పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

కుక్కకాటు

కుక్క విశ్వాస పాత్రమైన జంతువు అని విశ్వసించండంలో తప్పు లేదు. అయితే రేబీస్ సోకిన పిచ్చికుక్కను మాత్రం ఖచ్చితంగా విశ్వసించకండి. వీధి కుక్క కరిచినా, వ్యాక్సిన్ చేయించని పెంపుడు కుక్క కరిచినా- అది రేబీస్ సోకిన కుక్కయితే అత్యంత ప్రమాదం అని గుర్తించండి.

కుక్క విశ్వాస పాత్రమైన జంతువు అని విశ్వసించండంలో తప్పు లేదు. అయితే రేబీస్ సోకిన పిచ్చికుక్కను మాత్రం ఖచ్చితంగా విశ్వసించకండి. వీధి కుక్క కరిచినా, వ్యాక్సిన్ చేయించని పెంపుడు కుక్క కరిచినా- అది రేబీస్ సోకిన కుక్కయితే అత్యంత ప్రమాదం అని గుర్తించండి.

వీధి కుక్కలు భయపడితే కరుస్తాయి. ఇంట్లోని కుక్కలతో పిల్లలు ఆటలాడుతూ కరిపించుకుంటారు. అప్పుడే ఈనిన కుక్క తన పిల్లల దగ్గరకు ఎవరు వెళ్ళినా కరుస్తుంది. కుక్కకాటు సాధ్యమైనంత వరకు తప్పించు కోవడం- పిచ్చి కుక్కకాటు అని అనుమానం వస్తే, విధిగా సమీప ఆసుపత్రిలో యాంటీ ర్యాబీస్ వేక్సిన్ చేయించుకోవడం మరవద్దు.

కుక్కలందు పిచ్చి కుక్కవేరయా.

 • పిల్లలు పెంపుడు కుక్కలతో ప్రమాదకరమైన ఆటలాడ కుండా జాగ్రత్త వహించండి. ఆటలాడి బిస్కట్ లు తినిపిస్తూ చేయి కొరికించుకునేవారు, కుక్క పిల్లతో పరుగు పెట్టించి లేదా దాగుడు మూతలాడుతూ ప్రమాదం తెచ్చుకునేవారెందరో.
 • కుక్కలన్నీ పిచ్చికుక్కలు కావు. వీధి కుక్క కరవగానే వీలయితే దాన్ని కొంతకాలం గమనించండి. సాధారణంగా పది రోజుల వరకు కుక్క మామూలుగానే తిరుగాడుతుంటే అది ప్రమాదం లేనిదని గుర్తించండి.
 • గతంలో మాదిరిగా పిచ్చికుక్క కాటుకు బొడ్డు చుట్టూ సూదులు వేయించుకునే బాధ ఇపుడు లేదు. 0-3-7-28 రోజులకు కేవలం నాలుగు డోసులు నొప్పిలేని సాధారణఇంజక్షన్ రూపంలో తీసుకుంటేచాలు.
 • పెంపుడు కుక్కలకు తప్పనిసరిగా నిర్ణీత వ్యవధిలో ఏంటీ రబీస్ టీకాలు వేయించండి. దాని వల్ల మీకు, ఇతరులకు కూడా ప్రమాదం తప్పుతుంది.
 • పాము కాటులా కుక్కకాటుకు తక్షణమే చికిత్స అవసరం లేదు పిచ్చికుక్కని అనుమాన ముంటే T,T. ఇంజెక్షన్, గాయానికి కట్టు వంటి ప్రాధమిక చికిత్స చేయించుకొని ఒకటి రెండు రోజుల్లో చికిత్స ప్రారంభించవచ్చు.
 • కుక్కకాటుకు అన్ని ప్రభుత్వాసుపత్రల్లో ఉచిత చికిత్స లభిస్తుంది.
 • స్దానిక సంస్ధల సహకారంతో జనావాసాల్లో తిరిగే వీధి కుక్కలకు టీకాలు వేయించడం వల్ల రేబీస్ వ్యాధిని అదుపులో ఉంచొచ్చు.

పరుగే ప్రమాదం

 • కుక్కను చూసి పరుగెత్తవద్దు, దాని వల్ల అది మీ వెంటబడి కరిచే ప్రమాదముంది
 • కొందరు పిల్లలు సరదా కోసం నిద్ర పోతున్న కుక్కల మీద రాళ్లు రువ్వి ప్రమాదం కొని తెచ్చుకుంటారు
 • పెంపుడు కుక్కలున్న ఇళ్లముందు కుక్క ఉన్నది జాగ్రత్త (BEWARE OF DOGS) బోర్డు పెడతారు.నిజానికి ఇంట్లోని వారు కూడా ఆ హెచ్చరిక పాటిస్తూ మరింత జాగ్రత్త వహించాలి. క్రమం తప్పకుండా తమ పెంపుడు కుక్కకు టీకాలు వేయించడం, పిల్లలు వాటితో ఆటలాడి ప్రమాదం తెచ్చుకోకుండా చూడ్డం ఎంతో ముఖ్యం
 • పెంపుడు కుక్కను తీసుకొని వీధిలో వాకింగ్ చేస్తుంటారు కొందరు. ఒక్కోసారి ఇతర పాదచారుల పైకి ఆ శునకం లంఘించే ప్రమాదముంది
 • నిజానికి కుక్క విశ్వాస పాత్రమైన జంతువే. అయితే రేబీస్ వ్యాధి సోకిన (పిచ్చి) కుక్కను విశ్వసిస్తే మనకు ప్రమాదం
 • సాధారణంగా కుక్కలు అపరిచితులను, అనుమానంగా తచ్చాడేవారిని చూస్తే అరచి, కరిచే ప్రమాదముంది
 • పెంపుడు కుక్కలను పగటిపూట, విజిటర్స్ వచ్చే సమయాల్లో గొలుసుతో కట్టి ఉంచడమే మంచిది.

ఆధారము: వైద్య ఆరోగ్యశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

3.08490566038
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు