অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ధనుర్వాతం

ధనుర్వాతము అనే జబ్బు శరీరానికి గాయం తగిలినప్పుడు ఆ గాయం ద్వారా ఇన్ పెక్షన్ అయినప్పుడు వస్తుంది. క్లాస్ట్రిడియా టెటని అనే క్రిములు గాయం ద్వారా శరీరంలో ప్రవేశించి - ధనుర్వాతం వ్యాధిని కలిగిస్తాయి.

లక్షణాలు

  • ధనుర్వాతం ప్రధానంగా కేంద్రనాడీ మండల వ్యవస్ధ (మెదడు,వెన్నెముక )పై ప్రభావము చూపుతుంది.
  • ధనుర్వాతం మొదటి లక్షణము,దవడ కండరాలు బిగుసుకుపోయి నోరు తెరవలేకపోవడం
  • ఈ లక్షణం చిన్న పిల్లలలో అయితే తల్లిపాలు త్రాగలేరు
  • ఏ కారణం లేకుండా ఎవరైన నోరు తెరవలేక పోయినట్లు అయితే వేంటనే డాక్టరు వద్దకు తీసుకువెళ్ళాలి
  • స్వల్పంగా జ్వరం రావడం
  • గుండె స్పందన వేగంగా వుండడం
  • పొత్తికడుపు వీపు ఇతర కండరాలు కూడ బిగుసుకు పోవచ్చు

నివారణ

  • ధనుర్వాతం రాకుండా నివారించడానికి సంవత్సరము లోపు పిల్లల్లో 1 నెల వయస్సు నుండి మూడు మోతాదులు వ్యాధి నిరోధక టీకా ఇవ్వాలి.
  • అనగా డిప్తీరియా కోరింత దగ్గు ధనుర్వాతము ఈ మూడు వ్యాధులకు నివారణ లా పని చేస్తుంది.
  • గాయం తగిలిన వెంటనే ప్రాధమిక చికిత్స చేసి ధనుర్వాతం టీకా డాక్టరు సలహా మేరకు వేయించాలి.
  • గాయం తగిలినా తగలకపోయినా ప్రతి 5 సంవత్సరాలకు యుక్త వయస్సు అమ్మాయిలు డాక్టరు సలహా ప్రకారము టి.టి సూది వేయించుకోవడం మంచిది.

ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate