హోమ్ / ఆరోగ్యం / ప్రాథమిక చికిత్స / షుగరు వ్యాధి (చక్కెర జబ్బు)
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

షుగరు వ్యాధి (చక్కెర జబ్బు)

షుగరు వ్యాధిలో రోగి రక్తంలో చక్కెర ఉండవలసిన మోతాదు కంటే ఎక్కువవుతుంది. ఒక పరిమితికి మించి చక్కెర రక్తంలో పెరిగిపోయినప్పుడు రోగి సృహ కోల్పోతాడు.

షుగరు వ్యాధి

షుగరు వ్యాధిలో రోగి రక్తంలో చక్కెర ఉండవలసిన మోతాదు కంటే ఎక్కువవుతుంది. ఒక పరిమితికి మించి చక్కెర రక్తంలో పెరిగిపోయినప్పుడు రోగి సృహ కోల్పోతాడు. అదే విధంగా ఒక పరిమితికి మించి రక్తంలో చక్కెర తక్కువయిపోయినప్పుడు కూడా రోగి సృహ కోల్పోతాడు.

అందరు మనషులలో సృహలో వున్నప్పుడు రక్తంలో చక్కెర సరిపడా మోతాదులో ద్రవరూపంలో ప్రసరణలో వుంటుంది. చక్కెర జబ్బులో ఇది కొద్ది కొద్దిగా అధికమవుతూపోయి ఒక పరిమితి దాటినప్పుడు రోగి సృహ కోల్పోవడం జరుగుతుంది.

చక్కెర జబ్బు చికిత్స తీసుకుంటున్న వారిలో, ఇన్సులిన్ తీసుకుంటున్న వారిలో ఇంకొక రకంగా సృహ కోల్పోవడం, అపస్మారక స్థితిలోనికి పోవడం జరుగుతుంది. ఇన్సులిన్ శరీరంలో రక్త ప్రసరణలో వున్న చక్కెర మోతాదును నియత్రిస్తుంది. ఇది చక్కెర మోతాదును అతి త్వరగా తగ్గించి వేస్తుంది లేదా ఎక్కువగా తగ్గించి వేస్తుంది దీని మూలంగా రోగి కొద్ది నిమిషాల హెచ్చరికతో సృహ కోల్పోతాడు. ఈ సమయంలో రోగి సన్న గొంతుతో మాట్లాడుతాడు, చికాకుగా వుండి ఎదుటి వారిని ఏమీ చేయనీకుండా అడ్డుపడుతూ వుంటాడు. జాగ్రత్తగా వెదికితే రోగికి చక్కెర జబ్బు వున్నట్టు నిర్థారించే సమాచారం దొరకవచ్చు. ఒకసారి సృహ కోల్పోయిన తరువాత, చికిత్స అందని పక్షంలో అపస్మారక స్థితిలోనికి జారుకుంటారు.

చికిత్స

రోగి కొద్ది కొద్దిగా మాట్లాడుతున్నప్పుడు తినడానికి చక్కెర ఇవ్వవచ్చును. కానీ ఒక్కసారి రోగికి సృహ తప్పాక నోటిలోనికి ఏమీ పోయకూడదు. వెంటనే రోగిని ఆసుపత్రికి తరలించడం లేదా వైద్యుని పిలిపించడం చేయాలి.

  • రోగి సృహ కోల్పోయిన వెంటనే రోగి శ్వాస మార్గం శుభ్రపరచి, ఏవైనా అడ్డంకులు వుంటే తొలగించి రోగిని సురక్షితమైన స్థితిలో పడుకోబెట్టాలి.
  • రోగి సృహ లో లేనప్పుడు వంటరిగా వదిలివేయకూడదు.

ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు

3.10810810811
lakshmi Mar 31, 2015 02:32 PM

నోరు తడి ఆరిపోవుట, బాగా నీరసంగా ఉంటుంది. ఏంచేయాలి?

Prathibha Mar 31, 2015 02:24 PM

షుగర్ రోగస్థులు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలపండి?

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు