హోమ్ / ఆరోగ్యం / ప్రాథమిక చికిత్స / ప్రమాదాలు - ప్రథమ చికిత్స
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ప్రమాదాలు - ప్రథమ చికిత్స

ప్రమాదాలు - ప్రథమ చికిత్స.

మన దైనందిన జీవితంలో అనేక రకాల పనులు చేస్తుంటాం. ఇందుకోసం వివిధ రకాల పరికరాలను ఉపయెగింస్తుండటం. మనం చేసే పనిలో ఏకాగ్రత, నైపుణ్యం ఉన్నపుడు ఉన్నత ఫలితాలను సాధించగలుగుతాం. అనేక కారణాలవల్ల ఒక్కోసారి చేసే పనిలో ఏకాగ్రత లోపిస్తుంది. అందువల్ల ప్రమాదాలకు గురౌతుంటాం. నీళ్ళలో మునగడం, కరెంటు షాక్ కొట్టడం, పనిముట్ల వల్ల గాయాలు కావడం మొదలైనవన్నీ అనాలోచితంగా చేసే పనులవల్ల జరిగే ప్రమాదాలు. ఇలా అనుకోకుండా ప్రమాదం సంభవించినప్పుడు బెంబేలు పడిపోతే ప్రాణహాని కూడా జరగవచ్చు. అందువల్ల ఇలాంటి సందర్భాలలో ప్రథమ చికిత్స ఎలా చేయాలో తెలుసుకుని ఉండడం అవసరం. వైద్య సహాయం పొందేలాగే మనం అందించే ఈ ప్రథమ చికిత్స ప్రాణాన్ని కాపాడుతుంది. ప్రమాదం కలిగిన సందర్భాలలో ఎలా ప్రథమ చికిత్స చేయాలో తెలుసుకుందాం.

నీళ్ళలో మునగడం (Drowning)

ప్రమాదవశాత్తు "నీళ్ళలో మునగడం" (Drowning) అనేది జరగవచ్చు.

కారణాలు

 • ఈత రానివారు పొరపాటున నీళ్ళలో పడిన, ఈత వచ్చినవారు ఈదటం వలన బాగా అలసిపోయిన.
 • ఈత వచ్చినవారు ప్రవాహ వేగానికి తట్టుకోలేకపోయిన.
 • ఈత వచ్చినవారికి శరీరంనిండా బట్టలున్న
 • మూర్ఛ జుబండి నీళ్ళలో ఉన్నప్పుడు ఫిట్సు వచ్చినా.
 • అకస్మాత్తుగా, కాళ్ళు చేతుల కండరాలు పట్టేసిన.
 • ఈత వచ్చిన కూడా ఆత్మహత్య చేసుకోవాలని బరువైన రాయిని కట్టుకొని నీళ్ళలో దూకినా, మునిగిపోతారు.

లక్షణాలు

నీళ్ళలో మునిగిపోగానే ఊపిరి అందదు. ఊపిరి పిల్చాలనే ప్రయత్నంలో ఉపిరితిత్తులలోనికి నీళ్ళు పోవటం, స్వరపేటిక మూసుకుపోవడం, కొద్దీ నిముషాలలోనే ప్రాణాపాయం సంభవిస్తుంది.

ఈదేటప్పుడు ప్రమాద హెచ్చరిక లక్షణాలు

 • అలసట పెరిగేకొద్దీ బోర్లా ఈడే శరీరం, క్రమేణా నిట్టనిలువుగా మారి కేవలం తల మాత్రమే పైకి కనపడుతుంది.
 • నీళ్ళలో ఈదే చేతులు, కాళ్ళ కదలికలు క్రమం తప్పిపోతాయి.
 • ఈదే  వ్యక్తి పెదాలు, నాలుక, ముఖం నీలం రంగుకు మారతాయి.
 • ఈ స్ధితిలో ఉన్న మనిషిని అలానే వదిలేస్తే తప్పక మునిగిపోతాడు.

ప్రథమ చికిత్స

 • మనిషి మునిగే ప్రమాదంలో ఉంది సహాయం కోసం చూస్తుంటే తేలికయిన బెండుని గాని, గాలినింపిన పెద్ద బంతిని గాని, మునగ బెండుగాని, టైరు గని, తేలికయిన కొయ్యనిగాని ఆ మనిషి దగ్గరకు విసిరేయాలి.
 • మునిగిపోతున్న మనిషి తెలివితో ఉంటే వెదురు బొందుగుని గాని, త్రాడునిగాని, పొడవాటి గుద్దని (పంచె, చీర) గాని ఆ మనిషి దగ్గరకు విసిరి రెండవ కొసను గట్టిగ ఒకచేత్తో పట్టుకోవాలి. రెండవ చేత్తో ఒడ్డున ఏదయినా వస్తువును బలంగా పట్టుకుని ఆ పైన మనిషిని బయటకు లగటంగాని, ప్రాకుంటూ రమ్మనిగాని చెప్పాలి.
 • పడవలో ఉంది నీళ్ళలో పడిన మనిషిని రాశించాల్సి వస్తే ఎదుర్రోమ్మును పడవ అంచుకు మీటించి (మేపి) చేతుల్తో లాగాలి.
 • ఈత బాగా వచ్చినవారు నీళ్ళలో పడిన వ్యక్తికన్నా బలంగా ఉంటే, నీళ్ళలో దూకి అతని జుట్టునుగాని, నడుముకున్న బట్టలుగాని, భుజంకాని పట్టుకొని లాక్కురావచ్చు. ఈ క్రమంలో మునిగిపోతానవి భయపడిన మనిషి రాశించటానికి పోయిన వ్యక్తి గొంతును బిగించకుండా చూడాలి.
 • నీళ్ళు ఎక్కువ లోతు లేకపోతే మునిగిన మునిగిన మనిషి తల పైకిలేపి నోటికడ్డం పడిన చెత్తాచెదారం తీసివేసి, అక్కడే నోట్లో నోరు పెట్టి గాలి ఉఁడాలి. ఆలా కొన్నిసార్లు గాలి ఊదిన తర్వాత ఒడ్డుకు తీసుకురావచ్చు.
 • ఒడ్డుకు లాక్కువచ్చిన తర్వాత వ్యక్తి ఊపిరి పిల్చుతుంటే వంటిమీదన్న బట్టలు వదులుచేసి, "బోర్లా పడుకోబెట్టి" కాళ్ళవైపు ఎత్తు ఉంచి పొట్టనిండా అలవిగాకుండా త్రాగిన నీళ్ళు బయటపడేట్లుగా పొట్టమీద నొక్కాలి. సినిమాలో లాగా వెల్లికిలా పడుకోబెట్టి కాదు.
 • మునిగిన మనిషికి ఊపిరి ఆడకుండా ఉంటే, నోటిలో నోరు పెట్టి ఊదుతూ కృత్రిమ శ్వసనివ్వాలి.
 • నాడి కూడా అందకపోతే ఛాతీమీద నొక్కి (Cardiac Massage) గుండె కొట్టుకొనేట్లు చేయడానికి ప్రయత్నించాలి. నాడి కొట్టుకోవడం, ఊపిరి పీల్చటం మొదలెట్టి, ఇంకా తెలివి రాకపోతే "తెలివితో లేని రోగిని పాడుకోబెట్టే పద్ధతి" లో పాడుకోబెట్టాలి. తడిబట్టలు తీసేసి చుట్టాలి.
 • చల్లని నీళ్ళలో పడితే, శరీరం చల్లబడిపోయే ప్రమాదముంది. వెంటనే పొడిబట్టలు దట్టంగా చుట్టాలి. తెలివితో ఈమొత్తాటె వేడి వేడి పానీయాల్ని ఇవ్వాలి. తెలివిలో లేకపోతే ప్లాస్టిక్ కావళ్లలో వేడినీళ్ళు పోసి తేలిగ్గా వాళ్ళంతా అద్దుతూ ఉండాలి.
 • వేడి వస్తుందని సారాయి త్రాగటం గాని, అరచేతులు, అరికాళ్ళు, ఆ మాటకొస్తే వాళ్ళంతా రుద్దటం ప్రమాదకరం.

సినిమాలలో ఎలా చూపిస్తారు

ఎప్పుడూ హీరోయిన్లే నీళ్ళలో మునిగిపోతారు. హీరోలు యధాప్రకారం రాశించటానికి దూకేస్తారు. తడిచిన హీరోయిన్ ను ఒడ్డున పాడుకోబెడతారు. పొట్టమీద నెమ్మదిగా నొక్కుతారు. నొటిలొంచి తగిన నీళ్ళను 'బోళాక్కి  బోళాక్కి' అని కక్కేస్తుంది హీరియిన్.

పొట్టలోకి పోయిన నీటితో ప్రమాదం లేదు. ఆ నీటిని పొట్టన నొక్కి బయటకు తీసుకురానక్కర్లేదు. పైగా వెల్లికిలా పడుకోబెట్టింది వ్యక్తిని పొట్టన నొక్కి నీటిని వెనక్కు రప్పి స్తే, ఆ నీటిలో కొంత ఊపిరితిత్తుల్లోకి పోథేయిప్పుడుతుంది. అసలైన ప్రమాదం.

ఊపిరితిత్తుల్లోకి నీరు పోయినందువలనగాని, స్వర పెట్టుక మూసుకుపోయినందువలన గాని ఊపిరి అందకపోతే చేయాలిసిందేంటంటే నోటిలో నోరు పెట్టి ఊపిరి ఎక్కించాలి. ఉన్నంతలో బ్రతికించటానికి యిదొక్కటే మార్గం.

కొన్ని ప్రశ్నలు

 1. ప్రమాదానికి గురయిన వ్యక్తి అతన్ని రాశించటానికి వెళ్లిన వ్యక్తి మెడను వాటేసుకుంటే ఎం చేయాలి?
 2. కాలువలో కొట్టుకుపోతున్న వ్యక్తికి ఒడ్డనుంచే పొడవాటి తగునో, గుడ్డనో అందించేవాడా? కొట్టుకుపోయ్యే వక్తి వెనుకాలే దూకినవాడా? ఎవరు నిజమైన హీరో?

ఆధారం : ఆరోగ్య వ్యాయమ విద్య

2.96296296296
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు