నలుపు మచ్చల జ్వరము అంటే ఏమిటి ?
- ఇలా చాలా మెల్లగా వ్యాపించే లేక వృద్ధి చెందే దేశీయ జబ్బు. దీనికి కారణం ప్రోటోజోవాకు చెందిన లీప్యానియా అను (కొత్తి మెర పురుగు) (చిన్న దోమ) పరాన్నజీవి
- మన దేశంలో లీష్మానియా అను ఒకే ఒక పరాన్నజీవి ఈ కాలా అజార్ జ్వరానికి కారణం అవుతుంది
- ఈ పరాన్న జీవి ముఖ్యంగా శరీర రక్షణ వ్యవస్ధ మీద ప్రభావం చూపుతుంది. తరువాత అస్ధిరమవుతుంది.
- (బోన్ మారో) , కాలేయము, మహాభక్షక వ్యవస్ధలలో ఎక్కువ మోతాదులో కనబడుతుంది
- కాలా జ్వరము లేక నల్ల మచ్చల జ్వరము. తదుపరి వచ్చే చర్మవ్యాధి లో లీప్యానియా డోనవాని అను పరాన్నజీవి చర్మం ఉపరితలంలోని కణాలలో చొచ్చుకొని పోయి అక్కడ వృద్ధి చెందుతూ వ్యాధి లక్షణాలకు కారణం అవుతుంది. కొందరు వ్యాధిగ్రస్థులలో ఈ చర్మ సమస్య చికిత్సానంతరం కొన్ని సంవత్సరాల తరువాత బయటపడవచ్చును
- కొన్ని సార్లు ఈ పరాన్నజీవి జీర్ణ వ్యవస్థ లో ప్రవేశించకుండానే చర్మంలోనే వృద్ధి చెంది అక్కడే లక్షణాలను వృద్ధి చేయవచ్చును. దీని గురించి ఇంకా విపులంగా పరిశోధనలు జరగవలసి వున్నవి
నల్లమచ్చలు జ్వరంలో కనపడే లక్షణాలు మరియు చిహ్నాలు
- మళ్ళీ, మళ్ళీ, వచ్చే జ్వరం లేక ఆగి వచ్చే జ్వరం. ఈ మళ్ళీ జ్వరం తీవ్రంగా ద్విగుణీకృతమై వుంటుంది
- ఆకలి లేకపోవడం, పాలిపోవడం, క్రమంగా బరువు తగ్గిపోవడం
- ప్లీహపు (స్ప్లీ న్) వాపు - ప్లీహము త్వరితగతిన వాపునకు గురౌతుంది. మెత్తగా ఉంటుంది. ముట్టుకుంటే నొప్పితెలియదు
- కాలేయము - వాపునకు గురౌతుంది కానీ ప్లీహమంత (స్ప్లీ న్) ఎక్కువగా వుండదు. మెత్తగా, ఉపరితలం సమంగా అంచులు కొస్సెగా వుంటాయి
- లింఫ్ గ్రంధుల్లో వాపు
- చర్మం - ఎండిపోయినట్టు, పలచబడినట్టు, పొలుసుబారినట్టు వుంటుంది. వెంట్రుకలు వూడి పోవచ్చు. చర్మం పాలిపోయి పాలిపోయి అక్కడక్కడా బూడిదరంగు మచ్చలు ఏర్పడుతాయి. దీని గురించి ఈ జ్వరానికి నల్ల మచ్చల జ్వరము అని పేరు వచ్చింది
- రక్త హీనత - శీఘ్రంగా వృద్ధి చెందుతుంది. బలహీనత రక్తహీనత శుష్కించి పోవడం, ప్లీహము వాపు వంటి లక్షణాలతో వీరు ప్రత్యేకంగా కనబడుతూ వుంటారు.
నల్ల మచ్చల జ్వరానంతరం కనపడే చర్మ వ్యాధి లక్షణాలు, మరియు చిహ్నాలు చర్మంలో వచ్చే మార్పుల ఆకృతిని బట్టి రకాలుగా విభజన
నల్ల మచ్చల జ్వరానంతరం వచ్చే చర్మ వ్యాధిలో ఈ పరాన్న జీవి చర్మపు ఉపరితలపు పొరల్లో కనబడుతుంది. ఈ చర్మంలో మార్పులు నల్ల మచ్చల జ్వరం వచ్చి కోలుకున్న 1-2 సం. తరువాత కనబడవచ్చు. అప్పుడప్పుడు నల్ల మచ్చల జ్వరం రాకుండానే కేవలం చర్మం వ్యాధిలాగా కనపడవచ్చు.
- తక్కువ వర్ణ పరిమాణంతో కూడిన మచ్చలు కనపడడం. ఇవి కుష్టు వ్యాధిలో కనబడు మచ్చలను పోలివుంటాయి. కానీ సాధారణంగా 1 సెం.మీ కంటే తక్కువ పరిమాణంలో ఎక్కువగా ముఖంలో కనపడుతాయి. కానీ శరీరంలో ఏ భాగంలోనైనా కనబడవచ్చు
- కొంత కాలం తరువాత (కొన్ని నెలలు నుంచి కొన్ని సంవత్సరాలు కావచ్చు) ఈ మచ్చల మీద వివిధ పరిమాణాల కంతులు ఉత్పన్నమవుతాయి
- ఎఱ్ఱగా సీతాకోక చిలుక ఆకారంలో ఉండే దద్దుర్లు కనబడుతాయి. ఇవి సూర్యరశ్మికి తీవ్రతరమవుతాయి. ఇది ఈ చర్మవ్యాధిలో తొలిదశలో కనబడే ఒక లక్షణం
- ఎఱ్ఱగా ఉండే కంతులు, బుడిపెలు ముఖ్యంగా గడ్డంమీద, ముఖం మీద కనపడతాయి
- ఇవి చాలా సంవత్సరాల కాలంలో పెరుగుతూ వుంటాయి. అకస్మాత్తుగా మానడం సాధారణంగా జరుగదు
అతి తక్కువగా చూసే నల్లజ్వరం తదనంతరం వచ్చే మార్పులు
- ఒకటికంటే ఎక్కువ కణుతులు, బుడిపెలు కలిసిపోయి గారలాంటి ప్రదేశాలు చర్మం మీద ఏర్పడతాయి
- చేతులు మరియు కాళ్ళ మీద పులిపిర్లవలే ఉత్పన్నం అవుతాయి
- పులిపిరుల వంటి కంతులు మొఖం మీద ముక్కుపై, గడ్డం, పెదవుల మీద కనబడతాయి
- అభివృద్ధి చెందిన కణజాలం (కనురెప్పల, ముక్కు, పెదవుల పైన)
- కనుబొమ్మల దగ్గర పసుపు పచ్చని తరకలు కట్టడం కొవ్వుతో కూడిన కంతులు చంకలలో, మోకాలి వెనుక భాగంలో, తొడల లోపలి భాగంలో నోటి చుట్టూ కనబడతాయి
- చర్మం పొలుసులలాగా కట్టి పొరలు పొరలుగా రాలిపోవుట. ఇది నానా రంగుల పొలుసుల రూపంలో ఉండవచ్చు
హెచ్.ఐ.వి. మరియు నల్లమచ్చలు జ్వరం సంయుక్తంగా ఉండుట
- అంతర్ అవయవాలలో కనిపించే లీప్మానియా పరాన్నజీవి తరచూ అవకాశానుసారం హెచ్.ఐ.వి. వ్యాధి సోకిన రోగులలో మరియు వ్యాధి నిరోధక శక్తి తగ్గిన రోగులలో ఎక్కువగా కనపడుతుంది
- మన దేశంలో ఇది అంత తీవ్ర సమస్య కాకపోయినా ఇతర దేశాలలో హెచ్.ఐ.వి. మరియు అంతర్ అవయవాలలో వచ్చే లీఫ్మానియా పరాన్ జీవి జబ్బు కలిసి 1000 కేసులకు పైగా నిర్ధారించబడ్డాయి
- హెచ్.ఐ.వి. వ్యాధి సోకిన వ్యక్తులలో ఈ అంతర్ అవయవాలకు సోకే లీప్మానియా జ్వరం మొదటి లక్షణంగా కనపడవచ్చు
- ఎయిడ్స్ వ్యాధి ముదిరిన రోగులలో (ధీర్ఝకాలిక) కనపడుతుంది
- ఎయిడ్స్ జబ్బుతో కూడి ఈ జబ్బు ఉన్నా కూడా అప్పుడప్పుడూ లక్షణాలు కనపడకపోవచ్చు
- నల్ల మచ్చల జ్వరం లక్షణాలు చాలా కొద్ది సమయం వరకే ఉండడం మూలాన జబ్బు నిర్ధారణ చేయడం కష్టం కావచ్చు. జ్వరం, ప్లీహం యెక్క వాపు ప్రస్పుటంగా కనపడకపోవచ్చు. రక్తంలో నల్ల మచ్చల జ్వర ప్రతికూల కణాలు కనపడకపోవచ్చును
- కొన్ని ప్రత్యేక రక్త పరీక్షలలో రోగ నిర్ధారణలో మంచి ఫలితాలు మెరుగుగా ఉంటాయి
- చికిత్సా ఫలితాలు ఆశాజనకంగా ఉండవు. మందుల వల్ల కలిగే దుష్ఫలితాలు అధికంగా ఉంటాయి. జబ్బు తిరగబెట్టడం సర్వ సాధారణంగా జరుగుతూ వుంటుంది
నల్ల మచ్చల జ్వరం ఏ విధంగా వ్యాపిస్తుంది ?
- నల్ల మచ్చల జ్వరం రోగ వాహకముల ద్వారా వ్యాపించు జబ్బు
- సాండ్ ఫ్లై అను ఒకే రోగ వాహకము ద్వారా మన దేశంలో నల్ల మచ్చల జ్వరం వ్యాప్తి చెందుతుంది
- ఇండియాలో కనిపించే నల్ల మచ్చల జ్వరం కేవలం మానవులలోనే కనబడుతుంది. మానవుడు ఒక్కడే ఆశయము లాగా పని చేస్తాడు
- ఆడ దోమ వ్యాధిగ్రస్థుడైన మనిషిని కుట్టినప్పుడు దాని శరీరంలోకి లీఫ్మానియా పరాన్నజీవి చేరుతుంది
- ఈ పరాన్న జీవి శరీరాకృతిలో కొన్ని మార్పులు చెంది, వృద్దిచెంది, విభజన జరుగుతుంది. ఇది అంతయూ ఆడ దోమ యొక్క ప్రేగులో జరుగుతుంది. తరువాత పరాన్నజీవి నోటి భాగములోనికి చేరుతుంది
- పై విధంగా లీప్మానియా పరాన్నజీవి నిల్వ వున్న స్యాండ్ ఫ్లై దోమ మానవుని కుట్టినప్పుడు పరాన్నజీవి మానవుని రక్తస్రావంలోకి ప్రవేశిస్తుంది
భారతదేశంలో వున్న నల్ల మచ్చల జ్వరం
- భారతదేశంలో స్యాండ్ ఫ్లై అనే ఒకే ఒక ఆరోహకము కనబడుతుంది. దీనిని ఫ్లెబోటొమస్ ఏరిజెన్ టిపిస్ అంటారు
- ఈ స్యాండ్ ఫ్లై అనే కీటకాలు చాలా చిన్నవి. దోమలలో వీటి పరిమాణం నాలుగో వంతు వుంటుంది. దీని పొడవు 1.5 నుంచి 3.5 మి.మి. వుంటుంది
- యౌవన దశలో వున్న స్యాండ్ ఫ్లై నాజూకుగా నిలువుగా వున్న పెద్ద రెక్కలతో సమంగా వుంటుంది. శరీరమంతా పొడుగాటి రోమాలతో కప్పబడి వుంటుంది
- జీవిత చక్రంలో అండము → 4 భాగముల లార్వా → ప్యూపా మరియు → ప్రౌఢ దశకు చేరుతుంది. ఈ మొత్తం ప్రక్రియకు నెలరోజులు పట్టవచ్చు
- ఈ ప్రక్రియ పూర్తి అవడం పై ఉష్ట్రోగ్రత, పరిసరాల ప్రభావం కూడా వుండవచ్చు
- ఈ కీటకాలు తేమ ఎక్కువగా వుండి వేడిగా వాతావరణం మరియు ఇసుక నీరు సమృద్దిగా చెట్లు చేమలూ ఉన్న ప్రదేశాలలో బాగా వృద్ధి చెందుతాయి
- ఈ కీటకాలు సమృద్దిగా జీవుల నుండి ఉత్పన్నమయ్యే వ్యర్ధ పదార్ధాలు ఉండే చోట ఎక్కువగా వుంటాయి. ఈ పదార్ధాలు లార్వాకు ఆహారంగా పనికి వస్తుంది
- ఇవి చాలా నాజూకైన కీటకాలు, ప్రతికూల వాతావరణంలో తేలికగా విఛ్చిన్నమవుతాయి. పొడిగా వున్న వాతావరణంలో బ్రతుకలేవు.
నల్ల మచ్చల జ్వరం నిర్ధారణ
వైద్యపరంగా రెండు వారాల కంటే ఎక్కువ రోజులు జ్వరం మలేరియా మందులు మరియు జ్వరం మాత్రలకు తగ్గకపోవడం. ప్రయోగ శాలలో పరీక్షలలో రక్తహీనత తెల్లకణాలు తగ్గపోవడం, రక్తంలో ప్రవహించు తెల్ల రక్త కణాలు తగ్గిపోవడం, రక్తంలో గామా గ్లోచ్యుల్లిన్ అనే ప్రోటీన్లు ఎక్కువగా ఉండడం.
ప్రయోగశాలలో పరీక్షలు
రసి విజ్ఞానము శరీరమునకు బహిర్గతంగా జరుగు ప్రతిజనక - ప్రతి రక్షక ప్రక్రియలకు సంవత్సరాలు శాస్త్రము - జ్ఞానము.
ఈ రోగ నిర్ధారణకు చాలా రకముల పరీక్షలు వున్నాయి
సాధారణంగా రక్తంలో ఉత్పన్నమై వున్న ఐ.జి.జి. ప్రతి రక్షక కణాలను గుర్తించే పరీక్షలు చేస్తారు. ఇవి రక్తంలో ఎక్కువ కాలం వుంటాయి. ఈ పరీక్షలకు పరిస్థితులు అనుకూలించాలి. ఐ.జి.ఎమ్. ప్రతి రక్షక కణాల కనుగొన్న పరీక్ష ఇంకా ప్రారంభదశలో వున్నది. ఇది కొంత మెరుగైన పరీక్ష.
పరాన్న జీవిని కనుగొనడం
పరాన్న జీవిని ఎముకల మూలుగ ప్లీహము, శోషరసకణాలు నుంచి తీసిన రస ద్రవము వీటిలో పరాన్న జీవిని చూపగలగడం. లేదా కణజాలమును పెంచి, సంరక్షించి వాటి సంఖ్య పెరిగేటట్లు చేసే సాధనలో పరాన్న జీవిని నిరూపించడం.
బాహ్య జీవ ప్రక్రియలో కణజాలమును పోషించుట.
ఈ విధంగా పరాన్నజీవిని కనుగొనడం వ్యాధిని నిర్ధారించడమవుతుంది. ఇది కూడా పరీక్షకు ఎన్నుకొన్న అవయవాన్ని అవయవాల నుంచి తీసిన ద్రవంలో పరాన్నజీవి యొక్క సాంద్రతను బట్టి నిర్ధారణ నిష్పత్తి ఆధారపడి వుంటుంది.
ప్లీహము నుండి తీసిన ద్రవంలో ఈ పరాన్న జీవిని ఖచ్చితంగా కనుగొనే అవకాశాలు ఎక్కువగా వుంటాయి. కానీ ఈ ద్రవాన్ని తీయడానికి నిపుణులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని వసతులు వున్న ఆసుపత్రిలో నైతేనే తీయడం మంచిది.
సారూప్యంగల ఇతర వ్యాధులు
- సన్నిపాత జ్వరము
- క్షయవ్యాధి (శరీరమంతా సబ్బుగింజల ప్రమాణం లో వ్యాధి నలుసుల వివిధ అవయవాలలో ఉంటాయి.)
- చలిజ్వరం, వణుకుడు జ్వరం (మలేరియా)
- బ్రూసెల్లోసిస్ గొర్రెలు, మేకల నుంచి మనుషులకు సోకే అంటు వ్యాధి
- కాలేయంలో వచ్చు చీముగడ్డ దీనికి కారణం అమీబా అను ఏకకణ జీవి
- ఇఫెక్షయస్ మోనో న్లూక్షియోసిస్
- శోషరసకణాల పెరుగుదల
- రక్త క్యాన్సరు
- ప్లీహపు వాపు
- కాలేయము నుండి బయటకు వెళ్ళు రక్త నాళాలు మరియు వాహిక లో అవరోధము
భారత దేశంలో నల్ల మచ్చల జ్వరం యొక్క తీవ్రత
- నిరంతరం ప్రబలి ఉండే రాష్ట్రాలు బీహార్, జార్ ఖండ్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్
- 48 జిల్లాలలో నిరంతరం ప్రబలి ఉంటుంది. అక్కడక్కడా కొన్ని వేరే జిల్లాలలో కూడా కనబడుతుంది
- 4 రాష్ట్రాలలో 165.4 మిలియన్ల జనాభా ప్రమాదం బారిన పడవచ్చునని అంచనా
- గ్రామీణ ప్రాంతాలలో నివసించి, ఆర్ధికంగా వెనుక బడినవారిలో ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది
నల్ల మచ్చల జ్వరాన్ని నియంత్రించుటకు భారత దేశంలో చేస్తున్న ప్రయత్నాలు
- 1990-91 లో కేంద్రప్రభుత్వ సాయంతో నియంత్రించ బడిన కార్యక్రమం నిరంతరం ప్రబలి ఉన్న ప్రాంతాలలో ప్రారంభించారు
- భారత ప్రభుత్వము నల్ల మచ్చల జ్వరం మందుల సరఫరా చేస్తున్నారు. పురుగుల మందులు (దోమల, స్యాండ్ ఫ్లై నివారణకు) సాంకేతిక సహకారం భారత ప్రభుత్వం అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆరోగ్య కేంద్రాలు, రాష్ట్ర మలేరియా నివారణ సంస్థల ద్వారా మిగిలిన ఖర్చుభరిస్తూ అమలు చేస్తున్నారు
ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు