অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కోరింత దగ్గు ( కక్కాయి దగ్గు )

కోరింత దగ్గు ( కక్కాయి దగ్గు )

ఇది బ్యాక్టీరియా సూక్ష్మజీవుల వలన వస్తుంది. ఈ వ్యాధికి గురయ్యే ముఖ్య భాగాలు ముఖం, గొంతు. ఇది సాధారణంగా రెండు సం. లోపల పిల్లల్లో కనిపిస్తుంది. ఈ వ్యాధితో ఉన్న పిల్లలు తెరలు తెరలుగా, పక్షి కూతవలె బెదురుగొలుపుతూ శ్వాస తీసుకుంటారు.

కారణాలు

బ్యాక్టీరియా - బోర్డెటెల్లా పెర్ట్యూసిన్

వ్యాప్తి

వ్యాధిగ్రస్ధులు తుమ్మినప్పుడు, దగ్గినపుడు తుంపర్ల (లాలాజలం) ద్వారా వ్యాపిస్తుంది. మరియు ముక్కు చీమిడి ద్వారా ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది.

లక్షణాలు

సాధారణంగా వ్యాధి లక్షణాలు. వ్యాధి సంక్రమించిన 7 నుండి 17 రోజులు తర్వాత ప్రారంభమవుతాయి.

  1. సాధారణంగా 2 సం. లోపు పిల్లల్లో కన్పిస్తుంది.
  2. ఈ లక్షణాలు 6 వారాల లోపు తగ్గుతాయి.
  3. ఈ వ్యాధి 3 దశలుగా విభజింపబడింది.

మొదటి దశ - ముక్కు నీరు, కన్నీరు కారటం, ఆకలి తగ్గుట, నీరసంగా ఉండటం, రాత్రి పూట దగ్గు మరియు తుమ్ములు

రెండవ దశ - తెరలు తెరలుగా దగ్గుతో పాటు పక్షి వలె శ్వాస తీసుకొనుట.

మూడవ దశ - ఇది నయమయ్యే దశ ఇది నాలుగవ వారం తర్వాత మొదలవుతుంది.

ఈ దశలో దగ్గు ఉంటుంది. కానీ తీవ్రంగా ఉండదు.

ఈ వ్యాధి పెద్దల్లో వస్తే 2 వారాల లోపు తగ్గుతుంది.

ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate