హోమ్ / ఆరోగ్యం / ప్రాథమిక చికిత్స / స్రృహ కోల్పోయినచో
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

స్రృహ కోల్పోయినచో

ఏ కారణం చేతనైనా ఒక వ్యక్తి స్రృహ లేని పరిస్థితిలో ఉంటే అతనికి DRABCR పద్దతిని పాటించాలి.

ఏ కారణం చేతనైనా ఒక వ్యక్తి స్రృహ లేని పరిస్థితిలో ఉంటే అతనికి DRABCR పద్దతిని పాటించాలి.

DRABCR పద్దతి

 1. D అనగా Danger - అతనిని మనకు ప్రమాదాన్నుంచి  తప్పించాలి. ఉదా,, అతనిని విషవాయువున్న ప్రదేశాన్నుంచి తప్పించాలి.
 2. R అనగా Response - అతనిని పలుకరించాలి - అతను  పలుకకునప్పుడు
 3. A అనగా Airway  అతని శ్వాస నాళాన్ని సరి చేయాలి. అందుకు
  నొసలు వెనక్కువంచి గడ్డాన్ని పైకి ఎత్తి పట్టాలి. నోరు పరీక్ష చేసిన తర్వాత
 4. B అనగా Breathing శ్వాస ఉన్నది లేనిది గమనించి, శ్వాస
 5. లేకుంటే కల్పిత శ్వాస  కలిగించాలి. రెండు సార్లు నాల్గు  సెకన్లకు
  ఒకసారి శ్వాస కలిగించాలి.
 6. అనగా Circulation అంటే రక్త ప్రసారము కొరకు నాడిని పరీక్షించాలి.  నాడి తెలియకుంటే గుండె ఆగినట్లు కాబట్టి కార్డియాక్ మసాజ్ చేయాలి.
 7. అనగా అతనిని రికవరీ పద్దతిలో పరుండబెట్టాలి.

సాధారణంగా ఈ సందర్బలలో మనిషి  స్రృహ లేకుండా ఉంటాడు.

 1. తలకు దెబ్బ - ప్రధమ చికిత్స DRABCR
 2. పక్షవాతము వచ్చినప్పుడు - ప్రధమచికిత్స DRABCR
 3. ఫిట్స్ - ప్రధమచికిత్స DRABCR
 4. చిన్న పిల్లలు ఫిట్స్ సాధారణముగా చిన్న పిల్లలకు ఫిట్స్ జ్వర తీవ్రత వలన రావచ్చును. ప్రధమచికిత్సలో DRABCR కాక జ్వరమును తగ్గించుటకు తడిగుడ్డతో ఒళ్ళంతా తుడవాలి. ( Cold Sponging) అయితే జ్వరం 102ºF వచ్చినట్లయితే తుడవటాన్ని ఆపాలి.
 5. వడదెబ్బకు గురైతే DRABCR పద్దతి  అవలంబిస్తు అతనిని చల్లని ప్రదేశాలకు తరలించాలి.
  • శరీర ఉష్ణోగ్రత తగ్గించేందుకు అతని అవలంబిస్తు  అతని శరీరమంతా తడి గుడ్డతో తుడవాలి .
  • స్రృహ వచ్చిన తరువాత అతనికి ఉప్పు కలిపిన నీళ్ళు (అనగా ఒక గ్లాసు నీళ్ళల్లో ¼ చంచాడు ఉప్పు కలిపి )  త్రాగించాలి.
 6. కళ్లు తిరిగి పడిపోవుట (Fainting)  ప్ర.చి. DRABCR
 7. హిస్టీరియా - మానసిక బలహీనత వల్ల తెలిసి, తెలియక స్రృహ కోల్పోవుట.
 8. రక్త స్రావమువలన స్రృహ కోల్పోవుట.
 9. విషపదార్థములు సేవించినందువలన స్రృహ కోల్పోవుట.
 10. గుండె పోటు వలన స్రృహ కోల్పోవుట. తదితర కారణాల వల్ల పై సందర్బాలలో పైన వివరించినట్లుగా  DRABCR పద్దతిని పాటించినట్లయితే రోగికి ఉపశమనం కలుగుతుంది.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.01612903226
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు