অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ప్రాథమిక ప్రథమ చికిత్స

గ్యాస్ / వాయువు పీల్చినచో చేసే ప్రథమచికిత్స

ఎవరికైనా గ్యాస్/వాయువులు పీల్చుట వలన ప్రమాదము సంభంవించినప్పుడు మనమా వ్యక్తిని రక్షించుటకు SCBA ను ధరించి వెళ్ళవలెను. లేనిచో ఆ గ్యాస్/వాయువులు మనకు కూడ హాని కలిగించగలవు. కాబట్టి తగిన రక్షణ తొడుగులను ధరించి  ఆ వ్యక్తిని ప్రమాద ప్రదేశాల నుంచి దూరానికి తరలించవలెను. ఆ వ్యక్తిని సురక్షిత ప్రదేశములో పరుండబెట్టి, బిగుతుగానున్న దుస్తులను వదులు చేసి, స్రృహలేనట్లయితే అతనికి శ్వాస, గుండె, పని చేయుచున్నది, లేనిది గమనించాలి.

శ్వాస లేనట్లయితే, మొదట అతని శ్వాస నాళాన్ని సరిచేసేందుకు.

 1. నొసటిపై ఒక చేయి ఉంచి రెండవ చేతితో గడ్డాన్ని పైకి ఎత్తిపట్టాలి.
 2. నోటిలో ఏదైనా అడ్డు (ఉదా” కట్టుడుపళ్ళు, పాన్ వగైరా) ఉంటే దానిని తీసివేయాలి.

శ్యాసనాళము సరిచేయుట వలన శ్వాస తిరిగి ప్రారంభముకావచ్చును. ఒక వేళ శ్వాస లేకుంటే కల్పిత శ్వాస కలిగించాలి.

కల్పిత శ్వాస పద్దతులు

 1. ముందుగా గాలి మార్గాన్ని మెరగుపరచుటకై నొసలుపై ఒక చేయివుంచి,యింకొక చేతితో గడ్డాన్ని ఎత్తి పట్టాలి.
 2. నోటిలో ఏవైనా అన్యపదార్థములుంటే వాటిని తీసివేయాలి.
 3. గాయపడిన వ్యక్తి నోటిపై ఒక గుడ్డను శుభ్రతకొరకై ఉంచాలి.
 4. గాయ పడిన వ్యక్తి ముక్కును వ్రేళ్ళతో మూయాలి.
 5. ప్రథమ చికిత్స చేయువాడు గట్టిగా గాలి పీల్చుకొని గాయపడిన వ్యక్తి నోరును తన  నోటితో పూర్తిగా మూసి గాలిని బలంగా గాయ పడిన వ్యక్తి నోటిలోనికి ఊదాలి.
 6. ఛాతి పెద్దదైనదో, లేదో గమనించాలి. ఛాతి పెద్ద దైనట్లయితే, గాయపడిన వ్యక్తి ఊపిరితిత్తులలోనికి  మీరూదిన గాలి వెళ్ళినట్లు అని నిర్థారించుకోవాలి. ఈ పని వలన అతను గాలి పీల్చుకున్నట్లయినది.
 7. మీ నోటిని అతని నోటిపై నుండి తొలగించాలి. అప్పుడు అతని ఊపిరితిత్తులలోని గాలి బయటకు వచ్చును. ఈ పని వలన అతను గాలి వదిలినట్లయినది.
 8. ఈ విధముగా నిముషమునకు 12 సార్లు ఎంతసేపు అవసరముంటే అంత సేపు చేస్తూ అతనిని ఆస్పత్రికి తరలించాలి.
 9. దీనిని అతనికి శ్వాస తిరిగి వచ్చినప్పుడు కాని లేక ఒక వైద్యుడు అక్కడకు చేరినప్పుడు కాని లేదా ఆవ్యక్తిని  ఆస్పత్రికి  చేరినప్పుడు కాని విరమించవచ్చును.

శ్వాస మార్గమును మెరుగుపరుచు పద్దతి

 1. మీరు గాలి అతని నోటిలోనికి ఊదినప్పుడు ఛాతి పెద్దగాకాకున్న యెడల అతని శ్వాస నాళములో దిగువన ఏదో అడ్డున్నట్లు గమనించాలి.
 2. అప్పుడు అతనిని వెల్లకిల పరుండబెట్టి అతని వీపుపై 5 లేక 6 సార్లు గట్టిగా చరచి దవడను పైకి ఎత్తిపట్టి గొంతులో నున్న అన్యపదార్థాన్ని తీసి, నోటినుండి నోటి ద్వారా గాలిని ఊదాలి.

నోటి నుండి ముక్కు ద్వారా కల్పిత శ్వాసను క్రింది సందర్బాలలో ఇవ్వాలి

 1. క్రింది దవడ ఎముక విరిగినప్పుడు
 2. పెదవులు, నోరు కాలినప్పుడు ( ఆమ్లము, క్షారము, త్రాగినప్పుడు)
 3. వ్యక్తి నోటిలో ఉండగ కల్పిత శ్వాస చేయవలసి వస్తే నోటిపై

నోరుంచి గాలి ఊదుటకు బదులుగా అతని నోటిని మూసి, మీ
నోటితో అతని ముక్కును మూసి గాలిని ఊదాలి.

నోటి నుండి నోరు ముక్కు ద్వారా

రోగి చిన్న బిడ్డ అయితే అతని నోరు, ముక్కు చుట్టు నీ నోరుంచి అతని రొమ్ముపైకి వచ్చు వరకు నెమ్మదిగా గాలిని ఊదాలి. ఈ విధముగా నిముషమునకు 20 సార్లు చేయాలి.

అంబుబ్యాగ్ సహయంతో నోటి ద్వారా కల్పిత శ్వాస

మీ దగ్గర (అంబుబ్యాగ్) అందుబాటులో ఉన్నప్పుడు మాస్క్ ను గాయపడిన వ్యక్తి నోటిపై ఉంచి గాలి బంతిని నొక్కినప్పుడు అతని రొమ్ముపైకి వచ్చును. బంతిని  వదిలినప్పుడు రొమ్ము క్రిందికి వెళ్ళి అతని ఊపిరితిత్తులోని గాలి వాల్వ్ ద్వారా బయటకు వెళ్ళును.

గుండె పని చేయుకుండుటకు కారణములు

 1. గుండె పోటు
 2. శ్వాస బంధము

గుర్తించుట:-
మెడ దగ్గర స్వర పేటిక ప్రక్కనున్న నాడీ (మన్యదమని) కొట్టుకొనని ఎడల గుండె స్థంభించినదని గుర్తించవలెను.

కాలినపుడు చేసే ప్రథమచికిత్స

 1. కాలిన చోటుని అవసరమైనంతకంటే ఎక్కువ ముట్టకూడదు. ముందు చేతులను శుభ్రముగా కడుగుకొనవలెను
 2. కాలిన గాయమును చల్లని నీటితో కడగవలెను. ఎట్టి ద్రావకములను గాయము మీద పోయవద్దు
 3. కాలిన గుడ్డలను ఊడదీయవద్దు. బొబ్బలను చిదపవద్దు
 4. కాలినచోటును, కాలిన గుడ్డలతో సహా అంటు దోషములేని గుడ్డలతో కప్పుము. అది లేనియెడల బట్టను ఉపయోగింపవచ్చును
 5. బొబ్బలుంటే తప్ప, కట్టుగట్టిగా కట్టాలి, బొబ్బలుంటే కొంతవదులుగా కట్టవలెను
 6. కాలిన భాగమును తగు రీతిగా కదలకుండా చేయుము
 7. నిస్త్రాణకు చికిత్స చేయుము
  • ఎక్కువ కాలిన యెడల వెంటనే ఆస్పత్రికి తరలించవలెను. ఆలోగా నోటికి ఎట్టి ద్రవపదార్థమును ఇవ్వకూడదు. ఎందుకనగా ఆస్పత్రిలో అతనికి మత్తుమందు ఇవ్వలసియుండును. నాలుగు గంటల వరకు వైద్య సదుపాయం దొరకదని తెలిసిన ఎడల ఒక గ్లాసెడు నీళ్ళలో టీ స్పూనులో 4వ వంతు ఉప్పు కలిపి ఇవ్వవచ్చును. వంటసోడా దొరికితే దానిని నీటిలో కలిపి ఇవ్వవచ్చును.
  • కొద్దిగా కాలిన ఎడల వేడి ద్రవము నియ్యవచ్చును. పలుచని టీలో కొంత చక్కెర యివ్వవచ్చును.

విష ప్రభావానికి చికిత్స మరియు సామాన్య సూత్రములు

 1. వెంటనే వైద్యునికి కబురు పంపుము. రోగి పరిస్థితి నీకు తెలిసిన యెడల రోగ కారణమును తెలియచేయుము. వైద్య పరీక్ష కొరకు యీ క్రింది వాటిని భద్రముగా నుంచుము.
  • అక్కడ మిగిలియున్న వస్తువులు
  • విషము ఫలానాదని గుర్తుంచుటకు అక్కడనున్న అట్టపెట్టె, బుడ్డి, సీసా మొదలైనవి వెదకవలెను కనుగొనవలెను.
  • వాంతి
 2. రోగి స్పృహ తప్పియున్న ఎడల –
  • రోగిని బోర్లా పరుండబెట్టుము / బోర్లా పడుకోపెట్టుము. తలను ఒక ప్రక్కకు త్రిప్పి ఉంచుము. తలక్రింద దిండు పెట్టకూడదు. అట్లు చేయుటవలన వాంతి పదార్థముగాలి గొట్టములోనికి పోదు. నాలుక కూడా ఊపిరి మార్గమునకు అడ్డుపడదు. అవసరమైతే వెంటనే ఊపిరి సాధన చేయుటకు వీలగును. డోకు, వాంతి ఎక్కువగా ఉంటే రోగి ఒక కాలిని ముందుకు వంచి యుంచుట మంచిది. అంటే, రోగి ఒక ప్రక్కకు పరుండును. పైకి ఉన్న కాలు వంచి ఒక దిండును రొమ్ము క్రింద నుంచవలెను.
  • ఊపిరి నీరసముగా ఆడుతుంటే, వెంటనే ఊపిరిసాధన చేయవలెను. వైద్యుడు వచ్చువరకు ఆ యత్నమును మానకూడదు.
 3. రోగి విషము మ్రింగి తెలివితో నున్నప్పుడు –

మొదట వాంతి చేయించుట ద్వారా ఆ విషమును కక్కించుము. ఒక గరిటెనుగాని, రెండు వ్రేళ్ళను గొంతుకలో పెట్టి ఆడించిన, రోగికి వాంతియగును. అప్పటికిని వాంతి కాని యెడల రెండు పెద్ద గరిటెల ఉప్పును ఒక గ్లాసుడు నీళ్ళలో కలిపి త్రాగించుము.
ఈ క్రింది పరిస్థితులలో వాంతి చేయించకూడదు.

 1. రోగి స్పృహ తప్పియున్నప్పుడు
 2. రోగి పెదవులు లేక  నోరు కాలియున్నప్పుడు, మరిగే ద్రావకములు పడినప్పుడు, చర్మము మీద పసుపు లేక బూడిదరంగు మచ్చ లేర్పడును. వాటిని సులభముగా గుర్తించవచ్చును.

తదుపరి విషపు విరుగుడు పదార్థము ఇవ్వాలి. అట్టి పదార్థము విషమును విరిచి రోగిని అపాయస్థితి నుండి తప్పించును. ఉదా. ఘాటైన ఆసిడుకు సుద్ధ లేక మెగ్నీషియా రసము విరుగుడు. కొన్ని విషములకు ప్రత్యేక విరుగుళ్ళు ఉన్నవి. కొన్ని యంత్రాగారాలలో ప్రత్యేక ప్రమాదములు సంభవించవచ్చును. వాటి విరుగుళ్ళు జాగ్రత్త పెట్టి యుంచుకొనవలెను . అవి ఉపయోగించవలసిన విధానమును బాగా కనబడు స్థలములో పెట్టవలెను.
పిదప ఎక్కువ నీళ్ళు త్రాగించి విషము యొక్క బలమును తగ్గించుము. అట్లు చేయుటవలన హాని తగ్గును, వాంతి యగుటవలన పోయిన ద్రవము వల్ల కలిగిన నష్టమును నీళ్ళు తీర్చును.
అటు పిమ్మట వ్యాధిని తగ్గించు పానీయముల నిమ్ము. ఒక గ్లాసెడు పాలు, బార్లీ నీళ్ళు, పచ్చిగ్రుడ్డు, నీటిలో కలిపిన పిండి, రోగికి యిచ్చినచో రోగము కొంత నయమగును.

వ్యవసాయమునకు సంబంధించిన పురుగు మందులు

మొక్కల రోగములు, పురుగులను చంపుటకు చల్లు కొన్ని మందులు అజాగ్రత్తగా వాడినను, ప్రమాదవశాత్తు అంటుకొనినను చాలా అపాయము కలుగవచ్చును. ఈ రకము విషము వల్ల ఆరొగ్యం రెండు రకములుగా దెబ్బ తినవచ్చును.  వానిలో ఒకటి వేడివల్ల కలిగే వడదెబ్బ పోలియుండును గనుక దానికి ఎండదెబ్బ చికిత్సవలె చేయవలెను.
రెండవ రకములో శ్వాస సంబంధము రీతిలో రావచ్చును. దాని గుర్తులేవనగా తలత్రిప్పుట, డోకు, చూపు మాంద్యము, రొమ్ము బిగుసుకొనుట, వాటితోపాటు నాడి నిదానముగా కొట్టుకొనుట, చిన్నవైన కనుపాపలు, చెమట, పెదవులు ముఖము నల్లబడుట, స్మారకము తప్పుట, మూర్ఛ రావచ్చును.

చికిత్స:
ఊపిరి సాధనను, అవసరమైతే చాలా సేపు చేయవలెను. డాక్టరుకు కబురు పంపినపుడు ఫలాని దానివలన యీ స్థితి వచ్చి యుండవచ్చునని చెప్పవలెను. ఎందుకంటే ఇంజక్షన్ ద్వారా డాక్టరు విరుగుడు మందు ఇవ్వదలచవచ్చును.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

ప్రథమచికిత్స మెళకువలు

అకస్మాత్తుగా ప్రమాదం జరిగితే ఈ కింది ఏ.బీ.సీ.డీ. లు అనుసరించాలి. అ ఏ.బీ.సీ.డీ. లు ఇవి...

ఏ అంటే... ఎరుుర్ వే గాలి పీల్చే వూర్గంలో అవాంతరం లేకుండా చూడటం.

బీ అంటే... బ్రీతింగ్... శ్వాస సరిగ్గా తీసుకునేలా చూడటం

సీ అంటే... సర్క్యులేషన్... అంటే రక్తస్రావం అవుతుంటే ఆపి... రక్తసరఫరా (సర్క్యులేషన్) సరిగా జరిగేలా చూసుకోవడం.

డీ అంటే... డెడ్లీ బ్లీడింగ్ లేదా డీఫైబ్రిలేషన్ అని కూడా అంటారు. అరుుతే డి అనేది సర్క్యులేషన్‌లోనే భాగవుని అంటారు.

ఫస్ట్ ఎయిడ్‌లో అనుసరించాల్సిన ఉదాహరణ... సాధారణంగా స్పృహ తప్పిన వ్యక్తుల నాలుక వెనక్కువెళ్లిపోరుు శ్వాసతీసుకునే వూర్గాన్ని అడ్డుకుంటుంది. అందుకే పడుకున్న భంగివులోనే ఉన్న రోగి గదవును ఎత్తిపెట్టినట్లుగా తలను కాస్తంత పెకైత్తినట్లుగా పడుకోబెడితే శ్వాస తీసుకునే వూర్గానికి ఎలాంటి అడ్డూ లేకుండా ఉంటుంది. ఇదే... ఎరుుర్‌వేలో అంతరాయుం లేకుండా చూడటం. అలా చేశాక... రోగి శ్వాస అందేట్లు చేయుడం, తగినంత గాలి ఆడేలా చూడటం ప్రధానం. రక్తస్రావం అవుతుంటే ఆపడం, సర్క్యులేషన్ సక్రవుంగా చూడటం ప్రధానం అంటారు. ఇంకొందరు ప్రథవు చికిత్స ప్రిన్సిపుల్స్ చెబుతూ ఈ ప్రక్రియులో వుూడు ‘బి’లను గవునించాలంటారు. అవే... బ్రీతింగ్ (శ్వాస), బ్లీడింగ్ (రక్తస్రావం), బోన్స్ (ఎవుుకలు). అంటే... శ్వాసక్రియు చక్కగా అయ్యేలా చూడటం, రక్తస్రావాన్ని అరికట్టడం, ఎవుుకలకు ఏదైనా ప్రవూదం జరిగిందేమో చూడటం. అవే ప్రథవు చికిత్సలోని ప్రాథమిక ప్రాణరక్షణ (బేసిక్ లైఫ్ సపోర్ట్) అంశాలు.

సాధారణ ఫస్ట్ ఎయిడ్...

పన్ను నొప్పిగా ఉంటే గోరువెచ్చని నీటితో నోరు తరచూ పుక్కిలిస్తూ ఉండాలి. నోట్లో మిగిలిపోరుున ఆహారపదార్థాలు పోయేలా శుభ్రం చేసుకోవాలి కాళ్లు వుడతపడటం/మెలికపడటం వల్ల వాస్తే... వాచిన చోట ఐస్ పెట్టాలి. స్ట్రెరుున్ అరుున కాలిని వీలైనంతగా కదిలించకుండా రెస్ట్ ఇవ్వాలి వుుక్కు నుంచి రక్తస్రావం అవుతుంటే... చూపుడువేలు, బొటనవేలు సాయుంతో వుుక్కుపై కాస్తంతే ఒత్తిడి పెట్టి ఓ పదినిమిషాలు గట్టిగా పట్టుకోవడం వల్ల రక్తస్రావం కట్టుబడుతుంది చెవిలో ఏదైనా దూరితే... టార్చిలైట్ చూపితే ఆ వెలుగుకు కీటకం ఏదైనా ఉంటే బయుటకు రావచ్చు. చెవిని నీటితో కడగాలి. చెవిలో నూనె వంటి పదార్థాలు వూత్రం అస్సలు వేయుకూడదు వాంతులు, విరేచనాలు అవుతుంటే శరీరం ద్రవపదార్థాలనూ, లవణాలను కోల్పోకుండా తగినన్ని కాస్తంత ఉప్పూ, చారెడు పంచదార కలిపిన నీళ్లు తాగాలి. కొబ్బరినీళ్లు, పప్పుపై ఉండే పల్చటి తేట తాగడం కూడా బాగానే పనిచేస్తుంది యూక్సిడెంట్ రోగులైతే... ప్రవూదం వల్ల అవుతున్న రక్తస్రావాన్ని ఆపేందుకు గుడ్డను అడ్డుగా పెట్టడం.

రక్తం పోకుండా చూడటం వుుఖ్యం కుక్క కరచిన సందర్భంలో నీళ్లను ఓ ప్రవాహంలా వదులుతూ సబ్బుతో గాయూన్ని కడగాలి కాలిన గాయూలైతే... వాటిపైనుంచి నీళ్లు ధారగా వెళ్లేలా 10 నిమిషాల పాటు చూడాలి. అలా నీళ్లు ప్రవాహంలా వేళ్లేలా చూస్తే కణజాలం (టిష్యూలు) వురింతగా చెడకుండా ఉంటారుు. అంతేకాదు... బొబ్బలను ఏవూత్రం చిదపకూడదు జ్వరంతో ఒళ్లు కాలిపోతుంటే... నుదుటిపై తడిగుడ్డ వేయాలి పావుు కరచిన సందర్భంలో రోగికి తొలిసాయుంగా ఆత్మస్థైర్యం కలిగించడం వుుఖ్యం. ఇక పావుు కాటేసిన ఆ కాలు లేదా చేతిని వీలైనంతగా కదపకుండా చూడటం వుుఖ్యం. కదలికలు ఎంత ఎక్కువగా ఉంటే విషం రక్తంలో కలిసే వేగం కూడా పెరుగుతుంది. కాబట్టి వీలైనంత ప్రశాంతంగా, కదలికలు లేకుండా చూడటం వుుఖ్యం.

ఏదైనా ప్రవూదమో, అత్యవసర పరిస్థితో ఏర్పడినప్పుడు మొదటి అరగంటను ప్లాటినం క్షణాలనీ, రెండో ఆరగంటను బంగారు క్షణాలనీ (గోల్డెన్ మొమెంట్స్), ఆ తర్వాతి అరగంటను (సిల్వర్ మూమెంట్స్) అని అంటారు. అంటే... రోగికి ఎంత త్వరగా చికిత్స అందితే దాన్ని బట్టే అతడు కోలుకునే సవుయుంలో వచ్చే రికవరీ సవుస్యలు అంతగా తగ్గుతారుు. గుండెపోటు వచ్చిన సందర్భాల్లో కొందరు అది గ్యాస్ వల్ల కావచ్చు అనుకొని నిర్లక్ష్యం చేసి సవుయుం దాటిపోయూక ఆసుపత్రికి తీసుకొస్తే పరిస్థితి వురింత జటిలం కావచ్చు. అందుకే అది గ్యాస్ వల్ల వచ్చిన సవుస్యా లేక నిజంగా హార్ట్ ప్రాబ్లవూ అన్నది డాక్టర్ నిర్ణరుుంచనివ్వాలి.

అదే పక్షవాతం (స్ట్రోక్) విషయుంలో కూడా వర్తిస్తుంది. ఓ నిర్ణీతమైన సవుయుంలోనే మెదడులో గడ్డకట్టిన రక్తాన్ని తొలగించే ఇంజెక్షన్ ఇస్తేనే అది సత్ఫలితం ఇస్తుంది. అందుకే అలాంటి సంక్లిష్టసవుయూల్లో అన్ని వసతులు ఉన్న పెద్ద ఆసుపత్రులకు వెళ్లడం వుంచిది. అదే సౌకర్యాలు లేని చోటికి వెళ్తే... ఒక డాక్టర్ నుంచి వురో డాక్టర్ వద్దకూ ఓ ఆసుపత్రి నుంచి వురో ఆసుపత్రికీ తిరుగుతూ విలువైన ఆ సవుయూన్ని కాస్తా వృథా చేస్తే అవుూల్యమైన కాలం కాస్తా గడిచిపోరుు పరిస్థితి వురింత విషమిస్తుంది.

ఆధారము: హెల్త్ కేర్ తెలుగు బ్లాగ్

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate