాటిక్ మందులతో చికిత్స చేయొచ్చు. ఈ సమయంలో ఎటువంటి ఆహారం ఇవ్వకుండా సెలైన్ ఇస్తారు. దీంతో పేగులకు పూర్తి విశ్రాంతి లభిస్తుంది. ఇలా 24-48 గంటల్లో అపెండిక్స్ వాపు లక్షణాలు తగ్గుముఖం పడతాయి. అప్పుడు తిరిగి పరీక్షించి మందులతో చికిత్స చేయాలా? ఆపరేషన్ చేయాలా? అనేది నిర్ణయిస్తారు. ఒకవేళ ఇన్‌ఫెక్షన్ తగ్గకుండా నొప్పి పెరుగుతూ అపెండిక్స్ వాపు లక్షణాలు స్పష్టమవుతుంటే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది.
నొప్పులన్నీ ఉండుకానివే కావు! పొట్టలో కుడివైపు వచ్చే నొప్పులన్నీ ఉండుకం నొప్పులే కాకపోవచ్చు. ఎందుకంటే ఇతరత్రా ఎన్నో సమస్యల్లో కూడా నొప్పి ఇలాగే ఉండొచ్చు. ముఖ్యంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు.. నీళ్ల విరేచనాలు పట్టుకున్నప్పుడు.. మూత్రపిండాల్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు.. పొట్టలోని లింఫ్ గ్రంథులు వాచినప్పుడు.. ఆడపిల్లల్లో పొత్తికడుపు వాపు (పీఐడీ) సమస్యలో.. కాలేయంలో చీము వంటి సమస్యలు తలెత్తినప్పుడు.. చివరికి కుడివైపు వూపిరితిత్తి కింది భాగంలో న్యూమోనియా వచ్చినపుడు కూడా... నొప్పి ఇలాగే ఉండొచ్చు. అందుకే అది 'అపెండిసైటస్' నొప్పేనని నిర్ధారించే ముందు వైద్యులు ఒకటికి రెండుసార్లు తరచి చూస్తారు!
అపెండిక్స్‌ను తొలగించటానికి రెండు రకాల ఆపరేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి పొట్టమీద కోతపెట్టి చేసేది, రెండోది పొట్ట మీద రంధ్రాలు వేసి వాటిద్వారా కెమేరా గొట్టంతో ఉండుకాన్ని తొలగించే ల్యాప్రోస్కోపిక్ పద్ధతి. రెండూ సమర్థమైనవే. కాకపోతే ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో చేస్తే త్వరగా కోలుకుంటారు. కండరాలను పెద్దగా కొయ్యాల్సిన పని ఉండదు కాబట్టి కండరాల నొప్పి అంతగా ఉండదు. త్వరగా లేచి తిరుగుతారు. పొట్ట మీద పెద్ద మచ్చలూ ఉండవు.
పట్టణాల్లో ఎక్కువ: ఉండుకం నొప్పి.. అదే అపెండిసైటిస్.. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ. పల్లెల్లో తక్కువ. దీనికి పట్టణ ఆహారంలో పీచు తక్కువ ఉండటం కూడా కారణం కావచ్చు. పీచు తక్కువగా తినేవారిలో మలబద్ధకం అధికం. మలం లోపల నిల్వ ఉన్నప్పుడు పేగుల్లో.. లోపల ఆహారద్రవాల కదలికలు తగ్గొచ్చు. ఫలితంగా ఉండుకంలోని జిగురు స్రావాలు బయటకు రాకుండా లోపలే ఉండిపోయి.. అవే ఇన్ఫెక్షన్‌కు కారణం కావచ్చు.
యుక్తవయసు బెడద: అపెండిక్స్ వాపు ఏ వయసువారిలోనైనా రావొచ్చుగానీ.. కానీ 12-19 ఏళ్ల యుక్తవయస్కుల్లో అధికం! నాలుగేళ్ల లోపు పిల్లల్లో చాలా అరుదు. ఆరేళ్లలోపు వారిలో కొంత అరుదు. 6-12 ఏళ్ల వారిలో కొంచెంగా కనిపించొచ్చు.
అమ్మాయిల్లో ఆపరేషన్: అపెండిక్స్ తొలగించే శస్త్రచికిత్స అబ్బాయిల్లో కన్నా అమ్మాయిల్లోనే 2.5 రెట్లు ఎక్కువ. ఎందుకంటే బాలికల్లో పునరుత్పత్తి అవయవాలు ఉండుకం దగ్గర్లోనే ఉంటాయి. ముఖ్యంగా ఫలోపియన్ ట్యూబు ఈ ఉండుకానికి దగ్గరగా ఉంటుంది. కాబట్టి అపెండిసైటస్ వస్తే ఆ ఇన్‌ఫెక్షన్ వల్ల పొత్తికడుపులో వాపు పెరిగి.. ట్యూబులకు ఇన్ఫెక్షన్ వస్తే వాటిలో అవరోధాలు తయారై.. భవిష్యత్తులో సంతాన రాహిత్యం సంభవించవచ్చు. అందుకనే అమ్మాయిల్లో అపెండిసైటస్ అని ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే ఆపరేషన్ చేస్తుంటారు.
వేసవి బెడద: పేగు సమస్యలైన నీళ్లవిరేచనాల వంటివన్నీ వేసవిలో ఎక్కువ. పేగుల్లో సమస్యల వల్ల ఈ అపెండిసైటస్ కూడా రావచ్చు.
గండం తగ్గింది: 24 గంటల కడుపు నొప్పి... అపెండిసైటస్‌పై ప్రజల్లో చైతన్యం పెరగటం వల్ల ఇప్పుడు త్వరగా స్పందిస్తున్నారు. దీంతో అపెండైసిటిస్ మూలంగా మరణాల సంఖ్య గతంలో కన్నా ఇప్పుడు గణనీయంగా తగ్గింది. ఇప్పటికీ దీనిబారిన పడిన ప్రతి 200 మందిలో ఒకరికి ప్రాణ ప్రమాదం ఉంటోంది!
ఒకప్పుడు ఉండుకం (అపెండిక్స్)ను.. పరిణామంలో మిగిలిపోయిన ఒక వ్యర్థ అవయవంగా, అవశేషంగా భావించేవారు. కానీ క్రమేపీ వైద్యపరంగా వైద్యపరిశోధనా రంగం అభివృద్ధి చెందిన కొద్దీ... ఈ ఉండుకం మరీ అంత వ్యర్థమైనదేం కాదన్న అవగాహన పెరుగుతోంది.
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా, ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు. ఆరోగ్యముగా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు. మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము. ఇప్పుడు -కడుపు నొప్పి (Abdominal pain/stomach pain) - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం!. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
ఉదరకోశంలో ఏ అవయవానికి సమస్య ఎదు రైనా అది కడుపు నొప్పిగా ప్రదర్శితమవు తుంది. ఛాతీ ఎముకలు, డయాఫ్రం కిందు గానూ, కటివలయానికి పైభాగంలోనూ ఉదర కోశం అమరి ఉంటుంది. ఉదరకోశంలో జీర్ణకోశం, చిన్న ప్రేవులు, పెద్ద పేగు, కాలేయం, గాల్‌బ్లాడర్, పాంక్రియాస్ తదితర అవయవాలు ఉంటాయి. ఈ అవయవా లనుంచి ఉత్పన్నమయ్యే నొప్పినే మనం కడుపు నొప్పి అని వ్యవహరిస్తుంటాము. కొన్నిసార్లు ఉదరకోశంలోని అవయవాల నుంచి కాకుండా, ఉదరకోశానికి సమీపంలో ఉండే ఇతర అయవాలనుంచి వెలువడే నొప్పి కూడా కడుపు నొప్పిగా ప్రదర్శితమవుతుంది.
ఉదాహరణకు శ్వాసకోశాల కింది భాగం, మూత్రపిండాలు, గర్భాశయం, అండాశయం మొదలైన ఇతర అవయవాలనుంచి వెలువడే నొప్పి కడుపు నొప్పిగా అనిపించవచ్చు.
అలాగే ఉదరకోశంలోని అవయవాలకు సంబంధించిన నొప్పి ఉదరకోశానికి వెలుపలి నొప్పిగా కనిపించవచ్చు. ఉదాహరణకు పాంక్రియాస్‌కు సమస్య ఎదురైనప్పుడు అది నడుము నొప్పిగా భ్రమింపజేయవచ్చు.
అంటే ఈ నొప్పులు ఉత్పన్నమైన చోట కాకుండా, ఇతర ప్రదేశంలో బహిర్గతమవవచ్చు. ఈ రకమైన నొప్పులను వైద్యపరిభాషలో రిఫర్డ్ పెయిన్స్ అని అంటారు.
కారణాలు
అయితే ఈ వ్యాధిలో కడుపు నొప్పి ఎందుకు వస్తుందనే విషయం ఇదమిత్థంగా తెలియదు. కాని చిన్న ప్రేవుల కండరాలు అసాధారణంగా వ్యాకోచ సంకోచాలకు గురి కావడం కాని, చిన్న ప్రేవుల్లో ఉండే సున్నితమైన నరాలు నొప్పికి సంబంధించిన సంకేతాలను విడుదల చేయడం వంటివి కారణమై ఉంటాయని భావిస్తున్నారు.
ఈ రకమైన కడుపు నొప్పులను వైద్య పరి భాషలో ఫంక్షనల్ పెయిన్స్ అని వ్యవహరి స్తారు. ఎందుకంటే వీటిలో కడుపు నొప్పికి స్పష్టమైన కారణమంటూ కనపించదు కనుక.
వ్యాధి నిర్ధారణ
కడుపు నొప్పిని నిర్ధారించడానికి ఈ కింది అంశాలు ఉపకరిస్తాయి.
నొప్పి లక్షణాలు
రోగిని ప్రశ్నించడం, భౌతికంగా పరీక్షించడం ద్వారా కడుపు నొప్పికి కారణాలేమిటో తెలుసు కుని వ్యాధిని నిర్ధారించడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఈ కింది అంశాలు దోహద పడతాయి.
నొప్పి ఎలా ప్రారంభమైంది? : నొప్పి ఎలా ప్రారంభమైందనే అంశం అతి ముఖ్యమైనది. ఉదాహరణకు కడుపు నొప్పి హఠాత్తుగా ప్రారం భమైతే పెద్ద పేగుకు రక్త సరఫరాకు అంత రాయం కలిగినట్లు కాని, పిత్తనాళంలో రాళ్ల వల్ల అడ్డంకి ఏర్పడటం కాని కారణమై ఉండవచ్చు నని ఊహించవచ్చు.
నొప్పి ఏ భాగంలో ఉంది? : అపెండిసైటిస్ కారణంగా కలిగే కడుపు నొప్పి ఉదరకోశంలో కుడి కింది భాగంలో, అపెండిక్స్ ఉన్న ప్రాంతంలో ఏర్పడుతుంది.
సాధారణంగా అపెండిసైటిస్ నొప్పి బొడ్డు ప్రాంతంలో ఆరంభమై నెమ్మదిగా అపెండిక్స్ ఉన్న ఉరదకోశంలోని కుడివైపు కింది భాగానికి చేరుతుంది.
డైవర్టిక్యులైటిస్ కారణంగా ఏర్పడే కడుపు నొప్పి ఉదరకోశంలో ఎడమవైపు కింది భాగంలో ఉంటుంది.
పిత్తాశయంలో సమస్య వల్ల కలిగే కడుపు నొప్పి ఉదరకోశం కుడివైపు పైభాగంలో పిత్తాశయం ఉన్న ప్రాంతంలో ఏర్పడుతుంది.
నొప్పి ఏ తీరుగా ఉంది? : నొప్పి ఏ తీరుగా ఉందనే అంశం మరికొన్ని సమస్యలను తెలుసుకోవడానికి ఉపకరిస్తుంది. ఉదాహరణకు చిన్న ప్రేవుల్లో అడ్డంకి ఏర్పడటం వల్ల కలిగే కడుపు నొప్పి తెరలు తెరలుగా ప్రారంభమవు తుంది. బిగబట్టినట్లుండే నొప్పి చిన్నప్రేవులు తీవ్రంగా సంకోచిం చినట్లు సూచిస్తుంది.
పైత్యరస వాహికలో రాళ్ల వల్ల అడ్డంకి ఏర్ప డిన కారణంగా కలిగే నొప్పి ఉదరకోశం ఊర్ధ్వ భాగంలో నిరంతరం కొనసాగే నొప్పిగా ఉంటుంది. ఈ నొప్పి కనీసం 30 నిముషాల నుంచి కొన్ని గంటలపాటు కొనసాగు తుంది.
అక్యూట్ పాంక్రియాటైటిస్ కారణంగా కలిగే నొప్పి చాలా తీవ్రంగా, భరించలేని స్థాయిలో ఉదరకోశం ఊర్ధ్వ భాగంలోనూ, నడుము పైభాగంలోనూ వస్తుంది.
నొప్పి కొనసాగే కాలం : ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ కారణంగా కలిగే కడుపు నొప్పి తీవ్రస్థాయికి చేరి, నెమ్మదిగా ఉపశమిస్తుంది. ఇది కొన్ని నెలలనుంచి సంవత్సరాల వరకూ కొనసాగవచ్చు.
గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడటం వల్ల కలిగే నొప్పి కొన్ని గంటలపాటు ఉంటుంది.
కడుపులో అల్సర్లు, జీర్ణకోశంనుంచి ఆమ్లాలు పైకి ఆహారనాళంలోకి ఎగదన్నడం వంటి సమస్యల కారణంగా ఉత్పన్నమయ్యే నొప్పి కొన్ని వారాలు లేదా నెలలపాటు తీవ్రంగా ఉంటుంది. తరువాత కొన్ని వారాలు, నెలలు తక్కువగా ఉంటుంది.
నొప్పి తీవ్రం కావడానికి కారణాలు : అవ యవం కందినట్లు అయి, వేడి, మంట, నొప్పి మొదలైన వాటితో కలిసి వాపు చెందడాన్ని ఇన్‌ఫ్లమేషన్ అంటారు. ఇన్‌ఫ్లమేషన్ కారణంగా కలిగేనొప్పి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, కదలి నప్పుడు తీవ్రమవుతుంది. అపెండిసైటిస్, డైవ ర్టిక్యులైటిస్, కొలి సిస్టయిటిస్, పాంక్రియాటైటిస్ వంటి వ్యాధులను దీనికి ఉదాహరణగా చెప్పు కోవచ్చు.
నొప్పిని ఉపశమింపజేసే అంశాలు : ఇరి టబుల్ బొవెల్ సిండ్రోమ్ కారణంగా కాని, మలబద్ధకం వల్ల కాని కలిగే నొప్పి మల విసర్జన అలవాట్లలో మార్పులు చేసుకోవడం వల్ల ఉపశమిస్తుంది.జీర్ణాశయంలో లేదా చిన్న ప్రేవుల్లో ఏదేని అడ్డంకి కారణంగా కలిగే నొప్పి వాంతి జరిగిన తరువాత కడుపు ఉబ్బరం తగ్గిపోవడంతో తాత్కాలికంగా ఉపశమిస్తుంది.
జీర్ణాశయంలో కాని, డుయోడినమ్ (జీర్ణాశ యాన్ని, చిన్న ప్రేవులను కలిగే భాగం)లో కాని ఏర్పడిన అల్సర్ల కారణంగా కలిగే నొప్పి ఆహా రాన్ని తీసుకోవడం వల్ల లేదా యాంటాసిడ్ మందులను తీసుకోవడం వల్ల ఉపశమిస్తుంది.
చికిత్స / మందులు :
Tab. Meftal spas 1 మాత్ర 3 సార్లు రోజుకి, 2 నుండి 3 రోజుల వరకు.
Tab. Gelusil mps 1 మాత్ర 3 సార్లు రోజుకి, 2 నుండి 3 రోజుల వరకు.
ఇంకా నొప్పి తగ్గక పోతే డాక్టర్ ని సంప్రదించాలి.
ఆధారము: వైద్యరత్నాకరం బ్లాగ్
ఆధారము: వైద్య రత్నాకరం బ్లాగ్
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020
కండ్ల కలక ముఖ్యంగా వైరస్ ద్వారా, బాక్టీరియా ద్వారా...
మధుమేహ వ్యాధిని - చెక్కర వ్యాధి, షుగర్ వ్యాధి అని ...
గుండె అనుక్షణము సంకోచ, వ్యాకోచాలు చేస్తూ రక్తాన్ని...
రక్తపోటు అదుపులో ఉండేందుకు కొన్ని ఆహారపు చిట్కాలు