పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

గొంతులో అడ్డు

తింటున్న భోజన పదార్థము కాని, అన్య పదార్థము (చిన్న పిల్లలు పెట్టుకొనే కొబ్బరి ముక్క, చింతపిక్కలు, చాక్లెట్ వగైరా) కాని గొంతులోని శ్వాస నాళమునకు అడ్డుపడి ఆ వ్యక్తిని ఉక్కిరి బిక్కిరి చేయవచ్చును.

తింటున్న భోజన పదార్థము కాని, అన్య పదార్థము (చిన్న పిల్లలు పెట్టుకొనే కొబ్బరి ముక్క, చింతపిక్కలు, చాక్లెట్ వగైరా) కాని గొంతులోని శ్వాస నాళమునకు అడ్డుపడి ఆ వ్యక్తిని ఉక్కిరి బిక్కిరి చేయవచ్చును.

అలాంటి సందర్బాలలో

 1. కళ్ళ వెంబడి, ముక్కు వెంబడి నీరు కారడం.
 2. శ్వాస యిబ్బంది గురై ఉక్కిరి బిక్కిరి కావడం జరుగుతుంది.

పెద్దలయితే

 1. 5 సార్లు దగ్గమని చెప్పాలి.
 2. అతనిని ముందుకు వంచి, వీపున రెక్క ఎముకల మధ్య గట్టిగ 5-6 సార్లు చేతితో కొట్టాలి.
 3. అడ్డు తొలగక పోతే అతని వెనుక నిల్చుండి ఒక చేతి పిడికిలి అతని కడుపుపై నుంచి రెండవ చేతితో పిడికిలి పట్టుకొని అతని కడుపును గట్టిగ లోనికి నెట్టాలి. ఈ విధంగా నాలుగు సార్లు ప్రయత్నించాలి.
 4. అప్పటికి అడ్డు తొలగకపోతే ఐదు సార్లు వీపుపై కొడుతూ ఐదుసార్లు కడుపుపై నొక్కుతూ అడ్డు తొలగు వరకు చేయాలి.
 5. ఆ వ్యక్తి స్రృహ కోల్పోతే, శ్వాస సక్రమంగా ఆడకుంటే అతనిని ప్రక్కకు పరుండబెట్టి తల భాగము క్రిందికి వేలాడునట్లు ఉంచి కడుపు నొక్కాలి.
 6. ఒక వేళ శ్వాస ఆగితే కల్పిత శ్వాస కలిగించాలి.
 7. ఒక వేళ గుండె పని చేయకుంటే కార్డియాక్ మసాజ్ చేయాలి.
 8. అతనిని ఆస్పత్రికి తరలించాలి.

చిన్న పిల్లలయితే

 • కాళ్లు పట్టుకొని పైకి లేవనెత్తి వీపుపై కొట్టాలి.
 • లేదా తలక్రిందులుగా వ్రేలాడునట్లు నీ తొడలపై బోర్ల పరుండబెట్టి వీపుపై కొట్టాలి.
 • ఆ తరువాత డాక్టరును సంప్రదించాలి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.00854700855
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు