హోమ్ / ఆరోగ్యం / ప్రాథమిక చికిత్స / 108 అత్యవసర ప్రతిస్పందన సేవ
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

108 అత్యవసర ప్రతిస్పందన సేవ

1-0-8 అత్యవసర ప్రతిస్పందన సేవ వైద్య, పోలీస్ మరియు అగ్ని ప్రమాదాలకై 24X7 (ఇరవై నాలుగు గంటలూ, వారానికి ఏడు రోజులూ) పని చేసే అత్యవసర సేవ.

1-0-8 అత్యవసర ప్రతిస్పందన సేవ వైద్య, పోలీస్ మరియు అగ్ని ప్రమాదాలకై 24X7 (ఇరవై నాలుగు గంటలూ, వారానికి ఏడు రోజులూ) పని చేసే అత్యవసర సేవ. ఈ సేవ రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, గోవా, తమిళ్ నాడు, రాజస్థాన్, కర్ణాటక, అస్సాం, మేఘాలయ మరియు మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో అందుబాటులో ఉంది.

ఈ సేవ యొక్క ప్రధానాంశాలు:

 • ఇది 24x7 అత్యవసర సేవ
 • లాండ్ లైన్ ఫోన్ నుండి కాని, మొబైల్ (సెల్ ఫోన్) నుండి కాని టోల్ ఫ్రీ నంబర్ పై అందుబాటులో ఉంటుంది.
 • సగటున 18 నిమిషాలలో అత్యవసర సేవ మీకు అందుతుంది.

ఈ క్రింది పేర్కొన్న ప్రయోజనాలకై 1 -0-8 కు డయల్ చెయ్యాలి:

 1. ప్రాణాన్ని కాపాడడానికి
 2. అప్పుడు జరుగుతూ ఉన్న నేరాన్ని తెలుపడానికి
 3. అగ్ని ప్రమాదం గురించి తెలుపడానికి

మొదటి 24 గంటలూ ప్రాధమిక వైద్య సంరక్షణను ఉచితంగా అందచేయడానికి గాను 108 అత్యవసర ప్రతిస్పందన సేవ 6800 కి పైగా ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకుంది.

వివిధ రకాల అత్యవసర పరిస్థితులు:

వైద్యసంబంధఅత్యవసరపరిస్థితులు

పోలీస్ఎమర్జెన్సీలు


అగ్నిప్రమాదాలు

తీవ్రమైనగాయాలు

దొంగతనాలు,దోపిడీలు

కాలినగాయాలు

గుండెపోటు

వీధిదెబ్బలాటలు

మంటలుచెలరేగడం

స్ట్రోక్(వాతం)

ఆస్తితగాదాలు


పరిశ్రమలలోఅగ్నిప్రమాదాలు

శ్వాససంబంధసమస్యలు

స్వయంకృతగాయాలు/ఆత్మహత్యాప్రయత్నాలు

మధుమేహం

దొంగతనాలు


ప్రసూతి,చంటిపిల్లల,పిల్లలవైద్యఅవసరాలు

దెబ్బలాటలు

మూర్ఛ

బహిరంగగొడవలు


స్పృహకోల్పోవడం

తప్పిపోవడం

జంతువులకాట్లు

కిడ్నాపులు

తీవ్ర మైన జ్వరం

ట్రాఫిక్సమస్యలు(ట్రాఫిక్జాం,ర్యాలీలు,రాస్తారోకోలు మొదలైనవి)

 

అంటువ్యాధులు

బలవంతపుచర్యలు,దొమ్మీలువంటివి

నిజమైన అత్యవసర పరిస్థితి లేనిదే 1-0-8 కు కాల్ చేయవద్దు. ఇది విచారణకో, సమాచార సేకరణకో చేసే నంబర్ కాదు. నవ్వులాటకి ఈ నంబర్ కి ఫోన్ చేసి ఆటలాడుకోవద్దు. అది ఒక నిజమైన ఆపదలో ఉన్న వారి కాల్ కు అడ్డు తగిలి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవచ్చు. ఒకవేళ పొరపాటున డయల్ చేసినట్లయితే సంబంధిత అధికారికి విషయం చెప్పే వరకూ ఫోన్ పెట్టేయవద్దు.

భారత దేశంలో జి.వి.కే. ఇ.ఎం.ఆర్.ఐ. - 108 అందుబాటు

108 అత్యవసర ప్రతిస్పందన సేవ 2005 ఆగష్టు లో హైదరాబాద్ లో మొదలవగా ప్రస్తుతం జి.వి.కే. ఇ.ఎం.ఆర్.ఐ. ఒక సమగ్ర అత్యవసర సేవను రాష్ట్ర వ్యాప్తంగా 752 అంబులెన్సులతో నడుపుతూ రోజుకి 4800 మందికి అత్యవసర సేవ లంది స్తోంది. ఆంధ్ర ప్రదేశ్ లోనూ, గుజరాత్ లోనూ జి.వి.కే. ఇ.ఎం.ఆర్.ఐ. 108 అత్యవసర సేవలను చూసి ఉత్తరాఖండ్, తమిళ్ నాడు, మధ్య ప్రదేశ్, గోవా, అస్సాం, రాజస్థాన్, కర్ణాటక, మేఘాలయ మరియు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాలలో కూడా ఇటువంటి అత్యవసర పరిస్థితి ప్రతిస్పందన కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆసక్తి చూపించాయి.
జి.వి.కే. ఇ.ఎం.ఆర్.ఐ. ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గోవా, తమిళ్ నాడు, కర్ణాటక, అస్సాం, మేఘాలయ మరియు మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో అమలులో ఉంది.

వివిధ రాష్ట్రాలలో అంబులెన్సుల వ్యాపన

 1. ఆంధ్ర ప్రదేశ్ -752
 2. గుజరాత్ - 403
 3. ఉత్తరాఖండ్ -108
 4. రాజస్థాన్ - 164
 5. తమిళ్ నాడు -385
 6. గోవా - 18
 7. కర్ణాటక - 408
 8. అస్సాం - 280
 9. మేఘాలయ - 28
 10. మధ్య ప్రదేశ్ - 55

అత్యవసర పరిస్థితులలో స్వఛ్ఛంద సేవకులు (వి ఒ ఐ సి ఇ )

అత్యవసర పరిస్థితులను తెలుసుకుని, సహాయం అందేటట్లు చూడడానికి జి.వి.కే. ఇ.ఎం.ఆర్.ఐ. స్వఛ్ఛంద సేవను ప్రవేశ పెట్టింది. 1-0 -8 సేవల గురించిన సమాచారాన్ని వ్యాప్తి చేసేందుకు జి.వి.కే. ఇ.ఎం.ఆర్.ఐ. వాలంటీర్ల సహాయాన్ని తీసుకునేందుకు ఆసక్తి చూపుతోంది.

 • టెలిఫోన్ సౌకర్యం లేని వారి అత్యవసర పరిస్థితిని తెలియబరచడం
 • అంబులెన్స్ వచ్చేంత వరకూ ఆపదలో ఉన్నవారికి సహాయపడటం
 • ఆపదలో ఉన్నవారి కూడా ఆసుపత్రికి వెళ్లి తెలియని వారికి తెలియ చెప్పడం
 • అంబులెన్స్ కలిసే అంత వరకూ ఆపదలో ఉన్నవారిని అక్కడికి తీసుకొని వెళ్ళడం లేదా అంబులెన్స్ బిజీగా ఉండి దొరకని పక్షంలో వారిని తిన్నగా ఆసుపత్రికి చేర్చడం.

జి.వి.కే. ఇ.ఎం. ఆర్. ఐ. ఆశించేవి:

 • మొదట ఉపచారము చేయు వ్యక్తిగా : ప్రమాదంలో ఉన్న వ్యక్తికి ప్రధమ చికిత్స చేసి హాస్పిటల్ చేరే వరకూ సంరక్షించడం. వాలంటీరు కనుక డాక్టర్ అయి ఉన్నట్లయితే వైద్యపరమైన అత్యవసర పరిస్థితులలో అంబులెన్స్ వచ్చే లోపే చికిత్స మొదలు పెట్ట వచ్చు.
 • అనుచరునిగా : వాలంటీర్ ప్రమాదంలో ఉన్నవారితో అంబులెన్స్ లో / హాస్పిటల్ లో తోడుగా ఉండడం.
 • డ్రైవర్ గా: ఆపదలో ఉన్న వారిని వాహనంలో హాస్పిటల్ కి చేర్చడం మరియు అనారోగ్యం వలన కానీ మరి ఏ ఇతర కారణాల వలన కానీ జీ. వి.కే. ఇ.ఎం.ఆర్.ఐ. వారి సిబ్బంది అందుబాటులో లేకపోతే డ్రైవర్ గా వ్యవహరించడం.
 • వాహన మెకానిక్ గా : అత్యవసర సేవలు కుంటు పడకుండా ఉండడానికి జీ. వి.కే. ఇ.ఎం.ఆర్.ఐ. నెట్ వర్క్ వారి వాహనాలకు వచ్చే చిన్నా పెద్దా మరమ్మత్తులను చేపట్టడం మరియు సర్వీసింగ్ చేయడం.

ఆధారము: జి వి కె – ఇ ఎమ్ ఆర్ ఐ

2.95454545455
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు