“ఎలిఫెంటియాసిస్” అనిపిలిచే లింఫాటిక్ ఫిలేరియాసిస్ అనే వ్యాధి సాధారణంగా బాల్యంలో వస్తుంది. శరీరాకృతిని వికారంగా మార్చటం, శారీరక వైకల్యం కలగటం ఈ వ్యాధి వచ్చిన వారికి జరుగుతుంది.
ఫిలేరియా అనే క్రిమి లక్షలాది సంఖ్యలో సూక్ష్మమైన, అపరిపక్వమైన మైక్రోఫిలేరియా అనే లార్వాను ఉత్పత్తి చేస్తుంది. ఈ లార్వాను పరిసర ప్రదేశాల్లోని రక్తంలో తిరుగుతూ నిర్థేశిత వ్యవధి వరకు నిద్రాణ స్థితి లోనే ఉంటుంది. ఇలా ఈ క్రిములు 4 నుంచి 6 సంవత్సరాల వరకు జీవించి మైక్రోఫైలేరియాను ఉత్పత్తి చేస్తుంటాయి.
దోమ కాటు ద్వారా లింఫటిక్ ఫిలేరియాసిస్ ఒకరి నుంచి ఒకరికి బదిలీ అవుతుంది. మైక్రోఫిలేరియా కలిగి వున్న వ్యక్తిని కుట్టినపుడు దోమ శరీరంలోకి ఈ క్రిమి ప్రవేస్తుంది. దోమ శరీరంలో ఈ మైక్రోఫిలేరియా పెరిగి పెద్దగా అవటానికి 7 నుంచి 21 రోజులు పడుతుంది.
లింఫటిక్ ఫిలేరియాసిస్ రావటానికి సంవత్సరాల తరబడి అనేక దోమకాట్లకు గురికావలసి ఉంటుంది. ఫిలేరియా ప్రబలిన ప్రాంతాల్లో ఎక్కువకాలం పాటు నివసించే ప్రజలకు ఈ వ్యాధి వచ్చే అపాయం ఎక్కువగా ఉంటుంది. రాత్రివేళ రక్తపరీక్షల సర్వే చేయటం ద్వారా ఈ అంటువ్యాధిని కనుగొనవచ్చు.
శరీరంలో ఈ వ్యాధిని కలుగజేసే కీటకాలు మరణించేంత వరకు సాధారణంగా చాలా మందికి ఈ వ్యాధి లక్షణాలు అనుభవంలోకి రావు. మమూలుగా నైతే ఈ వ్యాధి వల్ల ప్రాణాలకు ముప్పు రాదు కాని, శారీరక ద్రవ క్రియా (లింఫ్) వ్యవస్థ మరియు మూత్రపిండాలు దెబ్బతింటాయి. ద్రవాలకు సంబంధించి శారీరక క్రియా వ్యవస్థ సరిగా పనిచేయని కారణంగా, శరీరంలో ఊరే ద్రవాలు ఒకే చోట చేరి భుజాలు, ఛాతీ, కాళ్లకు వాపు కలిగిస్తాయి. ఇలాంటి వాపులకు, “లింఫోడెమా” అని పిలుస్తారు. మగవారికైతే, పురుషాంగం లో కూడా వాపు కలుగుతుంది. దీన్ని “హైడ్రోసీల్” అని అంటారు. వాపు మరియు “లింఫ్ సిస్టమ్” పని తీరులో తగ్గుదల కారణంగా రోగకారక క్రిములు, అంటువ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటం శరీరానికి కష్టమవుతుంది. ఇలాంటి వ్యక్తులకు చర్మంపైన, లింఫ్ వ్యవస్థలోను బ్యాక్టీరియా కారక అంటువ్యాధులు ఎక్కువగా వస్తాయి. ఇవి చర్మాన్ని దళసరిగా, మొద్దుగా తయారు చేస్తాయి. దీన్నే “ఎలిఫెంటియాసిస్” అని కూడా అంటారు.
వ్యాధి కలుగజేసే సూక్ష్మాతి సూక్ష్మమైన క్రిములను చంపటానికి వాడలో ఉన్న వారందరికీ ఔషధాలు ఇవ్వటం, దోమలను నియ్రంత్రించటం నివారణ చర్యల్లో ఒక భాగం. దోమకాటు నుంచి రక్షించుకోవటం నివారణ చర్యల్లో మరో భాగం. ఫెలేరియల్ పురుగులను బదిలీ చేసే దోమలు సాధారణంగా రాత్రి వేళల్లో కుడతాయి. లింఫటిక్ ఫిలేరియాసిస్ ప్రబలి ఉన్న ప్రాంతాల్లో ఒకవేళ మీరు నివసిస్తున్నట్లయితే, ఈ క్రింద పేర్కొన్న జాగ్రత్తలను తీసుకోండి.
ఈ వ్యాధి కీటకాలు సంక్రమించిన వ్యక్తులు ఏడాదికొకడోసు (డి.ఇ.సి.) మందును తీసుకోవటం ద్వారా రక్తంలో సంచరిస్తున్న (మైక్రోఫిలేరియా) సూక్ష్మక్రిములను చంపేయవచ్చు. ఈ మందు శరీరంలో పెద్ద కీటకాలన్నిటినీ చంపలేక పోయినప్పటికీ, కనీసం ఈ వ్యాధి గ్రస్తులు ఇంకొకరికి దీన్ని బదిలీ చేయకుండా నివారించగలరు. పెద్ద కీటకాలు చనిపోయినప్పటికీ, లింఫోడెమా వృద్థి చెందగలదు. ఈ లింపోడెమా తీవ్రమై, హానికలిగించకుండా ఉండాలంటే క్రింద పేర్కొన్న మౌలిక సూత్రాలు పాటించాలి.
ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు
చివరిసారిగా మార్పు చేయబడిన : 7/12/2020