హోమ్ / ఆరోగ్యం / ప్రాథమిక చికిత్స
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ప్రాథమిక చికిత్స

ప్రతి ఫ్యాక్టరీ, ఆఫీసు, పాఠశాల, ఇళ్లల్లో అందరికీ అందుబాటులో ప్రథమ చికిత్స పెట్టె ఉండాలి. ఇది షాపులో రెడీమేడ్ గా లభిస్తుంది. మీరైతే రేకు లేదా అట్టపెట్టెతో మీ ఇంట్లో ప్రథమ చికిత్స బాక్స్ ను తయారు చేసుకోవచ్చు. ఈ క్రింద పేర్కొన్న పరికరాలు, వస్తువులు మీ ప్రథమ చికిత్స పెట్టెలో ఉండాలి.

ప్రథమ చికిత్స పరికరాల పెట్టె
ప్రతి ఫ్యాక్టరీ, ఆఫీసు, పాఠశాల, ఇళ్లల్లో అందరికీ అందుబాటులో ప్రథమ చికిత్స పెట్టె ఉండాలి. ఇది షాపులో రెడీమేడ్ గా లభిస్తుంది. మీరైతే రేకు లేదా అట్టపెట్టెతో మీ ఇంట్లో ప్రథమ చికిత్స బాక్స్ ను తయారు చేసుకోవచ్చు. ఈ క్రింద పేర్కొన్న పరికరాలు, వస్తువులు మీ ప్రథమ చికిత్స పెట్టెలో ఉండాలి.
ప్రాథమిక ప్రథమ చికిత్స
ఎవరికైనా గ్యాస్/వాయువులు పీల్చుట వలన ప్రమాదము సంభంవించినప్పుడు మనమా వ్యక్తిని రక్షించుటకు ఎస్.సి.బి.ఎ ను ధరించి వెళ్ళవలెను. లేనిచో ఆ గ్యాస్/వాయువులు మనకు కూడ హాని కలిగించగలవు.
గొంతులో అడ్డు
తింటున్న భోజన పదార్థము కాని, అన్య పదార్థము (చిన్న పిల్లలు పెట్టుకొనే కొబ్బరి ముక్క, చింతపిక్కలు, చాక్లెట్ వగైరా) కాని గొంతులోని శ్వాస నాళమునకు అడ్డుపడి ఆ వ్యక్తిని ఉక్కిరి బిక్కిరి చేయవచ్చును.
స్రృహ కోల్పోయినచో
ఏ కారణం చేతనైనా ఒక వ్యక్తి స్రృహ లేని పరిస్థితిలో ఉంటే అతనికి DRABCR పద్దతిని పాటించాలి.
మూర్ఛలు
మూర్ఛలనేవి (తీవ్రంగా లేక ఉగ్రంగా కండరాలు తమ ప్రమేయం లేకుండా ముడుచుకుపోవడం, ఈడ్చుకు పోవడం) ఆకస్మిక జబ్బులో కానీ, మూర్ఛరోగం, అపస్మారకంలో కనబడుతాయి. రోగి శ్వాస ఆగిపోవడం ప్రమాదకరమైన పరిస్థితి. వెంటనే వైద్యులు సహాయం తీసుకోవాలి.
వడదెబ్బ
వడదెబ్బ, దీనినే ఎండదెబ్బ అని కూడా అంటారు ఎక్కువ ఉష్ణోగ్రతల తాకిడికి గురైన కారణంగా శరీరంలోని వేడిని నియంత్రించే విధానం విఫలమయి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడడం . చాలా వేడియైన వాతావరణం లేదా చురుకైన పనులవలన కలిగే అధిక వేడిని శరీరం తట్టుకోలేనప్పుడు ఇది సంభవిస్తుంది
పాము కాటుకు వైద్యముంది
పాము అనగానే అందరికీ భయం. పాము కాటు వేసిందంటే ప్రాణం పోయినట్టే అన్నది అపోహ. అసలు పాముల గురించి సరైన సమాచారం లేకపోవడమే ఈ అపోహలకు, అపనమ్మకాలకు కారణం.
రక్తస్రావం
రక్తప్రసారణ మార్గం నుంచి రక్తం కారిపోవడాన్నే రక్తస్రావం అంటారు. రక్తస్రావం - శరీరంలోపల, అంతర్గతంగా రక్తనాళాలకు చిల్లులు పడి జరగవచ్చు...లేదా శరీరం బయటి భాగంలోని యోని, నోరు, ముక్కు వంటి శరీర ద్వారాల నుంచి గానీ, గాయంద్వారా చర్మంతెగిగానీ జరగవచ్చు.
కుక్కకాటు
కుక్క విశ్వాస పాత్రమైన జంతువు అని విశ్వసించండంలో తప్పు లేదు. అయితే రేబీస్ సోకిన పిచ్చికుక్కను మాత్రం ఖచ్చితంగా విశ్వసించకండి. వీధి కుక్క కరిచినా, వ్యాక్సిన్ చేయించని పెంపుడు కుక్క కరిచినా- అది రేబీస్ సోకిన కుక్కయితే అత్యంత ప్రమాదం అని గుర్తించండి.
విష ప్రభావం
విష ప్రభావం వల్ల చాలా మంది అస్వస్థులవడం, కొందరు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. గాలి ద్వారా, నీటి ద్వారా ఏ రూపంలోనైనా విష ప్రభావం ప్రమాదకరమే. కాబట్టి తక్షణమే చికిత్స అవసరం. రైతులు సస్యరక్షణ మందులు వాడినపుడు తగు జాగ్రత్తలు పాటించాలి.
నావిగేషన్
పైకి వెళ్ళుటకు